పదకొండవ అధ్యాయము
ప్రభువైన యేసు లాజరును లేపుట
లాజరు రోగియై యుండుట (11:1-4) :
11:1 ప్రభువుయొక్క బహిరంగ పరిచర్యలో చివరి అద్భుత కార్యమును సువార్తికుడైన యోహాను పొందుపరచియున్నాడు. ఇది చాలా గొప్ప అద్భుతకార్యమని కొందరు చెప్పుదురు, ఎందుకనగా చనిపోయినవానిని లేపుట మహా అద్భుత కార్యమేగదా.
యెరూషలేమునకు తూర్పుదిశగా రెండుమైళ్ళ దూరమునగల కుగ్రామమైన బేతనియలో లాజరు నివసించుచుండెను. బేతనియ-మరియ, మార్తల యొక్క గ్రామమనికూడ చెప్పబడెను. ఈ విషయమై ‘పింక్’ యొక్క వ్యాఖ్యానము ఆసక్తికరముగా నుండెను.
దేవుడు ఎన్నుకున్న ప్రజలుండు పట్టణములుగాని, దేశములుగాని ప్రసిద్ధిచెందినవి. మార్త, మరియల గ్రామమైన బేతనియ గుర్తింపబడినది గాని, గొప్ప పట్టణములైన మెంఫిన్, ధేబ్స్ పట్టణముల పేర్లు క్రొత్త నిబంధనలో వ్రాయబడలేదు.
11:2,3 బేతనియలోనున్న మరియ ప్రభువు పాదములను తన తలవెంట్రుకలతో తుడిచి ఆయనను తైలముతో అభిషేకించెనని యోహాను వ్రాసియున్నాడు. దైవభక్తికి సంబంధించిన ఈ కార్యమును పరిశుద్ధాత్ముడే ఎత్తి చూపించెను.
Read and Learn More Telugu Bible Verses
తనయెడల హృదయ పూర్వకమైన ప్రేమగలవారిని యెహోవా (ప్రభువు) ప్రేమించును. లాజరు రోగిగా నున్నప్పుడు ప్రభువు యొర్దాను నదికి తూర్పు దిక్కున నున్నాడు. ప్రభువా, నీవు ప్రేమించువాడు రోగియైయున్నాడని మార్త వర్తమానము పంపెను. ప్రభువు నొద్దకు వచ్చువారికి సహాయము చేయుటకు బలమైన కారణము వారిపట్ల ఆయనకుగల ప్రేమను గుర్తుచేయుచున్నందున ఆయనకు మనవి చేసికొనిరి.
లాజరు పునరుజ్జీవము
Paraloka Prardhana In Telugu Bible
11:4 ఈ రోగము మరణము కొరకు వచ్చినదికాదని యేసు చెప్పెను. లాజరు మరణించెనని ప్రభువు చెప్పుటలేదుగాని మరణమే ఈ రోగమునకు అంతము కాదని ఆయన చెప్పెను. ఈ రోగము దేవుని మహిమార్థమై వచ్చెను. మరియు దేవుని కుమారుడు దీనియందు మహిమపరచబడుటకు వచ్చెనని చెప్పెను.

చనిపోయిన లాజరును యేసు లేపుటద్వారా మరొకసారి యేసును మెస్సీయగా ప్రత్యక్షపరచుటకు దేవుడే ఈ కార్యమును జరిగించెను. ఈ మహాద్భుత కార్యమును చూచి ప్రజలు దేవుని మహిమపరచిరి. లాజరుకు వచ్చిన రోగము అతని జీవితములో ఒక ప్రత్యేక మైన పాపమునుబట్టి సంభవింపలేదు. పైగా లాజరు భక్తికలిగిన శిష్యుడుగాను, రక్షకునియొక్క ప్రేమకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యముగా నిలిచెను.
యోహాను 11:43–44 వచనం
క్రీస్తు బేతనియకు ప్రయాణము చేయుట (11:5-16) :
11:5-7 అనారోగ్యము మన యింటిలోనికి ప్రవేశించినపుడు దేవుడు మనపట్ల అసంతృప్తి కలిగియున్నాడని తలంచరాదు. ఇక్కడ లాజరుకు కలిగిన రోగము ఆయన ప్రేమకు ముడిపడియున్నది. నిజముగా ప్రభువైన యేసు ఈ ముగ్గురిని ప్రేమించి యుండినయెడల ఆయన త్వరగా అచ్చటికి చేరియుండవలసినదని మనము తలంచెదము.
అట్లుకాక పోగా ఆ వర్తమానము వినిన తరువాతకూడ యేసు తానున్న చోటనే మరి రెండు దినములు ఉండినట్లుగా మనము గమినించుచున్నాము. దేవుని ఆలస్యము త్రోసివేయుటకుకాదు. మన ప్రార్థనలకు త్వరగా జవాబు రానియెడల మనము ఓపికతో ఎదురుచూచుటకు ఆయన మనకు తర్భీతు నిచ్చుచున్నాడనియు, అట్లు మనము ఓర్పుతో ఎదురుచూచినయెడల మనము ఆశించిన దానికంటె మరి ఎక్కువగా ఆశ్చర్యకరమైన రీతిలో మన ప్రార్థనలకు ప్రతిఫలమిచ్చుననియు మనము చూడగలము.
