ఆయన ఘనపరచబడిన గృహము – Bible Verses Chapter 12 in Telugu

పన్నెండవ అధ్యాయము

ఆయన ఘనపరచబడిన గృహము
మరియ యేసు పాదములను అభిషేకించుట (12:1-8) :

12:1,3 బేతనియలోనున్న ఇల్లు యేసుకు ప్రియమైనది. అక్కడ ఆయన లాజరు, మరియ మార్తల సహవాసమునందు ఆనందించెడివాడు. ఈ సమయమునందు యేసు బేతనియకు వచ్చుట ప్రమాదమును కొనితెచ్చుకొనుటయే. ఎందుకనగా ఆ గ్రామమునకు అతి దగ్గరలోనున్న యెరూషలేములో ఆయనను చంపుటకు ప్రయత్న ములు సాగుచున్న సమయమది.

అనేకులాయనను వ్యతిరేకించుచున్నప్పటికి ఆయన పట్ల నమ్మకమున్న వారు బహుకొద్దిమంది కలరు. ఆయనతోకూడ భోజనమునకు కూర్చుండినవారిలో లాజరు ఒకడు. మార్త ఉపచారము చేసెను. లాజరు లేపబడిన తరువాత తానేమి కని విని యున్నాడో లేఖనములందు వ్రాయబడలేదు.

స్త్రీ యేసును అభిషేకించుటను గూర్చి మరికొన్నిసార్లు వ్రాయబడెను. ఈ రెండు సన్నివేశములు ఒకటికావు. అయితే మరియ ఆయనను అభిషేకించుట మరి ఏ ఇతర సువార్తలలోను వ్రాయబడలేదు.

క్రీస్తుపట్ల ఆమెకుగల భక్తి ఆమెను అంతటి విలువగల అత్తరును ఆయన పాదములపై పోయునట్లు చేసెను. ఎంతటి విలువగలదైనను ఆయనకిచ్చుటయే ప్రధానమైనదని ఆమె భావము. మనకున్న విలువైన వాటికన్న యేసుప్రభువు అమూల్య మైనవాడని తెలియుచున్నది.

Read and Learn More Telugu Bible Verses

మనమెప్పుడు చూచినను, మరియ యేసు పాదములచెంత కూర్చుండుటను గమనించుచున్నాము. ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడుచుచున్నది. స్త్రీ యొక్క తలవెంట్రుకలు ఆమెయొక్క ఘనతను సూచించును. అనగా మరియ తన ఘనతనంతయు ఆయన పాదములచెంత నుంచెను.

ఈ పరిమళ వాసనను అన్ని కాలములకు వ్యాపింపజేసినది. కనుక క్రీస్తును ఆరాధించిన వారు ఆ సమయమునందు వెదజల్లబడిన పరిమళ వాసనను కొంత తీసికొనిపోవుదురు. ఏ గృహము ఆయనకు ఇవ్వవలసిన స్థానము ఇచ్చునో ఆ గృహము పరిమళముతో నిండియుండునంతగా మరి ఏ గృహమును నిండియుండదు.

ఆయన ఘనపరచబడిన గృహము మరియ యేసు పాదములను అభిషేకించుట (12:1-8) :

12:4,5 ఈ విధమైన పరిశుద్ధ సన్నివేశములయందు శరీరము ప్రవేశించుచున్నది. అంతగొప్ప విలువైన అత్తరు ఈ విధముగా వాడబడుట ‘యూదా’ కు ఏ మాత్రము ఇష్టములేదు. ప్రభువు మూడువందల పెన్నీల ఖరీదు చేయడని అతని అభిప్రాయము. ఈ అత్తరును అమ్మి దాని ఖరీదును బీదలకివ్వవలెనని అతడి అభిప్రాయమైయున్నది.

ఇది అతని శుద్ధమైన వేషధారణయైయున్నది. పేదవారి పట్లగాని, యేసుపట్లగాని అతనికి లక్ష్యము లేదు. యేసును అతడు మూడువందల పెన్నీలలో పదియవవంతు అనగా ముప్పది వెండి నాణెములకే అమ్మజూపుచున్నాడు.

రైలుగారు యీ విధముగా చెప్పుచున్నారు ఎవరైనను క్రీస్తును మూడు సంవత్సరములు వెంబడించి, ఆయన చేసిన అద్భుతములను చూచి, ఆయన బోధనంతయు విని, ఆయన కృపాకనికరము లను బొంది, అపొస్తలుడుగా లెక్కింపబడి, హృదయమునందు స్వస్థచిత్తుడుకానియెడల చూచుటకు ఇదంతయు, నమ్మదగనిదిగాను, అసాధ్యమైనదిగాను ఉండును. యూదా విషయములో ఇట్లు జరుగవలసినదే. నశించిపోవు మానవుని పరిస్థితిని మనము ఇక్కడ చూడవచ్చును.

