హెబ్రీయులకు వ్రాసిన పత్రిక పరిచయము
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాస ముంచిన యూదుల నుద్దేశించి వ్రాయబడినది. ఇందలి విషయములను బట్టి స్పష్టమగునదేమనగా – విశ్వాసులను క్రైస్తవ సత్యమందు, తదను గుణమైన ఆశీర్వాదములు మరియు ఆధిక్యతలయందు స్థిరపరచుట.
ఆ విధముగా వారిని పుట్టుకతో సహజముగా సంక్రమించిన యూదా మత వ్యవస్థనుండి తప్పించుటయే ఈ పత్రిక ముఖ్యోద్దేశము.
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక బైబిల్‌లో
ఈ పత్రికయొక్క ప్రాధాన్యతను గ్రహించవలెనంటే, యూదా శేషిత జనాంగము; వారికి సంబంధము కలిగి ఉన్న మత వ్యవస్థ లక్షణములను మనము అర్థము చేసికొనవలెను.
యూదా మతము అబ్రాహాము సంతానమునకు అనువంశికముగా ఇవ్వబడినది. ఇందులో క్రొత్త జన్మనుగూర్చిన ప్రస్తావనే లేదు. ఇది పూర్తిగా భూసంబంధమైనది. పరలోక విషయమై ఇది మౌనముగా ఉన్నది.
Read and Learn More హెబ్రీయులకు వ్రాసిన పత్రిక
మనిషి దేవునితోను, సాటి వ్యక్తులతోను ఎలాంటి సంబంధము కలిగి ఉండవలెనో ఈ యూదా మతము నిర్దేశించుచున్నది. ఈ మతానుసారులకు భౌతిక జీవము, తదనుగుణమైన ఆశీర్వాదములు సంక్రమించును.
ఈ మతమునందలి కేంద్రాకర్షణ – దృశ్యమానమైన దేవాలయము. ఇది మానవ నిర్మిత కట్టడములలోకెల్లా మనోజ్ఞమైనది. ఇందలి బలి పీఠములు పదార్థ నిర్మితములు. ఇందు ఒక ప్రత్యేక సమూహమైన యాజకులచే అర్పింపబడు భౌతిక బలులు, బాహ్యమైన ఆరాధన, దానివెంట విస్తారమైన కర్మకాండలు నిర్దేశింపబడినవి.
దేవుని మంచితనమునకు బదులుగా ప్రకృతి సంబంధియైన మనిషి యొక్క శరీరమందు ఏమైనా ఉన్నదా? అని ఋజువు చేయుటకు ఈ మతము ఉద్దేశపూర్వకముగా నిర్దేశింపబడినది.
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక అర్థం తెలుగులో
ఈ మతము మనిషి జీవితములోని ప్రతి విషయమునూ నియంత్రించును. భూసంబంధమైన వృద్ధి, సుఖ సౌఖ్యములు బాల్యమునుండి వృద్ధాప్యమువరకు సంక్రమించు విధము ఈ మతావలంబులకు సంక్రమించును.
ఫలితముగా ప్రకృతి సంబంధియై, తిరిగి జన్మించని వ్యక్తిలో దేవునికి బదులుగా ఏమీ లేదని స్పష్టమైనది. అందువలన దేవుడే స్వయముగా స్థాపించిన ఈ యూదా మత వ్యవస్థ కాలక్రమములో మనిషి చేతిలో భ్రష్టమైపోయినది. తుదకు ఈ వ్యవస్థలోని దుష్టత్వము వారి రక్షకుడైన మెస్సీయాను తిరస్కరించి, హత్యగావించుటతో పరాకాష్టకు చేరినది.
