ఒలీవల కొండ మీద రాజు ప్రసంగం అధ్యాయాలు 24-25

ఒలీవల కొండ మీద రాజు ప్రసంగం (24, 25 అధ్యాయాలు)

24, 25 అధ్యాయాలను ఒలీవ కొండ ప్రసంగం అని అంటారు. ఈ ముఖ్యమైన సంభాషణ ఒలీవల కొండమీద జరిగింది గనుక దానికా పేరు వచ్చింది. ప్రసంగం అంతా ప్రవచనాత్మకమైంది. అది శ్రమల కాలాన్ని, ప్రభువు రాకడను సూచిస్తుంది.

అది కేవలం ఇశ్రాయేలు జాతికే సంబంధించింది. అది జరిగే ప్రాంతం పాలస్తీనా. ఉదాహరణకు ‘యూద యలో ఉండువారు కొండలకు పారిపోవలెను’ (24:16).

దాని నేపథ్యం యూదా మత సంబంధ మైందన్నది స్పష్టం. ఉదా : ‘అప్పుడు మహాశ్రమ విశ్రాంతి దినమందైనను సంభవించకుండునట్లు ప్రార్థించుడి’ (24:20).

కాగా ఏర్పరచబడిన వారికి (24:22) అన్న వివరణ దేవుడేర్పరచుకొన్న యూదులకు చెందినది, సంఘానికి కాదు. ఈ ప్రసంగంలోని ప్రవచనాలలో గాని ఉపమానాలలో గాని సంఘం ప్రస్తావన లేదు.

దేవాలయ విధ్వంసం గురించి యేసు ముందుగా చెప్పటం (24:1,2)

‘యేసు దేవాలయమునుండి బయలుదేరి వెళ్ళి’ అనే వివరణతో ఈ ప్రసంగాన్ని పరిచయం చేశారు. ఈ ప్రయత్నం, ముఖ్యంగా యేసు ఇంతకు ముందే చెప్పిన ‘ఇదిగో ఇల్లు మీకు విడువబడియున్నది’ (23:38) అన్న మాటల్లోని భావంతో నిండివుంది.

ఒలీవల కొండ ప్రసంగం (మత్తయి 24-25)

యెహోవా మహిమ దేవాలయమునుండి వెళ్ళిపోవుచున్నది

తమతోపాటు ప్రభువు కూడా దేవాలయ నిర్మాణ సౌందర్యాన్ని మెచ్చుకొంటాడని శిష్యులు ఆశించారు. నిత్యమైన దానికి బదులు అనిత్యమైనది, అసలు వస్తువుకంటే దాని ఛాయ వారి మనస్సుల్లో ఉన్నాయి. అందుకు యేసు రాతిమీద రాయి ఒక్క టైనా ఇక్కడ నిలిచి ఉండకుండా ఈ కట్టడం పూర్తిగా నాశనం చేయబడుతుందని వారిని హెచ్చరించాడు.

రోమా చక్రవర్తియైన టైటస్ ఆ దేవాలయాన్ని కాపా డాలని ప్రయత్నించినప్పటికీ, సైనికులు దానిని తగులబెట్టడంతో క్రీస్తు ప్రవచనం నెరవేరింది. ఆ అగ్నివలన దానిలో తాపడం చేసిన బంగారం కరిగి పోయి ఆ దేవాలయ కట్టడం రాళ్ళమధ్యకు ప్రవ హించింది.

ఆ కరిగిన బంగారాన్ని తీసుకోవడం కోసం ప్రభువు చెప్పినట్టే రోమా సైనికులు ఒక్కొక్క రాయిని పెళ్ళగించారు. ఈ తీర్పు క్రీ.శ. 70 లో టైటస్ చక్రవర్తి యెరూషలేమును ధ్వంసం చేసి నప్పుడు అమలు జరిగింది.

శ్రమలకాలంలోని మొదటి సగభాగం (24:3-14)

24:3 ప్రభువైన యేసు ఒలీవల కొండమీదికి వెళ్ళినప్పుడు ఆయన శిష్యులు ఏకాంతంగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు.

  1. ఈ సంగతులు ఎప్పుడు జరుగుతాయి? అంటే దేవాలయం ఎప్పుడు నాశనం అవుతుంది?
  2. ఆయన రాకడకు సూచన ఏమిటి? అంటే ఆయన తన రాజ్యాన్ని స్థాపించడానికి తిరిగి వచ్చే ముందు ఎలాంటి మానవాతీతమైన సంఘటనలు జరుగుతాయి?
  3. ఈ యుగ సమాప్తికి సూచనలేమిటి? అంటే, ఆయన మహిమపాలనకు ముందు ఈ యుగ సమాప్తిని ఏది ప్రకటిస్తుంది (రెండు, మూడు ప్రశ్నలు ఒకే అంశానికి చెందినవి).

యూదులైన ఈ శిష్యుల ఆలోచన ఈ భూమి మీద మెస్సీయా మహిమ యుగం చుట్టే తిరుగు తున్నదని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి వారు సంఘం కోసం క్రీస్తు రావడాన్నిగూర్చి ఆలోచించ డంలేదు. ఆయన రాకడలోని ఈ దశను గూర్చి వారికేమీ తెలియదు.

ఆయన రాకడలో అధి కారంతో, మహిమతో వచ్చి శత్రువులను నాశనం చేసి ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తాడని వారను కొంటున్నారు.

వారు ప్రపంచం అంతాన్ని గూర్చి గాక ఈ యుగ సమాప్తిని గూర్చి మాట్లాడుతున్నారన్నది కూడా మనం స్పష్టంగా తెలుసుకోవాలి.

వారి మొదటి ప్రశ్నకు ఆయన సూటిగా జవాబు చెప్పలేదు. క్రీ.శ 70 లో జరిగిన యెరూషలేము విధ్వంసం లాంటిదే (లూకా 21:20 – 24 చూడం డి) ఆ తర్వాతి కాలంలో మరొకటి జరుగుతుందని రక్షకుడు చెప్పాడు.

మత్తయి 24-25 వచనాలు

ప్రవచనాన్ని అధ్యయనం చేస్తే మొదట పాక్షికంగా నెరవేరిన కొంత భాగం నుండి తెలియకుండానే ఆ తర్వాత జరుగబోయే అంతిమ నెరవేర్పుకు పయనిస్తున్నట్లుగా చూస్తాం.

రెండు, మూడు ప్రశ్నలకు 24 అధ్యాయం 4-44 వచనాల్లో జవాబు చెప్పాడు. క్రీస్తు మహిమాన్విత రాకడకు ముందు ఏడు సంవత్సరాల శ్రమ కాలాన్ని ఈ వచనాలు వివరిస్తాయి. 4 నుండి 44 వచనాలు మొదటి మూడున్నర సంవత్సరాలను వివరిస్తాయి.

‘మహా శ్రమకాలం” లేక “యాకోబు సంతతివారికి ఆపద తెచ్చు దినము” అని పిలిచే చివరి మూడు న్నర సంవత్సరాలు (యిర్మీయా 30:7) భూమి మీద ఉన్నవారికి ముందెన్నడూ ఎరుగని శ్రమల కాలంగా ఉంటుంది.

శ్రమల కాలం మొదటి సగంలోని పరిస్థితులు కొంతవరకు మానవ చరిత్రంతటిలో ఉన్నవే కాని ఆ కాలంలో అవి మరింత ఎక్కువగా హెచ్చింపబడిన విధంగా ఉంటాయి.

ప్రభువు సంఘానికి కూడా శ్రమలు సంభవిస్తాయని చెప్పాడు (యోహా ను 16:33) కాని, ఈ మహాశ్రమ కాలంలో వచ్చే కష్టాలకు అవి భిన్నమైనవి. ఈ మహా శ్రమలు దేవుని కుమారుని తిరస్కరించిన ఈ ప్రపంచం మీద కుమ్మరించబడతాయి.