12:6 ఈ నష్టమెందుకు అని యూదా చెప్పుటలో తాను బీదవారిపట్ల శ్రద్ధ కలిగి కాదుగాని, తాను ‘దొంగ’ యగుటచే అట్లు చెప్పెనని సువార్తికుడైన యోహాను వివ రించెను. యూదా దగ్గర డబ్బుసంచి యుండుటచే అందులో వేసినది అతడు దొంగిలించుచు వచ్చెను.

12:7,8 మీరామెను ఆటంకపరచకుడి. నేను చనిపోయి పాతిపెట్టు దినమువరకు ఆమెను దీనిని ఉంచుకొననియ్యుడి. ఆమె ఇట్లు ఆరాధించుటవలన ఆమెయొక్క ప్రేమ, ఆరాధన తెలియవచ్చుచున్నది.

ఆ విధముగా చేయుటకు ఆమెకు అవకాశమియ్య వలెను. పేదవారిపట్ల, ఇట్లు ప్రేమను ప్రదర్శించు సమయములు మునుపెన్నడు మనకు కానరావు. ప్రభువుయొక్క పరిచర్య త్వరగా ముగియనున్నది.

కనుక మరియకు ఆయనను ఆరాధించు అవకాశము ఎల్లప్పుడు కలుగదు. ఆత్మీయావకాశములుకూడ జారిపోవుచున్నవని దీనినిబట్టి తెలియుచున్నది. మనము రక్షకునికొరకు చేయదగినది ఆలస్యము చేయక చేయుదము.

లాజరును చంపుటకు ప్రయత్నించుట (12:9-11) :

12:9 యేసు యోరూషలేమునకు సమీపముగా నున్నాడను మాట త్వరగా వ్యాపిం చెను. ఆయన ఉనికిని రహస్యముగానుంచుట అసాధ్యము. యూదులనేకులు బేత నియకువచ్చి ఆయనను చూచిరి. కొంతమంది ఆయన లేపిన లాజరునుకూడ చూచుటకు వచ్చిరి.

ఆయన ఘనపరచబడిన గృహము మరియ యేసు పాదములను అభిషేకించుట (12:1-8) :

12:10,11 వెట్టితనము మానవ హృదయమునకు ద్రోహము కలిగించును. ప్రధాన యాజకులు లాజరునుకూడ చంప నాలోచించిరి. లాజరు మరణించి తిరిగి లేచుట వలన అతడు రాజద్రోహియాయెను. అతడు మరణించి తిరిగిలేచుట వలననే అనేకులు యేసును విశ్వసించుటకు కారణము గనుక లాజరును చంపవలెనను తలంపు యూదు లకు కలిగెను. ప్రభువునొద్దకు ఎవరు అనేకులను తీసికొని వచ్చెదరో వారు హింసకును, మరణమునకును గురిచేయబడుచుండిరి.

క్రీస్తు యెరూషలేములో ప్రవేశించుట (12:12-19) :

12:12-14 విజయోత్సవముతో యేసు యెరూషలేములో ప్రవేశించుటను మనము చూచుచున్నాము. ఆయన చంపబడక మునుపు విశ్రాంతి దినమది. ప్రజలు యేసును గూర్చి ఏమనుకొనుచున్నారో ఇంకను తెలియరాలేదు.

ఆయన నిజముగా దేవుని కుమారుడనియు, ఇశ్రాయేలీయులు ఎదురుచూచుచున్న ‘మెస్సీయ’ అని గ్రహించి యున్నారా? లేదా రోమా సామ్రాజ్యాధిపత్యము క్రింద మ్రగ్గుచున్న తమను విడిపించు టకు వచ్చిన ‘రాజు’ అని గుర్తించిరా? ఆ గుంపులో ఉన్న కొంతమంది నిజమైన విశ్వాసులేగాని అనేకులు వారి హృదయములో ప్రభువుపట్ల నిజమైన ఆసక్తిని కలిగి యుండలేదు.

