క్రీస్తు వ్యక్తిత్వపు మహిమలు (అధ్యాయములు 1, 2)
ఈ పత్రికయొక్క రచయిత ఎవరో వ్రాయబడలేదు. అందువలన ఎవరు వ్రాసినది మనకు అంత ప్రాముఖ్యము కాదు అని గ్రహించవలెను.

రచయిత పేరు లేకపోవుటకు కారణము పత్రికలోని ప్రత్యేక లక్షణ ములు కావచ్చును. దేవుడు మనుష్యులద్వారా ఇక ఎంతమాత్రము మాట లాడుటలేదు. క్రీస్తుయేసు అను వ్యక్తిద్వారా నేరుగా కృపతో మాటలాడు చున్నాడని తెలియజేయుట ఈ పత్రిక ముఖ్యోద్దేశము.
అంతేకాక దేవుడు మనుష్యులతో ఏ అపొస్తలులద్వారా మాటలాడి నాడో ఆ అపొస్తలుడు క్రీస్తేయని ఈ పత్రిక తెలుపుచున్నది. అందువలన కొంత తక్కువ హోదాలో అనేకమంది అపొస్తలులుగా పిలువబడినను క్రీస్తు వారినందరినీ అధిగమించుచున్నాడు.
ఈ పత్రికయొక్క పరమావధి విశ్వాసులను క్రైస్తవ్యపు పారలౌకిక లక్షణములందు స్థిరపరచి, బాహ్యమైన భూసంబంధమైన మతాచారముల నుండి విడుదలచేయుట.
Read and Learn More హెబ్రీయులకు వ్రాసిన పత్రిక
క్రైస్తవ్యములోని సమస్తము – అనగా దానిద్వారా దేవునికి కలుగు మహిమ, విశ్వాసికి సంక్రమించు ఆశీర్వాదములు మున్నగునవి క్రీస్తు వ్యక్తిత్వము, ఆయన పనిమీదనే ఆధారపడియుండును.
అందువలననే ఈ పత్రిక క్రీస్తు వ్యక్తిత్వపు మహిమలతో ప్రారంభమగు చున్నది. మొదటి అధ్యాయములో కుమారునిగా క్రీస్తుయొక్క మహిమ; రెండవ అధ్యాయము 1-4 లో ఆయన వాక్యాధికారములు; 2:5 – 18 లో ఆయన మానవత్వపు మహిమ వెల్లడియగుచున్నది.
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక అర్థం
కుమారునికి మహిమ (అధ్యాయములు -1)
పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా దేవుడు మన పితరులతో మాటలాడి యున్నాడు. (1:1-3). మనుష్యులపైన తనకున్న అధికారమును తెలుపుచు దేవుడు మోషేతో ధర్మశాస్త్రమందు మాటలాడెను.
ఇతర సమయములలో దేవుడు తన అనుగ్రహముచొప్పున దేవదూతలద్వారా తన ప్రజలతో మాటలాడెను. తరువాత తిరుగుబాటు చేయు ప్రజలను తనయొద్దకు రమ్మని ప్రవక్తలద్వారా మాటలాడెను. కుమారునికి ముందు ప్రవక్తలు వచ్చినట్లు ప్రత్యేకముగా ప్రస్తావించబడినది.
“దినముల అంతమందు” అనగా ప్రవక్తల కాలము ముగింపులో కుమారుడు వచ్చెను. పూర్వకాలమందు దేవుడు మనిషికి ఇచ్చిన సాక్ష్య మును క్రీస్తుయేసునందు కొనసాగించెను. కుమారుడు వచ్చినప్పుడు మాట్లాడినది దేవుడే.
ప్రవక్తలు దేవుని ఆత్మచేత నడిపింపబడి ఆయన సాధనములుగా పలికిరి. కుమారునియందు దేవుడు మానవునికి సమీపముగా వచ్చెను. ఇప్పుడు ప్రవక్త లేదా యాజకుని ప్రమేయము లేకుండానే మానవులు దేవుని సమీపింప వీలగుచున్నది.
ఏదేని ఒకదానియొక్క ప్రాధాన్యత దానినిగూర్చి మాటలాడు మనిషి యొక్క మహిమ మరియు అతని వ్యక్తిత్వములపై ఆధారపడి ఉండును. నిత్యకుమారుడగు యేసుక్రీస్తుయొక్క మహిమగల నామములో దేవుడు మనతో మాటలాడియున్నాడు.
మాట్లాడిన వ్యక్తి గొప్పతనము, మాట్లాడిన సందేశముయొక్క ప్రాధాన్యత మనము గ్రహించగలుగునట్లు ఆత్మ దేవుడు మనయెదుట ఆ కుమారునియొక్క ఏడు విధములైన మహిమను ఉంచు చున్నాడు.
ఒకటి : కుమారుడు సమస్తమునకు వారసునిగా నియమింపబడి యున్నాడు. కుమారత్వము, వారసత్వము అనునవి లేఖనములలో ఒకదానికొకటి సంబంధము కలిగియున్నవి.
మనుష్యులు భూమిని స్వాధీనము చేసుకొని, సముద్రమును పాలించి, వాయువును కూడ జయించ ప్రయత్నించుచున్నారు. వారు అధికారము, ఆస్తిపాస్తులు, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, ఆశీర్వాదములను చేజిక్కించు కొనుటకు ప్రయాసపడుచున్నారు.
