క్రైస్తవ పాఠకునికి

క్రైస్తవ పాఠకునికి

సంగ్రహ రచన నీ ఆత్మీయ మేలు నిమిత్తము రూపొందించబడినది. | పరలోక మహిమను నీ మనోనేత్రములకు ప్రదర్శించుటద్వారా నీ ఆశలూ ప్రేమానురాగాలూ పరలోకంవైపుకు ఆకర్షించబడి, ఆ పరలోకాన్నే నీ ముఖ్యమైన ధననిధిగా నీవు ఎంచుకొంటావు. అప్పుడు “నీ ధనమెక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును” .

బహుశాః నీ ప్రేమానురాగాలు ఇంతవరకు దృశ్యములైన ఐహిక అంశములవైపు మళ్ళివుండ వచ్చు. అయితే పరలోకాన్ని గురించిన ఈ సంగ్రహ రచనను నీవు చదువుటద్వారా నీ ప్రేమానురాగాలు పరలోక మహిమవైపు మళ్ళించబడి, అందులోని ఆనందాన్ని నీవు ఈ లోకంలోనే అనుభవించుట మాత్రమేగాక, దాని ఫలితంగా నీవు నిత్యమైన ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించి, ఆ నిత్యమైన ఆనందంలో శాశ్వతంగా పాలు పొందగలవు.

పరలోకాన్ని గురించిన పరిపూర్ణ వివరణను ఇది నీకు ఇవ్వదుగాని, భవిష్యత్తును గురించిన దైవిక ప్రత్యక్షతను ఇది కొంతవరకు వివరిస్తుంది. ఎందు కనగా, “మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు” .

మన నిజమైన సంతోషము ఎక్కడ ఉందో ఈ పుస్తకం నీకు చక్కగా వివరిస్తుంది. మన నిత్యత్వమును గురించి మనలో నిరంతరం చెలరేగే అనేకములగు ఆసక్తికరమైన ప్రశ్నలకు, సంశయాలకు సత్యవాక్యము ప్రకారము ఈ రచన చక్కని జవాబులను ఇస్తుంది.

పరలోకము మరియు నరకములనుగూర్చిన దర్శనములు ప్రేమ మరియు కోరిక అనునవి ఆత్మను పరలోకంవైపుకు ఎగిరేట్లుగాచేసే రెక్కలుగా నేను కనుగొనినందున, దైవిక ప్రేరణ కలిగిన ఆత్మ తప్పక పరలోక ఆకర్షణలవైపుకు మెల్లమెల్లగా చేరుకొని, చివరిగా “శాశ్వత శోభాతిశయ”మైన ఆ పరలోకపు అందాల్ని కళ్ళారా వీక్షించి ఆనందిస్తుంది.

ఆ పరలోకపు అందాలు మాత్రమే మనము కోరదగినవి. ఆ పరలోక ప్రభువు మాత్రమే మనము కోరదగినవాడు. తన దీనదశలో సహితము ఎంతో ఆకర్షణీయుడుగా ఉండిన ఆ ప్రేమాప్రభువు, అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు తెలిపినట్లుగా తన పరలోక మహిమలో “మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన” వాడుగా ఇంకెంత ఆకర్షణీయంగా ఉంటాడో కదా?

“శాశ్వత శోభాతిశయముగాను బహు తరములకు సంతోష కారణముగాను” మనకు బయలుపరచబడిన దేవుని పట్టణమును గురించి “మిక్కిలి గొప్ప సంగతులు” చెప్పబడి నప్పటికీ, అనేక విధములుగా దానిని గురించి మనకు అభివర్ణించబడినప్పటికీ, తాను వాస్తవంగా వీక్షించిన సంగతులలో సగమైనను తనకు తెలుపబడలేదని సొలొమోను వైభవమును గురించి షేబ రాణి పలికినట్లుగా మనముకూడ పలికేందుకు ప్రోత్సహించబడుదుము గాక! ఈ లోకంలో ఉండగనే మనము మన హృదయాలను ఆనందమయమైన ఆ పరలోక మహిమవైపు మళ్ళించి, ఆ పరలోక మహిమయొక్క ప్రేమాను రాగాలతో వాటిని నింపుకొని “సైన్యములకధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు!” అని రాజైన దావీదులాగా ఆనందపార వశ్యములతో పలుకగలము .

ఆ పరలోక మహిమపై మనకున్న ప్రేమ మరియు అందులో ప్రవేశించాలన్న మనలోని లోతైన కోరిక మనము అపేక్షించే పరలోక మహిమవైపుకు మనల్ని ఎంత శక్తివంతంగా నడిపిస్తాయో, మనల్ని ఆ పరలోక మహిమకు వెళ్ళనీయ కుండాచేసే పాపములన్నిటినుండి మనం దూరంగా పారిపోయేందుకు మన ఆత్మయొక్క భావోద్రేకమైన భయము మనల్ని ప్రోత్సహిస్తుంది.

