మార్గములో సంభాషణ – Bible Verses Chapter 15 in Telugu

పదిహేనవ అధ్యాయము

మార్గములో సంభాషణ

“నేనే నిజమైన ద్రాక్షావల్లిని” (15:1-11) :

15:1 పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగము యెహోవా నాటిన ద్రాక్షాతోటగా చెప్పబడెను, అయితే ఆ ప్రజలు అవిధేయులై ఫలింపనందువలన ప్రభువైన యేసు ‘నిజమైన ద్రాక్షావల్లి’ ఆయెను. తండ్రియైన దేవుడు వ్యవసాయకుడు – అనగా ద్రాక్షా తోటను కాయువాడు.

15:2 ఫలింపని తీగెనుగూర్చి వేర్వేరు అభిప్రాయములు కలవు. విశ్వాసముతో క్రీస్తును అంగీకరించక, క్రైస్తవునివలె నటించువాడని ఈ తీగెను గూర్చి కొందరు చెప్పుదురు. ఫలించుటలో విఫలులగుటవలన రక్షణను పోగొట్టుకొనిన నిజక్రైస్తవులని మరికొందరు చెప్పుదురు.

కాని బైబిలునందలి అనేక లేఖన భాగములు ‘ఒక విశ్వాసి యొక్క రక్షణ నిత్యము నిలచియుండును’ అని బోధించుటవలన ‘రక్షణను కోల్పోవుట’ అనునది అసాధ్యమని స్పష్టమగుచున్నది. ‘మరి కొందరు, ఫలింపని తీగె’ అనగా విశ్వాసములో వెనుకతీసిన ఒక నిజక్రైస్తవుడు అని చెప్పుదురు.

అట్టివాడు ప్రభువును విడిచినవాడై లోకవిషయములందాసక్తి కలిగియుండును. మరియు అట్టివాడు ఆత్మఫలములైన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహములను ప్రత్యక్షపరచుటకు విఫలుడైనవాడు తత్ఫలితముగా ప్రభువు వానిని అనారోగ్యముతోను, దుఃఖముతోను శిక్షించును. కొన్నిసార్లు విషమించిన పరిస్థితులలో అతని చెడ్డ సాక్ష్య జీవితాన్నిబట్టి ప్రభువు అతనిని ఈ లోకమునుండి తీసివేయును.

‘ఫలించెడి తీగె’ అనగా ప్రభువైన యేసువలె ఎదుగు విశ్వాసిని సూచించుచున్నది. ఫలించెడి కొమ్మను సహితము శుద్ధిచేయవలసిన అవసరమున్నది. ద్రాక్షాతీగెను కీటకములనుండియు, తెగులునుండియు, బూజునుండియు శుభ్రపరచుచున్నట్లుగా, క్రైస్తవుని ఈడ్చుకొనిపోవు లోకాశలనుండి వానిని శుభ్రపరచవలసి యున్నది.

Read and Learn More Telugu Bible Verses

15:3 విశ్వాసిని శుభ్రపరచునది ప్రభువు వాక్యమే. ఆయన శిష్యులు వారి సంభాషణలో దేవుని వాక్యముద్వారా శుద్ధిచేయబడిరి. పైగా రక్షకుడు వారితో మాటలాడుచుండగా వారి జీవితములలో శుద్ధిజరగుచుండెడిది. ఇట్లు ఈ వాక్యము న్యాయము తీర్చుటను, పరిశుద్ధపరచుటను సూచించుచున్నది.

15:4 ‘నిలిచి యుండుట, అనగా ఉన్నచోటుననే నిలిచియుండుమని అర్ధము. క్రైస్తవుడు నిలిచియుండు స్థలము క్రీస్తే. అనుదిన జీవితములో క్రైస్తవుడు క్రీస్తుతో సహవాసము కలిగియుండును. కొమ్మ తీగెలో నిలిచియుండి, దానిలోని జీవమును, సారమును గ్రహించును.

మనము ప్రార్థన చేయుటద్వారా, వాక్యము చదువుటద్వారా, ఆయన ప్రజలతో సహవాసము కలిగియుండుటద్వారా, ఆయనతో మనము ఏకమై యున్నామనే నిశ్చయతను కలిగియుండుటద్వారా – మనము ఆయనలో నిలచియుం దుము.

