పరలోకమునకు మార్గము – క్రీస్తు – Bible Verses Chapter 14 in Telugu

పద్నాలుగవ అధ్యాయము

పరలోకమునకు మార్గము – క్రీస్తు

“నేనే మార్గమును, సత్యమును, జీవమునైయున్నాను” (14:1-14) :

14:1,2 కొందరు ఈ వచనమును 13వ అధ్యాయములోని చివరి వచనముతో జోడించి, ఇది పేతురు నుద్దేశించి, చెప్పబడెనందురు. పేతురు ఆయనను ఎరుగ ననును. అయితే ప్రభువు అతనిని ఆదరించును. ప్రభువు ఈ విషయము అందరితోను చెప్పెను.

13వ అధ్యాయము తరువాత కొంత సమయము గడచినట్లుగా మనము గ్రహింపవలెను. దీనిలో తలంపు ఇట్లున్నది. “నేను వెళ్ళబోవుచున్నాను గనుక మీరిక నన్ను చూడరు. అయితే మీ హృదయమును కలవరపడనియ్యకుడి, దేవునియందు విశ్వాసముంచియున్నారు.

మీరు ఆయనను చూడకపోయినను, దేవునియందు విశ్వాస ముంచినట్లు, నా యందును విశ్వాసముంచుడు. ప్రభువైన యేసు మరల ఇంకొకసారి తన్ను దేవునితో సమానునిగా ఎంచుకొనుచున్నాడు. తండ్రి ఇల్లు పరలోకముగా చెప్పబడినది. మరియు అచ్చట నివాసములు కలవు. విమోచింపబడిన వారికందరికి నివాసములు కలవు.

అట్లు లేనియెడల ప్రభువు చెప్పియుండెడివాడు. ఆధారములేని నివాసములు ఆయన నిర్మించడు. “నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. దీనిలో రెండు అర్థములు కలవు. తన స్వంతవారికి స్థలము సిద్ధపరచుటకు ముందుగా ఆయన ‘కలువరి’ కేగెను.

ఆయన ప్రాయశ్చిత్తార్థ మరణమువలన విశ్వాసులకు పరలోకమందు స్థలము సిద్ధపరచెను. మరియు ఆయన పరమునకు తిరిగివెళ్ళి మన కోసరము స్థలము సిద్ధపరచెను. ఆ స్థలమునుగురించి మన కంతగా తెలియకపోయి నను అక్కడ దేవుని బిడ్డలకొరకు స్థలము సిద్ధపరచబడుచున్నదని ఎరుగుదుము. సిద్ధపడిన వారికి సిద్ధపరచబడిన స్థలము.

Read and Learn More Telugu Bible Verses

14:3,4 ఈ వచనము ప్రభువు మధ్యాకాశమునకు వచ్చుటనుగూర్చి వివరించు చున్నది. ఆయన వచ్చినప్పుడు ప్రభువునందు మృతులు మొదట లేతురు. మరియు సజీవులై యుండువారు మార్చబడుదురు.పరలోకమునకు మార్గము – క్రీస్తు “నేనే మార్గమును, సత్యమును, జీవమునైయున్నాను” (14:1-14) :

ఆయన రక్తముతో విమోచింపబడిన వారందరు ఇట్లు పరమునకు కొనిపోబడుదురు (1 థెస్స 4:13-18; 1 కొరింథీ 1515-58 ఆయన రాకడను గూర్చి ఇట్లు లిఖిత పూర్వకముగా చెప్పబడినది. ఆయన ఎట్లు పరమునకు కొనిపోబడెనో అట్లే రానై యుండెను.

నిత్యత్వమంతయు తనవారు తనతో ఉండునట్లుగా ఆయన అట్లు చేయును. “నేను వెళ్ళు చోటికి మీకు మార్గము తెలియును”. ఆయన అనేకసార్లు ఈ విషయము వారికి చెప్పియుండెను గనుక వారికి పరలోకమునకు పోవు మార్గము తెలియును.