కుమారునిగా క్రీస్తు వీటన్నిటిని వార సత్వముగా పొందియున్నాడు. ఎందుకనగా ఆయన సమస్తమునకు వారసునిగా నియమింపబడియున్నాడు. సమస్తమునకు యోగ్యుడుకూడా ఆయనే. మనిషి వీటన్నిటిని వారసత్వముగా పొందుటకు ఎంత మాత్ర మును తగినవాడు కాదని ప్రపంచ సుదీర్ఘ చరిత్ర రుజువుపరచుచున్నది.
ఇవన్నియు ఏ పరిణామములో మనిషి అందుబాటులోనికి వచ్చినను, అతడు వాటిని దుర్వినియోగపరచి, తనను హెచ్చించుకొని దేవునిని వెలుపల ఉంచుచున్నాడు.
తన సంకల్పమును వెల్లడించుటకు అధికార మును, దేవుడు లేకుండా సంతోషముగా ఉండుటకు ఆస్తిపాస్తులను, దేవుని ఆయన సృష్టినుండి దూరము చేయుటకు జ్ఞానమును, దేవుడు లేకుండా స్వతంత్రముగా వ్యవహరించుటకు బలమును, తనను తాను హెచ్చించుకొనుటకు ఘనతను, తనను తాను చూపెట్టుకొనుటకు మహి మను, స్వార్థ ప్రయోజనముకొరకు ఆశీర్వాదమును మనిషి వినియో గించుకొనుచున్నాడు.
క్రీస్తు వ్యక్తిత్వపు మహిమలు హెబ్రీయులకు వ్రాసిన పత్రిక
సమస్తమునకు వారసునిగా నియమించబడిన వానిని ఈ మనిషి పూర్తిగా తృణీకరించి, ఆయనను మేకులతో సిలువకు కొట్టియున్నాడు.
అయినను క్రీస్తు తన స్వాస్థ్యమైన సమస్తమందు ప్రవే శించునప్పుడు పరలోక వాణి ఈలాగు ఆనందముతో ప్రకటించును “వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు స్తోత్రము పొందనర్హుడు”.
ఆయన సమస్తమును తండ్రియైన దేవుని మహిమార్ధము మానవుని ఆశీర్వాదముకొరకు విని యోగించును. క్రైస్తవ్యములో మనము సమస్తమునకు వారసుడైనవానితో సమైక్యపరచబడియున్నాము. యూదా విశ్వాసులవలెనే శ్రమపెట్టబడి, దోచుకొనబడినవారికి ఇది ఎంత ఆదరణ కలిగించునో కదా!
రెండు : కుమారునిద్వారానే సర్వ ప్రపంచము నిర్మించబడినది. “ఆయన ప్రపంచములను నిర్మించెను”. కేవలము ఈ ప్రపంచము మాత్రమే కాదు. ఈ అనంత విశ్వములోని విశాల వ్యవస్థనంతటినీ ఆయనే నిర్మించెను.
ఆయన సమస్తమునకు వారసునిగా నియమింపబడి నందున, ఆయనకొరకు మనము ఎదురుచూచుచున్నాము. సమస్తమును, అనగా చిన్నవైనను, పెద్దవైనను అన్నింటినీ సృష్టించినది ఆయనే. కుమారునియొక్క ముద్ర సృష్టియావత్తుపైనను ఉన్నది.
మూడు : కుమారుడు దేవుని మహిమను ప్రకాశింపజేయు ఆయన తేజస్సు. కుమారుడు శరీరమును ధరించుటద్వారా దేవుని మహిమను పూర్ణముగా వ్యక్తపరచుచున్నాడు. దేవుని లక్షణములన్నిటిని ఈ మహిమ వెల్లడించుచున్నది. దేవుని లక్షణములన్నియు మనయెదుట తేటగా ప్రదర్శితమగునట్లు కుమారుడు మనకు సమీపముగా ఉన్నాడు.
నాలుగు : కుమారుడు “దేవుని తత్వముయొక్క మూర్తిమంతమునై యున్నాడు”. ఇది దేవుని గుణములను ప్రకాశించుటకంటే మించినది. ఇది దేవునినే వెల్లడించుచున్నది. ఆయన మూర్తిమత్వమును చూపెట్టుట అనగా ‘కుమారుడు మానవుడగుటద్వారా అదృశ్యముగానున్నవానియొక్క దృశ్యమానమగు ప్రతినిధిగా మన ఎదుట నిలుచుట’ అని అర్ధము.
ఒక వ్యక్తి ప్రతినిధి కాకుండగనే, ఆ వ్యక్తి గుణములను ధరించుట సాధ్యమే. అయితే కుమారునిలో దేవుని గుణ లక్షణములు ప్రవేశించుట మాత్రమే కాదు, సృష్టిలో ఆయన దేవుని ప్రతినిధి. ఆయన పనులన్నియు దేవుడు మనతో ఉన్నాడని వెల్లడించినవి.
ఐదు : కుమారుడు తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచున్నాడు. సృష్టికి ప్రథమ కారణమున్నదని ప్రజలు అంగీక రించినను, ప్రస్తుత చరాచర సృష్టినుండి దేవుని మూసివేయుచున్నారు. “సృష్టి అనునది ఒక పరిపూర్ణ యంత్రము, దాని నిర్మాత ప్రమేయము లేకుండానే అది అనంతకాలము మనగలదు” అని ఒకడు చెప్పిన మాట ప్రజలు నమ్ముచున్నారు.
అసలు సత్యమేమనగా ఈ చరాచర జగత్తును కుమారుడు ఉనికిలోనికి తెచ్చుట మాత్రమే కాదు, దానిని నిర్వహించు వాడు ఆయనే. ఆయన లేకుండా ఒక్క నక్షత్రముకూడా తన గతిలో పయనించలేదు. ఒక్క పిచ్చుక నేల వ్రాలదు!