ఇట్లు మనమాయనతో సన్నిహిత సంబంధము కల్గియుండినచో ఆయన మనలో నిలిచియున్నాడనియు, మనకు ఆత్మీయ స్థైర్యమును కలిగించి, ఆధారము చూపించుచున్నాడని గ్రహించవలయును. తీగెలో నిలిచియున్న కొమ్మ ఫలించును. క్రీస్తువలె ఫలింపనాశగల క్రైస్తవులు క్రీస్తుతో సహవాసము కలిగియుండవలెను.

మార్గములో సంభాషణ “నేనే నిజమైన ద్రాక్షావల్లిని” (15:1-11) :

15:5 క్రీస్తు – ద్రాక్షావల్లి, విశ్వాసులు – తీగెలు ద్రాక్షావల్లికొరకు ఫలించుట అనునది ప్రశ్నకాదు గాని, ద్రాక్షావల్లిలోని జీవమును తమద్వారా ప్రవహింపజేయుట అనునది ముఖ్యము. కొన్నిసార్లు మనము ‘ప్రభువా నేను నీకొరకు జీవించుటకు సహాయము చేయుము’ అని ప్రార్థింతుము.

కాని మనము ‘ప్రభువా! నాద్వారా జీవించుము’ అని ప్రార్థించుట మంచిది. క్రీస్తుకు వేరుగా మనము ఏమియు చేయలేము. ద్రాక్షాతీగెయొక్క ముఖ్య ఉద్దేశము ఫలించుట. ద్రాక్షాతీగెలు వస్తుసామగ్రి చేయుటకు గాని, ఇండ్లు కట్టుటకుగాని ఉపయోగపడవు ఇది వంట చెరకుగా కూడ ఉపయోగపడదు. అయితే ఇది ఫలములు ఫలించుటకు బాగుగా ఉపయోగపడును. అయితే ఆ తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనేగాని ఎక్కువగా ఫలించదు.

15:6 ఈ వచనము చాలా భేదాభిప్రాయము కలిగించుచున్నది. విశ్వాసిగా పరిగ ణింపబడినవాడు పాపములో పడినయెడల అతడు పూర్తిగా నశించిపోవునని కొందరు చెప్పుదురు. కాని ‘నిజమైన దేవునిబిడ్డ ఎప్పటికిని నశించడు’ అని చెప్పు దేవుని వాక్యమును ఇది వ్యతిరేకించుచున్నది.

‘నశించువాడు’ అనగా – తాను మారుమనస్సు పొందకయే విశ్వాసినని చెప్పుకొనువాడు అని కొందరు తలంచెదరు. యూదాను ఇందుకు ఉదాహరణగా చెప్పుదురు. అయితే దీనికి సరియైన అర్థము ఈ విధముగా చెప్పవచ్చును – ఈ లేఖన భాగము నిజవిశ్వాసులకు సంబంధించినది కావున ఇతడు విశ్వాసియే అయివుండవచ్చును.

ఇక్కడ రక్షణను గూర్చి కాదుగాని, ప్రాముఖ్యముగా ‘నిలిచియుండుట’ మరియు ‘ఫలించుట’ అను వాటిని గూర్చి వ్రాయబడినది. ఒకడు అలక్ష్యముగా నుండుటవలన, ప్రార్థనా రహితముగా నుండుటవలన దేవునితో సంబంధము పోగొట్టుకొనును. తత్ఫలితముగా అతడు పాపము చేసి తన సాక్ష్యమును పాడుచేసికొనును.

ఇట్లు క్రీస్తులో నిలిచియుండుటయందు విఫలుడైన వ్యక్తి ఫలింపని తీగెవలె క్రీస్తువలన కాదుగాని మనుష్యులవలననే పారవేయబడును. మనుష్యులు అట్టి తీగెలను ప్రోగుచేసి, కాల్చివేయుదురు, అవి కాల్చివేయబడును.

ఇట్టిపని చేయునది దేవుడుగాని, దూతలుగాని కాదు. మనుష్యులే. దీని అర్థమేమి? వెనుకంజవేసిన క్రైస్తవుని మనుష్యులు దూషింతురు. అట్టివాని పేరును మట్టుపెట్ట తలంతురు. అతనియొక్క సాక్ష్యమును నిప్పులో పడవేసి కాల్చివేతురు.