14:5,6 తోమాకు ప్రభువు చెప్పు మాటలు బోధపడలేదు. ఈ భూమిపైన ప్రభువైన యేసు మరొకచోటికి ప్రయాణించుచుండెనని తోమాకూడా పేతురువలె తలంచెను. ప్రభువైన యేసు తానే పరలోకమునకు మార్గమైయుండెనని చెప్పెను.

ఆయన మార్గము చూపించలేదుగాని, తానే మార్గమైయుండెను. రక్షణ ఒక వ్యక్తియందున్నది. ఆ వ్యక్తిని నీవు అంగీకరించినయెడల నీకు రక్షణ కలుగును. క్రైస్తవ్యమనగా క్రీస్తు. ప్రభువే సత్యము.

ఆయన కేవలము సత్యము బోధించువాడు కాదుగాని, ఆయనే సత్యమై యుండెను. ఆయన సత్యమునకు నివాసస్థానమైయుండెను. క్రీస్తును కలిగియున్నవారు సత్యమును కలిగియుందురు, సత్యము మరెక్కడ లభించదు, క్రీస్తుయేసు జీవమై యుండెను.

జీవమునకు ఆధారము ఆయనే. ఆత్మీయ జీవమునకును, నిత్యత్వము నకును ఆధారమాయనే. ఆయనను స్వీకరించువారందరు నిత్యజీవమును పొందుదురు. ఎందుకనగా ఆయనే జీవమైయుండెను.

అనేక మార్గములలో యేసు ఒక మార్గమై యుండలేదు. ఆయనే ఏకైక మార్గమైయున్నాడు. ఆయనద్వారానే తప్ప ఎవడును తండ్రియొద్దకు రాడు. పది ఆజ్ఞలుగాని, బంగారు సూత్రముకాని, అభిషేకములుగాని, సంఘ సభ్యత్వముగాని, దేవునియొద్దకు నడిపించలేవు గాని, యేసుక్రీస్తు మాత్రమే నడిపించగలడు.

చాలమంది ఒకడు నిజాయితీగా జీవించగలిగిన చాలునని చెప్పుదురు. ప్రతి మతమునందు ఏదేని కొంత మంచి ఉండును గనుక, అన్ని మతములు పరలోకమునకు దారితీయునని చెప్పుదురు నా ద్వారానే తప్ప ఎవడును తండ్రియొద్దకు రాడు. అని యేసు చెప్పెను.

14:7,8 తండ్రికి తనకుగల సంబంధమును మరియొకసారి ప్రభువు వివరించు చున్నాడు. యేసు ఎవరోయని శిష్యులు గుర్తించిరా? వారికి తండ్రి ఎవరో తెలియును. ఎందుకనగా ప్రభువు తండ్రిని ప్రత్యక్షపరచెను. యేసు పునురుత్థానుడైనప్పటినుండి, ఆయన దేవుని కుమారుడని గుర్తించిరి.

క్రీస్తును ఎరిగినయెడల తండ్రిని ఎరుగుదు రనియు, యేసును చూచువాడు తండ్రిని చూచుననియు శిష్యులు తెలిసికొందురు. దేవుడును, ప్రభువైన యేసును ఒకే వ్యక్తియని ఈ వాక్యము వివరించుటలేదు. దైవత్వమునందు ముగ్గురు వేరువేరు వ్యక్తులు కలరుగాని దేవుడొక్కడే. తండ్రిని గురించి ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత నపేక్షించి, ఫిలిప్పు ప్రభువు నడిగెను. ప్రభువు చెప్పిన దంతయు, చేసినదంతయు ప్రభువే తండ్రిని ప్రత్యక్షపరచెనని ఫిలిప్పునకు తెలియలేదు.

