ఇరువదియవ అధ్యాయము
పునరుత్థానుడైన ప్రభువు
20:1 వారములో మొదటి దినము ఆదివారము. మగ్దలేనే మరియ తెల్లవారక ముందే సమాధి దగ్గరకు వచ్చింది. ఈ సమాధి బహుశ ఒక కొండలో తొలచబడిన చిన్న గదిలాంటిదై యుండవచ్చు. సమాధిమీద ఉంచబడిన రాయి నిస్సందేహంగా ఒక నాణెము ఆకారములో గుండ్రముగా మరియు చదునుగా ఉండి ఉంటుంది.
అది సమాధి ఎదుటనున్న ఒక గాడిలో అమర్చబడి, దానిని దొర్లించి, సమాధిని మూయుటకు వీలుగా ఏర్పాటుచేయబడినది. మరియ వచ్చేటప్పటికే రాయి దొర్లించబడి ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయములో మనము నేర్చుకొనిన విధముగా క్రీస్తు పునరుత్థానుడైన తరువాత అకస్మాత్తుగా ఇది సంభవించింది.
20:2 మరియు వెంటనే పరుగెత్తుకొని పేతురు, యోహానులయొద్దకు వెళ్ళి ప్రభువు దేహమును సమాధిలోనుండి ఎవరో తొలగించారని చెప్పింది. ఆ పని ఎవరు చేశారో ఆమె చెప్పలేదు కాని తనకు అంతా తెలుసన్నట్లుగా ‘వారు’ అని మాత్రం చెప్పింది.
పునరుత్థానుడైన ప్రభువు బైబిల్‌లో
మన ప్రభువు సిలువ వేయబడినప్పుడు మరియు పునరుత్థానుడైనప్పుడు స్త్రీలయొక్క నమ్మకత్వము మరియు భక్తి గమనించదగినది. శిష్యులయితే ప్రభువును విడిచిపెట్టి పారిపోయారు. కాని ఈ స్త్రీలు తమ స్వంత క్షేమాన్నికూడా లక్ష్యపెట్టక ఆయన ప్రక్క నిలిచారు.
20:3 పేతురు, యోహానులు త్వరపడి పట్టణమునుండి కల్వరికొండకు సమీపమున ఉన్న ఆ తోటవైపుకు పరుగెత్తుతూ ఉన్నప్పుడు ఏమి ఆలోచిస్తూ ఉన్నారో ఊహించడం కష్టము.
Read and Learn More Telugu Bible Verses
20:4 పేతురు కంటే యోహాను బహుశ చిన్నవాడై యుండటంవల్ల అతడు త్వరగా పరుగెత్తి ఖాళీ సమాధిని ముందుగా చేరాడు.

20:5 సమాధిలోకి ఎవరైనా ప్రవేశించాలన్నా, లోపలికి చూడాలన్నా క్రిందగా ఉన్న ద్వారమువల్ల వారు వంగవలసిన అవసరం ఉంది. నారబట్టలు పడియుండటం యోహాను చూశాడు. నారబట్టలు దేహానికి ఏ విధంగా చుట్టబడ్డాయో, బహుశ అదే ఆకారములో అవి అక్కడ ఉండియుండవచ్చు. యోహాను సమాధిలో ప్రవేశించలేదు.
20:6 ఈ లోగా పేతురు వచ్చి తన సహజమైన దూకుడు వైఖరితో ఏ మాత్రం సందేహించకుండా సమాధిలో ప్రవేశించాడు. అతడుకూడా నారబట్టలు పడియుండటం చూచాడు. కాని రక్షకుని దేహము అక్కడలేదు.
20:7 “ఆయన తలరుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టి పెట్టి యుండుటయు చూచెను”. ప్రభువు ఆ స్థలమును విడిచిపెట్టడమనేది ఏదో తొందరపాటుగా జరిగినది గాక ఒక పద్ధతి ప్రకారం జరిగింది అని చూపడానికి ఈ వివరణ చేర్చబడింది. ప్రభువు దేహమును ఎవరైనా దొంగిలించివుంటే, వారు తల రుమాలును జాగ్రత్తగా చుట్టిపెట్టి ఉంచరు.

20:8 యోహాను పేతురును వెంబడించి సమాధిలోనికి వెళ్ళి నారబట్టలు మరియు తల రుమాలు ఒక క్రమపద్ధతిలో ఉండటం చూశాడు. “అతడు.. చూచి నమ్మెను” అనగా అప్పుడు అతడు గ్రహించాడు. అతని యెదుట క్రీస్తు పునరుత్థానానికి సంబంధించిన సాక్ష్యాధారాలున్నాయి.
