పరలోక దర్శనములు మరియు అందుగల మహిమలు

పరలోక దర్శనములు మరియు అందుగల మహిమలు

నా మార్గదర్శి చెప్పిన మాటలు కొన్ని క్షణాల తర్వాత నిజమని ఋజువు అయ్యాయి. ఎందుకనగా కాసేపటి తర్వాత నేను పరలోక మహిమా గృహాలలోనికి ప్రవేశించాను. నేను చూసిన దృశ్యాలను మానవ మాటలతో నేను వివరించడం అసాధ్యం. నేను విన్న శ్రావ్యమైన సంగీతనాదాలను నేను నా నోటితో ఎన్నటికీ వ్యక్తీకరించలేను. ఆ విషయాన్ని అపొస్తలుడైన పౌలు చాలా బాగా చెప్పాడు : “ఇప్పుడు మనము దేవుని పిల్లలమైయున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకను ప్రత్యక్షపరచబడలేదు (1 యోహాను 3:2).

ఎవరైతే దానిని ఇంకను చూడలేదో వారు దానిని గురించి పరిపూర్ణముగా చెప్పలేరు. ఎవరైతే దానిని చూశారో వారు దానిలో వెయ్యవభాగంకూడ చెప్పలేరు. కావున, తాను పరదైసుకు కొనిపోబడినట్లును, అక్కడ వచింప శక్యము కానివియు మనుష్యుడు పలుకకూడనివియునైన మాటలను తాను వినినట్లును అన్యులకు అపొస్తలుడుగా నియమింపబడిన పౌలు తెలిపాడు (2 కొరింథీ 12:4).

అందుకే తాను కనినవియు వినినవియునైన సంగతులను గురించి అతడు ఏమియు వ్రాయలేదుగాని, “దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు” అని మాత్రమే వ్రాశాడు (1 కొరింథీ. 2:9). అయితే, నేను కన్నవాటిని గూర్చియు, విన్నవాటిని గూర్చియు, అక్కడున్న కొందరు ఆశీర్వాదకరమైన వ్యక్తులను గూర్చియు, నేను మీకు సవివరంగా తెలుపుతాను.

సమస్తమైన వెలుగుకు మూలము

ఆ మహిమకరమైన ప్రదేశానికి నేను సమీపించినప్పుడు, ప్రకాశిస్తున్న లెక్కలేనంతమంది దేవదూతలను నేను చూశాను. వారు నన్ను ఆ అద్భుతమైన ప్రదేశంలోనికి సాదరంగా ఆహ్వానించారు. వారందరి ముఖాల్లో పరిపూర్ణమైన వెలుగులు విరజిమ్మే వజ్రాలుగాని, కాంతివంతమైన ముత్యాలు రత్నాలు వైఢూర్యాలుగాని ఆ మహిమా వెలుగు ముందు కేవలం జీవంలేని బొగ్గులే.

ఆనందం మరియు పరిపూర్ణమైన సంతృప్తిని నేను చూడగలిగాను. అక్కడ సమీపించరాని పరిపూర్ణమైన వెలుగు ప్రతి ఒక్కరినీ తన స్వభావములోనికి ఇముడ్చుకొని ఉండటాన్ని నేను చూశాను. మహిమపరచబడిన పరిశు దుల ఆత్మల అంతర్భాగంకూడ అతి స్పష్టంగా అద్దంలో చూసినట్లుగా కనిపిస్తోంది. సూర్యుడు లేదా వేరొక వస్తువుద్వారా ఆ వెలుగు అక్కడ ప్రసరించబడటం లేదుగాని, దైవిక మహిమా వెలుగు ప్రతి ఒక్కరిపైనను ప్రతి ఒక్క వస్తువుపైనను ప్రతి గృహంలోను ప్రతి ఆత్మయొక్క అంతర్భాగంలోను ప్రసరిస్తోంది. ఆ దైవిక వెలుగుతో పోల్చినప్పుడు సూర్యుని వెలుగు కేవలం చీకటే.

వెలుగులు విరజిమ్మే వజ్రాలుగాని, కాంతివంతమైన ముత్యాలు రత్నాలు వైఢూర్యాలుగాని ఆ మహిమా వెలుగు ముందు కేవలం జీవంలేని బొగ్గులే.

దేవుని మహిమా సింహాసనంగా పిలువబడే ఆ అద్భుతమైన స్థలమునుండి ప్రసరించబడే ఆ మహిమా వెలుగునుండి దైవిక అధికారము మరియు ఆధిపత్యము అత్యద్భు తంగా బయలుపరచబడుతున్నాయి.

దేవదూతలు మరియు పరిశుద్ధులు ఆలపించే హల్లెలూయ పాటలనూ స్తుతి గీతాలనూ వింటూ, వారుచేసే ఆరాధనలను స్వీకరిస్తూ, తన మహిమా సింహా సనంపై ఆసీనుడైయున్న సర్వోన్నతుని దైవత్వాన్ని వీక్షించడం మానవులమైన మనకు ఒక అత్యద్భుతమైన దృశ్యం. కావున, ఆయన మహిమగల దేవునిగా పిలువబడేందుకు ఎంతైనా అర్హుడు. ఎందుకనగా ఆయన మహిమా ప్రసన్నత ద్వారా పరలోకం ఒక మహిమా ప్రదేశంగా విలసిల్లుతోంది. ఆ దైవిక ప్రసన్నత నుండి పరలోకంలో ఉన్న నివాసులందరివద్దకూ ఆనందకరమైన నదులు ప్రవహి స్తున్నాయి. ఆయన మహిమ పరలోకంలోని అన్నివైపులకూ వెదజల్లబడుతోంది.

నావరకైతే, సింహాసనాసీనుడైన దేవుని మహిమావెలుగుయొక్క ఒక్క కిరణాన్ని చూసేందుకుకూడ శక్తిలేనంత బలహీనంగా నా కనుదృష్టి ఉంది. నేను నా ప్రక్క నున్న నా మార్గదర్శి అయిన దేవదూతను చూస్తూ ఇలా గట్టిగా అరిచాను : “ఇంతటి గొప్ప వెలుగును ఏ మానవనేత్రమూ చూసి భరించజాలదు. అయినప్ప టికీ, ఇది ఆత్మలను సేదదీర్చి వాటిని ఆనందోత్సాహాలతో నింపేదిగా ఉంది. ఈ మహిమా వెలుగును చూసినట్లయితే ఒకవేళ నేను మరణిస్తానేమో! అలా నేను మరణించవలసి వచ్చినప్పటికీ, దీనిని వీక్షించేందుకే నేను ఇష్టపడతాను.”

పాపానికిగాని, దుఃఖానికిగాని తావులేదు

దేవదూత : మరణాన్ని గురించి నీవు ఇక్కడ మాట్లాడకూడదు. ఎందుకనగా, ఈ ఆశీర్వాదకరమైన స్థలంలో మరణానికి ఏమాత్రం చోటులేదు. ఇక్కడ జీవము మరియు నిత్యత్వములకు మాత్రమే చోటుంది. ఎందుకనగా ప్రతివిధమైన చెడుగు నుండి ఈ స్థలము ప్రత్యేకించబడింది. అలా లేనట్లయితే, మహికరమైన ఈ స్థలము అసంపూర్ణమైనదే. ఇప్పుడు నేను నీకు నీలానే శరీరంతోనే ఇక్కడకు ప్రవేశించిన ఒక వ్యక్తిని పాపానికిగాని దుఃఖానికిగాని ఇక్కడ ఏమాత్రం చోటులేదు.

ఇక్కడ జీవము మరియు నిత్యత్వములకు మాత్రమే చోటుంది.పాపానికిగాని దుఃఖానికిగాని ఇక్కడ ఏమాత్రం చోటులేదు. 

పరిచర్యచేయు వేరొక ఆత్మను నేను నీవద్దకు పంపునంతవరకు నీవు అతనితో సంభాషిస్తూ ఉండు.

ఎపెనెటస్ : దానికిబదులు నన్ను ఇక్కడే ఉండనివ్వకూడదూ? ఎందుకంటే, పరలోక గృహాలు ఈపాటికే నిర్మించబడి సిద్ధంగా ఉన్నాయి గనుక, ఇక్కడ ఎలాంటి గుడారాలూ వేసుకోనవసరం లేదు.

అందుకు ఆ దేవదూత నాకు ఇలా జవాబిచ్చాడు- “కొంతకాలము తరువాత నీవు తప్పక ఇక్కడ శాశ్వతంగా నిలిచి ఉండబోతున్నావు. అయితే, మొట్టమొదట దైవచిత్తానికి మనము విధేయత చూపించాలి.”

ఏలీయాతో సంభాషణ

క్షణంలో అతడు నన్ను ప్రకాశమానమైన వేలాది దూతల సమూహంద్వారా అత్యంత వేగంగా తీసుకెళుతూ చివరిగా సుపరిచితుడును గొప్ప ప్రవక్తయునైన పరిశుద్ధుడగు ఏలీయా వద్దకు తీసుకెళ్ళాడు. అతడు భూమిమీద ఎన్నో సంవత్స రాలకు ముందు జీవించినప్పటికీ నా మొదటి చూపులోనే నేను అతనిని నాకు సుపరిచితుడైన వ్యక్తిగా దృష్టించాను.

దేవదూత : (ఏలీయాతో) పరలోక మహిమను వీక్షించేందుకు దేవుని అనుమతిని పొందిన ఒక వ్యక్తిని నేను నీవద్దకు తీసుకొచ్చాను. ఇందులోని మహిమాసంతోషాలు ఎక్కడనుండి వచ్చాయో అతడు తెలుసుకొనేందుకు అతనికి నీవు సహాయం చెయ్యి.

ఏలీయా : నేను దానిని సంతోషంగా చేస్తాను. ఎందుకంటే, దేవుని యొక్కయు గొఱ్ఱపిల్ల యొక్కయు చిత్తము నెరవేర్చుటయు, ఆయనకు స్తుతిగీతాలు ఆల పించుటయు, వినయముతో ఆయనను ఆరాధించుటయు, “సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక” (ప్రకటన 5:13) అని పలుకుటయు ఇక్కడ మన ఆహారమును పానీయమును అయియున్నది. (యోహాను 4:34 చూడుము).

ఆయన “వధింపబడినవా(డై), (తన) రక్త మిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను” చేసెను (ప్రకటన 5:9,10). “అవును, ఆమేన్” (ప్రకటన 1:7).

నేనుకూడ పరిశుద్ధుడగు ఆ ప్రవక్తతో కలిసి “ఆమేన్” అని పలికాను. అప్పుడు ఆ ప్రవక్త నావైపు తిరిగి ఇంత గొప్ప అనుమతి మరియు ఆధిక్యత నాకు ఎలా లభించిందని నన్ను ప్రశ్నించాడు.

భూమిమీద ఏం జరుగుతోందో పరలోకంలో నున్న పరిశుద్ధులకు ఏ మాత్రం తెలియదని నేను గ్రహించాను. అలాగైతే ఇక భూమిమీదనున్న మనుష్యులను గురించి ప్రార్థించేందుకు వారు ఎలా నిర్దేశించబడతారు?

ఆ విషయాన్నే నేను నా పరిచయభాగంలో తెలియబరిచాను. ఆ తర్వాత ఆ పరిశుద్ధ ప్రవక్త నాతో ఇలా మాట్లాడటం ప్రారంభించాడు :

ఏలీయా : సింహాసనాసీనుడైన దేవునికిని, వధింపబడిన గొఱ్ఱపిల్లకును, వారి మంచితనమునుబట్టియు, నిరుపేదలకును బలహీనులకును అనుమానితు లగు పాపులకును వారు చూపించిన అవధులులేని ప్రేమ మరియు మంచితనము లనుబట్టి మహిమయు ప్రభావమును యుగయుగములకును కలుగునుగాక. ఇప్పుడు నేను నీకు చెప్పు సంగతులను నీవు జాగ్రత్తగా వినుము.

తన ఆత్మీయ శరీరమును గురించి ఏలీయా వివరణ

ఏలీయా : నీవు ఇంతవరకు చూసిన మరియు వినిన సంగతులను ఇతరులకు అర్థమయ్యే రీతిలో నీవు ఎన్నటికీ వివరించలేవని నేను దృఢంగా నమ్ముతున్నాను.

ఎందుకనగా, “దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయము నకు గోచరము కాలేదు”(1 కొరింథీ. 2:9). మహిమకరమైన ఈ స్థితికి ఇంకను మార్చబడనివారిని లేదా తమ భౌతికశరీరములనుండి విడుదల నొందనివారిని గురించి నేను మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ శరీరములో ఉండుట అనునది ఇక్కడి విషయాలను గ్రహించుటకు ఏమాత్రం అడ్డుకాదు. ఎందుకనగా, నా శరీరము స్వాభావిక మరణమునొందనప్పటికీ, భౌతిక మరణమునకు సమాన ముగా అది శ్రమనొంది రూపాంతరం చెందింది.

అది ఇప్పుడు దేవుని సింహాస నము చుట్టూ ఉన్న ప్రకాశమానమైన దేవదూతల స్వరూపానికి ఏమాత్రం తీసిపోని విధంగా రూపాంతరం చెందింది. అయినప్పటికీ, ఈ సంతోషకరమైన స్థితిలో నేను అనుభవిస్తున్నవన్నీ నేను నీకు వివరించలేను. ఇంకను నేను అనుభవించనై యున్నవాటినికూడ నేను నీకు వివరించలేను. ఎందుకనగా ఇక్కడ మన సంతోషము ఎప్పటికప్పుడు నూతనపరచబడుతూ ఉంటుంది.

పరలోక సంతోషము పరిపూర్ణమైనది

సంతోషము ఎలా పరిపూర్ణము చేయబడుతుందో, ఆ సంతోషానికి ఇంకను అదనంగా సంతోషము ఎలా చేర్చబడుతుందో నాకు సవివరంగా తెలుపమని నేను ఆ ప్రవక్తను అడిగాను. ఎందుకనగా, పరిపూర్ణమైన సంతోషము ఈపాటికే సమాప్తమైనదని క్రిందున్న ప్రపంచంలో మనము సాధారణంగా భావిస్తుంటాము.

ఎపెనెటస్ : నేను ఏదో వ్యర్థమైన ఆసక్తితో ఇలా ప్రశ్నిస్తున్నానని దయచేసి భావించవద్దు. పరలోక విషయాలను గురించి నాకు ఏమియు తెలియదు. కావున, ఆ సంగతులను గ్రహించేందుకు నా గ్రాహ్యశక్తి అధికము కావాలన్నదే నా ఆశంతా.

ఏలీయా : నీ అనుమానాలను సంతృప్తిపరచేందుకును, ఊగిసలాడే నీ విశ్వాసాన్ని స్థిరపరచేందుకును, ఈ మహిమా ప్రదేశములోనికి త్రియేక దేవుని

పరలోక దర్శనములు మరియు అందుగల మహిమలు ద్వారా నీవు అనుమతించబడ్డావు. కావున, నీ మనస్సులోని అనుమానములన్నిటినీ నేను నివృత్తిచేస్తాను. అయితే, సంతోషము పరిపూర్ణము చేయబడుటను గురిం చియు, అదనముగా సంతోషము చేర్చబడుటను గురించియు నీకున్న సందేహ మును నివృత్తిచేయుటకు, నాలాగా ఆత్మ మరియు శరీరము రెండును సంతోష నేను ముగా ఉన్నప్పుడు దానిని అత్యున్నతమైన సంతోషకరమైన స్థాయిగా అభిప్రాయపడుతున్నాను.

లెక్కించడానికి అసాధ్యమైన గత యుగాలన్నిటిలో ఆత్మ మరియు దేహము ఆశీర్వాదకరమైన పునరుత్థాన స్థితిలో కలిసి ఉన్నప్పుడు అవి ఈ ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంటాయి. అయితే, సంతోషము ఎల్లప్పుడూ నూతనపరచబడుతూ ఉండుటే ఈ మహిమా స్థలములోనున్న సంతోషము యొక్క ఉద్దేశము.

దైవిక పరిపూర్ణతలు అనంతమైనవి. ఈ మహిమను నిత్యత్వం మాత్రమే ప్రదర్శించగలదు. నిత్యత్వం మాత్రమే నూతనమైన సంతోషాన్ని అదనంగా చేర్చగలదు. అంతేగాక, అవసరమైనకొలదీ ఈ సంతోషముయొక్క పరిజ్ఞానము నిత్యత్వంలో అభివృద్ధిచెందుతూ ఉంటుంది.

తన పరలోక దర్శనమును గురించి పౌలు ఇచ్చిన జవాబు

ఏలీయా : కావున, అపొస్తలుడైన పౌలు తాను శరీరంతో భూమిమీద జీవించిన కాలంలో నీవలె పరదైసుకు కొనిపోబడినప్పుడు, “దేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు” (1 కొరింథీ. 2:9) అని గొప్ప ఉద్దేశంతోనే పలికాడు.

పరలోక దృశ్యాలు వివరణకు అసాధ్యమైనవి

ఏలీయా : ప్రకృతిలో ప్రశంసించదగ్గ అంశాలను ఎన్నింటినో మన కళ్ళు చూశాయి. స్పటికపు కొండల్నీ, వజ్రాల బండల్నీ అవి చూశాయి. బంగారు గనుల్నీ, ముత్యాల తీరాల్నీ, పరిమళ సువాసనల్ని వెదజల్లే మూలికల దీవుల్నీ అవి చూశాయి. అవి భూమిమీద ఎన్నో అద్భుతమైన వాటిని ఆశ్చర్యంతో తిలకించి ఉండవచ్చు. అయితే, అత్యంత ఆశ్చర్యకరమైన ఈ మహిమా ప్రదేశంలోని అద్భుతాల్ని అవి ఎన్నడూ తిలకించి ఉండవు.

శ్రావ్యమైన పరలోక సంగీత సునాణాలు పోలికకు సాటిలేనివి

ఏలీయా : మానవుని చెవులు ఎన్నో శ్రావ్యమైన శబ్దాలను వినియున్నప్పటికీ, సర్వోన్నతుని సింహాసనంవద్ద పరిశుద్ధులును దేవదూతలును చేసే మధురమైన సంగీత సునాదాలను అవి ఎన్నడూ వినివుండవు.

పరలోకము ఊహాతీతమైనది

ఏలీయా . అద్భుతమైన పరలోక దృశ్యాలను మానవనేత్రాలు ఎలా చూడలేవో, అక్కడి శ్రావ్యమైన శబ్దాలను మానవుని చెవులు ఎలా వినలేవో, అలానే పరలోక మహిమలను మానవ హృదయం ఏమాత్రం గ్రహించలేదు (1 కొరింథీ. 2:9). సృష్టి కర్తయొక్క అత్యద్భుతమైన సృష్టియగు మానవ హృదయం భూలోకంలో గతంలో ఉన్నవాటినీ, ఇప్పుడు ఉన్నవాటినీ, భవిష్యత్తులో ఉండబోవువాటినీ పరిపూర్ణంగా గ్రహించగలదు. అయితే, పరలోక సంగతులను అది ఏమాత్రం గ్రహించలేదు.

భూమిపైనున్న ప్రతి రాయీ ధగధగలాడు వజ్రంగా మారడాన్ని మానవుడు గ్రహించగలడు. కంటికి కనబడే ప్రతి గడ్డిపోచా ఒక అందమైన మణిహారంగా మారడాన్నికూడా అతడు ఊహించగలడు. భూమిపైనున్న మట్టి అంతా వెండి గాను, భూమి అంతా స్వచ్ఛమైన బంగారముగాను మారడాన్ని అతడు ఊహించ గలడు. కళ్ళకు కనిపించని గాలి ముత్యాలహారాలుగాను, ఆకాశంలో కనిపించే ప్రతి చిన్న తారా ఒక పెద్ద సూర్యునిగాను, సూర్యుడు ఇప్పుడున్న పరిమాణంకన్నా వెయ్యిరెట్లు పెద్దదిగాను అతడు ఊహించగలడు. అయితే, తన అనుచరులకోసం సర్వాధికారియగు దేవుడు సిద్ధపరచిన వాటిని మానవుడు ఏమాత్రం ఊహించ లేడు (1 కొరింథీ 2:9).

ఏలీయా : మేము ఈ పరలోక మహిమలో అనుభవించే అద్భుతమైన ఆనందాన్ని నీవు స్పష్టంగా గ్రహించేందుకుగాను దేవునిచే ఆశీర్వదించబడిన ఆత్మలు వేటినుండి విడిపించబడ్డారో నేను నీకు క్లుప్తంగా తెలుపుతాను. ఆ ఆనందాన్ని గురించి నేను నీకు సవివరంగా తెలపాలంటే యుగాలు పడుతుంది. అయితే, నీవు ఆ ఆనందాన్ని గురించి సరైనవిధంగా గ్రహించునట్లుగా భూమిమీద నీవు చూసిన వాటితో పరలోకంలో ఉన్నవాటిని పోల్చుతూ నేను నీకు వివరిస్తాను.

దయనీయమైన పాపపు స్థితినుండి విడిపించబడ్డారు

దేవునిచే ఆశీర్వదించబడిన ఆయన ప్రజలు మొట్టమొదట దౌర్భాగ్యకరమైన స్థితి అంతటినుండి విడిపించబడ్డారు. ఆ స్థితిలో అత్యంత ప్రాముఖ్యమైనది పాపపుస్థితి. ఇదియే మానవుణ్ణి అత్యంత దయనీయమైన స్థితిలోనికి నెట్టి వేస్తుంది. ప్రారంభంలో దేవుడు సమస్తాన్నీ సంతోషకరమైన విధంగా సృజించాడు.

పాపము గనుక అందమైన ఆ పరలోక సంతోషాన్ని హరించివేయక ఉండినట్ల యితే, మానవుడుగాని దేవదూతలుగాని దుఃఖమంటే ఏంటో ఎరిగివుండేవారు కారు. అయితే, తిరుగుబాటుచేసిన దేవదూతలను కేవలం వారి పాపమే నరకము లోనికి పడద్రోసి, సృష్టి అందాన్ని సర్వనాశనం చేసింది. ఆ తర్వాత మానవుడు చేసిన పాపము వాని ఆత్మలోని దేవుని స్వరూపాన్ని చెరిపివేసి సృష్టికి రాజుగా నుండిన అతణ్ణి తన స్వంత ఆశలకు బానిసగా చేసింది. ఆ విధంగా అతడు ఇక ఏమాత్రం విమోచింపబడుటకు వీలులేని నిత్యనాశన సముద్రంలోకి తన్నుతాను త్రోసివేసుకొన్నాడు.

పాప శరీరములోనున్న పరిశుద్దులు తమ శరీరములను విడిచిన వెంటనే, పంజరముల నుండి విడుదలనొందిన పక్షులవలె వారు స్వేచ్ఛనొంది విహరిస్తారు.

ఈ సంతోషకరమైన స్థలంలోనున్న ప్రతి ఒక్కరినీ విడిపించింది విలువ కట్టలేని దేవుని కృపయే. విమోచించు యేసు రక్తముద్వారా వారు పాపంనుండి శాశ్వతంగా విడిపించబడ్డారు. ఆయనకు ఘనత మహిమా ప్రభావములు నిరంతరం కలుగునుగాక!

భూమిమీద అతి పరిశుద్ధమైన ఆత్మలు కూడ పాపభారముచే మూల్గుచున్నాయి. వారు చేసే ప్రతి పనిలో పాపం వారిని వెంటాడుతూ ఉంటుంది. అనేకసార్లు వారు తమ స్వంత పరిశుద్దులు తమ శరీరములను విడిచిన వెంటనే, పంజరములనుండి విడుదలనొందిన పక్షులవలె వారు స్వేచ్ఛనొంది విహరిస్తారు.

చిత్తమునకు బానిసలవుతుంటారు. “అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?” (రోమా 7:24) అనునది ప్రభువైన యేసుకు అత్యంత ప్రియముగానున్న అనేకులగు దేవుని పిల్లల ఆర్తనాదంగా ఉంది. పాపశరీరములో నున్న పరిశు దులకు పాపము అనునది గొప్ప అవరోధముగా ఉన్నది.

భూమిమీద ఒక ప్పుడు తమతో పోరాడుతూ వచ్చిన పాపము ఇప్పుడు తమ్మును వెంటాడక పోవుటనుబట్టి వారు శాశ్వతంగా పాపమునుండి విడుదల పొందినవారై, విజయోత్సాహంతో పైపైకి ఎగురుతూ ఈ ఆనందకరమైన స్థలానికి వారు ఇక్కడ వారి ఆత్మలు పాపరహితమైనవై “కళంకమైనను ముడతయైనను” లేనివిగా యేసుక్రీస్తు ద్వారా నిత్యుడగు తండ్రికి ప్రత్యక్షపరచబడతాయి.

పాపపు శోధనలనుండి విడిపించబడ్డారు

ఏలీయా : రెండవదిగా, ఆశీర్వాదకరమైన వారి ఆత్మలు పాపమునుండి ఎలా విడిపించబడ్డాయో అలానే వారు పాపపు అవకాశములనుండికూడా విడిపించబడ్డారు. ఇది వారి సంతోషాన్ని మరింత అధికం చేస్తుంది. ఆదాము పరదైసులో ఉన్నప్పుడు, తాను నిష్కళంకుడననీ పాపమునుండి పూర్తిగా విడి పించబడ్డాననీ తలంచాడు. అయితే, అతడు పాపపు శోధననుండి విడిపించ బడలేదు. అది అతనికి ఒక గొప్ప దుఃఖకరమైన విషయం. సాతానుడు అతనిని శోధించేందుకు పరదైసుకు వచ్చినప్పుడు అతడు పూర్తిగా సాతానుని శోధనలకు లొంగిపోయాడు. నిషేధింపబడిన ఫలాన్ని అతడు భుజించి పాపంలో పడిపోయాడు. అతడు అలా పాపంలో పడిపోవుటద్వారా అతని మానవ స్వభావము పూర్తిగా అవినీతిమయమైంది.

ఏ పాపమూ ఏ వ్యక్తినీ ఏ పాపమూ ఇక్కడ ప్రవేశించలేదు. పరిశుద్ధతకు మాత్రమే ఇక్కడ చోటుంది. దురాత్మల శోధనలకు ఇక్కడ ఏమాత్రం చోటులేదు.

కుళ్ళులాంటి పాపము మానవుని స్వభావంలో ప్రవేశించి మానవాళి నంతటినీ చెరిపివేసింది. ఆ పాపస్వభావము పదేపదే శోధకుడైన సాతానుని శోధనలద్వారా శోధించబడుతూ పదేపదే పాపం చేస్తోంది. అయితే, ఇక్కడ ప్రతి ఆత్మా దానినుండి పూర్తిగా విడుదలనొందింది. ఏ పాపమూ ఏ వ్యక్తినీ ఇక్కడ ముట్టలేదు.

ఏ పాపమూ ఇక్కడ ప్రవేశించలేదు. పరిశుద్ధతకు మాత్రమే ఇక్కడ చోటుంది. దురాత్మల శోధనలకు ఇక్కడ ఏ మాత్రం చోటులేదు. భూమిమీద “గర్జించు సింహము”గానున్న సాతానుడు, “ఎవరిని మ్రింగుదునా అని” అటూ ఇటూ తిరిగే శోధకుడు (1 పేతురు 5:8), ఇక్కడ ఏమాత్రం ఇక్కడ ముట్టలేదు.

ప్రవేశింపలేడు. వాడు త్వరలో నిత్యసంకెళ్ళచే బంధించబడి నరకపు నిత్యాగ్నిలో పడద్రోయబడేందుకు సిద్ధంగా ఉన్నాడు.

అంతేగాక, తమ “విశ్వాసము మరియు ఓర్పు”ల (హెబ్రీ. 6:12) ద్వారా ఇక్కడకు చేరుకొన్నవారిపై మానవుని పతనంద్వారా తన సౌందర్యాన్ని కోల్పోయిన భూమియొక్క శూన్యత మరియు వ్యర్థతలు ఏమాత్రం ప్రభావము చూపలేవు.

క్రిందున్న లోకంలోని పరిశుద్ధులు నిరంతరం శోధనలూ మరియు పరీక్షలతో వేధించబడుతూ తీవ్రమైన సంఘర్షణను అనుభవిస్తుంటారు. అయితే పరలోక మహిమలోనికి ప్రవేశించిన మేము పాపపు శోధనలన్నిటినుండి విడిపించ బడ్డాము. మమ్మల్ని అమితంగా శోధించిన ప్రాపంచిక ఆకర్షణలన్నిటినుండీ మేము విజయాన్ని పొందాము.

జయకరమైన యేసు రక్తంద్వారా మేము వాటన్నిటిపై విజయాన్ని సాధించాము (ప్రకటన 7:9). ఇక్కడ మా శాంతిని దొంగిలించేది ఏదీలేదు. మేము పాపమునుండియు శోధనలనుండియు విడిపించబడినందున మా శాంతిని ఇక్కడ ఏదియు దొంగిలించలేదు.

పాపపు ప్రభావము నుండి విడిపించబడ్డారు

ఏలీయా : మూడవదిగా, ఏమాత్రం భరించలేని నిత్యనరకాగ్నికి వారసులుగా నిర్ధారించబడి నిత్యనాశనానికై ఎదురుచూస్తూ నిరంతరం మూల్గుచున్న అభాగ్యులు లోనైన పాపపు ప్రభావమంతటినుండి ఇక్కడ మేము పూర్తిగా విడిపించబడ్డాము. ఆ పాపపు ప్రభావమే క్రిందున్న లోకాన్ని పూర్తిగా ప్రభావితంచేసి దానిని ఏలుతోంది. మరణము అనునది కేవలం పరలోకపు సర్వోన్నతునిచే ఇవ్వబడిన పాపపు జీతము ( రోమా 6:23). పాపము, మరణము, నరకము అనునవి ప్రస్తుతము మేము అనుభవిస్తున్న పరలోక మహిమనుండి శాశ్వతంగా బహిష్కరించ బడ్డాయి. క్రీస్తుయేసు తన మరణముద్వారా మరణాన్నీ, మరణముపై అధికారము కలిగిన సాతానునీ జయించాడు (హెబ్రీ. 2:14).

క్రీస్తుయేసు తన మరణముద్వారా మరణాన్నీ, మరణముపై అధికారము కలిగిన సాతానునీ జయించాడు. పాపము, మరణము, నరకములపై ఆయన విజయము పొందాడు.

పాపము, మరణము, నరకములపై ఆయన విజయము పొందాడు. అందుకే ఆయన నిత్యత్వపు విజయస్తుతి గీతాలు తన నామమునకు ఆలపించబడుటకు శాశ్వతంగా అర్హుడు.

ఆశీర్వదించబడిన పరలోక ప్రజలు

అనుభవించి,ఆనందించునవి

ఏలీయా : ఈ ఆశీర్వాదకరమైన స్థితిలోనున్న మేము వీటన్నిటినుండి విడిపించబడ్డాము. అయితే, ఇలా ఐహిక శ్రమలన్నిటినుండి విడిపించబడుట అనే ఆనందము పరలోక మహిమలోగల ఆనందములన్నింటిలోకెల్ల చాల చిన్నది. ఇక్కడ పరలోక మహిమలో మేమనుభవించు సంతోషాలు అనుకూలమైనవి మరియు వ్యక్తిగతమైనవి. నీవు గ్రహించగలిగేకొద్దీ నేను వాటిని నీకు వివరిస్తాను.

దేవుని ముఖాముఖిగా చూచుట

ఏలీయా : ఇక్కడ మేము మా ఆనందమంతటికీ మూలమైన ఒక అందమైన స్వప్నాన్నీ ఆశీర్వాదకరమైన ఊటనూ అనుభవిస్తున్నాము. అవధులులేని ఈ ఆనందాన్ని అనిత్యులగు మానవులు తమ పరిమితమైన జ్ఞానంతో ఏమాత్రం గ్రహించలేరు. ఈ పరలోక ఆనందం మా గ్రాహ్యశక్తిని నిరంతరం ప్రభావితంచేసి వెలిగిస్తూ, మా హృదయాలను “చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము”తో (1 పేతురు 1:8) నింపుతుంది. ఆయన ప్రేమ నిత్యత్వమంతటిలో తరిగిపోనిదిగా ఉంటుంది. అది శాశ్వతంగా నిత్యత్వంలో నిలిచియుండునది.

ఆ ప్రేమను సృజించిన సృష్టికర్త తానే మాలో ప్రతిఒక్కరికీ ఆ ప్రేమను వ్యక్తిగతంగా పంచి పెడతాడు. ఆయన దైవిక ప్రసన్నత మరియు మంచితనం ఇక్కడ మా జీవములకు జీవ మును, మా ఆత్మలకు ఆత్మయు, మా పర లోకమునకు పరలోకమునైయున్నది. ఆ ప్రేమే మమ్ములను ఇక్కడ జీవింపజేస్తూ, ఆయనను ప్రేమించేందుకు పురికొల్పుతూ, ఆయనకు స్తుతిగానాలను ఆలపించేందుకు నిరంతరం ప్రేరేపిస్తూ ఉంది. అంతేగాక, అది మా ఆత్మలను ఆశీర్వాదకరమైన ఆయన సారూప్యంలోనికి మార్చివేస్తోంది.

దేవుని ప్రసన్నత మరియు మంచితనం ఇక్కడ మా జీవములకు జీవమును, మా ఆత్మలకు ఆత్మయు, మా పరలోకమునకు పరలోకమునైయున్నది.

క్రిందవున్న పరిశుద్ధులు ఆశీర్వాదకరమైన ఈ దేశమువైపుకు పయనిస్తున్న సమయంలో ఆయన “నిత్యముగనుండు బాహువులచే” (ద్వితీ. 33:27) బలపరచబడి నడిపించబడుతుంటారు. దాని ద్వారానే వారు కృపనుండి కృపకు దాటిపోతుంటారు. అయితే, నిత్యసంతోషంలోనికి క్షేమంగా చేరుకొన్న మేము “ముసుగులేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము” (2 కొరింథీ.3:18).

అయితే, విషయాలను నీ గ్రాహ్యానికి దగ్గరగా తీసుకొచ్చేందుకు, ఈ విషయాన్ని నీకు మరింత విపులంగా వివరించాలని నేను ఆశిస్తున్నాను. నిరంతరం దేవుని ముఖకాంతివైపు మేము చూచుటద్వారా, ఆయన ప్రేమలో నిజమైన పాలుపొందుతూ అందులో ఆనందిస్తాము. ఆయన చిరునవ్వు మా క్రింది లోకంలో ఉన్న పరిశుద్దులు ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుభవించుటద్వారా వాస్తవముగా ఆయనను అనుభవిస్తున్నప్పటికీ, ఇక్కడ మేము ఆయనను ముఖాముఖిగా అనుభవిస్తుంటాము.

ఆత్మలను సంతోషభరితుల్ని చేస్తుంది. ఆయన మంచితనాన్నీ ఆయన ప్రేమనూ ఆయన దయనూ మేము నిరంతరం అనుభవించి ఆనందిస్తుంటాము. ఎందుకనగా, ఆయన దయ మా జీవమైయున్నది (కీర్తనలు 30:5). అంతేగాక, ఆశీర్వాదకరమైన ఆయన ముఖ దర్శనముద్వారా మేము క్రిందున్నవారికంటే ఎక్కువగా తెలుసుకొనగలము. ఎందుకనగా, ఆయనను మేము నిరంతరం దృష్టించుట అనునది మా గ్రాహ్యశక్తిని అధికంచేసి, ఆయన “మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచు టకు మా హృదయములలో ప్రకాశించెను” (2 కొరింథీ. 4:6).

దైవిక అధికారాన్నీ ఆధిపత్యాన్నీ గ్రహించుట అసాధ్యమైనప్పటికీ, ఇక్కడ మేము ఆయన స్వభావాన్నీ ఆయన దైవిక లక్షణములనూ పరిపూర్ణంగా గ్రహించగలము. ఎందు కనగా సర్వోన్నతుడైన దేవుని పరిపూర్ణతను ఎవరు తెలిసికొనగలరు?

దేవునితో సహవాసము

ఏలీయా : ఇక్కడ మేము ఆయనను ముఖాముఖిగా చూచుట మాత్రమేగాక, ఆయనను వాస్తవంగా అనుభవించగలము. తద్వారా మేము ఆయనలో ఐక్య పరచబడి ఆయనలో మేము, మాలో ఆయన నివసిస్తూ (1 యోహాను 4:13), ఆయన “దేవ స్వభావమునందు పాలివారము” గా (2 పేతురు 1:4) ఉంటాము. ఆ స్వభావము మాలో అత్యధిక ప్రకాశముతో వెలుగొందుతూ ఉంటుంది. క్రింది లోకంలో ఉన్న పరిశుద్ధులు ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను

అనుభవించుటద్వారా వాస్తవముగా ఆయనను అనుభవిస్తున్నప్పటికీ, ఇక్కడ మేము ఆయనను ముఖాముఖిగా అనుభవిస్తుంటాము. క్రింది లోకంలో ఉన్న పరిశుద్ధులు ఆయనను పాక్షికంగా అనుభవిస్తుంటారు. కాని, ఇక్కడ మేమైతే ఆయనను కొలవలేని విధంగా అనుభవించి ఆయనలో ఆనందిస్తుంటాము.

అక్కడ వారు ఆయన మంచితనాన్ని కొంతవరకే రుచిచూస్తుంటారు. కాని, ఇక్కడ మేము ఆయన మంచితనాన్ని సమృద్ధిగా రుచిచూస్తుంటాము. ఇక్కడ మేము ఆనంద సాగరంలో మునిగితేలుతుంటాము. క్రింద ఉన్న పరిశుద్ధులు ఆయనలోని ఆనందాన్ని కొంతవరకే అనుభవిస్తూ ఉంటారు. వారికి దేవునితోటి తమ సహవాసం అనేకసార్లు తెగిపోతూ ఉంటుంది. అయితే, ఇక్కడ మేము ఆయనతో ఆటంకపరచబడని విధంగా నిరంతర సంబంధబాంధవ్యాలను కలిగి ఉంటాము.

దేవుని కృపావరముల పరిపూర్ణత

ఏలీయా : ఇక్కడ మేము ఆయన కృపను పరిపూర్ణంగా అనుభవిస్తుంటాము. అయితే, క్రిందవున్న ప్రపంచంలోని పరిశుద్ధులు ఆయన కృపను కొంతవరకే అనుభవిస్తుంటారు. ఇక్కడ మేము పరిపూర్ణమైనవాటినే అనుభవిస్తాము. అసంపూర్ణమైనవి విడిచిపెట్టబడతాయి (1 కొరింథీ 13:9,10). క్రింది లోకంలో “దండనతో కూడినది “. ప్రేమ భయముతో మిళితమై ఉంటుంది. ఆ భయము అయితే ఇక్కడ ప్రేమ పరిపూర్ణమైనదిగా క్రింద ఉన్న పరిశుద్ధులకు ఉంటుంది. ఆ “పరిపూర్ణ ప్రేమ భయ మును వెళ్ళగొట్టును” (1 యోహాను 4:18).

ఇక్కడ మేము దేవుని మాకంటే ఎక్కువగా ప్రేమిస్తాము. ఇతరులనుకూడ మాకంటే ఎక్కు వగా మేము ప్రేమిస్తాము. ఇక్కడ మేమంద రము ఒక్క తండ్రి పిల్లలముగాను, ఒకరికి ఒకరము అత్యంత ప్రియమైనవారముగాను ఎంచుకొంటాము. క్రింది లోకంలో ప్రేమ అనేక దేవునితోటి తమ సహవాసం అనేకసార్లు తెగిపోతూ ఉంటుంది.

అయితే, ఇక్కడ మేము ఆయనతో ఆటంకపరచ బడని విధంగా నిరంతర సంబంధబాంధవ్యాలను కలిగి ఉంటాము. విధాలుగా విభజించబడి అనేక మార్గాలలో పయనిస్తూ ఉంటుంది. అయితే, ప్రేమా ఊట అయిన సర్వోన్నతుడగు దేవునిపై మాత్రమే మా ప్రేమ కేంద్రీక రించబడి ఉంటుంది.

ఆయన సామర్థ్యమును మేము తెలిసికొనునట్లుగా మా ప్రియ ప్రభువు ఇక్కడ మా సామర్థ్యమును అధికంచేశాడు.మా ఊహలకు మించిన జ్ఞానాన్ని ఆయన మాకు దయచేశాడు.

అదేవిధంగా, క్రింద ఉన్న లోకంలోని పరిశుద్ధుల జ్ఞానము అసంపూర్ణమైనది. పగిలిపోయిన అద్దంలోనుండి చూచినట్టుగా ఆక్కడ ఉన్న పరిశుద్ధులు దేవుని దృష్టిస్తారు. అయితే, ఇక్కడ ఆయనను మేము ముఖాముఖిగా ఉన్నట్టుగానే చూస్తాము. కావున మేము ఆయనను సంపూర్ణముగా యెరుగుదుము (1 కొరింథీ. 13:12).

ఇక్కడ మా ఆనందము సంపూర్ణమైనది. అయితే క్రింది లోకంలోనున్న పరిశుద్ధుల ఆనందము దుఃఖము మరియు నిట్టూర్పులచే ఆటంకపరచబడుతూ ఉంటుంది. ఎందుకనగా, ఎక్కడ పాపముంటుందో అక్కడ దుఃఖముంటుంది. అయితే, ఇక్కడ దుఃఖమునకు కారణమైన పాపము నిషేధించబడినందున, పాపఫలితమైన దుఃఖము అంతము చేయబడింది. వాస్తవానికి, మేము భూమిపై నున్నప్పుడు మా విమోచకుని ఆశీర్వాదకరమైన ప్రసన్నతలో మేము అనుభవించిన దుఃఖము నకు ప్రతిగా ఇక్కడ మా ఆనందము అధికము చేయబడింది.

పరిమితిలేని సామర్ధ్యము

ఏలీయా : ఇక్కడ మా సామర్థ్యము అధికం చేయబడింది. అయితే, మేము క్రింది ప్రపంచంలో ఉన్నప్పుడు, జ్ఞానేంద్రియాలద్వారా తప్ప మా మనస్సుల్లోకి ఎలాంటి వెలుగూ ప్రసరించబడేదికాదు. అయితే, ఆయన సామర్థ్యమును మేము తెలిసికొను నట్లుగా మా ప్రియ ప్రభువు ఇక్కడ మా సామర్థ్యమును అధికంచేశాడు. మా ఊహలకు మించిన జ్ఞానాన్ని ఆయన మాకు దయచేశాడు. ఆయన దైవిక ప్రత్యక్షత ఇక్కడ మాకు మరింత మహిమకరంగా బయలుపరచబడింది. అంతేగాక, మా మనస్సులు భూసంబంధమైన తలంపులనుండి సంపూర్ణంగా విడిపించబడ్డాయి.

స్పష్టమైన దర్శనం

ఏలీయా : క్రింది లోకంలో దేవుని గురించిన గ్రహింపు చాల సంకుచితమైనది మరియు అసంపూర్ణమైనది. అయితే ఇక్కడ, చెత్త అంతటి నుండి బంగారము వేరుచేయబడింది. ఇక్కడ మన గ్రహింపు సరైనదిగాను, దేవుని స్వచ్ఛతను సరైనవిధంగా గ్రహించేదిగాను చేయబడింది. క్రింది లోకంలో మహిమయొక్క ఉద్దేశములు కేవలం జ్ఞానేంద్రియాలపై ఆధారపడి ఉంటాయి. అయితే, ఇక్కడ దైవిక వెలుగు కిరణాలు నేరుగా మాలోకి ప్రసరించబడుతున్నందున, మా జ్ఞానేంద్రి యాలు పూర్తిగా మెరుగుదిద్దబడ్డాయి గనుక మహిమా ఉద్దేశములను మేము నేరుగా గ్రహించగలము. ఇక్కడ శరీరానికి సంబంధించిన తెరలు తొలగించబడి నందున, ఆత్మ దేవునియొక్క స్పష్టమైన దర్శనాన్ని అనుభవిస్తూ ఉంటుంది.

దేవుడు నిత్యత్వంనుండి ఉనికిలో ఉన్నట్టుగా ఇక్కడ మేము స్పష్టంగా చూస్తున్నాము.

ఇప్పుడు మాలో దేవుని మహిమకరమైన స్వభావము కొనసాగుతుంది. దేవుడు నిత్యత్వంనుండి ఉనికిలో ఉన్నట్టుగా ఇక్కడ మేము స్పష్టంగా చూస్తున్నాము. దైవ త్వము సంఖ్యాపరంగా విభజించబడనట్లునూ, దైవత్వముయొక్క ఐక్యత ఎక్కడా గలిబిలి చెంద నట్లునూ, త్రిత్వములోని వ్యక్తులలో ప్రాముఖ్య తలు గాని విబేధాలుగాని కొద్దిగొప్పలన్న తలంపులుగాని లేవు. వారందరిలో ఒకే దైవత్వం నిలిచి కొనసాగుతోంది.

దేవుని మార్గాలు మాకు అర్థమయినంతగా క్రింద ఉన్న వారికి అర్థంకావు. ఇక్కడ మేము దైవిక జ్ఞానమును కలిగియున్నందున సత్యమును స్పష్టంగా గ్రహించగలుగుతున్నాము. ఇవన్నీ మా ఆనందాన్ని మరింత అధికంచేస్తున్నాయి.

ఆత్మీయ దేహముయొక్క లక్షణములు

ఏలీయా : ఈ విషయాలన్నీ మా ఆత్మకు సంబంధించినవి. అయిన్పటికీ, ఇక్కడున్న వ్యక్తుల శరీరాలు తిరిగిలేచి వారి ఆత్మలతో ఐక్యపరచబడనంతవరకు వారి సంతోషము పరిపూర్ణముకాదు. దేవుని ఉదారత్వమునుబట్టి హనోకు మరియు నేను ఈ విషయంలో ఒక ప్రత్యేకమైన ఆధిక్యతను పొందియున్నాము. మేము ఇరువురము ఇప్పుడు మునుపటి మరియు రానైయున్న దేహములను కలిగినవారమై, దైవకుమారుని యొక్కయు పరిశుద్ధుల యొక్కయు పునరుత్థాన మును ముందుగానే పొందిన ఆధిక్యతను కలిగియున్నాము.

వాస్తవానికి మెస్సీయా మాత్రమే మరణమును గెలిచి సజీవుడుగా తిరిగిలేచాడు. పునరుత్థానము చెందు ఆత్మలలో ఆయన ప్రథమఫలమైయున్నాడు. నేనును హనోకును ఆయన పునరుత్థానమునకు సమానమైన మార్పును పొందినప్పటికీ, మా శరీరములు మరణమును రుచిచూడలేదు. కావున, పునరుత్థానస్థితి అనగానేమో సరైన విధంగా నిర్వచించుట కష్టము. ఆయన సంపూర్ణతను పునరుత్థానమునొందు ప్రతిఒక్కరూ అనుభవించవలెను.

మావి ఆత్మీయ దేహములయినప్పటికీ, ఆయన సంపూర్ణతను నేనుగాని హనోకుగాని అనుభవించలేదు. పునరుత్థానమునొందిన శరీరములయొక్క లక్షణములను నేను నీకు ఇప్పుడు వివరిస్తాను.

అవి ఆత్మీయమైనవి కాని వాస్తవమైనవి

ఏలీయా : పునరుత్థానము తర్వాత, నా శరీరములాగా ఆశీర్వదించబడిన శరీరములన్నియు ఆత్మీయ శరీరములే. నీవు నన్ను చూడటం మాత్రమేకాదుగాని, నన్ను స్పర్శించగలుగుతున్నావు కూడా. (అలా అని ప్రవక్త తన చేతిని నావైపు చాచాడు). ఆత్మీయ శరీరమనగానేమో ఇప్పుడు నీవు సరిగ్గా గ్రహించి ఉంటావని నేను భావిస్తున్నాను. ప్రతివిధమైన పాపస్వభా వమునుండి ప్రత్యేకించబడి పవిత్రపరచబడిన శరీరమే ఆత్మీయ శరీరము. ఆత్మీయ శరీరము అయినప్పటికీ అది సహజసిద్ధమైన వాస్తవ శరీరమువలెనే ఉంటుంది. ఇంకను స్పష్టంగా గ్రహించేందుకు భూమిమీద ఉన్నవారు ఊహించి నట్లుగా దానిని గాలి మరియు వాయువుల మిశ్రమంగా మనము చెప్పుకొనవచ్చును.

పునరుత్థానము తర్వాత, నా శరీరములాగా ఆశీర్వ దించబడిన శరీరము అన్నియు ఆత్మీయ శరీరములే. నీవు నన్ను చూడటం మాత్రమేకాదు గాని, నన్ను స్పర్శించ గలుగుతున్నావు కూడా.

ఈ సమయంలో నా విషయంలో కొంత ఓర్చుకొనమని నేను ఆ పరిశుద్ధు డగు ప్రవక్తకు విన్నవిస్తూ, ఆత్మీయమైనవి శరీర సంబంధమైనవాటికి భిన్నమైన విగా ఉంటాయనీ, ఆత్మీయశరీరం ఒక పదార్థమువలె ఉండదనీ నేను తలం చుచూ వచ్చానని నేను ఆతనితో అన్నాను.

అప్పుడు ఆ ప్రవక్త నాతో, ఆత్మీయ శరీర ములు కేవలం ఆత్మీయమైనవనీ, అవి ప్రతివిధ మైన పాపమునుండి పవిత్రపరచబడి ఉంటా యనీ, అవి భూమిమీద ఉన్న శరీరములు ఆధారపడినరీతిగా ఆహారము, నీరు, నిద్ర, బట్టలు మొదలగు వాటిపై ఆధారపడక కేవలం దేవుని ఆనందముపైననే ఆధారపడివుంటా యనీ నాతో అన్నాడు.

ఆత్మీయ శరీరములు భూమిమీద ఉన్న శరీర ములు ఆధారపడినరీతిగా ఆహారము, నీరు, నిద్ర, బట్టలు మొదలగువాటిపై ఆధారపడక కేవలం దేవుని ఆనందముపైననే ఆధారపడివుంటాయి.

ఏలీయా : ప్రభువైన యేసు తాను పునరుత్థానుడైన తరువాత తన శిష్యులు ఒక గదిలో కూడుకొనివున్నప్పుడు అక్కడ తలుపు మూసియుండినప్పటికీ ఆయన లోనికి ప్రవేశించిన సంగతి నీకు తెలుసుగదా? దీనినిబట్టి పునరుత్థానమైన శరీరము ఒక వస్తురూపంలో ఉండదని మనకు తెలుస్తోంది. అయినప్పటికీ, తన శరీరమును స్పర్శించి చూడమని ఆయన తోమాను ఆహ్వానించినట్టుగా మనకు తెలుసు. కావున ఆత్మీయ శరీరములు ఒక వస్తువులాంటి ఘనపరిమాణ మును కలిగి ఉంటాయని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పునరుత్థానము చెందిన మా శరీరములు ఈ రెండు స్వభావములచే శాశ్వతంగా ఆశీర్వదించబడి ఉంటాయి.

అవి నిత్యమైనవి

ఏలీయా : పునరుత్థానము నొందిన మా శరీరములు శాశ్వతమైనవి, నిత్యమూ జీవించునవి, ఎన్నడూ మరణించనివి. క్రింది లోకంలో ఉన్న జనుల శరీరములన్నీ అనిత్యమైనవి, మరణించి నాశనమయ్యేవి, శాశ్వతంగా మట్టిలో కలిసిపోయేం దుకు సిద్ధంగా ఉండేవి. అయితే, ఇక్కడ మా శరీరములు ఎన్నడూ పాడుకానివి మరియు మరణమునుండి శాశ్వతంగా విడిపించబడినవి. “మర్త్యమైనది జీవముచేత మ్రింగివేయబడునట్లు” మర్త్యమగు మా శరీరములు అమర్త్యతను ధరించుకొన్నాయి. (2 కొరింథీ. 5:4).

ఈ సమయంలో నేను నా విషయంలో కాస్త ఓర్చుకొనుమనీ, నాకున్న మరికొన్ని సందేహాలను నివృత్తి చేయమనీ ఆ ప్రవక్తకు తిరిగి విన్నవించాను.

ఏలీయా : నీకున్న సందేహాలేంటో తెలుపు. నేను వాటిని నివృత్తి చేసేందుకు ప్రయత్నిస్తాను.

దేవుడు మాత్రమే అమర్త్యుడని నీవు లేఖనాలలో చదివిన విషయానికొస్తే అది ముమ్మాటికీ వాస్తవం. సృజించబడినది ఏదైనను, దేవదూతలైనను మానవు లైనను ఆ స్థితిని కలిగియుండలేదు.

ఎపెనెటస్ : అమరత్వమనేది కేవలం దేవునికి మాత్రమే చెందినదనీ, అది మానవులకు చెందినదికాదనీ నేను లేఖనాల్లో చదివాను. ప్రత్యేకించి మానవ శరీరములకు సంబంధించి, అమరత్వమనేది వాటికి సంబంధించినది ఏమాత్రం కాదని నేను చదివాను. కావున, దేవుడు మాత్రమే అమరత్వ మును కలిగియున్నాడని అపొస్తలుడైన పౌలు తిమోతికి తెలిపాడు (1 తిమోతి 6:16).

ఏలీయా : ఆశీర్వదింపబడిన పరిశుద్ధుల శరీరములు అమర్త్యమైనవని నేను ఇక్కడ చెబుతున్నప్పుడు, తిరిగిలేచిన శరీరములను గురించి నేను చెబుతున్నాను. అవి తిరిగి లేచాక, మరణమునకు తిరిగి ఏమాత్రము గురికావు. పాపపుస్థితిలో నున్న మానవుడు మర్త్యుడు మరియు మరణమునకు పాత్రుడు. క్రింది లోకంలో ఉన్న జనులందరి విషయంలో ఇది వాస్తవము.

శిష్యులు ఒక గదిలో కూడుకొనివున్నప్పుడు అక్కడ తలుపు మూసియుండినప్పటికీ మన ప్రభువు లోనికి ప్రవేశించిన సంగతి నీకు తెలుసుగదా? దీనినిబట్టి పునరుత్థానమైన శరీరము ఒక వస్తురూపంలో ఉండదని మనకు తెలుస్తోంది. అయినప్పటికీ, తన శరీరమును స్పర్శించి చూడమని ఆయన తోమాను
ఆహ్వానించినట్టుగా మనకు తెలుసు.

ఈ సమయంలో ఇక్కడ మహిమపరచబడిన ఆత్మల శరీరములుకూడ మరణముయొక్క శక్తి క్రింద ఉంచబడియున్నవి. అయితే, పునరుత్థాన స్థితిలో అవి తిరిగిలేచినప్పుడు, అవి అమర్త్యతను ధరించుకొంటాయి. ఇక దేవుడు మాత్రమే అమర్త్యుడని నీవు లేఖనాలలో చదివిన విషయానికొస్తే అది ముమ్మాటికీ వాస్తవం. సృజించబడినది ఏదై నను, దేవదూతలైనను మానవులైనను ఆ స్థితిని కలిగియుండలేదు. అయితే, మేము దేవుని కృపాకనికరములనుబట్టి అమర్త్యుల మయ్యాము.

అయితే, దేవుడు స్వతహాగా తన స్వభావమునుబట్టి తత్వమంతటిలో అమర్త్యుడు. ఆ విధంగా చూచినట్లయితే, ఆయన మాత్రమే అమర్త్యతను ధరించుకొన్న వాడు. కావున లేఖనములద్వారా నీవు గ్రహిం చిన సంగతి వాస్తవమైనదే. ఆయనను గురించి మనము ఇంకను చెప్పుకొనవలెనంటే, ఆయన మాత్రమే పరిశుద్ధుడు మరియు ఆయన మాత్రమే “మంచివాడు” (మత్తయి 19:17).

ఆయన తప్ప నీతిమంతుడుగాని, దయాకనికర ములు గలవాడుగాని వేరొకడులేడు గనుక, ఆయనకు మాత్రమే “యుగయుగములకు……స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక” (ప్రకటన 7:12).

అవి పునరుత్థానమునొందినవి

ఎపెనెటస్ : నాకు ఇంకో సందేహం ఉంది. నీవును హనోకును మాత్రమే మీ శరీరములతో ఇక్కడ ఉండేందుకు అనుమతించబడినట్లునూ, మీరు మరణించక  పోయినప్పటికీ మరణమునకు సమానమైన శ్రమానుభవంద్వారా మీరు వెళ్ళారని మీరు అన్నప్పుడు, మరణము శక్తి క్రిందనున్న పరిశుద్ధుల శరీరములు తిరిగి లేస్తాయని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకనగా ఇక్కడున్న ఆత్మలు తమ శరీరములు లేకుండగనే చాల సంతోషంగాను ఆనందంగాను ఉన్నాయని నేను అభిప్రాయపడుట మాత్రమేగాక నా కళ్ళారా చూస్తున్నాను.

