మనము ఒప్పుకొనినదానికి ప్రధాన యాజకుడు (3, 4 అధ్యాయములు)
మొదటి రెండు అధ్యాయములు క్రీస్తు వ్యక్తిత్వముయొక్క మహిమను వెల్లడించుచున్నవి. ఆ విధముగా మహా ప్రధాన యాజకునిగా ప్రభువు చేసిన దివ్య పరిచర్యలోనికి మనకు ప్రవేశము లభించుచున్నది.
ఈ భాగములో మనము నేర్చుకొనునది క్రీస్తు యాజక పరిచర్యయొక్క పరిధి. మొదటగా, దేవుని ఇల్లు (3:1-6); రెండవదిగా, ప్రభువు యాజక పరి చర్యకు అవకాశము కల్పించిన అరణ్య పరిస్థితులు.
హెబ్రీయులకు పత్రిక అధ్యాయం 3, 4
(3:7-19); మూడ వదిగా, అరణ్య యాత్ర ఎటువంటి విశ్రాంతికి నడిపించునో అనునది. (4:1-11); చివరిగా, అరణ్యయాత్రలో దేవుడు కనికరించి మనకు కలిగించిన ఏర్పాట్లు (4:12-16).
Read and Learn More హెబ్రీయులకు వ్రాసిన పత్రిక
క్రీస్తు యాజక పరిచర్య పరిధి (3:1-6).
రెండవ అధ్యాయము చివరి భాగములో ప్రభువు తన ప్రజల శ్రమల యందు సహానుభవము పొందునట్లు ఆయన ఎన్నుకున్న యాజక పరిచర్య విధానము వివరించబడినది. ఈ మూడవ అధ్యాయము ప్రారంభ వచనములలో ఆయన యాజక పరిచర్య పరిధిని తెలుపుచు దేవుని ఇల్లు పరిచయము చేయబడినది.
(వచనము 1). ప్రారంభ వచనములో “పరలోక పిలుపులో పాలు పొందిన” అనియు, “పరిశుద్ధ సహోదరులు” అనియు యూదా విశ్వాసులు సంబోధించబడిరి.
యూదులుగా “సహోదరులు” అని పిలిపించుకొనుట వారికి తెలుసు. వారు భూసంబంధమైన పిలుపులో పాలుపొందియున్నారు.
క్రైస్తవులుగా వారు “పరిశుద్ధ సహోదరులు”. క్రైస్తవులందరికిని ఇది వర్తించును. క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును వారు పొందియున్నారు.
మొదటి రెండు అధ్యాయములలో క్రీస్తు మహిమలను మన యెదుట పెట్టి, ఇప్పుడు “మనము ఒప్పుకొనినదానికి అపొస్తలుడును, ప్రధాన యాజకుడునైన యేసుమీద లక్ష్యముంచ”వలసినదిగా దేవుడు మనలను హెచ్చరించుచున్నాడు.
అపొస్తలుడు అను బిరుదు మొదటి అధ్యాయము లోని దేవుని కుమారుడు అను సత్యమునకు సంబంధించినది. ప్రధాన యాజకుడు అను బిరుదు రెండవ అధ్యాయమునకు సంబంధించినది.
ఈ అధ్యాయములో మనుష్యుల పక్షముగా దేవుని యెదుట సేవ చేయుటకు మనుష్యకుమారుడు భువినుండి పరమునకు వెళ్ళుచున్నట్లు చూపబడినది.
నిజమైన పరిచర్యయొక్క గురి, ప్రకటించిన సత్యమును కొందరు వినునట్లు చేయుటమాత్రమే గాక, యేసునందు “లక్ష్యముంచునట్లు” చేయుటయే. ఇదియే పరిచర్య అంతటి అంతిమ లక్ష్యము.
ఈ అధ్యాయము మొదటి వచనములో క్రీస్తుయేసు అని గాక ‘యేసు’ అని మాత్రమే ప్రస్తావించుట గమనార్హము. ప్రతి యూదుడు మెస్సీయాను అంగీకరించును. క్రైస్తవులు మాత్రమే ‘యేసు’ అను వ్యక్తిగా ‘క్రీస్తు’ వచ్చినట్లు గుర్తించుదుర.
(వచనములు 2–6). దేవుని ఆత్మ అరణ్యమందలి మోషేను, ప్రత్యక్ష గుడారమును సూచించుచున్నాడు.
ఎందుకనగా మోషేకంటే క్రీస్తు శ్రేష్ఠు డనియు, ప్రత్యక్షగుడారము తరువాతి కాలమందు ప్రత్యక్షపరచబోవు వాటికి సాక్ష్యార్థముగా నున్నదని తెలియజేయబడినది.
మోషే యాజకుడు కాడు, అతని పరిచర్య ప్రవక్త లక్షణములు గలది. అతడు దేవుని పక్షముగా మనుష్యుల యెదుటికి వెళ్లువాడు.
యాజకుడగు అహరోను ప్రజల పక్షముగా దేవుని యెదుటికి వెళ్ళువాడు. మోషే దేవుని సూచనల మేరకు అరణ్య ములో ప్రత్యక్ష గుడారమును నిర్మించెను.