14:9 – 11 ప్రభువు ఎంతో సహనముతో ఫిలిప్పును సరిచేసెను. ప్రభువుతో ఫిలిప్పు చాలాకాలము జీవించెను. ఇతడు మొదటిగా పిలువబడిన శిష్యుడు (యోహాను 1:43). అయినను క్రీస్తుయొక్క దైవత్వమును గూర్చిన సంపూర్ణ సత్యమును, క్రీస్తు తండ్రితో ఏకమైయున్న సంగతి ఫిలిప్పునకు బోధపడలేదు.

పరలోకమునకు మార్గము – క్రీస్తు “నేనే మార్గమును, సత్యమును, జీవమునైయున్నాను” (14:1-14) :

తాను యేసును చూచునప్పుడెల్ల తండ్రిని నిర్ధిష్టముగా ప్రత్యక్షపరచు యేసును చూచుచున్నానని ఫిలిప్పు గ్రహించుటలేదు. “నేనే తండ్రిననియు, తండ్రి నా యందున్నాడనియు” ప్రభువు చెప్పుటలో తండ్రికి, ఆయనకుగల సన్నిహిత సంబంధము కానవచ్చుచున్నది.

వారిరువురు వేర్వేరు వ్యక్తులే. తలంపులయందును, పనులయందును వారేకమైయున్నారు. దీనిని మనము గ్రహింప కున్న యెడల నిరుత్సాహము చెందనవసరములేదు. మానవులెవరూ దైవత్వమును గూర్చి సంపూర్ణముగా గ్రహించలేరు. మన మెన్నడు తెలిసి కొనలేని విషయములు తెలిసికొన్నప్పుడు ప్రభువుకే మనము ప్రాధాన్యత నివ్వవలసియున్నది.

మన మాయనను పూర్తిగా అర్థము చేసికొనినయెడల ఆయన ఎంత గొప్పవాడో అంతటి గొప్పవారము కాగలము. “నేను మీతో మాట్లాడు మాటలు నాయంతటనేనే చెప్పుటలేదు గాని, నా యందు నివసించుచున్న తండ్రియే ఈ మాటలను పలుకుచున్నాడు, మరియు నేను చేయు పనులు నా యంతట నేను చేయుట లేదుగాని నాయందు నివసించుచున్న తండ్రియే ఈ అద్భుతములను నిర్వర్తించుచున్నాడు.

” అని ప్రభువు చెప్పెను. అయితే ఆయన యెహోవా దేవుని సేవకునిగా వచ్చినందున తండ్రికి సంపూర్ణ విధేయతతో సమస్తమును మాట్లాడి నెరవేర్చెను. ఆయన ఇచ్చు సాక్ష్యమునుబట్టి ఈయన తండ్రితో నున్నాడని శిష్యులు విశ్వసింపవలసియున్నారు. లేనియెడల ఆయన చేయుచున్న కార్యములను బట్టియైనను వారు నమ్మవలసి యున్నది.

14:12 తనయందు విశ్వాసముంచువాడు తాను చేయుచున్నట్లు సూచకక్రియలు, అద్భుతములు మరిగొప్పవియు చేయునని చెప్పెను. ప్రభువు చేసిన స్వస్థత కార్యములు (శారీరక స్వస్థతలు) అపొ॥ కార్య॥ గ్రంథమందు శిష్యులు చేసినట్లుగా చూడగలము అంతకంటే గొప్పక్రియలు అనగా ఒక దినమున (పెంతెకొస్తు దినమున) 3 వేలమంది రక్షింపబడుటను మనము గమనించుచున్నాము.

ప్రపంచ వ్యాప్తంగా సువార్త ప్రకటింప బడుట, అనేకులు రక్షింపబడుట, ప్రభువుయొక్క సంఘము కట్టబడుట అనునవి ప్రభువు చెప్పిన గొప్పకార్యములు శరీర స్వస్థతకంటే ఆత్మ రక్షణ గొప్పది. ఆయన పరమునకు తిరిగి వెళ్ళినప్పుడు మహిమపరచబడెను.

