ఘనుడైన కాన్స్టాంటైన్  (రోమా చక్రవర్తి, క్రీ.శ. 306-337)

ఘనుడైన కాన్స్టాంటైన్  (రోమా చక్రవర్తి, క్రీ.శ. 306-337)

క్రీ.శ. 293 లో చక్రవర్తియైన డయోక్లేషియన్ గాలు (Gaul), బ్రిటన్ కు కాన్ స్టాంటియస్ నన్ను కైసరుగ నియమించినప్పుడు కాన్స్టాంటియస్ కుమారుడైన కాన్ స్టాంటైన్ (Constantine) తూర్పుప్రాంతపు చక్రవర్తి, డయోక్లేషియన్ పెంపుడు కుమారుడైన గలేరియస్ ఆస్థానములో వాస్తవమునకు బందీగా ఉంచబడి, క్రీ.శ. 305 లో పారిపోయి పశ్చిమ ప్రాంతమున తండ్రియొద్దకు చేరెను.

అదే సంవత్సరము డయోక్లేషియన్ రోమా చక్రవర్తి పదవికి రాజీనామా చేయగా గలేరియస్ చక్రవర్తి అయ్యెను. ఇతడు మాగ్జిమియన్ (Maximian), సెవరస్ (Severus) లను కైసరులుగ తనక్రింద నియమించుకొనెను. అదేవిధముగ కాన్స్టాంటి యస్ తన కుమారుడైన కాన్స్టాంటైన్ ను తన క్రింద కైసరుగ నియమించెను. ఇటలీ, ఆఫ్రికాలు పశ్చిమ సామ్రాజ్యములో భాగమైనప్పటికి వాటి పరిపాలన సమస్యాత్మకముగా ఉన్నందున కాన్ స్టాంటియస్ వాటిని అంగీకరింపక ఫ్రాన్సు, స్పెయిను, బ్రిటన్లను పరిపాలించెను.

కనుక ఇటలీ, ఆఫ్రికాలు తూర్పు సామ్రాజ్య భాగములోని మాగ్జిమియన్ పాలనలోనికి వచ్చినవి. అయినప్పటికిని తూర్పుప్రాంతమున కొంతకాలముపాటు హింసలు కొనసాగినవి. పడమటి ప్రాంతములో కాన్స్టాంటియస్, కాన్ స్టాంటైన్ల కాలములో హింసలు వాస్తవమునకు ఆగినవి. వారిద్దరు ప్రజలతో మంచి సంబంధములు ఏర్పరచుకొని, వారి సహకారమును పొందుచు అందరిని సమానముగ పరిపాలించిరి.

కాన్ స్టాంటియస్ పరిపాలనాదక్షత, జాగ్రత్త, నెమ్మది, మంచితనము, ఉదార భావములు కలవాడు కనుక అతని పరిపాలనలో ఉన్నవారందరికి మంచిని పెంపొం దింపవలెనని తలంచెను. “తన స్నేహితులను ఐశ్వర్యవంతులుగ చేసినప్పుడు తనకు ఐశ్వర్యము లభించినద”ని చిన్న సైరస్ (Cyrus, the younger – క్రీ.పూ. 424? -401) చెప్పిన విధముగ కాన్స్టాంటియస్ క్కూడ “తన ధనాగారములో డబ్బు నిల్వ ఉండుటకంటె తన ప్రజలు ధనవంతులుగా నుండుట మంచిద”ని తరచు చెప్పెడివాడు. కాన్ స్టాంటియస్ స్వతహాగా నిరాడంబరజీవి, డంబముగా ఉండుటకంటె మట్టిపాత్రలలో తిని, త్రాగితే అతనికి తృప్తి కలిగేది. అతని సుగుణముల ఫలితముగ అతడు పరిపా లించిన ప్రాంతములలో గొప్ప శాంతి, సమాధానము లేర్పడినవి.

ఈ సుగుణములకు తోడు, అతనికి దేవుని వాక్యముయెడల అమితమైన ప్రేమ కలదని చెప్పబడుచున్నది. తన జీవితమును, పరిపాలనను ఆ సిద్ధాంతములకనుగుణ ముగ నడిపించెను. క్రైస్తవ నీతికి, సిద్ధాంతమునకు వ్యతిరేకమైనందున అతడు ఏవిధమైన యుద్ధములలో పాల్గొనలేదు మరియు యుద్ధములలో పాల్గొను ఇతర నాయకులకుకూడ అతడు సహకరించలేదు.

దేవాలయములను నాశనము చేయుటను ఆపి క్రైస్తవులను బ్రతుకనీయుమని, చిత్రహింసలవలన వారికి కలిగిన గాయములనుండి ఉపశమనము కలగనీయుమని ఆజ్ఞాపించెను. కాని సామ్రాజ్యములోని యితర ప్రాంతములలో హింసలు అంతగా తగ్గలేదు. కాన్ స్టాంటియస్మాత్రము క్రైస్తవులు తమ విశ్వాసమును యధేచ్ఛగా కొనసాగించుటకు అనుమతించెను.

ఒక సందర్భములో కాన్ స్టాంటియస్ తన ఆస్థానములోని క్రైస్తవులలో ఎవరు యథార్థవంతులో తెలిసికొనవలెనని నిశ్చయించుకొని, ఒక దినమున ఆస్థానములోని అధికారులను, సేవకులందరిని పిలిచి ఎవరైతే దయ్యములకు బలి అర్పించెదరో వారుమాత్రమే తమ తమ ఉద్యోగములలో కొనసాగెదరు, ఎవరు దీనికి అంగీకరించరో వారు తన ఆస్థానమునుండి నెట్టివేయబడుదురని చెప్పెను.

అది వినగానే ఆస్థానము లోని సేవకులందరు గుంపులుగా విడిపోయి, కొంతమంది సేవకులు ఇష్టపూర్వకము గానే దయ్యములను పూజించెదమని చెప్పిరి. మరికొందరు బహిరంగముగ ధైర్యముతో దయ్యములను పూజించుటకు నిరాకరించిరి. ఇది గ్రహించిన చక్రవర్తి స్థిరవిశ్వాసము కలిగి దైవికముగా జీవించుచున్న క్రైస్తవులను అవిశ్వాసులనుండి వేరుచేసెను.

దయ్యములకు బలి అర్పించెదమని చెప్పినవారిని చక్రవర్తి సున్నితముగ మంద లించి, వారు దేవునికి విశ్వాసఘాతకులని, తన ఆస్థానములో సభ్యులుగనుండుటకు తగినవారు కారని, వారిని దేశ బహిష్కరణ గావించెను. దయ్యములకు బలి అర్పిం చుటకు నిరాకరించి దేవుని ఒప్పుకొనినవారిని చక్రవర్తి అభినందించి వారుమాత్రమే తన కొలువులో ఉండతగినవారని, వారు తాను ఆధారపడతగిన సలహాదారులని; తనను, రాజ్యమునుకూడ కాపాడగలరని చెప్పెను. మరియు వారు తన కొలువులో ఉద్యోగులుగామాత్రమేగాక, వారిని తన నిజస్నేహితులుగ భావించి, తన రాజ్యములోని ధనాగారముకంటె గొప్పవారని ఘనపరచెను.

క్రీ.శ. 306 లో కాన్ స్టాంటియస్ చనిపోగా, అతని కుమారుడైన కాన్ స్టాంటైన్ చక్రవర్తియయ్యెను. బానిసత్వమునుండి సంతోషకరమైన స్వాతంత్య్రములోనికి దేవుని పిల్లలను నడిపించుటకు దేవుడు పంపించిన రెండవ మోషేవంటివాడు ఈ కాన్స్టాంటైన్ అని క్రైస్తవులనేకులు విశ్వసించిరి.

ఫ్లావియస్ వెలేరియస్ కాన్ స్టాంటినస్ (కాన్ స్టాంటైన్) {Flavius Valerius Constantinus (Constantine)} రోమా సామ్రాజ్యములోని నైసుస్ (Naissus) పట్టణములో క్రీ.శ. 280 లో జన్మించెను. అదే ఈనాటి ఆగ్నేయ ఐరోపాలోని సెర్బియా.

క్రీ.శ. 312 కు పూర్వము కాన్స్టాంటైన్ అన్యుడైనను తనకు సహాయము చేసెడి క్రైస్తవులను చేర్చుకొనుటకు ఇష్టపడెను, కాని అతడు ఏ ఒక్క దేవుని ఆరాధించెడివాడు కాదు. ఏదిఏమైనను క్రీ.శ. 312 నుండి 324 మధ్యకాలములో నిజదేవుడైన క్రీస్తును అంగీకరించి, అనేక పర్యాయములు సంఘములకు, బిషప్లకు ప్రోత్సాహములను అందించెను. క్రీ.శ. 324 సెప్టెంబరు 18న తన రాజకీయ శత్రువు, చక్రవర్తియైన లిసినియస్ (Licinius) ను ఓడించిన తర్వాత కాన్ స్టాంటైన్ బహిరంగముగ క్రైస్తవ్య మును స్వీకరించెను.

తండ్రివలె నిరాపేక్షగల రాజైనప్పటికిని, కాన్స్టాంటైన్ నిరంకుశాధికారముతోను, అణచివేత, క్రూరత్వములతోను పరిపాలించెను. తన సలహా సంఘములో సంఘకాపరు లను చేర్చుకొనెను. బానిసలు, ఖైదీలను ఆదరించు విషయములో అతనిపై క్రైస్తవ బోధనలు మిక్కిలి ప్రభావము చూపెను. అయితే తన జ్యేష్ఠ కుమారుడైన క్రిస్పస్ (Crispus) ను, రెండవ భార్య ఫౌస్తా (Fausta) ను చంపించెను. ఆ కాలమునకు చెందిన అనేకులవలె కాన్స్టాంటైన్ జీవితము, ప్రవర్తన క్రైస్తవ్యము, అన్యమతముల కలయికయైయున్నది.

కాన్స్టాంటైన్ పరిపాలనా కాలములో మూడు ప్రాముఖ్య సంఘటనలు జరిగెను. అవి, అతడు రోమా సామ్రాజ్యపు మొదటి క్రైస్తవ చక్రవర్తియగుట. క్రైస్తవ మతమును చట్ట సమ్మతమైన మతముగా చేయుట. మరియు కాన్ స్టాంటినోపిల్ (Constantinople) పట్టణమును కట్టించుట. కాన్ స్టాంటినోపిల్ తూర్పు రోమా సామ్రాజ్యమునకు రాజధానియై, క్రైస్తవ మత విజయమునకు సంకేతమైనది.

పశ్చిమ ప్రాంతమునకు కాన్ స్టాంటైన్ చక్రవర్తియైనప్పుడు సింహాసనమునకు వారసులైనవారినుండి ఎన్నో కష్టముల నెదుర్కొనెను. మాగ్జిమియన్ చక్రవర్తిగా రాజీనామా చేయగానే, అతని కుమారుడైన మాగ్జెన్షియస్ (Maxentius) సైన్యముచేత చక్రవర్తిగ ఎన్నుకొనబడెను. ఇటలీకూడ పశ్చిమ రాజ్యములోని భాగము కనుక రోమా సామ్రాజ్యమంతటికి మహాచక్రవర్తినని మార్జెన్షియస్ తలంచెను.

కాన్స్టాంటైన్ పరి పాలన కాలములోకూడ అతని సైనికపాలన రోములో కొనసాగెను. అందుచే రోమను శాసనసభ మాగ్జెన్షియసనకు మిక్కిలి భయపడి అతనిని ఎదిరించుటకు సందేహించినది కాని అతని తండ్రియైన మాగ్జిమియన్ ను ప్రాధేయపడగా అతడు తన కుమారుని ఆధీనములో లేని ప్రాంతముపై అజమాయిషీని విధించుటకు ఎత్తువేసి మాగ్జెన్షియస్ ను పడద్రోయుటకు డయోక్లేషియను తనతో సహకరింపుమని కోరెను. కాని డయోక్లేషి యన్ అందుకు అంగీకరింపలేదు. మార్జెన్షియస్ ను చక్రవర్తిగా ఎన్నుకొనిన సైనికులు అతనిని తొలగించుటకు అతని తండ్రి పన్నిన కుట్రను ఎరిగినవారై మాగ్జిమియన్ ను హెచ్చరించిరి.

మాగ్జెన్షియసు ఎదిరింపలేనని గ్రహించిన మాగ్జిమియన్ ఫ్రాన్స్ను పరిపాలించు చున్న కాన్స్టాంటైన్ వైపు తన దృష్టిని మరల్చెను. అతని కుమారునిమీద ఫిర్యాదుచేయు నెపముతో అతడు కాన్స్టాంటైన్ వద్దకు వెళ్ళెను. కాని, వాస్తవమునకు అతనిని చంపి పడమటి రాజ్యమును వశపరుచుకొనవలెనని తలంచెను. అయితే మాగ్జిమియన్ కుమార్తె మరియు కాన్స్టాంటైన్ భార్యయగు ఫౌస్తా ఆ కుట్రను తెలిసికొని భర్తకు సమాచార మందించగా, కాన్స్టాంటైన్ ఫ్రాన్స్కు పారిపోవుచున్న తన మామను బంధించి, ఉరితీయించెను.

ఇంతకాలము మాగ్జెన్షియస్ సహింపరాని దుర్మార్గముతో రోమును పరిపాలించెను. అనేకమంది ప్రజలను ఉరితీయించి, వారి అస్తులను స్వాధీనపరచుకొనెను. అందుచే ఇతనిని మరియొక ఫరో లేక నీరోగా ప్రజలు భావించిరి. ఇతడు అప్పుడప్పుడు ఉన్మాదియై అనేకమంది రోమా పౌరులను చంపుమని సైనికులకు ఆజ్ఞాపించెను. ఇతడు శరీరేచ్ఛలకు, దుర్మార్గమునకు హద్దులు లేనంతగా చెడ్డవాడై మంత్ర తంత్ర విద్యలకు అలవాటుపడి, తన చెడుకార్యములలో సహాయపడుటకు పిశాచములను ఆశ్రయించేవాడు. కాన్ స్టాంటైన్ తనపై యుద్ధము చేయుటకు సిద్ధపడుచున్నాడని ఊహించుకొని, యుద్ధ నివారణకు తగిన జ్ఞానమును అనుగ్రహింపుమని పిశాచములను కోరెడివాడు.

కొంతకాలము ఇతడు క్రైస్తవులకు అనుకూలముగ ఉన్నట్లు నటించెను. రోమీ యులను స్నేహితులుగా చేసికొనుటకు క్రైస్తవులను హింసింపరాదని శాసించి, అతడుకూడ వారిపై గర్వముతోకూడిన నిందలు మోపుట మానివేసెను. అయితే ఆ తరువాత మరల వారిని బహిరంగముగ హింసించుట మొదలుపెట్టెను.