వాస్తవానికి వారి శరీరములు తమ సమాధుల్లో నాశనమైపోయి మట్టిలో కలిసిపోయాయి. నేను ఆలోచించే ఒక గొప్ప విషయమేమనగా పరిశుద్ధుడగు మన ప్రియమైన యేసు, మచ్చలేని దేవుని గొఱ్ఱపిల్ల, నిజంగా మరణించి తిరిగి సజీవుడుగా సమాధినుండి తిరిగిలేచి జీవించుచున్నాడు, నిరంతరం జీవిస్తూనే ఉంటాడు.

నా మాటలకు అంతరాయం కలిగిస్తూ ఆ ప్రవక్త నాతో ఇలా అన్నాడు : “ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరూ ఆయనవలెనే తిరిగి లేస్తారనేందుకు నీకు ఇంతకంటే మరే ఋజువు కావాలి?

ఎపెనెటస్ : ప్రభువైన యేసు శరీరము కుళ్ళుపట్టలేదు. అయితే, మరణించిన మానవునికి ఆత్మతోబాటు శరీరము ఒక అత్యవసరమైన భాగము. అవి రెండును పనిచేసే విధానంలో ఎంతో వ్యత్యాసము ఉన్నప్పటికీ, ఆ రెండింటి ఐక్యత ఎంతో అవసరము. తరువాత, తమ శరీరాలు కుళ్ళుపట్టిన తరువాత, ఆ కుళ్ళుపట్టిన శరీరాలు తిరిగి లేచిన ఉదంతాలు మనకు ఎక్కడా కనిపించవు కదా?

ఏలీయా : అలాంటి ఉదంతాలు ఎక్కడా మనకు కనిపించని విషయం వాస్తవమే అయి నప్పటికీ, ఇప్పుడు ఆత్మ మహిమపరచబడుట అనునది ఎంత వాస్తవంగా జరిగిందో, శరీరం పునరుత్థానము నొందుట అనునదికూడ అంతే వాస్తవంగా జరుగుతుంది. ఎందుకనగా, ప్రభువైన యేసు బహిరంగంగా సిలువవేయబడి మరణించి తిరిగిలేచినందున పునరుత్థానము చెందే పరిశుద్ధులలో ఆయన ప్రథమఫలమై యున్నాడు. (1 కొరింథీ. 15:20-23), సంఘమునకు ఆయన శిరస్సైయున్నాడు (ఎఫెసీ. 1:22) గనుక, తనవలె తిరిగిలేది తనతోకూడ సదాకాలము జీవించబోవు తన శరీర అవయవములు లేకుండా ఆయన ఏమాత్రము పరిపూర్ణుడు కాలేడు. ఆ శరీరము తన మరణనిద్రనుండి మేల్కొల్పబడి నేను చెబుతున్నవిధంగా అమర్త్యమైన మహిమ శరీరంగా మార్చబడుతుంది.

మహా దినములో అందరి యెదుట నీతికిరీటమును మహిమా కిరీటమును బహూకరించబడు సమయంలో ఆత్మయు శరీరమును ఆ గౌరవములో సమానంగా పాలుపొందుతాయి.

మానవునికి ఆత్మతోబాటు శరీరము ఒక అత్యవసరమైన భాగము. అవి రెండును పనిచేసే విధానంలో ఎంతో వ్యత్యాసము ఉన్నప్పటికీ, ఆ రెండింటి ఐక్యత ఎంతో అవసరము. క్రింది లోకంలో ఆత్మయొక్క సలహా మరియు నిర్ణయముల ద్వారానే సత్రియలు రూపొందించబడతాయి. అయితే, అవి శరీరముద్వారా మాత్రమే జరి గించబడతాయి. ప్రతి విధమైన కృపకూడ దృశ్యములగు క్రియలద్వారా వ్యక్తీకరించబడు తుంది. పశ్చాత్తాపపు దుఃఖంలో కన్నీళ్ళు కళ్ళ  ద్వారా సరఫరా చేయబడతాయి.

కృతజ్ఞతార్ప ణలో దేవునికి స్తుతిగానాలు చెల్లించేటప్పుడు నాలుక ముందుంటుంది. క్రింది లోకంలో శరీరంతో ఏకీభవిస్తూ ఆత్మకూడా బాధలనూ సంతోషాలనూ అనుభవిస్తుంది. ఈ రెండును ఇంతటి అవినాభావ సంబంధము కలిగియుండగా దైవిక ప్రేమ ఆ రెండింటినీ విడదీస్తుందని నీవు అనుకొంటున్నావా? వాటిలో ఒకటి పరలోకంలో మహిమపరచబడి ఇంకొకటి మట్టిలో కలిసిపోతుందా? క్రింది లోకంలో ఆ రెండును జననమునుండి ఒకటిగా పరుగెత్తాయి, ఒకే పరుగుపందెంలో పాలుపొందాయి.

కావున, ఆ రెండును ఒకే బహుమానాన్ని అనుభవిస్తాయి. మహా దినములో అందరి యెదుట నీతికిరీటమును (2 తిమోతి 4:8) మహిమా కిరీటమును బహుకరించబడు సమయంలో ఆత్మయు శరీరమును ఆ గౌరవములో సమానంగా పాలుపొందుతాయి. శరీరపునరుత్థానమును గురించిన నీ సందేహము నివృత్తి చేయబడిందని నేను విశ్వసించుచున్నాను.

ఆ విషయంలో ఇక నా సందేహం తీరిందని నేను అతనితో అన్నాను. ఆ తర్వాత, పునరుత్థాన స్థితిలో శరీరము మహిమపరచబడుటను గురించి ఇంకను కొన్ని విషయాలు నాకు తెలుపమని నేను అతనికి విన్నవించాను. అప్పుడు ఆ ప్రవక్త ఆ విషయంపై ఇలా కొనసాగించాడు :

అవి అమర్త్యమైనవి

ఏలీయా : పరిశుద్ధుల శరీరములు అమర్త్యమైనవని నేను ఈపాటికే నీకు చెప్పాను. అయితే, దేవుడు కలిగియున్న అమర్త్యతను మాత్రము అవి పొందలేవు. శరీరము లేకుండా సృజించబడినవి అయిన దేవదూతలు కలిగియున్న అమర్త్యతనుకూడ అవి పొందలేవు. ప్రభువైన యేసు రక్తము ద్వారా కొనబడినవాడుగా మాత్రమే మానవుడు అమర్త్యతను సంపాదించాడు. అంతేగాక, వారి అమర్త్యత శాపముతో కూడినదై, వారికి ఎలాంటి ఆనందాన్నీ ఇవ్వలేనిదిగా ఉంటుంది.

మా అమర్త్యతను పతనమై నరకాగ్నికి లోనైయున్న వారి అమర్త్యతతోకూడ మనము పోల్చలేము. ఎందుకనగా వారు నరకంలో అమర్త్యులుగా ఉన్నప్పటికీ, అమితమైన వేదనను అనుభవిస్తూ ఉంటారు. వారి అమర్త్యత శాపముతో కూడి నదై, వారికి ఎలాంటి ఆనందాన్నీ ఇవ్వలేనిదిగా ఉంటుంది గనుక, వారి అమర్త్యత కేవలం నరకంలో అమర్త్యులుగా ఉన్నప్పటికీ, అమితమైన వేదనను అనుభవిస్తూ ఉంటారు.

వ్యర్థమైనది. అయితే, మేము అనుభవించే అమర్త్యత పరలోక సంతోషముతో కూడినది గనుక, అది మహిమకరమైన అమర్త్యత. ఈ సంతోషాన్ని మేము శాశ్వతకాలం అనుభవిస్తాము.

అవి చొరబడుటకు వీలుకానివి

ఆశీర్వాదకరమైన పునరుత్థాన స్థితిలో పరిశుద్ధుల శరీరాలు అనుభవించు మరొక ఆనందకరమైన సంగతి ఏదనగా, వారి శరీరాలు నిజమైన సౌందర్యాన్ని కలిగివుంటాయి.

ఏలీయా : పరిశుద్ధులు ఇక్కడ అనుభవిస్తోన్న మరొక ఆనందకరమైన విషయమేమనగా, వారి శరీరములు చొరబడుటకు వీలుకానివి. కావున, అవి ఎలాంటి బాధనూ అనుభవించవు. క్రింద ఉన్న పరిశుద్ధుల శరీరములు అనేక సార్లు బాధల కుటీరాల్లాగానో లేదా అనేక వ్యాధులు బలహీనతలతో నిండిన వైద్యశాల ల్లాగానో ఉంటాయి.

ఒకవేళ ఇవేవీ లేనట్ల యితే, మరణంకన్నా భయంకరమైన బాధను అవి అనుభవిస్తూ ఉంటాయి. అనేకసార్లు ఇన్ని బాధలను అనుభవిస్తూ జీవించేకన్నా తాము మరణించడమే మేలని వారు చింతించేంత తీవ్రమైనవిగా క్రింద భూలోకంలో ఉన్న పరిశు ద్ధులు అనుభవించే బాధలు ఉంటాయి. ఎంత మంది పరిశుద్ధులు కీళ్ళనొప్పులతో బాధపడటం లేదు! ఎంతమంది పరిశుద్ధులు మూత్రపిండాల్లోని రాళ్ళతో బాధపడటం లేదు। క్రింది లోకంలో ఆశీర్వాదాలుగా తలంచబడేవన్నీ వారికి ఉన్నప్పటికీ, వారి శరీరంలోని వ్యాధిబాధలు వారిని నిరంతరం వేధిస్తూనే ఉంటాయి.

ఒకవేళ వారు మంచి ఆరోగ్యవంతులుగా ఉంటూ ఎలాంటి వ్యాధిబాధలకూ గురికాకుండా ఉన్నప్పటికీ, ఆకలి దాహం దిగంబరత్వం మున్నగునవి వారిని బాధిస్తూ ఉంటాయి. అవి వారి జీవితాలను అసౌకర్యంగా ఉంచుతాయి. కొన్నిసార్లు పరిశుద్ధులు చెరసాలల్లో వేయబడతారు లేదా, గాలిదూరని రాతి గోడల మధ్యలో వారు ఉంచబడతారు, లేదా సజీవంగా సమాధిచేయబడతారు. క్రిందిలోకంలో వారు మరువబడినవారుగా ఉంటారు. వీటన్నింటినీ గమనించి నప్పుడు, భూమిమీద వారి జీవితం అత్యంత దుర్భరమైనదిగా స్పష్టమౌతోంది.

అయితే, ఇక్కడున్న ఆనందకరమైన ప్రదేశాల్లో, మాపై ఎలాంటి కీడూ దాడిచేయదు. ఇక్కడున్నవారి పరిస్థితి క్రిందున్నవారి పరిస్థితికి పూర్తిగా భిన్నమైనది.

ఇక్కడ ఎలాంటి శాపమూ ప్రవేశించదు. భూమిమీద నేను పేర్కొన్న వ్యాధిబాధలన్నీ కేవలం సాపఫలితాలే. అయితే, ఇక్కడ మా శరీరాలు ఎలాంటి పాపాన్నీ, దుఃఖాన్నీ, బాధనూ అనుభవించవు. దానికి భిన్నంగా, దేవుని కుమారుని కృపద్వారా, ఇక్కడి పరిశుద్ధుల శరీరాలు పునరుత్థాన స్థితిలో మహిమా వెలుగులను పొందినవై ఆనందకరమైన స్థితిలో ఉంటాయి. నేను అనుభవిస్తున్న ఈ స్థితినిబట్టి మహిమ పరచబడిన పరిశుద్ధుల శరీరములు శాశ్వతంగా ఆశీర్వదించబడినవని నేను ప్రకటించగలను.

అవి సౌందర్యమైనవి

ఏలీయా : ఆశీర్వాదకరమైన పునరుత్థాన స్థితిలో పరిశుద్ధుల శరీరాలు అనుభవించు మరొక ఆనందకరమైన సంగతి ఏదనగా, వారి శరీరాలు నిజమైన సౌందర్యాన్ని కలిగివుంటాయి. అది ఇక్కడున్న పరిశుద్ధులకు ఇవ్వబడిన ఆశీర్వాదాలలో తక్కువైన ఆశీర్వాద మేమీ కాదు. ఎందుకనగా, క్రింద ఉన్న పరిశు ద్ధుల శరీరాలు కేవలం వ్యర్థమైనవి, అవి నాశన మగునవి.

ఇక్కడ మా శరీరాలు ఎలాంటి పాపాన్నీ, దుఃఖాన్నీ, బాధనూ అనుభవించవు. దానికి భిన్నంగా, దేవుని కుమారుని కృపద్వారా, ఇక్కడి పరిశుద్ధుల శరీరాలు పునరుత్థాన వెలుగులను పొందినవై స్థితిలో మహిమా ఆనందకరమైన స్థితిలో ఉంటాయి.

ఆ శరీరాలు సమాధులలో ఉంచ బడినప్పుడు, అవి పురుగులచే తినివేయబడి, కుళ్ళుపట్టి, భయంకరమైన దుర్వాసనను బయటికి రప్పిస్తాయి. చెప్పాలంటే, వాస్తవానికి ఆ భౌతిక శరీరాలు కేవలం మట్టిబొమ్మలే. వాటి పునాది మట్టిలోనే ఉంది.

అయితే, ఇక్కడ దానికి భిన్నంగా ఉంటుంది. ఎందుకనగా, ఇక్కడ పరిశు దుల శరీరాలు ఆదాముద్వారా సంక్రమించిన ప్రతివిధమైన వ్యాధిబాధలనుండి విడిపించబడి ఉంటాయి. వారి ఆత్మలు ప్రకృతిసిద్ధమైనవియు అతి సున్నితమైన జీవితాలు కలిగినవియునైన శరీరాలతో ఐక్యపరచబడి ఉంటాయి. అనిశ్చితితో కూడిన ఆ శరీరాలు నిరంతరం మరమ్మత్తు చేయబడుతూ ఉండాలి.

అయితే, పునరుత్థానముద్వారా మహిమపరచబడిన శరీరములు ఆత్మీయమైన లక్షణము లను కలిగి, బాహ్యపోషణ యొక్క అవసరత లేకుండా మానవాతీతమైన ఆత్మీయ శక్తిచే బలపరచబడి ఉంటాయి.

అంతేకాదు, నాశనమయ్యే లోకగర్వం మరియు శరీరక మహిమవలేకాక, ఏమాత్రం తరిగిపోని మహిమ వాటిలో ప్రకాశిస్తూ ఉంటుంది. అవి క్రీస్తుయొక్క మహిమకరమైన శరీరమువలె తయారుచేయబడతాయి. ఆయన మా వ్యర్థమైన శరీరములను తన మహిమకరమైన శరీరమువలె మార్చుతాడు (ఫిలిప్పీ. 3:21). తన బలమైన శక్తిచేత ఆయన వాటిని అలా తయారుచేస్తాడు (ఎఫెసీ. 1:19-22).

మాలో ఈ అద్భుతమైన సౌందర్యాన్ని ఆయన తన స్వంత చేతులతోనే తయారుచేస్తాడు. సర్వశక్తిమంతుడగు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. పునరుత్థాన శరీరాన్ని, గర్భంలో అది మొదట రూపింపబడినట్టుగా మహిమకర మైన అమర్త్యస్థితిలో అందంగా మలచడం ఆయనకు అంత కష్టమైన పనేంకాదు.

అవి చురుకైనవి

ఏలీయా : ఇక్కడున్న ఇంకొక ఆనందము ఏదనగా, ఇక్కడ మా శరీరాలు ఎంతో చురుకైనవిగా ఉంటూ ఊహించలేనంత వేగంగా కదులుతుంటాయి. అవి క్రింది లోకంలో ఆకాశంలో వేగంగా ఎగిరే క్రింది లోకంలో ఉన్న సమయంలో మా శరీ రాలు ఎంతో అసహ్యంగాను బరువుగాను మా ఆత్మకు భారంగా ఉంటూ వచ్చాయి.

పునరుత్థానముద్వారా మహిమపరచబడిన శరీరములు ఆత్మీయమైన లక్షణములను కలిగి, బాహ్యపోషణయొక్క అవసరత లేకుండా మానవాతీతమైన పరిశుద్ధాత్మ శక్తిచే బలపరచబడి ఉంటాయి.

అయితే, పునరుత్థాన స్థితిలో అవి అందుకు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ మా శరీరాలు “ఘనులగు వారి రథములను” పరమగీతము 6:12) పోలినవిగా ఉంటాయి. అవి ఆకాశంలో అత్యంత వేగంగా ఎగిరే పక్షులకన్నా వేగంగా పరుగెడుతాయి.

అవి స్వచ్ఛమైనవి

ఏలీయా : ఇప్పుడు నీవు నన్ను చూస్తున్నట్టుగా ఇక్కడ ఉన్న పరిశుద్ధుల శరీరాలన్నీ ఎంతో స్వచ్ఛమైనవి. అది ఇక్కడున్న మరో ఆనందకరమైన విషయము. ఇది ఒక గొప్ప ఆధిక్యత. ఎందుకనగా, పునరుత్థానము నొందిన శరీరాలు అమర్త్య మైనవి ఆత్మీయమైనవి చొరబడుటకు వీలు లేనివి అందమైనవి చురుకైనవి అయినప్పటికీ, అవి ఇంకను పాపముతో నిండినవిగా ఉన్నట్ల యితే, అవి కేవలము వ్యర్థమైనవి. ఒకవేళ పాపము పరలోకంలో ప్రవేశించగలిగితే, అది ఇక్కడ మేము అనుభవిస్తున్న ఆనందాన్ని సర్వనాశనం చేస్తుంది. అయితే, పాపము పర లోకానికి బహుదూరంలో ఉంది.

ఒకవేళ పాపము పరలోకంలో ప్రవేశించగలిగితే, అది ఇక్కడ మేము అనుభవిస్తున్న ఆనందాన్ని సర్వనాశనం చేస్తుంది. అయితే, పాపము పరలోకానికి బహుదూరంలో ఉంది.

మాకున్న మరో ఆధిక్యత ఏదనగా, మా శరీరాలు ఇక్కడ స్వచ్ఛమైనవిగాను పాపపు మరకలు లేనివిగాను ఉంటాయి. క్రింది లోకంలో పరిశుద్ధుల శరీరాలు పాపభారంచే కృంగి ఉంటాయి. వారిని నిరంతరం పాపపు శోధనలు వెంటాడుతూ ఉంటాయి. ఆ శోధనలు వారిని “అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?” అని ఆర్తనాదాలు చేసేలా వేధిస్తాయి (రోమా 7:24). అయితే, ఇక్కడ వారి శరీరాలు ఆశీర్వాదకరమైన విమోచనను అనుభవిస్తూ ఉంటాయి. ఈ విమోచన కోసమే క్రింది లోకంలో ఉన్న పరిశుద్ధులు ఎదురుచూస్తూ ఉంటారు.

అవి మహిమకరమైనవి

ఏలీయా : చివరిగా, పునరుత్థాన స్థితిలోనున్న పరిశుద్ధుల శరీరములు మహిమకరమైన శరీరములు. అవి ఎంతగా మహిమపరచబడి ఉంటాయంటే, అవి దాదాపుగా తమ విమోచకుని మహిమకరమైన శరీరమును పోలి ఉంటాయి. ఇది ఎలా జరుగుతుందో దైవిక లేఖనాలు మనకు తెలుపుతున్నాయి.ఆయన శక్తివలననే పరిశుద్ధుల శరీరములు “క్షయమైనవిగా విత్తబడి అక్షయ మైనవిగా లేపబడును. ఘనహీనమైనవిగా విత్తబడి మహిమగలవిగా లేపబడును” (1 కొరింథీ 15:42,43). ఆశీర్వాద కరమైన ఆ పునరుత్థానస్థితిలో వారు సూర్యుని కన్నా ఎక్కువ ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటారు.

వ్యర్థమైనవియు పాపభూయిష్టమైనవియునైన మన శరీరములను మహిమకరమైన దేవుని గొఱ్ఱపిల్ల అయిన యేసు తన స్వంత శరీరమువలె మార్చుతాడు.

కావున నా కుమారుడా, మేము ఇక్కడ అనుభవించు సంతోషము మరియు మహిమ ఎక్కడనుండి వస్తాయో నేను నీకు క్లుప్తంగా వివరించాను. నేను నీకు వివరించినది మేము
వ్యర్థమైనవి పాపభూయిష్టమైనవినైన మన శరీరములను మహిమకరమైన దేవుని గొఱ్ఱపిల్ల అయిన యేసు తన స్వంత శరీరమువలె మార్చుతాడు.

అనుభవిస్తున్న సంతోషంలో వెయ్యవభాగమే. నేను ఆ ఆనందాన్నిగురించి నీకు పరిపూర్ణంగా వివరించాలని ప్రయత్నించినప్పటికీ నీవు దానిని ఏమాత్రం గ్రహించ లేవు. ఇక్కడ మేము అనుభవించే ఆనందాలు క్రొత్త పేరు చెక్కబడిన తెల్లరాయి వంటివి ఇంకను అనేకములు ఉన్నాయి. పొందినవానికేగాని మరి యెవనికిని వాటినిగూర్చి తెలియదు (ప్రకటన 2:17).

ఆ విధంగా ఆ పరిశుద్ధ ప్రవక్త ముగించగానే, అతడు నాకు తెలిపిన పరలోక సమాచారమంతటికీ నేను ఆతనికి వినయపూర్వకమైన కృతజ్ఞతలు తెలిపాను. నేను పాపభూయిష్టమైన శరీరమును ధరించియున్నప్పటికీ, మహిమకరమైన పరలోక విషయములను గ్రహించేశక్తి నాకు లేనప్పటికీ, విన్నవాటినీ కన్నవాటినీ నేను ఏమాత్రం గ్రహించలేకపోయినప్పటికీ, క్రింది లోకంలో అనేక విధాలుగా ప్రశ్నింపబడుతూ అతికొద్దిమంది మాత్రమే విశ్వసించే పరలోక విషయాలను నేను చాలవరకు గ్రహించగలిగానని నేను అతనితో చెప్పాను.

పరిశుద్ధులను గురించిన పరిపూర్ణ అవగాహన

ఎపెనెటస్ : నాకున్న మరికొన్ని సందేహములను మీరు నివృత్తి చేయాలని నేను ఆశిస్తున్నాను.

ఏలీయా : అడుగు, నేను నీకు తృప్తి కలిగించే విధంగా సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తాను.

ఎపెనెటస్ : సృజించబడినవారైన ఇక్కడి పరిశుద్ధులు, ప్రస్తుతం మహిమ పరచబడిన స్థితిలో ఉన్నప్పటికీ, ఇంకను వారు పరిమితమైనవారుగానే ఉండగా, అపరిమితమైనవాడైన త్రియేక దేవుని గురించిన పరిపూర్ణమైన అవగాహనను ఎలా కలిగివుండగలరు? మనలను గురించి మనము పూర్తిగా యెరిగినట్టుగా వారు ఆయనను ఎలా యెరుగగలరు? ఆ విషయంలో నేను మీరు చెప్పిన విషయాన్ని తప్పుగా ఆర్థంచేసుకొన్నానా?

ఏలీయా : అలా నేను నీకు చెప్పడంలో లేఖనములలో ఉన్న విషయాలనే నేను నీకు తెలిపాను. అన్యజనులకు అపొస్తలుడైన పౌలు తాను క్రింది లోకంలో ఉన్నప్పుడు మాట్లాడుతూ, పైనున్న పరలోక మహిమలోనున్న సర్వశక్తుడగు దేవుని తాను అక్కడనుండి “అద్దములో చూచి నట్లుగా” చూశాననీ, పైలోకానికి చేరుకొన్న తరువాత “ముఖాముఖిగా” చూడబోతాననీ, అప్పుడు తాను ఆయనను “పూర్తిగా ఎరు గుదున” నీ తెలిపాడు (1 కొరింథీ. 13:12).

క్రింది లోకము అశాశ్వతమైన చిరుదీపము లాంటి సూర్యునిద్వారా వెలిగించబడుతుండగా,మహిమకరమైన ఈ లోకము అనంతుడును అద్వితీయుడును సర్వశక్తుడును సర్వాధికారియునగు దేవునిచే వెలిగించబడుతోంది.

అయితే నా కుమారుడా, ఈ విషయాలన్నీ ఇప్పుడు నీవు పరిపూర్ణంగా గ్రహించడం అసా ధ్యము. ఎందుకనగా, క్రింది లోకము అశాశ్వత మైన చిరుదీపములాంటి సూర్యునిద్వారా వెలిగించబడుతుండగా, మహిమకరమైన ఈ లోకము అనంతుడును అద్వితీయుడును సర్వశక్తుడును సర్వాధికారియునగు దేవునిచే వెలిగించబడుతోంది. గనుక ఈ లోకంలోనున్న జనులవలె క్రింది లోకంలోనున్న జనులు ఆయ నను అర్థంచేసుకొనడం కష్టం.

ఇక్కడున్న పరిశుద్ధులకేగాక, నిరంతరం ఆయన సింహా సనం చుట్టూ ఉండే దేవదూతలకుకూడా ఆయనను గురించిన పరిపూర్ణమైన అవగా హన ఉండదు. ఎందుకంటే, వారందరూకూడ కేవలం ఆయనచే సృజించబడినవారే. మన సృష్టికర్త అయిన ఆయనను అయన సృష్టి అయిన మనము పరిపూర్ణంగా గ్రహించడం అసాధ్యము.

గాఢాంధకారపు అజ్ఞానంలో ఉన్న పరిశుద్ధులకు దేవుని గురించిన జ్ఞానము ఒక చిరుదీపంలా క్రింది లోకంలో బయలు పరచబడుతుంది.

“నేను పూర్తిగా ఎరుగుదును” అని పౌలు పలికిన మాటలను ఒక కోణంనుండే మనము తీసుకోవాలి తప్ప, అతడు దేవునిని పరిపూర్ణంగా తెలిసి కొనబోవునన్న తలంపుతో ఆ మాటను మనము తీసికొనకూడదు. గాఢాంధ కారపు చీకట్లో ఒక చిరుదీపంకూడ దేదీప్యమానమైన వెలుగునిస్తుంది. అయితే, సూర్యుని వెలుగులో ఆ దీపపుకాంతి ఏమాత్రం లెక్కించబడదు.

అదే విధంగా గాఢాంధకారపు అజ్ఞానంలో ఉన్న పరిశుద్ధులకు దేవుని గురించిన జ్ఞానము ఒక చిరుదీపంలా క్రిందిలోకంలో బయలుపరచబడుతుంది. అయితే, వారు పైలోకంలోనికి వచ్చిన తరువాత దేదీప్యమానమైన దేవుని వెలుగులోను ఆయన స్వరూపదర్శనములోను ఆయనను గురించి వారు పూర్తిగా తెలుసుకొంటారు.

కావున, దీనిని గురించి నేను క్లుప్తంగా చెప్పాలంటే, ఈ లోకంలో ఉన్న దేవుని పరిశుద్ధులు, సృజించబడినవారుగా తమకున్న సామర్థ్యము కొలది, లేదా తమ హృదయములు ఆశించుకొలది వారు ఆయనను గ్రహించగలరు.

ఆ తర్వాత నేను ఆ గొప్ప ప్రవక్తకు నా కృతజ్ఞతలను తెలిపి, నా ప్రశ్నలకు ఆయన చెప్పిన జవాబులు నన్ను సంతృప్తిపరచాయని చెప్పాను. నేనేదైనా అతనిని ఇబ్బందిపెట్టి ఉన్నట్లయితే, అది నా గ్రాహ్యలోపంవల్లనే అలా జరిగి ఉంటుందని నేను అతనికి చెప్పాను.

ఏలీయా : నేను ప్రస్తుతం ఉన్న స్థితిని నీవు ఇంకను తప్పుగా అర్థంచేసి కొంటున్నావు. ఎందుకనగా ఇక్కడ నాకుగాని, నాలాంటి ఇతర పరిశుద్ధులకుగాని  ‘ఇబ్బంది’ అనేది అస్సలు ఉండదు. సర్వోన్నతుడగు దేవుని గురించిన జ్ఞానాన్ని ప్రకటించు టయు, ఆయన గొప్పదనాన్ని ప్రచురపరచు టయు, ఆయన మహిమను ప్రదర్శించుటయు మాకు ఇక్కడ గొప్ప సంతృప్తినిస్తుంది. యుగ యుగాలు మా ఆనందము అదే.

ఆయనను మనము ఎంత ఎక్కువగా వీక్షిస్తామో, ఆయనను మనము ఎంత ఎక్కువగా ప్రేమిస్తామో, అంత ఎక్కువగా మన ఆత్మలు ఆయన సారూప్యములోనికి మార్చబడుతుంటాయి. దానిపైననే మన మహిమ ఆధారపడి ఉంటుంది.

ఆ తర్వాత నేను మరలా ఆ ప్రవక్తవైపు తిరిగి అడగవలసిన ఇంకో ప్రశ్న మిగిలివుందని అతనితో చెప్పాను.

ఏలీయా : అడుగు, నేను నీకు తప్పక జవాబిస్తాను.

మహిమయొక్క వివిధ అంతస్తులు

ఎపెనెటస్ : నీ వద్దకు తెచ్చేంతవరకు నా మార్గదర్శి నన్ను ఆయా ప్రదేశాలలో నడిపిస్తున్నప్పుడు నేను వేర్వేరు వ్యక్తులను చూస్తూవచ్చాను. వారిలోని కొంత మంది ఇతరులకంటె ఎక్కువ మహిమ కలిగి ఉన్నట్టుగా నేను కనుగొన్నాను. కావున, ఇక్కడకు వచ్చిన పరిశుద్ధులలో వేర్వేరు స్థాయిలలో మహిమ ఉన్నట్టుగా నాకు కనిపించింది. ఈ విషయం తెలుసుకొనవలెనన్న కుతూహలం నాలో అప్పటినుండి అలానే ఉంది.

ఏలీయా : ఇక్కడున్న పరిశుద్ధులందరూ అనుభవిస్తోన్న ఆనందము మరియు మహిమ, పరిశుద్ధుడగు దేవునితోటి సహవాసము మరియు ప్రేమలపై ఆధారపడి ఉంటుంది. నేను నీకు మునుపు చెప్పినవిధంగా, ఇక్కడ ఆయన దర్శనం నిరంతరం ప్రవహించు నిత్యజీవపు ఊటయైయున్నది. ఆయనను మనము ఎంత ఎక్కువగా వీక్షిస్తామో, ఆయనను మనము ఎంత ఎక్కువగా ప్రేమిస్తామో, అంత ఎక్కువగా మన ఆత్మలు ఆయన సారూప్యములోనికి మార్చబడుతుంటాయి. దానిపైననే మన మహిమ ఆధారపడి ఉంటుంది.

కావున, ఇది ఆయా వ్యక్తుల మధ్య వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. ఇక్కడున్నవారిలో దేవునిపట్ల ప్రేమ లేదని కాదు. ఎందుకనగా, ఇక్కడ అలా ఉండుట అసాధ్యము. వాస్తవానికి దేవుని ప్రేమించనివారు ఇక్కడెవరూ ఉండరు. ఇక్కడున్న వారందరూ దేవుని అమితంగా ప్రేమించేవారే. ఆయితే, ఆయనవైపు వారు చూడటంలోనే తేడా ఉంటుంది. దానిపైననే వారిలోని మహిమ ఆధారపడి ఉంటుంది.

అయితే, తమలోనున్న మహిమకంటే ఇతరులలోనున్న మహిమ ఎక్కువగా ఉన్నందుకు ఇక్కడ ఎవరూ అసూయపడరు. ఎందుకనగా తమలో ఒక్కొక్కరిలో నున్న మహిమద్వారా దేవుడు మహిమపరచబడుతున్నందునను అదే తమ ఆనందమైనందునను వారు అలా అసూయపడరు. అసలు అలాంటి ఆలోచన లకుగాని అలాంటి అసూయాద్వేషాలకుగాని ఇక్కడ తావుండదు.

తమలో ప్రతి ఒక్కరూ దేవుని మహిమతో నింపబడి ఉన్నప్పుడు, ఆ మహిమావెలుగుద్వారా తమలో ఒక్కొక్కరూ ఆనందిస్తున్నప్పుడు, ఇక ఫిర్యాదుచేసేవారు ఎవరుంటారు? అవధులులేని వెలుగు మరియు జీవము, ఆనందము మరియు సంతోషములతో మిళితమైన సముద్రములాంటివాడైన పరిశు దుడగు దేవుడు ప్రతి పాత్రనూ పొర్లిపారు నంతగా నింపుతాడు. పాత్రలు వేర్వేరు పరిమా ణములలో ఉన్నప్పటికీ, ప్రతి పాత్రా పూర్తిగా నింపబడుతున్నందున ఇక ఇక్కడ ఎవరూ సణగరు గొణగరు ఫిర్యాదుకూడా చేయరు.

ఆకాశంలో తారలెన్నో వెలుగుతున్నప్పటికీ, ఆవి వేర్వేరు పరిమాణాలలో ఉన్నట్లే, పునరుత్థానము నొందిన దేవుని ప్రజలుకూడ అదేవిధంగా ఉంటారని పరిశుద్ధ లేఖనాలు మనకు బయలుపరుస్తున్నాయి.

ఇక్కడున్న ప్రతి ఆత్మా లోబడే మనస్తత్వాన్ని కలిగి ఉంటుంది. క్రిందిలోకంలోనిఉన్నందున, ఒక తార వెలుగు ఆకాశంలో తారలెన్నో వెలుగుతున్నప్పటికీ, ఆవి వేర్వేరు పరిమాణాలలో మరో తార వెలుగును మించి ఉంటుంది. పునరుత్థానమునొందిన దేవుని ప్రజలుకూడ అదేవిధంగా ఉంటారని లేఖనములు మనకు బయలుపరుస్తు న్నాయి. (1 కొరింథీ. 15:41,42).

కావున, నీ ప్రశ్నకు నా జవాబు ఏదనగా, ఎవరైతే దేవునివైపు ఎక్కువగా దృష్టిస్తారో వారు దేవుని ఎక్కువగా ప్రేమిస్తారు. అలాంటివారు ఎక్కువగా ఆయన సారూప్యం లోనికి మార్చబడతారు. అదే పరలోకంలో అత్యంత మహిమకరమైన స్థితి. నేను నీకు చెప్పే ఇంకో విషయం నీకు వింతగా అనిపించ వచ్చు.

మరణించకనే నీవు ఇక్కడకు ఎలా రాగలిగావో నాకు ఆశ్చర్యంగా ఉంది. మిత్రమా, నీవు ఇక్కడకు ఎలా రాగలిగావో నాకు చెప్పు ? ఈ గొప్ప ఆధిక్యత నీకు ఎలా లభించిందో నాకు తెలుపు?

అగ్నిజ్వాలల్లాంటి పరిచారకులైన (కీర్త నలు 104:4) దేవదూతలుకూడ వివిధ స్థాయిల్లో మహిమను కలిగివుంటారు. నీవు ఇక్కడకు వచ్చినప్పుడు దేవదూతల్లో ఆ తార తమ్యాన్ని బహుఃశా గమనించే ఉంటావు.

అలా నేను ఆ పరిశుద్ధుడగు ప్రవక్తతో సంభాషిస్తూ నా సందేహాలకు సమాధానాలను పొందుతున్న సమయంలో ఉన్నట్టుండి “ఎపెనెటస్ ఇక్కడికెలా వచ్చాడు!” అని ఆశ్చర్యంగా ప్రశ్నిస్తూ ప్రకాశవంతంగా మెరుస్తోన్న ఒక వ్యక్తి నా యెదుట ప్రత్యక్షమయ్యాడు.

ఒక స్నేహితుని తిరిగి కలిసికొనుట

నా పేరు పలుకుతూ నా వద్దకు వచ్చిన ఆ వ్యక్తివైపు నేను ఆశ్చర్యంగా చూశాను. అతణ్ణి నేను నిదానించి చూసినప్పుడు ఆ వ్యక్తి భూలోకంలో మరణిం చిన ఒకప్పటి నా స్నేహితుడైన జూనియస్ గా నేను కనుగొన్నాను.

జూనియస్ : ప్రియమైన ఎపెనెటస్, ఆశీర్వాదకరమైన ఈ పరలోక పట్ట ణంలో నిన్ను చూడటం నాకు మహదానందంగా ఉంది. కాని, మరణించకనే నీవు ఇక్కడకు ఎలా రాగలిగావో నాకు ఆశ్చర్యంగా ఉంది. మిత్రమా, నీవు ఇక్కడకు ఎలా రాగలిగావో నాకు చెప్పు. ఈ గొప్ప ఆధిక్యత నీకు ఎలా లభించిందో నాకు తెలుపు. ఎందుకనగా, ఈ విషయం నన్ను ఆత్యంత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

భూలోకంలో నాకు అత్యంత సన్ని హితుడుగా జీవించిన నా పాత స్నేహితుణ్ణి చూడటంతో నేను అమితానందాన్ని అనుభ వించాను. నాలోని ఆనందాన్ని అణచుకోలేక అతణ్ణి గట్టిగా కౌగలించుకోవాలని నేను ప్రయ త్నించినప్పుడు అతడు అందుకు నిరాకరిం చాడు. తన శరీరాన్ని పునరుత్థానదినం వరకు తాను భూమిమీద వదలి వచ్చాననీ (1 పేతురు 1:3-5 చూడుము), తానిప్పుడు ఒక రూపంలో కనిపిస్తున్నప్పటికీ, ఆ రూపము ఇక ఎన్నటికీ మరణానికి గురికానిదనీ, అది మరణము నొందువారిచే స్పర్శించబడకూడదనీ అతడు నాకు తెలిపాడు.

జూనియస్ : కాని, మరణించని మరియు మార్పునొందని శరీరంతో నీవు ఇక్కడకు ఎలా రాగలిగావు?

అప్పుడు నేను అతనికి నా శోధనను గురించీ, నా విడుదల గురించీ సవివరంగా నేను ఏలీయాతో మాట్లాడటానికి ముందు జరిగిన సంఘటనలన్నీ అతనికి వివరించాను.

వాస్తవానికి నేను మరణించి మహిమకరమైన ఈ ప్రదేశానికి వచ్చాక, దేవుని ఉనికిని గురించీ, పరలోకం మరియు నరకం ఉన్నాయన్న వాస్తవాన్ని గురించీ తెలిపేందుకు ఎవరైనా ఒకరు భూలోకానికి పంపబడాలని నేను చాలా ఆశించాను. దేవుడు, పరలోకం, నరకం, దేవుని తీర్పు మొదలైన విషయాలను ఋజువుచేస్తూ ఇక్కడనుండి వెళ్ళిన ఒక వ్యక్తి భూలోకంలో ప్రకటించి భూలోకంలో ఇంకను జీవిస్తూ ఉన్న ప్రజలను హెచ్చరించ వలసిన అవసరత ఉందని నేను భావించాను.

జూనియస్ : చాల సంతోషం ఎపెనెటస్, వాస్తవానికి నేను మరణించి మహిమకరమైన ఈ ప్రదేశానికి వచ్చాక, దేవుని ఉనికిని గురించీ, పరలోకంమరియు నరకం ఉన్నాయన్న వాస్తవాన్ని గురించీ తెలిపేందుకు ఎవరైనా ఒకరు భూలోకానికి పంపబడాలని నేను చాలా ఆశించాను. దేవుడు, పరలోకం, నరకం, దేవుని తీర్పు మొదలైన విషయాలను ఋజువు చేస్తూ ఇక్కడనుండి వెళ్ళిన ఒక వ్యక్తి భూలోకంలో ప్రకటించి భూ లోకంలో ఇంకను జీవిస్తూ ఉన్న ప్రజలను హెచ్చరించవలసిన అవసరత ఉందని నేను భావించాను.

కేవలం ఉచితమైన కృప మాత్రమే ఆత్మను మహిమలోనికి నడిపించగలదు. ఎందుకనగా పరలోకం విమోచకుని అమూల్యమైన రక్తముద్వారా మాత్రమే కొనబడింది.

కాని నా ప్రియ స్నేహితుడా, దేవుని గురించిన సత్యాన్నీ, ఆయన మంచి తనాన్ని గురించిన వాస్తవాన్నీ బాగుగా ఎరిగిన నీవు ఆయన ఉనికిని గురించి ఎలా ప్రశ్నించగలిగావు? నీవు అలా ప్రశ్నిస్తావని నేను ఎన్నడూ అనుకోలేదు. ఈ విషయాన్ని చూసినప్పుడు, ఆ భయంకరమైన శోధనలనుండియు, శత్రువైన సాతాను ఉరులన్నిటినుండియు నన్ను తప్పించి మహిమకరమైన తన పరలోక రాజ్యము కొరకు నన్ను నిల్వచేసిన కృపామయుడగు దేవుని నేను మనసారా స్తుతించేందుకు నేను తాజాగా ప్రోత్సహించబడుతున్నాను. ఆయన పరిశుద్ధ నామము నిరంతరం స్తుతినొందునుగాక!

ఏలీయా నిష్క్రమించుట

జూనియస్ మాటలను విన్న ఏలీయా నన్ను నా స్నేహితునివద్ద వదలిపెట్టి, నేను అతని నిష్క్రమణను గుర్తించేలోగానే అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అతడు అక్కడనుండి వెళ్ళిపోయాక, నేను నా స్నేహితునితో తిరిగి సంభాషించడం ప్రారంభించాను.

జూనియస్తో సంభాషణ

ఎపెనెటస్ : నా ప్రియమైన జూనియస్, ఈ సంతోషకరమైన స్థలంలో నివసిస్తోన్న ఆశీర్వాదకరమైన వ్యక్తులందరిలో నీవుకూడ ఒకడవుగా ఉన్నందుకు నేను అమితంగా సంతోషిస్తున్నాను. భూలోకంలో నీవు జీవించిన కాలంలో అద్వితీయుడగు దేవునిపట్ల నీకుండిన లోతైన ఆశ నిన్ను ఇక్కడకు తీసుకొని వచ్చిందనేందుకు ఎలాంటి అనుమానమూ లేదు.

జూనియస్ : నీవు ఒకవేళ అమర్త్యతను గురించి యెరుగక ఉండినట్లయితే, నీకు ప్రస్తుతం ఉన్న తలంపులను నీవు ఎన్నటికీ కలిగియుండెడివాడివి కావు. క్రింద ఉన్న ప్రపంచంలో ఎంతో భక్తిపరులైనవారు సహితము ఈ మహిమా లోకంలో అతిచిన్న బహుమతినికూడా పొందలేకపోతున్నారు (యెషయా 64:6; రోమా 3:23).

కేవలం ఉచితమైన కృప మాత్రమే ఆత్మను మహిమలోనికి నడిపించగలదు. ఎందుకనగా పరలోకం విమోచకుని అమూల్య మైన రక్తముద్వారా మాత్రమే కొనబడింది. ఆయన ప్రేమ మరియు దయాకనికరాలు చెప్ప నశక్యమైనవి. అవి అనంతమైనవి. నిత్యత్వం మాత్రమే వాటిని వివరించగలదు.

ఎపెనెటస్ : అవును, యోగ్యుడవైన జూని యస్, నీవు చెప్పేది ముమ్మాటికీ వాస్తవం.

జూనియస్: ‘నన్ను ‘యోగ్యుడు’ అని పిలువ వద్దు. ఎందుకనగా సింహాసనాసీనుడైన దేవుడు మరియు దేవుని గొట్టెపిల్లయైన క్రీస్తుయేసు తప్ప మరెవరును యోగ్యులుకారు. ఆయనకు మహిమ ఆరోపించుట మాత్రమే మనకు ఇక్కడ అత్యున్నతమైన ఆనందాన్ని ఇస్తుంది.

సృజింపబడిన ఎవ్వరుకూడ ఘనపరచబడేందుకు వీలులేదు. ఇక్కడ ప్రకాశమానమైన కిరీటములు ధరించేవారు కూడా తమ కిరీటములను దేవుని సింహాసము యెదుట పెట్టి, “ఘనత మహిమ ప్రభావములకు నీవు మాత్రమే అర్హుడవు” అని ఆయనతో అంటారు.

ఎందుకనగా, దేవదూతలు పరిశుద్ధులు కెరూబులు సెరూపులు నిరంతరం ఆయనను యోగ్యునిగా ఆరాధిస్తూ, ఆయనకు స్తుతి గానాలు చేస్తుంటారు. “వధింపబడిన గొఱ్ఱపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నర్హుడని గొప్ప స్వరముతో” వారు ఆయనకు నిరంతరం స్తుతిగానాలు చేస్తుంటారు (ప్రకటన 5:12). ఎపెనెటస్, సృజింపబడిన ఎవ్వరుకూడా ఘనపరచ బడేందుకు వీలులేదు. ఇక్కడ ప్రకాశమానమైన కిరీటములు ధరించేవారుకూడ తమ కిరీటములను దేవుని సింహాసము యెదుట పెట్టి, “ఘనత మహిమ ప్రభా వములకు నీవు మాత్రమే అర్హుడవు” అని ఆయనను స్తుతిస్తూ ఉంటారు.

ఎపెనెటస్ : ప్రియమైన జూనియస్, నా విషయంలో దయచేసి నీవు కొంత సహించు. ఎందుకనగా, నేను ఇంకను భూలోక స్వభావాన్నే కలిగియున్నాను. అంతేగాక, నేను మర్త్యుడనుగానే ఉన్నాను. నేను వాటినుండి విడుదల పొంది నట్లయితే ఎంత బాగుండును! నేనుకూడ నీలాగా త్రియేక దేవుని కళ్ళారా చూసి, పరిశుద్ధుడగు ఏలీయా చెప్పినట్లుగా ఆనందమునకు పరిపూర్ణతయైన ఆయన రూప్యములోనికి మార్చబడుట అను గొప్ప ధన్యతలోనికి ప్రవేశించినట్లయితే ఎంత బాగుండును!

జూనియస్ : నిజంగా ఆ ఆశీర్వాదకరమైన దర్శనం మన సంతోషాన్ని పరిపూర్ణం చేస్తుంది. అది మన హృదయాలను ప్రేమ మరియు ఆనందములతో నింపి, దానిని అనుభవించేవారు తప్ప వేరెవరూ వ్యక్తీకరించలేని విధంగా వారిని పరిపూర్ణు లనుగా చేస్తుంది.

త్రియేక దేవుని కళ్ళారా చూసి, ఆనందమునకు పరిపూర్ణతయైన ఆయన సారూప్యములోనికి మార్చబడుట ఎంత గొప్ప ధన్యత.

అయితే, నీవు ఒక విషయాన్ని గ్రహించాలి. ఇక్కడ ఉన్నవారిలో ఎవరును మహిమా ప్రభావములు కలిగిన దేవుని మహిమా వెలుగులోని ఒక చిన్న కాంతికిరణాన్నికూడ భరించలేరు. సృజించబడినవారైన పరిశుద్ధుల వెలుగును వర్ణనాతీతమైన సృష్టికర్తయొక్క మహిమా వెలుగుతో మనము ఏమాత్రం పోల్చలేము.
నేను

ఎపెనెటస్ : ఆశీర్వదించబడినవాడవైన ఓ జూనియస్, నీ మాటల్ని సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను. అయితే, ఈ విషయంలో నాకు తెలియని కొన్ని సంగతులను గురించి నేను తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. ఆనందానికి కర్తయైన సృష్టికర్త సన్నిధిలో నిరంతరం నివసించుటకన్నా గొప్ప ఆనందము మరొకటి లేదని నేను ఎరిగినందున, ఆయన దైవిక ప్రేమను అమితంగా అనుభవించి అనందిస్తోన్న నీ పెదవులతో ఆ ప్రేమను గురించిన మర్మాలను వినాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. నేనును ఆయనను స్తుతించి ఆరాధించు లాగున ఈ విషయాలను నీకు తెలిసినంతవరకు నాకు తెలిపేందుకు నీవు ఏమాత్రం నిరాకరించవద్దు. క్రిందున్న లోకానికి ఏమాత్రం తెలియనిదియు, నీవు వాస్తవంగా అనుభవించి ఆనందిస్తోన్నదియునైన ఆయన ప్రేమను గురించిన మర్మాలను నానుండి నీవు ఏమాత్రం దాచిపెట్టవద్దు.

దేవుడు మనల్ని వేటితో ఆశీర్వదించాడంటే …

జూనియస్ : నా ప్రియ మిత్రమా, నిత్యత్వంలోని అన్ని యుగాలలో ఆయన దైవిక అధికారము మరియు ఆధిపత్యమును గురించిన స్తుతి కొనసాగుతూ ఉంటుంది. పరిశుద్ధులును దేవదూతలును ఒకటిగా చేరి ఆయనను గురించి గొప్ప పల్లవి పాడతారు. ఆయన మాత్రమే నీచే ప్రేమించబడుటకు మరియు స్తుతించబడు టకు అర్హుడని నీవు ఎరుగులాగున నీవు నన్ను కోరినవిధంగా ఆయనను గురించి నాకు తెలిసినంతవరకు నేను నీకు తెలుపుతాను.”ఆయన ఇక్కడున్న పరిశుద్ధులలోను దేవదూతలలోను ఉన్న ప్రేమ కేవలం ఆయన మనపట్ల కనబరచిన ప్రేమయొక్క ప్రతిబింబమే.

ఇక్కడున్న పరిశుద్ధులలోను దేవదూతలలోను ఉన్న ప్రేమ కేవలం ఆయన మనపట్ల కనబర చిన ప్రేమయొక్క ప్రతిబింబమే.

మనలను మొదట ప్రేమించెను గనుక మనము ఆయనను ప్రేమించుచున్నాము” అని అయన యెదపై ఆనుకొని ఆయన ప్రేమను అనుభవించిన ఆయన ప్రియమైన శిష్యుడు అన్నాడు (1 యోహాను 4:19).

కావున నా ప్రియమైన ఎపెనెటస్, మనపట్ల దేవుడు చూపించిన ప్రేమ ఆయనపట్ల మనకున్న ప్రేమకు పునాది అయినందున, ఆయన ప్రేమను గురించిన తలంపులను మరియు వాటిద్వారా మనము పొందు లాభములను నేను నీకు మొదట తెలుపుతాను. అవి లెక్కకు మించి నవిగా ఉన్నాయి. వాటి మొత్తమును ఎవరునూ లెక్కించలేరు.

ఆయన అనుగ్రహించిన జ్ఞానము మరియు సంపదలనుబట్టి ఒక వ్యక్తి ప్రశంసింప బడవచ్చు. కాని ఆ వ్యక్తికి జ్ఞానాన్ని ఇచ్చినవాడు దేవుడు కాడా? ఆ వ్యక్తికి సంపదను అనుగ్రహించి ఆశీర్వదించినది దేవుడుకాడా?

అయితే, వాటిని మనము ఒక క్రమమైన పద్ధతిలో ఉంచినప్పుడు, క్రింది లోకంలో ఆయన మనపట్ల కనబరచిన ఆయన ప్రేమకు మరియు ఆయన మంచి తనానికి మనము ఎంతగా ఋణపడి యున్నామో మనకు ఆర్థమవుతుంది.

మనము కలిగియున్నవన్నీ కేవలం ఆయన ఈవియే

జూనియస్ : మొట్టమొదట, క్రింది లోకంలో మనము కలిగియున్నవన్నీ ఆయన ఈవియే. మనకున్న శ్రేష్టమైనవన్నీ ఆయనకు మనము ఇచ్చినప్పటికీ, మనమింకను ఆయనకు ఋణపడే ఉంటాము. మనము కలిగియున్నవన్నీ, మనము అనుభవిస్తున్నవన్నీ కేవలం ఆయన ఉచితమైన కృపయే. వాటన్నిటి కొరకు మనము ఆయనకు ఎంతగానో ఋణపడియున్నాము : “ఆయనే మనలను పుట్టించెను”(కీర్తనలు 100:3).

ఒక కుమ్మరి చేతిలో ఉన్న మట్టిలాగా మనము ఆయన చేతిలోని మట్టియైయున్నాము (యెషయా 64:8). ఆయన మనలను ఎలా అయినా సృజించియుండవచ్చు. లేదా మన శూన్యతలోనే ఆయన మనలను వదలివేసి ఉండవచ్చు. ఆయన మనకు అనుగ్రహించిన అనేక రకము లైన ఆశీర్వాదములన్నీ ఆయన ప్రేమను మనకు స్పష్టంగా బయలుపరుస్తున్నాయి. దేవుని ప్రేమను ఎవరైతే చూడలేకపోతున్నారో వారు నిజంగా గ్రుడ్డివారే.

ప్రియ నేస్తమా, ఈ సమయంలో భయం కరమైన గాలితుఫానులలో చిక్కుకొని భీకరమైన అలలమధ్యన కొట్టుమిట్టాడుతోన్న దౌర్భాగ్యులవైపు ఒక్కక్షణం నీ ఆలోచనలను మళ్ళించు. మరణకరమైన వ్యాధిబాధల్లో అల్లాడుతోన్న రోగులవైపుకూ, మరణకూపాల్లాంటి వైద్యశాలలవైపుకూ నీ మనస్సును మళ్ళించు.

ఆయన అనుగ్రహించిన జ్ఞానము మరియు సంపదలనుబట్టి ఒక వ్యక్తి ప్రశంసింపబడవచ్చు. కాని ఆ వ్యక్తికి జ్ఞానాన్ని ఇచ్చినవాడు దేవుడు కాడా? ఆ వ్యక్తికి సంపదను అనుగ్రహించి ఆశీర్వదించినది దేవుడుకాడా? మనము అనుభవించేవన్నీ నిజంగా దేవుని ద్వారానే మనకు అనుగ్రహించబడ్డాయి. ఒక భిక్షకునికి ఎవరైనా రెండు లక్షల రూపాయలు ఇచ్చారను కోండి. ఆ డబ్బుతో అతడు ఆహారాన్నీ, వస్త్రాలనూ మాత్రమేగాక తనకు అవసరమైన వన్నీ కొనగలడు. ఆ డబ్బు అతనికి ఇవ్వబడక పోతే అతడు వాటన్నిటినీ కొనగలడా?

విషాదములన్నిటినుండి విడుదల

జూనియస్ :తన అపారమైన ప్రేమనుబట్టి క్రిందిలోకంలో ఆయన మనకు అనేక ఈవు లను అనుగ్రహించుట మాత్రమేగాక, ఆనేక రకములైన బాధలనుండికూడ ఆయన మనకు విడుదలను అనుగ్రహిస్తున్నాడు. అవన్నీ ఆయన దైవిక ప్రేమను మనకు బయలుపరుస్తున్నాయి. అవన్నీ ఈ లోకంలో విలువైనవిగా ఎంచబడక పోయినప్పటికీ, క్రింది లోకంలో అవి చాల అమూల్యమైనవిగానే ఎంచబడుతున్నాయి. ప్రియ నేస్తమా, ఈ సమయంలో భయంకరమైన గాలితుఫా నులలో చిక్కుకొని భీకరమైన అలలమధ్యన కొట్టుమిట్టాడుతోన్న దౌర్భాగ్యులవైపు ఒక్కక్షణం నీ ఆలోచనలను మళ్ళించు.

ఆ సమయంలో తమకు మరణంతప్ప వేరే శరణంలేదని వారు నిశ్చయించుకొంటారు. మరణకరమైన వ్యాధిబాధల్లో అల్లాడుతోన్న రోగులవైపుకూ, మరణకూపాల్లాంటి వైద్యశాలల వైపుకూ నీ మనస్సును మళ్ళించు. ప్రియ నేస్తమా, వాటివైపు ఒక్కసారి నీవు నీ దృష్టిని కేంద్రీకరించు. వాటన్నిటిలోనుండి ఆ దౌర్భాగ్యులైన మానవులను విడిపించే కృపాహస్తం నీకు కనిపించడం లేదూ? వాటన్నిటిలో వారిని ఆదరించి, ఓదార్చి, వారి కన్నీళ్ళు తుడిచి, వారిని ధైర్యపరచే దైవిక ప్రేమ నీకు కనిపించడం లేదూ?

