కృపాసత్య సంపూర్ణుడు – Bible Verses Chapter 21 in Telugu

ఇరువది ఒకటవ అధ్యాయము

కృపాసత్య సంపూర్ణుడు

గలిలయలో క్రీస్తు శిష్యులకు ప్రత్యక్షపరచుకొనుట (21:1-14) :

21:1 సన్నివేశం ఇప్పుడు తిబెరియ (గలిలయ) సముద్రమునకు మారినది. శిష్యులు ఉత్తరముగా ప్రయాణించి గలిలయలోని తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు. వారిని ప్రభువు అక్కడ కలుసుకున్నాడు.

21:2 శిష్యులలో ఏడుగురు ఆ సమయములో అక్కడ కూడుకొనియున్నారు. వారు – పేతురు, తోమా నతానియేలు, యాకోబు, యోహాను (జెబెదయ యొక్క ఇద్దరు కుమారులు), మరియు మనకు పేర్లు తెలియని మరి ఇద్దరు.

21:3 సముద్రములో చేపలు పట్టుటకు వెళ్ళడానికి పేతురు నిర్ణయించుకున్నాడు. మిగిలినవారు కూడా అతనితో వెళ్ళడానికి అంగీకరించారు. వారు అలా వెళ్ళడం దేవుని చిత్తంలో లేదని మరియు వారు ముందుగా ప్రార్థించకుండా వెళ్ళారని అనేకులు అభిప్రాయపడినప్పటికీ, ఇది చాలా సర్వసాధారణమైన నిర్ణయంగా కన్పిస్తుంది.

ఆ రాత్రి వారు ఏమీ పట్టలేదు చేపలు పట్టడంలో రాత్రంతా గడిపినా, ఫలితం లేకుండా ఉండటానికి, వారు క్రొత్తగా వృత్తిని చేపట్టిన జాలరులేమీ కాదు. “దైవికమైన సహాయము లేని మానవ ప్రయత్నాలు వ్యర్థమగును” (ముఖ్యంగా ఆత్మల సంపాదనలో) అనుదానికి ఇది చక్కని దృష్టాంతముగా ఉన్నది.

21:4 తెల్లవారు జామున వారు తమ నావను తీరమునకు నడిపిస్తూ ఉండగా యేసు వారికోసం వేచిచేస్తూ ఉన్నాడు. అయితే వారాయనను గుర్తుపట్టలేదు. బహుశ అప్పటికి ఇంకా చీకటిగా ఉండియుండవచ్చు లేక దేవుని శక్తివల్ల వారు ఆయనను ఎరుగకుండా ఆటంకపరచబడియుండవచ్చు.

Read and Learn More Telugu Bible Verses

21:5 యేసు – పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైన ఉన్నదా అని వారిని అడుగగా ఎంతో నిరుత్సాహముతో వారు ‘లేదు’ అని సమాధానమిచ్చారు.

21:6 వారికి తెలిసినంతవరకు అతడు తీరంవెంబడి నడచి వెళ్ళుచున్న ఒక అపరి చితుడు మాత్రమే. అయినప్పటికీ ఆయన ఆజ్ఞచొప్పున నావకు కుడివైపున వారు వల వేయగా చేపలు విస్తారముగా పడ్డాయి! వారు వలను లాగలేకపోయారు.

బాప్తిస్మమిచ్చు యోహాను సాక్ష్యము (1:19-34) :

చేపలు సముద్రంలో ఎక్కడున్నాయో యేసుకు బాగా తెలుసు. అదేవిధంగా ఆయన మన సేవనుకూడా నడిపించినప్పుడు ఇంక ఖాళీ వలలు ఉండవు. రక్షించబడుటకు సిద్ధముగా ఉన్న ఆత్మలు ఎక్కడున్నాయో ఆయనకు తెలుసు. మరియు మనము ఆయనను అనుమతిస్తే, ఆ ఆత్మల యొద్దకు మనలను నడిపించుటకు ఆయన ఇష్టపడుచున్నాడు.

