హెబ్రీయులకు వ్రాసిన పత్రిక – క్రొత్త ఆరాధకులు

క్రొత్త ఆరాధకులు (అధ్యాయము 10)

విశ్వాసి ఏలాగు పరలోకమునకు యోగ్యునిగా చేయబడెనో పదియవ అధ్యాయము వివరించుచున్నది. అతని మనస్సాక్షి శుద్ధిచేయబడినది. (1-18 వచనాలు); కనుక ఇప్పుడు పరిశుద్ధ స్థలములో ఆత్మద్వారా ప్రవేశించగలుగుచున్నాడు.

(19-22 వచనాలు); ఈ లోకయాత్రలో మనము ఒప్పుకొనినదానిని గట్టిగా పట్టుకొని, తడబడకుండుట లేదా ప్రక్కకు తొలగకుండుట. (23-31 వచనాలు); శ్రమల నెదుర్కొనుట. (32-34 వచనాలు); విశ్వాస పథమున నడచుట. (35-39 వచనాలు).

శుద్ధపరచబడిన మనస్సాక్షి. (వచనములు 1-18).

(వచనములు 1-4). దేవునియెదుట క్రీస్తు పొందియున్న స్థాయిని బట్టి, ఆయన చేసిన కార్యముద్వారామాత్రమే విశ్వాసికి పరలోకమందు స్థలము సమకూర్చబడినట్టు 9వ అధ్యాయములో నేర్చుకొనియున్నాము.

Read and Learn More హెబ్రీయులకు వ్రాసిన పత్రిక

10వ అధ్యాయములో విశ్వాసి నూతన స్థలములో ఆత్మద్వారా ప్రవేశించి, ఆనందించునట్లు అదే పని విశ్వాసి మనస్సాక్షికి అన్వయించబడినది. క్రీస్తుతో పరలోకములో స్థలము కలిగియుండవలెనంటే, శుద్ధిచేయబడిన మనస్సాక్షి అవసరము.

10వ అధ్యాయము మొదటి 18 వచనములలో శుద్ధిచేయబడిన మనస్సాక్షి ఏ విధముగా సంపాదించబడినది స్పష్టముగా వివరించబడినది.

9, 10 అధ్యాయములలోని మూడు భాగములలో అపొస్తలుడు “పూర్ణసిద్ధి పొందిన” లేదా “కడుగబడిన” మనస్సాక్షినిగూర్చి మాటలాడు చున్నాడు. యూదా ఆరాధకుని బలులు మనస్సాక్షికి పూర్ణసిద్ధి కలుగ జేయవని 9:9 లో తేటగా చెప్పబడియున్నది.

తిరిగి 9:14 లో విశ్వాసి మనస్సాక్షిని శుద్ధిచేసి జీవముగల దేవుని ఆరాధించునట్లు నిర్జీవ క్రియల నుంచి మనస్సాక్షిని విడుదల చేసినట్లు చెప్పబడినది.

చివరిగా 10:2 లో మనస్సాక్షి శుద్ధిచేయబడినందున ఇక మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఉండదు. పాపమునుగూర్చి జ్ఞప్తియున్నట్టి మనస్సాక్షిగల వ్యక్తి తన పాపములనుబట్టి దేవుడు ఒకానొక రోజున తీర్పు తీర్చును కనుక భయముతో జీవించు చుండును.

అందువలన దేవునితో సమాధానము లేకయుండును. పాప జ్ఞప్తిలేని మనస్సాక్షి కలిగియుండుట అనగా దేవుడు విశ్వాసి పాపములను పరిహరించి, తీర్పును తప్పించెనను భావమువలన భయము తొలగి పోయినది.

విశ్వాసికి దేవుడు అతని పాపములనుబట్టి తీర్పు విధింపక పోవ చ్చును, అయితే మనము పిల్లలముగా పాపము చేసినయెడల ఆయన తండ్రిగా శిక్షించును. (12:5-11).