నిజమైన అపొస్తలుడగు యేసు సర్వజగత్తుకు నిర్మాత. దీనికి ప్రత్యక్ష గుడారము సాక్ష్యముగా నున్నది. దేవుడు ఆకాశ మహాకాశములందు నివసించినయెడల, ఈ రోజున తన ఇల్లగు తన ప్రజలమధ్య నివసించుట మరింత నిజము.
నేడు ఆత్మీయ రూపమున ఉన్న దేవుని ఇంటికి అప్పటి పదార్థ నిర్మితమైన ప్రత్యక్ష గుడారము అలంకారికముగా నున్నది. సేవకుడుగా మోషే అరణ్యమందు దేవుని ఇంటిలో నమ్మకముగా ఉన్నాడు.
క్రీస్తు అయితే కుమారునిగా దేవుని ప్రజలతో కూడిన ఆయన ఇంటిపైనున్నాడు. ఈ విధముగా దేవుని ప్రజలు దేవుని ఇల్లుగా రూపొందు చున్నారని పరిచయము చేయుటనుబట్టి క్రీస్తు యాజకత్వ పరిచర్య జరిగించు పరిధి తెలియుచున్నది.

హెబ్రీయులకు పత్రిక 3, 4 అధ్యాయాల వచనాలు
క్రీస్తు యాజక పరిచర్యకు పిలుపునిచ్చు అరణ్యము (3:7-19)
(వచనము 6). మోషేను, ప్రత్యక్ష గుడారమును గూర్చిన సూచన సహజముగా దేవుని ప్రజల అరణ్య ప్రయాణముయొద్దకు మనలను నడిపించును.
ప్రత్యక్ష గుడారము దేవుని ప్రజలకు ముంగుర్తుగా నుండిన యెడల, ఇశ్రాయేలు ప్రజల అరణ్యయాత్ర దేవుని ప్రజలు ఈ దుష్ట లోకములో దాని ప్రమాదములను ఎదుర్కొనుచు ప్రయాణము చేయుటకు ముంగుర్తుగా నున్నది.
ఈ అరణ్యయాత్ర కారణముగానే యాజక పరిచర్య అవశ్యకమైనది. అరణ్యములో మనకు ఎదురగు ప్రమాదములవలన మన ఒప్పుకోలు నిజమైనదో కాదో పరీక్షింపబడినది.
ఈ యూదులు క్రైస్తవ్యమును బహిరంగముగా ఒప్పుకొనియున్నారు. ఒప్పుకోలులో యథార్థత కొరవడు ప్రమాదము తప్పక ఉండును. అందుకే “చేపట్టిన యెడల” అను పదము వచ్చెను.
“ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిర ముగా చేపట్టినయెడల … మనమే దేవుని ఇల్లు అని రచయిత చెప్పుచున్నాడు. ఈ హెచ్చరిక క్రీస్తునందు మనకుగల నిబ్బరము, విశ్వాసికి ఆయన సంపాదించు భద్రత విషయమైనది కాదు.
అందుకే ఒకరు ఈలాగు చెప్పియున్నారు – “క్రీస్తు కార్యములోగాని, కృపమూలముగా వచ్చు శుభ వర్తమానములలో గాని ‘అయితే’ అనునది లేనే లేదు. ఉన్నవన్నియు విశ్వాసమునకు భేషరతుగా లభ్యమగును.
హెచ్చరింపబడినవారు ఈ నిశ్చయత కలిగియున్నారని భావించినందున, తాము ఒప్పుకొనినదానిని విడిచిపెట్టవద్దని హెచ్చరింపబడియున్నారు. విశ్వాసికి అపజయములు ఎన్నో ఎదురైనను క్రీస్తు తన యాజక పరిచర్యవలన విశ్వాసిని గట్టిగా పట్టుకొనును.
లేదా విశ్వాసి ఆయనను గట్టిగా చేపట్టును. విశ్వాసి నిజ విశ్వాసము అంతమువరకు సహించుటవలన ఋజువగును. నిజ విశ్వాసిని పరీక్షించు అరణ్యము నామకార్థ క్రైస్తవుల కపట జీవితమును బహిర్గతము చేయును”.
(వచనములు 7-11). యేసుక్రీస్తు తన మహిమతోను, శక్తితోను వచ్చి యూదా జాతికి ఇవ్వనైయున్న విశ్రాంతిని ఇశ్రాయేలీయులకు చూపుచు దేవుని ఆత్మ పై లేఖన భాగమును ఉదహరించెను.

రాబోవు లోకములో క్రీస్తు మహిమను పంచుకొను కృపా రక్షణ దినము నేడే. అట్టి ధన్యకరమైన దినమందు తమ పితరులవలె ప్రవర్తించవద్దని వారు హెచ్చరింపబడుచున్నారు.
ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టి అడు గడుగునా అపాయములతో నిండిన అరణ్యమందు యెహోవాను వెంబ డింతుమని ఒప్పుకొనియున్నారు. దేవునియందు నమ్మకము మాత్రమే వారిని అంతమువరకు నడిపించును. నలువది సంవత్సరములు వారు దేవుని బలమైన కార్యములను చూచిరి.
