గొట్టెల మంచి కాపరి – Bible Verses Chapter 10 in Telugu

పదియవ అధ్యాయము

గొట్టెల మంచి కాపరి
(యోహాను 10:11)
“నేనే ద్వారమును” (10:1-10) :

10:1 ఇశ్రాయేలీయులకు తామే సరియైన కాపరులమని పరిసయ్యులు చెప్పు కొందురు. అట్టివారితో ప్రభువైన యేసు గంభీరముగా ఇట్లు మాట్లాడుచున్నాడు. నిశ్చయముగా, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను.

రాత్రియందు గొట్టెలు విశ్రాంతి తీసికొను స్థలము గొట్టెల దొడ్డి. ఈ విశ్రాంతి స్థలముచుట్టు కంచెవేయబడి ఒక స్థలమునందు ద్వారముంచబడును. ఈ గొట్టెల దొడ్డియే “యూదా జనాంగము”.
యూదా జనాంగములో అనేకులు ఆత్మీయమైన పాలకులుగాను, ఉపదేశించు వారుగా కనుపరచుకొందురు, అట్టివారు ఆ జనాంగమునకు తమ్మును తామే మెస్సీయలుగా ప్రతిష్ఠించుకొందురు.

కాని వారు ద్వారములోనుండి ప్రవేశించువారు కారు. పాత నిబంధనలో మెస్సీయ రాకను ప్రవచించునట్లుగా వారి మార్గము ఉండదు. వారు మరియొక మార్గముగుండ ఎక్కివచ్చిరి. తాము ఏర్పరచుకొనిన స్వంత మార్గముల ద్వారావచ్చి ఇశ్రాయేలీయులకు కనుపరచుకొందురు. వీరు నిజమైన కాపరులుకారు గాని, దొంగలును దోచుకొనువారునైయున్నారు.

తమది కాని దానిని స్వతంత్రించు కొనువాడు దొంగ, తమది కాని దానిని దౌర్జన్యముతోను, హింసతోను స్వతంత్రించు కొనువాడు దోచుకొనువాడునైయున్నాడు. పరిసయ్యులు దొంగలును, దోచుకొనువారునై యున్నారు.

Read and Learn More Telugu Bible Verses

వారు యూదులను పరిపాలింపవలెనని ఆశించుదురు. మరియు ఇశ్రాయేలీ యులు నిజమైన మెస్సీయను అంగీకరించుటకు వారు అనేకములైన ఆటంకములను కలిగించుదురు. యేసును వెంబడించినవారిని హింసించుదురు మరియు ఆయనను మరణమునకు పాత్రునిగా చేయుదురు.

10:2 రెండవ వచనము ప్రభువునుగూర్చి చెప్పబడినది. ఇశ్రాయేలీయులలో నశించిన వారియొద్దకే ఆయన వచ్చెను. ఆయన నిజమైన గొట్టెలకాపరి, ఆయన ద్వారములో నుండి ప్రవేశించెను. పాత నిబంధనలో మెస్సీయను గూర్చిన ప్రవచనములు నెరవేరు నట్లుగా ఆయన వచ్చెను. ఆయన తన్నుతాను ఏర్పరచుకొనిన రక్షకుడు కాడు. తండ్రి చిత్తమునకు సంపూర్ణ విధేయుడై వచ్చెను. తన్నుగూర్చిన నిబంధనలన్నిటికి విధేయుడై వాటిని నెరవేర్చెను.

10:3 క్రొత్త నిబంధన ప్రకారము ‘పోర్టరు’ అనగా ద్వారపాలకుడు. ద్వారపాలకుని యొక్క గుర్తింపులో యీ వచనమందు భేదాభిప్రాయము కనబడుచున్నది. క్రీస్తుయొక్క రాకడనుగురించి పాత నిబంధనలో ప్రవచించిన ప్రవక్తలను ఈ వచనము సూచించు చున్నదని కొందరు చెప్పుదురు.

మరికొందరు నిజమైన కాపరికి ముందుగా వచ్చిన బాప్తిస్మమిచ్చు యోహానునుగూర్చి అని చెప్పుదురు. మరికొందరైతే మానవుల జీవితము లోనికి, హృదయములోనికి తలుపు తెరచి ప్రభువును ప్రవేశింపజేయు పరిశుద్ధాత్ముడేనని చెప్పుదురు.

గొట్టెలు, గొజ్జెల కాపరి స్వరము వినును. నిజమైన గొట్టెలకాపరి స్వరమును అవి గుర్తించును. గొట్టెలు కాపరి స్వరము వినునట్లుగా యూదులలో కొంతమంది మెస్సీయను గుర్తించగలిగిరి. ఈ సువార్త అంతటిలో గొజ్జెల కాపరి తన గొట్టెలను పేరు పెట్టి పిలుచుటను గమనించుదుము.

మొదటి అధ్యాయములో ఆయన కొంత మంది శిష్యులను పిలువగా వారు ప్రతిస్పందించిరి. 9వ అధ్యాయములో ఆయన గ్రుడ్డివానిని పిలిచెను. ఆయన తనను రక్షకునిగా అంగీకరించువారిని ఇంకను పిలుచు చున్నాడు. ఒక్కొక్కరినే వ్యక్తిగతముగా పిల్చుచున్నాడు.

“బయటికి పిలుచుచున్నాడనగా” ఇశ్రాయేలీయులు దొడ్డిలోనుండి తన స్వరమునకు విధేయులగువారిని పిలుచుచున్నాడు. వారా దొడ్డిలో బంధింపబడి, మూయబడియున్నారు. ధర్మశాస్త్రముక్రింద స్వేచ్ఛా స్వాతం త్ర్యము లేదు.

అట్టివారిని తన కృపలోనున్న స్వేచ్ఛాస్వాతంత్య్రములను అనుభవించుటకు పిలిచెను. చివరి అధ్యాయములో ఆయనను సునగోగునుండి బయటికి పంపివేసిరి. వారట్లు చేయుటవలన తెలియకయే ప్రభువు చేయు పనికి సహకరించుచున్నారు.

10:4 మరియు ఆయన తన గొట్టెలను వెలుపలికి నడిపించునప్పుడెల్ల వాటినే ముందుగా నడిపించక, తానే వాటిముందర నడుచును. తాను ఒక స్థలమునకు ముందుగా పోనియెడల తన గొట్టెలను అక్కడికి నడిపించడు.

రక్షకునిగా, దారి చూపువానిగా వారికి మాదిరిగా వాటిముందర తానే నడుచును. నిజమైన గొట్టెలు ఆయనను వెంబడించును. ఆయనను అనుసరించుట వలన అవి ఆయన గొట్టెలు కాలేవు గాని రక్షింపబడిన తరువాత తిరిగి జన్మించుట వలననే అగును.

10:5 అవి ఆయన నడిపించుచోటికి పోనాశించవలసియుండును. గొట్టెలకుగల యీ స్వభావము నిజమైన కాపరి స్వభావము గుర్తించుటకును, అన్యుని స్వరము విని పారిపోవుటకును సహకరించును.

అన్యులెవరనగా తమ స్వలాభముకొరకు గొట్టె పట్ల ఆసక్తినిజూపు పరిసయ్యులు మరియు యూదుల అధికారులు, చూపు పొందిన గ్రుడ్డివాడు మంచిగొట్టెకు ఉదాహరణగానున్నాడు. అతడు ప్రభువైన యేసు స్వరమును గుర్తెరుగ గల్గెను. పరిసయ్యులను అన్యులుగా గుర్తించెను. కనుకనే వారికి విధేయుడగుటకు అంగీకరింపకపోయెను. వారతనిని వెలివేసినప్పటికిని వారికి విధేయుడు కాలేదు.గొట్టెల మంచి కాపరి (యోహాను 10:11) “నేనే ద్వారమును” (10:1-10) :

10:6 ఈ మాటలు ప్రభువు పరిసయ్యులతో చెప్పినప్పటికిని వారు నిజమైన గొట్టెలు కానందుచే ఆయన మాటలను అర్థము చేసికొనలేదు. వారు మంచి గొట్టెలయినచో ఆయన మాటలు విని, ఆయనను వెంబడించెడివారే.

10:7 ప్రభువు ఇచ్చట క్రొత్త వివరణ ఇచ్చుచున్నాడు. 2వ వచనములో చెప్పినట్లుగా గొట్టెల దొడ్డి, ద్వారమును గురించి చెప్పుటలేదుగాని, తానే ద్వారమునై యున్నానని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలీయులనబడిన గొట్టెల దొడ్డిలో ప్రవేశించుట కాదుగాని ఎన్నుకొనబడిన ఇశ్రాయేలీయులు యూదా మతమును వదలి ద్వారమనబడిన క్రీస్తు నొద్దకు వచ్చిరి.

10:8 కొందరు అధికారమును, ఉన్నతమైన స్థితిని కోరుచు క్రీస్తుకుముందు వచ్చిరి. కాని ఎన్నుకొనబడిన ఇశ్రాయేలీయులు వారు దేనికి తగినవారు కారో, దానిని ఆశించు చున్నారని గ్రహించి, వారి మాట విననైరి.

10:9 ఈ వచనము సండేస్కూలు విద్యార్థికి సహితము అర్థమగు రీతిలోనున్నది. అయినను బాగుగా జ్ఞానము తెలిసిన వారికి అందనిదికాదు. క్రీస్తు ద్వారమైయున్నాడు క్రైస్తవ్యము, ఒక మతముగాని, సమాజముగాని కాదుగాని, ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనద్వారానే ఒకడు లోపల ప్రవేశించగలడు, రక్షణ క్రీస్తు ద్వారా గల్గును.

బాప్తిస్మముగాని, ప్రభురాత్రి భోజనముగాని రక్షణ కలుగజేయదు. క్రీస్తుద్వారా ఆయనిచ్చు శక్తిద్వారా మనము లోపల ప్రవేశింపవలసియున్నాము. ఈ ఆహ్వానము అందరికీ, క్రీస్తు యూదులకు ఎలాగో, అన్యులకు ఆయన రక్షకుడే, కాని రక్షింపబడవలెనంటే ఒకడు లోపల ప్రవేశింపవలసియున్నది.

వాడు విశ్వాసముద్వారా క్రీస్తు నంగీకరించవలసియున్నది అది వ్యక్తిగతచర్య. ఈ కార్యము జరుగనిదే రక్షణలేదు. లోపలికి ప్రవేశించువాడు శిక్షనుండియు, పాపమునుండియు, దానియొక్క శక్తినుండియు తప్పింపబడును.

రక్షింపబడిన తరువాత వాడు బయటికి వెళ్ళుచు, లోపలికి వచ్చుచుండవలెను. అనగా విశ్వాసముతో ఆరాధించు టకు ప్రభువు సన్నిధికి వచ్చుచు, ప్రభువునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు లోకములోనికి వెళ్ళుచుండవలెను, ప్రభువు పరిచర్యలో సంపూర్ణ స్వేచ్ఛను ఈ పటము చూపించును.

లోపలికి ప్రవేశించువారు పచ్చికను కనుగొందురు. క్రీస్తు రక్షకుడేకాక స్వేచ్ఛను అనుగ్రహించువాడును, మరియు మనలను నిలువబెట్టువాడునైయున్నాడు. ఆయన గొజ్జెలు దేవుని వాక్యమందు ఆహారమును కనుగొనును.

10:10 దొంగ దొంగిలించుటకును, ప్రాణము తీయుటకును, నశింపజేయుటకును వచ్చును. దొంగ తన స్వలాభాపేక్షతో వచ్చి గొట్టెలను సహితము చంపును. ప్రభువైన యేసు స్వలాభాపేక్షతో ఏ మానవ హృదయములోనికి వచ్చియుండలేదు.

ఆయన జీవము ఇచ్చుటకు వచ్చెను. మానవులకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగజేయుటకును వచ్చెను. యేసుప్రభువును అంగీకరించిన తక్షణమే మనము జీవమును పొందుదుము.

మనము రక్షింపబడినపిదప మనమనుభవించు ఆనంద ములో వివిధ అంతస్థులుండును. మనమెంత ఎక్కువగా పరిశుద్ధాత్మునివైపు మళ్ళు దుమో, అంత ఎక్కువగా మనకివ్వబడిన జీవమును అనుభవించెదము, జీవమును కలిగియుండుటయేగాక అది సమృద్ధిగా కలిగియుందుము.

10:11 త్రిత్వమైయున్న దేవుని మూర్తిమత్వములో తానొకరని ప్రభువైన యేసు పలుమార్లు ప్రస్తావించెను. దేవునితో తాను సమానుడనని ప్రతిసారి చెప్పుకొను చుండెను. ఇక్కడ తాను గొజ్జెల మంచి కాపరిననియు తన గొజ్జెలకొరకై ప్రాణము పెట్టుటకు వచ్చియున్నాననియు చెప్పెను. సాధారణముగా కాపరికొరకు గొట్టే వధింప బడును.  యేసు ప్రభువైతే తన గొట్టెలకొరకు చనిపోయెను.

హతుడు గాయపరచబడినవాడై రక్తము కారుచుండగా

నడిపింపబడెను  కాపరి దయగల హృదయముతో

మనకు, మన విరోధికి మధ్య నిలుచుటకై

హృదయ పూర్వకముగా తానే మనకొరకు మరణించుటకై.

10:12 జీతగాడు తాను చేసిన పనికి జీతము పుచ్చుకొనును. పరిసయ్యులు జీతగాండ్రుగా చెప్పబడిరి. వారు పొందు జీతమునుబట్టి వారికి ప్రజలపట్ల అభిమానము పెంపొందును. గొజ్జెలు జీతగాని స్వంతముకాదు. ప్రమాదము సంభవించునప్పుడు వాడు పారిపోవును. తోడేలు గొట్టెలను పట్టి తినివేయును,

10:13 మనమేమైయున్నామో అదే అయియుండి, మనము చేయునదే చేయుదము జీతగాడు జీతగాడే గనుక గొట్టెలను ప్రేమింపడు. తన క్షేమమునే కోరుకొనునుగాని, గొట్టెల క్షేమమును ఆలోచించడు. ఇట్లే దేవుని సమాజములోని సభ్యులపట్ల నిజమైన ప్రేమ లేకుండినను పరిచర్యనొక అనుకూలమైన వృత్తిగా చేపట్టిన జీతగాళ్ళు గలరు.

10:14 మరల ప్రభువు తాను గొట్టెలకు మంచి కాపరినని చెప్పుకొనుచున్నాడు. ‘మంచి’ అనగా న్యాయమైన, యుక్తమైన, శ్రేష్ఠమైన, ఉత్తమమైన, యోగ్యమైన అను అర్థముల నిచ్చును. ఆయన ఇట్టి లక్షణములన్నియు కలవాడు. ఆయన తనకును తన గొట్టెలకున్న సంబంధమును గూర్చి మాట్లాడుచున్నాడు. తండ్రి తన కుమారుని ఎరుగును. తనవారు ఆయనను ఎరుగుదురు. ఇది అద్భుతమైన సత్యము.

10:15 నా గొట్టెలను నేను ఎరుగుదును. (అవి నన్ను ఎరుగును). “తండ్రి నన్ను ఎరిగియుండినట్లుగా నేను వాటిని ఎరుగుదును. నేను నా తండ్రిని ఎరుగుదును”. ఇది నిజముగా హృదయమును స్పందించు సత్యము. తనకు గొట్టెలకు ఉన్న సంబంధ మును యేసుప్రభువు తనకు తండ్రికి మధ్యగల సంబంధమునకు పోల్చెను.

తండ్రికి, కుమారునికి గల సహవాసము మరియు సన్నిహిత సంబంధము-గొట్టెల కాపరికిని, గొట్టెలకునుకూడా గలదు. “నేను గొట్టెలకొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను.” ప్రభువు చెప్పిన మాటలలో అనేకసార్లు పాపులకు ప్రతిగా తన ప్రాణము పెట్టుటకు ఈ లోకములోనికి తాను ఇష్టపడి వచ్చినట్లుగా చెప్పెను.గొట్టెల మంచి కాపరి (యోహాను 10:11) “నేనే ద్వారమును” (10:1-10) :

10:16 ఈ అధ్యాయమునకు ఈ వచనము తాళపుచెవి వంటిది. ప్రభువు చెప్పిన వేరొక గొట్టెలు ఎవరనగా అన్యులు. ఆయన రాక ఇశ్రాయేలీయులకొరకే. అయినను అన్యుల రక్షణను గురించి ఆలోచన ఆయనకు గలదు.

అన్యులు యూదులు కలసి సాంగత్యము చేయరు. (అన్యులు యూదులకు చెందినవారు కారు) అయితే ఆయన హృదయములో గొప్ప ఆశ ఏమనగా తన దైవజ్ఞానముతో బలవంతము చేయబడి అన్యులను రక్షించుటకు పూనుకొనెను.

యూదులకంటే ఎక్కువ ఆసక్తితో వారు తనను అంగీకరింతురని ఆయనకు తెలియును. కనుకనే ఒకే దొడ్డి, ఒకే కాపరి ఉండునని ప్రభువు చెప్పుచున్నాడు. దీనిని ఒకే మంద, ఒకే కాపరి ఉండునని కూడ వ్రాయబడినది.

“దొడ్డి” యూదా మతమునకును, “మంద” క్రైస్తవ్యమునకును చెందినది. క్రీస్తునందు యూదుడు, అన్యుడు ఏకమైయున్నాడని ఈ వచనముయొక్క భావమైయున్నది. వీరిద్దరికి ఉన్న విపరీతమైన భేదము తొలిగించబడెను.

10:17,18 ఈ వచనములలో ప్రభువు యూదులను, అన్యులను తనయొద్దకు ఆకర్షించుకొనుటకు ఏమి చేసెను? ఆయన చనిపోయి తిరిగి లేచెను. ఆయన తన ప్రాణమును పెట్టుటకును, తిరిగి తీసికొనుటకును, ఆయనకు అధికారము కలదు. ఆయన దేవుడు గనుక ఆలాగు చేయగలడు.

నశించిన గొట్టెల రక్షణార్థమై ఆయన చనిపోవుటకు, మరల తిరిగి లేచుటకు యిష్టము చూపినందున తండ్రి ఆయనను ప్రేమించెను ప్రభువు ప్రాణమును ఆయన యొద్దనుండి తీసికొనువారు ఎవరునులేరు.

ఆయన దేవుడు గనుక తన్ను చంపుటకు పన్ను కౄర పన్నాగములన్నింటికి ఆయన అతీతుడు. కనుక ఆయన తన ప్రాణము పెట్టుటకును, తిరిగి తీసికొనుటకును ఆయనకు అధికారము కలదు.

అయితే మానవులాయనను చంపలేదా? అవును, మానవులాయనను చంపిరి. ఈ విషయము అ.కా. 2:23 మరియు 1 థెస్స 2:15. లోను చెప్పబడినది. వారట్లు చేయుటకు ఆయన ఒప్పుకొనెను. ఇది తన ప్రాణము పెట్టుటకు తనకు అధికారము కలదని నిరూపించుటకు సూచన.

యోహాను 19:30 ప్రకారము ఆయన “ఆత్మను అప్పగించెను” అని చెప్పబడినది. ఇది ఆయన యొక్క చిత్తమును శక్తిని చూపించుచున్నది. ఈ ఆజ్ఞ నా తండ్రివలన పొందితినని చెప్పు చున్నాడు. ఆయన తన ప్రాణము పెట్టుటకును మరియు మృతులలోనుండి తిరిగి లేచుటకును తండ్రి ఆయనకు ఆజ్ఞాపించెను. ఆయన మరణ పునరుత్థానములు తండ్రియొక్క చిత్తమై యున్నవి.

యూదులలో భేదము (10:19 – 21)

10:19 యూదులలో మరియొక భేదమును ప్రభువైన యేసుక్రీస్తు చూపించు చున్నాడు. క్రీస్తు ప్రవేశము ఈ లోకములోనికి, గృహములోనికి, హృదయములోనికి సమాధానముకన్న ఖడ్గమును తీసికొని వచ్చును. ఆయనను ప్రభువుగాను, రక్షకునిగాను అంగీకరించిన వారి హృదయములు దేవుని సమాధానముతో నింపబడును.

10:20,21 ఈ లోకములో నివసించిన పరిపూర్ణ మానవుడు ప్రభువైన యేసు ఒక్కడే. ఆయన ఒక దుర్భాషగాని, ఒక దుష్టకార్యమునుగాని చేసియుండలేదు. ఆయన ప్రేమనుగూర్చియు, జ్ఞానమునుగూర్చియు మాటలాడుటకు వచ్చియుండగా దుర్మార్గు లైన మనుష్యులు ఇతడు దయ్యము పట్టినవాడును, పిచ్చివాడును అని చెప్పి నిర్లక్ష్యము చేసిరి. అయితే కొందరు ఆయనయొక్క మాటలను, కార్యములను గుర్తించి ఆయన దయ్యము పట్టినవాడుకాక, మంచివాడని ఒప్పుకొనిరి.

యూదులలో భేదము (10:19 - 21)

యేసు తాను చేసిన పనులనుబట్టి
క్రీస్తు అని గుర్తింపబడుట (10:22-39) :

10:22 – 24 ఇక్కడ ప్రభువు పరిసయ్యులతో మాటలాడుట చాలించి యూదులతో మాటలాడుట కారంభించెను. 21వ వచనములో జరిగిన సంఘటనకు 22వ వచనములో జరిగిన సంఘటనకు ఎంత సమయము గడిచిపోయెనో మనకు తెలియదు, ఆలయప్రతిష్ఠ పండుగనుగూర్చి ఇక్కడ మాత్రమే ఇవ్వబడెను.

క్రీ.పూ. 165వ సంవత్స రమున (యూదా మక్కాబీయుల కాలమందు) దేవుని మందిరము ‘అంతియొకస్ ఎపిఫనెస్ వలన అపవిత్రపడియుండుట వలన మక్కాబీయులైన యూదా జనాంగము ఈ ఆలయ ప్రతిష్ఠ పండుగను ఆచరించుటకు ఏర్పాటు చేసిరని సామాన్యముగా చెప్పుదురు.

ఇది యూదులు సంవత్సరమున కొకసారి ఏర్పాటుచేసిన పండుగయేగాని యెహోవా దేవుడు వారికి నిర్ణయించినదికాదు. అది చలికాలము, ఆధ్యాత్మికముగాను అది చలికాలమే. యేసుప్రభువు పరిచర్య ముగియనున్నది. సిలువ మ్రానుపై ఆయన తన ప్రాణమును అప్పగించుటద్వారా తన్ను తాను తండ్రియైన దేవునికి ప్రతిష్ఠించుకొను చున్నాడు.

 

గొట్టెల మంచి కాపరి Bible Verses Chapter 10

సొలొమోను మంటపము హేరోదు నిర్మించిన మందిరమునకు ఆనుకొని యున్నది. యేసు అక్కడ ఉండగా యూదులనేకులు ఆయనచుట్టు కూడిరి. అంతట వారు నీవు మమ్ములను ఎంత కాలము సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైన మాతో చెప్పుమనిరి.

10:25 యేసు మరల వారికి తాను చేసిన బోధయు, తాను నెరవేర్చిన కార్యములను వారి జ్ఞాపకమునకు తెచ్చెను. అనేకసార్లు వారికి తాను మెస్సీయనని చెప్పుకొనెను. ఆయన చేసిన అద్భుత కార్యములు ఆయనను ‘మెస్సీయ’గా నిరూపించినవి.

మరియు తాను చేసిన అద్భుత కార్యములు తండ్రియొక్క అధికారముతోను, ఆయన మహిమ కొరకు చేసినట్లుగా వారికి వివరించెను. ఆ విధముగా ఆయన చేయుటవలన తాను తండ్రియొద్దనుండి పంపబడితినని వారికి నిరూపించుకొనెను.

10:26 అయితే వారాయనను అంగీకరించలేదు గనుక వారాయన గొట్టెలుకారని తేలుచున్నది. వారాయనవారని తమ్మును తాము ప్రత్యేకించుకొనినచో, వారాయనను నమ్ముచున్నట్లుగా తమ అంగీకారమును చూపవలసినవారునై యున్నారు.

10:27 ప్రభువైన యేసుయొక్క నిజమైన గొట్టెలు ఎన్నటికి నశించవని తరువాయి వచనములు కొన్ని మనకు బోధించుచున్నవి. విశ్వాసియొక్క నిత్యత్వమంతటిలోని భద్రత ఒక మహిమాన్విత కార్యము.

క్రీస్తుయొక్క నిజమైన గొజ్జెలు ఆయన స్వరము వినును. సువార్త ప్రకటింపబడగా వినుట మరియు, వినినదానికి అనుగుణముగా ప్రతిస్పందించుట నిజమైన గొట్టెలు (విశ్వాసుల యొక్క లక్షణము. (ఆయనను అంగీకరించుట). దినము తరువాత దినము ఆయన స్వరమును వినుచు ఆయన వాక్యమునకు వారు విధేయులై యుందురు.

ప్రభువైన యేసు తన గొట్టెలను ఎరుగును. పేరుపేరున ఆయన తన వారిని ఎరుగును. ఎవరైనను ఆయనను దాటి పోజాలరు. (ఆయన గురిని తప్పిపోరు). ఆయనయొక్క అలక్ష్యము వలన గాని, నిర్లక్ష్యము వల్లగాని ఎవరు తప్పిపోరు. క్రీస్తు గొట్టెలు ఆయనను వెంబడించును. నిజమైన కాపరిని గుర్తించి, ఆయన అడుగుజాడలను అనుసరించును.

10:28 క్రీస్తు తన గొట్టెలకు నిత్యజీవమనుగ్రహించి యున్నాడు. దీనినిబట్టి ఎల్లప్పుడు ఉండునది నిత్యజీవమేనని తేలుచున్నది. వారి ప్రవర్తననుబట్టి ఈ జీవము అనుగ్రహింపబడియుండలేదు. ఇది నిత్యజీవము.

జీవితముయొక్క ప్రత్యేకతను చూపించుచున్నది. ఇది ప్రభువైన యేసు జీవితమే. ఆయన దేవునిగూర్చిన సంగతులను ఈ భూమిపై ఆనందించి, పరలోకమునకు అర్హమైన జీవితమును జీవించెను. ఈ మాటలను గమనించండి. “అవి ఎన్నటికిని నశింపవు.”

క్రీస్తు గొట్టెలు నశించి పోయినచో ప్రభువైన యేసు తనయొక్క వాగ్దానమునుండి తప్పిపోయినవాడుగా నుండును. గాని అది అసాధ్యము. అయితే ఆయన గొజ్జయైనది ఏదియు నరకములో నిత్యత్వమున గడపజాలదు.

అయితే దీనినిబట్టి ఒకడు మారుమనస్సు పొంది తన ఇష్టానుసారముగా జీవించవచ్చునా? వాడు రక్షింపబడి పాపయుక్తమైన లోకభోగము లందు జీవించవచ్చునా? వలదు. నిజముగా అట్టివాడు ఈ కార్యములను చేయువాడై యుండకూడదు.

వాడు తన కాపరిని అనుసరించ నాశగలవాడై యుండవలెను. మనము క్రైస్తవులుగా నుండుటకు క్రైస్తవ జీవితము జీవించలేము. లేదా రక్షణను నిలుపుకొనుటకు క్రైస్తవులుగా జీవించము గాని మనము క్రైస్తవులము గనుక క్రైస్తవ జీవితమును జీవించుదుము.

మన రక్షణ పోగొట్టుకొందుమేమోనను భయముతో పరిశుద్ధ జీవితము జీవించుట కాదుగాని మనకొరకు ప్రాణము పెట్టిన వానికొరకు కృతజ్ఞతతో పరిశుద్ధ జీవితమును జీవించుట కాశించుదుము. నిత్యత్వముయొక్క భద్రతనుగూర్చిన సిద్ధాంతము జీవితముపట్ల నిర్లక్ష్య వైఖరిని కలిగియుండుట కాదు గాని, పరిశుద్ధ జీవితము జీవించుటకు స్థిరమైన అభిప్రాయమును కలిగియుండుటయే. ఎవడును క్రీస్తు చేతిలోనుండి ఒక విశ్వాసిని అపహరింపలేడు.

ఆయన హస్తము అనంతమైన శక్తిగలది. ఆయన హస్తము ప్రపంచములను నిర్మించెను. 10:29 ఆ ప్రపంచములకు ఆయన ఆధారమైయున్నాడు. ఆయనయొద్దనుండి తీసివేయుటకు ఏ శక్తియు చాలదు. ప్రభువైన క్రీస్తు చేతిలోనేగాక. తండ్రిచేతిలో కూడ మనము ఉన్నాము. ఇది రెండింతలు క్షేమకరమైన వాస్తవము. తండ్రియైన దేవుడు అందరికంటే గొప్పవాడు గనుక ఆయన చేతిలోనుండి మనలను ఎవడును అపహరించ లేడు.గొట్టెల మంచి కాపరి (యోహాను 10:11) “నేనే ద్వారమును” (10:1-10) :10:30 ఇక్కడ ప్రభువు తన్ను దేవునితో సమానముగా చూపుచున్నాడు. నేనును నా తండ్రియు ఏకమై యున్నాము. అధికారములోను, శక్తిలోను తండ్రి, క్రీస్తు ఒక్కటే. గొట్టెలను కాపాడు శక్తిని గూర్చి ప్రభువు మాట్లాడుచుండెను. తన గొట్టెలను కాపాడుటలో తండ్రి కెంత శక్తిగలదో తనకు అంత శక్తిగలదని యేసు చెప్పుచున్నాడు. దైవత్వములోను ఆయన సమానుడేనని నిరూపించుచున్నాడు.

10:31 ప్రభువైన యేసుక్రీస్తు నిశ్చయముగా దేవుడైయుండి, ప్రతి విషయములోను తండ్రితో సమానుడు. రక్షకుడు చెప్పినదానికి యూదులకు ప్రశ్నవేయనగత్యము లేదు. వారిముందు తన దైవత్వమును ఆయన నిరూపించుకొనుచున్నాడు. ఆయనను చంపు టకు వారు రాళ్ళుఎత్తిరి.

10:32,33 వారు తనపై రాళ్ళు విసురుటకు ముందుగా తన తండ్రి ఆజ్ఞానుసారముగ వారి మధ్య చేసిన అద్భుత కార్యములను వారికి గుర్తుచేసెను. తాను చేసిన ఈ కార్యములలో దేనిని బట్టి తనను రాళ్ళతో కొట్టుచున్నారని అడిగెను.

అందుకు వారు నీవు చేసిన ఏ అద్భుత కార్యములకును మేము నిన్ను రాళ్ళతో కొట్టుటలేదు గాని, నీవు దేవునితో సమానముగా ఎంచుకొని, దేవదూషణ చేయుచున్నందుకు మేము నిన్ను రాళ్ళతో కొట్టెదమని చెప్పిరి.

ఆయన తాను దేవునిగా అనేకసార్లు నిరూపించు కొనుచున్నప్పటికి నీవు మానవునికంటె ఏ మాత్రము ఎక్కువైన వాడివి కాదని వారు వాదించుచుండిరి. వారు ఆయన దేవుడని చెప్పుటకు నిరాకరించుచుండిరి. వారు ఆయన దేవుడనని చెప్పుకొనుటకును సహించలేకపోయిరి.

10:34 కీర్తన 32:6 ను చూపించి అది వారి ధర్మశాస్త్రములో భాగమని చెప్పెను. అనగా దేవుని ప్రేరణతో ప్రవచింపబడిన పాత నిబంధన భాగమునుండి గ్రహింపబడిన దని వారికి చూపించెను. “మీరు దైవములనియు, మీరందరు సర్వోన్నతుని కుమారు లనియు నేనే సెలవిచ్చియున్నాను.”

కీర్తనకారుడు ఇశ్రాయేలీయులలోని న్యాయాధి పతులను ఈ కీర్తనలో సంబోధించెను. వారిని దైవములని పిలుచుటలో వారి దైవత్వమునుబట్టికాదు గాని, ప్రజలకు తీర్పుతీర్చుటలో దేవుని పోలియున్నారని చెప్పెను.

హెబ్రీభాషలో ‘దేవుడు’ ‘న్యాయాధిపతి’ అను రెండు అర్థములనిచ్చు ఒకే ఒక పదము గలదు. ఈ పదమునకు ‘శక్తిగలవాడని’ కూడ అర్ధము చెప్పవచ్చును. మనమా కీర్తన అంతయు చదివినయెడల వారు మానవులే కాని, ‘దేవుళ్ళు’ కారు అని తెలియు చున్నది. ఎందుకనగా వారు అన్యాయముగా తీర్పు తీర్చిరి. వ్యక్తులను వారి వారి గొప్పతనమునుబట్టి గౌరవించిరి అని చెప్పబడుచున్నది.

10:35 వాక్యమైయున్న దేవుడు ఎవరి యొద్దకు వచ్చెనో, వారిని దైవములని దేవుడు అనినట్లుగా ప్రభువు ఈ కీర్తనలోని భాగమును వారి గమనములోనికి తెచ్చియున్నాడు. వీరు దేవునికొరకు ప్రవచించువారునై యున్నారు.

ఇశ్రాయేలు జనాంగముతో వీరిద్వారా యెహోవా దేవుడు మాట్లాడెను. దేవునిచే అభిషేకింపబడిన వారై వారు తీర్పు తీర్చునపుడు అధికారము కల్గిన దేవుని ప్రత్యక్షపరచుదురు. పాత నిబంధనలోని లేఖన భాగములు దేవుని ప్రేరణచే కల్గినవని నమ్మిన ప్రభువు లేఖన ములు నిరర్ధకము కానేరవని చెప్పెను.

లేఖన భాగములు అమోఘమైనవిగానుండి నెరవేరినవిగాను తృణీకరింపబడనివిగాను ఆయన నమ్మెను. లేఖనములు దేవునివలన ప్రేరేపింపబడినవే గాని, అవి ఆలోచనలుగాని, ఉద్దేశములుగాని కానేరవు. ఇక్కడ ఆయన ఉద్దేశము అంతయు ‘దైవములను’ గూర్చియే.

10:36 ప్రభువు అల్పుడైన వాని దగ్గరనుండి గొప్పవానికొరకు తర్కము పెంచి యున్నాడు. అన్యాయస్థులైన పాత నిబంధన కాలపు న్యాయాధిపతులే దైవములని చెప్పబడగా తాను దేవుని కుమారుడనని ఎక్కువగా చెప్పుకొనుటకు అధికారము కలదని చెప్పెను.

దేవుని వాక్యము వారియొద్దకు వచ్చెను. ఆయనే దేవుని వాక్యమై యుండెను. వారు దైవములని పిలువబడిరి. ఆయన దేవుడైయుండెను. తండ్రి వారిని పవిత్రపరచి వారిని లోకములోనికి పంపెనని ఆయన చెప్పుటలేదు.

పడిపోయిన ఆదాము కుమారులవలె వారును ఈ లోకములో జన్మించినవారే. అయితే యేసు తండ్రియైన దేవునివలన పవిత్రపరచబడి నిత్యత్వమంతటిలో తండ్రితో నివసించుచు ఈ లోక రక్షకునిగా పరలోకమునుండి పంపబడెను.

కావుననే యేసు తాను అన్ని విషయములలో దేవునితో సమానునిగా చూపించుకొనుటకు అధికారము కలదు. తను తండ్రితో సమానునిగా చూపించుకొనుట వలన ఆయన దేవదూషణ చేయు చున్నాడని చెప్పజాలము. దేవునియొక్క ప్రవక్తలును, న్యాయాధిపతులపై అపవాదు వేయుచు యూదులు ‘దైవము’లను మాటను వాడుచున్నారు.

ఆయనే నిజమైన దేవుడు గనుక మరి నిశ్చయముగా తానే దేవుడనని యేసు మరింతగా దృఢపరచవచ్చునుగదా!

10:37 తాను చేసిన అద్భుత కార్యములన్నియు తనయొక్క దైవత్వమును దృఢపరచు చున్నదని రక్షకుడు మరల చెప్పెను. అద్భుతములు ఆయన దైవత్వమును నిర్ధారించుట కాదుగాని, “నా యొక్క తండ్రి పనులు” అనునది ముఖ్యమైనది.

దురాత్మకూడా కొన్ని అద్భుత కార్యములు చేయునట్లుగా మనము లేఖన భాగములలో చూచెదము. అయితే ప్రభువైన యేసు చేసిన అద్భుత కార్యము లేవనగా “ఆయనయొక్క తండ్రి పనులే.”

ఆ పనులు ప్రభువైన యేసును మెస్సీయ అని రెండింతల సాక్ష్యాధారములై యున్నవి. ప్రభువు ఈ భూమిపై గావించిన అద్భుతములు మెస్సీయ వచ్చినప్పుడు ఈ అద్భుతములు చేయునని పాత నిబంధనకాలములో ప్రవచింపబడెను.

ఆయన చేసిన అద్భుతములు కృపాకనికరములుగలవై ప్రజలకు మేలు కలిగించెను. ఈ విధమైన అద్భుతములు దుష్టుడు చేయజాలడు.

10:38 ఈ వచనమును గురించి ‘రైల్’ గారు ఉపయోగార్ధమై ఈ విధముగా చెప్పిరి. నేను నా తండ్రి పనులను చేయుచున్నయెడల, నా మాటలను బట్టిగాక, నేను చేయు పనులనుబట్టి ఒప్పుకొనుడి. నా మాటను నమ్మినయెడల నా పనులనుకూడ నమ్ముదురు.

దీనినిబట్టి నేనును, నా తండ్రియు ఏకమై యున్నామని నమ్ముడి, తండ్రి నాయందును నేను నా తండ్రియందును ఉన్నాము. గనుక నేను ఆయన కుమారుడనని చెప్పుకొనుటలో దేవదూషణ చేయుటలేదని చెప్పెను.

10:39 ఆయన గతములో ప్రస్తావించిన విషయములను తీసివేయక వాటినే బలపరచుచున్నాడని గ్రహించిరి. కనుకనే వారాయనను మరల పట్టుకొనజూచిరి. గాని వారి చేతినుండి ఆయన తప్పించుకొని పోయెను. ఆయన వారికి అప్పగించు కొనుటకు సమయము సమీపించినను, ఆ గడియ వచ్చియుండలేదు.

యేసు యోర్దాను అద్దరికి తప్పించుకొని పోవుట (10:40-42) : 10:40,41 _

ఆయన పరిచర్యను ప్రారంభించిన ప్రాంతమునకు అనగా యోర్దాను అద్దరికి వెళ్ళెను. మూడు సంవత్సరములుగా ఆయన మాట్లాడిన ఆశ్చర్యకరమైన మాటలు శక్తిగల కార్యములు ముగియనున్నవి. ఆయన ఎక్కడ తన పరిచర్య ప్రారంభిం చెనో అక్కడనే – అనగా ధర్మశాస్త్రపరమైన యూదా మతమునకు దూరముగా తిరస్క రింపబడిన స్థలము ఒంటరిగా విడువబడిన స్థలములో ముగించెను.

అయినను ఆయన దగ్గరకు అనేకులు వచ్చుచుండిరి. వారు నిజమైన విశ్వాసులు, ఆయన నిందను భరించు టకు తమ సిద్ధపాటును చూపించుచున్నారు. ఆయనలో నిందను భరించుటకును, మతమునకు దూరముగా నుండుటకు ఒప్పుకొన్నవారు.

ఈ అనుచరులు బాప్తిస్మమిచ్చు యోహానుకు ప్రశస్తమైన సాక్ష్యమిచ్చిరి. యోహానుయొక్క పరిచర్య వేడుకయైనది, జ్ఞానయుక్తమైనది కాదుగాని అది యథార్థమైనది, ప్రభువైన యేసును గురించి బాప్తిస్మమిచ్చు యోహాను ప్రవచించినదంతయు, ఆయన రక్షకుని పరిచర్య యందు నెరవేర్చెను.

గొట్టెల మంచి కాపరి (యోహాను 10:11) “నేనే ద్వారమును” (10:1-10) :

ఈ విషయము ప్రతి క్రైస్తవుని హృదయమును ప్రోత్సహించును. మనము శక్తివంతమైన అత్భుతకార్యములను చేయలేకపోవచ్చును, మనకు ప్రజాదరణ లేకపోవచ్చును గాని, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుకు నమ్మకమైన సాక్ష్యము కలిగియుందుము గాక ! ఇది దేవుని దృష్టిలో గొప్ప విలువ కలిగినది.

10:42 ఇశ్రాయేలు జనాంగముచే తృణీకరింపబడినప్పటికిని, ఆయనకు సాత్వికు లైన కొందరు స్వాస్థ్యముగా లభించుట చాలా ఆహ్లాదము కలిగించును. అక్కడ అనేకు లాయనను విశ్వసించిరి అని మనము చూచుచున్నాము.

ప్రతియుగమునందు ఇట్లే జరుగుచున్నది. దేవుని కుమారునియొక్క తియ్యని సహవాసమును అనుభవించుటకు ప్రభువైన యేసుతోకూడ నిందను భరించును, లోకముచే తృణీకరింపబడుటకు అసహ్యింపబడుటకు హింసింపబడుటకు అంగీకరించి ఆయనను హత్తుకొనియుండు టకు ఎల్లప్పుడు ఆయనకు ఈ భూమిపై కొంత శేషము ఆయనకుండెను.

ఆయన నా కన్నులు తెరచెను – Bible Verses Chapter 9 in Telugu

తొమ్మిదవ అధ్యాయము

ఆయన నా కన్నులు తెరచెను
(యోహాను 9:10)

ఆరవ సూచకక్రియ –
పుట్టు గ్రుడ్డివానిని బాగుచేయుట (9:1-12) :

9:1 యేసు దేవాలయమునుండి బయటికి వెళ్ళిన తరువాత (8వ అధ్యాయము లోని సంగతులు జరిగిన తరువాత) ఇది జరిగియుండెను. ఇది మానవునియొక్క పరిస్థితిలో దేవుడు చేసిన అద్భుత కార్యమును వివరించుచున్నది.

9:2 శిష్యులాయనకు ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్నవేసిరి. ప్రభువా ! వీడు పుట్టు గ్రుడ్డివాడుగా పుట్టుటకు కారణము వీడు చేసిన పాపమా? లేక వీడి తల్లిదండ్రులు చేసిన పాపముద్వారానా అని అడిగిరి.

వీరికి పునర్జన్మయందు నమ్మకమున్నదా? వీడు పుట్టిన తరువాత చేయు పాపములను దేవుడు ఎరిగియుండి, వీనిని గ్రుడ్డివానిగా పుట్టించెనా? వాని గ్రుడ్డితనము వారి కుటుంబములోని పాపమునకు కారణము అని వారు తలంచిరి.

కాని అట్లు కాదు. రోగము, బాధ మరియు మరణము పాపము వలన లోకములోనికి వచ్చెనను మాట నిజమైనను, ఒకవ్యక్తి తాను చేసిన పాపములకు బాధపడుచున్నాడనునది వాస్తవమైనది కాదు.

9:3,4 వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివానిగా పుట్టెనని యేసు చెప్పెను. ఈ మనుష్యుడు పుట్టకమునుపే ఆ గ్రుడ్డికళ్ళను తాను బాగుచేయగలనని యేసుకు తెలి యును.

Read and Learn More Telugu Bible Verses

తాను సిలువ వేయబడక మునుపు మూడు సంవత్సరములు పరిచర్య చేయవలె ననికూడ తెలియును. ప్రతి క్షణము ఆయన దేవుని మహిమార్థమై పరిచర్యచేయవలసి యున్నది. పుట్టినప్పటినుండి గ్రుడ్డివాడుగా నుండిన ఒకడు ఇచ్చట కలడు.

అది సబ్బాతు దినము ఐనప్పటికి, ప్రభువైన యేసు అతని స్వస్థపరచి అద్భుతము చేయవలసి యున్నది. ప్రభువైన యేసు బహిరంగముగా చేయు పరిచర్య ముగియవలసియున్నది.

మరియు ఈ విధమైన అద్భుతములు జరిగించుటకు ఆయన ఈ భూమిపై వుండువాడు కాడు, పగటికాలము గతించిపోయి రాత్రి సమయము ఆసన్నమగుచున్నదను ఒక గంభీరమైన సత్యమును ఇది మనకు తెలియజేయుచున్నది. అనగా మన పరిచర్య కాలము సమీపించుచున్నది. అంగీకరింపబడురీతిలో ప్రభువు మనకిచ్చు సమయమును ఆయన మహిమార్థమై వినియోగపరచుదుము గాక !

9:5 యేసు ఈ లోకమునందున్నపుడు ఒక ప్రత్యేకమైన మరియు నిజమైన వెలుగై యుండెను. ఆయన అద్భుతములు చేసెను. మరియు పరలోక రాజ్యమును గురించి బోధించెను. ఈ లోకమునకు నిజమైనవెలుగు ఆ ప్రజల ముందుండెను. యేసు ఇంకనూ ఈ లోకమునకు వెలుగైయున్నాడు, కనుకనే ఆయనను వెంబడించువాడు చీకటిలో నడువడని ఆయన వాగ్దానము చేసెను. ఈ వాక్యములో భూమిపై ఆయన జరిగించుచున్న బహిరంగ పరిచర్యనుగురించి మాట్లాడెను.

ఆరవ సూచకక్రియ - పుట్టు గ్రుడ్డివానిని బాగుచేయుట (9:1-12) :

9:6 యేసు ఎందునిమిత్తమై ఉమ్మి నేలపై వేసి, ఆ బురదతీసి అతని కండ్లకు పూసెనో మనకు చెప్పబడలేదు. కొంతమంది – ఆ పుట్టు గ్రుడ్డు వానికి కనుగ్రుడ్లులేని కారణమున ప్రభువు వాటిని అప్పుడు ఏర్పరచెనని చెప్పుదురు. లోక దృష్టికి తృణీకార మైన దానిని దేవుడు ఉపయోగించుకొనునని మరొకరు చెప్పుచున్నారు. గుర్తింపులేని బలహీనమైన విషయములనే తన కార్యము సఫలపరచుటకు ప్రభువు వాడుకొనును. ఆత్మీయముగా గ్రుడ్డివారైయున్నవారికి చూపునిచ్చుటకు దుమ్ముతోను, మట్టితోను చేయబడిన స్త్రీ, పురుషులను ప్రభువు వాడుకొనుచున్నాడు.

9:7 పుట్టు గ్రుడ్డువాని విశ్వాసమును పరీక్షించు నిమిత్తము యేసు వానిని సిలోయ మను కోనేటికి వెళ్ళి కడుగుకొనుమని చెప్పెను. వానికి ఆ కోనేరు ఎచ్చట ఉన్నదో తెలియదు. గనుక తనకు చెప్పబడినట్లు చేయగలడు. “సిలోయము” అనగా పంపబడిన వాడని బైబిలు చెప్పుచున్నది.

ఇది పంపబడిన ‘మెస్సీయ’ను సూచించుచుండవచ్చును. ఈ అద్భుత కార్యమును జరిగించినవాడు తండ్రివలన యీ లోకమునకు పంపబడిన వాడు. ఆ గ్రుడ్డివాడు వెళ్ళి ఆ కోనేటిలో కండ్లు కడుగుకొని చూపుపొందెను. అంతకు పూర్వము అతడు ఏమియు చూచియుండలేదు.

ఈ అద్భుతము తృటికాలములో జరిగినది. వెంటనే తన కండ్లను ఉపయోగపరచుకొనగలిగెను. అతడు చూడగలిగెను. అతనికి ఆ మొదటి చూపు తాను జీవించుచున్న ఈ లోకమును చూచినప్పుడు ఎంతటి ఆనందమును కలిగించెనో !

9:8 గ్రుడ్డివాని స్నేహితులందరు ఈ కార్యమునుచూచి ఉలిక్కిపడిరి. ఇంతవరకు గ్రుడ్డివానిగానుండి భిక్షమెత్తుకొనినవాడు ఇతడు కాదా ! అనుకొనిరి. (ఒకడు రక్షింప బడుటకూడా ఇట్లే. మన ఇరుగుపొరుగువారు మనలోని మార్పును గుర్తించ గలుగ వలెను).

9:9 కొంతమంది అతడే అనిరి. కొంతమంది అతడు కాడనిరి. అతనివలె ఉన్నా డనిరి. అతడైతే వారందరి అనుమానము తీరునట్లుగా తాను అంతకు మునుపు గుడ్డివాడుగానుండి ఇప్పుడు చూచుచున్నవాడనని చెప్పెను.

9:10 యేసుచేసిన అద్భుత కార్యములు అనేకరకములైన ప్రశ్నలను రేకెత్తించును. తరచుగా యీ ప్రశ్నలు ఒక విశ్వాసి ప్రభువుకొరకు సాక్ష్యమిచ్చుటకు ఉపయోగపడును. అసలు ఇదెట్లు జరిగెనని ప్రజలతనిని అడిగిరి. అందుకతని సాక్ష్యము సామాన్యము గాను, వారిని ఒప్పింపజేయునదిగా నుండెను.

9:11 తన్ను స్వస్థపరచిన వానికి ఘనతను చేకూర్చునట్లుగా తన స్వస్థతను గురించిన వాస్తవములను వారికి వివరించుచుండెను. అంతవరకు తన్ను స్వస్థపరచినది ప్రభువైన యేసు అని అతడు గుర్తించలేదు. అయితే అతడు ఆయనను ఒక సామాన్యమైన వ్యక్తిగా సంబోధించెను. తరువాత అతడు యేసు ఎవరో తెలిసికొనెను.

బాగుపడిన గ్రుడ్డివానిని ప్రశ్నించువారు యేసు ఎక్కడ ఉండెనో తెలిసికొనగోరిరి. మనము ప్రభువైన యేసుక్రీస్తును గురించి సాక్ష్యమిచ్చునపుడు ఇతరుల హృదయములలో ఆయనను గూర్చిన ఆసక్తిని కలిగింపవలసి యున్నాము.

యూదులనేకులాయనను వ్యతిరేకించుట (9:13-41) :

9:13-14 జరిగిన సూచకక్రియయందాసక్తి కల్గిన యూదులు గ్రుడ్డివానిని పరిసయ్యుల యొద్దకు తీసికొని వచ్చిరి జరిగిన విషయమై యూదుల అధికారులు ఎంత ఆగ్రహించిరో వారికి తెలియలేదు. యీ అద్భుతకార్యము యేసు సబ్బాతు దినమందు చేసెను. సబ్బాతుదినమున కనికరమైన కార్యములను చేయుటకు దేవుడు అభ్యంతరపరచడను విషయమును వారు గుర్తింపరైరి.

9:15 ఇప్పుడా గ్రుడ్డివానికి ‘యేసు’ నుగూర్చి సాక్ష్యమిచ్చుటకు మరొక అవకాశము లభించెను. పరిసయ్యులు వానిని నీవెట్లు చూపు పొందితివని అడిగి, మరొకసారి ఆ వృత్తాంతమును వారు వినిరి.

అయితే వాడీసారి యేసు అను పేరు చెప్పకయే ఆ వృత్తాంత మును వివరించెను. ఆ విధముగా అతడు చెప్పుటకు భయపడి కాదుగాని, ఆ అద్భుత కార్యమును ఎవరు చేసిరో అందరికి తెలిసియుండుటచే తానట్లు చెప్పెను. ఆ సమ యమునకు యేసునుగూర్చిన సమాచారము యెరూషలేమునందంతట వ్యాపించెను.

9:16 యేసు ఎవరు ? అను సమస్య బయలుదేరెను. ఆయన సబ్బాతు దినమును ఆచరించలేదు గనుక అతడు దైవికవ్యక్తి కాదనిరి. మరికొందరు పాపాత్ముడైన మనుష్యు డిట్టి గొప్ప కార్యములు చేయలేడనిరి, కొన్ని సందర్భములలో ప్రజలలో భేదమును కలిగించువాడు యేసు. ప్రజలలో రెండు గుంపులేర్పడినవి. అవేవనగా యేసును వెంబడించువారు, యేసును వ్యతిరేకించువారు.

9:17 నీవు యేసును గూర్చి ఏమి తలంచుచున్నావని పరిసయ్యులాగ్రుడ్డి వానిని అడిగిరి. యేసు దేవుడని వాడు గుర్తించలేదుగాని, వాని యొక్క విశ్వాసము యేసును ఒక ప్రవక్తగా గుర్తించగలిగెను. అయితే వాడు ఆయన దేవుడు పంపిన వ్యక్తియనియు. ఆయనయొద్ద దైవికమైన వర్తమానము కలదని నమ్మెను.

ఆయన నా కన్నులు తెరచెను Bible Verses Chapter 9

9:18 జరిగిన యీ అద్భుత కార్యమును జరిగినట్లుగా యూదులు, పరిసయ్యులు ఒప్పుకొనుటకు అంగీకరించలేదు. కనుక వారు ఆ గ్రుడ్డివాని తల్లిదండ్రులను పిలువ నంపించి వారేమి చెప్పుదురోయని కనిపెట్టిరి.

9:19 సాధారణముగా ఒక బిడ్డ గ్రుడ్డివానిగా పుట్టినయెడల వాని తల్లిదండ్రులు కంటే ఎవరికి ఎక్కువ తెలియును? గనుక వారి సాక్ష్యము నమ్మదగినది. కనుక వారు వీడు మీ కుమారుడేనా? అయితే వీడెట్లు చూపు పొందెనని యడిగిరి.

9:20 – 22 వారు – వాడు తమ కుమారుడేనని ఒప్పుకొనిరి. ఎందుకనగా కొన్ని ఏళ్ళ తరబడి వాని గ్రుడ్డితనమును కృంగిన హృదయములతో భరించిరి. అంతకు మించి వారు చెప్పుటకు భయపడిరి.

తమ కుమారునికి చూపు ఎట్లు వచ్చినదో తెలియదనియు, మరియు ఎవరు చూపు అనుగ్రహించిరో తెలియదనియు చెప్పిరి. పరిసయ్యులను మరల తమ కుమారునే అడుగుమనిచెప్పిరి. ఎందుకనగా తనకు జరిగినదంతయు వాడు చెప్పగలడని చెప్పిరి.

ఎందుకనిన యేసు మెస్సీయ అని ఎవరైనను ఒప్పుకొనిన, వారిని సమాజమునుండి వెలివేయుదుమని యూదులు నిర్ణయించి యుండిరి. వెలివేయుట అనునది యూదులకు చాలా తీవ్రమైన సంగతి, అంతటి క్రయమును వారు చెల్లించనిష్టపడరు. తమ జీవనాధారమును పోగొట్టు కొనుటయేగాక, యూదామత సాంప్రదాయములను కోల్పోవుదురు.

9:23 ఇది వారి హృదయములలోనున్న గొప్ప భయాందోళన గనుక వారి ప్రశ్నకు సమాధానమును తమ కుమారునే అడుగమని తప్పించుకొనిరి.

యూదులనేకులాయనను వ్యతిరేకించుట (9:13-41) :

9:24, 25 “దేవునికి స్తుతి చెల్లించుడి” అను పదమునకు రెండు అర్థములు కలవు మొదటిగా నిదియొక ప్రమాణము. కనుకనే పరిసయ్యులు “నీవిప్పుడు సత్యమును చెప్పవలయును” “ఆ మనుష్యుడు పాపియని మాకు తెలియును,” జరిగిన ఈ అద్భుత కార్యమునకు దేవునికే మహిమ చెల్లునుగాని యేసును వారు పాపాత్ముడని తలంచుటకు మరియు ఆయనకెట్టి ఘనత చెందకూడదనియు వారి అభిప్రాయము.

పరిసయ్యులు ప్రతి సమయమందును ఓటమిని రుచిచూచుచుండిరి. ప్రతి సమయమందును వారు యేసుకు అపకీర్తి కలుగజేయుటకై ప్రయత్నించుచుండగా, వారి ప్రయత్నములన్నియు నిష్ప్రయోజనమై ఆయనకు మహిమను చేకూర్చుచుండెను.

వాని సాక్ష్యము బహుచక్కగా నుండెను. వానికి యేసునుగూర్చి ఎక్కువగా తెలియక పోయినను, ఒకటి తెలియును. అదేమనగా ఒకప్పుడు తాను గ్రుడ్డివాడు. ఇప్పుడు చూచుచుండెను. ఈ సాక్ష్యమును ఎవ్వరు తిరస్కరింపలేనిది.

ఇట్లే తిరిగి జన్మించిన వాని విషయములో నుండవలసినది. “నేను ఒకప్పుడు నశించితిని, ఇప్పుడైతే ప్రభువైన యేసు కృపనుబట్టి రక్షింపబడితిని.” అని నీవు చెప్పినప్పుడు లోకము నిన్ను అనుమానించ వచ్చును; వెక్కిరింపవచ్చును; తిరస్కరింపవచ్చును !

9:26 – 28 మరల పరిసయ్యులు అదే ప్రశ్నవేసి వానిద్వారా సమాధానము (విన నాశించిరి) వివరముగా విననాశించిరి. గతములో గ్రుడ్డివానిగానుండి చూపుపొందిన ఆ వ్యక్తి విసుగు జెందెను. వాడు తాను వాస్తవము చెప్పినను వారు నమ్మలేదని వారికి మరల గుర్తుజేసెను.

మీరు మరల ఎందుకు వినగోరుచున్నారు? మీరు ఆయన శిష్యులు కాగోరుచున్నారా? అని ఆ గ్రుడ్డివాడు వారిని అడుగుటలో వాస్తవముగా వారిని అపహసించెనని చెప్పవచ్చును. ఎందుకనగా పరిసయ్యులు యేసును ద్వేషించు చున్నారనియు వారతనిని వెంబడించుటకు ఇష్టపడరనియు ఆ గ్రుడ్డివానికి తెలిసినది.

“నీవు ఒకని ఇష్టపడనియెడల వానిని దూషింతువు” అదియే ఇక్కడ జరిగినది. పరిసయ్యులు వాడిచ్చు సాక్ష్యమును బలహీనపరచలేకపోయిరి. గనుక అతనిని దూషించిరి. అతడు యేసు శిష్యుడగుట ప్రపంచములో అదియొక నీచమైన సంగతియై నట్లు దూషించిరి. మరియు వారు మేము మోషే శిష్యులమని ఎంతో గొప్పగా చెప్పుకొనిరి.

9:29 పరిసయ్యులు “దేవుడు మోషేతో మాట్లాడెననియు, వీడెక్కడనుండి వచ్చెనో మాకు తెలియదనియు” యేసును దూషించిరి. వారు మోషేను విశ్వసించినయెడల ప్రభువైన యేసును అంగీకరించియుందురు. అయితే మోషే పుట్టుగ్రుడ్డువానికి ఎప్పుడైనను కండ్లు తెరచినట్లుగా చెప్పబడెనా? లేదు! అయినప్పటికి మోషేకంటే గొప్పవాడు వారి మధ్యనుండెను. అయితే వారికావిషయము తెలియపరచబడలేదు.

యూదులనేకులాయనను వ్యతిరేకించుట (9:13-41) :

9:30-33 పరిసయ్యులు ఊహించని రీతిలో కన్నులు తెరవబడిన గ్రుడ్డివాడు వారికి సమాధానమిచ్చి వారికి జ్ఞానమును బోధించుచున్నాడు. వారు ఇశ్రాయేలు దేశములో పాలించువారు మరియు యూదులకు బోధకులునై యుండియు, పుట్టుగ్రుడ్డు వానికి కండ్లు ఇచ్చుటకు శక్తిగలవాడు వారి మధ్యనుండగా ఆయన ఎక్కడి నుండి వచ్చెనో వారికి తెలియక పోవుట ఆశ్చర్యమే.

ఇది సిగ్గుకరమైన సంగతి, గ్రుడ్డివాడు సాక్ష్యమిచ్చుటలో ధైర్యము కలిగియుండెను. అతని విశ్వాసము అభివృద్ధి చెందు చుండెను. వారికొక ముఖ్య సందేశమును గుర్తుచేయుచుండెను. అదేదనగా దేవుడు పాపుల మనవి ఆలకింపడనియు, పాపిద్వారా ఇట్టి అద్భుత కార్యము జరిగింపడనియు, చెప్పెను.

ఆయన దుర్మార్గులను అంగీకరింపడనియు, శక్తివంతమైన పనులు చేయుటకు అట్టివారికి అధికారము అనుగ్రహించడనియు చెప్పెను. కాగా దేవుని ఆరాధించువారే దేవునియొక్క అధికారమును, ఆమోదమును పొందుదురని చెప్పెను.

ఈ గ్రుడ్డివాడు, ప్రపంచములో పుట్టు గ్రుడ్డుగా పుట్టి చూపు పొందిన వారిలో తానే మొదటి వాడని గ్రహించెను. ఇంతటి మహత్తర కార్యమును గాంచిన పరిసయ్యులు ఈ కార్యము జరిగించిన వానిలో తప్పు వెదుకుటకు కారణమేమో ఆ గ్రుడ్డివానికి బోధపడలేదు. ప్రభువైన యేసు దేవునికి చెందినవాడు కాని యెడల యీ అద్భుత కార్యమును చేయగలిగి యుండెడివాడు కాదు.

9:34 యూదులు మరల ఆయనను దూషించుట ప్రారంభించిరి. వాని గ్రుడ్డితనము కేవలము “పాపము” వలననే సంప్రాప్తమాయెననునది పరిసయ్యుల తప్పుడు అభిప్రాయము. ఒక గ్రుడ్డివానికి పరిసయ్యులకు బోధించు అధికారము కలదా? అధికారము కలదనుమాట సత్యమే.