మనస్సాక్షి శుద్ధి చేయబడినదనగా మనమిక ఎన్నడూ పాపము చేయమని, వర్తమాన భూత కాలములందలి అపజయములు జ్ఞప్తికి రానేరావని దాని భావము కాదు.

మన పాపము లనుబట్టి భవిష్యత్తులో తీర్పు ఉండునేమోనన్న భయము పూర్తిగా తొలగి పోయిన మనస్సాక్షి అని భావము. కనుక శుద్ధిచేయబడిన మనస్సాక్షి, మంచి మనస్సాక్షి ఒకటేయని భావించరాదు.

నిజమైన విశ్వాసి తప్ప టడుగు వేసినందున అపజయము పాలగును. అతని మనస్సాక్షికి కల వరము కలుగక మానదు. దేవుని యెదుట తన ఓటమిని ఒప్పుకొనినప్పుడే మంచి మనస్సాక్షిని సంపాదించుకొనును.

ఇక్కడ అతని పాపములకు శాశ్వత క్షమాపణ నిచ్చెడి శుద్ధిచేయబడిన మనస్సాక్షినిగూర్చిన ప్రస్తావన లేనేలేదు. ధర్మశాస్త్రము క్రింద “పరిపూర్ణమైన” లేదా శుద్ధికలిగిన మనస్సాక్షి కల్గియుండుట అసాధ్యము.

బలులద్వారా కేవలము తాత్కాలిక ఉపశ మనము మాత్రమే కలుగును. ఎప్పటికప్పుడు పాపమునకు క్రొత్త బలి అవసరమగును, బలులద్వారా మనస్సాక్షికి శుద్ధికలిగినయెడల వాటిని అర్పించవలసిన అవసరత ఇక ఉండదు. పాపములను తీసివేయుటకు బలి అవసరమని ధర్మశాస్త్రము చూపెట్టుచున్నది కదా.

అయితే అది రాబోవుచున్నవాటి మేలులయొక్క ఛాయ. అది అసలైనది కాదు. కోడెల యొక్కయు, మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయజాలదు.

ఆలాగైన శుద్ధిచేయబడిన మనస్సాక్షిని పొందుట ఎట్లు సాధ్యము? మూడు సత్యములను మనయెదుటికి తెచ్చుటద్వారా క్రింది వచనములు ఆ ప్రశ్నకు జవాబిచ్చుచున్నవి.

మొదటిది దేవుని చిత్తము. (5-10 వచనములు)

రెండవది క్రీస్తు పని. (11-14 వచనములు)

మూడవది ఆత్మ సాక్ష్యము. (15-18 వచనములు)

(వచనములు 5-7). దేవుని చిత్తము గ్రంథపు చుట్టలో వ్రాయ బడినది. ఈ గ్రంథపు చుట్ట అనగా లేఖనములు కాదని స్పష్టమగుచున్నది. ఇక్కడ ప్రస్తావించిన లేఖన భాగము కీర్తన 40 లోనిది.

ఇది బహుశ దేవుని నిత్యసంకల్పములనుగూర్చిన అలంకారిక సూచన కావచ్చును. ఆయన లోకములోనికి దేవుని చిత్తము నెరవేర్చుటకు వచ్చెను. బలులు, అర్పణలు ధర్మశాస్త్రమును నెరవేర్చలేవు. దేవుని సంకల్పము నెరవేర్చుటకు ప్రభువునకు ఒక శరీరము అమర్చవలసియుండెను.

(వచనములు 8, 9). ప్రభువు లోకములోనికి వచ్చినప్పుడు ఏమి చెప్పెనో అది ముందే పరలోకమందు చెప్పబడెను. దేవుని చిత్తమును నెరవేర్చుటకు మొదటి నిబంధనను తొలగించి రెండవ నిబంధనను స్థిరపరచు ఆవశ్యకత ఏర్పడినది.