కొన్నిసార్లు తన ప్రియమైన పిల్లలను శిక్షించేందుకోసం లేదా పరీక్షించేందు కోసం వ్యాధిబాధలను లేదా ఉపద్రవములను ఆయన ఎన్నుకొంటాడు. ఆ పరిస్థితులద్వారా వారు వెళ్ళడం అవసరమని ఆయన అనుకొంటాడు. వీటన్నిటిలో కూడా ఆయన ప్రేమ మనకు కనిపిస్తుంది. ఎందుకనగా, వారు పాపములో పడకుండా వారిని సంరక్షించేందుకు ఆయన వారికోసం ఆ మార్గాన్ని ఎన్ను కొంటాడు.

ఎపెనెటస్, క్రిందిలోకంలో తల్లులు తమ పిల్లల ఆరోగ్యంకోసం నొప్పిని కలిగించే మందును పూయడం నీవు చూడలేదా? తమ పిల్లలు దీర్ఘకాలం వ్యాధితో బాధపడేకంటే కొంతసేపు ఆ మందు కలిగించే నొప్పిని భరించి నివారణ పొందటం మంచిదని వారు భావిస్తారు కదా?

కావున, మన ప్రియమైన పరలోక తండ్రి మనము పాపపు ఆధిపత్యము క్రింద నలుగుతున్న సమయంలో, దానినుండి మనల్ని విడిపించేందుకు వ్యాధి బాధలను మనకు అనుగ్రహించడంలో ఆయన ప్రేమ మనకు కనిపించడంలేదా? ఆయన భయంకరమైన పాపరోగంతో బాధపడుతోన్న తన ప్రియ పిల్లలను స్వస్థపరచే ఒక మంచి వైద్యుడు!

ఎపెనెటస్, దేవుడు మోషేద్వారా సంపదను గురించి ఇచ్చిన హెచ్చరిక నీకు జ్ఞాపకముందా? సంపద విస్తరించినప్పుడు తమ సుఖభోగాలుతప్ప మానవులకు మరేవీ జ్ఞాపకముండవు. అంతేగాక, అది వారిని “మా సామర్థ్యము మా బాహు బలము ఇంత భాగ్యము మాకు కలుగ జే సెనని” అనుకొనేలా చేస్తుందని ఆయన వారిని హెచ్చరించాడు (ద్వితీ 8:17).

తల్లులు తమ పిల్లల ఆరోగ్యంకోసం నొప్పిని కలిగించే మందును పూయడం నీవు చూడలేదా? తమ పిల్లలు దీర్ఘకాలం వ్యాధితో బాధపడేకంటే కొంతసేపు
ఆ మందు కలిగించే నొప్పిని భరించి నివారణ
పొందటం మంచిదని వారు భావిస్తారు కదా?

ఇశ్రాయేలీయులు అలా అలోచింపక, దానికి భిన్నంగా తమ దేవుని వారు జ్ఞాపకంచేసుకొన వలెనని అయన వారిని హెచ్చరించాడు. ఎందు కంటే, వారు “భాగ్యము సంపాదించుకొను టకై వారికి) సామర్థ్యము కలుగజేయు వాడు ఆయనే” (ద్వితీ 8:18). వాస్తవానికి వారికేగాక భూలోకములోనున్న ప్రతి ఒక్కరికీ అలాంటి హెచ్చరిక తప్పక అవస రము. ఎందుకనగా, దేవుడే తనకు ధాన్యమును ద్రాక్షారసమును నూనెను దయచేశాడని మానవ స్వభావం త్వరగా మరచిపోతుంది గనుక.

ఆయన ప్రేమ

జూనియస్ : మూడవదిగా, దేవుని మంచితనం అత్యధికంగా ఆయన ప్రేమ లోని లాభాలను మనకు బయలుపరుస్తుంది. మనము క్రిందిలోకంలో ఉన్నప్పుడు ఆత్మీయ వరములను మరియు ఆనందము లను గురించిన వాగ్దానమును దేవుడు మనకు అనుగ్రహించాడు. అది మనకు ఎంతో ఆదర అంతేగాక, నిత్య ణనూ ప్రోత్సాహాన్నీ ఇచ్చింది. మైన పరలోక ఆనందముకొరకు ఎదురు చూస్తూ తాత్కాలిక ఆనందాలవైపు అది మన లను చూడకుండా చేసింది.

క్రిందిలోకంలో దేవుడు మనపై చూపించిన దయాకనికరాలు అనేకములైనప్పటికీ, అవన్నీ ఆయనను మనము స్తుతించి ఆరాధించేందుకు పరలోకరాజ్యంలో మనల్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ, క్రిందిలోకంలో ఆయన మనపట్ల ప్రదర్శించిన ప్రేమ అన్నింటికన్నా ఎంతో ఉన్నతమైనది.

దేవుని ప్రేమ క్రిందిలోకంలో మన ఆప్తులు మరియు స్నేహితుల్లాగా కేవలం మన సమాధివద్దకు మాత్రమే వచ్చి ఆ తర్వాత వెనుదిరిగి పోయేది కాదు.

ఆ ప్రేమ క్రిందిలోకంలో మన ఆప్తులు మరియు స్నేహితుల్లాగా కేవలం మన సమాధివద్దకుమాత్రమే వచ్చి ఆ తర్వాత వెనుదిరిగి పోయేది కాదు. మన చీకటి కళ్ళు మూతలు పడినప్పుడు దేవుని ప్రేమ మనకు దేదీప్యమానంగా కనిపిస్తుంది. అది శరీరాశలనుండి మన దృష్టిని పూర్తిగా ఆత్మీయ విషయాలవైపు మరల్చుతుంది. చివరిగా అది మనల్ని ధన్యకరమైన ఈ స్థలానికి నడిపి, “బ్రతికియున్నవారికిని చచ్చినవారికిని ఉపకారము చేయుట మానని యితడు” (రూతు 2:20) అని బోయజును గురించి నయోమి చెప్పినట్లుగా మనమును కృతజ్ఞతా హృదయాలతో మన ప్రభువును గురించి చెప్పేందుకు మనల్ని ప్రేరేపిస్తుంది.

కావున, మన రక్షకునికి అత్యంత ప్రియమైన శిష్యుడు ఇలా పలికాడు: “ఇప్పుడు మనము దేవుని పిల్లలమైయున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకను ప్రత్యక్ష పరచబడలేదుగాని, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లు గానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము” (1 యోహాను 3:2). ప్రస్తుతము నా ఇతివృత్తము అదే.

నా ప్రియ స్నేహితుడవైన ఎపెనెటస్, కేవలం దేవుని ప్రేమ మాత్రమే మనకు పరలోక ప్రవేశాన్ని కలుగజేస్తుంది. పరలోకంలో మనము పొందే ఆనందాన్ని మనము వేరే దేనితోనూ పోల్చలేము. నిజమైన ఆనందానికి పరలోకం కేంద్రస్థానమై ఉంది. భూలోక సుఖభోగాలేవీ వాటితో సమానంకావు.

దేవుని ప్రేమ మాత్రమే మనకు పరలోక ప్రవేశాన్ని కలుగజేస్తుంది. పరలోకంలో మనము పొదే ఆనందాన్ని మనము వేరే దేనితోనూ పోల్చలేము. నిజమైన ఆనందానికి పరలోకం కేంద్రస్థానమై ఉంది.

పరలోక ఆనందాలను భూలోక సుఖభోగాలతో మనం ఏమాత్రం పోల్చలేము. అవి చాల ఉన్నతమైనవి. ఈ విషయాన్ని గురించి అపొస్తలుడైన పౌలు మనకు ఇలా చెప్పాడు : “దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపర చెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడ లేదు, మనుష్య హృదయమునకు గోచ రము కాలేదు” (1 కొరింథీ. 2:9).

వర్ణనాతీతమైన పరలోక ఆనందములు

జూనియస్ :మా స్వంత అనుభవాలు ఈ విషయాన్ని ఋజువుచేస్తున్నాయి. క్రింది లోకంలో మన ఊహలన్నిటినీ ఇక్కడి సుఖభోగాలు అధిగమిస్తున్నాయి. పరిపూర్ణ సంతోషమును గురించి క్రిందిలోకంలో మనము ఊహించిన దానికన్నా ఇక్కడ మనము అనుభవిస్తోన్న ఆనందము ఎంతో ఉన్నతమైనది. ఇక్కడ మేము అనుభవిస్తున్న మా సంతోషకరమైన అనుభవాలు మా గత ఊహలన్నిటినీ అధిగమిస్తున్నాయి.

పరలోకంలో మాకు కనిపించేదీ మేము అనుభవించేదీ కేవలం ఆనందమే. క్రిందిలోకంలోని మా తప్పిదములు, వైఫల్యాలు, నిరాశలు మున్నగు దుఃఖకరమైన వాటినన్నిటినీ ఇక్కడి మా సంతోషం మరచిపోయేలా చేస్తోంది. ఇక్కడ మేము అనుభవిస్తోన్న ఆనందాన్ని పరిశుద్ధ లేఖనాలుకూడ సరైనవిధంగా వివరించలేక పోయాయి.

క్రింది లోకంలోని మా తప్పిదములు, వైఫల్యాలు, నిరాశలు మున్నగు దుఃఖకరమైన వాటినన్నిటినీ ఇక్కడి మా సంతోషం మరచిపోయేలా చేస్తోంది.

ఎపెనెటస్, భూలోకంలో ఉన్న సమయంలో ఊహిం చిన ఆనందాన్ని మేము ఇక్కడ అనుభవించి అనందించి సంతృప్తి నొందడమేగాక, ఆ లోకంలో ఉన్నప్పుడు మేము ఏమాత్రం ఊహిం చని ఎన్నో ఆనందములనుకూడ ఇక్కడ మేము అనుభవించి ఆనందించి ఆశ్చర్యపడుతూ ఉంటాము.

ఊహలకు మించిన ఆనందము

జూనియస్ : క్రిందిలోకంలో, అప్పుడప్పుడే నూతనంగా జన్మించిన శిశువు ఆ లోకంలోనున్న ఆనందాలను గురించి ఏమీ ఎరుగడు. అయితే, ఆ శిశువు పెరిగి పెద్దవాడౌతుండగా, ఆ ఆనందాలను క్రమక్రమంగా గ్రహించగలుగుతాడు. అంతేగాక, తన ముందున్న భవిష్యత్ ఆనందాలను కూడ అతడు కొంతవరకు ఊహించగలడు.

మహిమకరమైన ఈ ప్రదేశంలోనికి ప్రవేశించేవారికి అనేక విధములైన ఆధిక్యతలు అనుగ్రహించబడతాయి. వాస్తవానికి చెప్పాలంటే, వారు ఇక్కడ అనుభవిస్తూ ఉన్న ఆనందములను గురించి వారు అసలు ఎన్నడూ ఊహించి ఉండరు. ఇక్కడున్న ఆనందాలు మనకు ఏమాత్రం తెలియనివి. మనము ఊహించని ఆనందాలు మనకు ఎదురైనప్పుడు, అవి మనకు ఎక్కువ సంతృప్తినీ సంతోషాన్నీ ఇస్తాయి.

అతిశయోక్తి అవసరము

జూనియస్: ఎపెనెటస్, నేను ఇప్పుడు చెప్పే మాటలు నీకు అతిశయోక్తు లుగా అనిపించవచ్చు. ఇక్కడి మహిమకరమైన సంగతులను గురించి నేను నీకు వివరించేటప్పుడు నీవు ఎన్నడూ వినని వ్యక్తీకరణలు నీకు వినిపిస్తూ ఉండ వచ్చు. ఇక్కడ మా ఇతివృత్తము ఈ ఆశీర్వాదకరమైన ప్రదేశములో స్తుతి ఆరాధ నలు చెల్లించుటయే. అందులోనే మా ఆనందమంతా ఇమిడివుంది. అదికాక, లెక్కలేనన్ని పరలోక ఆనందాలు ఇక్కడ మాకోసం నిల్వచేయబడి ఉన్నాయి. నా మాటలు అతిశయోక్తులవలె నీకు అనిపించినప్పటికీ, ఈ ఆశీర్వాదకరమైన పరలోక ఆశీర్వాదాలను వివరించేందుకు అంతటి అతిశయోక్తి తప్పక అవసరము.

పరలోక ఆనందాలు క్రింది లోకంలోని ఆకాశంలో కనిపించే నక్షత్రములంత విస్తారమైనవి. అవి లెక్కకు మించినవి. ఆ నక్షత్రములు భూమికి బహు దూరంగా ఉన్నందున అవి చాల చిన్నవిగా కనిపిస్తాయి. అయితే, అవి పరిమాణంలో చాల పెద్దవి. అవి ఒక్కొక్కటి భూమికంటే చాల పెద్దవి. ఎపెనెటస్, నీవు ఇంకను మర్త్యుడవు అయినందున, నీకు ఇక్కడి విషయాలను వివరించేందుకు నీకు అర్థమయ్యే ఉదాహరణలతో నేను వివరించ వలసి వచ్చింది. ఉన్నవి ఉన్నట్టుగా వాటిని నీకు వివరించేందుకు నేను ప్రయాసపడ్డాను.

కోరికలు తీర్చబడ్డాయి

జూనియస్ : ఎపెనెటస్, క్రింది ప్రపంచంలోని మన ఊహలన్నిటినీ ఇక్కడి పరిశుద్ధులు అనుభవిస్తున్నారు. మా నిత్య ఆనందాన్ని పరిపూర్ణం చేస్తూ మేము అనుభవిస్తోన్న ఆనందములన్నిటిని పేరుపేరునా మేము లెక్కించవలెనని మేము బోధించబడ్డాము. వేదాంతములోని నటనా బోధలవలెగాక, మేము ఇక్కడ నిజమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాము.

నా మాటలు అతిశయోక్తులవలె నీకు అనిపించినప్పటికీ, ఈ ఆశీర్వాదకరమైన పరలోక ఆశీర్వాదాలను వివరించేందుకు అంతటి అతిశయోక్తి తప్పక అవసరము.

ఒకప్పటి మా కోరికలను మాటల రూపంలో గాక, వాస్తవ రూపంలో మేము ఆ ఆనందాన్ని అనుభవించి ఆనందిస్తున్నాము. అవన్నియు మా విష యంలో పరిపూర్ణముగా నెరవేర్చబడినవిగా ఉన్నాయి.

పరిశుద్ధుల సహవాసంలో …

జూనియస్ : లేఖనాలు మనకు తెలుపుతోన్నవారును, భూలోకంలో ప్రశం సించబడుతోన్నవారును, ఈ పరలోక మహిమలో “సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతులును” (హెబ్రీ. 12:23) అయిన పరిశుద్ధులను ఇక్కడ మేము చూడటం మాత్రమేగాక, ఇక్కడ మేము నిరంతరం వారి సహవాసంలో ఆనందిస్తూ ఉంటాము.

భూలోకంలో ఉన్నప్పుడు మనము చూసేందుకుకూడా ఏమాత్రం వీలులేని మహిమకరమైన పరిశుద్ధ దూతలతోకూడా ఇక్కడ మేము సహవాసాన్ని కలిగి ఉంటాము.

అంతేగాక,  భూలోకంలో ఉన్నప్పుడు మనము చూసేందుకుకూడా ఏమాత్రం వీలులేని మహిమకరమైన పరిశుద్ధ దూతలతోకూడా ఇక్కడ మేము సహవాసాన్ని కలిగి ఉంటాము.

గొట్టెపిల్ల సన్నిధిలో …

జూనియస్ : ఎపెనెటస్, వీటన్నిటికీ మించి, “జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొఱ్ఱపిల్ల” (ప్రకటన 13:8) సన్నిధిని మేము ఇక్కడ కలిగి ఉంటాము. లేఖనాలు అద్భుతమైనవిధంగా మనకు ప్రత్యక్షపరచిన మన మహిమా రక్షకుడు మనకొరకు శ్రమనొంది మనకు గొప్ప రక్షణను అనుగ్రహించాడు. ఆయన మన స్తుతులకు ఎంతైనా పాత్రుడు.

అవును ఎపెనెటస్, ఇక్కడ మేము పరిశుద్ధుడగు ఆ దైవికవ్యక్తిని నిరంతరం కళ్ళారా చూస్తుంటాము. మానవులను తన సారూప్యములోనికి మార్చి వారిని తన పరిశుద్ధ పరలోక రాజ్యములోనికి ప్రవేశించేందుకు అర్హులనుగా చేసేందుకు ఆయన మానవ స్వభావమును ధరించి, మనుష్యులమధ్య తన గుడారమును వేసికొని, ఎన్నో బాధలను అనుభవించి, దీనుడుగాను దరిద్రుడుగాను భూ లోకంలో జీవించాడు.

భూలోకంలో తాను జీవించిన కాలమంతటిలో ఆయన పాపరహితుడుగాను, నిందారహితుడుగాను, పరిపూర్ణుడుగాను, తన శత్రువులైన యూదా మతపెద్దలుకూడా “ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు” (మార్కు 7:37) అని పలుకునట్లుగాను జీవించాడు. అంతేగాక, ఆయనను బంధించి తీసికొనివచ్చుటకు ఆయన శత్రువులచే పంపబడినవారు సహితము ఆయనను గురించి మాట్లాడుతూ, “ఆ మనుష్యుడు మాటలాడి నట్లు ఎవడును ఎన్నడును మాటలాడ లేదని” సాక్ష్యమిచ్చారు (యోహాను 7:46).

సింహాసనాసీనునిగా హెచ్చింపబడిన ఆయన మెరిసే కళ్ళు అగ్నిజ్వాలల్లాగా కనిపిస్తుంటాయి.

అయితే ఎపెనెటస్, మహిమపరచబడిన ఈ దేవుని కుమారుడు మనకొరకు శ్రమనొంది తన యాజకధర్మమును జరిగించుటకుగాను భూమి మీద “దాసుని స్వరూపమును” (ఫిలిప్పీ. 2:7) ధరించాడు. అయితే, ఇక్కడ ఆయనను మనము “రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును” అయిన తేజోమయునిగా చూస్తున్నాము (1 తిమోతి 6:15). ఇప్పుడు ఆయనకు భూమిమీదను పరలోకములోను ఘనతయు మహి మయు ప్రభావమును సర్వాధికారమును ఇవ్వబడి యున్నవి (మత్తయి 28:18).

ఆయన మహిమను వీక్షిస్తూ…

జూనియస్ : ఆయన ఇక్కడ ఎంత ప్రకాశమానంగా వెలుగుతూ ఉంటాడంటే ఆయనను చూసిన ప్రతిఒక్కరూ, ఆయనను ఆనందంతో ఆరాధించక మౌనంగా ఉండలేరు. ఆయనను నిరంతరం వీక్షించే పరిశుద్ధులు పెండ్లికుమారుని అందాన్ని వర్ణిస్తూ సొలొమోను పాటను నిరంతరం జ్ఞాపకం చేసుకొంటూ ఉంటారు. “అతడు అతి కాంక్షణీయుడు” అని వారు ఆయనను చూసి సంభ్రమాశ్చర్యాలతో అంటారు (పరమగీతము 5:16).

సింహాసనాసీనునిగా హెచ్చింపబడిన ఆయన మెరిసే కళ్ళు అగ్నిజ్వాలల్లాగా కనిపిస్తుంటాయి. ఆ కళ్ళలోకి నేరుగా చూసేవారి హృదయాలలోనికి ఆ కళ్ళలోని కాంతికిరణాలు స్వచ్ఛమును పరిశుద్ధమును సజీవమునైన సెరాఫీమువలె ప్రవేశిస్తాయి.

నిజంగా ఎపెనెటస్, దైవిక లేఖనాలు మనకు తెలుపుతున్న విధంగా, “దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి పరలోక దర్శనములు మరియు అందుగల మహిమలు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు” (1 కొరింథీ 2:9). పరిశుద్ధుడగు దేవుడు తాను అధికంగా ప్రేమించే తన ఏకైక కుమారునియొక్క శ్రమలు మరియు విధేయతలకు ప్రతిగా ఉన్నతమైన బహుమానాలతో ఆయనను హెచ్చించాడు.

ఆ ప్రియ ప్రభునియొక్క మహిమనూ, ఆయన సౌందర్యాన్నీ వివరించడం ఎవరితరమూ కాదు. ఆయనను బట్టియే దేవుడు ఆయనచే ఎన్నుకొనబడిన లెక్కకు మించిన విశ్వాసుల సమూ హమును మానవ ఊహలకు అతీతమైన ఈ మహిమా రాజ్యంలోనికి అనుమతిం చేందుకు ఇష్టపడ్డాడు.

తన సేవకులలో అనేకులకు నక్షత్రములను పోలిన కాంతిని అనుగ్రహించిన సర్వోన్నతుడగు సర్వశక్తిగల దేవుడు, నీతిసూర్యుడు అయిన తన ప్రియకుమారునికి కోటి సూర్యుల తేజస్సును అనుగ్రహించాడు. ఆ మహిమా ప్రభువుయొక్క తేజస్సును ప్రస్తుత నీ మర్త్యస్థితిలో నీవు వీక్షించలేక పోయినప్పటికీ, నీవు ఈ పరలోక మహిమలో ప్రవేశించినప్పుడు ఆయన మహిమా తేజస్సును తప్పక వీక్షించి ఆనందిస్తావు.

ఆయన స్వాగతాన్ని మేము స్వీకరిస్తాము

జూనియస్ : అయితే, మన ప్రియ రక్షకునియొక్క మహిమకరమైన తేజస్సు మరియు ఆయన గొప్పదనం ఆయన కృపాకనికరాలను ఏమాత్రం తక్కువ చేయవుగాని, ఇంకను అధికంచేస్తాయి. తాను పునరుత్థానుడై, పరలోక మహిమ లోనికి ఆరోహణుడైన తర్వాతకూడా ఆయన తన కృపాకనికరాలను ఇనుమడింపజేస్తూ, “ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినయెడల, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము” ప్రకటన 3:20) అని పలకడాన్ని ఆపలేదు.

తన సేవకులలో అనేకులకు నక్షత్రములను పోలిన కాంతిని అనుగ్రహించిన సర్వోన్నతుడగు సర్వశక్తిగల దేవుడు,నీతిసూర్యుడు అయిన తన ప్రియకుమారునికి కోటి సూర్యుల తేజస్సును అనుగ్రహించాడు.

అంతేకాదు, చివరిగా ఆ మహిమగల రాజు నమ్మకస్తులైన తన ప్రతి సేవకునీ చూసి చిరునవ్వు నవ్వుతూ ” భళా, నమ్మకమైన మంచి దాసుడా” అని ప్రేమపూర్వకంగా అభినందిస్తూ ఆహ్వా నిస్తాడు (మత్తయి 25:21).

యేసు ప్రత్యక్షత పరలోకాన్ని పరమానందభరితంగా చేస్తోంది

జూనియస్ : మహిమపరచబడిన మన రక్షకునియొక్క తేజస్సునూ, ఆయన ఆనందాన్నీ నేను నీకు వివరిస్తున్నప్పుడు నీవు ఆశ్చర్యపడవద్దు. ఎలాంటి కారు మేఘాలూ ఇప్పుడు తనను ఆటంకపరచలేని విధంగా ఆ నీతిసూర్యుడు ఇప్పుడు ఇక్కడ అత్యంత కాంతివంతంగా ప్రకాశిస్తున్నాడు. హెబ్రీ గ్రంథకర్త అభివర్ణించిన విధంగా “మహిమా ప్రభావములతో” (హెబ్రీ. 2:7) కిరీటము ధరించిన యేసును ఇప్పుడు నేను కళ్ళారా చూస్తున్నానని నీకు చెబుతున్న మాటలకు నీవు ఆశ్చర్యపడవద్దు. ఎందుకనగా, నాకోసం క్రిందిలోకంలో ఎంతగానో హింసించబడిన ఆయన ఇక్కడ రాజ్యపరిపాలన చేయటం పరలోకాన్ని మరింత మహిమకరంగా చేస్తుండటం చూసి నేను ఆనందిస్తున్నాను.

అంతేగాక, గొప్పదియు వివరించడానికి అసాధ్యమైనదియునైన మన విమోచకుని సంతోషము, మనకు ఆయనపై ఉన్న ప్రేమను ఆధారంచేసికొని ఇంకను అధికమవుతూ ఉంటుంది. ఇక్కడ మా ఆనందము అత్యంత అధికమైనదై నప్పటికీ, మన విమోచకుని సంతోషము మా సంతోషాన్ని అధికం చేస్తోందని నీకు చెప్పేందుకు నేను చాల సంతోషిస్తున్నాను.

నాకోసం క్రిందిలోకంలో ఎంతగానో హింసించబడిన ఆయన ఇక్కడ రాజ్యపరిపాలన చేయటం పరలోకాన్ని
మరింత మహిమకరంగా చేస్తోండటం చూసి నేను ఆనందిస్తున్నాను.

అందుకే, తాము “ఆ నామము కొరకు అవమానము పొందుటకు” (అపా.కా. 5:41) పాత్రులమని భూమిమీద విషాదకరమైన పరిస్థితుల్లో తమ జీవితాలను గడుపుతూ వచ్చిన అపొస్తలులు అనుకొంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆయనతోకూడా రాజ్యపరిపాలన చేస్తోన్న ఆ ఆశీర్వాదకరమైన వ్యక్తుల ఆనందాన్ని గురించి నీవేమనుకొంటున్నావు? అనేక రకాలైన బాధలద్వారా వారిని నడిపించిన ఆయన ఇప్పుడు వారిని సేదదీర్చి, “మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది” (యెషయా 53:5) అని వారు అనేలా చేశాడు.

యజమానుని సంతోషములో మేము పాలుపొందుచున్నాము

జూనియస్ : ఎపెనెటస్, తన సిలువద్వారా మనలను విమోచించిన ఆ ప్రేమా ప్రభువు తన మహిమా కిరీటముద్వారా మనల్ని ఇంకెంతగా ఇక్కడ సంతోషా నందాలతో నింపుతాడో నీవు ఎప్పుడైనా ఆలోచించావా? తన యజమానుని సంతోష ములో పాలుపొందేందుకు నమ్మకస్తులైన తన పనివారిని ఆయన అనుమతించడం మాత్రమే గాక, వారిని స్వయంగా అందులోనికి ఆహ్వాని స్తాడు (మత్తయి 25:21 చూడుము).

తన యజమానుని సంతోషములో పాలు పొందేందుకు నమ్మకస్తులైన తన పనివారిని ఆయన అనుమతించడం మాత్రమేగాక, వారిని స్వయంగా అందులోనికి ఆహ్వానిస్తాడు.

భూమి మీదను పరలోకములోను మన సంతోషానికి క్రీస్తుయేసే మూలము. తన దయాకనికరముల చొప్పున ఆయన మన సుఖదుఃఖాలలో నిరంతరం పాలుపొందుచున్నాడు. తన శ్రమలద్వారా ఆయన మన బాధలను తగ్గిం చడు, లేదా తన ఆనందముద్వారా మన ఆనందాన్ని ఆయన అధికము చేయడు.

విశ్వాసంలో మరణించిన మా స్నేహితులను మరియు మా కుటుంబ సభ్యులను మేము కలుసుకొంటున్నాము

జూనియస్ : ఆ విధంగా మా ఆశీర్వాదపు కిరీటమును మమ్ములను విమోచిం చిన ప్రభువును అయిన క్రీస్తుయేసుయొక్క ఆశీర్వాదకరమైన సన్నిధిలోను, పరలోక సౌఖ్యాలతో నిండిన మా పరలోక గృహాలలోను మేము అనుభవిస్తోన్న ఆనందాన్ని నేను పరీక్షించిన తరువాత, నీవు ఈపాటికే గమనించిన ఒక విషయాన్ని నీకు వివరించేందుకు ఇప్పుడు నేను ప్రయత్నిస్తాను.

ఇక్కడ మేము మా అన్నయ్య అయిన యేసును మాత్రమేగాక, భూమిమీద ఆయనయందలి భయభక్తులలోను విశ్వాసంలోను మరణించిన మా స్నేహితులను, సన్నిహితు లను, బంధువులను, కుటుంబసభ్యులనుకూడ కలుసుకొని వారి సహవాసంలో ఆనందిస్తున్నాము. ఈ వాస్తవము మమ్ములను మరింత ఆనందములోనికి నడిపిస్తోంది.

మాకంటె ముందుగా ఇక్కడకు చేరిన పరిశుద్ధులను మేము కనుగొని కలుసుకొంటున్నాము

జూనియస్ : మా స్నేహితులను, బంధువులను, సమకాలీనులను మాత్రమే గాక, అన్ని యుగాలలోను జీవించిన పరిశుద్ధులందరినీకూడా మేము ఇక్కడ కలుసుకొని వారితో కలిసి ఆనందిస్తున్నాము. కావున, మెస్సీయాకు ముందు కాలంలో భూమిమీద జీవించిన ఏలీయాను నీవు కనుగొని సంభాషించినట్లుగా, మన ఆది పితరుడైన ఆదామునుకూడా ఇక్కడ నీవు కనుగొని సంభాషించగలవు.

పరిశుద్ధ లేఖనములనుండి నీవు ఈ విషయాన్ని ఎప్పుడో ఎరిగినందున, ఇది నీకు క్రొత్త విషయమని నేను భావించడం లేదు. పునరుత్థానమునొందిన  పరిశుద్ధులు దేవదూతలవలె ఉందురని మన రక్షకుడు తానే స్వయంగా చెప్పాడు (మత్తయి 22:30).ప్రవక్తయైనదానియేలు మరియు అపొస్త లుడైన యోహానుల దర్శనములలోకూడా ఈ విషయం దృఢీకరించబడింది. ధనవంతుడు మరియు భిక్షకునికి సంబంధించిన ఉపమాన ములో వ్యక్తులను మరియు వారి ప్రస్తుత స్థితిని మాత్రమేగాక, వారి గత జీవితాన్నికూడా తండ్రి
యైన దేవుడు ఎరిగియున్నాడు (లూకా 16:19-25).

మెస్సీయాకు ముందు కాలంలో భూమిమీద జీవించిన ఏలీయాను నీవు కనుగొని సంభాషించినట్లుగా, మన ఆది పితరుడైన ఆదామునుకూడా ఇక్కడ నీవు కనుగొ సంభాషించగలవు.

అంతేగాక, మహిమకరమైన మహాదినాన భక్తిపరులైన థెస్సలొనీకయులు తన కిరీటముగా ఉండవలెనని అన్యులకు అపొస్తలుడైన పౌలు ఆశించాడు (1 థెస్స. 2:19,20). మన ప్రియుడగు దానియేలు చెప్పిన విధంగా, నీతిమార్గము ననుస రించి నడుచుకొనునట్లు వారు అనేకులను త్రిప్పినందున, ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై వారు ప్రకాశిస్తారు (దానియేలు 12:3).

ఎపెనెటస్, మన విమోచకుడు పరిశుద్ధ పర్వతముపై రూపాంతరము చెందుటను గురించియు, ఆ సమయంలో మోషే ఏలీయాలు ఆయనతో మాట్లాడుటను గురించియు నీవు అనేకసార్లు చదివి ఉంటావని నేను నమ్ము తున్నాను. ఆ సమయంలో అక్కడ ఉన్న శిష్యులు మోషే ఏలీయాలను ఎంత బాగా గుర్తించారో కదా! అది పరిశుద్ధులు ఒకరినొకరు బాగుగా యెరిగిన ఒక పరలోకము వంటిది.

మన జ్ఞానము తన నిష్కపటస్థితిలో మొదట ఆదాము కలిగియుండిన జ్ఞానమునకు తక్కువైనదని నీవు తలంచుచున్నావా? హవ్వ తనవద్దకు మొట్టమొదటిసారిగా తీసికొనిరాబడి నప్పుడే ఆదాముకు ఆమె ఎవరో తెలుసు.అందుకే అతడు “నా యెముకలలో ఒక యెముక, నా మాంసములో మాంసము” అని ఆమెను సంబోధిస్తూ అన్నాడు (ఆదికాండము 2:23).

నేను నీకు మరో అద్భుతమైన విషయాన్ని తెలపాలని అనుకొంటున్నాను. ఇక్కడున్న పరిశుద్ధు
లందరూ ఒకరినొకరు ఎరిగేందుకు జ్ఞానము అనుగ్రహించబడింది.

ఇక నీకు మరిన్ని ఉదాహరణలు ఎందుకు? నీ స్వంత అనుభవమే నీకు ఈ సత్యాన్ని బయలుపరచింది కదా? కొంతకాలము తరువాత, నీవు అమర్త్యతను దాటివచ్చి నప్పుడు, ఈ విషయాన్ని నీవు మరిన్ని స్పష్టమైన ఋజువులతో కనుగొంటావు.

పరిపూర్ణ ఐక్యత

జూనియస్ : అయితే నా ప్రియ నేస్తమా, నేను నీకు మరో అద్భుతమైన విషయాన్ని తెలపాలని అనుకొంటున్నాను. ఇక్కడున్న పరిశుద్ధులందరూ ఒకరినొకరు ఎరిగేందుకు జ్ఞానము అనుగ్రహించబడింది.

అంతేగాక, ఇక్కడున్న పరిశుద్ధులందరూ దేవునితో మాత్రమేగాక, ఒకరితో నొకరు ఎడతెగని పరిపూర్ణమైన సహవాసాన్ని కలిగియుంటారు. ఒకరికొకరు పరిచయము లేకుండా వారిమధ్య అంగీకారము కుదరదు. అంగీకారము లేకుండా ఇరువురిమధ్య సహవాసము అసాధ్యము. అలా అంగీకారము లేకుండా ఇరువురిమధ్య సహవాసము కుదిరినప్పటికీ, వారిమధ్య నిజమైన సంతోషము ఉండదు. ఇక్కడున్నవారిలో ఒకరికొకరు పరిచయం లేనట్లయితే వారిమధ్య సహవాసము ఉండదు. అప్పుడు ఇక్కడున్నవారిలో సంతోషము కొదువ ఉన్నట్టే. అయితే, ఇక్కడ, “జ్యేష్ఠుల సంఘము” (హెబ్రీ 12:23) అద్వితీయుడగు దేవుని కాంతివంతమైన దర్శనమునుండి సంతోషమును పొందుతున్నందునను, దాని ఫలితంగా ఒకరితోనొకరు స్వచ్ఛమైన సంతోషముతో సహవాసం చేస్తున్నందు నను, వారందరిని ఎడతెగని నిత్యప్రేమ ఒకటిగా ఐక్యపరుస్తోంది.

పరిపూర్ణ ప్రేమ

జూనియస్ : భూమిమీద మన ప్రేమ ప్రకృతిసిద్ధమైన సంబంధబాంధవ్యాల పైనను ఎదుటివారి యోగ్యతల పైనను ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ అలాకాదు. ఇక్కడున్న పరిశుద్ధులందరిలో దేవుని ప్రేమ పొర్లిపారుతుంటుంది. ఎదుటివారి అర్హతలు మరియు యోగ్యతలతో నిమిత్తంలేకుండా ఆ దైవిక ప్రేమ ప్రతిఒక్కరినీ ప్రేమించేందుకు పురికొల్పుతుంది. తాను క్రీస్తును “శరీరరీతిగా” (2 కొరింథీ.5:16) యెరిగియుండినట్లయితే, తాను ఆయనను ఎన్నటికీ ఎరిగి యుండకపోదునని అపొస్తలుడైన పౌలు తాను భూమిపై ఉన్నప్పుడు మనకు చెప్పాడు. మన ప్రియ ప్రభువుయొక్క పునరుత్థానము మరియు ఆరోహణములనుబట్టి అతడు మరో ప్రపంచా నికి కొనిపోబడి, పరలోక రాజుగానున్న ఆయన సహవాసాన్ని అనుభవిస్తున్నాడు.

భూమిమీద మన ప్రేమ ప్రకృతిసిద్ధమైన సంబంధబాంధవ్యాల పైనను ఎదుటివారి యోగ్యతల పైనను ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడున్న పరిశుద్ధులందరిలో దేవుని ప్రేమ పార్టీపారుతుంటుంది.

మా ఆత్మీయ సంబంధము ప్రకృతిసిద్ధమైన సహవాసము లాంటిది కాదుగాని, అది శాశ్వత మైనది. ఇక్కడ మేమందరము ఒకే పరలోక తండ్రితోను, సమాధానాధిపతియు మా సంతోషకరమైన సహోదరత్వానికి శిరసైన యేసుక్రీస్తుతోను నిరంతర సహవాసాన్ని కలిగియున్నాము. క్రింది లోకంలో ఒక వ్యక్తి ప్రవర్తన మరియు గుణలక్షణములను బట్టి ఎదుటివారి ప్రేమ ఆధారపడి ఉంటుంది. పరిశుద్ధత, జ్ఞానవివేకములు, మంచితనము మొదలగు ఆకర్షణలపై భూలోక ప్రేమ ఆధార పడి ఉంటుంది. ఇవన్నీ ఆయా వ్యక్తులమధ్య ప్రేమానురాగాలనూ సాన్నిహిత్యాన్నీ పెంపొం దింపజేస్తాయి.

ఒక వృద్ధుని చర్మము ముడతలుపడి ఉన్న ప్పటికీ, అతని ఆకారము అసహ్యకరంగా ఉన్నప్పటికీ, అతని మంచితనాన్నిబట్టి అతడు భూలోకంలో అందరిచే ప్రశంసించబడి ప్రేమించబడతాడు. అదేవిధంగా, ఒక అందమైన వ్యక్తిలో మంచితనం లేనట్ల యితే, అతడు అందరిచే ద్వేషించబడతాడు.

కింది లోకంలో ఆత్మీయ ప్రేమకూడా అపవిత్రమైనదే. అత్యంత పరిశుద్ధులైన వారు అక్కడ ఎక్కువగా ప్రేమించబడతారు: బలహీనతలున్నవారు
ద్వేషించబడతారు.

ఎపెనెటస్, శరీర సంబంధమైన కళ్ళకన్నా తేటగానున్న కళ్ళనూ, భౌతిక వెలుగుకన్నా స్వచ్ఛమైన వెలుగునూ, శారీరక అందంకన్నా శ్రేష్టమైన దైవిక అందాన్నీ నీవు భూమిమీద చూసేవుంటావు. అందుకే, “భక్తులే శ్రేష్టులు; వారు నాకు కేవలము ఇష్టులు” రాజరికపు ప్రవక్తయైన దావీదు తెలిపాడు (కీర్తనలు 16:3).

క్రిందిలోకంలో ఆత్మీయ ప్రేమకూడా అపవిత్రమైనదే. అత్యంత పరిశుద్ధులైన వారు అక్కడ ఎక్కువగా ప్రేమించబడతారు; బలహీనతలున్నవారు లేదా దోషము లున్నవారు తక్కువగా ప్రేమించబడతారు లేదా ద్వేషించబడతారు. అయితే, ఇక్కడ అలాకాదు. ఇక్కడ అందరూ అందరిచే ప్రేమించబడతారు. ఇక్కడ పరిపూర్ణతకు అవసరమైన మహిమకరమైన మంచితనములన్నిటియొక్క కలయికను దేవుని స్వరూపము పరిపూర్ణము చేస్తోంది. ఇక్కడ ప్రతి పరిశుద్ధుడును మొట్టమొదటి మాదిరియైన దేవునితో కచ్చితంగా అంగీకరిస్తాడు. వారిలో వెలుగొందుతోన్న దైవిక సౌందర్యము నిత్యము వారిలో నివసిస్తూ ఉంటుంది. ఆ సౌందర్యము అగ్నిజ్వాలలచేగాని, గాయములచేగాని చెక్కుచెదరదు.

అంతేగాక, క్రిందిలోకంలో పరిశుద్ధుల వాస్తవ హృదయ పరిస్థితి సరైన విధంగా కనిపించదు. వారిలోని పరిశుద్ధత అతికొద్దిగా మాత్రమే మనకు కనిపిస్తుంది. భూమిని మనము గమనించినప్పుడు, అది పూర్తిగా అందమైన మొక్కలతోను పుష్పాలతోను నిండివుంటుంది. అయితే, భూమియొక్క సంపదంతా దాని అంతర్భాగంలో కనిపించకుండా దాగివుంటుంది. అలాగే, భూమిమీద ఉన్న విశ్వాసులలోని పరిశు ద్ధత వారి చర్యలలోను క్రియలలోను కనిపిస్తుంది. అయితే, పైకి కనిపించే ఆ పరిశుద్ధతలోని స్వచ్ఛత ఆంతర్యంలో దాగివుంటుంది.

అయితే, ఇక్కడ బాహాటంగా కనిపిస్తూ ఉంటుంది. వారిలో దేవుని పరిశుద్ధుల ఆంతర్యం అద్దంలో కనబడినట్టు పరిశుద్ధత స్పష్టంగా బయలుపరచబడుతూ ఉంటుంది. వారిలోని ఆ దైవిక సారూప్యత పరిశుద్ధ నేత్రానికి ఎంత ఆకర్ష ణీయంగా కనిపిస్తూ ఉంటుందో! ఇక్కడ నా సహపరిశుద్ధులు అమర్త్యమైన నా సౌందర్యంతో తేజోవంతంగా ప్రకాశిస్తూ ఉండటాన్ని నేను వీక్షిస్తూవుంటాను।

భూమిమీద మానవుల మధ్యనున్న ప్రేమ ఇచ్చిపుచ్చుకొనే సిద్ధాంతంపై
ఆధారపడి ఉంటుంది. ఎదుటివారు ఎంతగా తమ్మును ప్రేమిస్తే అంతగా వారు ప్రేమిస్తారు.

భూమిమీద మానవుల మధ్యనున్న ప్రేమ ఇచ్చిపుచ్చుకొనే సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. ఎదుటివారు ఎంతగా తమ్మును ప్రేమిస్తే అంతగా వారు ప్రేమిస్తారు. అయితే, ఇక్కడ మాకు అలాంటిదేమీ కనిపించదు. ఇక్కడున్న అందరిలో ప్రేమధారలు పొర్లి ప్రవహిస్తూ ఉంటాయి. ప్రేమయొక్క ఈ ఔన్నత్యస్థితి ఎంత సంతోషకరమైనది! “సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!” (కీర్తనలు 133:1) అని పలికిన కీర్తనాకారుని పలుకులు ఎంత రమ్యమైనవి। ఇక్కడున్న తన సహపరిశుద్ధులతో తాను అనుభవించనైయున్న ఈ ప్రేమాఐక్యతలను అతడు ముందుగానే చూసి ఆనందపారవశ్యాలతో ఆ కీర్తన వ్రాశాడు।

ప్రేమ అనునది భూలోకంలో మన జీవితాలలోను మన సమాజాలలోను అత్యంత అద్భుతమైనది మరియు బలమైనది. అలాగైతే, “మనము ఏకమై యున్నలాగున, వారును ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని” (యోహాను 17:22,23) అని ప్రార్థించిన మన రక్షకుని ప్రార్థనా నెరవేర్పును పరిశుద్ధులు ఇక్కడ కళ్ళారా చూడటం ఎంత అద్భుతమైన విషయం!

ఇక్కడ ప్రేమ ఒక వ్యక్తినుండి మరో వ్యక్తిలోనికి ప్రవహిస్తూ, ఒక వ్యక్తిలోని మహిమ ఇంకో వ్యక్తిలోనికి బయలువెళ్ళుతూ అందరినీ ఆనందంతో నింపుతుంది.

సర్వోన్నతుడగు దేవుడు తన స్వభావములో ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నాడు. అంతేగాక, ఎల్లప్పుడూ ఆయన ఏకరీతిగానే ఉంటాడు. ఆయన ఎన్నడును మారని మార్పుచెందనివాడు. అదేవిధంగా, మారని మార్పుచెందని ఆయన ప్రేమతో నింపబడిన పరిశుద్ధులు ఇక్కడ నిరంతరం ఆయన ప్రేమను మరియు ఐక్యతను ప్రతిబిం బింపజేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రేమ ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తిలోనికి ప్రవహిస్తూ, ఒక వ్యక్తిలోని మహిమ ఇంకో వ్యక్తిలోనికి బయలు వెళ్ళుతూ అందరినీ ఆనందంతో నింపుతుంది. ఈ పరలోక అగ్నియొక్క శక్తి అంతటి ప్రభావము గలది. అది ఇక్కడి పరిశుద్ధులను అంతగా ఐక్యపరచి, సన్నిహితమైన ఆనందాన్ని వారిలో పెంపొందింపజేసి, ప్రతి ఒక్కరి హృదయాల్లో అందరూ నివసించు నట్లునూ, అందరి హృదయాల్లో ప్రతి ఒక్కరూ నివసించునట్లునూ చేస్తుంది.

పరిపూర్ణ స్నేహము

జూనియస్ : ఎక్కడైతే ఇలాంటి ప్రేమ పొర్లిపారుతూ ఉంటుందో, అక్కడ ఆనందం వెల్లివిరుస్తుంటుంది. అలాగైతే, దైవిక ప్రేమ పొర్లిపారే పరలోకంలో ఎంతటి ఆనందం వెల్లివిరుస్తుంటుందో కదా! వారి సహవాసము మరియు వారి సంభాషణ అత్యానందముతో నిండినది. భూలోకంలోనున్న ప్రియస్నేహితుల సహవాసములోను వారి సంభాషణలోను ఎంతటి ఆనందం మరియు వినోదం మనకు కనిపిస్తుందో కదా! తమ ఆలోచనలను మరియు తలంపులను వారు ఒకరితోనొకరు పంచుకొంటున్నప్పుడు, అవి వారిని ఎంత సన్నిహితంగా చేస్తాయో కదా! పరిపూర్ణత లేకుండా భూలోకంలో స్నేహము సాధ్యముకానప్పటికీ, వారి సంభాషణల్లో ప్రేమయొక్క ఆనందము స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. స్నేహంలో మెచ్చదగినవన్నీ పరలోకంలో పరిపూర్ణత చెందుతాయి. మానవుని బుద్ధిహీనతను బట్టియు వారి బలహీనతనుబట్టియు అసంపూర్ణంగా ఉన్నవి ఇక్కడ సంపూర్ణము చేయబడతాయి. ఇక్కడి పరిశుద్ధులందరిలో ప్రేమానురాగాలు పొర్లిపారు తుండగా వారందరూ తమకు ఇవ్వబడిన దైవిక ఆశీర్వాదాలను సమిష్టిగా అనుభవిస్తూ ఉంటారు.

ఐక్య స్తుతి

జూనియస్ : సింహాసనం చుట్టూ పరిశుద్ధులు మరియు దేవదూతలు చేసే మధురమైన స్తుతిగానాలు నీకు వినిపించడం లేదా ఎపెనెటస్? అత్యల్పులైన తమకు ఆయన ప్రేమను అనుభవించే ఆధిక్యతను అనుగ్రహించినందుకు వారు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న సన్నివేశం నీకు కనిపించడంలేదా నేస్తమా? తమపట్ల ఆయన కనబరచిన దయాప్రేమల కొరకును, తమపట్ల ఆయన చూపిన కృపాకని కరములకొరకును, అయోగ్యులును ఎన్నికలేని వారమునైన తమ్మును ఘనత చెందిన పాత్రలుగా ఆయన ఎన్నుకొన్నందుకును, భయంకరమైన పాపపుసంకెళ్ళనుండి తమ్మును ఆయన విడిపించినందుకును, ఇప్పుడు ఘన పరచబడి మహిమపరచబడిన తన ప్రియ కుమారుని మరణముద్వారా తమ పాపములనుండి తమ్మును విమోచించి నీతిమంతులనుగా తీర్చినందుకును వారాయనకు నిరంతరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆనందిస్తుంటారు.

తన ప్రియ కుమారుని మరణముద్వారా తమ పాపములనుండి తమ్మును విమోచించి నీతిమంతులనుగా తీర్చినందుకు వారాయనకు నిరంతరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆనందిస్తూ ఉంటారు.

ఆయనను మేము నిరంతరం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాము ఎపెనెటస్! ఆయనను స్తుతించడంలో మేమేన్నడూ అలసిపోము. అవును, రెక్కలు కలిగిన కెరూబులు మరియు సెరూపులు ఆయన మంచితనాన్ని గురించియు, ఆయన మహిమా ప్రభావములను గురించియు ఆయనను నిరంతరం ఆసక్తితో కీర్తిస్తూఉంటారు.

ఆ అద్భుతమైన కార్యక్రమంలో ఇక్కడున్న పరిశుద్ధులందరూ పాలు పంచుకొంటారు. ఆయనను ఆరాధించుటలో ఎంత ఆనందముందని। క్రింద ఉన్న ప్రపంచంలోని ప్రజలు ఈ పరలోకంలో ప్రతిధ్వనిస్తోన్న పరిశుద్ధుల స్తుతి గానాలును గనక వినగలిగితే, తాముకూడా స్తుతిగానాలు చేసే ఆ గుంపులో చేరాలన్న లోతైన ఆశ వారిలో ఎంతగా జనిస్తుందో కదా!

లేఖనముల మర్మములు బయలుపరచబడినవి

జూనియస్ : స్నేహితులు సన్నిహితులు బంధువులు మొదలగువారిని గురించిన సంతోషముకన్నను, స్నేహితులు మరియు ఇతరులతో మనముచేసే సహవాసముకన్నను, దైవిక మర్మములను గురించిన జ్ఞానము నా మట్టుకు నాకు లోతైన సంతోషాన్ని ఇస్తుంది. భూలోకంలో అత్యుత్తమ బోధకులు సహితము మత సంబంధమైన మర్మములను సరైనవిధంగా బోధించలేక పోతున్నామని ఒప్పుకొంటారు. అయితే, అనేకమంది గొప్ప గొప్ప వేదాంత పండితులు, విద్వాంసులు, విమర్శకులు సహితము గ్రహించలేని లేఖనమర్మములను ఇక్కడ నేను చక్కగా గ్రహించగలుగుతున్నాను. కారణం, సర్వశక్తుడగు దేవుని ఉద్దేశాలను నేను గ్రహించుటే. ఇక్కడ మేము సమస్తమును సులభముగా గ్రహించగల జ్ఞానమును పొందియున్నాము. కావున, క్రింది లోకంలో అత్యంత క్లిష్టముగా కనిపించిన లేఖనభాగములను సహితము ఇక్కడ మేము సులభముగా గ్రహించ గలుగుతున్నాము.

అనేకమంది గొప్ప గొప్ప వేదాంత పండితులు,
విద్వాంసులు, విమర్శకులు సహితము గ్రహించలేని లేఖనమర్మములను ఇక్కడ నేను చక్కగా గ్రహించగలుగుతున్నాను.

ఎపెనెటస్, ప్రపంచాన్ని పరిపాలించుటలో దేవుని ప్రవర్తనను ప్రశ్నించేందుకు మంచి విశ్వా సులను సహితము శోధించిన అనేక గూఢ మైన సంగతులు ఇక్కడ మాకు స్పష్టంగా బయలుపరచబడ్డాయి. ఉపద్రవములు సంభ వించినప్పుడు, శ్రమలు హింసలు బాధలు విస్త రించినప్పుడు, నిరపరాధులు శిక్షించబడి నప్పుడు మనము దేవుని చర్యలను బహుగా అయితే, అవి ఎందుకు సంభవించాయో ఇక్కడ మేము స్పష్టంగా గ్రహించి దేవుని జ్ఞానాన్ని కొనియాడి కీర్తిస్తాం. క్రింది ప్రపంచంలో జ్ఞానులనబడే వ్యక్తులు సహితము అన్యాయములుగా అభిప్రాయపడే విషయాలు సహితము ఇక్కడ మాకు న్యాయమైనవిగా బయలుపరచబడతాయి.

అత్యంత అర్థవంతంగా మాట్లాడేవాడు అయినప్పటికీ, నిర్దయుడగు యోబు స్నేహితులలో ఒకడగు బిల్దదు, భూమిమీద నివసించేవారిని గురించి మాట్లాడుతూ, “మనము నిన్నటివారమే, మనకు ఏమియు తెలియదు, భూమిమీద మన దినములు నీడవలె నున్నవి” అని చాల కాలమునకు మునుపే మనకు తెలిపాడు (యోబు 8:8). ప్రపంచ నటనావేదికపై మానవాళి నటించే సుదీర్ఘ నాటకంలోని ఒకటి లేదా రెండు దృశ్యా లను మాత్రమే అతికొద్ది పరిమాణము కలిగిన మానవ జీవితాలు చూడగలవు.

కావున, ఆ నాటకములోని దర్శకుని ఉద్దేశమేమిటో వారు ఏమాత్రం గ్రహించలేరు. వారు ఆ నాటకంలోని ఏదో కొంత మధ్యభాగాన్నిమాత్రమే చూసి నందున, ఆ నాటకంలోని ప్రారంభంగాని అంతంగాని వారికి తెలియవు.

ప్రపంచ నటనావేదికపై మానవాళి నటించే సుదీర్ఘనాటకంలోని ఒకటి లేదా రెండు దృశ్యాలను మాత్రమే అతికొద్ది పరిమాణము కలిగిన మానవజీవితాలు చూడగలవు. కావున, ఆ నాటకములోని దర్శకుని ఉద్దేశమేమిటో వారు ఏమాత్రం గ్రహించలేరు. వారు ఆ నాటకంలోని ఏదోకొంత మధ్యభాగాన్ని మాత్రమే చూసినందున,  ఆ నాటకంలోని ప్రారంభంగాని అంతంగాని వారికి తెలియవు.

అయితే, ప్రపంచ పరిపాలనలో దైవిక ప్రవర్తన మనకు పూర్తిగా బయలుపరచబడినప్పుడు, ఆయా రాజ్యల్లోను రాష్ట్రాల్లోను కుటుంబాల్లోను వ్యక్తులమధ్యను జరిగే ప్రతిసంఘటనా న్యాయ మైనదిగాను, సమయానుకూలమైనదిగాను, అత్యంత అవసరమైనదిగాను మనము గ్రహి స్తాము. మనము భూలోకంలో ఉన్నప్పుడు దేవుని తృణీకరించేందుకు మనల్ని శోధించిన కార్యాలు ఇక్కడ ఆయనను స్తుతించి కొనియాడేందుకు మనల్ని ప్రోత్సహిస్తాయి. ఆయన అద్భుతమైన చర్యలపట్ల అప్పుడు మనము సంతృప్తినొంది ఆనందిస్తాం.

భూసంబంధమైన పరీక్షలకుగల కారణములు

జూనియస్ : దేవుని సాధారణ కార్యాలు మరియు ఆయన అద్భుతమైన జ్ఞానముతో కూడిన దైవిక మంచితనాన్ని కనుగొనే అనేక విషయాలపట్ల ఇక్కడ మేము ఆశ్చర్యంతో ఆనందించి ఆయనను ఆరాధిస్తాం. ఒక్కొక్కరిపట్ల ఆయన జరిగించిన ఆయా కార్యాలకుగల కారణాలను ఆయన తన దయచొప్పున మాకు బయలుపరుస్తాడు. ఎపెనెటస్, నా మట్టుకైతే, భూమిమీద నేను జీవించిన కాలంలో నేను ఎదుర్కొన్న అనేకములగు ఘోరమైన శ్రమలు న్యాయమైనవిగాను అవసరమైనవిగాను నేను ఇక్కడ కనుగొన్నాను. వాటన్నిటిలో దేవుని దయాకనికరాలనుకూడా నేను కనుగొన్నాను.

ఇక్కడ మేము పరిశుద్దుల తోను దేవదూతలతోను మాత్రమేగాక, సృష్టికర్తయైన దేవునితోకూడా సంభాషిస్తూ సహవాసము చేస్తాము.

ఎపెనెటస్, భూమిమీద నేను ఎదుర్కొన్న శ్రమలు కష్టాలు బాధలు వేదనలు కేవలం నాకు అవసరమైనవనీ సమయానుకూలమైనవనీ నేను ఇక్కడ పూర్తిగా ఒప్పింపబడ్డాను. అవన్నీ నా నిరీక్షణను ఏమాత్రం చెరిపివేయలేదుగాని, అవి దానిని ఇంకను బలపరిచాయి. వాటిద్వారా నా సంక్షేమము ఏమాత్రము గాయ పరచబడలేదుగాని, దానికి బదులుగా, నా మేలునిమిత్తమే భూమిమీద ప్రతిదీ జరుగుతూ వచ్చింది (రోమా 8:28 చూడుము).

అవును ఎపెనెటస్, భూమిమీద నా గ్రుడ్డితనముయొక్క గ్రహింపును ఆవరించిన కారుమబ్బులన్నీ ఈ మహిమా ప్రదేశంలోనికి నేను ప్రవేశించిన మరుక్షణమే తొలగిపోయాయి. నా కష్టాలలో నేను చేసికొనిన నిర్ణయాలు, వాటిద్వారా నేను పొందిన కృంగుదల, అవి నా విశ్వాసాన్ని కదిలించిన విధానము, నాకు ఇప్పుడు బహుమానాలుగా మారాయి.