యూదులు ఆ విధముగా తమ దుర్మార్గతయను పాత్రను నింపుకొని, తీర్పుకు సిద్ధముగా ఉన్నారు. మానవుని చేతిలో దేవుని కుమారుడే హత్యగావింపబడునంతగా దిగజారిన వ్యవస్థను పరిశుద్ధుడైన దేవుడు దీర్ఘకాలము సహించుట తన నీతికి కళంకము తెచ్చుకొనుట, పాపమును విస్మరించుటయే యగును. అందువలననే తీర్పు విధించబడినది. తరు వాతి కాలములో యెరూషలేము పట్టణము నాశనము గావించబడి, ఆ యూదా జాతి చెదరగొట్టబడినది.
అయితే ధర్మశాస్త్ర ఉద్దేశ్యము మరియొక విధముగా ఉన్నది. దేవుని యెడల, సాటి మానవుల యెడల మనిషి బాధ్యతను చూపెట్టుట, అతని జీవితమును నియంత్రించుటమాత్రమే కాదు. ఈ వ్యవస్థ యావత్తు రాబోవుచున్న మేలులయొక్క ఛాయగా ఉన్నది.
ప్రత్యక్ష గుడారము పర లోకమందలి వస్తువుల నమూనా, దాని యాజకత్వము యేసుక్రీస్తుయొక్క యాజకత్వమును చూపెట్టుచున్నది. దాని బలులు క్రీస్తు చేయనైయున్న గొప్ప బలివైపు ఎదురుచూచుచున్నవి.
రాబోవుచున్నవాటన్నిటి ఛాయయగు క్రీస్తు వచ్చుటద్వారా యూదా వ్యవస్థలోని ఆ నమూనా, వస్తువులన్నిటికిని పూర్ణ నెరవేర్పు కలిగినది. అందువలన అది ప్రక్కన పెట్టబడినది. మొదటిది – మనిషి దానిని భ్రష్టము చేసెను; రెండవది – క్రీస్తు దానికి పరిపూర్ణ నెరవేర్పయియున్నాడు.
మనము మరియొక విషయము మనస్సులో ఉంచుకొనవలెను. యూదా మత వ్యవస్థ శరీర సంబంధియైన మనిషిని ఉద్దేశించి మాటలాడు చుండగా, దేవునితో బాహ్యరీతిగాను, లేక సంప్రదాయ సంబంధము కలిగిన అధిక సంఖ్యాకులు వెలుపలనే ఉండిపోవుచున్నారు. అయితే ఈ వ్యవస్థయందుకూడా కొందరు విశ్వాసముగలవారై దేవునితో సవ్యమైన సంబంధము కలిగియున్నారు.
క్రీస్తు వచ్చినప్పుడు వారు ఆయనను మెస్సీయాగా గుర్తించిరి. సంఖ్యాపరముగా వారు కొద్దిమందే అయినను ఈ పత్రికలో వారు గుర్తింపబడినవారై క్రైస్తవ్యము స్థాపింపబడక పూర్వమే వారు దేవునితో సంబంధము కలిగి ఉన్నట్టు చూడగలము.
అట్టి దైవభక్తిగల శేషమునుద్దేశించియే ఈ పత్రిక వ్రాయబడినది. ఎందుకనగా వారు భూసంబంధమైన యూదా మతమునుండి వేరై క్రైస్తవ్యమను నూతన మరియు పరలోక సంబంధములో స్థిరపరచబడ వలెనని దేవుని అభీష్టము.
ఈ విధముగా మనుష్యుల చెడుతనమునుబట్టియు, క్రీస్తు ఆగమనము ద్వారా యూదా మత వ్యవస్థను ప్రక్కన పెట్టుటవలనను క్రైస్తవ్యము ఈ లోకమున ప్రవేశించుటకు ద్వారము తెరువబడినది.