మాగ్జెన్షియస్ క్రూర పరిపాలనకు విసుగుజెందిన రోమా ప్రజలు కాన్ స్టాంటైన్ ను జోక్యము కలిగించుకొని, తమ పట్టణమును, రాజ్యమును మాగ్జెన్షియస్ నుండి విడిపింపు మని ప్రాధేయపడిరి. కాన్స్టాంటైన్ వారి విజ్ఞాపనను విని, వారి దుస్థితికి జాలిపడి అతని అవినీతిక్రియలను, క్రూరత్వమును విడనాడుమని మాగ్జిన్షియస్ ను హెచ్చరించుచు ఒక ఉత్తరము వ్రాసెను. అయినను మాగ్జెన్షియస్ తన క్రూరత్వమును విడనాడనందున, కాన్స్టాంటైన్ ఉత్తరములు వ్రాసి ప్రయోజనములేదని గ్రహించి ఫ్రాన్సు, బ్రిటన్ లో తన సైన్యమును సమకూర్చుకొని క్రీ.శ. 313 లో రోముపై దండెత్తుటకు సిద్ధపడెను.

కాన్స్టాంటైన్ సైన్యముతో వచ్చుచున్నాడని మార్జెన్షియస్ విని అప్రమత్తుడయ్యెను. బహిరంగ యుద్ధములో అతనిని ఎదుర్కొనుటకు ఇష్టపడక, పట్టణమునకు వచ్చు దారిపొడవున రహస్య సైనికస్థావరములను ఏర్పరచి, కాన్స్టాంటైన్ సైన్యముపై అకస్మాత్తుగా దాడిచేయుటకు ఏర్పాటు చేసెను. కాని వారందరిపై కాన్స్టాంటైన్ విజయము సాధించెను.

అయినను అన్యమూఢవిశ్వాసములచేత ప్రభావితుడైన మాగ్జెన్షియస్ యొక్క మంత్ర తంత్ర శక్తులనుగురించి కాన్స్టాంటైన్ ఆందోళనచెంది, అతని శక్తులను జయించెడు మార్గమును అన్వేషింపసాగెను. అతని సైన్యము రోమును సమీపించుచున్నపుడు దేవుని సహాయముకొరకు అతడు అనేకసార్లు ఆకాశమువైపు చూచినాడని ఒక కథ చెప్పబడినది.

ఒక సాయంకాల సంధ్యాసమయములో అతడు ఆకాశపు దక్షిణ దిక్కును చూచినప్పుడు గొప్ప ప్రకాశమానమైన వెలుగు సిలువ ఆకారములో కనబడెను. ఆ సిలువమీద “దీనితో జయించు” అని వ్రాయబడి యుండెను. ఈ దర్శనమును కాన్స్టాంటైన్తో పాటు అతని సైన్యాధికారియైన యూస్టేబియస్ పామ్ఫలస్ మరియు ఇతర సైనికులుకూడ చూచిరి ఆ దర్శనభావము కాన్ స్టాంటైను తెలియలేదు. అతడు తనతోకూడ ఉన్న అనేకమందిని సంప్రదించెను గాని ఎవరివద్దను జవాబులేదు. అయితే ఆ రాత్రి క్రీస్తు అదే సిలువతో కలలో కనిపించి, అట్టి సిలువను తయారుచేయించి, తనతోపాటు యుద్ధభూమికి ఆ సిలువను తీసికొనివెళ్లినచో నీవు వెళ్లు ప్రతి యుద్ధమందును తప్పక విజయము పొందగలవని క్రీస్తు పలికినట్లు చెప్పబడినది.

“ఒక ముఖ్యవిషయమును గమనించవలెను. మూఢవిశ్వాసమునకు గుర్తుగ ఆ సిలువ యీయబడలేదు. కాని ఆ సిలువలో యుద్ధములను జయించెడి శక్తియున్నది. అది అతనికి, అతని జనమునకు ఎల్లప్పుడు జ్ఞాపక చిహ్నమైయున్నది. ఎవరిపేరున వారు యుద్ధము చేయుచున్నారో, ఎవరి మహిమ, ఎవరి రాజ్యవ్యాప్తికొరకు వారు యుద్ధము చేయుచున్నారో, ఆయనయందు నమ్మికయుంచవలెను.”

మరుసటి దినము కాన్ స్టాంటైన్ తాను యుద్ధముచేయు ప్రతి స్థలమునకు తీసికొనివెళ్లుటకు బంగారముతోను, ప్రశస్తమైన రత్నములతోను సిలువను చేయించెను. వారికి ముందున్న ఆ సిలువ వారిలో క్రొత్త ఆశను, నమ్మకమును పునరుద్ధరింపజేయగా, కాన్ స్టాంటైన్, అతని సైన్యము రోమువైపు త్వరితముగ బయలుదేరి వెళ్లిరి.

ఇప్పుడు మాగ్జెన్షియస్ కచ్చితముగ ప్రత్యక్ష యుద్ధములో కాన్స్టాంటైన్ సైన్యమును ఎదుర్కొనవలెను. కనుక, అతని సైన్యములను తైబర్ నది ఆవలగల మైదానమునకు నడిపించెను. నది దాటిన వెంటనే వారు దాటివచ్చిన వంతెనను మాగ్జెన్షియస్ పడ గొట్టించి, అదే స్థలములో తెడ్లతో నడుపు పడవలను, పలక బల్లలను ఉపయోగించి పడగొట్టించిన వంతెనవంటి ఆకారమును నిర్మించెను. కాన్స్టాంటైన్ సైనికులు నది దాటుటకు ప్రయత్నించినప్పుడు, అది వారితోపాటు కూలి నదిలో పడును గనుక అప్పుడు వారిపై దాడిచేయుట మాగ్జిన్షియస్ యుక్తియైయున్నది.

అయితే దానికిబదులు ఏమి జరిగినదో కీర్తనల గ్రంథములో వ్రాయబడినది :

కీర్తనలు 7-15, 16

రెండు సైన్యములు యుద్ధములో నిమగ్నమైయున్నప్పుడు మాగ్జెన్షియస్ మనుష్యులు సిలువ పతాకము క్రింద యుద్ధముచేయుచున్న కాన్స్టాంటైన్ సైన్యము ముందు నిలువలేకపోయిరి. కనుక అతడు, అతని సైన్యము పట్టణమువైపు పరుగెత్తిరి. రౌద్రముతోకూడిన కాన్స్టాంటైన్ ముట్టడిని తప్పించుకొను తొందరలో కాన్స్టాంటైన్’ సైనికులను పడద్రోయవలెనని మోసముతోకట్టిన వంతెనమీద వారే మోసపోయి పడిపోయిరి. తొందరగ దాటుటకు కట్టిన వంతెన కూలి, తిరుగబడినది. చాలమంది సైనికులు ఇటు అటు కొట్టుకుపోయిరి.

మాగ్జెన్షియస్, అతని గుఱ్ఱము నదిలో పడిపోయెను. అతడు ధరించిన బరువైన కవచము అతనిని నది అడుగుభాగమునకు లాగినది. కనుక అతడు నీటమునిగి చనిపోయెను. ఫరో సైన్యము ఏవిధముగ ఎర్రసముద్రములో మునిగి చనిపోయినదో ఆ ప్రవచనపు నెరవేర్పునకు సాదృశ్యముగా మాగ్జెన్షియస్, అతని సైన్యము తైబర్ నదిలో మునిగి చనిపోయిరి.

ఐగుప్తు దాస్యములో ఇశ్రాయేలీయులు 400 సంవత్సరములు శ్రమననుభవించి నట్లు, రోమా ప్రభుత్వపు కాలిమడమక్రింద క్రైస్తవులు 300 సంవత్సరములు శ్రమ ననుభవించిరి. సంహారదూత ఐగుప్తును దాటిపోవునప్పుడు గొఱ్ఱపిల్ల రకము ఇశ్రాయే లీయులను ఫరో ఇనుప పిడికిలినుండి విడిపించెను. ఇప్పుడైతే దేవుని గొఱ్ఱపిల్లయొక్క సిలువ సైన్యసమూహమును చివరి రోమా ప్రభుత్వ క్రూరబంధకములనుండి విడిపించి, దేవుని ప్రజలను స్వతంత్రులనుగా చేసెను. ఇప్పటికి సుమారు 1600 సంవత్సరములు గతించినవి, అయినను అదే ప్రభువు తన ప్రజలను కాపాడుచునే యుండెను.

కాన్స్టాంటైన్ రోమా సామ్రాజ్యమంతటికి చక్రవర్తియయ్యెను. క్రీ.శ. 324 లో తన రాజధానిని రోమునుండి తూర్పు ప్రాంతమునకు మార్చెను. ఉత్తరమున నల్ల సముద్రము, మర్మరా సముద్రముల మధ్యగల జలసంధియగు బోస్ఫరస్లోని బైజాంటి యమ్ (Byzantium) అను గ్రీకుల పురాతన పట్టణమును తన రాజధానిగా ఎన్ను కొనెను. పురాతన కాలమునుండి అది గొప్ప వర్తక మార్గము. ఎంతో డబ్బు వెచ్చించి కాన్స్టాంటైన్ దానిని విస్తృతపరచి, దానిని ఐశ్వర్యవంతమైన పట్టణముగ చేసి, ‘నూతన రోము’ అను పేరుతో ప్రతిష్ఠించెను. కాని అది కాన్స్టాంటినోపిల్ (Constantinople) అను పేరుతో పిలువబడెను.

కాన్స్టాంటైన్ రోమా సామ్రాజ్యపు మొదటి క్రైస్తవ చక్రవర్తి. పశ్చిమ ప్రాంతపు క్రైస్తవ్యమునకు కాన్ స్టాంటినోపిల్ రాజధాని నగరమైనది. కాని తూర్పు ప్రాంతములోని క్రైస్తవ్యమును రోము ఏలుబడిచేసెను. కాన్స్టాంటైన్చే స్థాపించబడిన పశ్చిమ రోమా సామ్రాజ్యము వేయి సంవత్సరములపైగా నిలచెను.

ఆ కాలములో క్రైస్తవ్యము శాంతిగా యుండెను. కాన్స్టాంటైన్ క్రీ.శ. 327 మే 22న చనిపోయెను. చనిపోవుటకు ముందు రోమా సామ్రాజ్యమును మిగిలియున్న తన ముగ్గురు కుమారులకు పంచియిచ్చెను.

రోమా చక్రవర్తుల పరిపాలనలో జరిగినట్లు సర్వ సాధారణమైన రీతిలో, క్రమ పద్ధతిలో క్రైస్తవులపై హింసలు జరుగలేదు కాని ప్రపంచములో వేల వేల ప్రాంతములలో చెదురుమదురుగ క్రైస్తవులు హింసింపబడెను. తాను శిరచ్ఛేదము చేయబడక పూర్వము, శ్రమలపాలైన అపొస్తలుడైన పౌలు రోమా చెరసాలనుండి తన శిష్యుడైన తిమోతికి ఈలాగు వ్రాసెను : కనుక శాంతితోకూడిన ఆ వేయి సంవత్సరములలోకూడ క్రీస్తునందలి విశ్వాసమునుబట్టి క్రైస్తవులు హతసాక్షులుగా చేయబడిన దృష్టాంతములు లేకపోలేదు.

2 తిమోతి 3-12

మొదటి క్రైస్తవ హతసాక్షులు

మొదటి క్రైస్తవ హతసాక్షులు

మత్తయి 16:18 లో ప్రభువైన యేసు తన శిష్యులతో ఈ విధముగ చెప్పెను:

ప్రభువైన యేసు మాటలలోని మూడు ప్రధానాంశములను యిట్లు గ్రహించ వచ్చును :

మత్తయి 16-18

  1. క్రీస్తు ఈ లోకములో ఒక సంఘమును కలిగియుండును.
  2. ఆయన సంఘము శక్తివంతముగ అపవాదిచే ముట్టడింపబడును.
  3. అపవాది దాడులు దానిని నాశనము చేయలేవు.

సంఘ చరిత్రను వెనుదిరిగి చూచినట్లయితే ప్రతి శతాబ్దములోను ప్రభువైన యేసు చెప్పిన మాటలు నెరవేరినట్లు మనము చూడగలము. ఘనమైన దాని చరిత్ర ఆయన మాటలు నిజమని నిరూపించును. మొదటిగా, లోకములో క్రీస్తు నిజ సంఘ మున్నదనుట నిర్వివాదాంశము.

రెండవది, ప్రతి శతాబ్దములోను ప్రతి స్థాయిలోనున్న లౌకిక, మత నాయకులు, వాటి పాలితులు బహిరంగముగాను, బలవంతముగాను వివిధమైన కపటబుద్ధి, మోసపూరిత పద్ధతులను అవలంభించుచు, యథార్థమైన ఆ సంఘమును నిందించి, బహుగా హింసించిరి.

మూడవది, ఎదురైన ప్రతి ముట్టడిని సంఘము ఓర్పుతో సహించి, క్రీస్తుయొక్క సాక్ష్యమును గట్టిగ పట్టుకొని యుండెను. క్రూరమైన కోపము, ద్వేషము సృజించిన తుపానుద్వారా సంఘము ప్రయాణించుట చూచుటకెంతో మహిమకరముగ ఉండును.

Psalm23.infoKnowledge Of The HolyEvery Christian Should Know
Key Biblical Messianic PropheciesPower in the BloodPsalm91.infoSavior on the Cross
Pursuit of GodBible Study For BeginnersPray For Those You LoveBible Study Act

దాని చరిత్ర చాలావరకు ఈ గ్రంథములో వ్రాయబడినది. ఈ గొప్ప కార్యములు క్రీస్తు మహిమకొరకు వ్రాయబడెను. సంఘము యొక్క హతసాక్షుల అనుభవజ్ఞానము చదువరులమీద ప్రయోజనకరమైన ప్రభావము కలిగి, వారి క్రైస్తవ విశ్వాసమును బలపరచునని ఆశించుచున్నాము.

ప్రభువైన యేసుక్రీస్తు

మానవులమైన మనకొరకు పరమును వీడి, ఈ లోకమునకు వచ్చి, మానవ పాపమును సిలువలో భరించి, మన దోషశిక్షనుండి మనలను రక్షించిన లోకరక్షకుడైన యేసుక్రీస్తే ఈ క్రైస్తవ హతసాక్షుల వరుసలో మొదటివాడు. (పటము 2 చూడుము) ఇక్కడ గ్రంథస్థము చేయవలసిన అవసరములేకుండ ఆయన శ్రమలు, సిలువ కథ పరిశుద్ధ లేఖనములలో చక్కగ చెప్పబడినవి.

తర్వాత ఆయన పునరుత్థానము యూదుల ఉద్దేశ్యమును ఓడించినదని చెప్పిన చాలును. అంతేగాక ఆయన శిష్యుల హృదయ ములకు నూతన ధైర్యమును, నూతన మార్గమును చూపినది. పెంతెకొస్తు దినమున వారు పరిశుద్ధాత్మశక్తిని పొందిన తర్వాత, ఆయన నామమును ప్రకటించుటకు అవసర మైన నమ్మకము, ధైర్యము కలిగియుండుట యూదుల అధికారులనందరిని కలవర పరచినది, వినువారందరు విభ్రాంతినొందిరి.