దేవుని ఉగ్రత మొదలు కాక ముందు సంఘం ప్రపంచంనుండి వేరు చేయబడుతుందని మనం నమ్ముతున్నాం.

శ్రమలకాలంలోని మొదటి సగభాగం

24:4,5 శ్రమలకాలపు మొదటి సగం కాలంలో అనేకమంది అబద్ధ మెస్సీయాలు ప్రత్యక్షమై అనేక మందిని మోసగించడంలో సఫలీకృతులౌతారు. నేడు విస్తారంగా ప్రబలిపోతున్న అసత్య మతాలు దానికి ప్రారంభ సూచిక కావచ్చుగాని దాని నెర వేర్పుకాదు. ఇక్కడ చెప్పిన అబద్ధ మెస్సీయాలు తామే క్రీస్తులమని చెప్పుకొనే కొందరు యూదులే.

24:6,7 ‘మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును.’

ఇప్పటి పరిస్థితులను చూసి అవి ఇప్పుడు నెరవేరుతున్నాయని అనుకోవడం సులభమే కాని, ఆనాడు జరుగబోయే వాటితో వీటిని పోల్చిచూస్తే ఇవి శాంతమైనవే. దేవుని కాల నిర్ణయంలో తరువాత జరగబోయే సంఘటన సంఘా రోహణం (యోహాను 14:1-6; 1 కొరింథీ 15: 51-57).

దానికి ముందు ఏ ప్రవచనం నెరవేరదు. సంఘం ఎత్తబడిన తర్వాత దేవుని ప్రవచన కాల మానం మొదలవుతుంది. అప్పుడు అవే త్వరగా ఆయా సంఘటనలను వెలుగులోకి తెస్తాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కరువులు, అంటు వ్యాధులు, భూకంపాలు ప్రబలుతాయి.

ఇప్పుడు కూడా జనాభా విపరీతంగా విస్తరించడం వలన ఎదురైన క్షామపరిస్థితులనుబట్టి ప్రపంచ నాయ కులు ఎంతో భయపడుతున్నారు. ఆ కాలంలో జరిగే యుద్ధాలవలన అవి మరింత తీవ్రతరం అవుతాయి.

భూకంపాలు, యిప్పుడు జరుగుతున్నవిగాని జరుగబోయేవి గాని ఎంతో కలవరపరుస్తున్నాయి. అయితే ఇవి మన ప్రభువు మాటల అసలైన నెర వేర్పుతో పోలిస్తే గాలిలో గడ్డి పరకల వంటివే.

24:8 ఈ కాలం శ్రమలకు ప్రారంభం అని 8వ వచనం స్పష్టంగా వివరిస్తోంది. ఇశ్రాయేలీ యుల మెస్సీయా రాజు ఆధీనంలో రాబోయే నూతన క్రమానికి ఇవి పురిటి నొప్పుల వంటివి.

24:9,10 నమ్మకమైన విశ్వాసులు శ్రమల కాలంలో వ్యక్తిగతంగా గొప్ప పరీక్షను అనుభ విస్తారు. దేవునికి నమ్మకంగా ఉన్నవారికి వ్యతిరే కంగా దేశాలు ద్వేషంతో దండయాత్రలు సాగి స్తాయి. వారిని మతసంబంధమైన న్యాయ స్థానా ల్లోనేగాక పౌర న్యాయస్థానాల్లోనూ తీర్పు తీరుస్తారు (మార్కు 13:9).

వారు క్రీస్తులో తమ విశ్వాసాన్ని వదులుకోడానికి నిరాకరించినందుకు చాలామంది హతసాక్షులవుతారు. క్రైస్తవ సాక్ష్యానికి చెందిన అన్ని కాలాల్లో ఇలాంటి పరీక్షలు కలిగినా ఈ కాలంలోని 144,000 మంది యూదా విశ్వాసులు జరిగించే ప్రత్యేక పరిచర్యను ఇది సూచిస్తోంది.

చాలామంది శ్రమలకు, మరణానికి భయపడి విశ్వాస భ్రష్టులవుతారు. కుటుంబ సభ్యులే తమ స్వంత బంధువులను గూర్చిన సమాచారాన్ని పశు ప్రాయులైన హింసకులకు అందించి వారిని అప్ప గిస్తారు.

24:11 ‘అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చెదరు.‘ 5వ వచనంలోని అబద్ధ మెస్సీయాలు వీరేనని కలవరపడనవసరం లేదు. దేవుని పక్షంగా మాట్లాడేవారం తామేనని ఈ అబద్ధ ప్రవక్తలు చెబుతారు. వారిని రెండు విధాలుగా తెలుసుకోవచ్చు.

వారి ప్రవచనాలు ఎన్నడూ నెరవేరవు. వారి బోధలు ఎల్లప్పుడు నిజ మైన దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి.

2 పేతురు 2-1

24:12 దుర్మార్గం విస్తరించుట వలన మానవ ప్రేమలు తగ్గిపోతాయి. ఎక్కడ చూసినా ప్రేమ రహితమైన చర్యలే కనిపిస్తాయి.

24:13 ‘అంతమువరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును.’వారు సహించినందువలన వారి ఆత్మలు రక్షించబడతాయని కాదు దీని భావం. రక్షణ ఎప్పుడూ దేవుని కృపావరం వలన, క్రీస్తు మరణ పునరుత్థానాలలో విశ్వాసం వలన పొందు తారని బైబిలు వివరిస్తోంది. అలాగని సహించిన వారందరూ శారీరక హింసనుండి తప్పించుకొంటా రని దాని అర్థం కాదు.

చాలామంది విశ్వాసులు హతసాక్షులౌతారని యిప్పటికే మనం తెలుసుకొని ఉన్నాం (వ. 9). ఆ శ్రమల్లో ఎవరు స్థిరంగా నిలిచి ఉంటారో, తమ విశ్వాసాన్ని విడిచిపెట్టక హింస లను సహిస్తారో వారు క్రీస్తు రెండవ రాకడలో విముక్తులు అవుతారన్నది సాధారణ వివరణ.

శ్రమ లను తప్పించుకొని క్షేమంగా ఉండడంకోసం మత విశ్వాసాన్ని విడిచిపెట్టడం ఒక మార్గమని ఎవరూ ఊహించకూడదు. నిజమైన విశ్వాసం గలవారు మాత్రమే రక్షణ పొందుతారు. రక్షణార్థమైన విశ్వా సంలో లోపాలుండవచ్చేమో గాని దానికెప్పటికీ శాశ్వత లక్షణం ఉంది.

24:14 ఈ కాలంలో ‘రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటించ బడును.’ 4:23 వివరిస్తున్నట్లు రాజ్య సువార్త అంటే క్రీస్తు ఈ లోకంలో తన రాజ్యాన్ని స్థాపించడానికి వస్తున్నాడని, శ్రమల కాలంలో ఎవరైతే విశ్వాసంతో ఆయనలో ఉంటారో వారు ఆయన వెయ్యేళ్ళ పాలన ఆశీర్వాదాలలో పాలుపంచుకుంటారు.

ఇంకా చాలా జాతుల వారు సువార్తను వినలేదు గనుక క్రీస్తు తన సంఘంకొరకు రాలేకపోతున్నాడు అని ఈ వచనాన్ని తప్పుగా వ్యాఖ్యానిస్తుంటారు.

ఆయన రాకడ తన ‘పరిశుద్ధుల కోసం’ గాక తన ‘పరిశుద్ధులతో’ అని ఈ వచనం యొక్క వివరణ పోతుంది. అంతేగాక ఈ వచనం దేవుని కృపా అని మనం గమనించగలిగితే ఆ అపార్థం తొలిగి సువార్తను గాక రాజ్యసువార్తను సూచిస్తోంది (4:23 వివరణ చూడండి).