“ఉన్నత స్థితిగల్గిన విద్యాధికులద్వారా కన్న అతి సామాన్యుడైన ఒక సహోదరునిద్వారా పరిశుద్ధాత్ముడు బోధించును” అని ‘రైల్’ చెప్పెను. వారతనిని వెలివేసిరని మనము చదువుదుము. అనగా వారతనిని సమాజమందిరము నుండి (వెలివేసిరి) వెళ్ళగొట్టిరి. యూదుల మతమునుండి తోలివేసిరి. వెలివేయుటకు ఆధారభూతమైన అంశమేమి? గ్రుడ్డివాడైన మనుష్యుడు సబ్బాతుదినమున చూపు పొందుట మరియు, తనకిట్టి అద్భుతకార్యమును చేసిన వ్యక్తిని గురించి చెడుగా మాట్లాడకపోవుటయే!

9:35-38 యేసు వానిని ఇప్పుడు కనుగొనెను. “నిన్ను వారు చేర్చుకొనని పక్షమున, నేను నిన్ను చేర్చుకొందును” అని చెప్పెను. యేసు నిమిత్తము వెలివేయబడిన వానికి నష్టములేదుగాని, ఆయనే వానిని ఆహ్వానించును గనుక ఆయన సహవాసములో ఆశీర్వాదముండును.

ప్రభువైన యేసు వానిని తనవైపు ఆకర్షించుకొని వాని విశ్వాస మునుబట్టి తనను దేవుని కుమారునిగా ప్రత్యక్షపరచుకొనెను. నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా? అని అడిగెను. అతడు బాహ్యముగా చూపు పొందినను, ఆత్మీయమైన కనుదృష్టి పొందనవసరముండెను.

అయితే ప్రభువా! నేను దేవుని కుమారునియందు విశ్వాసముంచుటకు ఆయన ఎవరు? అని వాడు అడిగెను ‘ప్రభువా’ అని అతడు సంబోధించినను అతడు సామాన్యముగా ఆయనను ‘అయ్యా’ అని పిలిచెను. ఇప్పుడు ప్రభువైన యేసు తన్ను తాను దేవుని కుమారునిగా ప్రత్యక్ష పరచుకొనెను.

ఈ అసాధారణమైన కార్యమును చేసినది ఒక సామాన్య మానవుడు కాదనియు వానికి కంటిచూపు ఇచ్చినది మానవమాత్రుడు కాదనియు, ఆయనే దేవుని కుమారుడనియు, “ఆయనను నీవు చూచుచున్నావనియు, ఆయనతో మాట్లాడుచున్నా” వనియు అతనితో చెప్పెను.

వెంటనే ఆ గ్రుడ్డివాడు ప్రభువైన యేసునందు విశ్వాస ముంచి, ఆయనకు సాగిలపడి నమస్కరించెను (ఆరాధించెను). అతడిప్పుడు రక్షింప బడినవాడును, స్వస్థతనొందినవాడునై యుండెను.

అతని జీవితములో ఆ దినమెంత ధన్యకరమైనది ! అతడు శారీరక, ఆధ్యాత్మిక దృష్టిని పొందెను. అతడు ప్రభువైన యేసును దేవుని కుమారునిగా గుర్తించనంత వరకు ఆయనను ఆరాధించలేదు అని మనము గమనించవలెను.

యూదులనేకులాయనను వ్యతిరేకించుట (9:13-41) :

తెలివిగల యూదునివలె ఇతనొక సామాన్య మానవుని ఆరాధించలేదు. తనను స్వస్థపరచినవాడు ‘దేవుడు’ అని గుర్తించినప్పుడే ఆయనను ఆరాధించెను. ఆయన చేసిన కార్యమునకు ఆయనకు మ్రొక్కలేదు గాని, ఆయన దేవుని కుమారుడని తెలిసినప్పుడే మ్రొక్కెను.

9:39 ఈ వాక్యము చూచుటతోడనే యోహాను 3:17 వాక్యమునకు భిన్నాభి ప్రాయము కలిగించినట్లగుపించును. “దేవుడు తీర్పు తీర్చుటకు తన కుమారుని లోకము లోనికి పంపలేదు” క్రీస్తు ఈ లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని, రక్షించుటకే వచ్చెను.

అయితే ఆయనను అంగీకరింపనివారికందరికి ఆ తీర్పు అనివార్యమైనది. సువార్తను ప్రకటించుటవలన మనము రెండు ఫలితములు జూచెదము. అవేవనగా మేము సరిగా చూడలేకపోవుచున్నామని చెప్పువారు దృష్టి పొందుదురు. ప్రభువైన యేసు లేకయే మేము బాగుగా చూచుచున్నామని చెప్పువారు గ్రుడ్డివారుగా మిగిలి పోవుదురు.

9:40,41 పరిసయ్యులలో కొందరు యేసు తమయొక్క గ్రుడ్డితనమునుగురించి మాట్లాడుచున్నాడని గ్రహించిరి. అందుకు వారు మేము గ్రుడ్డివారమా అని ఆయనను అడిగిరి. మేము గ్రుడ్డివారము కాము అని చెప్పిరి. అప్పుడు ప్రభువు వారితో మీరు గ్రుడ్డివారనియు, పాపులనియు.

మీకు రక్షకుడు అవసరమనియు మీరు ఒప్పుకొనిన యెడల మీరు క్షమింపబడి రక్షింపబడుదురు. అయితే మీరు మేము నీతిమంతుల మనియు మాకు పాపము లేదనియు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపములు క్షమించబడలేదు.

యేసు – ‘మీలో పాపము లేదని’ చెప్పుటలో వారు పాపరహితులని చెప్పలేదు గాని, మీ పాపము నిలిచియుండదని సాదృశ్యముగా చెప్పెను. (మెస్సీయను గుర్తించకపోవుటవలన తాము గ్రుడ్డివారమని ఒప్పుకొనని యెడల తాము చూచుచూ దేవుని కుమారుని గుర్తించకపోవుటవలన కలుగు పాపమునకు మిష లేదు).

వారు ఆయనను మెస్సీయగా గుర్తించుటలో తప్పిపోయినందుకు తమకున్న గ్రుడ్డితనమును గూర్చి ఒప్పుకొనినయెడల వారి పాపమేలాగు క్షమింపబడునో ఆలాగే తాము చూచుచూ ఆయనను దేవునికుమారునిగా గుర్తించలేనప్పుడు కలుగు పాపమును క్షమింపబడును.

క్రీస్తు – లోకమునకు వెలుగు – Bible Verses Chapter 8 in Telugu

ఎనిమిదవ అధ్యాయము

క్రీస్తు – లోకమునకు వెలుగు

వ్యభిచారమునందు పట్టబడిన స్త్రీ (8:1-11) :

8:1 ఈ వచనము గత అధ్యాయంలోని చివరి వచనమునకు జోడించబడియున్నది. ఈ రెండు వచనములు కలిపి చదివినయెడల దీనిని మనము గ్రహించవచ్చును. ఎట్లనగా అంతట “ఎవరింటికి వారు వెళ్ళిరి, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను,” ప్రభువు చెప్పినమాట మనము జ్ఞాపకము చేసికొందము.

“నక్కలకు బొరియలును, ఆకాశపక్షులకు గూళ్ళుగలవు గాని, మనుష్యకుమారుడు తలవాల్చుటకు స్థలములేదు”.

8:2 ఒలీవల కొండ ఆ దేవాలయమునకు సమీపములో నుండెను. కావున ఉద యముననే ప్రభువు ఆ కొండదిగి కిద్రోను లోయదాటి ఆ దేవాలయముండిన పట్టణములోనికి ప్రవేశించెను. అప్పుడు గొప్ప జనసమూహమాయనను వెంబడించెను ఆయన వారితో కూర్చుండి, వారికి బోధించుచుండెను.

8:3,4 ఈ వచనములో మనముందు శాస్త్రులుండిరి. వీరు లేఖన భాగములను వ్రాసి, బోధించినవారు. పరిసయ్యులాయనను శోధించవలెనని ఆయన మీద నేరము మోపుటకు వారు వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తీసికొనివచ్చి ఆ జన సమూహముమధ్య నిలువబెట్టిరి. ఆమె ముఖము ప్రభువువైపునకు తిరిగియుండెను, ఆమెపై మోపిన నేరము వాస్తవమైనది, అనుమానము లేదు, ఆమె పాపము చేయు చుండగా పట్టబడెను.

Read and Learn More Telugu Bible Verses

8:5 వారి కుయుక్తి పెల్లుబికెను. ప్రభువు మోషే చెప్పిన మాటలు ధిక్కరించునని ఆశించిరి. వారు తలంచినది ఫలించినయెడల ఈ జనసమూహమంతయు ఆయనకు వ్యతిరేకముగా ఎదురు తిరుగునట్లు చేసియుండెడివారే.

ఎవరైనను వ్యభిచారమునందు పట్టబడినయెడల, అట్టి వారిని రాళ్ళురువ్వి చంపవలెనని మోషే ధర్మశాస్త్రమునందు వ్రాయబడినట్లుగా ఆయనకు గుర్తు చేసిరి. అయితే ప్రభువు ఈ విషయమునకు అంగీకరించడని కౄరులైన పరిసయ్యులు ఎరిగినవారై ఇప్పుడాయన ఏమి చెప్పునోయని ఎదురుచూచుచుండిరి. న్యాయమును, ధర్మమును, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమును ఆమె రాళ్ళతో కొట్టబడి చంపబడవలెనని చెప్పుచున్నది.

(అయితే డార్బి గారు ఇట్లు వాఖ్యానించిరి) “తనకంటే ఎదుటివ్యక్తి మరి ఎక్కువ చెడు స్వభావము గలవాడయి నప్పుడు అది మానవుని భ్రష్టహృదయమును ఆదరించును, నెమ్మదిపరచును. అట్టివాడు యెదుటివాని పాపమును తలంచుచు తనను తాను సమర్థించుకొనును క్షమించు కొనును. ఇతరులను దూషించినపుడు మరియు తీవ్రముగా నిందించునపుడు తనయొక్క చెడుగును మరచును, ఇట్లు తన అతిక్రమములందు ఆనందించును.” ఇది పరిసయ్యులపట్ల శాస్త్రులపట్ల డార్బి వ్యాఖ్యానమైయున్నది.

క్రీస్తు - లోకమునకు వెలుగు వ్యభిచారమునందు పట్టబడిన స్త్రీ (8:1-11) :

8:6 ప్రభువుపై నేరము మోపుటకు వారికేమియు దొరకలేదు గాని, నేరము మోపుటకు ప్రయత్నించుచుండిరి. ఆయన ఆ స్త్రీని పోనిచ్చినయెడల ఆయన మోషే ధర్మశాస్త్రమునకు అవిధేయుడనబడును; కనుక ఆయన అవినీతినిబట్టి వారాయనను నిందింపవచ్చును. ఒకవేళ ఆ స్త్రీని ఆయన మరణశిక్షకు అప్పగించినయెడల ఆయన కనికరము లేనివాడుగా నుండును. ఆయన వంగి నేలమీద ఏమో వ్రాయుచుండెను.

8:7 ఆయన వ్రాసినదేమో తెలిసికొనుటకు అవకాశమేలేదు. అసంతృప్తి చెంది యున్న యూదులు ఆయనను జవాబివ్వవలసినదిగా బలవంతము చేసిరి. కనుక ఆయన “పాపమునకు శిక్ష విధించవలసినదియే గాని, మీలో పాపములేని వాడు. ఆమెను శిక్షించవచ్చును” అని చెప్పెను. అట్లు ప్రభువు మోషే ధర్మశాస్త్రమును నెరవేర్చి, పాపము చేసినవారినందరిని గద్దించెను. ఇతరులకు తీర్పు తీర్చువారు మొదటిగా తమకు తాము శుద్ధులై యుండవలసియున్నది.

పాపమును క్షమించుటకు కొన్నిసార్లు ఈ వచనము వాడబడుచున్నది. మనము నిందకు దూరముగా నుంటిమి. ఎందుకనగా ప్రతి ఒక్కరును చెడ్డపనులనే చేయుచున్నారు. ఇది ఈ వచనముయొక్క ఉద్దేశ్యమై యున్నది. అయితే ‘పాపమునకు శిక్ష విధించకుండా సహించుట’ అనునది ఈ వచనముయొక్క భావము కాదు. వారు పట్టుబడక పోయినప్పటికి, పాపము చేసిన వారినందరిని ఈ వచనము ఖండించుచున్నది.

8:8 మరియొకసారి వంగి నేలమీద ఏమో వ్రాయుచుండెను. ప్రభువు ఏదైనను వ్రాసియుండెనని చెప్పుటకు ఇదియొక నిదర్శనముకాని, ఆయన వ్రాసినదేమోయది భూమిపైనుండి చెరిపివేయబడియుండెను. ఆ స్త్రీపై నేరారోపణ చేయువారందరు ఒప్పింపబడిరి. వారికి సమాధానము చెప్పుట కేమియు లేవు. ఒకని వెంట ఒకడు వారు వెళ్ళియుండిరి.

8:9 పెద్దవాడు మొదలుకొని చిన్నవానివరకు వారందరు అపరాధులే. యేసు ఒక్కడే అచ్చట నిలుచుండియుండెను. మరియు ఆ స్త్రీ మధ్యన నిలుచుండెను. అద్భుత మైన కృపకలిగిన ప్రభువైన యేసు ఆమెపై నేరారోపణ చేయువారందరిని కనబడక పోవునట్లుగా చేసెను. వారు మరెచ్చటను కానరారు. వారిలో ఒక్కడైనను ఆమెకు శిక్ష విధించుటకు తెగించలేదు.

8:10,11 “ఎవరును నీకు శిక్ష విధించలేదా?” అని ఆయన ఆ స్త్రీని అడిగెను. అందుకామె “లేదు ప్రభువా” అని జవాబిచ్చెను. ఇక్కడ ‘ప్రభువు’ (Lord) అను మాటకు ‘Sir’ అనునది గౌరవనీయ పదముగా వాడబడెను. “నేనుకూడ నీకు శిక్ష విధింపను, ఇకను వెళ్ళి పాపము చేయకుము” అని ప్రభువు ఆశ్చర్యకరమైన మాటలు ఆమెతో చెప్పెను.

ఇక్కడ ప్రభువు తన పౌర హక్కును వినియోగించుకొనలేదు. శిక్షించు అధికారము రోమా ప్రభుత్వముయొక్క అధికారమై యున్నది. ఆ అధికారము ఆయన వారికే వదలివేసెను. అయితే ఆయన ఆమెను ఇకను పాపము చేయకుమని ఈ సువార్తలోని మొదటి అధ్యాయమునందు “కృపయు, సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను” అని మనము చదివియుంటిమి.

దానికి ఉదాహరణగా మన మిక్కడ చూచుచున్నాము. అది ఏమనగా “నేనును నీకు, శిక్ష విధింపను” అని చెప్పుటలో “కృపయు” “ఇకను వెళ్ళి పాపము చేయకుము” అని చెప్పుటలో “సత్యమును” కలవు. “నీవు వెళ్ళి వీలైనంత కొద్దిగా పాపము చేయుమని” ఆయన చెప్పియుండలేదు. యేసుక్రీస్తు దేవుడు గనుక ఆయనకు పరిపూర్ణమైన పవిత్రత కావలసియుండెను. ఎంత స్వల్పమైన పాపమునైనను ఆయన అంగీకరింపడు, కనుకనే ఆయన దేవునికి కావలసిన పరిపూర్ణతను ఆమె ముందుంచెను.

“నేను లోకమునకు వెలుగునై యున్నాను” (8:12–20) :

మనము 20వ వచనములో చూచినట్లుగా దృశ్యము ఆలయములోని కానుకల పెట్టెనొద్దకు మార్చబడెను. గొప్ప జనసమూహము ప్రభువును వెంబడించుచుండెను. ఆయన వారివైపు తిరిగి, తాను మెస్సీయ యని ఋజువు చేసికొనుటకు ఒక నిర్వచ నమును నిర్వచించెను. “నేను లోకమునకు వెలుగైయున్నాను.”

లోకము పాపమనెడి చీకటిలోను, అజ్ఞానములోను, ఒక స్థిరమైన ఉద్దేశ్యము లేనిదిగా నుండెను. లోకమునకు వెలుగు “యేసు.” ఆయన లేకుండ పాపమనెడి చీకటినుండి విముక్తి కలుగదనియు, జీవితయాత్రలో కాపుదల ఉండదనియు, నిజ జీవితార్థము గ్రహించలేరనియు, నిత్య త్వముయొక్క ఫలితముండదనియు భావము. అయితే “యేసు” తన్ను వెంబడించువాడు చీకటిలో నడువక, జీవపు వెలుగు కలిగియుండుననియు వాగ్దానము చేసెను. యేసును వెంబడించుటయనగా యేసును (స్వీకరించుటయే) అంగీకరించుటయే.

చాలమంది తాము మారుమనస్సు పొందకయే యేసువలె జీవించ గల్గుదుమని చెప్పుదురు. కాని యేసును వెంబడించుటయనగా పశ్చాత్తాపముతో ఆయనయొద్దకు వచ్చి, ఆయనను ప్రభువుగాను, రక్షకునిగాను అంగీకరించుటయు విశ్వసించుటయు మరియు అటు తరువాత జీవితమును సమర్పించుటయైయున్నది. ఎవరైతే దీనిని చేయుదురో అట్టివారు తమ జీవితములో దేవుని కాపుదల కలిగియుండి, నిర్మలమైన, ప్రకాశవంత మైన నిరీక్షణ సమాధి అనంతరము కలిగియుందురు.

8:13 పరిసయ్యులు ఆయనతో ఒక న్యాయపరమైన (చట్టపరమైన విషయమునందు సవాలు చేయుచుండిరి. నీయంతటనీవే సాక్ష్యమును చెప్పుకొనుచున్నావని వారాయనతో అనిరి. ఒక వ్యక్తి స్వంత సాక్ష్యము నమ్మదగినది కాదు, ఏలయనగా మానవులు పక్షపాత వైఖరి కల్గియున్నవారు. యేసుయొక్క మాటలను పరిసయ్యులు నమ్మలేదు.

8:14-18 ఆయన మాటలు వాస్తవమైనవో కావోనని వారి అనుమానము. అయితే ఇద్దరు లేక ముగ్గురు మనుష్యుల సాక్ష్యము బలమైనదని యేసు గుర్తెరిగియుండెను. అయితే ఆయన విషయములో ఆయనిచ్చు సాక్ష్యము సత్యమైనది.

ఎందుకనగా ఆయన దేవుడై యుండెను. ఆయన పరలోకమునుండి దిగివచ్చి పరలోకమునకు వెళ్ళనైయుండెనని ఆయనకు తెలియును. అయితే ఆయన ఎక్కడనుండి వచ్చెనో, ఎక్కడికి వెళ్ళుచుండెనో వారికి తెలియదు.

ఆయన వారివలె ఒక సామాన్య మానవుడని తలంచుచుండిరి గాని అద్వితీయ కుమారుడనియు, తండ్రితో సమానత్వము గలవాడ నియు వారు గ్రహింపరైరి, వారు పై రూపమునుబట్టియు, వ్యక్తి గత జీవన విధానమును బట్టియు తీర్పు తీర్చుచుండిరి. వారాయనను వడ్రంగివాడైన, నజరేయుడైన యేసు అనియు, అయితే మానవులందరిలో ఆయన ప్రత్యేకమైనవాడనియు తలంచిరి.

తానెవరికి తీర్పు తీర్చుట లేదని ప్రభువు చెప్పెను. ఈ లోక సాంప్రదాయమును బట్టి పరిసయ్యులు తీర్పు తీర్చునట్లుగా ఆయన మానవులకు తీర్పు తీర్చుట లేదు. ఆయన మనుష్యులకు తీర్పు తీర్చుటకు ఈ లోకములోనికి రాలేదుగాని, వారిని రక్షించు టకే వచ్చెను.

ఆయన న్యాయాధిపతియైనప్పుడు ఆయన తీర్పు న్యాయమైనదిగాను, యథార్థమైనదిగాను ఉండును. ఆయన దేవుడైయుండి, ఆయన చేయునదంతయు ఆయనను పంపిన తండ్రితో ఏకీభవించి చేయును.

తండ్రితో తాను ఏకమైయున్నానని పరిసయ్యులతో ప్రభువు నొక్కినొక్కి చెప్పుచుండెను. ఈ మాట వారి హృదయములో ఆయనపట్ల ద్వేషమును రగిలించెను. మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఇద్దరిచ్చు సాక్ష్యమును ప్రభువు ధృవీకరించెను.

"నేను లోకమునకు వెలుగునై యున్నాను” (8:12–20) :

ఆయన మోషే ధర్మశాస్త్రమును తృణీకరించుచున్నట్లుగా ఏమియు మాటలాడలేదు. ఇద్దరి సాక్ష్యము కావలయునని వారు బలవంతము చేసినచో సాక్ష్యమిచ్చు ఇద్దరిని చూపించుట కష్టమైన పనికాదు. మొదటిగా తనయొక్క పాపరహిత జీవితమునుబట్టి తనంతటతానే నోటిమాటలతో సాక్ష్యమిచ్చుచుండెను.

రెండవదిగా పరలోకమందున్న తండ్రి బహిరంగముగా పరలోకమునుండి సాక్ష్యమిచ్చును. ప్రభువు చేయుటకిచ్చిన అద్భుతములనుబట్టియు సాక్ష్యమిచ్చుచుండెను. పాత నిబంధన గ్రంథ మందు మెస్సీయను గూర్చిన లేఖనములన్నింటిని ప్రభువైన యేసు నెరవేర్చెను. ఇంత బలమైన సాక్ష్యము కలిగియున్నప్పటికి యూద మతాధికారులు ప్రభువునందు విశ్వాస ముంచుటకు అంగీకరించుటలేదు.

8:19,20 పరిసయ్యులు తిరస్కారముతో ఆయనను “నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని” అడిగిరి. అందుకు ప్రభువు మీరు నన్ను గుర్తించి యుండలేదని వారితో చెప్పెను. మీరు నన్ను గుర్తించలేదు గనుక, నా తండ్రిని మీరెరుగరని వారితో చెప్పెను. (వారు తమయొక్క అజ్ఞానముతో దేవుని తృణీకరించిరిగాని, అది వాస్తవము). దేవుని గూర్చిన వారి అజ్ఞానమును వారు ఒప్పుకొనకపోయిరి. ఇది వాస్తవమే.

వారు ప్రభువైన యేసును స్వీకరించినయెడల తండ్రిని కూడ ఎరిగియుందురు. ప్రభువైన యేసుద్వారా తప్ప ఎవడును తండ్రియైన దేవుని ఎరుగడు. వారు ప్రభువును తృణీకరించుచున్నారు గనుక తాము తండ్రిని ఎరిగియున్నామనియు ప్రేమించుచున్నామనియు చెప్పుకొనుట అసాధ్యము. ఇది దేవాలయములోని కానుకల పెట్టెదగ్గర దృశ్యము. ప్రభువు దైవికముగా మరల ఇక్కడ తప్పింపబడెను.

ఆయనను పట్టుకొనుటకు ఎవరును ఆయనపై చేయి వేయుటకు తెగింపలేదు. ఎందుకనగా ఆయన సమయమింకను వచ్చియుండలేదు. సమయమనగా ఈ లోక పాపములకొరకు కలువరిలో మరణించుటకు సమయ మింకను రాలేదు గనుక ఆయనను పట్టుకొనుటకుగాని చంపుటకుగాని ఎవరును చేయివేయుటకు తెగింపలేదు.

యేసుతో యూదుల వివాదము (8:21 – 59) :

8:21 ప్రభువు మరల భవిష్యత్తును గురించి తనకుగల పరిపూర్ణ జ్ఞానమును తెలియ జేయుచున్నాడు. ఆయన తాను వెడలిపోవు సమయమాసన్నమైనట్లుగా చెప్పుచుండెను. అనగా తాను మరణించి, సమాధిచేయబడి, పునరుత్థానుడై తిరిగి లేచి ఆరోహణుడై పరలోకమునకు ఎక్కి వెళ్ళుదునని తెలియజేసెను.

అప్పుడు యూదులు ఆయన యీ లోకమునకు అరుదెంచి తిరిగి ఆరోహణుడయ్యెనని గుర్తింపక మెస్సీయ కొరకు ఎదురుచూచుదురు. వారాయనను తృణీకరించినందువలన తమ పాపములలోనే ఉ ండి మరణించి ప్రభువు వెళ్ళు పరలోకములో ప్రవేశింపనేరరు, ఇది ఒక గంభీరమైన సత్యము. ప్రభువైన యేసును అంగీకరించుటకు ఎదురాడు వారికి పరలోకము చేరుదుమన్న నిరీక్షణ ఉండదు. దేవుడు లేకుండ, క్రీస్తు లేకుండ, నిరీక్షణ లేకుండ ఒకడు తన పాపములో చనిపోయినయెడల అది ఎంత దౌర్భాగ్యమైన స్థితి !

8:22,23 పరలోకమునకు తిరిగి వెళ్ళుదునని ప్రభువు చెప్పు మాటలను యూదులు గ్రహించలేకపోయిరి. వెడలిపోవుటయనగా ఆయన వారు చేయు కుట్రలో నుండి తప్పించుకొనిపోయి తనకుతానే ఆత్మహత్య చేసికొనునా? అని తలంచుచుండిరి. వారికిది చాలా ఆశ్చర్యముగా నున్నది.

ఆయన అట్లు చేసికొనినయెడల వారాయనను వెంబడించుట తప్ప మరేదియు వారిని నివారింపజాలదు. అవిశ్వాస మనెడి చీకటికి ఇది మరియొక ఉదాహరణయై యున్నది. రక్షకుడు చెప్పునదేమో తెలిసికొనుటకు వారి అజ్ఞానము, నిర్లక్ష్యము ఆశ్చర్యమును కలిగించుచున్నది.

ఆయన తన్నుతానే చంపుకొనునని వారు అనుమానించుచుండిరని యేసు యెరిగి వారితో మీరు భూమిపై నుండువారనియు, కనుక మీ ఆలోచన, గ్రహింపు అక్షరార్థముగానే యుండునుగాని ఉన్నతమైన ఉద్దేశ్యములు కలిగియుండలేరనియు చెప్పెను.

వారు ఆత్మానుసారమైన గ్రహింపు లేనివారు, అయితే ప్రభువు పైనుండి వచ్చినవాడు. ఆయన ఆలోచనలు, మాటలు, కార్యములన్నియు పరలోక సంబంధమైనవే. ఆయన చేసినదంతయు లోకమును రక్షించుటకొరకే, ఆయన జీవించిన జీవితమంతయు తాను ఈ లోకమునకు వేరుగా పవిత్రమైన లోకమునుండి వచ్చియున్నాడని ప్రకటించుచున్నది.

8:24 యేసు తాను ఏదైనా ఒక విషయముయొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పదలిచి నప్పుడు దానిని మరల మరల ప్రస్తావించెడివాడు. కనుకనే ఆయన మీరు మీ పాపములలోనే చనిపోవుదురని వారిని మరల హెచ్చరించెను.

వారాయనను పూర్తిగా నిరాకరింప పూనుకొనిరి. వారి నిర్ణయమునకు తిరుగులేదు. ప్రభువైన యేసునకు వేరుగా నొకడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందడు, మరియు క్షమింపబడని పాపములతో నొకడు పరలోకములో ప్రవేశింపజాలడు. ‘ఆయన’ అను పదము ఈ వచనమునకు చెందినది కాదు. అయితే “నేను ఆయననని మీరు నమ్మనియెడల మీరు మీ పాపములోనే చనిపోవుదురు”. “నేను” (I am) అనునది ప్రభువైన యేసు యొక్క దైవత్వమును చూపించుచున్నది.

8:25 యూదులు పూర్తిగా విసుగుచెందిరి నీ వెవడవో చెప్పుమని ఆయనను సూటిగా ప్రశ్నించిరి. నీ వెవరనుకొనుచున్నావు? అన్నట్లుగా వారాయనను అపహాస్యము చేయుచు అడిగిరి. లేక తనను గురించి ఆయన ఏమి చెప్పుకొనునోయని తెలిసి కొనుటకు ఆతురముగా అడిగియుండవచ్చును.

ఆయన సమాధానము గుర్తింపదగినది. ఆయన “నేను మొదటినుండి ఎవడనని చెప్పుకొంటినో వానినే” యని వారితో చెప్పెను. ఆయన ఈ లోకములో తన పరిచర్యను ప్రారంభించినప్పటినుండి, వారికి వాగ్దానము చేయబడిన ‘మెస్సీయ’ తానేనని చెప్పుకొనుచుండెను.

ప్రభువు తరచుగా చెప్పు ఈ మాటను యూదులు వినుచుండిరి గాని, వారి కఠిన హృదయము ఈ సత్యమునంగీక రించుటకు విధేయత చూపించలేదు. యేసు ఇచ్చిన సమాధానము మరియొక మలుపు తిరిగెను. ఆయన బోధకు తగినట్లుగా ఆయన ఉండెను. ఆయన ఒకటి చెప్పి, మరొకటి చేయలేదు. తాను బోధించిన దానికి మూర్తిమత్వమునై యుండెను. ఆయన బోధకు ఆయన జీవితము సరిపోయినది.

8:26, 27 ఈ వచనముయొక్క భావము విపులముగా తెలియజేయబడలేదు. ఆయన తీర్పు తీర్చుటకు అవిశ్వాసులైన యూదులకు సంబంధించిన సంగతులనేకము కలవని ప్రభువు చెప్పుచుండెను. యేసు వారి హృదయములోని దుష్ట ఆలోచనలను, ఉద్దేశ్యము లను బయలుపరచగలడు.

అయినప్పటికి తండ్రి తనకు బోధించుమని ఇచ్చిన సంగతులను మాత్రమే ఆయన విధేయుడై బోధించుచున్నానని చెప్పెను. తండ్రి సత్యమై యున్నాడు గనుక ఆయనయందు విశ్వాసముంచుటకును ఆయన బోధ వినుటకును ఆయన చాలినవాడు అని చెప్పెను. యూదులాయనను గ్రహింపరైరి.

ప్రతి సమయ మందును వారికి మబ్బు (చీకటి) కమ్మియుండెను. ప్రభువైన యేసు గతకాలమందు తాను దేవుని కుమారుడనని చెప్పుకొనినపుడు తాను తండ్రియైన దేవునితో సమానునిగా ఎంచుకొనుచున్నాడనుకొనిరి. కాని అట్లెన్నటికి కాదు.

8:28 భవిష్యత్తును గురించి యేసు మరల ప్రవచించుచుండెను. మనుష్య కుమారుని వారు పైకెత్తుదురని ఆయన చెప్పెను. ఇది ఆయన పొందబోవు సిలువ మరణమును గూర్చి తెలియజేయుచున్నది.

వారు దానిని నెరవేర్చిన తరువాత ఆయనను మెస్సీయగా గుర్తింతురు. భూకంపమునుబట్టియు, చీకటినిబట్టియు తెలిసికొందురుగాని, మరి ముఖ్యముగా ఆయన పునరుత్థానమునుబట్టి తెలిసికొందురు. “అప్పుడు మీరు నేనే ఆయననని తెలిసికొందురు” అని ప్రభువు చెప్పిన మాటలను గమనించుడి.

“అనగా నేను దేవుడనని” తెలిసికొందురని దాని భావము. అప్పుడు వారు ఆయన తన స్వశక్తితో ఏమియు చేయలేదని తెలిసికొందురు. తన తండ్రి ఏమి బోధించునో వాటినే ప్రకటించుటకు ఆయన ఈ లోకములోనికి వచ్చెను.

8:29 తండ్రియైన దేవునితో ప్రభువుయొక్క సంబంధము చాల సన్నిహితమైనది. ఈ వచనములోని ప్రతిమాట తండ్రితో ఆయన సమానత్వమును తెలియచేయుచున్నది. ఈ లోకములో ఆయన పరిచర్య ప్రారంభించినప్పటినుండి తండ్రి ఆయనతో నుండెను.

ఏ సమయమందును యేసు ఒంటరిగా విడువబడలేదు. అన్ని సమయములయందును. తండ్రికి ప్రీతికరమగు కార్యములనే ఆయన చేయుచుండెను. పాపరహితుడైనవాడు “నేను ఎల్లప్పుడు నా తండ్రి ఆనందించు కార్యములను చేయుచున్నాను” అని చెప్ప ఏ గలడు. మానవ నైజముగల ఏ తల్లిదండ్రులైనను ఇట్లు చెప్పలేదు. మనము మనకు ప్రీతికలిగించు కార్యములను లేదా మన తోటి వారికి ప్రీతికలిగించు కార్యములను చేయుదుము. దేవునికి అత్యంత ప్రీతికరమైన కార్యములను ప్రభువైన యేసు ఒక్కడే చేయగలడు.

8:30 ఆయన మాటలాడుచుండగా అనేకులాయనయందు వివ్వాసముంచినట్లుగా చెప్పిరి. వారిలో కొంతమంది విశ్వాసము స్థిరమైనదేకాని మరికొందరు విశ్వాసము వారి పెదవులతో ఒప్పుకొనుటయే.

8:31 శిష్యులకు “నిజమైన శిష్యులకు” మధ్యగల భేదమును ఈ వచనములో ప్రభువు తెలియజేయుచున్నాడు. శిష్యుడు విద్య నభ్యసించువాడై యుండగా “నిజమైన శిష్యుడు” కచ్చితముగా తన్నుతాను క్రీస్తుకు సమర్పించుకొనువాడునైయున్నాడు.

నిజమైన విశ్వాసులు ఈ లక్షణమును కలిగియున్నారు. వారు ఆయన వాక్యమునందు ముందుకు సాగుదురు. అనగా ఆయన బోధ ప్రకారము జీవింతురు. మరియు వారు ప్రభువునుండి ఎంత మాత్రము తొలిగిపోరు నిజమైన విశ్వాసము ఎల్లప్పుడు “స్థిరత” అను గుణమును కలిగియున్నది. మనము ఆయన వాక్యమునందు సాగిపోవుటవలన రక్షింపబడలేదు. గాని,మనము రక్షింపబడి ఆయన వాక్యమునందు నిలిచియున్నాము.

8:32,33 ఒకడు సత్యము గ్రహించును. అప్పుడు సత్యము వానిని స్వతంత్రునిగా చేయునను వాగ్దానము ప్రతి నిజ విశ్వాసికి చేయబడినది. ఇట్టి సత్యమును యూదులు ఎరుగరు. అజ్ఞానము, దోషము, పాపము, ధర్మశాస్త్రము, మూఢభక్తి అనెడి భయంకర మైన దాస్యములో వారుండిరి. అయితే ప్రభువైన యేసును ఎందరు నిజముగా ఎరిగి యుండిరో వారు పాపమునుండి విమోచింపబడిరి.

వారు వెలుగులో నడుచుచున్నారు. అంతమాత్రమేగాక అనుదిన జీవితములో పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుచున్నారు. మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ప్రభువు చెప్పిన మాటలు యూదులుకూడ విని ఆ మాటలకు వెంటనే ప్రభువుపై కోపగించుకొనిరి. “మేము అబ్రాహాము సంతానము, మేమెవరికిని దాసులము కాలేదు” అని తమ్మును గూర్చి గొప్పలు చెప్పుకొనిరి. కాని అది నిజముకాదు.

యేసుతో యూదుల వివాదము (8:21 - 59) :

ఇశ్రాయేలీయులు ఒకప్పుడు ఐగుప్తు, అష్షూరు, బబులోను, పారశీక, గ్రీకు రాజులకు దాసులైయుండిరి. ఇప్పుడు రోమీయులకు దాసులైయుండిరి. కాని అన్నిటికంటే వారు పాపమునకు, సాతానుకు మరి ఎక్కువగా దాసులైయుండిరి. ఈ దాసత్వమును గూర్చియే ప్రభువు ఇక్కడ మాటలాడుచున్నాడు.

8:34 “పాపము చేయువాడు పాపమునకు దాసుడు” అని ప్రభువు ఆ ప్రజలకు జ్ఞాపకము చేయుచున్నాడు. మరియు యూదులు తాము మతాసక్తిగలవారివలె నటించిరి. కాని వాస్తవమునకు వారు నీతి బాహ్యులును, అమర్యాద పరులును, హంతకులునై యుండిరి. యీ సమయములోకూడ దేవుని కుమారుని చంప వెదకుచున్నారు.

8:35,36 ఒకే ఇంటిలో ఉన్న దాసునికిని కుమారునికిగల సంబంధము, వారి స్థితులను ప్రభువు ఈ వచనములో పోల్చి చెప్పుచున్నాడు. తాను ఎల్లప్పుడు యీ ఇంటిలో నివాసముచేయగలనను నిశ్చయత దాసునికి లేదు. కాని కుమారుడు ఎల్లప్పుడు నివాసము చేయును.

ఇక్కడ “కుమారుడు” అనుపదము దేవుని కుమారునికి మరియు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుటద్వారా దేవుని బిడ్డలుగా తీర్చబడినవారికి అన్వయించవచ్చునా? ఈ రెండింటిలో మనము దేనిని అంగీకరించినను యూదులు కుమారులు కాదుగాని దాసులేయని ప్రభువైన యేసు చెప్పుచున్నాడు.

ఆయనద్వారా స్వతంత్రులుగా చేయబడినవారు, నిజముగా స్వతంత్రులై యున్నారు. ఒక వ్యక్తి రక్షకుని యొద్దకు వచ్చినప్పుడు, అతడు ఆయననుండి నిత్య జీవమును పొందుచున్నాడు. అంతేగాక అతడు పాప దాస్యమునుండియు మూఢభక్తి నుండియు కట్టుబాట్లనుండియు స్వతంత్రుడుగా చేయబడుచున్నాడు.

8:37 శరీరరీత్యా యూదులు అబ్రాహాము సంతానమని ప్రభువు ఎరుగును. మేము అబ్రాహాము వంశమునకు చెందినవారము అని వారే చెప్పిరి. కాని అబ్రాహాముయొక్క ఆత్మీయ బీజము వారిలో లేదు. అబ్రాహాము వలె వారు దేవుని బిడ్డలు కారు. ప్రభువుయొక్క మాటలు తమ జీవితములలో గొప్ప ప్రభావము చూపునట్లు వారు వాటిని అంగీకరించలేదు. గనుక వారు ఆయనను చంప వెదకుచుండిరి. ఆయన మాటలను వారు త్రోసివేసిరి. ఆయన వాక్యమునకు వారి హృదయములలో తావులేదు.

8:38,39 గనుక ఆయనకు విధేయులు కాకపోయిరి. బోధించుటకు తన తండ్రి అప్పగించిన సంగతులనే యేసు వారికి బోధించెను. యేసు మాటలాడిన మాటలు తండ్రియైన దేవుని మాటలే. ఎట్లనగా ఆయనయు ఆయన తండ్రియు ఏకమై యుండిరి.

ప్రభువైన యేసు ఈ లోకములో ఉన్నప్పుడు తన తండ్రిని గూర్చి సంపూర్ణముగా తెలియజేసెను. కాని యూదులు తమ తండ్రియొద్ద నేర్చుకొనిన కార్యములనే చేసిరని ప్రభువు చెప్పెను. అనగా యూదులయొక్క తండ్రి అపవాదియనియేగాని భూసంబంధ మైన తండ్రియని ప్రభువుయొక్క భావముకాదు.

అబ్రాహాముతో తమకుగల సంబంధ మును ప్రస్తావించుచు అబ్రాహాము తమ తండ్రియని మరియొకసారి అతిశయ ముగా చెప్పుకొనిరి. అయితే అబ్రాహాము పిల్లలకు ఉండవలసిన లక్షణములు వారిలో లేవని ప్రభువు వారితో చెప్పెను. సహజముగా పిల్లలయొక్క చూపు, నడక, మాట తమ తండ్రిని పోలియుండును, కాని యూదులు ఆలాగున లేరు. వారి జీవితములు అబ్రాహాము జీవితమునకు పూర్తిగా విరుద్ధమైయున్నవి. శరీరరీత్యా వారు అబ్రాహాము పిల్లలైనను, నైతికపరముగా వారు అపవాది పిల్లలైయున్నారు.

8:40-41 వారికిని అబ్రాహాముకు మధ్యగల భేదము ఇక్కడ స్పష్టముగా కనిపించుచున్నది. యేసుక్రీస్తు ఈ లోకమునకువచ్చి సత్యమును బోధించుచున్నాడు. అయితే వారు ఆయన మాటలకు కోపపడి, తొట్రుపడి ఆయనను చంపుటకు యత్నించిరి. అబ్రాహాము ఈలాగు చేయలేదు.

అతడు ఎల్లప్పుడు సత్యమును, నీతిని తన పక్షముగా గైకొనెను, కనుక వారి తండ్రి ఎవరో ఇప్పుడు స్పష్టమైనది ఏలయనగా, వారు తమ తండ్రివలె ప్రవర్తించిరి. వారి తండ్రి అపవాది. “మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము” అని చెప్పుటలో “నీవే వ్యభిచారము వలన పుట్టినవాడవు” అని ప్రభువును దూషించినట్లుండెను.

“వ్యభిచారము” అను మాట బైబిలులో విగ్రహారాధనను సూచించుచున్నది. కాని తాము ఏమాత్రము ఆత్మీయ వ్యభిచారము చేయలేదని యూదులు చెప్పుచున్నారు. అయితే వారు తమ తండ్రిగా తాము ఎరిగిన దేవుడే ఏకైక దేవుడను విషయములో మాత్రము వారు సత్యమే చెప్పిరి.

8:42 ప్రభువు మరల వారి మాటలలోని దోషమును ఇక్కడ ఎత్తిచూపుచున్నాడు. ఎట్లనగా మీరు దేవుని ప్రేమించినయెడల, దేవుడు పంపించిన నన్నుకూడ ప్రేమింతురు అని చెప్పెను. ప్రభువైన యేసుక్రీస్తును ద్వేషించుచు అదే సమయములో నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పుట వెట్టితనము.

నేను దేవుని యొద్దనుండి పంపబడితినని ప్రభువు చెప్పెను. అనగా ఆయన దేవునియొక్క అద్వితీయ కుమారుడని దీని భావము. నిత్యత్వము నుండియే తండ్రికి కుమారునితో ఇట్టి సంబంధము కలదు. గనుకనే “నేను తండ్రియొద్దనుండి వచ్చితిని” అని ప్రభువు వారితో చెప్పెను.

అంతేగాక తాను అన్నిటికంటె ముందున్నవాడనని క్రీస్తు స్పష్టముగా తెలియజేయుచున్నాడు. ఆయన ఈ భూమిమీద ప్రత్యక్షము కాకమునుపు ఆయన పరలోకములో తండ్రితో ఉన్నవాడు. కాని తండ్రి లోక రక్షకుడుగా ఉండునట్లు ఆయనను ఈ పాపలోకములోనికి పంపెను గనుక విధేయుడైన కుమారునిగా ప్రభువు ఈ లోకమునకు వచ్చెను.

క్రీస్తు - లోకమునకు వెలుగు Bible Verses Chapter 8

8:43 ఈ వచనములో చెప్పబడిన “మాటలు, బోధ” అను పదముల మధ్య కొంత బేధము కలదు. క్రీస్తుయొక్క “మాట” ఆయన ఉపదేశించిన విషయమును సూచించు చుండగా ‘బోధ’ అను పదము ఒక ఆత్మీయ సత్యమును తాను ఏ మాటలలో తెలియ జేసెనో ఆ మాటలను సూచించుచున్నది. అయితే ఆయన బోధను సహితము వారు అర్థము చేసికొనలేదు. క్రీస్తు రొట్టెను గూర్చి బోధించినప్పుడు, అక్షరార్థమైన రొట్టెను గూర్చి వారు తలంచిరి.

నీటినిగూర్చి మాటలాడినప్పుడు అక్షరార్థమైన నీటినిగూర్చి తలంచిరి. అయితే వారు ఆయన బోధను ఎందుకు అర్థము చేసికొనలేకపోయిరి? ఎందుకనగా, ఆయన బోధలను అంగీకరించుటకు వారికి మనస్సులేకపోయెను.

8:44,45 ఇప్పుడు ప్రభువు వారి తండ్రినిగూర్చి బహిరంగపరచుచు “మీ తండ్రి అపవాది” అని చెప్పెను. అంటే విశ్వాసులు దేవుని మూలముగా పుట్టినట్లు వీరు అపవాది మూలముగా పుట్టిరని దీని భావముకాదు. భక్తుడైన అగస్టీన్ వీరిని గూర్చి చెప్పుచూ” వారు అపవాదిని అనుకరించుటద్వారా వాని పిల్లలైరి”. అతడు జీవించినట్లే వీరును జీవించుటద్వారా అపవాదితో తమకుగల సంబంధమును తెలియజేయు చున్నారు. “మీ తండ్రి దురాశలను మీరు నెరవేర్చగోరుచున్నారు” అని ప్రభువు చెప్పిన మాటలలో వారి హృదయాభిలాష మనకు గోచరమగుచున్నది.

ఆదినుండి అపవాది హంతుకుడైయున్నాడు. అతడు ఆదాముకును సమస్త మానవాళికిని మరణము కొని తెచ్చెను. అతడు హంతకుడే గాక అబద్ధికుడుకూడ అతనియందు సత్యములేదు గనుక అతడు సత్యమునందు నిలువలేదు.

అతడు అబద్ధమాడినప్పుడు, తన స్వభావమును తెలియజేయుచున్నాడు. వాని పుట్టుకతోనే అబద్ధములు ప్రారంభమైనవి. గనుక అతడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడు గానుయుండెను. యూదులు ఈ క్రింద చెప్పబడిన రెండు విధములుగా అపవాదిని అనుకరించిరి.

దేవుని కుమారిని చంపవలెనను కోరికతో ఉండిరిగనుక వారు కేవలము హంతకులే. మరియు దేవుడు తమ తండ్రియని చెప్పిరి గనుక వారు కేవలము అబద్ధికులు. దేవుని బిడ్డవలె, ఆత్మీయతగల వ్యక్తులవలె వారు నటించిరి కాని వారి జీవితములు దుష్టత్వముతో నిండియున్నవి.

అబద్ధమాడుటకు తమ్మునుతాము అప్పగించు కొనువారు సత్యమును తెలిసికొను శక్తిని కోల్పోవుదురు. ఈ యూదా మనుష్యులతో ప్రభువైన యేసుక్రీస్తు ఎల్లప్పుడు సత్యమే చెప్పుచుండెను. అయినప్పటికిని వారు ఆయనయందు నమ్మికయుంచలేదు. ఇది వారి దుష్ట ప్రవర్తనను సూచించుచున్నది.

8:46,47 “నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును”? అని దేవుని కుమారు డైన క్రీస్తుమాత్రమే పలుకగలడు. ఈ ప్రపంచములో ఏ ఒక్కవ్యక్తికూడ యేసునందు ఒక్క పాపమైనను ఉన్నట్లు నేరస్థాపన చేయలేడు. ఎందుకనగా ఆయన ప్రవర్తనయందు ఎట్టి దోషములేదు.

ఆయన తన సమస్త మార్గములయందు పరిపూర్ణుడు. గనుక ఆయన ఎల్లప్పుడు సత్యమునే మాటలాడెను. కాని వారు యేసు ప్రభువును నమ్మలేదు. ఒక వ్యక్తి నిజముగా దేవుని ప్రేమించిన యెడల, అతడు దేవుని మాటలు విని, వాటికి విధేయత చూపును. అయితే యూదులు నిజముగా దేవునికి చెందినవారు కారు గనుక రక్షకుడైన యేసుక్రీస్తుయొక్క వర్తమానముపట్ల విముఖత చూపిరి.

8:48, 49 ఈ వచనములోకూడ యూదులు సహజముగానే దూషణ మాటలను పలుకుచున్నారు. ఎందుకనగా, ఆయన ప్రశ్నకు ఏ విధముగాను ప్రత్యుత్తరమియ్యరైరి. “నీవు సమరయుడవు” అని దూషించిరి. అనగా వారి దృష్టిలో యేసుక్రీస్తు సంకరజాతికి చెందిన సమరయుడేగాని పూర్తిగా యూదుడు కాడని వారి భావము.

“మరియు నీవు దయ్యము పట్టినవాడవు” అనికూడ నిందించిరి. అనగా, ఆయన పిచ్చివాడనియు లేక వెట్టిపట్టినవాడనియు వారి భావము. ఇక్కడ ప్రభువు తన శత్రువులకు పదునైన మాటలతో ఇచ్చిన జవాబును గమనించండి.

క్రీస్తు మాటలు దయ్యము పట్టినవాని మాటలవలె లేవుగాని, తండ్రియైన దేవుని ఘనపరచ నపేక్షించువాని మాటలవలె నున్నవి. వారి దృష్టిలో క్రీస్తు దయ్యము పట్టినవాడు. ఆ కారణమునుబట్టి వారాయనను అవమానపర చుటలేదు గాని. పరలోకములోనున్న తన తండ్రి చిత్తమును ప్రభువు సంపూర్ణముగా నెరవేర్చ పూనుకొనెను గనుక వారు ఆయనను అవమాన పరచుచున్నారు.

8:50 ప్రభువు ఎన్నడును తన మహిమను వెదకలేదని వారు తెలిసికొనవలెను. ఆయన చేయు సమస్తకార్యములు తన తండ్రికి మహిమ తెచ్చుటకొరకే చేయుచున్నాడు. మీరు నన్ను అవమానపరచుచున్నారని ప్రభువు చెప్పుటలో ఆయన తన మహిమను వెదకుచున్నాడని భావముకాదు.

మరియు “వెదకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు” అను మాటలను ప్రభువు ఈ వచనములో ఉపయోగించుచున్నాడు. ఈ మాటలు కేవలము తండ్రియైన దేవునికే చెందియున్నవి. తండ్రియైన దేవుడు తన ప్రేమకుమారుని మహిమను వెదకువాడును, తన్ను మహిమపరచని వారెల్లరికి తీర్పుతీర్చు వాడునైయున్నాడు.

8:51 దేవుడైయున్న ప్రభువైన యేసు మాత్రమే పలికిన దివ్యమైన మాటలలోని ఒక దానిని మనము ఈ వచనములో చూడగలము. ఈ మాటలు “మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అను మాటలతో ముగియుచున్నవి.

ఒక వ్యక్తి ప్రభువుయొక్క మాటలను గైకొనినయెడల అతడు ఎన్నడు మరణము రుచి చూడడని ప్రభువైన యేసు వాగ్దానము చేసెను. ఇది భౌతిక మరణమునుగూర్చి చెప్పిన మాటలుకావు. ఎందుకనగా, ప్రభువు నందు విశ్వాసముంచిన అనేకులు ప్రతి దినము చనిపోవుచున్నారు. గనుక ఈ మాటలు శరీర మరణమును గాక ఆత్మీయ మరణమును సూచించుచున్నవి. అనగా తనయందు విశ్వాసముంచువారు నిత్య మరణమునుండి తప్పింపబడి నరక వేదనల నెన్నటికిని అనుభవించరని ప్రభువు చెప్పెను.

8:52, 53 యేసు పిచ్చి పట్టినవాడని ఇంతకుముందుకంటే మరి ఎక్కువగా ఇప్పుడు నిందమోపుచున్నారు. అబ్రాహామును ప్రవక్తలందరును మరణించిరని వారు ప్రభువుకు జ్ఞాపకము చేయుచున్నారు.

అయితే, ఒక వ్యక్తి తన మాటలు గైకొనినయెడల వాడు ఎన్నడును మరణము రుచిచూడడని ప్రభువు చెప్పెను. మరి వారి ప్రశ్నకు ఎట్లు సమాధానమియ్యవలెను? ప్రభువు తన మాటలలో అబ్రాహాముకంటెను ప్రవక్తలందరి కంటెను గొప్పవాడనని చెప్పినట్లు వారు గ్రహించిరి.

అబ్రాహాము మరణమునుండి ఎవరిని విమోచించలేదు. అంతేకాదు మరణమునుండి తన్నుతాను విమోచించుకొన లేకపోయెను. మరియు అతడు ప్రవక్తలనుకూడ విమోచించలేదు. అయితే తనతోటి మానవులను విమోచించుటకు శక్తిగలవాడను ‘నేనే’ యని చెప్పువాడొకడు ఇక్కడ ఉన్నాడు. గనుక ఆయన తన పితరులకంటే తాను గొప్పవాడనని ఎంచుకొన తగును.

8:54,55 జనసమూహమును తనవైపు ఆకర్షించుకొనుటకు యేసు ప్రయత్నించు చున్నాడని యూదులు తలంచిరి. కాని అది తన ఉద్దేశ్యము కాదని యేసు స్పష్టముగా చెప్పెను. ఆయనను ప్రేమించి ఆయన పరిచర్య చేయుచున్నామని వారు ఏ దేవునిగూర్చి చెప్పుచున్నారో ఆ దేవుడే ప్రభువైన యేసును మహిమపరచుచున్నాడు.

దేవుడు మా తండ్రియని వారు చెప్పినప్పటికిని, నిజముగా వారు ఆయనను ఎరుగరుగాని తండ్రిని ఎరిగినవానితోను ఆయనతో సమానుడైన వానితోను వారు మాటలాడుచున్నారు. తన తండ్రితో సమానుడను కానని చెప్పవలెనని వారు యేసును కోరిరి, కాని ఆయన వారు కోరినట్లు చెప్పినయెడల ఆయన అబద్ధికుడగును. ఎట్లనగా, ఆయన తండ్రియైన దేవుని ఎరిగియుండి ఆయన మాటలను గైకొనుచున్నాడు.

యేసుతో యూదుల వివాదము (8:21 - 59) :

8:56 అబ్రాహామును గూర్చి ప్రభువు తమ సంభాషణలో ప్రస్తావించినప్పుడు ఆ విషయమై యూదులు పట్టుపట్టిరి. గనుక అబ్రాహాము మెస్సీయ రాకడ దినము కొరకు ఎదురుచూచుననియు, విశ్వాసముద్వారా అతడు ఆ దినము చూచి ఆనందించే ననియు ప్రభువు వారితో చెప్పెను.

అబ్రాహాము ఎవరికొరకు ఎదురుచూచెనో, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. రాబోవు క్రీస్తుమీద అబ్రాహాముయొక్క విశ్వాసము ఆనుకొనియున్నది. ఈ విధముగా మెస్సీయను గూర్చిన పాత నిబంధన ప్రవచనముల నెరవేర్పును గూర్చి యేసు చెప్పెను.

8:57 యూదులు దైవసత్యములను అర్థము చేసికొనుటలో తమ అసమర్థతను మరొకసారి కనుపరచిరి. “అబ్రాహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను”. అని ప్రభువు చెప్పిన మాటలకు – “నీవు అబ్రాహామును చూచితివా?” అని వారు ప్రశ్నించుచుండిరి. ఇక్కడ ఒక గొప్ప భేదమున్నది.

అదేమనగా – అబ్రాహాము స్థితికంటే తనస్థితి గొప్పదని ప్రభువు చెప్పుచున్నాడు. అబ్రాహాముయొక్క ఆలోచనలకు, నిరీక్షణకు ప్రభువు గురియైయున్నాడు. క్రీస్తుయొక్క దినముకొరకు అబ్రాహాము విశ్వాసముద్వారా ఎదురుచూచెను.

కాని యూదులు ఈ సత్యమును అర్థము చేసికొనలేదు గనుక నీకు ఇంకను ఏబది సంవత్సరముల వయస్సు కూడ లేదే యని వారు ఎదురు ప్రశ్న వేయుచుండిరి. (వాస్తవముగా ఈ సమయములో ఆయన వయస్సు 33 సం॥లు మాత్రమే) అయితే అబ్రాహాము ఆయనను ఏలాగు చూచెను?

8:58 ఈ వచనములో ప్రభువు తాను దేవుడై యున్నానని మరియొకసారి స్పష్టముగా చెప్పుచున్నారు. “అబ్రాహాము ఈ లోకములో ఉండుటకుముందే నేనున్నాను” (Be- fore Abraham was, I was) అని ప్రభువు చెప్పలేదు.

అయితే ఆయన అబ్రాహాము కంటే ముందున్నవాడు. ఈ సందర్భములో పాత నిబంధనలో దేవుడు ఉపయోగించిన “నేనే” (I AM) అను నామమును ప్రభువు ఉపయోగించెను. మన ప్రభువు శాశ్వత కాలమునుండి తండ్రియైన దేవునితో ఉన్నవాడు.

ఆయన ఉనికికి, ఆయనయొక్క జీవ ప్రారంభమునకు ఒక సమయమంటూ ఏదీ లేదు. అందువలన, “అబ్రాహాము పుట్టక మునుపే నేనున్నాను” (Before Abraham was I am) అని వారితో చెప్పెను. ఆ మాటలు వినిన దుష్టులైన యూదులు యేసును చంపుటకు యత్నించిరి.

కాని ఆయన ఆశ్చర్యకరముగా వారి మధ్యనుండి తప్పించుకొని దేవాలయమును విడిచి వెళ్ళెను. అయితే “అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నాను” అని ప్రభువు చెప్పిన మాటలను నేను యెహోవానై యున్నానని ఆయన చెప్పుచున్నాడని వారు అర్థము చేసికొనిరి.

ఈ కారణమునుబట్టి ఆయనపై రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి. ఏలయనగా ప్రభువు చెప్పిన ఆ మాట దైవ దూషణగా వారు పరిగణించిరి. గాని మెస్సీయ తమ మధ్య ఉన్నాడను సత్యమును అంగీకరించుటకు వారు సమ్మతించలేదు. తమ్ము నేలునట్లు వారు ఆయనను కోరుకొనలేదు.

పర్వతారోహణమగుచున్న తర్కము – Bible Verses Chapter 7 in Telugu

ఏడవ అధ్యాయము

పర్వతారోహణమగుచున్న తర్కము
(యోహాను 7:8)
(Mounting Controversy)

క్రీస్తు తన సహోదరులను గద్దించుట (7:1-9) :

7:1 6వ అధ్యాయమునందు జరిగిన సంఘటనల అనంతరము కొలది నెలలు గడచిన తరువాత 7వ అధ్యాయములోని సంఘటనలు సంభవించెను. ఆయన గలిలయలో నిలిచిపోయెను. యూదులాయనను చంప ప్రయత్నము చేయుచుండిరి గనుక ఆయన యూదయలో నిలిచియుండక పోయెను. యూదులు అప్పుడు నాయకులుగాను, పరిపాలకులుగాను ఉండిరి. ఆయనను బహుగా ద్వేషించినది యూదులే. మరియు ఆయనను చంపుటకు సమయమును వెదకుచుండిరి.

7:2 ఈ వచనములో చెప్పబడిన పర్ణశాలల పండుగ యూదుల క్యాలెండరు నందు ముఖ్యమైనది. ఈ పండుగ కోతకాలము తరువాత వచ్చును. మరియు దీని ఉద్దేశ్యము యూదులు ఐగుప్తునుండి వచ్చిన తరువాత వారు గుడారములలో నివసించిరని అది తెలియజేయుచున్నది.

అది ఆనందకరమైన పండుగ సమయము. మరియు రక్షింపబడిన యూదా జనాంగము ఇశ్రాయేలు దేశమందు నివసించునపుడు మెస్సీయ వారిని సమాధానముతోను క్షేమాభివృద్ధితోను ఏలును అని ఆ పండుగ తెలియజేయుచున్నది.

Read and Learn More Telugu Bible Verses

7:3 ఈ వచనమునందు, చెప్పబడిన ప్రభువు సహోదరులెవరనగా, యేసు పుట్టిన తరువాత మరియకు పుట్టినవారుగాని, జ్ఞాతి లేదా దూరపు బంధువులు ఎవరైనను సరే ఆయనకు ఎంత దగ్గర సంబంధము కలిగియున్నను వారు రక్షింపబడినవారు కారు.

వారాయనయందు నిజముగా విశ్వాసముంచినవారు కారు. అయితే వారాయ నను పండుగకు వెళ్ళి అక్కడ ఏమైనను సూచకక్రియలు చేసిన యెడల, ఆయనను వెంబడించువారు ఆ అద్భుతములను చూచెదరని ఆయనతో చెప్పిరి. శిష్యులనగా పండ్రెండుమంది శిష్యులు కాదుగాని, యూదయలో శిష్యులనబడిన వారని అర్థము.

అయినను వారాయనను అంగీకరించలేదు గాని, ఆయన తన్నుతాను ప్రత్యక్షపరచు కొనినయెడల జనులు వారిని – వీరు ఒక గొప్ప వ్యక్తికి సంబంధించినవారనుకొందురని వారి అభిప్రాయము. మరియు వారు ఆయన పొందుచున్న కీర్తినిబట్టి ఆయనయందు అసూయతో అట్లు చెప్పి, ఆయన పండుగకు వెళ్ళిన యెడల వారిచేత చంపగలడని తలంచిరి.

7:4 ఈ వచనము వారు ఆయనను అపహసించుచు చెప్పియుండవచ్చును. ప్రభువు తాను ప్రసిద్ధిగాంచవలెనని తలంచుచున్నట్లు ఆయన సమీప బంధువులు తలంచిరి. ఆయన ప్రసిద్ధిగాంచవలెనని ఆశించక పోయినచో యిన్ని అద్భుతములు ఆయన గలిలయలో చేయుటకు గల కారణమేమి? కనుక నీవు ప్రసిద్ధినొందుటకు ఇది యొక మంచి సమయము గనుక నీవు పండుగకు వెళ్ళుమని వారాయనతో చెప్పిరి.