వారి చేతిలోనున్న ఖర్జూరపు మట్టలు దుఃఖము పొందిన తరువాత విశ్రాంతికి, సమాధానమునకు సాదృశ్యముగా నున్నవి. (ప్రకటన 7:9). హోసన్న అనగా “ఇప్పుడే రక్షించుము, మేము నిన్ను ప్రార్థించుచున్నాము” అని అర్థము, దీనినిబట్టి ప్రభువైన యేసు దేవునియొద్దనుండి పంపబడెననియు, రోమా ప్రభుత్వము యొక్క హింసలనుండియు, అన్యుల అధికారముక్రింద అణిగిపోయి అనేక సంవత్సర ములుగా దుఃఖించుచున్న తమ్మును విడిపించి రక్షించుటకు వచ్చెననియు వారు నమ్ముచున్నారు. గాడిదపిల్లనెక్కి యేసు పట్టణములో ప్రవేశించెను.

గాడిద అనగా “భారవాహకము.” యేసు ప్రవచనములు నెరవేరు నిమిత్తము “సీయోను కుమారీ భయపడకుము ఇదిగో నీ రాజు గాడిదను ఎక్కి వచ్చుచున్నాడు”. అని జెకర్యా 9:9 లో చెప్ప బడినట్లుగా ఇది జరిగెను.

ఆయన ఘనపరచబడిన గృహము మరియ యేసు పాదములను అభిషేకించుట (12:1-8) :

12:15-17 సీయోను కుమార్తె యూదా జనాంగమును సూచించుచున్నది. సీయోను అనునది యెరూషలేములో నొక కొండ. జరిగినదంతయు జెకర్యా ప్రవక్త ప్రవచించి నట్లుగా జరిగెనని శిష్యులు గ్రహింపరైరి. ఆయన యూదులు రాజువలెనే యెరూషలేములో ప్రవేశించియున్నాడు.

అయితే ప్రభువు ఆరోహణుడై తండ్రియొక్క కుడిపార్శ్వమున మహిమపరచబడుటకు కూర్చుండునంతవరకు వారు దీనిని గ్రహింపలేదు. ఆయన యెరూషలేములో ప్రవేశించినపుడు చూచిన యూదులనేకులు బేతనియలో చనిపోయిన లాజరును లేపినపుడు ఆయనను చూచినవారే, ఆయనను చూచుటవలన మరల ఆ అద్భుత కార్యము జ్ఞప్తికి వచ్చెను.

12:18-19 ఈ వార్త వినిన వెంటనే ఆయనను చూచుటకు గుంపులు గుంపులుగా జనసమూహము కూడివచ్చెను. ఇది వారి ఆతృతను సూచించుచున్నది గాని, విశ్వాస మును కాదు. కూడివచ్చిన గుంపులో పరిసయ్యులుకూడ ఉండుటచే రక్షకుని విషయమై ఆసక్తి పెల్లుబికెను.

వారేమి చెప్పినను, ఏమి చేసినను నిష్ప్రయోజనమైపోయెను. ఇదిగో, లోకము ఆయనవెంట పోయెనని చెప్పుకొని నిట్టూర్చిరి. అయితే ఆ గుంపం తయు చెదరిపోవువారేననియు, వారిలో కొద్దిమంది మాత్రమే ఆయనను దేవుని కుమారునిగా ఆరాధించువారని వారికి తెలియలేదు.

యేసును చూడవలెనను గ్రీసు దేశస్థుల కోరిక (12:20-26) : 12:20

యూదా మతమును అంగీకరించిన అన్యులు (గ్రీసుదేశస్థులు) ఆయన యొద్దకు వచ్చిరి. వారి పితరులు ఆచరించిన మతాచారములను పాటించక ఈ పండుగ సమయములో దేవుని ఆరాధించుటకు వచ్చినవారు వీరు. ఇది యూదులు ప్రభువును తృణీకరించినప్పుడు, అన్యులు సువార్తద్వారా యేసునందు విశ్వాసముంచు పటమును చూపించుచున్నది.

12:21 – 24 వారు ఫిలిప్పునొద్దకు వచ్చుటకుగల కారణమేమో తెలియదు. అతని పేరు గ్రీకుపదమై యుండుటవల్లనో లేక అతడు బేత్సయిదావాడై యుండుటవల్లనో వారతని యొద్దకు వచ్చిరి. వారి కోరిక విలువ గలది మరియు గంభీరమైనది.

అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని చెప్పిరి ఈ కోరిక గలవారెవరైనను నిరాశతో వెనుదిరిగి పోనవసరములేదు. అయితే యీ గ్రీసు దేశస్థులను ప్రభువు చూచెదరను నమ్మకము ఫిలిప్పునకు లేదు.