అన్ని ఆపదలనుండి కాపాడుచు, ఆయన వారిని పోషించెను. అయినను వారు “యెహోవా మన మధ్య ఉన్నాడా లేదా?” అనుచు దేవుని శోధించిరి. దేవుని మంచితనము వారి కఠిన హృదయములను కదిలించలేదు అని వారు ఋజువు చేసిరి.
వారి స్వకీయ దురాశలను తీర్చుకొనుచు, దేవుని మార్గములను ఎరుగక, కేవలము నామకార్థముగా ఒప్పుకొనినను, దేవునియందు వారికి నమ్మిక లేదని ఋజువుచేసిరి. అట్టివారినిగూర్చి దేవుడు “వారు నా విశ్రాంతిలో ప్రవేశించరని” చెప్పెను.
(వచనములు 12, 13). ఈ వచనములలో కీర్తన 95 లోని హెచ్చరిక నామకార్థ క్రైస్తవులకు అన్వయించబడినది. జీవముగల దేవుని విడిచిపెట్టి, మృతమగు ఆచారముల తట్టు మరల తిరుగు విశ్వాసరహితమైన దుష్ట హృదయము కలదేమో అని పరిశీలించుకొనవలెను.
వారు ఒప్పుకొనినది ఏమైనను, క్రీస్తు కృపద్వారా విశ్వాసికి సంపాదించి ముగించిన రక్షణ, పాప క్షమాపణలో వారికి నమ్మకము లేదు అని స్పష్టమగుచున్నది.
మొత్తముమీద ఇక్కడ చెప్పదలచిన విషయమేమనగా క్రైస్తవ జీవిత శైలికి, యూదా ఆచారములను జోడించుట మంచిది కాదు. అసలు జరిగిన దేమనగా వారు క్రీస్తునే పూర్తిగా విడిచి యూదా మతమునకు మళ్ళిరి.
ఇదే భ్రష్టత్వము. మనము జాగ్రత్తపడుట మాత్రమే కాదు. నేడు అను సమయముండగనే స్వంత ఆలోచన అను మోసములో చిక్కుకొని కఠిన పరచబడకుండునట్లు “ఒకనినొకడు” బుద్ధి చెప్పుకొనవలెనని హెచ్చరింప బడియున్నాము.
ఇక్కడ పాపములు చేయుటవలన కలుగు మోసమును గూర్చి చెప్పుటలేదు. ఒక పాపము మరియొక పాపమునకు దారితీయును. ఇక్కడ రచయిత మాట్లాడుచున్నది పాపముయొక్క విధానము, అనగా అక్రమమన్న మాట.
మన ఇష్టముచొప్పున జరిగించిన హృదయము ఏలాగు కఠినపరచబడును అని మనము అంతగా దాని విషయము ఆలోచించము. అందుచే మనము జాగ్రత్తపడి ఒకరికొకరము బుద్ధి చెప్పుకొనవలెను. తమ సొంత ఆలోచనను అనుసరించుచు దిగజారి పోవుచున్నవారిని ప్రేమతో దారికి తేవలెనుగాని, దూరము చేయరాదు.
(వచనములు 14-19). విశ్వాసులు దేవుని ఇల్లు మాత్రమేకాదు. వారు క్రీస్తు సహచరులును అయి ఉన్నారు. ఇక్కడ చెప్పబడినది క్రీస్తు శరీరము కాదు, పరిశుద్ధాత్మచే శిరస్సుకు అతుకబడిన ఆయన శరీర అవయవములు కాదు.
ఎందుకనగా శరీరమునుండి తగనిదేదియు వచ్చు టకు వీలులేదు. ఇక్కడ ఇంకను ఒప్పుకోలు ప్రస్తావనలో ఉన్నది. అది యథార్థమైనదిగా ఉండవలెను.
అయితే యథార్థత లేకుండటకుకూడా అవకాశమున్నది. అందువలననే “మొదటినుండి మనకున్న దృఢ విశ్వాస మును అంతముమట్టుకు గట్టిగా చేపట్టవలెనని” మరల చెప్పబడియున్నది.
ఈ నిశ్చయతకు ఆధారము మనలోనున్నదేదియు కాదు. మనలోనున్నది స్వనీతి మాత్రమే. ఇక్కడ నొక్కి చెప్పిన నిశ్చయత క్రీస్తుయేసునందు పునాది కలిగియున్నది.
ఆయన ప్రాయశ్చిత్త బలిని అంగీకరించుటవలన అది అందుబాటులోనికి వచ్చినది. అట్టి నిశ్చయత కలిగియున్నందున రచయిత మనలను నిందించుట లేదు సరిగదా దానిని గట్టిగా చేపట్టవలెనని హెచ్చ రించుచున్నాడు.
అరణ్యములోని ఇశ్రాయేలు విషయము రచయిత మరల ప్రస్తావిం చుచు, ఇశ్రాయేలీయుల కఠినత్వమును, పాపమును, అవిశ్వాసమును వెలికితీయుటకు మూడు సూటియైన ప్రశ్నలు వేసియున్నాడు.