3-14 వచనాల్లోని సంఘటనలకు ప్రకటన 6:1-11 వచనాల్లో వివరించిన సంఘటనలకు గొప్ప సారూప్యం ఉండటం చూస్తాం.

‘తెల్లని గుర్రము మీద వచ్చువాడు’ – అబద్ధ మెస్సీయా; ‘ఎర్రని గుర్రము మీద వచ్చువాడు’ – యుద్ధం; కరువు; ‘నల్లని గుర్రము మీద వచ్చువాడు‘ ‘పాలిపోయిన రంగు గుర్రము మీద వచ్చువాడు’ – అంటువ్యాధులు, లేక మరణం. ‘బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు’ హతసాక్షులు.

ప్రకటన 6:12-17 లో వివరించిన సంఘటనలు మత్తయి 24:19 – 31 లోని సంఘటనలతో జతపరచబడ్డాయి.

ఒలీవల కొండ ప్రసంగం అర్థం

మహా శ్రమలు (24:15-28)

24:15 ఈ సమయానికి మనం శ్రమలకాలం మధ్యకు వచ్చాం. ఈ 15వ వచనాన్ని దానియేలు 9:27 లో పోల్చటంద్వారా దీనిని మనం తెలుసుకో గలం. దానియేలు డెబ్బదియవ వారం మధ్య అని అంచనా వేశాడు.

అంటే మూడున్నర సంవత్సరాల చివర పరిశుద్ధ స్థలంలో, అంటే యెరూషలేము దేవాలయంలో విగ్రహారాధన నిమిత్తం ఒక ఆకారం నిలబెట్టి ప్రజలంతా ఆ హేయకరమైన విగ్రహాన్ని ఆరాధించాలని ఆజ్ఞ జారీ అవుతుంది. దానికి అంగీకరించని వారికి మరణదండన అమలు జరుగుతుంది.

ప్రకటన 13-15

దేవునివాక్యం తెలిసిన వారికి ఆ విగ్రహం నిలబెట్టడం మహాశ్రమలకు ప్రారంభం అని తెలుసు. ఈ ప్రవచనం చదివినవారు దానిని అర్థం చేసుకోవాలని ప్రభువు కోరుతున్నాడు.

24:16 ‘యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను.’ యెరూషలేము పరిసరాల్లో ఆ విగ్ర హము ముందు మోకరించనివారు వెంటనే తెలిసిపోతారు.

24:17-19 ప్రతి ఒక్కరూ చాలా త్వరపడాలి. ఒక వ్యక్తి మేడమీద ఉంటే అతడు తన యావ దాస్తిని విడిచిపెట్టి పారిపోవాలి. తన వస్తువులను తీసుకోవడానికి అవసరమైన సమయం అంటే చావు బతుకులమధ్య గడిపే సమయమే.

పొలంలో పని చేస్తున్నవాడు తన బట్టలు తీసుకొనిపోడానికి ఇంటికి రాకూడదు. గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చు తల్లులకు అయితే మరీ దుర్భరంగా ఉంటుంది. త్వరితంగా తప్పించుకోగలగడం వారికి చాలా కష్టం.

24:20 ఈ శ్రమలు ప్రయాణానికి ఆటంకంగా ఉండే చలికాలంలోనూ, ధర్మశాస్త్రం ప్రకారం ప్రయా ణాలు చేయకూడని సబ్బాతు రోజున సంభవించ కుండేలా విశ్వాసులు ప్రార్థించాలి.

సబ్బాతు వారు చేయగలిగిన ప్రయాణం వారు ఆపదనుండి తప్పించుకోడానికి ఏమాత్రం సరిపోదు. (నిర్గ16:29) 24:21 ‘లోకారంభమునుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగ బోదు.’

అప్పటివరకు చరిత్రలో జరిగిన సమస్త దురాక్రమణలు, జాతి సంహారాలు, నరమేధాలు, ఊచకోతలు, అన్నీ కలిపినా ఈ కాలంలో చెలరేగే హింసలకు సాటిరావు. ఈ ప్రవచనం క్రీస్తు రెండవ రాకతో ముగుస్తుంది. గనుక ఇది అంతకుముందు జరిగిన ఏ హింసాకాండతోను ముగిసేది కాదు.

24:22 ఈ శ్రమలెంత తీవ్రంగా ఉంటా యంటే ఆ దినాలు ‘తక్కువ చేయబడకపోయిన యెడల ఏ శరీరియు తప్పించుకొనడు.’ అలాగని శ్రమలు కొనసాగుతాయని చెప్పిన ఆ మూడున్నర సంవత్సరాలు మాత్రం తగ్గించబడవు.

బహుశా ఏ సమయంలోనైతే పోరాటం, వధ ఎక్కువగా జరిగే అవకాశం ఉందో ఆ పగటి కాలాన్ని దేవుడు అద్భుత రీతిగా తగ్గిస్తాడని భావించవచ్చు. ఏర్పరచబడిన వారి (యేసుక్రీస్తును అంగీకరించినవారు) కోసం ప్రభువు రాత్రి సమయం త్వరగా వచ్చేలా చేస్తాడు.

24:23 – 26 23, 24 వచనాల్లో అబద్ధ మెస్సీ యాలు, అబద్ధ ప్రవక్తలను గూర్చిన హెచ్చరికలు తిరిగి చెప్పబడ్డాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మెస్సీయా ఫలానా రహస్య స్థలంలో ఉన్నాడన్న వార్తలు ప్రచారం చేస్తారు. అలాంటి వార్తలు క్రీస్తు కొరకు నిజంగా ప్రేమతో ఎదురుచూస్తున్నవారిని పట్టుకో డానికి ఉపయోగిస్తారు.

కాగా స్థానికంగా, రహస్య మార్గంలో ప్రభువు వస్తాడన్న వార్తలను నమ్మవద్దని ఆయన తన శిష్యులందరిని హెచ్చరిస్తున్నాడు. అద్భుత కార్యాలు చేసేవారు కూడా తప్పనిసరిగా దేవునినుండి వచ్చిన వారే అయ్యుండనవసరం లేదు.

2 థెస్స 2-9,10

24:27 క్రీస్తు రాకడ విషయంలో అస్పష్టత లేదు. అది అకస్మాత్తుగా, బహిరంగంగా, మహి మతో వస్తుంది. ఒక మెరుపులా అది అప్పటి కప్పుడు వచ్చి అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది.

24:28 దాని ఉగ్రతనుండి, తీర్పునుండీ అనై తికమైన దేదీ తప్పించుకోలేదు. ‘పీనుగ ఎక్కడ ఉండునో అక్కడ గ్రద్దలు పోగవును.’ భ్రష్టమైన యూదా మతం, క్రైస్తవ్యం, దేవునికి ఆయన క్రీస్తుకు వ్యతిరేకంగా సమకూడిన సమస్త ప్రపంచ వ్యవస్థ లకు పీనుగు ప్రతినిధిగా ఉంది.

గ్రద్దలు లేక రాబం దులు అనేవి మెస్సీయా ప్రత్యక్షతతో కలిసి కనిపించే దేవుని న్యాయ తీర్పులను సూచిస్తున్నాయి.

మత్తయి 24-25 సెర్మన్

రెండవ రాకడ (24:29-31)

24:29 మహా శ్రమల ముగింపు సమయంలో ఆకాశంలో భయంకరమైన కలవరాలుంటాయి. చీకటి సూర్యుని కమ్ముతుంది. చంద్రుని వెలుగు సూర్యకాంతి ప్రతిబింబమే గనుక చంద్రుడు కాంతిని ఇయ్యడు.

నక్షత్రాలు ఆకాశంనుండి రాలిపోతాయి. గ్రహాలు వాటి కక్షను తొలగిపోతాయి. అందువల్ల వాతావరణంలో తీవ్రమైన మార్పులు వస్తాయి. ఉప్పెనలు వస్తాయి, ఋతువులు మారిపోతాయి.