మొదటి క్రైస్తవ హతసాక్షులు

క్రైస్తవ సంఘ ప్రారంభ దినములలో రోమా ప్రభుత్వ పరిపాలన కాలములో హింసలు భరించి క్రీస్తుకొరకు మరణించినవారిని మొదటి క్రైస్తవ హతసాక్షులుగా పేర్కొనవచ్చును. ప్రభువు తన శిష్యులను వీడి పరమునకు వెళ్లినపుడు, వారు ఒంటరి గాను, నిరుత్సాహముగాను యుండిరి.

వారాయన స్వరమును తరువాత కాలములో ప్రత్యక్షముగా వినకపోయినను ఆయన పరమునుండి వారిని చూచుచున్నాడని, ఆత్మ స్వరూపిగా వారిమధ్యనే యున్నాడని శిష్యులు గ్రహించిరి. ఆయన వారితోనుండగా, “మీరు సర్వలోకమునకు వెళ్లి, సకల జనులకు సువార్త ప్రకటించుడి” అను ఆయన ఆజ్ఞను తాము పాటించవలసినదని వారు గ్రహించిరి.

పండ్రెండుమంది శిష్యులలోని ఇస్కరియోతు యూదా ఆయనను యూదులకు అప్పగించిన తరువాత తన తప్పును గ్రహించి, ఉరిపోసికొని మరణించెను. అతని స్థానములో మత్తీయ అను వ్యక్తిని అపొస్తలునిగా వారు ఎన్నుకొనిరి. తరువాత వారు యేసు తమతో చెప్పిన ఆజ్ఞను నెరవేర్చుటకు పూనుకొని, సకల జనులకు క్రీస్తు నామమును ప్రకటించుటకు ప్రపంచము నలుమూలలకు వెళ్లిరి.

ఈ విధముగా క్రీస్తు సువార్తను ప్రకటించుటకు వెళ్లిన అపొస్తలులు మరియు సువార్తికులు ఎంతకాలము జీవించిరో, ఏవిధముగ మరణించిరో క్రొత్త నిబంధనలో వ్రాయబడలేదు. అయితే సంఘపెద్దయైన స్తెఫను, అపొస్తలుడైన యాకోబునుగూర్చి మాత్రమే క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడెను. సైఫను రాళ్లతో కొట్టబడి హతసాక్షి యాయెను.

యాకోబు హేరోదు ఖడ్గముచే చంపబడెను. అయితే మిగిలిన అపొస్తలు లందరు ఆలాగుననే హతసాక్షులైరని చరిత్రకారుల రచనలవలన మనకు తెలియు చున్నది. ఆలాగు హతసాక్షులైనవారి జీవితములలో కొన్నింటిని మనము ఈ గ్రంథములో చదువగలము.

స్తెఫను

యేసును చంపినవారికి విశ్వాస మార్గములో సువార్తను బోధించినందున అతడు హతసాక్షి మరణము పొందెను. సంఘ ప్రారంభ దినములలో శిష్యులసంఖ్య విస్తరించుచుండగా, అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరను ఫిర్యాదు వచ్చెను.

అపొ. 6-8

అంతట పండ్రెండు గురు అపొస్తలులు శిష్యుల సమూహముతో – “మేము దేవుని వాక్యమును బోధించుట మాని, ఆహారము పంచి పెట్టుట యుక్తము కాదు. కాబట్టి మీరు ఆత్మతోను, జ్ఞానముతోను నిండుకొని మంచి పేరుపొందిన ఏడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి” అనిరి.

ఆలాగు ఏర్పాటుచేయబడిన ఏడుగురిలో సైఫను ఒకడు. సైఫను ఆత్మతోను, విశ్వాసముతోను, జ్ఞానముతోను నిండుకొని కృపావరములు కలిగినవాడు. అతడు బలముతో దేవుని వాక్యమును బోధించుచు వ్యాధిగ్రస్థులను స్వస్థపరచగా అనేకులు క్రీస్తును అంగీకరించిరి. దీనికి యూదులు కోపించి, స్తెఫను దేవునిని, మోషేను దూషించుచున్నాడని అతనిపై అబద్దసాక్ష్యము మోపి, మహాసభయెదుటకు తీసుకొని ప్రపంచ క్రైస్తవ హతసాక్షులు వెళ్లిరి.

స్తెఫను అచ్చటకూడ యేసే ‘మెస్సీయా’ అని సాక్ష్యమిచ్చెను. వారీమాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే స్తెఫను పరిశు ద్ధాత్మతో నిండినవాడై  చెప్పగా వారు ఇంకా కోపపడి, పట్టణపు వెలుపలికి అతనిని వెళ్లగొట్టి, రాళ్లురువ్వి చంపిరి.

మత్తయి 2-16,19

తన ప్రభువు సిలువవేయబడిన ఎనిమిది సంవత్సరముల తరువాత క్రీ.శ. 35 లో స్తెఫనుకు హతసాక్షి మరణము సంభవించెను. యేసు వాస్తవమునకు క్రీ.పూ. 6 లో పుట్టినట్లు, అనగా క్రీ.పూ. 4 లో హేరోదు మరణమునకు ముందు రెండు సంవత్స రములలోపు పుట్టినట్లు భావింపబడెను. (మత్తయి 2:16,19), సెఫనుకు వ్యతిరేకముగ కలిగిన ఈ ద్వేషము, ‘క్రీస్తే యూదుల మెస్సీయా’ అని గట్టి నమ్మకముతో ఒప్పుకొనిన వారందరికి అధిక హింస కలిగెను.

లూకా ఈ విధముగ వ్రాయుచున్నాడు: ఆ హింసలో సుమారు రెండువేలమంది క్రైస్తవులు మతవైరముచేత చంపబడిరి. వారిలో సంఘముచేత ఏర్పాటుచేయబడిన ఏడుగురు పెద్దలలో ఒకడైన నీకా నోరుకూడ ఉండెను. (అపొ. 6:5).

అపొ. 8-1

యాకోబు (పటము 3 చూడుము)

యూదయ రాజైన మొదటి హేరోదు అగ్రిప్ప ఆజ్ఞ ప్రకారము ఇతడు క్రీ.శ. 44 లో ఖడ్గముతో చంపబడెను. ఇతని త్యాగము యేసు ముందుగానే అతనితోను, అతని సహోదరుడైన యోహానుతోను చెప్పినదాని నెరవేర్పుగా ఉన్నది. (మార్కు 10:39) .

అపొ. 12-2-1

పురాతన కాలమునకు చెందిన గొప్ప గ్రంథకర్తయైన క్లెమెన్స్ అలెగ్జాండ్రినస్ (Clemens Alexandrinus) ఈ విధముగా వ్రాసెను :

“చంపబడుటకు యాకోబు తీసికొని పోబడుచున్నప్పుడు, అతనిని బంధిం చినవారిలో ఒకడు అతనితోకూడ వధస్థలమునకు వెళ్లెను. యాకోబు తన మరణసమయములో చింతాక్రాంతుడుగాను, భయముతోను ఉండునని అతడు తలంచెను. కాని యాకోబు యుద్ధములో గెలిచిన వీరునివలె ఉత్సా హముగా, సంతోషముగా ఉండుట చూచి అతడు ఆశ్చర్యపడెను. “యాకోబు నమ్మిన యేసుక్రీస్తు సత్యమైన దేవుడును, రక్షకుడునైయుండును.

హతసాక్షుల చరిత్ర తెలుగులో

లేనియెడల అతడు తన మరణసమయములో అంత ఆనందముతో ఉండేవాడు కాడు” అని తలంచెను. తలంచుట మాత్రమేకాదు, ఆ సమయంలోనే అతడు క్రీస్తును అంగీకరించి అపొస్తలుని పాదములమీదపడి క్షమాపణ కోరుకొనెను. వెంటనే తానుకూడ క్రైస్తవుడనని ఒప్పుకొని, యాకోబు ఒక్కడే చనిపోకూడ దనెను. ఆ మీదట వారిద్దరిని శిరచ్ఛేదము చేసిరి”.

అపొ. 6-5

ఫిలిప్పు

ఫిలిప్పు గలిలయలోని బేత్సయిదాలో జన్మించెను. అతడు ఆసియాలోని అనేక ప్రాంతములకు వెళ్లి అన్యజనులకు సువార్తను ప్రకటించెను. అతడు ప్రయాణము చేయుచూ ప్రుగియలోని హెరపొలిస్ (Hierapolis) అను పట్టణమునకు వచ్చెను. ఈ పట్టణములోని ప్రజలు భయంకరమైన సర్పారాధన చేయువారు. ఫిలిప్పు వారికి క్రీస్తు సువార్తను ప్రకటించెను.

ఆ పట్టణ అధికారులు, సర్పయాజకులు విగ్రహారాధన ద్వారా తమకు వచ్చుచున్న ధనము పోవుచున్నదని గ్రహించి ఫిలిప్పును కొరడాలతో కొట్టి, చెరసాలలో బంధించి, క్రూరముగా హింసించి సిలువవేసిరి. అతని స్నేహితుడైన బర్తొలొమయి ఫిలిప్పు మృతదేహమును సిలువమీదనుండి దింపి, సమాధిచేయుటకు అనుమతి పొందెను. ఇట్లు క్రీ.శ. 54 లో అపొస్తలుడైన ఫిలిప్పు క్రీస్తుకొరకు హతసాక్షి మరణము పొందెను.

మత్తయి (పటము 4 చూడుము)

అపొస్తలుడైన మత్తయి గలిలయలోని నజరేతులో జన్మించెను. ఇతడు కపెర హూములో పన్నులు వసూలు చేయువాడుగా జీవించెను. యేసు తన శిష్యుడుగా ఉండుటకు అతనిని పిలువగా మత్తయి సమస్తమును వదలిపెట్టి ఆయనను వెంబ డించెను. క్రీస్తు పరమునకు ఆరోహణుడైన తరువాత దాదాపు తొమ్మిది సంవత్సరముల వరకు అతడు యూదయలో సువార్తను ప్రకటించెను. యూదయను విడచి, అన్య జనులకు సువార్త ప్రకటించుటకు వెళ్లకమునుపు యూదులకొరకు హెబ్రీ భాషయందు మత్తయి సువార్తను రచించెను. తదుపరి మత్తయి జీవితమును గూర్చిగాని, అతడు ఎప్పుడు, ఎక్కడ, ఏవిధముగ మరణించినాడనిగాని ఏమీ తెలియదు. మరికొన్ని రచనలు అతడు ఇనుపమేకులతో భూమిలో గ్రుచ్చబడినాడని, ఇతియోపియాలోని నాదబ (Nadabah) అను పట్టణములో క్రీ.శ. 60 లో బల్లెముతో శిరచ్ఛేదము చేయబడినాడని తెలుపుచున్నవి.

స్టీఫన్ హతసాక్షుడు బైబిల్ వచనం

అపొ. 8-27

చిన్న యాకోబు

యోహాను సోదరుడైన యాకోబు, క్రీస్తు శిష్యవర్గములో పెద్దవాడుగా పరిగణింప బడగా ఈ యాకోబు చిన్నవాడుగా పరిగణింపబడెను. ఈయన ప్రభువైన యేసుయొక్క సహోదరుడు, యాకోబు పత్రిక గ్రంథకర్తకూడ. క్రీస్తు ఆరోహణుడైన తరువాత అతడు యెరూషలేము సంఘమునకు అధ్యక్షుడయ్యెనని తెలియుచున్నది. ఆ బోధను ఖండించుచూ యాకోబు విశ్వాసు లందరి ఉపయోగార్థమై ఒక సార్వత్రిక పత్రికను వ్రాసెను.

అపొ. కా. 12-17; 15-13-29

యాకోబు క్రీ.శ. 66 లో మరణించినాడని నమ్మినను, కచ్చితమైన కాలము, మరణించిన విధానమును గూర్చి తెలియదు. యూదుల చరిత్రకారుడైన ప్లేవియస్ జోసెఫస్ (Flavius Josephus) చెప్పిన ప్రకారము – ప్రధాన యాజకుడైన అననీయ ఆజ్ఞ ప్రకారము చిన్నయాకోబును రాళ్లురువ్వి చంపిరి. కాని తొలి క్రైస్తవ చరిత్రకారుడైన హెజిసిప్పస్ (Hegesippus), మూడవ శతాబ్దపు క్రైస్తవ చరిత్రకారుడైన యూసెబియస్ (Eusebius) లు ఉదహరించినట్లు చిన్నయాకోబు దేవాలయ శిఖరమునుండి క్రిందకు త్రోసివేయబడెననియు, కాని దాని ప్రాకారముపైనుండి పడినందువలన అతడు చనిపో లేదనియు, అతనిని దుడ్డుకఱ్ఱలతో నలుగగొట్టి చంపిరనియు తెలియుచున్నది.

క్రైస్తవ హతసాక్షుల పాత్ర

అంద్రెయ (పటము 5 చూడుము)

ఎడెస్సా (Edessa) నగరములో క్రీస్తు సువార్తను ప్రకటించుచుండగా, ఆ పట్టణ గవర్నరు అక్కడున్న విగ్రహారాధనకు భిన్నముగా బోధించినచో అతనిని చంపివేతునని బెదిరించెను. అయినను అంద్రెయ బహు ధైర్యముగా సువార్తను బోధించుచుండెను. అందుచే సమాన పొడవుగల రెండు కొయ్యలతో చేయబడి, వాటి చివరిభాగములు భూమిలో నాటబడిన ‘X’ ఆకారముగల సిలువపై అతనిని చంపవలసినదిగా శిక్ష విధింపబడెను.

మత్తయి 4-18

ఆ సిలువపై అతడు మేకులతో కొట్టబడలేదు గాని త్రాళ్ళతో కట్టబడి, తుదకు నెమ్మదిగా మరణించి హతసాక్షియాయెను. అప్పటినుండి, ‘X’ ఆకారముగల సిలువ ‘పరిశుద్దు డైన అంద్రెయ సిలువ’గా ప్రసిద్ధిచెందెను.

తనకొరకు సిద్దము చేయబడిన సిలువను చూచి అంద్రెయ ఏమాత్రమును భయపడలేదు. అతని ముఖకవళికలు మారలేదు, మనస్సు చలించలేదు. అతడు బిగ్గరగా “ఓ సిలువా, నీకు సుస్వాగతము, సంపూర్ణ మనస్సుతో, సంతోషముగా, నీ యొద్దకు వచ్చుచున్నాను. నిన్ను ప్రేమించుచున్నాను, నీమీద మరణించుటకు సిద్ధముగా ఉన్నాన”ని చెప్పి అంద్రెయ మూడు దినములు ఆ సిలువమీద వ్రేలాడుచూ, భయం కరమైన బాధ, హింసను అనుభవించెను. అయినను సిలువశ్రమను అనుభవించుచునే క్రీస్తు ప్రేమనుగూర్చి తన చుట్టూ చేరియున్న ప్రజలకు తెలియజేసెను. వారిలో కొందరు ఆ మాటలను నమ్మి క్రీస్తును విశ్వసించిరి. అచ్చట చేరిన ప్రజలలో కొందరు అంద్రెయను విడిచిపెట్టమని కోరగా, అధికారి సమ్మతించెను గాని చివరి త్రాడు విప్పుచుండగా అంద్రెయ అప్పటికే మరణించి క్రిందపడిపోయెను. ఇట్లు అంద్రెయ సిలువ వీరుడుగా తాను ప్రేమించిన క్రీస్తుకొరకు హతసాక్షియాయెను.