(వచనము 10). దేవుని చిత్తమేమిటో 10వ వచనములో స్పష్టముగా చెప్పబడినది. “యేసుక్రీస్తు శరీరము ఒక్కసారే అర్పింపబడుటచేత ఆ చిత్తమునుబట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము” అని వ్రాయబడి యున్నది.

భారభరితమగు మనస్సాక్షికి ఉపశమనము లేదా శాంతి మన అనుభవములలో, మన పశ్చాత్తాపములో, మన విశ్వాసములో వెదకుట వ్యర్థము, అనవసరము.

ఈ లేఖనము మన ఆలోచనలను మననుండి తొలగించి, దేవుని చిత్తముపై, క్రీస్తు చేసిన కార్యముపై కేంద్రీకరింప జేయుచున్నది. మనము ప్రతి పాపపు డాగును విడిచిపెట్టవలెను.

శ్రేష్ట మగు తన సంకల్పమును దేవుడు కనుగొనియున్నాడు. మనము పాపమును విడిచిపెట్టునది మనము చేసినదానినిబట్టి కాక, మరియొకరు అనగా యేసుక్రీస్తు ప్రభువు చేసినదానినిబట్టియే సాధ్యమగును.

(వచనములు 11-14). దేవుని చిత్తమును నెరవేర్చిన క్రీస్తు పనిని గూర్చిన పూర్తి వివరణ 11-14 వచనములలో ఉన్నది. ఈ వచనము క్రీస్తును, ఆయన చేసిన పనినిగూర్చియే తెలియజేయుచున్నది.

ఈ పనికి దోహదకారియైన మన పాపములు మినహా ఇందులో మన ప్రమేయమేమి యును లేదు. మన భావములను అనుభవములను వెల్లడిచేసి గట్టి విశ్వాసముతో నిలుచుండి, యెహోవా రక్షణను చూడవలెను.

యూదా ప్రజల మత బలులు ఎంత నిరర్థకమైనవో ఈ 11వ వచనము తెలియజేయుచున్నది. ఈ వచనము 1500 సంవత్సరముల కాలమును తెలియజేయుచున్నది.

ప్రతి యూదా యాజకుడు అసంఖ్యా కముగా అంతులేని బలులనర్పించుట అంతయు ఒకే ఒక్క ఘనమైన ప్రదేశములో అంతమైనది. విస్తారమగు ఈ మానవ ప్రయాస, యూదా బలిపీఠముపై ఏరులై ప్రవహించిన రక్తము “పాపములను ఎన్నటికి తీసివేయలేవు” అని చెప్పబడినది.

యూదా వ్యవస్థనంతటిని ఒకే ఒక్క వచనములో కొట్టివేసి 12వ వచనములో అపొస్తలుడు క్రీస్తు చేసిన గొప్ప పనిలోని వ్యత్యాసమును చూపుచున్నాడు. “ఈయన” అనగా క్రీస్తు ఆ యాజకులందరికి భిన్నముగా ఆ (యూదులు అర్పించు బలులన్నిటికి భిన్నముగా) “పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి” దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను.

యాజకులైతే తమ పని ఎన్నడూ ముగియునది కాదు గనుక, ఎల్లప్పుడు నిలుచుని ఉండేవారు. క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడగుటనుబట్టి ఆయన చేసిన పని ముగిసినది. దేవుడు ఆ పనిని అంగీకరించెనని స్పష్టమగుచున్నది.

క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున సదా కూర్చున్నందున ఆయన శత్రువు లకు, విశ్వాసులకు కలుగు రెండు ఫలితములను ఆ తరువాతి రెండు వచనములు వివరించుచున్నవి.

ఆయన చేసిన పనిని శత్రువులు తిరస్క రించినందున, పాపములను తీసివేయుటకు ఆయన చేయునదేమియు లేదు గనుక వారికిక మిగిలినది తీర్పు మాత్రమే.