దీనిని మనము దావీదు జీవితములో చూచెదము. అతడు నిజమైన విశ్వాసి. అతడు తన హృదయ ములో దేవునిపట్ల చల్లారిన పరిస్థితి గలవాడై వ్యభిచారమును, నరహత్యను గావించెను. ప్రభువు శత్రువులు దైవదూషణ చేయుటకు అతడు అవకాశమిచ్చెను.ఇప్పటికి నాస్తికులు దావీదును, దావీదు దేవునిని దూషింతురు.

15:7,8 ‘నిలిచియుండు జీవితము’ అనునది ఫలభరితమైన ప్రార్థనా జీవితముయొక్క రహస్యము. మనము ప్రభువును సమీపించుకొలది ఆయనను గూర్చిన సంగతులు మరి ఎక్కువగా తలంచుదుము. ఆయన వాక్యముద్వారా మనమాయనను ఎక్కువగా తెలిసికొన్నప్పుడు మరెక్కువగా ఆయన చిత్తమును కనుగొనగలము.

ఆయన చిత్తమే మన ఇష్టమైనయెడల మన ప్రార్థనలకు కచ్చితముగా జవాబు దొరుకునని మరెక్కువగా నమ్మవచ్చును. దేవుని పిల్లలు క్రీస్తును లోకమునకు ప్రత్యక్షపరచినయెడల తండ్రి ఘనతనొందును. కౄరులైన పాపాత్ములను దేవుని పరిశుద్ధులుగా మార్చిన దేవుడే గొప్ప దేవుడని ప్రజలు బలముగా ఒప్పింపబడుదురు.

మార్గములో సంభాషణ Bible Verses Chapter 15

ఈ అధ్యాయములో మనము గమనించినట్లయిన మొదటిగా “ఫలించుట” ఆ తరువాత ‘బహుగా ఫలించుట’ అను మాటలను గమనింతము. క్రీస్తునందు అంటు కట్టబడిన వాడు శిష్యుడు కాగలడని దీని అర్థము కాదు. ఒకడు ప్రభువైన యేసునందు విశ్వాసముంచునప్పుడు ఆయన శిష్యుడు కాగలడు.

ఆయన శిష్యులుగా ఆయన యందు నిలిచియుండుటవలన ఆయనను ప్రత్యక్షపరచుదుము. మన మాయనను పోలియుండునపుడు మనమాయన నిజమైన శిష్యులముగా ఇతరులు గుర్తించుదురు.

15:9,10 తండ్రికి కుమారునిపట్ల ప్రేమ ఎంతో రక్షకునికి మనపట్లగల ప్రేమ అంతే. ఈ వాక్యములు మనము ధ్యానించినప్పుడు ఆరాధనతో నిండిన హృదయములతో ఆయనకు మ్రొక్కుదము. ఈ ప్రేమ స్థాయిలోను, గుణములోను తీసిపోనిది. ప్రేమయొక్క ఎత్తుగాని, లోతుగాని, కొలతకు అందనిది, మన జ్ఞానమునకు అందనిది, మానవుడు సంపూర్ణముగా గ్రహించలేనిది.

ఇట్టి ప్రేమలో కొనసాగమని యేసు చెప్పుచుండెను. ఆయన ప్రేమలో కొనసాగుచు, దానియందు మన జీవితములలో ఆనందించుదుము. ఈ వచనములోని మొదటి భాగము మనమెట్లు ఆయనయందు నిలిచియుండగలమో వివరించుచున్నది.

ఆయన ఆజ్ఞలను నెరవేర్చుటద్వారా ఆయన ప్రేమయందు నిలిచియుందుమని చెప్పుచున్నది. ఈ వచనములోని రెండవ భాగము మన ముందున్న ‘నిర్ధిష్టమైన నమూనా’ను చూపించుచున్నది.

ప్రభువైన యేసు తన తండ్రి ఆజ్ఞలను నెరవేర్చెను. తాను చేసినదంతయు తండ్రి చిత్తమునకు విధేయుడై నెరవేర్చెను. తండ్రి ప్రేమయందు యేసు నిత్యము ఆనందించుచుండెను. ఆ మధురమైన సహవాసమును ఏదియు తప్పించివేయజాలదు.