Paraloka Prardhana In Telugu Bible
మార్త, మరియ, లాజరుపట్ల తనకుండిన ప్రేమనుబట్టి సకాలములో ఆయన అచ్చటికి వెళ్ళి లాజరును స్వస్థపరచవలసినదేగాని, ఆయన పూర్తిగా దేవుని చిత్తమునకు లోబడి ఆయన చిత్తానుసారముగా ప్రభువు తాను చేసినదంతయు చేసెనని మనము గ్రహింపవలసి యున్నాము.
రెండురోజులు కాలము గడిపిన అనంతరము ప్రభువు – ఇప్పుడు మనమందరము యూదయకు వెళ్ళవలసి యున్నదని చెప్పెను.
11:8 ప్రభువైన యేసు పుట్టుగ్రుడ్డివానిని స్వస్థపరచిన తరువాత యూదులేలాగు చంపవచ్చిరో శిష్యులా భయమును మనస్సునందుంచుకొన్నవారై ప్రభువా నిన్ను వారు చంపజూచుచుండగా మనము మరల యూదయకు వెళ్ళుదుమా యని ఆశ్చర్యముతో ఆయనను అడిగిరి.
ప్రభువు యేసు లాజరును బ్రతికించుట
11:9,10 ప్రభువు వారికి ఈ విధముగా జవాబిచ్చెను. ఒక దినములో పగలు పన్నెండు గంటలు వెలుగుండుటచే మానవులు పనులు చేసికొందురు. తాము పని చేసికొను సమయమందు వెలుగుండుటచే తాము ఎక్కడికి వెళ్ళుచున్నారో, ఏమి చేయుచున్నారో తెలియును గనుక తొట్రుపడరు.
వెలుగు – తొట్రుపాటువలన కలుగు ఆకస్మిక మరణమునుండి తప్పించును. దీని ఆత్మీయార్ధమిదే. దేవుని చిత్తమునకు విధేయుడై యేసు నడుచుచున్నాడు. కనుక నిర్ణయింపబడిన సమయమునకు ముందుగా ఆయన చంపబడు ప్రమాదము సంభవింపదు.
ఆయన పనులు తుదముట్టింపబడు వరకు ఆయన నిలిచియుండును. ఈ వాస్తవము ప్రతి విశ్వాసి జీవితములోను సత్యమై యున్నది. “మన పనులు తుదముట్టించు వరకు మనము జీవించియేయుందుము”.
మనము దేవునితో సహవాసము కలిగి నడుచుకొనుచు ఆయన చిత్తము జరిగించు చుండినయెడల దేవుని నిర్ణయ కాలమునకు ముందుగా మనలను ఏ శక్తియు చంప జాలదు. దీనికి ప్రతికూలముగా చెప్పవలెనన్నచో రాత్రి సమయమందు నడుచువాడు దేవునికి అవిధేయుడై తన స్వచిత్తమును నెరవేర్చుకొనువాడు, తన మార్గములో వెలుగుండునట్లుగా అట్టివారికి దేవుని కాపుదల ఉండదు గనుక వాడు తొట్రిల్లును.
10:11 లాజరు మరణమును గురించి ప్రభువు ‘నిద్ర’ అని చెప్పుచున్నాడు. క్రొత్త నిబంధనలో ‘నిద్ర’ ఆత్మను సూచించదు గాని శరీరమునే సూచించును. విశ్వాసియొక్క ఆత్మ క్రీస్తుతో నుండుటకు పోవును.
Paraloka Prardhana In Telugu Bible
అది శ్రేష్ఠమైన స్థలము. ఇక్కడ ప్రభువైన యేసు తన సర్వజ్ఞత్వమును గురించి వివరించుచున్నాడు. లాజరు చనిపోయెనని ఆయనకు తెలియును. లాజరు రోగియాయెనని తనకు వర్తమానము అందినపుడే తాను దేవుడు గనుక లాజరు చనిపోయెనని ముందుగా తెలిసికొనెను.

ఇప్పుడాయన లాజరును లేపుటకు వెళ్ళుచున్నాడు. ఎవడైనను ఒకడు నిద్రపోయిన వానిని లేపగలిగినయెడల (లేపినట్లు) ప్రభువు తప్పక మరణించిన లాజరును లేపును. తానావిధముగా లాజరును లేపుదునని ప్రభువు సూచించుచున్నాడు.
11:12-14 ప్రభువు ‘నిద్ర’ అని చెప్పుటలోని అర్థమును శిష్యులు గ్రహింపలేదు. గనుకనే వారు లాజరు నిద్రించినయెడల అతడు బాగుపడునని చెప్పిరి. ఎందుకనగా ‘నిద్ర’ అనునది ఆరోగ్యము పొందుటకు సూచనయనియు, అంతటి రోగములోను సుఖముగా నిద్రించుచున్నాడంటే తనకున్న క్లిష్టపరిస్థితిని అతడు తప్పించుకొని తప్పక బాగుపడునని వారు నమ్మిరి.
లాజరు నిద్రించినయెడల వారు బేతనియకు వెళ్ళ నవసరము లేదని ఈ వాక్యము మరొక అర్థము నిచ్చుచున్నది. శిష్యులు బేతనియకు వెళ్ళినచో క్షేమము లేదని తెలిసి బేతనియకు వెళ్ళకుండుటకు కారణము ఆలోచించు కొనుచుండిరి.
