పరిశుద్ధాత్మ – ఆదరణకర్త – Bible Verses Chapter 16 in Telugu

పదహారవ అధ్యాయము

హింసింపబడుటనుగూర్చి ముందుగా చెప్పుట (16:1-4) :

16:1 మెస్సీయ రాజ్యమును స్థాపించి, రోమా సామ్రాజ్య శక్తిని పడద్రోయునన్న యూదుల నమ్మకమును శిష్యులు వృద్ధిపొందించిరి. ఇది ఇట్లుండగా ప్రభువు తాను మరణించి, తిరిగిలేచి, పరమునకు తిరిగి వెళ్ళనై యున్నట్లుగా వారికి చెప్పెను.

పరిశుద్ధాత్ముడు వచ్చుననియు, క్రీస్తుకొరకు సాక్షులుగా శిష్యులు వెళ్ళవలసి యున్నారని చెప్పెను. వారు తృణీకరింపబడి హింసింపబడుదురు. ఇట్టి సంఘటనలన్నియు జరుగు నని, అభ్యంతరపడకుండవలెనని ప్రభువు వారికి ముందుగానే తెలియజేసెను.

పరిశుద్ధాత్మ బైబిల్‌లో

16:2 సునగోగునుండి వెలివేయబడుట అతి నీచమైన సంభవమని యూదులనేకులు అభిప్రాయపడుదురు. ఇది యూదులైన యేసు శిష్యులకు సంభవించినది. క్రైస్తవ విశ్వాసమును అసహ్యించుకొనుచు, తాము దేవుని సంతోషపరచుచున్నామని తలంచు దురు.పరిశుద్ధాత్మ - ఆదరణకర్త

ఒక వ్యక్తి కచ్చితమైన వాడును, ఎంతో ఆసక్తిపరుడును అయినప్పటికీ, అతడు తప్పు త్రోవలో నుండుటకు అవకాశము కలదని దీనినిబట్టి మనకు తెలియుచున్నది.

16:3,4 క్రీస్తుయొక్క దైవత్వము గుర్తించకపోవుటే దీనికి మూలకారణము. యూదు లాయనను స్వీకరించలేదు గావున వారు తండ్రిని అంగీకరించుటకు నిరాకరించిరి కనుక ప్రభువు ఇవి సంభవించునపుడు వారు తప్పిపోకుండునట్లు ఆయన హెచ్చరిం చెను.

Read and Learn More Telugu Bible Verses

అయితే తమ జీవితముపట్ల ఆయన ఒక ఉద్దేశము గలవాడై ఈ విషయములు తమకు బయలు పరచినట్లుగా గుర్తుంచుకొనిరి. ఆయన వారితో ఉన్నపుడు ముందుగా వారికీ విషయములు తెలుపలేదు.

ఆయన వారితో నున్నపుడు వారు ఈ విషయములను గురించి ఆలోచించి, చింతించకుండునట్లు ఆయన వారికీ విషయములను ముందుగా బోధించలేదు. ఇప్పుడైతే ఆయన వెడలిపోవు కాలము సమీపించెను గనుక వారికొరకై ఏర్పాటు చేయబడిన మార్గమును వారికి బోధించెను.

పరిశుద్ధాత్మ – ఆదరణకర్త – Bible Verses Chapter 16 in Telugu

Bible VersesKnowledge Of The HolyEvery Christian Should Know
Key Biblical Messianic PropheciesPower in the BloodPresence of GodSavior on the Cross
Pursuit of GodBible Study For BeginnersPray For Those You LoveHeart Of God

సత్యాత్మయొక్క రాక (16:5-15)

16:5 ప్రభువుకొరకు ఏమి సిద్ధపరచబడియున్నదో తెలిసికొనుటకు ఇష్టము లేనివారై శిష్యులు తమ నిరుత్సాహమును తెలియచేసిరి. వారు సాధారణమైన తలంపుతో మీరెక్కడికి వెళ్ళుచున్నారని ప్రభువు నడిగిరి గాని ఆసక్తితో అడిగినట్లుగా లేరు.