పరిశుద్ధులు దేవుని సహవాసాన్ని అనుభవిస్తారు

జూనియస్ : ఎపెనెటస్, ముగింపు మాటగా నేను చెప్పదలచేది ఏమనగా, ఇక్కడ మేము పరిశుద్ధులతోను దేవదూతలతోను మాత్రమేగాక, సృష్టికర్తయైన

దేవునితోకూడా సంభాషిస్తూ సహవాసము చేస్తాము. ఇక్కడ మేము పరలోక సన్నిధిని మాత్రమేగాక, దాని నిర్మాణకుడైన దేవుని సన్నిధినికూడా అనుభవించి ఆనందిస్తున్నాము. మా సమస్తములో సమస్తమైన ఆయనను మేము ఉన్నట్టుగానే చూస్తున్నాము.

యుగయుగాలుగా తన మహిమను బయలుపరచుచున్న మహిమగల దేవుని సన్నిధినీ, ఆయన సన్నిధిలోని ఆనందాలనూ తప్ప ఇక్కడ మేము మరి దేనినికూడా ఆశించము. ఆయనను స్తుతించి ఆరాధించేందుకు మరిన్ని నాలుక లను తప్ప మరి వేటినీ మేము ఇక్కడ ఆశించము. మాకు ఆయన దయచేసిన ఈవులకు ప్రతిగా ఆయనను మరెక్కువగా స్తుతించి ఆరాధించే సామర్థ్యమును తప్ప మరి దేనినీ మేము ఇక్కడ ఆశించము.

పరిశుద్ధులు పరిపూర్ణ ఆనందాన్ని అనుభవిస్తారు

జూనియస్ : ప్రకాశమానమైన ఈ పరలోక గృహాలలో నివసించేవారికి ఏదియు కొదువ ఉండదు. మాకు అవసరమైనవీ, మేము ఆశించేవీ సమస్తమూ ఇక్కడ మాకు లభిస్తాయి. ఇక్కడ మాకు సమయమనేదే తెలియదు. సమయాన్ని గురించిన ధ్యాసకూడా ఇక్కడ మాకు ఉండదు. కాలము ఎలా దొర్లిపోతుందోకూడా ఇక్కడ మాకు తెలియదు. ఇక్కడ మా ఆనందము ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది. శతాబ్దాలు గడిచినా అది పాతగిలదుగాని, అది మొదట్లో ఎంత తాజాగా ఉండేదో ఎల్లప్పుడూ అంతే తాజాగా ఉంటూ మాకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక్కడ మా సంతోషానికి ఉన్న ప్రత్యేకత అదే. అది ఎల్లప్పుడూ ఒకేవిధంగా ఉంటుంది. అది ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది. ఇక్కడ మాకు అలసట అనేదే తెలియదు. అసంపూర్ణతకు ఇక్కడ తావేలేదు.

ఇక్కడ మాకు సమయమనేదే తెలియదు. సమయాన్ని గురించిన ధ్యాసకూడా ఇక్కడ మాకు ఉండదు. కాలము ఎలా దొర్లిపోతుందోకూడా ఇక్కడ మాకు తెలియదు.

ఎపెనెటస్, ఇలా నేను ఎన్నని చెప్పుకుపోను? ఇక్కడ మేము అనుభవిస్తున్న ఆధిక్యతలను ఎన్నని నీకు వివరించను? అవి లెక్కకు మించినవి! అవి నీ ఊహలకు అందనివి!

పరిశుద్ధుల ఆనందం నిరంతరం తాజాగా ఉంటుంది

జూనియస్ : ఇక్కడ మా ఆశీర్వాదస్థితి ఎంతో ఉన్నతమైనది అయినందు నను, ఇక్కడ మేము అనుభవిస్తున్న ఆశీర్వాదాలు లెక్కకు మించినవి అయినందు నను, వేర్వేరు విధములైన మార్పులను ఇక్కడ మేము ఆశించము. ఇక్కడ వాటి అవసరత మాకు అస్సలు ఉండదు. ఇక్కడ సమస్తమూ పరలోకానికి కేంద్రబిందు వైన దేవునికి సంబంధించినవిగానే ఉంటాయి. ఇక్కడ మేము అనుభవించే ఆనందాలు లెక్కకు మించినవి. అవన్నీ ఒక ప్రకాశమానమైన వజ్రమువలె వివిధ కోణాల్లో విభజించబడి కాంతులు వెదజల్లుతూ ఉంటాయి. సరిగ్గా చెప్పాలంటే, ఇక్కడ మేము అనుభవించే వివిధ ఆనందాలన్నీ దేవునిలోనే ఇమిడి, ఆయన చుట్టూ కేంద్రీకరించబడి ఉన్నాయి. అవన్నీ మమ్మల్ని సంపూర్ణంగా సంతృప్తి పరుస్తూ, అలసటలేకుండా వాటిని అనుభవించేందుకు మమ్మల్ని ప్రోత్సహిస్తాయి. వాటిలో ఏవీ మమ్మల్ని నిరాశకు గురిచేయవు.

ఇతర ఆనందములు మనుష్యులు ధరించే వస్త్రములవలె త్వరగా పాతగిలిపోతాయి. అయితే, పరలోకంలో మేము అనుభవించే ఆనందములు అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలీ యులు ధరించిన వస్త్రములవలె నిరంతరం క్రొత్తగా ఉంటాయి. ఒక అయస్కాంతమును తాకిన సూది కొన్ని యుగాల తర్వాతకూడా మొట్టమొదట దానికి అతుక్కుపోయినట్లుగానే ఎలా ఉంటుందో, అలానే ఇక్కడి పరిశుద్ధులు తమ పరలోక తండ్రితో మొట్ట మొదట ఐక్యపరచబడినప్పుడు ఎలా ఉన్నారో, ఎన్ని యుగాల తర్వాత అయినా అదే తాజాదనంతో ఆయనలో ఆనందిస్తూ ఆయనతో జతపరచబడి ఉంటారు.

మా అనుభవాలు అధికమైనప్పుడు, అవి మాకు తారాస్థాయిలో
ఆనందాన్ని కలిగిస్తున్నప్పుడు, వాటిని మేము పదేపదే
రుచిచూచి ఆనందించేందుకు ఇష్టపడతాం.

మా సంతోషము మా అనుభవాలద్వారా అభివృద్ధి చెందనట్లయితే, మా అనుభవాలు అంత సంతోషకరమైనవి కానట్టే. మా అనుభవాలు అధికమైనప్పుడు, అవి మాకు తారాస్థాయిలో ఆనందాన్ని కలిగిస్తున్నప్పుడు, వాటిని మేము పదేపదే రుచిచూచి ఆనందించేందుకు ఇష్టపడతాం. అలాంటి అనుభవాలు మాకు నిత్యమైన అనుభవాలుగా మారినప్పుడు, అవధులులేని మా ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు? ఆ ఆనందానుభవాలను మేము అత్యంత అమూల్యమైన విగా భావిస్తూ, వాటన్నిటికోసం మేము నిరంతరం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూవుంటాము.

ఎపెనెటస్, నేను నీకు క్లుప్తంగా చెప్పాలంటే, తరిగిపోని మా ఆనందములు ఇక్కడ లెక్కకు మించినవిగా ఉన్నాయి. వాటన్నిటినీ మేము అనుభవించాలంటే నిత్యత్వంలో మేము నివసించే కాలము సరిపోదేమో!

పరిశుద్ధుల ఆనందము కొలవలేనిది

జూనియస్ : అయితే ఎపెనెటస్, ఇంకను శరీరంలోనే ఉన్న నీవు, నేను నీకు వివరిస్తోన్న విషయాలను వినేందుకు అలసిపోయి ఉంటావని నేను అనుకొంటున్నాను. కావున, ఇప్పుడు నేను మా ఆనందముయొక్క ఒకే ఒక లక్షణాన్ని మాత్రమే నీకు తెలిపి ముగిస్తాను. ఇక్కడి ఆనందమును మరియు మహిమను అనుభవించే పరిశుద్ధులు వాటిని తమలోతాము పంచుకొనరు. లేదా, ఇతరుల ఆనందమువల్ల తమ ఆనందము ఏమాత్రం తక్కువకాదు. ఈ పరలోక ఆనందపు సముద్రము ఎంత విస్తారమైనదంటే, ఇక్కడున్న పరిశుద్ధులు మరియు దేవదూతలు నిరంతరం వాటిని అనుభవిస్తున్నప్పటికీ అవి ఏమాత్రం తరిగిపోవు!

తరిగిపోని మా ఆనందములు ఇక్కడ లెక్కకు మించినవిగా ఉన్నాయి. వాటన్నిటినీ మేము అనుభవించాలంటే నిత్యత్వంలో మేము నివసించే కాలము సరిపోదేమో!

అంతేకాదు, క్రింది ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. వాటన్నిటినీ ఉన్నప్పటికీ, వాటిలో ఎక్కువభాగం సముద్ర మేము అనుభవించాలంటే జలాలచే విభజించబడి ఉన్నప్పటికీ, ప్రతి నిత్యత్వంలో మేము దేశమూ వెలుగుయొక్క లాభాన్ని సమానంగా నివసించే కాలము అనుభవించి ఆనందిస్తూ ఉంటాయి. ఇతర సరిపోదేమో! దేశాలు ఆ వెలుగును ఉపయోగించుకొన్నందున తమకు ఆ వెలుగు తక్కువ అవుతుందని ఏ దేశమూ ఫిర్యాదు చేయదు. అన్ని దేశాలూ ఆ వెలుగును సమృద్ధిగా అనుభవిస్తూ ఉంటాయి.

నీతిసూర్యునికీ, క్రింది ప్రపంచంలో ప్రకాశించే సూర్యునికీ మధ్య ఈ విషయంలో నిజంగా తేడావుంది. క్రింది ప్రపంచంలో ప్రకాశించే సూర్యుడు తన ప్రసన్నతద్వారా గ్రహాలన్నిటిని మరుగుపరుస్తుండగా, అత్యంత ప్రకాశమానంగా వెలుగొందే నీతిసూర్యుడగు మన ప్రభువు మాత్రము తన ప్రసన్నతద్వారా తనచుట్టూ ఉన్న పరిశుద్ధులనందరినీ తేజోవంతంగా ప్రకాశింపజేస్తున్నాడు. ఈ విషయంలో “మనకు జీవమైయున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతోకూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు” (కొలస్సీ. 3:4) అని అపొస్తలుడైన పౌలు పలికిన మాటలు వాస్తవమైనవి.

“నేను … నా ప్రియునిదానను, అతడును నావాడు” పరమ గీతము 6:3) అనునది తన విమోచకుని గురించి ప్రతి పరిశుద్ధుడును చేయు ఆనందగానమైయున్నది. ఎందుకనగా ఆయన వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికీ చెందినవాడు. దేవునియందు నమ్మికయుంచినవారందరినీ ఆయన తన మందిర సమృద్ధితో తృప్తిపరచి, ఆనంద నదీజలాలను త్రాగేలా చేస్తాడని తన విమోచకునికి స్తుతి గీతాలు ఆలపించుటలో అత్యంత నైపుణ్యము కలిగిన దావీదు చెప్పాడు (కీర్తనలు 36:8).

నేను ఇంతవరకు పరలోక కనానును గురించి నీకు క్లుప్తంగా వివరించాను.దాని వాస్తవస్థితిలో వెయ్యవభాగముకూడా నేను నీకు తెలుపలేదు.

విస్తారమైన జనసమూహములు ఒకే నది జలాలను త్రాగినప్పటికీ, దానిలోని నీరు ఏ మాత్రం తరిగిపోవు. దానిలోని నీరు ఎవరికి ఎంత అవసరమో అంతగా వారు ఆ నీటిని స్వేచ్ఛగా త్రాగవచ్చు. అనుమతి పొందినవారే తప్ప వేరెవరూ దానిలోని నీరు త్రాగేందుకు ఏమాత్రం అనుమతించ బడరు. అదేవిధంగా, ఎవరైతే దేవునిలో ఆనందిస్తూ అయన సన్నిధిని అనుభవిస్తూ ఉంటారో, వారు ఆయన జీవజలనదిలోని నీటిని తృప్తిగా త్రాగి ఆనందించేందుకు అనుమతించబడతారు.

ఎపెనెటస్, నేను ఇంతవరకు పరలోక కనానును గురించి నీకు క్లుప్తంగా వివరించాను. దాని వాస్తవస్థితిని వెయ్యవభాగముకూడా నేను నీకు తెలుపలేదు. అయినప్పటికీ, పాలుతేనెలు ప్రవహించే ఈ దేశాన్ని గురించి నీవు అర్థంచేసికో డానికీ, దీనిని గురించిన ఆశ నీలో అధికం చేయడానికీ నేను నీకు చెప్పిన విష యాలు చాలు. ఇక్కడికి వచ్చి ఇందులోని ఆనందాన్ని వ్యక్తిగతంగా అనుభవించేంత వరకు ఎవరునూ ఈ మహిమా రాజ్యాన్ని గురించి సంపూర్ణంగా గ్రహించలేరు.

జూనియస్ తన సంభాషణను ముగించాడు. నేను అతనికి పదేపదే కృతజ్ఞ తలు తెలిపాను. అతడు నాకు చెప్పిన మాటల్లో ఏదికూడా నాకు విసుగుకలిగించ లేదని నేను అతనికి తెలిపాను. అంతేగాక, నాకు అతడు తెలిపిన విషయాలన్నీ నాకు అమితానందాన్ని కలిగించాయని నేను అతనికి తెలిపాను. నా విమోచకుని కృపాసమృద్ధిద్వారా ఇక కొద్దికాలంలో నేను పాలుపొందబోతున్న ఆ మహిమా రాజ్యాన్ని గురించీ, అందులోని సంతోషాన్ని గురించీ ఎన్నో వాస్తవాలను తెలిసి కోవడం ఎంత అద్భుతమైన విషయం!

జూనియస్ : ఇక మర్త్యమగు నీ శరీరము మరణించేవరకు “విశ్వాసము చేతను ఓర్పుచేతను” (హెబ్రీ 6:12) వేచియుండుట మాత్రమే ఇక నీకు మిగిలివుంది. అప్పుడు నేను చెప్పిన విషయాలకన్నా మరెక్కువ విషయాలను చూడటమేగాక, నీవు స్వయంగా అనుభవించి ఆనందిస్తావు. ఇప్పుడైతే సింహా సనం యెదుట పరిశుద్ధులును దేవదూతలును పాడే మధురగీతాలను నీ చెవులు వినలేవు. పరిశుద్ధులు నిరంతరం ఇక్కడ ఆలపించే స్తుతిగీతాలను నీ నాలుక ఆలపించలేదు. మర్థ్యులైన ఇతర మనుష్యులకంటె నీ కళ్ళు బలపరచబడినప్పటికీ, ఈ అద్భుతమైన ప్రదేశాన్ని నింపుతోన్న మహిమను అవి ఏమాత్రం చూడలేవు. క్రిందిలోకంలోనున్న మనుష్యులెవ్వరికీ ఇవ్వబడనంత గొప్ప ఆధిక్యతను నీకు అనుగ్రహించి నిన్ను ఈ మహిమా ప్రదేశానికి రప్పించిన దేవుని కృపను నీవు నిరంతరం కొనియాడుతూ ఉండాలి.

ఎపెనెటస్ తన తల్లిని చూడాలని ఆశించుట

ఎపెనెటస్ : నేను ఈ ఆశీర్వాదకరమైన మహిమలో ప్రవేశించుట అనునది సంభవించేందుకు ఇంకను కొంతకాలం పడుతుంది. ఎన్నటికీ అంతంకాని ఈ నిత్యమహిమా రాజ్యంలో ప్రవేశించే ఆ శుభసమయంకోసం నేను విశ్వాసము తోను ఓర్పుతోను వేచియుంటాను. నాలో ప్రారంభించబడిన దేవుని మహిమా కార్యము నిరంతరం నిలిచివుంటుందని నేను ఆశిస్తున్నాను. కాని జూనియస్, ఇక్కడ నేను నిన్ను చూసి నీతో సంభాషించిన విధంగా నా తల్లినికూడ చూసి ఆమెతో సంభాషించలేనా? ఆమె ఇక్కడి పరిశుద్ధులలో తప్పక ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. నా బాల్యదినాల్లో ప్రతిదినం బైబిలు చదవమని ఆమె నాకు చెబుతూ ఉండేది.

భక్తితో కూడిన ఆమె బోధలు నన్ను నిత్యమైన పరలోకం వైపు చూసేలా చేశాయి. చివరిగా తన మరణశయ్యపై ఆమె నాతో మాట్లాడుతూ, చివరివరకు ప్రభువును సేవించమని నాకు ఆజ్ఞాపించింది. ఈ ప్రదేశంలో నన్ను చూసి ఆమె తప్పక ఆనందిస్తుందని నేను అనుకొంటున్నాను.

భూసంబంధమైన సంబంధ బాంధవ్యాలకు పరలోకంలో తావుండదు

జూనియస్: ఎపెనెటస్, నీవు ఆశించి నట్లుగా నీ తల్లి ఇక్కడే ఉంది. అంతేకాదు, ఆమె నిన్ను చూసి తప్పక ఆనందించి దేవుని మరింత మహిమపరుస్తుంది. కాని ఎపెనెటస్, ఈ సంతోషకరమైన స్థలంలో ప్రాపంచిక సంబంధబాంధవ్యాలు ఏమాత్రం ఉండవు. ఇక్కడ ఆడ మగ అన్న తారతమ్యాలుకూడా అస్సలు ఉండవు. ఇక్కడ అందరూ ఆత్మ స్వరూపులై దేవదూతలవలె ఉంటారు (మత్తయి 22:30). ఎందుకనగా, ఆత్మల్లో లైంగిక బేధాలు ఉండవు. ఇక్కడ అన్ని రకాల సంబంధాలూ దేవునియందు కనుమరుగైపోతాయి.

ఈ సంతోషకరమైన స్థలంలో ప్రాపంచిక సంబంధబాంధవ్యాలు ఏమాత్రం ఉండవు. ఇక్కడ ఆడ మగ అన్న తారతమ్యాలుకూడా అస్సలు ఉండవు. ఇక్కడ అందరూ ఆత్మస్వరూపులై దేవదూతలవలె ఉంటారు.

అయినప్పటికీ, క్రింది లోకంలో నీకు తల్లిగా ఉండిన వ్యక్తిని ఇక్కడ నీవు ప్రస్తుతం చూసి ఆమెతో సంభాషించగలవు.

జూనియస్ నన్ను నా తల్లివద్దకు తీసుకెళ్ళి ఆమె యెదుట నిలువబెట్టాడు. ఆమె నా యెదురుగా
ఉన్నప్పటికీ నేను ఆమెను గుర్తుపట్టలేకపోయాను. ఎందుకనగా, ఆమె ఒక తేజోనక్షత్రంలో ప్రకాశిస్తూ నాకు కనిపించింది.

అతడు అలా చెప్పడం ముగించి, నా చెయ్యి పట్టుకొని వింటిలోని బాణం కంటె వేగంగా అమరత్వపు వస్త్రాలను ధరించి ప్రకాశిస్తోన్న అనేకమంది పరిశు దులను దాటించుకొంటూ నన్ను తీసుకెళ్ళ సాగాడు. అలా నేను వారిని దాటి వెళుతుండగా వారు ఆశ్చర్యంగా నావైపు చూడసాగారు. మర్థ్య మైనవియు దయనీయమైనవియునైన నా వస్త్రా లనుబట్టియే వారు అలా నావైపు వింతగా చూశా రని నేను ఆ తర్వాత తెలుసుకొన్నాను. అలా జూనియస్ నన్ను నా తల్లివద్దకు తీసుకెళ్ళి ఆమె యెదుట నిలువబెట్టాడు. ఆమె నా యెదురుగా ఉన్నప్పటికీ నేను ఆమెను గుర్తుపట్టలేకపోయాను. ఎందుకనగా, ఆమె ఒక తేజోనక్షత్రంలా ప్రకాశిస్తూ నాకు కనిపించింది.

జూనియస్ నిష్క్రమణ

జూనియస్ : నా ప్రియ నేస్తమా, ఎపెనెటస్, నాకిక సెలవా? నీవు నానుండి ఆశించినదానిని నేను నెరవేర్చాను. కాసేపటి తర్వాత నీ సంరక్షకుడైన దేవదూత నీ వద్దకు వచ్చి నిన్ను క్రింది లోకానికి తీసుకెళతాడు.

నీవు అక్కడకు వెళ్ళాక, భౌతిక నేత్రాలతో పరలోక మహిమలను తిలకించేందుకు నిన్ను అనుమతించిన దైవిక ప్రేమను మరియు దైవిక అద్భుతాలను నీవు ఏమాత్రం మరువవద్దు, నిరంతరం వాటియందు ఆనందించడాన్నిగాని సర్వోన్నతుడగు దేవుని స్తుతించి ఆరాధించడాన్నిగాని నీవు ఎన్నడూ నిలిపివేయవద్దు.

ఎపెనెటస్ తన తల్లిని కలిసికొనుట

జూనియస్ నన్ను విడిచి వెళ్ళగానే నా యెదుట ప్రకాశిస్తోన్న వ్యక్తివైపు నేను అడుగులు వేసాను. ఆమె నాకు అత్యంత కాంతివంతంగా కనిపిస్తూ, మహిమ కరంగా ప్రకాశిస్తోంది. ఆమె ముఖకాంతిని నేను అస్సలు చూడలేకపోయాను. ఏలీయా మరియు జూనియస్లకంటే ఎక్కువగా ఆమె ప్రకాశిస్తోంది. ఆమెను నిదానించి చూసి ఆమె నిజంగా నా తల్లేనని నేను నిర్ధారించుకొన్నాక, నేను ఆమెతో మాట్లాడటం ప్రారంభించాను.

ఎపెనెటస్ : అమ్మా, ఈ ఆమరత్వపు స్థితిలో అత్యంత ప్రకాశమానంగా వెలుగొందుతోన్న నిన్ను చూస్తుంటే నాకు మహదానందంగా ఉంది.

దేవుని విశ్వాస్యతకు సాక్ష్యల పలుకుట

తల్లి : ప్రియమైన ఎపెనెటస్, నేను ఏమైయున్నానో అది కేవలం సింహాసనా సీనుడైయున్న దేవునియొక్కయు గొఱ్ఱపిల్లయొక్కయు కృపయే స్తుతియు మహిమయు ప్రభావమును వారికే చెందునుగాక. ఎందుకనగా, నా ప్రస్తుత స్థితికి కేవలం వారు మాత్రమే కారణం.

నేను ధరించినదిగా నీవు చూస్తోన్న ఈ మహిమావస్త్రము విమోచకుడగు యేసు వెలుగు కిరణాల ప్రతిబింబం మాత్రమే! అవును ఎపెనెటస్, ఆయన మొదట తన నీతివస్త్రమును నాకు ధరింపజేసి యుండనట్లయితే, ఈ మహిమ వస్త్రాన్ని నేను ఎన్నటికీ ధరించియుండలేను.

నీవు ఇక్కడకు ఎలా వచ్చావని నేను నిన్ను ప్రశ్నించను. ఎందుకనగా, ఏలీయా ఈపాటికే నిన్ను గురించి నాకన్ని విషయాలూ చెప్పాడు. కేవలం అపారమైన దైవిక కృప మాత్రమే నిన్ను ఇక్కడకు అనుమతించిందని నేను గుర్తిస్తు న్నాను. దానికోసం ఆయన నిత్యమూ స్తుతించబడునుగాక.

నేను ధరించినదిగా నీవు చూస్తోన్న ఈ మహిమావస్త్రము విమోచకుడగు యేసు వెలుగు కిరణాల ప్రతిబింబం మాత్రమే!

ఎపెనెటస్, ఎన్నో ప్రమాదాలను తప్పిస్తూ దైవిక కృప మా ఆత్మలను ఈ మహిమలోనికి నడిపించింది! దైవిక ప్రేమ నన్ను దర్శించిన సమయంలో నేను నిత్యనాశనానికి ఎంత సమీపంగా ఉన్నానో నేను ఎన్నటికీ మరువలేను. ఒకప్పుడు నేను దారిద్ర్యంలోను, గ్రుడ్డితనంలోను, దిగంబరత్వంలోను ఉన్న సమయంలో, (ప్రకటన 3:17 చూడుము) పాపపు మురికి కూపంలో నేను కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆయన సమృద్ధియైన కృప దయనీయమైన ఆ స్థితిలో నన్ను కనుగొని తన అపారమైన ప్రేమతో నా మురికినంతా కడిగి నా పాపాన్ని పరిహరించింది.

నేను ఆ సమయంలో కేవలం కారుచీకటిని తప్ప మరేమీకాను. అయితే, ఎంత అద్భుతమైన మార్పు! ఎంత సంతోషకరమైన విమోచన! నేను ఇప్పుడు సంపూర్ణంగా వెలుగు, ప్రేమ మరియు ఆనందాలతో నింపబడ్డాను.

ఒకప్పుడు నేను దారిద్ర్యంలోను దయనీయమైన స్థితిలోను కొట్టుమిట్టాడుతూ జీవించాను. అయితే, ఇప్పుడు నేను పరలోక ఐశ్వర్యంతో నింపబడ్డాను. ఇప్పుడు పరలోక ధననిధులలోనుండి నేను స్వీకరించగలిగినంతగా నేను స్వీకరించి అనుభవిస్తూ ఆనందిస్తున్నాను. ఒకప్పుడు నేను దిగంబరిగా జీవించాను, ఇప్పుడైతే మహిమా వెలుగుతో కూడిన వస్త్రములను నేను ధరించియున్నాను.

ఒకప్పుడు నేను దైవిక సన్నిధిని కోల్పోయి నిత్య నరకానికి వారసురాలనుగా ఉండెడిదానను. ఇప్పుడైతే దేవుని సన్నిధికాంతిచే నేను నింపబడ్డాను. అప్పటి స్థితికీ ఇప్పటి స్థితికీ నాలో ఎంతటి వ్యత్యాసం! గాలి తుఫానుల మధ్య గాఢాంధ కారపు రాత్రిలాంటి భౌతిక జీవితం తర్వాత వెలుగు దినంలాంటి ఈ పరలోక అనుభవం ఎంత ఆహ్లాదకరమైనది! గత వేదనలన్నీ ఎంతటి ఆనందాన్నీ సంతోషాన్నీ ఉత్పత్తిచేశాయి! ఇవన్నీ జయవీరుడైన నా విమోచకునికి హల్లెలూయ పాటలు పాడేందుకు నన్ను ప్రేరేపిస్తున్నాయి.

గాలి తుఫానుల మధ్య గాఢాంధకారపు రాత్రిలాంటి భౌతిక జీవితం తర్వాత వెలుగు దినంవంటి ఈ పరలోక అనుభవం ఎంత ఆహ్లాదకరమైనది!

నా తల్లి ఇంతటి ఉన్నతమైన పరిశుద్ధస్థితిలో ఉన్నందుకు నేను అమితమైన సంభ్రమాశ్చర్యా నింపబడ్డాను. కాసేపు నా నోటనుండిలతో మాటరాలేదు.

ఎపెనెటస్ : నా ప్రియమైన తల్లీ, నిజంగా పరలోకంలో ఉన్న పరిశుద్ధులలో ఒకరివలె నీవు మాట్లాడుతున్నావు.

తల్లి : ఎపెనెటస్, ఇది ఏదో ఒక వింతగా నీవు భావించవద్దు. ఇక్కడ దైవిక ప్రేమ మరియు కృపలద్వారా మేము అనుభవించే అద్భుతాలెన్నో మా స్తుతిగానా లకు మూలకారణాలుగా ఉన్నాయి. అంతే కాదు, ఒకప్పుడు నేను నీకు తల్లిగా ఉండి నప్పటికీ, ఇక్కడ నీవు నన్ను తల్లిగా సంబోధించ కూడదు. ఎందుకంటే, భౌతిక సంబంధ బాంధ వ్యాలకు ఇక్కడ ఏమాత్రం తావుండదు. పరలోక కుటుంబమునకు తండ్రియైన దేవునితో మాత్రమే ఇక్కడ మా సంబంధబాంధవ్యాలు పెనవేసుకొని ఉంటాయి.

ఒకప్పుడు నేను నీకు తల్లిగా ఉండినప్పటికీ, ఇక్కడ నీవు నన్ను తల్లిగా సంబోధించకూడదు. ఎందుకంటే, భౌతిక సంబంధ బాంధవ్యాలకు ఇక్కడ ఏమాత్రం తావుండదు.

అంతేగాక ఎపెనెటస్, నేను నీకు ఇంకో విషయాన్నికూడా తెలపాలని ఆశిస్తున్నాను. భూమిమీద నా శరీరమునుండి జన్మించిన కుమారునిగాకాక, ప్రభువును ప్రేమించి ఆయనయందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా నీవు నాకు ఇక్కడ అత్యంత ప్రియమైనవాడవు. విశ్వాసముద్వారా నీవు ఆయన దత్తపుత్రుడవు. మా సంతోషపు ఊట అయిన దేవుని సహవాసాన్ని కలిగియుండుటే ఇక్కడ మాకున్న గొప్ప ఆధిక్యత. ఆయననుండియు ఆయనద్వారాను మాత్రమే మేము ఇక్కడ సమస్తాన్నీ అనుభవించి ఆనందిస్తున్నాము. ఆయనను అనుభవించి ఆయనయందు ఆనందించుటద్వారా మేము ఇక్కడ సమస్తాన్నీ పొందుతున్నాము (ఎఫెసీ 3:20 చూడుము).

ఆ తర్వాత నేను ఏ స్థితిలో నా తండ్రినీ, నా సహోదరులనూ భూమిమీద వదలి ఇక్కడకు కొనితేబడ్డానో నేను వివరించడం తనకు ఇష్టమా కాదా అని నేను ఆమెను ప్రశ్నించాను.

తల్లి : అవేవీ నాకు చెప్పవద్దు. ఎందుకనగా, నేను నా భౌతిక శరీరాన్ని వదలివేసినందున, నా భౌతిక సంబంధబాంధవ్యాలనుకూడ నేను వదలివేసాను. ఇక్కడ దేవుడే నాకు సమస్తమైయున్నాడు. నాకు ఇప్పుడు భర్తలేడుగాని, నా ఆత్మకు ఒక ఆశీర్వాదకరమైన పెండ్లికుమారుడు ఇక్కడ నాకున్నాడు. ఆయన మానవ కుమారులందరికంటే అత్యంత సుందరుడు. ఆయనే నేను ఎక్కువగా ఆశింపదగినవాడు. ఆయనతోటి సంబంధబాంధవ్యాలు తప్ప మరే సంబంధ బాంధవ్యాలూ నాకు ఇక్కడ లేవు. ఇక్కడున్న మేమందరము ఇప్పుడు ఒకే తండ్రి పిల్లలము మరియు ఒకే యజమానుని దాసులము. ఆయన సేవయే మాకిప్పుడు పరమానందమును పరిపూర్ణ స్వేచ్ఛయునై యున్నది.

నాకు ఇప్పుడు భర్తలేడుగాని, నా ఆత్మకు ఒక ఆశీర్వాదకరమైన పెండ్లికుమారుడు ఇక్కడ నాకున్నాడు. ఆయన మానవ కుమారులందరికంటే అత్యంత సుందరుడు. ఆయనే నేను ఎక్కువగా ఆశింపదగినవాడు. ఇక్కడున్న మేమందరము ఇప్పుడు ఒకే తండ్రి పిల్లలము. మరియు ఒకే యజమానుని దాసులము.

అయితే, నేను భూమిమీద వదలివచ్చిన ఒకప్పటి నా కుటుంబసభ్యుల విషయానికొస్తే, నేను వారిని దేవుని కృపాహస్తాలకు వదలివేసాను. అందుకు నేను అమితంగా ఆనందిస్తున్నాను. వారందరుకూడా నాలాగా ఈ మహిమకర మైన పరలోక రాజ్యానికి రావాలన్నదే నా ఆశ. అప్పుడు నా సంతోషం ఇంకను అధికమౌతుంది. అయితే, వారు దేవుని కృపను నిరాకరించి, తమ రక్షణకు విరోధియైన సాతానుని వెంబడించి, తమ అవిశ్వాసముద్వారా నాశనమైనట్లయితే, తన న్యాయతీర్పునుబట్టి దేవుడు మహిమపరచబడ తాడు. అప్పుడుకూడా ఆయన మహిమార్థం ఆయన మహిమలో నేను ఆనందిస్తాను. అయితే ప్రియమైన ఎపెనెటస్, నీవు తిరిగి భూలోకానికి దిగిపోయి వారిని కలుసుకొన్న తరువాత, వారికి దేవుని ప్రేమను గురించి తెలిపి వారిని నీతి మార్గంలో నడిపించడం మంచిది. అందుకే నీవు ఈ మహిమకరమైన పరలోకపట్టణానికి తీసికొనిరాబడ్డావన్న విషయాన్ని నీవు మరచి కు .

హతసాక్షులు దేవుని మహిమపరుస్తారు

నేను అలా నా తల్లితో సంభాషిస్తుండగా లెక్కించలేని విస్తారమైన సమూహం నా యెదురుగా నన్ను దాటిపోయింది. వారందరూ ప్రకాశమానమైన తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నారు. అంతటి తెల్లని వస్త్రాలను నేను ఎన్నడూ చూడలేదు. వారి వస్త్రాలు ఉదయకాలపు కాంతిలాగా మెరుస్తున్నాయి. వారందరూ మహిమ కిరీటాలను తమ తలలపై ధరించియున్నారు. అవన్నీ ధగధగా మెరుస్తున్నాయి. వారిలో ప్రతిఒక్కరూ విజయసూచకమైన ఒక ఖర్జూరమట్టను తమ కుడిచేతిలో పట్టుకొనియున్నారు. వారు అలా వెళుతూ, “సింహాసనాసీనుడైన మా దేవుని కిని గొఱ్ఱపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో” (ప్రకటన 7:10) కేకలు వేయడాన్ని నేను విన్నాను. ఆ తర్వాత తమ ముఖములను తమ రెక్కలతో కప్పుకొని వెళుతోన్న దేవదూతల సమూహాన్ని నేను చూశాను. వారు ప్రకాశమానంగా కనిపిస్తున్నారు. వారందరూ “యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని” (ప్రకటన 7:12) కేకలు వేస్తూ వెళ్ళడాన్ని నేను విన్నాను.

వారందరూ “యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు
బలమును కలుగును గాకని” కేకలు వేస్తూ వెళ్ళడాన్ని నేను విన్నాను.

తమ చేతుల్లో ఖర్జూరపు మట్టలు పట్టు కొని వెళుతోన్న విస్తారమైన ఆ సమూహము ఎవరని నేను నా తల్లిని ప్రశ్నించాను. వారం దరూ భూలోకంలో క్రీస్తు నిమిత్తము అమితంగా శ్రమలను సహించి మరణించిన హతసాక్షు లని ఆమె నాకు తెలిపింది. వారందరూ గొట్టె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొన్నా రనికూడ ఆమె నాకు తెలిపింది. వారు జయసూచకంగా తమ చేతుల్లో ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఉన్నారు (ప్రకటన 7:9,13,14). వారు ఎక్కడనుండి వచ్చారని నేను ప్రశ్నించాను. వారందరూ –“నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా,యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా” ప్రకటన 6:10) మొర పెడుతూ బలిపీఠం క్రిందనుండి వచ్చారని ఆమె నాకు తెలిపింది.

ఎపెనెటస్ : ఇక్కడున్న పరిశుద్ధులందరూ దేవుని సమాధానాన్నీ ఆనందాన్నీ అనుభవిస్తూ విశ్రాంతి తీసుకొంటూ ఉంటారని నేను అనుకొన్నాను. ఒకప్పటి తమ సహజీవులపట్ల వారికి ఇక ఎలాంటి తలంపులూ ఉండవని నేను అభిప్రాయ పడ్డాను. నేను అలా ఎందుకు ఆలోచించానంటే, హతసాక్షులైన అనేకులు తమ విరోధులకోసం ప్రార్థిస్తూ మరణించడాన్ని గురించి నేను విన్నాను. అయితే, వారి క్షమాగుణం ఇక్కడ తారుమారు కావడం నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

హతసాక్షులైన అనేకులు తమ విరోధులకోసం ప్రార్థిస్తూ మరణించడాన్ని గురించి నేను విన్నాను. అయితే, వారి క్షమాగుణం ఇక్కడ తారుమారు కావడం నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

తల్లి : ఇక్కడున్న పరిశుద్ధులందరూ నిత్యవిశ్రాంతినీ, దేవుని సమాధానాన్నీ, పరలోక ఆనందాన్నీ కలిగియున్నారన్న మాట వాస్తవమే. అందులో వారు సంతోషి స్తున్నారనేందుకు ఎలాంటి అనుమానమూ లేదు. అయితే, వారందరూ తమ్మును తాము దేవుని చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకొన్నందున, అన్ని విషయాలలోను దేవుని చిత్తము నెరవేర్చ బడాలని వారు తప్పక కోరుకొంటారు. కావున, తమ్మును తీవ్రమైన శ్రమలకు గురిచేసి పరిశు ద్ధులయొక్కయు హతసాక్షులయొక్కయు రక్తాన్ని త్రాగిన (ప్రకటన 17:6) క్రీస్తు విరోధులకు తీర్పు తీర్చే విషయంలో దేవుని నామము ఘనపరచ బడునట్లుగా ఆయన చిత్తము నెరవేర్చబడాలని వారు తప్పక ఆశిస్తారు. ఆయన తీర్పు ఏదో వారికి బాగా తెలుసు.

ఎందుకనగా, బబులోను పతనమైనప్పుడు ఒక క్రొత్త పాట వారి నోట ఉంచబడుతుంది. అప్పుడు వారు “పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, దానిగూర్చి ఆనం దించుడి, ఏలయనగా దానిచేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చియున్నాడు” (ప్రకటన 18:20)  అని పలుకుతూ ఆనందగానాలు చేస్తారు.

అవును, అప్పుడు వారు ఇంకను ఇలా సంతోషగానాలు చేస్తారు –

“ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావ ములు మన దేవునికే చెల్లును; ఆయన తీర్పులు సత్య ములును న్యాయములునై యున్నవి; తన వ్యభిచార ముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమునుబట్టి దానికి ప్రతి దండన చేసెను” ప్రకటన 19:1,2).

కావున, కొద్దివారేమి గొప్పవారేమి ఆయన నామమునకు భయపడు ఆయన సేవకులందరు దేవునికి స్తుతిగీతాలు పాడతారు. అప్పుడు పరిశుద్ధులు హల్లె లూయ పాటలు పాడతారు. కావున, “నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా” ప్రకటన 6:10) వారు బలిపీఠం క్రిందనుండి చేసే మొర ప్రతీకారవాంఛతో చేసేది కాదుగాని, దేవుని నీతియుక్తమైన తీర్పులకుగాను ఆయన మహిమపరచబడాలన్న ఆశతోనే వారు అలా మొరపెడతారు.

భూమిమీద జరిగే సంభవాలు పరలోకంలో ఉన్న పరిశుద్ధులకు తెలుసా?

ఆమె జవాబు నన్ను సంతృప్తిపరచింది. ‘భూమిమీద జరుగుతున్న సంభవాలు పరలోకంలో ఉన్న పరిశుద్ధులకు తెలుసా? లేదా?’ అని నేను తెలుసుకోవాలను కొన్నాను. ఆ మాటే నేను నా తల్లిని అడిగాను.

తల్లి : ఇక్కడ మాకున్న ధ్యాసంతా కేవలం మా సంతోషాలకు ఊటయైన దేవుణ్ణి గురించి తెలుసుకోవటమే. మిగతా విషయాలపై మాకు అస్సలు ధ్యాస ఉండదు. ఇతరులను గురించిన విషయాలపై మాకు అస్సలు ఆసక్తి ఉండదు. వాటిని గురించి మేము అసలు పట్టించుకోము. ఆయన కళ్ళకు మాత్రమే సమస్తమూ కనిపిస్తూ ఉంటుంది. మేము మహిమపరచబడిన వారమైనప్పటికీ, మేము ఇంకను మా పరిధిలో ఉండవలసినవారమే. ఒకే సమయంలో అన్ని ప్రదేశాల్లోనూ ఉండుట అనగా ‘సర్వాంతర్యామి’గా ఉండుట అనునది కేవలం దేవునికి మాత్రమే ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం.

అయినప్పటికీ, రక్షణకు వారసులైన విశ్వాసులకు (హెబ్రీ 1:14) సహాయం చేస్తూ వారికి పరిచర్య చేసేందుకు పంపబడే దేవదూతలద్వారా క్రింది లోకంలో ఉన్న సంఘముయొక్క అభివృద్ధి లేదా పతనమును గురించిన సమాచారము మాకు తెలియపరచబడుతూ ఉంటుంది. మేము సింహాసనాసీనుడైనవానికిని
మేము మహిమపరచ బడిన వారమైనప్పటికీ, మేము ఇంకను మా పరిధిలో ఉండవలసినవారమే.

మేము మహిమపరచబడిన వారమైనప్పటికీ, మేము ఇంకను మా పరిధిలో ఉండవలసినవారమే. ఒకే సమయంలో అన్ని ప్రదేశాల్లోనూ ఉండుట అనగా ‘సర్వాంతర్యామి’గా ఉండుట అనునది కేవలం దేవునికి మాత్రమే ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం.

ఒకే సమయంలో అన్ని ప్రదేశాల్లోనూ ఉండుట అనగా ‘సర్వాంతర్యామి’గా ఉండుట అనునది కేవలం గొఱ్ఱపిల్లకును స్తుతిగానాలు చేస్తూ వారిని మహిమపరచేందుకు మాకు తెలియపరచబడిన ఈ సమాచారము మమ్ములను ప్రోత్సహిస్తుంది. తన సంఘాన్ని దేవుడు కాపాడి నడిపించే విధా నము మమ్ములను అమితంగా ఆనందపరు స్తుంది. క్రీస్తు శరీరమైన సంఘము సంపూర్ణంగా సిద్ధపరచబడేంతవరకు ఆయన దానిని సంర క్షించి, పోషించి, తద్వారా ఆయన మహిమ పరచబడాలని మేమందరం ఆశిస్తాం. ఆ సంఘాన్నిబట్టి మేము దేవుని హృదయ పూర్వ కముగా ఆరాధిస్తాం.

పరిశుద్ధులు పరలోకంలో తమ కాలాన్ని ఎలా వెళ్ళబుచ్చుతారు ?

నేను ఇంకొక విషయాన్ని గురించి మాత్రమే ఆమెను ప్రశ్నిస్తానని ఆమెతో చెప్పాను. ఎందుకనగా, నా మార్గదర్శియైన దేవదూత నాకొరకు రావడానికి సిద్ధంగా ఉన్నాడని నేను తలంచాను. పరలోకంలో పరిశుద్ధులు తమ కాలాన్ని ఎలా వెళ్ళబుచ్చుతారో, వారి సాధారణ సంభాషణ ఏ అంశాలపై సాగుతుందో నాకు తెలుపమని నేను నా తల్లిని అడిగాను.

భూలోకంలో గంటలు,రోజులు, వారములు, నెలలు, సంవత్సరములుగా కాలము విభజించబడి ఉంటుంది. అయితే, ఇక్కడ అలాంటివేవీ లేవు. ఇక్కడ రాత్రి పగలు అన్న భేదం ఉండదు. సంవత్సరాన్ని విభజించేందుకు ఇక్కడ ఋతువులు లేవు.

తల్లి : ఓ నా ఎపెనెటస్, ఈ ప్రకాశమానమైన ప్రదేశంలోకూడ నీవు భౌతిక ఆలోచనలచే ఎంతగా నింపబడి ఉన్నావు! నీ మర్త్యశరీరాన్ని ఇంకను చీకటి ఆలోచనలు ఎంత దట్టంగా ఆవరించివున్నాయి! మేము ఇంకను మర్త్యమైన శరీరాన్ని ధరించుకొన్నవారమని తలంచి నీవు మాట్లాడుతున్నావు. మాలోని మర్త్యత “మ్రింగివేయబడినదని” (2 కొరింథీ 5:4) నీవు గ్రహింపకున్నావు.

ఇక్కడ కాలము నిత్యత్వంలోనికి ఎలాంటి అంతం లేకుండా మార్చబడుతుంది. క్రింది లోకంలో కాలము నిరంతరం మార్పు చెందుతూ ఉంటుందన్న విషయం వాస్తవం. అక్కడ గంటలు, రోజులు, వారములు, నెలలు, సంవత్సరములుగా కాలము విభజించబడి ఉంటుంది. అయితే, ఇక్కడ అలాంటివేవీ లేవు. ఇక్కడ రాత్రి పగలు అన్న భేదం ఉండదు. రోజుల్ని విభజించేందుకు ఇక్కడ రాత్రులు లేవు. సంవత్సరాన్ని విభజించేందుకు ఇక్కడ ఋతువులు లేవు. ఇక్కడ విభజించబడని ఒకే ఒక కాలం శాశ్వతంగా కొనసాగుతూ ఉంటుంది. కావున ఎపెనెటస్, కాలాన్ని వెళ్ళబుచ్చే సమస్యే ఇక్కడ ఉత్పన్నంకాదు.

పరలోకంలో పరిశుద్ధుల సంభాషణ

తల్లి : ఇక నీ ప్రశ్నలోని రెండవ భాగానికి వస్తే, మా మధ్యలో జరిగే సంభాషణను నిత్యత్వం మాత్రమే నిర్ణయిస్తుంది. నిత్యత్వంలో లెక్కకు మించినయుగాలన్నింటిలో అవిరామంగా చేసేంతటి పని మాకోసం ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉంది. ఇక్కడ మా ఆనందం ఉత్పత్తి కావడం మాత్రమే గాక, అది అనునిత్యం అధికం చేయబడుతూ ఉంటుంది. జ్ఞానముకన్నా ఆత్మకు ఆనందకర మైనది మరేముంది? నిత్యత్వంలో మేము అన్వేషించవలసింది ఎంత ఉంటుందో నీవు ఆలోచించు.

మా జ్ఞానము అభివృద్ధిచెందు కొలది, ఆ జ్ఞానమునకు కర్తయైన దేవునికి మరెక్కువగా మేము స్తుతులు చెల్లిస్తూవుంటాం. ఇక్కడ మా సంతోష మంతా ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఆయనయందు ఆనందించడమే. అలాగే, ఇక్కడ మా సంభాషణలన్నీ త్రియేక దేవుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి.

ఎపెనెటస్, క్రింది లోకంలో ఇంకనూ కనుగొనబడని దేవుని మర్మాలు ఎన్నో మిగిలివున్నాయి! అక్కడ మానవ గ్రాహ్యానికి గోచరంకాని మర్మాలు ఇంకను ఎన్నో మిగిలివున్నాయి! ఒక విత్తనంనుండి ఒక వృక్షం ఎలా వస్తుందో ఎవరికి తెలుసు?
ఒక మొక్కనుండి మొగ్గ మొలకెత్తి, అందమైన పుష్పంగా ఎలా మారుతుందో ఎవరు చెప్ప గలరు?

ఇక్కడ మా సంతోషమంతా ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఆయనయందు ఆనందించడమే. అలాగే, ఇక్కడ మా సంభాషణలన్నీ త్రియేక దేవుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి.

అయస్కాంతపు రాయి సూదులను ఎందుకు ఆకర్షిస్తుందో మర్త్యులైన మానవుల్లో అత్యంత జ్ఞానులైనవారికి సహా తెలియదు. మానవులకు నిరంతరం కనిపించే అనేక సంభవాలు ఎలా సంభవిస్తున్నాయో వారికి తెలియదు. అయితే, అవన్నీ ఇక్కడ మాకు బహిర్గతం చేయబడ తాయి. వాటి రహస్యాలన్నీ మాకు తెలియజేయబడతాయి. దేవుని స్తుతించి కొనియాడేందుకు అవన్నీ మమ్మును పురికొల్పుతాయి.

అంతేకాదు, గ్రహాలకూ నక్షత్రాలకూ సంబంధించి భూమిమీద మనుష్యులు గ్రహించలేనివి, వ్యర్థమైన జ్యోతిష్యులు తెలిసినట్లు నటించే అనేక అంతరిక్ష విషయాలు మరియు వాటి కారణాలు ఇక్కడ పరిశుద్ధులకు స్పష్టంగా తెలియ పరచబడతాయి. తద్వారా వారు దేవుని ఆశ్చర్యకార్యములనుబట్టి ఆయనను స్తుతించి ఆరాధిస్తారు.

ఇవన్నీ మా జ్ఞానంవల్ల మాకు బయలుపరచబడవుగాని, ఆయా విషయాలను సమీక్షించుటద్వారానూ, తద్వారా మా జ్ఞానము అధికమవుటద్వారానూ మాకు బయలుపరచబడతాయి. ఇక్కడ మేము ఒకే ఒక చూపుతో అనేక విషయాలను గ్రహించగలము. క్రిందిలోకంలో అనేక సంవత్సరాలపాటు నేర్చుకొనే విషయాలను మేము ఒకే ఒక్క క్షణంలో నేర్చుకొనగలము. మా కదలికలలోని వేగముకూడ మాకు ఈ విషయంలో సహాయపడుతుంది. అంతేగాక, దేవుని ఆశ్చర్య కార్యాలనూ, అవి సంభవించుటకుగల కారణాలనూ ఇక్కడ మేము ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉంటాము. అలా మేము ఎంత ఎక్కువగా ధ్యానిస్తామో, అంత ఎక్కువగా మేము ఆయన ఆశ్చర్యకార్యాలను గ్రహించి తద్వారా మా ఆనందానికి కర్తయైన ఆయన మహిమగల నామాన్ని కీర్తిస్తాము.

ఇక్కడ మేము ఒకే ఒక్క చూపుతో అనేక విషయాలను గ్రహించగలము. క్రిందిలోకంలో అనేక సంవత్సరాలపాటు నేర్చుకొనే విషయాలను మేము ఒకే ఒక్క క్షణంలో నేర్చుకొనగలము.

ఎపెనెటస్, ఈ విధమైన ధ్యానములు క్రిందిలోకంలో నాకు అమితానందాన్ని ఇచ్చేవి. అయితే, అక్కడ నేను ఆయా విషయాలను ఎంత ఆలోచించినా గ్రహించ లేకపోయేదాన్ని. కాని, ఇప్పుడు నా జ్ఞానము అధికము చేయబడినందున, క్రింది ప్రపంచంలో నేను చూడలేని అనేక సంగతులను ఇక్కడ నేను స్పష్టంగా చూడగలగటం మాత్రమేగాక, అవి సంభవించుటకుగల కారణములనుకూడా సంపూర్ణంగా గ్రహించగలుగుతున్నాను. క్రింది లోకంలోని జనులు సమస్తాన్నీ తమ స్వార్థ దృష్టితో చూస్తారు గనుకను, వారు వాటిని సృష్టికర్తను ఘనపరచే దృష్టితో ఏమాత్రం చూడరు గనుకను, వాటిని వారు ఏమాత్రం గ్రహించలేరు.

అయితే, సృష్టిలోని ఆయా అంశాలు ఎలా సృజించబడ్డాయో, ఆయన అనంత జ్ఞానముచేత అవన్నీ ఎలా పరిపాలించబడుచున్నాయో దైవికజ్ఞానంతో మేము పరిశీలించి గ్రహించినప్పుడు, “జనులు సైన్యములకధిపతియగు యెహోవాచేత దాని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచనశక్తియు అధిక బుద్దియు అనుగ్రహించువాడు ఆయనే” (యెషయా 28:29) అని ఆయనను నిత్యత్వంలోని యుగాలన్నింటిలో మేము స్తుతించి ఆరాధిస్తాం.

మన గొప్ప విమోచకుడు బేత్లహేములో జన్మించాలని నిత్యుడగు తండ్రి ఆజ్ఞాపించాడు. అందుకే ప్రవక్తయైన మీకా ఇలా ప్రకటించాడు:

“బేత్లహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబము లలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయు లను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగు చుండెను.” (మీకా 5:2)

అయితే, ఆయన జననదినం సమీపించినప్పుడు ఆయనకు జన్మనివ్వబోవు కన్యక అయిన మరియ తనకు ప్రధానము చేయబడిన భర్త అయిన యోసేపుతో నజరేతులో నివసిస్తూ వచ్చింది. తన గర్భములోని శిశువుకు జన్మనిచ్చేందుకు ఆమె ఇంకను నజరేతులోనే వేచివుంది. అలా జరిగినట్లయితే అనేక సంవత్సరాల క్రితం దైవిక ప్రేరణతో మీకా ప్రకటించిన ప్రవచనానికి అది భిన్నంగా ఉంటుంది.

అయితే, ఆ సమయంలో, ప్రతి ఒక్కరూ ప్రజాసంఖ్యలో తమ పేర్లను నమోదు చేసుకొనుటకుగాను తమ తమ స్వస్థలములకు వెళ్ళవలెనని అప్పటి రోమా చక్రవర్తియైన కైసరు ఔగుస్తు ఆజ్ఞాపించాడు. ఫలితంగా, అది భారమైన ప్రయాణ మైనప్పటికీ, కన్యయైన మరియ తనకు ప్రధానము చేయబడిన భర్తతో కలిసి బేత్లహేముకు వెళ్ళవలసివచ్చింది (లూకా 2:1-5 చూడుము).

ఆయన ప్రతి సంభవాన్నీ తన స్వంత మహిమ నిమిత్తమును, తన ప్రజల మేలు నిమిత్తమును జరిగించువాడైయున్నాడు.

మీకా ప్రవచించిన ప్రవచనము ప్రకారము అక్కడ సజీవుడగు ప్రభువు జన్మించాల్సి ఉంది. కైసరు ప్రజాసంఖ్య వ్రాయుటద్వారా సుంకము రూపంలో తన ఖజానా నింపుకొన వలెనని అనుకొన్నాడు. అయితే, దైవిక ప్రణాళిక దానిని మెస్సీయా జననానికి సంబంధించిన ప్రవచన నెరవేర్పుకు సాధనంగా ఉపయోగించుకొంది. ఇది దేవుని అనంతమైన జ్ఞానాన్ని గురించి మనకు తెలుపు తుంది. ఆయన ప్రతి సంభవాన్నీ తన స్వంత మహిమ నిమిత్తమును, తన ప్రజల మేలు నిమిత్తమును జరిగించువాడైయున్నాడు.

దేవుని ఏర్పాటు బయలుపరచబడుట

తల్లి : ఎపెనెటస్, నేను నీకు ఇప్పుడొక సంభవాన్ని గురించి చెబుతాను. క్రింది లోకంలో ఒక వ్యక్తి తన స్నేహితునివద్దకు వెళ్ళి కొన్ని రోజులు అతనితో గడిపి రావాలని నిర్ణయించుకొని తన గుఱ్ఱమెక్కి వెళుతుండగా క్రిందపడి అతని కాలు విరిగిందట. ఫలితంగా అతడు ఇక ప్రయాణం చేయలేకపోవడంతో తాను ఆశించినవిధంగా తన స్నేహితుని ఇంటికి వెళ్ళలేకపోయాడు. తన స్నేహితుని ఇంటికి వెళ్ళలేకపోయినందుకు ఆ వ్యక్తి చాల నిరాశచెందాడు.

నాశనకరమైన మా పాపమార్గమునుండి మమ్మును ఆయన ప్రక్కకు మళ్ళించనట్లయితే మేము ఎలా నాశనమైయుండేవారమో మాకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది.

ఆ సమయంలో తన కాలు విరగడం తనకొక గొప్ప పరీక్షగాను, ఒక గొప్ప శ్రమగాను అతడు తలంచి అమితంగా బాధపడ్డాడు. అయితే, కొద్దిరోజుల తర్వాత అతనికొక సమాచారం అందింది. తాను తన స్నేహితుని ఇంట్లో బస చేయదలచిన రాత్రి ఆ ఇల్లంతా మంటల్లో కాలి బూడిదైపోయిందట! ఆ రాత్రి ఆ ఇంట్లో ఉన్న వారందరూ ఆ మంటల్లో కాలి చనిపోయారట! తాను గొప్ప పరీక్షగాను శ్రమ గాను తలంచిన తన కాలు విరగడం అనేది తనకొక ఆశీర్వాదకరమైందిగా అప్పుడు అతడు తెలుసుకొన్నాడు.