మత్తీయ

మత్తీయ గురించి విపులముగా తెలియదు కాని ఇస్కరియోతు యూదా స్థానములో అపొస్తలుడుగా ఎన్నిక చేయబడినవాడు. ఇతడు యెరూషలేములో రాళ్లతో కొట్టబడి, తరువాత శిరచ్చేదము చేయబడెనని తెలియుచున్నది.

మార్కు

క్రొత్త నిబంధనలో వ్రాయబడినది తప్ప మార్కును గురించి మరేమియు తెలియదు.సెరాపిస్ (Serapis) అను దేవతకు భక్తితో చేయుచున్న పండుగనుగూర్చి మార్కు వ్యతిరేకముగ మాట్లాడి నాడని అలెగ్జాండ్రియ ప్రజలు అతనిని హింసించి, ముక్కలు ముక్కలగునట్లు ఈడ్చి చంపిరని తెలియుచున్నది.

2 తిమోతి 4-11

పేతురు

క్రీస్తుకొరకు హతసాక్షియైన మరియొక అపొస్తలుడు సీమోను పేతురు. ఇతడు గలిలయలోని బేత్సయిదావాడును, జాలరియైన యోహాను కుమారుడు. యేసు అతనికి ‘కేఫా’ అను పేరు పెట్టెను. సిరియా భాషలో ‘కేఫా’ అనగా ‘రాయి’ అని అర్థము.

ఈ పేరు అతని స్థిరమైన విశ్వాసమును సూచించుచున్నది. కాని ఒక సమయములో అతడు బలహీనుడై తన ప్రభువునుగూర్చి బొంకెను. తదుపరి పశ్చాత్తాపము పొంది, క్రీస్తుకొరకు నమ్మకమైన సాక్షిగా నిలిచెను.

హతసాక్షుల గురించి బైబిల్ వచనాలు

అపొస్తలుడైన పేతురుయొక్క త్యాగమును గూర్చి తొలి క్రైస్తవ చరిత్రకారుడైన హెజిసిప్పస్ నుండి లభించినదే మనకున్న సమాచారము. క్రీస్తుయొక్క అద్భుత దర్శనము ఆ వర్ణనలో చేర్చబడినది.  వినిన శిష్యులు రోము పట్టణము విడిచి పారిపొమ్మని అతనిని ప్రాధేయపడిరి. చాల వాదము జరిగిన తరువాత అతడు బయలుదేరెను.

యోహాను 21-18

కాని అతడు పట్టణద్వారమువద్దకు వెళ్లెనో లేదో క్రీస్తు అతనివైపు నడచి వచ్చు చున్నట్టు కనిపించెను. పేతురు సాష్టాంగపడి, ‘ప్రభువా, నీవెక్కడికి వెళ్లుచున్నావు?’ అని అడిగెను. అందుకు ప్రభువైన క్రీస్తు ‘నేను మరల సిలువ వేయబడుటకు వచ్చితిన’ని సమాధానమిచ్చెను.

యోహాను 21-19

కనుక పట్టణమునకు అతడు తిరిగివెళ్లి బంధింపబడెను. తన విశ్వాసమునకై చంపబడు స్థలమునకు అతడు తీసికొని రాబడినప్పుడు, తన ప్రభువు సిలువ వేయబడిన రీతిగ సిలువ వేయబడుటకు తాను అర్హుడను కాదని, కనుక తనను తలక్రిందులుగ సిలువవేయుడని వారిని కోరెను. ఆ ప్రకారమే తలక్రిందులుగ పేతురు సిలువ వేయబడెను.

పౌలు

క్రీ.శ. 61 లో అపొస్తలుడైన పౌలును రోమా చెరసాలలో బంధించిరి. అక్కడ నుండియే అతడు ఎఫెసు, ఫిలిప్పై, కొలొస్పై సంఘములకు పత్రికలు వ్రాసెను. అతడు సుమారు మూడు సంవత్సరములు చెరసాలలో ఉండి క్రీ.శ. 64 లో విడుదల పొందెను. అదే సంవత్సరము మే నెలలో రోము పట్టణము దగ్ధమైనది. (అపొ. 28:30). కొద్ది స్వేచ్ఛ లభించగానే, పౌలు పశ్చిమ, తూర్పు ఐరోపాలను, ఆసియా ప్రాంతమును దర్శించెను. అప్పుడే తిమోతికి మొదటి పత్రికను, తీతుకు ఒక పత్రికను వ్రాసెను.

రోము పట్టణమును తగులబెట్టినాడని మొదట నీరో నిందింపబడెను. గనుక తన మీదకు వచ్చిన నిందను తొలగించుకొనుటకు నీరో క్రైస్తవులను నిందించెను.

మొదటి క్రైస్తవ హతసాక్షులు

తత్ఫలితముగ వారియెడల భయంకరమైన హింసలు ప్రారంభమైనవి. ఆ సమయములో పౌలును పట్టుకొని మరల రెండవసారి రోమా చెఱసాలలో బంధించిరి. బహుశః అప్పుడే పౌలు తిమోతికి తన రెండవ ఉత్తరము వ్రాసెను, అదే అతని చివరి పత్రిక.

అనతికాలములోనే చక్రవర్తికి వ్యతిరేకముగ నేరము చేసిన దోషియని తీర్పుచెప్పి పౌలుకు మరణశిక్ష విధించి శిరచ్ఛేదము చేసిరి. అది క్రీ.శ. 66, అనగా యెరూషలేము నాశనమగుటకు కేవలము నాలుగు సంవత్సరములకు ముందు జరిగెను. ఈ విధముగా అపొస్తలుడైన పౌలు తాను నమ్మిన క్రీస్తుకొరకు మరణమువరకు నమ్మకముగా ఉండి హతసాక్షి మరణము పొందెను.

యూదా

క్రీస్తు కొరకు హతసాక్షియైన మరియొక అపొస్తలుడు యాకోబు సహోదరుడైన యూదా. ఇతడు మెసపొటోమియాలోని పురాతన నగరమైన ఎడెస్సాలో క్రీ.శ. 72 లో సిలువ వేయబడెను.

బర్తొలొమయి

ఇతడు అనేక దేశములలో సువార్త ప్రకటించినాడని చరిత్ర తెలియజేయుచున్నది. మత్తయి సువార్తను హిందూదేశపు భాషలోనికి తర్జుమా చేసి దానిని ఆ దేశములో బోధించుచుండగా విగ్రహారాధికులైన అన్యులు కోపగించి బర్తొలొమయిని సిలువవేసిరి.

తోమా (పటము 6 చూడుము)

ఇతనిని సిరియా భాషలో తోమా అనియు, గ్రీకు భాషలో దిదుమ అనియు పిలుతురు. తోమా పర్షియా, పార్థియా, హిందూ దేశములలో సువార్త ప్రకటించెను. హిందూదేశములోని కాలమినా (Calamina) లో కోపోద్రిక్తులైన అన్యులు బల్లెములతో పొడిచి, హింసించి, కొలిమి మంటలలోనికి విసరగా తోమా తన ప్రాణమును విడిచెను.

లూకా (పటము 7 చూడుము)

లూకా అన్యుడు, గ్రీసు దేశస్థుడైయుండవచ్చును. అతడు ఎప్పుడు, ఏవిధముగ క్రైస్తవుడైనది తెలియదు. బహుశః అతడు త్రోయలో వైద్యుడైయుండవచ్చును లో గమనించుము, త్రోయలో లూకా తన అంశములో ‘వారు’ అను పదమునుండి ‘మనము’ అను పదమునకు వెళ్లెను.

హతసాక్షుల చరిత్ర తెలుగులో

అపొ. 16-8 - 10

“అంతట వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియ దేశస్థుడొకడు నిలిచి – నీవు మాసిదో నియకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొను చున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచియున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియకు బయలుదేరుటకు యత్నము చేసితిమి.”

హతసాక్షుల గురించి బైబిల్ వచనాలు

లూకా పౌలుతో ఫిలిప్పై వెళ్లెను, కాని అతనితోపాటు చెరసాలలో ఉంచబడలేదు మరియు పౌలు విడుదలైన తరువాత అతనితో ప్రయాణము చేయలేదు. లూకా ఫిలిప్పైని తన నివాసముగ చేసికొని అక్కడ కొంతకాలము ఉండెను. అప్పటినుండి అతడు యెరూషలేమునకు వెళ్లువరకు పౌలుతో కలసి ప్రయాణముచేసెను. పౌలు యెరూషలేములోను మరియు కైసరయ చెరసాలలో బంధింపబడినప్పుడు లూకా మరియొకసారి కనిపించకుండ వెళ్లెను.  అనేకమంది బైబిలు పండితులు లూకా పౌలుతో ఉన్న ఈ కాలములోనే తన సువార్తను, అపొస్తలుల కార్యముల గ్రంథమును వ్రాసినాడని నమ్ముచున్నారు.

(అపొ. 20-5,6)

స్టీఫన్ హతసాక్షుడు బైబిల్ వచనం

పౌలు రెండవసారి ఖైదులో ఉంచబడినప్పుడు లూకా పౌలుతో లేక పౌలుకు దగ్గరగా ఉన్నట్టు కనిపించుచున్నది.  పౌలుతో కలసి సువార్తను ప్రకటించిన విధముగానే లూకా పౌలు మరణించిన తరువాతకూడ సువార్తను ప్రకటించుచునే ఉండెను.

తిమోతి 4-11

అయితే లూకా ఎప్పుడు, ఏవిధముగా చనిపోయెననునది స్పష్టముగా తెలియదు. ఒక పురాతనాధారమునుబట్టి, ‘ఏ విధమైన ఆటంకము లేకుండ లూకా ప్రభువును సేవించెను. అతనికి భార్యగాని పిల్లలుగాని లేరు. ఎనుబది నాలుగు సంవత్సరముల వయస్సులో బొయాషియా (Boeatia) లో పరిశుద్ధాత్మపూర్ణుడై శాశ్వతముగా నిద్రించి నాడని’ తెలియుచున్నది. మరియొక తొలి ఆధారము – సువార్తను ప్రకటించుటకు అతడు గ్రీసు దేశము వెళ్లగా, ‘అచ్చట ఏథెన్సు నగరములో ఒక ఒలీవ చెట్టుకు వ్రేలాడదీయబడుటవలన క్రీ.శ. 93 లో హతసాక్షియైనాడని చెప్పుచున్నది.

క్రైస్తవ హతసాక్షుల పాత్ర

ప్రకటన గ్రంథములోని ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్టీస్, ఫిలడెల్ఫియ, లవొదకయ అను ఏడు సంఘములను స్థాపించి కీర్తి గడించిన అపొస్తలుడైన యోహాను యాకోబునకు సహోదరుడు. ఇతనిని ఎఫెసులో బంధించి, రోమునకు తీసుకొనివెళ్లి అక్కడ సలసల కాగుచున్న నూనె పాత్రలోనికి విసరివేసిరి గాని అది అతనికి ఏ హానియు చేయలేదని చెప్పబడినది. ఫలితముగ అతడు విడిపింపబడి, చక్రవర్తి డొమిషియన్ (Domitian) ఆజ్ఞచే పత్మాసు ద్వీపమునకు ఖైదీగా పంపబడగ, అతడక్కడ ప్రకటన గ్రంథమును వ్రాసెను. పత్మాసునుండి విడుదల పొందిన తరువాత అతడు ఎఫెసునకు తిరిగివచ్చి, అక్కడ క్రీ.శ. 98 లో మరణించెను. క్రూర మరణమును తప్పించుకొనిన అపొస్తలుడు ఇతడు ఒక్కడే.

హింసలు కొనసాగుచున్నను, క్రూర మరణములు సంభవించుచున్నను రక్షింప బడినవారినందరిని ప్రభువు తన సంఘమునకు చేర్చుచుండెను. సంఘము అపొస్తలుల సిద్ధాంతములతో లోతుగా వేళ్లూని, పరిశుద్దుల రక్తముతో బాగుగా తడుపబడి, తనకు సంభవింపనైయున్న క్రూర హింసలకు సిద్దపడియున్నది.

సంఘము : సాధారణ హింసలు (క్రీ.శ. 54-304)

సంఘము : సాధారణ హింసలు (క్రీ.శ. 54-304)

నీరో చక్రవర్తి : మొదటి హింస (క్రీ.శ. 54-68)

రోమా చక్రవర్తులలో నీరో ఆరవవాడు. నీరో రోమును పదిహేను సంవత్సరములు పరిపాలించెను. ఇతడు ఒక విరుద్ధమైన వ్యక్తి – దుష్ట స్వభావము, అమిత క్రూర స్వభావములతో కూడిన మనుష్యుడు. క్రూరుడైన ఈ నీరో చక్రవర్తియే పేతురును, పౌలును క్రూరముగా హింసించి, చంపించెను. ఫేస్తు యెదుట న్యాయముకొరకు నిలువ బడినపుడు, పౌలు ఈ చక్రవర్తియెదుటనే తన ఫిర్యాదును తెలుపుకొందుననెను. రోము పట్టణమును దగ్ధముచేయుమని ఆజ్ఞాపించినవాడు నీరోయేనని జనుల వాడుక మాట. తనమీదకు వచ్చిన నిందను తొలగించుకొనుటకు క్రైస్తవులమీద ఆ దోషారోపణము మోపెను. రోము దగ్ధమైనప్పుడు అతడు రోములో లేడని కొందరు చెప్పుట కద్దు.

ఏదియేమైనను రోము తొమ్మిది దినములు తగులబడుటకు క్రైస్తవులుకూడ కారణమను నిందకలదు. నీరో పరిపాలనలోనే క్రైస్తవులకు మొదటిగా శ్రమలు, హింసలు ప్రారంభమైనవి. ఇతని కాలములోనే గాక ఇతరుల పాలనా కాలములలోను క్రైస్తవులను ఘోర హింసలకు గురికావించుట జరిగినది.

Psalm23.infoKnowledge Of The HolyEvery Christian Should Know
Key Biblical Messianic PropheciesPower in the BloodPsalm91.infoSavior on the Cross
Pursuit of GodBible Study For BeginnersPray For Those You LoveBible Study Act

నీరోకు ముందు క్లౌడియస్ రోమాకు చక్రవర్తిగా యుండెను. ఇతడు నీరో తల్లియైన అగ్రిఫ్పైనాను మారు వివాహము చేసికొనెను. అగ్రిఫ్పైనాకు అంతకుముందు ఉన్న భర్తద్వారా కలిగిన కుమారుడే నీరో, క్లౌడియస్కుకూడ ఒక కుమారుడు కలడు. క్లౌడియస్ తన తరువాత తన స్వంత కుమారుని రోమా సామ్రాజ్యమునకు చక్రవర్తిగా చేయుటకు సంకల్పించెను.