20:9 మెస్సీయా మృతులలోనుండి తిరిగిలేస్తాడు అని చెప్పుచున్న లేఖనాలను ఇంకను ఆ శిష్యులు నిజముగా అర్థం చేసుకోలేదు. ప్రభువు, తానే ఆ విషయమును గూర్చి వారికి ఎన్నోసార్లు చెప్పాడు గాని వారు దానిని గ్రహించలేదు.
20:10 దీనిని గ్రహించింది. మొదటిగా యోహానే. పేతురు, యోహానులు బహుశ యెరూషలేములో తాము బసచేసిన స్థలాలకు తిరిగివెళ్ళిపోయారు. సమాధి యొద్ద వేచియుండటంలో ఏమీ అర్థంలేదు. వారేమి కనుగొన్నారో దాన్ని మిగిలిన శిష్యులకు చెప్పడమే ఉత్తమమైనది.
యేసు మరియకు కన్పించుట (20:11-18)
20:11 ఈ వచనంలోని ‘అయితే మరియ’ అనే మొదటి రెండు మాటలు గమనించ దగినవి. మిగిలిన ఇద్దరు శిష్యులు ఇంటికి వెళ్ళి పోయారు, అయితే మరియ …. ఇక్కడకూడ ఒక స్త్రీ యొక్క ప్రేమ మరియు భక్తిభావం మనకు కన్పిస్తుంది.
ఆమె విస్తారంగా క్షమించబడింది; కాబట్టి ఆమె విస్తారంగా ప్రేమించింది. బహుశ ప్రభువు యొక్క శత్రువులు ఆయన దేహమును దొంగిలించారేమో అని ఆమె తలంచి సమాధి బయటే ఏడుస్తూ నిల్చొని ఉంది.
20:12 అప్పుడామె లోపలికి వంగిచూడగా ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో ఆమెకు కన్పించారు. ఈ అద్భుతమైన వాస్తవాలు గొప్ప భావోద్రేకంతో కాక ఎంతో నిశ్చలంగా ఎలా చెప్పబడ్డాయో అది గమనించదగినది.
20:13 మరియ భయపడినట్లుగాని, ఆశ్చర్యపడినట్లుగాని మనకు కన్పించదు ఇది ఎంతో సాధారణమైన అనుభవం అన్నట్లుగా ఆమె వారి ప్రశ్నకు జవాబిచ్చింది. యేసు తిరిగిలేచాడని మరియు సజీవుడుగా ఉన్నాడని ఆమె ఇంకా గ్రహించలేదు.
పునరుత్థాన ప్రసంగం తెలుగులో
20:14 ఆ క్షణాన ఏదో ఆమెను వెనక్కు తిరిగి చూచేలా చేసింది. అక్కడున్నది ప్రభువే, కాని ఆమె ఆయనను గుర్తుపట్టలేదు. అది ఇంకా వేకువజాము కావడంవల్ల బహుశ బాగా వెలుతురుగా లేదేమో. ఆమె ఇంకా ఏడుస్తూ బాగా కలవరముతో ఉంది. సరియైన సమయము వచ్చేవరకు యేసును గుర్తుపట్టకుండా దేవుడే ఆమెను ఆటంకపరచియుండవచ్చు.
20:15 తాను వేస్తున్న ప్రశ్నకు జవాబు బాగా తెలిసినప్పటికి ఎందుకేడుస్తున్నావని ప్రభువు ఆమెను ప్రశ్నించాడు. ఆమె దుఃఖానికి కారణాన్ని ఆమె పెదవుల నుండే వినడానికి ఆయన ఇష్టపడ్డాడు.
ఆమె ఆయనను తోటమాలి అనుకొంది, రక్షకుడు మానవులకు ఎంత సమీపంగా ఉన్నా గుర్తింపబడకపోవచ్చు. ఈ లోకములోని గొప్ప వారిలో ఒకనిగా కాక ఆయన తరచుగా ఎంతో తగ్గించుకొన్న వాడైవస్తాడు.

మరియు ప్రభువు పేరును సంబోధించలేదు. మూడుసార్లు యేసును గూర్చి ఆమె ‘ఆయన’ అని ప్రస్తావించింది. ఒకే ఒక వ్యక్తి గురించి మాత్రమే ఆమె ఆలోచన కలిగివుంది. అంతకు మించిన వివరాలు అనవసరం అని ఆమె భావించింది.