15:11 తండ్రితో సహవాసమునందే యేసుయొక్క లోతైన ఆనందమున్నది. ఆయనపై ఆధారపడుట వలన తన శిష్యులు అట్టి ఆనందము పొందవలయునని ప్రభువు ఆశించుచుండెను. తన ఆనందమే తన శిష్యులదైయుండవలెనని ఆయన ఆశయైయున్నది.

అయితే మానవుల ఆశ ఏమనగా ప్రభువైన యేసుకు దూరముగా తాము ఆనందించగలిగినంత ఎక్కువ ఆనందము పొందనాశించుదురు. ఒకడు దేవుని తన హృదయములోనికి ఎంతగా ఆహ్వానించునో అంతగా ఆనందించునని ప్రభువు చెప్పుచున్నాడు.

మన ఆనందము పరిపూర్ణమగుటకు మన హృదయములలోనికి దేవుని ఆహ్వానించవలయునని దీని భావము. యేసుప్రభువుయొక్క ఆజ్ఞలు గైకొనుటలోను, ఆయనయందు నిలిచియుండుటలోను వారియానందము పరిపూర్ణమగును.

యేసుప్రభువుయొక్క ఆజ్ఞలు గైకొనుటలోను, ఆయనయందు నిలిచియుండుటలోను వారియానందము పరిపూర్ణమగును.

విశ్వాసి యొక్క భద్రతలోని అనుమానములనుగూర్చి ఈ అధ్యాయము నాధారముగా తీసికొని అనేకులు ప్రసంగించుదురు. అయితే ప్రభువు ఉద్దేశ్యము మన అనుమానములు తీరవలెననికాదుగాని, మన ఆనందము పరిపూర్ణము కావలెనని ఆయన చెప్పుచుండెను. మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడని శిష్యులకాజ్ఞాపించుట (15:12-17) :

15:12 ప్రభువు తన శిష్యులను శీఘ్రముగా విడచి వెళ్ళవలసియున్నది. ప్రతి కూలమైన లోకములో వారు విడచిపెట్టబడనైయున్నారు. ఇట్టి ఉద్రిక్త పరిస్థితులలో వారు ఒకరితో నొకరు కలహించుకొను అపాయకరమైన పరిస్థితులలో ఉన్నందున ప్రభువు వారికి నూతనముగా ఒక ఆజ్ఞ ఆజ్ఞాపించుచున్నాడు.

అదేమనగా – నేను మిమ్మును ప్రేమించు చున్నట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడి. వారిలో ఒకరికొరకొకరు చావసిద్ధమై యుండవలసినది. ఇట్లు చేయగోరువారు ఒకరితోనొకరు కలహించుకొనరు.

తన స్నేహితునికొరకు చనిపోవనుద్దేశించువాడే ఆత్మ త్యాగము చేయు గొప్ప మానవత్వము గలవాడు. విశ్వాసులైనవారు ఇట్టి స్థితికి ఎదుగవలసియున్నారు. కొందరు అక్షరార్థముగా తమ ప్రాణములర్పింపవలసియున్నారు. మరి కొందరు తమ జీవితకాలమంతయు దేవునిబిడ్డలకు పరిచర్యచేయ సమర్పించుకొందురు.

ప్రభువే మనకు మాదిరి. తన స్నేహితులకొరకు ఆయన మరణించెను. మనము జన్మించినప్పటినుండి మన మాయనకు విరోధులమే. అయితే మనము రక్షింపబడిన పిమ్మట మనమాయనకు స్నేహితులమైతిమి. కనుక ఆయన తన స్నేహితుల కొరకును మరియు తన శత్రువుల కొరకును మరణించెనని చెప్పుటలో ఇది యథార్థమైన విషయము.

15:14,15 మనమాయన ఆజ్ఞలను గైకొనినయెడల ఆయనకు స్నేహితులమై యుందుము. ఆయన స్నేహితులైయుండుటకు ఇది మార్గము కాదుగాని, అయితే మనము ప్రపంచమునకు చూపించవలసిన మార్గమిది. సేవకునికి స్నేహితునికిగల తేడాను ప్రభువు ఇక్కడ తేటగా వివరించుచున్నాడు.