“అప్పటినుండి” తన శత్రువులు పాదపీఠముగా చేయబడువరకు క్రీస్తు కనిపెట్టుచున్నాడు. పరిశుద్ధపరచబడినవారి విషయమైతే, క్రీస్తు పునరుత్థానుడై, మహిమ పరచబడినందున వారిని సంపూర్ణులనుగా చేసియున్నాడు.

తన పనిద్వారా విశ్వాసిని ఆయన పరిపూర్ణునిగా చేసియున్నాడు. మనము మహిమ శరీరములు పొందుటకు కనిపెట్టుచున్నాము. కాని, దేవుని దృష్టిలో క్రీస్తు కార్యముద్వారా మన ఆత్మలు పాపము విషయములో సంపూర్ణముగా శుద్ధిచేయబడినవి.

“యేసు తనయొక్క బలిలో చేసినదానికి మించి ఇక ఎవరును మరేమియు చేయజాలడు. మన విశ్వాసమునుబట్టి దేవుని వాక్యమందు అది వెల్లడించబడినది” అని ఒకరు చెప్పియున్నారు.

క్రీస్తు సదాకాలము కూర్చుండుటమాత్రమే కాదు. విశ్వాసులు సదాకాలము పరిశుద్ధపరచబడియున్నారు. క్రీస్తు సదాకాలము కూర్చుండినయెడల, విశ్వాసులు కూడా సదాకాలము సంపూర్ణులుగా చేయబడియున్నారు.

(వచనములు 15-18). మన ఆశీర్వాదములకు ఆధారము దేవుని చిత్తమనియు, దానిని అనుభవములోనికి తెచ్చినది ఆయన బలి అనియు ఈ వచనము వివరించుచున్నది.

ఇప్పుడు మనకు అపొస్తలుడు పరిశు ద్ధాత్మ సాక్ష్యమును వెల్లడించుచున్నాడు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము దైవిక అధికారముతో సంక్రమించును గనుక, దైవికమగు నిశ్చయతతో దానిని పొందవలెనని ఆత్మ వెల్లడించుచున్నాడు.

రోమా 8-16

క్రొత్త నిబంధన విధులు వివరించుటకు 8వ అధ్యాయములో కూడా ఈ లేఖన భాగము ఉదహరింపబడినది.

ఇక్కడ క్రీస్తు పనియొక్క సాఫల్యతను ఋజువు చేయుటకు ఆ లేఖన భాగము మరల ఉదహరించబడినది. దేవుడిప్పుడు విశ్వాసితో

వారి పాపములను అతిక్రమములను జ్ఞాపకము చేసికొనను అని దేవుడు చెప్పుట లేదు కాని, వారి పాపములను, అతిక్రమములను ‘ఇకను ఎన్నటికి’ జ్ఞాపకము చేసికొనను అనుచున్నాడు. మన పాపములను జ్ఞాపకము చేసికొనను అనుటద్వారా ఆయన మన పాపములను దాటిపోయి ఉండునని అర్థమగు చున్నది.

దేవుడు ‘ఇకను జ్ఞాపకము చేసికొనను’ అనుటద్వారా స్పష్టమగున దేమనగా పాపములన్నియు జ్ఞాపకము చేసికొని, ఒప్పుకొని, భరించి, తీర్పులో పరిష్కరించుట జరిగిపోయినదన్నమాట. పాపములను పరిష్క రించినందున “ఇక ఎన్నటికీ” జ్ఞాపకము చేసికొనను అని దేవుడు నీతితో ప్రకటించుచున్నాడు.

యిర్మీయా 31-34

క్రొత్త ఆరాధకులు (19-22 వచనములు).

శుద్ధిచేయబడిన మనస్సాక్షి అను సత్యము ఆరాధనకు మార్గము సిద్ధము చేయును. ఇంతకు ముందే అపొస్తలుడు క్రొత్త బలిని, క్రొత్త గుడారమునుగూర్చి వివరించి, ఇప్పుడు క్రొత్త ఆరాధకుని వివరించు చున్నాడు.