మొదటిది – దేవుని వాక్యము రాబోవు విశ్రాంతిని గూర్చి మాటలాడినప్పుడు విని, కోపము పుట్టించినవారెవరు? ప్రజలలో కొద్దిమందా? కానేకాదు, ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చిన అసంఖ్యాక ప్రజలు.
రెండవది ఎవరిమీద దేవుడు నలుబది ఏండ్లు కోపగించెను? స్వేచ్ఛగా పాపమును ఎన్నుకొని హృదయములు కఠినపరచుకొనినవారిమీదనే గదా! మూడు – తన విశ్రాంతిలో ప్రవేశింపరని దేవుడు ఎవరినిగూర్చి ప్రమాణము చేసెను? విశ్వసింపనివారిని గూర్చియే.
దీనినిబట్టి అంతటికిని మూల మగు పాపము అవిశ్వాసము అని అర్థమగుచున్నది. అవిశ్వాసము వారి పాపములను బహిర్గతము చేయగా, పాపము వారి హృదయములను కఠినపరచెను.
అరణ్యయాత్రగుండా వెళ్ళగా కలుగు విశ్రాంతి (4:1-11).
3:7-19 లో రచయిత ఇశ్రాయేలీయుల అరణ్యయాత్ర గురించి మాటలాడుచున్నది – కనానులో వారు పొందబోవు విశ్రాంతిని దృష్టిలో ఉంచుకొనియే.
ఐగుప్తునుండి వెలుపలికి వచ్చినవారు విశ్రాంతిలో ప్రవేశింపకపోవుటకు కారణము వారి హృదయ కాఠిన్యము, వారి పాపము మరియు వారి అవిశ్వాసమే. (3:15,17,19).
పూర్వకాలమందలి ఇశ్రాయేలీయులవలెనే, నేటి విశ్వాసులుకూడా ఈ లోకమను అరణ్యముగుండా రాబోవు మహిమయను విశ్రాంతిలో ప్రవేశింప వెళ్ళుచున్నారు.
నాలుగవ అధ్యాయము మొదటి 11 వచనముల లోని ప్రధానాంశము ఈ విశ్రాంతి. ఇక్కడ రచయిత మాట్లాడుచున్నది “దేవుని విశ్రాంతి” అని మనము గ్రహించవలెను. ఇదియే “ఆయన విశ్రాంతి” అనియు, పాత నిబంధన లేఖన భాగమందు “నా విశ్రాంతి” అనియు చెప్పబడియున్నది. (3:18; 4:1,3,5).
ఇక్కడ ప్రస్తావించిన విశ్రాంతి విశ్వాసి యేసుక్రీస్తునందు ఆయన ముగించిన కార్యమందు విశ్వాసముంచుటద్వారా కలుగునది కాదు. అలాగే ప్రభువు చెప్పినట్లు “ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త మైన వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును” అను వాక్యము ప్రకారమును కలుగు ప్రస్తుత మానసిక ప్రశాంతతకూడా కాదు. అది దేవుని విశ్రాంతి.

దేవుడు తన ప్రేమ, పరిశుద్ధతలకు సంతృప్తి కలిగినప్పుడే విశ్రాంతి గైకొనును. ఆయన ప్రేమించువారి మూలముగా దేవుని సంకల్పము, దేవుని ప్రేమ నెరవేరినప్పుడే ఆయన విశ్రాంతి అందుబాటులోనికి వచ్చును.
దుఃఖము, నిట్టూర్పు ఎగిరిపోయినప్పుడు, నీతి స్థాపించబడి నప్పుడు దేవుడు “తన ప్రేమయందు విశ్రాంతి నొందును” (జెఫన్యా 3:17). “పాపమున్నచోట పరిశుద్ధత, దుఃఖమున్న చోట ప్రేమ విశ్ర మింపవు” అని జె. యన్. డార్బీ అను భక్తుడు చెప్పెను.

క్రైస్తవుడు పరలోక విశ్రాంతిలో పాల్గొనునట్లు అవిశ్రాంత లోకము నుండి పిలువబడియున్నాడు. అతడు లోకమును విడిచిపెట్టలేదు, తాను వెళ్ళనున్న పరలోకమును చేరలేదుగాని తాత్కాలికముగా లోకములో ఉన్నాడు.
క్రీస్తు మనకొరకు సంపాదించి, ఆయన ఉన్నట్టి పరలోక విశ్రాంతిని విశ్వాసముద్వారా చూడగలుగుచున్నాము. ఈ విషయము 9:20 లో “ఇప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను” అని ఆయననుగూర్చి చెప్పబడినది.
(వచనములు 1, 2). శ్రేష్టమైన ఈ వాగ్దానము మనకున్నను, ఆ విశ్రాంతిలో ప్రవేశించక తప్పిపోవుదుమేమో అని హెచ్చరింపబడి యున్నాము.
నామకార్థులుమాత్రము తమ క్రైస్తవ ఒప్పుకోలును విడిచిపెట్టి యూదా మతమునకు మళ్ళి తప్పిపోయినట్లుండుట గాక, అక్షరాలా తప్పి పోయి, అరణ్యమందు నశించెదరు. నిజమైన విశ్వాసి అయితే వెనుదిరిగి, లోకమందు స్థిరపడి తప్పిపోయినట్లు కనిపించును.