సేవకుడు తనకు నియమింప బడిన పనిని చేయువాడు. స్నేహితుడైతే నమ్మకమును సంపాదించుకొని పనిచేయును. మన భవిష్యత్తునుగూర్చిన ప్రణాళికను స్నేహితునికి తెలియజేయుదుము.

రహస్యము లనుగూడ స్నేహితునితో పంచుకొందుము. ఆయన శిష్యులెల్లప్పుడు ఆయనకు శిష్యులుగా ఉండగోరిరి. అయితే వారు మరెక్కువగా ఆయనకు స్నేహితులైరి. తన తండ్రివద్ద వినిన సంగతులను సైతము ప్రభువు వారికి తెలియజేసెను.

తాను వెడలి పోవు సంగతికూడ వారికి తెలియజేసెను. మరియు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చునన్న సంగతి ఆయన తిరిగి రానైయున్న సంగతి, ఆయనపట్ల వారి బాధ్యతను గురించి వివరించెను. కొందరు – మనము కొమ్మలవలె గ్రహించుదుము, శిష్యులవలె అనుస రించుదుము (8వ) స్నేహితునివలె సహవాసము కలిగియుందుమని చెప్పుదురు.

15:16 వారు నిరుత్సాహముతో ఎప్పుడైనను తమకు అప్పగింపబడినదానిని వదలివేయుదురను తలంపుతో ఆయన వారిని తాను ఏర్పరచుకొనియున్నానని వారికి తెలియజేసెను. వారిని నిత్యరక్షణకును, శిష్యత్వమునకును, ఫలించుటకును ఏర్పరచు కొనెను.

నేను మిమ్మును ప్రత్యేకించియున్నాను అనగా అభిషేకించియున్నానని చెప్పెను. ఇది ఇప్పుడు మానవులు చేయు అభిషేకమువంటిది కాదు. క్రీస్తువలన ఏర్పరచబడిన వారై, వారి కప్పగింపబడిన పనిని చేయుటలో వారికి గుర్తుచేయుటను సూచించును.

మనము ఫలింపవలసియున్నాము. ‘ఫలించుట’ అనగా క్రైస్తవ జీవితముయొక్క కృపలైన ప్రేమ, సంతోషము, సమాధానము మొ||వి కావచ్చును. లేదా ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించుటయై యుండవచ్చును ఈ రెండు విషయములకు దగ్గర సంబంధము కలదు.

మనము మన జీవితములో మొదటి రకమైన ఫలమును (ప్రేమ, సంతోషము… మొదలగునవి) కలిగియున్నప్పుడు మాత్రమే రెండవ ఫలమును ఫలించగలము. “మీ ఫలము నిలిచి యుండనియ్యుడి” అని చెప్పుటలో ‘ఫలము’ అనగా రక్షింపబడిన ఆత్మలు.

ఎల్లప్పుడు నిలిచియుండే ఫలమును ఫలించుటకు ప్రభువు శిష్యులను ఏర్పరచుకొనెను. కేవలము నోటిమాటచేత తనను విశ్వసించి ఒప్పుకొనుట యందు ఆయన ఆసక్తిని కలిగిలేడు కాని నిజమైన రక్షణ అనుభవము కలిగియుండాలని ఆయన కోరుచున్నాడు. యల్. యస్. ఛాఫర్ (L.S. Chafer) – “ఈ అధ్యాయమునందు ప్రభావము గల్గిన ప్రార్థన (7వ॥).

పరిపూర్ణమైన సంతోషము (11వ॥), శాశ్వతమైన ఫలము (16వ॥) – అను వాటిని మనము చూడగలమని” చెప్పెను. “కాబట్టి మీరు అడుగు ప్రతిదానిని …” ప్రభావము కల్గిన పరిచర్యయొక్క రహస్యము ప్రార్ధనే. క్రీస్తుపేర ఏమి అడిగినను తండ్రి దానిని అనుగ్రహించునను వాగ్దానముతో శిష్యులను ఈ లోకములోనికి ప్రభువు పంపెను.

ప్రభావము కల్గిన పరిచర్యయొక్క రహస్యము ప్రార్ధనే.