యూదా మతములో ఆరాధకునికి అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశము లేదు. అందుకు భిన్నముగా క్రైస్తవ్యములో విశ్వాసి యేసు రక్తముద్వారా పరిశుద్ధస్థలమందు నిర్భయ ప్రవేశము పొందుచున్నాడు.

ఆరాధకులుగా మనము దేవుని సమీపించుటకు అవరోధముగా నున్న వాటన్నిటిని తొలగించు ఏర్పాటుచేయబడినది. క్రీస్తు రక్తము పాపములను పరిహరించినది.

క్రీస్తు శరీరమును ధరించి, మానవుడగుటచే పరిశుద్ధ స్థలమందు ప్రవేశించునట్లు మనకొరకు జీవముగల మార్గమును ప్రతిష్ఠించియున్నాడు. మన బలహీనతలను మన ప్రధాన యాజకుడు భరించియున్నాడు.

మనము చేసిన పాపములను కాని, మనము నివసించు చున్న ఈ శరీరము కాని, మన చుట్టూ ఆవరించియున్న బలహీనతలు గాని, విశ్వాసి ఆత్మద్వారా తెరలోపల, అనగా పరలోకమందు ప్రవేశించు టను నిరోధించలేవు.

అట్లయినయెడల మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింప బడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములుగలవారమునైయుండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత గలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధా నమునకు చేరుదము అని అపొస్తలుడు చెప్పుచున్నాడు.

ఇక్కడ ఒక్క నిమిషమాగి మనలను మనము ప్రశ్నించుకొనుట మంచిది. దేవుని సమీపించుట, తెరలోపల ప్రవేశించుట మనమెంత వరకు ఎరిగియున్నాము? మనకు 4:16 లో అపొస్తలుడు చెప్పినట్లు “మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము” అని చెప్పిన హెచ్చరికతో కొంత తెలిసి ఉండవచ్చును.

అది జీవిత తుపానులను తప్పించుకొనుటకు ఆశ్రయస్థానమునొద్దకు పరుగెత్తుటయే. ఇది ప్రేమ యను ఎండనుండి తప్పించుకొనుటకు మన స్వంత ఇంటికి మరలుట.

ఆశ్రయస్థానమునకు ఇంటికి ఎంతో వ్యత్యాసమున్నది. తుపాను సమయములో తలదాచుకొనుటకు పరుగెత్తునది ఆశ్రయ స్థానము. ఇంటిలో నైతే మనకు విశ్రాంతి లభించును.

జీవిత సమస్యలలో మనము తల దాచుకొను ఆశ్రయ స్థానముగా క్రీస్తును మనము ఎరుగుదుము గాని మన ఆశలు తీరే గృహము ఆయనే అని మనకెంతవరకు తెలియును? క్రీస్తు నిజముగా ఉన్నాడు. మరింత ఆశీర్వాదకరమైన అనుభవము వేరొకటి ఉన్నది.

యెషయా 32-2

ఈ లోకమను అరణ్యముగుండా, సముద్రపు ఆటుపోటు లను తట్టుకొని, అలసిపోయి, ఎట్టకేలకు ఉపశాంతి, ఆశ్రయముకొరకు మనము ఆయనను ఆశ్రయించగలము.

తుపాను వచ్చినప్పుడుమాత్రమే క్రీస్తును మనము ఆశ్రయించినయెడల, నిమ్మళించిన తరువాత ఆయనను విడిచిపెట్టు ప్రమాదమున్నది. మనందరి విషయములో తరచు జరుగు చున్నది ఇదే.

ఆపదలలో ఆయనను హత్తుకుంటాము, అంతా సవ్యముగా ఉంటే విడిచిపెడతాము. అయితే మన మనస్సులను ఆయనపై కేంద్రీక రించినయెడల, ఆయన ఉన్న పరలోక స్థానము మనదే అని చూడగలిగిన యెడల ఆయన ఉన్న స్థానముపై మన మనస్సు నిలుపుదుము.