‘నిద్ర’ అనగా లాజరు మరణించెనని ప్రభువు వారికి చెప్పుచుండినను వారు గ్రహింపరైరి. ఇప్పుడు వారు అపార్థము చేసికొనుటకు వీలులేదు. అంతట ప్రభువు తేటగా ‘లాజరు చనిపోయెనని చెప్పెను. మారు మాట్లాడక సమాధానముగా ప్రభువు చెప్పు ఈ మాటను వారు అంగీకరించిరి గాని, ప్రభువా, నీకెట్లు తెలియును? అని ఒకరైనను అడుగ తెగింపలేదు. ఆయన అధికారముతో మాట్లాడినప్పుడు వారాయన జ్ఞానమును ప్రశ్నింపలేదు.
11:15 లాజరు చనిపోయినందుకు ప్రభువైన యేసు సంతోషించలేదు గాని, ఆ సమయమునందాయన అచ్చట లేనందుకు సంతోషించుచున్నాడు. లాజరు మరణించని యెడల ఆయన బేతనియలో ఉండెడివాడా? ప్రభువు సమక్షములో మరణించిన వ్యక్తి అని క్రొత్త నిబంధనలో వ్రాయబడి యుండలేదు.
యోహాను 11లో పునరుజ్జీవము మరియు యేసు శక్తి
మరణమును ఆపివేయుటకంటె మరెక్కువైన గొప్ప కార్యమును చూడబోవుచున్నారు. మరణించి తిరిగి లేచినవానిని చూడబోవుచున్నారు. గనుక వారి విశ్వాసము బలపడనున్నది. కనుకనే మీ నిమిత్తము నేను బేతనియలో ఉండనందుకు సంతోషించుచున్నానని ప్రభువు చెప్పెను.
“వారు నమ్మునట్లుగా” అని ఆయన చెప్పెను. వారాయనను నమ్మలేదని ఆయన చెప్పుటలేదు గాని నమ్మినవారు చూడబోవు ఆ కార్యము ప్రభువుపట్ల వారి నమ్మకమును మరింత స్థిరపరచును. కనుకనే ఆయన వారిని తనతో అచ్చటికి రండని చెప్పెను.
11:16 ప్రభువైన యేసు బేతనియకు వెళ్ళినచో యూదులచేత ఆయన చంపబడు నని తోమా తలంచెను. మరియు వారాయనతోకూడ వెళ్ళినచో ఆయనతోపాటు తామును చంపబడుదుమని తలంచెను. అందుచేత దుఃఖముఖుడై మనమును చంపబడుటకై ఆయనతోకూడ వెళ్ళుదము రమ్మని మిగిలినవారితో చెప్పెను. అతడు మాట్లాడిన మాటలు విశ్వాసము గలవై ధైర్యముతో కూడినవిగాక నిరుత్సాహమును కలిగించెడివిగా నున్నవి.
Paraloka Prardhana In Telugu Bible
“నేనే పునరుత్థానమును జీవమునై యున్నాను” (11:17-27) :
11:17,18లాజరు సమాధిలో నుంచబడి నాలుగు దినములైనవని చెప్పుట, రూఢిగా అతడు చనిపోయెనని తెలియజేయుచున్నది. లాజరుయొక్క పునరుత్థానము ఒక మహాత్మ్యమని తెలియజేయుటకు పరిశుద్ధాత్ముని కాపుదలకు నిదర్శనము.
యెరూషలేమునకు తూర్పుదిశగా బేతనియ గ్రామము గలదు. యూదులలో అనేకులు మరియను, మార్తను లాజరు నిమిత్తమై ఓదార్చుటకు వచ్చుచుండిరి. ఇక కొద్ది కాలములో తాము వారిని ఓదార్చనవసరములేదను విషయము వారికి తెలియలేదు, దుఃఖముతో నిండిన ఈ ఇల్లే గొప్ప సంతోషముతో నిండిపోయెను.
11:20 యేసు వచ్చుచున్నాడని వినినవెంటనే మార్త ఆయనను ఎదుర్కొనబోయెను. ఆమె ఆయనను గ్రామమునకు వెలుపట కలిసికొనెను మరియు ఇంటిలో ఎందుకు నిలిచిపోయెనో మనకు చెప్పబడలేదు.
ఆమెకు ప్రభువు వచ్చుచున్నాడను సమాచారము అంది యుండకపోవచ్చును. దుఃఖముతో ఆమె మొద్దుబారియుండవచ్చును. లేదా ఆమె నమ్మకముతో ఆత్మలో ప్రార్థన చేయుచు ఎదురు చూచుచుండెనేమో ! తాను ప్రభువునకు అతి సమీపముగా నుండుటచే తనకేమి సంభవింపనైయున్నదో ఆమెకు గ్రాహ్యమైయుండెనా. అది మనకు తెలియదు.
11:21-23 మార్తయొక్క నిజమైన విశ్వాసము ఏదనగా యేసు ఒక్కడే లాజరును చనిపోకుండ బ్రదికింపగలవాడని నమ్మెను. అయినను ఆమె విశ్వాసము అసంపూర్ణమే. ఎందుకనగా లాజరు బ్రతికి ఉంటే అతడు చనిపోకుండా ప్రభువు కాపాడగలడని ఆమె నమ్మకము.
అయితే ప్రభువు దూరముననుండియు స్వస్థపరచగలడనియు, చనిపోయిన వారిని లేపగలడనియు ఆమె గ్రహించలేదు. దుఃఖములో నున్నప్పుడు మనముకూడ మార్తవలె మాటలాడుదుము. మంచి ఔషధములుండినయెడల నా ప్రియుడు చనిపో డనియు చెప్పుదుము.