ఆ విషయమును గ్రహించిన నీరో తల్లియైన అగ్రిఫ్పైనా, క్లౌడియస్కు, అతని కుమారునికి విషమిచ్చి చంపించెను. తరువాత ఆమె తన కుమారు డైన నీరోను రోమా సామ్రాజ్యమునకు చక్రవర్తిగా చేసెను. అప్పటికి నీరో వయస్సు పదహారు సంవత్సరములు మాత్రమే. నీరో చక్రవర్తి అయిన తరువాత తన సలహా దారులతో చక్కగా పరిపాలించెను. అతడు ఎదుగుచూయుండగా అతనిలోని క్రూరత్వము బయల్పడుచుండెను. నీరో ఆక్టేవియా అను యువతిని వివాహము చేసికొనెను.

అయితే, కొంత కాలమునకు అందమైన మరియు క్రూరమైన పొప్పాయే సబీనా అను యువతి సౌందర్యమునకు ముగ్ధుడై, ఆమె ప్రేమలో పడెను. ఆమె క్రూరురాలు గనుక అతని తల్లియైన అగ్రిఫ్పైనాను చంపివేయుమని నీరోకు సలహానిచ్చెను. ఆమె సలహామేరకు తన తల్లిని ఆమె స్వంత దేశమునకు ఒక పడవలో పంపించుచూ, సముద్రములో ఆమెను ముంచివేయుడని నీరో పడవ నడుపువారికి ఆజ్ఞ ఇచ్చెను.

వారు చక్రవర్తి చెప్పినట్లు చేయగా, అగ్రిఫ్పైనా తప్పించుకొని ఈదుకొనుచూ సముద్రపు దరిచేరినది. అయినను రోమా సైనికులు ఆమెను హతమార్చిరి. తదుపరి నీరో తన భార్యయైన ఆక్టేవియాకు విడాకులిచ్చి, ఆమెను ఒక ద్వీపమునకు పంపివేసెను. తుదకు అక్కడ ఆమె నీరో ఆజ్ఞవలన చంపబడెను. అటు తరువాత నీరో క్రూరురాలైన పొప్పాయే సబీనాను వివాహమాడెను. అగ్నికి ఆజ్యము తోడైనట్లు నీరో చక్రవర్తికి సబీనా తోడై రోమా సామ్రాజ్యములో ఘోర కార్యములు చేసిరి.

ఆనాటి రోమా చక్రవర్తులు క్రీడా మైదానములలో జరుగు మనుష్య-మృగ పోరాట ములను తిలకించుచూ, ఆనందించెడి వారు. నీరో చక్రవర్తి తన రాజ్యపరిపాలనను వీడి ఎక్కువ సమయము యిట్టి క్రీడా మైదానములలో జరుగు పోరాటములను, పందెము లను చూచుచూ, మనుష్యులను మృగములు చీల్చుచుండుట తిలకించి, పైశాచిక ఆనందాన్ని అనుభవించేవాడు.

రోమా పట్టణమునందు “కొలోస్సియం” అను క్రీడా మైదానమొకటి కలదు. అది అంతస్తులుకలిగి, దాదాపు లక్షమంది కూర్చొని, అందు జరుగు ఆటల పోటీలను చూడగలిగినంత విశాలమైనది. రోమా సామ్రాజ్యములోని ప్రజలు, ధనికులు, ప్రభుత్వ అధికారులు, చక్రవర్తి, అతని అంతఃపుర పరివారము కూర్చొని, అందు నిర్వహించబడు ఆటలపోటీలను వినోదముగా చూచెడివారు. అక్కడ సామాన్యముగా మనుష్య-మృగ పోరాటములు జరుగును.

అనగా యుద్ధ ఖైదీలను, నేరస్థులను, బానిసలను క్రీడా మైదానములో ఉంచి, వారి మధ్యకు సింహము, చిరుత పులి, పెద్దపులి మొదలగు క్రూరమృగములను పంపెడివారు. మైదానములో యున్న నేరస్థులు, బానిసలు ప్రాణరక్షణకై వాటితో పోరాడుచుండగా ప్రేక్షకులు వినోద భరితముగా చూచుచూ ఆనందించెడివారు. ఇట్లు రక్తసిక్తమైన క్రీడా మైదానములోనికి క్రైస్తవులను వదలి క్రూరమృగములు వారిపైబడి, వారిని చీల్చి, చంపుచుండగా రోమా చక్రవర్తి, ప్రజలు కేకలువేయుచూ ఆనందించేవారు. ఈ విధముగా అనేకమంది క్రైస్తవులు క్రీస్తుకొరకు హతసాక్షులైరి.

నీరో తనకొరకు ఒక గొప్ప అంతఃపురమును నిర్మించ తలపెట్టి, అందుకొరకు కావలసిన ధనమును ధనవంతులనుండి బలవంతముగా వసూలు చేసెను. డబ్బు ఇవ్వని ధనవంతులను చంపి, వారి ఆస్తులను జప్తుచేసెడివాడు. తత్వవేత్తయు తన ముఖ్య సలహాదారుడును, ఉపాధ్యాయుడైన సెనెకామీద ఒక నేరము మోపి అతనిని చంపించెను.

అదే సమయములో రోమా పట్టణములో ఘోర అగ్నిప్రమాదము సంభవించినది. రోమా పట్టణము తొమ్మిది దినములవరకు కాలుచు చాలభాగము బూడిదయ్యెను. పట్టణము కాలుచుండగా, నీరో చక్రవర్తి తన మేడలో ఫిడేలు వాయించుకొనుచూ, కాలుచున్న పట్టణమును చూచుచూ ఆనందించెను. అతడు చేయుచున్న ఘోరకృత్యములకు జనులు విసిగిపోయి, చక్రవర్తిమీద తిరుగుబాటు చేయ ప్రయత్నించిరి. ఆ సమయములో నీరో కుయుక్తితో రోమా పట్టణము కాలి పోవుటకు క్రైస్తవులు కారణమని ప్రకటించి వారిని హింసించుటకు పూనుకొనెను.

ఇట్లు నీరో చక్రవర్తి పరిపాలనలో క్రైస్తవులు అనేక హింసలను అనుభవించిరి. కొందరు క్రైస్తవులను అడవిమృగముల చర్మములలో పెట్టి, కుట్టి వదలగా క్రూర శునకములు వారిని చీల్చిచెండాడినవి. కొందరిని మరణించువరకు త్రాడుగట్టి ఈడ్చుకొనిపోయిరి. కొందరు తరుచుట్టలలో చుట్టబడి మరణించువరకు తీవ్రమైన ఎండవేడిమిలో ఉంచబడిరి. కొందరికి మైనము పూసిన చొక్కాలను తొడిగించి, నీరో ఉద్యానవనమందలి స్తంభములకు వారిని కట్టి, అగ్నితో కాల్చిరి. ఇట్లు క్రైస్తవులు అగ్నికి ఆహుతియగుచుండగా నీరో మేడమీదకు ఎక్కి తన పరివారముతో వారిని చూచి ఆనందించుచూ, కాలిపోవుచున్న క్రైస్తవులు తన కాగడాలని చెప్పుకొనుచూ సంతోషించెడివాడు. ఈ విధముగ ఆనాటి విశ్వాసులు క్రీస్తుకొరకు ఘోర హింసలను,

ఈ దారుణ హింసాకాండ రోమా సామ్రాజ్యమంతట వ్యాపించినది. శ్రమలు, హింసలు ఎంత హెచ్చుగా ఉండెనో, క్రైస్తవుల సంఖ్య అంత ఎక్కువగా విస్తరించు చుండెను. దీనికి కారణము పరలోకములో వారు అనుభవించనైయున్న నిత్యానందము నకు మరణమును తొలి మెట్టుగా భావించిరి. వారు ఎంతో సంతోషముతో, ఆనంద ముతో మరణశిక్షను అనుభవించిరి. అది చూచినవారు ఆశ్చర్యమొంది హృదయములో కలవరపడి, ఈ నూతన విశ్వాసముయొక్క ప్రత్యేకతను గుర్తించిరి.

రోమా 16-23

డొమిషియన్ చక్రవర్తి : రెండవ హింస (క్రీ.శ. 81-96)

క్రైస్తవులకు రెండవసారి హింస కలిగించినవాడు డొమిషియన్ (Domitian) చక్రవర్తి. ఇతడు తన సొంత సోదరునికూడ చంపిన క్రూరుడు. డొమిషియన్ క్రైస్తవులపై ద్వేషముతో ఒక ఆజ్ఞను జారీచేసెను. అది – “న్యాయస్థానము ఎదుటికి తీసికొని రాబడిన క్రైస్తవులు తమ మతమును పరిత్యజించకపోయినచో వారిని శిక్షింపకుండ విడువరాదు.” అదే కాలములో క్రైస్తవులను బాధించుటకు అబద్ధములు అసంఖ్యాక ముగా పుట్టినవి.

కొంతమంది ఊహించలేనంత ద్వేషముతో ఉగ్రులై రోమా సామ్రాజ్య ములోని ఏ భాగమునైనను పీడించుచున్న కరవు, అంటువ్యాధులు, భూకంపము మొదలైనవాటికన్నిటికీ క్రైస్తవులను బాధ్యులుగా చేసిరి. వీరికి వ్యతిరేకముగ సాక్ష్య మిచ్చువారికి ద్రవ్యమిచ్చెదమని ఆశజూపగా అన్యులు ధనసంపాదనకొరకు ఎంతో మంది అమాయకులైన క్రైస్తవులను బలిచేసిరి. వీరు చక్రవర్తియైన డొమిషియన్ సమక్షమునకు తేబడినప్పుడు చక్రవర్తికి విధేయులుగ ఉందుమని ప్రమాణము చేసినచో వారిని స్వేచ్ఛగా వదిలివేయుదుమని చెప్పిరి. ఆ విధముగ ప్రమాణము చేయనివారికి, క్రైస్తవులమని ఒప్పుకొనినవారికి కఠిన శిక్షలు విధించిరి.

ఆ శిక్షలుకూడ భయంకరముగా నుండెను. కొందరు చెరసాలలో వేయబడిరి, కొందరు రాళ్లతో కొట్టబడిరి, కొందరికి ఉరిశిక్ష వేయబడెను. కొందరు ప్రాణములతో యుండగనే అగ్నితో కాల్చబడిరి. కొందరు క్రూరమృగములకు వేయబడిరి. కొందరు సిలువ వేయబడిరి. కొందరు ఎత్తైన ప్రదేశములనుండి క్రిందికి త్రోయబడిరి, కొందరు పోట్ల ఎద్దులచే పొడవబడిరి. ఈ విధముగా క్రైస్తవులనేకులు ఘోరహింసలను పొంది, క్రీస్తుకొరకు నమ్మకముగా ఉండి హతసాక్షులైరి.

క్రీ.శ. 97 వరకు ఎఫెసీ సంఘమునకు విచారణకర్త, అపొస్తలుడైన పౌలుయొక్క శ్రేష్ఠుడైన శిష్యుడగు తిమోతి ఆ కాలమునాటి చిరపరిచయస్థుడైన హతసాక్షి. ఆ సంవత్సరములో ఎఫెసులోని అన్యులందరు ‘కేటగోజియన్’ (Catagogion) అను తిరునాళ్లు జరుపుకొనుచుండిరి. అన్యులైన వారి ఊరేగింపును తిమోతి చూచినప్పుడు, అతడు వారి మార్గమును మూసి వారి విగ్రహారాధననుగూర్చి తీవ్రముగ ఖండించెను. అతని పవిత్ర సాహసము అన్యులకు కోపము కలిగించినది. కనుక వారతనిని దుడ్డు కఱ్ఱలతో తీవ్రముగా కొట్టగా, ఆ గాయములవలన రెండురోజుల అనంతరము తిమోతి చనిపోయెను.

ట్రాజన్ చక్రవర్తి : మూడవ హింస (క్రీ.శ. 98–117)

డొమిషియన్ చక్రవర్తి తరువాత రోమా సింహాసనమధిష్టించిన నెర్వా చక్రవర్తి పదమూడు నెలలుమాత్రమే పరిపాలించెను. పిదప ట్రాజన్ (Trajan) చక్రవర్తి యాయెను. ఇతని కాలములో క్రైస్తవులకు మూడవ పర్యాయము శ్రమలు సంభవించెను. రోమా ప్రతినిధి, గ్రంథకర్తయైన ‘చిన్న’ ప్లినీ (Pliny, the younger) హింసింపబడు చున్న క్రైస్తవులమీద జాలికలవాడై ట్రాజన్ చక్రవర్తికి ఒక ఉత్తరము వ్రాసెను :

“రోమా శాసనములకు వ్యతిరేకముగా ఏ తప్పు చేయని వేలకొలది క్రైస్తవులు ప్రతిదినము చంపబడుచున్నారు. వారిపై మోపబడిన నేరము లకు కారణమేమనగా – వారు నిర్ణయించుకొనిన దినమున సూర్యోదయ మునకు ముందు కలసికొనుటకు అలవాటుపడిరి. క్రీస్తే దేవుడని ఒక విధమైన ప్రార్థన వారందరు కలసి చేయుదురు. వారు చెడుకార్యములు చేయరాదను సిద్ధాంతమునకు తమకుతాము కట్టుబడియుందురు. దానికి విరుద్ధముగ వారు దొంగతనము, దోపిడి, వ్యభిచారము చేయరు. వారు ఎన్నడు మాట తప్పరు, ఏ మనుష్యుని మోసగింపరు. తరువాత వారి ఆచార ప్రకారము విడిపోవుటకుముందు అందరు కలసి భోజనము చేయుదురు.”

ప్లినీ ఉత్తరము హింసను ఏమేరకు తగ్గించినదో వ్రాయబడలేదు. ఈ హింసా సమయములో క్రీ.శ. 110 సం॥లో ఇగ్నేషియస్ (Ignatius) సిరియా రాజధానియైన అంతియొకయ సంఘ విచారణకర్తగానుండెను. (పటము 8 చూడుము). ఇగ్నేషియస్ క్రీస్తును అంగీకరించి, బహిరంగముగా సువార్త ప్రకటించుచున్నాడని అతనిని రోమునకు పంపిరి.

అపొ. 11-26

సైనికులు కావలి ఉన్నప్పటికి, అతడు ఆసియలోనుండి వెళ్లుచున్నప్పుడు, వారు ప్రయాణము చేసిన ప్రతి పట్టణములోను దేవుని వాక్యము ప్రకటించి, సంఘములను ప్రోత్సహించి బలపరచెను. స్ముర్నలో ఉన్నప్పుడు అతడు హతసాక్షి మరణమునుండి తనను విడిపింపవద్దని విజ్ఞాపన చేయుచు రోమా సంఘమునకు ఒక ఉత్తరము వ్రాసెను. ఎందుకనగా దేనిని కోరుకొని నిరీక్షించు చున్నాడో దానిని తాను పొందకుండ ఆటంకపరచవద్దని వ్రాసెను :

“ఇప్పుడు నేను క్రీస్తు శిష్యుడనైతిని. గోచరము, అగోచరమునైన విషయ ములను నేను పట్టించుకొనను, క్రీస్తునుమాత్రమే సంపాదించుకొందును. అగ్నిగాని, సిలువగాని, తుదకు అడవి మృగ సమూహములైననుసరే. ఎముకలు విరిచినను, అవయవములను చీల్చినను, శరీరమంతటిని నలుగగొట్టినను, సైతాను ద్వేషమంతయు నా మీదికి వచ్చినను, రాని య్యుడి; నేనుమాత్రము క్రీస్తుయేసును సంపాదించుకొందును.”