ఆ పండుగ సమయమందు యెరూషలేములో వందలాది ప్రజలుందురు గనుక నీవు అచ్చట వారికొరకు అద్భుతములు చేయవచ్చును. గలిలయ (నిశ్శబ్ద) నిర్మానుష్యమైన ప్రదేశము. నీవు ఈ రహస్యస్థలమందు ఈ అద్భుతకార్యములు చేయుచున్నావు గాని, నీవు ప్రసిద్ధిగాంచవలెన్న నీతి కార్యములు ఇచ్చట ఎందుకు చేయుచుంటివని అడిగిరి.

నీవీకార్యములను చేసి లోకమునకు నిన్ను నీవే కనుపరచు కొనుమని చెప్పిరి. నీవు మెస్సీయవని ఋజువు పరచుకొనుటకు ఈ అద్భుత కార్యములను చేయుచున్నయెడల నీవు యూదయలో ఈ కార్యములు చేసినయెడల అవి నిజముగా లెక్కించబడునని చెప్పిరి.

7:5 ఆయన మహిమపరచబడుచుండగా చూచి ఆనందించుటకు నిజముగా మనస్సులేనివారు, ఆయనను మెస్సీయగా కూడ వారు అంగీకరించుటకు ఇష్టపడలేరు. వారాయనయందు విశ్వాసముంచుటకు కూడ ఇష్టపడలేదు. వారు చెప్పినదంతయు ఆయనను అపహాస్యము చేయుటకే చెప్పిరి.

ప్రభువుయెదుట వారి హృదయములు సరిగా లేవు. తన స్వకీయులే ఆయన మాటలయందును క్రియలయందును విశ్వాస ముంచకపోవుట ఆయనకు చేదు అనుభవమును కలిగించెను. తరచుగా ప్రభువు నందు విశ్వాసముంచిన వారనేకులు తమ క్రియలవలన ఇట్టి చేదు అనుభూతిని కలిగి యుండుట (వ్యతిరేకతను) మనము చూచుచున్నాము.

7:6 ప్రభువుయొక్క జీవితము ఆదినుండి అంతమువరకు ఒక క్రమములో నున్నది. ప్రతి దినము, ప్రతి క్షణముకూడ ముందుగా సిద్ధపరచబడిన సూచిక ప్రకారము జరుగుచుండెను. లోకమునకు తన్నుతాను ప్రత్యక్షపరచుకొను సమయమింకను రాలేదు.

ఆయనయందు ఏమి ఉంచబడెనో ఆయనకు తెలియును. ఈ సమయమందు తాను యెరూషలేమునకు వెళ్ళుట దేవుని చిత్తము కాదు గనుక తన్ను కనుపరచు కొనుటకు ఆయన అచ్చటికి వెళ్ళియుండలేదు. కనుకనే ఆయన సహోదరులకాయన వారి సమయమెల్లప్పుడు (వారి యెదుటనే సిద్ధముగానే ఉండెనని చెప్పెను.

వారి జీవితములు వారి ఇష్టానుసారముగా నడుపబడుచుండెను గాని, దేవుని చిత్తమునకు విధేయులైన వారుగా జీవించుటలేదు. వారియొక్క ప్రణాళిక చొప్పుననే వారి ప్రయాణ ములు కొనసాగించుచున్నారు గాని, దేవుని చిత్తమునకు విధేయులు కారు. వారి స్వచిత్తమును చేయ నిష్టము కలవారు.

7:7 ప్రభువు సహోదరులను లోకము ద్వేషించనేరదు. ఎందుకనగా వారు లోకము నకు చెందినవారు. వారు యేసుకు వ్యతిరేకముగా లోకముతో ఏకీభవించిరి, వారి జీవితమంతయు లోకముతో ఐకమత్యము కలిగియుండెను.

ఇచట ‘లోకము’ అనునది దేవునికిగాని, దేవునియొక్క క్రీస్తుకుగాని ఏమాత్రము స్థానము లేకుండా మానవుడు నిర్మించుకొనిన జీవన సరణిని సూచించుచున్నది. ఈ లోకము పూర్తిగా సంస్కృతి, కళ, విద్య మరియు మతము అనువాటితో నిండిపోయినది. ‘యూదయ’ – ప్రత్యేకముగా మతసంబంధమైన ప్రాంతము. మరియు క్రీస్తును అత్యధికముగా ద్వేషించునది ఈ యూదా మతాధికారులే.

క్రీస్తు తన సహోదరులను గద్దించుట (7:1-9) :

లోకముయొక్క క్రియలు చెడ్డవని ప్రభువు సాక్ష్యమిచ్చుచున్నాడు గనుక లోక మాయనను ద్వేషించెను. ఎవడైనను నీతిమంతుడైనవాడు ఈ లోకమునకు వచ్చిన యెడల లోకమాయనను చంపజూచును.

ఇది చెరుపుచేయు మానవుని యొక్క ప్రవృత్తిపై విచారకరమైన వ్యాఖ్యానము. క్రీస్తుయొక్క సంపూర్ణత ప్రతి మానవునియొక్క అసంపూర్ణ తను ప్రత్యక్షపరచుచున్నది. హెచ్చరికలు తననిట్లు హెచ్చరించుచుండగా మానవుడు దేవుని కృపకొరకు మొర్రపెట్టక, తన పాపమును బట్టబయలు చేసినవానిని సంహరింప బూనుకొనెను.

లోకముచే ద్వేషించబడక, ప్రేమించబడి, ఘనపరచబడి, హెచ్చించబడి యుండుటవలన క్రైస్తవుడు తాను ఘోర దుర్భరమైన స్థితియందున్నానని గుర్తించవలసి యున్నది. “అతడు నా గురించి మంచిగా మాట్లాడుటకు నేను చేసిన చెడ్డపని ఏమిటి?” అని పూర్వకాలమందున్న యోగి ఒకడు ప్రశ్నించెనట.

మనలను లోకము ద్వేషించని కారణ మేమనగా దానిని గూర్చియు, దాని క్రియలను గూర్చియు మనము చెడ్డవని సాక్ష్యమివ్వకుండుటయే. లోకములోని ప్రేమపట్ల మనకున్న వేడిమికి గల కారణము మనము లోకమునకు చెందియున్నామనుటయే. ఈ లోకముతో స్నేహము దేవునితో వైరము, లోకమునకు స్నేహితుడై యుండగోరువాడు దేవునికి శత్రువగును. (యోహాను 7:7;15:19; యాకోబు 4:4).

7:8 పండుగకు వెళ్ళవలసినదిగా ప్రభువు తన సహోదరులకు సెలవిచ్చెను. ఈ విషయమై కొంత విచారము కలదు. మతనిష్ట గలవారివలె వారు వ్యవహరించిరి. వారు పర్ణశాలల పండుగను ఆచరింప సిద్ధపడుచుండిరి.

దేవునియొక్క క్రీస్తు వారి మధ్య నిలుచుండినప్పటికిని వారికి ఆయనపై ప్రేమలేదు. మానవుడు సాధారణముగా మతాచారులయందు లక్ష్యముంచుటకు గల కారణము వాటిని ఆచరించుటలో నతడు హృదయపూర్వకముగా ఆసక్తి ఉండనవసరము లేదు గనుక అట్టివాడు క్రీస్తునొద్దకు ముఖాముఖిగా వచ్చినప్పుడు సిగ్గునొందును లేక ఇబ్బందిపడును.

తన సమయమింకను రాలేదు గనుక తాను పండుగకు వెళ్ళలేదని యేసు చెప్పెను. తాను పండుగకు వెళ్ళుటలేదని ఆయన చెప్పుటలేదు. గాని తనకు ఘనత కలుగకుండు నిమిత్తము తన సహోదరులతో తాను పండుగకు రానని చెప్పెను. ఆయనకు అది సమయముకాదు. ఆయన వెళ్ళునప్పుడు ఆయన రహస్యముగాను, తగిన ఘనతతోను వెళ్ళెను.

7:9 కనుక ఆయన తన సహోదరులతో కలసి ఆ పండుగకు వెళ్ళలేదు. పర్ణశాలల పండుగ ఏ ఆనందమును గూర్చి తెలియజేయునో ఆ యానందమునకు కారణభూత మైన వానిని వెనుక విడిచిపెట్టి వారు ఆ పండుగకు వెళ్ళిరి.

యేసు ఆలయములో బోధించుట (7:10-31)

7:10 తన సహోదరులు పండుగకు వెళ్ళిన తరువాత ఆయన రహస్యముగా అచ్చటికి వెళ్ళెను. భక్తిగల యూదునివలె ఆయన ఆ పండుగకు హాజరు కాదలంచెను. అయితే ఆయన విధేయుడైన దేవుని కుమారుడై యుండెను గనుక ఆయన బహిరంగముగా కాక రహస్యముగా వెళ్ళెను.

7:11 పండుగ సమయమందు ఆయనకొరకు వెదకినవారు ఎవరనగా ఆయనను చంపగోరు యూదామతాధికారులే, ఆయన ఎక్కడ? అని వారడిగినప్పుడు ఆయనను ఆరాధించగోరి వారడుగలేదుగాని, ఆయనను సంహరించుటకే అడిగియుండిరి.

7:12 ప్రభువు వారిలో కొంత అలజడి పుట్టించునట్లుగా మనమిక్కడ చూచుచున్నాము. ఆయన చేయుచున్న అద్భుతకార్యములనుబట్టి నిజముగా ఆయన ఎవరో తెలిసికొనుటకు ప్రజలకు అవకాశము లభించుచుండెను. అంతట ఆ పండుగలో ఆయన అబద్ధ ప్రవక్తయై యుండెనా లేక నిజమైన ప్రవక్తయై యుండెనాయను సణుగు ప్రజలలో పుట్టెను.

7:13 కొందరు ఆయన మంచివాడనిరి, మరి కొందరు ఆయన మోసపుచ్చు వాడనిరి. ఆయనపట్ల ఆ మతాధికారులయొక్క పగ బహు తీవ్రముగా నున్నందున ఎవడును ఆయనను గురించి (ఆయన మంచి తనమును గురించి) బహిరంగముగా మాటలాడ తెగింపలేదు.

అయితే నిస్సందేహముగా సామాన్య ప్రజలు ఆయన ఇశ్రాయేలుయొక్క మెస్సీయ అని గుర్తించిరి గాని, యూదయ మతాధి కారులకు భయపడి వారు ఈ విషయము చెప్పుటకు సాహసించ లేదు.

7:14 కొద్ది దినములకు పర్ణశాలల పండుగను ఆచరించుట ముగిసెను. సగము పండుగైన తరువాత యేసు దేవాలయమునకు వెలుపట జనులు గుంపుకూడి యుండగా అచ్చటికి వెళ్ళి బోధించుచుండెను.

యేసు ఆలయములో బోధించుట (7:10-31)

7:15 ఆయన బోధ వినిన జనులు ఆశ్చర్యపడిరి. లేఖన భాగములయందు ఆయనకు కలిగిన జ్ఞానమును గూర్చి వారాశ్చర్యపడిరి, ఆయన పాండిత్యమును గూర్చియు, బోధ చేయుటయందు ఆయనకు గల్గిన జ్ఞానమును గూర్చియు వారు ఆశ్చర్యపడిరి. ఆయన అంతటి జ్ఞానము కలిగియుండుటకు ఏ పాఠశాలకును వెళ్ళియుండలేదని వారికి తెలియును.

7:16 ప్రభువు తనకు గొప్పతనము నపేక్షింపక తన తండ్రి మహిమపరచబడుటకై ఆయన పనిచేసెను. అందుకు ప్రభువు నేనుచేయు బోధ నాదికాదు. నన్ను పంపిన తండ్రిదేనని చెప్పెను. ప్రభువైన యేసు బోధించునది, మాట్లాడునది అంతయు తండ్రి తనకు బోధించుమని, మాట్లాడుమని ఆదేశించినదే తండ్రికి వేరుగా తాను స్వతంత్రుడై ఆయన ఏమియు మాట్లాడియుండలేదు.

7:17,18 ఆయన బోధ సత్యమైనదో కాదో యూదులు తెలిసికొనగోరినయెడల అది చాల సుళువైన విషయము. ఒకడు దేవుని చిత్తమును నెరవేర్చుటకు యిచ యించినయెడల అట్టివానికి క్రీస్తు చేయు బోధ దైవికమైనదో లేక, ఆయనే తన ఇష్టానుసారముగా బోధించుచుండెనో దేవుడు వానికి తెలియజేయును.

వాస్తవముగా సత్యమును గూర్చి అన్వేషించు ప్రతి ఒక్కరికి అద్భుతమైన వాగ్దాన మివ్వబడెను. ఒకడు నీతిమంతుడై యుండి, సత్యమనగా ఏమిటో తెలిసికొన నాసక్తి కలిగియుండిన యెడల అట్టివానికి దేవుడు ప్రత్యక్షమగును.

“నా యంతట నేను బోధించుచున్నాననగా” తన్ను గురించి తాను బోధించుకొనుచున్నాడని కాదుగాని, “అధికారముతో బోధించు చున్నానని” అర్థము. ఎవడైనను తనకై తాను బోధించునో, అనగా తన చిత్తాను సారముగా బోధించునో అట్టివాడు తన స్వంత మహిమను అపేక్షించును.

ప్రభువైన యేసు అట్లు చేయలేదుగాని, తన్ను పంపిన తండ్రి మహిమను వెదకెను. ఎందుకనగా ఆయన ఉద్దేశ్యములు సంపూర్ణముగా పవిత్రమైనవి. ఆయన బోధ సత్యమైనది. ఆయన యందు అవినీతి ఏమియు లేదు. అట్టి మాటలు ఆ ప్రభువును గూర్చియే పలుకబడెను.

ప్రతి బోధకునియందు వానియొక్క పరిచర్యలో స్వార్థము కనిపించును. కాని దేవుని సేవకులలో ప్రతి ఒక్కరు తమకు కాక దేవునికే మహిమ ఆరోపించవలయును. 19 ప్రభువు యూదులపై సూటిగా నిందయొకటి మోపుచుండెను, మోషే వారికి ధర్మశాస్త్ర మనుగ్రహించెనని గుర్తుచేసెను.

వారు ధర్మశాస్త్రమును కలిగియుండుటవలన వారికేమియు ప్రయోజనము లేదని గుర్తించిరి. ధర్మశాస్త్రమునకు లోబడియుండవలసి నదిగా వారిపై చట్టము యజమాయిషీ చేయుచున్నది. ధర్మశాస్త్రము కలిగి యుండుటలో వారు ఘనత పొందినను, ప్రభువైన యేసును చంపుటకు పన్నాగము పన్నుటలో వారిలో ఏ ఒక్కరును ధర్మశాస్త్రమును గురించి ఆలోచించినవారు కారు.

ధర్మశాస్త్రము ‘హత్యను’ నిషేధించును, వారి స్వంత యిష్టమును నెరవేర్చ గోరినవారై ప్రభువును చంపుటలో ధర్మశాస్త్రమును మీరుట కైనను వారు వెనుకతీసినవారు కారు.

పర్వతారోహణమగుచున్న తర్కము Bible Verses Chapter 7

7:20 ఆయన తమను నిందించుటను గమనించి, ఆయన సత్యమై యుండెనని ఒప్పుకొనుటకు అంగీకరింపక తిరిగి ఆయనను నిందించసాగిరి. వారు నీవు దయ్యము పట్టిన వాడవనిరి. మరియు వారు మేము నిన్ను చంపజూచుచున్నామని ఏల చెప్పుచున్నావని ఆయనను సవాలు చేసిరి.

7:21,22 బేతెస్థ కోనేటివద్ద తాను స్వస్థపరచిన నిస్సహాయకుని గురించి తిరిగి ప్రస్తావించెను. ఈ అద్భుతమును చూచినప్పటినుండి యూదులలో ఆయనపై ద్వేషము చెలరేగెను, అప్పటినుండి ఆయనను చంపుటకు వారు కుట్ర చేయుచుండిరి.

నేను అద్భుతమును చేసినందున మీరు విస్మయమొందితిరని ఆయన జ్ఞాపకము చేసెను. అనగా ఆయన చేసిన అద్భుతమును చూచి, ప్రశంసించువారు అచ్చెరువొందలేదుగాని, ఆ కార్యమును సబ్బాతు దినమున చేసినందులకు విస్మయమొందిరి.

మగశిశువు జన్మించిన తరువాత ఎనిమిదవ దినమున అతనికి సున్నితి చేయింపవలెనని మోషే ధర్మశాస్త్రమునందు వ్రాయబడెను. ఎనిమిదవ దినము సబ్బాతుదినమందు వచ్చిన యెడల వారా శిశువునకు సున్నతి చేయించి యుండెడివారే. అది అత్యవసరమైన కార్యము గనుక అట్టి కార్యము చేయుటకు ధర్మశాస్త్రమంగీకరించునని వారు తలంతురు.

7:23 సున్నతి చేయుటకు ధర్మశాస్త్రము అంగీకరించిన యెడల ఒక వ్యక్తి స్వస్థత నొందుటలో వారు ప్రభువైన యేసునందు ఎందుకు తప్పు వెదుకుచున్నారు? అత్యవసర మైన కార్యమునకు ధర్మశాస్త్రము అంగీకరించిన యెడల, కృపగల కార్యమునకు ధర్మశాస్త్రము అంగీకరింపదా?

7:24 యూదులు కంటికి కనిపించు దానిని బట్టి విమర్శించుదురుగాని, అంతర్గత మైన వాస్తవమునుబట్టి విమర్శించు వాడుక వారికి లేదు. వారి తీర్పు నీతియుక్తమైనది కాదు. వారు చేసిన కార్యమే న్యాయయుక్తమైనది. అయితే వారు చేసిన కార్య ప్రభువు చేసినచో వారి దృష్టికది న్యాయయుక్తమైనది కాదు. న్యాయమైన తీర్పునుబట్టి కాక, వెలిచూపునుబట్టి తీర్పు తీర్చుట మానవ నైజము. ప్రభువు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమును మీరలేదు గాని, అజ్ఞానముగా ఆయనను ద్వేషించుటవలన వారే ధర్మశాస్త్రమును మరియున్నారు.

7:25 – 27 ఇప్పటికి యూదా మతాధికారులు రక్షకుని చంపుటకు పన్నాగము పన్నుచున్నారని యెరూషలేము నందు తెలియవచ్చెను. అయితే కొంతమంది సామాన్య ప్రజలు మన మతాధికారులు చంపదలచినవాడు ఈయన కాడా? యనియడిగిరి.

భయపడకయే బహిరంగముగా ప్రభువైన యేసు బోధించుటకు ఎట్లు అనుమతింప బడెనో వారికి గ్రహింపు కాలేదు. ప్రజలాయనను అంగీకరించుట యూదా మతాధి కారులకు ఇష్టములేదు. వారాయనను ద్వేషించుచున్నప్పుడు ఆయనను ఎందుకు ఈ విధముగా అనుమతించిరి? ఆయన బోధించునట్లుగా వారాయనను మెస్సీయగా అంగీకరించుటకు అవకాశముండెనా? యేసును మెస్సీయగా అంగీకరించినవారు ఆయన ఎక్కడినుండి వచ్చెనో ఎరుగుదురు.

ఆయన నజరేతునుండి వచ్చియున్నాడని విశ్వసించుచున్నారు. ఆయన తల్లి మరియయని వారెరుగుదురు. మరియు తండ్రి యోసేపుగా గుర్తించిరి, అయితే మెస్సీయ వచ్చునపుడు అకస్మాత్తుగా వచ్చుననియు అదియొక మర్మమనియు యూదుల నమ్మకము.

అయితే వారికి ఆయన యొక శిశు వుగా జన్మించి, మానవునిగా ఎదుగునని గ్రహించరైరి. క్రీస్తు బేత్లహేమునందు జన్మించు నని పాత నిబంధన గ్రంథమును చదివి గ్రహించవలసియుండెను గాని వారు ఆయన రాకను గురించిన వివరములు తెలిసికొనుటలో నిర్లక్ష్యము కలిగియుండిరి. కనుకనే క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడివాడో ఎరుగమని చెప్పిరి.

7:28 ఆ సమయమందు అక్కడ ఉండి ఈ సంభాషణంతయు వినుచున్న వారందరి కొరకు యేసు బిగ్గరగా ఇట్లు చెప్పెను “నేను ఎక్కడనుండి వచ్చియున్నానో వాస్తవముగా మీరెరుగుదురు. అయితే ఒక సామాన్య మానవునిగా నేనెక్కడనుండి వచ్చితినో మీకు తెలియును.

నజరేయుడైన ‘యేసు’ గా నేను మీకు తెలిసియుంటిని గాని నేను దేవుడనని మీకు తెలియదు. నాయంతట నేను రాలేదుగాని, నన్ను నా తండ్రియైన దేవుడు పంపెననియు, మీరు తెలిసికొనుటకు నిర్లక్ష్యము చేయుదురు” అని చెప్పెను. ఇట్లు చెప్పి తాను దేవునితో సమానమైనవానినని వారికి సూటిగా జవాబిచ్చెను. సత్యదేవు డాయనను ఈ లోకములోనికి పంపెనుగాని ఆ దేవుని వారు తెలిసికొనలేదు.

7:29 ఆ దేవుడు ఆయనను ఎరిగియుండెను. నిత్యత్వమంతటిలో దేవునితో కలసి నివసించెను. మరియు అన్ని విషయములలోను ఆయన తండ్రియైన దేవునితో సమానమైనవాడు.

ప్రభువు తాను దేవునియొద్దనుండి వచ్చెనని చెప్పుటలో తాను దేవునియొద్దనుండి పంపబడియున్నానని చెప్పుటయే గాక, నిత్యము దేవునితో జీవించి యున్నాననియు, తానన్ని విషయములలో దేవునితో సమానమైన వాడననియు తెలియ జేసెను. “ఆయన నన్ను పంపెననగా” తాను దేవుని క్రీస్తుననియు అభిషేకించబడి, విమోచన కార్యమును నెరవేర్చుటకు ఈ లోకమునకు పంపబడితిననియు చెప్పెను.

7:30 ఆయన మాటలలోని ముఖ్యాంశమును గుర్తించిన యూదులు తాను ‘మెస్సీయా’ అని వారికి తెలియజేయుచున్నాడని గ్రహించిరి. ఇది వారు దేవదూషణగా భావించి, ఆయనను పట్టుకొనుటకు ప్రయత్నించిరి గాని, సమయ మింకను రాలేదు గనుక ఎవరును ఆయనపై చేయి వేయలేకపోయిరి.

7:31 వాస్తవముగా అనేకులాయనయందు విశ్వాసముంచిరి వారి విశ్వాసము సరియైనదని మనము తలంచుచున్నాము. వారికి కలిగిన గ్రహింపు ఏదనగా, యేసు మెస్సీయయని ఋజువుపరచుకొనుటకు ఇంకేమి కావలసియుండెను? యేసు మెస్సీయ కానియెడల, మెస్సీయ వచ్చినప్పుడు యేసు ఇప్పుడు చేసిన అద్భుతములకంటె మరిన్ని అద్భుతములు, మరి గొప్ప అద్భుతములు చేయునా? కనుక ఆయన చేసియున్న అద్భుతములు ఆయనను ‘మెస్సీయ’ యని ఋజువుచేయుచున్నవని విశ్వసించిరి.

పరిసయ్యుల శత్రుత్వము (7:32-36)

7:32 గుంపుకూడిన ప్రజలలో పరిసయ్యులు ఇటు అటు తిరుగుచుండగా వారు సణుగులను వినిరి. ప్రజలు ప్రభువును గూర్చి వ్యతిరేకముగా తలంచక వారాయనను హృదయమునందు అభినందించుచు చిన్నగా మాట్లాడుకొనుచుండిరి.

కనుక పరి సయ్యులు ఆయనను అంగీకరించువారు పెక్కుమంది యగుదురేమోయని భయపడి ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి. ఈ వచన భాగము బంట్రౌతులకును, మతాధికారులకును, పరిసయ్యలకును అక్కడ గుమికూడిన ప్రజల కోసరము చెప్ప బడెను. ప్రభువు వారితో “ఇంక కొంతకాలము మీతో ఉందుననియు, అటు తరువాత నా తండ్రియైన దేవునియొద్దకు వెళ్లుదుననియు” చెప్పెను.

7:34 దీనితో పరిసయ్యులు మరింత కోపోద్రిక్తులైరి. రానున్న దినములలో మీరు నన్ను వెదకుదురు గాని, నన్ను కనుగొనరని ప్రభువు వారితో చెప్పెను. మరికొంత కాలమునకు వారికి రక్షకుడు అవసరమగును గాని, అప్పటికి సమయము మించి పోవును.

పరిసయ్యుల శత్రుత్వము (7:32-36)

ఆయన అప్పటికే పరలోకమునకు వెళ్ళిపోవును. కాని వారియొక్క అవిశ్వాసము మరియు దుష్టత్వమునుబట్టి పరలోకములో ఉన్న ఆయనను వారు కలుసుకొనలేరు. ఈ వచనములోని మాటలు చాల గంభీరమైనవి. రక్షింపబడుటకు మానవులకిప్పుడు అవకాశము ఇవ్వబడెను. ఇప్పుడీ అవకాశమును వారు తృణీక రించినచో మరెన్నడును ఈ అవకాశము వారికి ఇవ్వబడదు.

7:35,36 ప్రభువు మాటలలోని సారాంశమును యూదులు గ్రహించుటకు విఫలులైరి. ఆయన తిరిగి పరమునకు వెళ్ళుచున్నాడని వారు గ్రహింపరైరి. ఆయన బోధించుచు, ప్రయాణము చేయుచు అన్యులలో చెదరియున్న యూదులకు బోధింప వెళ్ళుచున్నాడనియు లేదా అన్యులకుకూడ బోధింప వెళ్ళుచున్నాడనియు అనుకొనిరి. ఆయన పలుకుచున్న మాటలకు వారు ఆశ్చర్యపడిరి. మీరు నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనరు అని చెప్పుటలో ఆయన ఉద్దేశ్యమేమి? వారు వెంబడించలేనంతగా ఆయన ఎక్కడికి వెళ్ళును?

పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన వాగ్దానము (7:37-39)

7:37 ఇది పండుగను ఆచరించు దినములలో చివరిదినము. యూదులు తమ మతాచారమును అనుసరించు కార్యము పూర్తికావచ్చినను, వారు ఆ పండుగయొక్క భావమును నిజముగా గ్రహించలేదు. గనుక వారి హృదయములు తృప్తి చెందియుండ లేదు.

వారు తమతమ ఇండ్లకు వెళ్ళబోవు ముందు వారికి ప్రభువు ఇట్లు చెప్పెను. ఎవడైనను ఆత్మీయ దాహమును తృప్తి పరచుకొనుటకు తన యొద్దకు రావలయునని చెప్పెను. “ఎవరినైనను” ఆయన ఆహ్వానించుచుండెను. ఆయన చెప్పిన మాటలను మనము జాగ్రత్తగా గమనించుదముగాక! ఆయన సువార్త సర్వ లోకమునకు చెందినది.

క్రీస్తునొద్దకు వచ్చిన వాడెవడైనను రక్షింపబడును. “ఎవడైనను దప్పిగొనినయెడల” అను మాట లేఖన భాగములలో చెప్పియున్నది. ‘దాహము’ అనగా ఆత్మీయ (దాహమును) అవసరతను గుర్తు చేయుచున్నది. ఒకడు తాను పాపియని గుర్తించిన యెడల వాడు రక్షింపబడును. తాను నశించియున్నానని గుర్తించనియెడల ఒకడు రక్షింపబడడు, ఒకడు తాను తన ఆత్మీయ జీవితములో ఎంతో కొరతబడి యున్నానని గ్రహించనిదే తన అవసరతను తీర్చుకొనుటకు (లోటును భర్తీ చేసికొనుటకు) ప్రభువు నొద్దకు వచ్చుటకు ఆశించడు.

దప్పికగొనిన ఆత్మను ప్రభువు తనయొద్దకు ఆహ్వానించుచున్నాడు, అంతేగాని ఒక సంఘమునకుగాని, ఒక బోధకునియొద్దకుగాని, బాప్తిస్మముయొద్దకుగాని, ప్రభువుబల్ల యొద్దకుగాని ఆయన ఆహ్వానించుటలేదు. “నా యొద్దకురండి” “నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనుడి” అని ఆయన చెప్పెను. “త్రాగుటకు” అనగా ఆయనను రక్షకునిగాను, ప్రభువుగాను విశ్వసించి ఒకడు క్రీస్తు నొద్దకు రావలసియున్నది.

పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన వాగ్దానము (7:37-39)

7:38,39 క్రీస్తునొద్దకు వచ్చి దాహము తీర్చుకొనుటయనగా ఆయనయందు విశ్వాసముంచుటయే. ఆయనయందు విశ్వాసముంచిన వారందరు వారి అసరములు తీర్చబడి, ఆశీర్వదింపబడి ఇతరులకు ఆశీర్వాద కారణముగా నుందురు.

పాత నిబంధన గ్రంథమందుకూడ మెస్సీయను అంగీకరించినవారు తమకు తాము ఫలించు వారైయుండి, ఇతరులకు ఆశీర్వాద కారకులగుదురని వ్రాయబడియున్నది. ‘అతని కడుపులోనుండి జీవనదులు పారునని” చెప్పుటలో ఒకని ఆత్మీయ జీవితమునుండి ఇతరుల సహాయముకొరకు జీవజల నదులు పారునని అర్థము.

“జీవజలము” అనగా ‘పరిశుద్ధాత్మ దేవునికి’ గుర్తు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించెదరో అట్టి వారు దేవుని ఆత్మను పొందియున్నారని ఈ వాక్యము ముఖ్యముగా వివరించుచున్నది. ప్రభువు మాట్లాడునప్పటికి పరిశుద్ధాత్మ ఈ లోకములోనికి పంపబడియుండలేదు. ప్రభువు పరలోకమునకు ఆరోహణుడై మహిమపరచబడనంత వరకు, పెంతెకొస్తు దినమువరకు పరిశుద్ధాత్మ దిగివచ్చియుండలేదు. ఆ క్షణమునుండియు ప్రభువైన యేసు క్రీస్తునందున్న నిజమైన ప్రతి విశ్వాసియు పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమైయుండెను.

క్రీస్తునుగూర్చి భిన్నాభిప్రాయములు (7:40-53)

7:40,41 ఆయన బోధ వినువారందరు ద్వితీ 18:15,18 లో మోషే చెప్పిన ప్రవక్త యితడేయని ఒప్పుకొనిరి. వారిలో కొందరు యేసే క్రీస్తనియు లేక మెస్సీయ అనియు ఒప్పుకొనిరి. మరికొందరు ఇది అసాధ్యమనిరి, యేసు గలిలయలోని నజరేతునుండి వచ్చెనని నమ్మిరిగాని మెస్సీయ గలిలయనుండి వచ్చునని పాత నిబంధనలోని లేఖనములలో ఎచ్చటను వ్రాయబడలేదని వారి నమ్మకము.

7:42, 43 మెస్సీయ బేత్లహేమునుండి వచ్చుననియు, దావీదు వంశమునుండి వచ్చుననియు, యూదులు కచ్చితముగా నమ్మిరి. యేసు బేత్లహేములో జన్మించుననియు మరియు దావీదు వంశీయుడనియు వారు కనుగొనినట్లుగా చెప్పబడలేదు. వారియొక్క సహజసిద్ధమైన నిర్లక్ష్య స్వభావమునుబట్టియు, భేదాభిప్రాయములనుబట్టియు వారిలో క్రీస్తునుగూర్చి వివిధములైన ఉద్దేశ్యములు కలిగియుండిరి.

ఇప్పుడును ఇంతే సంభ వించుచున్నది. యేసునుగూర్చిన విషయములందు స్త్రీ పురుషులు విభజింపబడిరి. ఆయన మనవలె ఒక మానవుడని కొందరు చెప్పుదురు. మరియు కొందరు ఇట్టివాడు ఇంతకుమునుపు జీవించియుండలేదని చెప్పుదురు. అయితే దేవుని వాక్యమును అంగీకరించువారు ప్రభువైన యేసుక్రీస్తు అన్నిటికిపైగా దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడైయున్నాడని నమ్ముచున్నారు.

7:44 ఆయనను పట్టుకొన ప్రయత్నములు జరుగుచుండెనుగాని ఆయనను పట్టు కొనుటకు ఎవరును ముందడుగు వేయలేకపోయి విఫలులైరి. ఒక వ్యక్తి దేవుని చిత్తప్రకారము జీవించినంత కాలము ఈ లోకములోని ఏ శక్తియు అట్టివానికి అభ్యంతరము కల్గించదు. “మన పనులను మనము పూర్తిచేయువరకు మనము జీవించియే యుందుము.” ప్రభువైన యేసుయొక్క సమయమింకను రాలేదు గనుక ఎవడును ఆయనకు హానిచేయ తెగింపలేదు.

7:45-47 పరిసయ్యులును ప్రధాన యాజకులును ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి. బంట్రౌతులు తిరిగి వచ్చిరిగాని వారితో ప్రభువు లేడు. అయితే ప్రధాన యాజకులును, పరిసయ్యులను బహుగా కలవరపడి ఈ బంట్రౌతు లాయనను పట్టుకొనలేని కారణమేమని యడిగిరి.

అప్పుడు బంట్రౌతులాయనను అంగీకరింపక పోయినప్పటికి ఆయననుగూర్చి మంచి సాక్ష్యమిచ్చిరి “ఆయన మాట్లాడి నట్లు ఎవడును మాట్లాడలేదని” చెప్పిరి. వారెంతోమంది అధికారులు మాట్లాడుట వినియున్నారు గాని, ప్రభువు మాట్లాడిన విధముగా అధికారముతోను, జ్ఞానముతోను, దయగలిగిన మాటలు ఎవరును మాటలాడలేకపోయిరి.

యేసును పట్టుకొనుటలో మోసపోయిన బంట్రౌతులను భయపెట్టుటకై వారు బంట్రౌతులను దూషించిరి.

7:48 అధికారులలో ఎవడును ఆయనయందు విశ్వాసముంచలేదని వారు చెప్పిరి. ఇది ఎంతటి ఘోరమైన విషయమోగదా! యూదా మతాధికారులలో ఒక్కరైనను ఆయనను మెస్సీయగా గుర్తించకుండుట ఎంత సిగ్గుకరమైన సంగతి! పరిసయ్యులు తమ ప్రభువైన యేసునందు విశ్వాసముంచుటకు అంగీకరింపక పోవుటయేగాక, ఇతరులనుకూడ ఆయనను అంగీకరించుటకు ఒప్పుకొనరు. ఈ దినములలో కూడ ఇట్లే జరుగుచున్నది. తాము రక్షింపబడుటకు ఇష్టములేని వారందరు తమ శక్తినంతయు నుపయోగించి తమ బంధువులను స్నేహితులను రక్షణలోనికి రానీయరు.

7:49-53 ఆ తరువాత పరిసయ్యులు యూదా జనాంగమును శాపగ్రస్తమైన జనము అని చెప్పిరి. ఎవనికైనను లేఖన భాగములు తెలిసియుండిన యెడల వారు కచ్చితముగా యేసు యెస్సీయకాడని చెప్పుదురా? ఇంతకంటే వారు చేయు తప్పిదము మరేదియు లేదు.

క్రీస్తునుగూర్చి భిన్నాభిప్రాయములు (7:40-53)

ఈ సమయమందు నీకొదేము వారితో మాట్లాడెను. ఇంతకు ముందు నీకొదేము ప్రభువునొద్దకు వచ్చి ఆయనను రక్షకునిగా అంగీకరించి రక్షించబడి యుండెనని మనకు తెలియును. అతడు అక్కడ కూడియున్న అధికారులందరి యెదుట ముందుకువచ్చి ప్రభువునుగూర్చి ఒకమాట మాటలాడ తెగించెను, యూదులు యేసుకు అవకాశ మివ్వలేదని నీకొదేము ఆరోపించెను.

ఒకడు చేసినదంతయు తెలిసికొనక మునుపు యూదుల ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చదనుట కద్దు. అయినప్పటికి యూదా మతాధికారులు ఆయనకు తీర్పు తీర్చుటకు పూనుకొనుచున్నారు.

వారు జరుగుచున్న వాస్తవములకు భయపడుచున్నారా? నీకొదేము వారితో సమానమైన అధికారము కలిగినప్పటికి వారతనిని అపహసించుచు ఆయనను వెంబడించు గలిలయులలో నీవును ఒకడవా? అని అడిగిరి.

గలిలయనుండి ఏ ప్రవక్తయు పుట్టడని లేఖన భాగములు చెప్పుట లేదా? అని వారు అనిరి. ఇట్లు వారియొక్క అజ్ఞానమును వెల్లడించిరి. వారు ప్రవక్తయైన యోనాను గురించి చదువలేదా? యోనా గలిలయ నుండి వచ్చెను.

ఇప్పటికి పర్ణశాలల పండుగ ముగియవచ్చినది. ప్రజలు తమతమ ఇండ్లకు వెళ్ళుచుండిరి. వారిలో కొందరు రక్షకుని ముఖాముఖిగా కలిసికొని ఆయన యందు విశ్వాసముంచిరి. అయితే ప్రజలలో పెక్కుమంది ఆయనను తృణీకరించిరి. మరియు యూదా మతాధికారులు ఆయనను చంపుటకు స్థిరముగా నిశ్చయించుకొనిరి. వారాయనను తమ మతమునకు, తమ జీవన సరళికి అడ్డుబండగా యుండెనని తలంచిరి.

పరలోకమునుండి వచ్చిన ఆహారము – Bible Verses Chapter 6 in Telugu

ఆరవ అధ్యాయము

పరలోకమునుండి వచ్చిన ఆహారము

నాల్గవ సూచకక్రియ –
ఐదువేలమందికి ఆహారము పెట్టుట 6:1-15) :

6:1-4 “అటు తరువాత” అనగా 5వ అధ్యాయములో వ్రాయబడిన సంగతులు జరిగిన తరువాత కొంత సమయము గడచిపోయెనని అర్థము. అది ఎంత సమయము గడచెనో మనకు తెలియదు. అయితే ప్రభువు యెరూషలేము చుట్టు ప్రక్కల ప్రాంతములు సంచరించి గలిలయ సముద్రము నొద్దకు వచ్చెను.

ఆయన సముద్రము దాటి అద్దరికి వెళ్ళెననగా – వాయువ్య దిశలోని సముద్ర తీరమునుండి ఈశాన్య తీరమునకు వెళ్ళెనని అర్థము. గలిలయ సముద్రమును తిబెరియ సముద్రమనికూడ పిలుతురు. ఎందుకనగా తిబెరియ పట్టణము దానియొక్క పడమటి ఒడ్డున ఉన్నది.

తిబెరియ పట్టణము గలిలయ ప్రాంతమునకు ముఖ్యపట్టణము. మరియు రోమా చక్రవర్తి “లిబేరియస్” అను పేరును బట్టి ఆ పట్టణమునకాపేరు వచ్చెను. అక్కడ బహు జనులాయనను వెంబడించిరి. అయితే వీరు ఆయన దేవుని కుమారుడని నమ్ముటవలన ఆయనను వెంబడించినవారు కాదుగాని, ఆయన అద్భుతములు చేయగా చూచి ఆయనను వెంబడించిరి.

ఆ ప్రాంతమందు పేరెన్నికగొన్న పర్వత మొకటి కలదు. ప్రభువైన యేసు తన శిష్యులతో ఆ కొండపైకి ఎక్కి వెళ్ళెను. పస్కా పండుగ సమీపించెనని యోహాను ఎందుకు వ్రాసెనో వివరముగా తెలుపలేదు.

Read and Learn More Telugu Bible Verses

అయితే యీ అధ్యాయములో ప్రభువైన యేసు జీవాహారమును గురించి అద్భుతరీతిగా మాట్లాడు చున్నప్పుడు పస్కా పండుగను గురించి తలంచెనని కొందరు చెప్పుదురు ఈ పస్కా పండుగకు యేసు యెరూషలేమునకు వెళ్ళియుండలేదు.

పస్కా పండుగ అనునది “యూదుల పండుగ” యని సువార్తికుడైన యోహాను చెప్పియుండెను. వాస్తవముగా యీ పండుగను దేవుడు నియమించి యూదుల కనుగ్రహించుటనుబట్టి ఇది యూదులు పండుగయైనది. అయితే యూదుల పండుగయని పిలుచుటలో దేవుడు దీనిని “యెహోవా పండుగ” గా గుర్తించలేదని భావము. ఎందుకనగా యూదులు ఈ పండుగను ఒక ఆచారముగా చేయుచున్నారుగాని హృదయపూర్వకముగా ఆచరించుటలేదు.

6:5,6 యేసు బహుజనులు గుంపుగా కూడి వచ్చుట చూచినప్పుడు ఆయన తన శిష్యులతో ఆ కొండపై ఏకాంతముగా గడుపు ఆ విశ్రాంతి సమయమును భంగపరచు చున్నారని ఎంతమాత్రము కోపపడలేదు. ఆయన మొదటిగా వారికి ఆహారము పెట్ట తలంచెను. కనుక వారు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుమనియేసు ఫిలిప్పునడిగెను.

ఇతరులకు బోధించుటకే యేసు ఈ ప్రశ్నను అడిగెను గాని తనకు తెలియకకాదు ఆయనకు ఆ ప్రశ్నకు సమాధానము తెలియునుగాని ఫిలిప్పుకు తెలియదు. ఇక్కడ ప్రభువు ఫిలిప్పుకు ఒక అమూల్యమైన పాఠమును నేర్పదలంచి అతనియొక్క విశ్వాసమును పరీక్షించెను. ఈ జనసమూహమునకు ఆహారము పెట్టుటకు తాను చేయబోవు అద్భుతమును ఆయన ఎరిగియుండెను.

అయితే ప్రభువు అద్భుతము చేయగలడని ఫిలిప్పు తలంచెనా? ఫిలిప్పు విశ్వాసము గొప్పదా? లేక అల్పమైనదా?

6:7 ఫిలిప్పు విశ్వాసము ఉన్నత శిఖరము నధిరోహించినట్లుగా మనకిక్కడ అగుపించుటలేదు.  అతడు వెంటనే లెక్కించి రెండువందల దేనారముల ఖరీదుగల ఆహారము వారిలో ప్రతి ఒక్కరు కొంచెము కొంచెముగా తీసికొనుటకుకూడ చాలదని చెప్పెను. ఎన్ని రొట్టెలు కొనవలెనో కచ్చితముగా తెలియదు.

పెద్ద మొత్తములోనే ఆహారము కావలసి యుండెను. దేనారము అనగా ఒక కార్మికునియొక్క రోజుకూలి.

6:8 సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ అచ్చట ఉండెను. వారిరువురు గలిలయ సముద్ర తీరములోని బేత్సయిదా ప్రాంతమందు నివసించుచుండెడివారు

6:9 ఇంత గొప్ప జనసమూహమునకు ఆహారము పెట్టుట బహు కష్టతరమైన సంగతియని అంద్రెయ తేల్చిచెప్పెను. అయినను అతడు అక్కడొక బాలునియొద్ద ఐదు యవల రొట్టెలను, రెండు చిన్న చేపలున్నట్లు గుర్తించెను. అయితే వీటిద్వారా యీ గొప్ప జనసమూహముయొక్క ఆకలి తీర్చ ప్రయత్నించుట నిష్ప్రయోజనమని తలంచెను.

ఆ చిన్నవానియొద్ద ఎక్కువ ఆహారము లేకపోయినప్పటికి అది అంతయు ప్రభువైన యేసు కిచ్చుటకు అతడు ఇష్టపడెను. తత్ఫలితముగా ఈ వృత్తాంతము నాల్గు సువార్తలయందు వ్రాయబడెను. ఆ చిన్నవాడు గొప్పకార్యమేమియు చేయలేదు. కాని, అది కొంచెమే అయినను ఆ కొంచెమందు దేవుడున్నయెడల అదే ఎక్కువ. దీనినిబట్టి ఆ చిన్నవాడు ప్రంపంచమంతట ప్రసిద్ధికెక్కెను.

6:10 ఈ వచనమందు వాడబడిన “జనులు” అను మాటకు ‘స్త్రీ పురుషులు’ అని భావము. ప్రభువైన యేసు వారిని పంక్తులుగా తీర్చి కూర్చుండబెట్టుట వారియొక్క సౌలభ్యముకొరకే పచ్చికగల చోటును ఆయన ఎన్నుకొనుటను గమనించుడి, ఆ ప్రాంతమందు పచ్చికగల ప్రదేశమును కనుగొనుట కష్టమే. అయినప్పటికి పరిశుభ్ర మైన ఆహ్లాదకరమైన ప్రదేశమందు ఆ జనులను కూర్చుండబెట్టుటలో ప్రభువు జాగ్రత్త వహించెను.

ఆ జనసమూహమందు ఐదువేలమంది పురుషులుండిరి అనగా వీరికితోడు స్త్రీలు పిల్లలు అనేకులు కలరని అర్థము. ఐదు వేలమంది పురుషులని చెప్పుటలో ఎంత గొప్ప అద్భుత కార్యము జరుగనైయున్నదో తెలియజేయుచున్నది.

6:11. యేసు ఆ ఐదు రొట్టెలు చేతపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను. ఆహార మును వడ్డించి పెట్టకమునుపు లేక వడ్డించకమునుపు యేసు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినయెడల మనము కూడ ఆహారము భుజించకమునుపు మనమెంతగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెనో గదా! ఆ తరువాత ఆయన ఆ ఆహారమును తన శిష్యులకు పంచి ఇచ్చెను.

ప్రభువు ప్రతిపని తనంతట తానేదియు చేయలేదు. ఇతరుల పరిచర్యను ఆయన తన పరిచర్యగా పరిగణించెను. “నీవు చేయగలిగినది నీవు చేయుము” “నేను చేయగలిగినది నేను చేయుదును” “మనము చేయలేని దానిని ప్రభువు చేయును” అని దీని విషయములో బాగుగా చెప్పబడినది.

ఆయన తన శిష్యులకు పంచి ఇచ్చునపుడు ఆ యాహారము ఆశ్చర్యకరముగా విస్తారమాయెను. ఈ అద్భుతము ఏ క్షణములో సంభవించెనో మనమెరుగము గాని ఐదు రొట్టెలు. రెండు చిన్నచేపలు ప్రభువు చేతులలో ఈ గొప్ప జనసమూహము తినుటకు సరిపోయినంత ఆహారమాయెనని మనము ఎరుగుదుము. కూర్చుండిన ప్రజలకు రొట్టెలను, చేపలను శిష్యులు పంచిపెట్టిరి.

వారికి “ఇష్టమైనంతమట్టుకు” చేపలుకూడ వడ్డించిరి. అనగా ఆహారపు కొరత లేదని భావము, ఈ అద్భుత కార్యములో సృష్టికార్యము మిళితమైయున్నది. ఒక సామాన్యమానవుడెవడును ఐదు రొట్టెలు రెండు చేపలు తీసికొని యీ విధముగా విస్తారపరచలేడు. ఆయన ఆ రొట్టెలను ఆశీర్వదించినప్పుడు అది ‘తొలకరి’ వానయనియు ఆయన ఆ రొట్టెలను విరిచి నపుడు అది ‘కోతకాలమనియు’ సరిగా పోల్చిచెప్పబడినది.

6:12 మిగిలిన ముక్కలు ప్రోగుచేయుడని ప్రభువు తన శిష్యులకు చెప్పిన మాటలు మన హృదయములను ఎంతగానో తాకుచున్నవి. యేసు కేవలము మానవుడైయున్న యెడల మిగిలిపోయిన ముక్కలను గురించి ఆలోచించువాడు కాదు.

పరలోకమునుండి వచ్చిన ఆహారము నాల్గవ సూచకక్రియ - ఐదువేలమందికి ఆహారము పెట్టుట 6:1-15) :

ఐదువేలమందిని పోషించిన మానవుడెవడు మిగిలినపోయిన ముక్కలను గురించి ఆలోచించడు. యేసు దేవుడు గనుక, దేవుని దాతృత్వమందు ‘వృధా’ యనునది ఉండదు. ఆయన మన కప్పగించిన అమూల్యమైన వస్తువులను మనము వృధా చేయకూడదు. గనుకనే ఆయన ఏమియు మిగులకుండ మిగిలిన ముక్కలను ప్రోగుచేయుడని చెప్పెను.

ఈ అద్భుతమును గురించి మరికొందరు ఇట్లు చెప్పుదురు. ఆ చిన్నవాడు ప్రభువు కిచ్చిన ఐదు రొట్టెలను, రెండు చేపలను ఆ జనసమూహముచూచి తామెంతో స్వార్థ పరులమని గ్రహించి వారి భోజనపుమూటలను విప్పి ఒకరితో ఒకరు పంచుకొనిరని వ్యాఖ్యానించుచున్నారు.

ఇట్లు ప్రతి ఒక్కరికి సమృద్ధియైన ఆహారముండెనని చెప్పుదురు. 6:13 కాని ఆ జనసమూహము తృప్తిగ (భోజనము) భుజించిన తరువాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపలు ఎత్తిరి. వారు ఎవరో తెచ్చుకొనిన భోజనము భుజించుట వలనగాని, లేక ఒకరితో ఒకరు పంచుకొనుట వలనగాని ఇంత విస్తారమైన ఆహారము మిగులుట సాధ్యమేనా ! నిశ్చయముగా అట్లు జరుగనే జరుగదు. గొప్ప అద్భుతకార్య మిక్కడ సంభవించెను.

6:14,15 ప్రజలు ఈ అద్భుతమును గుర్తించిరి. ఈ అద్భుతమునుబట్టి ఈ లోకమునకు రానైయున్న ప్రవక్త ఈయనేయని వారు ఒప్పుకొనిరి. ఒక ప్రవక్త వచ్చునని వారెరుగుదురు. ఆయన వచ్చి తమ్మును రోమా ప్రభుత్వాధికారము నుండి విడిపించు నని ఆయనకొరకు కనిపెట్టుచున్నారు. కాని యేసు దేవుని కుమారుడని మాత్రము వారు ఒప్పుకొనుటకు ఇష్టపడరు. మరియు వారి పాపములను ఒప్పుకొని ఆయనను తమ రక్షకునిగా అంగీకరించుటకుకూడ ఇష్టపడరు.

యేసు చేసిన యీ అద్భుతకార్య మునుబట్టి ప్రజలాయనను రాజుగా చేయదలంచిరి. అయితే వారియొక్క శరీరాశలకు యేసు కదిలింపబడలేదు. పాపులకు ప్రతిగా ఆయన కలువరిలో సిలువపై మరణించు టకు ఈ లోకములోనికి వచ్చెను. ఆ గురినుండి ఆయన ఎంతమాత్రము తొలిగిపోడు. ఆయన హెచ్చింపబడక మునుపు శ్రమపొంది రక్తము కార్చి మరణించవలసియున్నది.

ఐదవ సూచకక్రియ
యేసు నీళ్ళపై నడచి తన శిష్యులను కాపాడుట (6:16-21) : 6:16,17

అది సాయం సమయము. యేసు ఒంటరిగా కొండకు వెళ్ళెను. జన సమూహము తమతమ ఇండ్లకు వెళ్ళిరి. శిష్యులు తిరుగు ప్రయాణమై గలిలయ సముద్రమును దాటుటకు సముద్రపు ఒడ్డునకు చేరిరి.

కపెర్నహూమునకు వెళ్ళవలెనని వారు సముద్రమును దాటుచుండగా చీకటిపడెను. ప్రభువు వారితో లేడు. ఆయన కొండపై ప్రార్థించుచుండెను. నేటి దినములలోని క్రీస్తు అనుచరులకు ఇది చక్కని పటము కాదా! తుఫానుతో కూడిన జీవితసాగరములో వారు పయనించుచున్నారు.

ఇది చీకటివేళ, ప్రభువైన యేసు ప్రత్యక్షముగా ఎక్కడను కనిపించుటలేదు. దీనినిబట్టి ఏమి జరుగుచున్నదో ఆయన గమినించుటలేదని అర్థమా? కాదు. ఆయన పర మందుండి తాను ప్రేమించువారికొరకు ప్రార్థించుచుండెను.

6:18 గలిలయ సముద్రము తరుచుగా తుఫానులకు గురియగుచుండును. యోర్దాను నదీలోయయందు వీచిన గాలులు ఈ సముద్రమందు పర్వతమంత అలలను పుట్టించును. ఆ సమయమందు చిన్న చిన్న దోనెలు ఆ సముద్రమందు ప్రయాణించుట క్షేమముకాదు.

శిష్యులు దాదాపుగా 25 నుండి 30 ఫర్లాంగులు లేక సుమారు 3 నుండి 4 మైళ్ళ దూరము నావలో ఆ సముద్రముపై ప్రయాణము చేసిరి. ఇప్పుడు వారు తుఫాను ప్రమాదములో చిక్కుకొనిరి. ఇంతలో అకస్మాత్తుగా వారు యేసు ఆ నీళ్ళపై నడచి వచ్చుట చూచిరి. ఆయన వారిని సమీపించగా వారు భయపడిరి.

ఐదవ సూచకక్రియ యేసు నీళ్ళపై నడచి తన శిష్యులను కాపాడుట (6:16-21) : 6:16,17

ఎంత సహజముగా ఈ వృత్తాంతము చెప్పబడెనో గమనించుడి, మిక్కిలి ఆశ్చర్య కరమైన వాస్తవములు మనకు చెప్పబడెనుగాని, జరిగిన గొప్ప కార్యము విని మనము ముగ్దులమగునట్లుగా యెహాను గంభీరమైన మాటలతో ఈ వృత్తాంతమును వివరించు టకు ప్రయత్నించలేదు. కాని వారికి ఎదురైన ఆటంకమును తేటగా వివరించెను.

6:20 అప్పుడు ప్రభువైన యేసు “నేనే, భయపడకుడి” అని చెప్పి వారినాదరించెను. శక్తిమంతుడైన సృష్టి నిర్మాణకుడు నిర్వాహకుడు వారిచెంతనే యుండెను. ఇంక వారు భయపడుటకు హేతువులేదు.

గలిలయ సముద్రమును కలుగజేసినవాడే తుఫాను అలజడికి లేచిన నీటి తరంగములను సద్దణిపి, తన శిష్యులను క్షేమముగా ఒడ్డుకు చేర్చగలడు. ‘నేనే’ అను మాటకు వాస్తవముగా ‘నేను ఉన్నవాడను అని అర్ధము. ఈ యోహాను సువార్తలో రెండవసారిగా యేసు తనంతట తానే తనకు యెహోవా నామమును ఉపయోగించుకొనెను.

6:21 ఆయన ప్రభువని వారు గుర్తించినప్పుడు వారాయనను తమదోనెలోనికి ఆహ్వానించిరి. వారాయనను చేర్చుకొనగా వారు చేరవలసిన గమ్యమునకు చేరిరి. ఇక్కడ మరొక అద్భుతమును గురించి చెప్పబడినదిగాని, వివరించబడలేదు. ఇక వారు దోనెను నడపనవసరములేదు. తక్షణమే ప్రభువు వారిని దరికి చేర్చెను. ఆయన ఎంత ఆశ్చర్యకరుడో గదా!

ప్రజలు సూచకక్రియ నడుగుట (6:22-34) :

6:22 ఇది మరుసటి దినము. గలిలయ సముద్రమునకు ఈశాన్య ప్రాంతమందు బహుజనులు ఇంకను నిలిచియుండిరి. గడచిన సాయంకాలమందు ఒక చిన్న దోనెలో శిష్యులు మాత్రమే ఎక్కివెళ్ళిరని వారు గమనించిరి. మరియు ప్రభువైన యేసు వారితో వెళ్ళలేదనికూడ వారు గుర్తించిరి. ఆ సమయమున అక్కడ ఆ ఒక్క దోనె మాత్రమే యుండుటచేత ఆ దోనెలో శిష్యులు వెళ్ళిరి.

6:23 మరుసటి దినమున మరికొన్ని దోనెలు ప్రభువు ఐదువేల మందికి ఆహారము పెట్టిన స్థలమునొద్దకు చేరెను. అయితే ప్రభువు ఆ దోనెలలో అక్కడనుండి వెడలిపోలేదు. ఎందుకనగా అవి అప్పుడే ఆ స్థలమునకు వచ్చెను. బహుశ ఆ చిన్న దోనెలలోనే ఆ ప్రజలు సముద్రము దాటి కపెర్నహూమునకు చేరియుండ వచ్చునని మనము తరువాత వచనములద్వారా తెలిసికొనగలము.

6:24 ఈ గుంపు ప్రభువును అతి జాగ్రత్తగా గమనించుచుండిరి. ఆయన కొండపై ప్రార్ధించుటకు వెళ్ళెనని వారికి బాగుగా తెలియును. ఆయన శిష్యులతో కలసి సముద్ర మును దాటి వెళ్ళియుండలేదని వారికి తెలియును. అయినను ఆ మరుసటి దినమందు వారెక్కడను ఆయనను కనుగొనరైరి.

కనుక వారు సముద్రమును దాటి సాధారణముగా శిష్యులుండు కపెర్నహూమునకు వెళ్ళదలంచిరి. అయితే యేసు అక్కడికి ఎటువెళ్ళెనో వారికి తెలియదుగాని, వారాయనను వెదుకుచు వెళ్ళిరి.

6:25 – 27 వారు కపెర్నహూమునకు వెళ్ళినపుడు ఆయనను అక్కడ కనుగొనిరి. వారు తమ ఉత్సాహమును అణచుకొనలేక నీ వెట్లు ఇక్కడకు వచ్చితివని వారాయనను అడిగిరి. వారి ప్రశ్నకు ప్రభువు సూటిగా జవాబివ్వలేదు. ఎందుకనగా వారు ఆయన ఇచ్చు ఆహారముకొరకే ఆయనను వెదుకుచున్నారుగాని, ఆయన ఎవరోయని తెలిసికొను నిమిత్తము ఆయనను వెదుకుటలేదని ప్రభువు ఎరిగియుండెను.

గత దినమున ఆయన చేసిన అద్భుత కార్యమును వారు కన్నులారా చూచిరి. దానినిబట్టి వారాయనను సృష్టికర్తగాను, మెస్సీయగాను తప్పక ఒప్పుకొనవలెను. అయితే వారి ఆసక్తియంతయు ఆహారమందే యున్నది.

ప్రభువు యిచ్చిన రొట్టెలు తిని ఆకలి తీర్చుకొనిరి. కనుక యేసు వారితో క్షయమగు ఆహారముకొరకు శ్రమ పడకుడని చెప్పెను. వారు తమ అనుదిన జీవనము కొరకు పనిచేయవద్దని ఆయన ఉద్దేశ్యము కాదు.

కాని ఆహార సంపాద్యమే వారి జీవితములో ముఖ్యోద్దేశ్యముగా నుండరాదని ప్రభువుయొక్క భావము. ఆకలితీరి తృప్తిపడుటయే జీవిత లక్ష్యము కాదు. మానవుడు ఒక్క శరీరమును మాత్రమే కలిగియుండలేదు.

గాని ఆత్మ, ప్రాణము దేహమును కలిగియుండెను. గనుక నిత్యజీవము కలుగజేయు అక్షయాహారము కొరకు మనము ప్రయాసపడవలెను. అనగా, ఆత్మీయాహారము లేక ప్రభువైన యేసుయొక్క బోధ నాశింపవలెనని యర్థము.

శరీరాహారముయొక్క విలువ సమాధితో అంతమగును. అయితే ప్రభువైన యేసుయొక్క మాటల విలువకు ఎన్నడు అంతము లేదు. అవి నిత్యజీవమనుగ్రహించును. మానవుడు శరీరావసరముల నిమిత్తము జీవించరాదు. దేవునియొక్క మాటచే తనయొక్క ప్రాణము దినదినము పోషించబడునట్లు నిశ్చయముగా చూచుకొనవలెను.

మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడుగాని, దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాటవలన జీవించును. దేవుని వాక్యముయొక్క శ్రేష్ఠమైన జ్ఞానమును సంపాదించు నిమిత్తము మనము అలయక ప్రయాసపడవలెను.

ఈ వచనముయొక్క చివరి భాగములో ప్రభువైన యేసు తండ్రియైన దేవుడు తనకు ముద్రవేసి యున్నాడని చెప్పెను. అనగా దేవుడాయనను పంపెననియు, మరియు ఆయనను ఆమోదించెననియు అర్థము. మనము ఏదేని ఒక విషయమునకు ముద్రవేసితిమంటే, అది సత్యమని మనము వాగ్దానము చేయుచున్నామని అర్ధము. దేవుడు మనుష్యకుమారునికి ముద్రవేసి యున్నాడనగా, ఆయన సత్యమును పలుకు వానిగా దేవుడు ఆయనను ప్రతిష్టించుచున్నాడు.

ప్రజలు సూచకక్రియ నడుగుట (6:22-34) :

6:28, 29 వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ప్రభువును అడిగిరి. పరలోకము చేరుటకు మానవుడు తన స్వంత మార్గములలోనే ప్రయత్నించుచున్నాడు. రక్షణ పొందుటకు తానేదియో చేయవలెనని మానవుడు ఆశించుచున్నాడు.

అయితే వారి వేషధారణ యేసు ఎరిగియుండెను. దేవునికొరకు పనిచేయుచున్నట్లుగా నటించుచున్నారుగాని దేవునికుమారుని విషయములో తమ కేమియు సంబంధములేనట్లుగానున్నారు. అయితే ప్రభువు ఎవరిని పంపెనో ఆయనను వారు మొదట తప్పక అంగీకరించవలెనని ప్రభువు చెప్పెను.