సమస్తము ప్రభువు చేతిలోనున్నది గనుక ఆయన అనుమతి లేనిదే ఆయనను నమ్మినవారికేమియు సంభవించదు. మరల మార్త విశ్వాసము బయలుపడుచున్నది. ప్రభువైన యేసు ఎట్లు సహాయము చేయునో తనకు తెలియదు గాని, ఆయన తప్పక సహాయము చేయునని నమ్మెను.
Jesus Bible Verses In Telugu
తాను అడుగునది ఆయన నెరవేర్చి ప్రస్తుతమున్న దుఃఖములో తనకు మేలు చేయునని ఆమెకు తెలియును. అయితే చనిపోయిన తన తమ్ముడైన లాజరు తిరిగి లేచునని మాత్రము ఆమె విశ్వాస మామెకు ధైర్యము పుట్టించలేదు. తాను అడుగు ప్రతిదానిని పొందుదునన్న నమ్మకము సృష్టింపబడిన ప్రతి జీవికి సృష్టికర్తపట్ల ఉండు నమ్మకమే.
ప్రభువైన యేసుయొక్క దైవత్వమును మార్త గుర్తించలేదు అయితే ఆయనను అసాధారణమైన గొప్ప వ్యక్తిగా గుర్తించెను గాని, గతించిన కాలములోనున్న ప్రవక్తలకంటే గొప్పవాడు కాడని అనుకొనెను. ఆమె విశ్వాసమును అభివృద్ధి పొందించుటకే ప్రభువు మొదటిగా లాజరు లేచునని ప్రకటించెను. దుఃఖపూరితురాలైన ఆమెతో బహు సున్నితముగా మాట్లాడి తనను దేవుని కుమారునిగా వర్ణించునట్లు ఆమె విశ్వాసమును బలపరచెను.
లాజరు మరణము మరియు పునరుజ్జీవము
11:24, 25 మృతుడైన లాజరు ఒకానొక దినమున సజీవుడై లేచునని ఆమెకు తెలియునుగాని, ఈ దినముననే, ఇప్పుడే లాజరు లేచునని ఆమెకు తెలియదు. మృతుల పునరుత్థానమందు ఆమెకు విశ్వాసము కలదు.
“అంత్యదినమందు” ఇది సంభవించునని ఆమెకు తెలియును. ఆమెకు జవాబుగా ప్రభువిట్లు చెప్పెను. “మార్తా నన్ను నీవు నిజముగా అర్థము చేసికొనుటలేదు. లాజరు అంత్యదినమున లేచునని నేను చెప్పుట లేదు.
నేను దేవుడనై యున్నాను మరియు నేను పునరుత్థానమును, జీవమునైయున్నాను. మృతుడైన లాజరును లేపుటకు నేను ఇప్పుడు ఈ క్షణమున శక్తిగల వాడనని పలికెను.” ప్రభువు పరిశుద్ధులైన తన వారందరు లేచు దినము తాను తన వారిని తీసుకొనిపోవు టకు వచ్చునప్పుడు వచ్చునని చెప్పెను.
ఆ సమయమునందు విశ్వాసులలో రెండు తెగలుండును. విశ్వాసములో ఉండి చనిపోయినవారు. ఆయన వచ్చినప్పుడు విశ్వాస ములో జీవించుచుండినవారు. పునరుత్థానులైన మొదటి వారికొరకును, జీవముతో నుండిన రెండవవారికొరకును వచ్చును.
Jesus Bible Verses In Telugu
25వ వచనములో చివరి భాగము మొదటి గుంపును సూచించుచున్నది. “నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును.” క్రీస్తు రాకముందు చనిపోయిన విశ్వాసులు మొదటిగా మృతులలో నుండి లేచెదరు. రెండవ గుంపువారు 26వ వచనములో చెప్పబడియున్నారు.
11:26 రక్షకుడు వచ్చినప్పుడు జీవించుచుండినవారు మరియు ఆయనయందు విశ్వాసముంచువారు ఎన్నటికి చనిపోరు. నిమిషమాత్రములోవారు మార్చబడి కనురెప్ప పాటులో మృతులలోనుండి లేచిన వారితోకూడ పరలోకములో నుండుటకై కొనిపోబడు దురు, లాజరు మరణముద్వారా మనకెన్నో విలువైన సత్యములు తెలియవచ్చినవి.
ప్రభువు చేదునుండి తీపిని, నిర్జీవమైన దానినుండి జీవమును చూపించుచున్నాడు. దీనిని నీవు నమ్ముచున్నావా?
11:27 మధ్యాహ్నకాలపు సూర్యునివలె మార్త విశ్వాసము ప్రకాశించుచున్నది. ఆమె యేసే ‘క్రీస్తు’ అనియు దేవుని కుమారుడనియు, ప్రవక్తలు ప్రవచించిన వ్యక్తి ఈయనే అనియు విశ్వసించెను. గమనించండి యేసు లాజరును మృతులలోనుండి లేపకమునుపే ఆయననుగూర్చి ఆమెపై విధముగా ఒప్పుకొనెను.