పరిశుద్ధాత్మ దేవుడు భూమిపైకి పంపబడెను పరిశుద్ధాత్మయొక్క శక్తినిబట్టి శిష్యులు ఇట్టి గొప్ప కార్యములు చేసిరి. 14:13,14 ప్రభువు వారితో లేకున్నప్పటికి, ఆయనద్వారా తండ్రిని వారడిగిన దానినెల్ల పొందగలుగుటలో వారికెంత ఆదరణ! విశ్వాసి తాను అడిగిన ప్రతిదానిని పొందగలుగునని దీని భావము కాదు.

ఈ వాగ్దానములోని రహస్యము ‘ఆయన నామములో’ అనునది. నా నామము పేరిట మీరేది అడిగినను అనుటలో ప్రతి ప్రార్థన చివర ఆయన పేరును ఉచ్ఛరించుట కాదు; మనము అడుగునది ఆయన చిత్తప్రకారము, ఆయన ఉద్దేశ్యము చొప్పున అడుగవలెను;

పరలోకమునకు మార్గము - క్రీస్తు  Bible Verses Chapter 14

మనము అడుగునది ప్రభువు మహిమార్థమై, మానవకోటి ఆశీర్వార్థమై మన ఆత్మీయ క్షేమము నిమిత్తము అడుగవలెను క్రీస్తు నామమున అడుగుటకు ఆయనతో సహవాసము కలిగియుండ వలెను, అట్లు సహవాసము లేనియెడల ఆయన చిత్తము కనుగొనలేము; మనము ఆయనకు ఎంత సమీపముగా జీవించుదుమో అంతగా ఆయన కోరికకు అను గుణముగా అడిగెదము.

దేవుని దృష్టికి అనుకూలమైన దానిని ప్రభువు చేసియున్నాడు గనుక తండ్రి ఆయనయందు మహిమపరచబడెను! దేవుని ప్రజలకు ప్రోత్సాహ కరముగా నుండుటకు ఈ వాగ్దానము గట్టిగా చెప్పబడెను. ఆయన చిత్త ప్రకారము జీవించుచు, ప్రభువుతో సహవాసముకలిగి నడుచుకొనుచు, ఆయన కోరిక మేరకు మనము అడుగుచు నుండిన యెడల అట్టివాటికి సమాధాన మనుగ్రహింపబడును.

ఆదరణకర్తను గూర్చిన వాగ్దానము (14:15-26) :

14:15 ప్రభువైనయేసు తన శిష్యులను వదలి వెళ్ళనైయుండగా, వారి హృదయములు దుఃఖముతో నిండుకొనెను. ఆయనిచ్చిన ఆజ్ఞలను గైకొనుటద్వారా వారు ఆయనపట్ల తమకున్న ప్రేమను వ్యక్తపరచవలెను. కన్నీరు కార్చుటవలననే కాదు గాని, విధేయత చూపించుటవలననే. ఆయన ఆజ్ఞలేవనగా క్రొత్త నిబంధనలో ఉన్న సువార్తలలోను, ఇతర పుస్తకములలోను యిమిడియున్న నియమములే.

14:16 ప్రార్ధన అను పదము తక్కువవాడు ఎక్కువ వానికిచేయు విజ్ఞాపన కాదుగాని, ఒకే స్థాయిలోనున్నవాడు చేసికొను విన్నపమైయున్నది. ఇక్కడ ప్రభువు ఆదరణకర్తను పంపమని తండ్రిని వేడుకొనెను.

ఆదరణకర్త అనగా ఒక వ్యక్తికి సహాయకారిగా నిలుచువాడు ‘వకీలు’ అని కూడ చెప్పవచ్చును. ప్రభువైన యేసు ‘వకీలు’ లేదా ఆదరణకర్త. పరిశుద్ధాత్మ దేవుడు మరియొక ఆదరణకర్త, పరిశుద్ధాత్మ దేవుడు ఒకే స్వభావము కల్గిన ఆదరణకర్తగాని, వేరు స్వభావము కల్గిన వాడుకాదు. విశ్వాసియందు పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడు వసించును.