పరలోక నిత్య విశ్రాంతిని గూర్చిన మరింత శ్రేష్ఠమగు సమాచారము క్రైస్తవులకు నేడు ఇవ్వబడినది. దేవుని వాక్యమునకు విశ్వాసమును జోడించకపోయినయెడల పూర్వకాలమువలెనే నేడును వినువారికి ఎట్టి ప్రయోజనము చేకూరదు.
(వచనములు 3, 4). పూర్వకాలమందు కొందరు కనాను విశ్రాంతిని గూర్చిన సమాచారము వినియు విశ్వసించనిరీతిగా, నేడును అసంఖ్యా కులు పరలోక విశ్రాంతియందు విశ్వాసముంచుట లేదు.
అయినను దేవుని రాబోవు విశ్రాంతి స్థిరముగా అట్లే నిలిచియున్నది. విశ్వాసులు అందు ప్రవేశించెదరు. వారు వేయు ప్రతి అడుగు వారిని దేవుని విశ్రాంతికి సమీపముగా తెచ్చుచున్నది.
హెబ్రీయులకు పత్రిక 4:14-16 వచనాలు
విశ్వాసమున్నదని కేవలము నోటితో చెప్పు కొనుచు క్రీస్తునందు నిజముగా విశ్వాసముంచని నామకార్థులు తిరిగి రాకుండా ఎడారిలో నాశనమగుదురు.

దేవుని విశ్రాంతి అను ఆయన లక్షణమును వెల్లడించుటకును, ఆదినుండియు దేవుడు తనయెదుట “విశ్రాంతి”ని ఉంచుకొనియున్నాడని చూపుటకు రచయిత సృష్టి ప్రస్తావన తెచ్చుచున్నాడు.
ప్రపంచము రూపింప బడిన తరువాత దేవుడు తన పోలికలో తన స్వరూపమందు మనిషిని సృజించెను. అంతటితో దేవుని సృష్టికార్యము ముగిసినది. రెండు స్పష్టమైన అంశములతో సృష్టి విశ్రాంతికి దారితీసినది.
మొదటిది – “దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగ నుండెను” అని వ్రాయబడియున్నది.
రెండవది – దేవుని విశ్రాంతిని సూచించు రెండు గొప్ప సత్యములను ఇక్కడ గమనించు చున్నాము. ఈ ప్రయాస ఫలితము – సంపూర్ణ సంతోషమును, సంతృప్తిని అనుభవించుట.

(వచనము 5). సృష్టి విశ్రాంతి నిత్య విశ్రాంతికి ముంగుర్తుగానున్నది. సృష్టియొక్క విశ్రాంతి పాపమువలన భంగపరచబడినది. అయినను దేవుడు తన హృదయమందు నిశ్చయించిన విశ్రాంతిని, అనగా నిత్య విశ్రాంతిని విడిచిపెట్టలేదు. ఎట్టి పాపము దానిని రద్దుచేయజాలదు.
యెహోషువ దినములలోకూడా మరియొకసారి దేవుని విశ్రాంతి మనయెదుట ఉంచ బడినది. ఇశ్రాయేలీయులు తమ అవిశ్వాసమునుబట్టి ఆ విశ్రాంతిలో ప్రవేశింపలేకపోయిరి. అందువలననే దేవుడు “వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు” (కీర్తన 95:11) అని చెప్పియున్నాడు.
(వచనము 6). సృష్టి విశ్రాంతిని పాపము పోగొట్టినను, అవిశ్వాసము కనాను విశ్రాంతిని రద్దుపరచినను “నా విశ్రాంతి” అని చెప్పు దేవుని విశ్రాంతి తన యెదుటనే ఉన్నదని దేవుడు మనకు అభయమిచ్చుచున్నాడు.
శారీరక బలహీనత మరియు ఆధ్యాత్మికత
మొదటిగా – సువార్త వినినవారు తమ అవిశ్వాసమువలన ఆ విశ్రాంతిలో ప్రవేశింపలేకపోయినను, ఎవరో కొందరు ఆ విశ్రాంతిలో ప్రవేశింతురను మాట నిశ్చయము. దేవుడు తన హృదయాలోచననుబట్టి సంపాదించు ఆ విశ్రాంతిని మానవుని పాపముగాని, అవిశ్వాసముగాని భంగపరచ జాలవు.
(వచనములు 7, 8). సృష్టి విశ్రాంతి పోయి, కనాను విశ్రాంతి భగ్నమైపోయినయెడల విశ్వసించువారు పొందు దేవుని విశ్రాంతి ఏమిటి? ఇశ్రాయేలు ప్రజలను కనాను విశ్రాంతిలోనికి తెచ్చుటకు యెహోషువ విఫలుడాయెను. అందువలననే, చాలా సంవత్సరముల తరువాత దావీదు విశ్రాంతినిచ్చు “మరియొక దినమును” గూర్చి చెప్పుచున్నాడు.
ఈ విశ్రాంతిని వెల్లడించుటకు రచయిత కీర్తన 95:7,8 ను ఉదహరించెను. యేసుక్రీస్తు ఇశ్రాయేలు జాతికి విశ్రాంతి నిచ్చుటకు రాబోవుచున్నందున కృతజ్ఞతతో యెహోవావైపు మరలుమని ఇశ్రాయేలీయులను ఈ కీర్తన పిలుచుచున్నది.