లాజరు సమాధియొద్ద యేసు ఏడ్చెను (11:28-37) :
11:28 మార్త ఈ విధముగా ఒప్పుకొనిన వెంటనే పరుగెత్తి వెనుకకు వెళ్ళి యింటిలోనున్న మరియను కలిసికొని “బోధకుడు వచ్చి, నిన్ను పిలుచుచున్నాడని” చెప్పెను. సృష్టికర్తయు, ఈ లోకరక్షకుడైనవాడు బేతనియలోనున్న మరియను పిలుచుచున్నాడు. ఈ దినములలోను ఇట్లే జరుగుచున్నది. ఈ ఆశ్చర్యకరమైన వ్యక్తి సువార్తద్వారా ప్రతివానిని తనయొద్దకు పిలుచుచున్నాడు.
11:29 ప్రతివాడు తన హృదయపు వాకిలి తెరచి రక్షకుని లోనికి ఆహ్వానింపవలసి యున్నది. మరియ వెంటనే ప్రతిస్పందించి, త్వరగా లేచి యేసునొద్దకు వెళ్ళెను. 11:30 బేతనియ గ్రామమునకు వెలుపట యేసు మార్త, మరియను కలిసికొనెను.
11:31 మార్త వచ్చి మరియకు రహస్యముగా యేసు నిన్ను పిలుచుచున్నాడని చెప్పుటవలన ఆయన వారికి సమీపములో ఉన్నాడను సంగతి వారికి తెలియలేదు. గనుక మరియు లేచి త్వరగా వెళ్ళుచుండగా వారు ఆమె సమాధియొద్ద యేడ్చుటకు వెళ్ళుచున్నదనుకొనుట అసాధారణమైనదికాదు.
11:32 మరియు యేసు పాదములపై బడెను. అది ఆరాధన కావచ్చును లేదా తన హృదయములోని దుఃఖమును ఆయన పాదములయొద్ద కుమ్మరించి యుండవచ్చును. మరియకూడ మార్తవలెనే ప్రభువా నీవిక్కడ ఉండినయెడల నా తమ్ముడు చావకుండును అని ఏడ్చెను.
ఆమెయు, ఆమెను ఓదార్చుటకు వచ్చిన వారును ఏడ్చుచుండుట చూచి యేసు ఆత్మలో కలవరపడెను. మరియు ఆయన మూల్గెను. మానవుని పాపమువలన ఈ లోకములోనికి వచ్చిన దుఃఖము, బాధ, మరణమునుగురించి ఆయన విచారించెను.
11:34 ఆయన మూల్గునకు ఇది కారణమాయెను. లాజరును ఎక్కడ సమాధి చేసితిరని అడిగెను. అక్కడ కూడియున్న వారియొక్క సంఘీభావమునకును, వారి విశ్వాసము అభివృద్ధిపొందించుటకును ప్రభువు ఆ ప్రశ్నకు అడిగెను.
11:35,36 ఈ 35వ వచనము ఇంగ్లీషు బైబిలులో అతి చిన్నది. మూడు సందర్భములలో ప్రభువు ఏడ్చినట్లు బైబిలునందు వ్రాయబడినది. (యెరూషలేము పట్టణము నిమిత్తమై ఆయన ఏడ్చెను, గెత్సెమనే తోటలో ఆయన ఏడ్చెను).
ఆయన నిజమైన మానవుడని దీనిని బట్టి తెలియవచ్చుచున్నది. పాపమువలన కలిగిన ఫలితము మానవ జాతిపై పడిన కారణమునుబట్టి ఆయన దుఃఖముతో కన్నీళ్ళు విడిచెను. యేసు కన్నీళ్ళు విడుచుటనుబట్టి తమ ప్రియులను కోల్పోయిన క్రైస్తవులు ఏడ్చుట సాధారణమైన సంగతియని తెల్పుచున్నది.
అయితే నిరీక్షణలేని యితరులవలె క్రైస్తవులు దుఃఖించరాదు. యేసు ‘కన్నీటిలో’ లాజరుపట్ల ఆయనకు కల్గిన ప్రేమను యూదులు చూచుచున్నారు. వారి అంచనా సత్యమే. ఎక్కువమందికి ఇది అర్థము కాకున్నను యేసు వారిని ప్రేమించుచున్నాడు.
మరల ఇక్కడ ప్రభువు వారిలో ప్రశ్నలు పుట్టించెను. వారిలో కొంతమంది ఆ గ్రుడ్డివానికి చూపు ఇచ్చినవాడు లాజరును చావకుండా చేయలేదా అనిరి. ఆయన ఆ విధముగా చేయగలడుగాని, అంతకంటే మరి గొప్ప అద్భుత కార్యమును ఆయన చేయనై యున్నాడు.
యేసు పునరుజ్జీవము యొక్క సాక్ష్యము
ఏడవ సూచకక్రియ –
లాజరు లేచుట (11:38-44) :
11:38-40 అంతరంగములో ప్రభువు భారముతో నిండియుండెను. లాజరు సమాధి భూమి లోపల ఒక గుహలో త్రవ్వబడియున్నది. కనుక దానిలోనికి నిచ్చెనద్వారా దిగుటకాని లేదా మెట్లు సహాయముతోగాని దిగవలసి యున్నది.
ఆ సమాధి పైనున్న రాయిని దొరిలించుమని ఆయన వారికాజ్ఞాపించెను. ఆయన ఆజ్ఞాపించి ఆ రాయిని తొలిగించగలడు. అయితే మానవుడు సామాన్యముగా చేయగలిగిన దానిని ఆయన చేయడు. ఆయన రాయిని తీసివేయుడని ఆజ్ఞాపించగానే మార్త అయ్యా, ఇప్పటికి నా తమ్ముడు చనిపోయి నాలుగు దినములైనది కావున వాసన కొట్టునని చెప్పెను.