ఈ దినములలోకూడ ఇట్లే జరుగుచున్నది. అనేకులు తమయొక్క సత్రియలద్వారా పరలోకమునకు వెళ్ళు మార్గమును వెదకుచున్నారు. అయితే వారు దేవునికొరకు సత్రియలు చేయనారంభించు టకు ముందు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలసి యున్నారు.

సత్రియలు రక్షణను అంటి వెంబడించునుగాని రక్షణ సత్రియలను వెంబడించదు. అనగా క్రియలు రక్షణ తరువాతే గాని రక్షణకు ముందుకాదు. ఒక పాపి తన పాపములను ఒప్పుకొని యేసు క్రీస్తును ప్రభువుగాను, రక్షకునిగాను అంగీకరించుటయే సత్రియ.

6:30 మానవునిది ఎంత దుష్ట హృదయమోగదా! నిన్ననే యేసుప్రభువు ఐదువేల మంది పురుషులకు ఐదు రొట్టెలు, రెండు చేపలు పంచిపెట్టుటను చూచిరి. కాని నేడు నీవు దేవుని కుమారుడవని ఋజువు పరచుకొనునట్లు మాకొక సూచకక్రియ చూపుమని వారు అడుగుచున్నారు.

వారు పాత నిబంధనలో చెప్పబడిన మన్నాను గూర్చిన అద్భుత కార్యమును యూదులు యేసు ప్రభువుకు గుర్తుచేసిరి. అనగా ఆ దినములలో దేవుడు చేసిన గొప్ప కార్యముకంటె, ప్రభువుచేసిన యీ కార్యము ఎన్నతగినది కాదని వారి అభిప్రాయము. మరియు వారు భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని కీర్తన 78:24,25 లోని సంగతిని ఎత్తి చెప్పిరి.

మోషే వారికొరకు పరలోకమునుండి ఆహారమును కురిపించెను. కాని ప్రభువు ఉన్నదానినే (తనకిచ్చిన ఆహారమును) ఎక్కువ చేసెను. కాబట్టి ప్రభువు మోషేకంటే గొప్పవాడుకాడని వారి ఉద్దేశ్యము.

పరలోకమునుండి వచ్చిన ఆహారము Bible Verses Chapter 6

6:32 మన్నాను ఇచ్చినది మోషే కాదనియు, దేవుడు దానిని వారికిచ్చెననియు యేసు వారికి ప్రత్యుత్తరమిచ్చెను. అయితే మన్నా పరలోకమునుండి వచ్చిన నిజమైన ఆత్మీయ ఆహారము కాదు. మన్నా అనునది అక్షరార్థమైన ఆహారము. ఇది శరీర పోషణార్ధమై యివ్వబడిన ఆహారము.

ఇది జీవిత కాలమువరకే ప్రయోజనమైనదిగాని ఆ తరువాత జీవితమునకు నిష్ప్రయోజనమైనది నిజమైనదియు, ఉన్నతమైనదియు, వాస్తవమైనదియు పరలోకమునుండి దేవుడనుగ్రహించు ఆహారమును గూర్చి ప్రభువైన యేసు చెప్పుచుండెను. ఈ ఆహారము ఆత్మకొరకేగాని శరీరము కొరకుకాదు. ‘నా తండ్రి’ అని చెప్పుటలో క్రీస్తు తన దైవత్వమును గూర్చి వక్కాణించుచున్నాడు.

6:33 పరలోమునుండి దిగివచ్చి ఈ లోకమునకు జీవమనుగ్రహించునదే దేవుడిచ్చు ఆహారమైయున్నది. ఇప్పుడు తాను దేవుడిచ్చు ఆహారమని ప్రభువైన యేసు తన్నుగూర్చి ఇక్కడ చెప్పుటలేదుగాని, దేవుడిచ్చు ఆహారము పరలోకమునుండి దిగివచ్చి జీవ మనుగ్రహించునని చెప్పెను.

దేవుడు ఆరణ్యములో కురిపించిన మన్నాకంటే ఈ ఆహారము శ్రేష్ఠమైనది. మన్నా జీవమనుగ్రహించదు గాని శరీరమును బలపరచును. మన్నా ఈ లోకమంతటికొరకు కాదుగాని ప్రత్యేకించి ఇశ్రాయేలు జనాంగము కొరకు ఇవ్వబడెను. పరలోకమునుండి వచ్చిన నిజమైన ఆహారము మానవులకు జీవము ఇచ్చును. అది ఒక్క జాతికేగాక సర్వ మానవాళికి అనుగ్రహింపబడెను.

6:34 అయితే యూదులు ‘తానే ఆ నిజమైన ఆహారమై యుండెనని ప్రభువైన యేసు చెప్పుచున్నట్లు’ ఇంకను గ్రహించక ఆ ఆహారమును తమకు దయచేయుమని వారాయనను అడుగుచున్నారు. వారింకను అక్షరార్థమైన ఆహారముకొరకు అడుగు చుండిరే గాని, వారి హృదయములందు నిజమైన విశ్వాసములేక యుండిరి.

“జీవాహారము నేనే” (6:35-65) :

6:35 జీవాహారము తానే యనెడి సత్యమును ఇప్పుడు ప్రభువైన యేసు చక్కగా తేటగా వివరించెను. ఆయన జీవాహారమైయుండెను. ఆయన యొద్దకు వచ్చువారు తమ ఆత్మసంబంధమైన ఆకలి ఆయనయందు శాశ్వతముగా తృప్తిపరచబడుటను కనుగొందురు. ఆయనయందు విశ్వాసముంచువారి దాహముకూడ శాశ్వతముగా తీర్చబడుట కనుగొందురు.

“నేనే” అను పదము ప్రభువైన యేసు తాను ‘యెహోవా’తో సమానునిగా చేసికొనుటను తెలియజేయుచున్నది. పాపాత్ముడైన మనుష్యుడు ఇట్టి మాటలను పలుకుట ఎంతో అజ్ఞానమే. తన స్వంత ఆత్మీయ దాహము ఆ తీర్చుకోలేని ఒక సామాన్య మానవుడెవడును ఈ ప్రపంచముయొక్క ఆత్మీయ దాహము, ఆత్మీయ ఆకలిని తీర్చజాలడు, మరియు తీర్చగలనని చెప్పజాలడు.

6:36 30వ వచనమందు అవిశ్వాసులైన యూదులు తాము చూచి నమ్మునట్లు ఒక సూచకక్రియ చేయుమని ప్రభువైన యేసును అడిగిరి. అయితే ప్రభువు వారితో – మీరు నన్ను చూచియున్నారని చెప్పెను.

అనగా ‘ఆయనే ఒక గొప్ప సూచకక్రియ, ‘ అయినను వారు ఆయనను విశ్వసించలేదు. దేవుని కుమారుడు సంపూర్ణమైన మానవునిగా వారియెదుట నున్నను; వారాయనను గుర్తించలేదు. అట్లయినచో మరి ఏ సూచకక్రియ చేసినను వారు దేవుని కుమారునిగా ఆయనను ఒప్పుకొనరని చెప్పుటలో ఎట్టి సందేహము లేదు.

6:37 యూదులలో ఉన్న అవిశ్వాసమునుబట్టి ప్రభువు నిరుత్సాహము చెందలేదు. తండ్రి ఉద్దేశ్యము ప్రణాళిక అంతయు నెరవేరవలసి యున్నదని ప్రభువు ఎరిగి యున్నాడు. తానెవరితో మాట్లాడుచుండెనో వారాయనను విశ్వసించక పోయినప్పటికి తండ్రి ఏర్పరచుకొనిన వారందరు ఆయన యొద్దకు వచ్చెదరు.

తిరుగులేని దేవుని నిత్యత్వపు ఆలోచనలయొక్క గ్రహింపు ఒక వ్యక్తికి ప్రశాంతతను పవిత్రమైన దైవభక్తిని, ధైర్యమును, పట్టుదలను కలిగించునుగాని మరేదియు ఇట్టి వాటిని ఆ వ్యక్తిలో కలిగించ జాలదని ‘పింక్’ వ్యాఖ్యానించెను.

ఈ వచనములో బైబిలునందలి రెండు ముఖ్యమైన సత్యములు యిమిడియున్నవి. గనుక ఇది చాల ప్రాముఖ్యమైనది. మొదటిగా దేవుడు కొంతమందిని క్రీస్తుకు అనుగ్రహించెను. ఆయన అనుగ్రహించిన వారందరు రక్షింపబడుదురు.

రెండవదిగా – మానవుడు బాధ్యతాజీవి. అనగా బాధ్యత గలవాడు. ఒకడు రక్షింపబడవలెనన్నచో వాడు ప్రభువైన యేసునొద్దకు వచ్చి విశ్వాసముతో ఆయనను అంగీకరించవలెను. దేవుడు కొందమందిని రక్షించుటకు ఎన్నుకొనెను.

గాని నాశనమునకు ఎన్నుకొనలేదు. ఎవడైనను రక్షింపబడినయెడల వాడు దేవునియొక్క ఉచితమైన కృపనుబట్టి రక్షింప బడెను. అయితే ఎవడైనను నిత్యనాశనమొందినయెడల అది వాని తప్పిదము మాత్రమే.

ప్రతివారు తమయొక్క పాపమునుబట్టియు, దుష్టత్వమునుబట్టియు నశించుదురు. నరకమునకు వెళ్ళువారందరు వారు పొందవలసిన దానినే వారు పొందుచున్నారు. తన కృపనుబట్టి దేవుడు దిగివచ్చి ఈ మానవజాతినుండి ఒక్కొక్కరిని రక్షించుచున్నాడు. ఇట్లు చేయుటకు ఆయనకు హక్కుగలదా ? అవును – అట్లు చేయుటకు ఆయనకు నిశ్చయముగా హక్కుగలదు.

దేవుడు తన చిత్తానుసారముగా ఏదైనను చేయగలడు. అయితే ఆయనకు గల ఈ హక్కును ఏ మానవుడు నిరాకరించలేడు. అయితే దేవుడు ఏ తప్పిదమునుగాని, అన్యాయమునుగాని చేయడు. దేవుడు కొందరిని రక్షణకు ఎన్నుకొనెను కాని మానవుడు సువార్తను నమ్మవలెను, అది అతని బాధ్యత.

ఎవడైనను ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచినయెడల వాడు రక్షింపబడునని దేవుడు సర్వజనులను ఆహ్వానించుచున్నాడు. వారి యిష్టమునకు వేరుగా దేవుడెవరిని రక్షింపడు. ఒకడు పశ్చాత్తాపముతోను, విశ్వాసముతోను తప్పక ఆయనయొద్దకు రావలసియున్నది. అప్పుడు వానిని దేవుడు రక్షించును. క్రీస్తుద్వారా తనయొద్దకు వచ్చినవానిని దేవుడు ఎంతమాత్రము త్రోసివేయడు.

మానవజ్ఞానము ఈ రెండు సత్యములను ఏకముచేసి సమాధానము కనుగొన జాలదు. మనము వాటిని గ్రహింపజాలక పోయినను వాటిని తప్పక నమ్మవలెను. ఇవి బైబిలు చెప్పుచున్న సత్యములు; ఈ వచనము వీటిని తేటగా విశదపరచెను.

6:38 37వ వచనమునందు తండ్రిద్వారా తనకు అనుగ్రహింపబడిన వారియొక్క రక్షణార్థమైన దైవ సంకల్పమంతయు కాలక్రమములో తప్పక నెరవేరునని ప్రభువైన యేసు చెప్పెను. ఇది తండ్రియొక్క చిత్తము గనుక ముఖ్యముగా తాను తండ్రి చిత్తమును నెరవేర్చుటకు వచ్చియుండెను గనుక ప్రభువైన యేసు వ్యక్తిగతముగా ఈ కార్యమును నెరవేర్చును.

“నేను పరలోకమునుండి దిగివచ్చితిని” అని ప్రభువైన యేసు చెప్పుటలో – తనయొక్క జీవితము బేత్లహేమునందు పశువుల తొట్టిలో ప్రారంభము కాలేదని తెలియజేయుచున్నాడు. అంతేగాక తాను తండ్రి యైన దేవునితో నిత్యత్వమంతటియందు ఉన్నాడు.

అనగా ఆయన నిత్యుడు. ఆయన ఈ లోకములోనికి వచ్చుటద్వారా ఆయన తండ్రికి విధేయుడైన కుమారుడని ఋజువగుచున్నది. అయితే తన తండ్రి చిత్తమును నెరవేర్చుటకై దాసుని స్వరూపమును ధరించెను. అనగా తన స్వంత చిత్తమును కలిగియుండలేదని భావము కాదుగాని, ఆయన చిత్తము తన తండ్రి చిత్తముతో సంపూర్ణముగా ఐక్యమైయుండెనని అర్థము.

6:39 తండ్రి చిత్తమేమనగా; క్రీస్తుకు అనుగ్రహింపబడిన ప్రతి ఒక్కరు రక్షింపబడి నీతిమంతుల పునరుత్థానము వరకు భద్రము చేయబడి, పునరుత్థానులై పరమునకు చేర్చబడుట తండ్రి చిత్తము.

"జీవాహారము నేనే” (6:35-65) :

ఈ వచనములోని “యేమియు” “దానిని” అను పదములు ఒక్క విశ్వాసిని గాక, విశ్వాసులందరిని సూచించుచున్నవి. వీరు గతించిన కాలముల నుండి రక్షింపబడిన విశ్వాసుల సమూహము (సంఘము) నకు సాదృశ్యముగా నున్నారు. ఈ విశ్వాసుల సమూహములో ఎవరును నశించకుండునట్లు అంత్యదినమున ఆ సంఘమును లేపుట ప్రభువైన యేసుయొక్క బాధ్యతయైయున్నది.

విశ్వాసుల విషయములో “అంత్యదినమనగా” ప్రభువైనయేసు వారి కొరకు (సంఘము కొరకు) ఆకాశమండలమునకు (మధ్యాకాశమునకు) వచ్చు దినము. ఆ దినమున విశ్వాసులు ఆయనతో సదాకాలముండుటకు ఆయనను ఎదుర్కొనుటకు మేఘములమీద కొనిపో బడుదురు. అయితే యూదుల విషయములో అంత్యదినమనగా మహిమతో వారికొరకు మెస్సీయ వచ్చుదనమే.

6:40 ఒక వ్యక్తి విమోచింపబడినవారి కుటుంబమునకు ఎట్లు చెందునో ఇక్కడ ప్రభువు వివరించుచున్నాడు. ఎవడైనను కుమారుని చూచి ఆయనయందు విశ్వాస ముంచి నిత్యజీవము పొందుట తండ్రి చిత్తమైయున్నది. కుమారుని చూచుటయనగా బాహ్య నేత్రములతోగాక విశ్వాస నేత్రములతో ఆయనను చూచుటయని అర్థము, ఆయన దేవుని కుమారుడనియు, లోకరక్షకుడనియు, ఆయనను చూచి గ్రహించవలెను.

మరియు ఆయనయందు తప్పక విశ్వాసముంచవలెను. విశ్వాసము వలననే ఒకడు ప్రభువైన యేసును తన స్వంత రక్షకునిగాను, ప్రభువుగాను స్వీకరించును. ఇట్లు చేయువారు ప్రస్తుత స్వాస్థ్యముగా నిత్యజీవమును మరియు అంత్యదినమందు లేపబడుదురను అభయమును పొందుదురు.

6:41 ప్రజలు ప్రభువైన యేసును అంగీకరించుటకు సిద్ధముగా లేరని వారి సణు గులు తెలియజేయుచున్నవి. తాను పరలోకమునుండి దిగివచ్చిన దేవుని ఆహారమని ఆయన తెలియజేయుచుండెను.

ఈ ఆరోపణ చాలా ప్రాముఖ్యమైనదని వారు గుర్తిం చిరి. ఏ మానవడుగాని ఎంత గొప్ప ప్రవక్తగాని పరమునుండి దిగిరాలేదు. కనుకనే వారు ఆయనను గురించి సణిగిరి. ఆయన మాటలు నమ్ముటకు ఇష్టపడరైరి.

6:42 యేసు యోసేపు కుమారుడని వారు తలంచిరి. అయితే వారి అభిప్రాయము తప్పు. ఎట్లనగా, ఆయన పరిశుద్ధాత్మవలన కన్య మరియకు జన్మించెను. యోసేపు ఆయన తండ్రి కాడు. కన్య మరియ గర్భమందు జన్మించెనని వారు నమ్ముటలో విఫలు లైరి గనుక వారు అంధకారములోనికి నెట్టివేయబడిరి.

ఇట్లే నేటి దినములలో కూడ జరుగుచున్నది. ప్రభువైన యేసు కన్య మరియ గర్భమందు జన్మించి ఈ లోకము లోనికి వచ్చెనని దేవుని కుమారునిగా అంగీకరించనివారు క్రీస్తుయొక్క వ్యక్తిత్వమును గూర్చిన సత్యమును ఆయన కార్యమును గూర్చిన సత్యమును నిరాకరింతురు.

6:43 వారాయనతో ముఖాముఖిగా మాట్లాడకపోయినను వారి సణుగులన్నియు ఆయన ఎరిగియుండెను. కనుక “మీలో మీరు సణుగుకొనకుడి” యని ఆయన చెప్పెను. వారి సణుగులెట్లు నిష్ప్రయోజనమైనవో తరువాత వచన భాగములందు వివరింపబడినది.

ఆయనిచ్చు సాక్ష్యమును వారెంతగా తృణీకరించుచున్నారో అంతగా ఆయన బోధలు యూదులు గ్రహించుట కష్టతరమయ్యెను. “వెలుగును తృణీకరించుట యనగా వెలుగును ద్వేషించుటయే.” వారు సువార్తను ఎంతగా తృణీకరించుచున్నారో అంతగా సువార్తను అంగీకరించుట వారికి కష్టమగుచుండెను.

అతిస్వల్ప విషయము లను గురించి ప్రభువైన యేసు వారితో మాటలాడినప్పుడు వారు నమ్మకున్నయెడల, కష్టతరమైన సంగతులను గురించి ఆయన బోధించునపుడు వారెట్లు గ్రహించుదురు? (వారెంతమాత్రమును గ్రహించరు గదా!).

6:44 మానవుడు పూర్తిగా నిస్సహాయుడును నిరీక్షణలేనివాడును, తనంతట తానుగా యేసునొద్దకు రాగల శక్తికూడ లేనివాడు. అట్టివాని జీవితములోను, హృదయములోను తండ్రి మొదటిగా కార్యము జరిగించనియెడల తనయొక్క ఘోరమైన పాపమును గుర్తించి, తన జీవితములో రక్షకునియొక్క అవసరతను ఎరుగలేడు.

ఈ వచనమును గ్రహించుట అనేకులకు కష్టముగా నున్నది. ఒక వ్యక్తి రక్షింపబడుట కాశించునుగాని, అది అతనికి అసాధ్యమని ఈ వచనము బోధించుచున్నట్లు అనేకులు తలంతురు, అయితే ఈ అభిప్రాయము సరికాదు.

దేవుడే మొదటిగా మన జీవితములలో : ‘కార్యమును జరిగించి, ఆయనకొరకై మనలను సంపాదించుకొనుటకు వెదకుచున్నాడని ఈ వచన భావము. ఆయనను అంగీకరించుటకుగాని తృణీకరించుటకుగాని మన ఇష్టమై యున్నది.

అయితే మొదటిగా దేవుడు మన హృదయములతో మాట్లాడనిదే మనకు రక్షణనుగూర్చిన కోరిక కలుగదు. మరల ప్రభువు అంత్యదినమందు ప్రతి నిజవిశ్వాసిని లేపుదునని వాగ్దానమిచ్చెను. మనము పై వచనములలో చూచినట్లుగా ఆయన తన పరిశుద్ధులకొరకు వచ్చునప్పుడు మృతులైన వారు మొదట లేతురు, మరియు సజీవుల మైన మనము మార్పుపొందుదుము. ఇది విశ్వాసుల పునరుత్థానము మాత్రమే.

6:45 తండ్రి ఆకర్షించనిదే ఎవడును ఆయనయొద్దకు రాడు – అని ఖండితముగా చెప్పిన తరువాత తండ్రి వారిని ఎట్లు ఆకర్షించునో ప్రభువు వివరించెను. మొదటిగా ఆయన యెషయా 54:13 లో వ్రాయబడినట్లుగా వారికి బోధించెను. “వారందరు (నా పిల్లలందరు) యెహోవాచేత ఉపదేశము నొందుదురు.” దేవుడు కొద్దిమందిని ఏర్పరచుకొనును. తన అమూల్యమైన వాక్యబోధద్వారా ఆయన వారి హృదయములతో మాటలాడును.

అయితే దీనిలో మానవుని యిష్టముయొక్క ప్రమేయముకూడ కలదు. దేవుని బోధద్వారా ప్రభావితులైన వారు తండ్రిని గురించి ఎరిగిన వారు క్రీస్తునొద్దకు వచ్చెదరు. ఇక్కడ దేవునియొక్క సార్వభౌమాధికారము మానవుని స్వచిత్తము అను రెండు గొప్ప సత్యములు కలవు. ఈ రెండు సత్యములు రక్షణయందు దైవకార్యము మానవకార్యములు కలవని చెప్పుచున్నవి.

ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నదని చెప్పినప్పుడు ప్రవక్తల గ్రంథములన్నింటిని గూర్చి చెప్పుచున్నాడు కాని ప్రభువైన యేసు ప్రత్యేకముగా యెషయా ప్రవక్తనుగూర్చి చెప్పెను. దేవుని వాక్య బోధద్వారాను దేవుని ఆత్మద్వారాను మానవులు దేవుని యొద్దకు ఆకర్షింపబడుదురు.

6:46 “దేవునిచేత బోధింపబడినవారు” అనగా వారాయనను చూచియున్నారని అర్థము కాదు. తండ్రిని చూచియున్న ఒకే ఒక వ్యక్తి ఎవరనగా, దేవునియొద్ద నుండి పంపబడిన ప్రభువైన యేసు మాత్రమే. దేవునిచేత బోధింపబడినవారందరు ప్రభువైన యేసుక్రీస్తును గురించి బోధింపబడినవారే. ఎందుకనగా దేవుని బోధయందలి గంభీర మైన అంశము “క్రీస్తే.”

6:47 దేవుని వాక్యములో రక్షణను గురించిన వివరణ ఈ వచనమునందు మనము కనుగొందుము. “తనయందు విశ్వాసముంచువారు నిత్యజీవముగలవారు” అని తేటగా ప్రభువైన యేసు చెప్పెను.

ఈ మాటలు గ్రహించుటకు కష్టముకాదు. ‘నిశ్చయముగా’ అను పదము తరుచుగా ఈ సువార్తలయందు ప్రభువు వాడెను, క్రొత్త నిబంధనలోని అనేక వచనములవలె ఈ వచనమునందు కూడ రక్షణ క్రియలవలనగాని, ధర్మశాస్త్రము నెరవేర్చుటవలనగాని, సంఘములో సభ్యత్వమువలనగాని, బంగారు సూత్రమును పాటించుటద్వారా కలుగదుగాని, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుటద్వారా మాత్రమే కలుగునని స్పష్టముగా తెలుపుచున్నది.

6:48 జీవాహారము నేనే అని ప్రభువైన యేసు చెప్పెను. ‘జీవాహారము’ అనగా ఆ యాహారము భుజించువానికి అది జీవమును అనుగ్రహించునని అర్థము. 6:49 యూదులు ఇంతకు ముందే మన్నానుగూర్చి ఆయనతో ప్రస్తావించి, ఆ విధమైన ఆహారమును తాను తెప్పించవలసినదిగా ప్రభువుతో వాదించిరి.

అయితే ప్రభువు వారి పితరులు ఆ మన్నాను తినియు చనిపోయిరని వారికి గుర్తుచేసెను. మరొక విధముగా చెప్పవలెనంటే మన్నా ఈ జీవితమునకు సంబంధించిన ఆహారము. మన్నాను భుజించిన వారికి అది నిత్యజీవము అనుగ్రహింపలేకపోయెను. ‘మీ పితరులు’ అని ప్రభువు చెప్పుటలో పడిపోయిన మానవజాతినుండి తన్నుతాను ప్రత్యేకించుకొని, తనయొక్క అద్వితీయమైన దైవత్వమును దృఢపరచుచుండెను.

6:50 మన్నాకు ప్రతిగా తానే పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమని ప్రభువైన యేసు చెప్పెను. ఎవడైనను ఈ ఆహారమును భుజించినయెడల అతడు మరణము చూడడు. అనగా అతడు శరీరరీతిగా చనిపోడని అర్థము కాదుగాని, పరమునందు నిత్యజీవమనుగ్రహించబడునని యర్ధము. అతడు శరీరరీతిని చనిపోయినను అతని దేహము అంత్యదినమున లేపబడి నిత్యత్వములో ప్రభువుతో సదాకాలము గడువునని యర్ధము.

ఈ వచనమునందును తరువాత వచనములయందును మానవులు తన్ను భుజించవలెనని చెప్పుచు వచ్చెను. అట్లు చెప్పుటలో అర్థమేమి? అనగా మనుష్యు లాయనను అక్షరార్థముగా శరీరరీతిగా భుజించుమని చెప్పెనా? అట్లు కానేకాదు.

అట్లయిన అది వికటము కాగలదు. మనము ప్రభురాత్రి భోజనమును అనగా ప్రభువు శరీరమునకు, రక్తమునకు సాదృశ్యముగానున్న రొట్టె, ద్రాక్షారసములో పాలు పొందునపుడు అద్భుతరీతిగా అవి ప్రభువుయొక్క శరీరముగాను, రక్తముగాను మారును గనుక మనము ఆయనను భుజించవలెనని కొందరు చెప్పుదురు.

మరియు ఆత్మరక్షణ పొందుటకు ఈ రొట్టె రసములలో పాలు పొందవలెననికూడ చెప్పుదురు. అయితే ప్రభువైన యేసు అట్లు చెప్పుటలేదు. ఆయనను భుజించుటయనగా ఆయన యందు విశ్వాసముంచటయే. మనమాయనను రక్షకునిగా అంగీకరించుటయనగా విశ్వాసముద్వారా ఆయనను అనుభవించుటయే. ఆయన వ్యక్తిత్వము మరియు ఆయన కార్యముయొక్క ధన్యతలో మనము పాలుపొందుచున్నాము.

6:51. యేసు జీవాహారమైయుండెను. ఆయన తనలోతాను జీవించుచు జీవమిచ్చు చుండెను. ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడు జీవించును కాని ఇదెట్లు సాధ్యమగును? పాపాత్ములైన మానవులకు ప్రభువు ఎట్లు నిత్యజీవమనుగ్రహించును? ఈ ప్రశ్నకు సమాధానము ఈ వచనమునందు చివరి భాగములో ఇవ్వబడెను. “నే నిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే” అని చెప్పెను.

ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో తాను పొందనైయున్న మరణమును సూచించెను. పాపాత్ముల విమోచన క్రయధనముగా ఆయన తన ప్రాణమును ఇవ్వవలసియుండెను. ఆయన శరీరము విరగగొట్టబడవలెను.

మరియు వారి పాపముల కొరకు ఆయన రక్తము పానార్పణముగా పోయబడవలసియుండెను. ఆయన పాపి స్థానములో పాపికి బదులుగా మరణించవలసి యుండెను. మన పాప విమోచన క్రయధనమును చెల్లించ వలసియు ఆయన ఇదంతయు ఎందుకు చేసెను? “లోకమునకు జీవము అనుగ్ర హించుటకే.”

యూదా జనాంగముకొరకు గాని, లేదా ఎన్నుకొనబడిన వారికొరకు మత్రమే ఆయన చనిపోలేదుగాని లోకమంతటికి ఆయన మరణము చాలినది. లోకమంతయు రక్షింపబడునని దీని అర్థముకాదు గాని, ప్రభువైన యేసు కలువరిలో ముగించిన సిలువకార్యము తనయొద్దకు వచ్చువారినందరిని రక్షించుటకు చాలినంత విలువ గలదైయున్నది.

6:52 అయినను యూదులింకను అక్షరార్థమైన భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన ఆహారమును గురించి (ఇంకను) ఆలోచించుచుండిరి. వారి ఆలోచనలు ఈ లోక జీవన వ్యాపారమును మించిలేవు.

అయితే ఆత్మీయ సత్యములను గ్రహించు నట్లు వాటిని ప్రకృతి సంబంధమైన వాటితో పోల్చి చెప్పుచున్నాడని వారు గ్రహింపరైరి. కనుక వారు ఒక మానవుడు తన శరీరమును ఎట్లు తినుటకు ఇవ్వగలడని తమలో తాము తలంచుచుండిరి.

రక్షకుని మాటలకు పలువిధములైన స్పందనలు (6:66-71) : 6:66

అయితే ప్రభువైన యేసు సమస్తము ఎరిగినవాడై యుండి, వారేమి తలంచుచున్నారో, మాట్లాడుచున్నారో కూడ ఎరిగియుండి వారు తనయొక్క శరీరమునుతిని, తనయొక్క రక్తమును త్రాగనియెడల వారియందు జీవముండదని గట్టిగా హెచ్చరించెను.

అయితే ఇది ప్రభురాత్రి భోజన సమయమందు వాడబడిన రొట్టె, ద్రాక్షారసమును సూచించుటలేదు. ప్రభువు తానప్పగింపబడిన రాత్రి ఈ ఆచారమును ప్రారంభించెను. అప్పటికింకను ఆయన శరీరము నలుగగొట్టబడలేదు. మరియు ఆయన రక్తము కార్చబడి యుండలేదు. ప్రభువు శిష్యులు రొట్టెలోను, ద్రాక్షారసములోను పాలుపొందిరిగాని, అక్షరార్థముగా ఆయన శరీరమును తిని, ఆయన రక్తమును త్రాగలేదు.

క్రీస్తుప్రభువు సిలువలో మనకొరకు పొందిన ఆయన మరణముయొక్క విలువను మనము సరిగా గ్రహించనియెడల మనము ఎన్నటికీ రక్షణ పొందలేమని ప్రభువు చెప్పెను. మనము ఆయనయందు తప్పక విశ్వాసముంచ వలెను. ఆయనను స్వీకరించవలెను, ఆయనను నమ్మవలెను మరియు ఆయనను మన స్వంతము చేసికొనవలెను.

6:54 ఈ వచనమును 47వ వచనముతో పోల్చిచూడుము, ఆయన శరీరమును తిని, ఆయన రక్తమును త్రాగుటయనగా, ఆయనయందు విశ్వాసముంచుటయని అర్ధము. 47వ వచనమునందు “నాయందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడని” చదువుచున్నాము.

54వ వచనములో నా శరీరమునుతిని, నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు అని వ్రాయబడినట్లు తెలిసికొనుచున్నాము. ఆయన శరీరముతిని, ఆయన రక్తమును త్రాగుటయనగా ఆయనను విశ్వసించుటయని అర్థము. ఆయనయందు విశ్వసించువారందరు అంత్యదినమున లేపబడుదురు. అనగా ప్రభువైన యేసునందు విశ్వాసముంచి మరణించినవారి దేహములని భావము.

6:55 ప్రభువైన యేసుయొక్క శరీరము నిజమైన ఆహారమైయున్నది. మరియు ఆయన రక్తము నిజమైన పానీయమునై యున్నది. ఈ ఆహారము ఈ లోకములోని ఆహారమునకు భిన్నమైనది. ఏలయనగా ఈ లోకసంబంధమైన ఆహారము తాత్కాలిక మైన విలువగలిగినది. ప్రభువైన యేసు పొందిన మరణముయొక్క విలువకు అంతము లేదు. విశ్వాసముతో ఆయనయందు పాలుపొందువారు శాశ్వత జీవమును పొందుదురు.

6:56 ఆయనకును, ఆయనయందున్న వారికి శాశ్వతమైన సన్నిహిత సంబంధము గలదు. ఆయన శరీరము తిని, ఆయన రక్తము త్రాగినవాడు ఆయనయందు నివసించును మరియు ఆయన వారియందు నివసించును.

ఇంతకంటే గొప్పదైన సన్నిహిత సంబంధము మరియొకటి లేదు. మనము అక్షరార్థమైన ఆహారమును తీసికొనినయెడల, మనలోనికి దానిని తీసికొందము, మరియు అది మనదై యుండును. మన విమోచకునిగా ప్రభువైన యేసును మనము స్వీకరించినయెడల మనలో నివసించుటకు మన జీవితములోనికి ఆయన వచ్చును మరియు మనము ఆయనలో నివసించుదుము.

6:57 ప్రభువైన యేసు తనకును, తనవారికిని మధ్య ఉన్న సన్నిహిత బంధమును గురించి మరొక ఉపమానమును వివరించెను. ఆ ఉపమానమేదనగా, తన తండ్రియైన దేవునితో తనకుగల సంబంధము, జీవముగల తండ్రి ప్రభువైన యేసును ఈ లోకము లోనికి పంపెను.

జీవముగల తండ్రియనగా, జీవమునకు మూలమైనవాడని భావము. ఈ లోకములో మానవునిగా ప్రభువైన యేసు తండ్రిద్వారా తండ్రి నిమిత్తము, తండ్రి వలన జీవించెను. తండ్రియైన దేవునితో ఆయన జీవితము సన్నిహిత సంబంధము కలిగి ఏకత్వము కలిగియుండెను.

దేవుడు ఆయన జీవమునకు కేంద్రమును మరియు సమస్తమునై యుండెను. అనగా తన తండ్రితోను, తండ్రి పనులయందు ఎల్లప్పుడు నిమగ్నమై ఉండవలెనని ఆయన ఉద్దేశ్యము. ఆయన ఒక మానవునిగా ఈ లోకములో ఉండెను కాని ఆయన శరీరధారియైన దేవుడని లోకము ఆయనను గ్రహించలేదు.

లోకమాయనను అపార్థము చేసికొనినను తండ్రియు ఆయనయు ఏకమైయుండెను. వారిరువురు అతి సన్నిహిత సంబంధము కలిగియున్నారు. అదే రీతిగా ప్రభువైన యేసు నందు విశ్వాసముంచువారందరితో ప్రభువు వారిమధ్య ఇట్టి సంబంధమునే కలిగి యుండును.

వారు ఈ లోకమునందు ఉండి, లోకమువలన అపార్థము చేయబడుచు ద్వేషించబడి హింసింపబడుదురు. అయితే వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుట వలన ఆయననుబట్టియే జీవించుచున్నారు. వారి జీవము ఆయన జీవముతో బంధింప బడి భద్రము చేయబడెను. కాబట్టి వారి జీవము నిత్యము నిలిచియుండును.

6:58 ఈ వచనము, ముందు వచనములలో ప్రభువు చెప్పిన మాటలయొక్క సారాంశమని చెప్పవచ్చును, పరలోకమునుండి దిగివచ్చిన ఆహారము ఈయనే. ఈయన మన పితరులు అరణ్యములో తినిన మన్నాకంటే శ్రేష్టుడు.

ఈ లోకపు ఆహారముయొక్క విలువ తాత్కాలికమైనది. అది ఈ జీవితకాలము మట్టుకే పరిమిత మైనది. అయితే క్రీస్తు తన్ను భుజించువారికందరికి నిత్యజీవమనుగ్రహించు దేవుని ఆహారమై యున్నాడు.

6:59 గలిలయ సముద్రమునకు అవతల ఆగ్నేయ దిశనుండి ప్రజలు కపెర్నహూము వరకు ఆయనను ఆయన శిష్యులను వెదకుచు వెంబడించిరని మనకు జ్ఞాపకమే గదా! అయితే వారు ఆయనను సమాజమందిరమందు కనుగొనిరి ఆ మందిరములోనే ప్రభువు జీవాహారమునుగూర్చి వారికి బోధించెను. (సమాజ మందిరము అనగా యూదుల మత సంబంధమైన బోధకు కూడుకొను స్థలమే గాని బలులు అర్పించు దేవాలయము కాదు.)

6:60 అప్పటికి మొదటి పండ్రెండుమంది శిష్యులు కాక మరి పెక్కుమంది శిష్యులు ఆయనకుండిరి. ఆయనను వెంబడించువారు మరియు ఆయన బోధను అంగీకరించు వారందరు ఆయనకు శిష్యులని పిలువబడిరి. ఆయన శిష్యులుగా పిలువబడినవారందరు ఆయనకు నిజమైన విశ్వాసులు కారు.

ఆయన శిష్యులమని చెప్పుకొనువారిలో కొందరు “ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని” చెప్పుకొనిరి. అనగా యీ మాట వారికి గ్రహింపులేక కాదుగాని, వారు స్వీకరించుటకు ఇంపుగా ఉండనందున వారట్లు చెప్పిరి. “ఎవరు విందురు?” అని వారు చెప్పిన మాటకు ఇట్టి విరుద్ధమైన బోధను ఎవరు వినగలరు? ఎవరు నిలువగలరు? అని వారి అభిప్రాయము.

6:61 యేసు సంపూర్ణ జ్ఞానము కలిగియుండెనని ఈ వచనములో మనము గ్రహించుచున్నాము. శిష్యులేమి చెప్పుచున్నారో ఆయనకు పూర్తిగా తెలియును. అది ఏదనగా తాను పరలోకమునుండి దిగివచ్చితిననియు, మరియు మానవులు తన శరీరమును భుజించి, తన రక్తమును త్రాగుటద్వారా నిత్యజీవము పొందుదురని తాను చెప్పిన మాటలు వారికిష్టములేనందున వారు సణుగుచున్నారనియు ప్రభువుకు తెలియును, కనుకనే “దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా?” యని ప్రభువు ప్రశ్నించెను.

6:62 ప్రభువు తాను పరలోకమునుండి దిగివచ్చితినని చెప్పినందుకు వారు అభ్యంతరపడి, నేరముగా నెంచిరి. అప్పుడాయన తాను పునరుత్థానుడైన తరువాత పరమునకు ఆరోహణుడౌదునని ఎరిగియుండి తాను పరమునకు తిరిగివెళ్ళుట వారు చూచినయెడల వారేమని తలంచెదరని ఆయన అడిగెను.

మరియు ఆయన తన శరీరమును తినుడని చెప్పినందుకు వారు అభ్యంతరపడిరి. శరీరముతోనే పరలోకము నకు వెళ్ళుట వారు చూచినట్లయిన ఏమి తలంచెదరో గదా? ఆయన పరమునకు వెళ్ళిన తరువాత మనుష్యులు అక్షరార్థమైన ఆయన శరీరమును ఎట్లు తిందురు? ఆయన రక్తమును ఎట్లు పానము చేయుదురు?

6:63 ఈ మనుష్యులు అక్షరార్థమైన క్రీస్తు దేహమును గురించి తలంచుచున్నారు. ఆయన మాంసయుక్తమైన దేహమును తినుటద్వారా నిత్యజీవము పొందలేరుగాని, దేవునియొక్క పరిశుద్ధాత్ముని క్రియవలన నిత్యజీవము పొందగలరని చెప్పెను. మాంస యుక్త దేహము జీవమును అనుగ్రహించలేదు గాని ఆత్మయే జీవమునను గ్రహించును.

అయితే వారు ఆయన మాటలను అక్షరార్థముగా ఎంచిరిగాని ఆత్మీయముగా గ్రహింప లేకపోయిరి. మరియు ప్రభువైన యేసు వారితో చెప్పియున్న మాటలు ఆత్మీయ జీవమును గూర్చినవైయున్నవని వారికి విశదపరచెను. అనగా “నా శరీరమును తిని, నా రక్తమును త్రాగువాడు” అను మాటలు ఆత్మీయముగా మనము గ్రహించ వలసినవారమైయున్నాము, అనగా ఆయనయందు విశ్వాసముంచుటయే. అప్పుడు ఆయన మాటలను అంగీకరించు వారికి నిత్యజీవము కలుగును.

6:64 ఆయన ఈ సంగతులను చెప్పుచుండగా వినుచున్నవారిలో కొంతమంది ఆయన చెప్పుబోధను గ్రహించలేదు. ఏలయనగా వారాయనను విశ్వసించలేదు. ఆయనను వెంబడించితిమని చెప్పుకొనినవారిలో కొందరు ఆయనయందు విశ్వాస ముంచలేదనియు ఆయన శిష్యులలో ఒకరు ఆయనను అప్పగించుననియు తన సేవా ప్రారంభమునుండియే ఎరిగియుండెను. అయితే ఇదంతయు ఆయన నిత్యత్వ మందే ఎరిగియుండెను.

6:65 ఈ హేతువునుబట్టి తండ్రి వలననేగాని మరి ఎవని వలనను ఒకడు తన యొద్దకు రాలేడని వారికాయన గతకాలములోనే చెప్పియుండెను. వారి అవిశ్వాసమే దీనికి హేతువైయున్నది. ఈ మాటలు మానవుని అహంకారమును దెబ్బ తీయుచున్నవి.

ఏలయనగా, మానవుడు తన స్వశక్తిద్వారా రక్షణను సంపాదించగలనని తలంచు చున్నాడు. గనుకనే ఎవడైనను తనయొద్దకు వచ్చుటకు కావలసిన శక్తిని తండ్రియైన దేవునినుండి మాత్రమే పొందగలడని ప్రభువు చెప్పెను.

రక్షకుని మాటలకు పలువిధములైన స్పందనలు (6:66-71) : 6:66

ప్రభువు చెప్పిన యీ మాటలు అనేకులకు రుచించలేదు గనుక వారు ఆయనను వెంబడించుటకు ఇష్టములేక వెనుకతీసిరని యీ మాటలద్వారా మనకు గ్రాహ్యమగుచున్నది. పై వచనములలో చెప్పినట్లుగా ఈ శిష్యులు నిజమైన విశ్వాసులు కారు. వివిధములైన ఉద్దేశ్యములతో వారు ప్రభువును వెంబడించిరి. ఆయన ఎవరో ఎరిగియుండిరిగాని, ఆయనపట్ల నిజమైన ప్రేమకల్గి ఆయనను వెంబడించలేదు.

6:67 – 69 ఇట్టి తరి ప్రభువు తన శిష్యులవైపు తిరిగి “మీరుకూడ వెళ్ళిపోవలెనని యున్నారా?” అని అడిగెను. అందుకు పేతురు “ప్రభువా, మేమెట్లు నిన్ను విడువగలము? నీవు నిత్యజీవమునకు నడిపించు బోధ చేయుచున్నావు. నిన్ను విడిచినచో మేము వెంబడించతగిన వ్యక్తి ఎవరూ లేరు” నిన్ను విడిచి వెళ్ళుటయనగా “మా నాశనమునకు మేము ముద్రవేయుటయే” అని చెప్పిరి. పన్నెండుమంది శిష్యుల పక్షముగా పేతురు – “ప్రభువైన యేసు దేవుని పరిశుద్ధుడని విశ్వసించి ఎరిగియున్నా మని చెప్పెను.”

విశ్వసించుట ఎరుగుట’ అను మాటల క్రమమును గమనించండి. ప్రభువైన యేసుక్రీస్తునందు వారు విశ్వాసముంచిరి. ఆ తరువాత ప్రభువు తన్ను గూర్చి చెప్పినదంతయు నిజమని వారు ఎరిగిరి.

రక్షకుని మాటలకు పలువిధములైన స్పందనలు (6:66-71) : 6:66

6:70 “మేము” అనగా పన్నెండుమంది శిష్యులమని పేతురు యొక్క భావము. గాని ప్రభువు పేతురు చెప్పిన తప్పును సరిదిద్దెను. మా పన్నెండుమందిమి నిజమైన విశ్వాసులమని పేతురు అంత దృఢముగా చెప్పకూడదు. ప్రభువు పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకొనుట వాస్తవమేగాని, వారిలో ఒకడు సాతాను. ఆ పన్నెండు మందిలో ప్రభువునుగూర్చి పేతురుకున్న దృక్పథముతో ఏకీభవించని యొకడు గలడు. యూదా ఆయనను అప్పగించునని ఆయన ఎరిగియున్నాడు.

6:71 తన్ను ప్రభువుగాను, రక్షకునిగాను యూదా ఎన్నడు అంగీకరించి యుండ లేదని ప్రభువు ఎరుగును. ఈ సందర్భములోకూడ ప్రభువుకున్న సంపూర్ణ జ్ఞానమును మనము గమనించుచున్నాము. అయితే పేతురు పన్నెండుమంది శిష్యుల తరపున మాట్లాడుటలో పొరపాటు పడినాడని తెలియుచున్నది.

శరీర దౌర్భల్యము కల్గిన మనుష్యుడు – Bible Verses Chapter 5 in Telugu

ఐదవ అధ్యాయము

శరీర దౌర్భల్యము కల్గిన మనుష్యుడు

మూడవ సూచకక్రియ – శరీర దౌర్భల్యముగల వ్యక్తిని స్వస్థపరచుట (5:1-9) :

5:1 యెరూషలేములో యూదుల పండుగ సమయమాసన్నమైనట్లు మనమీ అధ్యాయ ప్రారంభమునందు గమనించుచున్నాము. అనేకులు ఇది పస్కా పండుగ అని భావింతురు గాని, కచ్చితముగా చెప్పుట కష్టము. యేసుక్రీస్తు ప్రభువు ఈ ప్రపంచమునందు యూదుడుగా జన్మించి, యూదులకు దేవుడనుగ్రహించు ధర్మశాస్త్రము నెరవేర్చబద్దుడై యెరూషలేమునకు (ఆ పండుగకు) వెళ్ళెను.

పాత నిబంధనలో యెహోవా అని పిలువబడిన ప్రభువైన ఈ యేసే పస్కా పండుగను గూర్చిన విధిని మొదటిగా నిర్ణయించెను. ఇప్పుడు మానవునిగా తండ్రికి విధేయుడై తాను నిర్ణయించిన చట్టమునకు తానే లోబడినవాడాయెను.

5:2 యెరూషలేము పట్టణమందు బేతెస్థ అనబడిన కోనేరు కలదు. బేతెస్థ అనగా “కృపా నిలయము” లేక “కనికరముగల ఇల్లు” అని అర్ధము. కోనేరు గొర్రెల సంత ప్రక్కగా లేదా గొర్రెలద్వారము దగ్గర యున్నట్లుగా చెప్పుదురు. ఆ కోనేటిచుట్టు ఐదు మంటపములు లేక విశాలమైన ప్రదేశములు గలవు. వాటియందు అనేకులుండుటకు అవకాశము కలదు. కొందరు ఈ విధముగా చెప్పుదురు: ఈ “ఐదు మంటపములు మానవుని సంకటములను తీర్చజాలని మోషే ధర్మశాస్త్రమునకు ప్రతిగా నున్నవి.”

Read and Learn More Telugu Bible Verses

శరీర దౌర్భల్యము కల్గిన మనుష్యుడు –

5.3 బేతెస్థ కోనేరు ఆశ్చర్యకరమైన స్వస్థతలు జరుగు స్థలముగా పేరుగాంచినది. అయితే యీ అద్భుతములు సంవత్సరము పొడవునా జరిగెనో లేక, కొన్ని ప్రత్యేకమైన సమయములందు జరిగెనో (పండుగ సమయములందు) మనకు తెలియదు.

ఆ కోనేరుచుట్టు స్వస్థపడనాశగలవారు అనేకులు గలరు. వారెవరనగా, శరీర దౌర్భల్యము గలవారు అనగా బలహీనులు, రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు మొదలగువారు. మరియు ఊచచేతులు గలవారుకూడ అక్కడ ఉండిరి. ఈ బలహీనతలన్నియు పాప మానవునియొక్క నిస్సహాయతకు గ్రుడ్డితనమునకు, కుంటితనమునకు, పనికిమాలిన స్థితికి పటముగా నున్నవి.

పాపమువలన తమ శరీరమందు దౌర్బల్యముగల్గిన మనుష్యులనేకులు ఆ కోనేటిలో నీరు ఎప్పుడు కదిలింపబడునాయని ఎదురుచూచు చుండిరి. వారికి కల్గిన ఆ యా రోగములనుండి బాగుపడవలెనని వారాశించి ఆ సమయముకొరకై ఎదురుచూచుచుండిరి.

శరీర దౌర్భల్యము కల్గిన మనుష్యుడు – Bible Verses Chapter 5

అట్లు వారు స్వస్థతకొరకై కనిపెట్టుచుండిరి. బెల్లెట్ అనునతడు ఇట్లు వ్యాఖ్యానించెను: “దేవుని కుమారుడు వారి మధ్యనే ఉండగా నిరాశ, నిస్పృహలు కలిగించు నీటిచుట్టు వారు తడవులాడుచుండిరి.” నిశ్చయముగా ఇందులో మనకు పాఠము కలదు. ఆ స్థలము జనముతో క్రిక్కిరిసియుండినను, ప్రభువు సంచారమును వారు లక్ష్యపెట్టరైరి. ఇది మానవ మతమునకు చక్కని సాక్ష్యముకాదా! మతము ఆచారములను, అభిషేకములను మొదలగువాటిని వెదకెను గాని, దేవుని కృపను లేశమైనను వెదకలేదు.

5:4 ఈ వృత్తాంతము మనకు ఆశ్చర్యమును కలిగించుచున్నదిగదా! ఒకానొక సమయమందు దేవదూత దిగివచ్చి ఆ నీటిని కదిలించుటకద్దు. నీటిని కదిలించిన వెంటనే ఎవరైతే ఆ నీటిలో దిగుదురో వారు తమ రోగమునుండి బాగుపడుదురు. అనేకులకు స్వస్థత అక్కర కలిగియుండగా దూత నీటిని కదిలించినప్పుడు ఒకరిపై నొకరు పడుచు నెట్టుకొనుచు, నీటిలో దిగుటకు ఆత్రుతపడుచున్న ఆ గుంపులలో నీటిలో ముందు దిగినవాడు మాత్రమే స్వస్థతపొందుట ఎంత శోచనీయము !

5:5-7 అట్టివారిలో నొకడు ముప్పదిఎనిమిది ఏండ్లనుండి నిరుపయోగముగా అచ్చట పడియుండెను. రక్షకుడు జన్మించక మునుపే ఇతడు అక్కడ ఉండెను. ప్రభువైన యేసుకు అన్నిటియందు పరిపూర్ణమైన జ్ఞానము గలదు. ఆయన ఈ వ్యక్తిని ఇంతకు మునుపెన్నడును కలువలేదు. అయినప్పటికి యిట్టి నిస్సహాయస్థితిలో అతడు చాలకాలముగా పడియుండెనని ఆయన యెరిగియుండెను.

అప్పుడు ప్రభువు వానిని చూచి, ప్రేమతో నీవు స్వస్థపడగోరుచున్నావా? అని అడిగెను. అయితే ఆ వ్యక్తి స్వస్థత నాపేక్షించుచున్నాడనియు గత ముప్పది ఎనిమిది సంవత్సరములుగా అది అతని హృదయాభిలాష అనియు ఎరిగియుండినను, ప్రభువు అతని నుండి తాను నిస్సహాయుడనియు, స్వస్థత తనయొక్క తక్షణ అవసరతయనియు ఒప్పుకొనునట్లు ఆ ప్రశ్న వేసెను. రక్షణ విషయము కూడ ఇంతే.

ఒక వ్యక్తి రక్షింపబడవలయునన్నచో – తాను నశించిన పాపియనియు, యేసు రక్షించుననియు అతడు నోటితో ఒప్పుకొను తరుణముకొరకు ప్రభువు కనిపెట్టుచున్నాడు, మనంతట మనము రక్షింపబడలేము గాని ఆత్మరక్షణ పొందుటకు ఆయనయెదుట మన యిష్టమును తెలియజేయవలెను. ఆ వ్యాధిగ్రస్థునియొక్క జవాబు హృదయ విదారకమైనది.

38 సంవత్సరములుగా అతడు కోనేటి దగ్గర ఉండి ఆ నీళ్ళు కదిలింపబడినప్పుడు దానిలోనికి దిగుటకు ఎదురుచూచుచుండెను గాని అతనికి సహాయము చేయువారెవరును లేరు. తాను ప్రయత్నించు ప్రతి సమయమందును వేరొకడు తనకంటె ముందుగా నీటిలో దిగు చున్నాడు. మన పాపములనుండి మనము రక్షింపబడుటకు మనతోటివారిపై ఆధార పడుట ఎంత నిస్పృహ కలిగించునో ఈ వృత్తాంతము జ్ఞాపకము చేయుచున్నది.

5:8,9 అతని పడక ఒక తేలికపాటి పరుపుకావచ్చును. నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని ప్రభువు చెప్పెను. రక్షింపబడినప్పుడు మనము లేచుట మాత్రము కాదుగాని, నడువవలసియున్నది. పాపరోగమునుండి ప్రభువైన యేసు మనలను స్వస్థపరచును, ఆ తరువాత ఆయనకు తగినట్లుగా మనము నడువవలెనని ఆయన ఆశించును. ఒకనికి ఒక పని చేయుటకు శక్తిననుగ్రహింపకనే ఆ పని చేయుమని ప్రభువు ఆజ్ఞాపింపడు.

ఆయన చెప్పినట్లు బలహీన దేహమునకు నూతన జీవమును శక్తిని ఇచ్చెను. తక్షణమే వాడు స్వస్థత నొందెను. ఇది క్రమేపి జరిగిన స్వస్థత కాదు, కొన్ని సంవత్సరముల తరబడి బలహీనముగా నున్న కాళ్ళు, చేతులు ఇప్పుడు బలముతో నింపబడెను. ప్రభువు మాటకు అతడు వెంటనే లోబడెను, అతడు తన పరుపెత్తుకొని నడచెను.

ముప్పది ఎనిమిది సంవత్సరములు అస్వస్థతగా నుండి ఇప్పుడు లేచి నడచుటలో అతడు ఎంత ఆశ్చర్యచకితుడాయెనో ! సబ్బాతు దినమందు ఈ అద్భుతము జరిగెను. సబ్బాతు దినమనగా వారములో ఏడవరోజు మనకు శనివారము. యూదులు సబ్బాతు దినమందు పనిచేయుట నిషేధము. స్వస్థతనొందిన వ్యక్తి యూదుడు. యూదుల నియమము ప్రకారము ఆ దినమున తాను ఏ పని చేయకూడనప్పటికి, ప్రభువైన యేసుయొక్క ఆజ్ఞ ప్రకారము అతడేమియు అభ్యంతరము చెప్పక తన పరుపెత్తుకొని నడచెను.

యూదుల వ్యతిరేకత (5:10-18) :

5:10 అతడు పరుపెత్తుకొని నడువగా చూచిన యూదులు అతని ఆక్షేపించిరి. ఎందుకనగా, యూదులు మతనియమముల విషయమై పట్టుదల గలవారు. ధర్మ శాస్త్రమునందు అక్షరార్థముగా నిష్టగలవారు మాత్రమేగాక శ్రద్ధకలిగి బహు నిక్కచ్చిగా దానిని నేరవేర్చుదురుగాని దయ కనికరములను ఇతరులపట్ల ఎంతమాత్రము
కనుపరచువారుకారు.

5:11 స్వస్థత నొందినవాడు బహుతేటగా సమాధానమిచ్చెను. అదేదనగా, తన్ను స్వస్థపరచినవాడు తనను పరుపెత్తుకొని నడువుమని ఆజ్ఞాపించగా తానట్లు చేసితినని చెప్పెను. ముప్పది ఎనిమిది సంవత్సరములుగా రోగియైయున్న వ్యక్తిని స్వస్థపరచ శక్తిగలవానికి విశ్రాంతి దినమందు పరుపెత్తుకొని నడువుమని ఆజ్ఞాపించగా దానికతడు విధేయుడు కావలెనుగదా? స్వస్థపరచబడిన వానికి ప్రభువైన యేసు ఎవరో, ఆ సమయమునకు తెలియదు. అతడు ఆయనను గురించి సహజ రీతిగా మాటలాడినను, కృతజ్ఞతా భావముతోనే మాటలాడెను.

5:12 అతనిని విశ్రాంతి దినమును అతిక్రమింప ఆజ్ఞాపించిన నేరస్థుడు ఎవరోయని తెలసికొనగొరి, ఆ నేరస్థుని చూపించుమని వారడిగిరి. ఎందుకనగా విశ్రాంతి దినమును అతిక్రమించువానిని రాళ్ళతో కొట్టుమని మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించు చున్నది.

5:13 అతని స్వస్థత విషయమై యూదులకేమి పట్టలేదు. స్వస్థతనొందిన వానికి తన్నెవరు స్వస్థపరచెనో తెలియదు. మరియు స్వస్థపరచిన వానిని గుర్తించుట అతనికి అసాధ్యము, ఎందుకనగా ఆ గుంపులోనుండి ప్రభువు తప్పించుకొని వెళ్ళెను.

ప్రభువైన యేసుయొక్క బహిరంగ పరిచర్యలో ఇదొక మలుపు. ఈ అద్భుతమును ప్రభువు విశ్రాంతి దినమున చేసినందున యూదులకు ద్వేషము, పగ, కోపమును ఆయన రేకెత్తించెను. కనుక వారాయనను తరుముచు ఆయనను చంపజూచిరి.

5:14 కొంతకాలము తరువాత స్వస్థతనొందిన వ్యక్తి మందిరమందు చేరి తన జీవితములో జరిగిన అద్భుతకార్యమును గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చుండగా ప్రభువైనయేసు అతని కనుగొనెను. అతడు కనికరింపబడెను గనుక ప్రభు వతనిని పిలిచి అతనిపై నొక బాధ్యతను మోపెను. ఆధిక్యతలు ఎల్లప్పుడు బాధ్యతను చూపించును. “నీవు స్వస్థపరచబడితివి గనుక నీకు మరెక్కువ కీడు సంభవించ కుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పెను”. అతని జీవిత పాప ఫలితముగా వానికి ఈ వ్యాధి సంభవించెను. అన్ని వ్యాధుల విషయములో ఇది వాస్తవము కాదు.యూదుల వ్యతిరేకత (5:10-18) :

ఒక వ్యక్తి జీవితములో అతని పాపములకును, రోగములకును అనేక మారులు ఎట్టి ప్రత్యక్ష సంబంధముండదు. ఉదాహరణకు: పసిపిల్లలు తాము ఇచ్ఛాపూర్వకముగా పాపముచేయు వయస్సు రాకమునుపే అస్వస్థతకు గురియగుచుందురు. “ఇకను పాపము చేయకుము అని ప్రభువు చెప్పుటలో ఆ మాటలు దేవుని పరిశుద్ధతయొక్క ప్రమాణమును సూచించుచున్నది. “సాధ్యమైనంత తక్కువగా పాపము చేయుము” అని చెప్పినచో ఆయన దేవుడుకాడు.

అది ఎంతటి చిన్న పాపమైనను దేవుడు క్షమించడు. కనుకనే ఆయన “నీకు మరి ఎక్కువ కీడు సంభవించకుండునట్లు ఇకను పాపము చేయకుము” అని గట్టిగా హెచ్చరించెను. ‘ఎక్కువ కీడు’ అనగానేమో మనకు చెప్పబడలేదు. శారీరక రోగముకంటె పాప ఫలితములు బహు భయంకరమైనవిగా ఆ వ్యక్తి గ్రహించవలెనని ప్రభువు ఉద్దేశించెనని మనము తలంచుటకు ఎట్టి అనుమానము లేదు. తన పాపములయందు చనిపోవువాడు నిత్యోగ్రతకు, వేదనలకు పాత్రుడు.

ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా చేయు పాపముకంటె కృపకు వ్యతిరేకముగా చేయు పాపము బహు భయంకరమైనది. ఈ వ్యక్తికి ప్రభువు ఆశ్చర్యకరమైన ప్రేమను కృపను కనుపరచెను. తన వ్యాధికి కారణమైన ఆ పాప జీవితములో కొనసాగుట బాధ్యతా రాహిత్యమును సూచించుచున్నది.

5:15 సమరయ స్త్రీవలె ఇతడుకూడ ప్రభువుకొరకు ప్రత్యక్ష సాక్షిగా జీవించ నాశించెను. కనుకనే అతడు తన్ను స్వస్థపరచినవాడు “యేసు” అని యూదులతో చెప్పెను. యూదులకు ఆయనపట్ల కృతజ్ఞత లేకున్నను అతడు యేసుకు కృతజ్ఞత చెల్లి. అయితే ప్రభువును కనుగొని ఆయనను శిక్షించుటయే యూదుల యొక్క ముఖ్య ఉద్దేశ్యమైయున్నది.

5:16 మానవుని హృదయమెంత కౄరమైనదో ఇక్కడ వెల్లడియగు చున్నది. రక్షకుడు వచ్చి ఒక గొప్ప స్వస్థత కార్యము చేసియుండగా యూదులు కోపోద్రేకులైరి. ఆ స్వస్థత కార్యము విశ్రాంతి దినమున జరిగెనని వారు కోపగించుకొనిరి యూదులు మతవిషయములందు నిర్దయులు గనుకనే సాటి మానవునియొక్క క్షేమము, ఆశీర్వా దములకంటె మతాచారములందే ఎక్కువ ఆసక్తిగలవారైయున్నారు.

అయితే సబ్బాతు దినమును నియమించినవాడే ఆ దినమున కృపాకార్యమును చేసియున్నాడని వారు గుర్తించలేదు. ఏ విధముగాను యేసు సబ్బాతును అతిక్రమించలేదు. ధర్మశాస్త్రము, విశ్రాంతి దినమున శరీరసంబంధమైన పనులను నిషేధించెను. అత్యవసరమైన, కనికరయుతమైన కార్యములను చేయ నిషేధించలేదు.