ఆకాశంలోని ముఖ్య భాగాలైన సూర్య చంద్ర నక్షత్ర గ్రహాలు భూమికి దగ్గరగా వచ్చి దాని కక్ష్యలోనుండి దాన్ని ప్రక్కకు తొలగిస్తే ఎలా ఉంటుందన్న విషయాన్ని డా॥ వెలికోవ్స్కీ ఈ క్రింది విధంగా వివరించాడు.

“ఆ క్షణంలో ఒక భూకంపం భూమిని భయంకరంగా కంపింపజేస్తుంది. తుపా నులు భూమిని తుడిచిపెడతాయి. సము ద్రాలు ఖండాలపై పొర్లి పారతాయి. అవి రాళ్ళను, ఇసుకను, జలచరాలను భూమి మీద పరుస్తాయి. వేడిమి పెరుగుతుంది, రాళ్ళు కరిగి పోతాయి, అగ్ని పర్వతాలు బద్దలవుతాయి.

బీటలు వారిన నేలలో నుండి లావా ప్రవహించి భూమిపై అత్య ధిక ప్రాంతాన్ని కప్పివేస్తుంది. కొండలు మైదానాల్లో నుంచి లేచి ఎగిరి ప్రయా ణించి ప్రక్కనున్న యితర కొండల మీది కెక్కుతాయి. సరస్సులు ప్రక్కకు దొర్లి ఖాళీ అయిపోతాయి. నదులు వాటి దిశలను మార్చుకుంటాయి.

విశాలమైన నేలలు వాటి నివాసులతో సహా సముద్రములో మునిగి పోతాయి. అడవులు కాలిపోతాయి. “తుపానులు చెలరేగి ఆ అడవులను పెకలించి కొమ్మలను వేళ్ళను పెద్ద పెద్ద కుప్పలుగా పోస్తాయి. సముద్రాలు ఎడారులుగా మారి పోతాయి. వాటి నీరు ప్రవహిస్తూ వెళ్ళి పోతుంది.”

24:30 ‘అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును.’ ఆ సూచన ఏదో మనకు చెప్పలేదు. ఆయన మొదటి రాకడ సమయంలో ఆకాశంలో నక్షత్రం వచ్చింది. ఆయన రెండో రాకడను కూడా ఒక ఆశ్చర్యకరమైన నక్షత్రం ప్రకటించవచ్చు. మనుష్య కుమారుడే ఆ సూచన అని కొందరి నమ్మకం.

అదెలాంటి సూచన అయినా అది ప్రత్యక్షమైనప్పుడు అది అందరికి స్పష్టంగా కనబడుతుంది. భూమిమీద ఉన్న సమస్తమైనవారు ఆయన్ను తిరస్కరించారు. కనుక అనుమానం లేక భూమి మీద ఉన్న సకల గోత్రాలవారు రొమ్ముకొట్టు కొంటారు.

కాని ముందుగా ఆ దేశంలో, అంటే ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలవారు దుఃఖపడతారు.

జెకర్యా 12-10

‘అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట వారు చూచెదరు.’ అదెంత అద్భుతమైన క్షణం! ఎవరి మీద ఉమ్మి వేసి, సిలువ వేశారో ఆయన నిర్దోషి అని, ఆయనే జీవానికి, మహిమకు ప్రభువని నిరూపణయ్యింది.

సాత్వికుడు, విధేయతగల యేసు తానే యెహోవాగా ప్రత్యక్షమైనాడు. బలిపశువైన గొట్టెపిల్ల జయించు సింహంగా దిగివచ్చాడు.

తృణీ కరింపబడిన నజరేతు వడ్రంగి రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా వచ్చాడు. ఆకాశ మేఘాలే ఆయన రథాలు. వేలాది సంవత్సరాలుగా సృష్టి ఏ క్షణం కొరకైతే నిట్టూరుస్తుందో, ఆయన నూతన రాజ్యాధికారంతోను, శోభతోను, వచ్చే ఆ క్షణం ఆసన్నమౌతుంది.

24:31 ఆయన దిగివచ్చినప్పుడు ఆయన ఏర్పరచుకొన్న వారిని, ఇశ్రాయేలీయులలో తనను నమ్మినవారిని పాలస్తీనాకు సమకూర్చడానికి ఆయన తన దూతలను ప్రపంచమంతటికీ పంపిస్తాడు. తమ మెస్సీయాకు నమస్కరించడానికి మహిమ కరమైన ఆయన పాలనలో ఆనందించడానికి భూ లోకమంతటినుండి వారంతా ఒకటిగా సమకూడతారు.

అంజూరపు చెట్టు ఉపమానం (24:32-35)

24:32 ‘అంజూరపు చెట్టును చూచి ఒక ఉప మానము నేర్చుకొనుడి.‘ మళ్ళీ మన ప్రభువు ప్రకృతిలోనుండి ఒక ఆత్మీయ పాఠాన్ని బోధించాడు. ‘అంజూరపు చెట్టు కొమ్మలు లేతవై చిగిరించు నప్పుడు వసంతకాలము యింక సమీపముగా ఉన్నదని మీకు తెలియును.’

అంజూరపు చెట్టు ఇశ్రాయేలు జాతిని సూచిస్తుందని మనం తెలుసు కొన్నాం. (21:18-22). వందల సంవత్సరాలుగా ఇశ్రాయేలీయులెవరో బయటికి తెలియక తమ కంటూ ఒక ప్రభుత్వం, ఒక దేశం, దేవాలయం, యాజకులు, జాతీయ జీవనమనే జాడే లేకుండామరుగున పడిపోయారు. ఆ జాతి ప్రజలు ప్రపంచమంతా చెదరిపోయారు.

1948 సం||లో ఇశ్రాయేలు తన స్వంత రాజ్యం, ప్రభుత్వం, స్వంత ధన చలామణి, స్టాంపులు మొద లైన వాటితో ఒక దేశంగా ఏర్పడింది. అయితే ఆత్మీయంగా ఆ జాతి యింకా ఫలించక, నిరుత్సాహంగానే ఉంది. అక్కడ దేవునికోసం ఫలం లేదు. కాని జాతీయంగా, దాని కొమ్మలు లేతగా చిరు రిస్తున్నాయని చెప్పవచ్చు.

24:33 ‘ఆ ప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే యున్నాడని తెలుసుకొనుడి. ‘ ఇశ్రా యేలీయులు ఒక జాతిగా ఏర్పడటం అంటే శ్రమలు ప్రారంభం సమీపంలోనే ఉన్నదనే గాక, ప్రభువు సమీపంగా ద్వారము దగ్గరే ఉన్నాడని అర్థం!

చివరి రోజుల గురించి యేసు బోధ

1 థెస్స 4-13-18

24:34 యేసు అంజూరపు చెట్టును గూర్చి చెప్పిన తర్వాత ఆయన ‘ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను’ అన్నాడు. ఈ తరం అంటే క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు జీవించి ఉన్నవారని అర్థం కాదు. వారంతా చనిపోయారు.

అయినా 24వ అధ్యాయంలోని సంఘటనలు యింకా మొదలు కాలేదు. మరి ఈ తరం అనడంలో ప్రభువు ఉద్దే శాన్ని రెండు వివరణల ద్వారా తెలుసుకోవచ్చు.

యఫ్. డబ్ల్యు. గ్రాంట్, యితరులు నమ్మిన భావం ఏమిటంటే ఈ సంగతులు ప్రారంభాన్ని చూసిన ఈ తరం ముగింపును కూడా చూస్తుంది. ఇశ్రాయేలీయులు ఒక జాతిగా కూడడం చూసిన ఈ ప్రజలు (లేక శ్రమల ప్రారంభాన్ని చూసిన ప్రజలు) యేసు ప్రభువు పరిపాలించడానికి ఆకాశ మేఘారూఢుడై రావడం కూడా చూస్తారు.