లాజరు శరీరము కుళ్ళిపోకుండ సుగంధ ద్రవ్యములు ఆ మృత శరీరమునకు వారు పూసియుంచలేదు. లాజరు చనిపోయిన రోజుననే అతని శరీరము సమాధి చేయ బడెను. లాజరు సమాధి చేయబడి నాలుగు రోజులైనదను వాస్తవమును మనము మరచిపోరాదు. అతడు గాఢనిద్రపోయి ఉండలేదు. మరియు అపస్మారకస్థితిలో నుండ లేదు. అతడు చనిపోయినట్లుగా యూదులందరికి తెలియును.
లాజరు పునరుత్థానము నిజముగా అద్భుతక్రియ అని చెప్పవచ్చును. ప్రభువైన యేసు ఈ మాటలు పలికినపుడు అది ఎవరికి అర్థము కాలేదు. 23 వ వచనములో నీ సహోదరుడు లేచునని ప్రభువు ఆమెతో చెప్పిన మాటల సారాంశమునే ప్రభువు మరల యీ వచనములో చెప్పు చున్నాడు.
Jesus Bible Verses In Telugu
మనము ఈ వాక్యములో “విశ్వసించుము, చూడుము” అను మాటలను గమనించుచున్నాము. నీవు విశ్వసించినయెడల దేవుడు చేయు మహిమగల కార్యమును చూచెదవని చెప్పుచున్నాడు. తనద్వారా దేవుని మహిమ చూచెదరని చెప్పెను. అయితే మొదటిగా విశ్వసించవలెను తరువాత చూడవలెను.

11:41-44 సమాధిపైనున్న రాయి దొరలింపబడెను. తానీ అద్భుతమును చేయకముందు యేసు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, తండ్రీ! నీవు నా మనవి వినినందుకు వందనములని చెప్పి ప్రార్థించెను. ఈ అధ్యాయములో ముందెక్కడను యేసు ప్రార్థించినట్లుగా వ్రాయబడలేదు.
ఇచ్చట ఆయన తండ్రితో మాట్లాడుచు, లాజరు పునరుత్థానములో దేవుని నామమును మహిమపరచునట్లుగా ప్రార్థించుచున్నాడు. ఈ కార్యమునుబట్టి తండ్రిని స్తుతించుచున్నాడు. అచ్చట కూడిన జనులందరు విని తండ్రి తనను పంపియున్నాడని, తానేమి చేయవలెనో, మాట్లాడవలెనో ఆయనే బోధించి యున్నాడని మరియు తాను చేయు ప్రతి పని దేవునిపై ఆధారపడి చేయుదననియు వారు తెలిసికొనునట్లుగా ఆయన ఎలుగెత్తి ప్రార్థించెను.
ఇక్కడ తండ్రియైన దేవుడును ప్రభువైన యేసు క్రీస్తును ఏకమైయున్నారని మనము గమనించవలెను. యేసు. ఎలుగెత్తి ప్రార్థించుటయనునది చాల తక్కువసార్లు మనము గమనించుదము. ఆయన లాజరును పేరు పెట్టి పిలువక పోయినయెడల అక్కడ సమాధులలో ఉన్నవారందరును లేచివచ్చి యుండెడివారని కొందరు తెలియజేయుచున్నారు.
Jesus Bible Verses In Telugu
లాజరు ఎట్లు బయటికి వచ్చెను? అతడు కుంటుతూ నడచి వచ్చెననియు, చేతులతో, కాళ్ళతో ప్రాకుతూ వచ్చెననియు మరికొందరు అతడు ప్రేత వస్త్రములచే కట్టబడియుండుటచే తన స్వశక్తిచే బయటికి రాలేకపోయెననియు చెప్పుదురు.
కొంతమంది అతని శరీరము గాలిలోనుండి వచ్చి ప్రభువైన యేసు యెదుట పాదములూని నిలిచెనని చెప్పుదురు. లాజరు ముఖము రుమాలుతో కట్టబడియుండుట అతడు చనిపోయినాడనుటకు మరొక గుర్తు.
ఒకడు ముఖమునకు గుడ్డ కట్టబడినవాడై నాలుగు దినములు బ్రదికియుండజాలడు. కట్లువిప్పి లాజరును పోనియ్యుడని ప్రభువు ఆజ్ఞాపించెను. ఆయనే మృతులను సజీవులనుగా చేయువాడు. మనకు అడ్డుబండలైన రాళ్ళను తీసివేయు పనియు, పగతీర్చుకొనుటయు, మూఢభక్తి అను బంధకములనుండి విడిపింపబడుటయు మొదలగునవి ఆయనకే అప్పగించదు.
ప్రభువుకు వ్యతిరేకముగా
యూదులు ఆలోచన చేయుట (11:45-57) :
11:45,46 ఈ కార్యమును చూచిన అనేకులు ఆయన దైవత్వమును ఒప్పుకొనుచు ఆయనయందు విశ్వాసముంచిరి. సమాధిలోనున్నవానిని దేవుడుతప్ప మానవుడెవడు పిలువగలడు ? పిలిచి బ్రతికించగలడు? జరిగిన యీ అద్భుత కార్యము ఒకడు జీవించు నీతి జీవితమునుబట్టి ప్రభావితము చేయబడును.