ఆరు : కుమారుడు పాపములకు శుద్దీకరణము చేసెను. ఆయన ప్రపంచమునకు సృష్టికర్తమాత్రమే కాదు. పతనమైన జగత్తును విమోచించు వాడు ఆయనే. ఆయన “తానే” పాపములకు ప్రాయశ్చిత్తము చేసినందున మన పాపములు క్షమింపబడి, అవి దేవుని యెదుటనుండి తొలగింప బడుచున్నవి.
ఏడు : కుమారుడు ఇప్పుడు ఉన్నత లోకమందు మహామహుని కుడిపార్శ్వమున కూర్చుండుటద్వారా ఆయన వ్యక్తిత్వపు మహిమ మరింత తేటగా వెల్లడియగుచున్నది.
ఈ పత్రికలో మొత్తముమీద నాలుగు పర్యాయములు ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండినట్లు చెప్ప బడియున్నది. ఇక్కడ దీని కారణము ఆయన వ్యక్తిత్వపు మహిమయే.
ఎనిమిదవ అధ్యాయములో మహా ప్రధాన యాజకుడిగా ప్రస్తుతము ఆయన జరిగించు పని మూలముగా ఆయన అట్లు కూర్చుండెనని వివరింపబడినది. తొమ్మిదవ అధ్యాయములో సిలువపైన ఆయన ముగించిన కార్యముయొక్క ఫలితమే తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని యున్న ఆయన ప్రస్తుత స్థితి అని వివరించబడినది. పన్నెండవ అధ్యాయ ములో విశ్వాస పథము చివరకు చేరిన సందర్భము చెప్పబడియున్నది.
కాలమంతటియందు ఉండిన కుమారునియొక్క మహిమలను నొక్కి చెప్పి, ప్రస్తుతము దేవుని కుడిపార్శ్వమున ఆయన స్థానమును వివరించి, అటుపైన దైవాత్మ మనయెదుట క్రీస్తు శరీరధారిగా నున్నప్పుడు ఆయన వారసత్వముగా పొందిన అంతులేని మహిమాన్విత నామమును ప్రదర్శించు చున్నాడు.
వాక్యములో నామమనునది ఒక వ్యక్తిని ఇతరులకంటే వేరుగా ప్రత్యేకముగా అతని కీర్తిని తెలుపును. సృష్టమైన ఏ వస్తువు లేక ఏ జీవి నామముకంటే క్రీస్తునకు అత్యున్నతమైన నామమున్నదని చూపుటకు పాత నిబంధననుండి ఏడు వాక్య భాగములు ఎత్తి వ్రాయబడినవి.
(వచనములు 4, 5). క్రీస్తుకు దేవదూతలకంటే హెచ్చగు నామము మరియు స్థానము కలదు. క్రీస్తు లోకములోనికి వచ్చుటద్వారా సృష్టింప బడిన జీవులన్నిటికంటే అత్యున్నత స్థానమును గైకొనినట్లు ఋజువు పరచుటకు కీర్తన 2 ఉదహరింపబడియున్నది. దేవదూతల స్థానము ఎంత శ్రేష్టమైనదైనను, వారుకూడ సేవకులుమాత్రమే. కాని, క్రీస్తు కుమారుడు. ఎందుకనగా “నీవు నా కుమారుడవు.
నేను నేడు నిన్ను కనియున్నాను” అని దేవదూతలతో దేవుడు ఎప్పుడూ చెప్పియుండలేదు. నిత్యత్వమునుండి క్రీస్తు కుమారుడని లేఖనము స్పష్టముగా చెప్పుచున్నది.
అయితే ఆయన కాలపరిమితికి లోనై జన్మించినప్పుడు కుమారునిగా ఆయన ఆహ్వానింపబడెను. “ఆయన ఎప్పటికిని కుమారుడైయుండెను. ఎన్నటెన్నటికీ కుమారునిగానే ఉండును. ఆయన మానవునిగా ఇక్కడ కుమారుడు.
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక వివరణ
నిత్యత్వమంతటిలోకూడా ఆయన కుమారునికంటే ఏమియు తక్కువవాడు కాదు” అని ఒకరు చెప్పినది ముమ్మాటికీ నిజము. నిత్యుడగు కుమారునికి, కాలమందు జన్మించిన కుమారునికి పరిస్థితులలో మినహా మరి దేనిలోనూ తేడా ఏమియు లేదు.

(వచనము 6). క్రీస్తు లోకములోనికి వచ్చినప్పుడు ఆయన గైకొనిన స్థానము దేవదూతలకంటే ఎంతో హెచ్చయినదని చూపుటకు మరియొక లేఖనభాగముకూడా ఉదహరించబడినది.

పరలోకమందుమాత్రమే ఆయన పూజార్హుడు కాదు; గతమందు దీనుడై వచ్చినను, భవిష్యత్తులో వెయ్యేండ్ల పాలన మహిమతో వచ్చునప్పుడును దేవదూతల సమూహముల ఆరాధనలు అందుకొనువాడు ఆయనే. ఈ గౌరవమంతయు ఆయన మహిమను చెప్పకయే చెప్పుచున్నది. ఆయన దైవికమగు వ్యక్తి కానియెడల ఈ ఆరాధన అంతయు అయోగ్యమగును.
(వచనములు 7, 8). ఆయన లోకములోనికి వచ్చినప్పుడు అధిష్టించిన సింహాసనము అన్ని సింహాసనములకంటే హెచ్చయినది. దేవదూతలు సృష్టించబడిన ఆత్మలు. కుమారుడైతే సృజింపబడినవాడు కాదు. ఆయన దేవునిగా సంబోధించబడెను, భూలోక రాజుల సింహాసన ములతో పోల్చగా ఆయన సింహాసనము ఎన్నటెన్నటికిని నిలుచునది.