ఎందుకనగా గ్రీసు దేశస్థులకు సువార్త ప్రకటింపరాదని మునుపు యేసు వారికి ఖండితముగా ఆజ్ఞాపించియుండెను. కనుక ఫిలిప్పు అంద్రెయను కలసికొని, వారిరువురు ఈ గ్రీసు దేశస్థులను ప్రభువునొద్దకు తీసుకొనివచ్చిరి.

గ్రీసుదేశస్థులు అడిగిన ప్రశ్నకు మొదటిగా ప్రభువు సమాధానము వ్యతిరేకముగానుండెను. సాధారణముగా గ్రీకులయొక్క నాగరికత, వారి ముందు చూపు, స్వాభిలాష, వారి సిద్ధాంతములన్నియు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా నున్నవని ప్రభువు వారితో చెప్పెను.

వారు ఎదురుచూచు ఆశీర్వాదమును ఆయన వారికొరకు మరణించుటద్వారానే పొందగలరని ప్రభువు సూచించియున్నాడని కొందరు చెప్పుదురు. ఎందుకనగా విత్తనము భూమిలోపడి చనిపోయినప్పుడే అది విస్తారముగా ఫలించును. ప్రభువే ఆ గోధుమ గింజ, ఆయన మృతిచెందనియెడల ఆయన ఒంటిగా నుండును.

పరలోక మహిమనంతటిని ఆయన ఒక్కడే అనుభవించునుగాని, ఆయన మహిమను పంచుకొనుటకు రక్షింపబడిన పాపి ఒక్కడైనను ఉండడు. కాని ఆయన చనిపోవుటవలన అనేకులాయనయందు విశ్వాసముంచి ఆయన ఏర్పరచిన రక్షణ మార్గముద్వారా పరలోక మహిమలో ప్రవేశించుదురు.

యేసును చూడవలెనను గ్రీసు దేశస్థుల కోరిక (12:20-26) : 12:20

T. G. రేగ్లండుగారు ఇట్లు చెప్పుచున్నారు : మనము భూమిలో పడిన దాన్యపు గింజగా నుండుటకు అంగీకరించనియెడల అనగా మన అభివృద్ధిని త్యాగము చేయని యెడల మనలను మనము నలుగగొట్టుకొననియెడల మన ఆస్థిని, ఆరోగ్యమును, మన ఇంటిని, కుటుంబ బంధములను క్రీస్తుయేసుకొరకు నష్టపరచుకొనని యెడల, తెంచుకొననియెడల మనము ఒంటిగానే యుందుము.

మనము ఫలింపవలెనని ఆశించినయెడల, ధన్యుడైన మన ప్రభువును అనుసరించి, గోధుమగింజవలె భూమిలో పడి చనిపోయినప్పుడు మనము ఫలించి అభివృద్ధి పొందుదుము.

12:25, 26 అనేకులు ఈ భూమిపై ఆహారము, వస్త్రము సుఖములు మొదలగు వాటిని తమ జీవితమునందు ముఖ్యమైనవిగా భావించుదురు. వారు వీటికొరకు మాత్రమే జీవించుదురు. శరీరముకంటె ఆత్మ ప్రాముఖ్యమైనదనియు వారు గ్రహింపక, ఆత్మ క్షేమమును నిర్లక్ష్యము చేయుట వలన దానిని కోల్పోవుదురు.

అయితే క్రీస్తుకొరకు సమస్తము నష్టముగా ఎంచుకొనువారు కలరు. వారు మనుష్యులలో ఎక్కువగా కొని యాడబడు దానిని నష్టపరచుకొందురు గాని నిత్యజీవము కొరకు తమ ప్రాణములను కాపాడుకొందురు.

ఒకడు తన ప్రాణమును ద్వేషించుచున్నాడనగా, తన స్వయిష్టము కంటె క్రీస్తునే ఎక్కువగా ప్రేమించుచున్నాడని అర్థము, ఒకడు క్రీస్తును సేవించవలె నన్నచో ఆయనను వెంబడింపవలసి యున్నాడు.

ఆయన సేవకులు ఆయన బోధకు విధేయులై నీతియుక్తముగా ఆయనను పోలియుండవలెను. ఆయన మరణముతో వారిని పోల్చుకొనవలెను. ఆయనయొక్క కాపుదల ఇప్పుడును, ఎల్లప్పుడును (నిత్యత్వ మంతటిలో) వారితోనుండునని ఆయన వాగ్దానము చేయుచున్నాడు ఈ దిన పరిచర్య రానున్న దినమందు ఆయన మెప్పును పొందును.