పాత నిబంధన కాలములో పరిశుద్ధాత్ముడు ఆయా సమయములందు మనుష్యులమీదికి వచ్చుచుండెడివాడు. మరల తిరిగి వెళ్ళు చుండెడివాడు. ఇప్పుడు అట్లుకాదు, ఆదరణకర్త ఎల్లప్పుడు వసించుటకే వచ్చెను.

14:17 పరిశుద్ధాత్మ దేవుడు ‘సత్యాత్మ’గా పిలువబడుచున్నాడు. ఎందుకనగా ఆయన బోధ సత్యమైనది మరియు సత్యమైయున్న క్రీస్తును మహిమపరచువాడు. లోకము ఆయనను అంగీకరింపదు ఎందుకనగా లోకమాయనను చూడలేదు. అవిశ్వాసులు తాము విశ్వసించకముందే చూడనపేక్షించుదురు. రక్షింపబడని వారు పరిశుద్ధాత్మను తెలిసికొనలేరు, గ్రహింపలేరు.

పరలోకమునకు మార్గము – క్రీస్తు “నేనే మార్గమును, సత్యమును, జీవమునైయున్నాను” (14:1-14) :

 

ఆయన వారిని పాపములనుగూర్చి ఒప్పింపజేయును గాని వారు దీనినెరుగరు. శిష్యులు పరిశుద్ధాత్మను ఎరుగుదురు. పరిశుద్ధాత్ముని కార్యము వారి జీవితములలో ఎరుగుదురు మరియు, ప్రభువైన యేసు ద్వారా ఆయన చేయు కార్యములలో ఆయనను చూచుదురు.

ఆయన నీతో నివసించును, ఆయన నీలో నివసించును, అని యేసు చెప్పెను. పెంతెకొస్తు పండుగకు ముందు పరిశుద్ధాత్మ దేవుడు వారి పైకివచ్చి వారిలో నివసించెను. అయితే పెంతెకొస్తు దినమునుండి ఎవడైనను ప్రభువైనయేసునందు విశ్వాసముంచినయెడల పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తియందు స్థిరనివాసమేర్పరచుకొనును.

దేవా నాయందున్న పరిశుద్ధాత్మను తీసివేయకుమని దావీదు ప్రార్థించెను. అయితే యీ దినములలో పరిశుద్ధాత్ముడు దుఃఖపరచబడినను, ఆర్పివేయబడినను, అభ్యంతరపరచబడినను, ఒక విశ్వాసినుండి పరిశుద్ధాత్ముడు తీసివేయబడడు.

14:18 ప్రభువు తన శిష్యులను అనాధలుగాను, దిక్కులేనివారిగాను ఎన్నడు వదలివేయడు. ఆయన వారియొద్దకు మరల వచ్చును. ఆయన పునరుత్థానుడైన తరువాత వారియొద్దకు వచ్చెను. పునరుత్థానుడై ఎట్లు వచ్చునని అనుమానము పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మునిద్వారా ఆయన వారియొద్దకు వచ్చునని మరియొక తలంపు. వ్రాయబడినట్లుగా ఆయన తనవారిని పరమునకు చేర్చుటకు వారి కొరకు రానై యుండెనని ఆ రీతిగా వచ్చునని మూడవ తలంపు.

14:19 ప్రభువైన యేసు సమాధి చేయబడిన తరువాత ఏ విశ్వాసియు ఆయనను చూడలేదు. ఆయన లేచిన తరువాత ఆయనను ప్రేమించిన వారికి అగుపించెను. ఆయన పరమునకు ఆరోహణమైన తరువాత ఆయన శిష్యులాయనను విశ్వాసము ద్వారా చూచుచున్నారు. ‘మీరు చూచెదరు’, ‘మీరు చూచుచున్నార’ను మాటలకు వ్యత్యాసమును దీనిలో మనము గమనించుచున్నాము. “నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించుచున్నారని” ప్రభువు చెప్పెను.