ఆదరణకర్త అర్థం తెలుగులో

సత్యాత్మయొక్క రాక (16:5-15)

యోహాను సువార్త – వ్యాఖ్యానము

16:6 ఆయనకు జరుగబోవు సంగతులకంటే తమకు సంభవింపబోవు సంగతులపై వారు ఎక్కువగా మనస్సునుంచిరి. ఆయనముందు సిలువ, సమాధి ఉంచబడియున్నవి. వారి ముందు ప్రభువుకొరకు పరిచర్యలో ‘హింస’ ఉంచబడియున్నది.

Bible VersesKnowledge Of The HolyEvery Christian Should Know
Key Biblical Messianic PropheciesPower in the BloodPresence of GodSavior on the Cross
Pursuit of GodBible Study For BeginnersPray For Those You LoveHeart Of God

ఆయన పొందనై యున్న శ్రమలను గురించికాక వారు పొందనైయున్న శ్రమలకొరకు చింతించుచున్నారు. 16:7 వారు నిరాదరణగా వదలివేయబడలేదు పరిశుద్ధాత్మ దేవుని వారికి సహాయ కారిగా ప్రభువు పంపెను. ఆదరణకర్త రాక శిష్యులకు యుక్తమైనది.

ఆయన (పరిశు ద్ధాత్మ దేవుడు) వారిని శక్తివంతులనుగాచేసి, ధైర్యవంతులనుగాచేసి, బోధించి, క్రీస్తును వారికి గతముకంటె ఇప్పుడు మరెక్కువగా ప్రత్యక్షపరచెను. ప్రభువైన యేసు పరమునకు తిరిగివెళ్ళి మహిమపరచబడువరకు ఆదరణకర్త పంపబడలేదు.

ఈ సంఘటనకు పూర్వము పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకములోనుండెను గాని ఇప్పుడాయన రాక ఒక క్రొత్తదనమును కలిగియున్నది. అదెట్లనగా లోకమును ఒప్పింపచేయుటకును, విమోచింపబడిన వారికి పరిచర్య చేయుటకును ఆయన వచ్చియుండెను.

16:8,9 పరిశుద్ధాత్మ దేవుడు లోకములోని పాపమును ఒప్పింపజేయును, నీతిని గూర్చి ఒప్పింపచేయును. మరియు తీర్పును గూర్చియు ఒప్పింపజేయును. పాపి జీవితములో పాపమునుగూర్చియు, నీతినిగూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పింపచేయుచున్నాడని చెప్పవచ్చును.

ఇది వాస్తవమైన యెడల ఈ భాగములో బోధ ఈ విషయమై కాదు. పరిశుద్ధాత్మ దేవుడు తానెందునిమిత్తమై ఈ లోకములో నుండెనో దానిని గురించి లోకమును శిక్షించుచుండెను. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉండుటకంటే ప్రభువైన యేసు ఇక్కడ ఉండి, ప్రపంచమును పరిపాలించవలసియుండెను.

ఈ లోకములోనుండి వారి నేరమునుగూర్చి సాక్ష్య మిచ్చుచుండెను.

అయితే లోకమాయనను అంగీకరించలేదు. కనుక ఆయన తిరిగి పరలోకమునకు వెళ్ళెను. క్రీస్తు నెట్టివేయబడిన స్థలములో పరిశుద్ధాత్మ దేవుడుండెను. గనుక లోకపాపము విపులీకరింపబడెను. క్రీస్తును అంగీకరించలేని పాపమును, లోకమును పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపచేయు చుండెను.

ఆయన నమ్మదగినవాడు. ఆయనను నమ్మలేకుండునట్లు ఆయనయొద్ద అసాధారణ సంగతులను మనము గమనించలేము. ఆయితే వారాయనను తృణీకరిం చిరి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకములోనుండి వారి నేరమునుగూర్చి సాక్ష్య మిచ్చుచుండెను.

పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత

రక్షకుడు నీతిమంతుడని బయలుపరచుచుండగా వారాయనను “దయ్యము పట్టినవాడనిరి.” దేవుడు ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. “నా కుమారుడు నీతిమంతుడు. ఆయనను మృతులలోనుండి లేపి, పరమునకు తిరిగి చేర్చుకొందును” అని దేవుడు చెప్పెను. పరిశుద్ధాత్మ దేవుడుకూడ క్రీస్తు నిజమనియు, లోకము అబద్ధమనియు సాక్ష్యమిచ్చుచుండెను.