ఈ లేఖన భాగము 45వ కీర్తన నుండి ఉదహరించబడినది. అది ఒక “రాజునుగూర్చి” తెలుపుచున్నది. ఇశ్రాయేలుపై రాజుగా పరిపాలించనై యున్న ఈ రాజు మరెవ్వరో కాదు, దైవిక వ్యక్తియైన కుమారుడే. మనుష్యుల సింహాసనములు ఉనికిలోకి వచ్చి ఒకనాడు అంతమొందును. ఎందుకనగా అవి నీతిపునాది గలవి కావు. కుమారుని సింహాసనమైతే నిరంతరము నిలుచును. కారణము ఆయన పాలన న్యాయార్థమైనది.
(వచనము 9). ఆయన కృపతో ఇతరులను సహచరులుగా ఏర్పరచుకొనినను, 45వ కీర్తన తన తోటి వారికంటే హెచ్చగు స్థానము ఆయనకున్నట్టు తెలియజేయుచున్నది. ఆయనను దేవునిగా సంబోధించి నను భూమిమీద పరిపూర్ణ మానవునిగా ఆయన అగుపడెను.
అందువలననే ‘నీ దేవుడు నిన్ను అభిషేకించెను’ అని చెప్పబడినది. ఆయన నైతిక పరి పూర్ణత, నీతిని ప్రేమించుట, దుర్నీతిని ద్వేషించుట, కృప తాను సమైక్య పరచుకొనిన తోటివారందరికంటే ఆయనను హెచ్చగునట్లు చేసెను.
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక వివరణ
(వచనములు 10, 11). సృష్టికర్తగా సంబోధింపబడిన ఈ మహిమగల వ్యక్తి యెదుట నిలువలేక సృష్టి యావత్తు ప్రక్కకు తొలగినది. వేదనతో, కన్నీళ్ళతో నిండిన వ్యక్తిగా తగ్గించుకొన్నవాడు ఎవరో కాదు, భూమ్యాకాశములకు సృష్టికర్తయగు ప్రభువే అని ఋజువు చేయుటకు కీర్తన 102 ఉదహరించబడినది. సృష్టియావత్తు పాతగిలి, నశించుపోవును గాని ఆయన నిరంతరము నిలుచును.
(వచనము 12). కాల ప్రవాహములో మార్పులు వచ్చును, చివరకు అంతము వచ్చును. కాని ఈ మహిమగల వ్యక్తి ఏకరీతిగానే ఉండును. ఆయన సంవత్సరములు తరగవు అని కీర్తన 102 తెలియ జేయుచున్నది.
(వచనము 13). ఏ శత్రువు ఆయన యెదుట నిలువలేడు. శత్రువులందరూ ఆయన పాదపీఠముగా చేయబడుదురని తెలియజేయు టకు కీర్తన 110 ఉదహరించబడినది. ఆయన శరీరముతోనున్న దినములలో శత్రువులాయనను సిలువకు మేకులతో కొట్టిరి. ఆయన మహిమతో వచ్చు దినమున వారాయన పాదపీఠముగా చేయబడుదురు.
(వచనము 14). క్రీస్తు మానవుడిగా తన స్థానము గైకొనినను, కీర్తన 110 ప్రకారము ఆయన దేవదూతలందరికంటే హెచ్చయినవాడు. ఆయన పరిపాలించునట్లు సింహాసనముపై కూర్చుండబెట్టబడియున్నాడు.
దేవదూతలైతే రక్షణయను స్వాస్థ్యమును పొందబోవువారికి సేవ చేయు ఆత్మలుగా పరిచర్య చేయుటకు పంపబడియున్నారు. ఆ విధముగా కుమారుడు శరీరమును ధరించినను, ఆయన మహిమ అతిజాగ్రత్తగా భద్రపరచబడినది.
మహిమలన్నిటిలోకెల్లా ఆయన నామము ఎంత శ్రేష్ఠమో చూడగలము. ఆయన ఖ్యాతి దేవదూతలను మించినది. ఆయన సింహాసనము అన్ని సింహాసనములకంటే ఉన్నతమైనది. సృష్టి నశించిన నశించవచ్చును, ఆయన నిరంతరముండును.
కాలము స్తంభిం చిన స్తంభించవచ్చును, ఆయన సంవత్సరములు తరగవు. ఆయన శత్రు వులు ఆయనకు పాదపీఠములుగా చేయబడిరి. ఆయన దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి నడిపించుచున్నాడు. ఇతరులు సేవచేయుచున్నారు. ఆయన లోకములోనికి వచ్చినయెడల సృష్టియావత్తూ ఆయనకు దాసోహ మనవలసినదే!
కుమారుని వాక్యాధికారము (2:1-4)
లోకములోనికి వచ్చునప్పుడు కుమారునియొక్క ఖ్యాతిని గూర్చి మొదటి అధ్యాయము తెలియపరచినది. వక్తయొక్క అధిక మహిమనుబట్టి వినువారు అతి జాగ్రత్తగా అతడు చెప్పినది వినవలెను.
వినినామని చెప్పుకొనుచు, ఆ మీదట ప్రభువు ప్రకటించిన గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసి, తిరిగి యూదా మతములోనికి మళ్ళుట ప్రమాదకరము.