అట్లు మనము యేసుతో సహవాసము కలిగి ఉన్నయెడల దృశ్యముపై మరణ చ్ఛాయ పడదు, కన్నీళ్ళన్నియు తుడిచివేయబడును.

మార్గము, అందలి ప్రమాదములు (23-39 వచనాలు)

మన ఆధిక్యతలను మనము గుర్తించి, తెర లోపలికి దేవుని సమీపించినయెడల, అరణ్యయాత్రలో తటస్థపడు ప్రమాదములను సమర్థ వంతముగా ఎదుర్కొనగలము.

అందువలన “సమీపించెదము” అను హెచ్చరిక వెంటనే – “మనము ఒప్పుకొనినదానిని నిశ్చలముగా పట్టు కొందము” అను హెచ్చరిక ఉన్నది. మనయెదుట గొప్ప నిరీక్షణ ఉన్నది. వాగ్దానము చేసినవాడు తన వాక్యము విషయములో నమ్మదగినవాడు.

అయితే ఈ లోకములో స్థిరపడిపోయినందుకు ఆ నిరీక్షణను గూర్చిన “ఒప్పుకోలు”ను విడిచిపెట్టు ప్రమాదమున్నది. మనము తడబడకుండా గట్టిగా పట్టుకొని ఉండవలెనంటే నమ్మదగిన ఆయనవైపే చూడవలెను.

పైగా, దుఃఖములలో కష్టములలో, ప్రమాదములలో మనకు పరస్పర సహకారము అవసరము. కొన్ని పర్యాయములు మనము ఒంటరిగా శోధింపబడవచ్చును. అయితే దేవుని ప్రజలకు సహవాసమే దేవుని విధానము.

అందువలన సమాజముగా కూడుట మానక, ఒకరినొకరు హెచ్చరించుకొనవలెను. శారీరక దురభిమానము, స్వావలంబన ఇతరుల సహాయమును లెక్కజేయకపోవచ్చును.

మనము ఎంత నిష్ప్రయోజకులమో ఆలోచించుకొనినప్పుడు ఇతరుల సహాయము ఎంత విలువైనదో గుర్తించి, అన్నిటికంటే మిన్నగా నమ్మదగినవాడగు క్రీస్తువైపుకు చూచెదము.

మన మెవరిని విలువైనవారుగా పరిగణించుదుమో, వారినుండి మనకు అవసరమగు ప్రేమను సంపాదించుకొని, వారి సత్కార్యములో పాలు పొందుదుము.

కొన్ని పర్యాయములు శరీరము కొద్దిపాటి పగతో సహోదరుని రెచ్చగొట్టి బాధకరమగు వాతావరణము సృష్టించును. కోపము రేపుటగాక ప్రేమ చూపుటలో ఒకరినొకరు పురికొల్పుకొనవలెను.

దేవుని ప్రజలు సమాజముగా కూడుట ఎంతమాత్రము మానకూడదు, పరిశుద్ధులు సమాజముగా కూడుట మానుకొనుట సంఘము క్షీణించు చున్నదనుటకు స్పష్టమైన సూచన.

అలవాటుగా తరచు సంఘ కూడికలను నిర్లక్ష్యము చేయుటవలన విశ్వాసి లోకమునకు లేదా లోక సంబంధియగు మతమునకు మళ్ళుట జరుగును.

ఆ దినము అనగా మహిమ దినము సమీపించుకొలది, ఒకరి సహాయము మరియొకరికి అవసరము గనుక పరిశుద్ధులు సమాజముగా కూడుటను నిర్లక్ష్యము చేయుట తగదు.

(వచనములు 26-31). నిరీక్షణను విస్మరించుట, ఒకరినొకరు చిన్నచూపు చూచుకొనుటలో, సమాజముగా కూడుటను నిర్లక్ష్యము చేయుటలో ఉన్న ప్రమాదములను అపొస్తలుడు వివరించుచున్నాడు.