2016 తనను పేరు పెట్టి పిలుస్తున్న ఒక సుపరిచిత స్వరాన్ని యరియ ఇప్పుడు విన్నది. ఏ మాత్రం సందేహంలేదు. – ఆ స్వరం యేసుదే. ఆమె ఆయనను ‘రబ్బూనీ’ అని పిలిచింది. అంటే ‘నా గొప్ప బోధకుడు’ అని అర్ధము. తానెరిగిన గొప్ప బోధకుని గానే ఆమె ఆయననుగూర్చి ఇంకా ఆలోచిస్తూ ఉంది.
ఆయన ఇప్పుడు ఆమెయొక్క బోధకుని కంటే అధికుడని ఆమె గ్రహించలేదు. ఆయన ఆమె యొక్క ప్రభువు మరియు రక్షకుడు. ఇకపై ఆమె ఆయనను గూర్చి ఒక నూతనరీతిలో సంపూర్ణంగా ఏ విధంగా ఎరుగనైయుందో దానిని ప్రభువు ఆమెకు వివరించాల్సి వుంది.
20:17 ‘నన్ను ముట్టుకొనవద్దు’ అని ఆయన అన్నాడు. అంటే మరియ కనీసం తన చేతి వ్రేళ్ళతోకూడా ఆయన దేహాన్ని తాకకూడదని దీని అర్థం కాదు. ‘నన్ను అంటిపెట్టుకొని యుండవద్దు’ అని దీని భావము.
శరీరముతో నుండిన మనుష్యునిగా యేసు మరియకు తెలుసు. ఆయన జీవించియున్నపుడు జరిగిన అద్భుతకార్యాలను ఆమె చూచింది. కాబట్టి, భౌతికంగా ఆమె ఆయనను కలిగియుండకపోతే ఆశీర్వాదము పొందడానికి ఆమెకు ఎలాంటి నిరీక్షణ ఉండదనే నిర్ణయానికి ఆమె వచ్చింది.
ప్రభువు ఆమె ఆలోచనను సరిచేయవలసివచ్చెను. ‘శరీరముతో ఉన్న ఒక మనుష్యునిగామాత్రమే తనను అంటిపెట్టుకొని యుండవద్దు’ అని ఆయన చెప్పాడు. “నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు.
యేసు క్రైస్తు పునరుత్థానం అర్థం
నేను పరలోకమునకు తిరిగివెళ్ళిన తరువాత పరిశు ద్ధాత్మ ఈ భూమిమీదకు పంపబడును. ఆయన వచ్చినపుడు నీవు ఇంతకు ముందెన్నడూ నన్ను ఎరుగని రీతిలో ఆయన నీ హృదయానికి నన్ను బయలుపరుస్తాడు.
ఈ భూమిపై నేను జీవించిన కాలంలో సాధ్యంకాలేనిది, అప్పుడు నేను నీకు ఎంతో సమీపంగాను, ప్రియముగాను ఉంటాను.” ఆయన, ‘తన శిష్యుల దగ్గరకు వెళ్ళి, ప్రవేశపెట్టబడిన ఈ నూతన క్రమాన్నిగూర్చి వారికి తెలియజేయుమని’ ఆమెతో చెప్పాడు.
మొదటిసారిగా ప్రభువు ఇక్కడ తన శిష్యులను ‘నా సహోదరులు’ అని సంబోధించాడు. ఆయన తండ్రే తమ తండ్రి అని, ఆయన దేవుడే తమ దేవుడని వారు తెలుసుకోవాల్సివుంది. ఆయన పునరుత్థానానికి ముందు ‘కుమారులు’ మరియు ‘దేవుని వారసులు’గా విశ్వాసులు ఎప్పుడూ చేయబడలేదు.
దేవుని గూర్చి ‘మన తండ్రి’ అని ప్రభువు చెప్పలేదు దేవుడు మనకంటే భిన్నమైన రీతిలో యేసుకు తండ్రియై యున్నాడు. ప్రభువైన యేసుకు నిత్యత్వమునుండి దేవుడు తండ్రిగా ఉన్నాడు. నిత్యత్వమునుండి క్రీస్తు కుమారునిగా ఉన్నాడు. కుమారుడు తండ్రితో సమానుడైయున్నాడు, మనమైతే దేవునికి దత్తపుత్రులము.