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక గురించి వివరణ
దేవుడు పాతదానిని ప్రక్కన పెట్టినట్లయిన అంతకంటే శ్రేష్టమైనదానిని తెచ్చుటకే అట్లు చేయును గదా! పాత వ్యవస్థను ప్రక్కన పెట్టునప్పుడు ఆయన యూదులలోనుండి విశ్వసించు ఆ కొద్ది శేషమును సంపాదించుకొని, క్రైస్తవ పరిధిలోనికి వారిని తెచ్చెను. ఈ యూదా జనాంగమునకు వారి పితరుల మతముతో బలమైన సంబంధముండుట సహజము.
భవబంధములు, దేశభక్తి, భౌతిక ఆశీర్వాదములు, విద్య, శిక్షణ మొదలగువాటినిగూర్చిన అతిశయము, అన్నీ కలసి దేవుడు ప్రక్కకు నెట్టిన ఆ వ్యవస్థ వారిని అంటిపెట్టుకొని ఉండు నట్లు చేసెను.
అందువలన పరలోక సంబంధమైన క్రైస్తవ్యంలోనికి ప్రవే శించుట వారికెంతో దుర్లభమనిపించినది. పైగా, దేవాలయం అట్లే నిలచి యుండగా మరియు అహరోను వంశమువారైన యాజకులు దృశ్యమాన మగు బలులింకను అర్పించుచుండగా, క్రైస్తవ్యమును స్వీకరించినవారు తిరిగి యూదా మతమునకు వెనుతిరిగెడి ప్రమాదము ఎల్లప్పుడు ఉన్నది.
ఇట్టి ప్రమాదమును ఎదుర్కొని, మన ఆత్మలను క్రైస్తవ్యములో స్థిర పరచుటకు ఆత్మ దేవుడు ఈ పత్రికలో మనయెదుట ఉంచిన విషయ ములను కొన్నింటిని గమనింతము :
మొదటిది – క్రీస్తు వ్యక్తిత్వపు మహిమలు, పరలోకములో ఆయన స్థానము. (1, 2 అధ్యాయములు).
రెండవది – పరలోకమునకు ప్రయాణమైయున్న తన ప్రజలను నడిపించు క్రీస్తు యాజకత్వము. (3-8 అధ్యాయములు).
మూడవది – క్రీస్తు బలి విశ్వాసికి పరలోకమును తెరచుట, విశ్వాసిని పరలోకమునకు తగినవాడుగా చేయుట. (9, 10 అధ్యాయములు).
నాలుగవది – ప్రస్తుతము క్రీస్తుయేసు ఉన్న పరలోకమునకు ప్రవేశము. (10వ అధ్యాయము).
అయిదవది – పరలోకమందున్న క్రీస్తునొద్దకు తీసుకొనివెళ్లు విశ్వాస ద్వారము. (11వ అధ్యాయము).
ఆరవది – పరలోకమందున్న క్రీస్తునొద్దకు పోవు మార్గములో దేవుడు మన పాదములను భద్రపరచు వివిధ మార్గములు. (12వ అధ్యాయము).
ఏడవది – భూమిమీద క్రీస్తుతోకూడ గవిని వెలుపల శ్రమపడు ఆశీర్వాదకరమైన అనుభవము. (13వ అధ్యాయము).
ఈ విధముగా హెబ్రీ పత్రికలో పరలోకము ఎల్లప్పుడు మన యెదుట ఉంచబడుట చూడగలము. ఇది తెరువబడిన పరలోకపు పత్రిక. మాన వుని పురోభివృద్ధికై క్రైస్తవ్యమును లోక వ్యవస్థకు దిగజార్చిన ఈ రోజులలో క్రైస్తవ్యముయొక్క పరలోక లక్షణములను వెల్లడించు ఈ పత్రిక ఎంతో ప్రత్యేకమైనది.
బైబిల్‌లో హెబ్రీయులకు వ్రాసిన పత్రిక ప్రాముఖ్యత
మరియు దేవుని ఆత్మ ఈ గొప్ప పరలోకపు సత్యములను మన ఆత్మలయెదుటికి తెచ్చునప్పుడు, ముందు వచ్చినవాటికంటే ఇవి ఎంత ఉన్నతమైనవో, ఏ విధముగా ముందున్నవాటిని ప్రక్కన పెట్టినవో చూడ గలము. సృష్టించబడినవి ఏవైనను, అనగా ప్రవక్తలైనను, దేవదూతలైనను క్రీస్తు మహిమయెదుట వెలవెలబోవును.