5:17 ఆరు దినములలో సృష్టికార్యమును సంపూర్తిజేసి ఏడవదినమున దేవుడు విశ్రమించెను. ఆ యేడవ దినమే సబ్బాతుదినము అనగా విశ్రాంతిదినము. పాపము లోకములో ప్రవేశించినప్పుడు దేవుని విశ్రాంతికి భంగము కలిగెను. కనుక ఇప్పుడు ఆయన విశ్రమించక స్త్రీ, పురుషులను తన సహవాసములోనికి మరల తెచ్చుటకు నిర్విరామముగా పనిచేయుచున్నాడు.

విమోచనా మార్గమేర్పాటుచేసెను. ప్రతి తరమునకు ఆయన సువార్త బయలువెళ్ళుచున్నది. ఆదాము పాపములో పడిపోయినది మొదలు ప్రస్తుత కాలమువరకు దేవుడు (ఆయన) విశ్రమించక పనిచేయుచుండెను. ఆయన ఇంకను పనిచేయుచుండెను. ప్రభువైన యేసు విషయమందు కూడ ఇది వాస్తవము. ఆయన తన తండ్రియొక్క పనిమీద యుండెను. ఆయన ప్రేమ ఆయన కృపలు ఆరుదినములకే పరిమితమైయుండలేదు.

5:18 ఈ వచనము చాలా ప్రాముఖ్యమైనది. యూదులు ఇంతకుముందుకంటె ఇప్పుడు మరెక్కువగా ప్రభువైనయేసును చంప నిశ్చయించుకొనిరి. ఆయన సబ్బాతు దినాచారమును మీరుటయేగాక దేవునితో సమానునిగా ఎంచుకొనెను, కనుక ఆయన నిశ్చయముగా సబ్బాతును అతిక్రమించి యున్నాడని వారికి స్పష్టమాయెను.

యేసు “దేవుడు తనయొక్క తండ్రి” యని చెప్పినప్పుడు వారాయనను దేవునితో సమానునిగా ఎంచుకొనియున్నాడని తలంచిరి. ఇది వారి దృష్టిలో ఘోరమైన దేవ దూషణయైనది. వాస్తవముగా ఇది సత్యమే! రానున్న వచనములలో తానెట్లు దేవునితో సమానమైనవాడో తేటగా వివరించెను. జె.యస్. బాక్సర్ ఇట్లు చెప్పెను. తాను దేవునితో సమానుడని ఏడు విధములుగా ప్రభువు వివరించెను.

  •  పనిలో సమానుడు: “తండ్రి వేటిని చేయునో కుమారుడును ఆలాగే చేయును” (19వ).
  •  ఎరుగుటలో సమానుడు : “తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయువాటినెల్లను ఆయనకు అగపరచుచున్నాడు”(20వ).
  •  మృతులను లేపుటలో సమానుడు: “తండ్రి మృతులను ఏలాగులేపి బ్రదికించునో….. కుమారుడును తన కిష్టము వచ్చిన వారిని బ్రదికించును (21,28,29వ).
  •  తీర్పు తీర్చుటలో సమానుడు: తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడుగాని, తీర్పు తీర్చు అధికారము కుమారునికి అప్పగించెను (22,27వ).
  •  ఘనతలో సమానుడు : “మనుష్యులందరు తండ్రిని ఘనపరచినట్లు కుమారుని ఘనపరచవలెనని … (23వ).
  •  క్రొత్తజన్మ (పునర్జన్మ) నిచ్చుటలో సమానుడు : “నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడు” (24,25వ)
  •  స్వయం భవత్వములో సమానుడు : తండ్రి ఏలాగు తనంతటతానే జీవము కలిగియున్నాడో అలాగే కుమారుడును తనంతటతాను జీవముగలవాడైయున్నాడు” (26వ).

యేసు – తాను దేవునితో సమానుడనని నిరూపించుకొనుట (5:19-29) :

5:19 ప్రభువు తాను తండ్రియైన దేవునితో ఏకమైయున్నాననియు, తనంతట తాను ఏదియు చేయననియు తెలియజేయుచున్నాడు. అనగా తనంతట తానేదియు చేయుటకు శక్తిలేనివాడనికాదు. దేవునితో ఏకమైయుండి, తండ్రి ఏది చేయుట చూచునో దానినే చేయును. ప్రభువు తండ్రితో సమానత్వమును ఆరోపించుకొనినను తండ్రికి వేరుగా తాను స్వతంత్రుడనని చెప్పుకొనలేదు. ఆయన తండ్రితో సంపూర్ణముగా సమానత్వము కలిగియున్నను, తండ్రికి వేరుగా ఆయన యుండలేదు.

యూదులు తన్ను దేవునితో సమానునిగా గుర్తించవలెనని ప్రభువైన యేసు ఆశించెను. దేవుడు చేయు పనులను తాను చేయగలనని ఒక మానవుడు చెప్పుకొనుట అవివేకమే. తండ్రిచేయుచున్న దానిని తాను చూచుచున్నట్లు యేసు చెప్పెను. తానట్లు చెప్పినప్పుడు తాను తండ్రితో నిరంతరము సన్నిహిత సంబంధము కలిగియుండి పరలోకములో జరుగుచున్న వాటి విషయమై పరిపూర్ణజ్ఞానము కలిగియుండవలెను గదా! మరియు తండ్రి యేమి చేయుట తాను చూచెనో దానినే తాను చేయుచున్నానని ప్రభువు చెప్పెను. ఇది ఆయన దేవునితో సమానుడని నిశ్చయముగా తెలియజేయు చున్నది. ఆయన సర్వశక్తిమంతుడు.

ఆ కుమారునికి తాను చేయునదంతయు చూపించుట తండ్రికి తన కుమారుని పట్లగల ప్రత్యేకమైన ప్రేమకు చిహ్నముగా నున్నది. యేసు ఆ సంగతులను చూచుటయే గాక, అట్టి కార్యములను చేయుటకును శక్తిగలవాడై యుండెను. మరియు దేవుడు తనకు ఇంతకంటే మరి గొప్ప కార్యములు చూపించునని జనులు ఆశ్చర్యపడునట్లు ప్రభువు తెలియజేసెను. ప్రభువైన యేసు చేసిన అద్భుతకార్యములను ప్రజలు అప్పటికే చూచిరి.

ముప్పది ఎనిమిది ఏండ్లనుండి వ్యాధిగ్రస్తునిగా పడియున్నవానిని ప్రభువు స్వస్థపరచగా వారు చూచిరి. అయితే వారు దీనికంటే మరిగొప్ప ఆశ్చర్య కార్యములను చూడగలరు. అట్టి అద్భుతములలో మొదటిది ఏదనగా, మృతులను బ్రతికించుట (21 వ॥). రెండవదిగా మానవజాతికి తీర్పు తీర్చుట (22 వ॥).

5:21 యేసు తాను దేవునితో సమానునిగా చేసుకొనెనని, యూదులు ఆయనపై నేరము మోపిరి. వారి నేరారోపణను ఆయన ఖండించలేదుగాని, తానును, తండ్రియు ఏకమైయున్నామని వారికి గొప్ప ఋజువులను చూపించెను. ఎట్లనగా తండ్రి మృతులను ఏలాగు లేపి జీవమనుగ్రహించెనో ఆలాగుననే కుమారుడుకూడ తనకిష్టమైన వారికి జీవమనుగ్రహించును. ఆయన సామాన్య మానవుడైనచో ఆయనను గురించి ఇట్లు చెప్పబడునా? దానికి ఈ ప్రశ్నలోనే జవాబు కలదు.

5:22 క్రొత్త నిబంధన ప్రకారము తండ్రియైన దేవుడు తీర్పుతీర్చు పనిని తన కుమారునికి అప్పగించెను. ప్రభువైన యేసు తండ్రి తనకు అప్పగించిన పనిని చేయుటకు పరిపూర్ణ జ్ఞానమును, సంపూర్ణమైన నీతియు కలిగియుండవలెనుగదా ! ఆయన మానవులయొక్క హృదయాలోచనలను, ఉద్దేశ్యములను ఎరిగినవాడైయుండ వలెను. ఈ లోకమునకు న్యాయాధిపతియైనవాడు యూదులయెదుట నిలుచుండి, తన అధికారమును నిరూపించుచుండగా వారాయనను ఎరుగరైరి.

5:23 ఈ వచనమందు దేవుడు తన కుమారునికి మృతులను లేపు అధికారమును, లోకమునకు తీర్పు తీర్చు అధికారమును ఎందుకు అనుగ్రహించెనో తెలుపబడినది. మనుష్యులందరు తండ్రిని ఘనపరచునట్లుగా కుమారుని ఘనపరచవలసియున్నది. ప్రభువు చెప్పిన యీ మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ప్రభువు యొక్క దైవత్వమునకు బైబిలు గ్రంథములో అనేక స్పష్టమైన ఋజువులు కలవు. వాటిలో ఇదియొకటి.

యేసు - తాను దేవునితో సమానుడనని నిరూపించుకొనుట (5:19-29) :

దేవుడొక్కడు మాత్రమే పూజార్హుడని బైబిలు మనకు బోధించుచున్నది. నిజదేవుడు తప్ప వేరొక దేవుడు ఉండకూడదని పది ఆజ్ఞలయందు కలదు. అయితే యిప్పుడు తండ్రిని ఘనపరచువారందరు కుమారుని ఘనపరచవలెనని మనకు చెప్పబడియున్నది. కనుక ఈ వచనములో చెప్పబడిన, సత్యమేమనగా యేసుక్రీస్తు దేవుడైయున్నాడు.

ప్రజలనేకులు దేవుని ఆరాధించుచున్నారని చెప్పుదురుగాని, యేసుక్రీస్తును దేవునిగా ఒప్పుకొనరు. వారు ఆయన మంచివాడనియు లేక దేవునివంటివాడనియు భూమిమీద జీవించినవారిలో అటువంటివాడెవడు లేడనియు చెప్పుదురు. అయితే యీ వచనము ఆయనను దేవునితో సరిసమానునిగా తెలియజేయు చున్నది. మరియు తండ్రియైన దేవునికిచ్చు ఘనతను కుమారుడైన దేవునికికూడ ఇవ్వవలెనని తెలియ జేయుచున్నది.

కుమారుని ఘనపరచనివాడు తండ్రిని ఘనపరచ లేడు. ప్రభువైన యేసును ప్రేమింపక నేను దేవుని ప్రేమించుచున్నానని ఒకడు చెప్పు కొనుట వ్యర్ధము. నీవు యేసుక్రీస్తు ఎవరో ఇంతవరకు ఎరుగనియెడల నీవీ వచనమును జాగ్రత్తగా చదివి ఇది దేవుని వాక్యమని ఎరిగి, ‘యేసుక్రీస్తు శరీరధారియైన దేవుడు’ అను ఈ మహిమాన్వితమైన సత్యమును అంగీకరించుము.
5:24 పై వచనములలో ప్రభువైన యేసు జీవమిచ్చువాడనియు, తీర్పు తీర్చు పని ఆయనకు అప్పగింపబడెననియు చదివియున్నాము. ఇప్పుడు ఆయనద్వారా ఒకడు. ఆత్మీయ జీవమును ఎట్లు పొందగలడో, రాబోవు తీర్పును ఎట్లు తప్పించుకొనగలడో ఈ వచనముద్వారా తెలిసికొనుచున్నాము.

ఈ వచనము బైబిలులోగల ప్రియమైన సువార్త వచనములలో ఒకటి. ఇందలి వర్తమానముద్వారా అనేకులు నిత్యజీవమునకు వారసులైరి. ప్రభువైన యేసు ఈ వచనములో “నిశ్చయముగా చెప్పుచున్నాను” అను మాటలను ఉపయోగించెను. తాను చెప్పబోవునది ఎంత ప్రాముఖ్యమైన విషయమో తెలియజేయుటకే ప్రభువు ఈ మాటను ఉపయోగించెను. ఈ వచనములో దేవుని కుమారుడు మనతో వ్యక్తిగతముగాను, సన్నిహితముగాను మాటలాడుచున్నాడు.

“నా మాట విని” – అను మాటకు – యేసు మాట విని అంగీకరించి, విశ్వసించి, విధేయులగుట యని అర్థము. సువార్త ప్రకటింపబడుచుండగా అనేకులు విందురుగాని ఆ సువార్తను నమ్మరు. అయితే యేసుప్రభువు తాను చేయు బోధ దైవసంబంధమైన దనియు ఆయన నిజముగా లోకరక్షకుడనియు నమ్మి ప్రతి ఒక్కడు తన్ను తప్పక అంగీకరించవలెనని చెప్పుచున్నాడు. “నన్ను పంపినవానియందు విశ్వాసముంచుము” అని ప్రభువు చెప్పుచుండెను.

అనగా దేవునియందు విశ్వాసముంచుమని ఆయన చెప్పుచున్నాడు. అయితే ఒకడు దేవునియందు విశ్వాసముంచినంతమాత్రముచేత వాడు రక్షింపబడునని దీని భావము కాదు. అనేకులు మేము దేవునియందు విశ్వాసముంచియున్నవారమేగదా అని అందురు.

అయితే వారు హృదయ పరివర్తనము చెందినవారు కారు. యిక్కడ చెప్పబడిన భావ మేమనగా, ప్రభువైన యేసుక్రీస్తును యీ లోకమునకు పంపిన దేవునియందు తప్పక విశ్వాసముంచుమని అర్థము. మరియు ప్రభువైన యేసును తనకు రక్షకునిగా దేవుడు పంపెనని ఒకడు తప్పక విశ్వసించవలెను. దేవుడే ప్రభువైన యేసునుగూర్చి చెప్పిన దంతయు మానవుడు నమ్మవలెను.

అనగా, ఆయన కలువరి సిలువ కార్యముద్వారా మాత్రమే పాపములు తీసివేయబడుననియు, ఆయన మాత్రమే రక్షకుడనియు తప్పక నమ్మవలెను. “నిత్య జీవము (everlasting life) గలవాడు” అనగా అతడు ఎప్పుడో నిత్య జీవము పొందునని కాదుగాని దానిని ఇప్పుడే ఉన్నపాటున కలిగియున్నాడని అర్ధము. ప్రభువైన యేసుక్రీస్తుయొక్క జీవమే నిత్యజీవము. ఇది నిత్యము కొనసాగు జీవమేగాక శ్రేష్ఠమైనది మరియు విలక్షణమైనది. అది ఆయనయందు విశ్వాసముంచువారికి రక్షకుడనుగ్రహించు జీవమైయున్నది. ఒకడు శరీరరీతిగా జన్మించినపుడు ఎట్లు ప్రకృతి సిద్ధమైన జీవమును పొందునో అట్లే ఒకడు తిరిగి జన్మించినప్పుడు ఆత్మీయ జీవమును పొందును.

“మరియు అట్టివాడు తీర్పులోనికి” రాడు అనగా విశ్వాసి, ఇప్పుడుగాని ఎన్నటికి గాని శిక్షింపబడడు. విశ్వాసి శిక్షనుండి విడుదల పొందియున్నాడు. ఎందుకనగా వాని పాప పరిహార క్రయధనమును కలువరి సిలువలో క్రీస్తు ప్రభువు చెల్లించెను, అయితే ఈ క్రయధనమును రెండు మారులు చెల్లించుమని దేవుడు కోరడు మనకు బదులు క్రీస్తే దానిని చెల్లించెను. ఇది చాలినది. ఆయన రక్షణ కార్యమును సమాప్తిచేసి యున్నాడు.

యేసు దేవుని కుమారుడనుటకు ఇవ్వబడిన నాలుగు సాక్ష్యములు (5:30-47) :

సమాప్తము చేయబడిన ఆ కార్యమునకు మరేదియు కలుపలేము. విశ్వాసి తన పాపములనుబట్టి ఇక ఎన్నటికి శిక్షింపబడడు. “అట్టివాడు మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడు”. క్రీస్తు నంగీక రించినవాడు ఆత్మీయ మరణస్థితినుండి ఆత్మీయ జీవములోనికి దాటియున్నాడు.

అతడు మారుమనస్సు పొందకమునుపు పాపములచేత అపరాధములచేత చచ్చినవాడై యుండెను. మరియు నతడు దేవుని ప్రేమ విషయములో, ప్రభువు సహవాస విషయములో సజీవుడు. ప్రభువైన క్రీస్తునందు విశ్వాసముంచినప్పుడు, అట్టి వానియందు దేవుని ఆత్మవసించును, మరియు అతడు దైవసంబంధమైన జీవమును కలిగియుండును.

5:25 ‘నిశ్చయముగా’ అనుపదమును ప్రభువైన యేసు ఈ అధ్యాయములో నుపయో గించుట యిది మూడవసారి. మరియు ఈ సువార్తలో ఇప్పటివరకు యీ మాట ఏడుసార్లు చూచుచున్నాము. మృతులు దేవునికుమారుని శబ్దము విను గడియ వచ్చు చున్నది. ఇప్పుడే వచ్చియున్నది. అని ప్రభువు చెప్పిన ఆ గడియ మానవ చరిత్రలోకి ఆయన అడుగిడిన సమయమును సూచించుచున్నది.

“ఈ వచనములో చెప్పబడిన మృతులెవరు? ఎవరు దేవుని కుమారుని స్వరము విని బ్రదుకుదురు? ఆయన బహిరంగ పరిచర్య కాలమందు ప్రభువు లేపిన వారై యుండవచ్చును. అయితే ఈ వచనము ఇంతకంటే గంభీరమైన భావమును మనకు తెలియజేయుచున్నది. మరణించిన వారెవరనగా తమయొక్క పాపముల చేతను, అపరాధములచేతను చచ్చినవారే. వారు దేవుని కుమారుని స్వరము వినిరి. సువార్త సందేశము నంగీకరించిరి సువార్త ప్రకటింపబడగా ప్రభువును రక్షకునిగా స్వీకరించి నప్పుడు వారు మరణములోనుండి జీవములోనికి దాటియున్నారు.

5:26 ఒక వ్యక్తి ప్రభువైన యేసు నుండి జీవము ఎట్లు పొందునో ఈ వచనము వివరించుచున్నది. తండ్రి ఎట్లు జీవమునకు మూలాధారమైయుండి ఆ జీవమును అనుగ్రహించువాడై యున్నాడో అట్లే తన కుమారుడుకూడ తనంతటతాను జీవము గలవాడైయుండి ఇతరులకు ఆ జీవమును ఇవ్వగల అధికారమును ఆయనకు అనుగ్ర హించెను. ఇవి క్రీస్తుయొక్క దైవత్వమును తండ్రితో ఆయనకు గల సమానత్వమును తెలియజేయు మాటలు. ఏ మానవుడు తనంతటతానే జీవముగలవాడని ఎవరిని గూర్చియు చెప్పలేము.

మనలో ప్రతి ఒక్కరికి జీవము ఇవ్వబడెను గాని. దేవునికిని ప్రభువైన యేసుకును ఎన్నడును ఎవరిద్వారాను ఇవ్వబడియుండలేదు. నిత్యత్వ మంతటినుండి వారిలో జీవము వసించుచుండెను. ఆ జీవమునకు ప్రారంభము లేదు. వారికి వేరుగా ఆ జీవమునకు ఆధారమేలేదు.

5:27,28 ఇదిగాక దేవుడు లోకమునకు తీర్పు తీర్చు అధికారమును క్రీస్తుకు అనుగ్రహించెను. ఆయన మనుష్యకుమారుడు గనుక ఈ తీర్పు తీర్చు అధికారము అనుగ్రహింపబడెను. ప్రభువు దేవుని కుమారుడుగాను, మనుష్యకుమారుడుగాను పిలువబడెను. దేవుని కుమారుడనుమాట ఆయన పరిశుద్ధ దైవ త్రిత్వములో ఒకడని తెలియజేయుచున్నది. దేవుని కుమారునిగా తండ్రితోను పరిశుద్ధాత్మతోను సమానత్వము కల్గియుండి ఇతరులకు ఆయన జీవము అనుగ్రహించును. ఆయన మనుష్యకుమారుడు కూడ, ఈ లోకమునకు ఆయన మనుష్యుడుగావచ్చి మనుష్యుల మధ్య నివసించెను. కలువరి సిలువలో మానవులైన స్త్రీ పురుషులకు బదులుగా ఆయన మరణించెను.

ఆయన మానవుడుగా ఈ లోకమునకు వచ్చినపుడు తృణీకరింపబడి సిలువ వేయ బడెను. ఆయన మరలా వచ్చినప్పుడు తన శత్రువులకు తీర్పు తీర్చు న్యాయాధిపతిగా వచ్చును. ఒకప్పుడు ఈ లోకములో హీనపరచబడిన ఆయనే మరలా వచ్చినప్పుడు ఈ లోకములోనే ఘనపరచబడును. ఆయన దేవుడును, మానవుడును గనుక తీర్పు తీర్చుటకు ఆయనే అధికారముగల న్యాయాధిపతి.

క్రీస్తు తన్ను తాను దేవునితో సమానుడనని దృఢముగా చెప్పుచుండగా ఆ మాటలు వినుచున్న యూదులు ఆశ్చర్య పడుచున్నారనుటలో ఎట్టి అనుమానము లేదు. ఆయన వారి హృదయాలోచనను ఎరిగియుండి మీరు ఇందుకు ఆశ్చర్యపడనవసరములేదని వారితో చెప్పెను. మరియు ఆయన వీరికి మరింత ఆశ్చర్యకరమైన సత్యములను బయలుపరచుచుండెను. రానున్న కాలములో సమాధులలో నున్నవారు ఆయన స్వరము విందురని చెప్పెను. దేవుడు కాని వాడెవడైనను తన స్వరము సమాధులలోనివారు విందురని ప్రవచించుట అవివేకము. దేవుడు మాత్రమే ఇట్లు చెప్పగలడు ఆయన క్రీస్తే.

5:29 మరణించిన వారందరు ఒక దినమున తిరిగి లేచెదరు. కొందరు జీవము పొందుటకును, మరికొందరు తీర్పు పొందుటకును లేచెదరు. మానవులలో ప్రతి ఒక్కరు వర్తమాన భూత భవిష్యత్కాలములో జీవించు మానవులెవరైనను ఈ రెండు గుంపులలో ఏదో ఒకదానికి చెందియుండవలసినదే.

సత్త్రియలు చేసినవారు తాము చేసిన సత్రియలనుబట్టి రక్షింపబడుదురనియు దుష్క్రియలు చేసినవారు తమ దుష్ట జీవితములనుబట్టి శిక్షింపబడుదురనియు ఈ వచనము బోధించుటలేదు. ఒకడు సత్రియలు చేయుటవలన రక్షింపబడడుగాని, అతడు రక్షింపబడుట వలన సత్రియలు చేయును. సత్రియలు రక్షణకు మూలము కాదుగాని అవి రక్షణ ఫలమైయున్నవి. అవి రక్షణకు హేతువుకావు గాని అవి రక్షణకు నిదర్శనములై యున్నవి. “కీడుచేయు వారందరు” అనగా ప్రభువైన యేసునందు విశ్వాసముంచనివారని అర్ధము, మరియు వారు దేవుని యెదుట నిలువబడుటకును, నిత్య నాశనమను శిక్ష పొందుటకును లేపబడుదురు.

యేసు దేవుని కుమారుడనుటకు ఇవ్వబడిన నాలుగు సాక్ష్యములు (5:30-47) :

5:30 ప్రభువు తనంతట తానుగా ఏమియు చేయలేనంతటి ఐక్యత తండ్రియైన దేవునితో కలిగియున్నట్లు ఈ వచనము చెప్పుచున్నది. తన స్వంత అధికారముతో ఆయన ఏమియు చేయలేదు, స్వచిత్తము రక్షకునియందు కానరాదు, ఆయన తండ్రికి పూర్తిగా విధేయుడైయుండి ఆయనతో సంపూర్ణ సహవాసము మరియు ఐక్యత కలిగియుండెను.

యేసుక్రీస్తు దేవుడు కాడని ఋజువు చేయుటకు దుర్బోధకులు ఈ వచనమును ఆధారము చేసికొనుచున్నారు. ఆయన తనంతట తానేమియు చేయలేడు గనుక ఆయన మానవుడని వారందురు. అయితే యీ వచనము వీరి బోధకు పూర్తిగా భిన్నమైనదానిని తెలియజేయుచున్నది. మానవులు తమకిష్టమైన కార్యమును చేయగలరు. వారు చేయు కార్యములు దైవచిత్తమునకు అనుకూలము కావచ్చును, కాక పోవచ్చును.

తానెవరో ఆయన ఎరుగును గనుక ప్రభువైన యేసు అట్లు చేయ జాలడు, ప్రభువు తనంతట తానేమియు చేయలేడనగా, శరీరరీతిగా చేయగలడు గాని, నైతికముగా చేయలేడు, సమస్త కార్యములను నిర్వర్తించుటకాయనకు భౌతికమైన శక్తి కలదు కాని అక్రమము ఎన్నడు చేయజాలడు. తండ్రియైన దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా చేసిన ఏ కార్యమైనను ప్రభువు దృష్టిలో అక్రమమే. “నా అంతట నేనే ఏమియు చేయలేను” అని ప్రభువు చెప్పిన మాటలు సమస్త మానవాళి నుండి ఆయనను ప్రత్యేకపరచుచున్నవి.

ప్రభువైన యేసు తండ్రి చెప్పునది విని, నిత్యము ఆయనయొద్దనుండి ఉపదేశము పొంది తండ్రివలె ఆలోచించెను, బోధించెను, ప్రవర్తించెను. ఈ వచనములో ‘తీర్పు’ అను పదము న్యాయసంబంధమైన తీర్పును సూచించుట లేదుగాని, తాను ఏమిచేయ వలెనో, ఏమి మాట్లాడవలెనోయను దానిని నిర్ణయించుచున్నది.

ఎందుకనగా స్వార్థపర మైన ఉద్దేశ్యములు రక్షకునికి లేవు గనుక సమస్త విషయములను నిష్పక్షపాతముగాను, న్యాయముగాను నిర్ణయించగలడు. ఆయన ఏకైక అపేక్ష యేమనగా, తండ్రి చిత్తమును నెరవేర్చి ఆయనను సంతోషపరచుటయే.

ఇందుకు భిన్నమైనదేదియు ఆయనలో లేదు. తన సొంత ప్రయోజనముకొరకు ఆయన తీర్పులు తీర్చడు. మన ఉద్దేశ్యములు, మన బోధలైతే మన క్రియలకు మన విశ్వాసమునకు అనుగుణ్యముగా నుండును, అయితే దేవుని కుమారుని విషయము అట్లుకాదు. ఆయన తలంపులు ఆయన తీర్మానములు పక్షపాతముతోగాని స్వయిష్టముతోగాని కూడినట్టివికావు. ఆయన నిష్పక్షపాతి.

5:31 ఈ అధ్యాయములోని మిగిలిన వచనములయందు ప్రభువైన యేసుక్రీస్తు తనయొక్క దైవత్వమును గురించి పెక్కు సాక్ష్యములను వివరించెను. అవేవనగా బాప్తిస్మమిచ్చు యోహాను యిచ్చిన సాక్ష్యము (32,35 వ॥లు); ఆయన సొంత క్రియలు (36 వ॥); తండ్రియొక్క సాక్ష్యము (37,38 వ॥లు); మరియు పాత నిబంధన లేఖనముల సాక్ష్యము (39,47 వ॥లు).

మొదటిగా, సాక్ష్యమనగా నేమో తెలియజేయుటకు ప్రభువు ఒక సాధారణ వివరణ ఇచ్చెను. నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినయెడల నా సాక్ష్యము సత్యము కాదు అని చెప్పెను. చట్ట సభలలో ఒక వ్యక్తియొక్క సాక్ష్యము పరిపూర్ణమైన ఋజువుగా పరిగణింపబడదు. ఒక సంగతిని స్థాపించుటకు ఇద్దరు లేక ముగ్గురు సాక్షులుండవలెనని దైవాజ్ఞ. న్యాయమైన తీర్పుకు ఇది చాలినది. కనుక ప్రభువైన యేసు తన దైవత్వమును ఋజువుపరచుటకు ఇద్దరు ముగ్గురు కాదుగాని నాలుగు సాక్ష్యములను చూపించుచుండెను.

5:32 ఈ వచనంలో చెప్పబడిన “వేరొకడు” అను మాట బాప్తిస్మమిచ్చు యోహానును సూచించుచుండెనా? తండ్రియైన దేవుని సూచించుచుండెనా? పరిశుద్ధాత్మ దేవుని సూచించుచుండెనా? యను ప్రశ్నను రేకెత్తించుచున్నది. కొందరు ‘వేరొకడు’ అను పదము బాప్తిస్మమిచ్చు యోహానును సూచించుచున్నదని నమ్ముచున్నారు. మరికొందరు తండ్రియనియు, పరిశుద్ధాత్మయని నమ్ముచున్నారు. మనమైతే తండ్రి ప్రభువును గూర్చి సాక్ష్యమిచ్చెనని నమ్ముచున్నాము. ఈ వచనము క్రింది మూడు వచనములతో సంబం ధము కలిగియున్నది.

5:33 తన తండ్రి తన్నుగూర్చి ఇచ్చిన గొప్ప సాక్ష్యమును తెలియజేసి, ఆ తరువాత యోహాను తన్నుగూర్చి యిచ్చిన సాక్ష్యమును ప్రభువు వివరించుచున్నాడు. అవిశ్వాసు లైన యూదులకు ఆయన ఇట్లు గుర్తుచేసెను : బాప్తిస్మమిచ్చు యోహాను ఏమి బోధించుచున్నాడోయని కొందరు మనుష్యులను మీరు పంపితిరి గదా! అయితే అతడు నన్నుగూర్చియే సాక్ష్యమిచ్చెనని ప్రభువు వారితో చెప్పెను. యోహాను మనుష్యులను తనవైపు ఆకర్షించుకొనక, వారి దృష్టిని ప్రజలవైపు మళ్ళించెను. సత్యవంతుడైన వానినిగూర్చి యోహాను సాక్ష్యమిచ్చెను.

5:34 తన మాటలు వినుచున్న వారికి ప్రభువైన యేసు చెప్పినదేమనగా, తాను దేవునితో సమానుడనని చెప్పినది మానవులిచ్చు సాక్ష్యమును ఆధారము చేసికొని కాదని తెలిపెను. ఒక వేళ అట్లు చెప్పినచో ఆయన వాదము బలహీనమైనదైయుండును.

మెట్టుకు బాప్తిస్మమిచ్చు యోహాను తన్నుగూర్చి యిచ్చిన సాక్ష్యమును ప్రభువు ఇక్కడ వివరించుచున్నాడు. అతడు దేవునియొద్దనుండి పంపబడినవాడు గనుక ప్రభువైన యేసు ‘మెస్సీయ’ అనియు, లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్లయనియు ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చియుండెను.

అటు తరువాత “మీరు రక్షింపబడవలెనని ఈ మాటలు చెప్పుచున్నాను” అని ప్రభువు చెప్పెను. ఇంత దీర్ఘముగా ప్రభువైన యేసు యూదులతో ఎందుకు మాట్లాడవలసి వచ్చెను? తాను చెప్పునదంతయు సత్యమనియు, వారు వాదించునదంతయు అసత్యమని తెలియజేయుటకు మాట్లాడెనా? కానే కాదు.

ఈ అద్భుతమైన సత్యములు వారి ముందుంచినది ఎందుకనగా, తానెవరో వారు గ్రహించి వాగ్దానము చేయబడిన రక్షకునిగా ఆయనను అంగీకరించు నిమిత్తమే. ఈ వచనము ప్రభువైన యేసుయొక్క మృదువైన ప్రేమ కల్గిన హృదయమును చూపించుచున్నది. తనను ద్వేషించువారితోను, తన ప్రాణము తీయజూచు వారితోను ఆయన ఎంతో ప్రేమతో మాట్లాడెను. అయితే వారిపట్ల ఆయనకేమాత్రమును ద్వేషము లేదు. ఆయన వారిని ప్రేమించెను.

5:35 ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి – “అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైయుండెను” అని అతని ఘనపరచెను. దీపమనగా, అతడు అధికాసక్తిగలవాడనియు ఇతరులకు వెలుగిచ్చు పరిచర్యగలవాడనియు ఇతరులను క్రీస్తునొద్దకు నడిపించుటలో తన్నుతాను వ్యయపరచుకొనువాడనియు అర్థము. మొదటిగా యూదులనేకులు యోహానును వెంబడించిరి. ఏలయనగా యోహాను నూతనమైన వింతైన వ్యక్తిగా వారి జీవితములలో ప్రవేశించెను. వారు అతడు చెప్పు బోధను ఆలకించుటకు అతనియొద్దకు వెళ్ళిరి. కొంతకాలము వరకు వారతనిని ఒక గొప్ప మత బోధకునిగా గుర్తించిరి. తాత్కాలికముగా ఆనందించిరి.

కాని వారు పశ్చాత్తాపము నొంద లేదు. యోహానును అంతగా అంగీకరించినవారు అతడు ఎవరిని గూర్చి చెప్పెనో ఆ మెస్సీయను వారెందుకు అంగీకరించలేదు? ఆ ప్రజలు పరస్పర విరుద్ధ స్వభావము గలవారు. వారు రాజుయొక్క రాకడను గూర్చి ముందుగా తెలియ జేయు వర్తమానికుని (వారు) అంగీకరించిరి గాని, రాజును అంగీకరించలేదు. యేసు యోహానును ఎంతగానో ఘనపరచెను.

క్రీస్తుయొక్క సేవకుడైనను “మండుచు ప్రకాశించుచున్న దీపము” అని పిలువబడుట అది దేవుని కుమారునియొద్దనుండి వచ్చిన నిజమైన ఘనతయైయున్నది. ప్రభువైన యేసును ప్రేమించు మనలో ప్రతి ఒక్కరము ఆయన కొరకు మండుచు ప్రకాశించు దీపమైయుండవలెననెడి ఆపేక్షగల వారమై యుండవలెను. మరియు మనము మండుచు లోకమునకు వెలుగు నివ్వవలెను.

5:36 యోహాను ఇచ్చిన సాక్ష్యము క్రీస్తుయొక్క దైవత్వమునకు గొప్ప ఋజువేమి కాదు. చేయుటకు తండ్రి తనకిచ్చిన ఆశ్చర్యకరమైన క్రియలే ఆయన దేవుని యొద్దనుండి నిజముగా పంపబడినవాడని సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే కేవలము అద్భుత కార్యములే దైవత్వమునకు ఋజువులు కాజాలవు. పరిశుద్ధ గ్రంథమందు మానవులకు అద్భుతములు చేయుశక్తి అనుగ్రహింపబడినట్లుగా చదువుచున్నాము. అపవిత్రాత్మలకుకూడ గొప్ప అద్భుతములు చేయు శక్తి కలదు. అయితే ప్రభువైన యేసు చేసిన అద్భుతములు ఇతరులు చేసిన అద్భుతములకు భిన్నమైనవి.

ఇట్టి గొప్ప అద్భుతములు చేయుటకు ప్రభువు తనంతట తానే శక్తిగలవాడు గాని ఇతరులైతే ఆ శక్తి అనుగ్రహింపబడిన (పొందిన) వారైయున్నారు. వారు అద్భుతములు చేయుదురు గాని ఎవరికైనను అద్భుతములు చేయు శక్తిని అనుగ్రహించలేరు. ప్రభువైన యేసు తనంతట తానే అద్భుతములు చేయు శక్తి కల్గియుండి, అపొస్తలులకు తనవలె అద్భుతములు చేయు శక్తిననుగ్రహించెను. రక్షకుడు చేసిన గొప్ప కార్యములు మెస్సీయనుగురించి పాత నిబంధనలో ప్రవచింపబడిన కార్యములే. ప్రభువైన యేసు చేసిన అద్భుత కార్యములు వాటి స్వభావమందును, ఉద్దేశ్యమందును మరియు సంఖ్యయందును అద్వితీయమైనవి.

యేసు దేవుని కుమారుడనుటకు ఇవ్వబడిన నాలుగు సాక్ష్యములు (5:30-47) :

5:37 ఈ వచనములో తండ్రి తననుగూర్చి ఎట్టి సాక్ష్యము కలిగియుండెనో దానిని గూర్చి ప్రభువు మరల తెలియజేసెను. ఇది ప్రభువైన యేసు బాప్తిస్మము పొందిన సమయమును సూచించుచున్నది. అప్పుడు “ఈయనే నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను” అని తండ్రియైన దేవుని స్వరము పరలోకము నుండి వినబడెను. కాబట్టి మనము గ్రహించునదేమనగా, యేసు ప్రభువుయొక్క జీవితమందును, పరిచర్యయందు, అద్భుత కార్యములయందు కూడా ఆయన దేవుని యొక్క అద్వితీయ కుమారుడని తండ్రి సాక్ష్యమిచ్చెను.

5:38 అవిశ్వాసులైన యూదులు దేవుని స్వరమును వినలేదు మరియు ఆయన స్వరూపము చూడలేదు. ఆయన వాక్యము వారిలో నిలిచియుండలేదు గనుక వారాయన స్వరమును వినలేదు. నేడు పరిశుద్ధ గ్రంథముద్వారా దేవుడు మానవులతో మాట్లాడు చున్నాడు. యూదులు పాత నిబంధన లేఖన భాగములను కలిగియున్నను, ఆ లేఖన భాగములద్వారా దేవుడు తమతో మాటలాడుటకు వారు ఒప్పుకొనలేదు. ఎందుకనగా వారి హృదయములు కఠినపరచబడి, వారి చెవులు వినుటకు మందమాయెను.

దేవుడు పంపినవానియందు విశ్వాసముంచలేదు గనుక వారు దేవుని స్వరూప మును ఎన్నడు చూచియుండలేదు. తండ్రియైన దేవుడు మానవ నేత్రములతో చూడ దగిన ఆకృతినిగాని, స్వరూపముగాని గలవాడుకాదు. దేవుడు ఆత్మగనుక ఆయన అదృశ్యుడు. కాని ప్రభువైన యేసుక్రీస్తునందు దేవుడు మానవాళికి తన్ను తాను బయలుపరచుకొనెను. అయితే క్రీస్తునందు విశ్వాసముంచినవారు నిజముగా దేవుని స్వరూపమును చూచియున్నారు. కాని అవిశ్వాసులైతే ప్రభువును చూచినప్పుడు ఆయనను తమవంటి వేరొక మనిషిగానే భావించిరి.

5:39 లేఖనములు క్రీస్తునుగురించి సాక్ష్యమిచ్చుచున్నవి. ఈ వచనములోని మొదటి భాగము రెండు విధములుగా అర్థము చేసికొనవచ్చును. (1) యూదులకు లేఖనములను పరిశోధించుమని ప్రభువైన యేసు చెప్పియుండ వచ్చును. (2) లేఖనములను కలిగి యుండి వాటిని పరిశోధించుటవలన వారు నిత్యజీవమును కలిగియున్నారను అభిప్రా యమును ప్రభువు చెప్పియుండవచ్చును, ఈ వచనమునకు ఈ రెండు వ్యాఖ్యానము లలో ఏదైనను సరిపోవచ్చును. లేఖనములు పరిశోధించినంతమాత్రముననే తాము నిత్యజీవమును పొందుదుమని వారు తలంచుచున్నట్లు ప్రభువైన యేసు చెప్పెను.

అయితే పాత నిబంధన లేఖనములు రానున్న మెస్సీయనుగూర్చి తెలియజేయుచున్నవి. కాని ఈ యేసే రానై యున్న మెస్సీయ అని లేఖనములు చెప్పుచున్నట్లు యూదులు గ్రహించరైరి. తమ చేతులలో లేఖనములు కల్గియుండియు గ్రుడ్డివారగుట ఎంతో భయంకరము, మరియు ప్రభువైన యేసు వారితో మాటలాడినను వారాయనను అంగీకరించకపోవుట క్షమింపరాని సంగతి. ఈ వచనములో “అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి” అను భాగమును గమనించుడి.

“క్రీస్తు రాకడ” పాత నిబంధనలోని లేఖనముల ముఖ్యాంశమని ఈ వాక్య భావము. ఎవడైనను యీ సత్యమును గ్రహించకనే పాత నిబంధన లేఖనములను పఠించినయెడల వాడు అతి ప్రాముఖ్యమైన అంశమును పోగొట్టుకొనినవాడగును.

5:40 యూదులు జీవము పొందునట్లుగా వారు క్రీస్తునొద్దకు వచ్చుటకు ఇష్టపడుట లేదు, జనులు రక్షకుని అంగీకరింపక పోవుటకు తగిన కారణము ఇక్కడ తెలుపబడినది. వారు సువార్తను గ్రహించలేక కాదు; లేక యేసును అంగీకరించుట అసాధ్యమనియు కాదు; మరియు వారికి ఆయనయందు నమ్మశక్యముకాని దేదియు లేదు. అసలైన తప్పు ఏదనగా అది మానవుని స్వయిచ్ఛయందున్నది. మనుష్యుడు రక్షకునికంటే తన పాపములనే ఎక్కువగా ప్రేమించెను. తన దుష్టమార్గములను విడిచిపెట్టుట అతనికి ఇష్టము లేదు.

5:41 యూదులు ప్రభువును ఘనపరచలేదు. ఆయనను అంగీకరించుటలో వారు విఫలులైరి. తాను వారిచేత అవమానము పొందితినని వారికి తెలియకూడదని ప్రభువు ఆశించెను. మనుష్యులవలన మెప్పుపొందుటకు ఆయన ఈ లోకములోనికి రాలేదు. మానవుల మెప్పును కోరక తండ్రియొక్క మెప్పునే ఆయన కోరెను. మానవ తృణీకారము ఆయన మహిమను లేశమైనను తగ్గించదు.

5:42 మానవుడు దేవుని కుమారుని అంగీకరించని కారణమేమో ఇక్కడ తెలుపబడి యున్నది. దేవుని ప్రేమ వారిలో లేదు గనుక వారు దేవుని ప్రేమింపక తమ్మును తామే ప్రేమించుకొనిరి. వారు దేవుని ప్రేమించినయెడల దేవుడు పంపినవానిని వారు అంగీకరించుదురు. ప్రభువైన యేసును తృణీకరించుటద్వారా వారు యెహోవా దేవుని ప్రేమించుటలో ఎంతగా కొరతపడియున్నారో వారే తెలియజేయుచున్నారు.

5:43 తండ్రికి మహిమ తెచ్చుటకును, తండ్రికి అన్ని విషయములలోను విధేయత కల్గియుండుటకును తండ్రి చిత్తము నెరవేర్చుటకును ప్రభువైన యేసు తన తండ్రి నామమున వచ్చెను. మానవులు నిజముగా దేవుని ప్రేమించిన యెడల, తన క్రియల ద్వారా మాటలద్వారా తండ్రిని సంతోషపరచినవానిని అనగా ప్రభువైన యేసునుకూడ వారు ప్రేమించుదురు గదా!
మరియొకడు తన నామమందు వచ్చినయెడల యూదులు అంగీకరింతురని ప్రభువు ప్రవచించెను. తన తరువాత అబద్ధబోధకులు లేచి, ఆ జాతిద్వారా ఘనతను అపేక్షించుదురని చెప్పెను.

బహుశా గడచిన శతాబ్దములనుండియు నేనే క్రీస్తునని ప్రకటించుకొనిన అబద్ధ మత నాయకులను గురించి చెప్పియుండవచ్చును. మరియు ఆయన క్రీస్తువిరోధినిగురించి మరి నిశ్చయముగా చెప్పియుండవచ్చును. రానున్న దినములయందు తన్నుతానే రాజుగా హెచ్చించుకొనుచు తన్ను దేవునిగా ఆరాధించు మని బలవంతము చేయు ఒకడు యూదా జనాంగములోనుండి లేచును (2 థెస్స 2:8-10). యూదులలో మూడువంతుల ప్రజలు ఈ క్రీస్తు విరోధిని తమ ఏలికగా అంగీకరింతురు. తత్ఫలితముగా వారు దేవునియొక్క కఠినమైన తీర్పుకు గురియగుదురు (ప్రకటన 13:11-18; మత్తయి 24:15).

5:44 యూదులు ప్రభువును అంగీకరించుటలో తప్పిపోవుటకు గల కారణమును ఆయన ఇక్కడ వివరించుచుండెను. వారు దేవుని మెప్పుకంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా నపేక్షించిరి. ఆయనను వెంబడింపగా కలుగు శ్రమలను, అవమానములను సహించుటకు ఇష్టములేనివారైరి. మనుష్యులేమనుకొందురో, ఏమిచేయుదురో యని మనుష్యులకు భయపడునంతవరకు వారు రక్షింపబడలేదు. ఒకడు ప్రభువైన యేసును అంగీకరించుటకు దేవుని మెప్పుకంటె మరెక్కువగా దేనిని అపేక్షించరాదు. దేవుని యొద్దనుండి వచ్చు ఘనతనే ఒకడు తప్పక వెదకవలెను.

5:45 ప్రభువే యూదులపై తండ్రి యెదుట నేరము మోపవలసిన అవసరము లేదు. ఆయన వారిపై అనేక నేరములు మోపగలడుగాని, వారిపై నేరారోపణ చేయుటకు మోషే ధర్మశాస్త్రమే చాలును. పాత నిబంధనయందు ప్రత్యేకించి, మోషే ధర్మశాస్త్రము నందు యూదులకు అతిశయము కలదు. ఈ లేఖనములు యూదా జనాంగమునకే ఇవ్వబడెనని వారు గర్వించుదురు గాని, 46వ వచనమునుబట్టి వారు మోషే మాటలకు విధేయత చూపలేదని మనము గమనించగలము.

5:46 ప్రభువు తన స్వంత మాటలకెంత ఆధిక్యత నిచ్చెనో అట్టి ఆధిక్యతను మోషే వ్రాతలకును ఇచ్చెను. ఎట్లనగా, లేఖనములన్నియు దైవావేశము వలన కలిగినవని మనమెరుగుదుము. మనము పాత నిబంధన చదివినను, క్రొత్త నిబంధన చదివినను దేవుని వాక్యమునే చదువుచున్నాము. యూదులు మోషేయందు విశ్వాసముంచిన యెడల ప్రభువైన యేసునందును విశ్వాసముంచవలసియున్నారు. ఏలయనగా, మోషే క్రీస్తు ఆగమనమును గురించి వ్రాసియుండెను.

ద్వితీయోపదేశకాండము 18:15-18 నందు మోషే క్రీస్తు ఆగమనమును గురించి వ్రాసియుండెను. మరియు మోషే క్రీస్తు వచ్చినప్పుడు ఆయనమాట విని, ఆయనకు విధేయులు కమ్మని వారికి చెప్పియుండెను. ఇప్పుడు ప్రభువైన యేసు వచ్చియుండెనుగాని, వారాయనను స్వీకరించుటలో తప్పిపోయిరి.

కనుక దేవుని యెదుట మోషే యూదులపై నేరారోపణచేయును. ఎందుకనగా, వారు మోషేను నమ్మియున్నట్లుగా నటించి, మోషే వారికాజ్ఞాపించినది చేయుటకు నిరాకరించిరి. “అతడు నన్ను గురించి వ్రాసెను” అని ప్రభువు చెప్పిన మాటలనుబట్టి పాత నిబంధన లేఖనములయందు క్రీస్తు ప్రభువును గూర్చిన ప్రవచనములు కలవని తేటగా తెలియుచున్నది.

5:47 మోషే వ్రాసిన దానిని యూదులు నమ్మనియెడల యేసు మాటలు వారు నమ్ముదురని మనము చెప్పజాలము. పాత నిబంధనకు, క్రొత్త నిబంధనకు సన్నిహిత సంబంధము కలదు. పాత నిబంధన గ్రంథమందలి లేఖన భాగములు దేవుని ప్రేరణచే వ్రాయబడినట్లు నమ్మనియెడల ప్రభువైన యేసు మాటలుకూడ దైవప్రేరితమని నమ్మలేరు. పరిశుద్ధ గ్రంథమందలి కొన్ని లేఖన భాగములను నమ్మక విమర్శించువారు తమ అపనమ్మకమునుబట్టి అనతి కాలములోనే పరిశుద్ధ గ్రంథమునంతటిని విమర్శింతురు.

చెడ్డ స్త్రీ – మంచి మనుష్యుడు – Bible Verses Chapter 4 in Telugu

నాలుగవ అధ్యాయము

చెడ్డ స్త్రీ – మంచి మనుష్యుడు

మూడు, నాలుగు అధ్యాయములలో మన ప్రభువు ఇద్దరు వేర్వేరు వ్యక్తులతో చేసిన సంభాషణ వివరించబడియున్నది. ఆ ఇద్దరు నీకొదేము మరియు సమరయ ఆ ఇరువురి మధ్యగల కొన్ని ముఖ్యమైన భేదములను దిగువ చూడగలము.

నీకొదేము                                                                                          సమరయ స్త్రీ
1. మంచివాడు                                                                                                 చెడ్డ స్త్రీ
2. యూదులనాయకుడు                                                                                 యూదులచే వెలివేయబడెను
3. రాత్రివేళ ప్రభువునొద్దకు వచ్చెను                                                                మధ్యాహ్నపువేళ కనుగొనబడెను
4. రక్షకుని వెదకెను                                                                                         రక్షకుడే ఈమెను వెదకెను
5. దైవ జ్ఞానము కలిగియుండెను “మేమెరుగుదుము”(3:2)                                 సత్యమునుగూర్చిన జ్ఞానము ఈమెకు లేదు. “మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తారు”(4:22)
6. క్రొత్త జన్మ                                                                                                     ఆరాధన
7. స్పష్టమైన ఫలితములేదు                                                                            తక్షణమే ఫలితము కనబడెను.

 

చెడ్డ స్త్రీ – మంచి మనుష్యుడు

 

సమరయ స్త్రీయొక్క సంభాషణ (4:1-30) :

4:1-3 యేసు యోహానుకంటే ఎక్కువమందిని శిష్యులనుగా చేసికొని వారికి బాప్తిస్మమిచ్చుచున్నాడనియు, యోహానుయొక్క పేరు ప్రతిష్ఠలు తగ్గిపోవుచున్నవనియు పరిసయ్యులు వినిరి. దీనిని ఆధారము చేసికొని యోహాను శిష్యులకు యేసు శిష్యులకును మధ్య వివాదము రేపుటకు ప్రయత్నించి యుండవచ్చును.

Read and Learn More Telugu Bible Verses

వాస్తవమునకు ప్రభువైన యేసు తానే బాప్తిస్మమియ్యలేదుగాని, ఆయన శిష్యులిచ్చిరి. అయినను ప్రజలు మాత్రము ప్రభువుయొక్క శిష్యులుగా, లేక ఆయన అనుచరులుగానే బాప్తిస్మము పొందిరి. తాను యూదయ దేశము విడచి గలిలయ ప్రాంతమునకు వెళ్ళుటద్వారా యోహాను శిష్యులకును మధ్య భేదాభిప్రాయములు కలిగించుటతో పరిసయ్యులయొక్క ప్రయత్నములను ప్రభువు నిరోధించెను. కాని యీ వచనములో గుర్తింపదగిన మరొక విషయమున్నది.

అదేమనగా, యూదయ ప్రాంతము యూదా జనాంగమునకు ప్రధాన కేంద్రము కాగా, గలిలయ ప్రాంతము అన్యజనాంగములకు చెందినది. యూదా జనాంగము ఇప్పటికే తనను మరియు తన సాక్ష్యమును తిరస్కరించిరని ప్రభువు ఎరిగినవాడై, రక్షణ వర్తమానము తీసికొని గలిలయ ప్రాంతమునకు వెళ్ళెను.

4:4-6 యూదయనుండి గలిలయకు వెళ్ళుటకు సమరయ గుండ వెళ్ళుటయే సరియైన మార్గము. కాని యూదులు సమరయగుండా ప్రయాణము చేయరు. యూదులు సమరయను నీచమైనదిగా నెంచెదరు. గనుక వారు గలిలయ ప్రాంతము లకు వెళ్ళునప్పుడు చుట్టు మార్గముగుండ వెళ్ళెదరు. ప్రభువు సమరయ మార్గముగుండా వెళ్ళవలసి వచ్చెనని చెప్పినప్పుడు తన సహాయము అవసరమైన ఒక ఆత్మ సమరయలో ఉన్నదను ఉద్దేశ్యముతో తప్ప, భౌగోళిక పరిస్థితులను బట్టి ప్రభువు ఆ మార్గమున వెళ్ళెనని తలంచరాదు. సమరయ ప్రాంతములో ప్రయాణము చేయుచు ప్రభువు “సుఖారు” అను గ్రామమునకు వచ్చెను.

ఆది 48:22లో వ్రాయబడి యున్నట్లు ఆ గ్రామమునకు సమీపములో యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి యుండెను. ప్రభువైన యేసు ఈ ప్రాంతములో ప్రయాణము చేయుచుండగా, దాని గత చరిత్ర దృశ్యములన్నియు ఆయన మనస్సులో స్థిరముగా నిలిచిపోయెను. ఆ ప్రాంతములోనే యాకోబు బావి యుండెను. నేడు కచ్చితముగా గుర్తించగల బైబిలు సంబంధమైన బహు కొద్ది స్థలములలో ఇది యొకటి ప్రభువు ఆ బావిని చేరునప్పటికి మధ్యాహ్న సమయమాయెను. ఆయన బహు దూరము నడుచుటవలన బాగా అలసిపోయెను గనుక ఆయన ఆ బావియొద్ద కూర్చుండెను. యేసు కుమారుడైన దేవుడైనప్పటికిని ఆయన మానవుడుకూడ.

దేవుడుగా ఆయన ఎన్నటికి అలసట చెందడు గాని, మానవుడుగా అలసిపోయెను. ఈ సంగతులు అర్థము చేసుకొనుట మనకు కష్టమే. కాని ప్రభువైన యేసు క్రీస్తు యొక్క వ్యక్తిత్వము నశించు మానవ మనస్సుకు పూర్తిగా అర్థము కాదు. దేవుడు ఈ లోకమునకు దిగివచ్చి ఒక మనుష్యుడుగా మనుష్యులమధ్య జీవించెనను సత్యము మర్మమైనది. ఇది సమస్త జ్ఞానమునకు మించినది.

4:7,8 ప్రభువైన యేసు బావినొద్ద కూర్చుండి యుండగా, ఒక స్త్రీ నీళ్ళు చేదుకొనుటకు బావియొద్దకు వచ్చెను. అది మిట్టమధ్యాహ్న సమయము. స్త్రీలు నీళ్ళ కొరకు బావియొద్దకు వెళ్ళుటకు అనుకూల సమయము కాదు. అది మిక్కిలి ఎండవేళ, ఈ స్త్రీ చాల ఘోరమైన పాపి. తన్ను చూచువారెవరు అక్కడ ఉండరని తలంచి ఆ స్త్రీ ఆ సమయమును ఎంచుకొని ఉండవచ్చును. కాని ఆ సమయములో ఆ స్త్రీ ఆ బావియొద్ద ఉండునని ప్రభువు ఎరిగియున్నాడు. ఆమె రక్షణ అవసరమైన ఆత్మయని ఆయన ఎరిగెను. గనుక ఆ స్త్రీని కలిసికొని ఆమె పాప జీవితమునుండి ఆమెను తప్పించవలెనని ఆయన నిశ్చయించుకొనెను.

ఈ వచనములోను, తరువాతి వచనములలోను గొప్ప ఆత్మల సంపాదకుడు తన పనిలో నుండుట మనము చూడగలము. అంతేగాక ఆమెయొక్క అవసరత గ్రహించునట్లు చేయుటకు, ఆమెకు గల సమస్యకు పరిష్కారమార్గము సూచించుటలో ఆయన అనుస రించిన పద్ధతులను మనము గమనించగలము. ప్రభువుతో ఆ స్త్రీ కేవలము ఏడు మారులు మాటలాడెను.

వాటిలో ఆరుమారులు ప్రభువుతోను ఒకమారు తన పట్టణ ప్రజలతోను మాటలాడెను. ఆమె మాటలాడినంతగా మనముకూడ ప్రభువుతో సంభాషిం చినయెడల, తన పట్టణప్రజలతో మాటలాడినప్పుడు ఆమె ఎటువంటి సాక్ష్య మిచ్చెనో అటువంటి సాక్ష్యము మనముకూడ కలిగియుందుము. మరియు మన సాక్ష్యముకూడ సఫలమగును. ‘ఇమ్ము’ అను మాటలతో ప్రభువు తన సంభాషణను ప్రారంభించెను. ఆయన ప్రయాణము చేసి అలసియుండుట వలన నీరు త్రాగ ఆశించెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ‘సుఖారు’ అను ఊరిలోనికి వెళ్ళిరి. కాని, అక్కడ బావినుండి నీరు చేరుకొనుటకు ఆయనకు ఎటువంటి సాధనము లేనట్లుగానున్నది.

4:9 ఆ స్త్రీ యేసు ఒక యూదుడని గ్రహించి, త్రోసివేయబడిన సమరయురాలైన తనతో ఆయన మాటలాడుట చూచి ఆమె ఆశ్చర్యపడెను. తాము యాకోబు సంతాన మనియు, తామే నిజమైన ఇశ్రాయేలీయులమనియు సమరయులు చెప్పుకొందురు. కాని వాస్తవమునకు వారు యూదులు మరియు అన్యజనాంగముద్వారా ఏర్పడిన మిశ్రిత జనాంగము. వారి ఆరాధన స్థలము గెరిజీము పర్వతముపై నున్నది.

ఆ స్త్రీ ప్రభువుతో మాటలాడుచున్న స్థలమునుండి చూస్తే, వారిరువురికి స్పష్టముగా కనిపించు పర్వతము గెరిజీము పర్వతమే. సమరయ ప్రజలంటేనే యూదులకు బహు అయిష్టత కలదు. వారిని సంకరజాతి ప్రజలుగా యూదులు పరిగణింతురు. అందువలననే ఆమె ఆ ప్రభువుతో “యూదుడవైన నీవు సమరయ స్త్రీ నైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావు” అని ప్రశ్నించెను. ఈ సందర్భములో తాను తన సృష్టికర్తతో మాటలాడు చున్నదని, ఆయన ప్రేమ మానవ పరిధులను మించినదనియు ఆమె ఎరుగకుండెను.

4:10 ఆయన ఆ స్త్రీని దాహమునకిమ్మని అడుగుటవలన ప్రభువు ఆమెలో ఆసక్తిని రేకెత్తించెను. తన్ను దేవునిగాను, మానవునిగాను చెప్పుకొనుటద్వారా ఆమెలోని ఆసక్తిని అధికము చేసెను. మొట్టమొదట ఆయన దేవుని వరమైయున్నాడు. దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును లోకరక్షకునిగా అనుగ్రహించెను. కాని ఆయన మానవుడు కూడ. మానవుడుగా ఆయన ప్రయాణము వలన అలసిపోయెను. గనుకనే ఆమెను దాహమునకిమ్మని అడిగెను. తనతో మాటలాడుచున్నవాడు శరీరధారిగా ప్రత్యక్షమైన దేవుడని ఆమె గ్రహించినయెడల ఆయనను వరమిమ్మని అడుగును. అప్పుడు ఆయన ఆమెకు జీవజలమును అనుగ్రహించును.

14:11-13 ఆ స్త్రీ కేవలము అక్షరార్థమైన నీటినిగూర్చి మాత్రమే ఆలోచించెను. మరియు ఏమి లేకుండ ఆ నీటిని ఎలా పొందగలడని ఆమె తలంచెను. ఆమె ప్రభువును గుర్తించుటలోను, ఆయన మాటలను అర్థముచేసికొనుటలోను పూర్తిగా విఫలమైనది. ఆమె ఎప్పుడైతే ఆ బావిని తమకిచ్చిన తమ పితరుడైన యాకోబునుగూర్చి ఆలోచించినదో అప్పుడు తాను ఎక్కువగా అలజడికి గురియాయెను. యాకోబును తన కుమారులును, వారి పశువులును ఆ బావి నీరు త్రాగిరి.

అయితే శతాబ్దముల తరువాత ఆ యాకోబు బావి నీరు త్రాగుట కిమ్మని అడిగిన అలసిన ప్రయాణికుని ఆమె కనుగొనుచున్నది. కాని అతడు దానికంటె శ్రేష్ఠమైన నీరు ఇవ్వగలనని చెప్పెను. తనయొద్ద శ్రేష్ఠమైనవి యుండగా, యాకోబు బావినీరు కావలెనని ఎందుకు అడిగెను? గనుక అక్షరార్థమైన యాకోబు బావి నీటికిని, తానిచ్చు నీటికిని గల భేదమును ప్రభువు వివరించుచున్నాడు. ఈ నీటిని త్రాగువారు మరల దప్పిగొందురు.

ఈ సత్యమును ఆ సమరయ స్త్రీ నిశ్చయముగా అర్థము చేసికొనెను. ఆ బావినుండి నీరు చేదుకొనుటకు ప్రతిదినము ఆమె అక్కడికి వచ్చుచున్నది. కాని ఆ నీరు ఆమెయొక్క దప్పి తీర్చలేదు. లోకములోని బావులన్నింటి పరిస్థితి అంతే. భూసంబంధమైన వాటిద్వారా తమ కోర్కెలను తృప్తిపరచుకొనుటకు మానవులు ప్రయత్నింతురు గాని, మానవ హృదయ దాహమును అవి ఏమాత్రమును తీర్చజాలవు.