ఇక్కడ ఆయన పునరుత్థాన జీవితము కొరకు ఎదురు చూచుచు, ఆయనయందు విశ్వాసముంచువారందరికి ఆ జీవితము ఒక సవాలుగా ఉండునని చెప్పెను. వారు మరణించినప్పటికి, మరల మరణించకుండు నట్లు వారు తిరిగి లేతురు.

14:20 ‘ఆ దినము’ అనగా పరిశుద్ధాత్ముడు దిగివచ్చిన దినము. తండ్రి కుమారుల మధ్య ఎట్టి సన్నిహిత సంబంధము కలదో క్రీస్తునకు, ఆయనను నమ్మిన పరిశుద్ధ లకు జీవితములోను, ఆశయములలోను అట్టి సంబంధముండును, క్రీస్తు ఎట్లు విశ్వాసి యందుండునో అదే సమయమునందు విశ్వాసి క్రీస్తుయందెట్లుండునో వివరించుట కష్టతరము.

ఇనుపకోల నిప్పులో నుండును. నిప్పు ఇనుపకోలలో నుండును గాని ఇది సంపూర్ణ అర్థము నివ్వదు, క్రీస్తు విశ్వాసియందు జీవించుననగా ఆయన జీవితము విశ్వాసికి సంగ్రహింపబడెనని అర్థము. పరిశుద్ధాత్మునిద్వారా క్రీస్తు విశ్వాసియందు జీవించును. విశ్వాసి క్రీస్తుయందున్నాడనగా, వ్యక్తిత్వములోను, క్రియలలోను ఉత్తమమైనవానిగా దేవునియందు నిలుచునని అర్థము.

14:21 ఒకడు ప్రభువును ప్రేమించుచున్నాడనుటకు నిదర్శనము-ఆయన ఆజ్ఞలను విధేయతతో గైకొనుటే. అట్టివారిని దేవుడు ప్రేమించును. ఒక విధముగా చెప్పవలెనంటే తండ్రి ఈ లోకము నెంతయో ప్రేమించెను అయితే తన కుమారుని ప్రేమించువానిని ఆయన ప్రత్యేకముగా ప్రేమించును.

క్రీస్తుకూడ వారిని ప్రేమించును. తననుతాను ప్రత్యేకముగా కనుపరచుకొనును. మన మాయనను ప్రేమించుకొలది ఆయనను మరెక్కువగా తెలిసికొందుము.

14:22 ఈ వచనములో ప్రస్తావించబడిన ‘యూదా’ అనునతడు, ద్రోహియగు ‘యూదా’ పేరును కలిగియుండుట దురదృష్టకరము. దేవుని ఆత్మ ఇతనిగూర్చి ‘ఇస్కరియోతు కాని యూదా’ అని చెప్పుటద్వారా వీరిద్దరిమధ్య ఉన్న తేడా స్పష్టమగు చున్నది.

ఇతడు ‘యూదా పత్రిక’ వ్రాసిన యూదాయై యుండవచ్చును. ప్రపంచములో ఎవరికి కన్పించక, తన శిష్యులకు ఆయన ఎట్లు కన్పించగలడని అతడు తలంచెను. రక్షకుని రాక లోకమును జయించిన రాజు రాకవలె నుండునని అతడు తలంచెను.