ఇక మరో వివరణేమిటంటే : ఈ తరం అంటే జాతి అని అర్థం చేసుకోవాలి. ఇది గ్రీకు పదానికి తగిన అనువాదం. దీని అర్థం అదే. జాతి ప్రజలు అంటే ఆ సంతానం లేక ఆ కుటుంబానికి చెందిన వారని అర్థం (మత్తయి 12:45, 23:35, 36).

కాబట్టి ఈ సంగతులన్నీ సంపూర్తి కావడం చూడ్డా నికి యూదా జాతి మిగిలి ఉంటుందని యేసు ముందుగానే చెప్పాడు. అత్యంత దుర్మార్గమైన, భయంకరమైన హింసలు జరిగినా వారి ఉనికి కొనసాగడం చరిత్రలోనే ఒక అద్భుతం.

నా ఉద్దేశంలో దానికి మరో భావం కూడా ఉంది. యేసు రోజుల్లోని ఆ తరం ఆయన్ను మెస్సీ యాగా అంగీకరించక, ఆయన్ను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఈ ఇశ్రాయేలు జాతి క్రీస్తు రెండో రాకడ వరకు క్రీస్తును తిరస్కరిస్తూనే ఉంటుందని యేసు ముందుగానే చెప్పాడని నా ఉద్దేశం.

ఆయన వచ్చినప్పుడు తిరుగుబాటుదారులందరూ నాశనం చేయబడతారు. ఆయన పాలనకు ఇష్టపూర్తిగా విధే యులైన వారు వెయ్యేళ్ళ పాలనలో ప్రవేశించడానికి నాశనం కాకుండా మిగిలి ఉంటారు.

24:35 తాను చెప్పిన ఈ మాటలు తప్పిపో వని నొక్కి చెప్పడానికి యేసు ‘ఆకాశమును భూమి యును గతించును గాని నా మాటలు ఏ మాత్రము గతింపవ’ని చెప్పాడు.

2 కొరింథీ 12-2-4

భూమ్యాకాశాలు గతించిపోవడం అన్నది 2 పేతురు 3:10 – 13 లోను మళ్ళీ ప్రకటన 20:11 లో వివరించి ఉంది.

ఆ రోజు, ఆ గడియ ఏదో తెలియదు (24:36-44)

24:36 యేసు రెండవ రాకడకు కచ్చితమైన రోజు, గడియ ‘తండ్రి మాత్రమే యెరుగునుగాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దేవదూత లైనను కుమారుడైనను ఎరుగరు.’ అలా ఆ తారీఖు లను రోజులను నిర్ణయించేవారిని నమ్మే శోధనకు లోనయ్యేవారికి యిది ఒక హెచ్చరిక.

దేవదూత లకు కూడా తెలియదని అంటే మనం ఆశ్చర్యపో నవసరంలేదు. వారు పరిమిత జ్ఞానంగల జీవులే.

క్రీస్తు పునరాగమనానికి ముందు జీవించి ఉన్న వారికి కూడా ఆ రోజు లేక ఆ గడియ ఎప్పుడో తెలియదు.

మత్తయి 24:42-25:30 వచనాలు

ప్రవచనం బాగా తెలిసిన వారు ఆ సంవత్సరం తెలుసుకోగలుగుతారని అనిపిస్తోంది. ఉదాహరణకు, దేవాలయంలో విగ్రహాన్ని స్థాపిం చిన తర్వాత సుమారు మూడున్నర సంవత్సరాలకు అది జరుగుతుందని వారికి తెలుసు.

మహా శ్రమలు

24:37-39 ఆ రోజుల్లో ఎక్కువమంది ‘నోవహు దినములలో ఎలా ఉండెనో’ అలాగే ఉపేక్షాభావంతో ఉంటారు. జల ప్రళయానికి ముందు రోజుల్లో భయంకరమైన దుర్మార్గం ఉన్నా, ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం అది కాదు. ప్రజలు తింటూ, త్రాగుతూ, పెళ్ళి చేసుకొంటూ, పెండ్లికిస్తూ ఉంటారు.

మరో మాటల్లో చెప్పుకొంటే వారు శాశ్వ తంగా జీవిస్తామన్న భావంతో జీవితంలో సాధారణ కార్యకలాపాలు చేసుకొంటూనే ఉంటారు. ప్రళయం రాబోతున్నదని హెచ్చరించినా, వారు జలప్రళయం ముంచుకువచ్చే వరకు చెక్కు చెదరని వారిలా జీవించారు.

తీరా జలప్రళయం వచ్చి నప్పుడు వారు సిద్ధపడి లేరు. సురక్షితమైన చోటుకు బయటవున్నారు. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు సరిగ్గా అలాగే ఉంటుంది. క్రీస్తులో ఉన్నవారు మాత్రమే సురక్షితమైన ఓడను పొందుతారు.

24:40,41 ‘ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు. ఒకడు తీసికొనిపోబడును, ఒకడు వెయ్యేళ్ళ పాలనలో ప్రవేశించడానికి విడిచిపెట్టబడతాడు. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచుంటారు. వారు ఉన్న పాటున వేరుచేయబడతారు. ఒకరు తీర్పు ప్రళ యంలో తుడిచివేయబడతారు.

మరొకరు క్రీస్తు పాలనా దీవెనలను ఆనందించడానికి విడిచి పెట్ట బడతారు (40,41 వచనాలను రక్షణ పొందని వారికి ఒక హెచ్చరికగా వాడారు). క్రీస్తు రాకడ మొదటి దశలో విశ్వాసులనందరిని ఆయన పర లోకానికి తీసుకొని వెళ్తాడు, అవిశ్వాసులను తీర్పు నిమిత్తం విడిచిపెడతాడు.

ఇది ఆ భాగానికి సరైన అన్వయం అయినప్పటికీ ఆ వివరణ సందర్భం క్రీస్తు పరిపాలించడానికి వస్తున్నాడని తెలియజేయడమే.

24:42-44 ఆ రోజుగాని, గడియగాని తెలి యదు కాబట్టి ప్రజలు దానికోసం కనిపెట్టి చూస్తూ ఉండాలి. ఒకని యిల్లు పడిపోయేలా ఉందని అతడు తెలుసుకొంటే అది ఎప్పుడు పడిపోతుందో సరిగ్గా తెలియకపోయినా అతడు దానిని బాగుచేసు కోడానికి సిద్ధపడతాడు.

ప్రజలు అసలు ఎదురు చూడని సమయంలో మనుష్యకుమారుడు వస్తాడు. కాగా, ఆయన ప్రజలు ఎదురుచూపుతో ముంగాళ్ళ మీద సిద్ధంగా ఉండాలి.

తెలివిగల, దుష్టులైన సేవకులను గూర్చిన ఉపమానం (24:45-51)

24:45-47 తన యజమాని తిరిగివచ్చే సందర్భంలో ఒక సేవకుడు ఏ విధంగా తన నిజ ప్రవర్తనను బయటపెట్టుకుంటాడో ఈ అధ్యాయం ముగింపు భాగంలో యేసు ప్రభువు వివరించాడు. పనివారికి ఆ యింటిలోని వారందరికీ తగిన సమ యంలో భోజనం పెట్టాల్సిన బాధ్యత ఉంది.

కాని క్రీస్తు సేవకులమని చెప్పుకొనేవారందరు నమ్మ దగినవారు కారు. ఏ సేవకుడు దేవుని ప్రజల విషయమై శ్రద్ధ వహిస్తున్నట్లు ఆయన దృష్టికి కన బడతాడో అతడు తెలివిగల సేవకుడు. అలాంటి వాడు దేవుని రాజ్యంలో గొప్ప బాధ్యతను పొందే గౌరవాన్ని పొందుతాడు. ఆ యజమాని ‘తన యావ దాస్తి మీద వాని నుంచును.’