21:7 యోహాను ముందుగా ప్రభువును గుర్తించి, పేతురుతో చెప్పాడు పేతురు అది విని, వస్త్రహీనుడై యున్నందున పైబట్టవేసికొని సముద్రంలో దుమికాడు, ఒక వ్యక్తి తనపై బట్ట (out side coat) ధరించి యుండకపోతే, అతనిగూర్చి ‘వస్త్రహీనుడు’ (naked) అనుమాట బైబిలునందు సాధారణంగా వాడబడింది. యూదుల ఆలోచనా విధానాన్నిబట్టి ఇక్కడ పేతురుకూడా వస్త్రహీనుడుగా ఉన్నాడని చెప్పవచ్చు.

21:8 మిగిలిన శిష్యులు చేపలుపట్టే పెద్దనావ నుండి ఒక చిన్న దోనెలోనికి వచ్చి, వలను లాగుతూ, ఇంకా 300 అడుగుల దూరంలో ఉన్న తీరానికి చేరారు. 21:9 రక్షకుడు అప్పటికే నిప్పులపై కాల్చబడిన చేపలను, రొట్టెలను వారికి అల్పా హారముకొరకై సిద్ధంచేశాడు.

ప్రభువు ఆ చేపలను పట్టాడో లేక అద్భుతముగా వాటిని పొందాడో మనకు తెలియదు. కాని మన బలహీన ప్రయత్నాలపై ఆయన ఆధారపడి లేడు అనే విషయం దీనినుండి మనకర్ధమవుతుంది.

మనము పరలోకమునకు వెళ్ళి నప్పుడు, సువార్త బోధ మరియు వ్యక్తిగత సాక్ష్యములద్వారా రక్షించబడిన అనేకులతో పాటు, ఎలాంటి మానవ సహాయం లేకుండా ప్రభువు తానే రక్షించుకొనిన అనేకులు కూడా అక్కడ ఉంటారని మనము తెలుసుకుంటాము.

దీనిలో సందేహము లేదు. చేపలతో నిండిన వలను తీసికొని రమ్మని ప్రభువు ఇప్పుడు వారితో చెప్పాడు. వాటిని వండుటకు కాదుగాని, లెక్కపెట్టుటకు. ఇలా చేస్తూ ఉన్నప్పుడు “ఆయన ఆజ్ఞకు లోబడి పనిచేయడం మరియు ఆయన వాక్యమునకు సంపూర్ణ విధేయత కలిగి నడచుకోవడం ఇదే విజయ రహస్యం” అనే విషయం వారికి జ్ఞాపకానికి వచ్చి వుంటుంది.

వలలో కచ్చితంగా 153 చేపలున్నాయి. ఆ కాలములో ప్రపంచములో ఉన్న భాషల సంఖ్యను; ప్రపంచములోని ఏ జాతుల, తెగలవైపు సువార్త వల విసరబడనైయుందో వాటి సంఖ్యను; మరియు గలిలయ సముద్రములోని వివిధరకాలైన చేపల సంఖ్యను సూచించడానికి ఈ సంఖ్య తీసికోబడింది.

సువార్త ప్రకటనద్వారా ప్రతి జాతి మరియు ప్రతి దేశములో రక్షింపబడనైయున్న వేర్వేరు రకముల మనుష్యులనుగూర్చి ఇది చెబుతున్నది అనడంలో సందేహంలేదు. ఇన్ని చేపలు పడినా వల చిరగకపోవడం విశేషం అని జాలరులకు తెలుసు.

కృపాసత్య సంపూర్ణుడు Bible Verses Chapter 21

“దేవుని పద్ధతుల్లో జరిగే దేవుని పనికి దేవుని వనరులు ఎప్పుడూ తక్కువకావు” అను సత్యమునకుకూడా ఇది ఒక ఋజువుగా ఉంది. వల పిగిలిపోకుండా ఆయనే చూచుకుంటాడు.

21:12 అల్పాహారానికి ఆహ్వానించబడిన శిష్యులు, ప్రభువు సిద్ధము చేసిన మంచి వాటిలో పాలుపొందడానికి ఆ నిప్పులచుట్టూ చేరారు.