16:11 పరిశుద్ధాత్మ దేవునియొక్క ఉనికి ఈ లోకమునకు తీర్పు రానైయున్నదని ఒప్పించుచున్నది. సాతాను సిలువలో నలుగగొట్టబడెననియు మరియు రక్షకుని ద్వేషించువారందరు రానున్న దినములలో భయంకరమైన తీర్పునకు లోనౌదురనియు పరిశుద్ధాత్ముని ఉనికి తెలియజేయుచున్నది.

16:12 అనేక సంగతులను ఆయన వారికి చెప్పవలసియున్నది గాని ఇప్పుడు వారు వాటిని గ్రహింపలేరు, బోధనా పద్ధతులలో ఇదియొక ముఖ్యసూత్రము. నిగూఢమైన సత్యములను తెలిసికొనకముందు వినుటలో అభ్యాసము అవసరము. తన బోధలో వారినెప్పుడు ఆయన ఇబ్బంది కలిగించక, ఒకదాని తరువాత నొకటి, ఒక సూత్రము తరువాత మరియొక సూత్రము చెప్పెడివాడు.

16:13 ప్రభువు ప్రారంభించిన పనిని పరిశుద్ధాత్ముడు కొనసాగింపనైయున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని సర్వసత్యములోనికి నడిపించును. శిష్యుల జీవిత కాలములో ఈ సర్వసత్యము వారికి అప్పగింపబడెను.

వారు దానిని వ్రాతపూర్వకముగా క్రొత్త నిబంధనలో పొందుపరచి మనకు అప్పగించిరి. ఈ క్రొత్త నిబంధన పాత నిబంధనకు జతచేయబడి, దేవునియొక్క వ్రాతపూర్వకమైన ప్రత్యక్ష మానవులకు అప్పగింపబడెను.

అన్ని యుగములలోను దేవుని ఆత్మ దేవుని ప్రజలను సర్వ సత్యములోనికి నడిపించును ఇది వాస్తవము. లేఖన భాగములద్వారా ఆయన దీనిని నెరవేర్చెను. తనను గూర్చితాను చెప్పుకొనుటలేదని యేసుప్రభువు చెప్పెను.

తననుగూర్చి తాను చెప్పుకొనుటలేదనగా తనంతట తానేమియు మాటలాడుట లేదని అర్థము. అనగా తన అధికారముతో ఏమియు మాటలాడుటలేదు. తండ్రియు కుమారుడు తనకు ఏమి అనుగ్రహిస్తే దానినే పరిశుద్ధాత్ముడు బోధించును.

 

పరిశుద్ధాత్మ - ఆదరణకర్త Bible Verses Chapter 16

జరుగబోవు సంగతులు ఆయన చూపించును. ఇది క్రొత్త నిబంధనలో చెప్పబడినది. ముఖ్యముగా ప్రకటన గ్రంథములో భవిష్యత్సంఘటనలు వివరింపబడెను. పరిశుద్ధాత్మ దేవునియొక్క ముఖ్యమైన పని క్రీస్తును మహిమపరచు టయే.

ఆయన నేర్పునది, బోధించునది ఏమైనది దీనినిబట్టి మనము పరిశీలించ వచ్చును. ఉపదేశించునదిగాని, బోధించునదిగాని రక్షకుని స్తుతించునదియైన, అది పరిశుద్ధాత్ముని పని యని చెప్పవచ్చును. ‘ఆయన నాలోనివి తీసికొనును’ అనగా, ‘నన్ను గూర్చిన గొప్ప సంగతులు గ్రహించును’ అని భావము. ఈ విషయములను ఆయన విశ్వాసులకు విశదపరచును. ఈ అంశమింతటితో విరమించుటలేదు.

16:15 తండ్రి కలిగియున్న సమస్తము కుమారుడు కలిగియుండెను. ఈ వాస్తవాలను గూర్చి ప్రభువైన యేసు 14వ వచనములో చెప్పియుండెను. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసి హృదయానికి ప్రభువునుగూర్చిన మహిమకరమైన వాస్తవాలను, పరిచర్యలను, పలువిధములైన పనులను, కృపలను ప్రభువుయొక్క పరిపూర్ణతను తెలియజేసెను.