పరలోకమునకు మార్గము – క్రీస్తు “నేనే మార్గమును, సత్యమును, జీవమునైయున్నాను” (14:1-14) :

ఆత్మద్వారా ప్రభువు తనవారికి ప్రత్యక్షపరచుకొనునన్న సంగతి అతడు గ్రహించలేదు. వారు విశ్వాసముద్వారా దేవుని వాక్యమునందు ఆయనను చూతురు. ప్రభువు ఈ భూమిపైనున్నప్పుడు శిష్యులు ఆయననుగూర్చి తెలిసికొనిన దానికంటే మరి ఎక్కువగా దేవుని ఆత్మద్వారా మనమాయనను తెలిసికొనుచున్నాము. వెనుక ఉన్న వారికంటె గుంపులో మొదటివాడే కేంద్రమునకు అతి సమీపముగానుండును కాని, విశ్వాసము ద్వారా మనలో ప్రతి ఒక్కరము ఆయనతో సన్నిహిత సహవాసము కలిగియుందుము.

14:23 – 25 ఒకడు వాస్తవముగా దేవుని ప్రేమించిన యెడల, ఆయన ఆజ్ఞలకే కాక బోధలన్నింటికి విధేయుడై యుండవలెను. ఏ ప్రశ్నలు లేక, నియమ నిబంధనలు లేక తన కుమారునికి విధేయుడైనవానిని తండ్రి ప్రేమించును. అట్టివారికి అనగా ప్రభువును ప్రేమించి, విధేయులైన వారికి తండ్రియు, కుమారుడును చేరువగా నుందురు.

ఆయనను ప్రేమింపనివారు ఆయన ఆజ్ఞలను గైకొనరు. వారు క్రీస్తు మాటలనే ధిక్కరించువారైయుండి తండ్రియైన దేవుని మాటలనుకూడ ధిక్కరించు చున్నారు. ఆయన వారితోనున్నంత కాలము వారు గ్రహింపగలిగినంతకంటె ఎక్కువగా వారికేమియు బోధింపలేదుగాని, తగుమాత్రమే బోధించెను. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎక్కువగా వారికి బోధించును.

14:26 పెంతెకొస్తు దినమున క్రీస్తు నామమున తండ్రి ఆత్మను పంపెను. క్రీస్తు ఉద్దేశములను ప్రకటించుటకు ఆయన వచ్చెను. ఆయనను మహిమపరచుటకు ‘ఆత్మ’గా దేవుడు రాలేదుగాని స్త్రీ పురుషులను రక్షకుని యొద్దకు చేర్చుటకు వచ్చెను. ఆయన మీకు సమస్తము బోధించునని ప్రభువు చెప్పెను.

అపొస్తలుల బోధద్వారా ఆయన దానిని నెరవేర్చెను. తరువాత వ్రాతపూర్వకమైన క్రొత్త నిబంధనద్వారా నెరవేర్చెను. రక్షకుని బోధయంతయు పరిశుద్ధాత్మ దేవుడు వారి జ్ఞాపకములోనికి తెచ్చెను.

యేసు తన శాంతినే శిష్యులకు అనుగ్రహించుట (14:27-31) : 14:27

సాధారణముగా ఒక వ్యక్తి చనిపోవుటకు ముందుగా తన స్వాస్థ్యము తనవారికి చెందుటకు వీలు వ్రాయును. అటులనే ప్రభువైన యేసు చేసెను. అయితే అది సొమ్ముకంటే విలువైనదియు వెలయిచ్చి కొనలేనిదగు సమాధానము.

ఈ సమాధానము పాపములు క్షమింపబడుటద్వారాను, దేవునితో సమాధానము పొందుట ద్వారాను కలుగుచున్నది. కలువరిలో తన రక్తమిచ్చి సంపాదించిన సమాధానమును వారి కనుగ్రహించెను. లోకమిచ్చునట్లుగా స్వార్థముతోను, కొన్ని నియమములతోను ఆయన వారికిచ్చియుండలేదు. ఆయన సమాధానము శాశ్వతకాలముండును. అట్లయిన క్రైస్తవుడెందుకు భయపడవలెను?