ఆ నిప్పులను, మంటలను చూచినప్పుడు పేతురు తాను ప్రభువును ఎరుగనని బొంకినప్పుడు, చలి కాచుకోవ డానికి ఏ మంటవద్ద ఉన్నాడో అది అతనికి గుర్తుకు వచ్చిందా? ప్రభువు సన్నిధిలో ఒక విధమైన భయము, గంభీరతతో కూడిన వింతైన భావాన్ని శిష్యులు అనుభవించారు.

ప్రభువును ఎన్నో ప్రశ్నలు అడగాలని వారు అనుకొనియుంటారు. కాని వారు ధైర్యం చేయలేకపోయారు. ఆయన ప్రభువని వారు గ్రహించారు.

21:13 ప్రభువు వారికి ఆ అల్పాహారాన్ని పంచిపెట్టాడు. కొద్ది రొట్టెలు, చేపలతో ఐదువేలమందికి ఆయన ఆహారం పెట్టిన సందర్భము బహుశ ఈ సమయంలో వారికి జ్ఞాపకం వచ్చివుంటుంది.

21:14 “యేసు మృతులలోనుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది యిది మూడవసారి” అని యోహాను చెప్పుచున్నాడు. అనగా దీనిగూర్చి యోహాను తన సువార్తలో ప్రస్తావించడం యిది మూడవసారి.

అయితే ప్రభువు ప్రత్యక్షమైన సందర్భాలు ఇంకా ఉన్నట్లుగా మిగిలిన సువార్తల వలన మనకు స్పష్టమవుతుంది. యోహాను సువార్తలో – ఆయన పునరుత్థానుడైనరోజు సాయంత్రం మొదటి సారిగా శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు; ఒక వారము తరువాత మరల కన్పించాడు; ఇప్పుడు గలిలయ సముద్ర తీరాన ప్రత్యక్షమయ్యాడు.

పేతురుతో సంభాషణ (21:15-17) :

21:15 ప్రభువు మొదటిగా వారి భౌతిక అవసరాలను తీర్చాడు. వారు తిని తృప్తి పొందిన తరువాత ఆయన పేతురువైపు తిరిగి ఆత్మీయ విషయాలనుగూర్చి మాట్లాడాడు.

పేతురు మూడుసార్లు బహిరంగంగా ప్రభువును ఉపేక్షించియున్నాడు ఆ తర్వాత అతడు పశ్చాత్తాపపడి తిరిగి ప్రభువుతో సహవాసంలోకి చేర్చబడ్డాడు. ఈ వచనాల్లో పేతురుయొక్క సమాధానపడిన స్థితిని ప్రభువు బహిరంగంగా సమ్మతించాడు.

ప్రేమకు పర్యాయపదాలుగా రెండు వేరవేరు మాటలు ఇక్కడ వాడబడినవి. 15వ వచనాన్ని వేరే మాటలలో ఈ విధంగా చెప్పవచ్చు – “యోహాను కుమారుడవైన సీమోను, ఈ మిగిలిన శిష్యులు నన్ను ప్రేమించినదానికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమించుచున్నావా?” అందుకతడు – ‘అవును ప్రభువా, నేను నీ స్నేహితుడనని నీకు తెలుసు’ అని ఆయనతో చెప్పాడు.

మిగిలిన శిష్యులందరూ విడిచిపెట్టినా తాను ఎన్నటికీ ప్రభువును విడువనని ఇకపై అతడు డంబాలు చెప్పలేదు. అతడు తన పాఠాన్ని నేర్చుకున్నాడు. ‘నా గొఱ్ఱపిల్లలను మేపుము’ అని యేసు చెప్పాడు.

క్రీస్తుకొరకైన ప్రేమను చూపించుటకు ఒక మంచి ఆచరణాత్మకమైన విధానమేమనగా – ఆయన మందలోని పిల్లలను మేపుట. ఈ సంభాషణ ‘చేపలు పట్టడం’ దగ్గరనుండి ‘మందను కాయడం’ వరకు మారడాన్ని గమనించండి మొదటిది – సువార్త ప్రకటనను, రెండవది – బోధించుట మరియు కాపరిగా సంరక్షించుటను సూచిస్తున్నాయి.

21:16 రెండవ సారి ప్రభువు – ‘నన్ను ప్రేమించుచున్నావా?’ అని పేతురును అడిగాడు. పేతురు, తననుతాను పూర్తిగా తగ్గించుకొన్నవాడై రెండోవసారికూడా, ‘నేను నీ స్నేహితుడనని నీకు తెలుసు’ అని జవాబిచ్చాడు.