24:48 – 51 ‘దుష్టుడైన దాసుడు’ తన యజ మాని త్వరలో వస్తున్నాడని తెలిసికూడా తన ప్రవ ర్తనలో ఏ మాత్రం మార్పు చూపని నామమాత్రపు విశ్వానికి సూచన. అతడు తన తోడి దాసులను కొట్టడం మొదలుపెట్టి, త్రాగుబోతులతో తింటూ, త్రాగుతూ ఉంటాడు.

అలాంటి ప్రవర్తన అతడు రాజ్య ప్రవేశానికి సిద్ధంగా లేడని తెలియజేస్తుంది. రాజు తిరిగి వచ్చినప్పుడు ఆయన అతని శిక్షించి ఎక్కడ ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ ఉండే వేషధారు లుంటారో అక్కడ వారితో పాలు నియమిస్తాడు.

ఈ ఉపమానం క్రీస్తు అందరికీ కనిపిస్తూ మెస్సీ యాగా ఈ భూమికి తిరిగి వచ్చే సందర్భాన్ని వివరిస్తోంది. అయితే ఈ సిద్ధాంతం అప్పుడు క్రీస్తుతో ఎత్తబడేవారికి కూడా సమానంగా అన్వ యించబడుతుంది.

మేము క్రైస్తవులం అని చెప్పు కొనే చాలామంది దేవుని ప్రజలపట్ల తమ విరోధ భావాన్ని చూపుతూ, భక్తిహీనులైన వారితో కలిసి పోయి క్రీస్తు రాకడ కొరకు ఎదురుచూడనివారిగా ఉంటారు. వారికి అది తీర్పే గాని దీవెన కాదు.

పదిమంది కన్యకల ఉపమానం (25:1-13)

25:1-5 మొదటి మాట ‘అప్పుడు’ 24వ అధ్యాయంలో రాజు భూమికి తిరిగి రావడానికి ముందు అన్న సమయాన్ని స్పష్టంగా వివరిస్తుంది. పరలోక రాజ్యము అప్పుడు ‘తమ దివిటీలు పట్టు కొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలు దేరిన పదిమంది కన్యకలను పోలియున్నది’ అని యేసు చెప్పాడు.

వీరిలో అయిదుగురు బుద్ధిగల వారు వారి దివిటీలకు నూనె తీసుకొని వెళ్ళారు. మిగిలిన అయిదుగురు తీసుకొని వెళ్ళలేదు. పెండ్లి కుమారుని కోసం ఎదురుచూస్తూ వారు కునికి నిద్రపోయారు.

బుద్ధిగల అయిదుగురు కన్యలు శ్రమలకాలంలో క్రీస్తుకు నమ్మకంగా ఉన్న శిష్యులకు ప్రతినిధులు. దివిటీలు వారి పనిని తెలియజేస్తున్నాయి. నూనె సామాన్యంగా పరిశుద్ధాత్మకు చిహ్నంగా ఉంటుంది. బుద్ధిలేని కన్యకలు మెస్సీయాను గూర్చిన నిరీక్షణ కలిగి ఉన్నామని చెప్పుకొనేవారికి ప్రతినిధులు.

నిజానికి వారెన్నడూ ఆ సత్యాన్ని హృదయంలో అంగీకరించలేదు కనుక వారిలో పరిశుద్ధాత్మ లేడు. పెండ్లి కుమారుడు రాజైన క్రీస్తు. ఆయన చేసిన ఆలస్యం క్రీస్తు రెండు రాకడల మధ్యకాలాన్ని సూచి స్తుంది. పదిమంది కన్యకలు నిద్రించడం అంటే, వారి మధ్య బాహ్యంగా చూపించదగిన బేధం ఎక్కువగా లేదు అని అర్థమవుతుంది.

25:6 అర్ధరాత్రివేళ ‘ఇదిగో పెండ్లి కుమారుడు’ వస్తున్నాడు అని ప్రకటించారు. ఆయన రాకడ భయభక్తులతో కూడిన సూచనలతో ప్రకటించబడు తుందని ముందు అధ్యాయంలో తెలుసుకొన్నాం.

ఒలీవల కొండ ప్రసంగం మరియు పరలోక రాజ్యం

25:7-9 అప్పుడు ‘ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి.” అందరూ సిద్ధంగా ఉన్నామని కనబడాలనుకొన్నారు. బుద్ధిలేని కన్య కలు తమ దగ్గర నూనెలేక మిగతా వారిని కొద్దిగా యిమ్మని అడిగారు కాని ‘మీరే వెళ్ళి కొనుక్కోమని’’ వారు జవాబిచ్చారు.

నూనె యివ్వడానికి తిరస్కరిం చిన బుద్ధిగలవారు స్వార్థపరుల్లా కనిపిస్తారు. కాని ఆత్మీయ రాజ్యంలో ఎవరూ కూడా తమ ఆత్మను మరొకరికి పంచిపెట్టరు. పరిశుద్ధాత్మను కొనలేం. కాని రక్షణను డబ్బు లేకుండా, ధర లేకుండా కొనుక్కోవచ్చనే ఒక సాహితీ ప్రక్రియను బైబిలు ఉపయోగించింది.

25:10-12 వారు నూనె కొనడానికి వెళ్ళి నప్పుడు పెండ్లి కుమారుడు వచ్చాడు. సిరియాక్, వల్గేట్ పాఠాంతరాలు ‘అతడు తన పెండ్లి కుమార్తెతో వచ్చాడు’ అని వివరిస్తున్నాయి.

యేసు ప్రభువు పెండ్లినుండి తన పెండ్లి కుమార్తె అయిన సంఘంతో తిరిగి వస్తాడు

క్రీస్తు భూలోకరాజ్యంలోని ఆనందానికి, ఆశీర్వాదానికి వివాహ విందు అన్నది తగిన పేరు. ‘బుద్ధిగల కన్యకలు అతనితోకూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతట తలుపు వేయబడెను.”

ఎవరికైనా పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి యిప్ప టికే చాలా ఆలస్యం అయింది. తర్వాత బుద్ధిలేని కన్యకలు వచ్చి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించి నప్పుడు పెండ్లి కుమారుడు వారెవరో తనకు తెలియదని వారిని లోపలకు అనుమతించలేదు. వారు అసలు ఎన్నడూ తిరిగి జన్మించలేదనే దానికిది స్పష్టమైన నిదర్శనం.

25:13 ‘ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి’ అన్నది యేసు చెప్పిన పాఠం. ప్రభువు ఏ సమయంలోనైనా రావచ్చునన్న భావంతో విశ్వాసులు జీవిస్తూ ఉండాలి. మన దివిటీలను నూనెతో నింపుకొనివెలిగించి ఉంచామా?

తలాంతుల ఉపమానం (25:14-30)

25:14-18 ప్రభువు తిరిగి వచ్చినప్పుడు నమ్మకమైన వారు, అబద్ధికులైన సేవకులు ఉంటా రని ఈ ఉపమానం వివరిస్తోంది. ఈ కథ దూర దేశం వెళ్ళే ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతడు దూరదేశం వెళ్ళక ముందు తన సేవకులను సమావేశపరచి వారి వారి సామర్థ్యాల ప్రకారం వారికి వేర్వేరు మొత్తాలను యిచ్చాడు.

ఒకనికి అయిదు తలాంతులను (ఒక తలాంతు యించు మించు 3,600 రూపాయలు), మరొకనికి రెండు, చివరివానికి ఒక తలాంతు యిచ్చాడు. వారు దానిని తమ యజమానికి ఆదాయం వచ్చేలా ఉప యోగించాలి.

అయిదు తలాంతులు తీసుకొన్న వ్యక్తి మరొక అయిదు తలాంతులను సంపాదించాడు. రెండు తీసుకొన్న వ్యక్తి దాన్ని రెట్టింపు చేశాడు. ఒకటి తీసుకొన్న వ్యక్తి వెళ్ళి గుంట త్రవ్వి దాన్ని అందులో పూడ్చిపెట్టాడు.