ఆ ప్రేమ మరియు మనల్ని పరలోక మహిమవైపుకు ఆకర్షించేందుకు కోరిక మనలో ఎంత బలంగా పనిచేస్తాయో అంతే బలంగా భయము అనే భావోద్రేకము మనలో పనిచేస్తుంది. మనల్ని పరలోక మహిమవైపుకు ఆకర్షిం చేందుకు మనకు పరలోక దర్శనము ఎంత అవసరమో, మనల్ని భయపెట్టి పాపమునుండి పారిపోయేలా చేసేందుకు నరకమును గురించిన దర్శనము కూడ మనకు అంతే అవసరము. అప్పుడు మనము మన చెవులను తోపెతు నోటివద్ద పెట్టి , వ్యర్థమైన తమ పాపభోగములనుబట్టి నిత్యనాశనము నకు వారసులైన దౌర్భాగ్యుల విలాపగీతము లను వినగలము.

ఈ లోకంలో తమ సుఖ భోగములకొరకు ఆ పరలోక మహిమను నిర్లక్ష్యంచేసిన ఆ దౌర్భాగ్యుల ఆర్తనాదాలను నీవుకూడ తప్పక వినగలవు. అయితే ఇప్పుడు వారు పశ్చాత్తాపపడేందుకూ, సహాయంకోసం అర్థించేందుకూ బాగా ఆలశ్యమైపోయింది. ఆ విధంగా పరలోకము మరియు నరకమును గూర్చిన దర్శనములు జ్ఞానులగు ప్రతి ఒక్కరినీ మనకు పరలోక దర్శనము ఎంత

అవసరమో, మనల్ని భయపెట్టి పాపమునుండి పారిపోయేలా చేసేందుకు నరకమును గురించిన దర్శనముకూడ మనకు అంతే అవసరము.
అత్యంత జాగ్రత్తగా ఉండునట్లు ప్రేరేపించడమేగాక, నాశనకరమైన నిత్యనరకము నుండి తప్పించుకొమ్మని అవి ఇతరులను హెచ్చరిస్తూ, నిత్యమైన పరలోక రాజ్యంవైపుకు చూసేందుకు వారిని పురికొల్పుతాయి.

నోవహు భయముచేత కదిలించబడినవాడై, తననూ తన ఇంటివారినీ రక్షించుకొనుటకు ఒక ఓడను తయారుచేసుకొన్నాడని హెబ్రీ గ్రంథకర్త మనకు తెలుపుతున్నాడు . నరకపువేదన సరైనవిధంగా వివరించబడి నట్లయితే, “రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు”  క్రీస్తు అను ఓడలోనికి ప్రవేశించునట్లు అనేక హృదయాలను అది కదిలిస్తుంది. అది నిజంగా చెప్పనశక్యమైన కృప. ఈ సందేశము ఒక దర్శనరూపంలో వ్యక్తీక రించబడినందుకు ఎవరూ ఎలాంటి గలిబిలికీ గురికానవసరము లేదు. ఎందు కనగా ఇక్కడ బయలుపరచబడిన సత్యములన్నియు విశ్వాస సూత్రమును

ఆధారముచేసికొనే వ్రాయబడ్డాయి. తన ఔషధము ఒక రోగిలోనికి పోయేందుకు ఒక వైద్యుడు ఒక సరియైన పరికరమునే ఉపయోగిస్తాడు. నేనుకూడ అదే చేశాను. పరలోక మార్గము ఒక స్వప్నమునకు పోల్చబడినప్పుడు, ప్రయాణము అదే దర్శనముద్వారా ఎందుకు అంగీకరించబడకూడదు? పరలోకమునకు మనలను చేర్చే సాధనము అయిన దర్శన మును దీనికోసం మనము ఎందుకు ఎన్ను విశ్వాసం మరియు ప్రేమ కొనకూడదు? యాత్రికుడు మార్గమధ్యంలో అనే బంగారు రెక్కలను అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. అయితే, చివరిగా అతడు సంతోషకరమైన పరలోకాన్ని చేరుకొన్నాక అతని కష్టాలన్నీ ఒక్కసారిగా అంతమయ్యాయి, గాలితుఫానులన్నీ ఒక్కసారిగా ఆగిపోయి నిశ్శబ్దం మరియు ప్రశాంతత అతనిని ఆవరించాయి.

అలాగైతే మనము ఇంకెంత మాత్రం ఆలశ్యంచేయక విశ్వాసం మరియు ప్రేమ అనే బంగారు రెక్కలను ధరించి పైపైకి ఎగురుదామా? ఎందుకనగా,

“చలికాలము గడిచిపోయెను, వర్షకాలము తీరిపోయెను, వర్షమిక రాదు; దేశమంతట పువ్వులు పూసియున్నవి; పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది.”

నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము, రమ్ము” అని మన ఆత్మలకు ప్రియమైన మన పెళ్ళికుమారుడు మనల్ని పిలుస్తున్నాడు (పరమగీతము 2:13). ప్రియ చదువరీ, నీ ప్రియుని చేరేందుకు నీవు త్వరపడవా? నీ ఆత్మ శ్రేయోభిలాషి,

Leave a Comment