తన కాలు విరగడం అనేది తన ప్రాణాన్ని రక్షించింది. దైవిక ప్రేమ మరియు మంచితనాలను గురించిన అలాంటి ఉదంతాలెన్నో మనం చెప్పుకోవచ్చు. అలాంటి ఉదంతాలు ఇక్కడి పరిశు ద్ధులను దేవునికిని గొఱ్ఱపిల్లకును హల్లెలూయ స్తుతిగానాలు చేసేందుకు ప్రోత్సహిస్తాయి.

అంతేకాదు ఎపెనెటస్, తన కృపద్వారా తమ్మును తన మహిమలోనికి తీసుకొనివచ్చిన సర్వోన్నతుడగు దేవునికి ఇక్కడి పరిశుద్ధులు నిత్యం స్తుతిగానాలు చేస్తుంటారు. నాశనకరమైన మా పాపమార్గమునుండి మమ్మును ఆయన ప్రక్కకు మళ్ళించనట్లయితే మేము ఎలా నాశనమైయుండేవారమో మాకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది.

మేము నాశనకరమైన మార్గంలో ప్రవేశించకుండునట్లుగా ఆయన అనేకసార్లు మా మార్గాలను ముళ్ళతుప్పలతో నింపాడు. మమ్మును ఇక్కడకు తెచ్చేందుకు ఆయన ఉపయోగించిన ఆయా పద్ధతులను తలంచుకొన్నప్పుడు మేము ఆయనకు స్తుతిగానాలు చేయకుండా ఉండలేము. మేము ఆలా ఆయనకు స్తుతిగానాలు చేస్తున్న సమయంలో ఆయన మాపై తన ముఖ కాంతు లను ప్రసరింపజేస్తాడు. అలా ఆయన ముఖకాంతులు మాపై ప్రసరించబడేకొద్దీ, మేము ఆయన సారూప్యములోనికి మార్చబడుతూ ఉంటాము. అదే మా అత్యు న్నతమైన ఆనందం.

ఎపెనెటస్, నీ చివరి ప్రశ్నకుకూడ నేను జవాబు చెప్పాను. అమరత్వపు వస్త్రాన్ని ధరించుకొని నీవు ఇక్కడకు వచ్చినప్పుడు, దీన్ని నీవు మరెక్కువగా గ్రహించగలుగుతావు. ఈ మధ్యకాలంలో నీవు పొందిన కృపకు తగినట్లుగా నడుచుకొనవలెనని” (ఎఫెసీ 4:1) నేను ఆశిస్తున్నాను. నీవు సాధించిన దేన్ని గురించికూడా నీవు ఎన్నడూ అతిశయించవద్దు. కాని, ఆయన కృపకోసం దేవునికి స్తుతులు చెల్లించు. నీవు ఇక్కడ కనిన వినిన సంగతులన్నీ నీకు ఒకేఒక పాఠాన్ని బోధింపనివ్వు : నీ వ్యర్థమైన నీచస్థితిని చూసి నిన్నునీవు అసహ్యించు కొనేలా అవి నీకు ఒక పాఠం బోధింపనివ్వు.

తాను అతిశయించకుండునట్లు తన “శరీరంలో ఒక ముల్లు” ఉంచ బడిందని నీలాగా ఇక్కడకు ప్రవేశించేందుకు అనుమతి పొందిన అపొస్తలుడైన పౌలు ఒకసారి ఆనందంతో అన్నాడు.

‘నీవు ఇక్కడ కనిన వినిన సంగతులన్నీ నీకు ఒకే ఒక పాఠాన్ని బోధింపనివ్వు – నీ వ్యర్థమైన నీచస్థితిని చూసి నిన్నునీవు అసహ్యించుకొనేలా అవి నీకు ఒక పాఠం బోధింపనివ్వు.

తాను ప్రభువువలన పొందిన లెక్కలేనన్ని కృపలనుబట్టి (2 కొరింథీ. 12:7) అతడు ఎంతో ఆనందిం చాడు. అతని ఉదాహరణ నీలో వినయమనస్సు కలుగజేయనివ్వు. వినయము అన్ని విధములైన శోధనలనుండి నిన్ను గొప్పగా సంరక్షిస్తుంది. దేవుడు దీనమనస్సు గలవారిని హెచ్చించి గర్విష్టులను అణచివేస్తాడు.

తల్లి నిష్క్రమించుట

తల్లి : నీ సంరక్షకుడైన దేవదూత రావడం నాకు కనిపిస్తోంది. కావున ఎపెనెటస్, నీవు ఇక్కడకు తిరిగి వచ్చేంతవరకు నీకు నా హృదయపూర్వకమైన వీడ్కోలు. నీవు ఇక్కడకు వచ్చాక, మనం మరి ఎన్నడూ విడిపోము.

అలా ఆమె నాతో చెప్పి నావద్దనుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నన్ను భూ లోకం నుండి అక్కడకు తీసుకొని వచ్చిన దేవదూత అమితమైన ప్రకాశమానంగా వెలుగుతూ నా యెదుట కనిపించాడు. నేను అతనికి వంగి నమస్కరించాను.

దేవదూత:నీవు సింహాసనాసీనుడైన దేవునికి మాత్రమే నమస్కరించు. నాకు నీవు నమస్క రించవద్దు. నేను నీలా ఒక సృజించబడిన వాడను మాత్రమేనని నేను నీకు ఇంతకు మునుపే చెప్పాను. కావున దేవునికి మాత్రమే నీవు నమస్కరించి ఆయనను మాత్రమే నీవు ఆరాధించు. ఎందుకనగా, ఆయన మాత్రమే ఆరాధనలకు అర్హుడు. ఇకపోతే, పరలోక మహిమను నీవు పూర్తిగా వీక్షించావా?

నేను నిన్ను ఎక్కడనుండి తీసుకొచ్చానో ఆ భూలోకానికి తిరిగి నిన్ను తీసుకెళ్ళాలని నేను ఆజ్ఞాపించబడ్డాను. అయితే, దానికి ముందు అంధకార అధిపతియైన సాతాను రాజ్యానికి నేను నిన్ను తీసుకెళతాను.

ఎపెనెటస్ : పరలోక మహిమను నేను వీక్షించి అత్యానందభరితుడనయ్యాను. కాని, ఆ మహిమను నేను కొంతవరకే చూడగలిగాను. ఇక్కడ ప్రకాశిస్తోన్న వెలుగు నా కన్నులు వీక్షించలేనంత కాంతివంతంగా ఉంది. అయినప్పటికీ, ఇక్కడి దృశ్యాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. వాస్తవానికి శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలన్న లోతైన ఆశ నాలో కలుగుతోంది.

దేవదూత : కాని, నేను నిన్ను ఎక్కడనుండి తీసుకొచ్చానో ఆ భూలోకానికి తిరిగి నిన్ను తీసుకెళ్ళాలని నేను ఆజ్ఞాపించబడ్డాను. అయితే, దానికి ముందు అంధకార అధిపతి అయిన సాతాను రాజ్యానికి నేను నిన్ను తీసుకెళతాను. సర్వోన్నతునికి విరోధంగా తిరుగుబాటు చేసినవారికి ఇవ్వబడిన న్యాయబద్ధమైన తీర్పునూ, పాపపు బహుమానాన్నీ అక్కడ నీవు వీక్షిస్తావు.

అయితే, ఈ విషయంలో నీవేమీ భయపడవద్దు. ఎందుకనగా నేను నిన్ను అక్కడ కొంత సమయంవరకే ఉంచి, అక్కడి సంగతులను నీకు చూపించిన తర్వాత తిరిగి భూలోకానికి తీసుకెళతాను. నీ మర్త్యశరీరం అంతమయ్యేవరకు నీవు భూమిమీదే ఉంటావు. ఆ తర్వాత నీవు ఇక్కడి పరిశుద్ధులతో కలిసి ఉండు నట్లుగా నేను నిన్ను తిరిగి ఇక్కడకు నడిపిస్తాను.

దేవదూత పలికిన చివరి మాటలు నన్ను అమితంగా ప్రోత్సహించి నాలో నూతన జీవాన్ని నింపాయి. ఎందుకనగా, పరలోకాన్ని వదలి భూమిపైకి తిరిగి వెళ్ళడం నన్ను అమితంగా కృంగదీసింది. అయితే, నేను తిరిగి ఇక్కడకు వస్తానన్న తలంపు నాకు ఊరట కలిగించింది. కాని, ఇప్పుడు పరలోకంనుండి భూమిపైకి వెళ్ళకమునుపు నరకానికి వెళ్ళాలన్న తలంపు తిరిగి నన్ను నిరాశకు గురిచేసి నన్ను కృంగదీసింది.

అయినప్పటికీ, నేను అక్కడనుండి భూమిపైకి తిరిగి వెళ్ళుట అనునది దైవిక ఉద్దేశమనీ, అక్కడ కొంతకాలం జీవించి నా మర్త్యశరీరాన్ని వదలివేసిన తర్వాత నేను తిరిగి పరలోకానికి వస్తాననీ తలంచినప్పుడు, నేను ఎంతో గొప్ప ఆదరణ పొందాను. నాలో ఇప్పుడు పూర్తిగా దేవుని చిత్తానికి లోబడే మనస్తత్వం ఉండ టాన్ని నేను కనుగొన్నాను. కావున, నేను నా మార్గదర్శి అయిన దేవదూతతో నిశ్చయతతోను ధైర్యముతోను తిరిగి మాట్లాడటం ప్రారంభించాను.

ఎపెనెటస్ : సర్వోన్నతుడగు దేవుడు ఏమైతే నాకు ఆజ్ఞాపిస్తాడో దానికి విధేయత చూపించేందుకు నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఆయన కృపను నేను ఈపాటికే గొప్పగా అనుభవించాను. ఆయన సన్నిధి నాతో ఉన్నట్లయితే నరకంలోకూడా నేను భయపడను.

దేవదూత : ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో అక్కడే పరలోకం ఉంటుంది. మనం నరకంలో ఉన్నప్పుడుకూడా ఆయన మనతో ఉంటాడు.

దేవుడు వేరే లోకాలనుకూడా సృజించాడా?

ఆ తర్వాత సర్వోన్నతుని సింహాసనం క్రిందనుండి వంగుతూ అమితమైన వేగంతో దేవదూత నన్ను పరలోకంనుండి బయటకు తీసుకొచ్చాడు. అలా మేము అత్యంత వేగంతో పయనిస్తున్న సమయంలో అంతరిక్షంలో అనేకమైన పెద్దపెద్ద అగ్నిగోళాలు నాకు కనిపించాయి.

కాంతివంతమైన ఆ ఆకాశదీపాలను నేను చూసినప్పుడు, దేవదూతతో వాటిని గురించి నేను సంభాషించడం ప్రారంభిం చాను. అంతరిక్షంలో అలా వ్రేలాడుతోన్న ప్రతి నక్షత్రం ఒక ప్రపంచమని నేను భూమిమీద ఉన్న సమయంలో అనుకున్నానని అతనితో అన్నాను.

ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో అక్కడే పరలోకం ఉంటుంది. మనం నరకంలో ఉన్నప్పుడుకూడా. ఆయన మనతోనే ఉంటాడు.

ఆ విషయం నిజమేనని నాకు అనిపిస్తోందనీ, ఎందుకనగా అంతరిక్షంలోనుండి అత్యంత చిన్నదిగా కనిపించే నల్లని భూగోళం ఒక ప్రపంచం అయినప్పుడు, అంతరిక్షంలో ఎంతో పెద్దవిగా కనిపించే ఆ అగ్నిగోళాలచుట్టూ అనేక లోకాలు ఉంటాయని నేను ఊహించాననీ నేను అతనితో అన్నాను. అయితే, ఇప్పుడు దీనిని గురించిన సత్యాన్ని

దేవదూతనుండి తెలిసికొనే అవకాశం ఉన్నందున ఆ విషయంలో నాకు వాస్తవాన్ని తెలియజేయమని నేను అతనిని అడిగాను.

దేవదూత : సర్వశక్తుడైన దేవునికి అసాధ్యమైనదేదీ లేదు. అంతేగాక, అనంతమైన ఈ విశ్వానికి హద్దులుకూడా ఉండవు. క్రింది లోకాన్ని సృజించేందుకు దేవుడు ఆరు దినాల సమయాన్ని తీసుకొన్నాడు. అయితే, ఆయన ఆశించి ఉంటే దాన్ని ఒకే ఒక్క క్షణంలోకూడ సృజించగలిగి ఉండేవాడు. ఆయన అనంతమైన శక్తి అంత గొప్పది. తనకున్న శక్తితో ఆయన ఏ మేం చేయగలడో అనంతశక్తిని కలిగిన ఆయన తప్ప మరెవరునూ చెప్పలేరు.

అయితే, ఆయనకు అనంతశక్తి ఉన్నందున దానితో ఆయన ఏమేం సృజించాడన్న విషయాన్ని గురించి చర్చించడం పరలోకంలో ఉన్నవారి పనికాదు. పరలోకంలోను భూమిమీదను తనకు ఇష్టమైనవన్నీ ఆయన జరిగిస్తాడు. మనకు ఆయన ఏవి బయలుపరుస్తాడో అవే మనకు తెలుసు. మనకు బయలుపరచ కుండా ఆయన వేటిని రహస్యంగా ఉంచాడో, అవన్నీ ఆయన నిత్యమైన ఉద్దేశంచొప్పున రహస్యంగా ఉంచబడ్డాయి. వాటిని గురించి ఆలోచించడం పరిశోధించడం సృజించబడినవారమైన మనకు అనవసరమైన ఆసక్తితప్ప మరొకటికాదు.

విశాలవిశ్వంలో అనేక నక్షత్రాలు ఉన్నందున, తనకు ఇష్టమై నట్లయితే ఆయన ఎన్ని లోకాలనైనా సృజించగలడు. అయితే, అలా ఆయన చేశాడా లేదా అన్న విషయం మనకు బయలుపరచబడలేదు. దానిని గురించి పరిశోధించి తెలుసుకోవడం మన పనికాదు.

నరకపు పొలిమేరల్లో

ఈ సమయానికల్లా మేము అంతరిక్షంనుండి అత్యంత తగ్గు ప్రదేశానికి చేరుకొన్నాము. అక్కడ నాకు భయంకరమైన స్వరూపాలు కనిపించాయి. అవన్నీ నా మార్గదర్శియైన దేవదూత వెలుగును చూచి పారిపోతున్నాయి.

ఎపెనెటస్ : నల్లగాను భయంకరంగాను వికారంగాను ఉన్న ఆ స్వరూపాలు తప్పక నరకలోకపు సైన్యసమూహాలు అయివుంటాయి.

దేవదూత :అవన్నీ భూమిపై ఇటు అటు తిరుగుతూ ఎవరిని మ్రింగుదుమా అని వెదుకుతోన్న దురాత్మలు (1 పేతురు 5:8). అవి ఇప్పుడు ఇక్కడనుండి పారి పోయినప్పటికీ, తమ చీకటి రాజ్యంలో అవి ఉండటాన్ని కొద్దిసేపట్లో నీవు చూడ బోతున్నావు. ఎందుకనగా, మనమిప్పుడు నరకలోకపు సరిహద్దుల్లో ఉన్నాం.

నరకము మరియు పాపుల వేదనలను గురించిన దర్శనములు

నరకము మరియు పాపుల వేదనలను గురించిన దర్శనములు

నా మార్గదర్శియైన దేవదూత మాటలు అతి త్వరలోనే కార్యరూపం దాల్చాయి. ఉన్నట్టుండి గాఢాంధకారపు రాత్రి చీకటికన్నా దట్టమైన చీకటిచే మేము ఆవరించబడ్డాము. మండుచున్న గంధకములు మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసాయి. అక్కడ వేదనపడుతున్న పాపుల ఆత్మలుచేసే ఆర్తనాదాలతో నా చెవులు గింగురుమన్నాయి.

ఈ శబ్దాలతో పోల్చినప్పుడు భూలోకంపై మ్రోగే సంగీతపు అపశృతులు ఎంతో వినసొంపుగా ఉంటాయని ఆ సమయంలో నాకు అనిపించింది.

దేవదూత : ఇప్పుడు నీవు నరకపు ద్వారంలో ఉన్నావు. సర్వోన్నతుడగు దేవునిచే నాకు ఇవ్వబడిన అధికారము నిన్ను సమస్త కీడులనుండి కాపాడుతుంది గనుక ఈ నరకంలో నీకు కనిపించే నాశన పురుషుడగు సాతానుకుగాని, ఇక్కడ ఉన్న దురాత్మలకుగాని నీవేమాత్రం భయపడవద్దు. ఇక్కడి దయ్యములనుండియు

పాపాత్ములనుండియు అంతములేని వారి నాశనమునకుగల శాపగ్రస్తమైన కార ణములను నీవు విని తెలుసుకొంటావు. నీవు వారిని అడగదలచుకొన్న నీ మనస్సు లోని ప్రశ్నలకు వారు నీకు జవాబులు ఇస్తారు. ఇక్కడి దయ్యములు నీకు ఎలాంటి హాని చేయలేవు. ఎందుకనగా, నాకు అధికారమిచ్చిన సర్వోన్నతుడగు దేవునిచే అవి బంధింపబడి ఉన్నాయి. అవి నిన్ను చూసి కోపంతో గర్జిస్తూ తాము బంధింప బడి ఉన్న సంకెళ్ళను కొరికి నానా హంగామా చేస్తాయి. కాని, అవి నిన్నేమీ చేయలేవు.

సింహాసనాసీనుడగు లూసీఫర్

ఇప్పుడు మేము అగాథ గోతిలోనున్న నరకపు అంతర్భాగంలోకి వచ్చాము. అక్కడ అగ్ని గంధకముల మంటల్లో పరలోక ఆజ్ఞనుబట్టి సంకెళ్ళచే బంధించబడి ఉన్న లూసీఫరు నాకు కనిపించాడు. అతని కళ్ళు క్రోధాగ్నిజ్వాలలతో ఎర్రగా మండుతున్నాయి.

మేము అక్కడకు వస్తున్న సమాచారాన్ని నరకపు పొలిమేరల్లోమాకు కనిపించిన దురాత్మల సమూహం ఈపా టికే వాడికి చేరవేసాయి. మా రాకపట్ల నరక మంతటా అల్లరి చెలరేగింది.

ఈ అల్లరే పరిశు దుడగు దేవునికి విరోధంగా దూషించేందుకు సాతానుని పురికొల్పింది. వాడు ఆయనకు విరోధంగా ఎంత కోపంగా మాట్లాడుతున్నా డంటే, వాని మాటల్లో అధికారవాంఛ నాకు స్పష్టంగా కనిపించింది.

ఇక్కడి దయ్యములు నీకు ఎలాంటి హాని చేయలేవు. ఎందుకనగా, నాకు అధికారమిచ్చిన సర్వోన్నతుడగు దేవునిచే అవి బంధింపబడి ఉన్నాయి.

లూసీఫర్ : దేవునికి ఇంకా ఏం కావాలట? ఆయన ఈపాటికే నేను యేల వలసి ఉన్న పరలోకాన్ని తీసుకొన్నాడు. అద్భుతమైన నా స్వాస్థ్యమగు ఆ పరలోక మహిమనుండి నన్ను క్రిందకు పడద్రోసి మరణము దుఃఖము వేదనలతో నిండిన ఈ చీకటి గృహంలో ఆయన నన్ను బంధించివేశాడు. అది చాలక ఇప్పుడు నేనున్న ఈ నరకాన్నికూడ నానుండి ఆయన లాక్కోవాలని ఉన్నాడా? ఇక్కడకూడ ఆయన నన్ను అవమానపరచాలని ఉన్నాడా? నాకు ఒక్క అవకాశం లభించి నట్లయితే, మహిమకరమైన ఆయన పరలోక సింహాసనాన్ని నేను ఊపివేస్తాను.

నా కోపాన్ని ఆయనపై నేను చూపించలేను. కాని, నా క్రోధాగ్ని జ్వాలలద్వారా ఆయన స్వరూపంలో సృజించబడిన మానవులపై నా పగతీర్చుకొంటాను.

ఇప్పుడు ఆయన నన్ను ఉంచిన అగ్నిజ్వాలలకన్నా మరింత ఎక్కువైన అగ్నిజ్వాలల్లో ఆయన నన్ను పడద్రోసినప్పటికీ, నేను ఏమాత్రం భయపడను. ఆయనతో చేసిన యుద్ధంలో  నేను ఓడిపోయినప్పటికీ, నా తప్పిదంవల్ల నేను ఓడిపోలేదు. అయినప్పటికీ, అయ్యో, నేను ఓడి పోయాను.

శాశ్వతంగా నేను ఓడిపోయి ఈ చీకటి సరిహద్దుల్లో నిత్యత్వమంతా శిక్ష అనుభ వించుటకు త్రోసివేయబడ్డాను! అయినప్పటికీ, మానవాళి దుఃఖము నా దుఃఖానికి ఆదరణగా నాకోసం వేచివుంది. నా కోపాన్ని ఆయనపై నేను చూపించలేను. కాని, నా క్రోధాగ్ని జ్వాలలద్వారా ఆయన స్వరూపంలో సృజించబడిన మానవులపై నా పగతీర్చుకొంటాను.

అసందర్భమైన సాతానుని మాటలపట్ల నేను విభ్రాంతినొందాను. నేను నా మార్గదర్శియైన దేవదూతవైపు తిరిగి, “వాని దేవదూషణ మాటలకుగాను ఎంత న్యాయంగా దేవుడు తీర్పుతీర్చాడు!” అని అనకుండా ఉండలేకపోయాను.

దేవదూత : ఈ అపవిత్రమైన ఆత్మయగు సాతానుని నోటనుండి నీవు విన్న మాటలన్నీ వాని పాపాన్నీ, దాని ఫలితంగా వానికి ఇవ్వబడిన శిక్షనూ ప్రతిబిం బింపజేస్తున్నాయి. వాడు మాట్లాడే ప్రతి దేవదూషణ పలుకూ నరకపు వేడిని మరింత తీక్షణంగా చేస్తూ వాని శిక్షను మరింత అధికం చేస్తోంది.

నరకంలోని పాపుల సంభాషణ

ఆ తర్వాత మేము అక్కడనుండి ముందుకు కదిలాము. తీవ్రమైన వేదనను అనుభవిస్తోన్న మానవుల ఆత్మలు మాకు అనేకం అక్కడ కనిపించసాగాయి. అక్కడ మండుతోన్న గంథకపు ద్రావకంలో కాలుతూ అమితమైన వేదనను అనుభవిస్తోన్న రెండు ఆత్మలు నాకు కనిపించాయి. అవి ఒకవైపు బాధను అనుభవిస్తూనే మరోవైపు ఒకదానిని మరొకటి తీవ్రంగా దూషించుకొంటూ ఉన్నాయి. వాటిలో ఒక ఆత్మ మరో ఆత్మతో ఇలా అంటోంది :

“నీ ముఖం చూసేందుకే నాకు అసహ్యంగా ఉంది! నీవల్లనే నేను ఈ భయంకరమైన ప్రదేశానికి వచ్చాను. నేను ఇప్పుడు పడుతోన్న వేదనకు కేవలం నీవే కారణం. నీవు నన్ను మోసంచేసి ఉచ్చుల్లో బంధిం చావు. నీవల్లనే నేను పేదవారిని అణచివేస్తూ వచ్చాను. ఫలితంగా నేను ఇక్కడకు తీసికొనిరాబడ్డాను.

నీవు నాకు ఒక మంచి ఉదాహరణగా ఉండివుంటే నేను ఇక్కడకుకాక పరలోకానికి వెళ్ళివుండేవాణ్ణి. ఇక్కడ నేను ఎంతగా వేదనను అనుభవిస్తున్నానో, అక్కడ అంతగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేవాణ్ణి. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! నీ అడుగు జాడల్లో నడవడంవల్ల నిత్యనాశనాన్ని నేను కొనితెచ్చుకొన్నాను. అయ్యో, నీవు నాకు పరిచయం కాకుండా ఉంటే ఎంత బాగుణ్ణు! అస్సలు నీవు భూమిమీద పుట్టకుండా ఉంటే ఎంత బాగుణ్ణు!”

దానికి రెండవ వ్యక్తి ఇలా బదులిచ్చాడు :

“నేనుకూడ నిన్ను నిందించాల్సిందే. ఎన్నిసార్లు నీవు నన్ను పాపంలోకి లాగావో నీకు గుర్తులేదా? చట్టబద్ధమైన వ్యాపారంలో నేను వెళుతోన్న సమయంలో నీతోకూడ రమ్మని నీవు నన్ను బలవంతం చేయలేదా? అనేక విషయాల్లో నీవు నన్ను తప్పుత్రోవ పట్టించావు. ఇక్కడకు మనము రావటంలో నా తప్పు ఎంత ఉందో, నీ తప్పుకూడ అంతే ఉంది. నేను మోసగాణ్ణయితే, నీవు గర్విష్టివి. నానుండి నీవు మోసాన్ని ఎలా నేర్చు కొన్నావో, అలానే నీనుండి గర్వాన్నీ త్రాగుడునూ నేను నేర్చుకొన్నాను. మోసగించడాన్ని నానుండి నీవు ఎలా నేర్చుకొన్నావో, అలానే వ్యభిచారాన్నీ మంచిని అపహాస్యం చేయడాన్నీ అబద్ధాలు చెప్పడాన్నీ నీనుండి నేను నేర్చుకొన్నాను. నీవు పడిపోవడానికి కొన్ని విషయాల్లో నేను కారణమైతే, నేను పడిపోవడానికి కొన్ని విషయాల్లో నీవు కారణమయ్యావు. కావున, నీవు నన్ను నిందించినట్లయితే, నేనుకూడ నిన్ను నిందించవలసి ఉంటుంది.

నీ అపవిత్రతకు నేను జవాబు చెప్పవలసివస్తే, నా అపవిత్ర తకు నీవుకూడ జవాబు చెప్పవలసి ఉంటుంది. నీవు ఇక్కడకు రాకుండా ఉండవలసిందని ఇప్పుడు నేను మనసారా కోరుకొంటున్నాను. ఎందు కంటే, ఇక్కడ నిన్ను చూస్తేనే నాకు పరమ చిరాగ్గావుంది.

నీ చూపులు నా హృదయాన్ని గాయపరచి నా మనస్సును తాజా పాపపు తలంపులతో నింపుతున్నాయి. నీవల్లనే నేను భూమిమీద పాపం చేసాను. అక్కడ నీ సహవాసం నాకు లభించివుండనట్లయితే, ఇక్కడ నేను నీ సహవాసంలో ఉండేవాణ్ణి కాను!”

భూమిమీద పాపంలో భాగస్వాములుగా ఉన్నవారు నరకంలోకూడ భాగ స్వాములుగా ఉంటారని దీనిద్వారా నేను తెలుసుకొన్నాను. భూమిమీద తమ సహవాసాన్ని వారు ఎంతగా ప్రేమిస్తారో, ఇక్కడ వారు దాన్ని అంతగా ద్వేషిస్తారని కూడా నేను తెలుసుకొన్నాను.

భూమిమీద విడువబడివున్న తన సహోదరులు దాతృత్వగుణాన్ని కలిగియుండాలని నరకాగ్నిలో వేదనపడుతోన్న ధనవంతుడు ఎందుకు ఆశించాడో ఇప్పుడు నాకు అర్థమయింది (లూకా 16:19-31 చూడుము). తాను అత్యంత వేదనను అనుభవిస్తోన్న నరకాగ్నిలోనికి వారు రాకూడదని అతడు ఆశించాడు. అతడు అలా ఆశించింది వారిపైనున్న ప్రేమతో కాదుగాని, వారు ఇక్కడకు వచ్చుటద్వారా తన్ను దూషిస్తూ తన వేదనను మరింత అధికం చేస్తారన్న తలంపుతోనే!

న్యాయమైన తీర్పు

నరకంలో నేను విషాదకరమైన దృశ్యాలెన్నో చూశాను. తమ దయనీయమైన పరిస్థితికి ఒకరినొకరు నిందించుకొంటున్న ఆ ఇద్దరు వ్యక్తులను దాటి వేదనకరమైన అనేక దృశ్యాలను చూసుకొంటూ మేము ముందుకు వెళ్ళాం. అలా మేము వెళుతున్న సమయంలో మండుతోన్న గంథకపు ద్రవాన్ని ఒక అపవిత్రాత్మ ఒక స్త్రీ గొంతులో పోస్తుండటాన్ని నేను చూశాను.

ఆ అపవిత్రాత్మ ఎంత క్రూరంగా ఆ పని చేస్తోందంటే, దాన్ని చూసిన నా మనస్సు విలవిలా కొట్టుకుంది. ఆ సమయంలో నేను కాసేపు ఆగి ఆ అపవిత్రాత్మతో ఇలా చెప్ప కుండా ఉండలేకపోయాను.

వేదనకరమైన అనేక దృశ్యాలను చూసుకొంటూ మేము ముందుకు వెళ్ళాం. అలా మేము వెళుతున్న సమయంలో మండుతోన్న గంధకపు ద్రవాన్ని ఒక అపవిత్రాత్మ ఒక స్త్రీ గొంతులో పోస్తుండటాన్ని నేను చూశాను.

ఎపెనెటస్ : సలసల కాగుతోన్న ఆ గంథకపు ద్రావకాన్ని ఆ స్త్రీ గొంతులో పోస్తూ ఆమె అనుభవిస్తున్న విపరీతమైన వేదనను తిలకించి నీవెందుకు ఆనందిస్తున్నావు?

ఈ స్త్రీ భూమిమీద జీవించిన కాలంలో బంగారాన్ని ఒక దేవునిగా తలంచినందున, ఇప్పుడు నరకంలో ఈ ద్రావకంతో ఆమె కడుపును నింపాలని  నేను ప్రయత్నించడం తప్పంటావా?

అపవిత్రాత్మ : ఇది న్యాయమైన శిక్ష తప్ప మరేంకాదు. ఈ స్త్రీ భూమిమీద జీవించిన కాలంలో ఈమెకు తగినంత బంగారం ఉండినప్పటికీ, ఈమె సంతృప్తి నొందలేదు. కావున నేనిప్పుడు ఆమె గొంతుకలో మండుతున్న గంథకపు ద్రావ “కాన్ని పోస్తున్నాను. ఈమె అనేకులను మోసగించి వారినుండి బంగారమును దొంగిలిస్తూ వచ్చింది. ఈమెద్వారా అనేకుల జీవితాలు నాశనమయ్యాయి. అలా ఈమె విస్తారమైన సంపదను సమకూర్చు  కొన్నప్పటికీ, సంపదపై ఈమె పెంచుకున్న ప్రేమ  ఆ సంపదను ఖర్చుచేయనీయలేదు.

విస్తారమైన సంపద తనకుండినప్పటికీ, ఈమె జీవితమంతా ఖాళీ కడుపుతోనే జీవించింది లేదా ఇతరుల ఖర్చుతో తన కడుపును నింపుకొంటూ వచ్చింది. ఇక ఈమె వస్త్రాల విషయాని కొస్తే, అవి ఈమె ఒంటిమీదే చిరిగిపోతూ ఉండేవి. అవి చిరిగిపోయినప్పుడు, వాటికి ఆమె అనేక అతుకులు వేసుకొంటూ వాటినే తిరిగి ధరించేది.

తనకు ప్రభుత్వపన్ను పడకుండునట్లు తనకోసం ఒక సొంత ఇంటినికూడా ఆమె నిర్మించుకోలేదు. తన సంపదను ఎవరైనా దొంగిలిస్తారన్న ఉద్దేశంతో ఆమె దానిని తన చేతుల్లో ఉంచుకోలేదు. తాను మోసగించబడతానేమోనన్న భయంతో దానిని ఇతరులవద్ద కొదువకు కూడ ఉంచలేదు. ఈ స్త్రీ తన సొంత శరీరానికికూడ అన్నం పెట్టనంత కఠినాత్మురాలు!

ఈ దౌర్భాగ్యురాలికి లోకంలో ఒకే ఒక బిడ్డ ఉంది. తన తల్లి సంపాదించిన సంపదను తాను ఎలా ఖర్చుచేయాలోకూడా ఆ బిడ్డకు ఇప్పుడు తెలియడం లేదు. ఈ స్త్రీ భూమిమీద జీవించిన కాలంలో బంగారాన్ని ఒక దేవునిగా తలంచి నందున, ఇప్పుడు నరకంలో ఈ ద్రావకంతో ఆమె కడుపును నింపాలని నేను ప్రయత్నించడం తప్పంటావా?

ఆ అపవిత్రాత్మ మాట్లాడడం చాలించిన తరువాత, ఆ మాటలు నిజమేనా అని నేను ఆ స్త్రీని ప్రశ్నించాను. “లేదు, వీడు చెప్పేదంతా అబద్ధం” అని ఆ గట్టిగా అరిచింది.

“వాడు చెప్పేది ఎలా అబద్ధం అంటావు?” నేను ప్రశ్నించాను.

దానికి ఆ స్త్రీ నాకు ఇలా జవాబిచ్చింది :

“వీడు చెప్పేది నిజమే గనుక అయితే నేను తప్పక సంతృప్తినొందేదాన్నే. తాను నా గొంతుకలో బంగారమును పోస్తున్నట్టు వీడు చెప్తున్నాడు. అది పచ్చి అబద్ధం. వాడు నా గొంతుకలో పోస్తున్నది గంథకపు ద్రావకం. తాను చెబుతు న్నట్టుగా వాడు నా గొంతుకలో బంగారాన్నే గనుక పోస్తుంటే నేను ఎంతో సంతో షించేదాన్ని. అప్పుడు ఇక్కడనుండి పరలోకం వెళ్ళేందుకు ఆ బంగారంతో నేను లంచమిచ్చి అక్కడకు వెళ్ళి ఉండేదాన్ని.”

అంత అమితమైన వేదనలోకూడా తన సంపదను గురించే ఆమె ఆలోచిస్తూ ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ విషయాన్నే నేను నా మార్గదర్శకు డైన దేవదూతతో అన్నాను.

పాపులు నరకంలో కూడా ఇంకను పాపాన్ని ప్రేమిస్తూనే ఉంటారు

దేవదూత : బంగారంపై ప్రేమ పాపములన్నింటిలో అతి గొప్ప పాపమని నీకు ఇప్పుడు అర్థమైవుంటుంది. ఎవరైతే బంగారాన్ని ప్రేమిస్తారో వారి ఆత్మ శాశ్వతంగా నాశనమైనట్టే. కావున వారికి నరకంలోకూడా ఎక్కువ శిక్ష ఉంటుంది.

భూమిమీద ఈ స్త్రీ బంగారంపై చూపిన ప్రేమను ఆధారంచేసికొనే ఇక్కడి అపవిత్రాత్మలు ఈ స్త్రీని ఇక్కడ ఇలా శిక్షిస్తున్నాయి.

ఎపెనెటస్ : అయ్యో, భూమిమీదనున్న మానవులు ఒక్కక్షణం ‘తో పెతు’ మాటలను వినడం వారికి ఎంత మేలు! (యెషయా 30:33). తాము పాపమును ప్రేమించకుండునట్లుగా నరకంలో వేదనపడు .తాము పాపమును ప్రేమించకుండునట్లుగా తోన్న ఆత్మల ఆర్తనాదాలు ఒక్క క్షణం వారికి నరకంలో వేదనపడుతోన్న వినిపించడం వారికి ఎంత మంచిది! ఆత్మల ఆర్తనాదాలు ఒక్క క్షణం వారికి వినిపించడం వారికి ఎంత మంచిది!

దేవదూత : భూమిమీద ప్రకటిస్తున్న దేవుని సేవకుల మాటలనూ, దేవుని వాక్యంలోని దైవ – వాక్కులనూ లెక్కచేయనివారు నరకంనుండి ఒక వ్యక్తి వెళ్ళి హెచ్చరించినా పట్టించుకోరని నిత్యసత్యం మనకు బయలుపరుస్తోంది (లూకా 16:31 చూడుము).

అనుక్షణం మరణిస్తూ జీవిస్తున్న పాపాత్ముల ఆత్మలు

అలా మేము కొద్దిదూరం వెళ్ళాక, ఎర్రగా కాలుతోన్న ఉక్కు మంచంపై పడుకొని ఉన్న ఒక వ్యక్తి మాకు కనిపించాడు. అతడు అమితమైన బాధతో బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. తీవ్రమైన వేదనను అనుభవిస్తూ ఆ వ్యక్తివేసే కేకలను వినాలన్న తలంపుతో నాతోనున్న దేవదూతను నేను ఆగమని చెప్పాను. అప్పుడు ఆ వ్యక్తి ఇలా కేకలు వేస్తుండటం నాకు వినిపించింది :

“ఓ దౌర్భాగ్యుడా, నీవు నిరంతరం ఇలా వేదనపడుతూ ఉండాల్సిందే. ఒక దినం కాదు రెండు దినాలు కాదు, నిరంతరం! కోట్ల సంవత్సరాల తరువాతకూడా నీవు ఈ బాధను భరిస్తూ ఉండాల్సిందే. ఈ బాధనుండి తప్పించుకొనేందుకు ఏం చేసేందుకైనా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అయ్యో, ఇదెంత నిస్సహాయమైన పరిస్థితి! ఇదెంత నిరీక్షణలేని స్థితి! ఓ శాపగ్రస్తమైన దౌర్భాగ్యుడా, నీవు శాశ్వతంగా శాపగ్రస్తుడవే! నేనెంత ఇష్టపూర్వకంగా ఈ శాపగ్రస్తమైన స్థలానికి వచ్చాను! తెలిసి తెలిసి నన్ను నేను ఎంతగా నాశనం చేసుకొన్నాను! క్షణికమైన సుఖభోగాలకోసం నిత్యమైన బాధను ఎంత బుద్ధిహీనంగా నేను ఎన్నుకొన్నాను!

ఇలా జరుగుతుందని ఎన్నిసార్లు నేను హెచ్చరించబడలేదు! నిత్య నాశనానికి నన్ను నడిపించే పాపపు మార్గాలను వదలివేయమని ఎన్ని సార్లు నాలో ఒత్తిడి కలుగలేదు! కాని, నేనొక చెవిటి సర్పంలా జ్ఞానయుక్త మైన ఆ మాటలను పెడచెవినిబెట్టాను. కొద్దికాలం మాత్రమే ఉండే ఆ సుఖభోగాలు శాశ్వతమైన వేదనకు నన్ను నడిపిస్తాయని నాకు తెలుప బడినప్పటికీ, నేను ఎంత బుద్ధిహీనంగా నిర్లక్ష్యం చేశాను! అవన్నీ వాస్తవాలు కావని అప్పట్లో నేను అనుకొన్నాను. అయితే, అవన్నీ ముమ్మా టికీ వాస్తవాలేనని దుఃఖకరమైన నా ఈ అనుభవం ఇప్పుడు నాకు తెలుపుతోంది. అప్పుడు నేను విన్న మాటలన్నీ వాస్తవాలని ఇప్పుడు నేను తెలుసుకొన్నాను. కాని సహాయం పొందేందుకు ఇప్పుడు బాగా ఆలస్యమైంది. ఎందుకంటే, నా నిత్యస్థితి శాశ్వతంగా స్థిరపరచబడింది.

నేనొక మనిషిగా ఎందుకు పుట్టాను? మంచిచెడులను గురించిన జ్ఞానం నాకు ఎందుకివ్వబడింది? అమర్త్యమైన ఆత్మ నాకెందుకు ఇవ్వ బడింది? దానిపట్ల నేను ఎందుకు శ్రద్ధ తీసుకోలేదు? నా నిర్లక్ష్యం నా నిత్యమరణానికి ఎంతగా కారణమయింది! పదివేల మరణాలకన్నా ఘోరమైన ఈ నిరంతర మరణం ఇంత భయంకరమైందని అప్పుడు నేనెందుకు తెలుసుకోలేకపోయాను? ఈ స్థితినుండి తప్పించుకొనే అవ కాశం అప్పుడు నాకు ఉండినప్పటికీ, నేనెందుకు తప్పించుకోలేదు?

ఇక్కడి అగ్ని ఆరదు. ఈ పురుగు ఇక ఎన్నటికీ చావదు. ఒకప్పుడు నేనెంతో సంతోషంగా ఉన్నాను. రక్షణ నాకు ప్రతిపాదించబడింది. అయితే, నేను దానిని త్రోసిపుచ్చాను. ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, వెయ్యిసార్లు అది నాకు ప్రతిపాదించబడింది. అయినప్పటికీ, నేను దానిని త్రోసివేసానంటే నేనెంతటి బుద్ధిహీనుడను! తాత్కాలికమైన సుఖభోగా లతో మానవులను ఆకర్షించి వారిని నిత్యనాశనానికి నడిపించే శాపగ్రస్త మైన పాపమా, నీవెంత దౌర్భాగ్యమైనదానవు!

దేవుడు అనేకసార్లు నన్ను పిలిచాడు. కాని, అన్నిసార్లూ నేను ఆయన పిలుపును నిరాకరించాను. అనేకసార్లు ఆయన నావైపు తన హస్తాన్ని చాచాడు. అయితే, నేను ఆ ప్రేమాహస్తాన్ని నిర్లక్ష్యంచేసాను. ఆయన జ్ఞానయుక్తమైన సలహాను ఎన్నిసార్లు నేను విస్మరించలేదు! ఎన్నిసార్లు ఆయన గద్దింపును నేను నిరాకరించలేదు!

అయితే, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నాపై ఊడిపడ్డ ఉపద్రవాన్ని చూసి ఇప్పుడు ఆయన నన్ను అపహాస్యం చేస్తున్నాడు. ఆయన సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు, సహాయం పొందేం దుకు నేను సిద్ధంగా లేను. కావున నా నిర్లక్ష్యానికి బదులుగా నాకు విధింపబడిన ఈ నిత్యశిక్ష న్యాయమైనదే.

దుఃఖకరమైన అతని విలాపవాక్కులను ఇక ఏమాత్రం నేను వినలేక పోయాను. దేవుడు నాపట్ల కనబరచిన తన అపారమైన కృపను అతని మాటలు నాకు జ్ఞాపకం చేసాయి. ఆయన పరిశుద్ధ నామము నిత్యము స్తుతించబడును గాక! దౌర్భాగ్యుడైన ఆ వ్యక్తివలె నేనుకూడా దేవుని నిత్యఉగ్రతకు గురికావలసిన వాడనే! అయితే, ఆయన కృపమాత్రమే ఆ ఉగ్రతనుండి నన్ను కాపాడింది.

ఆయన ఆలోచనలు ఎంత అగమ్యగోచరమైనవి! ఆయన దైవికతలంపులను ఎవరు ఊహించగలరు?

అలా నేను దేవుడు నాపట్ల కనబరచిన తన అపారమైన కృపను తలంచు కొంటూ కాసేపు నాలో నేను ఆయనను స్తుతించిన తరువాత, దుఃఖకరమైన స్థితిలో అమితంగా విలపిస్తున్న ఆ వ్యక్తితో నేను మాట్లాడాను.

నేను అతని విలాపవాక్కులను విన్నాననీ, అతని దుఃఖకరమైన స్థితిని నేను గ్రహించాననీ, అతనికి జరిగిన నష్టము సరిచేయలేనిదనీ నేను అతనితో అన్నాను. అతని వేదనను నాకు ఒక హెచ్చరికగా స్వీకరిస్తున్నానని నేను అతనితో చెప్పాను.

పాపాత్మ : లేదు, నా వేదనను నీవు ఏమాత్రం అర్థం చేసికోలేవు. ఎందుకనగా, దానిని అనుభవిస్తున్నవారు తప్ప వేరెవరూ దానిని గ్రహించలేరు. నీవు ఈ నరకానికి క్రొత్త వ్యక్తివని నేను అనుకొంటున్నాను.

నేను రక్షించబడతానన్న ఆశ ఏ కొంచెం నాకున్నా నేను వెంటనే మోకరిల్లి ఇక్కడనుండి విమోచింపబడేందుకు ప్రార్థించేవాణ్ణి. అయితే, ఇప్పుడు అవన్నీ వ్యర్థం. నేను శాశ్వతంగా నాశనానికి అప్పగించబడ్డాను. కాని, నీవు ఇక్కడకు రాకుండునట్లు జాగ్రత్తపడు. నరకంలో పాపులు ఎలాంటి వేదనను అనుభవిస్తారో నేను నీకు వివరిస్తాను.

పాపులు ఏం కోల్పోయారు?

పాపాత్మ : మేము ఇక్కడ రెండు విషయాలలో వేదనను అనుభవిస్తుంటాము. మొదటిది, ‘మేము కోల్పోయినవాటిని గురించి, రెండవది, ‘మేము అనుభవిస్తున్న వాటిని గురించి.’ దీనిని నాకు తెలిసినంతవరకు వివిధ భాగాలుగా నీకు వివరిస్తాను.

దేవుని సన్నిధిని

పాపాత్మ : ఈ దుఃఖకరమైన చీకటి ప్రదే శంలో మేము పరిశుద్ధుడగు దేవుని సన్నిధిని కోల్పోయాము. ఆయన సన్నిధి లేమియే ఈ చెరసాలను నరకంగా తయారుచేస్తోంది. ఈ నష్టం వేయి లోకాలను నష్టపోవడంకన్నా ఎక్కు వైన నష్టము. దేవుని ముఖకాంతిలో ఒక చిన్న
నేను రక్షించబడతానన్న ఆశ ఏ కొంచెం నాకున్నా నేను వెంటనే మోకరిల్లి ఇక్కడనుండి విమోచింపబడేందుకు ప్రార్థించేవాణ్ణి. అయితే, ఇప్పుడవన్నీ వ్యర్థం.

కాంతికిరణం ఇక్కడ ప్రవేశించినట్లయితే, మేము సంతోషంగా ఉండగలము. అయితే, మేము దానిని కోల్పోయి శాశ్వత దుఃఖానికి విడువబడ్డాము.

పరిశుద్ధులు మరియు దేవదూతల సహవాసము

పాపాత్మ : అంతేకాదు, మేము పరిశుద్ధులు మరియు దేవదూతల సహవా సాన్ని కూడా కోల్పోయాము. వారి స్థానంలో మమ్మును వేధించే దయ్యాలు, దౌర్భాగ్యకరమైన సహవాసం ఇక్కడ మాకు లభించింది.

పరలోకము

పాపాత్మ : ఇక్కడ మేము పరలోకాన్నికూడ కోల్పోయాము. పరలోకానికీ మాకూ మధ్య గొప్ప అగాధం ఉంది. కావున మేము ఎన్నటికీ అక్కడికి వెళ్ళలేము. పరిశుద్ధులకు పరలోక ఆనందంలోనికి స్వాగతం పలికే ఆ నిత్యద్వారాలు మా కోసం శాశ్వతంగా మూసివేయబడ్డాయి.

జాలి

పాపాత్మ : ఇక్కడ మాపట్ల జాలి చూపించేవారే లేరు. కావున “జాలి”ని మేము శాశ్వతంగా కోల్పోయాము. అది మాకు గొప్ప నష్టము. దేవుడు పాపులను ఎంతో ప్రేమించి వారికొరకు తన ఏకైక కుమారుని మరణానికి అప్పగించాడు. అయితే,

దేవుడు పాపులను ఎంతో ప్రేమించి వారికొరకు తన ఏకైక కుమారుని మరణానికి అప్పగించాడు. అయితే, దానికి భిన్నంగా
ఆయన ఇప్పుడు మా వేదనను చూసి ఆనందిస్తున్నాడు.

దానికి భిన్నంగా ఆయన ఇప్పుడు మా వేదనను చూసి ఆనందిస్తున్నాడు. ఆ విషయం మమ్మల్ని ఇక్కడ మరింతగా బాధిస్తోంది. ప్రేమామయు డగు దేవుని దయనూ, జాలినీ కోల్పోవడం కొలవలేని గొప్ప నష్టం. ఇతరుల పాప పరిహా రార్థం ఘోర సిలువలో తన రక్తాన్ని కార్చి, తన ప్రాణాన్ని అర్పించిన విమోచకుడు మాపై జాలి చూపించేందుకు నిరాకరించడంకన్నా క్రూరత్వం మరేముంటుంది?పరిశుద్ధులు మరియు దేవదూతలుకూడ మాపై జాలిపడరు. ఇక్కడ మేము తీవ్రమైన బాధను అనుభవిస్తుండగా మా నాశనముద్వారా దేవుడు మహిమపరచ బడుచున్నాడంటూ వారు ఆనందిస్తున్నారు. పాపంయొక్క ఫలితం ఎంత భయం కరమైందో చూశావా?

నిరీక్షణ – సహాయం

పాపాత్మ : మళ్ళీ మంచిస్థితికి వెళతామన్న నిరీక్షణ మాకు లేకపోవడం మా వేదనను ఇక్కడ మరింత అధికం చేస్తోంది. భూమిమీద అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నవారికి కూడా కొంత నిరీక్షణ మిగిలి ఉంటుంది. అందుకే, ‘నిరీక్షణ లేనప్పుడు హృదయం బ్రద్ద లవుతుంది’ అన్న సామెత భూమిమీద పదేపదే వినిపిస్తూ ఉంటుంది. ఈ నరకాగ్నిలో మాకు నిరీక్షణగాని సహాయంగాని లేనందున, మా హృదయాలు ఎంతగా బ్రద్దలవుతుంటాయో నీవు ఒక్కసారి ఊహించిచూడు.

ఒకే సమయంలో జ్వరం, మూత్రపిండంలో రాళ్ళు, కుష్ఠు, క్షయలాంటి జబ్బులన్నీ ఒక వ్యక్తిని పట్టి పీడించాయనుకో! అప్పుడా వ్యక్తి పరిస్థితెలా ఉంటుంది? అయితే, ఇక్కడ మేము అనుభవిస్తున్న వేదనలతో వాటన్నిటిని కలిపి పోల్చినప్పుడు, అవన్నీ కేవలం శూన్యమయినవే!

నరకంలో పాపులు ఏమి సహించవలసి ఉంటుంది?

పాపాత్మ : అలా మేము పోగొట్టుకొన్నవాటిని గురించి మేము తలంచినప్పుడు మమ్మల్ని మేము దూషించుకొంటూ పండ్లు కొరుకుతూ విపరీతంగా దుఃఖిస్తూ ఉంటాము. అయ్యో, అంతటితో అయిపోయిందా? తీవ్రమైన వేదనను భరిస్తూ ఇక్కడ మేము తల్లడిల్లుతుంటాము. ఇప్పుడు మేము ఇక్కడ అనుభవిస్తోన్న వేదనను గురించి నీకు వివరిస్తాను.

చెప్పనశక్యమైన వేదన

పాపాత్మ : ఇక్కడ మేము అనేక విధములైన వేదనలను అనుభవిస్తున్నాము. దాదాపుగా పది వేల రకాలైన వేదనలను ఇక్కడ మేము అనుభవిస్తున్నాము.

భూమిమీద మానవులు ఒక సమయంలో ఒక బాధను మాత్రమే అనుభవిస్తారు. అయితే ఒకే సమయంలో జ్వరం, మూత్రపిండంలో రాళ్ళు, కుష్ఠు, క్షయలాంటి జబ్బులన్నీ ఒక వ్యక్తిని పట్టి పీడించాయనుకో! అప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఇక్కడ ఒకవైపు ఆరని అగ్ని, మరోవైపు మండుతోన్న గంధకము మమ్మల్ని కాల్చివేస్తుంటాయి.

ఇక్కడ ఒకవైపు ఆరని అగ్ని, మరోవైపు మండుతోన్న గంథకము మమ్మల్ని కాల్చివేస్తుంటాయి. మేము తప్పించుకొనేందుకు ఏమాత్రం వీలులేకుండా మాచుట్టూ గాఢాంధకారం ఆవరించి నిత్యం మమ్మల్ని నిత్యసంకెళ్ళు మమ్మల్ని బంధించివేస్తాయి.

మేము తప్పించుకొనేంద ఏమాత్రం వీలులేకుండా నిత్యసంకెళ్ళు మమ్మల్ని బంధించివేస్తాయి. అది ఎంతో భయంకరంగాను భరించలేని విధంగాను ఉంటుంది కదూ? అయితే, ఇక్కడ మేము అనుభవిస్తున్న వేదనలతో వాటన్నిటిని కలిపి పోల్చినప్పుడు, అవన్నీ కేవలం శూన్యమయినవే! మాచుట్టూ గాఢాంధకారం ఆవరించి నిత్యం మమ్మల్ని భయపెడుతూ ఉంటుంది. ఇలా చెప్పుకొంటూ పోతే, ఆ చిట్టాకు హద్దుండదు. భూమిమీద మానవులు అనుభవించే వేదనలన్నీ ఒకటిగా కలిపినప్పటికీ, అవన్నీ ఇక్కడ మేము అనుభవిస్తోన్న ఒక్క వేదనకు సమానం కావు.

వేదనలన్నీ ఒకే సమయంలో

పాపాత్మ : ఇక్కడ వేదనలన్నీ ఒకే సమయంలో మాపై మూకుమ్మడిగా దాడి చేస్తాయి. అవి మా శరీరంలోని ప్రతి భాగాన్నీ, ఆత్మలోని శక్తులన్నిటినీ ఒకే సమయంలో వేధిస్తాయి. ఆ వేదన భరించలేనిదిగా ఉంటుంది. భూమిమీదైతే శరీరంలోని కొన్నిభాగాలు బాధననుభవిస్తుండగా మరికొన్ని భాగాలు విశ్రాంతి తీసుకొంటుంటాయి. నీ శరీరం అనారోగ్యానికి గురైనప్పుడు, నీ తల ఆరోగ్యంగా ఉంటుంది.

ఒకవేళ నీ తల అస్వస్థతగా ఉన్నప్పటికీ, ఇతర శరీరభాగాలు బాగా పనిచేస్తూ ఉంటాయి. అయితే, ఇక్కడి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఆత్మ మరియు శరీరంలోని అన్ని భాగాలు ఒకే సమయంలో వేధించ బడుతూ ఉంటాయి. మా కళ్ళు దయ్యాల చూపులతో వేధించబడుతుంటాయి. అవి భయంకరమైన రూపాలతో మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. పెద్దపెద్ద కేకలు మరియు పాపాత్ముల ఏడ్పులు చెవులను తూట్లు పొడుస్తూ ఉంటాయి. గంథకపు అగ్నిజ్వాలలు ముక్కులను ఊపిరిపీల్చుకోనీయవు. నాలుక ఆ వేడిని భరించలేక దాహానికి అలమటిస్తూ ఉంటుంది. శరీరమంతా అగ్ని ద్రావకపు జ్వాలల్లో దొర్లుతూ ఉంటుంది.

గంధకపు అగ్నిజ్వాలలు ముక్కులను ఊపిరిపీల్చుకోనీయవు.
నాలుక ఆ వేడిని భరించలేక దాహానికి అలమటిస్తూ ఉంటుంది. శరీరమంతా అగ్ని ద్రావకపు జ్వాలల్లో దొర్లుతూ ఉంటుంది.

అంతేకాదు, ఆత్మలోని శక్తులన్నీ ఒకే సమయంలో ఇక్కడ వేదనకు గురవుతాయి. జ్ఞాపకశక్తి, ఊహలు, ఆలోచనలు – ఇవన్నీ ఏకకాలంలో వేధించబడతాయి. మేము కోల్పో యిన పరలోక ఆనందం మరియు ప్రస్తుతం అనుభవిస్తున్న నరకపు వేదనలను గురించిన తలంపులు ఒకే సమయంలో మమ్మల్ని వేధిస్తాయి. మా అమూల్యమైన సమయాన్ని భూమిమీద మేము ఎలా వృధాగా గడిపామో, అమూల్యమైన రక్షణ భాగ్యాన్ని ఎలా మేము తృణీకరించామోనన్న తలంపులతో మా మనస్సులు అమితమైన వేదనను అనుభవిస్తాయి. గత సుఖభోగాలు, ప్రస్తుత బాధలు, భవిష్యత్తులోని దుఃఖాలను గురించిన తలంపులతో మా గ్రాహ్యశక్తి వేధించబడుతుంది. నిరంతర మరణవేదనకు గురౌతున్నప్పటికీ, ఈ ఆత్మ మరణించదన్న తలంపు మమ్మల్ని నిరంతరం తీవ్రమైన వేదనకు గురిచేస్తూ ఉంటుంది.