ఆ యజమాని క్రీస్తు అని, దూర ప్రయాణం రాకడకు మధ్యకాలమని గ్రహించడం కష్టం కాదు. ముగ్గురు సేవకులు శ్రమల కాలంలో జీవించి ఉండి అప్పుడక్కడ లేని ప్రభువుకు ఇష్టమైన పనులు చేయాల్సిన ప్రతినిధులైన ఇశ్రాయేలీయులు. వారి వ్యక్తిగత సామర్థ్యాలనుబట్టి ఆయన వారికి బాధ్యత లను అప్పగించాడు.

25:19-23 ‘బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారియొద్ద లెక్క చూచుకొనెను.” ఇది రెండవ రాకడను వివరిస్తోంది. మొదటి యిద్దరితో – ‘భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించె దను.

నీ యజమానుని సంతోషములో పాలు పొందుమ’ని చెప్పాడు. వారెంత సంపాదించారన్నది వారి సేవకు కొలమానం కాదు. కాని వారెంత కష్ట పడి పనిచేశారన్నదే కొలమానం.

వారు ఒక్కొక్కరు తమ సమర్థతలను పూర్తిగా ఉపయోగించి నూరు శాతం సంపాదించారు. వీరు నిజమైన విశ్వాసులకు ప్రతినిధులు. వారి ప్రతిఫలం మెస్సీయా రాజ్యంలో ఆశీర్వాదాలను పొంది ఆనందించడమే.

25:24,25 మూడో దాసుని దగ్గర తన యజ మానికి ఇవ్వడానికి అవహేళనలు, క్షమాపణలు తప్ప మరేమీ లేవు. ఆయన కఠినుడని, అన్యాయస్థు డని, విత్తనం చల్లని చోట పంట కూర్చుకొనువాడని యజమాని మీద నేరం మోపాడు.

ఇలాంటివానికి తాను సేవ చేయలేనని భయంతో తనను తాను సమర్థించుకొని తన తలాంతును పాతిపెట్టాడు. ఈ దాసుడు అవిశ్వాసి అనడంలో సందేహం లేదు. యథార్థ వర్తనుడైన ఏ దాసుడూ తన యజమానిని గూర్చి అలాంటి ఆలోచనలు చేయడు.

25:26, 27 అతని యజమాని ‘సోమరివైన చెడ్డ దాసుడా’ అని అతనిని గద్దించాడు. నీ యజ మానిని గూర్చి అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఆ సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచి వడ్డీకి యివ్వ వలసింది అన్నాడు.

ఒలీవల కొండ ప్రసంగం మరియు పరలోక రాజ్యం

కాని తన యజమాని ఆయ నపై మోపిన నేరాలను అతడు అంగీకరించలేదని 26వ వచనం చెబుతోంది. అందుకు ఆ యజమాని ‘నేను అలాంటి యజమానినని నీవనుకొన్నప్పుడు నీవా తలాంతును తప్పనిసరిగా ఉపయోగంలో ఉంచాల్సింది. నీ మాటలు నీపై తీర్పు తీరుస్తు న్నాయే గాని నిన్ను క్షమించడం లేదు’ అని అతనితో అన్నాడు.

25:28, 29 ఈ సేవకుడు తన తలాంతుతో మరొక తలాంతును సంపాదించి ఉంటే అతడు కూడా ఇతరులు పొందిన మెప్పునే పొంది ఉండే వాడు. దానికి బదులు అతనికి లభించిందల్లా జీవిత మంతా గడపడానికి ఒక నేలగుంట మాత్రమే. అతనికిచ్చిన తలాంతును అతనినుండి తీసివేసి పది తలాంతులున్నవానికి యిచ్చాడు.

దీనినిబట్టి ఆత్మీయ రంగంలో నిర్ణయించబడిన కొలమానం ఇదే. ‘కలిగిన ప్రతివాని కియ్యబడును. అతనికి సమృద్ధి కలుగును. లేనివాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును.” దేవుని మహి మార్థం ఉపయోగపడాలని కోరుకొనే వారికి దానికి తగిన వనరులు ఇవ్వబడతాయి.

వారెంత ఎక్కు వగా పనిచేస్తే అంత ఎక్కువగా ఆయనకోసం చేసే సమర్థత కలుగుతుంది. దానికి భిన్నంగా మనం వాడుకలో పెట్టని తలాంతు మననుండి తీసి వేయ బడుతుంది. సోమరితనానికి ప్రతిఫలం క్షీణించిపోవడమే.

27వ వచనంలోని ‘సాహుకారులు’ అనే మాట దేవుని కోసం మన వస్తుసముదాయాన్ని మనం ఉపయోగించలేకపోతే వాటిని ఉపయోగించగలిగే ఇతరులకు వాటినివ్వాలి అని సూచిస్తుంది.

నేటి సందర్భంలో సాహుకారులు అంటే మిషనెరీలు, క్రైస్తవ పుస్తక ప్రచురణాలయాలు, బైబిలు సొసైటీలు, రేడియో సువార్త కార్యక్రమాలు మొదలైనవని చెప్ప వచ్చు. మన ఈ ప్రపంచంలో ధనాన్ని ఖర్చుపెట్ట కుండా ఉంచడంలో క్షమాపణ లేదు.

25:30 ప్రయోజనం లేని ఆ సేవకుడు ఆ రాజ్యం నుండి బయటికి తరిమివేయబడ్డాడు. అతడు దుష్టులకు కలిగే వేదనాభరితమైన దుష్ఫలి తాన్ని పంచుకుంటాడు. అతనికి ఇవ్వబడిన ఆ తలాంతును పెట్టుబడిగా పెట్టకపోవడంవల్ల అతడు శిక్షించబడలేదు. కాని అతడు మంచి పనులు చేయక పోవడం అతనిలో రక్షణార్థమైన విశ్వాసంలేదని బయలుపరుస్తుంది.

రాజు దేశాలకు తీర్పుతీరుస్తాడు (25:31-46)

25:31 ఈ భాగం దేశాల తీర్పును గూర్చి వివరిస్తుంది. ఇది క్రీస్తు న్యాయపీఠంయొక్క తీర్పు, మహా ధవళ సింహాసనం నుండి తీర్పులకు వేరైనది.

క్రీస్తు న్యాయపీఠం తీర్పు విశ్వాసులను సమీక్షించి వారికి ప్రతిఫలమివ్వడానికి జరిగేది

క్రీస్తు భూమి మీద పరిపాలించడానికి వచ్చిన తర్వాత రాజ్యాలు, లేక అన్యులు (ఇక్కడి గ్రీకు పదానికి ఈ రెండు అర్థాలు ఉన్నాయి) తీర్పుతీర్చ బడతారు. ఈ విషయాన్ని 31వ వచనం స్పష్టంగా యిలా వివరిస్తోంది, ‘తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాస నము మీద ఆసీనుడైయుండును.

దీనిని యోవేలు 3 తో గుర్తించడం సరైనదైతే, ఆ తీర్పు జరిగే చోటు యెరూషలేము బయటనున్న యెహోషాపాతు లోయ (3:2).

25:32 ఈ తీర్పులో గొట్టెలు, మేకలు, క్రీస్తు సహోదరులు అన్న మూడు వర్గాలను ప్రస్తావిం చడం మనం గమనించాలి. క్రీస్తు తీర్పు తీర్చబో తున్న మొదటి రెండు వర్గాలు శ్రమల కాలంలో జీవించిన అన్యజనులు. మూడో వర్గం వారు శ్రమల కాలంలో ఎన్ని హింసలు ఎదురైనా ఆయన నామాన్ని తిరస్కరించక క్రీస్తుపట్ల నమ్మకంగా ఉన్న యూదా సహోదరులు.