పరలోకములో నున్న తండ్రియైన దేవుని నిమిత్తము పొందిన సిగ్గును అవమానమును ఆ మహిమ యెదుట ఎన్న దగినవిగా కనిపించవు.

క్రీస్తు మరణమును ఎదుర్కొనుట (12:27-36):

12:27, 28 జరుగనైయున్న సంగతులను గురించి ప్రభువు ఇప్పుడు ఆలోచించు చున్నాడు. ఆయన పాపమును భరించు సమయమునుగూర్చియు సిలువను గూర్చియు ధ్యానించుచుండెను. ఈ విధముగా సిలువ మరణమును గురించి ఆలోచించుచుండగా ఆయన కలవరపడెను.

ఆ సమయమునందు ఆయన ఎట్లు ప్రార్థించెను? ఆ గడియనుండి తనను తప్పించమని తండ్రిని ప్రార్థించెనా? లేదు. ఇందు నిమిత్తమే ఆయన ఈ లోకమునకు వచ్చెను. కనుక ఆయన సిలువను సమీపించుచుండెను.

ఆయన ఘనపరచబడిన గృహము Bible Verses Chapter 12

చనిపోవుటకే ఈ లోకమునందు ఉద్భవించెను. తన తండ్రి నామము మహిమపరచు మని ప్రార్థించెను. తన క్షేమముకంటే తండ్రికి మహిమ చేకూర్చుటే తన యిష్టమై యున్నది. నేను దానిని మహిమపరచితిని మరల దానిని మహిమపరతును అని తండ్రి పరలోకమునుండి పలికియున్నాడు.

భూమిపై యేసుప్రభువు చేసిన పరిచర్యను బట్టి దేవుని నామము మహిమపరచబడియున్నది. నజరేతులోని యేసు జీవించిన ముప్పది సంవత్సరముల నిశ్శబ్ద జీవితము, ఆ తరువాత బహిరంగముగా ఆయన చేసిన మూడు సంవత్సరముల పరిచర్య ఆశ్చర్యకరమైన రక్షకుని మాటలు, పనులు, తండ్రి నామమును మహిమపరచెను. రక్షకుని మరణము, పునరుత్థానము, ఆరోహ ణముద్వారా దేవుని నామము మరింతగా మహిమపరచబడనైయున్నది.

12:29 ఆయనయొద్ద నిలుచుండినవారు దేవుని మాటలను ఉరుముగా అర్థము చేసికొనిరి. అద్భుతములను గురించిన వాస్తవమును అంగీకరించని కొందరు స్వాభావిక సూత్రముల ననుసరించి ఆ అద్భుతములను వివరించ పూనుకొందురు.

మరికొందరు అది ఉరుము కాదని గుర్తించిరిగాని, దేవుని స్వరముగా గుర్తించలేదు. వినినది మానవా తీతమైన స్వరమనియు, దేవునిదూత స్వరమనియు భావించిరి. పరిశుద్ధాత్ముని సహాయము వలననే ఒకడు దేవుని స్వరమును వినగలడు. గ్రహించగలడు. ఒకడు సువార్తను తరచుగా వినినను పరిశుద్ధాత్ముడు ఆ సువార్తద్వారా వానికి బోధింపకుండిన యెడల అతడు అర్థరహితముగా ఉండవచ్చును.

12:30,31 అప్పుడు యేసు పరలోకమునుండి వచ్చిన ఈ స్వరము తాను వినుటకు రాలేదు గాని తనచుట్టు నిలువబడినవారు వినుచుండు నిమిత్తమే వినవచ్చెనని చెప్పెను. ఈ లోకముయొక్క తీర్పు ఆరంభమిది! జీవమును మహిమనైయున్న ప్రభువును ఈ లోకము సిలువవేయుచున్నది.

ఇట్లు చేయుటవలన లోకము తనపై తానే శిక్ష విధించు కొనుచున్నది. క్రీస్తును నిరాక్షేపముగా తృణీకరించుటవలన లోకమునకు తీర్పురానై యున్నది. పాపాత్ములైన మనుష్యులమీదికి తీర్పు రానైయున్నది.

ఈ లోకాధికారి సాతాను కలువరిలో ఘోరముగా ఓడింపబడెను. ప్రభువైన యేసు సిలువవేయబడుట వలన తాను గెలుపొందెనని సాతాను తలంచుచున్నాడు. రక్షకుడు మానవులను రక్షించుటకు రక్షణమార్గమేర్పరచి, అదే సమయమునందు సాతానును, వాని అనుచరు లను ఓడించెను. ఇప్పుడు సాతాను నాశనము చేయబడలేదు గాని, సాతాను అగ్ని గుండములో పడవేయబడునంతవరకు ఆ నాశనమునకు ముద్రవేయబడెను.