దుఃఖము ఆనందముగా మార్చబడుట (16:16-22) : 16:16 ఈ వచనముయొక్క భావము స్పష్టముగా విపులీకరించబడలేదు. ‘ప్రభువు వారికి మూడు దినములు అగుపించకుండా పోయి మరల పునరుత్థానము తరువాత వారికి కనుపించును’ అని దీని భావమైయుండవచ్చును.

బైబిల్‌లో ఆదరణకర్త గురించి వచనాలు

లేక, ‘పరలోక మందున్న తండ్రియొద్దకు ఆయన వెళ్ళి కొంత సమయము (ఈ యుగ సమాప్తి) తరువాత వారియొద్దకు మరల వచ్చును (ఆయన రెండవరాకడ’ – అని దీని భావమై యుండ వచ్చును లేక, ‘వారి శరీరసంబంధమైన నేత్రములతో కొంత కాలము ఆయనను చూడకపోయినను, పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చిన పిమ్మట వారియొక్క విశ్వాసమునుబట్టి మునుపెన్నడు ఆయనను చూడనిరీతిగా వారాయనను చూతురని’ దీని భావమైయుండవచ్చును.

16:17 శిష్యులు కలవరపడిరి. వారట్లు కలవరపడుటకు కారణము ఆయన 10వ వచనమునందు ‘నేను నా తండ్రియొద్దకు వెళ్ళెదను. ఇక మీరు నన్ను చూడరు’ అని చెప్పెను. ఇప్పుడు ‘ఆయన కొంతకాలము నన్ను చూడరుగాని మరి కొంతకాలము నకు నన్ను చూచెదరని’ చెప్పుచున్నాడు. అయితే వారీ తేడాను గమనించలేదు.

16:18 ‘మరికొంతకాలమునకు’ అని ఆయన చెప్పిన మాట అర్థమేమిటని వీరు తమలోతాము చర్చించుకొనుచుండిరి. ఈ సమస్య మనదికూడ. ఆయన చెప్పిన ఈ మాట పునరుత్థానమునకు మూడురోజుల ముందునకు సంబంధించినదా లేక ఆయన రెండవ రాకడకు ముందు దాదాపు 1900 సం॥ల కంటే ఎక్కువైన కాలమునకు సంబంధించినదా అను విషయము మనకుకూడ కచ్చితముగా తెలియదు.

16:19,20 ప్రభువైన యేసు – దేవుడై యుండి, వారి తలంపులను ఎరిగియుండెను. వారి కలవరమునుగూర్చి అనేక ప్రశ్నలు వేసి వారి సమస్య తాను పూర్తిగా ఎరిగి యున్నట్లు వారికి తెలియజేసెను. వారియొక్క సమస్యకు సూటిగా సమాధానమివ్వక ‘మరి కొంతకాలమునకు’ అను మాటకు మరికొద్ది వివరణ ఇచ్చెను.

లోకమునకు ఈ సమయము సంతోషభరితమైనది. ఎందుకనగా క్రీస్తుప్రభువును సిలువవేయుటలో ఈ లోకము గెలుపొందినది. శిష్యులకు ఈ సంగతి ఏడ్పును, దుఃఖమును కలిగించి నది. అయినను వారి దుఃఖము కొద్దికాలముండును.

మొదటిగా ఆయన పునరుత్థానము వలన, రెండవదిగా పరిశుద్ధాత్ముని రాకవలన వారి దుఃఖము ఆనందమునకు మార్చ బడును. అయితే అన్ని కాలములయందున్న ఆయన శిష్యులందరికి ఆయన రెండవసారి తిరిగివచ్చునపుడు వారి దుఃఖము పరిపూర్ణ ఆనందమునకు మార్చబడును.

ఒక స్త్రీ తనకు శిశువు పుట్టెనన్న సంతోషముతో తన ప్రసవవేదనను వెంటనే మరచిపోవును. ఈ సందర్భములో తప్ప మరి ఏ విషయములోను ఒక వ్యక్తి ఇంత త్వరగా తన బాధను మరచిపోలేడు.