అపొ. 5-41

అతడు చెప్పినదేమనగా, ‘నేను క్రీస్తుయొక్క గోధుమను; నేను క్రూరమృగముల దంతములతో పిండిగా మారి శుద్ధమైన రొట్టెగ చేయబడుదును.’

అద్రియన్ చక్రవర్తి (క్రీ.శ. 117-138)

ట్రాజన్ చక్రవర్తి పిదప అద్రియన్ (Adrian) చక్రవర్తి అయ్యెను. ట్రాజన్ చక్రవర్తి ప్రదర్శించినంత క్రూరత్వమును ఇతడు కూడ ప్రదర్శించి, మూడవ హింసను కొనసా గించెను. ఇతని పరిపాలనలో సుమారు పదివేలమంది క్రైస్తవులు హతసాక్షులైరి. యేసు మరణమునకు దృష్టాంతముగా అనేకులకు ముళ్లకిరీటములను పెట్టి, ప్రక్కలో బల్లెములతో పొడిచి సిలువవేసిరి.

విజయము వీరత్వముగల రోమా సైన్యాధిపతియైన యూస్టాకియస్ (Eustachius) రోమా సైన్యము పక్షమున అనేక యుద్ధములలో విజయము సాధించెను. అనేక యుద్ధములలో జయము పొందినందులకు రోమా పట్టణములో వేడుకలు జరిగించుచు, ఆ సందర్భమున అన్యదేవతకు విజయ సూచికగా బలి నర్పించుటకు, విగ్రహారాధికుల యజ్ఞములో చేరవలసినదిగా యూస్టాకియస్ను చక్రవర్తి ఆజ్ఞాపించెను. అయితే చక్రవర్తి అహంకారముకంటే అతని హృదయ విశ్వాసము ఉన్నతమైనది కనుక అతడు ఆ ఆజ్ఞను తిరస్కరించెను. దానికి కోపోద్రేకుడైన అద్రియన్, యూస్టాకియస్ రోమునకు చేసిన విశిష్ట సేవలనుకూడ మరచి, అతనిని, అతని కుటుంబమంతటిని సంహరించెను.

ఆ కాలములోనే ఫాసినెస్ (Fausines) మరియు జోవిట (Jovita) అను సహోదరులిద్దరు గొప్ప సహనముతో హింసలను అనుభవించుట చూచిన కలొసెరియస్ (Calocerius) అను అన్యుడు పరవశుడై, ఆశ్చర్యమొంది ‘క్రైస్తవుల దేవుడు గొప్పవాడు’ అని కేకలు వేసెను. దానికి, వెంటనే కలొసెరియసును బంధించి ఆ యిరువురు సోదరులతోబాటు అతనినికూడ చిత్రహింసలకు గురిచేసిరి.

చక్రవర్తియైన అద్రియన్ ఏథెన్సు పట్టణమును దర్శించుటకు వచ్చినప్పుడు ఆ పట్టణ సంఘ విచారణకర్తయైన క్వాడ్రేటస్ (Quadratus) క్రైస్తవుల పక్షముగ చక్రవర్తితో తెలివిగ వాదించెను. అదే సమయములో, ఆ పట్టణ వేదాంతియైన అరిస్టిడెస్ (Aristides) క్రైస్తవుల పక్షముగ చక్రవర్తికి ఒక గంభీరమైన ఉత్తరము వ్రాసెను. ఈ రెండు సంఘటనలద్వారా చక్రవర్తికి దయకలిగి, హింసయొక్క తీవ్రతను తగ్గించెను.

ఆంటోనినస్ పయస్ (క్రీ.శ. 138–161)

క్రీ.శ. 138 లో అద్రియన్ చనిపోగా, ఆంటోనినస్ పయస్ (Antoninus Pius) చక్రవర్తి అయ్యెను. ఇతని పరిపాలనా కాలములో సంభవించిన హతసాక్షి మరణములన్నింటిలో అపొస్తలుడైన యోహానుయొక్క శిష్యుడు, స్ముర్న సంఘమునకు విచారణకర్త మరియు వృద్ధుడైన పాలికార్ప్ (Polycarp) (క్రీ.శ. 69-156) మరణము మిక్కిలి ప్రసిద్ధమైనది. పాలికార్ప్ సామాన్యుడైనను లోతైన విశ్వాసి. ప్రజలందరు అతనిని మిక్కిలి భక్తితోను, ప్రేమతోను గౌరవించిరి. స్ముర్నలోని క్రైస్తవేతరులు సహితము అతనిని గౌరవించిరి.

పాలికార్ప్ ‘అపొస్తలుల యుగము’లోని సంఘమను గొలుసుయొక్క చివరి కొక్కెము. అతని యవ్వన ప్రాయములో అపొస్తలుడైన యోహానుకు శిష్యుడుగా ఉండి, ప్రభువును చూచిన అనేకుల సహవాసమును అనుభవించినాడు.

వాస్తవమునకు చక్రవర్తి ఆంటోనినస్ పయస్ క్రైస్తవులయెడల దయగలవాడగుటచే సంఘము కొంత నెమ్మదిననుభవించినది. అయినను, స్ముర్నలో ప్రాంతీయ అల్లర్లు, హింసలు చెలరేగుటచే పన్నెండుమంది క్రైస్తవులను అక్కడికక్కడే దోషులని తీర్పుతీర్చి,
మరణదండన విధించిరి.

హతసాక్షి మరణమును ధైర్యముగా ఎదుర్కొనవలెనని ఇతరులను హెచ్చరించిన క్వింటియస్ (Quintius) అనునొక మనుష్యుడు, మృగములను చూచి గుండె చెదిరిన వాడై, చక్రవర్తికి బలినర్పించి, విగ్రహారాధన చేయుటకు సమ్మతించెను. మిగిలిన పదకొండుమంది విశ్వాసమునందు స్థిరులైనందున వారిని చిత్రహింసలుపెట్టి, క్రూర మృగములకు ఎరగావేసిరి.

వారిలో ఒకడు తనను ముట్టడించుచున్న మృగములను వాస్తవముగా రెచ్చగొట్టినాడు. అతని ధైర్యము అక్కడ చేరిన గుంపునకు కోపము పుట్టించగా, వారు పాలికార్డ్స్ కొరకు బిగ్గరగా కేకలు వేయుచు ‘పాలికార్ప్న వెదకుడి, అతనిని సింహములకు ఎరగా వేయుడి’ అని గట్టిగా అరచిరి.

అతని క్షేమమునుగురించి ఆతృతగానున్న విశ్వాసులు, పారిపొమ్మని పాలికారన్న బలవంతముచేసిరి. మరణమంటే భయపడకపోయినను, ప్రజలకు సువార్త బోధించు అవసరమున్నదని గ్రహించినవాడై అంగీకరించెను. అయితే అతని అంతము సమీప ముగానున్నదని దేవుడు అతనికి బయలుపరచెను.

అతడు మరణించుటకు మూడు రోజులముందు పాలికార్ప్ కలలో తన తలదిండు కాలిపోవుట చూచెను. దానిని ప్రవచనముగా నమ్మి, ‘తాను సజీవ దహనము కావలసియున్నద’ని వారికి తెలియజేసి నప్పుడు వారు ఎంతో కలవరపడిరి. అతడు తప్పించుకొని పారిపోవుటకు అవకాశ మున్ననూ, ‘దేవుని చిత్తమే సిద్ధించున’ని చెప్పుచు పారిపోవుటకు తిరస్కరించెను.

పాలికార్ప్ సేవకులలో ఒకనిని రోమా అధికారులు పట్టుకొని, హింసించినప్పుడు అతడు తన యజమాని ఉనికిని శత్రువులకు అప్పగించి, ద్రోహముచేసెను. తనను బంధించుటకు సైనికులు వచ్చినప్పుడు, పాలికార్ప్ వారిని ఎంతో ప్రేమపూర్వకముగ చేర్చుకొని; తినుటకును, త్రాగుటకును అతిథులవలె ఆహ్వానించెను. వారుకూడా అతనిని చూచినప్పుడు, అతని వయస్సునకు, భక్తికి ఆశ్చర్యపడి భక్తిపూర్వకమైన భావమును వ్యక్తపరచిరి.

ప్రార్థనలో గడుపుటకు తనకు ఒక గంట సమయమియ్యవలెనని అతడు వారి నడుగగా, వారు అనుమతించిరి. కొంత సమయము ప్రార్థనలో గడిపి, తన స్నేహితు లను దేవునికి అప్పగించి, రాబోవు శ్రమను ఎదుర్కొనుటకు శక్తిననుగ్రహింపుమని అమితాసక్తితో ప్రార్థించెను. అతడు బయలుదేరుటకు సిద్ధపడగా.

వారు అతనిని గాడిదపై ఎక్కించి పట్టణమునకు తెచ్చిరి. ప్రయాణములో సైనికులు, ‘కైసరు ప్రభువు అని ఒప్పుకొని, నిన్ను నీవు రక్షించుకొనుటలో తప్పేమున్నది? క్రీస్తును ఎరుగనని చెప్పుమని’ వాదించిరి.

మృగములకు ఎరగావేయబడు మైదానములోనికి పాలికార్ప్ ప్రవేశించుచుండగా, ‘పాలికార్ప్ పౌరుషముగలవాడవై ధైర్యముగా ఉండుము’ అను ఒక స్వరము ఆకాశము నుండి వచ్చెను. అతనికి దగ్గరగా నిలుచున్న విశ్వాసులలో కొందరు ఆ స్వరము వినిరి, కాని వారికి ఎవరును కనబడలేదు. బహుశః అది దేవుని స్వరమైయుండవచ్చును.

అడవి మృగములను తెచ్చుట ఆలస్యమైనందున అక్కడ చేరిన జనసమూహము విసుగుచెంది, ఆగ్రహించిరి. పాలికారన్న గవర్నరు యెదుటకు తీసికొని వచ్చినప్పుడు, అతడు పాలికార్ప్న తన విశ్వాసమును వదలుకొనుమని బలవంతము చేసెను. ‘నీ వృద్ధాప్యమును గౌరవించుము, కైసరు దైవత్వముమీద నమ్మకముంచుము, పశ్చాత్తాప పడి, నాస్తికులకు దూరముగా నుండెదనని ఒట్టుపెట్టుకొని క్రీస్తును దూషించుము, నిన్ను విడిచిపెట్టెదమ’ని ప్రలోభపెట్టెను. అందుకు పాలికార్స్, ‘ఎనుబదియారు సంవత్స రములు నేను ఆయనను సేవించితిని, ఆయన నాకెన్నడు ఏ కీడు చేయలేదు – అట్లు నన్ను రక్షించిన నా రాజును నేనెట్లు దూషించగలను?’ అని గంభీరముగ జవాబిచ్చెను.

బ్రతిమాలినను, అడవి మృగములు, అగ్నిచేత బెదిరించినను, పాలికార్ప్ చెదరని ధైర్యముతో నిలుచుండెను. చివరకు గవర్నర్ చాటింపువేయువానిని పిలిచి, ‘పాలికార్ప్ క్రైస్తవుడుగానుండుటకు ఇష్టపడుచున్నాడ’ని మూడుసార్లు చాటించుమని చెప్పెను.

అడవి మృగములకొరకు వేచియుండకుండ, జన సమూహము ‘పాలికారన్న సజీవ దహనము చేయవలెన’ని అరచి ప్రవచనమును నెరవేర్చిరి. వేగముగ కట్టెలు తెచ్చి చితిపేర్చగా, పాలికార్ప్ తన అంగీని తీసివేసి, నడికట్టును వదులుచేసి, పాద రక్షలను విప్పి, ‘అగ్నిని సహించుటకు శక్తినిచ్చిన దేవుడే ఈ జ్వాలలను ఎదిరించగల శక్తి తనకు అనుగ్రహించున’ని ప్రకటించి, ఆకాశమువైపు కన్నులెత్తి, దేవుని స్తుతించుచు, క్రీస్తుయొక్క గిన్నెను తీసికొనుటకు (శ్రమలను అనుభవించుటకు) తనను యోగ్యునిగా యెంచిన దేవునికి వందనములు చెల్లించెను.

చుట్టూ పేర్చిన ఎండు కట్టెలను వారు అగ్నితో ముట్టింపగా, జ్వాలలు అతని శరీరము చుట్టూ వృత్తాకారములో పైకిలేచినవి, కాని అవి అతనిని తాకలేదు. శిక్షను అమలుచేయు అధికారి పాలికారన్న బల్లెముతో చీల్చమని తలారిని ఆజ్ఞాపించెను. అతడు ఆ విధముగ చేసినప్పుడు, రక్తము ఎగజిమ్ము కుంటూ వచ్చి అగ్నిని ఆర్పివేసినది.

పాలికార్ప్ తన ఆత్మను దేవునికి అప్పగించి ప్రాణము విడిచెను. అతని ఎముకలను భూస్థాపన చేయుటకు తమకీయవలసినదిగ అతని క్రైస్తవ స్నేహితులు కోరిరి. కాని వారు సిలువ వేయబడిన క్రీస్తును ఆరాధించుట మానకపోవుటచేత, వారి విన్నపమును సువార్త శతృవులు తిరస్కరించిరి.

పాలికార్పు హతసాక్షి మరణము ప్రాంతీయముగా చెలరేగు హింసలకు కొంత కాలము అడ్డుతెరవేయగా విశ్వాసులు కొంత నెమ్మది ననుభవించిరి. క్రైసరుకు ధూపము వేయు బలిలోని ఔచిత్యమును విశ్వాసులు ఎరుగుదురు. ఎవరిని ఎన్నుకొనుట అనునది వారిముందున్న సమస్య. వారి జీవితములలో ప్రభువు ఎవరు? అయితే అధిక సంఖ్యాకులు ప్రభువును తిరస్కరించలేదు. ప్రతిఫలమెట్టిదైనను, మరణమును ఎదుర్కొని, మహిమ కిరీటమును పొందుటను కోరుకొనిరి.

మార్కస్ ఔరెలిస్ ఆంటోనినస్ చక్రవర్తి: నాల్గవ హింస (క్రీ.శ. 162-180)

మార్కస్ ఔరెలిస్ ఆంటోనినస్ (Marcus Aurelius Antoninus) ఒక వేదాంతి. ఇతడు స్తోయికుల మహాకావ్యమైన ‘ధ్యానములు’ (Meditations) అను గ్రంథమును వ్రాసెను. అది ఆనందమునకు దుఃఖమునకు అతీతమైనది. ఇతడు భయంకరుడు, క్రైస్తవులయెడల నిర్దయుడైయుండి నాల్గవ హింసకు బాధ్యుడయ్యెను.