ఈ సంబంధము మనము రక్షింపబడిన నాటి నుండి ప్రారంభమై ఎన్నటికీ అంతమవదు. దేవుని కుమారులముగా మనము దేవునితో సమానులము కాము. అలా ఎన్నటికీ కాలేము.
20:18 తన కప్పగింపబడిన పనికి విధేయురాలైన మరియ ‘అపొస్తలులకే అపొస్తలు రాలు’ అయినది. క్రీస్తుపట్ల ఆమెకున్న భక్తికి ప్రతిఫలంగా ఆమెకు ఇంతటి గొప్ప ఆధిక్యత ఇవ్వబడింది అనడంలో సందేహంలేదు.
శిష్యులకు యేసు ప్రత్యక్షమగుట (20:19-23)
20:19 అది ఆదివారం సాయంకాలం. మూడు రాత్రుల క్రితం వారు కూడుకొనిన మేడగదిలోనే బహుశ శిష్యులందరూ సమావేశమై యుంటారు. యూదులవలని భయం చేత గది తలుపులు మూసికొనియున్నారు. అకస్మాత్తుగా యేసు వారి మధ్యలో నిలబడి ‘మీకు సమాధానము కలుగును గాక’ అని చెప్పడం వారు విన్నారు.
తలుపులు తెరవకుండానే ప్రభువు గదిలోపలికి ప్రవేశించాడు. ఆయన పునరుత్థాన శరీరము మాంసము, ఎముకలతో కూడిన నిజమైన శరీరమే. అయినప్పటికి, అడ్డంకుల గుండా వెళ్ళడానికి మరియు ప్రకృతి ధర్మాలకు అతీతంగా స్వతంత్రంగా వ్యవహరించడానికి ఆయన శక్తి కలిగియున్నాడు.

“మీకు సమాధానము కలుగునుగాక” అని ఆయన అన్నాడు. ఇప్పుడు ఈ మాటలు క్రొత్త అర్థాన్ని కలిగి యున్నాయి. ఎందుకంటే తన సిలువలో కార్చిన రక్తముద్వారా క్రీస్తు సమాధానాన్ని కలుగజేసాడు. ఎవరైతే విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారో వారు దేవునితో సమాధానాన్ని కలిగియుంటారు.
20:20 ఏ గుర్తుల ద్వారా వారికి సమాధానము లభించిందో వాటిని (తన ప్రేమ గుర్తులను) ఆయన వారికి చూపించాడు. మేకుల గుర్తులను, బల్లెపు గాయాన్ని వారు చూచారు. సంతోషంతో వారి హృదయం నిండిపోయింది. ఆయన నిజంగా ప్రభువే!
20:21 తాను చెప్పినట్టుగానే ఆయన జరిగించాడు; ఆయన మృతులలోనుండి తిరిగిలేచియున్నాడు. కాని ఆయన సమాధానాన్ని వారు స్వార్థంగా తాము మాత్రమే అనుభవించడానికి ఉద్దేశింపబడలేదు. దానిని వారు ఇతరులతో పంచుకోవాల్సి వుంది.
కాబట్టి తండ్రి ఆయనను పంపినట్లుగా ఆయన వారిని లోకములోనికి పంపించాడు, క్రీస్తు ఒక పేదవానిగా ఈ లోకమునకు వచ్చాడు; ఆయన దాసునిగా వచ్చాడు; తన్నుతాను రిక్తునిగా చేసుకొన్నాడు; తండ్రి చిత్తాన్ని జరిగించడానికి ఎంతో సంతోషిం చాడు; తన్నుతాను మానవునితో సమానునిగా ఎంచుకున్నాడు; ఆయన సమస్తాన్ని పరిశుద్ధాత్మ శక్తిద్వారా జరిగించాడు. ఆయన గురి – సిలువ. ఇప్పుడు ప్రభువు తన శిష్యులతో ఇలా చెబుతున్నాడు – “కాబట్టి నేను మిమ్మును పంపుచున్నాను.”
20:22 “ఆయన ఈ మాట చెప్పి వారిమీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని వారితో చెప్పెను.” – ఈ సువార్తలలోని అతి క్లిష్టమైన వచనాల్లో ఇది ఒకటి, సమస్య ఏమిటంటే, పెంతెకొస్తు దినమువరకు పరిశుద్ధాత్మ పంపబడలేదు.