ఇప్పుడు అంతకంటే ప్రమాదకరమగు క్రైస్తవ ఒప్పుదలలోనికి చొచ్చుకొని వచ్చుచున్న భ్రష్టత్వమునుగూర్చి హెచ్చరించుచున్నాడు. క్రైస్తవ విశ్వాసులు బుద్ధిపూర్వకముగా పాపము చేయుట భ్రష్టత్వమే.

ఇక్కడ దేమావలే లోకమువైపు మరలిపోవుటను గూర్చి అపొస్తలుడు మాటలాడుటలేదు. అట్టివాడు తిరిగి యథాస్థితికి వచ్చు వీలు కలదు. భ్రష్టుడు ఎవరనగా క్రైస్తవ్యమును అంగీకరించిన తరువాత, దానిని విడిచిపెట్టి, మానవ కల్పితమగు మతమును స్వీకరించినవాడు.

“నేను” క్రైస్తవ్యమును ప్రయత్నించితిని, యూదా మతము, బౌద్ధమతము లేదా ఏదేని ఇతర మతము దానికంటే మెరుగైనది అని చెప్పుచున్నాడన్నమాట. అట్టి పాపము నకు బలి యిక లేదుగాని న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయే ఉండును.

అట్టివాడు దేవుని కుమారుని తిరస్కరించి, క్రీస్తు రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను అగౌరవపరచుచున్నాడు. భ్రష్టుని దేవునికే వదలిపెట్టవలెను. పగతీర్చుకొనుట మన పనికాదు.

పగతీర్పుకొను పనిని దేవుడు మనకు అప్పగించడు. ‘పగ తీర్చుట నా పని’ అని తేటగా చెప్పబడినది. జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరమని భ్రష్టుడు తెలిసికొనును.

(వచనములు 32-34). శ్రమలు, నిందలు, బాధలనుబట్టి నిరుత్సా హపడవద్దని అపొస్తలుడు హెచ్చరించుచున్నాడు. విశ్వాస పథములో నిందలు, బాధలు కలిగినప్పుడు కృంగిపోవు ప్రమాదము ఎప్పుడూ ఉన్నది.

యూదా విశ్వాసుల ప్రారంభము బాగుగానే ఉన్నది. సత్యముచేత వెలిగించ బడిన వెంటనే వారు సత్యముకొరకు పోరాడుట గమనించగలము.

అయితే ఈ పోరాటములో వారు సహించిరి, క్రీస్తు నిమిత్తము శ్రమలనుభవించు వారితో హృదయపూర్వకముగా పాలివారైరి. పరలోకమందు శ్రేష్టమైన స్వాస్థ్యమున్నదని ఎరిగి తమ ఆస్తులను కోల్పోవుటకును సిద్ధమైరి.

(వచనములు 35-39). అట్టి దృఢమైన విశ్వాసమునకు బహుమాన మున్నది. వాగ్దానము పొందుటకు కనిపెట్టు సంధికాలములో మనము ఓపికతో దేవుని చిత్తమునకు మనలను అప్పగించుకొనవలెను.

కనిపెట్టు నది చాలా కొద్దికాలమే. అప్పుడు “వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును”. ఆయన వచ్చువరకు విశ్వాసి మార్గము విశ్వాస మార్గమే.

పూర్వకాలమందేలాగో ఈ రోజుకూడా అది ఎంతైనా వాస్తవము. హబక్కూకు ప్రవక్త చెప్పినట్లు “నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును”.

వెనుకదీసినవానియందు దేవునికి ఎంతమాత్రము సంతోషముండదు. భ్రష్టుడు వెనుదీయుట నాశనమగుటకే.

అయితే అపొస్తలుడు వ్రాయుచున్న వారినిగూర్చి “మనము నశించుటకు వెనుకదీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారమైయున్నామని” గట్టిగా చెప్పుచున్నాడు.

Leave a Comment