ఈ హింసాకాలములో క్రైస్తవులకు వ్యతిరేకముగా జరిగిన క్రూరచర్యలు ఎంత అమానుషమైనవంటే వాటిని జాగ్రత్తగా చూచిన ఇతరులనేకులు భయముతో కంపించి, బాధితుల ధైర్యమునకు ఆశ్చర్యపడిరి. కొందరి హతసాక్షుల పాదములను యంత్రము లలో పెట్టి చితుకగొట్టి, ముళ్ళమీద, మేకులపైన, పదునైన మొనలుగల వస్తువులు మీద నడువుమని బలవంతము చేసిరి.

కొందరిని నరములు, కండరములు బయటపడు వరకు కొరడాలతో కొట్టిరి. ఇట్టి మిక్కిలి బాధాకరమైన చిత్రహింసలకన్నిటికి గురిచేసిన తరువాత, భయంకరమైన పద్ధతులద్వారా వారిని చంపిరి. కొద్దిమంది బాధకలిగించు ఆ హింసలను తగ్గింపుమని ప్రాధేయపడిరి, మరికొందరు క్రీస్తునుండి వెడలిపోయిరి.

యువకుడును, యథార్థ క్రైస్తవుడునైన జర్మనికస్ (Germanicus) తన దృఢ విశ్వాసమునుబట్టి క్రూర సింహముల ముందుకు విసరివేయబడినప్పుడు అద్భుత ధైర్యమును ప్రదర్శించెను. ఆ ధైర్యమునకు ప్రభావితులైన అనేకమంది అన్యులు క్రైస్తవ్యమును స్వీకరించిరి.

ఫెలిసిటాటిస్ (Felicitatis) సంపన్న రోమా కుటుంబమునకు చెందిన భక్తిగల, పవిత్ర క్రైస్తవ స్త్రీ. ఆమెకు ఏడుగురు కుమారులు కలరు. వారందరు భక్తిగల క్రైస్తవులై నందున హతసాక్షులైరి. వారిలో జనువరీస్ (Januarius) పెద్దవాడు. అతడు తీవ్రముగ కొట్టబడి, పెద్ద పెద్ద బరువులతో అణచి చంపబడెను.

ఫేలిక్స్ (Felix) మరియు ఫిలిప్ (Philip) అను ఇద్దరిని దుడ్డుకఱ్ఱలతో కొట్టగా మెదడు బయటకువచ్చి చనిపోయిరి. నాల్గవ వాడైన సిల్వానస్ (Silvanus) ను ఎత్తైన కొండపైనుండి క్రిందకు త్రోసివేసిరి. అలెగ్జాండర్ (Alexander), విటాలిస్ (Vitalis), మార్షల్ (Martial) అను మిగతా ముగ్గురు చిన్నకుమారుల తలలను కత్తితో నరికిరి. చివరకు తల్లియైన ఫెలిసిటాటిస్ుకూడ అదే కత్తితో శిరచ్ఛేదము చేసిరి.

జస్టిన్ (Justin) అను గ్రీకు వేదాంతి రోములో క్రైస్తవ వేదాంత పాఠశాలను స్థాపించెను. ఇతడు ‘అపోలజీ అండ్ ది డయలాగ్’ (Apology and the Dia- logue) అను గ్రంథమును వ్రాసెను. ఈ హింసలు జరుగుచున్న కాలములో ఇతడు కూడ హతసాక్షియైనాడు. సమరయలోని నియోపోలిస్ (Neapolis) ఇతని జన్మ స్థలము.

ఇతడు సత్యమును ప్రేమించు గొప్ప పండితుడు. ముప్పది సంవత్సరముల ప్రాయములో క్రైస్తవ్యమును స్వీకరించిన తరువాత అన్యులకు ఒక పత్రికను వ్రాసి తన తలాంతులను ఉపయోగించి క్రైస్తవ విశ్వాససత్యమువైపు యూదులను నడిపించెను.

అన్యులు క్రైస్తవులను తీవ్రముగ హింసించుట ప్రారంభించినప్పుడు, వారి పక్షముగా జస్టిన్ చక్రవర్తికి ఒక ఉత్తరము వ్రాసెను. దానికి చక్రవర్తి స్పందించి క్రైస్తవుల పక్షముగ ఒక తీర్మానమును జారీచేసెను. క్రిసెన్స్ (Crescens) అను ప్రఖ్యాత విమర్శనాత్మక వేదాంతితో జస్టిన్ తరచు వాగ్వివాదములు జరిపెడివాడు. జస్టిన్, క్రిసెన్స్ను వాదములో ఓడించెడివాడు కనుక కలతచెందిన క్రిసెన్స్, జస్టిన్ ను నాశనము చేయుటకు తీర్మా నించుకొనెను.

క్రైస్తవుల పక్షముగ జస్టిన్ వ్రాసిన రెండవ ఉత్తరము క్రిసెన్స్కు తాను ఆశించిన అవకాశమును కలిగించినది. జస్టిన్ చక్రవర్తికి ప్రమాదకరమైన వ్యక్తియని చక్రవర్తిని ఒప్పించుటతో అతనిని, మరి ఆరుగురు అతని అనుచరులను బంధించి, అన్యదేవతలకు బలి అర్పింపుడని చక్రవర్తి ఆజ్ఞాపించెను. వారు నిరాకరించుటతో వారిని హింసించి, శిరచ్ఛేదము గావించిరి.

అనతికాలములో హింసలు తాత్కాలికముగా నిలిచిపోయెను. ఎందుచేతననగా ఉత్తరప్రాంతములో కచ్చితముగా ఓడిపోవుననుకున్న తన సైన్యము, క్రైస్తవ సైనికులు అనేకమంది ప్రార్థించినందున అద్భుతముగా విజయము సాధించెను. అయితే మరల ఫ్రాన్సులో వర్ణింపనలవికాని రీతిలో క్రైస్తవులపై చిత్రహింసలు అధికమైనవి.

సాంక్టస్ (Sanctus) క్రీస్తుకొరకు శ్రమనొంది, హింసింపబడినవారిలో ఒకడు. ఎర్రని ఇత్తడి పళ్లెములను వేడిగా కాల్చి, ఎముకలుకూడ కాలిపోవునట్లు వాటిని అతని శరీరములోని సున్నిత భాగములపై అదిమిపెట్టి హింసించిరి.

బ్లాండినా (Blandina) బలహీన శరీరముగల క్రైస్తవురాలు. ఆమె హింసలను ధైర్యముగా ఎదుర్కొనగలదని ఎవ్వరు ఊహించలేదు. ఆమెతోపాటు మరి ముగ్గురిని మృగమైదానమునకు తీసికొనివెళ్లి, భూమిలో పాతిన కొయ్యకుకట్టి అడవి సింహములకు ఆహారముగా వదలిపెట్టిరి. శ్రమను కనిపెట్టుచు, ఆమె తనతోనున్నవారికొరకు దయతో ప్రార్థించి, వారిని ధైర్యపరచినది.

అయితే సింహములలో ఏదియూ ఆమెను ముట్టలేదు. కనుక ఆమెను మరల జైలులో ఉంచిరి. ఈ విధముగ రెండుసార్లు జరిగెను. చివరిసారి ఆమెను వెలుపలికి తీసికొనివచ్చిరి. ఆమెతోపాటు 15 సం॥ల వయస్సుగల పొంతికస్ (Ponticus) కూడ ఉన్నాడు. వారి విశ్వాసములోని స్థిరత్వము అన్యులకు ఎంత ఎక్కువ కోపము కలిగించినదంటే ఆమెను స్త్రీ అనిగాని, అతడు బాలుడనిగాని వారు గౌరవింపలేదు. వారిని తీవ్రశ్రమలకు, చిత్రహింసలకు గురిచేసిరి.

బ్లాండినా కొట్టబడి, బోనులో పెట్టబడినది, అడవి ఎద్దుచే ఎగురవేయబడినది, ఎర్రగా కాలిన లోహపు కుర్చీమీద దిగంబరిగా కూర్చుండబెట్టబడినది, సింహములచేత చీల్చబడినది. ఆమె మాట్లాడగలిగినప్పుడు, విశ్వాసములో స్థిరముగా నుండవలెనని తనదగ్గర ఉన్నవారిని హెచ్చరించినది. పొంతికస్ ను మరణమువరకు వదలలేదు. విశ్వాసమునుండి ఆమెను మళ్లింపలేక పోయినందున, హంతకులు బ్లాండినాను కత్తితో పొడిచి చంపిరి.

లూసియస్ సెప్టిమస్ సెవరస్ చక్రవర్తి : ఐదవ హింస (క్రీ.శ. 193–211)

ఒక క్రైస్తవుడు సేవచేయగా సెవరస్ (Severus) తీవ్ర వ్యాధినుండి కోలుకొనుట చేత సెవరస్ చక్రవర్తి తాత్కాలికముగా క్రైస్తవులకు అనుకూలముగా నుండెను. అది ఎంతో కాలము కాకముందే, రోమా పౌరులు ద్వేషముతో క్రైస్తవులకు వ్యతిరేకముగా వాడుకలో లేని చట్టములను పునరుద్ధరించుటలో కృతకృత్యులైరి. మరియు సహజముగ సంభవించిన ప్రతి ప్రకృతి విపత్తునకు మరియొకసారి క్రైస్తవులను నిందించి, శిక్షించిరి.

పునరావృతమగుచున్న హత్యలతో సంబంధములేకుండ సంఘము వృద్ధిచెంది సువార్తకొరకు ధైర్యముగా నిలిచెను. వారు క్రీస్తుకొరకు శ్రమలను, హింసలను అనుభ వించుటకు సంతోషముగా ముందుకువచ్చిరి. రోమా సామ్రాజ్యమంతటినుండి ప్రభువు తన శరీరమను సంఘమునకు సభ్యులను చేర్చుచున్నాడు. కార్తేజినియన్ వేదశాస్త్ర పండితుడైన తెర్తుల్లియన్ (Tertullian) క్రీ.శ. 193 లో క్రైస్తవ్యమును స్వీకరించెను. ఇతడు క్రైస్తవులందరు రోమా రాష్ట్రములను వదలి వెళ్లినట్లయిన రోమా సామ్రాజ్యము చాలవరకు ఖాళీ అవునని చెప్పెను.

ఈ శ్రమల కాలములో రోమా బిషప్ విక్టర్ (Victor) క్రీ.శ. 201 లో హతసాక్షి అయ్యెను. ఆరిజెన్ (Origen) కు తండ్రి, పాత నిబంధన వ్యాఖ్యానమునకు పేరు గాంచిన గ్రీకు క్రైస్తవ వేదాంతియైన లియోనిడస్ (Leonidus) శిరచ్ఛేదము చేయ బడెను. ప్లుటార్కస్ (Plutarchus), సెరినస్ (Serenus), హెరాన్ (Heron), మరియు హిరాక్లిడెస్ (Heraclides) లు శిరచ్ఛేదము చేయబడిరి.

రైస్ (Rhais) అను పేరుగల స్త్రీ తలమీద మరుగుచున్న తారును పోసి, తరువాత ఆమెను కాల్చిచంపిరి, అదే విధముగా ఆమె తల్లి మార్సెల్ల (Marcella), సోదరి పొటైనైన (Potainiena) కూడ కాల్చి చంపబడిరి. కాని ఆమె హింసించబడుచున్నప్పుడు ఆమెను శిరచ్ఛేదము చేయు టకు నియమింపబడిన సైన్యాధికారియైన బాసిలిడెస్ (Basilides) క్రైస్తవ్యమును స్వీకరించెను.

తరువాత అతనిని రోమా అన్యవిగ్రహములమీద ప్రమాణము చేయుమని కోరినప్పుడు, అతడు క్రైస్తవుడైనందున తిరస్కరించెను. అతనితో ఉన్నవారు తాము విన్నదానిని మొదట నమ్మలేకపోయిరి, అయితే అతడు దానినే మరియొకసారి చెప్పినందున, న్యాయాధిపతి అతడు దోషియని తీర్పుచెప్పి, శిరచ్ఛేదము గావించెను. గ్రీకు సంఘ స్థాపకుడు మరియు లయాన్స్ పట్టణ బిషప్ ఐరేనియస్ (Irenaeus – క్రీ.శ. 130-202), గ్రీసులో జన్మించెను. అతడు లౌకిక, క్రైస్తవమత సంబంధమైన విద్యలనభ్యసించెను. లయాన్స్లో జరిగిన హింసల లెక్కలను ఇతడు వ్రాసినట్లు నమ్మబడుచున్నది. ఇతడు క్రీ.శ. 202 లో శిరచ్చేదము చేయబడెను.

రోమా సామ్రాజ్య భాగమైన ఉత్తర ఆఫ్రికాకుకూడ హింసలు విస్తరించినవి. ఆ ప్రాంతములో పెక్కుమంది హతసాక్షులైరి. పర్పట్వ (Perpetua) వివాహమైన యువతి, ఆమెకు ఒక పసిబిడ్డ కలదు; ఫెలిసిటస్ (Felicitas) అప్పటికి గర్భవతి; కార్తేజికి చెందిన రివొకాటస్ (Revocatus) క్రైస్తవ సిద్ధాంతములను బోధించెడి బానిస యువతి; సాటర్నినస్ (Saturninus), సెకన్ డ్యులస్ (Secundulus), మరియు సాతూర్ (Satur) లు అదే కాలములో శ్రమలననుభవించుచున్న ఖైదీలు. ఈ చివరి ముగ్గురిని రెండువరుసల మగవారి మధ్య పరుగెత్తించుచు కొరడాలతో తీవ్రముగా కొట్టిరి.

ఉపమంత్రి మైనుటియస్ (Minutius) ముందు పర్పట్వ నిలువబడినప్పుడు, విగ్రహములకు బలి అర్పించినచో ఆమెను విడిచిపెట్టుదుమని చెప్పిరి. అందుకు ఆమె తిరస్కరించగా, ఆమెవద్దగల పసిబిడ్డను బలవంతముగా తీసికొని ఆమెను ఖైదులో పెట్టిరి. ఆమె తన చెరసాల జీవితమును గురించి తన తండ్రితో ‘ఈ చీకటి గుహ నాకు రాజభవంతిలా ఉన్నద’ని చెప్పెను.

తరువాత, ఆమె ఇతర ఖైదీలతో కలసి హిలారియానస్ (Hilarianus) అను న్యాయాధిపతి ముందునకు తేబడెను. అతడుకూడ ఆమె తన మతమును పరిత్యజించి అన్య విగ్రహములకు బలి అర్పించినచో ఆమెను విడుదల చేయుదునని చెప్పెను. అక్కడ తన పసిబిడ్డతోనున్న ఆమె తండ్రికూడ ఆ విధముగ చేయుమని పర్పట్వను ప్రాధేయపడెను. కాని అందుకు ‘నేను పరిత్యజింపను’ అని పర్పట్వ జవాబిచ్చెను. ‘నీవు క్రైస్తవురాలవా?’ అని హిలారియానస్ ప్రశ్నించెను. ‘నేను క్రైస్తవురాలను’ అని పర్పట్వ జవాబిచ్చెను.

ఆమెతోపాటు ఉన్న క్రైస్తవ ఖైదీలందరు క్రీస్తుకొరకు స్థిరముగ నిలిచియుండిరి. అందుచే అన్యుల ఆనందముకొరకు వారి సెలవురోజున అడవి మృగములచేత వారు చంపబడవలెనని న్యాయాధిపతి ఆజ్ఞాపించెను. మగవారు సింహములు, చిరుత పులులచేత చీల్చబడిరి, ఆడవారు ఎద్దులచేత పొడవబడిరి.