12:32 ఈ వచనములోని మొదటి భాగము క్రీస్తుయొక్క సిలువ మరణమునుగూర్చి చెప్పుచున్నది. ఆయన మేకులతో సిలువకు కొట్టబడి భూమికి పైగా ఎత్తబడెను. ఆ విధముగా ఆయన ఎత్తబడి మనుష్యులనందరిని తనవైపు ఆకర్షించుకొనును.

రక్షించుటకు గాని, తీర్పునకు గాని అందరిని ఆయనవైపునకు ఆకర్షించునని కొందరు చెప్పుదురు. సువార్త బోధయందు క్రీస్తును ఎత్తి చూపించినచో ఆ బోధ ఎక్కువ శక్తిగలదై ఆత్మలు ఆయనయొద్దకు ఆకర్షింపబడును అని కొందరు చెప్పుదురు.

ప్రభువు మరణించుటద్వారా అనేక జాతులకు చెందిన మానవులందరూ ఆయనయొద్దకు ఆకర్షింపబడుదురు. (మానవులందరు అని దీని భావము కాదుగాని, ప్రతి జాతి, గోత్రము, భాషలోని ప్రజలు ఆయనయొద్దకు ఆకర్షింపబడుదురని భావము).

12:33, 34 ప్రభువైన యేసు పైకెత్తబడవలెననగా ఆయన ఏలాటి మరణము పొందనైయున్నాడో అనగా ఆయన పొందు సిలువ మరణమునుగూర్చి ఈ వచనము చెప్పుచున్నది. ప్రభువుయొక్క పరిపూర్ణజ్ఞానమును దీనిలో మనము చూచుచున్నాము.

ప్రభువు పైకెత్తబడవలసియున్నదను మాట ప్రజల హృదయములలో కలవరము రేకెత్తించినది. ఆయన తాను మెస్సీయనని చెప్పుకొనుచున్నాడని వారికి తెలియును. అయితే మెస్సీయ ఎల్లప్పుడు జీవించువాడు, అని (యెషయా 9:7; కీర్తన 110:4; దానియేలు 7:14; మీకా 4:7) చెప్పబడినది.

యేసు “మనుష్యకుమారుడు పైకెత్తబడిన యెడల” అని చెప్పియున్నాడని ప్రజలు అనుచున్నారు. అయితే వాస్తవముగా ఆయన ఇక్కడ “నేను పైకెత్తబడిన యెడల” అని చెప్పెను. ప్రభువు అనేక సార్లు తాను మనుష్యకుమారునిగా చెప్పుకొనెను. కనుకనే ప్రజలు “దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు” అను రెండు తలంపులు కలిగియుండిరి. మనుష్యకుమారుడెవడని ప్రజలు
యేసును అడిగిరి.

12:35 వారికి జవాబుగా తాను లోకమునకు వెలుగైయున్నానని చెప్పెను. అయితే ఈ వెలుగు కొద్దికాలము మాత్రమే వారితో ఉండునని ఆయన చెప్పెను. వారు వెలుగునొద్దకువచ్చి వెలుగులో నడువవలెను.

లేనియెడల చీకటి వారిని క్రమ్మును అప్పుడు వారు తొట్రుపడెదరు. ప్రభువు సూర్యుని వెలుగువలె పగటి కాలమందే ప్రకాశించును. సూర్యుడు ఉదయముననే ఉదయించి మధ్యాహ్నమున శిఖరమును అధిరోహించి సాయంకాలమందు అస్తమించును.

నిర్ణీత కాలమువరకే వెలుగు మనతో నుండును. కనుక వెలుగు ఉన్నప్పుడే మనము మన పని పూర్తి చేసుకొనవలెను. ఏలయనగా చీకటి సమయమునందు మనమేమి చేయలేము. మరియు మనకేమియు ప్రయోజనముండదు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచువాడే వెలుగులో నడుచుకొను వాడు.

అయితే ఆయనను తృణీకరించువాడు చీకటిలో నడుచువాడైయుండి, తానెక్కడికి పోవుచున్నడో తానే ఎరుగడు గనుక దేవుని కాపుదలను పోగొట్టుకొనును. మరియు వాడు తొట్రుపడును.