ఈ ఉరిలో తగులుకొన్నవారు కేవలము విన్నవాటిని విడిచిపెట్టుటమాత్రమే కాదు, వినినట్లు నటించి క్రైస్తవ్యమును వదలి తిరిగి యూదా మతములోనికి వెళ్ళిపోవు గొప్ప ప్రమాదములో చిక్కుకొందురు. ఇదే భ్రష్టత్వము.
ఈ పత్రిక అంతటిలో రచయిత క్రైస్తవ్యమును అంగీకరించిన యూదు లను సంబోధించుచున్నాడని మనము గుర్తుంచుకొనవలెను. వారిలో తానుకూడా ఒకడు. మొదటి అధ్యాయములో దేవుడు “మనతో మాట లాడినట్లు” చెప్పియున్నాడు. ఈ అధ్యాయములో “మనము శ్రద్ధగా విన వలెను” అని చెప్పుచున్నాడు.
ఈ పత్రికలో సంఘ ప్రస్తావన లేదు, విశ్వాసులు వ్యక్తిగతముగా సంబోధించబడియున్నారని కొందరి అభిప్రా యము. వారు అంగీకరించినది యథార్థమే అని గ్రహించవచ్చును. లేని యెడల వారు క్రీస్తునుండి వెనుదిరిగిపోవుదురు. అది కేవలం బాహ్యమైన ఆచారమని ఋజువగుచున్నది.
దేవదూతలద్వారా అనుగ్రహింపబడిన వాక్యమును స్థిరపరచినందున ప్రతి అతిక్రమమునకు, అవిధేయతకు న్యాయమైన శిక్ష విధించుటద్వారా దేవుడు “పలుకబడిన వాక్యము”నకు అధికారము ఇచ్చెను.
అలాగైతే కుమారునిద్వారా పలుకబడిన వాక్యమునకు దేవుడు మరెంత అధికారము ఇచ్చునో కదా! దేవదూతలు పాపముచేసి అనుగ్రహింపబడిన ధర్మశాస్త్రము నకు అవిధేయులై దాని పర్యవసానమునుండి తప్పించుకొనలేక పోయిన యెడల, నామకార్థముగా క్రైస్తవ్యమును అంగీకరించి, క్రీస్తు వాక్యమును నిర్లక్ష్యముచేసి, యూదా మతమునకు మరలిపోయినవారు తప్పించు కొనుట మరింత అసాధ్యముకదా?
ఈ పత్రికలో రచయిత వివరించు రక్షణ ఇప్పుడు మనము ప్రకటించు కృపా సువార్త కాదు. లేదా పాపి సువార్తపట్ల చూపు విముఖతనుకూడా ఇది వివరించుట లేదు. దీనిని వ్యక్తిగతంగా అన్వయించుకొనవలెను. సువార్తను నిర్లక్ష్యము చేయువారు దండన తప్పించుకొనజాలరు.
ఇక్కడ ప్రభువు ప్రకటించిన సువార్త యూదులకొరకు. వారు విశ్వసించినయెడల జాతిపైకి రాబోవు తీర్పును విశ్వసించు శేషము తప్పించుకొందురు.
ఈ సువార్తను తరువాత పేతురు, ఇతర అపొస్తలులును బోధించిరి. అపొస్త లుల కార్యములు ప్రారంభ అధ్యాయములలో మూర్ఖులైన వక్రజనము నుండి వేరై రక్షణ పొందుమని వారు ప్రకటించిరి.
బైబిల్‌లో క్రీస్తు వ్యక్తిత్వపు మహిమలు వివరణ
ఈ రక్షణ సాక్ష్యమును దేవుడు “సూచక క్రియలచేతను, మహత్కార్యములతోను, నానావిధములైన అద్భుతములతోను” ధృవపరచెను. సంఘము సంపూర్తియైన తరువాత ఈ రాజ్య సువార్త మరల ప్రకటించబడును.
ధర్మశాస్త్రమును అతిక్రమించుట భయంకరము, కృపావాక్యమునుండి ప్రక్కకు తొలగుట అంతకంటే చెడ్డది. దేవుని వాక్యమును వినినట్లు విని, ఆ మీదట దానిని నిర్లక్ష్యము చేసి, విడిచిపెట్టి, యూదా మతమునకు గాని మరే మతమునకుగాని మళ్ళుట అతి భయంకరము. ఇదే భ్రష్టత్వము. భ్రష్టుడైన వ్యక్తికి లేఖనములలో నిరీక్షణే లేదు.
మనుష్య కుమారుని మహిమ (2:5 -18)
కుమారుని వాక్య అధికారమును వివరించి, ఆయన వాక్యమును నిర్లక్ష్యము చేసినయెడల కలుగు ప్రమాదమునుగురించి హెచ్చరించి, రచయిత యింకను క్రీస్తు మహిమలను వెల్లడించుచున్నాడు.
నిత్యత్వము నుండి దేవుని కుమారునిగా, శరీరధారియైనప్పుడు ఆయన మహిమలను దేవుడు మన యెదుట ఉంచియున్నాడు. ఇప్పుడు మనుష్య కుమారుని మహిమలను మనము చూడవలెను.
(వచనము 5). యేసుక్రీస్తు మహిమ ప్రభావములు ధరించినట్లు ఇప్పుడు మనము విశ్వాస నేత్రముతో చూడగలిగినను, రాబోవు లోకములో మనుష్య కుమారునిగా ఆయన మహిమ వెల్లడికాబోవుచున్నది.
అవి, ఒకటి – జలప్రళయమునకు ముందున్న లోకము. దీనినే పేతురు “అప్పుడున్న లోకము” అని వ్రాసెను. రెండవది – ప్రస్తుత లోకము “ఇప్పుడున్న ఆకాశమును, భూమియు” (2 పేతురు 3:7); మూడవదిగా – ప్రస్తుత వాక్యభాగములో చెప్పబడిన “రాబోవు లోకము”.