తీవ్రమైన వేదన

పాపాత్మ : మేము భరించలేనంతగా మా బాధను అధికంచేసే మరొకటి ఏదనగా, మా వేదనలయొక్క తీవ్రత. మమ్మల్ని నిరంతరం దహించివేసే అగ్ని జ్వాలలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే, సముద్రజలాలన్నీ ఒక్కసారిగా ఉప్పెనలా ముంచుకొచ్చి వాటిమీద పడినప్పటికీ, వాటిని ఆర్పజాలవు! ఇక్కడ మేము అనుభవించే బాధ, దానిని అనుభవించేవారికి తప్ప ఇతరులకు అర్థంకాదు.

దైవిక న్యాయము తన తీర్పును మాపై ఎంత తీవ్రంగా అమలుచేస్తోందంటే, మేము అనుభవించే బాధను దేవదూతల శక్తి కూడ భరించలేదు।

ఎడతెగని వేదన

పాపాత్మ : మా వేదనలోని మరో దుఃఖకరమైన అంశం ఏదనగా, మా వేదన ఎడతెగక నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఒక్కక్షణంకూడ మాకు ఆ వేదనల నుండి విరామం ఉండదు. మా వేదనలు తీవ్రమైనవేగాక, నిరంతరం కొనసాగుతూ ఉంటాయి.

కొద్దిసేపైనా మా వేదనలు మాకు విరామాన్ని ఇచ్చినట్లయితే, అది మాకు ఎంతో ఉపశమనంగా ఉంటుంది. అయితే, మా వేదనలకు విరామం అనేది ఉండదు. మేము ఇప్పుడు అనుభవిస్తోన్న బాధను శాశ్వతకాలం అనుభవించాలి. ఇది మా హృదయాలలో దేవుని పట్ల ద్వేషాన్ని మరింత పెంపొందింపజేస్తుంది. దేవునిపట్ల మాలో పెంపొందే ఆ ద్వేషం మా వేదనలను మరింత అధికం చేస్తుంది.

నిరంతర మరణవేదనకు గురౌతున్నప్పటికీ, ఈ ఆత్మ మరణించదన్న తలంపు మమ్మల్ని నిరంతరం తీవ్రమైన వేదనకు గురిచేస్తూ ఉంటుంది. కొద్దిసేపైనా మా వేదనలు
మాకు విరామాన్ని ఇచ్చినట్లయితే అది మాకు ఎంతో ఉపశమనంగా ఉండేది. అయితే, మా వేదనలకు విరామం అనేది ఉండదు. మేము ఇప్పుడు అనుభవిస్తోన్న బాధను శాశ్వతకాలం అనుభవించాలి.

ఒకరినొకరు వేధించుకొనుట

పాపాత్మ : ఇక్కడ మాతోపాటు ఉన్న మా సహచరులు మా వేదనను అధికంచేసే మరో సాధనాలు. వేధించే దయ్యాలు మరియు వేధింపబడే ఆత్మలు ఇక్కడ మా సహచరులు. భయంకరమైన కేకలు, దూషణ మాటలు,హృదయవిదారకమైన ఏడ్పులు, భీకరమైన పెడబొబ్బలు మాత్రమే ఇక్కడ మా సంభాషణ. మాతోకూడ వేధించబడే మా సహచరులు మాకు ఏమాత్రం ఓదార్పును ఇవ్వకపోగా మా వేదనను మరింత అధికం చేస్తారు.

వేదనలతో నిండిన స్థలం

పాపాత్మ : వేదనలతో నిండిన ఈ స్థలము మా వేదనను మరింత అధికం చేసేందుకు మరో కారణం. ఇది అత్యంత దౌర్భాగ్యమైన స్థలం. ఇదొక చెరసాల మాత్రమేగాక, ఒక అగ్నిగుండముకూడా. అంతేకాదు, ఇది గాఢాంధకారంతో నిండిన ఒక అగాధ గొయ్యి. ఈ దౌర్భాగ్యమైన స్థలము మా వేదనను మరింత అధికం చేయక మరేం చేస్తుంది?

క్రూరంగా వేధించేవారు

పాపాత్మ : మమ్మల్ని వేధించే దురాత్మల క్రూరత్వం మా బాధను మరింత అధికం చేస్తుంది. మమ్మల్ని వేధించే దురాత్మలకు ప్రేమ, దయ, కరుణ, కనికరం, జాలి అంటే ఏంటో తెలియదు. అవి తాము వేదనకు గురౌతూ మమ్మల్నికూడా వేదనకు గురిచేస్తూ ఆనందిస్తుంటాయి.

శాశ్వతమైన వేదన

పాపాత్మ : నేను నీకు చెప్పిన వివరాలన్నీ దుఃఖకరమైనవి. అయితే, భరించ లేని ఇంకో విషయమేమంటే మా వేదన శాశ్వతమైనది. భరించలేని మా వేదన లన్నీ నిత్యత్వమంతటా మేము అనుభవిస్తూ ఉండాలి. అయ్యో, మానవులపట్ల దేవుని ప్రతీ కారంతోకూడిన తీర్పు ఎంత భయంకర మైనది “శపించబడినవారలారా, నిత్యాగ్నిలోనికి పోవుడి” (మత్తయి 25:41) అని ఆయన పలికిన మాటలు నా చెవుల్లో ఇంకను ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అయ్యో, ఆ మాటలు నాపట్ల పూర్తి భిన్నంగా మార్చబడితే ఎంత బాగుణ్ణు! అలా మార్చబడేందుకు ఒక చిన్న అవకాశం ఉంటే ఎంత బాగుణ్ణు! దాని అయితే, ఇవన్నీ కేవలం వ్యర్థమైన ఊహలే. ఇవేవీ నన్నిప్పుడు ఈ నిత్యశిక్ష నుండి తప్పించలేవు. సర్వోన్నతుని శక్తి నన్ను ఈ చీకటి చెరసాలలో ద్వారాశాశ్వతంగా బంధించివేసింది.

ఈ వేదన నానుండి తొలగిపోతే ఎంత బాగుణ్ణు! ఈ వేదన నానుండి తొలగిపోతే ఎంత బాగుణ్ణు! అయితే, ఇవన్నీ కేవలం వ్యర్థమైన ఊహలే. ఇవేవీ నన్నిప్పుడు ఈ నిత్యశిక్షనుండి తప్పించలేవు. సర్వోన్నతుని శక్తి నన్ను ఈ చీకటి చెరసాలలో శాశ్వతంగా బంధించివేసింది. 

ఈ శాశ్వతమైన బాధను నేను ఎలా భరించాలో నాకు అర్థంకావడం లేదు. అయినప్పటికీ, దీన్ని నేను శాశ్వతకాలం సహించాల్సిందే. ఇలా మేము ఈ దుర్భరమైన స్థలంలో పడిపోయామనీ, శాశ్వతంగా ఇక్కడే ఉంటామనీ నీకు మా దయనీయమైన పరిస్థితిని గురించి వివరంగా చెప్పాను.

ఇలా ఆ ప్మా నాకు చెప్పడం ముగించగానే నరకంలోని దురాత్మ అతణ్ణి తాజాగా శిక్షించడం ప్రారంభించింది. ఫిర్యాదుచేయడం ఇక చాలించమనీ, అలా ఫిర్యాదుచేయడం కేవలం వ్యర్థమనీ ఆ దురాత్మ అతనికి హితబోధ చేసింది. ఆ వ్యక్తిని ఉద్దేశిస్తూ ఆ దురాత్మ ఇలా మాట్లాడింది :

“ఈ శిక్షంతటికీ నీవు పాత్రుడవేనన్న విషయం నీకు తెలియదా? ఈ శిక్షను గురించి భూమిమీద నీవు జీవించిన కాలంలో ఎన్నిసార్లు నీకు తెలియపరచబడలేదు! అప్పుడు నీవు ఎందుకు దాన్ని విశ్వసించక నిర్లక్ష్యంచేశావు? అప్పుడు నరకాన్ని గురించి నీకు చెప్పినవారిని నీవు అపహాస్యం చేశావు!”

“సర్వశక్తుని న్యాయమైన తీర్పును ప్రశ్నించేందుకు అప్పట్లో నీవు ధైర్యం చేశావు! ఎన్నిసార్లు నీవు దేవుని తృణీకరించి అపహాస్యం చేయ లేదు? ఇప్పుడేమో వేదాంతం వల్లిస్తూ ఫిర్యాదు చేస్తున్నావా? తెలిసి తెలిసీ నిన్ను నీవు నిత్యనాశనానికి నడిపించుకొని, నీవేదో అన్యాయా నికి గురైనట్లు ఫిర్యాదుచేస్తే ఎలా? రక్షణ పొందేందుకు నీకు అవకాశం ఇవ్వబడిందనీ, దాన్ని నీవు నిర్లక్ష్యం చేశావనీ నీవే ఒప్పుకొంటున్నావు. అలాంటప్పుడు ఏ ముఖం పెట్టుకొని నీవు శిక్షింపబడుతున్నందుకు “అలా చెప్పాలంటే ఫిర్యాదు చేసేందుకూ వాదించేందుకూ నీకన్నా నాకే ఎక్కువ కారణాలున్నాయి. మారుమనస్సు పొందేందుకు నీకు అనేక అవకాశాలు ఇవ్వబడ్డాయి. కాని, నేను పాపం చేసిన వెంటనే నరకంలోనికి త్రోయబడ్డాను. రక్షించబడేందుకు నీకు అవకాశం ఇవ్వ బడింది. పాపక్షమాపణాకాలం నీకు అనేకసార్లు పొడిగించబడింది. అయితే, నాకు ఎలాంటి దయాకనికరాలు చూపించబడలేదు. నేను పాపము చేసిన వెంటనే నిత్యశిక్షకు అప్పగించబడ్డాను.

ఒకవేళ నాకే గనక మారుమనస్సు పొందే అవకాశం ఇవ్వబడి ఉండినట్లయితే నేను ఆ అవకాశాన్ని ఏమాత్రం తృణీకరించేవాడను కాను. నీకు రక్షణావ కాశం ఇవ్వబడి ఉండనట్లయితే నీకు ఇక్కడ మేలుగా ఉండేది. అప్పుడు నీవు ఈ శిక్షను సులభంగా భరించి ఉండేవాడవు. ఇప్పుడు నీపట్ల ఎవరు జాలి చూపాలని నీవు ఆశిస్తున్నావు? పరలోకాన్నే తృణీకరించిన నీవు దయను ఎలా ఆశిస్తున్నావు?”

ఆ మాటలు విన్నాక ఆ వ్యక్తి మరింత బిగ్గరగా అరుస్తూ ఆ దురాత్మతో ఇలా అన్నాడు :

“అలాగైతే నన్ను నీవు వేధించడాన్ని కొనసాగించవద్దు! నా నాశనం నా స్వంత తప్పిదంద్వారా వచ్చిందేనని నాకు తెలుసు. అయ్యో, నేను నా తప్పిదాన్ని మరచిపోయినట్లయితే ఎంత బాగుణ్ణు! ఆ తలంపు నన్ను మరింత వేదనకు గురిచేస్తోంది. ఈ శిక్షంతటికీ నేను పాత్రుడనే, ఈ శిక్ష నాకు న్యాయమే.

ఆ తర్వాత ఆ వ్యక్తి తన ప్రక్కనున్న దురాత్మవైపు తిరిగి ఇలా అన్నాడు :

“కాని, శాపగ్రస్తమైన దురాత్మా, ఇదంతా కేవలం నీ శోధనలవల్లనే జరిగింది. నేను చేసిన పాపాలన్నీ కేవలం నీవు నన్ను శోధించడంవల్లనే నేను చేశాను. ఇప్పుడు నీవు నాకు హితబోధ చేస్తున్నావా? తప్పంతా నాదేనని నావైపు నీవిప్పుడు వేలెత్తి చూపిస్తున్నావా? నీకు ఒక రక్షకుడు ఇవ్వబడలేదని నీవంటున్నావు. అయితే, నిరంతరం శోధించే నీలాంటి శోధకుడు నాకుండినట్టుగా నీకు శోధకుడెవడూ లేడుగా?”

ఈ మాటలకు ఆ దురాత్మ ఎగతాళిగా నవ్వుతూ ఆ వ్యక్తికి ఇలా బదులిచ్చింది:

“నిన్ను శోధించడం, నిన్ను నరకానికి నడిపించడం నా పని. ఈ విషయాన్ని భూలోకంలోని బోధకులు అనేకసార్లు నీకు చెప్పారు. మేము నీ నాశనాన్ని కోరుతున్నామని వారు నీకు స్పష్టంగా చెప్పారు.

మేము గర్జించు సింహములవలె భూమిమీద ఎవరిని మ్రింగుదుమా అని నిరం తరం ఇటూ అటూ తిరుగుతూ వచ్చాము (1 పేతురు 5:8). ఇతరులు అనేకులు ఆ బోధకుల మాటలు విని మమ్మల్ని నిరుత్సాహపరచారు. వారి మాటలను నీవుకూడా వింటావేమోనని ఆ సమయంలో నేను చాల భయపడ్డాను. అయితే, నీవు ఏం చేయాలని మేము ఆశించామో కచ్చి తంగా దాన్నే నీవు చేస్తూ వచ్చావు. మేము చెప్పినట్లుగా మా పనులన్నీ నీవు చేసినందున, ఇప్పుడు నీ జీతాన్ని మేము నీకు తప్పక చెల్లించాలి.

ఆ తర్వాత దురాత్మ ఆ వ్యక్తిని వినూత్న పంధాలో వేధించడం ప్రారంభించింది. ఆ బాధ భరించలేక ఆ వ్యక్తి భయంకరంగా కేకలువేయడం ప్రారంభించాడు. అతని బాధను చూస్తూ, అతడు వేస్తున్న కేకలను వింటూ ఇక నేనక్కడ ఒక్క క్షణంకూడ ఉండలేకపోయాను. భారమైన హృదయంతో అక్కడనుండి నేను ముందుకు కదిలాను.

శిక్షకు అప్పగించబడిన ఈ ఆత్మల పరిస్థితి ఎంత విచారకరమైనది! వారు భూమిమీద ఉన్నప్పుడు దురాత్మల దాసులుగా జీవించారు. తాము నరకానికి వచ్చాక ఆ దురాత్మలతోనే శిక్షించబడుతున్నారు!

ఎపెనెటస్ : శిక్షకు అప్పగించబడిన ఈ భూమిమీద ఉన్నప్పుడు దురాత్మల దాసులుగా ఆత్మల పరిస్థితి ఎంత విచారకరమైనది! వారు జీవించారు. తాము నరకానికి వచ్చాక ఆ దురాత్మలతోనే శిక్షించబడుతున్నారు!

దేవదూత : ఆదాము వారసులైన మానవజాతిపై ఈ దురాత్మలకు ఉన్న ద్వేషం చాల తీవ్రమైనది. అది వర్ణనాతీతమైనది. ఎందుకనగా, తాము నరకంలో త్రోయబడివుండగా, దైవకుమారుడు తన మరణంద్వారా మానవజాతిని రక్షిం చడం వారి ద్వేషాగ్నిజ్వాలల్ని మరింత తీవ్రతరం చేశాయి. ఎన్నుకొనబడినవారిలో ఎవరినీ పరలోక మహిమలోనికి వెళ్ళనివ్వకుండా నిరోధించడం వారికి సాధ్యమైన విషయం కానప్పటికీ, రకరకాల పాపపుశోధనలతో ఈ దురాత్మలు భూమిమీద ఏర్పరచబడిన దేవునిబిడ్డలను నిరంతరం శోధిస్తూనే ఉంటాయి. భూమిమీద అనేక ఆత్మలు పరలోకాన్ని గురించిగాని నరకాన్ని గురించిగాని సరైన అవగాహన కలిగియుండ నందువల్ల, అలాంటి ఆత్మలను ఈ దురాత్మలు సులభంగా తమ ఉచ్చుల్లో బంధించి నిత్య నాశనకరమైన ఈ నరకానికి నడిపించగలుగు తున్నాయి.

ఆదాము వారసులైన మానవజాతిపై ఈ దురాత్మలకు ఉన్న ద్వేషం చాల తీవ్రమైనది. అది వర్ణనాతీతమైనది. ఎందుకనగా, తాము నరకంలో త్రోయబడివుండగా, దైవకుమారుడు తన మరణంద్వారా మానవజాతిని రక్షించడం వారి ద్వేషాగ్నిజ్వాలల్ని మరింత తీవ్రతరం చేశాయి.

తమ శోధనలకు లొంగినందుకుగాను ఈ దురాత్మలు మానవాత్మలను ఎలా హింసించి సన్మానిస్తున్నాయో నీవు ఈపాటికే చూశావు, ఇకను చూడబోతావు. మానవజాతిపై తమ కున్న ద్వేషాగ్నిజ్వాలల్ని ఈ దురాత్మలు ఇలా ప్రదర్శిస్తూ సంతృప్తినొందుతున్నప్పటికీ, వాస్తవానికి ఇవి భూమిమీద తమ మాట విని ఇష్టపూర్వకంగా పాపము చేసిన పాపులకు నిర్ణయించబడిన శిక్షను అమలుచేసే సర్వోన్నతుడగు దేవుని ప్రతినిధులుగానే ఇక్కడ ఉన్నాయి!

అబద్ధసాక్షులకు మరింత వేదన

అలా మేము ఇంకకొంత ముందుకు వెళ్ళాక, తీవ్రమైన ద్వేషంతో ఏమాత్రం విరామంలేకుండా దురాత్మలు నిరంతరం తమపై అగ్నిగంథకములను వేస్తుండగా,భయంకరమైన వేదనను అనుభవిస్తూ, ఆ వేదనను భరించలేక తమ పళ్ళు కొరుకుతూ, బిగ్గరగా కేకలువేస్తోన్న విస్తారమైన పాపాత్మల సమూహాన్ని మేము చూశాము. ఆ పాపాత్మలు దురాత్మలు పెట్టే బాధను భరించలేక భయంకరంగా దేవుని దూషిస్తూ, తమ చుట్టూ ఉన్నవారిని దూషిస్తూ, తమ్మును తాము నిందించుకొంటూ ఉన్నాయి.

నేను అక్కడ ఆగి, అలా ఆ పాపాత్మలను హింసిస్తూ ఉన్న ఒక దురాత్మను చూసి, వారిని అంత భయంకరంగా ఎందుకు హింసిస్తున్నారని అడగకుండా ఉండలేకపోయాను.

దురాత్మ : వీరందరూ ఇంతటి శిక్షకు పాత్రులే. వీరు ఇతరులకు పరలోక మార్గాన్ని బోధించి, తాముమాత్రం నరకాన్ని ప్రేమించి ఇక్కడకు చేరుకొన్న శాపగ్రస్తులు. వాస్తవానికి వీరు భూలోకంలో నరకలోకానికి ప్రతినిధులుగా పని చేశారు. కావున, ఇక్కడకు నరకలోకపు ప్రతినిధులుగా వచ్చిన వీరిని గొప్పగా గౌరవించాల్సిన బాధ్యత మామీద లేదంటావా? తమ తమ క్రియలచొప్పున వారిలో ఎవరెవరికి ఎంతభాగం ఇవ్వాలో నిదానించి చూసిమరీ మేము వారివారి భాగాన్ని వారికి ఇస్తున్నాము. ఈ విషయంలో మేము చాల జాగ్రత్త వహిస్తున్నాము. తాము చేసిన పాపాలకు మాత్రమేగాక, తమ సిద్ధాంతాలద్వారాను, తమ మాదిరి జీవితంద్వారాను తాము దారి మళ్ళించినవారి విషయంలోకూడ వీరు జవాబుదారీగా ఉన్నారు.

భూమిమీద వారు ఉన్నప్పుడు మేము ఈ విషయాలన్నింటినీ వారికి చెప్పలేదన్నది వాస్తవం. ఎందుకంటే,అక్కడ వారికి అబద్ధాలు చెప్పి వారిని మోసగించడమే మా పని.

ఎపెనెటస్ : నీవు చెప్పిన విధంగా వారు నరక ప్రతినిధులైనప్పుడు, వారికి మీ కృతజ్ఞతను వ్యక్త పరుస్తూ, వారికి కాస్తయినా మీరు దయాకనిక రాలను చూపించాల్సిన అవసరం లేదా?

దురాత్మ : వారుగాని మరెవరైనాగాని దురా త్మలమైన మావద్దనుండీ కృతజ్ఞతనూ దయా కనికరాలనూ ఆశిస్తున్నారంటే వారు మమ్మును

తప్పుగా అర్థం చేసుకొన్నారన్నమాటే. ఎందుకంటే, అవి మా స్వభావానికి భిన్నమైనవి. కృతజ్ఞత, దయ, కనికరం, జాలి – ఇవన్నీ సద్గుణాలు. ఆ సద్గుణాలను మేము అమితంగా ద్వేషిస్తాం. అవి మాకు శాశ్వతమైన శత్రువులు.

పరలోక మార్గంలో ప్రవేశించిన పాపులకోసం శత్రువు ఆ మార్గంలో ఎన్ని ఉరులను అమర్చాడో నాకు అర్థమయింది. ఆ విషయాన్ని గురించి నేను మరింత ధ్యానించినప్పుడు, కేవలం చెప్పశక్యముగాని దేవుని ఉచిత కృపద్వారా మాత్రమే ఒక పాపి పరలోకం చేరగలడని నేను తెలుసుకొన్నాను.

భూమిమీద వారు ఉన్నప్పుడు మేము ఈ విషయాలన్నింటినీ వారికి చెప్ప లేదన్నది వాస్తవం. ఎందుకంటే, అక్కడ వారికి అబద్ధాలు చెప్పి వారిని మోసగించడమే మా పని. అయితే వారు ఇక్కడి కొచ్చాక, విమోచన ఏమాత్రం సాధ్యంకాని నరకంలో వారు భద్ర పరచబడిన తరువాత, మమ్మును విశ్వసించి వారు ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించారో వారికి మేము వివరిస్తాం.

గొప్ప కృపావిమోచన

ఈ దురాత్మనుండీ మరికొన్ని దురాత్మలనుండీ నేను విన్న మాటలను గురించి నేను లోతుగా ఆలోచించిన తరువాత, పరలోక మార్గంలో ప్రవేశించిన పాపుల కోసం శత్రువు ఆ మార్గంలో ఎన్ని ఉరులను అమర్చాడో నాకు అర్థమయింది. ఆ విషయాన్ని గురించి నేను మరింత ధ్యానించినప్పుడు, కేవలం చెప్పశక్యముగాని దేవుని ఉచిత కృపద్వారామాత్రమే ఒక పాపి పరలోకం చేరగలడని నేను తెలుసుకొన్నాను.

కావున, కేవలం దేవుని కుమారుడు జరిగించిన విమోచనాకార్యం మాత్రమే ఆయన ప్రజలను వారి పాపములనుండి రక్షించి, “రాబోవు ఉగ్రతనుండి” (1 థెస్స. 1:10) వారిని విడిపించగలదని నేను స్పష్టంగా గ్రహించాను. అయితే, ఆయన ప్రతిపాదించిన కృపాప్రతిపాదనలను త్రోసిపుచ్చి నాశనపురుషునితో తమ్మునుతాము ఐక్యపరచుకొనిన ప్రజలు ఎంత బుద్ధిహీనులోనన్న విషయాన్ని కూడా నేను గ్రహించాను. ఈ విషయాన్నే నాతోనున్న నా మార్గదర్శియగు దేవ దూతతో నేను అన్నాను.

దేవదూత : వారి పాపమే వారి హృదయాలను అలా కఠినపరచి, వారి కళ్ళకు గ్రుడ్డితనం కలుగజేస్తుంది. దానినిబట్టియే వారు సరైన నిర్ణయాలను తీసుకోలేక పోతారు. పరిశుద్ధాత్ముడు వారి హృదయకాఠిన్యాన్నీ వారి గ్రుడ్డితనాన్నీ తీసివేసేంత వరకు వారిలో ఆ అజ్ఞానం కొనసాగుతూ ఉంటుంది. అప్పుడు మాత్రమే వారు నిజమైన వెలుగును చూడగలుగుతారు (అపొ.కా. 9:1-18 చూడుము).

అలా మేము మరికాస్త ముందుకెళ్ళాక, అక్కడ ఒక పాపాత్మ అమితమైన బాధతో హృదయవిదారకంగా కేకలు వేస్తూ, తన్ను మోసగించి ఆ స్థలానికి తీసుకొనివచ్చినవారిని తీవ్రంగా దూషించడం మా కంటబడింది.

రక్షించబడేందుకు బాగా ఆలస్యమయింది

పాపాత్మ : నేను ఎవరిపైన అయితే ఆధారపడ్డానో, వారు నాకు చెప్పిన
మాటలు వాస్తవమైనవనీ, వారు నన్ను సరైన మార్గంలోనే నడిపిస్తున్నారనీ నేను అనుకొన్నాను.

నా జీవితకాలమంతా ఐహికభోగాలను బాగా అనుభవించవచ్చుననీ, చివరిగా నేను నా మరణ శయ్యపై ఉన్న సమయంలో, “ప్రభువా, నన్ను దయతో క్షమించు” అని పలికితే సరిపోతుందనీ వారు నాకు చెప్పారు.

నన్ను రక్షించడానికి ఆ పలుకులు చాలునని వారు చెప్పిన అబద్ధాలను నేను గ్రుడ్డిగా నమ్మాను. కాని, ఆ మాటలు నన్ను రక్షించకపోగా, అవి నన్ను నిత్యనాశనానికి ఇక పాపం చేసేందుకు నీలో సత్తువలేనంతవరకు నడిపించాయి. అయ్యో, నేను నా మరణశయ్యపై బాధతో కేకలు వేశాను, క్షమాపణకోసం ఎంతగానో అర్థించాను। రక్షణను ఎంతగానో నేను ఆశించాను। కాని, అప్పటికే బాగా ఆలస్యం అయిపోయిందని నేను కనుగొన్నాను.

“నీకేం ఫరవాలేదు, నీవు సురక్షితంగానే ఉన్నావు” అని నాతో అంతకు మనుపు పలికిన ఈ శాపగ్రస్తమైన దురాత్మ అప్పుడు నావైపు చూసి, నేను రక్షించబడటానికి ఇప్పుడు బాగా ఆలస్యం అయిపోయిందనీ, ఇప్పుడు కేవలం నరకం మాత్రమే నాకోసం నోరు తెరుచుకొని ఉందనీ నన్ను అపహాస్యం చేస్తూ పలికింది! ఈ దౌర్భాగ్యపు దురాత్మ చెప్పిన మాటలు కొన్ని క్షణాల్లోనే నిజమయ్యాయి!!

నీవు నీ పాపంలో కొనసాగావు. చివరిగా,. నీ పాపాన్ని నీవు ద్వేషించినందున నీవు దాన్ని వదలిపెట్టలేదుగాని, నీ పాపంలో కొనసాగేందుకు నీలో ఇక ఏమాత్రం శక్తి లేనందుననే నీవు దానిని వదలివేశావు.

నీవు దేన్ని విత్తుతావో ఆ పంటనే కోయాలి

దురాత్మ : చూశావా, కనీసం నీ చివరి క్షణాల్లోనైనా నేను నీకు నిజం చెప్పాను. నేను చెప్పిన మాటలు నిజమయ్యాయా? లేదా? కాని, నీ ఆలోచన ఎంత దుష్టత్వంతో నిండినది! నీ జీవితకాలమంతా నీవు నీ పాపంలోను నీ అపవిత్రత లోను ఐహిక భోగాల్లోను జీవించి, చివరికి మరణించడానికి కొద్ది సమయం ముందు పాపక్షమాపణకొరకు ప్రయత్నించి పరలోకానికి వెళ్ళాలని ఆశించడం ఎంత విడ్డూరంగా ఉంది! అది సాధ్యమవుతుందని కేవలం ఒక పిచ్చోడుతప్ప
మరెవరు అనుకొంటారు?

తాను మరణించాక పరలోకానికి వెళ్ళాలని నిజంగా ఆశించేవాడు తన జీవితకాలంలో పరిశుద్ధంగా జీవించాలని ఆశిస్తాడు. కాని, “చనిపోయే చివరి క్షణాల్లో ప్రభువా, నాపై దయచూపించు’ అని పలికితే చాలు, పరలోకం వెళతావు” అని ఎవడో చెబితే నీవెలా నమ్మావు? నీవు కాస్త నీ బైబిలును తెరిచి, అలా నీతో చెప్పబడిన మాటలు నిజమో కాదో పరిశోధించాల్సిన బాధ్యత నీకు లేదా? “పరిశు ద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు” (హెబ్రీ 12:14) అన్న వాస్తవాన్ని తెలిసికొనవలసిన అవసరత నీకు లేదా?

“దేవుడు వెక్కిరింపబడడు, మను ష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును” (గలతీ. 6:7) గనుక మోసపోవద్దని నీవు అనేకసార్లు హెచ్చరించబడ్డావు. అయినప్పటికీ, నీవు అలాంటి మాటలను పెడచెవినపెట్టావు.

నీ జీవితకాలమంతా నీ ఇష్టానుసారంగా పాపంలో జీవించావు. పాపపు లోతుల్లోకి వెళ్ళావు. ఐహిక భోగాలను నీకు ఏవగింపు అయ్యేంతవరకు నీవు “దేవుడు వెక్కిరింపబడడు, అనుభవించావు. ఇక పాపం చేసేందుకు నీలో మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును” గనుక మోసపోవద్దని నీవు అనేకసార్లు హెచ్చరించబడ్డావు. అయినప్పటికీ, నీవు అలాంటి మాటలను పెడచెవినపెట్టావు.

సత్తువలేనంతవరకు నీవు నీ పాపంలో కొన సాగావు. చివరిగా, నీ పాపాన్ని నీవు ద్వేషించి నందున నీవు దాన్ని వదలిపెట్టలేదుగాని, నీ పాపంలో కొనసాగేందుకు నీలో ఇక ఏమాత్రం శక్తి లేనందుననే నీవు దానిని వదలివేశావు. ఇవన్నీ ముమ్మాటికీ వాస్తవాలని నీకు బాగా తెలుసు. అలా నీవు ఒకవైపు నీ హృదయంలో పాపాన్ని ప్రేమిస్తూనే, మరో వైపు పరలోకానికి వెళతానని నీవు ఎలా అనుకొంటావు? ఆనాడు నీవు బుద్ధిహీనంగా ప్రవర్తించినందున, ఈనాడు ఎవరినీ నిందించలేవు.

ఎపెనెటస్ : దయనీయమైన స్థితిలోనున్న ఈ పాపాత్మకు దురాత్మచే ఇవ్వ బడిన సుదీర్ఘమైన ఉపన్యాసం అతనికి కేవలం గుండెకోతనే మిగిల్చుతోంది. భూలోకంలో ఉన్న అనేకుల విషయంలోను నరకంలోనున్న అందరి విషయం లోను ఈ మాటలు వాస్తవములైయున్నవి. కాని, భూలోకంలో తాము చేసిన పాపమంతటికీ వీరు పొందుతోన్న శిక్ష ఎంత భయంకరమైనది!

దేవదూత : దీనికి కారణం, భూమిమీద వీరు ఉన్నప్పుడు పాపము ఎంత భయంకరమైనదో, పాపముయొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయో వీరు ఏమాత్రం ఆలోచించకపోవడమే. ఈ విషయంపై తమ దృష్టిని నిలపనందువల్ల కోట్లకొలది ఆత్మలు నిత్యనాశనానికి గురౌతున్నాయి. తాము రక్షించబడటానికి బాగా ఆలస్యమయిందని తాము తెలిసికొనేంతవరకు, తాము ఏం చేస్తున్నామో, తాము ఎక్కడికి వెళుతున్నామో అన్న విషయాలను గురించి వారు ఏమాత్రం ఆలోచించరు.

ఆలస్యంగా పెల్లుబికిన పశ్చాత్తాపం

అలా మేము మరికాస్త దూరం ముందుకు వెళ్ళామో లేదో, తన దయనీయ మైన స్థితినీ, పరలోకంలో మహిమపరచబడిన ఆత్మల ఆశీర్వాదకరమైన స్థితినీ తలంచుకొంటూ విలపిస్తోన్న ఒక వ్యక్తి మాకు కనిపించాడు. ఆ వ్యక్తి ఇలా రోదిస్తున్నాడు :

ఇక్కడ నేను నా స్వరూపాన్ని పూర్తిగా కోల్పోయి ఉండగా, పరలోకంలో ఉన్న పరిశుద్ధులు దైవికసారూప్యముయొక్క మహిమలో ఎంత తేజస్సుతో ప్రకాశిస్తున్నారు! ఒకప్పుడు ఆ మహిమలో ప్రవేశించే అవకాశం నా ముందుకొచ్చింది. అయితే, నా పాపం ఆ అవకాశాన్ని పరిహాసం చేసింది. ఆ నిత్యమహిమను శాశ్వతంగా కోల్పోయిన నేను ఎంతటి దౌర్భాగ్యుడను! వారికీ నాకూ మధ్య ఇప్పుడు ఎంత వ్యత్యాసం! పరిపూర్ణ సౌందర్యమైన స్థితిలో వారుండగా, నాశనకరమైన స్థితిలోను వికారమైన స్వరూపంలోను నేనున్నాను.

మా ఇరువురి స్థితి ఏమాత్రం పోల్చలేనంత భిన్నమైనది. ఈ ఆశ్చర్యకరమైన వ్యత్యాసానికి కారణం కేవలం ఇష్టపూర్వకంగా నేను చేసిన నా పాపమే. తీవ్రమైన నిత్యనరకాగ్ని జ్వాలల్లో నిరంతర వేదనను అనుభవించేందుకు నన్ను ఇక్కడకు తీసుకొచ్చింది కేవలం నా పాపమే. నా పాపానికి బదులుగా నాకు ఇవ్వబడిన ఈ బహుమానము కేవలము న్యాయమైనదే!

నాస్తికులులేని నరకం

ఆ తర్వాత, ఎఱ్ఱగా కాల్చబడిన ఇనుపకొరడాలతో దురాత్మలు పాపాత్మలను కొడుతూ, వారిని తీవ్రంగా హింసిస్తోన్న దృశ్యం నా కంటపడటంతో నా దృష్టి అటువైపు మళ్ళింది. భయంకరమైన ఆ కొరడా దెబ్బలను భరించలేక వారు చేసే హృదయవిదా రకమైన ఆర్తనాదాలు నా గుండెను పిండేసాయి. ఆ భయంకరమైన హింసను చూసి క్రూరత్వమే కరిగిపోతుందేమోనని నాకు అనిపించింది! నేను ఆ దృశ్యాన్ని చూసినప్పుడు, అలా హింసి స్తోన్న ఒక దురాత్మతో ఇలా అనకుండా ఉండ లేకపోయాను : “ఓ దురాత్మా, ఇక ఆపు. బహుశాః నీచే మోసగించబడి ఈ దౌర్భాగ్యమైన స్థలానికి వచ్చిన నీ సహసృష్టి అయిన ఆ వ్యక్తిని ఎందుకు అంత క్రూరంగా హింసిస్తావు?”

భయంకరమైన ఆ కొరడా దెబ్బలను భరించలేక వారుచేసే హృదయవిదారకమైన ఆర్తనాదాలు నా గుండెను పిండేసాయి. ఆ భయంకరమైన హింసను చూసి కరిగిపోతుందేమోనని
నాకు అనిపించింది!

దురాత్మ : ఈ వ్యక్తులు ఎంత దుర్మార్గులో నీకు తెలియదు. దురాత్మలమైన మేము చెడ్డవారమే. అయినప్పటికీ, దేవుని ఉనికిని మేము ఎన్నడూ ప్రశ్నించలేదు, దేవుడు లేడని మేము ఎన్నడూ అనలేదు. అయితే, ఇక్కడున్న వీరంతా ఎంతటి దుర్మార్గులంటే, తమ్మును సృజించిన దేవుని ఉనికినే వీరు ప్రశ్నించారు. వీరు ఇక్కడకు వచ్చేంతవరకు అసలు దేవుడనేవాడే లేడని వీరన్నారు.

ఎపెనెటస్ : అలాగైతే వీరందరూ ఒకప్పటి నాస్తికులన్న మాట! నిత్యకృప నన్ను ఆటంకపరచక పోయినట్లయితే, వీరు నన్ను దాదాపుగా నిత్యనాశనానికి నడిపించి ఉండేవారే!

నేను ఆ దురాత్మతో అలా పలికిన వెంటనే హింసించబడుతోన్న ఒక పాపాత్మ దుఃఖకరమైన స్వరంతో నావైపు చూస్తూ గట్టిగా కేకవేసి నన్ను పలకరించింది.

మునుపు నాస్తికునిగా ఉన్నవానితో సంభాషణ

పాపాత్మ : నీ స్వరం ఎక్కడో విన్నట్టుంది. నీవు ఎపెనెటస్వి కదూ?

ఆ పాపాత్మ నోటనుండి నా పేరు బయటకు రావడం నన్ను ఆశ్చర్యపరచింది. ఆ వ్యక్తి ఎవరైందీ తెలుసుకోవాలన్న ఆశతో నేను అతనికి ఇలా జవాబిచ్చాను.

ఎపెనెటస్ : అవును, నేను ఎపెనెటస్నే. కాని, దుఃఖకరమైన ఈ నశించిన స్థితిలో ఉన్న నీవెవరు? నేను నీకు ఎలా తెలుసు?

పాపాత్మ : భూమిమీద నేను నీతో ఎంతో సన్నిహితంగా జీవించాను. నేను దాదాపుగా నిన్ను నా అభిప్రాయంతో ఏకీభవించేలా చేశాను. భూలోకంలో సంచలనాన్ని సృష్టించి ప్రపంచమంతా ప్రసిద్ధిగాంచిన “రాకాసి” అన్న పుస్తక రచయితను నేనే.

ఎపెనెటస్ : భూలోకంలో పేరుప్రఖ్యాతులు గడించిన హబ్స్! నీవు ఇక్కడకు ఎలా వచ్చావు? నీ స్వరం నేను గుర్తుపట్ట లేనంతగా మారిపోయింది.

హబ్స్ : అయ్యో, నేనే ఆ దౌర్భాగ్యుడను! కాని, భూలోకంలో నేను ఆర్జించిన పేరుప్రఖ్యా తులు నాకు ఇక్కడ బహు దూరమయ్యాయి. ఇప్పుడు నేను ఈ నిత్యనాశనకరమైన స్థలంలో చేరిన దౌర్భాగ్యులలో ఒకడను. నా స్వరం మారి నందుకు నీవు ఆశ్చర్యపడవద్దు. ఇప్పుడు నా సిద్ధాంతాలుకూడా మారాయి. కాని, ఇలా మారేందుకు బాగా ఆలస్యమయింది. నాలోని ఈ మార్పువల్ల ఇప్పుడు నాకు ఎలాంటి ప్రయోజనమూ లేదు. దేవుడనేవాడు ఉన్నాడని నేను ఇప్పుడు తెలుసు కొన్నాను. కాని, ఏమి ప్రయోజనము? అలా నేను తెలిసికోవడం బాగా ఆలస్య మయింది. దీనివల్ల నాకు ఇప్పుడు ఎలాంటి ప్రయోజనమూ లేదు. దీనికి బదులు దేవుడనేవాడు లేకుండా ఉంటే ఎంతో బాగుండునని నేను ఇప్పుడు ఆశిస్తున్నాను. ఎందుకనగా, ఆయన నాపట్ల ఎలాంటి దయాకనికరాలనూ ప్రదర్శించడనీ, ఆయన ఉనికి నాకు ఎలాంటి లాభాన్నీ చేకూర్చదనీ నాకు తెలుసు.

దేవుడనేవాడు ఉన్నాడని నేను ఇప్పుడు తెలుసు కొన్నాను. కాని, ఏమి ప్రయోజనము? అలా నేను తెలిసికోవడం బాగా ఆలస్యమయింది. దీనివల్ల నాకు ఇప్పుడు ఎలాంటి ప్రయోజనమూ లేదు.

భూమిమీద నేను ఆయన శత్రువుగా జీవించానని నేను ఒప్పుకొంటున్నాను. దానికి ప్రతిగా నరకంలో ఆయన నాకు శత్రువయ్యాడు. ఒక జీవి సహించలేనంత విధంగా సర్వశక్తుడు నన్ను హింసిస్తున్నాడు. నా స్వంత జ్ఞానము నన్ను మోసపరచి, ఈ నిత్యనాశనానికి నన్ను నడిపించింది.

ఎపెనెటస్ : నీ విషయం నిజంగా చాలా దుఃఖకరమైనది. అయినప్పటికీ, నీకు ఇవ్వబడిన ఈ శిక్ష న్యాయమైనదేనని నీవు తప్పక అంగీకరించాలి. ఎందు కంటే, భూలోకంలో నీవు రూపొందించిన నీ సిద్ధాంతాలవల్ల ఎంతమందిని నీవు ఈ నిత్యనాశనానికి నడిపించావోకదా! అంతెందుకు, నన్నుకూడా నీవు నాదొక చిన్న సందేహం. నీవు భూమిమీద జీవించిన కాలంలో దేవుడనేవాడు లేడని నిజంగా నమ్మేవాడివా? నిన్ను సృజించిన సృష్టికర్త ఒకడు తప్పక ఉన్నాడనీ, నీయంతట నీవుగా ఉనికిలోనికి రాలేదనీ నీ అంతరాత్మ నీలో గుసగుసలాడుతున్నట్టుగా నీకెప్పుడనిపించ లేదా? దాదాపుగా నీ వలలో చిక్కించుకొని ఈ స్థలానికి నడిపించేందుకు ప్రయత్నించ లేదూ?

హబ్స్ : నాద్వారా అనేకులు ఈ దౌర్భాగ్యకర మైన స్థలానికి వచ్చారన్న తలంపు ఇక్కడ నన్ను మరింత వేదనకు గురిచేస్తోంది. నేను మొదట నీ స్వరాన్ని విన్నప్పుడు నీవుకూడా ఈ నిత్యశిక్షకు అప్పగింపబడ్డావేమోనని భయపడ్డాను. అందరూ సంతోషంగా ఉండాలని నేను ఆశిస్తున్నానని దీని భావం కాదుగాని, నాద్వారా ఇక్కడకు చేరుకొన్న ఆత్మలు ఇక్కడ నా వేదనను మరింత అధికం చేస్తున్నాయన్నది వాస్తవం.

ఎపెనెటస్ : కాని, నాదొక చిన్న సందేహం. నీవు భూమిమీద జీవించిన కాలంలో దేవుడనేవాడు లేడని నిజంగా నమ్మేవాడివా? సృష్టి దానంతట అదే ఉనికిలోనికి వచ్చిందనీ, జీవులు తమంతట తాముగా ఉత్పత్తి అవుతూ వచ్చారనీ నీవు నిజంగా ఊహించేవాడివా? నిన్ను సృజించిన సృష్టికర్త ఒకడు తప్పక ఉన్నాడనీ, నీయంతట నీవుగా ఉనికిలోనికి రాలేదనీ నీ అంతరాత్మ నీలో గుస గుసలాడుతున్నట్టుగా నీకు ఎప్పుడూ అనిపించ లేదా? (కీర్తనలు 100:3). ఈ విషయంలో నీకు ఎప్పుడూ అనుమానం రాలేదా?

భూమిమీద దేవుడు లేడని పైకి బల్లగుద్ది చెప్పే నాస్తికులంతా, దేవుడనేవాడు ఒకడు తప్పక ఉన్నాడని తమ అంతరాత్మ తమకు ప్రబోధిస్తుండగా, తీవ్రమైన మనోక్షోభకు గురయ్యేవారని అనేకులు చెప్పగా నేను విన్నాను. పైకి వారంతా దేవుడు లేడని చెబుతున్నప్పటికీ, లోపల దేవుడు ఉన్నాడని నమ్మేవారని నేను విన్నాను. అలాగైతే, తమ అంతరాత్మ ప్రబోధం చేస్తోన్న దేవుణ్ణి వారు విస్మరించడం ఎంత విడ్డూరం! నేను విన్న మాట వాస్తవమా కాదా అన్న విషయాన్ని నీనుండి తెలుసుకోగోరుతున్నాను.

నా పాపాన్నిబట్టి నేను దేవుని ఉగ్రతకు గురికానున్నానని నా మనఃస్సాక్షి నాకు ప్రబోధిస్తుండగా,అలా నన్ను శిక్షించే దేవుడు ఉండకూడదన్న లోతైన ఆశ నా హృదయాంత రంగంలో జనించడం ప్రారంభించింది.

హబ్స్ : ఎపెనెటస్, నీవు విన్నది వాస్తవం. భూమిమీద నేను ఉన్నప్పుడు దేవుడు లేడని పైకి నేను అంటున్నప్పటికీ, లోలోన నా అంతరాత్మ నన్ను గుచ్చుతూ నన్ను తీవ్రమైన అశాంతికి గురిచేసేది. నా జీవితంలో మొదట నేను దేవుడున్నాడనే విశ్వసించాను. ఆయన సర్వాధికారియనీ, సర్వశక్తిమంతుడనీ, సర్వసృష్టికర్తయనీ, అయనద్వారానే సర్వమూ సృజించబడ్డాయనీ నేను విశ్వసించాను. అయితే, కాలం గడుస్తుండగా, నేను మెల్లమెల్లగా నా పాపపుజీవితంలో ప్రవేశించి అందులో కొన సాగుతుండగా, నా పాపాన్నిబట్టి నేను దేవుని ఉగ్రతకు గురికానున్నానని నా మనఃస్సాక్షి నాకు ప్రబోధిస్తుండగా, అలా నన్ను శిక్షించే దేవుడు ఉండకూడదన్న లోతైన ఆశ నా హృదయాంతరంగంలో జనించడం ప్రారంభించింది.

క్రమ క్రమేణా తన ఆజ్ఞలను అతిక్రమించే మానవు లను శిక్షించే నీతిమంతుడగు దేవుని గురించి ఆలోచించడం నాకు బహు కష్టంగా తోచింది. నేను ఆయన న్యాయమైన తీర్పుకు మాత్రమే అర్హుడనని నేను బాగుగా ఎరిగినందున, అలా నన్ను శిక్షించే దేవుణ్ణి నేను ద్వేషించడం పాపంపై నేను పెంచుకొన్న ప్రేమ, మొదట నా సృష్టికర్తకు విరోధంగా నా హృదయాన్ని కఠినపరచి, ఆ తర్వాత ఆయనను ద్వేషించేందుకూ, చివరిగా ఆయన ఉనికినే ప్రశ్నించేందుక నన్ను పురికొల్పింది. అలాంటి దేవుడనేవాడు అస్సలు ఉండకూడదని నాలో ఈపాటికే నించివున్న లోతైన ఆశ మరింత వేరు పారింది.

ఫలితంగా, దేవుడనేవాడు లేడని నేను నమ్మడం ప్రారంభించాను. అప్పటినుండి నా నమ్మకానికి తగ్గట్టుగా నేను నా ఆలోచనలను మలచుకోవడం ప్రారంభిం చాను. నా ఆలోచనలకు తగ్గట్టుగా నేను కొన్ని సిద్ధాంతాలకు రూపకల్పన చేయడం ప్రారంభిం చాను. ఆ తర్వాత మెల్లమెల్లగా నా ఆలోచన లనూ, నా సిద్ధాంతాలనూ నేను ఇతరులపై రుద్దడం ప్రారంభించాను. ఇలా నేను నా లక్ష్యసాధనలో ఉన్నత శిఖరాలకు చేరుకొన్నప్పటికీ, నా మనఃస్సాక్షి నన్ను నిరంతరం గద్దిస్తూ ఉండటాన్ని నేను కనుగొన్నాను.

నేను తప్పుడు మార్గంలో వెళుతున్నానేమోననీ చివరిగా ఈ మార్గం నన్ను ఎక్కడికి నడిపిస్తుందోననీ నాలో నేను తీవ్రమైన సంఘర్షణను అనుభవిస్తున్నప్ప టికీ, నా మానసిక స్థితిని అధిగమించి సాధ్యమైనంతవరకు సంతోషంగా ఉండేం దుకు నేను ప్రయత్నించేవాణ్ణి. ఆ సమయంలో నన్ను సరైన మార్గంలోకి మళ్ళిం చేందుకు ప్రయత్నించిన దైవికతలంపులను నా పాపపుతలంపులు అధిగమించేవి. ఆ జ్ఞాపకాలు నన్ను ఇక్కడ మరింత వేదనకు గురిచేస్తున్నాయి.

పాపంపై నేను పెంచుకొన్న ప్రేమ, మొదట నా సృష్టికర్తకు విరోధంగా నా హృదయాన్ని కఠినపరచి, ఆ తర్వాత ఆయనను ద్వేషించేందుకూ చివరిగా

ఆయన ఉనికినే ప్రశ్నించేందుకూ నన్ను పురికొల్పింది. అలా నేను ఎంతో ప్రేమతో నేను కౌగలించుకొన్న పాపము ఇప్పటి నా దుఃఖకరమైన స్థితికి శాపగ్రస్తమైన కారణమయింది. పాపమనే ఘటసర్పము మరణమగునంతగా నా ఆత్మను కాటువేసింది! ప్రపంచంపై రుద్దేందుకు నేను అవిరామంగా కృషిచేసిన వ్యర్థమైన నా వేదాంతానికి భిన్నంగా దేవుడనేవాడు ఉన్నాడనీ, ఆయన “భయంకరుడైన గొప్ప దేవుడనీ” (నెహెమ్యా 1:5) ఇప్పుడు నేను తెలుసుకొన్నాను.

దేవుడు వెక్కిరింపబడడనికూడా నేను తెలుసుకొన్నాను (గలతీ.6:7). నేను భూమిమీద ఉన్నప్పుడు, పరలోకాన్నీ పరిశుద్ధమైన విషయాలనూ పరిహాసం చేయటమే నా నిత్య దినచర్యగా ఉండేది. అలా చేయడంద్వారా నా సిద్ధాంతాలను ఎంతో సులభంగా లోకానికి ప్రకటించేందుకు నాకు వీలయ్యేది. నా సిద్ధాంతాలను నేను ప్రకటించే పద్ధతులు నాకు సత్ఫలితాలను ఇవ్వడాన్ని నేను గమనించాను. అలా అనేకులు నాకు శిష్యులు కావడం నన్ను అమితానందభరితుణ్ణి చేసింది. అయితే, ఆ తలంపులన్నీ కాల్చబడిన ఇనుపకొరడా దెబ్బలకన్నా ఎక్కువగా ఇప్పుడు నన్ను బాధిస్తున్నాయి. సమస్తాన్నీ మన మేలుకోసం సృజించిన సృష్టికర్తను అపహాస్యం చేసినందుకు నాకు ఇవ్వబడిన ఈ శిక్ష న్యాయ అక్కడ వెలుగు ఉంటుంది.

ఎక్కడ అగ్ని ఉంటుందో కాని, ఇక్కడ అగ్నిగంధకముల మంటలు మింటినంటుతున్నా గాడాంధకారం ఈ ప్రదేశాన్ని ఆవరించివుంది,ఎందుకని?

ఎపెనెటస్ : నీవు చెప్పిన మాటలనుబట్టి ప్రదేశాన్ని ఆవరించివుంది, పాపం దేవుణ్ణి ఎంతగా ద్వేషిస్తుందో, అది దేవుని నీతియుక్తమైన ఉద్దేశములనుండి ఎందుకని? మానవుణ్ణి ఎంతగా ప్రక్కకు మళ్ళిస్తుందో నాకు అర్థమయింది. ఇక నీవు ఇష్టపూర్వకంగా పాపానికి దాసోహం కావడంద్వారానే నీవు ఇంతటి దయనీయ మైన స్థితికి చేరుకొన్నావనే విషయం సుస్పష్టం. నీవు ఇక్కడ అనుభవిస్తోన్న ఈ బాధ మరియు వేదన కేవలం న్యాయమైనదనేందుకు ఎలాంటి అనుమానమూ లేదు. అయితే, నేనిలా అనడంద్వారా నీ బాధను మరింత అధికం చేయాలన్నది నా ఉద్దేశం ఏమాత్రంకాదని నీవు గ్రహించాలి. చివరిగా నేను అడిగే ఒకే ఒక ప్రశ్నకు మాత్రమే నీవు జవాబు చెప్పవలసిందిగా నిన్ను నేను కోరుతున్నాను. ఎక్కడ అగ్ని ఉంటుందో అక్కడ వెలుగు ఉంటుంది. కాని, ఇక్కడ అగ్నిగంథకముల మంటలు మింటినంటుతున్నా గాఢాంధకారం ఈ ప్రదేశాన్ని ఆవరించివుంది,ఎందుకని?

హబ్స్ : భూలోకంలో నీవు చూసిన అగ్నికీ, ఇక్కడ నీవు చూస్తోన్న అగ్నికీ చాల వ్యత్యాసముంది. దాని స్వభావానికీ, దీని స్వభావానికీ చాల తేడావుంది. అందుకే, నరకం పూర్తిగా అగ్నిజ్వాలలచే ఆవరించబడి ఉన్నప్పటికీ, ఇక్కడ నీకు వెలుగు కనిపించడం లేదు.

భూమిమీద నీవు చూసిన అగ్ని కాల్చివేసే స్వభావం కలది. అది దేన్నయితే అంటుకొంటుందో దాన్ని పూర్తిగా కాల్చివేసి బూడిద చేస్తుంది. అలా తాను అంటుకొన్న వస్తువును అది పూర్తిగా కాల్చివేసి బూడిదగా మార్చివేసిన తర్వాత, అది ఆరిపోతుంది. అయితే, ఇక్కడ నీవు చూస్తోన్న అగ్ని అలాకాదు. ఇక్కడ అగ్ని ఎంత తీవ్రంగా మండుతున్నప్పటికీ, తాను అంటుకొన్న వస్తువును అది కాల్చివేయదు, కాల్చివేయలేదుకూడా! కావున మా చుట్టూవున్న అగ్నిజ్వాలలు మమ్మల్ని ఏమాత్రం కాల్చివేయడం లేదు. మేము వాటిలో నిరంతరం
మా చుట్టూవున్న అగ్నిజ్వాలలు మమ్మల్ని ఏమాత్రం కాల్చివేయడం లేదు. మేము వాటిలో కాలుతుంటాము, కాని కాలిపోము. ఇది కేవలం హింసించే అగ్ని. అంతేగాని, దహించే అగ్ని మాత్రంకాదు.
కాలుతుంటాము, కాని కాలిపోము. ఇది కేవలం హింసించే అగ్ని. అంతేగాని, దహించే అగ్ని మాత్రంకాదు.

భూమిమీద ఉన్న అగ్ని భౌతికమైనది. అది భౌతికమైనది కానటువంటి అత్మను ఏమాత్రం కాల్చలేదు. అయితే, ఇక్కడున్న అగ్ని మమ్మల్ని దహిస్తూ నిరంతరం బాధిస్తూవుంటుంది.

ఆ బాధను వివరించడం ఎవరితరం కాదు. నేను భూమిమీద అజ్ఞానాంధకారంలో జీవిస్తూ ఉన్నప్పుడు, ఆత్మ అగ్నిలో కాలడాన్ని గురించి అపహాస్యం చేసేవాణ్ణి. అయితే నేను అక్కడ దేన్నయితే అపహాస్యం చేశానో, అదే ఇక్కడ నా విషయంలో నిజమయింది.

భూమిమీద ఉన్న అగ్నికీ నరకంలో ఉన్న అగ్నికీ మధ్య ఇంకో తేడా కూడా ఉంది. భూమి మీద ఉన్న అగ్నిని నీవు కావాలనుకొన్నప్పుడు ముట్టించవచ్చు, వద్దనుకొన్నప్పుడు ఆర్పివేయ వచ్చు. అయితే, నరకంలోవున్న అగ్ని అందుకు భిన్నమైనది. పరలోకపు ఉఛ్వాసనిఛ్వాసలచే నిరంతరం మండుతూవుండే ఈ నరకాగ్ని “ఆరని అగ్ని” (లూకా 3:17). ఈ ఆరని అగ్నియే ఇక్కడ మాకు ఇవ్వబడిన నిత్య బహుమానము!

నరకంలోవున్న అగ్ని అందుకు భిన్నమైనది. పరలోకపు ఉఛ్వాస నిఛ్వాసలచే నిరంతరం మండుతూవుండే ఈ నరకాగ్ని “ఆరని అగ్ని” (లూకా 3:17). ఈ ఆరని అగ్నియే ఇక్కడ మాకు ఇవ్వబడిన నిత్యబహుమానము!

ఎపెనెటస్ : ఎంత విచారకరం! సర్వశక్తుని ఆజ్ఞలను అతిక్రమించినవారికి ఇవ్వబడే శిక్ష ఎంత భయంకరం!