ఈ శుభసమాచారము విని, యెహోషువ కాలమునాటి ఇశ్రాయేలీయులవలె హృదయములను కఠినపరచుకొనవలదని హెచ్చ రించుచున్నది. సరిక్రొత్తగా చేసిన ఈ అభ్యర్థనను తిరస్కరించుటయనగా క్రీస్తుయేసు భూలోకపాలనలో విశ్రాంతిని పోగొట్టుకొనుటే.
(వచనములు 9, 10). “కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి యున్నదని” చెప్పి రచయిత తన తర్కమును ముగించెను.
ఈ విశ్రాంతి యొక్క విశేష లక్షణమేమనగా ప్రయాస అంతటినుండి విశ్రమించుట. ఎందుకనగా, “ఆయన విశ్రాంతిలో ప్రవేశించువాడుకూడ తన కార్యము లను ముగించి విశ్రమించును” అని వ్రాయబడియున్నది.
ఆ విధముగా ఇక్కడ రూఢిపరచబడిన గొప్ప సత్యమేదనగా పరలోక సంబంధమైన ప్రజలకు పరలోక సంబంధమైన దేవుని విశ్రాంతిగాని, భూసంబంధమైన ఆయన ప్రజలకు భూసంబంధమైన విశ్రాంతిగాని ఏదైనను భవిష్యత్తులో కలుగునదే.
విశ్వాసము ఎదురుచూచు విశ్రాంతి ఇదే. అంతేకాదు, ఇక్కడ చెప్పిన విశ్రాంతి పాపమునుండి కాదుగాని ప్రయాసనుండి. ప్రయాసపడిన వ్యక్తి అలసిపోయినందున విశ్రాంతి కాదు, అతని పని ముగిసినందుననే.
ఒకరు ఈ విధముగా చెప్పియున్నారు – “ప్రస్తుత విశ్రాంతి దేవుని విశ్రాంతి కాదు. భవిష్యత్తులో క్రైస్తవులకు, ముఖ్యముగా ఈ లోకములోనే విశ్రాంతిని వెదకు యూదులకు లభించు విశ్రాంతి వారిని లోకపు ఉరులనుండి కాపాడును.
దేవుడు పాపములో దుఃఖములో విశ్రమించడు గనుక, మనముకూడా మన కోర్కెలయందు సైతము దానిని అనుమతించరాదు. అది మన జీవిత లక్ష్యము ఎంతమాత్రము కాకూడదు.
ఆయన ప్రేమను ఎరిగి ఉన్నయెడల ప్రేమకలిగి ప్రయాసపడు సమయమిదే. తండ్రి యథార్థముగా ఆరాధించువారిని వెదకుచున్నందున మనముకూడా అదే పని చేయవలయును.
(వచనము 11). ఈ విశ్రాంతి భవిష్యత్తులో కలుగుననియు, శ్రేష్ట మైనది గనుక దానిలో ప్రవేశించుటకు ప్రయాసపడుదమనియు హెచ్చ రింపబడియున్నాము.
ఈ పత్రికలోనే తరువాత “ప్రేమతో ప్రయాసపడ వలెనని”, “జాగ్రత్తపడుమని”, “మందులు కాక విశ్వాసముచేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనువారిని పోలి నడుచుకొను మనియు” హెచ్చరింపబడియున్నాము. (6:10-12).
మన యాత్ర ముగింపులో మనయెదుట ఉన్న దేవుని విశ్రాంతిని తృణీకరించు ప్రమాదమున్నది. లేదా ప్రయాణములో ప్రేమతో ప్రయాస పడుటలో అలసిపోవచ్చును. ఇశ్రాయేలీయులు ఈ రెంటినీ చేసిరి.
కనుక, మనలో ఎవరును వారివలె అవిశ్వాసముతో తప్పిపోకుండునట్లు జాగ్రత్త పడుదుముగాక! ఇక్కడ రెండు గొప్ప హెచ్చరికలేమనగా, ఒకవేళ ఆ విశ్రాంతినిగూర్చిన వాగ్దానము పొందకుండ తప్పిపోదుమేమోయని “భయము కలిగియుందము” (4:1); ఆ విశ్రాంతిలో ప్రవేశించునట్లు “ప్రయాసపడుదము” (11వ).
అరణ్య యాత్రలో మన పోషణకు దేవుని ఏర్పాటు (4:12-16)
విశ్వాసులు దేవుని విశ్రాంతి పొందుటకై ప్రయాణమై యాత్రలో నుండగా వారిని సంరక్షించు రెండు గొప్ప ఏర్పాట్లు ఈ అధ్యాయము చివరలో మనయెదుట ఉంచబడినవి. మొదటిది, దేవుని వాక్యము. (12, 13 వచనాలు). రెండవది, క్రీస్తు యాజక పరిచర్య. (14-16 వచనాలు).