ఈ సారి ప్రభువు, ‘నా గొట్టెలను కాయుము’ అని చెప్పాడు. ప్రభువుయొక్క మందలో గొట్టెపిల్లలు మరియు గొట్టెలు ఉంటాయి. కాపరిని ప్రేమించేవానియొక్క ప్రేమతో కూడిన సంరక్షణ వాటికెంతో అవసరము.

21:17 పేతురు ప్రభువును మూడుసార్లు ఉపేక్షించినందున, ఆయనను ఒప్పుకొను టకు అతనికి మూడు అవకాశాలు ఇవ్వబడ్డాయి. ఈ సారి పేతురు ‘యేసు, దేవుడైయున్నాడు, కాబట్టి ఆయన సమస్తమును ఎరిగినవాడు’ అనే వాస్తవాన్ని విన్నవిస్తున్నాడు.

మూడవసారికూడా అతడు, ‘నేను నీ స్నేహితుడనని నీ వెరుగుదువు’ అని చెప్పాడు. చివరిగా, క్రీస్తుయొక్క గొట్టెలను మేపడంద్వారా తన ప్రేమను చూపించు మని ప్రభువు అతనితో చెప్పాడు. ఈ లేఖన భాగములో దాగియున్న సత్యమేమనగా- క్రీస్తును సేవించడము వెనుక ఉండవలసిన ఒకే ఒక ఉద్దేశ్యము – ఆయనకోసమైన ప్రేమ మాత్రమే.

పేతురు మరణమునుగూర్చి ముందుగా చెప్పబడుట (21:18-23): 21:18

యౌవనుడుగా ఉన్నపుడు పేతురు ఎంతో స్వాతంత్ర్యాన్ని అనుభవించాడు. తనకిష్టమైన చోటికి అతడు వెళ్ళాడు. కాని అతని జీవితపు చివరి రోజుల్లో అతడు బంధించబడి, చంపబడటానికి తీసికొనిపోబడతాడని ఇప్పుడు ప్రభువు అతనితో చెప్పాడు.

21:19 పేతురు హతసాక్షిగా మరణించి దేవుని మహిమపరచనైయున్నాడు. ప్రభువును ఎరుగునని బొంకినవానికి ఆయనకోసం ప్రాణాన్ని అర్పించగల ధైర్యం అనుగ్రహించబడింది.

మన జీవితముద్వారా మాత్రమే కాక మరణంద్వారాకూడా దేవుని మహిమపరచగలము. అప్పుడు ప్రభువు – ‘నన్ను వెంబడించు’ అని చెప్పాడు. ఆయన ఈ మాట పలికినపుడు, వెళ్ళడానికి అతడు సిద్ధమై యుండియుంటాడు.

21:20 పేతురు ప్రభువును వెంబడించడం ఆరంభించినట్లుగా ఇక్కడ కన్పిస్తుంది. అప్పుడతడు వెనక్కు తిరిగి యోహానుకూడా వెంబడిస్తూ ఉండటం చూచాడు. ఈ వృత్తాంతాన్ని వ్రాస్తూ యోహాను తననుగూర్చి, ‘యేసు ప్రేమించినవాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని – ప్రభువా, నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు’ అని చెప్పుచున్నాడు.

21:21 పేతురు, యోహానును చూచినపుడు “యోహాను సంగతేమిటి? అతడు కూడా హతసాక్షిగా మరణించబోతున్నాడా? లేక ప్రభువు తిరిగి వచ్చువరకు ఇంకా బ్రతికేవుంటాడా?” అను ఆలోచన అతని మదిలో మెదిలింది. యోహాను భవిష్యత్తును గూర్చి అతడు ప్రభువునడిగాడు.

21:22 యోహానుయొక్క అంతమునుగూర్చి నీవు పట్టించుకోనవసరంలేదు, అని ప్రభువు పేతురుతో చెప్పాడు. క్రీస్తుయొక్క రెండవ రాకడవరకు అతడు జీవించియున్నా, దీనివల్ల పేతురుకు ఒరిగేదేమీ లేదు.