నేను ఈ విషయాన్ని గురించి ఇంకను లోతుగా ఆలోచిస్తుండగా, నాతో మునుపు మాట్లాడిన దురాత్మ నా ఆలోచనలకు అంతరాయం కలిగించాడు.

దురాత్మ : ఈ మనుష్యులు భూమిమీద ఉన్నప్పుడు ఎలా జీవించారో ఈ వ్యక్తి జీవితంద్వారా నీవు తెలుసుకొన్నావు. ఇప్పుడు చెప్పు, వారు అనుభవిస్తున్న శిక్ష న్యాయమైనదా? కాదా?

ఎపెనెటస్ : వారు చేసిన పాపానికి వారు అనుభవిస్తున్న శిక్ష న్యాయమైనది. అనేందుకు ఎలాంటి అనుమానమూ లేదు. కాని, ఇలాంటి శిక్షనే నీవుకూడ అనుభవించవలసి ఉంటుదన్న విషయాన్ని నీవు గుర్తుంచుకో. ఎందుకంటే, నీవు గా సర్వోన్నతుడగు దేవునికి విరోధంగా పాపం చేశావు. కావున,ఈ నిత్యనరకాగ్నిలో నీవుకూడా కాలుతూ ఉండవలసిందే. రాబోవు కాలంలో నీవుకూడా ఈ న్యాయమైన శిక్షను అనుభవించవలసిందే.

నీవు దేవుని ఉనికిని ప్రశ్నించలేదు గనుక, నీవు నీతిమంతుడవని అనుకొనవద్దు. దేవుడున్నాడని నీవు స్పష్టంగా ఎరిగియుండియు, ఆయనపై తిరుగుబాటుచేసి ఆయనకు విరోధంగా నీవు పాపంచేశావు. కావున సర్వోన్నతుడైన దేవుని న్యాయమైన శిక్షను భరిస్తూ నీవుకూడా నిత్యనాశనానికి గురికావలసిందే.

దురాత్మలమైన మా శోధనల ఫలితంగా మానవాళి పాపం చేసింది గనుక వారిపట్ల మేము జాలి చూపించవలసివస్తే. దురాత్మలమైన మాపట్ల కూడా జాలిచూపించబడాలి.

దురాత్మ : నీవు చెప్పినవిధంగా మేముకూడా శిక్షించబడుదుమని మాకు తెలుసు. కాని, నీవు చెబుతున్నట్టుగా దురాత్మలమైన మా శోధనల ఫలితంగా మానవాళి పాపం చేసింది గనుక వారిపట్ల మేము జాలి చూపించవలసివస్తే, దురాత్మలమైన మాపట్లకూడా జాలిచూపించ బడాలి. ఎందుకనగా, మేముకూడా మానవు ల్లాగా మా అంతట మేముగా కాక, తేజోనక్షత్ర మును వేకువచుక్కయు అయిన లూసీఫర్ ద్వారా శోధించబడి సర్వోన్నతుడైన దేవునిపై తిరుగుబాటు చేసి ఆయనకు విరోధంగా పాపము చేశాము. గనుక మాపై మోపబడిన పాపదోషము తగ్గించబడాలి.

ఈ మాటకు అంతవరకు మౌనంగా వున్న నా మార్గదర్శియైన దేవదూత మహాకోపంతో ఆ దురాత్మవైపు చూస్తూ ఇలా అన్నాడు :

దేవదూత : అబద్ధికుడవును, దుష్టుడవును అయిన ఓ దురాత్మా! నిన్ను ఒక మహిమకరమైన జీవిగా సృజించిన సర్వోన్నతుడగు దేవునికి విరోధంగా లూసీ ఫర్తో కలిసి తిరుగుబాటుచేసేందుకు నిన్ను ప్రేరేపించింది నీ గర్వపుహృదయం కాదా? నీ అందాన్నిబట్టి నీవు గర్వించి సర్వోన్నతునికంటే పైగా నిన్ను నీవు హెచ్చించుకోవాలని నీవు తలంచలేదా? నీవు దేవునికి విరోధంగా లూసీఫర్తో చేరినందున, న్యాయమైనవిధంగా నీవుకూడా అతనితోబాటు ఈ నరకంలోనికి త్రోయబడ్డావు. ఫలితంగా నీవు నీ అందాన్నీ నీ వెలుగునూ కోల్పోయి, ప్రస్తుతము నీకున్న వికారమైన రాక్షసస్వరూపాన్ని పొందావు. తిరుగుబాటుతో కూడిన నీ గర్వానికి ప్రతిగా నీకు ఇవ్వబడిన ఈ శిక్ష న్యాయమైనదే.

దురాత్మ : అది సరేగాని, మా సమయానికి ముందే మమ్మును హింసిం చేందుకు మా సరిహద్దుల్లోకి అసలు నీవెందుకొచ్చినట్టు?

దురాత్మ దేవదూతను అలా ప్రశ్నించిన వెంటనే, అతని నోటనుండి రానై యున్న జవాబును వినేందుకు ధైర్యంలేక అక్కడనుండి మెరుపువేగంతో జారు కొన్నాడు.

ఆ దురాత్మ అక్కడనుండి నిష్క్రమించగానే, తిరుగుబాటు చేసిన ఒకప్పటి ఆ దేవదూతలను గురించి నేను ఈపాటికే విన్నాననీ, అయితే దానిని గురించి మరెక్కువగా నేను తెలిసికొనేందుకు ఆశిస్తున్నాననీ నేను నా మార్గదర్శియైన దేవదూతతో అన్నాను.

దేవదూత : నీవు నీ మర్త్యశరీరాన్ని వదలి, మహిమా స్వరూపాన్ని ధరించిన తరువాత ఈ
వివరంగా తెలుసుకొంటావు. అంతవరకు, లేఖనాల్లో వ్రాయించబడిన విషయాలకు మించి తెలిసికొనేందుకు నీవు ఆశించవద్దు.

దేవదూతలు పాపం చేశారనీ, ఫలితంగా నరకంలోనికి త్రోసివేయబడ్డారనీ మాత్రం ప్రస్తుతానికి నీవు తెలిసికొంటే చాలు. తమ్మును సృజించిన నిత్యుడును సర్వోన్నతుడును అగు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసేందుకు ఏ తలంపు వారిని ప్రేరేపించిందో నీ ప్రస్తుతస్థితిలో నీవు గ్రహించలేవు.

తమ్మును సృజించిన నిత్యుడును సర్వోన్నతుడును అగు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసేందుకు ఏ తలంపు వారిని నీ ప్రస్తుతస్థితిలో నీవు గ్రహించలేవు.

తాను సృజించినవారిచే మనఃపూర్వకంగాను స్వేచ్ఛాయుతంగాను సేవించ బడాలని ఆశించే సర్వశక్తిగల దేవునిచే స్వేచ్ఛాప్రతినిధులుగా దేవదూతలు సృజించబడ్డారు. ఈ విషయాన్ని పరిశుద్ధ లేఖనము “అనుకూలమునైన సజీవయాగము” (రోమా 12:1) అని అభివర్ణిస్తోంది.

ఆదాము పరదైసులో పరిశోధించబడు కాలమును (probation period) కలిగియుండినరీతిగా, పరలోకంలో దేవదూతలుకూడ పరిశోధించబడు కాలమును కలిగియుండిరి. అతనివలెనే వారుకూడా పడిపోవు అవకాశము మరియు సాధ్యత కలిగిన వారుగా సృజించబడ్డారు. ఆదాము పతనము అద్భుతమైన మెస్సీయా కృపద్వారా సరిచేయబడింది. కాని, దేవదూతల పతనము మాత్రము సరిచేయబడలేదు.

ఆ మెస్సీయా మానవులకును దేవదూతలకును శిరస్పైయున్నాడు. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలదు (కొలస్సీ. 1:18). ఎందుకనగా, ఆయన నిత్యుడగు దేవుని కుమారుడైయున్నాడు.

ఆదాము పతనము అద్భుతమైన మెస్సీయా కృపద్వారా సరిచేయ బడింది. కాని, దేవదూతల పతనము మాత్రము సరిచేయబడలేదు. ఆ మెస్సీయా మానవులకును దేవదూతలకును శిరస్పైయున్నాడు. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలదు (కొలస్సీ. 1:18).

దౌర్భాగ్యకరమైన ఈ చీకటి ప్రదేశంలో న్యాయమైన దైవిక నిత్యతీర్పు అమలు చేయబడి ఉండటాన్ని నీవు చూశావు. తాము అనుభవిస్తోన్న దైవికశిక్ష న్యాయ మైనదేనని ఇక్కడ శిక్షను అనుభవిస్తోన్న పాపాత్మలు అంగీకరించడాన్ని కూడ నీవు చూశావు. తీర్పుదినాన, మరణించినవారి శరీరాలు తిరిగిలేచి తమ ఆత్మలతో ఐక్యపరచ బడి తీర్పు సింహాసనం ఎదుట నిలువబడి నప్పుడు, ఈ అంధకార ఆత్మలలో ఎవరునూ దేవుని తీర్పును ఏమాత్రం తప్పుపట్టారు. అలా తప్పు పట్టేందుకు వీలు లేదనేందుకు ఇది నిదర్శనము.

ఎపెనెటస్ : ఇక్కడున్నవారంతా తాము అను భవిస్తోన్న వేదన కేవలం తమ స్వంత తప్పిద ములవల్లనే అనీ, దేవుని తీర్పు న్యాయమైనదనీ చెబుతున్నారు. ఈ చీకటి చెరసాల పాపాన్ని సరైనవిధంగా ప్రతిబింబింపజేసే ఒక అద్భుతమైన అద్దంలా ఉంది. పాపంపై దేవునికి ఎంతటి ద్వేషం లేకపోతే ఆయన ఇంతటి శిక్షను పాపులకు విధిస్తాడు!

దేవదూత : నీ ఊహ చాల స్వాభావికంగా ఉంది. అయితే, దీనికంటే శ్రేష్టమైన అద్దము మరొకటి ఉంది. దేవుని కుమారుని సిలువ శ్రమను గురించిన ధ్యానము మానవుని పాపపు తీవ్రతను కచ్చితంగా ప్రతిబింబింపజేసే ఒక శ్రేష్టమైన అద్దము! పాపముయొక్క భయంకరమైన ఫలితాన్ని అక్కడ మనము స్పష్టంగా చూడగలము.

దేవుడు పాపాన్ని ఎంతగా ద్వేషిస్తాడో అక్కడ మనము లోతుగా తెలిసికొనగలము. పాపము చేసిన మానవాత్మలు శ్రమనొందడాన్ని నరకంలో మనము చూశాము. అయితే, ఏ పాపమూ ఎరుగని పరిశుద్ధుడగు దేవుడు శ్రమ నొంద డాన్ని సిలువలో మనము చూడగలము.

దేవుని కుమారుని సిలువశ్రమను గురించిన ధ్యానము మానవుని పాపపు తీవ్రతను కచ్చితంగా ప్రతిబింబింప జేసే ఒక శ్రేష్టమైన అద్దము! దేవుడు పాపాన్ని ఎంతగా ద్వేషిస్తాడో అక్కడ మనము లోతుగా తెలిసికొనగలము.

ఎపెనెటస్ : సిలువలో తీర్పు మరియు కృప ఒకదానినొకటి ముద్దుపెట్టుకొన్నాయన్నది వాస్తవం (కీర్తనలు 85:10). ఎందుకనగా, అక్కడ మానవుని పాపము కొరకైన దేవుని న్యాయమైన తీర్పు పరిపూర్ణంగా అమలుచేయబడటమేగాక, పాపియైన మానవునికి రక్షణను అనుగ్రహించేందుకు దేవుని అపారమైన కృపకూడ అక్కడ ప్రదర్శించబడింది.

తన కృపద్వారా నాకు రక్షణను ప్రసాదించి, తద్వారా మహిమ కరమైన పరలోక వారసత్వాన్ని నాకు అనుగ్రహించిన ఆయన పరిశుద్ధ నామానికి నిత్యమూ స్తుతి కలుగును గాక. కేవలం ఆయన కృపమాత్రమే ఆయన ప్రతిపా దించిన రక్షణను నేను అంగీకరించేలా చేసింది. ఎందుకనగా, ఆయన ప్రతిపా దించిన రక్షణను తాము నిర్లక్ష్యం చేశామని విలపిస్తోన్న అనేక పాపాత్మలను నేను ఇక్కడ చూశాను. గనుక, నేను రక్షింపబడుట అనునది కేవలం దేవుని కృపయేనని నేను విశ్వసిస్తున్నాను.

నా సంరక్షకుడును, నా మార్గదర్శియునగు ప్రకాశమానమైన ఆ దేవదూత ఆ తర్వాత నావైపు తిరిగి, తాను నన్ను ఇప్పుడు తిరిగి భూమిపైకి తీసుకెళ్ళి . అక్కడ వదలివేయబోతున్నాననీ, నాకు నిర్ణయించబడిన సమయమువరకు నేను ఓర్పుతోను సహనముతోను అక్కడ జీవించవలసి ఉంటుందనీ నాతో చెప్పాడు.

నా దృష్టిలో నన్ను నేను వ్యర్థుడనుగాను అయోగ్యునిగాను ఎంచుకొన్నప్పుడు దేవుని దృష్టిలో నేను యోగ్యునిగా ఎంచబడతాను గనుక, నా వ్యర్థతను గురించిన తలంపు నా మనస్సులోనుండి తొలగిపోకుండా చూసుకోమని అతడు నాకు పదేపదే చెప్పాడు.

ఈ హెచ్చరికను అంత చులకనగా తీసికోవద్దనీ, ఎందుకనగా, నాకు బయలుపరచబడిన సంగతుల విషయమై నేను గర్వించేలా చేసేందుకు ఆత్మల శత్రువైన సాతానుడు నన్ను నిరంతరం శోధిస్తూ ఉంటాడనీ అతడు నాకు చెప్పాడు.

దేవునికి అత్యంత ప్రియమైనవారిని ఆయనకు దూరంచేసి, వారిని నాశనము చేయడమే వాని గురియనీ, దీనికోసం వాడు అవిరామంగా ప్రయాస పడుతూ ఉంటాడనీకూడా అతడు నాతో అన్నాడు.

పరలోకంలోను నరకంలోను భూమిమీదను సరోన్నతుడును
సర్వశక్తిమంతుడును అయిన దేవునికి నీవు సదా స్తుతులు చెల్లిస్తూ, నిర్ణయించబడిన దినము వరకు కృతజ్ఞతతో జీవించు.

చివరిగా అతడు నాకు ఇచ్చిన మంచి సలహా కోసం నేను నా మార్గదర్శియైన దేవదూతకు కృతజ్ఞతలు తెలిపాను. నేను అతని సలహాను సర్వాధికారము కలిగియున్న పాటించనట్లయితే, నాలాంటి కృతఘ్నుడుగాని సింహాసనాసీనుడగు నాలాంటి దౌర్భాగ్యుడుగాని వేరొకడు ఉండ డని నేను అతనితో అన్నాను.

దేవదూత : సరే, ఇక్కడి పాపాత్మలను వారి దౌర్భాగ్యానికి వదలిపెట్టి, భయంకరమైన ఈ చీకటిప్రదేశంనుండి ఇక మనం వెళదాం పద.

ఆ తర్వాత కాసేపటికే నేను తిరిగి భూమిమీద ఉన్నట్టుగా నేను కనుగొన్నాను. నేను ఆత్మహత్యకు పాల్పడేందుకు ప్రయత్నించిన ప్రదేశంలోనే నేను తిరిగి వదలి వేయబడ్డాను. . ఆ నదీతీరంలో నిలువబడి, నా దర్శనాన్ని గురించి నేను తీవ్రమైన సంభ్రమాశ్చర్యాలకు గురైయున్న సమయంలో, దేవదూత నాతో ఇలా అన్నాడు:

దేవదూత : ఎపెనెటస్, నీవు ఇప్పుడెక్కడున్నావో నీకు బాగా తెలుసు. నేను వేరొక పరిచర్యకు వెళ్ళవలసి ఉన్నందున, ఇక నేను నీతో ఒక్క క్షణంకూడ ఉండలేను. పరలోకంలోను నరకంలోను భూమిమీదను సర్వాధికారము కలిగి యున్న సింహాసనాసీనుడగు సరోన్నతుడును సర్వశక్తిమంతుడునైన దేవునికి నీవు సదా స్తుతులు చెల్లిస్తూ, నిర్ణయించబడిన దినమువరకు కృతజ్ఞతతో జీవించు.

అతికొద్ది సమయంలో ఆయన నీకు చూపించిన ‘ఆయన ప్రేమ మరియు కృప కొరకు అనునిత్యం అయనపట్ల కృతజ్ఞతతో జీవించు, ఆయనవైపే చూస్తూ నీ యాత్రను సాగించు కడవరకు!

తిరిగి ఇంటివైపుకు…

నేను అతనికి జవాబు ఇచ్చేలోగా నా మార్గదర్శియగు దేవదూత అదృశ్య మయ్యాడు. నేను ఆ నదీతీరాన ఇప్పుడు ఒంటరిగా నిలువబడి ఉన్నాను. నా మనస్సులో ఎన్నో ఆలోచనలు. నా మనస్సునిండా పట్టజాలనంత సంతోషం. తిరిగి భూమిపై ఉన్నానని నేను నమ్మలేకపోతున్నాను.

నేను ఎంతకాలంగా భూమి మీద లేనో నాకు తెలియదు. నేను ఇక నా ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకొని, ప్రార్థించేందుకు మోకరిల్లాను. నాకు బయలుపరచబడిన అద్భుతమైన దర్శనము లను నేను ఎన్నటికీ మరువకుండునట్లుగా నాకు సహాయం చేయమని నేను దేవుని మనసారా వేడుకొన్నాను. ఆ తర్వాత నేను పైకిలేచి, నా హృదయంలో సంతోషానందాలు పొర్లిపారుచుండగా, నేను కనిన వినిన అద్భుతమైన దర్శనాలను నెమరువేసుకొంటూ, వాటిని నాకు బయలుపరచిన దేవుని మంచితనానికై ఆయనకు స్తుతులు చెల్లిస్తూ, ఆయన కృపాకనికరాలను ప్రశంసిస్తూ, మెల్లగా నా ఇంటివైపు నడకసాగించాను.

ప్రకాశిస్తోన్న ముఖము

నేను నా ఇంటికి చేరగానే, నా ముఖతేజస్సును చూసి నా కుటుంబసభ్యులు ఆశ్చర్యపడ్డారు. ఎన్నడూ చూడని ఒక వింతవ్యక్తిని చూసినట్లుగా వారు నావైపు చూస్తున్నారు.

వారు నావైపు ఎందుకంత వింతగా చూస్తున్నారని నేను వారిని ప్రశ్నించాను.

నా ముఖం వింతకాంతుల్ని వెదజల్లుతోందని వారు నాకు బదులిచ్చారు. నిన్నటి దినాన నా ముఖంలో కారుమబ్బులు అలుముకొని ఉండటాన్ని తాము చూశామనీ, అయితే ఈ దినం నా ముఖం ప్రకాశమానంగా వెలుగుతోందనీ, సంతోషం సంతృప్తి అందులో వెల్లివిరుస్తున్నాయనీ వారు నాతో చెప్పారు.

నేను చూసిన దృశ్యాలను వారు గనక చూసివున్నట్లయితే, వారు నాలోని మార్పుపట్ల ఏమాత్రం ఆశ్చర్యపడరని నేను వారితో అన్నాను. ఆ తర్వాత నేను ఒక్కక్షణంకూడా ఆలశ్యం చేయకుండా నా గదిలోనికి వెళ్ళి, నా బల్లవద్ద కూర్చొని, కలం కాగితం చేతికి తీసికొని, మొదటినుండి చివరివరకు ఒక చిన్న సన్నివేశాన్ని కూడా వదలకుండా నేను చూసిన దర్శనాలను వ్రాయడం ప్రారంభించాను.

నేను వ్రాసిన ప్రతి అక్షరం చదవరులను అమితంగా ప్రభావితంచేసి, నేను పొందిన అనుభూతినే వారిలో మిగల్చాలని నేను గాఢంగా ఆశిస్తున్నాను.

“సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్” 1 తిమోతి 1:17

పరిచయము

పరిచయము

దుర్మార్గులు తమ పాపపు అవధులు దాటినప్పుడు, తమ పాపములకు క్షమా దుపణ ఇక ఏమాత్రం ఉండదనీ, దేవుని తీర్పుకు ఎదురుచూడటం తప్ప తమ ముందు వేరే ఏ మార్గమూ లేదనీ తమకు తెలిసినప్పుడు, తమకు శిక్ష అనేదే లేదనీ అసలు తమ్మును శిక్షించేందుకు దేవుడనేవాడే లేడనీ అభిప్రాయపడే స్థాయికి వారు చేరుకొంటారు. ఆ తర్వాత తమ అభిప్రాయాన్ని బలపరచే వాదన లను కనుగొనేందుకు వారు తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఆ తర్వాత తాము విశ్వసించే అభిప్రాయాన్ని ఋజువుచేసేందుకు వారు విశ్వప్రయత్నాలు చేస్తారు.

చెడు ప్రభావము

ఒకసారి నేను ఒక క్రూరమైన ఆటవిక వ్యక్తిని కలిసాను. ఆటవిక వ్యక్తి అని ఆ వ్యక్తిని గురించి నేను ఎందుకు అన్నానంటే, అలాంటి మనుష్యులకు ఇవ్వదగిన సరైన పేరు అదే గనుక. వాస్తవానికి ఆ వ్యక్తి సహవాసం నాకు పరమ అసహ్యం.

ఆ వ్యక్తి నాతో దేవుడు దయ్యం అనేవేవీ లేవనీ, స్వర్గం నరకం అనేవి కేవలం కల్పితాలనీ, మనుష్యులను భయపెట్టేందుకే అవి కనిపెట్టబడ్డాయనీ, వాస్తవానికి అవి పిల్లల్ని భయపెట్టేందుకే పనికొస్తాయనీ చెప్పాడు. ఆ వ్యక్తి మాటలు నన్ను తీవ్రమైన ఆందోళనకు గురిచేసాయి.

దేవుడు, దయ్యం, పరలోకం, నరకం ఇవేవీ లేవన్న అతని మాటలు విన్న నేను భయంతో వణికిపోయాను. అలా అతడు నాకు పదే పదే చెబుతూ వచ్చాడు. అతడు ఆ మాటల్ని చెప్పడానికి ప్రారంభించిన ప్రతిసారీ నేను భయంతో వణికిపోతూ అతనికి దూరంగా పారిపోతూ వచ్చాను. అయితే, అతని మాటలు పదే పదే నా చెవులకు వినిపించడంవల్ల అవి నన్ను మెల్ల మెల్లగా ప్రభావితం చేయసాగాయి. అవి ఒక స్థాయిలో నన్ను శక్తివంతంగా తాకి నన్ను లోతైన ఆలోచనలో పడవేసాయి.

‘దేవుడు, దయ్యం, పరలోకం, నరకం – వీటిని గురించిన సత్యాసత్యాలను తెలిసికోవడం ఎలా?’ అని నాలో నేను సతమతమయ్యాను.

అప్పటినుండి నేను తీవ్రమైన గలిబిలికి గురయ్యాను. ఆ సమయంనుండి నేను భరించలేనంతగా కారుమేఘాలు నన్ను కమ్ముకొన్నాయి. కటిక చీకట్లు నన్ను ఆవరించాయి. ‘దేవుడు, దయ్యం, పర లోకం, నరకం – వీటిని గురించిన సత్యాసత్యా లను తెలిసికోవడం ఎలా?’ అని నాలో నేను సతమతమయ్యాను.

దేవుడు లేడన్న తలంపు నన్ను తీవ్రమైన భయానికి గురిచేసింది. అయి నప్పటికీ, దేవుని ఉనికిని గురించిన ఋజువేం టని నన్ను నేను ప్రశ్నించుకొన్నాను. నాకోసం పరలోక మహిమ వేచియుందన్న తలంపునుండి నేను ప్రక్కకు రావడానికి ఇష్టపడ లేదు. అయినప్పటికీ, అలాంటి స్థలం నిజంగా ఉందా అని నన్ను నేను ప్రశ్నించుకొన్నాను. ఇక నరకమనే స్థలం ఒకటి ఉందన్న విషయాన్నికూడ నేను అనుమానించసాగాను.

అయినప్పటికీ, ఒకవైపు నరకపు అగ్నిజ్వాలలు నా ముఖాన్ని బలంగా తాకుతున్నట్టుగా నాకు అనిపించసాగింది. ఆ విధంగా భిన్నమైన ఆలోచనలు మరియు అభిప్రాయాల మధ్య నా మనస్సు ఊగిసలాడ సాగింది. గజిబిజిగానున్న అనేక త్రోవలమధ్యలో ఎటువెళ్ళాలో తెలియక తీవ్రమైన గలిబిలి గురైన వ్యక్తివలె నేను తీవ్రమైన ఆందోళనకు గురయ్యాను.

తప్పుడు సలహా అనే ప్రమాదము

ఈ గందరగోళ పరిస్థితిలో ఏదైనా ఆదరణ దొరుకుతుందేమోనని నేను నా తప్పుడు స్నేహితునివద్దకు వెళ్ళాను. అది దేవుడు తనను విడనాడిన సమయంలో సౌలు ఒక కర్ణపిశాచముగల స్త్రీయొద్దకు వెళ్ళినట్లుగా ఉంది (1 సమూయేలు 28:7-19). అయితే, నన్ను ఆదరించి తృప్తిపరచడానికి బదులుగా అతడు నన్ను మరింత గలిబిలికి గురిచేసాడు. నా భయాన్ని చూసి అతడు విరగబడి నవ్వాడు.

నా బలహీనతను చూసి అతడు జాలిచూపిస్తున్నట్టుగా నటించాడు. అంతేగాక, తాను అనుభవిస్తున్న స్వేచ్ఛాస్వాతంత్ర్యాల దృష్ట్యా అతడు తన్నుతాను అభినందించు కొన్నట్టుగా కనిపించాడు. భవిష్యత్తును గురించిన తలంపులుగాని, చివరి తీర్పును గురించిన భయంగాని తనను ఏమాత్రం గలిబిలికి గురిచేయడం లేదని అతడు నాతో అన్నాడు.

ఈ విశాలవిశ్వంలో ప్రకృతి ఒక గొప్ప యజమానురాలు అని అతడు విశ్వసించాడు. కావున ఆమె ఏం చెబుతోందో దాన్నే తాను అనుసరిస్తాననీ, ఈ జీవితాన్ని గురించి తానేమీ ఆందోళనకు గురికావడం లేదనీ, తాను తీసుకొన వలసిన జాగ్రత్తంతా ఈ జీవితం తరువాత రానైయున్న జీవితాన్ని గురించేననీ, తాను మరణించి మట్టిలో కలిసిపోయాక తన మట్టి మరొక జీవిగా మారిపోతుం దనీ, తాను తీసుకొనవలసిన జాగ్రత్తంతా ఒక అందమైన జీవిగా తాను మారిపోవడాన్నీ గురించి మాత్రమేననీ, అదంతా తాను భూస్థా పన చేయబడబోవు స్థలంపై ఆధారపడి ఉంటుందనీ, తాను ఒకవేళ ఒక స్మశాన వాటికలో భూస్థాపన చేయబడినట్లయితే, తన మట్టి ఒక సాలెపురుగుగానో లేదా ఒక కప్ప గానో లేదా ఒక పాముగానో మారుతుందనీ, కావున తాను ఒక అందమైన పొలములోనో లేదా ఒక పూలతోటలోనో పాతిపెట్ట బడేట్లుగా తాను జాగ్రత్త తీసికొన్నట్లయితే, అప్పుడు తాను ఒక అందమైన పూల మొక్కగానో లేదా ఒక అందమైన పుష్పంగానో మారేందుకు వీలుంటుందనీ అతడు నాకు చెప్పాడు.

అనేక త్రోవలమధ్యలో ఎటువెళ్ళాలో తెలియక తీవ్రమైన గలిబిలికి గురైన వ్యక్తివలె నేను తీవ్రమైన ఆందోళనకు గురయ్యాను.

తన సంతోషకరమైన భవిష్యత్తు కేవలం తన చేతిలోనే ఉందనీ, ప్రకృతిలోని అందాలన్నీ తన చేతిలోనే ఉన్నాయనీ, వాటిని మనసారా అనుభవించడంకూడ

తన చేతిలోనే ఉందనీ, అంతేగాక తాను ఈ జీవితం తర్వాత తన ప్రణాళిక ప్రకారం ఈ ప్రకృతిలోని వివిధ అంశాలుగా మారుతూ చివరిగా కొన్ని యుగాల తర్వాత తిరిగి ఒక మనిషిగా మారే అవకాశం ఉందనీ, ఆ ప్రక్రియలోనే తాను ఇప్పుడు ఒక మనిషిగా మారి జీవిస్తున్నాననీ అతడు నాకు చెప్పాడు.

అతని జ్ఞానయుక్తమైన ప్రణాళికను వ్యతిరేకించే కొన్ని లేఖన భాగాలను నేను అతనికి చూపించాను. అయితే, అతడు వాటన్నిటినీ కొట్టిపారవేస్తూ అవన్నీ కేవలం పిరికివారిచే రూపొందించబడిన కల్పనా కథలుగా అభివర్ణించాడు. లేఖనములద్వారా దేవుని ఉనికిని ఋజువుచేయుట, దేవుని ఉనికిద్వారా లేఖన ముల ఉనికిని ఋజువుచేయుట – రెండూ ఒకటేనని అతడు నాకు చెప్పాడు.

అనుమానం నిరాశకు జన్మనిస్తుంది.

అతని మాటలు నాలో మరిన్ని అనుమానాలను రేకెత్తించాయి. నేను చాల అసౌకర్యానికి గురయ్యాను. నా బ్రతుకు ఇక నాకు భారంగా తోచింది. శాపగ్రస్త మైన అతని అభిప్రాయాలను నా మనస్సులోనుండి బయటకు గెంటెయ్యాలని నేను ప్రయత్నించాను. అయినప్పటికీ, అవి నిరంతరం నా మనస్సులో కదలాడుతూ నన్ను గలిబిలి చేయసాగాయి.

ఆ మాటల్ని నేను అసలు వినలేదన్నట్లుగా నాలో నేను వెయ్యిసార్లు అను కొన్నాను. అయినప్పటికీ, అవి నిరంతరం చెవుల్లో ప్రతి ధ్వనిస్తూ నా మనస్సులో తిష్టవేసి ఉన్నాయి. “పరలోకాన్ని గురించిన నా ఆశలన్నీ కేవలం ఒక భ్రాంతియేనా? నేను ఇంతకాలంగా దేవుణ్ణి వ్యర్థంగా సేవించానా? అసలు దేవుడనేవాడే లేనప్పుడు, ఆ దేవుణ్ణి నాకు నేనుగా సృజించానా?” అని నాలో నేను రోదించసాగాను.

“పరలోకాన్ని గురించిన నా ఆశలన్నీ కేవలం ఒక భ్రాంతియేనా? నేను ఇంతకాలంగా దేవుణ్ణి వ్యర్థంగా సేవించానా?”

ఆ సమయంలో నా మనస్సులో మెదలాడిన ఆలోచనలు నన్ను ఎంత వేదనకు గురిచేశాయో వివరించడం అసాధ్యం. అవి నాపై శక్తివంతంగా దాడిచేసి చివరిగా నైరాశ్యపు అంచులకు నన్ను త్రోసివేసాయి. “ఆశ నిరాశలమధ్య నేనెందుకు ఊగిసలాడాలి? దీనికన్నా నా జీవితాన్ని అంతం చేసుకొని సత్యా సత్యాలను పరీక్షించడం మేలుకదా?” అని నాలో నేను అనుకొన్నాను.

ఆత్మహత్య ఆలోచన

ఈ తలంపు నాలోకి రాగానే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన నాలో కలిగింది. ఇక నేను ఒక్క క్షణంకూడ జీవించకూడదనీ, ఏ విధంగానైనా నన్ను నేను చంపుకోవాలనీ నేను నిర్ణయం తీసుకొన్నాను. ఈ విషాదకరమైన అంతాన్ని కార్యరూపంలోకి తెచ్చేందుకు నేను ఒక దినం దగ్గరలోనున్న అడవుల్లోకి వెళ్ళాను. అక్కడ నేను ఆత్మహత్య చేసుకొనేందుకు సిద్ధపడుచుండగా ఒక మెల్లని స్వరం నాతో ఇలా మాట్లాడటం నాకు వినిపించింది :

“ఓ ఎపెనెటస్, నీ విరోధియైన అపవాది ఉచ్చుల్లో పడి వాణ్ణి సంతృప్తి పరుస్తూ నీవు నిత్యనరకాగ్నిలోనికి దూకొద్దు. నీవు ఇప్పుడు చేయబోయే చర్యద్వారా నిన్ను నీవు నిత్యనరకాగ్నిలో శాశ్వతంగా బంధించుకో బోతున్నావు. ఎందుకనగా, దేవుని స్వరూపంలో ఉన్న నీ ఆత్మను నీవు నాశనం చేసికొన్నప్పుడు ఆయన దయాకనికరాలను ఆశించే అవకాశం ఇక నీకు ఎక్కడుంటుంది? దేవుడు అనేవాడు లేడని నీవు అనుకొంటు న్నావు. ఒకవేళ దేవుడనేవాడు ఒకడు ఉన్నట్టయితే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? దేవుడు లేడని నీవు అనుకొంటున్నావు. అయితే, దేవుడు తప్పక ఉన్నాడు.”

దేవునిచే రక్షించబడ్డాను

ఆ మెల్లని స్వరం ఎక్కడనుండి వచ్చిందో నాకు తెలియదు. అయితే, అది తప్పక దేవునినుండే వచ్చివుంటుందని నేను విశ్వసిస్తున్నాను. ఆ స్వరం ఎంత శక్తివంతంగా వచ్చిందంటే, అది నా చేతిలోనున్న ఉరితాడును నేను దూరంగా విసిరివేసేలా చేసింది. అంతేకాదు, అది నా ఉద్దేశంలోని దుష్టత్వాన్ని నాకు బయలుపరచింది.

నేను తీవ్రమైన భయంతో విపరీతంగా వణకడం ప్రారంభిం చాను. నన్ను రక్షించాలన్న ఉద్దేశంతో ఒక అదృశ్యశక్తి సరైన సమయంలో నాకు ప్రత్యక్షపరచబడిందని నేను గుర్తించాను. ఆ అదృశ్యశక్తి దేవుడు తప్ప మరొకరు కారన్న ఆలోచన నాలో జనించగానే ఆయనపట్ల కృతజ్ఞతాభావం నాలోనుండి పెల్లుబికి వచ్చింది. నా కళ్ళల్లోనుండి అశ్రుధారలు ప్రవహిస్తుండగా నేను నేలమీద మోకరిల్లి ఇలా ప్రార్థించాను :

“సర్వశక్తి కలిగిన ఓ అదృశ్యుడవగు దేవా, నీవు మానవుని కళ్ళకు కనిపించకపోయినప్పటికీ, వాని చర్యలన్నిటినీ నీవు గమనిస్తూనే ఉన్నావు. నీ స్వరూపంలో సృజించబడిన నేను నాశనం కావడం ఇష్టం లేక ఈ సమయంలో నన్ను నీవు రక్షించావు. అందుకోసం నేను విన యంతో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.”

“ఉనికిలోనున్న వాటన్నిటిపై సార్వభౌమాధికారము కలిగియున్న ఓ దేవా, నన్ను సజీవునిగా నిలిపినందులకై నీకు కృతజ్ఞతలు చెల్లించు చున్నాను. నీ ఉనికిని నేను గుర్తించేలా చేసినందుకై నీకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఓ దేవా, నీవు ఇక ఏమాత్రం నానుండి దాగియుండక, నీ మహిమా వెలుగును నాపై ప్రసరింపజేసి నాలోని అజ్ఞానాంధకారాన్ని పారద్రోలుము. ఈ సమయంలో నేను అనుభవించిన నీ ఉనికినిగాని నీ సర్వశక్తినిగాని, ఇకమీదట ఎన్నడూ నేను ప్రశ్నించకుండునట్లుగా నాకు కృపజూపుము.”

అలా నేను ప్రార్థించాక, నేను నా మోకాళ్ళమీదనుండి పైకిలేచి అక్కడికి దగ్గర్లోవున్న ఒక నది ఒడ్డున కూర్చున్నాను. భయంకరమైన నరకాగ్నినుండి నన్ను కాపాడిన సర్వోన్నతుడగు దేవుని మంచితనాన్ని గురించిన తలంపులతో నా మనస్సు నిండిపోయింది.

నా హృదయం ఆనందపారవశ్యంతో గాలిలో తేలి పోతోంది. అదే సమయంలో, దేవుని ఉనికిని గురించి ప్రశ్నించిన నా అజ్ఞానాన్ని గురించి నేను ఆశ్చర్యపడసాగాను. సృష్టిలోని ప్రతి చిన్న అంశమూ దేవుని ఉనికిని గురించి సాక్ష్యమిస్తోంది. అంతేగాక, మానవునిలోని మనఃస్సాక్షి వెయ్యి సాక్షులకంటె ఎక్కువగా దేవుడున్నాడన్న వాస్తవాన్ని ఎలుగెత్తి చాటుతోంది. అలాం టప్పుడు దేవుని ఉనికిని నేను ఎలా ప్రశ్నించగలిగాను? నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను?’ నా అజ్ఞానాంధకారాన్ని గురించి నేను ఆశ్చర్యపడుతూ నాలో నేను ఆలోచించాను.

పరలోక అతిథి

అలా నేను ఆ నది ఒడ్డున సుదీర్ఘంగా ఆలోచిస్తున్న సమయంలో ఉన్నట్టుండి నాచుట్టూ ఒక గొప్ప వెలుగు ఆవరించింది. అలాంటి వెలుగును నేను అంతవరకు ఎన్నడూ చూసియుండ లేదు. ఆ వెలుగు నన్ను తీవ్రమైన సంభ్రమాశ్చర్యాలకూ భయానికీ గురిచేసింది. ఆ వెలుగు ఎక్కడనుండి వచ్చిందా అని నేను ఆశ్చర్యపడు తుండగా ఒక ప్రకాశమానమైన రూపము నా ముందు ప్రత్యక్షమయింది.

ఆ రూపము ఒక మనిషి రూపంలా ఉంది. కానీ, అతని చుట్టూ మహిమకరమైన వెలుగు ప్రకాశిస్తోంది. అతని ముఖము ప్రకాశమానంగా వెలుగుతోంది. అంతే కాదు, అతని ప్రత్యక్షతతో అక్కడి గాలికూడ మధురమైన సువాసనల్ని వెదజల్లు తోంది. అతడు నా శత్రువు కాడన్న నిశ్చయత నాకు కలిగింది. అతని మహిమా ప్రసన్నతను నేను ఇక ఏమాత్రం భరించలేకపోయాను.

వెంటనే నేను అతని యెదుట బోర్లపడ్డాను. అయితే, అతడు నన్ను తన చేతులతో పైకిలేపి, నన్ను నిలబెట్టాడు. ఆ సమయంలో ఒక నూతనమైన బలం నాలోనికి ప్రవేశించడాన్ని నేను కనుగొన్నాను. అప్పుడు నేను అతనితో ఇలా సంభాషించడం ప్రారంభించాను :

ఎపెనెటస్ : ప్రకాశమానమైన ఓ నా విమోచకుడా, బలహీనమైన నా శరీరాన్ని నీవు రక్షించి నాకు ఒక నూతన జీవితాన్ని ప్రసాదించావు. నీకు నేను ఎలా కృతజ్ఞతలు చెల్లించగలను? నిన్ను ఎలా నేను ఆరాధించగలను?

దేవదూత : నాకు కాదుగాని, నిన్ను సృజించిన నీ సృష్టికర్తకే నీ ఆరాధనలు నీవు సమర్పించు. నీవు ఎవరి ఉనికినైతే తృణీకరిస్తూ వచ్చావో, ఆ సృష్టికర్తచే నేను నీ యొద్దకు పంపబడ్డాను. నీవు వెళ్ళదలచుకొన్న నిత్యనరకానికి వెళ్ళ నీయకుండా నిన్ను ఆపేందుకు నేను నీ యొద్దకు పంపబడ్డాను.

ఈ మాట నన్ను బహుగా కదిలించివేసింది. అధముడనూ అయోగ్యుడనూ అయిన నా యెడల సర్వోన్నతుడును సర్వశక్తుడును అయిన దేవుడు కనబరచిన దయాకనికరములను తలంచుకొని నా హృదయం ద్రవించిపోయింది. నా కళ్ళల్లోనుండి ఉప్పెనలా కన్నీళ్ళు పెల్లుబికి రాగా, “ఇంత గొప్ప దయాకనికరము లకు నేను అయోగ్యుడను” అని బిగ్గరగా ఏడ్వసాగాను.

నీకు దయచూపించుటలో సర్వశక్తిగల దేవుడు నీ అయోగ్యతను చూడలేదుగాని, అవధులులేని ఆయన మంచితనంతోను ఎవ్వరూ గ్రహించలేని ఆయన ప్రేమతోను మాత్రమే నిన్ను చూశాడు.

దేవదూత : నీకు దయచూపించుటలో సర్వశక్తిగల దేవుడు నీ అయోగ్యతను చూడలేదుగాని, అవధులులేని ఆయన మంచితనంతోను ఎవ్వరూ గ్రహించలేని ఆయన ప్రేమతోను మాత్రమే నిన్ను చూశాడు. ఆత్మలవిరోధి అయిన సాతానుడు నిన్నెంతగా సర్వనాశనం చేయాలని ప్రయత్నించాడో ఆయన చూశాడు.

నీపై దాడిచేసేందుకు వాణ్ణి ఆయన అనుమతించాడుగాని, తన రహస్యశక్తితో ఆయన నిన్ను కాపాడాడు. నిన్ను జయించానని సాతానుడు ఆనందిస్తున్న సమ యంలో ఆయన వాని ఉరులను తెంపివేశాడు. ఫలితంగా నీవు తప్పించుకొన్నావు.

ఈ మాటలు పట్టజాలని ఆనందంతోకూడిన ఒక వింత అనుభూతితో నా హృదయాన్ని నింపివేశాయి. అలా నా హృదయంలోని ఆనందం పొర్లిపారు తుండగా ఆనందపారవశ్యంతో నేను ఇలా పాడటం ప్రారంభించాను :

“శోధనలో మునిగిపోతోన్న నా ఆత్మను నరకమునుండి రక్షించిన ఆ గొప్ప ప్రేమయొక్క లోతుల్ని ఎవరు కొలువగలరు? నాశనకరమైన నరకపు అంచుల్లో నేను పడివున్న సమయంలో నన్ను మోసగించిన సాతానుని చేతుల్లోనుండి నన్ను రక్షించిన ఆ ప్రేమగల రక్షకుని నామానికి మహిమ కలుగునుగాక!

నిత్యం నేను ఆయన నామాన్ని మహిమపరుస్తూనే ఉంటాను. దేవుడు లేడని నేను అనుకొన్నా, దేవుని ఉనికిని నేను తృణీకరించినా, దేవుడు అనేవాడు తప్పక ఉనికిలో ఉన్నాడు. అవును, ఆయన తానే దేవుడైయున్నాడు!”

దేవదూత : సరే, నిత్యత్వాన్ని గురించిన సంగతులయొక్క వాస్తవాన్ని నీవు ఇక ఎన్నడూ అనుమానించకు. వాటిని గురించిన వాస్తవాలను నీచే ఒప్పింప జేసేందుకే నేను నీవద్దకు వచ్చాను. విశ్వాసము ద్వారా మాత్రమేగాక కళ్ళతో ప్రత్యక్షంగా చూచుటద్వారా నీవు ఈ విషయాలను ఒప్పు కొనవలెనన్న ఉద్దేశంతోనే నేను నీవద్దకు వచ్చాను. మర్త్యమగు మానవనేత్రము ఎన్నడూ చూడని సంగతులను నేను నీకు చూపించబోతున్నాను. అలా ఆ నిత్యమైన దృశ్యాలను వీక్షించేందుకు అనువైన విధంగా నీ నేత్రాలు బలపరచబడతాయి.

మర్త్యమగు మానవనేత్రము ఎన్నడూ చూడని సంగతులను నేను నీకు చూపించబోతున్నాను.

దేవదూత పలికిన ఆ ఆశ్చర్యకరమైన మాటలు నన్ను నిశ్చేష్టుణ్ణి చేశాయి. అలాంటి అద్భుతమైన దృశ్యాలను చూసి నేను భరించగలనా అని నాలో నేను అనుమానపడ్డాను. “అలాంటి దృశ్యాలను చూసి ఎవరు భరించగలరు?” నేను అతనితో అన్నాను.

అందుకు అతడు నాకు ఇలా జవాబిచ్చాడు: “యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు” (నెహెమ్యా 8:10). అలా

పరలోకము మరియు నరకములనుగూర్చిన దర్శనములు 42 పలికిన తరువాత అతడు నా చేయి పట్టుకొని తిరిగి నాతో ఇలా అన్నాడు : “భయపడవద్దు. నీవు ఇంతవరకు చూడని దృశ్యాలను నీకు చూపించేందుకే నేను పంపబడ్డాను.”

పరలోక పరిధుల్లోకి

చూస్తుండగానే నేను భూమికి పైగా ఎత్తబడ్డాను. కాసేపటి తర్వాత నేను రూపాంతరం పొంది విశాలమైన అంతరిక్షంలో విహరిస్తుండటాన్ని నేను కను గొన్నాను. అక్కడనుండి నేను క్రిందకు చూశాను. ఆ విశాలవిశ్వంలో భూమి నాకు చాలా చిన్నదిగా కనిపించింది. వాస్తవానికి అది నాకు ఒక చిన్న చుక్కలాగా కనిపించింది.

అప్పుడు నేను నా ప్రక్కనున్న నా మార్గదర్శి అయిన ఆ దేవదూతతో ఇలా అన్నాను – “నేను ఒకటి రెండు ప్రశ్నలు వేస్తే మీకేమైనా అభ్యంతరమా?”

దేవదూత : నాకెలాంటి అభ్యంతరమూ లేదు. నీ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పడం నా బాధ్యత. ఎందుకనగా, నేను నీకు పరిచారము చేయుటకు పంప బడిన ఆత్మను (హెబ్రీ 1:14). నీకు మాత్రమేగాక రక్షణ అనే స్వార్థ్యాన్ని పొందగోరు వారందరికీ పరిచారము చేయుటకే నేను నియమింపబడ్డాను.

ఎపెనెటస్ : నా క్రింద అక్కడ దూరంగా కనిపిస్తున్న ఆ నల్లని చుక్క ఏంటి? నేను పైకి వెళ్ళేకొద్దీ అది మరింత చిన్నగానూ, నేను అంతరిక్షపు వెలుగుల్లోకి వెళ్ళేకొద్దీ అది మరింత నల్లగానూ నాకు కనిపిస్తుందెందుకు?

పరలోకపు దృష్టితో కనిపించే భూమి

దేవదూత : దూరాన నీకు కనిపించే ఆ నల్లని చుక్కనీవు ఇంతవరకు నివసిం చిన ప్రపంచం. అది నీకు ఎంత చిన్నగా కనిపిస్తోందో గమనించావు కదా? అనేకులు దానిలోని ఒక చిన్న భాగాన్ని సంపాదించేందుకు తమ బలాన్నీ కాలాన్నీ ఖర్చుచేస్తూ ఎంతగా శ్రమపడుతుంటారో కదా?

భూమి అనేక రాజ్యాలుగా విభజించబడి ఉంది. ఒక రాజ్యాన్ని సంపాదించేం దుకు ఎన్ని హత్యలు! ఎంత రక్తపాతం! దానిలోని ఒక చిన్న భూభాగాన్ని సంపాదించేందుకు ఎంతమంది వ్యర్థంగా తమ ప్రాణాలను పోగొట్టుకొన్నారు! “ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము?” అని సమాధానాధిపతి అట్టివారిని గురించి ఎంతగా వాపోయాడు। (మత్తయి 16:26).

వారిలోని మూర్ఖత్వానికిగల ఏకైక కారణం వారు పైనున్న సంగతులవైపు చూడకపోవటమే. పైనున్న సంగతులవైపు ఎక్కువగా చు”సేకొద్దీ, వాటికి మరింతగా దగ్గరయ్యేకొద్దీ, భూలోకము మరింత చిన్నదిగా మనకు కనిపిస్తుంది.

విశ్వాసం ద్వారా ఒక వ్యక్తి పైనున్నవాటిపై తన హృదయాన్ని నిలిపి వాటిని స్పష్టంగా దృష్టిం చడం ప్రారంభిస్తాడు. అలాకాక, తామున్న ప్రపంచాన్నే మనుష్యులు దృష్టించడాన్ని కొనసాగించినప్పుడు, వారు పైనున్నవాటిని ఏమాత్రం దృష్టించలేరు. అయ్యో, వారు కేవలం అంధకారంలో ఉన్నారు!

మనుష్యులలోని మూర్ఖత్వానికిగల ఏకైక కారణం, వారు పైనున్న సంగతులవైపు చూడకపోవటమే.

దానికంటే హీనమైన విషయం ఏంటంటే, వారు ఆ భూమిమీదనే సదాకాలం జీవించి సంచరించాలని ఆశిస్తారు! వెలుగు అధిపతి తానే స్వయంగా వారి మధ్యకు వచ్చి “జీవపు వెలుగును” వారికి స్పష్టంగా చూపించినప్పటికీ (యోహాను 8:12), తన పరిచారకులద్వారా

ఆయన ఆ వెలుగును వారికి ఇంకను చూపిస్తున్నప్పటికీ, వారు ఇంకను ఆ వెలుగువద్దకు రాక చీకటిలోనే సంచరిస్తున్నారు. ఎందుకనగా, వారి క్రియలు చెడ్డవి గనుక వారు చీకటినే ప్రేమిస్తున్నారు (యోహాను 3:19).

పతనమైన దేవదూతలకు విధించబడిన శిక్షావిధి

ఎపెనెటస్ : భూమికి పైభాగాన భయంకరంగా కనిపించే విస్తారమైన ఆ నల్లని రూపాలేంటి? నీవు నాతో ఉండకపోయినట్టయితే, నేను నిజంగా వాటిని చూసి చాల భయపడేవాణ్ణి. అయితే, నీవు వాటి మధ్యలోనుండి దాటి వస్తుండగా అవి నీకు దూరంగా పరుగెడుతున్నాయి. బహుశా నీ చుట్టూ ఉన్న వెలుగును అవి సహించలేక కాబోలు!

దేవదూత : అవి పతనమైన దురాత్మల సమూహం. అవి తమ గర్వాన్నిబట్టి సర్వోన్నతుడైన దేవునిపై తిరుగుబాటు చేశాయి. ఫలితంగా అవి పరలోకంనుండి క్రిందకు పడద్రోయబడి దేవుని తీర్పునుబట్టి అంధకారంలో తిరుగులాడు తున్నాయి. అవి రానైయున్న తీర్పుదినం వరకు ఆ అంధకార పరిధిలో సంకెళ్ళచే బంధించబడి ఉంటాయి. అవి అక్కడనుండి ఎన్నుకొనబడినవారిని పరీక్షిం చేందుకును దుర్మార్గులను శిక్షించేందుకును భూమిపైకి వెళ్ళేందుకు అనుమ తించబడ్డాయి. ఇప్పుడు వారందరూ వికృతమైన నల్లని రూపంలో నీకు కనిపిస్తు న్నప్పటికీ, ఒకప్పుడు వారందరూ వెలుగు కుమారులే.

ఒకప్పుడు వారందరూకూడ నాలానే మహిమకరమైన వెలుగు వస్త్రాలను ధరించినవారే. అయితే, సర్వోన్నతుడగు దేవుని శక్తినీ అధికారాన్నీ ద్వేషించి తమ స్వంత చిత్తముచొప్పున ఆయనకు విరోధంగా పాపము చేయుటనుబట్టి వారు ఇలా త్రోసి వేయబడ్డారు. వారు ఆ మహిమా వెలుగును పోగొట్టుకొన్నవారై, సర్వోన్నతుడగు దేవునికి ఇంకను అవిధేయులుగా కొన సాగుతూ, ఆయన మహిమా వెలుగును ధరించుకొనియున్న దేవదూతలనుండి దూరంగా పారిపోతారు.

పతనమైన దేవదూతలు శాశ్వతంగా ఆ అవకాశాన్ని కోల్పోయారు. శోధకుడు లేకుండిన సమయంలోనే వారు పాపంచేశారు. అసలు మొట్టమొదట పాపంచేసినవారు వారే.

ఎపెనెటస్: కాని నా మార్గదర్శీ, ఈ అవిధేయులైన ఆత్మలు తిరిగి దేవునితో సమాధానపరచబడేందుకు ఎలాంటి అవకాశమూ లేదా? వారిలో కొందరికైనా కొంతకాలం తరువాతనైనా ఆ అవకాశం లేదంటావా?

దేవదూత : లేదు, ఎంతమాత్రమూ లేదు. వారు శాశ్వతంగా ఆ అవకాశాన్ని కోల్పోయారు. శోధకుడు లేకుండిన సమయంలోనే వారు పాపంచేశారు. అసలు మొట్టమొదట పాపం చేసినవారు వారే. అంతేకాదు, రక్షణకు ఆధారమైన మెస్సీయా, పడిపోయిన దేవదూతలకోసం ఒక దేవదూత రూపంలో రాలేదుగాని, వారిని నాశనమునకు అప్పగిస్తూ మానవుల రక్షణార్థం దీనమానవుడుగా ఈ లోకానికి వచ్చాడు. తాము నరకాగ్నికి వారసులమైయుండగా, మానవులు మాత్రం పరలోక వారసులుగా చేయబడ్డ కారణాన్నిబట్టి ఆ దురాత్మలకు మానవులపై అమితమైన ద్వేషం.

సూర్యుడు మరియు నక్షత్రములయొక్క ప్రకాశమానమైన సౌందర్యము

ఈ సమయానికి మేము అంతరిక్షంలో సూర్యునికి పైగానున్న భాగానికి చేరుకొన్నాము. సూర్యుడు భూమికన్నా వందరెట్లకుపైగా పెద్దదిగానుంటూ అత్యంత ప్రకాశమానంగా వెలుగుతూ ఉంటుంది. వ్రేలాడే ఈ అగ్నిగోళం దేవుని సృష్టిలో ఒక గొప్ప అంశంగా నా మార్గదర్శి నాకు వివరించాడు. అది గంటకు లక్ష మైళ్ళ వేగంతో తన పరిధిలో తిరుగుతూ ఉంటుంది. అంత వేగంతో అది తిరుగుతున్నప్పటికీ అది ఒక వెంట్రుకవాసి కూడ తన పరిధినుండి ప్రక్కకు తొలగదు. అలా అది సంవత్సరాల తరబడి పరిభ్రమిస్తున్నా ఎన్నడూ తన పరిధినుండి ప్రక్కకు తొలగలేదు.

నేను ఆ సమయంలో రూపాంతరం చెంది యుండటంవల్లనూ, ఆ సమయంలో నా కను దృష్టి గొప్పగా బలపరచబడి ఉండటంవల్లనూ నేను దానిని అత్యంత సమీపంనుండి చూడ గలిగాను.

తాము నరకాగ్నికి వారసులమైయుండగా, మానవులు మాత్రం పరలోక వారసులుగా చేయబడ్డ కారణాన్నిబట్టి ఆ దురాత్మలకు మానవులపై అమితమైన ద్వేషం.

నక్షత్రాలుగా మనచే పిలువబడు వ్రేలాడే పెద్ద అగ్నిగోళాలుకూడ తక్కువ ఆశ్చర్యకరమైనవేం కావు. అవి మనకు చాల ఎత్తులో ఉన్నందున చిన్నచిన్న క్రొవ్వొత్తుల్లాగా అవి మనకు కనిపిస్తాయి.

పరిమాణములో అవన్నీ భూమికన్నా చాల పెద్దవే. వాటిలో ఏ ఒక్కటి స్థానభ్రంశం చెంది భూమిమీద పడినప్పటికీ, ఒకే ఒక క్షణంలో భూమి పూర్తిగా దహించివేయబడుతుంది. అయినప్పటికీ, అవన్నీ దేవుడు తమ్మును సృజించినప్పుడు ఏ స్థానాల్లో ఉంచాడో ఆ స్థానాల్లో నుండి ఏమాత్రం ప్రక్కకు తొలగక వాటిలోనే స్థిరంగా ఉంటూ, తమకు ఎలాంటి ఆధారమూ లేకపోయినప్పటికీ కేవలం దేవుని మాటను ఆధారంచేసుకొని తమ తమ స్థానాల్లో అవి స్థిరంగా నిలిచి ఉన్నాయి.