“రాబోవు లోకము” అనగా భూమిమీద వెయ్యేండ్ల పాలన కాలము. ఇది ఇంతకుముందెన్నడును లేని ఆశీర్వాద క్రమమును ఆవిష్కరించు చున్నది. ఈ ఆశీర్వాదకరమగు నూతన ప్రపంచము మనుష్యకుమారునికి లోబడి ఉండును గనుక ఆయన మహిమ వెల్లడింపుకు కారణమగును.
ఒక విధముగా చూచినయెడల ప్రస్తుత లోకమును దేవుడు దేవదూతల అధికారము క్రింద ఉంచియున్నాడు. రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారిని భద్రపరచుచు, దేవుని ప్రభుత్వమును జరిగించు పని దేవదూతలకు అప్పగించబడినది. రాబోవు లోకములో దేవదూతలు మనుష్య కుమారునికి అధికారమును అప్పగించుదురు.
(వచనములు 6-9). క్రీస్తుయొక్క ఈ మహా మహిమను వెల్లడించు టకు రచయిత ఇక్కడ 8వ కీర్తనను ఉదహరించియున్నాడు. “నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు?” అని దావీదు ప్రశ్న లేవనెత్తియున్నాడు. ఈ ప్రశ్న మానవుని అల్పత్వమును సూచించు చున్నది.
బైబిల్‌లో క్రీస్తు వ్యక్తిత్వపు మహిమలు వివరణ
మనుష్య కుమారుడగు క్రీస్తు గొప్పతనమే దానికి జవాబు. సూర్యచంద్రనక్షత్రముల గొప్పతనమును దావీదు ఆలోచించినప్పుడు తానెంత అల్పమైనవాడో గ్రహించి “మనుష్యుడు ఏపాటివాడు?” అని ఆశ్చర్యము వ్యక్తము చేసెను. పాపముతో పతనమైన మానవుడు నిజముగా కొద్దివాడే.
కాని మనుష్య కుమారుడగు క్రీస్తులోనుంచబడిన దేవుని సంకల్ప ముతో చూచినప్పుడు ఎంతో గొప్పవాడు. దేవుని ఆత్మచేత నడిపించ బడిన హెబ్రీ పత్రిక రచయిత కీర్తన 8 లోని మనుష్యకుమారునిలో క్రీస్తును చూచి “మేము యేసును చూచుచున్నాము” అని చెప్పగలుగుచున్నాడు.
“ఆయన పాదములక్రింద నీవు సమస్తము ఉంచియున్నావు” అని దావీదు అనుచున్నాడు. రాబోవు లోకములో యేసు పరిపాలించును అను దానిని ఇది సూచించుచున్న దేవుని ఆత్మ తెలియజేయుచున్నాడు.
“సమస్తము” అనగా భూమిమీద ఉన్న వస్తు సముదాయము మాత్రమే కాదు, సృష్టించబడిన జగత్తు అంతయు, సృష్టించబడిన ప్రతి ప్రాణియు. ఎందుకనగా “ఆయనకు లోబరచకుండ దేనిని విడిచిపెట్టలేదు”.
దావీదు “నీవు దేవదూతలకంటే ఆయనను కొంచెము తక్కువవానిగా చేసితివి” అనుచున్నాడు. యేసు “మరణము అనుభవించునట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడెనని” దేవుని ఆత్మ చెప్పు చున్నాడు.
దేవుని అగౌరవపరచిన లోకములో మనుష్యకుమారుడు దేవుని మహిమపరచెను. మరణము అనుభవించుటద్వారా తన పరిశుద్ధతను వెల్లడించెను.
పాపఫలితముగా మనుష్యుడు మరణమును రుచి చూచు చున్నాడు. మనుష్యకుమారుడైతే దేవుని కృపనుబట్టి మరణమును రుచి చూచుచున్నాడు. కృప అందరికీ విస్తరించునట్లు ఆయన అందరికొరకు మరణమును అనుభవించెను.
“మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి” అను చున్నాడు దావీదు. “ఆయనే యేసు” అని దేవుని ఆత్మ విశ్వాసమూలముగా మనము పలుకునట్లు నడిపించును. మహిమా ఘనతలతో కిరీటధారియై యున్నట్లు ఆయనను చూతుము.
ఆ విధముగా క్రీస్తు అను వ్యక్తిద్వారా మనుష్యకుమారుడు సృష్టికి ప్రభువుగా నుండుట దేవుని సంకల్పము. సమస్తమును సృష్టించి, నిర్వహించువాడు నరునిగా అవతరించుటవలన ఆయన విశాల విశ్వమునకు కేంద్రము, అధిపతి యగును.
ఈ మహిమ యెదుట దేవదూతల మహిమ వెలవెలబోవును. ఏ దేవదూతయు, ఎప్పు డునూ సార్వత్రిక అధికార స్థాయి పొందియుండలేదు, పొందబోడు.
ఈ విధముగా మనుష్యకుమారుని భూత, భవిష్యత్, వర్తమాన కాలములలోని మహిమ మనయెదుట స్పష్టముగా చూపెట్టబడినది. గతములో ఆయన అందరికొరకు మరణము అనుభవించెను.
వర్తమాన కాలమందు మహిమా ప్రభావములను కిరీటముగా ధరించియున్నాడు. భవిష్యత్తులో సర్వలోకము ఆయన అధికారము క్రిందకు కొనిరాబడును.