(వచనములు 12, 13). దేవుని వాక్యము మృతతుల్యమైన లేఖ కాదు. అది సజీవము. మానవ హృదయమును ఛేదించుచు పనిచేయును. దేవుని వాక్య తాకిడి క్రిందికి వచ్చిన వ్యక్తి మనస్సాక్షి హృదయముపై రెండు విధములుగా ఫలితము చూపును.
మొదటిది, హృదయముయొక్క తలంపులను, ఆలోచనలను వెల్లడించును. రెండవది, మనమెవరికైతే లెక్క అప్పగించవలసియున్నదో ఆయన యెదుటికి మనలను నడిపించును.
దేవుని వాక్యము శరీరముయొక్క నిజస్థితిని చూపెట్టును. హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించును. ఆత్మసంబంధమైన అవిశ్వాసమును, శరీర సంబంధమైన రహస్య కోర్కెలను బహిర్గతము చేయును.
ఇక్కడ ప్రస్తావించబడినది బహిరంగ పాపములు కాదు గాని చెడుగంతటికిని మూలమైనట్టి అంతరంగిక ఆలోచనలు. దేవుని వాక్యము హృదయపు లోతులలోనికి వెళ్లి, మన జీవితములోని రహస్య ఆలోచనలు ఎంత “స్వార్థపూరితమో” వెల్లడిచేయును.
అంతేకాదు, ఇది దేవుని వాక్యము గనుక మనలను దేవునియెదుటికి తెచ్చును. దేవుని వాక్యము నాలో పసిగట్టినదానినంతటిని ఒప్పుకొనునట్లు నా హృదయమును తేటగా తనయెదుట నుంచుకొని దేవుడే నాతో మాటలాడుచున్నాడు.
ఇశ్రాయేలీ యులు అరణ్యములో నేలరాలుటకు కారణమేమి? “ప్రకటించబడిన వాక్యము వారికి ప్రయోజనకరము కాకపోయినందునా?” వారు దేవుని వాక్యమునకు తమ హృదయములలో చోటిచ్చియున్నయెడల, వారు విశ్రాంతిలో ప్రవేశించకుండా ఆటంకపరచిన అవిశ్వాసమునకు కారణ మగు రహస్య పాపములను ఆ వాక్యము పరిష్కరించియుండును.
దేవుని విశ్రాంతి పొందుటకు మనము సాగిపోవుచుండగా మనలను ఆటంకపరచు సమస్తమును, మనము ఈ లోకమందే స్థిరపడునట్లు శోధించు సమస్తమును దేవుని సన్నిధిలో ఆయన వాక్యము పసిగట్టి తీర్పు తీర్చును.
ఆ విధముగా మానవాత్మ దేవుని విశ్రాంతిపై దృష్టి నిలిపి, యాత్రలో నిరాటంకముగా కొనసాగుచు, ప్రేమతో ప్రయాసపడగలదు.
(వచనము 14). దేవుని వాక్యము మన రహస్య తలంపులను శోధిం చుట మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువు యాజక పరిచర్యద్వారా మనతో సహానుభవము పొందుటనుబట్టి మనకు ప్రయోజనము కలుగునట్లు సిద్ధపరచును.
మన హృదయములోనున్న రహస్య పాపములతో మనము పోరాడుట మాత్రమేకాదు, మన చుట్టూ దుర్బలత్వము ముసురుకొని యున్నది. అడుగడుగునా శోధనలు ఎదురగుచున్నవి.
మన హృదయ మందలి రహస్యమైన చెడుగును పరిహరించుటకు దేవుని వాక్యము అవసరము. మరియు శోధనలలో, కడగండ్లలో మనకు సహాయము కావలెనంటే సజీవుడైన వ్యక్తి కావలయును.
ఆయన మన విషయము శ్రద్ధ కలిగి, మనకు ప్రతినిధిగా ఉండవలెనంటే, ప్రతిక్షణము మన బలహీనతలను భరించువాడు కావలెనంటే మనవలెనే ఆయన అన్ని విషయములలో శోధింపబడి, కష్టములను ఎదుర్కొని యుండవలెను.
“దేవుని కుమారుడైన యేసు” అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. దేవుని విశ్రాంతికి నడిపించు మార్గమందు ఆయన మన కంటే ముందుగా ఉన్నాడు. ఆయన ప్రతి అడుగు వేసియున్నాడు, ఆకాశమండలముగుండా వెళ్ళియున్నాడు. దేవుని విశ్రాంతిని చేరు కొన్నాడు.
మన అరణ్యయాత్రలో ఆయన విశ్రమించు స్థలములో మన మును విశ్రమించునట్లు అన్ని పరీక్షలలో, శోధనలలో, మన బలహీనత లన్నింటిలో ఆయన మనలను ఆదుకొనగలుగుచున్నాడు. చిట్టచివరకు శ్రమ అంతయు అంతమొందును.
అట్టి ప్రధాన యాజకుడు మనకు ఉన్నందున మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టవలెనని హెచ్చరింపబడియున్నాము. యేసే క్రీస్తని, ప్రభువని ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుట మాత్రమే కాదు, మనము శ్రేష్టమైన పరలోక సంబంధమగు పిలుపులో పాలివారమని ఒప్పుకొనుట అవసరము.