క్రీస్తు యాజకత్వము అహరోను యాజకత్వమును ప్రక్కనబెట్టినది. క్రీస్తు బలి ధర్మశాస్త్రము క్రింద ఉన్న బలులన్నిటినీ ప్రక్కనబెట్టినది. దేవునియొద్దకు తక్షణ ప్రవేశము దేవాలయ మును, అందలి తెరను ప్రక్కనబెట్టినది.
విశ్వాస పథము దృశ్యమాన మగు వ్యవస్థ అంతటిని ప్రక్కనబెట్టినది. అట్లే గవిని వెలుపలి స్థలము “శిబిరము”ను, తత్సంబంధమైన భూలోక మతమును ప్రక్కనబెట్టినది.
ఈ పత్రికలో గమనించగల మరియొక ముఖ్య విషయమేమనగా – ఇందు సంఘమును గూర్చిన ప్రస్తావన లేదు. అది ఒకే ఒక పర్యాయము ప్రస్తావించబడినది. అదికూడా మనము కొన్ని విషయములయొద్దకు వచ్చితిమని చెప్పు సందర్భములో వాటిలో ఒకటిగా ప్రస్తావించబడినది.

క్రీస్తు మహిమ, ఆయన యాజకత్వము, ఆయన బలి, దేవుని సముఖమునకు చేరుట, విశ్వాసపథము, పరలోక ప్రయాణము, మనము చేరుకున్న సమస్తము విశ్వాసముద్వారా మాత్రమేనని చూడ
గలము మరియు తెలిసికొనగలము.
క్రైస్తవ్యముయొక్క ఫలము, దానికి సంబంధించిన ఫలితము రక్షింప బడని వ్యక్తులలోకూడా కనిపించ వచ్చును. అయితే క్రైస్తవ్యమునకు చెందిన గుణములన్నియు కంటికి కనిపించునవి కావు. అదే యూదా మతములో నైతే సమస్తమును కంటికి కనిపించును, తాకి చూడవచ్చును. అయితే పరసంబంధమైనవి, విశ్వాస సంబంధమైనవి, దేవుని ఎదుట ఉండెడివి.
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక ముఖ్య వచనాలు
అవన్నియు నిశ్చలమైనవి. వాటియొద్దకు మనము వచ్చియున్నాము. మన చుట్టూ ఉన్నవన్నియు గతించిపోవునవి, మార్పుచెందునవి, కదలి పోవునవి. క్రైస్తవ్యములో మార్పు చెందని, గతించని, ఎన్నడూ కదలని వాటి యొద్దకు మనము కొనిరాబడియున్నాము. క్రీస్తు మార్పులేనివాడు, ఆయన నిరంతరము ఏకరీతిగానున్నాడు. ఆయన నిత్య విమోచన స్థిర మైనది, ఎన్నడూ చలించనిది.
ఈ పత్రిక మనకు ముఖ్యముగా, ఆచరణాత్మకముగా నేర్పించునదే మనగా – భూసంబంధమైన మతమునుండి మనలను వేరుపడమని. అది యూదా మతమైనా కావచ్చు, యూదా మత నమూనాలో స్థాపించిన భ్రష్ట క్రైస్తవ్యము కావచ్చు.
ఏదైనను దానినుండి వేరుపడవలసినదే. అంతేకాదు, ఈ లోకములో మనము గవిని వెలుపల ఉన్నచో పరలోకము నందు తెరలోపల స్థలము లభించును. కావున ఈ లోకయాత్రలో మనము పరదేశులము, యాత్రికులముగా నుందము.