12:36 సమయముండగానే తనయందు విశ్వాసముంచుమని అక్కడ తన మాటలు వినుచున్న వారితో ప్రభువు చెప్పుచున్నాడు. అట్లు వారు వెలుగుబిడ్డలై తామెక్కడికి పోవుచున్నారో తామెరిగియుండి నిత్యత్వములో ప్రవేశించుదురు. యేసు ఈ మాటలు వారితో చెప్పి వారికి కనబడకుండ కొంతసేపు దాగియుండెను.

యూదులు ఆయనను నమ్మలేక పోవుట (12:37-43) :

12:37,38 యేసు ఇన్ని అద్భుతములు చేసినప్పటికి వారు ఆయనను నమ్మలేక పోవుట సువార్తికుడైన యోహానుకు మిక్కిలి ఆశ్చర్యము కలిగించెను. వారి అపనమ్మ కత్వమునకు కారణము వారికి సరియైన ఆధారములు లేకకాదు.

తన దైవత్వమును నిరూపించుకొనుటకు అనేక ఆధారములు వారి ముందుంచినప్పటికి వారు నమ్ముటకు ఇష్టపడరైరి. తమ్మును పరిపాలించుటకు తమకు రాజు కావలెనని ఆశించిరిగాని, వారు పశ్చాత్తాపపడుటకు ఇష్టపడలేదు.

వీరి అవిశ్వాసము (యెషయా 53:1) ప్రవచనము నెరవేర్పు. “ప్రభువా మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను?” ఇది ప్రశ్న – “ఎంతోమంది కాదు.” దీని జవాబు ప్రభువుయొక్క బాహువే దేవునియొక్క అనంత మైన శక్తిని క్రీస్తునుగూర్చిన సమాచారము నమ్మునట్లు చేయును.

మెస్సీయను గూర్చిన సమాచారము ఎక్కువమంది నమ్మలేదు గావున దేవునిశక్తి అందరికి ప్రదర్శింపబడలేదు. 12:39-41 వారు నమ్మకపోవుట దేవుని తప్పుకాదు. ఆయన తన్నుతాను ఇశ్రాయే లీయులకు ప్రత్యక్షపరచుకొనెను.

వారు ఆయనను తృణీకరించిరి. రక్షణనుగూర్చి వారితో పదేపదే ప్రస్తావించెను. అయినను వారు ‘కాదు’ అని జవాబిచ్చిరి. వారు ఎంతగా సువార్తను తృణీకరించిరో, సువార్తను అంగీకరించుటకు అంతగా కఠినపరచబడిరి.

యేసును చూడవలెనను గ్రీసు దేశస్థుల కోరిక (12:20-26) : 12:20

ఆయన కుమారుని తృణీకరించుటద్వారా దేవుని తీర్పు అనగా న్యాయసమ్మతమైన గ్రుడ్డితనముతో వారిని మొత్తెను. యెషయా 6:9,10ని సువార్తికుడు ఇక్కడ పరిచయము చేయుచున్నాడు. దేవుడు వారికి మొదటిగా కఠిన హృదయమును గ్రుడ్డితనమును కలుగచేయలేదుగాని, వారే ముందుగా తమ కండ్లు మూసికొని తమ హృదయములను కఠినపరచుకొనిరి.

తద్వారా వారు చూచుటకును గ్రహించుటకును, మార్పు చెందు టకును, స్వస్థపడుటకును తమ్మును తామే దూరపరచుకొనిరి. ఈ వచనము యెషయా దేవుని మహిమను చూచిన గొప్ప అధ్యాయములోనిది. యెషయా క్రీస్తు మహిమను చూచి, క్రీస్తుతో మాట్లాడెనని సువార్తికుడైన యోహాను చెప్పుచున్నాడు కనుక యీ వచనము క్రీస్తు దేవుడైయున్నాడని నిరూపించు వాక్యముల గొలుసులో యొక జత అని చెప్పవచ్చును.

12:42, 43 ప్రధానాధికారులైన యూదులలో అనేకులు యేసు ‘మెస్సీయ’ అని తెలిసికొన్నప్పటికీ తాము వెలివేయబడకుండు నిమిత్తము ఆయనను మెస్సీయగా అంగీకరింపలేదు. వీరు ప్రభువైన యేసునందు నిజమైన విశ్వాసులైనప్పటికీ వారి విశ్వాసము కచ్చితముగా అనుమానాస్పదమే.