అయితే బిడ్డను కనిన స్త్రీ విషయములో జరిగిన విధముగానే శిష్యుల విషయములోను జరుగును. ప్రభువు వారితో నుండకపోవుట వలన కలిగిన దుఃఖము ఆయనను మరల చూచిన వెంటనే ఎగిరిపోవును.

16:22 “మిమ్మును మరల చూచెదనని” ప్రభువు పలికిన ఈ మాట యొక్క పునరుత్థానమునకు లేక పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మను పంపుటకు లేక ఆయన రెండవరాకడకు ఈ మూడు విషయములలో దేనికి గుర్తుగా ఉన్నదో కచ్చితముగా మనము చెప్పలేము. అయినప్పటికి ఈ మూడు విషయములలో ఫలితము ఒక్కటే. అది – ఆనందము నిలిచియుండే ఆనందము.

యేసునామమున తండ్రిని ప్రార్థించుట (16:23-28) :

16:23 ఇంతవరకు శిష్యులాయనను ప్రశ్నలడుగుచు, మనవి చేయుచు వచ్చిరి. పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చిన నాటనుండి ప్రభువు భౌతికముగా (శరీరముతో) వారితో ఇక నివసింపడు. గనుక వారిక ప్రశ్నలు వేయనవకాశము లేదు.

అనగా వారు వెళ్ళుటకు వారికి ఎవరును లేరు – అని భావముకాదు. ఇప్పుడు యేసు నామమున తండ్రియైన దేవునికి ప్రార్థించు భాగ్యము వారికి కలిగెను. ప్రభువైన యేసునుబట్టి వారి మనవులు ఆలకింపబడును.

‘నా నామమున మీరు ఏది అడిగినను అది మీకు అనుగ్రహింపబడును’ అని యేసు చెప్పెను. మనయొక్క యోగ్యతనుబట్టి మన మనవులు ఆలకింపబడవు. గాని ప్రభువైన యేసుయొక్క యోగ్యతనుబట్టి మన మనవులు ఆలకింపబడును.

పరిశుద్ధాత్మ మరియు ఆదరణకర్త సంబంధం

16:24 _ ఇంతకు మునుపు వారెప్పుడును ప్రభువైన యేసు నామమున తండ్రియైన దేవునికి ప్రార్థింపలేదు. అట్టివారికి ఇప్పుడు ఆ నామమున ప్రార్థించు భాగ్యము కలిగినది. జవాబు పొందిన ప్రార్ధనలవల్ల వారి సంతోషము పరిపూర్ణమైనది.

16:25 ప్రభువుయొక్క బోధనా సారాంశము వెంటనే బోధపడదు. ఆయన దృష్టాంతములను, సామెతలను ఉపయోగించెడివాడు. ఈ అధ్యాయమునందు సహితము మనము సరియైన అర్థమును గ్రహించలేము.

పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తరువాత తండ్రిని గూర్చిన సమాచారము విపులముగా తెలియవచ్చెను. అపొస్తలుల కార్యముల గ్రంథములోను, పత్రికలలోను ‘సత్యము’ దృష్టాంతరూపములో కాక సూటిగా వివరింపబడినది.

పత్రికలలోను 'సత్యము' దృష్టాంతరూపములో కాక సూటిగా వివరింపబడినది.

16:26 మనము నివసించు ఈ పరిశుద్ధాత్మ యుగమునందు ప్రభువైన యేసు నామమునందు తండ్రికి ప్రార్థించు భాగ్యము మనకు కల్గెను “మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు” అని యేసు చెప్పెను. తండ్రి మన ప్రార్థనలకు జవాబిచ్చుటకు ఆయనను బలవంతపెట్టనవసరము లేదు.

ప్రభువు ఆయనను బ్రతిమాలుకొననవసరము లేదు. కాని అదే సమయమునందు ప్రభువైన యేసు దేవునికి మానవునికి మధ్యవర్తియైయుండి తన ప్రజల పక్షమున దేవుని సింహాసనముయెదుట విజ్ఞాపన చేయును.