4:14 యేసు ఇచ్చు నీరు నిశ్చయముగా తృప్తినిచ్చును. క్రీస్తుయొక్క ఆశీర్వాద కనికరములను గ్రోలినవాడు ఎన్నడు దప్పిగొనడు. ఆయన మేళ్ళతో హృదయము నిండుట మాత్రమేగాక అవి పొర్లిపారును. అవి ఈ జీవితములోనే గాక నిత్యత్వ మందును నిత్యము ఉబుకుచుండు బుగ్గవలె ఉండి నిరంతరము ప్రవహించుచుండును. ఈ వ్యత్యాసము బహు తేటగా నున్నది.

మానవ హృదయమును తృప్తితో నింపుటకు లోకమిచ్చునదంతయు చాలదు కాని క్రీస్తు అనుగ్రహించు దీవెనలు హృదయమును నింపుటయేగాక అవి ఏ హృదయము పట్టజాలనంత గొప్పవియైయున్నవి. లోకము ఇచ్చునట్టి సంతోషము బహుకొద్ది సంవత్సరములమట్టుకేగాని క్రీస్తు అనుగ్రహించు సంతోషము నిత్యజీవములోకూడ నిలుచును.

4:15 ఆశ్చర్యకరమైన ఈ నీటినిగూర్చి ఆ స్త్రీ వినినప్పుడు వెంటనే తనకు ఆ నీరు దయచేయుమనికోరెను. ఆమె ఇంకను అక్షారార్థమైన నీటిని గూర్చియే తలంచుచున్నది. ప్రతిదినము బావికివచ్చి చాలా లోతునుండి తోడుకొని, బరువైన ఆ కుండను మోసికొని వెళ్ళుట ఆమె కిష్టము లేదు.

ప్రభువైన యేసు ఆత్మీయమైన నీటినిగూర్చి మాటలాడు చున్నాడని ఆమె గ్రహించలేదు. ఈ నీటిని కేవలము ఆయనయందు విశ్వాసముంచుట ద్వారా పొందవచ్చునని ఆయన సూచించుచున్నాడని ఆమె గ్రహించకుండెను.

4:16 వారి సంభాషణలో వచ్చిన ఆకస్మికమైన మార్పును గమనించండి. ఆమె నీరునడుగుచుండగా, ప్రభువైన యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసికొని రమ్మని చెప్పుచున్నాడు. ఎందుకు ? ఎందుకనగా, ఈ స్త్రీ రక్షింపబడుటకు ముందు తాను పాపినని గ్రహించవలెను. ఆమె నిజమైన పశ్చాత్తాపముతోను, ఒప్పుకోలుతోను ప్రభువు చెంతకు వచ్చి తన పాపములను అవమానకరమైన తన స్థితిని ఒప్పుకొనవలెను.

ప్రభువైన యేసు ఆమె జీవించిన పాపపంకిలమైన ఆమె జీవితమంతటిని ఎరుగును. గనుక తన పాపస్థితిని తాను గ్రహించునట్లు నెమ్మది నెమ్మదిగా ఆమెను నడిపించ బోవుచున్నాడు. తాము నశించితిమని ఎందరు గ్రహించెదరో వారు మాత్రమే రక్షణ పొందగలరు. నిజముగా మానవులందరు నశించిరి. కాని దానిని ఒప్పుకొనుటకు
ఎవరూ ఇష్టపడరు.

క్రీస్తుకొరకు మనుష్యులను సంపాదించుటలో పాపమును గూర్చిన ప్రశ్న ఎంతమాత్రము విడిచిపెట్టకూడదు. తమ పాపములనుబట్టి, అపరాధములనుబట్టి మానవులు మరణించిరను సత్యమును వారు తప్పక ఎదుర్కొనవలెను. వారికి ఒక రక్షకుడు అవసరమైయుండెననియు వారు తమ్మును తాము రక్షించుకొనలేరనియు, తమ్మును రక్షించు రక్షకుడు క్రీస్తు ప్రభువనియు, ఆయనయందు విశ్వాసముంచి పశ్చాత్తాపముతో తమ పాపములను ఒప్పుకొనినయెడల ఆయన తప్పక రక్షించుననియు వారు ఎరుగవలెను.

4:17,18 మొట్టమొదట అబద్ధమాడకుండగనే సత్యమును మరుగుపరచుటకు ఆ స్త్రీ ప్రయత్నించినది. నాకు పెనిమిటిలేడు అని చెప్పినది. చట్టపరముగా ఆలోచిస్తే. ఆమె చెప్పినది వాస్తవమే. కాని భర్తకాని వ్యక్తితో పాపములో జీవించుచున్నదను వాస్తవమును మరుగుచేయుటకు ఆమె ప్రయత్నించుచున్నది. దేవునిగా, ప్రభువైన యేసు సమస్తమును ఎరిగినవాడు. అందువలననే ఆయన “నాకు పెనిమిటి లేడని నీవు చెప్పినమాట సరియే,” అని ఆమెకు బదులిచ్చెను.

ఆయన ఆమెను గూర్చి సమస్త మును ఎరుగును. ఒక వ్యక్తి జీవితమును అనవసరముగా బహిర్గతము చేయుటకుగాని లేక అవమాన పరచుటకుగాని ప్రభువు తన జ్ఞానమును ఎన్నడు ఉపయోగించలేదు. కాని యీ సమయములో ఒక వ్యక్తిని పాపపు కట్లనుండి విడిపించుటకు తన జ్ఞానమును ఇక్కడ ఉపయోగించెను. ప్రభువు ఆమె గత జీవితమును ఆమెకు తెలియజేసినప్పుడు ఆ స్త్రీ ఎంతగా ఆశ్చర్యపడెనో గదా! ఆమెకు ఐదుగురు భర్తలుండిరి. కాని ఇప్పుడున్న వాడు ఆమె భర్తకాదు.

ఈ వచనమునుగూర్చి బైబిలు విద్యార్థులలో కొన్ని భేదాభిప్రాయములు కలవు. ఆమె ఐదుగురు భర్తలు మరణించి ఉండవచ్చును లేక ఆమెను విడిచిపెట్టి యుండ వచ్చును. గనుక ఆమెకు వారితోగల సంబంధము పాపసంబంధమైనదికాదని కొందరి అభిప్రాయము. ఈ అభిప్రాయము నిజమో కాదో మనకు తెలియదుగాని, ఈ వచనము లోని రెండవ భాగము ఆమె ఒక వ్యభిచారిణియనే తెలియజేయుచున్నది. ఆ మాటను గమనించండి. “ఇప్పుడున్నవాడు నీ పెనిమిటికాడు.” ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము. ఆ స్త్రీ కేవలము పాపి. ఈ సత్యమును ఆమె గుర్తించు వరకు జీవజలములతో ప్రభువు ఆమెను ఆశీర్వదించలేడు.

4:19 తన జీవితమును తన యెదుట తెరచి చూపెట్టుచూ, తనతో మాటలాడిన వాడు సామాన్యమైన వ్యక్తికాడని ఆమె గ్రహించెను. అయినను ఆయన దేవుడని మాత్రము ఆమె గ్రహించలేదు. దేవుని పక్షమున మానవులతో మాటలాడు ఒక ప్రవక్తయని మాత్రమే ఆమె తలంచెను.

4:20 ఇప్పుడు ఆమె తన పాపముల విషయమై ఒప్పింపబడిన స్త్రీనిగా చూచు చున్నాము. గనుక సరియైన ఆరాధనా స్థలమును గూర్చి ప్రశ్నించుచు అంశమును మార్చుటకు ప్రయత్నించెను. “మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి” అని గెరిజీము పర్వతమును చూపించుచు చెప్పినది. మరియు యెరూషలేమే సరియైన ఆరాధన స్థలమని యూదులు చెప్పుచున్నారని ప్రభువుకు జ్ఞాపకము చేయుచున్నది.

4:21 అయితే ప్రభువు ఆమె మాటలను త్రోసివేయక మరొక ఆత్మీయ సత్యమును గ్రహింపజేయుటకు ఆమె మాటలనుపయోగించెను. అదేమనగా, ఒక కాలము వచ్చు చున్నది. ఆ కాలమందు గెరిజీముగాని, యెరూషలేముగాని ఆరాధన స్థలముగా ఉండదు.

పాత నిబంధనలో తన్ను ఆరాధించు స్థలముగా దేవుడు యెరూషలేమును నియమించెను. ఆ కాలములో యెరూషలేములోని మందిరము దేవుని నివాసస్థలమై యున్నది. గనుక భక్తిగల యూదులు తమ బలులను, అర్పణలను యెరూషలేమునకు తెచ్చెడివారు. అయితే యీ సువార్త యుగములో తన్ను ఆరాధించుటకు భూమిమీద ఒక ప్రత్యేకమైన స్థలమును దేవుడు ఎన్నుకొనలేడు. తరువాత వచనములలో ప్రభువు యీ సత్యమునుగూర్చి పూర్తిగా వివరించియున్నాడు.

4:22 “మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు” అని ప్రభువు చెప్పినప్పుడు ఆయన సమరయుల ఆరాధన విధానమును ఖండించుచున్నాడు. “అన్ని మతములు ఒక్కటే, అన్ని మతములు చివరికి మానవుని పరలోకమునకే చేర్చును” అని చెప్పెడి మత బోధకుల తప్పుడు బోధకు ఇది పూర్తిగా భిన్నమైనది సమరయుల ఆరాధన దేవునిచేతగాని, తనచేతగాని ఆమోదింపబడలేదని ప్రభువు ఆమెకు తెలియజేసెను.

అంతేగాక వారి ఆరాధన మానవ కల్పితమైనదేగాని, దైవ వాక్యధారమైనది కాదు. మరియు యూదుల ఆరాధన దీనివంటిది కాదు. యూదులు భూలోకములోని జనాంగ ములన్నింటినుండి దేవునిచేత ఎన్నుకొనబడిన జనాంగము. తన్ను ఆరాధించుటకు అవసరమైన నియమములను ఆయన వారికి అనుగ్రహించెను. “రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది” అని ప్రభువు చెప్పెను. వారిని తన దూతలనుగా నియమించి వారికి తన లేఖనములనను గ్రహించెను. అంతేగాక ఆ జాతిద్వారానే మెస్సీయకూడ అనుగ్రహించబడెను. ఆయన యూదురాలైన తల్లికి జన్మించెను.

4:23 తన రాకతో ఆరాధనకు దేవుడు భూమిమీద ఒక ప్రత్యేకమైన స్థలము కలిగియుండలేదని ప్రభువు ఆ స్త్రీకి తెలియజేసెను. అవును ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచువారు తండ్రియైన దేవుని ఏ సమయమందైనను, ఏ స్థలమందైనను ఆరాధించవచ్చును. నిజమైన ఆరాధనకు అర్థమేమనగా, ఆరాధికుడు ఎక్కుడ ఉన్నా డనునది ప్రశ్నకాదు. విశ్వాసి విశ్వాసముద్వారా దేవుని సన్నిధిచేరి ఆయనను స్తుతించి ఆరాధించగలడు.

తండ్రిని ఆరాధించువారు ఇప్పటినుండి ఆయనను ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెనని ప్రభువు చెప్పెను. ఇట్టి ఆరాధనను యూదులు మానవపద్ధతులుగా, ఆచారములుగా మార్చిరి. అందుచేత యూదుల ఆరాధన ఆత్మతో చేయు ఆరాధన కాదు. అది బాహ్యసంబంధమైన ఆరాధనయేగాని, అంతరంగమున జరుగునది కాదు. వారి దేహములు ఆయన సన్నిధిలో సాష్టాంగపడియున్నను, వారి హృదయములు దేవునియెదుట సరియైనవిగా లేవు. మరలా చెప్పునదేమనగా, యూదుల ఆరాధన బాహ్యసంబంధమైనదే గాని, అది ఆత్మీయమైనదికాదు. గనుక ఈ ఆరాధన సరికాదు.

మరొకవైపు సమరయుల ఆరాధన ఇంతకంటే అప్రమాణికమైనది. అది లేఖనాధారమైనది కాదు. అది సమరయులు తామే ప్రారంభించి తాము కనుగొనిన స్వంత పద్ధతులద్వారా కొనసాగించిన మతారాధనైయున్నది. అయితే ఆత్మతోను, సత్యముతోను ఆరాధించవలెనని ప్రభువు చెప్పుటలో, ఆయన యూదులను, సమర యులను ఖండించుచున్నాడు. కాని యిప్పుడు తాను పరలోకమునకు చేరిన పిదప తనద్వారా దేవునియొద్దకు వచ్చి యథార్థమైన ఆరాధన చేయుటకు మనుష్యులకు అవకాశము కలదనికూడ ప్రభువు చెప్పుచున్నాడు.

తన్ను ఆరాధించువారు “అట్టివారే కావలెనని” తండ్రి వెదుకుచున్నాడు. దీనిని లోతుగా ఆలోచించండి! తండ్రి తన్ను ఆరాధించు ఆరాధికుల కొరకై వెదుకుచున్నాడు. తన ప్రజలయొక్క ఆరాధనయందు దేవుడు ఆసక్తిగలవాడైయున్నాడు. ఇట్టి ఆరాధన ఆయన నీ నుండి స్వీకరించుచున్నాడా?

4:24. “దేవుడు ఆత్మయైయున్నాడు.” మానవాళికిగల సమస్త హద్దులకు, పొరబాటు లకు లోనగుటకు ఆయన కేవలము మానవమాత్రుడు కాడు. ఆయన ఒక స్థలమునకు పరిమితమైనవాడు కాడు ఆయన ఆదృశ్యుడు. గనుక ఏక సమయములో అన్ని స్థలములలో ఉండువాడు. అంతేకాదు, ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు; సర్వశక్తి మంతుడు. అంతేగాని ఆయన ఒక సమయమునకు ఒక స్థలమునకు మాత్రమే పరిమితమైన దేవుడు కాడు. ఆయన తన మార్గములన్నింటిలో పరిపూర్ణుడు. గనుక, ఆయనను ఆరాధించువారు తప్పక ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. ఆయనను ఆరాధించుటలో సిగ్గుగాని, వేషధారణగాని ఉండకూడదు. అంతమాత్రమే కాదు.

అంతరంగము చెడిపోయియుండగా, మత సంబంధమైన పైపై నటన తగదు. మతాచారముల రీతిగా ఆయనను ఆరాధించుటద్వారా దేవుడు సంతోషించునను ఆలోచనకు చోటివ్వకూడదు. ఒకవేళ దేవుడు తానే ఆ ఆచారములను నియమించి నప్పటికిని, మానవుడు విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధికి చేరవలెనని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. ఈ అధ్యాయములో తప్పక చేయవలసిన రెండు కార్యములు కలవు. మొదటిది – ఆత్మలను సంపాదించువాడు తప్పక చేయవలసిన కార్యము (4:4), రెండవది – ఆరాధికుడు తప్పక చేయవలసిన కార్యము (4:24).

4:25 ప్రభువు మాటలు ఆలకించుచున్న ఆ సమరయ స్త్రీ, రాబోవు మెస్సీయను గూర్చి ఆలోచించినది. మెస్సీయ ఈ లోకమునకు రావలెనను అపేక్షను దేవుని ఆత్మ ఆమెలో కలిగించెను. అంతేగాక, ఆయన వచ్చినప్పుడు సమస్తమును తెలియజేయునను నమ్మకమును ఆమె వ్యక్తపరచెను. క్రీస్తు రాకడ యొక్క గొప్ప ఉద్దేశ్యములలో ఒకదానిని ఆమె బహు స్పష్టముగా గ్రహించినట్లు తన మాటలద్వారా వ్యక్తమగుచున్నది.

Bible verse.guide - 2023-02-17T151448.467

 

4:26 ఆ స్త్రీకి ప్రభువిచ్చిన జవాబు ఏమనగా “నీతో మాటలాడుచున్న నేనే ఆయనను”. కాని K.J.V లోని (he) “ఆయనను” అను మాట మూల గ్రంథములో లేదు. అయితే యీ వచనము స్పష్టముగా అర్థమగుటకు “ఆయనను” అను పదము చేర్చబడినది. ప్రభువుయొక్క మాటలకు ఎంతో ప్రాధాన్యత కలదు. పాత నిబంధనలో దేవుడు తనకు అన్వయించుకొనిన కొన్ని పేర్లలో నొకదానిని ప్రభువు ఈ వచనములో ఉపయోగించెను.

నేను “అనువాడను” నీతో మాటలాడుచున్నాను” లేక మరియొక రీతిగా చూస్తే “నీతో మాటలాడుచున్నవాడు యెహోవాయైయున్నాడు” అని ఆయన చెప్పెను. ఆమె ఎవరికొరకు చూచుచున్నదో ఆమెతో ఎవరు మాటలాడుచున్నారో ఆయనే మెస్సీయా అను ఆశ్చర్యకరమైన సత్యమును ఆయన తెలియజేసెను. ఆయన తానే దేవుడైయున్నాడు. పాత నిబంధనలోని యెహోవాయే క్రొత్త నిబంధనలోని యేసు.

4:27 సుఖారు నుండి తిరిగివచ్చిన ప్రభువు శిష్యులు ఆయన ఆ స్త్రీతో మాటలాడుట చూచిరి. సమరయురాలైన ఆ స్త్రీతో ఆయన మాటలాడుట చూచి వారు ఆశ్చర్యపడిరి మరియు ఆమె పాపాత్మురాలనికూడ వారు తెలిసికొనియుండిరేమో, అయినను ఆమె నుండి ప్రభువుకు ఏమికావలెననిగాని లేక ఆమెతో ఎందుకు మాటలాడుచున్నావని
ఆ గాని ఆయనను ఎవరు అడుగలేదు.

4:28 ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టెను. ఆమె వేటిద్వారా తన వాంఛలను తీర్చుకొనుచున్నదో వాటికి ఈ కుండ సూచనయైయున్నది. కాని ఆమెకు తృప్తి నిచ్చుటలో అవన్నియు నిష్ప్రయోజనమైనవి. అయితే యిప్పుడు ఆ స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తును కనుగొన్నది. ఇంతకుముందు తన జీవితములో ప్రముఖ స్థానము నాక్రమించిన వాటియొక్క అవసరత ఇప్పుడు ఆమెకు లేదు.

ఆమె కుండను విడిచిపెట్టుట మాత్రమేగాక తన ఊరిలోనికి వెళ్ళెను. ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షింపబడెనో అప్పుడే జీవజలముల అక్కరలో ఎందరున్నారో వారిని గూర్చి వెంటనే ఆలోచించసాగెను. గొప్ప భక్తుడైన హడ్సన్ టేలర్ ఒకసారి ఈరీతిగా చెప్పెను. కొందరు అపొస్తలులకు వారసులగుటకు ఆశింతురు. నేనైతే సమరయ స్త్రీకి వారసునిగా ఉండనాశించుచున్నాను.

వారు ఆహారము కొరకు ఊరిలోనికి వెళ్ళిరి. కాని ఆమె ఆత్మల నిమిత్తము తన కుండను విడిచి ఊరిలోనికి వెళ్ళెను. 4:29, 30 ఆమె సాక్ష్యము చాలా సామాన్యమైనదేగాని, దాని ప్రభావము బహు గొప్పది. తాను చేసిన వాటన్నింటిని తనతో చెప్పిన మనుష్యుని చూడరమ్మని ఆ పట్టణస్థులను ఆహ్వానించినది. వారు క్రీస్తు ప్రభువును కనుగొను నిమిత్తము ‘ఈయన క్రీస్తుకాడా’ అని ఆమె చెప్పెను.

ఈయన క్రీస్తు కాడా, అని చెప్పుటలో ప్రభువు విషయములో ఆమె కెట్టి అనుమానము లేదు. ఎందుకనగా తాను క్రీస్తునని ప్రభువు ఆమెకు ముందే తెలియజేసెను. ఆ స్త్రీ ఆ పట్టణస్థులకు సుపరిచితురాలనుట నిస్సందేహము. కాని యిట్టి పాపాత్మురాలైన ఆమె ఒక బహిరంగ స్థలములో నిలిచి, ప్రభువైన యేసుక్రీస్తుకొరకు బహిరంగ సాక్ష్యమిచ్చుట చూడగా వారికి బహు ఆశ్చర్యము కలిగినది.

అందువలననే తమ హృదయములలోని అనుమానమును తీర్చుకొనుటకు వారు ప్రభువును చూడవచ్చిరి. ఆ స్త్రీయొక్క సాక్ష్యము సార్ధకమైనది. జనులు తమ గృహములను, పనులను విడిచిపెట్టి యేసును కనుగొనుటకు వెళ్ళసాగిరి.

దేవుని చిత్తము జరిగించుటలో క్రీస్తుయొక్క ఆనందము (4:31-38) :

4:31 ఇప్పుడు ప్రభువు శిష్యులు తిరిగి వచ్చిరి. వారు భోజనము చేయుమని ఆయనను ప్రేరేపించిరి. కాని మరికొద్ది నిమిషముల క్రిందట జరిగిన సంఘటనను గూర్చి వారికి ఏ మాత్రము తెలియదు. మహిమాస్వరూపియైన ప్రభువుకు సమరయ పట్టణము లేక ప్రజలు పరిచయమైన ఈ చారిత్రాత్మక ఘడియలలో శిష్యులు తమ శరీరమునుగూర్చి మాత్రమేగాని అంతకుమించి ఆలోచించలేకపోయిరి.

4:32 తండ్రిని ఆరాధించువారిని సంపాదించుటయే తనకు ఆహారముగా ప్రభువు ఎంచుకొనెను. ఈ ఆనందముతో పోల్చినప్పుడు, భౌతిక ఆహారము ఆయన దృష్టిలో బహు అప్రధానమైనది. శిష్యులు భోజనము విషయములో ఎంతో ఆసక్తి కనుపరచిరి. గనుకనే ఆహారము కొనుటకు పట్టణములోనికి వెళ్ళిరి. వారు ఆహారము తీసికొని దానితో తిరిగి వచ్చిరి. కాని ప్రభువు ఆత్మలయందు ఆసక్తి కలిగియుండెను. వారి పాపములనుండి స్త్రీ పురుషులను రక్షించి వారికి జీవజలము ననుగ్రహించుటలో ఆయన మరి ఎక్కువ ఆసక్తి కలిగియుండెను. అయితే మన ఆసక్తి దేనియందు ?

4:33 భూసంబంధమైన దృష్టి వారికుండుటను బట్టి, ప్రభువుయొక్క మాటలలోని భావమును గ్రహించుటలో వారు విఫలులైరి. అంతేగాక ఆత్మీయ విజయమునందున్న ఆనంద సంతోషములు శరీర అక్కరలకంటే ఉన్నతమైనవై యున్నవి. ఈ సత్యమును వారు గ్రహించలేకపోయిరి. గనుక ఆయన భుజించుటకు ఎవడైనను ఏమైనను తెచ్చియుండవచ్చునని వారు తలంచిరి. ఇప్పుడు మరియొకసారి వారి మనస్సులను భౌతిక విషయములనుండి ఆత్మీయ విషయములవైపు త్రిప్పుటకు ప్రభువు ప్రయత్నిం చెను.

దేవుని చిత్తము నెరవేర్చుటయు, చేయుటకు దేవుడు తనకిచ్చిన పని తుద ముట్టించుటయు తనకు ఆహారమై యున్నదని, ప్రభువు నుడివెను. ఇక్కడ ప్రభువు భోజనము చేయలేదని లేక చేయడని కాదు. కాని దేవుని చిత్తము జరిగించుట ఆయన జీవితముయొక్క ప్రధాన లక్ష్యమైయున్నది.

4.35″ నాలుగు నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు గదా” అని ప్రభువు చెప్పెను. బహుశా ఆ సమయములో రాబోవు కోతకాలమును గూర్చి శిష్యులు ముచ్చటించుచుండిరేమో ! లేక విత్తనము విత్తుటకును కోతకాలమునకు మధ్య నాలుగు నెలల సమయమున్నది అని యూదులలో ఉన్న ఒక సామ్యము కాబోలు.

ఏది ఏమైనను ఒక ఆత్మీయ సత్యమును బోధించుటకు ప్రభువు భౌతిక సత్యమైన కోతను ఉదహరించెను. కోత సమయము ఇంకను బహుదూరములో నున్నదని శిష్యులు తలంచకూడదు. ‘దేవుని కార్యము తదుపరి చేయవచ్చుననెడి తలంపుతో ఆహారమును వస్త్రమును వెదకుటలోనే తమ జీవితములను గడుపుటకు ప్రయత్నించ కూడదు. పొలము తెల్లబారి కోతకు సిద్ధముగా నున్నదని వారు తప్పక గ్రహించవలెను. ఇక్కడ చెప్పబడిన పొలము లోకమును సూచించుచున్నది.

చెడ్డ స్త్రీ - మంచి మనుష్యుడు – Bible Verses Chapter 4

అదే సమయములో, సమరయ పట్టణపు స్త్రీ పురుషుల ఆత్మలనే పంటతో నిండియున్న పొలము మధ్య ఉండి ప్రభువు ఈ మాటలు పలుకుచున్నాడని మనము గమనించవలెను. పంటను కోసి కూర్చవలసిన గొప్పకార్యము వారియెదుటనున్నదని ప్రభువు చెప్పెను గనుక ఆ కార్యముకొరకు బహు త్వరితముగాను, ఆసక్తితోను తమ్మునుతాము అప్పగించుకొన వలెను. కాబట్టి నేటి దినములలోకూడ ప్రభువు “మీ కన్నులెత్తి పొలమును చూడుడి” అని విశ్వాసులకు చెప్పుచున్నాడు.

ప్రపంచముయొక్క గొప్ప అక్కరను గూర్చి కొంత సమయము మనము యోచన చేయుచుండగా నశించుచున్న ఆత్మలను గూర్చిన భారమును దేవుడు మన హృదయమునందు ఉంచునని మనము గ్రహించగలము. అప్పుడు పండిన పంటయొక్క పనలను మోసికొని ఆయన కొరకు తెచ్చుటకు ముందుకు సాగుట మన బాధ్యతయై యున్నది.

4:36 ఈ వచనములో ప్రభువు – వారు ఏ పని నిమిత్తము పిలువబడిరో ఆ పనినిగూర్చి తన శిష్యులకు సూచనలిచ్చుచున్నాడు. కోతవారినిగా ప్రభువు వారిని ఎన్నుకొనెను. ఫలితముగా వారు ఈ లోకములో తగిన జీతము పుచ్చుకొనుటయే గాక, నిత్య జీవార్ధమైన ఫలమునుకూడ సమకూర్చుకొందురు. ప్రస్తుత కాలములో క్రీస్తుకొరకు మనముచేయు పరిచర్యవలన అనేక బహుమానములు కలవు. కాని రాబోవు కాలమందు కోతవారు నమ్మకముగా ప్రకటించిన సువార్త సందేశమువలన రక్షింపబడిన ఆత్మలను పరలోకమందు చూతురు.

అప్పుడీ లోకములో వారు పొందిన బహుమానములవలన వారికి కలిగిన సంతోషముకంటె అధికమైన సంతోషము పొందుదురు. అంతేగాక విత్తువారును, కోయువారును ఆ దినమున పరలోకములో కలసి సంతోషించెదరు. ఈ ప్రకృతి జీవితములో విత్తనముచేయుటకు ముందు భూమి సిద్ధపరచబడవలెను. ఆ తరువాత విత్తనము విత్తవలెను. ఆ పిదప దాని కాలములో పంటకోయబడును.

ఆత్మీయ జీవితములోకూడ యింతే. మొట్టమొదట సువర్త మానము ప్రకటింపబడవలెను. ఆ పిదప ప్రార్థనతో దానికి నీరు కట్టవలెను. కాని, కోతకాలము వచ్చినప్పుడు, ఆ పనిలో పాలుపొందిన వారందరు కలసి ఆనందింతురు.

దేవుని చిత్తము జరిగించుటలో క్రీస్తుయొక్క ఆనందము (4:31-38) :

 

4:37, 38 ఆ దినములో జనులు సామాన్యముగా చెప్పుకొనెడి “విత్తువాడొకడు, కోయువాడొకడు” అను సామెత ఈ సందర్భములో నెరవేరినట్లు ప్రభువు చూచెను. కొంతమంది విశ్వాసులు అనేక సంవత్సరములు సువార్త ప్రకటింతురు. కాని తమ శ్రమకు తగిన ఫలమును వారు వెంటనే చూడలేరు. కొన్ని సంవత్సరములు గతించిన తరువాత మరొకరు ఆ పరిచర్యలో ప్రవేశింతురు. వారి కాలములో అనేక ఆత్మలు ప్రభువుతట్టు తిరుగును.

ఇతరులచేత అంతకుముందే సిద్ధపరచబడిన ప్రాంతములకు ప్రభువు తన శిష్యుల నంపుచున్నాడు. పాత నిబంధన కాలమంతటిలో రాబోవు సువార్త యుగమునుగూర్చియు మెస్సీయ యుగమునుగూర్చియు ప్రవక్తలు ముందుగా ప్రకటించిరి. ఆ తరువాత బాప్తిస్మమిచ్చు యోహానుకూడ ప్రభువుకొరకు జనుల హృదయములను సిద్ధపరచుటకు ప్రభువుకంటె ముందుగా వచ్చెను. ప్రభువు తానే సమరయ పట్టణములో వాక్య విత్తనము విత్తి కోత వారికొరకు పంటను సిద్ధపరచెను.

ఇప్పుడు కోతకు సిద్ధముగానున్న ఆ పొలములోనికి శిష్యులు అడుగిడ బోవుచున్నారు. గనుక అనేకులు క్రీస్తుతట్టు మళ్ళుకొనుట చూచి సంతోషించునప్పుడు, మరొకరి శ్రమలో ప్రవేశించినట్లు వారు గ్రహించవలెనని ప్రభువు వారిని కోరుచున్నాడు. ఒక వ్యక్తియొక్క పరిచర్యద్వారా కేవలము బహుకొద్ది ఆత్మలు మాత్రమే రక్షింపబడును.

అనేకులు రక్షకుని అంగీకరించుటకుముందు అనేక మారులు సువార్త వినియుందురు. గనుక, ఒక వ్యక్తిని క్రీస్తునొద్దకు నడిపించిన వ్యక్తి, ఆశ్చర్యకరమైన ఈ కార్యములో దేవుడు వాడుకొనిన ఏకైక పాత్ర తానే అయియున్నట్లు తన్నుతాను ఏమాత్రము హెచ్చించుకొనకూడదు.

సమరయులలో అనేకులు యేసునందు విశ్వాసముంచిరి (4:39-42) :

4:39 సమరయ స్త్రీ ఇచ్చిన అతి సామాన్యమైన సాక్ష్యము ఫలితముగా ఆమె యొక్క జనులు అనేకులు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిరి. తన సాక్ష్యములో ఆమె చెప్పిన విషయము గమనించండి. “నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి.” ఇవి బహుకొద్ది మాటలైనను ఇతర వ్యక్తులను రక్షకుని చెంతకు తెచ్చుటకు అవి చాలు, క్రీస్తుకొరకు ధైర్యముగా, ప్రత్యక్షముగా సాక్ష్యమిచ్చుటలో ఇది మనలో ప్రతి ఒక్కరికి ప్రోత్సాహకరముగా ఉండును.

4:40 సమరయులు ప్రభువును చేర్చుకొనిన విధానము విశేషమైనది. వారు ప్రభువును ఆశ్చర్యకరుడుగా గుర్తించుటయేగాక, ఆయనను తమయొద్ద ఉండవలెనని ఆహ్వానిం చిరి. ఫలితముగా ప్రభువు వారితో రెండు దినములుండెను. సమరయుల గ్రామమైన ఆ సుఖారు ఎంత ధన్యకరమైనదో గదా. వారు మహిమా స్వరూపియు జీవాధిపతియు నైన ప్రభువును చేర్చుకొని ఆయనకు ఆతిథ్యమిచ్చుటద్వారా ఆయనను ఘనపరచిరి.

 

 

4:41 ఈ రెండు దినములలో ప్రభువు యొక్క మాటలు వినినవారిలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి. కొందరు ఆ స్త్రీ ఇచ్చిన సాక్ష్యమునుబట్టి విశ్వసించిరి. మరికొందరు ప్రభువు మాటలనుబట్టి విశ్వసించిరి. పాపియైన మానవుని తన చెంతకు తెచ్చుటలో దేవుడు వివిధములైన రీతులను ఉపయోగించును.

4:42 ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి “ఇక మీదట నీవు చెప్పిన మాటనుబట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నామనిరి.” రక్షకుని గూర్చి సమరయులు ఇట్టి స్పష్టమైన సాక్ష్యమిచ్చుట వినుటకు ఆశ్చర్యముగా ఉన్నది.

ఆయననుగూర్చి వారి మనస్సులలో ఎట్టి అనుమానములేదు. ఇప్పుడు ఆ స్త్రీ యొక్క మాటలనుబట్టిగాక, ప్రభువుయొక్క మాటలనుబట్టి తమ రక్షణ విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగియున్నారు. ప్రభువునుగూర్చి విని ఆయన మాటలయందు విశ్వాసముంచుటను బట్టి ఆయన నిజముగా లోకరక్షకుడైన క్రీస్తని సమరయులు తెలిసికొనిరి.

ఇట్టి జ్ఞానము వారికి పరిశుద్ధాత్మద్వారా మాత్రమే అనుగ్రహించబడెను. మెస్సీయా కేవలము తమకు మాత్రమేనని యూదులు తలంచిరి. కాని క్రీస్తుయొక్క పరిచర్య ఫలము సర్వలోకమునకు చెందినదని సమరయులు గ్రహించిరి.

రెండవ సూచక క్రియ – ప్రధాని కుమారుడు స్వస్థపరచబడుట (4:43-54) :

4:43 ప్రభువు సమరయుల మధ్య రెండు దినములు గడిపిన పిదప గలిలయలోని ఉత్తర భాగమునకు పయనమాయెను.

4:44 ఈ వచనము ఒక సమస్యను చూపించుచున్నది. మరియు ప్రభువు సమరయ నుండి గలిలయ ప్రాంతమునకు వెళ్ళుటకు గల కారణముకూడ తెలియజేయుచున్నది, అదేమనగా, ప్రవక్త స్వదేశములో ఘనత పొందడనునదే. గలిలయ ప్రాంతము తన స్వదేశము.

ప్రభువు నివాసమున్న నజరేతు ఆ గలిలయ ప్రాంతమునకు చెందినది. ఎట్టి పరిస్థితులలోను, ఒక వ్యక్తి తాను ఇతర స్థలములలో ఉన్నప్పటికంటే తన స్వంత గ్రామములో లేక దేశములో ఉన్నప్పుడు ఎక్కువ ఘనత ఏ మాత్రము పొందడనుట సత్యము. ఆ రీతిగను తాను పొందవలసిన ఘనత ప్రభువైన యేసుక్రీస్తు తన స్వజనులవలన ఏ మాత్రము పొందలేదనుట వాస్తవము.

4:45 యెరూషలేములో పండుగ సమయములో యేసుప్రభువు చేసిన కార్యము లన్నింటిని వారు చూచియున్నారు గనుక, ఆయన గలిలయకు వచ్చినప్పుడు ఆ ప్రజలు ప్రేమతో ఆయనను చేర్చుకొనిరి.

ఈ వచనములో గలిలయులు అని చెప్పబడినవారు యూదులేయనుట స్పష్టము. వారు ఆరాధించుటకు యెరూషలేమునకు వెళ్ళిరి. అక్కడ వారు ప్రభువును, ఆయన చేసిన గొప్ప కార్యములలో కొన్నింటిని చూచియుండిరి. గనుక ఇప్పుడు ఆ ప్రభువునే తమతో ఉంచుకొనుటకు ఇష్టపడుచున్నారు. ఎందుకనగా ఆయన దేవుని కుమారుడైయున్నాడని గాక, తాను వెళ్ళిన ప్రతి స్థలములో చర్చనీయాంశ ముగా ఉన్నాడు. గనుక వారు ఆయనను చేర్చుకొనిరి.

4:46 ప్రభువు మరొకసారి కానా అను గ్రామమునకు వచ్చుటవలన దానికి ఘనత కలిగినది. ప్రభువు మొదటిసారి ఆ గ్రామమును దర్శించినప్పుడు ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చుటను కొందరు చూచిరి. ఇప్పుడు ఆయన చేయనైయున్న మరొక గొప్ప సూచకక్రియను వారు చూడనైయున్నారు. దాని ప్రభావము కపెర హూము వరకు విస్తరించనైయున్నది.

4:47 పెర్నహూములో ఒక ప్రధానియొక్క కుమారుడు రోగియైయుండెను. నిస్సందేహముగా ఈ ప్రధాని రాజైన హేరోదు చేత నియమింపబడిన యూదుడై యుండెను. ప్రభువు యూదయనుండి గలిలయకు వచ్చుచున్నాడని అతడు వినెను. ఈ సమయములో తన కుమారుని స్వస్థపరచుటకు ప్రభువు సమర్ధుడని అతడు విశ్వసించెను. ఏలయనగా, అతడు ప్రభువు దగ్గరకు వచ్చి చావనైయున్న తన కుమారుని బ్రతికించుమని ఆయనను బ్రతిమాలెను. తన దేశస్థులలో అనేకులకంటే ఇతడు ప్రభువునందు గొప్ప విశ్వాసముంచినట్లు కనిపించుచున్నాడు.

4:48 ఇక్కడ ప్రధానితోనేగాక యూదా ప్రజలను దృష్టిలో ఉంచుకొని ప్రభువు మాటలాడుచున్నాడు. అదే సమయములో వారు నమ్మకముందు మహత్కార్యములను చూడనాశింతురని చెప్పుచు ఆ జాతియొక్క ప్రధాన లక్షణమును ప్రభువు వారికి జ్ఞాపకము చేయుచున్నాడు. అయితే సహజముగా ఆయన బోధ వినుటద్వారా వారిలో కలుగు విశ్వాసమునుబట్టి ఆయన సంతోషించువాడేగాని మహత్కార్యము చూచుట ద్వారా కలుగు విశ్వాసమునందు ప్రభువు సంతోషించడు. లేక అద్భుతములు చూచి నమ్ముటకంటె ఆయన మాట విని నమ్ముట ఆయనకు ఘనతయైయున్నది.

విశ్వసించక మునుపు అద్భుతములను చూడవలెనని ఆశించుట మానవ లక్షణమై యున్నది. కాని మొదట మనము విశ్వసించవలెను ఆ పిమ్మట అద్భుతములు చూచెదమని ప్రభువు మనకు బోధించుచున్నాడు. ఈ వచనములో చెప్పబడిన సూచకక్రియలు, అద్భుతములు ఈ రెండు పదములు ఆశ్చర్యకార్యములనే సూచించుచున్నవి. సూచకక్రియలు అనగా లోతైన భావము కలిగియున్న మహత్కార్యములే. అద్భుతకార్యములనగా, మానవులను ఆశ్చర్యపరచునట్టి పరలోకపు లక్షణములు కలిగియున్న మహత్కార్యములు.

4:49 ఆ ప్రధాని స్థిర విశ్వాసముతో యేసుప్రభువు తన కుమారుని బాగుచేయునని నమ్మి, ఆయన తన కుమారుని దర్శించవలెనని ఎంతగానో బ్రతిమాలెను. ఒక విధముగా చూచినచో, అతని విశ్వాసము లోపభూయిష్టమైయున్నది. ఎట్లనగా ప్రభువు తన కుమారుని స్వస్థపరచకమునుపు ఆయన ఆ బాలుని మంచము ప్రక్కనే ఉండ వలెనని తలంచెను. అయినను ఇందుకు ప్రభువు అతనిని ఎంతమాత్రము గద్దించలేదు గాని, అతడు కనుపరచిన విశ్వాస పరిమాణమునుబట్టి అతనికి బహుమానమును అనుగ్రహించెను.

రెండవ సూచక క్రియ - ప్రధాని కుమారుడు స్వస్థపరచబడుట (4:43-54) :

4:50 ఈ వచనములో అంతకంతకు వృద్ధియగుచున్న ఆ ప్రధానియొక్క విశ్వాస మును మనము చూచుచున్నాము. అతడు తనకున్న అల్ప విశ్వాసమును సాధకము చేయగా, ప్రభువు అతని విశ్వాసమును వృద్ధిచేసెను. ఆ పిదప “నీ కుమారుడు బ్రతికియున్నాడు” అను వాగ్దానమనుగ్రహించి అతనిని యింటికి పంపించెను. ఆ వాగ్దాన ప్రకారము తన కుమారుడు స్వస్థచిత్తుడాయెను. ఎట్టి మహత్కార్యమును ప్రత్యక్షముగా చూడకుండగనే ఆ ప్రధాని కేవలము ప్రభువైన యేసుయొక్క మాటల యందు నమ్మికయుంచి తన యింటికి బయలుదేరెను.

4:51 క్రియారూపకమైన విశ్వాసమంటే ఇదే! ప్రధాని తన యింటికి సమీపించు చుండగా తన కుమారుడు బాగుపడెనను సంతోషకరమైన వర్తమానముతో అతని సేవకులు ఎదురు వెళ్ళిరి. ఆ వర్తమానము వినిన ప్రధాని ఏ మాత్రము విస్మయము చెందలేదు. ఏలయనగా అతడు ప్రభువుయొక్క వాగ్దానమును నమ్మెను. ఆ నమ్మిక గలవాడై ఆ వాగ్దానముయొక్క నెరవేర్పును ప్రత్యక్షముగా ఇప్పుడు చూచుచున్నాడు

. 4:52,53 యేసుక్రీస్తుయొక్క వాగ్దానమును అతడు నమ్మెనుగాని వెంటనే స్వస్థత కలుగునని అతడు నమ్మలేదు. తన కుమారుడు స్వస్థత పొందిన సమయమును అతడు తన సేవకుల నడిగి తెలిసికొనెను. స్వస్థత నెమ్మది నెమ్మదిగా కాక, వెంటనే కలిగెనని వారి జవాబు తెలియజేయుచున్నది. అద్భుతమైన సూచిక క్రియను గూర్చి లేశమంత అనుమానముకూడ లేదు. గత దినము ఒంటిగంటకు కానాలో ప్రభువు నీ కుమారుడు బ్రతికియున్నాడని ప్రధానితో చెప్పెను.

ఆ సమయములో కపెర హూములో అతని కుమారుడు స్వస్థపడెను. మరియు జ్వరము అతనిని విడిచిపోయెను. ఒక అద్భుత కార్యము జరిగించుటకు లేక ప్రార్థనకు జవాబిచ్చుటకు ప్రభువైన యేసు శరీరరీతిగా ఆ స్థలములో ఉండవలసిన అవసరత లేదని దీనిద్వారా ఆ ప్రధాని నేర్చుకొనెను.

ప్రతి విశ్వాసి యొక్క ప్రార్థన జీవితములో ఈ సత్యము ప్రోత్సాహకరముగా ఉండవలెను. మన విన్నపములను ఆలకించు బలమైన దేవుడు మనకున్నాడు. మరియు ఆయన తన సంకల్పములను ప్రపంచములో ఏ స్థలమందైనను, ఏ సమయమందైనను నెరవేర్చ శక్తిగల దేవుడు. తన కుటుంబములో ప్రభువుచేసిన మేలునుబట్టి ఆ ప్రధానియు అతని యింటి వారందరును ప్రభువునందు విశ్వాసముంచిరి.

క్రొత్త నిబంధనలో ఇటువంటి వచనములద్వారా మనకు ఒక సత్యము తేటపరచబడుచున్నది. అదేమనగా, వ్యక్తిగా మాత్రమేగాక ఇల్లంతయు అనగా ఇంటిలోనివారందరు క్రీస్తునందు ఐక్యపరచ బడుట దేవుని అభీష్టమైయున్నది.

4:54 ప్రధానియొక్క కుమారుని స్వస్థపరచుటయనునది అప్పటివరకు ప్రభువు యొక్క పరిచర్యయంతటిలో రెండవ సూచక క్రియకాదు. ప్రభువు యూదయనుండి వచ్చిన తరువాత గలిలయలో ఆయన చేసిన సూచక క్రియలలో ఇది రెండవది.

కొత్త జన్మ – Bible Verses Chapter 3 in Telugu

మూడవ అధ్యాయము

కొత్త జన్మ

నూతన జన్మను గూర్చి యేసు నీకొదేముకు బోధించుట (3:1-21) :

3:1 ఇప్పటి వరకు మనము ముచ్చటించిన సంగతులకంటే నీకొదేము వృత్తాంతము వేరైనది. యూదులలో అనేకులు ఆయనను విశ్వసించినట్లు చెప్పినను, వారి విశ్వాసము నిజమైనది కాదని ఆయన ఎరుగును. కాని నీకొదేము ఇందుకు భిన్నమైనవాడు. సత్యమును తెలిసికొనవలెననెడి ఆకాంక్ష అతనిలో ఉన్నదని ప్రభువు గ్రహించెను. మొదటి వచనము “కాని” యను మాటతో ప్రారంభించబడవలెను. “యూదుల అధికారి యైన నీకొదేమను పరిసయ్యుడొకడుండెను.

” అతడు తన ప్రజలమధ్య బోధకుడుగా గుర్తింపు పొందెను. బహుశ అతడు ప్రభువు నొద్దకు ఉపదేశము పొందుటకు వచ్చెను. ఆ ఉపదేశమును తన బోధతో కలిపి యూదులకు చెప్పవలెనను ఉద్దేశముతో అతడు వచ్చియుండవచ్చును.

3:2 నీకొదేము రాత్రి సమయములో ప్రభువు దగ్గరకు ఎందుకు వచ్చెనో బైబిలు మనకు చెప్పుటలేదు. కాని దీనికి సరియైన వివరణ ఏమనగా, యూదులలో అనేకులు ప్రభువును అంగీకరించక పోవుటనుబట్టి, ప్రభువునొద్దకు వెళ్ళుట ఇతరులు చూచుట ద్వారా ఇబ్బందులు కలుగునని అతడు తలంచెను. కాని మెట్టుకు … అతడు ప్రభువు నొద్దకు వచ్చెను. ప్రభువు చేసినట్టి అద్భుతములు దేవుని సహాయము లేనిదే ఏ వ్యక్తి చేయలేడని గ్రహించినప్పుడే ఆయన దేవునియొద్దనుండి పంపబడిన బోధకుడని నీకొదేము గ్రహించెను.

Read and Learn More Telugu Bible Verses

అతడు లేఖనములను బాగుగా ఎరిగినప్పటికిని సశరీరుడుగా ప్రత్యక్షమైన దేవుడని అతడు గుర్తించలేదు. నేడు యేసు ఒక గొప్ప వ్యక్తి, అద్భుతమైన బోధకుడు, గొప్ప మాదిరిగల వ్యక్తియని చెప్పెడి అనేకులవలె నీకొదేము ఉన్నాడు. ఇట్టి వ్యాఖ్యానములన్నియు సత్యదూరములే. యేసు వర్తమాన భూత భవిష్యత్కాలము లలో ఉన్న దేవుడు.

3:3 నీకొదేము చెప్పినదానికి, ప్రభువు ఇచ్చిన ప్రత్యుత్తరమునకు ఎటువంటి సంబంధమున్నట్లు మొదట మనకు కనిపించదు. కాని నిదానించి గమనించిన యెడల, “నీకొదేమూ, బోధకొరకు నీవు నాదగ్గరకు వచ్చితివి; నీకు నిజముగా అవసరమైనది ‘క్రొత్తజన్మ,’ నీ ప్రారంభము అక్కడనుండియే. నీవు పైనుండి జన్మించవలెను. లేనియెడల నీవు దేవుని రాజ్యమును చూడలేవు” అని ప్రభువు చెప్పినట్లు గ్రహించగలము.

ఒక యూదునిగా నీకొదేముకూడ మెస్సీయ రాకకొరకు ఎదురుచూచుచుండెను. అంతేకాదు ఆయనవచ్చి రోమీయుల చెఱనుండి ఇశ్రాయేలీయులను విడిపించునని ఆశించుచుండెను. మెస్సీయ వచ్చి శత్రువులను సంహరించి, ఈ భూమిమీద తన రాజ్యమును స్థాపించి, జనములన్నింటిలో ఇశ్రాయేలు జనాంగము ప్రధానమైనదిగా చేయబడు ఆ సమయముకొరకు నీకొదేము ఎంత ఆశతో ఎదురు చూచుచుండెను.

అయితే ఈ రాజ్యములో ప్రవేశించుటకు ఒకడు క్రొత్తగా జన్మించవలెనని ప్రభువు చెప్పెను. ఈ భౌతిక జీవమునకు మొదటి జన్మ ఎంత అవసరమో, ఆ విధముగనే, దైవికమైన జీవమునకు రెండవ జన్మ అంత అవసరమైయున్నది. (ఇక్కడ “క్రొత్త జన్మ” అనుదానికి “పైనుండి కలుగు జన్మ” అను అర్థముకూడ కలదు). దీనిని మరొకరీతిగా చెప్పవచ్చును: ఎవరి జీవితములు పూర్తిగా మార్పు చెందినవో వారు మాత్రమే క్రీస్తురాజ్యములో ప్రవేశించగలరు.

ఆయన రాజ్యము నీతి రాజ్యము. ఆయన పరిపాలన నీతి పరిపాలన గనుక పాలితులుకూడ నీతిమంతులై యుండవలెను. అంతేగాని తమ పాపములోనే జీవించువారిని ఆయన పాలించువాడుకాడు.

3:4ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు అర్థము చేసికొనుట మనుష్యులకు ఎంత కష్టమో మరొకసారి ఈ వచనములో చూడగలము. నీకొదేము ప్రతి విషయము అక్షరార్ధముగానే గైకొనుచుండెను. ముసలివాడైన ఒక వ్యక్తి ఎట్లు క్రొత్త జన్మ పొంద గలడో నీకొదేముకు అర్థము కాలేదు. ఒక వ్యక్తి తిరిగి జన్మించు నిమిత్తము తల్లి గర్భములో ప్రవేశించుటలో గల అసాధ్యమును గూర్చి బహులోతుగా ఆలోచించెను (1 కొరింథీ 2:14).

3:5 ఒకడు నీటిద్వారాను, ఆత్మద్వారాను జన్మించవలెననియు, లేనియెడల అతడు దేవుని రాజ్యములో ప్రవేశింప లేడనియు ప్రభువు నీకొదేముతో మరికొంత వివరముగా చెప్పెను.
ఆ విధముగా చెప్పుటలో ప్రభువుయొక్క భావమేమి? రక్షణ పొందుటకు బాప్తిస్మము అవసరమని ప్రభువు చెప్పినట్లు నేడు అనేకులు తలంచుచున్నారు. కాని అటువంటి బోధ బైబిలంతటికి విరుద్ధమైనది. అయితే ఒకడు ప్రభువైన యేసు క్రీస్తునందలి విశ్వాసముద్వారా మాత్రమే రక్షణ పొందగలడని దేవుని వాక్యములో మనము చదువుచున్నాము. బాప్తిస్మము ఒక వ్యక్తి రక్షణ పొందుటకు సాధనము కాదుగాని, రక్షింపబడిన వారికి మాత్రమే అది నియమింపబడినది.

ఈ వచనములో చెప్పబడిన నీరు దేవుని వాక్యమును సూచించుచున్నదని కొందరు చెప్పుచున్నారు. ఎఫెసీ 5:25, 26 లో చెప్పబడిన నీరు దేవుని వాక్యముతో సన్నిహిత సంబంధము కలిగియున్నది. మరియు 1 పేతురు 1:23 లో కూడ నూతనజన్మ దేవుని వాక్యముద్వారా కలుగునని వ్రాయబడినది. గనుక ఈ వచనములో చెప్పబడిన నీరు దేవుని వాక్యమైన బైబిలును సూచించుచున్నది. అనగా, లేఖనములకు వేరుగా రక్షణ లేనేలేదు. గనుక ఒక పాపి దేవుని వాక్యములో పొందుపరచియున్న వర్త మానమును క్రొత్తజన్మ పొందుటకు ముందు అంగీకరించవలెను.

కొత్త జన్మ నూతన జన్మను గూర్చి యేసు నీకొదేముకు బోధించుట (3:1-21) :

కాని నీరు పరిశుద్ధాత్మనుకూడ సూచించుచున్నది. యోహాను సువార్త 7:38,39లో యేసుక్రీస్తు జీవజల నదులనుగూర్చి మాటలాడెను. మరియు ప్రభువైన యేసుక్రీస్తు “నీరు” అని తన బోధలో ఎక్కడ ఉపయోగించినను అది పరిశుద్ధాత్మనే సూచించుచు చెప్పెను. ఏడవ అధ్యాయములో “నీరు” పరిశుద్ధాత్మయైనయెడల, మూడవ అధ్యాయ ములో ఆ అర్ధమే ఎందుకుండదు? ఈ వచనములో “నీళ్ళను” ఆత్మ యను భావముతో రెండు పర్యాయములు చెప్పబడినట్లు కనిపించుచున్నది.

కాని శారీరక జన్మ కలిగి యుండుట చాలదు. ఒక వ్యక్తి దేవుని రాజ్యములో ప్రవేశించవలెనంటే ఆత్మీయ జన్మకూడ కావలెను. ఒకడు యేసుక్రీస్తునందు విశ్వాసముంచినప్పుడు, దేవుని ఆత్మ కార్యముద్వారా ఈ ఆత్మీయ జన్మ కలుగుచున్నది. “ఆత్మ మూలముగా జన్మించవలెను” అనుమాట 6, 8 వచనములలో రెండు పర్యాయములు మనకు కనిపించుచున్నది. గనుక ఈ వ్యాఖ్యానము సరియైనదిగా మనము గమనించగలము.

3:6 అదే రీతిగా, నీకొదేము రెండవసారి తల్లి గర్భములో ప్రవేశించి, మరల జన్మించినను అతనియందున్న పాపస్వభావము సరిచేయబడనేరదు “శరీరమూలముగా పుట్టినది శరీరమును” అని ఈ వచనములో చెప్పబడిన మాటలు – “మానవ మాత్రులకు పుట్టిన బిడ్డలు పాపములో పుట్టినవారై నిరీక్షణాధార రహితులును, నిస్సహాయులునై తమ్మును తాము రక్షించుకొనలేని స్థితిలో ఉన్నారు” అను భావమును తెలియజేయు చున్నవి. ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మరుక్షణమే ఆత్మజన్మ కలుగుచున్నది. ఒక వ్యక్తి ఆత్మద్వారా తిరిగి జన్మించినప్పుడు అతడు నూతన స్వభావ మునుపొంది, దేవుని రాజ్యమునకు అర్హునిగా చేయబడుచున్నాడు.

3:7 ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బోధకు నీకొదేము ఆశ్చర్యపడనవసరము లేదు. కాని ఒక వ్యక్తి తప్పక తిరిగి జన్మించవలెనని అతడు గ్రహించవలెను. అంతేగాక పతనమైన స్థితిలోనున్న మానవ స్వభావమును సరిచేసికొనుటలో మానవుడు కేవలము బలహీనుడని అతడు గ్రహించవలెను. మరి ముఖ్యముగా, ఒక వ్యక్తి దేవుని రాజ్య నివాసిగా యుండుటకు, అతడు తప్పక పరిశుద్ధుడును, పవిత్రుడును మరియు ఆత్మాను సారియై యుండవలెనని నీకొదేము తప్పక గ్రహించవలెను.

3:8 ఆత్మీయ సంగతులను వివరించుటకు ప్రభువైన యేసు అనేక సందర్భములలో ప్రకృతినే ఉపయోగించెను. గాలి తనకిష్టమైన తావులకు వీచుననియు, మనిషి దాని శబ్దమును మాత్రము వినునుగాని, అది ఎక్కడనుండి వచ్చెనో, ఎక్కడకి వెళ్ళుచున్నదో అతడు గ్రహించలేడని ప్రభువు నీకొదేముకు జ్ఞాపకము చేసెను. అదే రీతిగా క్రొత్తజన్మ గాలిని పోలియున్నది. క్రొత్తజన్మ దేవుని చిత్తప్రకారము కలుగదు. అంతేగాక అది మానవుని స్వాధీనములో లేదు.

మరియు క్రొత్తజన్మ అదృశ్యమైనది (Invisible) అనగా దీనిని బాహ్యనేత్రములతో చూడలేముగాని, దాని ఫలితములను చూడగలము. కనుక ఒక వ్యక్తి రక్షింపబడినప్పుడు అతనిలో ఒక మార్పు కలుగును. ఇంతకుముందు తాను ప్రేమించిన చెడ్డ సంగతులన్నింటిని ఇప్పుడు అతడు ద్వేషించును. అంతేగాక ఇంతకుముందు తాను తృణీకరించిన దేవుని సంగతులన్నియు ఇప్పుడు తనకు ప్రియ మైనవిగా మారిపోవును. మరియు ఒకడు గాలినిగూర్చి ఏవిధముగా పూర్తిగా గ్రహించ లేడో, ఆ విధముగానే దేవుని ఆత్మయొక్క అద్భుత కార్యమైన క్రొత్తజన్మను గూర్చికూడ పూర్తిగా గ్రహించలేడు. అంతేగాక గాలినివలె క్రొత్తజన్మ ముందుగా ప్రకటింప వీలుకానిది. అది ఎప్పుడు ఎక్కడ సంభవించునో తెలుపుట కూడ అసాధ్యము.

3:9 దైవిక విషయములతో సంబంధము కలిగియుండుటలో ప్రకృతి సిద్ధమైన మనస్సుకుగల అసమర్ధతను గూర్చి నీకొదేము మరలా ఈ వచనములో వివరించు చున్నాడు. క్రొత్త జన్మ ఆత్మ సంబంధమైనది కాక, కేవలము ప్రకృతి సంబంధమైన సంభవమనియు లేక భౌతిక సంబంధమైనదనియు నీకొదేము ఇంకను తలంచుచున్నా డని చెప్పుటలో ఎట్టి అనుమానము లేదు. అందుకే అతడు “ఈ సంగతులు ఏలాగు సాధ్యము” అని ప్రభువును ప్రశ్నించుచున్నాడు.

3:10,11 అందుకు ప్రభువు ఇశ్రాయేలీయులకు బోధకుడైన నీకొదేము ఈ సంగతులను తప్పక తెలిసికొనవలెనని తెలియజేయుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు తన రాజ్యస్థాపనకు తిరిగి ఈ భూమి మీదకి వచ్చునప్పుడు ఆయన మొదట తన శత్రువులకు తీర్పు తీర్చి, ఆ పిదప తనకు విరోధమైన ప్రతిదానిని ఆయన నాశనము చేయునని పాత నిబంధన లేఖనములు స్పష్టముగా మనకు బోధించుచున్నవి. అయితే ఎవరు తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుదురో వారు మాత్రమే ఆ రాజ్యములో ప్రవేశించుదురు. పదకొండవ వచనములో ప్రభువు తన బోధయొక్క నిశ్చయతను గూర్చియు, ఆ బోధపట్ల మానవునికిగల విశ్వాసమును గూర్చియు నొక్కి చెప్పుచున్నాడు.

ఈ సత్యమును ఆయన నిత్యత్వములోనే ఎరిగి యుండెను గనుక, తాను వినినట్టియు, చూచినట్టియునైన సంగతులనే బోధించెను. కాని నీకొదేము, ఆయన కాలములో నున్న యూదులలోని అనేకులు ఆయన సాక్ష్యమును విశ్వసించుటకు తిరస్కరించిరి. 3:12 ఈ వచనములో ప్రభువు చెప్పిన భూ సంబంధమైన విషయములేవి? అవేవనగా, ఆయనయొక్క భూలోక రాజ్యమును గూర్చిన విషయములే.

పాత నిబంధన లేఖనముల విద్యార్థిగా – ఒకానొక దినము మెస్సీయ ఈ లోకమునకు వచ్చి యెరూషలేము ముఖ్యపట్టణముగా ఈ లోకములో తన రాజ్యమును స్థాపించునని ఎరుగును. కాని ఈ రాజ్యములో ప్రవేశించుటకు క్రొత్తజన్మ అవసరమను సత్యమును అతడు గ్రహించలేకపోయెను. అట్లయితే ప్రభువు చెప్పిన పరసంబంధమైన విషయములేవి? ఒక వ్యక్తి ఈ బోధించెను. క్రొత్తజన్మను ఏ విధముగా పొందగలడో ఆ సత్యములను గూర్చి క్రింది వచనములలో

3:13 పరలోక విషయములను గూర్చి మాటలాడుటకు ఒకే వ్యక్తి సరిపోయినవాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దేవుని యొద్దనుండి పంపబడిన మానవమాత్రు డైన బోధకుడే కాదుకాని, నిత్యత్వమంతటిలో తండ్రియొద్ద నున్నవాడు ఆయనే ఈ లోకమునకు దిగివచ్చెను. “పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు” అని ప్రభువు చెప్పినప్పుడు – పాత నిబంధన భక్తులైన హనోకు, ఏలీయాలు పరలోకమునకు ఎక్కిపోలేదని కాదుగాని, తనవలె ఏ మానవునికి దేవుని సన్నిధిలో ప్రవేశము లేదని ఆయన భావము.

ఆయన పరలోకమునుండి భువికి దిగివచ్చినవాడు గనుక దేవుని నివాసస్థలమైన ఆ పరలోకమునకు విశేషమైన రీతిగా ఆయన మాత్రమే ఎక్కి వెళ్ళ గలడు. ఆయన ఈ లోకములో ఉండి నీకొదేముతో మాటలాడుచున్నప్పుడు సహితము తాను పరలోకములో నున్నట్లు చెప్పెను. అదెట్లు? ఎట్లనగా, దేవునిగా ప్రభువు ఒకే సమయములో అన్ని స్థలములలో ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి (He is Omni-Present).