(వచనము 10). 5-9 వచనములలో రాబోవు లోకములకు సంబం ధించి క్రీస్తు మహిమలు వెల్లడిచేయబడియున్నవి. 10వ వచనమునుండి చివరివరకు ఆయన అనేకమంది కుమారులను మహిమకు కొనితెచ్చు సందర్భమున ఆయన మహిమ మరింత వెల్లడియగుచున్నది.
మొదటి అధ్యాయములో ఉదహరించిన 45వ కీర్తనలోని లేఖన భాగముద్వారా రాబోవు మహిమను క్రీస్తుతో పంచుకొనుటకు సహచరులు కావలెనను దేవుని ఉద్దేశ్యమును ఇంతకుముందే తెలిసికొన్నాము.
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక బైబిల్ స్టడీ గైడ్
ఈ అధ్యాయము మిగిలిన భాగములో ఈ సహచరులు దేవుని “కుమారులు” అనియు, క్రీస్తు “సహోదరులనియు” పిలువబడియున్నారు. తన సహోదరు లను మరణమునుండి, అపవాదినుండి, పాపమునుండి విడిపించి, ప్రస్తుత కాలమందు వారిని మహిమకు నడిపించుచు, వారికి సహాయపడుచు, ఆదుకొనుటకు ఆయన అనుభవించినదంతయు గ్రహించుచున్నాము.
అయితే అనేకులైన కుమారులను మహిమకు తెచ్చునప్పుడు, వారు దేవుని పరిశుద్ధతకు తగినట్టుగా ఉండవలెను. “ఎవని నిమిత్తము సమస్త మును ఉన్నవో, ఎవరివలన సమస్తమును కలుగుచున్నవో” ఆ క్రీస్తు మరణమును అనుభవించుట మాత్రమేకాదు, తన ప్రజలకు అధిపతి యగునట్లు వారి పరిస్థితిలో, శ్రమలలో పాలుపొంది, శ్రమలద్వారా పరిపూర్ణునిగా చేయబడెను.
పరిపూర్ణుడైన వ్యక్తిగా అరణ్యయాత్రలో తన ప్రజలను నడిపించుటకు, శ్రమలు అనుభవించుటకు ఆయన సంపూర్ణ ముగా తగినవాడు. ఆ విధముగా ఆయన వారి “రక్షణకర్త” యగు చున్నాడు. మహిమకు వారు వెళ్లుచుండగా ప్రతి అపాయమునుండి వారిని తప్పించుటకు ఆయన సమర్థుడు.
(వచనము 11). 11వ వచనమునుండి విశ్వాసులకు క్రీస్తు మూల ముగా సంక్రమించు ధన్యకరమైన ఫలితములను గ్రహించుచున్నాము. వారు ఆ వారసత్వమున ప్రవేశించి ఆ హోదావలన కలుగు ప్రతిఫలము లను అనుభవించుచు అందు దేవుని మహిమను కొనసాగించుచున్నారు.
మొదటిగా, పరిశుద్ధపరచువాడు (క్రీస్తు), పరిశుద్ధపరచబడువారు (విశ్వాసులు) ఇరువురిని ఏకముగా చూడగలము. ఈ అద్భుత పరిభాష వలన స్పష్టమగునదేమనగా, క్రీస్తు మన స్థానములోనికి వచ్చి దాని పరి ణామములను భరించి, మనలను దేవునియెదుట తన స్థానములోనికి తెచ్చియున్నాడు. మనిషిగా తాను, తనవారు – పరిశుద్ధపరచువాడు పరిశుద్ధపరచబడువారు దేవునియెదుట ఒకే సమూహముగా కనబడు చున్నారు.
“పరిశుద్ధపరచువాడు, పరిశుద్ధపరచబడువారు, ఏకమైయున్నా రని” దేవుని వాక్యము చెప్పుచున్నది కాని – యేసుక్రీస్తు, మానవులు ఏకమైయున్నట్లు ఎక్కడా చెప్పబడలేదు. ఇది గమనార్హము.
ఆ కారణము చేతనే వారిని పరిశుద్ధపరచుటద్వారా తన స్థానములోనికి తీసుకొని వచ్చినందుకు వారిని “సహోదరులు” అనుటకు ఆయన సిగ్గుపడలేదు.
విశ్వాసులు పరిశుద్ధపరచబడినవారు: పరిశుద్ధపరచబడినందున దేవునియెదుట క్రీస్తు స్థానములోనికి వారు కొనిరాబడియున్నారు. వారంతా ఏకమైయున్నందున వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదు.
క్రీస్తు పునరుత్థానుడగునంతవరకు శిష్యులను ఆయన “సహోదరులు” అని పిలువలేదని సువార్తలలో చూడగలము. ప్రభువు ఎప్పుడూ దేవునితో తండ్రి కుమార సంబంధము కలిగియుండెను.
ఆయన తన యాత్రలో ఎప్పుడూ “నా దేవా” అని సంబోధించక, ఎల్లప్పుడూ “నా తండ్రీ” అని సంబోధించెను. క్రీస్తు శరీరధారియగుటద్వారా మనకు ఈ సంబంధము కలుగలేదుగాని, విమోచన కార్యమునుబట్టియే కలిగినది.

(వచనములు 12, 13). పరిశుద్ధపరచువాడు, పరిశుద్ధపరచబడు వారైన తన సహోదరులతో ఏలాగు సమైక్యపరచుకొన్నది ఋజువు చేయుటకు పాత నిబంధననుండి మూడు లేఖనములు ఉదహరించ బడినవి.