ఒకని హృదయము చెడుతోను, దౌర్జన్యముతోను, అవిశ్వాసముతోను నిండియుండిన యెడల చనిపోయిన వాడు తిరిగిలేచుట చూచినను అట్టివాడు విశ్వసింపడు. ఇక్కడ జరిగిన కార్యమదే. అయినను యీ మహత్కార్యమును జూచిన యూదులలో కొందరు ప్రభువైన యేసును మెస్సీయగా అంగీకరించుటకు ఒప్పుకొనలేదు. వారు పరిసయ్యులయొద్దకు వెళ్ళి బేతనియలో జరిగిన వృత్తాంతమును వారికి వివరించిరి. ఎందుకనగా పరిసయ్యులు మరింత కోపోద్రేకులై ఆయనను చంపుటకు ఆలోచించుచుండిరి.
11:47 పరిసయ్యులును ప్రధాన యాజకులును కూడివచ్చి తామిప్పుడు ఏమి చేయ వలెనా అని ఆలోచించుకొనుచుండిరి. మనము దీని నిమిత్తమై ఏమి చేయుదుము? మనమెందుకు నిర్లక్ష్యముగా నున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచకక్రియలను చేయుచుండెను.
గాని మనమాయనను నివారింపలేకున్నాము, యూదుల అధికారులు తమ స్వనాశనమునకే ఇట్లు మాట్లాడుకొనుచున్నారు? యేసు చాల అద్భుతములు చేయుచున్నాడని ఒప్పుకొనిరి. అయితే వారాయనను ఎందుకు నమ్మలేకపోవుచున్నారు? ఎందుకనగా రక్షకునికంటే తమ పాపములయందే ఎక్కువ లక్ష్యముంచియున్నారు.
లాజరును బ్రతికించడంలో యేసు పాత్ర
‘రైలు’గారు ఈ విధముగా చెప్పుచున్నారు. ప్రభువుయొక్క విరోధులు సైతము ఆయన అద్భుతములెన్నియో చేసియున్నాడని నమ్మిరి. ఆయన జరిగించిన అద్భుతములలోని సత్యమును వారు గ్రహించలేదని మనము చెప్పగలమా ? వారు దానిగురించియే ఆలోచించి యుండలేదని చెప్పవచ్చును.
అవి ఎక్కువగాను, బహిరంగముగాను, చేయబడి అనేకులచే సాక్ష్యమివ్వబడుచుండుటచే వారు ఆ కార్యములను తృణీకరింప లేకపోయిరి. నాస్తికులును, దేవుడున్నాడని చెప్పుటకు సందేహించువారును, ప్రభువు జరిగించిన ఈ అద్భుత కార్యములు మోసకరమైనవనియు, కేవలము భ్రాంతియనియు చెప్పగలిగినయెడల అట్లు వివరించుటకు మరెక్కువగా పూనుకొనెడివారే.
ప్రభువు నివసించిన రోజులలో ఉన్న పరిసయ్యులు ఆయన పురోభివృద్ధిని ఆటంకపరచుటకు భూమ్యాకాశములను కదిలించినను, ఆయన అద్భుతకార్యములు చేసిరను వాస్తవమును మాత్రము తృణీకరించలేరు. అయితే 18 శతాబ్దములు దాటిన తరువాత ఆయనచేసిన అద్భుతములనుగురించి న్యాయ విరుద్ధమైన వివాదమును లేపుట నిర్వివాదాంశము.
11:48 యేసు చేయుచున్న అద్భుతములనుబట్టి ప్రజలు ఆయనను వెంబడించు చున్నారు. యేసును వెంబడించుచున్న ప్రజలను ఆటంకపరచనిచో, వారు ఆయనను రాజుగా చేసి రోమా ప్రభుత్వమునకు దెబ్బతీయవచ్చును.
అట్లు జరిగినయెడల ప్రభుత్వమును పోగొట్టుకొనిన రోమీయులు యూదులపైబడి వారిని హింసించగలరు. ఇట్లు తమ అధికారములను, రాజ్యమును పోగొట్టుకొందుమని యూదులు భయపడిరి. అనగా రోమియులు దేవాలయమును పడగొట్టి యూదులను చెదరగొట్టుదురని వారి అభిప్రాయము.
Blessing Bible Verses In Telugu
క్రీ.పూ. 70 లో ఇట్లే జరిగెను. అది వారాయనను అంగీకరించినందు లకు కాదుగాని, తృణీకరించినందులకే. ఎఫ్.బి. మేయర్ క్రైస్తవ్యమును గురించి ఇట్లు చెప్పుచున్నాడు – “క్రైస్తవ్యము వ్యాపారమును, లాభమును, మోసకరమైన లావాదేవీ లను, వ్యాపారస్తులను, సాతానుయొక్క అగ్రపీఠమును శాశ్వతముగా స్థిరముగా పరిష్కరించి ప్రపంచమును తలక్రిందులు చేయును” అని చెప్పెను. ఇది మిక్కిలి ఆయాసకరమైనదియు దుఃఖపూరితమైనదియునైయుండి లాభమును కూల్చివేయును.
11:49 క్రీ.పూ. 26-36 లో కయప ప్రధాన యాజకుడుగా నుండెను. యేసును పట్టుకొనుటకు ప్రధాన యాజకులు ప్రయత్నించుటకును, ఆయనను సిలువ వేయు టకును ఆలోచించుకొనుచుండెడి ఈ ప్రయత్నములన్నింటిలోను కయప ముందు నడిచెను. పేతురు, యోహాను సన్హెద్రిన్ సభముందు నిలిచినప్పుడు (అపొ.కా. 4:6) కయప అక్కడ ఉండెను. కయప యేసుప్రభువును అంగీకరించినవాడు కాడు.