యూదయ ప్రాంతములో బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య (3:22-36):

3:14 ప్రభువైన యేసుక్రీస్తు క్రొత్తజన్మ అవసరమని నీకొదేముకు ఇంతకు ముందే నొక్కి చెప్పెను. అయితే క్రొత్తజన్మ ఎట్లు కలుగును? పాపపు శిక్షను ప్రతి మానవుడు తప్పక పొందవలెను. పాపియైన మానవుడెవడును పరలోకమునకు వెళ్ళలేడు. అరణ్యములో ఇశ్రాయేలీయులు పాముకాటు తినినప్పుడు మోషే ఆ అరణ్యములో ఒక యిత్తడి సర్పమును ఒక స్థంభముపై ఏలాగు ఎత్తైనో, ఆ విధముగనే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను (సంఖ్యా. 21:4-9 చదవండి).

మోషే కాలములో చేసిన అనేకమంది ఇశ్రాయేలీయులు సర్పపుకాటు తిని మరణించిరి. అయితే ఆ బాధననుభవించినవారు పశ్చాత్తాపపడి ప్రభువుకు మొఱ్ఱపెట్టినప్పుడు ఒక యిత్తడి సర్పమును రూపించి, ఒక స్థంభముపై ఎత్తిపెట్టవలెనని ఆయన మోషేకు ఆజ్ఞాపించెను సర్పముకాటు తినిన ప్రతివాడు దానిని నిదానించి చూచి ఆశ్చర్యకరమైన స్వస్థత పొందెను. క్రొత్తజన్మ ఎట్లు కలుగునో వివరించుటకు ప్రభువు ఈ సాదృశ్యమును గుర్తుచేయుచున్నాడు.

స్త్రీ పురుషులందరు పాపమనే సర్పపుకాటుతిని నిత్యమరణమను శిక్షక్రిందనున్నారు. ఇత్తడి సర్పము ప్రభువైన యేసుక్రీస్తుకు పటముగానున్నది. బైబిలు గ్రంథములో ఇత్తడి తీర్పును సూచించుచున్నది. ప్రభువైన యేసు పాపరహితుడు గనుక ఎంతమాత్రము శిక్షకు పాత్రుడు కాడు. కాని ఆయన మన స్థానము వహించి, మనము పొందవలసిన శిక్షను తాను భరించెను. సర్పము ఎత్తబడిన స్థంభము మన ప్రభువు వ్రేలాడిన కలువరి సిలువను సూచించుచున్నది. గనుక విశ్వాసముతో ఆయన తట్టు చూచుట ద్వారా మనము రక్షింపబడియున్నాము.

3:15 మనము ఆయనయందు దేవుని నీతియగునట్లు పాపమెరుగని ప్రభువైన యేసు మన నిమిత్తము పాపముగా చేయబడెను. గనుక ప్రభువైన యేసునందు ఎందరు విశ్వాసముంచుదురో వారు నిత్యజీవమను వరమును ఉచితముగా పొందెదరు.

3:16 బైబిలంతటిలో బాగుగా పరిచయమున్న వచనములలో ఈ వచనము మొదటిది. ఎందుకనగా, ఈ వచనములో సువార్త బహు స్పష్టముగాను, బహు సూక్ష్మముగాను చెప్పబడెను. క్రొత్త జన్మను పొందు విధమును గూర్చి ప్రభువు నీకొదేముతో చెప్పిన విషయము సంగ్రహపరచబడియున్నది. ఈ వచనములో “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను” అని చదువుచున్నాము. ఇక్కడ “లోకము” అనగా సమస్త మానవకోటియని అర్థము.

దేవుడు మానవుని పాపములను గాని, లేక లోకములోనున్న దుష్టవిధానమునుగాని ప్రేమించుటలేదు. కాని ఆయన మానవులను ప్రేమించి, ఎవ్వరు నశించగూడదని ఆయన ఇచ్ఛయించుచున్నాడు. ఆయన తన అద్వితీయ కుమారుని మనకొరకు అనుగ్రహించుటద్వారా మనపట్ల ఆయనకుగల అపారమైన ప్రేమను వెల్లడిచేసియున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వంటి కుమారుడు ఆయనకెవరును లేరు.

తిరుగుబాటు స్వభావముగల మానవజాతి కొరకు తన అద్వితీయ కుమారుని అనుగ్ర హించుటలో ఆయనయొక్క అనంతమైన ప్రేమ ఈ వచనములో వివరింపబడినది. అంటే ప్రతి ఒక్కరు రక్షింపబడిరని భావము కాదు. కాని, ఒక వ్యక్తి క్రీస్తు తనకొరకు జరిగించిన కార్యమునందు విశ్వాసముంచవలెను. అప్పుడు దేవుడు అతనికి నిత్యజీవ మిచ్చును. గనుకనే ఈ వచనములో ఆయనయందు విశ్వాసముంచువారు నశింపరను మాటలు చేర్చబడినవి. అవును, ఎవ్వరును నశించిపోనవసరములేదు. అందరు రక్షణ పొందునట్లు ఒక మార్గము ఏర్పాటుచేయబడినది. గనుక వారు చేయవలసిన కార్య మేమనగా ప్రభువైన యేసుక్రీస్తును తమ ప్రభువుగాను, రక్షకునిగాను అంగీకరించ వలెను. అట్లుచేసిన ప్రతి వాడు నిత్యజీవమును వరముగా కలిగియున్నాడు.

3:17 దేవుడు కఠినుడును నిర్దయుడును కాదు. మానవాళిపై తన ఉగ్రతను కురిపించుటకు త్వరపడువాడు కాదు. కాని వారిపట్ల ఆయన దయార్దహృదయము కలిగియున్నాడు. గనుక మానవులను రక్షించుటకు ఆయన ఎంతో మూల్యము చెల్లిం చెను. లోకమునకు తీర్పు తీర్చుటకు ఆయన తన కుమారుని పంపగలడు కాని, దానికి బదులు లోకము ఆయనద్వారా రక్షణ పొందునట్లు శ్రమపడి తన రక్తము కార్చి మరణించుటకు ఆయన తన కుమారుని పంపెను. కలువరి సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు జరిగించిన కార్యము ఎంతో విలువైనది. అనగా, ఆ కార్యము ప్రతి స్థలములో తన్ను అంగీకరించు పాపులనందరిని రక్షింప గలిగినంత అమూల్యమైనది.

కొత్త జన్మ – Bible Verses Chapter 3

3:18 మానవులలో సహజముగా విశ్వాసులు అవిశ్వాసులను రెండు తరగతులు కలవు. మన నిత్యత్వపు గతి దేవుని కుమారునిపట్ల మనకుగల వైఖరినిబట్టి నిర్ణయింప బడియున్నది. రక్షకునియందు విశ్వాసముంచువాడు తీర్పు తీర్చబడడు గాని, ఆయన యందు విశ్వాసముంచువానికి ఇంతకుమునుపే తీర్పు తీర్చబడెను. ప్రభువైన యేసు రక్షణ కార్యమును సంపూర్తి చేసెను. అయితే యిప్పుడు ఆయనను అంగీకరించుట లేక నిరాకరించుట ప్రతి వ్యక్తి నిర్ణయమునకు వదిలివేయబడినది.

కాని ఇట్టి ప్రేమపూర్వకమైన వరమును తృణీకరించుట బహు భయంకరము. ఒక వ్యక్తి ప్రభువైన యేసునందు విశ్వాసముంచని యెడల దేవుడు వానికి శిక్ష విధించుట తప్ప మరేమియు చేయలేడు. “ఆయన నామమందు” విశ్వాసముంచుట “ఆయనయందు” విశ్వాస ముంచుటయే. బైబిలు గ్రంథములో చెప్పబడిన పేరు ఒక వ్యక్తిని సూచించుచున్నది. నీవు ఆయన నామమును విశ్వసించుట ఆయనను విశ్వసించుటయే.

3:19 లోకములోనికి వచ్చిన వెలుగు యేసుక్రీస్తే. ఆయన పాపరహితమై నిష్కళంక మైన దేవుని గొఱ్ఱపిల్ల. సర్వలోక పాపముల కొరకు ఆయన చనిపోయెను. అందుకు మానవులు ఆయనను ప్రేమించారా? లేదు. వారు ఆయనను అవమానపరచిరి. అంతేకాదు. ఆయనను తమ రక్షకునిగా కలిగియుండుటకంటె తమ పాపములనే మిన్నగా ఎంచిరి. గనుక వారు ఆయనను తిరస్కరించిరి. ప్రాకెడు జీవులు వెలుగు వచ్చిన తోడనే ఎట్లు పారిపోవునో, అట్లే పాపులైన మానవులు క్రీస్తు సన్నిధినుండి
పారిపోవుదురు.

3:20 సహజముగా పాపమును ప్రేమించువారు వెలుగును ద్వేషింతురు. ఎందు కనగా, వెలుగు వారి పాపస్థితిని బయలుపరచును. ప్రభువైన యేసు ఈ లోకములో ఉన్నప్పుడు పాపులైన మానవులు ఆయన సన్నిధి వారిమధ్య ఉండుటను బట్టి బహు సంకటపడిరి. ఎందుకనగా ఆయన తన పరిశుద్ధతద్వారా వారి భయంకరస్థితిని బయలు పరచెను. ఒక కర్రయొక్క వంకరతనమును తెలియజేయుటకు దాని ప్రక్కనే ఒక తిన్ననికర్ర నుంచితే చాలుగదా!

3:21 ఆలాగుననే ప్రభువైన యేసు పరిపూర్ణుడైన మానవునిగా ఈ లోకమునకు వచ్చి, ఇతర మానవులందరి వంకరతనమును తన పరిపూర్ణత ద్వారా బయలుపరచెను. ఒక వ్యక్తి దేవుని యెదుట నిజముగా సత్యవర్తనుడైయున్న యెడల, అతడు వెలుగైయున్న క్రీస్తునొద్దకు వచ్చి తన అయోగ్యతను, తన పాపస్థితిని గుర్తెరిగి రక్షకునియందు విశ్వాసముంచును. ఈ విధముగా ఒక వ్యక్తి క్రీస్తునందలి విశ్వాసముద్వారా తిరిగి జన్మించును.

యూదయ ప్రాంతములో
బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య (3:22-36):

3:22 యెరూషలేములో ప్రభువుయొక్క సాక్ష్యమును గూర్చి ముందు వచనములలో వివరించబడినది. ఇరవై రెండవ వచనమునుండి ఈ అధ్యాయము ఆఖరి వరకు యూదయలో ప్రభువుయొక్క పరిచర్యను గూర్చి చదువుచున్నాము. ఈ ప్రాంతములో ప్రభువు రక్షణను గూర్చిన శుభవర్తమానమును ప్రకటించుచుండెననుటలో ఎట్టి సంశయము లేదు. మనుష్యులు వెలుగునొద్దకు వచ్చుటను బట్టి బాప్తిస్మము పొందిరి. అయితే ఈ వచనములో ప్రభువు తానే బాప్తిస్మమిచ్చినట్లు చూడగలముగాని, 4:2లో శిష్యులు బాప్తిస్మమిచ్చినట్లు నేర్చుకొనుచున్నాము.

3:23 యోహానని ఈ వచనములో చెప్పబడిన వ్యక్తి బాప్తిస్మమిచ్చు యోహానే. అతడు యూదయ పరిసరప్రాంతములో మారుమనస్సును గూర్చి ప్రకటించుచుండెను. మరియు మెస్సీయా రాక కొరకు సిద్ధబాటు కలిగి మారుమనస్సు పొంద ఇష్టపడు వారికందరికి అతడు బాప్తిస్మమిచ్చుచుండెను. “ఐనోను” అను స్థలములో నీరు విస్తార ముగా నున్నందున అక్కడ యోహాను బాప్తిస్మమిచ్చుచుండెను. అయితే అతడు ముంచడము ద్వారా బాప్తిస్మమిచ్చెనని మనము పూర్తిగా ఋజువు చేయలేముగాని, అతడు ఆ విధముగనే ఇచ్చియుండ వచ్చునని మనము గట్టిగా భావించవచ్చును. ఏలయనగా, అతడు కేవలము చిలకరింపుద్వారా బాప్తిస్మమిచ్చి యున్నయెడల అంత విస్తారమైన నీరు అవసరము లేదు.

3:24 యోహాను తన పరిచర్యను ఇంకను కొనసాగించుచుండెననియు, నమ్మకమైన తన సాక్ష్యమునుబట్టి భక్తిగల యూదులనేకులు స్పందించుచున్నారనియు ఈ వచనము మనకు వివరించుచున్నది. సమీప భవిష్యత్తులో యోహాను చెరసాలలో వేయబడి శిరచ్ఛేదనము చేయబడనై యున్నాడు. కాని ఈ కొద్ది సమయములోనే తనకప్పగించిన పనిని శ్రద్ధతో నెరవేర్చుచున్నాడు.

3:25 శుద్ధీకరణాచరమునుగూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెనని ఈ వచనము స్పష్టపరచుచున్నది. “శుద్ధీకరణము” అను పదము బాప్తిస్మమును సూచించుచున్నది. యేసు ఇచ్చు బాప్తిస్మముకంటె యోహాను ఇచ్చు బాప్తిస్మము మిన్నయను విషయములో వారికి వివాదము కలిగెను. అయితే ఏ బాప్తిస్మములో ఎక్కువ శక్తి యున్నది? ఏ బాప్తిస్మము ఎక్కువ విలువ గలది? బహుశా అన్ని బాప్తిస్మములకంటె యోహాను యొక్క బాప్తిస్మము గొప్పదను ఉద్దేశ్యముతో యోహాను శిష్యులలో కొందరు అవివేకముగా జగడము పెట్టుకొని యుండవచ్చును. క్రీస్తుయొక్క ప్రసిద్ధినిగూర్చి యోహాను యొక్క శిష్యులలో అసూయ కలిగించుటకు పరిసయ్యులలో ఒకడు ప్రయత్నించి యుండవచ్చును.

3:26 గనుక ఒక నిర్ణయము కొరకు వారు యోహానునొద్దకు వచ్చి – నీవిచ్చు బాప్తిస్మము శ్రేష్ఠమైనదైతే, అనేకులు నిన్ను విడిచి ఏల క్రీస్తు నొద్దకు వెళ్ళుచున్నారు. అని అతనిని అడిగియుండవచ్చును. (యొర్దానుకు అవతల నున్నవాడనగా క్రీస్తే). యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చెను. ఆ సాక్ష్యమునుబట్టి తన శిష్యులలో అనేకులు తనను విడిచి యేసును వెంబడించసాగిరి.

3:27 యోహాను ఇచ్చిన ప్రత్యుత్తరమునకు రెండు విధములైన వివరణలు కలవు. అతడు యేసుక్రీస్తును గూర్చి చెప్పుచున్న యెడల రక్షకుడు పొందిన ప్రతి విజయము ఆయనను దేవుడంగీకరించెననుటకు గుర్తు. కాని యోహాను తన్ను గూర్చి చెప్పుచున్న తాను గొప్పవాడైనట్లును లేక ప్రముఖడనైనట్లును ఎన్నడు నటించలేదని అతడు చెప్పుచున్నాడు. యేసు ఇచ్చిన బాప్తిస్మముకంటె తానిచ్చిన బాప్తిస్మమే గొప్పదని అతడు ఎన్నడు చెప్పలేదు. అనగా పరలోకమునుండి పొందినది తప్ప తనయొద్ద ఏమియు లేదని యోహాను భావము. మన యందరి విషయము కూడ అంతే. ఈ లోకములో మానవుల యెదుట మనము అతిశయించుటకు గాని, మనలను మనము హెచ్చించుకొనుటకుగాని తగిన హేతువు ఏది లేదు.

3:28 తాను క్రీస్తును కానని చెప్పుచు యోహాను కేవలము క్రీస్తు రాకడ సమయ మును సూచించుటకును మరియు మెస్సీయా రాకడ కొరకు మార్గమును సిద్ధపరచుటక మాత్రమే పంపబడితినని తన శిష్యులకు జ్ఞాపకము చేయుచున్నాడు. అయితే వారు అతని విషయమై ఎందుకు వాదించిరి? అతని చుట్టు ఒక గుంపు ఉండవలెనని ఎందుకు ప్రయత్నించిరి? అతడు ప్రముఖమైన వ్యక్తి కాడుగాని, కేవలము ప్రభువైన యేసుతట్టు మానవులను త్రిప్పుటకు ప్రయత్నించుచున్నాడు.

3:29 ప్రభువైన క్రీస్తు పెండ్లికుమారుడై యున్నాడు. అయితే యోహాను కేవలము పెండ్లికుమారుని స్నేహితుడు మాత్రమే. బహుశా ఈనాడు మనము చెప్పుచున్నట్లు తోడి పెండ్లి కుమారుడు కావచ్చును. పెండ్లికుమార్తె తోడి పెండ్లికుమారునికి చెందదు గాని, పెండ్లి కుమారునికే చెందును. గనుక జనులు యోహానును వెంబడించుటకంటె యేసును వెంబడించుటయే తగును. ప్రభువైన యేసుక్రీస్తుయొక్క శిష్యులుగా ఎందరు తీర్చబడుదురో వారందరు పెండ్లికుమార్తెగా చెప్పబడుచున్నారు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు యెహోవాయొక్క భార్యగా చెప్పబడిరి.

అయితే క్రొత్త నిబంధనలో సంఘసభ్యులందరు పెండ్లికుమార్తెగా వర్ణింపబడిరి. కాని ఇక్కడ యోహాను సువార్తలో సాదారణ భావముతో మెస్సీయా ప్రత్యక్షమైనప్పుడు యోహానును విడిచి క్రీస్తును వెంబడించిన శిష్యులను సూచించుచు చెప్పబడినది. అంతేగాని అది ఇశ్రాయేలు జనాంగమనిగాని లేక క్రీస్తు సంఘమనిగాని భావము కాదు. అయితే తన శిష్యులు తన్ను విడిచిపెట్టుటను బట్టి అతడెంత మాత్రము చింతించలేదు. కాని వారు పెండ్లి కుమారుని స్వరము వినుట అతనికెంతో గొప్ప సంతోషము. మరియు అందరు క్రీస్తునందు లక్ష్యముంచుటవలన అతడు తృప్తిచెందెను. క్రీస్తు మానవులచేత స్తుతింపబడి ఘనపరచబడినప్పుడు అతని సంతోషము పరిపూర్ణమైనది.

3:30 యోహాను పరిచర్యలో ముఖ్యోద్దేశ్యము ఈ వచనములో క్రోడీకరింపబడినది. స్త్రీ పురుషులను ప్రభువుతట్టు త్రిప్పి ఆయనయొక్క నిజమైన యోగ్యతను ప్రజలకు గుర్తుచేయుటకు అతడు ఎడతెగక ప్రయాసపడెను. తన కార్యమును నెరవేర్చుటలో అతడు తన్నుతాను మరుగుపరచుకొనెను, క్రీస్తు సేవకుడు స్వమహిమను వెదకుట ద్రోహమే కాగలదు. ఈ అధ్యాయములో తప్పక జరుగవలసిన మూడు కార్యములు గమనించండి : (1) పాపి పక్షముగ జరుగవలసినది (3:7); (2) రక్షకుని పక్షముగా జరుగవలసినది (3:14); (3) పరిశుద్ధుల పక్షముగా జరుగవలసినది (3:30).

3:31 “యేసుక్రీస్తు పైనుండి వచ్చినవాడు; అందరికి పైనున్నవాడు.” ఈ మాటలు పరలోక సంబంధమైన ఆయన ఉనికిని మరియు సర్వోత్కృష్టమైన ఆయన స్థానమును తెలియజేయుచున్నది. అయితే తన అల్పత్వమును నిరూపించుటకు తాను మంటినుండి వచ్చినవాడననియు, భూసంబంధమైన విషయములనే మాటలాడుచున్నాననియు బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పెను. ఈ మాటలలోని భావమేమనగా, బాప్తిస్మమిచు యోహాను జన్మత మానవమాత్రులైన తల్లిదండ్రులకు పుట్టినవాడు. పరలోక సంబంధ మైన ఔనత్యము అతనికి లేదు. అందుచేత దేవుని కుమారునివలె అధికారముతో అతడు మాటలాడలేదు.

యూదయ ప్రాంతములో బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య (3:22-36):

“క్రీస్తు పైనుండి వచ్చినవాడును అందరికి పైనున్నవాడు” గనుక యోహాను క్రీస్తుకంటె తక్కువవాడు. ఈ విశ్వమంతటికి సర్వాధికారి క్రీస్తే. గనుక మనుష్యులు ప్రభువుయొక్క దూతను గాక ప్రభువునే వెంబడించుట ఎంతైన మంచిది.

3:32 కాని ప్రభువైన యేసు మాటలాడినప్పుడు అధికారముగల వానివలె మాట లాడెను. తాను ఏమి వినెనో ఏమి చూచెనో దానినిగూర్చిమాత్రమే ప్రభువు మనుష్యులకు చెప్పెను. దానిలో పొరబాటుగాని, మోసముగాని ఉండుటకు ఎట్టి అవకాశము లేదు. అయితే ఎవడును ఆయన సాక్ష్యమును గైకొనకపోవుట వింతగా నున్నది. ఇక్కడ “ఎవడును” అనగా – బొత్తిగా ఎవ్వరును ఆయన సాక్ష్యమును గైకొనలేదను భావము కాదు.

ప్రభువుయొక్క మాటలు గైకొని ఆయనను స్వీకరించిన వ్యక్తులు అక్కడక్కడ ఉన్నారు. అయితే యోహాను మానవాళిని గమనించి, వారిలో అనేకులు ప్రభువుయొక్క బోధను తిరస్కరించిన వారేయను భావముతో అతడు ఈ మాటలు చెప్పెను. పరలోకమునుండి దిగివచ్చినవాడు ప్రభువైన క్రీస్తే. గాని, బహుకొద్దిమంది మాత్రమే ఆయన బోధలు వినుటకు ఇష్టపడిరి.

3:33 ప్రభువుయొక్క మాటలను దేవునియొక్క మాటలుగా అంగీకరించిన బహుకొద్ది మందిని గూర్చి ఈ వచనము వివరించుచున్నది. వారు ఆ రీతిగా అంగీకరించుట ద్వారా దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేయుచున్నారు. నేడు కూడ అంతే. మనుష్యులు సువార్త సందేశమును అంగీకరించునప్పుడు వారు తనకును తక్కిన మానవాళికిని వ్యతిరేకముగా దేవుని పక్షము వహించుదురు.

దేవుడు చెప్పునదేదైనను తప్పక సత్యమైయుండునని వారు గ్రహించిరి. క్రీస్తుయొక్క దైవత్వమును గూర్చి ముప్ఫైమూడవ వచనము ఎంత స్పష్టముగా వివరించెనో గమనించండి. క్రీస్తుయొక్క సాక్ష్యమును ఎవరు నమ్ముదురో వారు దేవుడు సత్యవంతుడని ఒప్పుకొందురని ఈ వచనము చెప్పుచున్నది. ఈ మాటలనే మరొకరీతిగా చెప్పవలెనంటే క్రీస్తుయొక్క సాక్ష్యమే దేవుని సాక్ష్యము; మరియు క్రీస్తును చేర్చుకొనుట దేవుని చేర్చుకొనుటయే.

3:34 యేసు దేవునిచేత పంపబడినవాడు. ఆయన దేవుని మాటలనే పలికెను. ఈ మాటలను ఋజువుపరచుటకే – దేవుడు కొలత ప్రకారము ఆయనకు ఆత్మను అనుగ్రహించలేదని యోహాను తెలిపెను. ఏ మనుష్యుడును అభిషేకింపబడని రీతిలో ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ఆత్మచేత అభిషేకింపబడెను. మనుష్యులు తమ పరిచర్యలో పరిశుద్ధాత్మయొక్క సహాయము గుర్తించిరి. కాని దేవుని కుమారుని యొక్క ఆత్మ పూర్ణమైన పరిచర్యవంటి పరిచర్యగలవాడు ఎన్నడును ఎవడును లేడు.

3:35 తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడని యోహాను సువార్తలో చెప్పబడిన ఏడు సందర్భములలో ఇది యొకటి. సమస్తముపై కుమారునికి అధికారము అనుగ్రహించుటలో కుమారునిపట్ల తండ్రియొక్క ప్రేమ ఇక్కడ బయలుపరచబడినది. ప్రభువైన యేసుకు అప్పగింపబడిన సంపూర్ణ అధికారములలో మానవుని “గతి” కూడ ఇమిడియున్నది. ఈ సత్యము క్రింద వచనములలో వివరించబడియున్నది.

3:36 క్రీస్తునందు విశ్వాసముంచు వారికందరికి నిత్యజీవము ననుగ్రహించు అధికారము దేవుడు ఆయనకు అనుగ్రహించెను. బైబిలులో ఒక వ్యక్తి ఎట్లు రక్షింపబడునను సత్యము వివరించబడిన వచనములలో ఇది యొకటి.

ధర్మశాస్త్రము ననుసరించుట వలనగాని, బంగారు సూత్రమును పాటించుట వలనగాని, సత్రియలు చేయుటవలనగాని రక్షణ కలుగదు. కాని అది కేవలము కుమారునియందు విశ్వాస ముంచుటద్వారానే కలుగును. ఈ సందర్భములలో దేవుడు మాటలాడుచున్నాడని జ్ఞాపకము చేసికొనుము. ఎన్నటికి తప్పిపోని వాగ్దానమును ఆయన చేయుచున్నాడు. తన కుమారునియందు విశ్వాసముంచువారెవరైనను నిత్యజీవము గలవారని ఆయన నిశ్చయముగా చెప్పుచున్నాడు.

ఈ వాగ్దానమును విశ్వసించుట అవివేకము ఎంత మాత్రము కాదు. అయితే దేవుని కుమారునికి విధేయులు కానివారు జీవము చూడరుగాని, వారిమీద దేవుని ఉగ్రత నిలిచియున్నది. దేవుని కుమారునిపట్ల మనము చేయుదానినిబట్టి మన నిత్యగతి ఆధారపడియున్నదని ఈ వచనముద్వారా మనము నేర్చుకొనుచున్నాము.

మనము ఆ కుమారుని అంగీకరించినయెడల దేవుని నిత్య జీవమును ఉచిత వరముగా మనకు అనుగ్రహించును. అయితే మనము ఆయనను తిరస్కరించినయెడల మనము నిత్యజీవము ననుభవించక పోవుటయేగాక ఏ క్షణమందైనను మనమీద దిగుటకు దేవుని ఉగ్రత కాచుకొనియున్నది. (అని గ్రహించ వలసి యున్నాము).

యూదయ ప్రాంతములో బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య (3:22-36):

నీరు ద్రాక్షారసమగుట – Bible Verses Chapter 2 in Telugu

రెండవ అధ్యాయము

నీరు ద్రాక్షారసమగుట

మొట్టమొదటి సూచకక్రియ –
నీటిని ద్రాక్షారసముగా మార్చుట (2:1-11) :

2:1 ఈ వచనములో “మూడవ దినము” అని చెప్పబడిన దినము ప్రభువైన యేసు గలిలయలో నిలిచిన మూడవ దినమును సూచించుచున్నది. మొదటి అధ్యాయము నలభైమూడవ వచనములో రక్షకుడు గలిలయకు వెళ్ళెనని జ్ఞాపకము చేసికొనుము గలిలయలో కానా అను ఊరు ఎక్కడ ఉన్నదో కచ్చితముగా మనకు తెలియదు. కాని, కపెర్నహూముకు దగ్గరగా ఎత్తైన ప్రదేశములో ఉన్నట్లు 2:12 ద్వారా తెలియుచున్నది.

ఆ ప్రత్యేకమైన దినమున కానాలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లియైన మరియ అక్కడ ఉండెను. ఇక్కడ మరియను “యేసుతల్లి” యని చెప్పుట ఆసక్తితో గమనించదగినది. రక్షకుడు కన్య మరియకు కుమారుడగుటను బట్టి ప్రజలలో ఎక్కువ ప్రఖ్యాతి నొందలేదు కాని, ఆమె ప్రభువుయొక్క తల్లి యగుటవలన ఆమె అనేకులకు బాగుగా తెలియబడెను. అయితే లేఖనములు క్రీస్తుకు ఎల్లప్పుడు ప్రాధాన్యత నిచ్చెను గాని మరియకు ఇయ్యలేదు.

2:2 ఆ వివాహమునకు యేసును ఆయన శిష్యులుకూడ పిలువబడిరి. ఆ వివాహ మునకు ఆయనను ఆహ్వానించుట వివేకమైన నిర్ణయము. గనుక ఇప్పుడుకూడ తమ వివాహమునకు క్రీస్తును ఆహ్వానించుట జ్ఞానానుసారమైన నిర్ణయము. ఇందుకై పెండ్లి కుమారుడును పెండ్లికుమార్తెయు ప్రభువైన యేసునందు నిజమైన విశ్వాసులైయుండ వలెను. మరియు తమ వివాహానంతరముకూడ ఆ రక్షకునికి తమ జీవితములను సమర్పించి వారి గృహము ప్రభువు ప్రేమించు నివాసముగా ఉండునట్లు తీర్మానించు
కొనవలెను.

Read and Learn More Telugu Bible Verses

2:3 ఈ వచనములో “ద్రాక్షారసము లేదు” అను మాటలు గమనించండి. అంటే ద్రాక్షారస కొరత ఏర్పడినదని దీని భావము. సరఫరా నిలిచిపోయినది. ఆ పరిస్థితిని గమనించిన యేసుతల్లి, ఆ సమస్యను తన కుమారునికి తెలిపెను. తన కుమారుడు ద్రాక్షారసమును సమకూర్చుటకు అద్భుతము చేయగలడని ఆమె ఎరుగును. గనుక ఆ విధముగాచేసి తన కుమారుడు అక్కడ చేరియున్న అతిధులందరికి తాను దేవుని కుమారునిగా బయలుపరచుకొనవలెనని ఆమె కోరికయనుటలో ఎట్టి సందేహము లేదు. లేఖనములలో ద్రాక్షారసము ఆనందమును సూచించుచున్నది. “వారికి ద్రాక్షా రసము లేదు” అని మరియ చెప్పిన మాటలలో – రక్షింపబడని స్త్రీ పురుషులను గూర్చిన కచ్చితమైన వివరణను తెలియజేయుచున్నది. అయితే అవిశ్వాసులకు నిజమైన శాశ్వతానందము లేనేలేదు.

అనేకులు క్రీస్తునందు విశ్వాసముంచుట (2:23-25) :

2:4 తన తల్లి మాటలకు యేసు నిరుత్సాహకరమైన సమాధానమిచ్చెను. కాని అది గద్దింపు మాత్రము కాదు. తెలుగులో ‘అమ్మా” అను మాటకు ఇంగ్లీషులో ‘ఉమెన్’ (Woman) అని వ్రాయబడెను. ఆ మాటకు “ఘనురాలైన స్త్రీ” లేక “అమ్మా” అని అర్ధము. మరియు “నాతో నీకేమి పని” అని చెప్పుటలో – దైవకార్యమును జరిగించుటయందు తాను తల్లియొక్క ఆజ్ఞకు లోబడుటకాక, పరలోకముందున్న తన తండ్రి చిత్తమునకు సంపూర్ణ విధేయతతో పనిచేయుటను ఆయన సూచించు చున్నాడు.

“నాతో నీకేమి (పని)?” అను మాట బైబిలులో అనేక మారులు చెప్పబడినది. ఈ మాటకు “మనకు పొందు ఏమిటి?” అని అర్ధము. అనగా “లేదు” అని జవాబు. ఈ మాటలను దావీదు సెరూయా కుమారులతో రెండు పర్యాయములు పలికెను ఆహాబు కుమారుడైన యెహోరామునకును, తనకు మధ్య ఎంత అగాధమున్నదో సూచించుచు ప్రవక్తయైన ఎలీషా రెండవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయములో ఈ మాటలు పలుకుచున్నాడు.

సాతానుకు క్రీస్తుతో లేక క్రీస్తుకు సాతానుతో పని ఏమి లేనట్లు తెలియజేయుచు దయ్యములుకూడ మూడు పర్యాయములు ఈ మాటలు పలికెను. ఈ సందర్భములో మనము గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయ మేమనగా పాపరహితమైన తన దైవత్వమునకును, పాపసహితమైన ఆమె మానవత్వమునకును ఎట్టి పొందులేనట్లును, వారిరువురి మధ్య గొప్ప వ్యత్యాసమున్నట్లు చూపించుటకు ప్రభువు ఈ మాటలు పలికెను.

యేసు మహిమపరచబడుట తాను కన్నులారా చూడవలెనని మరియు ఆశించినది. కాని అందుకు సమయము ఇంకను రాలేదని ఆయన ఆమెకు జ్ఞాపకము చేయు చున్నాడు. సమస్తమును జయించిన క్రీస్తుగా ఆయన లోకమునకు ప్రత్యక్షము కాకముందు ఆయన మొదటిగా బలిపీఠమును తప్పక ఎక్కవలసియున్నది. ఆ కార్యమును ఆయన కలువరి సిలువలో నెరవేర్చినాడు.

2:5 మరియ ఆయన మాటల భావమును అర్థము చేసికొని, “ఆయన మీతో చెప్పునది చేయుడి” అని సేవకులకు హెచ్చరించెను. తనకుగాని, మరి యే మానవునికి గాని విధేయులు కావలెనని ఆమె మనుష్యులకు ఆజ్ఞాపించలేదు. క్రీస్తును వారికి చూపించుచు ఆయనకే విధేయత చూపవలసినదని ఆమె వారికి చెప్పెను. ప్రభువైన యేసుయొక్క బోధలు క్రొత్త నిబంధనలో ఇయ్యబడినవి. అమూల్యమైన ఈ గ్రంథమును చదివినయెడల “ఆయన మీతో చెప్పునది చేయుడి” అని మరియ పలికిన ఈ మాటలే ఆమె ఆఖరి మాటలని మనము గ్రహించగలము.

2:6,7 పెండ్లి జరుగుచున్న ఆ స్థలములో ఆరు రాతి బానలుండెను. వాటిలో పదహారునుండి ఇరవైయేడు గ్యాలనుల నీరు పట్టును. కలిగిన అపవిత్రత నుండి తమ్మునుతాము శుద్ధిచేసికొనుటకు యూదా ప్రజలు ఈ నీటిని ఉపయోగింతురు. ఆ బానలను నీటితో నింపుడని ప్రభువైన యేసు ఆజ్ఞాపించెను. తక్షణమే పనివారు ఆయన చెప్పినట్లు చేసిరి. తాను అద్భుతమును చేయచూచినప్పుడెల్ల ప్రభువైన యేసుక్రీస్తు తనకు అందుబాటులోనున్న పరిస్థితులనే వినియోగించుకొనెను.

రాతి బాసలను సమకూర్చుటకును, వాటిని నీటితో నింపుటకును ఆయన మానవమాత్రులను అనుమతించెను. కాని ఏ మానవుడు ఎన్నడు చేయలేని కార్యమును ఆయన చేసెను. అనగా నీటిని ద్రాక్షారసముగా మార్చెను. రాతి బానలను నీటితో నింపినది. పనివారేగాని యేసు శిష్యులు కాదు. ఇట్లు చేయుటద్వారా మొదటి సూచకక్రియ చేయుటలో ప్రభువు ఏదో మోసము చేసెనను అపవాదుకు తావులేకుండ చేసెను. అంతేగాక నీటిలో ద్రాక్షారసము కలుపబడినదని ఎవరు చెప్పనేరకుండునట్లు ఆ రాతి బానలు అంచులమట్టుకు నీటితో నింపబడెను.

2:8 అద్భుతము జరిగిన తరువాత బానలోనున్న దానిని ముంచి విందు ప్రధాని యొద్దకు తీసికొనిపొండని ప్రభువు ఆజ్ఞాపించెను. తక్షణమే ఆ అద్భుతము జరిగినట్లు స్పష్టమగుచున్నది. అవును, కొంత సమయము జరిగిన తరువాత గాక, ఆ మరుక్షణమే నీరు ద్రాక్షారసముగా మారిపోయెను.

2:9 ఆ విందులో భోజనమును, బల్లలను ఏర్పాటు చేయవలసిన బాధ్యత విందు ప్రధానిదే. కాని ద్రాక్షారసమును రుచి చూచిన వెంటనే, అసాధారణమైన సంభవమేదో సంభవించియుండునని అతడు తలంచెను. అయితే అది ఎక్కడ నుండి వచ్చెనో అతనికి తెలియలేదు. అది బహుశ్రేష్ఠమైనదని అతడు తలంచి వెంటనే దానిని గూర్చి పెండ్లికుమారుని విచారించెను. (తూర్పు దేశములో అనేక మారులు నీరు కలుషితమై త్రాగుటకు పనికిరాక, ప్రమాదభరితముగా నుండును. ఆ దేశములలో ద్రాక్షారసము అతి సామాన్యమైన పానీయము, అయితే కొద్ది మోతాదులో వాడుట పాపముగా పరిగణింపలేదు. నేడు లోకములో కలుగుచున్న అనేక సమస్యలకు కారణము ఈ ద్రాక్షారసమును దుర్వినియోగ పరుచుటయే).

నీరు ద్రాక్షారసమగుట మొట్టమొదటి సూచకక్రియ – నీటిని ద్రాక్షారసముగా మార్చుట (2:1-11) :

అయితే నేటి దినములలో ద్రాక్షారసముపట్ల నిజ విశ్వాసియొక్క వైఖరి ఏమి? కొన్నిసార్లు వైద్యులు ద్రాక్షారసమును ఔషధముగా నిర్ణయించిరి. ఇది క్రొత్త నిబంధన బోధకు పూర్తిగా అనుగుణ్యముగా నున్నది (1 తిమోతి 5:23). దానిని మితిమీరి ఉపయోగించుట వలన కలిగెడి భయంకరమైన ఫలితములనుబట్టి అనేకమంది విశ్వాసులు దానిని పూర్తిగా నిషేధించిరి.

మత్తుపానీయములకు ఎవరైనను బానిసయగు అవకాశము కలదు. అయితే ఆ ప్రమాదమునుండి బయట పడవలెనంటే దానిని పూర్తిగా విడిచిపెట్టుటయే ఏకైకమార్గము. ఇతరులపై తన క్రియలు ఏ రీతిగా ప్రభావము చూపుచున్నవో విశ్వాసి ఎల్లప్పుడు గమనించుకొనవలెను. ఒకవేళ ఒక విశ్వాసి మత్తు పానీయము సేవించుచుండగా, రక్షింపబడని వ్యక్తి అతని చూచిన యెడల ఎంత చెడ్డ సాక్ష్యము పొందునో గదా! విందు ప్రధాని ఆ ద్రాక్షారసమును చూచినప్పుడు అది మంచిదని గ్రహించెను. అతనికియ్యబడిన ఆ రసము కేవలము ద్రాక్షరసమని చెప్పలేము.

2:10 కాని ఇప్పుడైతే అది సామాన్యమైనది కాదని అతడు గ్రహించెను. ఈ సమయములో అతడు పలికిన మాటలు – ప్రభువైన యేసు కార్యములకును, మానవుని కార్యములకును గల భేదమువైపు మన మనస్సులను ఆకర్షించుచున్నవి. సహజముగా పెండ్లి విందులో జరుగునదేమనగా – మొదట మంచి ద్రాక్షారసమును వడ్డించెదరు. ఎందుకనగా, జనులు మత్తుగొనకముందు దాని మంచిచెడులను దాని రుచి, వాసనలను బట్టి గ్రహించగలరు. ఆఖరున మత్తుగా నున్నప్పుడు ద్రాక్షారసముయొక్క నాణ్యతను గూర్చి వారు పట్టించుకొనరు. కాని ఈ విందులో శ్రేష్ఠమైన ద్రాక్షారసము ఆఖరిలో వడ్డించబడును.

ఇందులో మనకొక ఆత్మీయ భావము కలదు. లోకము సహజముగా ప్రారంభములో శ్రేష్ఠమైనదానినే ఇవ్వజూపును. మరి ముఖ్యముగా యౌవనస్థులకు బహు ఆకర్షణీయమైనవాటినే యివ్వజూపును. క్షణికానందము కలిగించువాటియందు తమ జీవితములను వ్యర్ధపరచుకొనిన తరువాత ఈ లోకము అతనికిచ్చునది మష్టేగాని మరేమికాదు. కాని నిజవిశ్వాసియొక్క జీవితము దీనికి పూర్తిగా భిన్నమైనది. అది అన్ని వేళలలో శ్రేష్ఠమైన దానినే పొందును. కాని క్రీస్తు అంతము వరకు శ్రేష్ఠమైన దానినే ఇచ్చును.

ఈ లేఖన భాగము యూదా జాతితో ప్రత్యక్ష సంబంధము కలిగియున్నది. యూదా జనాంగమునందు నిజమైన ఆనందము ఎంతమాత్రము లేదు. యూదా ప్రజలు వ్యర్థమైన ఆచారములను, సాంప్రదాయములను అనుసరించుచుండిరి. కాని వారి జీవితములు నిస్సారమైనవి. దైవికమైన ఆనందమునకు వారు దూరస్థులు. గనుకనే తనయందు విశ్వాసముంచుమని ప్రభువు వారికి చెప్పగోరెను. వారి నీతి బాహ్యమైన స్థితిని పూర్ణ సంతోషము గలదానిగా ప్రభువు మార్చగలడు. ఆచారము సాంప్రదాయము లనెడి యూదా నీరు, క్రీస్తునందు సంతోషభరితమైన, నిక్కమైన ద్రాక్షారసముగా మారగలదు.

2:11 “పేతురు సువార్త” అని చెప్పబడుచున్న ఒక అవాస్తవికమైన గ్రంథములో ప్రభువైన యేసుక్రీస్తు బాల్యములో ఎన్నో అద్భుతములు చేసినట్లు చెప్పబడెను. కాని “యేసు ఈ మొదటి సూచకక్రియను చేసెను” అను మాటలు పైన చెప్పబడిన దానిని కొట్టివేయుచున్నవి. బాల్యములో ప్రభువు అద్భుతములు చేసినట్లు ఆరోపించుట కేవలము దేవదూషణ చేయుటయే. దీనిని ముందే ఎరిగియుండి ప్రభువు జీవితములోని ఈ కాలమును (బాల్యమును) పరిశుద్ధాత్మ దేవుడు “ఈ మొదటి సూచకక్రియ చేసి” అను మాటలతో మరుగుపరచి దురభిప్రాయమునకు చోటు లేకుండ చేసెను.

నీటిని ద్రాక్షారసముగ మార్చుట యనునది ఒక సూచకక్రియ. అది ప్రాధాన్యతతో కూడిన ఆశ్చర్యకార్యము. మరియు అది ఒక ఆత్మీయ భావముతో కూడిన దైవ కార్యము. ప్రభువుయొక్క అద్భుత కార్యములు యేసు దేవుని అభిషిక్తుడని ఋజువు చేయుచున్నవి. ఆ అద్భుతము చేయుటద్వారా ఆయన తన మహిమను ప్రత్యక్ష పరచెను. అంతేకాదు, శరీరమందు ప్రత్యక్ష పరచబడిన నిజమైన దేవుడుగా ఆయన మానవులకు బయలుపరచుకొనెను. ఆయన చేసిన ఆ అద్భుతమును బట్టి ఆయన శిష్యులు ఆయనయందు నమ్మికయుంచిరి. ఒక రీతిగా వారు ఇంతకు ముందే ఆయనయందు విశ్వాసముంచిరి. గాని ఇప్పుడు ఆ విశ్వాసము బలపరచబడెను. గనుక మరి ఎక్కువగా ఆయన యందు విశ్వాసముంచిరి.

క్రీస్తు యెరూషలేములో దేవాలయమును శుద్ధిచేయుట (2:12-17):

2:12 తరువాత యేసు కానా విడిచి తన తల్లితోను, సహోదరులతోను, తన శిష్యులతోను కలసి కపెర్నహూమునకు వెళ్ళెను. వారు అక్కడ కొన్ని దినములు మాత్రమే ఉండి, ఆ తరువాత వెంటనే యెరూషలేముకు వెళ్ళెను.

2:13 ప్రభువు యెరూషలేముకు వచ్చుట ఇదే మొదటి సారియని ఈ వచనము ద్వారా మనము గ్రహించవచ్చును. ప్రభువు తన బహిరంగ పరిచర్యను పస్కా పండుగ సమయములో మందిరమును శుద్ధిచేయుటద్వారా ప్రారంభించి, మందిరమును శు ద్ధిచేయుట ద్వారానే ముగించుచున్నాడు (మత్తయి 2:12, 13; మార్కు 11:15-18; లూకా 19:45, 46 పోల్చండి) ఐగుప్తు దాస్యమునుండి ఇశ్రాయేలీయులను విమో చించి, ఎర్రసముద్రము దాటించి, ఎడారిగుండా నడిపించి, వాగ్దానభూమిలో ప్రవే పెట్టిన ఆ సమయమును జ్ఞాపకార్థముగా ప్రతి సంవత్సరము జరుపుకొను పండుగే పస్కాపండుగ, మొట్టమొదట జరుపబడిన పస్కాపండుగను గూర్చి నిర్గమ 12 అధ్యా॥లో వివరించబడినది. భక్తిగల ఒక యూదునిగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రాముఖ్యమైన ఆ దినమున యెరూషలేము చేరెను.

2:14 ఆలయము ఒక సంతగా మారిపోయినట్లు ఆయన దానిలో ప్రవేశించిన వెంటనే కనుగొనెను. ఎద్దులు, గొట్టెలు, పావురములు దేవాలయములో అమ్మబడు చుండెను. ఆరాధించుటకు వచ్చువారి ఆరాధన నిమిత్తము జంతువులు, పక్షులు అక్కడ అమ్మబడుచుండెను. రూకలు మార్చువారు సహితము తమ వ్యాపారమును అక్కడ జరుపుచుండిరి. రూకలు మార్చువారు చేయు పని ఏమనగా, విదేశీ యాత్రికుల నుండి వారి రూకలు (డబ్బు) తీసికొని, యెరూషలేములో వాడుకలోనున్న రూకల నిచ్చెదరు. దీనివలన యాత్రికులు దేవాలయపు పన్ను కట్టగలుగుటకు వీలగుచున్నది. ఈ రీతిగా వారు అక్రమముగా సొమ్ము సంపాదించెడివారు.

నీరు ద్రాక్షారసమగుట – Bible Verses Chapter 2

2:15 ఈ సమయములో ప్రభువు వాడిన కొరడా బహుశా సన్నని త్రాళ్ళతో తయారు చేయబడియుండవచ్చును. కాని ఆ కొరడాతో ప్రభువు ఎవరిని దండించినట్లు వ్రాయ బడలేదు. అయితే ప్రభువు చేతిలోని ఆ కొరడా ఆయనకుగల అధికారమునకు ఆనవాలైయున్నది. ఆయన కొరడా ఝళిపించుచు ఆలయములో వ్యాపారము చేయు వారిని బయటికి తోలివేసి, చిల్లర మార్చువారి బల్లలను పడద్రోసెను.

2:16 పావురము పేదల అర్పణ. కాని ఈ పావురములనమ్ము వర్తకులనుకూడ బయటికి వెళ్ళిపొమ్మని ఆయన ఆజ్ఞాపించెను. అవును, దేవుని ఇంటిని వ్యాపారపుటిల్లుగా మార్చుట సరికాదు. మత కార్యములను ధనవంతులగుటకు సాధనములుగా ఉపయోగించకూడదని అన్ని యుగములలో దేవుడు తన ప్రజలను హెచ్చరించెను. ఆయన చేసిన ఈ కార్యములన్నింటిలో ఎట్టి క్రూరత్వముగాని, అన్యాయముగాని లేదు కాని, ఆయనయొక్క పవిత్రతకును, నీతిమత్వమునకును అవి ప్రతీకలైయున్నవి.

2:17 మందిరములో జరుగుచున్నదానిని చూచిన ఆయన శిష్యులు మెస్సీయ వచ్చినప్పుడు దేవుని సంగతులను గూర్చి ఆయనకుగల ఆసక్తినిగూర్చి కీర్తన 69:9లో వ్రాయబడిన “నీ యింటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది” అను మాటలు జ్ఞాపకము చేసికొనిరి. దైవారాధన పవిత్రమైనదిగా ఉండవలెనను దృఢ నిశ్చయతను ప్రభువైన యేసు బయలు పరచుటను శిష్యులు చూచిరి అంతేగాక కీర్తనకారుడు ఎవరినిగూర్చి వ్రాసెనో ఆ వ్యక్తి ఈయనే (యేసు) అని శిష్యులు గ్రహించెను.

నిజ విశ్వాసియొక్క దేహము పరిశుద్ధాత్మకు ఆలయమైయున్నదని మనము జ్ఞాపకము చేసికొనవలెను. యెరూషలేములోని దేవాలయము పవిత్రముగా ఉండవలె నని ప్రభువైన యేసుక్రీస్తు ఎంతటి ఆసక్తి కలిగియుండెనో, ఆ విధముగనే మనముకూడ మన దేహములను నిరంతరము శుద్ధి చేసికొనుటకు కూడ జాగ్రత్త వహించవలెను.

తన మరణ పునరుత్థానములనుగూర్చి యేసు ముందుగా చెప్పుట (2:18-22) :

2:18,19,20,21 యూదా ప్రజలు ప్రభువునుండి ఒక అద్భుత కార్యమునో, సూచకక్రియనో చూడవలెనను ఉద్దేశ్యముగల వారివలె కనిపించుచున్నారు. అయినను, ప్రభువైన యేసు అద్భుతములను ఒకదానివెంట మరొకటి జరిగించినను వారి హృదయములు ఆయనపట్ల మూసివేయబడెను. ఈ వచనములో దేవాలయములోని వ్యాపారులను బయటికి నెట్టివేయుటలో ఆయనకుగల అధికారమును వారు ప్రశ్నించిరి. మరియు తానే మెస్సీయ అని ఋజువుపరచుటకు ఒక సూచకక్రియ జరిగించుమని కూడ వారు కోరిరి. అందుకాయన తన మరణ పునరుత్థానములను గూర్చిన ఆశ్చర్యకర మైన సంగతిని తెలియజేసెను.

వారు తన పరిశుద్ధాలయమును పడగొట్టెదరనియు, తాను మూడు దినములలో తిరిగి లేపెదనని వారితో చెప్పెను. ఈ వచనములో ప్రభువుయొక్క దైవత్వము మరొకసారి మనకు కనిపించుచున్నది. “మూడు దినములలో దానిని తిరిగి లేపెదను” అని దేవుడు మాత్రమే చెప్పగలడు. కాని యూదులు ఆయనను గ్రహించలేదు. ఆత్మీయ సంగతులలో కంటే భౌతికమైన విషయములలో వారు ఎక్కువ ఆసక్తి కలిగియుండిరి. ఆలయమంటే యెరూషలేములో నున్న హేరోదుయొక్క ఆలయమునుగూర్చిమాత్రమే వారు ఆలోచించుచుండిరి. దానిని కట్టించుటకు సుమారు నలభై యారు సంవత్సరములు పట్టినది.

తన మరణ పునరుత్థానములనుగూర్చి యేసు ముందుగా చెప్పుట (2:18-22) :

అయితే దానిని తిరిగి మూడు దినములలో ఎట్లు కట్టగలడో వారు గ్రహించలేదు. అయితే ప్రభువైన యేసు తన స్వంత దేహమును గూర్చి మాటలాడు చున్నాడు. ఆయన దేహము దైవత్వముయొక్క సర్వపరిపూర్ణత నివసించు పరిశుద్ధ స్థలమైయున్నది. ఈ యూదులు యెరూషలేములోని ఆలయమును ఎట్లు అపవిత్ర పరచిరో ఆ విధముగనే ప్రభువును మరికొద్ది సంవత్సరములలో మరణమునకు అప్పగించెదరు.

2:22 ఆయన సిలువ వేయబడి, మరణమునుండి తిరిగిలేచిన తరువాత, తాను మూడవ దినమున తిరిగి లేచెదనని ప్రభువు చెప్పిన మాటలను, ప్రభువు యొక్క శిష్యులు జ్ఞాపకము చేసికొనిరి. ఇటువంటి అద్భుతమైన ప్రవచనము కళ్ళెదుట నెరవేరుట చూచి, ఆయన శిష్యులు లేఖనములను, ప్రభువు చెప్పిన మాటలను విశ్వసించిరి.

అనేక మారులు మనము గ్రహించుటకు కష్టమైన సత్యములను బైబిలు గ్రంథములో మనము చూచుచున్నాము. కాని దేవుని వాక్యమును మన హృదయములో దాచుకొన వలెనని ఈ సందర్భములో మనము నేర్చుకొనుచున్నాము. ఆ లేఖనములు ప్రస్తుతము మనకు అర్థము కాకపోవచ్చును. కాని కొన్ని దినములైన తరువాత ప్రభువు వాటిని మనకు వివరించును. “వారు లేఖనములను విశ్వసించి” అని ఈవచనములో వ్రాయబడిన భావమేమనగా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును గూర్చి పాత నిబంధనలో వ్రాయబడిన ప్రవచనములను వారు విశ్వసించిరి.

అనేకులు క్రీస్తునందు విశ్వాసముంచుట (2:23-25) :

2:23 పస్కా పండుగ సమయములో యెరూషలేములో ప్రభువైన యేసు చేసిన సూచకక్రియలు, అద్భుతముల ఫలితముగా అనేకులాయనయందు విశ్వాసముంచిరి. అనగా తాము ఆయనను అంగీకరించినట్లు చెప్పుకొనిరి. కాని చెప్పినదానికి, వారి ప్రవర్తనకు ఎట్టి పొందిక లేదు. వారు క్రీస్తును వెంబడించుట కేవలము పైకి తమ్మును తాము కనుపరచుకొనుటకే. నేడు లోకములో జరుగుచున్నది కూడ ఇదే. అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసముద్వారా తిరిగి జన్మించిన అనుభవము లేకపోయినను తాము క్రైస్తవులమని చెప్పుకొనుచున్నారు.

2:24, 25 అనేకులాయనయందు విశ్వాసముంచినప్పటికిని, (23వ) యేసు వారిని విశ్వసించలేదు. ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. వారు కేవలము ఆసక్తితో మాత్రమే ఆయనయొద్దకు వచ్చుచున్నారని ఆయనకు ఎఱుకే. ఒక వింతైన అనుభూతి కొరకే వారు ఎదురు చూచుచుండిరి. “ఆయన అందరిని ఎరిగినవాడు” ఆయన వారి ఆలోచనలను, ఉద్దేశ్యములను ఎరిగినవాడు. వారు ఆ రీతిగా ప్రవర్తించుటలో గల కారణములను కూడ ఆయన ఎరుగును.

అనేకులు క్రీస్తునందు విశ్వాసముంచుట (2:23-25) :

అంతేగాక వారి విశ్వాసము నిజమైనదా? లేక అనుకరణా? అనునదికూడ ఆయన ఎరుగును. ఒకని హృదయమును ప్రభువు ఎరిగినంతగా మరి ఏ మానవుడు ఎరుగలేడు. ఒకని హృదయమును ఎరుగుటలో లేక గ్రహించుటలో ప్రభువుకు ఎవరు బోధించనవసరంలేదు. లేక జ్ఞానోదయము కలిగించనవసరం లేదు. మానవునియందు ఏమున్నదో, అతడు అట్లెందుకు ప్రవర్తించు చున్నాడో అనువాటి విషయమైన పరిపూర్ణ జ్ఞానము ఆయనకు కలదు.

యేసుక్రీస్తుయొక్క దైవత్వము – Bible Verses Chapter 1 in Telugu

మొదటి అధ్యాయము

యేసుక్రీస్తుయొక్క దైవత్వము

ఉపోద్ఘాతము :
యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందగలరని చదువరులు ఎరుగు నిమిత్తము యోహాను ఈ సువార్తను వ్రాసెను (20:31).
యోహాను సువార్తలో ఏడు బహిరంగ అద్భుతములు లేక సూచకక్రియలు కలవు. వాటిలో ప్రతి ఒక్కటి యేసే దేవుడని నిరూపించుటకు ఉద్దేశించబడినవి.
అవి :

  • గలిలయలోని కానా అను ఊరిలో నీటిని ద్రాక్షారసముగా మార్చుట (2:9).
  • ప్రధాని కుమారుని స్వస్థపరచుట (4:46-54).
  • బేతెస్థ కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది ఏండ్లనుండి పడియున్న వ్యాధిగలవానిని స్వస్థపరచుట(5:2-9).
  • ఐదువేలమందికి ఆహారము పెట్టుట 6:1-14).
  • సముద్రములో రేగిన తుఫానునుండి తన శిష్యులను కాపాడు నిమిత్తము యేసు గలిలయ సముద్రముపై నడుచుట (6:16 – 21).
  • పుట్టు గ్రుడ్డివానిని బాగుచేయుట (9:1-7).
  • చనిపోయిన లాజరును మరణమునుండి తిరిగిలేపుట (11:1-14).

ప్రభువు బహిరంగముగా ప్రజల యెదుట చేసిన ఈ ఏడు సూచకక్రియలేగాక వీటితోపాటు తాను పునరుత్థానుడైన తరువాత ప్రత్యేకముగా తన శిష్యులకొరకు ఎనిమిదవ అద్భుత కార్యము చేసెను. అదేమనగా – చేపలు పట్టుటయే.

Read and Learn More Telugu Bible Verses

చార్లెస్ ఆర్, ఎర్డ్మన్ అను భక్తుడు యోహాను సువార్తను గూర్చి ఈ రీతిగా చెప్పెను : బైబిలు గ్రంథములో చెప్పబడిన మరి ఏ పుస్తకముకంటెను ఈ సువార్త అనేకులు క్రీస్తును వెంబడించునట్లు ప్రోత్సాహపరచెను. ప్రభువుయొక్క యథార్థమైన పరిచర్య చేయునట్లు అనేకులను ప్రేరేపించెను. సంక్లిష్టమైన ఎన్నో సమస్యలను అనేకమంది బైబిలు పండితులయెదుట ఉంచెను.

రచయితను గూర్చిగాని ఆతని పేరు గాని ఈ సువార్తలో ఎక్కడా చెప్పబడలేదు. అయితే పన్నెండుమంది అపొస్తలులలో ఒకడైన యోహాను దీనిని వ్రాసెనని నమ్ముటకు అనేక మంచి కారణములు కలవు. ఉదాహరణకు దీని రచయిత యూదుడై యుండెను. ఎట్లనగా రచనాశైలి, దానిలో ఉపయోగించిన శబ్దసముదాయము, యూదా మతాచారములు దాని లక్షణములతో అతనికిగల పరిచయము, ఈ సువార్తలో ప్రతిబింబించెడి పాత నిబంధన లేఖనములు – ఇవన్నియు దీని గ్రంథకర్త యూదుడని తెలియజేయుచున్నవి. ఇతడు పాలస్తీనాలో నివసించిన ఒక యూదుడు (1:28; 2:1,11; 4:46; 11:18,54; 21:1,2). మరియు యెరూషలేమును గూర్చియు దేవాలయమునుగూర్చియు అతనికి మంచి పరిచయము కలదు (5:2; 9:7; 18:1; 19:13, 17, 20, 41; మరియు 2:14-16; 8:20; 10:22).

ఈ సువార్తలో తాను వివరించినవాటన్నింటికి అతడు ప్రత్యక్షసాక్షియైయున్నాడు. అనేక ప్రదేశముల, వ్యక్తుల, సమయముల, అలవాటులను గూర్చిన వివరణలు ఈ సువార్తలో అనేకములు కలవు (4:46; 5:14; 6:59, 12:21; 13:1; 14,5,8; 18:6; 19:31). మరియు ఇతడు అపొస్తలుడైయుండెను. యేసుక్రీస్తును గూర్చియు, ఆయనయొక్క ఆంతరంగిక శిష్యులను గూర్చియు అతడు బాగుగా ఎరిగి యున్నాడు. (6:19,60,61; 12:16, 13:22, 28, 16:19).

అయితే ఇతర అపొస్తలులయొక్క పేర్లను పేర్కొని తన పేరు వెల్లడిచేయకుండునట్లు జాగ్రత్త వహించెను. మరియు 13:23; 19:26; 20:2; 21:7,20 లో పేరు చెప్పబడని ఒక వ్యక్తి గలడు. అతడు నిస్సందేహముగా ఈ అపొస్తలుడైన యోహాను కావచ్చునని నమ్మబడుచున్నది. అంతేగాక ఈ రచయిత ప్రత్యక్షసాక్షి యనుటకు ప్రాముఖ్యమైన మరి మూడు లేఖన
భాగములను గమనించండి -1:14; 19:35 మరియు 21:24.

మన ప్రభువుయొక్క భూలోక పరిచర్యను గూర్చిన వరుసక్రమము ఈ సువార్త నుండియే గైకొనబడినది. తక్కిన మూడు సువార్తలలో ప్రభువుయొక్క పరిచర్యకాలము ఒక్క సంవత్సరమునకే పరిమితమైయున్నట్లు కనిపించుచున్నది. కాని యోహాను సువార్తలో పేర్కొనబడిన సాంవత్సరిక పండుగలు, ప్రభువుయొక్క బహిరంగ పరిచర్య కాలము ఇంచుమించు మూడు సంవత్సరముల కాలవ్యవధిని తెలియజేయుచున్నవి. ఈ వాక్యభాగములు గమనించండి : మొదటిది పస్కాపండుగ (2:12,13); “పండుగ” (5:1) ఇది పూరీము అను పస్కా పండుగ కావచ్చును. రెండవది (లేక మూడవది) పస్కా పండుగ (6:4); “పర్ణశాలల పండుగ” (7:2); “ఆలయప్రతిష్ఠ పండుగ” (10:22); ఆఖరిది “పస్కా పండుగ” (12:1).