బైబిల్‌లో పునరుత్థాన వచనాలు
ఈ సందర్భము వెంటనే జరగనప్పుడు ప్రభువు ఎలా ఈ మాటలు మాట్లాడగలిగారు? దీనికి అనేక వివరణలు ఇవ్వబడ్డాయి. పెంతెకొస్తు దినమున వారు పొందబోయే దానినిగూర్చి ప్రభువు వాగ్దానము చేస్తున్నాడు అని కొందరి అభిప్రాయం. ఇది యుక్తమైన వివరణ కాదు.
“వాస్తవానికి రక్షకుడు ‘పరిశుద్ధాత్మను పొందుడి’ (re- ceive the Holy Spirit) అని అనలేదు కాని ‘పరిశుద్ధాత్మ పొందుడి’ (receive Holy Spirit) అని మాత్రమే అన్నాడు” అని మరికొందరి అభిప్రాయం.
ఈ వివరణ నుండి వారు – “శిష్యులు ఈ సయమంలో పరిశుద్ధాత్మను ఆయన సంపూర్ణతతోకూడా పొందలేదు. కాని సత్యమునుగూర్చిన అధిక జ్ఞానము లేక వారి సేవకోసం అధికారము మరియు నడిపింపు మొదలగు ఆత్మయొక్క కొన్ని పరిచర్యలను మాత్రం పొంది యున్నారు, వారు పరిశుద్ధాత్మను ముందుగా రుచి చూచిన అనుభవాన్ని మాత్రమే పొందిరి” అని చెబుతారు.
మరికొందరు – ‘ఈ సందర్భములో శిష్యులపై పూర్తిగా పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగిందని’ అభిప్రాయపడుచున్నారు. కాని లాకా 24:49 మరియు అపొ. 1:4,5,8 వచనాలలో ‘పరిశుద్ధాత్మ రావడం’ అనేది భవిష్యత్తులో జరగ బోయే విషయంగా చెప్పబడింది.
యేసు మహిమపరచబడనంతవరకు అనగా ఆయన పరలోకమునకు తిరిగివెళ్లకమునుపు పరిశుద్ధాత్మ దేవుడు తన సంపూర్ణతతో ఈ భూమి పైకి రాలేడు అనే విషయం యోహాను 7:39 ద్వారా మనకు స్పష్టమవుతున్నది.
20:23 ఈ 23వ వచనముకూడా కష్టమైనది మరియు అనేక భేదాభిప్రాయాలకు మూలముగా ఉంటున్నది. పాపములు క్షమించుటకును లేక వాటిని నిలిచి యుండ నిచ్చుటకును యేసు తన శిష్యులకు (మరియు వారి వారసులైనవారికి) అధికారమును వాస్తవంగానే ఇచ్చాడని ఒక అభిప్రాయము.

కాని దేవుడు మాత్రమే పాపములను క్షమించగలడు (లూకా 5:21) అను బైబిలు బోధకు ఇది పూర్తి విరుద్ధంగా ఉంది. రెండవ అభిప్రాయమేమనగా – “వాగ్దానము చేయబడిన శక్తి మరియు ఇవ్వబడిన ఈ అధికారము – సువార్త ప్రకటించడానికి; ఏయే షరతులమీద పాపములు క్షమించ బడగలవు అని తెలియజేయడానికి సంబంధించినది. షరతులు అంగీకరించబడకపోతే పాపములు నిలిచివుంటాయి.”
మూడవది మరియు మనముకూడా అంగీకరించే అభిప్రాయము ఏమనగా “పాపములు క్షమించబడినవి” అని ప్రకటించడానికి శిష్యులకు అధికారము ఇవ్వ శిష్యులు సువార్తను ప్రకటిస్తూ వెళతారనుకోండి, కొంత మంది ప్రజలు పశ్చాత్తాపపడి తమ పాపములను ఒప్పుకొని యేసుప్రభువును అంగీక రిస్తారు.
అలాంటివారితో వారి పాపములు క్షమించబడ్డాయి అని చెప్పడానికి శిష్యులు అధికారం పొందారు. కొందరయితే పశ్చాత్తాపపడడానికి నిరాకరించి క్రీస్తులో విశ్వాస ముంచరు. అప్పుడు శిష్యులు – వారు ఇంకా వారి పాపములలోనే ఉన్నారని అలాగే మరణిస్తే, వారు నిత్యనాశనమునకు గురిఅవుతారని వారితో చెబుతారు. కొన్నిరకాల పాపములతో వ్యవహరించే విషయంలో శిష్యులు ప్రత్యేక అధికారాన్ని ప్రభువునుండి పొందియుండటము గమనించండి : పేతురు, అపొ. కార్య.