15:17 ఈ లోకమునకు, వారికి మధ్యగల వైరమునుగూర్చి ప్రభువు వారిని హెచ్చరించెను. మొదటిగా ఒకరి నొకరు ప్రేమించుకొనవలెననియు, ఒకరి నొకరు హత్తుకొని యుండవలెననియు, శత్రువును ఐక్యమత్యముతో ఎదిరించుడని ఆయన వారికి ఆజ్ఞాపించెను.

‘లోకము ద్వేషించుట’ నుగూర్చి ముందుగా చెప్పుట (15:18–27) : 15:18 లోకము తమను ద్వేషించునపుడు శిష్యులు ఆశ్చర్యము చెందనవసరము లేదు. అధైర్యపడనవసరములేదు. లోకము ప్రభువును ద్వేషించెను మరియు ఆయనను పోలియున్న ప్రతివానిని లోకము ద్వేషించును.

15:19 లో కనుసారులు తమవలె చెడుమాటలు మాటలాడువారిని, శరీరాశలు నెరవేర్చువారిని ప్రేమించుదురు. పరిశుద్ధమైన జీవితము జీవించు క్రైస్తవుడు వారిని ఖండించును. గనుక లోకానుసారులు క్రైస్తవుని ద్వేషింతురు.

15:20 ఈ వచనములో నున్న ‘సేవకుడు’ అను మాటకు ‘బానిస’ అనియు, ‘ప్రభువు’ అనగా ‘బోధకుడు’ అనియు అర్థము వచ్చును. తమ ప్రభువు ఈ లోకమునుండి పొందిన అనుభవముకంటె మంచిదైన రీతిలో ఆదరణను తాము పొందగలమని శిష్యులు ఆశించరాదు. క్రీస్తు హింసింపబడినట్లే శిష్యులును హింసింపబడుదురు. రక్షకుని వాక్కులను తృణీకరించినట్లే శిష్యుల వాక్కులనుకూడ లోకము తృణీకరించును.

15:21 హింసయు, ద్వేషింపబడుటయు ఆయన నామము నిమిత్తమే. ఎందుకనగా విశ్వాసి క్రీస్తుతో జతచేయబడెను. అతడు క్రీస్తువలన లోకమునుండి వేరు చేయబడెను. మరియు విశ్వాసి క్రీస్తు నామమును ధరించి, క్రీస్తును పోలి యుండినందు వలననే లోకము దేవుడనిన నిర్లక్ష్యముగా నుండును. ప్రభువును రక్షకునిగా ఈ లోకములోనికి తండ్రి పంపెనని వారికి తెలియలేదు. నిర్లక్ష్య వైఖరి క్షమాపణ నొందదు.

15:22,23 నేను ఈ లోకమునకు వచ్చియుండనియెడల మీరు పాపాత్ములై యుండరని ఆయన చెప్పలేదు. ఆదామునుండి మానవులందరు పాపాత్ములే. అయితే వారి పాపము ఈ తరము వారి పాపముకంటె గొప్పదికాదు.

ఈ తరము వారు దేవుని కుమారునిచూచి, ఆయన (మాటలు) బోధ వినియున్నారు. వారికి ఆయన యందు ఏ దోషము కానరాలేదు. ఆయినను వారాయనను తృణీకరించిరి ఇదే వారియొక్క గొప్ప పాపము.

మహిమాన్వితుడైన ప్రభువుని తృణీకరించినందు వలన కలిగిన పాపము వారి పాపములన్నిటికంటె గొప్పది. కావున వారి పాపములకు క్షమాపణ లేదు. లోకమునకు వెలుగును వారు ద్వేషించిరి.

క్రీస్తును ద్వేషించినందువలన వారు తండ్రిని ద్వేషించిన వారైరి. వారిరువురును ఏకమైయున్నారు. వారు మేము దేవుని ప్రేమించితిమని చెప్పుట లేదు. అట్లు ప్రేమించినచో, దేవుడు పంపించిన వానినికూడ ప్రేమించియుందురు.

15:24 క్రీస్తు బోధ వినుటలో వారు బాధ్యత కలిగియుండుట కాక ఆయన చేసిన అద్భుతములు కూడ వారు చూచియున్నారు. ఇది వారు శిక్షార్హులగుటకు మరి ఎక్కువగ దోహదపడెను. ఏ మనుష్యుడు చేయగా చూడని అద్భుతములను ఆయన చేయగా వారు చూచిరి.