యోహాను తన సువార్తలో కాలమును గూర్చి కూడ తేటగా తెలియజేసెను. కాని తక్కిన ముగ్గురు సువార్తికులు సమయాన్ని గూర్చి చెప్పినప్పుడు “ఇంచు మించు” అను పదము వాడిరి. యోహానయితే “ఒంటి గంటకు” (4:52), “మూడవ దినము” (2:1), “రెండు దినములు” (10:22), “ఆరు దినములు” (12:1) అని కచ్చితముగా వ్రాసెను.
ఈ సువార్తలో వాడబడిన శైలి, మాటలు బహు విశేషమైనవి. ఇట్టి శైలి, మాటలు ప్రత్యేకమైనవైయుండి యోహాను వ్రాసిన పత్రికలలోనే కనిపించును. దీనిలోని వచనములు సంక్షిప్తముగాను, బహు సులభశైలిలోను ఉన్నవి.

అనేకులు క్రీస్తునందు విశ్వాసముంచుట (2:23-25) :

ఇది గ్రీకు భాషలో వ్రాయబడినప్పటికిని దీనిలో హెబ్రీ భాషయొక్క ఆలోచన ధోరణి కలదు. సహజముగా వచనము, దానిలోని సత్యము అంత గంభీరముగా నుండును. తక్కిన సువార్తల కంటె ఈ సువార్తలో పదసముదాయము చాలా తక్కువ. కాని వాటిలో బహు లోతైన భావము కలదు. ఈ సువార్తలో చెప్పబడిన ప్రాముఖ్యమైన కొన్ని మాటలు, అవి ఎన్ని మారులు వాడబడినది మనము గమనించవలెను : తండ్రీ (118), విశ్వసించు (100), లోకము (78), ప్రేమ (45), జీవము (37), సాక్ష్యము (47), వెలుగు (24).

ఈ సువార్తలో గుర్తింపదగిన మరొక ముఖ్య లక్షణమేమనగా – “ఏడు” అను సంఖ్య. దాని గుణిజములు సారిసారి మనకు కనిపించును. ఈ సంఖ్యకు లేఖన మంతటిలో పరిపూర్ణత మరియు ముగింపు లేక నెరవేర్పు అను భావము ఇయ్యబడినది (ఆదికాండము 2:1-3 చూడండి). ఈ సువార్తలో దేవుని ఆత్మ యేసుక్రీస్తునందు దేవుని ప్రత్యక్షతను పరిపూర్ణము చేయుచున్నాడు. అందునుబట్టి “ఏడు” అను సంఖ్య పదే పదే మనకు కనిపించుచుండును.

“నేనే” అను మాట ఏడు విధములుగా ఈ సువార్తలో మనకు కనిపించుచున్నది. గమనించండి: “జీవాహారము నేనే” (6:35, 41,48,51), “నేను లోకమునకు వెలుగును”(8:12; 9:5), “ద్వారమును నేనే” (10:7,9), “నేను గొజ్జెలకు మంచి కాపరిని” (10:11,14), “పునరుత్థానమును జీవమును నేనే” (11:25), “నేనే మార్గమును, సత్యమును, జీవమును (14:6), “నేను ద్రాక్షావల్లిని” (15:1,5), ఇవిగాక మరి ఏడు “నేను” లు కలవు (4:26; 6:20; 8:24, 28, 58; 13:19, 18:5, 8).

ఆరవ అధ్యాయములో జీవాహారమునుగూర్చి చెప్పబడిన “ఆహారము” (Bread) అను పదము ఇరువదిఒక్కమారులు గ్రీకు భాషలో చెప్పబడినది. ఇది ఏడుయొక్క గుణిజము (7×3=21). కొన్ని మారులు “రొట్టెలు” (Loaves) అనియు, కొన్ని మారులు “ఆహారము” (Bread) అను భావములతో చెప్పబడెను. “జీవాహారము” అను మాటలో “పరలోక ఆహారము” అని ఏడు పర్యాయములును “పరలోకమునుండి దిగివచ్చిన ఆహారము” అని ఏడు పర్యాయములును చెప్పబడెను.

యోహాను తన సువార్తను “వాక్యము” అను మాటతో ప్రారంభించుచున్నాడు. కాని, వాక్యమనగా ఎవరు? ఆ వాక్యము ఏమైయున్నది? అను విషయమును గూర్చి ప్రారంభములో అతడు వివరించలేదు. సహజముగా మన భావములను ఇతరులకు వ్యక్తపరచు సంభాషణల సముదాయమే వాక్యము. కాని ఇక్కడ యోహాను సంభాషణ లనుగూర్చి గాక, ఒక వ్యక్తిని గూర్చి మాటలాడుచున్నాడు. ఆ వ్యక్తి దేవుని కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు.

ఆయనను యోహాను “వాక్యము” అని సంబోధించెను. ఎందుకనగా, ప్రభువైన యేసుక్రీస్తునందు దేవుడు మానవాళికి తన్నుతాను సంపూర్ణ ముగా బయలుపరచుకొనెను. క్రీస్తు ఈ లోకమునకు వచ్చుటద్వారా దేవుడు ఎట్టివాడై యున్నాడు లేక ఏమైయున్నాడను సత్యమును ఆయన మనకు బయలుపరచెను. అంతే గాక కలువరి సిలువలో మనకొరకు మరణించుటద్వారా దేవుడు మనలను ఎంతగా ప్రేమించెనను దానిని క్రీస్తు మనకు బోధించెను. ఈ రీతిగా క్రీస్తు మానవునికి దేవుని జీవవాక్యమైయున్నాడు. అనగా దేవుని ఆలోచనలను బయలుపరచువాడైయున్నాడు.

వాక్యమైయున్న ప్రభువైన యేసు : (1:1-5) :

1:1 ప్రభువు నిత్యత్వములోనే తన ఉనికి కలిగియున్నాడు. మానవుని ఆలోచన గతములో ఎంత వెనుకకు వెళ్ళగలదో, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన ఎన్నడు సృజింపబడినవాడుకాడు. ఆయన ఆది (ప్రారంభము) లేనివాడు.

అందుకు ఈ వచన భాగమును గమనించండి : “వాక్యము దేవునియొద్ద ఉండెను” అనగా, ఆయన ఒక ప్రత్యేకమైన విశిష్టమైన వ్యక్తి. ఆయన దేవునితో జీవించియున్న ఒక వాస్తవికమైన వ్యక్తి. ఆయన దేవునియొద్దనుండుటమాత్రమే గాక, తనంతట తానే దేవుడైయున్నాడు. దేవుడొక్కడే. మరియు ఆ దైవత్వములో ముగ్గురు వ్యక్తులు అనగా తండ్రి-కుమార-పరిశుద్ధాత్మ ఉన్నారనియు బైబిలు మనకు బోధించుచున్నది.

1.2 ఈ ముగ్గురు వ్యక్తులు కలసి దేవుడై యున్నారు. కాని ఈ వచనములో దైవత్వములోని యిద్దరు వ్యక్తులు మాత్రమే పేర్కొనబడిరి. వారే తండ్రియైన దేవుడు, కుమారుడైన దేవుడు. “యేసుక్రీస్తు దేవుడైయున్నాడ”ని ఈ సువార్తలో చెప్పబడిన అనేక వచనములలో ఇది మొదటి వచనము. ఆయన దేవుని వంటివాడనియు, ఆయనకూడా ఒక దేవుడ నియు చెప్పుట సరికాదు. కాని “ఆయన దేవుడు” అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది. మొదట చెప్పిన విషయమునే ఈ రెండవ వచనముకూడా చెప్పినట్లు కనిపించ వచ్చును.

కాని అది సత్యముకాదు. క్రీస్తుయొక్క వ్యక్తిత్వమునకును, ఆయన దైవత్వ మునకును ఆది లేదని ఈ వచనము చెప్పుచున్నది. ఆయన బేత్లహేములో శిశువుగ జన్మించినప్పుడు మాత్రమే ఒక వ్యక్తి కాలేదు. లేక నేడు అనేకులు చెప్పుచున్నట్లు పునరుత్థానము తరువాత ఆయన ఒక దేవుడు కాలేదు. నిత్యత్వమంతటిలో నుండి ఆయన దేవుడైయున్నాడు.

1:3 యేసుక్రీస్తు ఒకరిచేత సృష్టింపబడినవాడు కాదు. కాని ఆయన సమస్తమును సృష్టించిన సృష్టికర్త. మానవులను, జంతుజాలమును, గ్రహములను దేవదూతలను అనగా – దృశ్యమైన, అదృశ్యమైన వాటన్నింటిని ఆయనే సృష్టించెను. సృష్టింపబడిన దేదైనను ఉన్నయెడల అది ఆయనద్వారానే సృష్టింపబడెను. సృష్టికర్తగా సమస్త సృష్టికి ఆయన పైవాడైయున్నాడు. వాస్తవముగా సృష్టి కార్యములో దేవత్వములోని ముగ్గురు వ్యక్తులు కలసియున్నారు. ఈ వచనమును గమనించండి: ఆదియందు ఆయన భూమ్యాకాశములను సృజించెను (ఆది 1:1). “దేవుని ఆత్మ జలములపైన అల్లాడు చుండెను” (ఆది 1:2).

వాక్యమైయున్న ప్రభువైన యేసు : (1:1-5) :

“సర్వమును ఆయన (యేసుక్రీస్తు) ద్వారాను, ఆయననుబట్టియు సృజింపబడెను” (కొలొస్స. 1:16).

1:4 ఆయన జీవమునకు మూలమైయుండెను. ఇక్కడ “జీవము” అను మాటలో “భౌతిక జీవము” మరియు “ఆత్మీయ జీవము” అను భావము కూడా కలదు. ఈ లోకములో మనము పుట్టినప్పుడు భౌతిక జీవమును పొందియున్నాము. అయితే మనము తిరిగి జన్మించినప్పుడు మాత్రమే ఆత్మీయ జీవమును పొందుదుము. అయితే ఈ రెండు జీవములు ఆయననుండియే కలుగుచున్నవి మనకు జీవమును అనుగ్రహిం చిన ఆయనే మానవులకు వెలుగైయున్నాడు. మానవునికి ఈ లోకములో అవసరమైన నడుపుదలను, మార్గమును ఆయనే చూపును. జీవించుట అనునది ఒక సత్యము. కాని, ఎలా జీవించవలెను?

“ఈ జీవముయొక్క నిజమైన ఉద్దేశ్యమేమి?” అను సత్యమును ఎరుగుట, అనగా పరలోకపు మార్గము ఎరుగుట ప్రాముఖ్యమైన సత్యము. మనకు జీవముననుగ్రహించిన ఆయనే. మనము పయనించుచున్న మార్గమునకు అవసరమైన వెలుగునుగూడ అనుగ్రహించుచున్నాడు.

ఈ ప్రారంభ అధ్యాయములో మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క అద్భుతమైన ఏడు బిరుదులు కలవు. అవి : వాక్యము (1,14); వెలుగు (5,7), దేవుని గొట్టెపిల్ల (29,36); దేవుని కుమారుడు (34,49); క్రీస్తు (మెస్సీయ 41); ఇశ్రాయేలు రాజు (49); మనుష్యకుమారుడు (51). ఈ ఏడింటిలో మొదటి నాలుగు బిరుదులు ఒక్కొక్కటి రెండుమారులు. తక్కిన మూడు బిరుదులు ఒక్కొక్కసారి మాత్రమే పేర్కొనబడినవి. మొదటి నాలుగు బిరుదులు సార్వత్రికముగను, తక్కిన మూడు బిరుదులు దేవుని పురాతన ప్రజలైన ఇశ్రాయేలీయులకును అన్వయింపబడియున్నవి.

1:5 పాపము లోకములో ప్రవేశించుటను గూర్చి ఈ వచనములో మనము చూడ గలము. పాపప్రవేశము మానవ జాతియొక్క మనస్సునకు చీకటి క్రమ్మజేసెను. మానవుడు దేవుని ఎరుగకుండునట్లును, దేవుని ఎరుగవలెననెడి కోరిక లేకుండ ఈ చీకటి అతనిని అంధకారములో ముంచివేసినది. అయితే ఈ చీకటి లోనికే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చెను. అనగా, చీకటిలో ప్రవేశించు వెలుగుగా వచ్చెను.

మరొక తర్జుమాలో (ASV) దీని భావము : “చీకటి దానిని జయింపకుండెను” అని కలదు. దీని భావమేమి? ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆ చీకటి ఆయనను గ్రహించలేదని దీని భావము. నిజముగా ఆయన ఎవరో, ఆయన ఈ లోకమునకు ఎందుకు వచ్చెనోయను విషయమును మానవులు గ్రహింపకుండిరి. అయిననేమి? మానవుని తిరస్కారము, శతృత్వము ఆ నిజమైన వెలుగు ఈ లోకములో ప్రకాశింపకుండ నిరోధించలేకపోయెను.

బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య (1:6-8) :

1:6 ఈ వచన భాగము బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి తెలియజేయుచున్నది. ఇతడు ప్రభువైన యేసుకు ముందుగా దేవునిచేత పంపబడెను. యేసు క్రీస్తుయొక్క రాకడను గూర్చి ప్రకటించుటయు, ఆయనను అంగీకరించుటకై సిద్ధపడవలెనని ప్రజలకు తెలియజేయుటయు ఇతని పనియైయున్నది.

1:7 మరియు లోకమునకు నిజమైన వెలుగు యేసుప్రభువేయని సాక్ష్యమిచ్చు టకును, తద్వారా మనుష్యులందరు క్రీస్తునందు విశ్వాసముంచునట్లును ఇతడు సాక్షిగా వచ్చెను.

1:8 తనకు అప్పగించిన పనిలో అపనమ్మకస్థుడు కాకుండునట్లు ప్రజలను తన తట్టు ఆకర్షించుకొనలేదు. అంతేగాక తన్నుగాక ప్రభువైన క్రీస్తునే ప్రజలకు కనుపరచెను. లోకములోనికి ప్రభువైన క్రీస్తు రాక (1:9-18) :

1:9 యుగములనుండి మేమే రక్షకులము, మార్గదర్శకులమని చెప్పుకొనిన అనేక మంది కలరుగాని యోహాను ఎవరినిగూర్చి సాక్ష్యమిచ్చెనో ఆయనమాత్రమే శ్రేష్ఠమైన, నిజమైన వెలుగైయున్నాడు. “నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది” (9వ).

అనగా ప్రతి మనుష్యుడు క్రీస్తును గూర్చిన జ్ఞానము తన అంతరంగములో పొందియున్నాడని భావము కాదు. లేక అందరు ఏదోయొక సమయములో యేసుక్రీస్తునుగూర్చి వినియున్నారను భావముకూడా కాదు. కాని కుల, మత, జాతి, రంగు విచక్షణ లేకుండ ఆ వెలుగు అందరిపై ప్రకాశించుననియే దీని భావము. మరియు ఆ వెలుగు మనుష్యులందరిపై ప్రకాశించుటద్వారా ప్రభువైన యేసుక్రీస్తుయొక్క నిజ స్వభావమును బయలుపరచుచున్నది. అంతేగాక పరిపూర్ణమైన

మానవుడుగా ఆయన ఈ లోకములోనికి వచ్చుటద్వారా, ఇతర మానవులందరు తనకంటే ఎంతో అసంపూర్ణులని తెలుపుచున్నాడు. సహజముగా ఒక గది చీకటిగా ఉన్నప్పుడు, ఆ గదిలోని వస్తువులపైనున్న దుమ్ము ధూళిని నీవు చూడలేదు. కాని ఎప్పుడైతే ఆ గదిలో వెలుగు ప్రకాశించునో అప్పుడుమాత్రమే ఆ గదిలో ఉన్నది ఉన్నట్లు కనిపించును. అదే విధముగా నిజమైన వెలుగుయొక్క ప్రకాశత ఒక వ్యక్తి వాస్తవముగా ఏమైయున్నాడను విషయమును అతనికి బయలుపరచును.

1:10 ప్రభువు బేత్లహేములో జన్మించినప్పటినుండి, తిరిగి పరలోకమునకు వెళ్ళు దినము వరకు ఇప్పుడు మనము జీవించుచున్న ఈ లోకములోనే ఆయన జీవించి యుండెను. వాస్తవముగా మనుష్యులందరికంటే ఈ భూమిమీద నివసించుటకు ఆయనకుమాత్రమే ఎక్కువ అధికారము, హక్కు కలదు. ఈ సమస్త లోకమును ఉనికి లోనికి తెచ్చినవాడును, దీనికి నిజమైన హక్కుదారుడును ఆయనే, కాని మనుష్యులు సృష్టికర్తగా, ఆయనను గుర్తించక, తమవలె ఆయనకూడ ఒక సామాన్య మానవుడని వారు తలంచిరి. గనుకనే ఆయనను తమకు అన్యునిగాను, బయటికి త్రోసివేయబడిన వానిగాను ఎంచిరి.

1:11 “ఆయన తన స్వకీయులయొద్దకు (తన స్వంతవారియొద్దకు) వచ్చెను” అని ఈ వచనములో మనము చదువుచున్నాము. ఆయన ఎవరి స్వాస్థ్యమును ఆక్రమించ లేదు. కాని తాను సృజించిన ఈ భూమిమీదనే ఆయన జీవించెను. అయినను “ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు” సామాన్యదృష్టితో పరికించిన యెడల ఆయన స్వకీయులు” అను మాట సమస్త మానవాళిని సూచించుచున్నది. గనుక సమస్త మానవాళి ఆయనను తిరస్కరించెననుట వాస్తవము.

కాని ప్రత్యేకముగా చెప్పవలెనంటె యూదా జాతిని ఆయన తన వారినిగా ఎంచుకొనెను. వీరు ఆయన యొక్క భూలోక ప్రజలైయున్నారు. గనుక ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు వారి “మెస్సీయ” గా తన్నుతాను యూదులకు కనుపరచుకొనెను. కానీ వారు ఆయనను
అంగీకరించలేదు.

1:12 అందువలన సమస్త మానవాళికి ఆయన తన్నుతాను సమర్పించుకొనెను. మరియు తన్ను ఎందరు అంగీకరించెదరో వారికి దేవుని కుమారులగు అధికారమును అనుగ్రహించెను. అయితే మనము దేవుని పిల్లలము కాగల విధానమును ఈ వచనము స్పష్టముగా మనకు తెలియజేయుచున్నది. సత్రియలవలనగాని, లేక సంఘములో సభ్యత్వమువలనగాని గాక, ఆయనను అంగీకరించి, ఆయన నామమునందు విశ్వాస ముంచుట ద్వారా మాత్రమే మనము దేవుని పిల్లలము కాగలము.

1:13 సామాన్యముగా ఆలోచించినయెడల, శరీరరీత్యా ఒకడు ఒక వ్యక్తికి బిడ్డగా తీర్చబడవలెనంటే వాడు తప్పక శరీరరీతిని జన్మించవలెను. అదేరీతిగా, ఒకడు దేవుని బిడ్డగా తీర్చబడవలెనంటే అతడు తప్పక రెండవ జన్మను కలిగియుండవలెను. దీనినే క్రొత్తజన్మ లేక “మారుమనస్సు” లేక “రక్షింపబడుట” అంటారు. అయితే క్రొత్త జన్మను ఏ రీతిగా పొందలేమో తెలియజేయు మూడు విధానములను ఈ వచనము మనకు తెలియజేయుచున్నది. అదే సమయములో క్రొత్త జన్మ పొందుటకుగల ఏకైక మార్గమును కూడ ఈ వచనము తెలియజేయుచున్నది. అవును, ఇది “రక్తమువలన” కలుగునది కాదు.

అనగా విశ్వాసులైన తల్లితండ్రులకు జన్మించుటవలన ఒకవ్యక్తి నిజమైన క్రైస్తవుడుగా తీర్చబడడు. రక్షణ రక్త సంబంధము (తల్లి తండ్రుల) ద్వారా బిడ్డలకు సంక్రమించునదికాదు. రెండవదిగా, ఇది “శరీరేచ్ఛలవలన” కలుగునదికాదు. అనగా క్రొత్త జన్మను కలిగించుశక్తిని ఏ వ్యక్తి తన శరీరమందు కలిగియుండడు. రక్షణపొంద వలెననెడి కోరిక అతనికి కలిగినను, అతని స్వయిష్టము ఎంత మాత్రము చాలదు. చివరిగా, రక్షణ “మనుషేచ్ఛవలన” కలుగదు.

ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఏ విధముగను రక్షించలేడు. లేక ఒక బోధకుడు ఫలానివ్యక్తి తిరిగి జన్మించవలెనని ఎంతో ఆత్రుత కనుపరచినను అద్భుతమైన ఆ క్రొత్తజన్మను కలిగించుశక్తి అతనికి లేదు. అయితే ఈ క్రొత్త జన్మ ఏ విధముగా కలుగును? “దేవునివలననే” అని దీనికి జవాబు. అనగా క్రొత్త జన్మను కలిగించుశక్తి దేనియందుగాని, ఎవరియందుగాని లేదు కాని, దేవునియందే కలదు.

1:14 ప్రభువైన యేసుక్రీస్తు బేత్లహేములో శిశువుగా పుట్టినప్పుడే “వాక్యము శరీర ధారియాయెను”. ఆయన దేవుని కుమారుడుగా పరలోకములో తండ్రితోకూడ నిరంత రము ఉన్నవాడు. కాని ఈ లోకములోనికి వచ్చుటకు ఆయన మానవ దేహమును ఎన్నుకొనెను. ఈ సందర్భములో మనము గ్రహించవలసినదేమనగా ఆయన శరీరా కారముగా చేయబడుననుట సరికాదు. కాని “ఆ వాక్యము శరీరధారియయ్యెను” యనుట స్పష్టము. ఎందుకనగా, ఆయన ఎన్నడు రూపింపబడినవాడుగాని లేక సృష్టింప బడినవాడుగాని కాడు. ఆయన తానే సమస్తమును సృష్టించిన సృష్టికర్త. అయినను ఆయన శరీరధారియాయెను. అనగా ఒక మానవుడుగా ఈ లోకమునకు వచ్చెను.

అంతేగాక, ఆయన “మన మధ్య నివసించెను.” అనగా, ఇంతలో కనబడి అంతలో వెళ్ళిపోయెనని తలంచుట పొరబాటు. కాని వాస్తవముగా దేవుడు తానే ఈ లోకమునకు దిగివచ్చి మానవులమధ్య ఒక మానవుడుగా జీవించెను. “నివసించెను” అను పదము “తన గుడారమును వేసెను” అను భావమును సూచించుచున్నది. అనగా ఆయన శరీరమే ఆ గుడారము. తన శరీరమనే ఆ గుడారములో ఆయన మానవుల మధ్య ముప్ఫై మూడు సంవత్సరములు నివసించెను.

మరియు యోహాను – “మనము ఆయన మహిమను కనుగొంటిమి” అని చెప్పు. చున్నాడు. బైబిలు గ్రంథములో “మహిమ” అను పదము అనేక మారులు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు కనిపించెడి తేజస్సును, ప్రకాశించుచున్న వెలుగును సూచించుచున్నది. అంతేగాక ఆ పదము దేవునియొక్క “పరిపూర్ణత” మరియు “మహాత్మ్యము” అను భావములనుకూడ సూచించుచున్నది. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమందు ఉన్నప్పుడు తన మాంసయుక్తమైన దేహమందు తన మహిమను మరుగుపరచెను.

కాని ఆయన మహిమ ప్రత్యక్షపరచబడుటకు రెండు మార్గములు కలవు. మొదటిది, ప్రకాశమానమైన, నీతియుక్తమైన మహిమ, అనగా, పరిపూర్ణమైన ఆయన శీలము మరియు పరిపూర్ణమైన జీవితమే. ఆయనయందు ఎట్టి లోపముగాని, దోషముగాని లేదు, ఆయన తన సమస్త మార్గములయందు సంపూర్ణుడై యున్నాడు. ప్రతి సద్గుణము ఆయన జీవితములో సమపాళ్ళలో ప్రత్యక్షపరచబడినది.

రెండవది – కనిపించని ఆయన మహిమ ఈ మహిమ రూపాంతరపు కొండమీద ప్రత్యక్షమైనది (మత్తయి 17:1,2). శిష్యులు చూచిన ఆ మహిమ ఆయన నిజముగా దేవుని కుమారుడై యున్నాడని తెలియజేయుచున్నది. క్రీస్తు తండ్రియొక్క అద్వితీయ కుమారుడు. అనగా దేవుని సాటిలేని కుమారుడు. ఆయనవంటి కుమారుడు దేవునికి మరొకడు లేడు. ఒక విధముగా, నిజవిశ్వాసులందరు దేవునికి కుమారులైయున్నారు. కాని యేసుక్రీస్తు తనకు తానుగా దేవుని కుమారుడై యున్నాడు.

దేవుని కుమారునిగా ఆయన దేవునితో సమానుడైయున్నాడని అర్ధము. మరియు ఆయన “కృపాసత్య సంపూర్ణుడై యున్నాడు. అపాత్రులయెడల ఆయన మితిలేని దయగలవాడు. పరిపూర్ణమైన నీతి, పరిశుద్ధత గలవాడు. కాని ఆయన ఎన్నడు పాపమును కప్పిపుచ్చలేడు. దుష్టత్వమును సహించలేదు. నిండు కృప, మెండైన నీతిగలవాడు దేవుడు మాత్రమే.
1:15 ఈ వచనములో – యేసుక్రీస్తు దేవుని కుమారుడని యోహాను సాక్ష్యమిచ్చెను.

ప్రభువు తన బహిరంగ పరిచర్య ప్రారంభించకముందే యోహాను ఆయనను గూర్చి మానవాళికి తెలియజేయుచుండెను. యేసు యోహాను నొద్దకు వచ్చినప్పుడు యోహాను – “నేను చెప్పినవాడు ఈయనే” అని ఎలుగెత్తి చాటెను. పుట్టుకలోను పరిచర్యలోను ప్రభువు యోహానుకంటే వెనుకటివాడు.

ఆయన యోహాను పుట్టిన ఆరు నెలల తరువాత పుట్టెను. యోహాను ప్రకటించుచు బాప్తిస్మమిచ్చుచున్న కొంత కాలమునకు ఇశ్రాయేలు జనాంగమునకు తన్నుతాను ప్రత్యక్షపరచుకొనెను. కాని ఆయన యోహానుకంటే ముందున్న వాడు. అంతేకాదు – ఆయన యోహానుకంటె గొప్పవాడు. గనుక యోహానుకంటే ఆయన అధిక ఘనతకు యోగ్యుడైయున్నాడు. కారణమేమనగా, ఆయన యోహాను కంటె ముందున్నవాడు. ఆయన విత్తుతున ఇట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచువారందరు ఆయన పరిపూర్ణతలో నుండి ఆత్మీయ బలమును పొందుదురు.

ఆపరిపూర్ణత సకల యుగములలో సమస్తదేశ విశ్వాసులకు బలమును అనుగ్రహింపగలిగినంత గొప్పదైయున్నది. ఈ వచనములో బడిన “కృప వెంబడి కృప” అను మాటకు “సమృద్ధియైన కృప” అని భావము కలదు. “కృప” అనగా, దేవుడు తన ప్రియమైన పిల్లలపట్ల కుమ్మరించు దయ వాత్సల్యతయని అర్థము.

1:17 పాత నిబంధన కాలమునకు క్రొత్త నిబంధన కాలమునకు గల వ్యత్యాసమును యోహాను ఈ వచనములో చూపించుచున్నాడు. మోషేద్వారా ఇయ్యబడిన ధర్మశాస్త్రము కృపను కనుపరచునదికాదు, విధేయతను చూపవలెనని అది మానవులకు ఆజ్ఞాపించు చున్నది. కాని విధేయత చూపుటలో మానవులు విఫలులైనయెడల వారికి మరణశిక్ష విధించుచున్నది. మరియు అది మంచిని మానవులకు బోధించెనుగాని, ఆ మంచిని చేయగల శక్తి ననుగ్రహించలేకపోయెను. ఆ ధర్మశాస్త్రము మానవులు కేవలము పాపులని చూపుటకే ఇయ్యబడెను. కాని ఆ మానవులను వారి పాపములనుండి రక్షించలేక పోయెను.

బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య (1:6-8) :

అయితే “కృపయు సత్యమును యేసుక్రీస్తుద్వారా కలిగెను” అని చెప్పబడిన మాటలు గ్రహింపతగినవి. ఆయన లోకమునకు తీర్పుతీర్చుటకు రాలేదుగాని, అయోగ్యులై తమ్మునుతాము రక్షించుకొనలేని తన శత్రువులైన వారిని రక్షించుటకు వచ్చెను. ఇదియే కృప. భూలోకపు నీచులకొరకు అనుగ్రహింపబడిన పరలోకపు శ్రేష్ఠుడే కృప.
కృప మాత్రమే కాదుగాని సత్యముకూడ ఆయనద్వారా కలిగెను.

ఆయన తన్ను గూర్చి “నేనే … సత్యమును” అని చెప్పెను. ఆయన తన సమస్త మాటలయందును కార్యముల యందును పరిపూర్ణమైన నీతిమంతుడును, నమ్మతగినవాడునైయుండెను. తన కృపను కనుపరచు నిమిత్తము ఆయన సత్యమును విడిచిపెట్టలేదు. మరియు పాపులను ప్రేమించినప్పటికిని, వారి పాపములను ఆయన ప్రేమించలేదు.

1:18 “ఎవరును ఎప్పుడైనను దేవుని చూడలేదు” అని యోహాను ఈ వచనములో చెప్పుచున్నాడు. దేవుడు ఆత్మగనుక ఆయన అదృశ్యుడైయుండెను. సామాన్యమైన మానవ దేహము ఆయనకు లేదు. పాత నిబంధన కాలములో ఆయన దేవదూతగా లేక ఒక మానవునిగా మానవులకు కనిపించెను. కాని దేవుడు ఏమైయున్నాడు? ఏ పోలికలో ఉన్నాడను దానిని పాత నిబంధనలోని ఈ ప్రత్యక్షతలు బయలుపరచలేదు. అవి కేవలము తన ప్రజలతో మాటలాడుటకు దేవుడు ఏర్పరచుకొనిన ప్రత్యక్షతలు మాత్రమే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడు. ఆయన దేవుని సాటిలేని కుమారుడు. ఆయనవంటి కుమారుడు మరొకడు లేడు. తండ్రియైన దేవునితో ఆయన ఎల్లప్పుడు ఒక విశిష్టమైన సన్నిహితము గలవాడు. యేసుక్రీస్తు

ఈ భూమిమీద ఉన్నప్పుడుకూడ ఆయన తండ్రి రొమ్మున ఉండెను. ఆయన దేవునితో ఉన్నవాడు. దేవుడు ఏమైయుండును లేక ఆయన ఎట్టివాడై యుండెనను సత్యమును ఆయన మానవులకు సంపూర్ణముగా ప్రత్యక్షపరచెను. యేసును చూచుట, దేవుని చూచుటయే. మానవులు యేసును చూచినప్పుడు దేవుని చూచిరి దేవుని మాటలు వినిరి. దేవుని ప్రేమను, ఆయన దయను వారు అనుభవించిరి.

బాప్తిస్మమిచ్చు యోహాను సాక్ష్యము (1:19-34) :

1:19 మెస్సీయ వచ్చుచున్నాడు గనుక మారుమనస్సు పొందుడని యోహాను అను పేరుగల వ్యక్తి యూదా జాతికి బోధించుచున్నాడను వార్త యెరూషలేమునకు చేరిన వెంటనే, అతడెవరో తెలిసికొనుటకు యూదులు యాజకులను లేవీయులను అతని యొద్దకు పంపిరి. (యాజకులు దేవుని మందిరములో ప్రాముఖ్యమైన పరిచర్యలను జరిగించువారైయుండగా, లేవీయులు సామాన్యమైన విధులను జరిగించు పరిచారకులై యున్నారు.) వారు యోహాను నొద్దకు వచ్చి “నీవు ఎవరవు? బహు కాలమునుండి మేము ఎదురు చూచుచున్న మెస్సీయవా?” అని అడిగిరి.

1:20 అందుకు ఇతరులెవరైనను ఈ అవకాశమును సద్వినియోగము చేసికొని తానే క్రీస్తునని చెప్పుకొని పేరు ప్రతిష్ఠలు సంపాదించుకొనుటకు ఉపయోగించుకొనెడి వారే. కాని యోహాను నమ్మకమైన సాక్షి. గనుక “నేను క్రీస్తును కాను” అని ఒప్పుకొనెను. 1:21 క్రీస్తు రాకముందు ఏలీయా ఈ భూమిమీదికి తిరిగి వస్తాడని యూదులు తలంచిరి (మలాకీ 4:5). గనుక ఈ యోహాను క్రీస్తుకానియెడల ఏలీయా కావచ్చునను ఉద్దేశ్యముతో “నీవు ఏలీయావా?” అని ప్రశ్నించిరి.

అందుకు యోహాను “కాను” అని గట్టిగా చెప్పెను. ఈ సందర్భములో ద్వితీయోపదేశకాండము 18:16 లో మోషే చెప్పిన మాటలు గమనించండి * “నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను.” అను ప్రవచన వాక్కులు యూదులు జ్ఞాపకము చేసికొని, మోషే చెప్పిన ఆ ప్రవక్త ఈ యోహాను కావచ్చునని తలంచిరి. కాని ఈ పర్యాయముకూడా యోహాను – “కాను” అని ప్రత్యుత్తరమిచ్చెను.

1:22 గనుక యెరూషలేమునుండి పంపబడిన యాజకులు లేవీయులు సరియైన ప్రత్యుత్తరము లేకుండ తిరిగి వెళ్ళుటకు కలవరపడి “నిన్నుగూర్చి నీవు ఏమని చెప్పుకొనుచున్నావు” అని ప్రశ్నించిరి.

1:23 అందుకతడు – “ప్రవక్తయైన యెషయా చెప్పినట్లు నేను …. అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము” అని చెప్పెను (యెషయా 40:3). మరొక మాటలో చెప్పవలెనంటే ముందుగా చెప్పబడినట్లు ఆయనకు ముందుగా వెళ్ళువాడనని యోహాన చెప్పెను. యోహానే ఆ స్వరము ఇశ్రాయేలీయులే ఆ అరణ్యము. ఎట్లనగా, ఇశ్రాయేలు జనాంగము ఎండిపోయి, నిష్పలమైన ఎడారివంటి వారైరి. అట్టి జనాంగమునకు యోహాను ఒక “స్వరముగా” తన్ను గూర్చి చెప్పుకొనెను. సహజముగా మనము స్వరమును వినగలమే గాని దానిని చూడలేము. ఇక్కడ యోహాను స్వరముకాగా, యేసుక్రీస్తు వాక్యమై యున్నాడు. వాక్యము వెల్లడి కావలెనంటే దానికి స్వరము కావలెను. కాని వాక్యములేకుండ స్వరమునకు విలువలేదు.

స్వరముకంటే వాక్యము బహు గొప్పది. గనుక మనము ఆయన స్వరమైయుండుట మన గొప్ప భాగ్యము. “ప్రభువు మార్గము సరాళము చేయుడి” – అనునది యోహాను వర్తమానము. “మెస్సీయ వచ్చుచున్నాడు. మరియు ఆయనను అంగీకరించుటకు ఆటంకముగా నున్న సమస్తమును మీలో నుండి తీసివేసికొనుడి. అట్లు చేసి ఆయన వచ్చి ఇశ్రాయేలు రాజుగా మిమ్మును ఏలునట్లు మీ పాపముల విషయమై పశ్చాత్తాప పడుడి” అని భావము.

1:24 యోహాను నొద్దకు మనుష్యులను పంపిన పరిసయ్యులు యూదా జాతిలో బహు నిష్టగల తెగకు చెందినవారు. ధర్మశాస్త్రమునందు తమకుగల విశేష జ్ఞానమును బట్టి పాతనిబంధన ఆజ్ఞలను, లేఖనములను తూ.చ. తప్పక పాటించెదమనెడి అతిశయము గలవారు. కాని వాస్తవమునకు వారిలో అనేకులు వేషదారులు. భక్తిగల వారివలె కనుపరచుకొనుటకు వారు ప్రయత్నించెదరు గాని ఘోరమైన పాపములో వారు జీవించెడివారు.

1:25 మరియు తాము పేర్కొనిన ప్రముఖ వ్యక్తులలో ఎవరూ కానప్పుడు బాప్తిస్మ మిచ్చుటలో యోహానుకు గల అధికారమేమిటోయని వారు తెలిసికొనగోరిరి.

1:26 ఇతరులు తన్ను ప్రాముఖ్యమైనవానిగా ఎంచవలెనని యోహాను ఆశించలేదు. గాని, క్రీస్తుకొరకు మానవులను సిద్ధపరచుటయే అతని పని. “నేను నీళ్ళలో బాప్తిస్మ మిచ్చుచున్నాను” అని యోహాను ఈ వచనములో చెప్పుచున్నాడు. ఎందుకనగా అతని బోధ వినినవారు తమ పాపముల విషయమై పశ్చాత్తాపపడినప్పుడు, వారి అంతరంగములో కలిగిన మార్పుకు బాహ్యసంకేతముగా అతడు వారికి నీటిలో బాప్తిస్మమిచ్చుచుండెను.

యేసుక్రీస్తుయొక్క దైవత్వము – Bible Verses Chapter 1 in Telugu

యోహాను తన ప్రసంగమును కొనసాగొంచుచు – నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు; మీరాయనను నెరుగరు అని ప్రభువైన యేసు క్రీస్తును సూచించుచు చెప్పెను. కాని పరిసయ్యులు బహుకాలము నుండి తాము ఎదురు చూచిన మెస్సీయగా ఆయనను గుర్తించలేదు. యోహాను మాటలలోని భావ మేమనగా ఒక ప్రముఖునిగా నన్ను తలంచవద్దు … మీరు లక్ష్యముంచవలసిన వ్యక్తి ఒక్కడే. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. కాని ఆయన నిజముగా ఎవరైయున్నాడో మీరు ఎరుగలేదు అని అతడు నొక్కి చెప్పెను.

1:27 అవును, ఆయన మాత్రమే యోగ్యుడు. ఆయన యోహానుకంటే తరువాత వచ్చినప్పటికిని ఆయన అన్నింటిలోను ప్రాముఖ్యత మరియు స్తుతి పొందనర్హుడు. తన యజమానియొక్క చెప్పులను విప్పవలసిన బాధ్యత దాసునిదే. కాని యోహాను క్రీస్తు కొరకు ఇట్టి దీనాతిదీనమైన పరిచర్యచేయుటకు తన్ను యోగ్యునిగా ఎంచుకొనలేదు.

1:28 యోహాను పరిచర్యచేసిన బేతనియ ఉన్న కచ్చితమైన ప్రదేశము మనకు తెలియదు. కాని యొర్దానునదికి తూర్పువైపున ఉన్నదని ఎరుగుదుము.

1:29 మరునాడు యెరూషలేమునుండి పరిసయ్యులు యొర్దాను. తీరమునకు వచ్చిరి, యేసుకూడ తనయొద్దకు వచ్చుట యోహాను చూచి, ఆ క్షణములో అమితానందము నొందినవాడై – “ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల” అని కేకవేసి చెప్పెను. గొజ్జెపిల్ల యూదులయొక్క బలిపశువు. గొట్టెపిల్లను వధించి దాని రక్తమును ప్రోక్షించవలెనని దేవుడు వారికి బోధించెను.

మానవుని పాపములు క్షమించబడునట్లు తనకు ప్రతిగా గొట్టెపిల్ల వధించబడి రక్తము చిందింపబడవలెను. అయినప్పటికిని, పాత నిబంధనలో వధింపబడిన గొఱ్ఱపిల్ల రక్తము పాపమును నిజముగా తీసివేయలేకపోయెను. ఆ గొట్టెపిల్లలు కేవలము ఛాయలైయుండి, దేవుడే ఒకనాటికి పాపభారమంతటిని మోసికొనిపోవు ఒక గొట్టెపిల్లను అనుగ్రహించునను సత్యమును సూచించుచున్నది. ఇప్పుడు ఆ సమయము రాగా, దేవుని నిజమైన గొట్టెపిల్ల వచ్చెనని యోహాను విజయోత్సవముతో ప్రకటించెను.

అయితే మనము ఇక్కడ గమనించవలసిన విషయమేమనగా, యేసు లోక పాపమును మోసెనని చెప్పుటలో, ప్రతి ఒక్కరి పాపములు క్షమించబడెనని యోహాను యొక్క భావముకాదు. సమస్త లోకపాప విమోచన క్రయధనముగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణము పూర్తిగా సరిపోయినది. కాని, ఎందరు ఆయనను ప్రభువుగాను, రక్షకునిగాను అంగీకరింతురో ఆ పాపులు మాత్రమే క్షమింపబడుదురు.

1:30 వచ్చుచున్నవాడు తనకంటే గొప్పవాడు. ఆయన కొరకు తాను మార్గమును సిద్ధపరచువాడను మాత్రమేయని జ్ఞాపకము చేయుటలో యోహాను ఎన్నడు అలయ లేదు. దేవుడు మానవునికంటే ఎంతటి గొప్పవాడో, యేసుక్రీస్తు యోహానుకంటె అంత గొప్పవాడు. యోహాను క్రీస్తుకంటె కొన్ని నెలలముందు పుట్టెనుగాని, యేసు నిత్యత్వమంతటిలో ఉన్నవాడు.

1:31 “నేను ఆయనను ఎరుగను అని యోహాను చెప్పినప్పుడు – యోహాను క్రీస్తును అంతకమునుపు ఎన్నడు చూడలేదని కాదు. యోహాను మరియు యేసు బంధువులు గనుక బహుశా వారు ఒకరి నొకరు బాగుగా ఎరిగియుండ వచ్చును. కాని యోహాను తన బంధువైన యేసుక్రీస్తును మెస్సీయగా తాను బాప్తిస్మమిచ్చువరకు గుర్తించలేదు. ఇక్కడ యోహాను చేయవలసిన పని ఒక్కటే. అదేమనగా – ప్రభువు మార్గము సిద్ధపరచి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఇశ్రాయేలు జనాంగమునకు ఆయనను కనుపరచుట. గనుక క్రీస్తురాకడ కొరకు ప్రజలను సిద్ధపరచుటకై వారికి నీటిలో బాప్తిస్మమిచ్చు చుండెను. అయితే శిష్యులను తన కొరకు సంపాదించుకొనవలెనను ఉద్దేశ్యముతో అతడు ఆ విధముగా చేయలేదు.

1:32 32 వ వచనములోని మాటలు యోర్దాను నదిలో యోహాను క్రీస్తుకు బాప్తిస్మ మిచ్చు సమయమును సూచించుచున్నవి. బాప్తిస్మము పొంది యేసు నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చిన వెంటనే దేవుని ఆత్మ పావురము రూపములో ఆయనమీదికి దిగి వచ్చెను (మత్తయి 3:16).

1:33 మెస్సీయ రాబోవుచున్నాడనియు, ఆయన వచ్చినప్పుడు దేవుని ఆత్మ దిగి వచ్చి ఆయనపై నిలుచుననియు దేవుడు యోహానుకు ముందుగా బయలుపరచెను, గనుక యేసు ప్రభువుకు ఈ సంభవము ఎప్పుడు సంభవించెనో, అప్పుడు “పరిశు ద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడు ఈయనే” అని యోహాను గ్రహించెను.

పరిశుద్ధాత్ముడు దైవత్వములోని ముగ్గురు వ్యక్తులలో ఒక వ్యక్తియైయున్నాడు. ఆయన తండ్రియైన దేవునితోను, కుమారుడైన దేవునితోను సమానుడైయుండెను. యోహాను నీటితో బాప్తిస్మమిచ్చెనుగాని, యేసు పరిశుద్ధాత్మతో బాప్తిస్మమిచ్చెను. ఈ ఆత్మ బాప్తిస్మము పెంతెకొస్తు దినమున సంభవించెను. (అ.కా. 1:15; 2:4,38). ఆ ఆత్మ ప్రతి విశ్వాసియందు నివసించుటకును, ఆ విశ్వాసిని క్రీస్తుశరీరమైయున్న సంఘములో అవయవములుగా చేర్చుటకును ఆ దినమున ఆయన దిగివచ్చెను (1 కొరింథీ 12:13). 1:34 ముందుగా చెప్పబడినట్లు లోకమునకు రానైయున్న దేవుని కుమారుడు నజరేయుడైన ఈ యేసేయని యోహాను సరిగా సాక్ష్యమిచ్చెను. యూదా జాతి యంతటిలో ఆయనను మెస్సీయగా గుర్తెరిగిన మొదటివారిలో వీరుకూడ ఉన్నారు. అంద్రెయ,

యోహాను, పేతురులు శిష్యులగుట (1:35-42):

1:35 “మరునాడు” అని చెప్పబడిన దినము మూడవ దినమును సూచించుచ్నుది. అప్పటికి యోహాను తన యిద్దరు శిష్యులతో ఉండెను. ఈ మనుష్యులు యోహాను ప్రకటించుచుండగా విని అతడు చెప్పినదానిని నమ్మిరి. అయితే వారు అప్పటికి యేసుక్రీస్తును కలసికొనలేదు.

1:36 క్రిందటి దినము క్రీస్తుయొక్క వ్యక్తిత్వమును గూర్చి – “దేవుని గొఱ్ఱపిల్ల” యని చెప్పి, ఆయన నెరవేర్చబోవు కార్యమును గూర్చి యోహాను మరియొకసారి బహిరంగముగా సాక్ష్యమిచ్చెను. ఇప్పుడైతే ప్రభువువైపు, ఆయన వ్యక్తిత్వమువైపు తన దృష్టిని సారించి, శిష్యుల మనస్సులను కూడ మళ్ళించెను. అంతేగాక, అతని సందేశము క్లుప్తముగాను, సామాన్యముగాను, స్వార్థరహితమైనదిగాను, పూర్తిగా రక్షకుని గూర్చినదిగాను యున్నది.

1:37 తానిచ్చిన నమ్మకమైన ప్రకటనద్వారా యోహాను తన ఇద్దరు శిష్యులను పోగొట్టుకొనెను. కానివారు యేసును వెంబడించుట చూచి అతడు బహుగా సంతోషించెను.

1:38 తన్ను వెంబడించువారియందు రక్షకుడు ఎల్లప్పుడు ఆసక్తి కలిగియున్నాడు. తన్ను వెంబడించుచున్న ఇద్దరు శిష్యులవైపు తిరిగి వారిని ప్రశ్నించుటలో ఆయన ఎంతో ఆసక్తి కనుపరచెను. తానడిగిన ప్రశ్నకు సమాధానము ప్రభువే ఎరిగియున్నాడు. ఆయన సమస్తమును ఎరిగినవాడు. కాని వారి ఆసక్తిని వారి మాటలలోనే ఆయన వినగోరెను. వారు ప్రభువుతోనే ఉండగోరిరనియు, ఆయనను గూర్చి మరి ఎక్కువగా తెలిసికొనగోరిరనియు వారిచ్చిన ప్రత్యుత్తరమునుబట్టి తెలియుచున్నది. కేవలము ఆయనను కలిసికొనుట వలననే వారు తృప్తిచెందలేదు. కాని, ఆయనతో సహవాసము కలిగియుండవలెనని వారు ఆశించిరి. గనుకనే వారు ఆయనను “రబ్బీ” అని సంబోధించిరి. ఆ మాటలకు “బోధకుడు” లేక “యజమానుడు” అని అర్థము.

1:39 అప్పటికి రక్షకునిగూర్చి మరి ఎక్కువగా నేర్చుకొనవలెననెడి నిజమైన అపేక్ష గలవాడెవడును ఆయననుండి ఎన్నడు వెనుకకు మళ్ళడు. రక్షకుని రాకతో పరిస్థితులు మారిపోయినవి. రక్షకుడు తాను ఆ సమయమున ఎక్కడ కాపురముండెనో, అక్కడికే ఆ ఇద్దరు శిష్యులను ఆహ్వానించెను. నేటి ఆధునిక నివాసములతో పోల్చినప్పుడు, ఆయన నివాసము అతిసామాన్యమైనదిగా నున్నది.

కాని ఈ సమస్త విశ్వమునకు సృష్టికర్తయైన ఆయనతో ఆ శిష్యులు ఆ చిన్న ఇంటిలోనే రాత్రి గడిపిరి. మెస్సీయాను గుర్తెరుగుటలో యూదాజాతి యంతటిలో మొట్టమొదట వ్యక్తులు వీరే. ప్రభువు వారిని ఆహ్వానించి నప్పుడు సమయము సాయంత్రము నాలుగు గంటలైనది. అక్కడ వారు ఎంత ప్రొద్దు గడిపిరో, ఏఏ సంగతులు ముచ్చటించిరో తెలిసికొనుట అసక్తికరమైన విషయమే.

1:40 ఆ శిష్యులలో ఒకని పేరు అంద్రెయ. రెండవ వ్యక్తి పేరు చెప్పబడలేదు. కాని యీ సువార్త వ్రాసిన యోహానే ఆ శిష్యుడని బైబిలు పండితులు ఒప్పుకొను చున్నారు. ఎట్లనగా, తన పేరును ఇక్కడ పేర్కొనక పోవుటలోగల అతని తగ్గింపు జీవితమును కారణముగా చూపుచున్నారు.

1:41 సహజముగా ఒక వ్యక్తి ప్రభువును కనుగొనినప్పుడు, తన బంధువులుకూడ ప్రభువును కలిసికొనవలెనని కోరుదురు. రక్షణ-ఒకడు తన కొరకు పదిల పరచుకొన దగినంత ప్రశస్తమైనది. గనుక ఇట్టి శుభ సందేశముతో అంద్రెయ తన సహోదరుడైన సీమోనునొద్దకు త్వరగా వెళ్ళి – మేము మెస్సీయను కనుగొంటిమి అని చెప్పెను. ఆహా! ఇది ఎంత ఆశ్చర్యకరమైన ప్రకటన! అవును. వాగ్దానము చేయబడిన దేవుని అభిషిక్తుడైన క్రీస్తుకొరకు ప్రజలు అప్పటికి నాలుగు వేల సంవత్సరములనుండి ఎదురు చూచుచుండిరి. కాని ఇప్పుడైతే, ఆ మెస్సీయా తనచెంతనే ఉండెనను ఆశ్చర్యకరమైన వార్తను సీమోను తన స్వంత సహోదరుని పెదవులద్వారా వినెను.

అంద్రెయ వర్తమానము ఎంత సూక్ష్మమైనది! అతని వర్తమానములో కేవలము మూడు మాటలే కలవు. గమనించండి : “మేము మెస్సీయను కనుగొంటిమి” అయిననేమి? సీమోనును సంపాదించుకొనుటకు దేవుడు ఆ మూడు మాటలనే ఉపయోగించెను. మనము గొప్ప బోధకులము తెలివైన ప్రసంగీకులము కాకపోవచ్చును, కాని సామాన్య మాటలలో ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చి ఇతరులకు చెప్పుట ఎంతైనా అవసరమైయున్నది. మిగిలిన కార్యమును దేవుడే చేయును.

1:42 ఇప్పుడు అంద్రెయ తన సహోదరుని తగిన స్థలమునకు తగిన వ్యక్తియొద్దకు తోడుకొనివచ్చెను. ఇది ఎంత ప్రాముఖ్యమైన కార్యమోగదా! అంద్రెయకుగల ఆసక్తిని బట్టి, తరువాత కాలములో సీమోను మనుష్యులను పట్టు గొప్పజాలరిగా మారిపోయెను. మరియు ప్రభువుయొక్క ముఖ్య అపొస్తలులలో ఒకడాయెను. మరియు తన సహోదరుడైన అంద్రెయకంటే సీమోను ప్రజలలో ఎక్కువ ప్రసిద్ధి పొందెను. కాని పేతురు యొక్క బహుమానములో అంద్రెయ తప్పక పాలు పంచుకొనుటలో సందేహము లేదు. ఎందుకనగా, యీ అంద్రెయయే సీమోనును ప్రభువు నొద్దకు తెచ్చెను.

ప్రభువు సీమోనుయొక్క పేరు ఎవరు చెప్పకనే ఎరుగును. అంతేకాదు, అతడు చంచల మనస్కుడనియు, పిరికివాడనికూడ ఆయన ఎరుగును. కడకు సీమోను గుణము మారిపోయి రాయివలె స్థిరచిత్తుడగునని కూడ ప్రభువు ఎరుగును. అయితే ఈ సంగతులన్నింటిని ప్రభువైన యేసు ఎట్లు ఎరుగును? ఆయన వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉన్న దేవుడు గనుక ఆయన ఎరుగును. ఇప్పుడు సీమోను పేరు కేఫాగా (పేతురు) మారెను. ప్రత్యేకించి యేసుక్రీస్తు ఆరోహణమై పరిశుద్ధాత్ముడు భూమిమిదికి దిగివచ్చిన పిదప అతడు ఒక బలమైన వ్యక్తిగా మారిపోయెను.
ఫిలిప్పు నతనయేలు పిలుపు (1:43-51) :

1:43 ఇప్పుడు నాలుగవ దినమును గూర్చి ఈ అధ్యాయములో మనము చదువు చున్నాము. ప్రభువు గలిలయలోని ఉత్తర భూభాగములో సంచరించెను. అక్కడ ఆయన ఫిలిప్పును కనుగొని తన్ను వెంబడించుమని ఆహ్వానించెను. ఈ సందర్భములో “నన్ను వెంబడించుము” అను మాటలు బహు శ్రేష్ఠమైనవి. ఎందుకనగా, ఆ మాటలు పలికినవాడు శ్రేష్ఠుడు. మరియు ఆ మాటలు అనుగ్రహించు ఆధిక్యతలుకూడ శ్రేష్ఠ మైనవే. గనుక ఇట్టి సామాన్యమైన అతి గంభీరమైన ఆహ్వానముతో ప్రతి స్థలములో నున్న ప్రతి మనుష్యుని ప్రభువు ఇంకను పిలుచుచున్నాడు.

1:44 బేత్సయిదా అనునది గలిలయ సముద్రపు ఒడ్డున ఉన్న ఒక పట్టణము, ఈ బేత్సయిదావలె ప్రసిద్ధిచెందిన పట్టణములు ఈ లోకములో బహు అరుదు. తాను జేసిన అద్భుతములలో కొన్నింటిని ప్రభువు ఈ పట్టణమందే జరిగించెను (లూకా 10:13). ఇది ఫిలిప్పు, అంద్రెయ, పేతురుయొక్క స్వంత పట్టణము. అయితే ఈ పట్టణము రక్షకుని తిరస్కరించినది. ఫలితముగా అది పూర్తిగా నాశనము చేయబడెను. ఇప్పుడు ఆ పట్టణము ఎక్కడ ఉన్నదో ఆ చోటును మనము కచ్చితముగా చెప్పలేము.

1:45 ఫిలిప్పు నూతనముగా తాను పొందిన ఆనందమును ఇతరులతో పంచుకొన గోరెను. గనుక అతడు బయలు వెళ్ళి నతనయేలును కనుగొనెను. ఫిలిప్పు యొక్క వర్తమానము సాధారణమైనదిగాను, సూటిగాను ఉన్నది. ఫిలిప్పు నతనయేలును మోషేయు ప్రవక్తలును ఎవరినిగూర్చి ముందుగా చెప్పెనో ఆయనను మేము కనుగొంటిమి. ఆయన నజరేయుడైన యేసు అని చెప్పెను.

వాస్తవముగా అతని వర్తమానము పరిపూర్ణమైనది కాదు. అతడు యేసును యోసేపు కుమారునిగా వర్ణించెను. యేసు కన్యమరియ గర్భమున జన్మించెను. కాని ఆయనకు శరీరరీత్యా తండ్రిలేడు, యోసేపు యేసుకు నిజమైన తండ్రి కాకపోయినను, ఆయనను దత్తత తీసికొని, చట్టరీత్యా ఆయనకు తండ్రియాయెను.
కనుగొని

1:46 నతనయేలుకు అనేక సమస్యలు, అనుమానములు కలవు. గలిలయలో నజరేతు తృణీకరింపబడిన పట్టణము. అట్టి వెనుకబడిన పట్టణములో మెస్సీయా నివసించుట అసాధ్యమని అతనికి తోచెను. గనుక తన మనస్సులోని ప్రశ్నను బయట పెట్టెను. కాని దానిని గూర్చి ఫిలిప్పు నతనయేలుతో వాదించలేదు. మనుష్యులకున్న అభ్యంతరములను తీసివేయుటకు వారిని నేరుగా ప్రభువుకు పరిచయము చేయుట శ్రేష్ఠమైన విధానమని అతడు తలంచెను. ప్రభువు కొరకు ఆత్మలను సంపాదించలెనని ప్రయత్నించెడి వారికందరికి ఇది యొక అమూల్యమైన పాఠము. వాదములకు పోవద్దు. దీర్ఘముగా తర్కించక “వచ్చి చూడుడి” అని మాత్రమే చెప్పుడి.

బాప్తిస్మమిచ్చు యోహాను సాక్ష్యము (1:19-34) :

1:47 యేసుక్రీస్తు సమస్తమును ఎరిగినవాడని ఈ వచనము మనకు తెలుపుచున్నది. ప్రభువుకు నతనయేలుతో ఎటువంటి పరిచయము లేకపోయినప్పటికిని “ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు; ఇతనియందు ఏ కపటమును లేదు” అని ప్రకటించెను. అయితే యాకోబు నీతి యుక్తముకాని విధానములను అనుసరించిన వాడుగా పేరు పొందెను. కాని నతనయేలు ఇందుకు భిన్నమైనవాడు. అవును, అతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. అతనియందు రహస్యముగాని, అక్రమముగాని లేదు.

1:48 ఒక క్రొత్తవ్యక్తి తన్ను ఇంతకుముందే ఎరిగియున్నట్లు మాటలాడుట చూచి నతనయేలు నిజముగా ఆశ్చర్యపడెను. ఆ అంజూరపు చెట్టుక్రింద కూర్చుండి యున్నప్పుడు అతడు పూర్తిగా దాగియుండెననుట స్పష్టమే.

1:49 కాని అతడెంత దాగుకొనినను యేసు అతనిని చూచెను. మానవ కంటికి
కనబడకుండ నతనయేలు తన్ను మరుగు చేసికొనెనని మానవ దృష్టితో మనము చెప్పినను, యేసు అతనిని చూచెను. ఇది ఆయన శక్తి. బహుశా, యేసుక్రీస్తు కియ్యబడిన ఈ జ్ఞానము మానవాతీతమైనదని నతనయేలు తలంచెను. మెట్టుకు యేసుక్రీస్తు దేవుని కుమారుడనియు, ఇశ్రాయేలుయొక్క రాజనియు అతడు గుర్తెరిగెను.

1:50 తానే మెస్సీయా అని తెలియజేయుటకు ప్రభువు రెండు ఋజువులను నతన యేలుకు కనుపరచెను. ఒకటి – ప్రభువు నతనయేలుయొక్క గుణమును వివరించెను. రెండు ఏ కన్ను చూడలేని అతనిని ఆయన చూచెను. ఈ రెండు ఋజువులు నతనయేలుకు చాలినవి. గనుక అతడు ప్రభువునందు విశ్వాసముంచెను. అయితే వీటికంటే గొప్ప కార్యములు చూతువని ప్రభువు వాగ్దానము చేసెను.

1:51 సర్వలోకమును యేలుటకు త్వరలో రానైయున్న తన భవిష్యత్కాల పటమును ప్రభువు నతనయేలుకు వివరించెను. ఆ దినమున పరలోకము తెరువబడును. యెరూష లేమును ముఖ్యపట్టణముగా చేసికొని రాజుగా ఆయన పరిపాలన చేయునప్పుడు దేవుని అనుగ్రహము రాజుపై నిలుచును. దేవదూతలు దేవుని పరిచారకులు. వీరు దేవుని చిత్తమును జరిగించు అగ్నిజ్వాలలవంటివారు. యేసుక్రీస్తు రాజుగా యేలునప్పుడు ఈ దూతలు ఆయన చిత్తమును నెరవేర్చుచు ఆకాశమునకు భూమికిని మధ్య ఎక్కుచును దిగుచును నుందురు. మెస్సీయాగా తనకుగల అధికారమును చూచించు సూచకక్రియ లలో అత్యల్పమైనది మాత్రమే నతనయేలుకు చూపబడెనని ప్రభువు నతనయేలుకు చెప్పెను. కాని రానైయున్న క్రీస్తు పరిపాలన కాలములో అభిషిక్తుడైన దేవుని కుమా రుడుగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడుట నతనయేలు చూచును. అప్పుడు నజరేతునుండి మంచివాడు వచ్చెనని సమస్త మానవాళి తెలిసికొనును.

“నిశ్చయముగా చెప్పుచున్నాను” అను మాట గమనించదగినది. “నిశ్చయముగా” అని ప్రభువు చెప్పినప్పుడు, ఆయన చెప్పిన మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవని మనము గుర్తించవలెను. “నిశ్చయముగా” అను మాటకు “నిజముగా,” “ఆలాగుననే జరుగును గాక” అని భావము. (Verily Verily means “truly truly” or “amen, amen”).