14:28 యేసు ఇప్పుడు వారిని వదలి వెళ్ళుచున్నాననియు, మరల వారిని కొని పోవుటకు వత్తుననియు ఇంతకు మునుపే వారికి చెప్పియుండెను. వారు ఆయనను ప్రేమించుచున్నయెడల, ఈ విషయము వారిని సంతోషింపజేయును. వారాయనను ప్రేమించుచున్నారు గాని, ఆయన ఎవరో పూర్తిగా ఎరిగియుండలేదు గనుక ఆయనపట్ల వారి ప్రేమ ఎంతగా ఉండవలెనో అంతగా లేదని చెప్పవచ్చును.

“తండ్రి నా కంటే గొప్పవాడు గనుక, మీరు నన్ను ప్రేమించినయెడల నేను తండ్రియొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు.” ప్రభువు మొదటినుండి తానును, తండ్రియు ఏకమైయున్నామని చెప్పు సమానత్వము ఇక్కడ భేదించుచున్నట్లుగా కనబడుచున్నది.

కాని ఏ భేదము లేదు. ప్రభువైన యేసు భూమిపైనున్నప్పుడు ఆయన తృణీకారము, వేదన హింస పొందెను. ప్రజలాయనను దూషించిరి. వ్యతిరేకించిరి. ఆయనపై ఉమ్మివేసిరి. సృష్టింపబడిన వారినుండి భయంకరమైన తిరస్కారమును ఆయన పొందెను.

అయితే తండ్రి అట్లు తిరస్కారమును ఎదుర్కొనలేదు. కౄరులైన పాపులకు దూరముగా ఆయన పరలోకమునందు నివసించెను. ప్రభువు పరమునకు వెళ్ళునప్పుడు తిరస్కారమునకు తావులేని స్థలమున ప్రవేశించెను. తాను తండ్రియొద్దకు వెళ్ళుచున్నానని చెప్పినపుడు వారు సంతోషించిరి.

పరలోకమునకు మార్గము – క్రీస్తు “నేనే మార్గమును, సత్యమును, జీవమునైయున్నాను” (14:1-14) :

ఈ విషయములో తండ్రి ‘యేసు’ కంటె గొప్పవాడై యున్నాడు. దైవత్వమునుగూర్చి చెప్పినయెడల తండ్రి, కుమారుడు సమానులే. అయితే ప్రభువైన యేసు ఎంతో తగ్గింపబడినవాడై దాసునిస్వరూపమును ధరించుట వలన తండ్రియైన దేవుడు ఆయనకంటె గొప్పవాడైయున్నాడు.

14:29,30 భయకంపితులైన శిష్యులకు వారు భయముచెందక బాధపడకుండునట్లు నిస్వార్ధముతో ఈ సంగతులను ప్రభువు వారికి తెలియజేసెను. తాను అప్పగింపబడ బోవు సమయము సమీపించుచున్నది.

గనుక తన వారితో ఎక్కువ సమయము గడుపుటకు సమయము లేదని ప్రభువునకు తెలియును. సాతాను వచ్చుచున్నాడనియు, తనయొద్ద ఏ పాపపు చిహ్నము వానికి దొరకదనియు ప్రభువునకు తెలియును.

14:31 ఈ చివరి వచనము మనమీలాగు చెప్పవచ్చును. నా సమయము సమీ పించియున్నది. నాకై నేనే సిలువను సమీపించుచున్నాను. నాయందు తండ్రి చిత్తమిదే. నేను నా తండ్రిని ప్రేమించుచున్నానని లోకము దీనినిబట్టి తెలిసికొనును.

కనుక నాయంతట నేనే దీనిని చేయుచున్నానని చెప్పి మనము ఇక్కడనుండి వెళ్ళుదుము లెండి అని వారినక్కడనుండి బయలుదేరదీసెను. వారు ఆ సమయమందు మేడగదిని విడచి వెలుపలికి వచ్చిరోలేదో వ్రాయబడలేదు గాని ఆ తరువాత సంభాషణయంతయు వారి మార్గమధ్యమున జరిగియుండవచ్చును.

Leave a Comment