11:50 యేసు ప్రధాన యాజకులతోను, పరిసయ్యులతోను వాదించినప్పుడు యేసు కొరకు యూదులు నశించవలెనని వారు తప్పుగా భావించిరి. కాని ఆయన యూదా జనాంగముకొరకు చావనైయున్నాడు.
యూదా జనాంగము నశించిపోకుండు నిమిత్తము యేసు చావనైయున్నాడనునది ప్రవచనమే. ఎందునిమిత్తమై యేసు ఈ లోకమునకు వచ్చెనో కయప గ్రహించినట్లున్నది. పాపులకు ప్రతిగా చనిపోవుటకు యేసు వచ్చెనని కయప నమ్మినట్లు మనకు కన్పించుచున్నది. కాని తన ఆత్మ రక్షణార్థమై యేసును అంగీకరించలేదని అతడు మాట్లాడు మాటలనుబట్టి తేలుచున్నది.
11:51 తన్ను గురించి కయప మాట్లాడియుండలేదు. మరియు తన ఇష్టాను సారముగా అతడట్లు మాట్లాడలేదుగాని, దేవుని ప్రేరేపణవలననే కయప ఆ విధముగా మాట్లాడెను. ఇశ్రాయేలీయుల జనాంగముకొరకు యేసు మరణించవలెనను ప్రవచన మిది.
ఎందుకనగా అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై యుండెను. గనుక దేవుడు అతని ద్వారా మాట్లాడెను. కయప నీతిమంతుడైయుండుటనుబట్టి కాదుగాని, అతడు పాపాత్ముడైనప్పటికీ, అతడు యాజకుని స్థానములోనున్నాడు గనుక, అత డుండిన స్థానమునుబట్టి అతడు ప్రవచించెను.
11:52 కయప యేసు ఇశ్రాయేలీయులందరి నిమిత్తము మరణించవలసి యున్నదని ప్రవచించుటయేగాక భూమిపైనున్న అన్యజనులందరిలో చెదరియున్న తనవారినందరిని ఒకచోట చేర్చుటకు మరణించవలసియున్నాడని ప్రవచించెను.
ఈ భూమిపై చెదరిపోయిన యూదులకు ‘కయప’ సాదృశ్యముగానున్నాడని కొంత మంది చెప్పుదురు. కాని మరికొందరు సువార్త ప్రకటింపబడుటద్వారా నమ్మిన అన్య జనులకు పోలికగా ‘కయప’ ఉన్నాడని చెప్పుదురు.
11:53, 54 : బేతనియ గ్రామములో జరిగిన అద్భుత కార్యమునుగూర్చి పరిసయ్యులు ఒప్పింపబడలేదుగాని, వారు మరింత ద్వేషముతో ఆయనను చంపుటకు ఆలోచనలు చేయుచుండిరి. యూదులలో తనపట్ల పెరుగుచున్న ద్వేషమును తెలిసికొనిన యేసు ఎఫ్రాయిము గ్రామమునకు వెళ్ళి అచ్చట నివసించెను. ఆ ఎఫ్రాయిము గ్రామము అరణ్య ప్రాంతమునకు సమీపమున నుండెను.
Blessing Bible Verses In Telugu
11:55 యూదుల పస్కాపండుగ సమీపించెననగా యేసుయొక్క బహిరంగ పరిచర్య ముగియుచున్నదని అర్థము. ఆ పస్కాపండుగ సమయమునందే ఆయన మరణించ వలసియున్నది. ఈ పండుగకుముందు తమ్మును తాము శుద్ధిచేసికొనుటకు ప్రజలు యెరూషలేమునకు రావలసియున్నది.
ఉదాహరణకు యూదుడొకడు శవమును పట్టు కొనినయెడల యూదుల శుద్ధీకరణాచార ప్రకారము అతడు తన్నుతాను శుద్ధిచేసికొన వలసియున్నది. ఈ శుద్ధీకరణ తన్నుతాను పవిత్రపరచుకొనుటద్వారాను, మ్రొక్కుబడులు చెల్లించుటద్వారాను జరుగును.
ఇట్లు యూదులు ఈ పండుగకు తమ్మునుతాము శుద్ధి చేసికొన తలంచుచు, పస్కాబలిపశువునే (క్రీస్తును) వధించుటకు పన్నాగములు పన్ను చున్నారు. మానవ హృదయ కాఠిన్యము ఎంత చక్కగా ఇక్కడ చిత్రీకరింపబడినది!
11:56,57 వారందరు యెరూషలేములోకూడుకొనిన తరువాత అద్భుతములు చేయు వాడైన యేసునుగూర్చి ఆలోచించుచుండిరి. ఆయన పండుగకు రాడా? యేమి? అని చెప్పుకొనుచుండిరి. “మీరేమి ఆలోచించుకొనుచున్నారు? ఆయన పండుగకు రాడు” అని కొందరు చెప్పుచుండిరి.
ఆయనను పట్టుకొనవలసినదిగా ప్రజల అధికారులు, పరిసయ్యులు అధికార పూర్వకమైన ఆజ్ఞలు జారీ చేసిరని వారికి బాగుగా తెలియును. మరియు వారిలో ఎవడైనను ఆయనను కనుగొనినప్పుడు వారాయనను పట్టుకొని చంపుటకు ఆలోచించుచుండిరి.