25:33 – 40 ‘రాజు తన కుడివైపున గొట్టే లను, ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పు డాయన లోకము పుట్టినది మొదలుకొని’ వారి కొరకు సిద్ధపరచబడిన తన ఘనమైన రాజ్యంలో ప్రవేశించమని గొర్రెలను ఆహ్వానిస్తాడు.

ఆ యోగ్య తకు ఆయన చెప్పిన కారణం వారు ఆయన ఆకలి గొని ఉండగా ఆయనకు భోజనం పెట్టారు, దప్పి ఉండగా ఆయన్ను ఆదరించారు, దిగంబరిగా గొని ఉండగా దాహం తీర్చారు, ఆయన పరదేశిగా ఉండగా ఆయనకు బట్టలిచ్చారు, రోగిగా ఉన్న ప్పుడు ఆయన్ను దర్శించారు.

చెరసాలలో ఉండగా నీతిమంతులు తాము ఆ రాజుకు ఎప్పుడు దయ ఆయన దగ్గరకు వెళ్ళారు. అయితే ఆ గొట్టెలనే చూపించామో తమకు తెలియదే అని అన్నారు. వారి తరంలో ఆయన అసలీ భూమి మీదే లేడు.

అందుకాయన ‘మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరు లలో ఒకనికి సహాయం చేశారు కాబట్టి నాకు చేసినట్టే’ అన్నాడు. ఆయన శిష్యులలో ఒకరికి ఏమి చేసినా అది ఆయనకు చేసినట్టే పరిగణించబడి వారు దానికి తగిన ప్రతిఫలం పొందుతారు.

25:41 – 45 దుర్నీతిపరులైన మేకలతో యాకోబు శ్రమలవంటి భయంకరమైన కష్ట కాలంలో తన గురించి పట్టించుకోలేదు గనుక తను విడిచి ‘అపవాదికిని వాని దూతలకును సిద్ధ పరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి’ అని చెప్పాడు.

తాము ఆయనను ఆ పరిస్థితులలో ఎప్పుడూ చూడ లేదని సమర్థించుకో చూడగా, వారు తన అనుచరు లను అశ్రద్ధ చేస్తే తనను అశ్రద్ధ చేసినట్లే అని వారితో చెప్పాడు.

25:46 అలా మేకలు నిత్య శిక్షకు, గొట్టెలు నిత్యజీవానికి వెళ్ళారు. కాని యిది రెండు సమస్య లను లేవనెత్తుతుంది. మొదటిది, రాజ్యాలు సామూ హికంగా రక్షణ పొందాయి లేక నశించిపోయాయి అని ఈ భాగం బోధిస్తున్నట్లు కనిపిస్తుంది.

రెండోది, గొట్టెలు తమ మంచి పనులవలన రక్షణ పొందా యని, మేకలు మంచి పనులు చేయలేక పోయి నందున శిక్ష పొందాయన్న అభిప్రాయం కలుగు తుంది.

మొదటి చిక్కు విషయంలో దేవుడు రాజ్యా లతో వ్యవహరించే విధానమదేనని జ్ఞాపకం చేసుకో వాలి. తమ పాపంవలన శిక్షను అనుభవించిన రాజ్యాలను గూర్చి పాత నిబంధన చరిత్ర అనేక సందర్భాలను తెలియజేస్తోంది (యెషయా 10:12 -19; 47:5-15; యెహెజ్కేలు 25:6,7; ఆమోసు 1:3,6,9,11,13; 2:1,4,6, ఓబద్యా 10; జెకర్యా 14:1-5).

దేశాలు దేవుని ప్రతీకారాన్ని అనుభ విస్తూనే ఉంటాయి అని నమ్మడం సమంజసమే. అలాగని ఒక దేశంలో ప్రతి వ్యక్తీ ఆ ప్రతీకారం క్రిందనే ఉంటాడని అర్థం కాదు. కాని దైవిక న్యాయసిద్ధాంతాలు జాతీయంగాను, వ్యక్తిగతం గానూ కూడా అన్వయిస్తాయి.

‘ఎతెనె’ అనే పదం దేశాలు (లేక జాతులు) అని ఇక్కడ అనువదించారు. దానిని ‘అన్యులు’ అని కూడా అనువదించవచ్చు. ఈ భాగం అన్యు లలో ఒక్కొక్క వ్యక్తి ఎదుర్కొనే తీర్పును వివరిస్తుం దని కొందరి నమ్మకం.

అవి దేశాలు గాని వ్యక్తులు గాని అంత విస్తారమైన గుంపు పాలస్తీనాలో ప్రభువు ముందు ఎలా సమావేశపరిచారన్నది కూడా ఒక సమస్య. బహుశ ఆయా జాతుల ప్రతినిధులు లేక ప్రజల వర్గాల ప్రతినిధులు ఆ తీర్పుకు సమావేశం అవుతారని అనుకోవడం బాగుంటుందేమో.

రెండవ సమస్యకు సంబంధించి ఈ భాగం క్రియల మూలంగా రక్షణ లభిస్తుందని బోధించ డానికి ఉపయోగించ కూడదు. రక్షణ విశ్వాసం వల్లనే గాని క్రియలవలన కాదు అన్నది బైబిలు సూత్రం (ఎఫెసీ 2:8,9). నిజమైన విశ్వాసం మంచి క్రియలు చేయిస్తుంది అని బైబిలు బోధ నొక్కి చెబుతుంది.

ఒకవేళ మంచి పనులు లేకపోతే ఆ వ్యక్తి రక్షణ పొందలేదని దాని భావం. కనుక యూదులలో నమ్మకంగా ఉండి శేషించినవారికి సహాయం చేసినందువలన రక్షణ పొందారని చెప్ప కూడదు. అయితే వారి దయగల కార్యాలు వారికి ప్రభువుపట్ల గల ప్రేమను ప్రతిబింబిస్తాయి.

ఇంకా మరో మూడు అంశాలను చెప్పాలి. మొదటిది నీతిమంతులకు ఇవ్వబడిన రాజ్యం వారి కోసం ఈ ‘లోకం పుట్టినది మొదలుకొని సిద్ధపరచ బడింది’ (వ.34). అయితే నరకం అపవాదికి, అతని దూతలకు సిద్ధపరచబడింది (వ.41). మాన వులను ఆశీర్వదించాలని దేవుని కోరిక. నరకం మానవుల కోసం ఉద్దేశించింది కాదు. కాని వారు తమ ఇష్టపూర్తిగా జీవాన్ని తిరస్కరిస్తే తప్పనిసరిగా మరణాన్ని ఎంచుకొన్నట్టే.

రెండవ అంశం యేసు ప్రభువు నిత్యమైన (అనంతమైన) అగ్ని (వ. 41) నిత్య నరకం (వ.46) నిత్యజీవం (వ.46) గూర్చి చెప్పాడు. నిత్యజీవం గురించి చెప్పిన వ్యక్తే నిత్యశిక్ష గూర్చి కూడా బోధిం చాడు. ఆ రెండింటినీ వివరించడానికి నిత్యమైన అన్న ఒకే పదం ఉండడాన్నిబట్టి ఒక దాన్ని అంగీక రించి, మరొక దాన్ని తిరస్కరించడం పరస్పర విరుద్ధంగా ఉంది.

ఒలీవల కొండ ప్రసంగం మరియు పరలోక రాజ్యం

1 తిమోతి 1-17

చివరిగా, క్రీస్తు, ఆయన ప్రజలు ఒక్కటే అని, వారికేది జరిగినా అది ఆయనకు జరిగినట్టేనని ఈ అన్యజాతులపై తీర్పు మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన్ను ప్రేమించేవారి పట్ల దయ చూపించడం ద్వారా ఆయనపై దయ చూపే అవకాశం మనకు ఎంతైనా ఉంది.