5:1-11 వచనాల్లో అననీయ సప్పీరాల విషయంలో ఈ అధికారాన్ని ఉపయోగించాడు. పౌలు, 1 కొరింథీ 5:3-5, 12,13 వచనాల్లో ఒక దుర్మార్గుని పాపమును నిలిచియుండనివ్వడం మరియు 2 కొరింథీ
2:4-8 వచనాల్లో అదే పాపన్ని క్షమించడం మనము చూస్తాము. ఇది ఇక్కడ జీవితములోని ఈ పాపముయొక్క శిక్షనుండి క్షమాపణ పొందడమైయున్నది. సందేహము విశ్వాసముగా మార్చబడుట (20:24-29) :
20:24 “యేసు వచ్చినప్పుడు, పండ్రెండుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను.” ‘తోమా అక్కడ లేకపోవడం అతని తప్పు’ అనే నిర్ణయానికి మనము రాకూడదు అతడు ఎందుకు అక్కడ లేడో దానినిగూర్చి ఏమీ చెప్పబడలేదు.
20:25 కానీ తోమా యొక్క అవిశ్వాస ధోరణిని మాత్రం తప్పు పట్టాల్సివుంది. అతడు ప్రభువు పునరుత్థానమునకు దృగ్గోచరమైన, స్పర్శనీయమైన ఋజువులను కోరాడు. లేనట్లయితే అతడు విశ్వసించడు! ఈ రోజుల్లో కూడా అనేకుల వైఖరి ఈ విధంగానేఉంది.
కాని అది సమంజసం కాదు. మన దైనందిన జీవితంలో తాకలేని, చూడలేని అనేకవిషయాల్లో మనము నమ్మకం కలిగి యుంటున్నాము.
పునరుత్థానుడైన ప్రభువు గురించి ప్రవచనాలు
20:26 ఒక వారము తర్వాత ప్రభువు మరల శిష్యులకు కన్పించాడు. ఈ సమయ ములో తోమాకూడా ఉన్నాడు. మరల యేసు అద్భుతరీతిగా గదిలో ప్రవేశించి అంతకు
ముందువలెనే ‘మీకు సమాధానము కలుగును గాక’ అంటూ వారిని పలుకరించాడు.
20:27 సందేహించిన తోమాతో ప్రభువు ఎంతో మృదువుగాను, సహనంతోను వ్యవహరించాడు. తన ప్రక్కలోని బల్లెపు గాయములో అతని చేతిని ఉంచడంద్వారా తన పునరుత్థానముయొక్క వాస్తవికతను ఋజువుపరచడానికి ప్రభువు అతనిని ఆహ్వా నించాడు.
20:28 తోమా ఒప్పించబడ్డాడు. ప్రభువు ప్రక్కలో అతడు తన చేతిని ఉంచి చూశాడా లేదా అనేది మనకు తెలియదు. కాని యేసు తిరిగిలేచాడని, ఆయనే ప్రభువు మరియు దేవుడు అని చివరకు అతడు తెలుసుకున్నాడు.
20:29 దేవునిగా ఆరాధించబడటాన్ని యేసు అంగీకరించడము ఇక్కడ గమనిం చండి. ఆయన కేవలం మానవుడే అయితే, ఆయన ఆరాధించబడటాన్ని నిరాకరించాల్సి ఉంటుంది. ఇక్కడ తోమా చూపిన విశ్వాసము ప్రభువుకు అంతగా ప్రీతికరమైనదిగా లేదు. అది చూడటంమీద ఆధారపడిన విశ్వాసము. ఎన్నడూ చూడనప్పటికీ
విశ్వసించువారు మరి ధన్యులు.
యోహాను సువార్తయొక్క ఉద్దేశ్యము (20:30,31)

20:30 యేసు చేసిన సూచక క్రియలన్నీ యోహాను సువార్తలో గ్రంథస్థము చేయబడలేదు. ఏవైతే తన ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలవో వాటినే పరిశు త దేవుడు ఎన్నుకొని వ్రాయించాడు.
20:31 యోహాను ఈ పుస్తకం వ్రాయడంలోని తన ఉద్దేశ్యాన్ని ఇప్పుడు చెబు తున్నాడు. దీనిని చదువువారు, యేసు నిజమైన మెస్సీయా అనియు మరియు దేవుని కుమారుడనియు విశ్వసించునట్లుగా ఇది వ్రాయబడింది. విశ్వసించువారు ఆయన ద్వారా నిత్యజీవమును పొందెదరు. ప్రియ చదువరీ నీవు విశ్వసించావా?