మన ఒప్పుకోలు ఏదనగా పిలుపులో పాలివారముగా మనము దేవుని విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. పొంచియున్న ప్రమాద మేమనగా, శోధనలలో మన బలహీనతలనుబట్టి పరలోక సంబంధమైన పిలుపును విడిచిపెట్టి, లోకములో కాకున్నను, సేవా సంబంధమైన కార్య క్రమాలలో చురుకుగా పాల్గొనుచు అందులో స్థిరపడుటకు యత్నించుట.
(వచనము 15). మన ప్రధాన యాజకుని ఆదరణ, సానుభూతి మనకు అవసరము. ఎందుకనగా, మొదటిది మన బాధలనుబట్టి, రెండవది – మనము ఎదుర్కొనవలసిన శోధనలనుబట్టి.
మనము శరీర మందున్నాము కనుక అనారోగ్యమువలనను, ఆపదలవలనను మనకు బాధలు కలుగును. దానికి వివిధ అవసరతలు కలుగుచుండును. అనారోగ్యమునకును, ప్రమాదములకును అది లోనగుచుండును.
బాధలు పాపము కాదు గాని, అవి పాపమునకు దారితీయవచ్చును. ఆకలి అనునది బాధ, ఆకలినిబట్టి సణుగుట పాపము. పౌలు తన బాధలలో క్రీస్తు కృపాసమృద్ధిని అనుభవించియున్నాడు. అతడు పాపములో అతిశయించువాడు కాడు, పాపము చేయుటలో సంతోషించు వాడు కాడు.

విశ్వాసికి రెండు విధములుగా శోధనలు కలుగును. వెలుపలి పరీక్షల మూలముగా కలుగునవి, లోపలనున్న పాపము మూలముగా కలుగునవి. రెండు విధములైన శోధనలను యాకోబు మన యెదుటికి తెచ్చియున్నాడు. “మీరు నానావిధమైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి” అనునది మొదటిది.
మనలను పరలోక పిలుపునుండి దారి తప్పించి, దేవుని విశ్రాంతి పొందుటకు ముందుకు సాగిపోకుండా నిరోధించుటకు మన శత్రువగు సాతాను వెలుపలినుండి అనేక శోధనలు మనమీదికి ఎక్కుపెట్టును. తరువాత అపొస్తలుడు మరియొక విధమైన శోధననుగూర్చి ఈ విధముగా వ్రాయుచున్నాడు. ఇది లోపల ఉన్న పాపము మూలముగా కలిగెడి శోధన.

ప్రస్తుతము మనము ధ్యానించుచున్న హెబ్రీ పత్రికలోని వాక్యభాగము మొదటి రకపు శోధనను మనయెదుటికి తెచ్చుచున్నది. దేవుని వాక్యము నకు విధేయులగువారు పొందు దేవుని విశ్రాంతినుండి తప్పించు శోధన ఇది.
మన ప్రభువు దేవునికి విధేయుడుగానున్న మార్గమునుండి ఆయనను తప్పించుటకు అపవాది ఆకలి అను శోధనను ప్రయోగించినట్టే, మనలను కూడా శారీరక బలహీనతలను ఆధారము చేసుకొని శోధించి, మనలను దారితప్పించ యత్నించుచున్నాడు.
ఇట్టి శోధనలలో ప్రభువుయొక్క సాను భూతి మనకు లభించును. ఎందుకనగా, ఆయనకూడా “సమస్త విషయము లలో మనవలెనే శోధింపబడెను”. రెండవ రకపు శోధన ఆయన బొత్తిగా ఎరుగడు. ఆయన మనవలెనే సమస్త విషయములలో శోధింపబడినట్లు చెప్పినను, “ఆయన పాపము లేనివాడుగా ఉండెను” అని జోడింపబడినది.
(వచనము 16). బలహీనతలలో, శోధనలలో మనకొక ఆధార మున్నది. ఎట్టి కష్టములు మనము ఎదుర్కొనవలసినను, ఏ విధముగా పరీక్షించబడి, శోధింపబడినను, ఎట్టి అత్యవసర పరిస్థితులు ఉత్పన్న మైనను ఆ శోధనను ఎదుర్కొనుటకు చాలినంత కృప మనకు అందు బాటులో ఉన్నది.
కృపా సింహాసనము మనకు తెరువబడియున్నది. కృపా సింహాసనము అనగా దేవునియొద్దకు సమీపించవలసినదిగా మనము హెచ్చరింపబడుచున్నాము. మనము సమీపించవలసినది ప్రధాన యాజకుని కాదు, దేవునినే.
మన కొండిగా యేసు యాజకత్వము
మనము ధైర్యముగా కృపాసనమును సమీ పించగలము. ఎందుకనగా ప్రధానయాజకుడు మన ప్రతినిధిగా కృపాస నము యెదుట నున్నాడు. మనము సమీపించినప్పుడు సమయోచిత సహాయము లభించును.
విఫలులమైనందున కాదు, శోధనలలో వైఫల్యము చెందకుండునట్లు మనము కనికరము పొందుచున్నాము. అవసర సమ యము _ అపజయ సమయము కాదు. అయితే శోధనలు, పరీక్షలు కలిగినమీదట అపజయమునకు దారితీయవచ్చును.