ఎక్కడ నిజమైన విశ్వాసముండునో అక్కడ క్రీస్తునుగురించి ఒప్పుకోలు త్వరగా గాని, ఆలస్యముగా గాని ఉండును. పరిస్థితుల ప్రభావమెట్లున్నప్పటికి ఒకడు క్రీస్తును ప్రభువుగా ఒప్పుకొని తెలియజేయ వలెను. ఇట్టివారు దేవుని మెప్పుకంటె ప్రజల మెప్పునే ఎక్కువగా నపేక్షించుదురు. దేవునికంటె మానవ పొగడ్తలపై మనస్సునుంతురు. ఇలాంటి ఒక వ్యక్తి క్రీస్తునందు నిజమైన విశ్వాసియై యుండెనా? జవాబుకొరకు 5:44 చూడుము.

అవిశ్వాసము వలన అపాయము (12:44-50) : 14,

“నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదుగాని, నన్ను పంపిన నా తండ్రియందు విశ్వాసముంచుచున్నాడు” ఆయన తండ్రితో ఏకమైయున్నానని రూఢిగా చెప్పుచున్నాడు. ఏకమైయున్న ఇరువురిలో ఒకరిని నమ్మక, మరొకరిని నమ్ముట అసాధ్యము, క్రీస్తును నమ్ముట అనగా, తండ్రియైన దేవునియందు విశ్వాస ముంచుటయే.

కుమారునికి తండ్రితో సమానత్వము ఆరోపించనిదే ఒకడు తండ్రిని విశ్వసింపడు. ఏ మనుష్యుడు తండ్రియైన దేవుని చూచియుండలేదు. ఆయన ఆత్మ గనుక అదృశ్యుడు అయితే యేసు తండ్రిని శారీరరీత్యా కాదుగాని, నీతియుక్తముగా చూపించియున్నాడు. దేవునియొక్క గుణలక్షణములను ఆయన చూపించియున్నాడు. కనుక ఎవరు క్రీస్తును చూచియున్నారో వారు తండ్రిని చూచియున్నారు.

12:46 వెలుగునుగూర్చిన ఉపమానము ప్రభువునకు ప్రీతికరమైన ఉపమానములలో నొకటి. ఆయన లోకమునకు వచ్చిన వెలుగైయున్నాడు. ఆయనను అంగీకరించినవాడు చీకటిలో నిలిచియుండలేదు.

క్రీస్తునందుండని ప్రతి ఒక్కరు ఘోరమైన చీకటిలోనున్నారు. వారు జీవమును గురించిగాని, మరణమును గురించిగాని, నిత్యత్వము గురించిగాని సరియైన గ్రహింపులేనివారు అయితే విశ్వాసముతో క్రీస్తునొద్దకు వచ్చువారు సత్యము కొరకు తడవులాడనవసరము లేదు సత్యమును ఆయనయందు కనుగొందురు.

 

యేసును చూడవలెనను గ్రీసు దేశస్థుల కోరిక (12:20-26) : 12:20

12:47 క్రీస్తు మానవులను శిక్షించుటకు ఈ లోకములోనికి రాలేదుగాని రక్షించుటకే వచ్చెను. తనను తృణీకరించువారికిగాని, అంగీకరించువారికిగాని ఆయన తీర్పుతీర్చడు.

12:48 రానున్న తీర్పు దినము గురించియైతే ప్రభువు మాటలను పెడచెవిన పెట్టిన వారు దేవుని ఎదుట నిలుచుండగా ఆయన మాటలు బోధన వారిని శిక్షించును. 12:49 నాయంతట నేనే పలుకుటలేదని చెప్పుటలో “నా అధికారముతో” మాట లాడుట లేదని అభిప్రాయము.

ఆయన బోధించునదంతయు తనంతటతాను బోధించి నదికాదు. మరియు ఏ పాఠశాలలోను నేర్చుకొనినది కాదు. తండ్రివలన ఆజ్ఞాపింప బడినవాడై ఆయన బోధించెను. అంత్యదినమున ఈ అధికారమే మానవులను శిక్షించును. యేసు మాట్లాడినది దేవునిమాట.

అయినను మనుష్యులు ఆయనను తృణీకరించిరి. ఆయన ఏమి మాట్లాడవలెనో బోధించవలెనో తండ్రియే నేర్పించెను.

12:50 ఆయన మాట్లాడునది, బోధించునదంతయు తండ్రిని గూర్చిన సత్యమని మనము గ్రహింపవలెను. ఆయనయందు విశ్వాసముంచు వారికి నిత్యజీవము ననుగ్రహించుటకు కుమారునికి అధికారమిచ్చి యున్నాడని యేసునకు తెలియును కనుకనే తాను చేయు బోధ తన్ను పంపిన తండ్రి తెలియజేసినదని ప్రకటించెను.

Leave a Comment