మొదటిది – కీర్తన 22:22. ప్రభువు తన పునరుత్థానమందు ఈలాగు ప్రకటించుచున్నాడు, “నీ నామమును నా సహోదరులకు ప్రచుర పరతును. సమాజముమధ్య నీ నామమును గానము చేతును”.
ఇక్కడ ప్రభువు తన ప్రజలతో సమైక్యపరచుకొనుచున్నాడు. దేవుని పక్షముగా తండ్రి నామమును ప్రచురముచేయుట, మన పక్షముగా ప్రజల స్తుతులను తండ్రికి అర్పించుట కీర్తన 22 లో ప్రవచించబడినది, యోహాను 20 లో వెల్లడించబడినది, హెబ్రీ 2 లో వివరించబడినది.

(వచనములు 14, 15). 12, 13 వచనములు క్రీస్తు దేవునియెదుట మనలను ఏలాగు సమైక్యపరచుకొనెనో తెలియజేసినవి. దేవునియెదుట మన బలహీనతలయందును, మరణమందును క్రీస్తు తనతో మనలను సమైక్యపరచుకొనినట్లుకూడా గమనించగలము.
పిల్లలు రక్తమాంసము లలో పాలివారైతే, ఆయనకూడా వాటియందు పాలివాడాయెను. వారు మరణముయొక్కయు, అపవాదియొక్కయు అధికారము క్రింద ఉండిన యెడల, ఆయనకూడా రక్తమాంసములు ధరించినవానిగా మరణాధిపతి యగు అపవాదిని నశింపజేయుటకు మరణమందు ప్రవేశించెను.
ఆ విధముగా జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోనైనవారిని విడిపించగలిగెను. పాపమునకు జీతము మరణమని అపవాదికి తెలియును. అందువలననే పాపిని జీవితకాలమంతయు మరణముతో, దాని పరిణామములతో భయపెట్టుటకు అపవాది వెను కాడడు.
ప్రభువుపై ఆ మరణమునకు ఎట్టి అధికారము లేదు గనుక, ఆయన మరణములోనికి ప్రవేశించి, మనపైనున్న మరణశిక్షను తానే భరించి విశ్వాసిని మరణముచేత భయభ్రాంతునిగా చేయుచున్న అపవాది శక్తిని కొల్లగొట్టెను.
అందువలననే మనము పాపముయొక్క శిక్షగా కాక, శ్రమలనుండి విడుదలగా, సంపూర్ణ ఆశీర్వాదములు పొందునట్లుగా మరణములోనుండి దాటుచున్నాము.
(వచనములు 16–18). ప్రభువు వచ్చినది దేవదూతలకు సహాయము చేయుటకు కాదుగాని, అబ్రాహాము సంతానముకొరకు కార్యము చేయు టకు వచ్చెను. ఈ పని చేయుటకు ఆయన సహోదరులవంటివాడు కావలసివచ్చెను.
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక బైబిల్ స్టడీ గైడ్
ఆ విధముగా ఆయన పూర్తిగా వారి స్థానములోనికి వచ్చెనుగాని, వారి స్థితిలోనికి కాదు. ఈ పత్రికలో ఇక్కడ మొట్టమొదటి సారిగా ఆయన మన ప్రధాన యాజకునిగా నమ్మకముగా, దయాపూర్వ కముగా పనిచేయుట చూడగలము.
ఈ పరిచర్య జరిగించుటకు ఆయన తనను తాను తగ్గించుకొని, శ్రమలు శోధనలు ఎదుర్కొనవలసి వచ్చెను. పరిపూర్ణ జీవితము జీవించిన పిమ్మట, పాపములు క్షమింపబడునట్లు ఆయన మరణమందు ప్రవేశించి, పాపములకు ప్రాయశ్చిత్తము జరిగిం చెను.
ఆ గొప్ప కార్యమును ముగించి, మహిమలో తన యాజక స్థానము ద్వారా కృపాకనికరములు చూపుచు, తానే శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికి సహాయపడగలవాడైయున్నాడు.
ఆయనకు శ్రమ కలిగినది శోధనకు లొంగిపోయినందుకు కాదు. మనము శోధనకు లొంగినయెడల శరీరము శ్రమపడదు సరిగదా, శరీరమే ఆ శోధనలో పాలుపుచ్చుకొనును.
ఏ శోధనకు లొంగిపోయెనో దానిలో ఆనందించును. తాత్కాలికముగా పాపపుశోధనవలన ఆనందించినను, చివరకు ఆ పాపమునుబట్టి శ్రమననుభవించవలసినదే. ప్రభువు శోధింప బడినను ఒక్క క్షణముకూడా దానికి లోబడలేదు.
శోధనద్వారా ఆయన పరిపూర్ణత మరింత వెల్లడాయెను. దీనిద్వారా శ్రమ కలిగినది. ఆయన అపవాది శోధనకు లొంగక ఆకలిని సహించెను. ఆ విధముగా శోధనలో శ్రమననుభవించినందున శోధింపబడువారు స్థిరముగా నిలువగలుగు నట్లు వారికి సహాయముచేయగలవాడైయున్నాడు.
ఆయన పరిపూర్ణమగు సున్నిత హృదయముతో మన శోధనలలో ప్రవేశించి కరుణ, విశ్వసనీయ తలలో మనకు సహాయపడగలుగుచున్నాడు. అనేక పర్యాయములు మనము కరుణను విడచి విశ్వసనీయతను, విశ్వసనీయతను విస్మరించి కరుణను చూపుట కద్దు. అయితే ఆయన తన పరిపూర్ణతనుబట్టి విశ్వస నీయతతో ఎంతమాత్రమును రాజీపడక కరుణ చూపును.