క్రీస్తు శిష్యులైనవారు నేడు ప్రభువునుగూర్చిగాక, ఒకరి విషయాలనుగూర్చి ఒకరు ఎక్కువగా ఆసక్తికలిగి యుండటంవల్లనే ‘క్రైస్తవ పరిచర్య’లో అనేక అపజయాలు తలెత్తుతున్నాయి.

21:23 ప్రభువు పలికిన ఈ మాటలు అటుతరువాత అనేకులచేత తప్పుగా ఉ దాహరించబడ్డాయి. తాను తిరిగివచ్చువరకు యోహాను ఇంకా సజీవంగా ఉంటాడని ఆయన చెప్పలేదు.

‘నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి’ అని మాత్రమే ఆయన పేతురుతో అన్నాడు. యేసు ఇక్కడ యోహానును తన రెండవ రాకడ సందర్భముతోకూడా కలిపి ప్రస్తావించాడు. అనుకోని విధంగా ఈ యోహానే, అంత్యదినములనుగూర్చి ఎంతో విపులముగా వివరించబడిన చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథమును వ్రాశాడు.

క్రీస్తునుగూర్చి యోహానుయొక్క ముగింపు సాక్ష్యము (21:24,25):

21:24 యోహాను, తాను వ్రాసిన సంగతులకు కచ్చితత్వముకోసం తన స్వంత సాక్ష్యాన్ని ఇప్పుడు చేర్చుచున్నాడు.
“యేసు చేసిన కార్యములు ఇంకను

21:25 యోహాను ఇలా వ్రాశాడు అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన యెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ఆమేన్.” దీనిని మనము అక్షరార్ధముగానే తీసికోవచ్చును.

యేసు, దేవుడు కావున ఆయన అనంతుడుగా ఉన్నాడు. ఆయన మాటల అర్థమునకు లేక ఆయన పనుల సంఖ్యకు అంతములేదు. ఆయన భూమిపై ఉన్నప్పుడుకూడా సూర్యచంద్ర నక్షత్రాలు మొదలగువాటన్నిటికి ఆయనే ఆధారభూతుడుగా ఉన్నాడు.

ఈ అనంత విశ్వాన్ని చలనంలో ఉంచడానికి దోహదపడిన వాటన్నిటినిగూర్చి ఎవరు వివరించగలరు? ఆయన భూమిపై చేసిన సూచక క్రియలనుగూర్చికూడ చాలా స్వల్పమైన వివరణనే మనము కలిగియున్నాము.

బాప్తిస్మమిచ్చు యోహాను సాక్ష్యము (1:19-34) :

 

ఒక చిన్న స్వస్థత కార్యమును గమనిస్తే – ఆయన సరిచేసిన నరములు, కండరాలు, రక్తకణాలు మరియు ఇతర అవయవాలనుగూర్చి ఆలోచించండి. క్రిమి కీటకాలు, చేపలు, జంతువుల జీవితాలను ఆయన నడిపించుచున్న విధానాన్ని గూర్చి ఆలోచించండి.

విశ్వములోని ప్రతి పదార్థముయొక్క అణు నిర్మాణముపై ఆయనకున్న అధికారమునుగూర్చి ఆలోచించండి. ఇటువంటి అనంతమైన వివరాలను వర్ణించే పుస్తకాలను ఈ భూలోకము కలిగియుండగలదా? దీనికి జవాబు కచ్చితముగా ‘లేదు’ అని నొక్కి చెప్పగలము.

ప్రియ చదువరీ! యోహాను సువార్తలోని ధ్యానాల ముగింపుకు మనము వచ్చాము. బైబిలులోని అతి ప్రియమైన భాగాలలో ఒకటిగా ఇది ఎందుకు ఎంచబడిందో బహుశ కొద్దిగానయినా నీకు అర్థమై యుంటుంది. ఈ యోహాను సువార్తను ఆలోచనా పూర్వకముగా మరియు ప్రార్థనాపూర్వకముగా చదివినవారెవరైనా అది చూపించుచున్న పావనుడగు ప్రభువుతో నూతనముగా ప్రేమలో పడకపోవడం దుర్లభము!

 

Leave a Comment