క్రీస్తును తృణీకరించుట క్షమింపరానిది. మిగిలినవారి పాపములన్నియు ఈ పాపముతో ఎన్నదగినవి కావు. ప్రభువు వారి పాపములన్నియు ఈ ఒక్క పాపమునకు పోల్చి చూచి, వారి పాపములన్నియు ఈ ఒక్క పాపము ప్రక్కన నిలువ బెట్టుటకు చాలినవి కావని చెప్పెను. ఎందుకనగా వారు కుమారుని, తండ్రిని. అసహ్యించుకొనుట చేత వారు ఘోర శిక్షకు లోనైరి.

15:25 మానవులు తనపట్ల ప్రవర్తించినదంతయు ప్రవచనముల నెరవేర్పు అని ప్రభువు గ్రహించెను. కీర్తన 69:4 లో “నిర్హేతుకముగా వారు నన్ను ద్వేషించిరి” అని వ్రాయబడియున్నది. పాత నిబంధనలోని లేఖన భాగములు ఆయనను వారు ద్వేషించి రని చెప్పుచుండెను.

వారు ద్వేషించుటను గూర్చి ముందుగా ప్రవచింపబడెను గనుక వారు ద్వేషించిరని దీని అర్ధమా? కాదు. గాని వారి స్వాభిలాష మేరకు వారాయనను ద్వేషించిరను సంగతిని దేవుడు ముందుగా చూచి, దావీదుచే దానిని వ్రాయించెను.

15:26 మనుష్యుల తృణీకారము పొందుచున్నప్పటికి, క్రీస్తుకొరకు నిరంతరము సాక్ష్యమిచ్చువారు కలరు. పరిశుద్ధాత్మ దేవుడైన ఆదరణకర్తద్వారా ఈ పని జరుగు చున్నది. తండ్రి యొద్దనుండి మీకొరకు ఆదరణకర్తను పంపుదునని ప్రభువు చెప్పు చున్నాడు.

ప్రభావము కల్గిన పరిచర్యయొక్క రహస్యము ప్రార్ధనే.

14:16 లో ఈ ‘ఆత్మ దేవుని’ తండ్రి పంపినట్లుగా చూచుచున్నాము. తండ్రియు, కుమారుడును ఒకేస్థాయి యందున్నారని చెప్పుటకు ఇదియొక నిదర్శనము. సత్యాత్మ తండ్రి నుండి బయలు వెడలెను.

అనగా ఈ ఆత్మ ‘దేవుని’ యొద్దనుండి పంపబడెనని స్పష్టమగుచున్నది. పెంతెకొస్తు దినమున ఈ ‘రాక’ ఒక ప్రత్యేకమైన గుర్తు. క్రీస్తును గురించి ఆత్మ సాక్ష్యమిచ్చుచున్నది. ఇది ఆ ఆత్మ దేవునియొక్క గొప్పపరిచర్య.

తాను త్రిత్వములో ఒకడైనను తనతో ప్రజల హృదయము నింపుటకు మనస్సులేని ఆత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే. మహిమ గల దేవునివైపు పాపాత్ముని, పరిశుద్ధుని మళ్ళించువాడు పరిశుద్ధాత్మ దేవుడు.

15:27 పరిశుద్ధాత్మ దేవుడు శిష్యులద్వారా ప్రత్యక్షముగా సాక్ష్యమిచ్చుచుండెను. ప్రభువు తనయొక్క పరిచర్య ప్రారంభమునుండి శిష్యులు ఆయనతో నుండిరి గనుక ఆయన వ్యక్తిత్వమును గూర్చియు, పనినిగూర్చియు ప్రకటించుటకు వారు చాలినవారు.

ఆయనతో నుండినవారే ఆయనయందు తప్పుపట్టుటకు సరిపోయినవారు. అయితే వారు ఆయన ఏవిధమైన పాపము చేసినట్లుగా కనుగొనలేదు. కనుకనే వారు ఆయన ఏ పాపమెరుగని దేవుని కుమారునిగాను, లోకరక్షకునిగాను సాక్ష్యమివ్వగలిగిరి.

Leave a Comment