సృష్టి అంతా సృష్టికర్త శక్తికి సాక్ష్యం పలుకుతోంది

ఎపెనెటస్ : ప్రేమగల సృష్టికర్తయొక్క అనంతమైన శక్తిని గురించి ఎలాంటి వారినైనా ఒప్పింపజేయడానికి ఈ అద్భుతాలు చాలు. తన శక్తి మరియు మహిమ లను గురించి అనేక ఋజువులనిచ్చిన దేవుని ఉనికిని ప్రశ్నించే అవిశ్వాసుల ప్రశ్నలకు జవాబిచ్చేందుకు ఈ అద్భుతాలు చాలు. మానవులు జంతువుల వంటివారు కానట్లయితే, వారు క్రిందికి చూడక పైకి చూచినట్లయితే, వారు దేవుని అనంతశక్తినీ ఆయన అనంతజ్ఞానాన్నీ తప్పక గుర్తిస్తారు.

దేవదూత : నీవు వాస్తవాన్ని మాట్లాడుతున్నావు. అయితే, నీవు వీటికన్నా అద్భుతమైన దృశ్యాలను వీక్షించబోతున్నావు. ఇంతవరకు చూసినవన్నీ ఒక కట్టడాన్ని నిర్మించేందుకు ఉపయోగించే కొయ్యల్లాంటివి. “చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోక మందు” నీవు చూడబోతున్నావు (2 కొరింథీ. 5:1). దానిని నీ మర్త్యమైన నేత్రాలతో శక్తి ఇప్పుడు నీకు ఇవ్వబడింది.

జాన్ బన్యన్ జీవిత వృత్తాంతము

జాన్ బన్యన్ జీవిత వృత్తాంతము

పంచంలో ప్రతి ఒక్కరికీ సుపరిచితుడైన జాన్ బన్యన్ ఇంగ్లాండులోని ‘బెడ్ఫోర్డ్ పట్టణానికి ఒక మైలు దూరంలోనున్న ఎలో గ్రామంలో క్రీ.శ. 1628వ సంవత్సరంలో జన్మించాడు. అతని స్వంతమాటల్లో చెప్పాలంటే అతడు “సమాజంలో ఏమాత్రం ఎన్నికలేని ఒక దిగువస్థాయి కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి ఆ ప్రదేశంలో తృణీకరించబడినది అయిన పాత్రలకు కళాయివేసే వృత్తిని చేపట్టి ఒక కళాయి వేసేవానిగా పిలువబడుతూ వచ్చాడు. ఆ రోజుల్లో ఈ వృత్తి సమాజంలో ఏమాత్రం గౌరవంలేని వృత్తిగా పరిగణించబడేది.

బహుశాః ఈ వృత్తిని చేపట్టేవారు ఒక ప్రదేశంనుండి ఇంకో ప్రదేశానికి తిరిగే సంచారులు కావడంవల్లనూ, ఏమాత్రం సిద్ధాంతాల్లేని వారి అనైతిక అలవాట్లు మరియు జీవన విధానంవల్లనూ వారికి సమాజంలో ఎలాంటి గౌరవమూ ఉండేదికాదు. అయితే, బన్యన్ తండ్రికి ఎల్లో గ్రామంలో ఒక స్థిరమైన నివాసగృహం మాత్రమేగాక, తన ఇరుగుపొరుగు వారిమధ్య అతనికి మంచి గౌరవమర్యాదలు ఉండేవి. అంతేగాక, సమాజంలో హీనదశలోనున్న సామాన్య ప్రజానీకం తమ పిల్లలను ఒక పాఠశాలకు పంపించి చదివించడం అత్యంత అరుదుగానుండిన ఆ రోజుల్లో బన్యన్ తండ్రి అతనికి విద్యాబుద్ధులు నేర్పించేందుకు ఒక పాఠశాలకు పంపిం చాడు.

తాను నేర్చుకొన్న “అతికొద్ది చదువును అనతికాలంలోనే మరచిపోయి నట్లు”గా జాన్ బన్యన్ చెప్పినప్పటికీ, అతడు చదవడాన్నీ వ్రాయడాన్నీ మాత్రం బాగా నేర్చుకొన్నాడు.

అతని జ్ఞాపకశక్తి అత్యద్భుతమైనదనీ, అతని మానసికశక్తి అత్యంత ఆరోగ్యకరమైనదనీ అతని రచనలద్వారా మనకు స్పష్టమవుతోంది. తన బాల్య చేష్టల కారణంగా విద్యను అభ్యసించాలన్న జిజ్ఞాస అతనిలోనుండి తొలగిపోయినందువల్ల, తన జ్ఞాపకశక్తిని గురించి బహుశాః బన్యన్ తప్పుగా అంచనా వేసికొని ఉండవచ్చు.

తన జీవితంలో అమూల్యమైన అనేక సంవత్స రాలు తాను తిరిగిన పనికిరాని తన చెడు తిరుగుళ్ళనుబట్టి తాను నేర్చుకొన్న కొద్దిపాటి విద్యకు తానేమీ అదనంగా చేర్చలేకపోయానని అతడు అభిప్రాయ పడ్డాడు. అతని బాల్యచేష్టలను గురించిన వివరణ మరియు వాటి ఫలితంగా అతడు అనుభవించిన నైరాశ్యపు జీవితాన్ని గురించి “ప్రధానపాపికి చూపబడిన అపరిమితమైన కృప” అన్న పేరుతో అతడు వ్రాసిన తన ఆత్మీయ స్వీయకథలో
మనము చదువగలము.

దేవుని కృప కార్యరూపంలో …

తన ప్రారంభజీవితంలో అతడు అనేక ప్రమాదకరమైన పరిస్థితులనుండి తప్పింపబడ్డాడు. రెండుసార్లు నదిలో మునిగిపోతుండగా వెంట్రుకవాసి వ్యత్యా సంలో అతడు తప్పించబడ్డాడు.

పార్లమెంటరీ సైన్యంలో సైనికునిగా ఉన్నప్పుడు అతని స్థానంలో వేరొక సైనికుడు యుద్ధానికి వెళ్ళి హతుడయ్యాడు. ఆ వ్యక్తి “ఒక తుపాకీ తూటా తలలోకి చొచ్చుకొనిపోగా అతడు అక్కడికక్కడే మరణిం చాడు.” ఆ తర్వాత, తన పాపములకుగాను తన్ను శిక్షించక, శిక్షతో మిళితమైన అపార కృపతో తనను కాపాడుతూ ఆశీర్వదిస్తోన్న దేవుని కృపాహస్తాన్ని బన్యన్ చూడటం ప్రారంభించాడు. అంతేగాక, తాను ఇంకను యౌవనస్తునిగా ఉన్న సమయంలో భక్తిగల భార్యను తనకనుగ్రహించి తనను ఆశీర్వదించిన దేవుని కృపాహస్తాన్ని బన్యన్ స్పష్టంగా చూడగలిగాడు.

ఆమె మాదిరి జీవితం మరియు ఆమెలోని మార్పు యౌవనస్తుడైన ఆ కళాయివేసే వ్యక్తిని క్రమంగా దేవాలయానికి వెళ్ళేందుకు పురికొల్పడం మాత్రమేగాక, త్రాగుబోతులైన తన సహచరుల సహవా సాన్ని అతడు అసహ్యించుకొనేలా చేసింది. ఆమె సహచర్యానికీ, ఆమె ప్రక్కన వెచ్చగా చలికాచుకోవడానికీ అతణ్ణి ప్రోత్సహించిన అతనిలోని తీవ్రమైన వాంఛ అల్లరిగా తిరిగే తన సహచరుల దుష్ట సాంగత్యానికి అతణ్ణి దూరంచేసింది.

తమకు ఒక చిన్న గరిటెగాని ఒక చిన్న గిన్నెగాని లేనంతటి అత్యంత నిరుపేద స్థితిలో ఆ యౌవనదంపతులు తమ దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు.

తన తండ్రి తనకు అందించిన ఆస్తి అయిన రెండు పుస్తకాలను అతని భార్య వారి వైవాహిక బంధంలోనికి తీసుకొచ్చింది.

“పరలోకానికి సామాన్య మానవుని రాజ బాట” మరియు “భక్తి సాధన” అన్న రెండు అమూల్యమైన పుస్తకాలను ఆమె తనతోపాటు తీసుకొచ్చింది. ఈ పుస్తకాలు బన్యను ఆత్మీయంగా ప్రభావితంచేసి, అతని ఆత్మీయాభివృద్ధికి అమితంగా దోహదపడ్డాయి.

యౌవనస్తుడును ఆరోగ్యవంతుడును అయిన బన్యన్ తన వృత్తిద్వారా తన కుటుంబ అవసరాలకు తగినంతగా సంపాదించుకొని ఒక గౌరవప్రదమైన జీవితాన్ని జీవించగలడు. అతని భార్య మంచి పొదుపరి, శ్రమజీవి, ఆరోగ్యకర మైన మానసికస్థాయి కలిగిన వ్యక్తి. వారి చిన్నికుటీరంలో వెలుగును వెదజల్లి దానిని శాంతి, సంతృప్తి, సమాధానములతో నింపేందుకు నిజమైన దైవభక్తి తప్ప వారిరువురికి మరింకేం కావాలి?

అయితే, నిజమైన దైవభక్తి అంటే ఏంటో జాన్ బన్యనక్కు ఇప్పటివరకు ఏమాత్రం తెలి యదు. అయినప్పటికీ అతడు చర్చికి వెళ్ళడంలో ఆనందించసాగాడు. చర్చి, చర్చి వేదిక, పీఠాధి పతి, అతని సహాయకులు, వారు ధరించే దుస్తులు … ఇవన్నీ అతణ్ణి అమితంగా ఆకర్షిం చాయి.

నిజమైన దైవభక్తి అంటే ఎంటో అప్పటికింకా జాన్ బన్యన్ కు తెలియకపోయినా, అతడు చర్చికి వెళ్ళడంలో ఆనందించసాగాడు.

వీటన్నిటిలో అతడు సంపూర్ణంగా ఆనందించడం ప్రారంభించాడు. అయి నప్పటికీ అతడు వాస్తవమైన భక్తిజీవితానికి ఇంకను అపరిచితుడే.
అతని దైవధ్యానాలు ఇంకను అత్యంత సాధారణమైనవే. అప్పుడప్పుడూ అవి అతని మనఃస్సాక్షిని మేల్కొలిపి అతని ప్రశాంతతను భంగపరుస్తున్నప్పటికీ, వాటిపట్ల క్రమక్రమంగా అతనికి మక్కువ ఎక్కువకాసాగింది.

దైవభక్తిపట్ల అతనిలో చెలరేగే ఆలోచనలు ఒకదానికి మరొకటి భిన్నమైనవై అతణ్ణి తీవ్రమైన గలిబిలికి గురిచేయడం ప్రారంభించాయి. అవన్నీ అతణ్ణి మార్మికవాదమువైపు మళ్ళిస్తూ, అతణ్ణి భవిష్యత్తును గురించిన లోతైన ఆలోచనల్లో పడవేయడం ప్రారంభిం చాయి.
కొన్నిసార్లు పరలోకంనుండి ఒక స్వరం తనతో మాట్లాడుతున్నట్టుగా అతడు అనుభూతి చెందేవాడు. మరికొన్నిసార్లు తన జ్ఞానేంద్రియాలకు వింతైన మార్మిక దృశ్యాలు ప్రత్యక్షపరచబడుతున్నట్టుగా అతనికి అనిపించేది.

ఏదో ఒక క్రొత్త విషయాన్ని నేర్చుకోవాలన్న ఆశతోను ఆసక్తితోను అతడు బైబిలు పఠనంలోను ప్రార్థనలోను గడపడం ప్రారంభించాడు. ఆ తర్వాత, తన గ్రాహ్యశక్తికి సుదూరంలో నున్న దైవికమర్మాలను గురించి తీవ్రమైన కలతకు గురై అతడు తన బైబిలు పఠనమును ఆపివేశాడు.

నిరాశా నిస్పృహలలో…

కొన్నిసార్లు తన హృదయం తీవ్రమైన అలజడికి గురైన సమయంలోను, తన చుట్టూ చిమ్మచీకట్లు కమ్ముకొన్న సమయంలోను ఏదో ఒక చిరుదీపంలాంటి ఆశ తన్ను ఆవరించి ఉన్నట్టుగా అతనికి అనిపించేది. అయితే, మరికొన్ని సమయాల్లో లోతైన నైరాశ్యపు చీకట్లు తన్ను ఆవరించి ఉన్న సమయంలో అతడు తీవ్రమైన భయభ్రాంతులకు గురైనవాడై, “ఆయ్యో నా స్థితి ఎంత దౌర్భాగ్యకర మైనది! నా పాపములను నేను వదలినప్పటికీ నా స్థితి దౌర్భాగ్యమైనదే! పాపములను నేను విడిచిపెట్టనప్పటికీ నా స్థితి దౌర్భాగ్యమైనదే! ఎటు చూచినా నా స్థితి దౌర్భాగ్యమైనదే! నేను కేవలం శిక్షకే పాత్రుడను.

నేను చేసే కొన్ని పాపముల కొరకైనా మరిన్ని పాపముల కొరకైనా నేను శిక్షార్హుడనే” అని భోరున విలపించేవాడు. ఆ సమయంలో తాను అనుభవించిన మానసిక క్షోభను గురించి అతడు ఇలా ఆవేదనతో వ్రాశాడు:

“నా ఆట మధ్యలో నా చుట్టూ ఉన్నవారందరి యెదుట నేను అలాగే నిశ్చేష్టుడనై నిలువబడ్డాను. కాని ఏం జరిగిందో నేను వారికి చెప్పలేదు.

అలా కాసేపు మౌనంగా నిలుచున్న తరువాత చివరిగా ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చి నేను తిరిగి నా ఆటలో కొనసాగాను. ఇలాంటి నిరాశా నిస్పృహలు నాలో పదేపదే చోటుచేసుకొంటున్నాయని నాకు తెలుసు. వాటినుండి నేను ఉపశమనం పొందే మార్గం కేవలం నేను నా పాపంలో కొనసాగడమే. ఎందుకనగా పరలోకం అనేది నాకు అందనిది. కావున, నేను దాన్ని గురించి ఆలోచించడంలో ఏమాత్రం అర్థం లేదు. అందు వలన నన్ను నేను విపరీతమైన పాపంతో నింపుకోవాలని నేను అమి తంగా ఆశించాను. నేను మరణించి ఈ లోకాన్ని వదలక మునుపు ఈ లోకంలో ఉన్న పాపపు లోతులన్నిటినీ నేను అనుభవించాలి. అందులోని మాధుర్యాన్ని నేను రుచిచూడాలి.”

ఒక మారిన మనిషిగా …

ఈ భయంకరమైన పరిస్థితినుండి అతడు ఒక అసాధారణమైన విధంగా విడిపించబడ్డాడు. ఒకనాడు పాపిష్టురాలైన ఒక స్త్రీ అతణ్ణి తీవ్రంగా అసహ్యించు కొంటూ, అతని బూతుమాటలను తాను వినలేకున్నాననీ, అతనిలాంటి భక్తిహీన మైన వ్యక్తిని తన జీవితంలో తాను ఎన్నడూ చూడలేదనీ, ఆ గ్రామంలోని యౌవ నస్తులందరినీ అతడు చెడుమార్గంలో నడిపిస్తూ వారిని సర్వనాశనం చేస్తున్నాడనీ నడివీధిలో అనేకమంది యెదుట అతణ్ణి శాపనార్ధాలు పెట్టసాగింది. ఆమె మాటలు అతని గుండెల్లోకి శూలాల్లా దూసుకుపోయాయి. అతడు అవమాన భారంతో చాలసేపు అలానే నిశ్చేష్టుడై మౌనంగా నిలబడ్డాడు.

ఈ సంఘటన అతని జీవితంలో పెనుమార్పును తీసుకొచ్చింది. అతడు వెంటనే తన చిన్ననాటి నుండి వాడుకగా తనలోనుండి వస్తోన్న బూతుమాటల్ని వెంటనే మానివేశాడు. అంతేగాక, అతడు బైబిలు గ్రంథాన్ని చదివేందుకు ఒక దృఢమైన నిర్ణయం తీసుకొన్నాడు. అతని ప్రవర్తనలో ఎంతగా మార్పు వచ్చిందంటే, అతని ఇరుగు పొరుగువారు అతనిలోని మార్పును చూసి ఆశ్చర్యచకితులై, ఒక మార్పునొందిన వ్యక్తిగా అతనిని గౌరవించడం ప్రారంభించారు.

“నాలాగా దేవుణ్ణి సంతోషపరచే వ్యక్తి ఇంగ్లండు దేశమంతటిలో వేరెవరూ లేర”ని జాన్ బన్యన్ ఆలోచించసాగాడు.

ప్రారంభంలో అతడు చర్చి గంటల్ని కొట్టడంలో అమితంగా ఆనందించేవాడు. అయితే, కాలక్రమేణా అతనిలోని మనఃస్సాక్షి మృదువుగా మారేకొలదీ “అలాంటి ఆచారం కేవలం వ్యర్థమైనదని” అతడు అభిప్రాయపడటం ప్రారంభించాడు. మెల్లమెల్లగా వినోదాలనూ నాట్యాలనూకూడ అతడు అల్లరితో కూడిన ఆట పాటలుగా భావించి విడిచిపెట్టాడు. క్రమ క్రమంగా నైతికభావన అతనిలో చోటు చేసు కొంది. అనతికాలంలోనే “నాలాగా దేవుణ్ణి సంతోషపరచే వ్యక్తి ఇంగ్లాండు దేశమంతటిలో వేరెవరూ లేర”ని అతడు ఆలోచించసాగాడు. అయితే, వాస్తవమైన హృదయ పరివర్తనను అతడింకను అనుభవించలేదు. హృదయంలో లోతైన మార్పుయొక్క అవసరత అతనికి ఏ మాత్రం తెలిసియుండలేదు.

హృద యముయొక్క స్వభావము పూర్తిగా మారాలన్న అవగాహనకూడ అతనికింకను కలుగలేదు. అయితే, దేవుని దృష్టిలో తన వాస్తవస్థితి ఆమోదయోగ్యమైనది కాదని తన హృదయపు లోతుల్లో ఎక్కడో ఒక మెల్లని స్వరం తనను మేల్కొలుపు తున్నట్టుగా అతనికి అనిపించేది.

ఒకనాడు మారుమనస్సును గురించీ, తిరిగి జన్మించుటను గురించీ భక్తిపరులైన కొందరు స్త్రీలు ఒకచోట మాట్లాడుకోవడాన్ని విన్న బన్యన్, తన భక్తిమార్గం కేవలం లోపభూయిష్టమైనదనీ “నిజమైన భక్తి పరునికి ఉండవలసిన గుర్తులు” తనలో లేవనీ గ్రహించాడు.
అతనిలో ఈ నూతనమైన వెలుగు ప్రవేశించడానికి కారకులైన ఆ స్త్రీలు, జాన్ గిఫోర్డ్ పాస్టరుగానున్న బెడ్ఫోర్డ్లోని బాప్టిస్ట్ సంఘానికి చెందినవారు.

ఆ సత్పురుషుని గురించి ఇవిమీ (Mr. Ivimey) అనే వ్యక్తి తాను రచించిన “ఇంగ్లీషు బాప్టిస్టుల చరిత్ర” (History of the English Baptists) అన్న పుస్తకంలో ఇలా వ్రాశాడు:

“అతని శ్రమ ఒక ఇరుకైన పరిధికే పరిమితమై ఉన్నప్పటికీ, కొంత కాలం తర్వాత ఆ శ్రమయొక్క ఫలితాలు చాల విశాలంగా విస్తరించాయి.

అతడు ఎల్లోని ఒక దుర్మార్గుడైన కళాయివేసే వ్యక్తికి బాప్తిస్మము ఇచ్చి తన సంఘానికి అతనిని పరిచయం చేసిన దృశ్యాన్ని మనము వీక్షించినప్పుడు, దుర్మార్గపు ద్వారంగుండా బన్యను సువార్త జ్ఞానము లోనికి నడిపించిన సువార్తికునిగా మనము అతనిని తప్పక గౌరవిస్తాం.

గాఢాంధకారపు లోయలోనుండి ఆ వ్యక్తిని వెలుగుమయమైన పర్వత శిఖరాగ్రానికి చేర్చిన బోధకునిగా మనము అతనిని తప్పక ప్రశంసిస్తాం. అయితే, దేవునిచే ఎన్నుకొనబడిన పాత్రయైన నిరుపేదయు నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోన్నవాడును అయిన బన్యను మొట్టమొదటి సారి తన ఇంటి తలుపులను తెరిచే సమయంలో అతని భవిష్యత్తును గురించి ఆ సంఘకాపరికి ఏమాత్రం తెలియదు. అతడు ఒక గొప్ప పాత్రగా దేవునిచేతిలో వాడబడతాడని ఆ సంఘకాపరి ఆ సమయంలో ఏమాత్రం ఊహించి ఉండడు.”

బన్యన్ మార్పుకు కేవలం గిఫోర్డ్ మాత్రమే కారణమని మనము చెప్పలేము గాని, అతని సంభాషణ మరియు బోధలు ఎల్టాలోని ఒకప్పటి దుర్మార్గుడైన కళాయివేసే వ్యక్తికి గొప్ప ఆశీర్వాదకరంగా ఉన్నాయన్న వాస్తవాన్ని మనము విశ్వసించక తప్పదు.

జాన్ బన్యన్ కు మొట్టమొదటిసారి తన ఇంటి తలుపులను తెరిచే సమయంలో అతని భవిష్యత్తును గురించి ఆ సంఘకాపరికి ఏమాత్రం తెలియదు.

తన మార్పు తర్వాత తన అంతరంగంలో తీవ్రమైన సంఘర్షణను బన్యన్ అనుభవిం చాడు. తనలోని అపరాధభావన ఒకవైపూ, క్రీస్తు దయచేసిన క్షమాపణ ధర్మశాస్త్రపు అవస రతను కొట్టివేసిందన్న బోధ మరోవైపూ అతణ్ణి తీవ్రమైన సంఘర్షణకు గురిచేసాయి. అయితే, బన్యన్ ఈపాటికే లేఖనాలను అత్యంత శ్రద్ధా సక్తులతోను ప్రార్థనాపూర్వకంగాను పఠించియున్నాడు. గనుక దేవుని ఆత్మయొక్క ఆశీర్వాదాన్నిబట్టి, దేవునియందు నమ్మికయుంచినవారు “ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయమొందకయు నుందురు” (యెషయా 45:17) అన్న లేఖనానుసారమైన నిశ్చయతద్వారా తీవ్రమైన అలజడికి గురియైయున్న తన ఆత్మలో అతడు శాంతినీ విశ్రాంతినీ పొందాడు.

బోధించేందుకు నియమించబడుట

క్రీ.శ. 1655వ సంవత్సరంలో తన ఇరవై ఏడేండ్ల వయస్సులో గిఫోర్డ్ సంఘ సభ్యునిగా బన్యన్ చేర్చబడ్డాడు. ఆ తర్వాత కొంతకాలానికే ఆ సంఘము తన కాపరి మరణంతో కృంగిపోవడంతో, తన అర్హతల విషయమై కొన్ని పరీక్షల తర్వాత, నూతన సహోదరుడుగా ఆ సహవాసంలోనికి చేర్చబడిన బన్యన్, అప్పు డప్పుడూ ఆ సంఘంలో బోధించే బాధ్యతను చేపట్టేందుకు ఆ సంఘసభ్యులచే ప్రోత్సహించబడ్డాడు. తన ఈ నియామకాన్ని గురించి బన్యన్ ఇలా వ్రాశాడు:

“తమ దృష్టిలో పరిశుద్ధునిగా కనిపించిన నాలో దేవుని చిత్రాన్ని గ్రహించే యోగ్యత తమకు అగుపడినందునను, దేవుని పరిశుద్ధ వాక్య మును ప్రకటించుటకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృపావరమును తాము స్పష్టంగా కనుగొనినందునను, తమకు దేవుని వాక్యమును బోధింప వలెనని మాతోనున్న పరిశుద్ధులు కొందరు నన్ను బలవంతం చేసారు. అలా తమ కూడికలలో తమకు దేవుని వాక్యమును బోధించమని వారు నన్ను పదే పదే అర్థించినందున మొదట నేను అంగీకరించనప్పటికీ, ఆ తర్వాత వారి కోరికను నేను మన్నించవలసి వచ్చింది.”

మొట్టమొదట బన్యన్ బోధించడాన్ని ప్రారంభించినప్పుడు, ప్రజలు అతని బోధను వినేందుకు నలుదిశలనుండి తండోపతండాలుగా రావడం ప్రారంభిం చారు. అతని పరిచర్యలో స్పష్టంగా కనిపించే జయకరమైన ఫలితాల్ని చూసిన సంఘస్తులు కొంతకాలం “పట్టుదలతో ఉపవాస ప్రార్థన” చేసిన తరువాత, బెడ్ఫోర్డ్లోనూ పరిసర ప్రాంతాల్లోనూ పూర్తి పరిచర్య జరిగించేందుకు అతణ్ణి నియమించారు.

బోధించడం ప్రారంభించిన మొదట్లో బన్యన్ ధర్మశాస్త్రముయొక్క భయంకర మైన స్థితిని గురించి బోధించసాగాడు. ఈ అంశంపై తాను బోధించడాన్ని గురించి అతడు ఈ విధంగా వ్రాశాడు:

“నాకు అప్పగింపబడిన ఈ పరిచర్యను అత్యంత శ్రద్ధాభక్తులతోను, గొప్ప నమ్మకత్వంతోను నేను నెరవేర్చాను. వ్యక్తిగతంగా నేను చూచి అనుభవించినవాటినే నేను బోధించాను.

నా దౌర్భాగ్యపు ఆత్మ మూల్గులనే నేను ప్రకటించాను. సంకెళ్ళచే బంధింపబడినవారు విడుదల పొందు నట్లుగా సంకెళ్ళచే బంధించబడిన నేను, నా అనుభవాలతో వారికి బోధించేందుకు బయలువెళ్ళాను.

నా స్వంత మనఃస్సాక్షిలో అగ్నిజ్వాలల్ని చవిచూసిన నేను, వాటి విషయమై జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ బోధించగలిగాను.” అతని ఆత్మీయస్థితి మెరుగుపడేకొద్దీ అతని బోధలు మెరుగులు దిద్దుకో సాగాయి. తాను “అనుభవించి అనుభూతి పొందినవాటినే” అతడు బోధించాడు.

“పాపాన్ని శత్రువుగా భావించిన పాపుల మిత్రుడైన క్రీస్తునే అతడు బోధించాడు. క్రీస్తు కృపాకార్యంపై మాత్రమే ఆధారపడవలెనని అతడు తన సభికులకు బోధిం చాడు. “ఈ లోకము ఆధారపడే పడిపోవునవీ నాశనమయ్యేవీ అయిన తప్పుడు స్తంభాలను పెకలించివేయడమే అతని సందేశములయొక్క ముఖ్యోద్దేశము.”

అంకితభావము కలిగిన రచయిత

ఇప్పుడు బన్యన్ నిరంతర పరిచర్యలో విరామం లేకుండా ఉన్నాడు. తనకు ఇవ్వబడిన మానసిక శారీరక మరియు ఆత్మీయ శక్తిచే అతడు దేవుని వాక్యాన్ని బోధించడం మాత్రమేగాక, ఆత్మీయ రచనలనుకూడ ప్రచురించడం ప్రారంభిం చాడు. “లేఖనముల ప్రకారము వెల్లడించబడిన కొన్ని సువార్త సత్యములు” అనునది అతని మొదటి ప్రచురణ. బెడ్ఫోర్డ్లోని సంఘ పరిచర్యలో గిఫోర్డ్ వారసుడైన జాన్ బర్టన్ (John Burton) తన వ్యాఖ్యానాన్ని ఈ విధంగా వ్రాశాడు:

సత్యములను గురించి ఈ నా సహోదరుడు రచించిన రచనలకు నేనును సాక్ష్యము పలుకుట నా కర్తవ్యంగా నేను భావిస్తున్నాను.”

“ఈ వ్యక్తియొక్క స్థిరమైన విశ్వాసాన్నీ, అతని దైవిక సంభాషణలనూ, మానవ నైపుణ్యముతోగాక క్రీస్తు ఆత్మతో సువార్తను ప్రకటించుటలో అతనికిగల సామర్థ్యాన్నీ, పాపులగు అనేకులను క్రీస్తువైపుకు త్రిప్పుటలో అతడు సాధించిన విజయాన్నీ, ఇతర పరిశుద్ధులతోబాటు నేనును ప్రత్యక్షంగా వీక్షించిన తరువాత, ప్రభువైన యేసుక్రీస్తు మహిమకరమైన బన్యన్ చేసిన ఈ రచన కాకర్ల (Quakers) చే తీవ్రంగా వ్యతిరేకించబడింది.

మంత్రశక్తులను ఉపయోగించి చేసిన రచనగా వారు దానిని అభివర్ణించారు. అందులో అతడు “తాను సిలువపై వ్రేలాడిన శరీరంతోనే మరియ కుమారుడైన యేసు పరలోకంలో ఉన్నాడని” వ్రాసినందున, అతడు “ఒక విగ్రహాన్ని గురించి బోధించాడని” వారు విమర్శించారు.

క్రీస్తు మరణం పునరుత్థానం ఆరోహణం మరియు మధ్యవర్తిత్వం మున్నగువాటిని గురించిన లేఖనానుసారమైన తన అభిప్రాయాలను బన్యన్ సమర్థించుకొంటూ వారి నేరారోపణలకు విరోధంగా శక్తివంతంగాను సరియైన విధంగాను న్యాయసమ్మతంగాను వాదించాడు.

అతని భాషాశైలి ప్రత్యేకంగా ఉన్నట్టు అనిపించినప్పటికీ, మొట్టమొదటి సారిగా రచనా వ్యాసంగంలోనికి ప్రవేశించిన విద్యావంతుడుకాని ఒక వ్యక్తి చేసిన ఆ రచన ఒక అసాధారణమైనదే. బన్యన్ రచనకు జవాబుగా “సమాధాన సువార్త యొక్క నిజమైన విశ్వాసము కొరకు వినయముతో కూడిన పోరాటము”

బోధించడాన్ని విరమించడానికి బన్యన్ నిరాకరించడంతో అతడు బెడ్ఫోర్డ్ చెరసాలకు అప్పగించబడ్డాడు.

అన్న పేరుతో ఎడ్వర్డ్  బరోస్ అనే వ్యక్తి ఒక కరపత్రాన్ని విడుదల చేసాడు. అయితే, బన్యన్ ఆ కరపత్రానికి సరైన  ఇచ్చాడు. బరోస్ ఆ తర్వాత తిరిగి మరో కరపత్రాన్ని విడుదల చేసినప్పటికీ బన్యన్ తన రచనను బలంగా నిరూపించ డంతో చివరికి వివాదం సద్దుమణిగింది.

చెరసాలకు పంపబడుట

క్రీ.శ. 1657లో ఈటన్ (Eaton) అనే స్థలంలో బన్యన్ బోధిస్తున్న సమ యంలో లండన్ చర్చి ఆరాధనకు విరోధంగా బోధిస్తున్నాడని అతనిపై నేరా రోపణ చేయబడింది. అయితే ఆ రోజుల్లో బ్రిటీష్ కామన్వెల్త్లో తీవ్రమైన శిక్షలు

అమలులో ఉండినప్పటికీ, అతనిపై మోపబడిన నేరారోపణ ఋజువుకానందు వల్ల బన్యన్కు ఎలాంటి శిక్షా పడలేదు. అయితే, కొన్ని నెలల తరువాత బన్యన్పై అరెస్టు వారంటు జారీచేయబడింది. ఫలితంగా బెడ్ఫోర్డ్షైర్లోని సామ్ సెల్లో అతడు నిర్బంధించబడి వినేట్ (Wingate) అనే న్యాయాధిపతి యెదుట హాజరుపరచబడ్డాడు. బోధించడాన్ని విరమించడానికి బన్యన్ నిరాకరించడంతో అతడు బెడ్ఫోర్డ్ చెరసాలకు అప్పగించబడ్డాడు. న్యాయస్థానంలో అతనిపై మోపబడిన అభియోగం ఈ విధంగా ఉంది :

“బెడ్ఫోర్డ్ పట్టణంలో సామాన్య కార్మికుడైన జాన్ బన్యన్ దైవిక ఆరాధనలో పాల్గొనడానికి చర్చికి రావడాన్ని మానివేయడమేగాక చట్ట విరుద్ధమైన రహస్య మతకూడికలను నిర్వహిస్తూ రాజరికపు సార్వ భౌమాధికారానికి హాని కలిగిస్తున్నాడు.”

ఈ అభియోగంపై అతడు తిరిగి మూడు నెలలు చెరసాల నిర్బంధంలోనికి పంపబడ్డాడు. అంతేగాక, ఆ మూడు నెలల నిర్బంధం తర్వాత చర్చికి వెళ్ళేందుకూ బోధించడాన్ని మానివేసేందుకూ అతడు అంగీకరించనట్లయితే, దేశబహిష్క రణకు గురికావలసి ఉంటుందని అతడు హెచ్చరించబడ్డాడు.

ఒక నమ్మకస్తురాలైన భార్య

ఈ సమయానికి బన్యన్కు అతని మొదటి భార్యద్వారా పుట్టిన నలుగురు చిన్నబిడ్డలు ఉన్నారు. అతని పెద్ద కుమార్తె అయిన మేరీ పుట్టుకతోనే అంధురాలు. తన మొదటి భార్య మరణించిన సంవత్సరం తరువాత అతడు తిరిగి వివాహం చేసుకొన్నాడు. అతని రెండవ భార్య ప్రసవదినములు సమీపిస్తున్న సమయంలో బన్యన్ చెరసాలలో బంధించబడటం మరియు అతని దేశబహిష్కరణలను గురిం చిన వార్తలు ఆమెను తీవ్రంగా ప్రభావితం చేయడంవల్ల తన ప్రసవదినములకు ముందే ఆమె ఒక మరణించిన బిడ్డను ప్రసవించింది. అయినప్పటికీ, ఈ శ్రమలన్నిటి మధ్యలో ఆమె తన భర్త విడుదలకోసం తీవ్రంగా పోరాడింది.

ఆమె ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి లండన్కు ప్రయాణంచేసి తన భర్త విడుదల కోసం హౌస్ ఆఫ్ లార్డ్స్క ఒక వినతిపత్రం సమర్పించింది. అయితే, ఈ విషయమై స్థానిక న్యాయస్థానంలోని న్యాయవాదులను సంప్రదించమని అక్కడ ఆమె నిర్దేశించబడింది. ఆమె తన ఇంటికి తిరిగి వచ్చి ఎంతో వినయముతోను ‘వణకుతున్న హృదయంతోను’, అనేకమంది న్యాయవాదుల సమక్షంలోను ఆ పట్టణములోని పెద్దల సమక్షంలోను తన విన్నపాన్ని న్యాయమూర్తులకు సమర్పిం చింది. అక్కడున్న న్యాయమూర్తులలో ఒకరైన సర్ మాథ్యూ హేల్ (Sir Mat- thew Hale) ఆమె భర్త విడుదల విషయంలో తన నిస్సహాయతను వ్యక్తంచేస్తూ తన తలను అడ్డంగా ఊపాడు.

“నీ భర్త బోధించడాన్ని విడిచిపెడతాడా?” – ట్విస్డెన్ (Twisden) అనే న్యాయాధిపతి ఆమెను ప్రశ్నించాడు. “ఆ విధంగా అతడు విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే, అతణ్ణి పిలిపించండి.”

“అయ్యా, తాను మాట్లాడగలిగినంత కాలం అతడు బోధించడాన్ని నిలిపి వేయలేడు” – ధైర్యస్తురాలైన ఆ స్త్రీ అతనికి జవాబిచ్చింది. సర్ మాథ్యూ ఆమె మాటల్ని తీవ్రమైన బాధతో ఆలకించాడు. అయితే, ట్విస్డెన్ ఆమెతో కఠినంగా మాట్లాడి దారిద్ర్యమే ఆమె పైవస్త్రమని ఆమెతో అన్నాడు.

“అవును,” – ఆమె సింహంలా గర్జించింది – “అతడు ఒక కళాయివేసేవాడు గనుకనూ, అతడు ఒక నిరుపేద గనుకనూ అతడు తృణీకరించబడ్డాడు. కాబట్టి అతనికి ఏమాత్రం న్యాయం జరగదు” – మండే గుండెతో ఆమె అతనికి బదు లిచ్చింది. ఆ సందర్భాన్ని గురించి ఎలిజబెత్ బన్యన్ తన అభిప్రాయాన్ని ఈ క్రింది మాటల్లో తెలిపింది :

“నేను న్యాయస్థానంలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టే సమయంలో భయపడినప్పటికీ, నేను అక్కడనుండి బయటకు వచ్చే సమయంలో కన్నీటి పర్యంతమయ్యాను. అలా నేను ఏడ్చింది నాపట్లనూ నా భర్తపట్లనూ వారు కఠినంగా ప్రవర్తించినందుకు కాదుగాని, ‘ఈ దౌర్భాగ్యులు ప్రభువు రాకడ సమయంలో ఏమని లెక్క అప్పగించ గలరా?’ అని నేను విలపించాను.”

ఫలాల్ని పండించిన కారగారవాసము

బన్యన్ పన్నెండు సుదీర్ఘ సంవత్సరాల కాలంపాటు కారాగారవాసం చేసాడు. అయితే, అతడు చెరసాల అధికారి కనికరమునుబట్టి అప్పుడప్పుడూ రాత్రివేళల్లో తన ఇంటికి వెళ్ళివచ్చేవాడు. ఒక సందర్భంలో అతడు రహస్యంగా లండన్లోని క్రైస్తవ విశ్వాసులను దర్శించాడు. తన జీవితంలోని అత్యంత మధురమైన కాలాన్ని అతడు చెరసాల నాలుగు గోడలమధ్య వ్యర్థపుచ్చుతున్న ఈ సమయంలో, బైబిలుగ్రంథం మరియు ఫాక్సుగారి హతసాక్షుల పుస్తకం తప్ప మరే పుస్తకమూ తనతోలేని ఈ కాలంలో అతడు దేవుని ప్రజలకు ఆదరణ కలిగించే అనేక చిన్న చిన్న కరపత్రాలతోపాటు తన సజీవ రచన అయిన “యాత్రికుని ప్రయాణము”ను రచించేందుకు పూనుకొన్నాడు.

చెరసాలనుండి విడుదల

బన్యన్ కారాగార శిక్ష అనుభవించిన చివరి సంవత్సరమగు 1671 లో అతడు బెడ్ఫోర్డ్ లోని బాప్టిస్ట్ చర్చికి పాస్టరుగా ఎన్నుకొనబడ్డాడు. తాను కారాగార శిక్ష అనుభవించిన చివరి నాలుగు సంవత్సరాలు అతడు ఆ సంఘ కూడికలకు వెళ్ళేందుకు చెరసాల అధికారిచే రహస్యంగా అనుమతించబడ్డాడు. తాను సాయం కాలం చెరసాలకు తప్పక తిరిగొస్తానన్న అతని మాటపై చెరసాల అధికారికి ఏమాత్రం అనుమానం ఉండేదికాదు.

చిట్టచివరిగా అతని విడుదల అధికారికంగా ప్రకటించబడింది. లింకన్ బిషప్ అయిన బార్లో, బన్యన్ విడుదల విషయంలో జోక్యంచేసుకొన్నాడు. అతని విడుదల తర్వాత బెడ్ఫోర్డ్ ఒక క్రొత్త ప్రార్థనా మందిరం నిర్మించబడింది.

తన శేషజీవితమంతా బన్యన్ ఆ ప్రార్థనామందిరం లోనే విస్తారమైన జనసమూహానికి బోధిస్తూ గడిపాడు.

సంవత్సరానికి ఒకసారి అతడు లండన్కు వెళ్ళి సౌత్వారాలోని సమావేశ భవనంలో బోధించేవాడు. ఆ సమయంలో ఆక్కడి ప్రజలు అతనిని అత్యంత ఆదరాభిమానాలతో ఆహ్వానించేవారు. అంతేగాక, అతడు బెడ్ఫోర్డ్ మరియు లండన్ పరిసర ప్రాంతాల్లో కూడ విరివిగా సంచరిస్తూ బోధించేవాడు. అతడు నగరాల్లో బోధించే సమయాల్లో ఆనాటి ప్రసిద్ధిగాంచిన వేదాంత పండితుడైన ఓవెన్ (Owen) తప్పక అతని కూడికలకు హాజరై అతని బోధలను వినేవాడు. విద్యాధికుడూ వేదాంతపండితుడూ అయిన ఆ వ్యక్తి విద్యాధముడైన ఒక కళాయి వేసేవాని బోధలను వినడాన్ని గురించి ఒకసారి రెండవ చార్లెస్ రాజు అతణ్ణి ప్రశ్నించినప్పుడు, అతడు ఇలా జవాబిచ్చాడు: “ఘనతవహించిన రాజా, అతని లాంటి బోధనాసామర్థ్యాన్ని సంపాదించేందుకు నా విద్యార్హతలన్నిటినీ సంతోషంగా వదలుకొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.”

బన్యన్ జీవిత చరిత్రను మొట్టమొదటిగా రచించిన ఒక రచయిత అతని భావోద్రేకాలను గురించి ఇలా వ్రాసాడు :

“అతడు చూడటానికి చాల కఠినంగా కనిపించేవాడు. అయితే, అతని మాటల్లో ఎంతో మృదుత్వం మేళవించేది. ఎప్పుడైనా అరుదుగా అవసరమొస్తే తప్ప అతడు వాక్చాతుర్యంతో వాక్యాన్ని బోధించేవాడు కాడు. తన్ను గురించి తాను గొప్పలు చెప్పుకోవడమంటే ఏంటో అతనికి తెలియదు. తన్నుతాను తగ్గించుకొంటూ ఇతరుల తీర్పుకే తనను వదలి వేయటం అతని అభిమతం. అబద్ధాలు చెప్పడం, ఒట్టుపెట్టుకోవటం, డంబాలు పలకటం, చెడు మాటలు పలకటం, ప్రతీకారం తీర్చుకోవటం, గాయపరచటం అతని దృష్టిలో హేయమైనవి. మాటల్లోను క్రియల్లోను నీతిని ప్రేమను ప్రదర్శించటం, బేదాభిప్రాయాలను సరిచేసుకొంటూ అందరితో స్నేహంగా ఉండటం అతనికి అత్యంత ఇష్టమైనవి. అతని కళ్ళు చాల త్వరగా ఇటూ అటూ తిరుగుతూ మనుష్యుల్ని కనిపెడు తుంటాయి. అంతేగాక అవి తమ మొదటి చూపులోనే ఒక వ్యక్తియొక్క గుణలక్షణాలను ఇట్టే పసిగట్టగలవు. అవి ఒకే క్షణంలో ఆ వ్యక్తిని గురించి తీర్పు తీర్చగలవు. ఇక అతని విగ్రహం విషయానికి వస్తే, అతనిది బలమైన కండలు తిరిగిన ఒక ఎత్తైన విగ్రహం. ఎఱ్ఱని ముఖంలో మెరిసే కళ్ళు. చిరునవ్వులొలికే పెదవులపై తొణికిసలాడే దట్టమైన మీసాలు, చక్కని ముక్కు అతని అందానికి అదనపు ఆస్తులు. అతని

వెంట్రుకలు ఎఱ్ఱగా ఉండేవి. అయితే, ఆ తర్వాతి కాలంలో అవి తెలుపు రంగుకు మారాయి. అతని నోరు ఒక మోస్తరు పెద్దదిగాను, అతని తల నిటారుగాను, అతని అలవాట్లు సాదాసీదాగాను ఉండేవి.”

తరతరాలకూ సజీవమైన పరిచర్య

బన్యన్ శేషజీవితాన్ని గురించి చరిత్రకారులచే అతి తక్కువగా వ్రాయబడింది. దేవుని ప్రజలు చార్లెస్ రాజు పరిపాలనలో భయంకరమైన హింసను అనుభవించిన సమయంలో బన్యన్ మునుపటిలాగా తన మనఃస్సాక్షిలో తీవ్రమైన సంక్షోభాన్ని అనుభవించాడా లేదా అన్న విషయాన్ని గురించి మనకు సరైన సమాచారం లేదు.

తన జీవిత చరమాంకంలో ఒక రోజు భయంకరమైన కుండపోత వర్షంలో బాగా తడిసి తీవ్రమైన చలిజ్వరం బారినపడ్డ కారణంగా అప్పటికే బాగా నీరసించి బలహీనంగా ఉన్న బన్యన్ 1688వ సంవత్సరం ఆగస్టు 12వ తేదీన తన ఇహలోక యాత్రను ముగించి నిత్యత్వంలోనికి చేరుకొన్నాడు.

అతని దేహం లండన్లోని క్రైస్తవ స్మశానవాటిక అయిన బర్హిల్ ఫీల్డ్స్లో భూస్థాపన గావించబడింది. విధవరాలైన అతని భార్య అతడు మరణించిన నాలుగు సంవత్సరాలకు మరణిం చింది.

అతని వారసులలో అతి కొద్దిమంది పేర్లు మాత్రమే బెడ్ఫోర్డ్ ని బాప్టిస్టు చర్చి పుస్తకాలలో కనిపిస్తున్నాయి.

అతని చివరి వారసురాలిగా కనుగొనబడిన బన్యన్ మునిమనుమరాలు అయిన హన్నా బన్యన్ క్రీ.శ. 1770 లో తన 76వ ఏట మరణించింది.

ఎలిజబెత్ బన్యన్ మరణించిన సంవత్సరమైన 1692 లో బన్యన్ రచనలన్నీ రెండు పెద్ద గ్రంథాలుగా ప్రచురించబడ్డాయి.

బెడ్ఫోర్డ్లో బన్యన్ పరిచర్యను కొనసాగించిన ఎబెనెజర్ క్యాండ్లర్ మరియు క్యాండ్లర్ తరువాత బెడ్ఫోర్డ్ సంఘ పరిచారకుడైన జాన్ విల్సన్ ఈ ప్రచురణ కార్యాన్ని చేపట్టి ముగించారు.

ఈ గ్రంథాలలో జాన్ బన్యన్చే రచించబడిన దాదాపు అరవై వేర్వేరు రచనలు సమీకరించబడ్డాయి. ఇవన్నీ లోతైన ఆత్మీయ ధ్యానాలతో నిండివున్నాయి.

క్రైస్తవ పాఠకునికి

క్రైస్తవ పాఠకునికి

సంగ్రహ రచన నీ ఆత్మీయ మేలు నిమిత్తము రూపొందించబడినది. | పరలోక మహిమను నీ మనోనేత్రములకు ప్రదర్శించుటద్వారా నీ ఆశలూ ప్రేమానురాగాలూ పరలోకంవైపుకు ఆకర్షించబడి, ఆ పరలోకాన్నే నీ ముఖ్యమైన ధననిధిగా నీవు ఎంచుకొంటావు. అప్పుడు “నీ ధనమెక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును” .

బహుశాః నీ ప్రేమానురాగాలు ఇంతవరకు దృశ్యములైన ఐహిక అంశములవైపు మళ్ళివుండ వచ్చు. అయితే పరలోకాన్ని గురించిన ఈ సంగ్రహ రచనను నీవు చదువుటద్వారా నీ ప్రేమానురాగాలు పరలోక మహిమవైపు మళ్ళించబడి, అందులోని ఆనందాన్ని నీవు ఈ లోకంలోనే అనుభవించుట మాత్రమేగాక, దాని ఫలితంగా నీవు నిత్యమైన ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించి, ఆ నిత్యమైన ఆనందంలో శాశ్వతంగా పాలు పొందగలవు.

పరలోకాన్ని గురించిన పరిపూర్ణ వివరణను ఇది నీకు ఇవ్వదుగాని, భవిష్యత్తును గురించిన దైవిక ప్రత్యక్షతను ఇది కొంతవరకు వివరిస్తుంది. ఎందు కనగా, “మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు” .

మన నిజమైన సంతోషము ఎక్కడ ఉందో ఈ పుస్తకం నీకు చక్కగా వివరిస్తుంది. మన నిత్యత్వమును గురించి మనలో నిరంతరం చెలరేగే అనేకములగు ఆసక్తికరమైన ప్రశ్నలకు, సంశయాలకు సత్యవాక్యము ప్రకారము ఈ రచన చక్కని జవాబులను ఇస్తుంది.

పరలోకము మరియు నరకములనుగూర్చిన దర్శనములు ప్రేమ మరియు కోరిక అనునవి ఆత్మను పరలోకంవైపుకు ఎగిరేట్లుగాచేసే రెక్కలుగా నేను కనుగొనినందున, దైవిక ప్రేరణ కలిగిన ఆత్మ తప్పక పరలోక ఆకర్షణలవైపుకు మెల్లమెల్లగా చేరుకొని, చివరిగా “శాశ్వత శోభాతిశయ”మైన ఆ పరలోకపు అందాల్ని కళ్ళారా వీక్షించి ఆనందిస్తుంది.

ఆ పరలోకపు అందాలు మాత్రమే మనము కోరదగినవి. ఆ పరలోక ప్రభువు మాత్రమే మనము కోరదగినవాడు. తన దీనదశలో సహితము ఎంతో ఆకర్షణీయుడుగా ఉండిన ఆ ప్రేమాప్రభువు, అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు తెలిపినట్లుగా తన పరలోక మహిమలో “మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన” వాడుగా ఇంకెంత ఆకర్షణీయంగా ఉంటాడో కదా?

“శాశ్వత శోభాతిశయముగాను బహు తరములకు సంతోష కారణముగాను” మనకు బయలుపరచబడిన దేవుని పట్టణమును గురించి “మిక్కిలి గొప్ప సంగతులు” చెప్పబడి నప్పటికీ, అనేక విధములుగా దానిని గురించి మనకు అభివర్ణించబడినప్పటికీ, తాను వాస్తవంగా వీక్షించిన సంగతులలో సగమైనను తనకు తెలుపబడలేదని సొలొమోను వైభవమును గురించి షేబ రాణి పలికినట్లుగా మనముకూడ పలికేందుకు ప్రోత్సహించబడుదుము గాక! ఈ లోకంలో ఉండగనే మనము మన హృదయాలను ఆనందమయమైన ఆ పరలోక మహిమవైపు మళ్ళించి, ఆ పరలోక మహిమయొక్క ప్రేమాను రాగాలతో వాటిని నింపుకొని “సైన్యములకధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు!” అని రాజైన దావీదులాగా ఆనందపార వశ్యములతో పలుకగలము .

ఆ పరలోక మహిమపై మనకున్న ప్రేమ మరియు అందులో ప్రవేశించాలన్న మనలోని లోతైన కోరిక మనము అపేక్షించే పరలోక మహిమవైపుకు మనల్ని ఎంత శక్తివంతంగా నడిపిస్తాయో, మనల్ని ఆ పరలోక మహిమకు వెళ్ళనీయ కుండాచేసే పాపములన్నిటినుండి మనం దూరంగా పారిపోయేందుకు మన ఆత్మయొక్క భావోద్రేకమైన భయము మనల్ని ప్రోత్సహిస్తుంది.

ఆ ప్రేమ మరియు మనల్ని పరలోక మహిమవైపుకు ఆకర్షించేందుకు కోరిక మనలో ఎంత బలంగా పనిచేస్తాయో అంతే బలంగా భయము అనే భావోద్రేకము మనలో పనిచేస్తుంది. మనల్ని పరలోక మహిమవైపుకు ఆకర్షిం చేందుకు మనకు పరలోక దర్శనము ఎంత అవసరమో, మనల్ని భయపెట్టి పాపమునుండి పారిపోయేలా చేసేందుకు నరకమును గురించిన దర్శనము కూడ మనకు అంతే అవసరము. అప్పుడు మనము మన చెవులను తోపెతు నోటివద్ద పెట్టి , వ్యర్థమైన తమ పాపభోగములనుబట్టి నిత్యనాశనము నకు వారసులైన దౌర్భాగ్యుల విలాపగీతము లను వినగలము.

ఈ లోకంలో తమ సుఖ భోగములకొరకు ఆ పరలోక మహిమను నిర్లక్ష్యంచేసిన ఆ దౌర్భాగ్యుల ఆర్తనాదాలను నీవుకూడ తప్పక వినగలవు. అయితే ఇప్పుడు వారు పశ్చాత్తాపపడేందుకూ, సహాయంకోసం అర్థించేందుకూ బాగా ఆలశ్యమైపోయింది. ఆ విధంగా పరలోకము మరియు నరకమును గూర్చిన దర్శనములు జ్ఞానులగు ప్రతి ఒక్కరినీ మనకు పరలోక దర్శనము ఎంత

అవసరమో, మనల్ని భయపెట్టి పాపమునుండి పారిపోయేలా చేసేందుకు నరకమును గురించిన దర్శనముకూడ మనకు అంతే అవసరము.
అత్యంత జాగ్రత్తగా ఉండునట్లు ప్రేరేపించడమేగాక, నాశనకరమైన నిత్యనరకము నుండి తప్పించుకొమ్మని అవి ఇతరులను హెచ్చరిస్తూ, నిత్యమైన పరలోక రాజ్యంవైపుకు చూసేందుకు వారిని పురికొల్పుతాయి.

నోవహు భయముచేత కదిలించబడినవాడై, తననూ తన ఇంటివారినీ రక్షించుకొనుటకు ఒక ఓడను తయారుచేసుకొన్నాడని హెబ్రీ గ్రంథకర్త మనకు తెలుపుతున్నాడు . నరకపువేదన సరైనవిధంగా వివరించబడి నట్లయితే, “రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు”  క్రీస్తు అను ఓడలోనికి ప్రవేశించునట్లు అనేక హృదయాలను అది కదిలిస్తుంది. అది నిజంగా చెప్పనశక్యమైన కృప. ఈ సందేశము ఒక దర్శనరూపంలో వ్యక్తీక రించబడినందుకు ఎవరూ ఎలాంటి గలిబిలికీ గురికానవసరము లేదు. ఎందు కనగా ఇక్కడ బయలుపరచబడిన సత్యములన్నియు విశ్వాస సూత్రమును

ఆధారముచేసికొనే వ్రాయబడ్డాయి. తన ఔషధము ఒక రోగిలోనికి పోయేందుకు ఒక వైద్యుడు ఒక సరియైన పరికరమునే ఉపయోగిస్తాడు. నేనుకూడ అదే చేశాను. పరలోక మార్గము ఒక స్వప్నమునకు పోల్చబడినప్పుడు, ప్రయాణము అదే దర్శనముద్వారా ఎందుకు అంగీకరించబడకూడదు? పరలోకమునకు మనలను చేర్చే సాధనము అయిన దర్శన మును దీనికోసం మనము ఎందుకు ఎన్ను విశ్వాసం మరియు ప్రేమ కొనకూడదు? యాత్రికుడు మార్గమధ్యంలో అనే బంగారు రెక్కలను అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. అయితే, చివరిగా అతడు సంతోషకరమైన పరలోకాన్ని చేరుకొన్నాక అతని కష్టాలన్నీ ఒక్కసారిగా అంతమయ్యాయి, గాలితుఫానులన్నీ ఒక్కసారిగా ఆగిపోయి నిశ్శబ్దం మరియు ప్రశాంతత అతనిని ఆవరించాయి.

అలాగైతే మనము ఇంకెంత మాత్రం ఆలశ్యంచేయక విశ్వాసం మరియు ప్రేమ అనే బంగారు రెక్కలను ధరించి పైపైకి ఎగురుదామా? ఎందుకనగా,

“చలికాలము గడిచిపోయెను, వర్షకాలము తీరిపోయెను, వర్షమిక రాదు; దేశమంతట పువ్వులు పూసియున్నవి; పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది.”

నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము, రమ్ము” అని మన ఆత్మలకు ప్రియమైన మన పెళ్ళికుమారుడు మనల్ని పిలుస్తున్నాడు (పరమగీతము 2:13). ప్రియ చదువరీ, నీ ప్రియుని చేరేందుకు నీవు త్వరపడవా? నీ ఆత్మ శ్రేయోభిలాషి,