16:27 తండ్రి శిష్యులను ప్రేమించుచున్నాడు. ఎందుకనగా వారు క్రీస్తును స్వీక రించి, ప్రేమించి, ఆయన దైవత్వమునందు విశ్వాసముంచిరి. ఈ కారణమునుబట్టియే ప్రభువు తండ్రిని వేడుకొనుట లేదు. పరిశుద్ధాత్ముని రాకతో శిష్యులు తండ్రితో నూతన సంబంధమును కలిగియున్నారు. వారు ఆయన కుమారుని ప్రేమించినందున ధైర్యముతో తండ్రి సన్నిధికి వెళ్ళగలరు.

16:28 తండ్రియైన దేవునితో తన సమానత్వమును ఆయన మరల నిర్ధారించు చున్నాడు. తాను ఒక ప్రవక్తవలే దేవునియొద్దనుండి పంపబడియున్నానని చెప్పుటలేదు. అయితే నేను “తండ్రియొద్దనుండి పంపబడియున్నాను” అని చెప్పుచున్నాడు.

కనుక ఆయన నిత్యుడగు తండ్రికి నిత్యుడగు కుమారుడైయున్నాడు. మరియు తండ్రియైన దేవునితో సమానత్వము కలవాడు. ఆయన భూమిపైకి వచ్చినపుడు మునుపు తానెక్కడో జీవించియున్నట్లుగా వచ్చెను. ఆయన ఆరోహణమైనపుడు ఈ లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్ళెను. ఇది మహిమాన్వితుడైన ప్రభువుయొక్క క్లుప్తమైన జీవితచరిత్ర.

శ్రమలు మరియు సమాధానము (16:29 – 33 ) :

16:29,30 మొదటిసారిగా వారు ఆయనను గ్రహించగలిగినట్లుగా తలంచిరి. ఇప్పుడాయన సామెతలు ఉపయోగించక మాటలాడుచున్నట్లుగా చెప్పిరి. ఆయన వ్యక్తిత్వమునుగూర్చిన మర్మమును వినుచున్నామని గ్రహించిరి.

ఆయన దేవుని యొద్దనుండి వచ్చెననియు, ఆయన అనంతజ్ఞానియనియు వారు నమ్మిరి. అయితే ఆయన తాను తండ్రియొద్దనుండి వచ్చియున్నానని చెప్పెను. వారు దీని అర్థమును గ్రహించిరా? త్రిత్వమైన దేవునిలో యేసు ఒక వ్యక్తియని నమ్మియున్నారా?

పరిశుద్ధాత్మ మరియు ఆదరణకర్త సంబంధం

16:31,32 వారి విశ్వాసము ఇంకను అసంపూర్ణమైనదని ప్రభువు చెప్పెను. వారాయనను ప్రేమించియున్నారనియు, నమ్మియున్నారనియు ఆయనకు బాగుగా తెలియునుగాని వారు నిజముగా ఈయన మానవ రూపము ధరించిన దేవుడని నమ్మియున్నారా? స్వల్ప కాలములోనే ఆయన పట్టబడి, హింసింపబడి, చంపబడెను.

పత్రికలలోను 'సత్యము' దృష్టాంతరూపములో కాక సూటిగా వివరింపబడినది.

ఆయన శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయిరి. అయితే ఆయన ఒంటరిగా విడిచి పెట్టబడలేదుగాని తండ్రి ఆయనతో నుండెను. తండ్రియైన దేవునికి, ఆయనకు గల సంబంధమునే వారు గ్రహింపరైరి. శిష్యులు తమ ప్రాణములను కాపాడుకొనుటకు పారిపోయినప్పుడు తండ్రి సహవాసమే ఆయనను బలపరచెను.

16:33 వారి సమాధానముకొరకు ఆయన వారితో ఇట్లు సంభాషించెను. తాము ద్వేషింపబడినను, తరుమబడినను, హింసింపబడినను, అన్యాయముగా శిక్షించబడినను ఆయనయందు వారికి సమాధానము కలదు. కలువరి సిలువలో ఆయన లోకమును జయించెను. తమకు శ్రమలు సంభవించినప్పటికి వారు జయమునొందిరి. పరిశు ద్ధాత్మ దేవుని రాకతో ఓర్పునొందినవారై నూతన ధైర్యముతో శత్రువును (విరోధిని) ఎదుర్కొనగలిగిరి.

Leave a Comment