వారు చంపబడు దినమున పర్పట్వ మరియు ఫెలిసిటస్ ను దిగంబరులుగ చేసి బోనులకు వ్రేలాడగట్టిరి, కాని ప్రేక్షకుల అభ్యంతరముమేరకు వారికి మరల వస్త్రములు ధరింపజేసిరి. మృగమైదానమునకు తిరిగివచ్చినప్పుడు, పిచ్చిఎద్దు పర్పట్వను పైకెత్తి ఎగరవేయగ, ఆమె దిగ్భ్రాంతి చెందినది కాని తీవ్రముగ గాయపడలేదు.

ఫెలిసిటస్ ను మాత్రము కొమ్ములతో గట్టిగా పొడిచినది. పర్పట్వ ఆతృతతో ఫెలిసిటస్ ను చేరుకొని ఆమెను గట్టిగ పట్టుకొనెను. ఎద్దు మరల వారిని పొడుచునని అన్యులు నిరీక్షించిరి, కాని అది ఆలాగున చేయలేదు. కనుక వారిని ఆ స్థలమునుండి ఈడ్చుకొని పోవుట జనసమూహమును నిరుత్సాహపరచెను.

కొద్దిసమయము తరువాత మల్లయోధులచే వారిని చంపించుటకు తిరిగి వారిని వెనుకకు తీసికొనివచ్చిరి. ఫెలిసిటస్ వెంటనే చంపబడినది, పర్పట్వను చంపుటకు నియమింపబడినవాడు యువకుడు, అనుభవము లేనివాడు. కనుక అతడు వణకి పోవుచు, బలహీనముగ పలుమారులు ఆమెను పొడిచెను.

అతడు వణకుట చూచిన పర్పట్వ అతని కత్తి అంచుపట్టుకొని తన శరీరములోని ముఖ్యమైన స్థానములో పొడుచుకున్నది. మగవారి స్థితికూడ అట్టిదే. సాతూర్, రివొకాటస్ క్రూరమృగములచేత చంపబడిరి. సాతూర్ నినస్ శిరచ్ఛేదము చేయబడగ, సెకన్ డ్యులస్ చెరసాలలో గాయములచేత చనిపోయెను.

మాగ్జిమస్ చక్రవర్తి : ఆరవ హింస (క్రీ.శ. 164-238)

మార్కస్ క్లోడియస్ ప్యుపైనస్ మాగ్జిమస్ (Marcus Clodius Pupienus Maximus) ఒక నియంతవలె క్రైస్తవులనందరిని వెంటాడి చంపుమని ఆజ్ఞాపించెను. ఆ విధముగా అనేకమంది చంపబడుటచే, పెద్ద పెద్ద గోతులు త్రవ్వి ఏబది లేక అరువదిమందిని కలిపి ఒకేమారు సమాధిచేసిరి.

చంపబడినవారిలో రోమా బిషప్ పొంతియానస్ (Pontianus) కూడ ఉన్నాడు. * విగ్రహారాధనకు వ్యతిరేకముగ బోధించుచున్నందుకు అతనికి దేశబహిష్కరణ విధించి, సార్టీనియా పంపి, అక్కడ అతనిని చంపిరి. అతని తరువాత వచ్చిన ఆంతెరోస్ (Anteros) నలుబది దినములు మాత్రమే బిషప్ గా పనిచేసెను. హతసాక్షుల సంగ్రహ చరిత్రను తయారుచేయుచున్నాడను అభియోగముపై రోమా ప్రభుత్వము అతనిని కూడ హతసాక్షిని చేసినది.

అదే రోజున రోమా శాసన సభ్యుడైన పమ్మకియస్ (Pammachius), అతని కుటుంబము, నలుబది ఇద్దరు ఇతర క్రైస్తవులు శిరచ్ఛేదము చేయబడి, వారి తలలు పట్టణద్వారములయొద్ద ప్రదర్శింపబడెను. క్రైస్తవ మంత్రియైన కలెపోడియస్ (Calepodius) ను రోమా వీధులలో ఈడ్చి, అతని మెడకు తిరుగటి రాయి కట్టి తైబర్ (Tiber) నదిలోకి విసిరివేసిరి.

సంస్కారి, రూపవతి, యౌవనస్థురాలైన మార్టీనా (Martina) ను శిరచ్ఛేదము చేసిరి. హిప్పోలిటస్ (Hippolitus) అను క్రైస్తవ మంత్రిని అడవి గుఱ్ఱమునకు కట్టి, చనిపోవువరకు నేలమీద ఈడ్చిరి.

క్రీ.శ. 238 లో మాగ్జిమస్ చనిపోయిన తరువాత గార్డియన్ (Gordian), అతని అనంతరము ఫిలిప్ (Philip) చక్రవర్తులుగా వచ్చిరి. చివరి ఇద్దరి పరిపాలనలో 6 నుండి 10 సంవత్సరముల కాలము సంఘమునకు హింసలు లేకుండ స్వేచ్ఛగా నుండెను. అయినను, క్రీ.శ. 249 లో చక్రవర్తికి తెలియకుండగనే అన్యపూజారి ప్రేరణతో అలెగ్జాండ్రియలో కఠినమైన హింస జరిగినది.

ఆ హింసలో వృద్ధ క్రైస్తవుడైన మెట్రూస్ (Metrus) విగ్రహములను పూజించుటకు నిరాకరించినందున, అతనిని దుడ్డుకఱ్ఱలతో మోది, సూదులతో గ్రుచ్చి, రాళ్లురువ్వి చంపిరి. క్రైస్తవ స్త్రీ క్విన్ట (Quinta) ను కొరడాతో కొట్టి, చెకుముకి రాళ్లమీద ఈడ్చి, రాళ్లురువ్వి చంపిరి.

డెబ్బది సంవత్సరముల ముదుసలి అపోలోనియా (Appolonia) తాను క్రైస్తవురాలనని ఒప్పుకొనినందున ఆమెను స్తంభమునకు కట్టి కాల్చిచంపిరి. నిప్పు ముట్టించిన తరువాత, తనను విడుదలచేయుమని ఆమె కోరినది. క్రీస్తును పరిత్యజించునని జనులందరు తలంచిరి కాని వారికి ఆశ్చర్యము కలుగునట్లు ఆమె ఆ మంటలలో దూకి చనిపోయెను.

డెసియస్ చక్రవర్తి : ఏడవ హింస (క్రీ.శ. 249-251)

డెసియస్ (Decius) చక్రవర్తి తనకుముందు పరిపాలించిన ఫిలిపన్ను క్రైస్తవునిగా భావించి, అతనిని ద్వేషించెను. ఫిలిప్ పరిపాలనా కాలములో క్రైస్తవ విశ్వాసము త్వరత్వరగా అభివృద్ధిచెంది, రోమా సామ్రాజ్య అన్యదేవతలు విడువబడెను. కాబట్టి, క్రైస్తవ్యమును దాని అనుచరులనందరిని తొలిగింపవలెనని చక్రవర్తి నిర్ణయించుకొనెను.

అన్యులైన రోమా పౌరులందరు డెసియస్ ఆజ్ఞలను అమలుపరచుటకు వేగిరపడుచు, క్రైస్తవులను హత్యచేయుట సామ్రాజ్యమునకు లాభదాయకమని ఆలోచించిరి. ఈ హింసాకాండలో హతసాక్షులు అనేకులగుటచే వారందరినిగూర్చి వ్రాయుట ఎవరికీ సాధ్యము కాలేదు. వారిలో కొందరిని గురించి తెలిసికొందము.

సైలీషియనుడైన జూలియన్ (Julian) క్రైస్తవుడైనందులకు బంధింపబడి అనేక సర్పములు, తేళ్లతో నింపబడిన చర్మపుసంచిలో కుట్టబడి, సముద్రములోనికి విసరి వేయబడినట్లు కాన్ స్టాంటినోపిల్ (Constantinople) ప్రధాన గురువు, పరిశుద్ధుడైన క్రిసోస్తమ్ (St. Chrysostom) క్రీ.శ. 398 లో వ్రాసెను.

యువకుడైన పేతురు (Peter) శారీరకముగా దృఢమైనవాడును, మహోన్నత మానసిక లక్షణములుగల వ్యక్తి. శుక్రుడను సౌందర్య దేవతకు బలి అర్పింపుమని చక్రవర్తి చెప్పినప్పుడు ఆలాగుచేయుటకు పేతురు తిరస్కరించెను. అతడు వాదనద్వారా తనను సమర్థించుకొనుచు ‘ఎవరి జారత్వకార్యములనుగురించి మీ గ్రంథములో వ్రాయబడినవో, మీ చట్టములు శిక్షించునంతగా ఎవరి జీవితము దుర్మార్గముగా ఉన్నదో అట్టి అవమానకరమైన స్త్రీకి మీరు బలి అర్పించుట నాకు దిగ్భ్రాంతి కలుగ జేయుచున్నది.

అయితే, నేను మాత్రము నిజదేవుడైన యేసుక్రీస్తుకు మాత్రమే స్తుతులు, ప్రార్థనలు అర్పించెదన’ని చెప్పెను. ఆసియా గవర్నరైన ఆప్టిమస్ (Optimus) ఇది వినినప్పుడు, పేతురును, అతని ఎముకలన్నీ విరిగిపోవువరకు ఒక చట్రముమీద సాగదీసి, తరువాత శిరచ్ఛేదము చేయవలెనని ఆజ్ఞాపించెను.

బలహీనుడగు క్రైస్తవుడైన నికొమాకస్ (Nichomachus) ను ఆప్టిమస్ తన వద్దకు రప్పించి, అన్యదేవతల విగ్రహములకు బలి అర్పింపుమని ఆజ్ఞాపించెను. అందుకు నికొమాకస్ ‘సర్వశక్తునికి మాత్రమే చెందవలసిన మహోన్నత గౌరవము దయ్యములకు నేను ఈయలేన’ని జవాబిచ్చెను. అయితే చిత్రహింసలకు గురిచేసిన కొద్దిసమయమునకే హింసలు భరించలేక క్రీస్తునందలి తన విశ్వాసమును విడచి పెట్టెను. వెంటనే అతనిని హింసలనుండి విడుదలచేసిరి. కాని అతడు భరింపరాని వేదనతో క్రిందపడి మరణించెను.

ప్రేక్షకులలోనున్న పదహారు సంవత్సరముల వయస్సుగల డెనీసా (Denisa) అను బాలిక నికొమాకస్ ను చూచి, విచారించి, ‘ఓ దౌర్భాగ్యుడా ! ఆనందకరమైన నిత్యత్వమును వదలి క్షణికమైన ఈ సుఖమును ఎందుకు కోరుకొనినావ’ని బిగ్గరగా అరచెను. ఆప్టిమస్ అది విని డెనీసాను తన యెదుటికి రప్పించినప్పుడు, డెనీసా తాను క్రైస్తవురాలనని ఒప్పుకొనుటచే, అతడు ఆమె శిరస్సును ఖండింపజేసెను.

నికొమాకస్ యొక్క క్రైస్తవ సహకారులైన అంద్రెయ, పౌలు క్రీస్తును హత్తుకొని తమ దీవెనకరమైన విమోచకుని స్తుతించినందున వారు రాళ్లచే కొట్టబడి, చంపబడిరి.

అలెగ్జాండ్రియాలో అలెగ్జాండర్ (Alexander) మరియు ఎపిమాకస్ (Epima chus) లు క్రైస్తవులైనందున ఖైదు చేయబడిరి. తాము క్రైస్తవులమని ఒప్పుకొనినప్పుడు వారు దుడ్డుకఱ్ఱులతో మోదబడి, ఇనుప కొక్కెములతో చీల్చబడి, అగ్నిచే కాల్చబడి, మరణించిరి. అదేరోజున నలుగురు మహిళా హతసాక్షుల శిరస్సులు ఛేదింపబడినవి, వారి పేర్లు తెలియరాలేదు.

నైస్ (Nice) లో ట్రైపో (Trypho) ను, రెస్పీషియస్ (Respicius) అను పేరు గాంచిన క్రైస్తవులను బంధించి చిత్రహింసలు పెట్టిరి. వారి కాళ్లలో మేకులు కొట్టి, కఱ్ఱలతో బాది, వీధులలో ఈడ్చి, చివరకు వారిని శిరచ్ఛేదము చేసిరి.

సిసిలి గవర్నరైన క్విన్టైన్ (Quintain), అగాథా (Agatha) అను సిసిలి మోహించెను. ఈమె అపురూప సౌందర్యవతి, దేవునియందు భయభక్తులుగల స్త్రీ. ఆమె క్విన్టైన్ చూపిన ప్రలోభములన్నిటిని తిరస్కరించినది. కనుక అతడామెను వేశ్యావాటికను నడిపించుచున్న అఫ్రోదిక (Aphrodica) అను అపకీర్తిగల స్త్రీ చేతికి అప్పగించెను.

ఈ ఆడదయ్యము అగాథాను వ్యభిచారిణిగా మార్చుటలో విఫలమైనది. అది వినిన క్విన్లైన్ తన కామదాహమును తీర్చుకొను అవకాశము కలుగనందున అగాథాను తన యెదుటకు రప్పించి ప్రశ్నించెను. అగాథా వ్యభిచరించుటకు ఒప్పుకొన నందున క్విన్లైన్ తన కోరికనంతటిని కోపముగా మార్చి అగాథాను కొరడాలతో కొట్టించి, పదునైన కొక్కెములతో చీరించి, మండుచున్న నిప్పులపైన, పగిలిన గాజు ముక్కలపైన దిగంబరిగా పరుండబెట్టించెను. అగాథా ఈ హింసలన్నిటిని గొప్ప ధైర్యముతో ఎదుర్కొనుటచే, తిరిగి జైలులో వేయబడి, ఆ గాయములవలన క్రీ.శ. 251, ఫిబ్రవరి 5న జైలులోనే మరణించెను.

క్రిటే పట్టణ గవర్నరైన లూసియస్ (Lucius), 84సం||ల వయస్సుగల గొర్తినా సంఘాధ్యక్షుడైన సిరిల్ (Cyril) అన్యుల విగ్రహములకు బలి అర్పింప నిరాకరించి నాడని అతనిని చెఱపట్టెను. లూసియస్ సిరిల్ను తన ముందుకు రప్పించి “విగ్రహా రాధనచేసి భయంకర మరణమునుండి నిన్ను నీవు రక్షించుకొనుము” అని హెచ్చ రించెను.

కాని దైవజనుడైన సిరిల్ “ఎంతో కాలమునుండి అనేకులకు క్రీస్తులో నిత్యజీవమునకు మార్గమును బోధించిన తాను, ఇప్పుడు తన ఆత్మరక్షణకొరకు స్థిరముగ నిలిచెదన”ని సమాధానమిచ్చెను. అంతట లూసియస్ అతనిని స్తంభమునకు కట్టి తగులబెట్టించెను.

క్రీ.శ. 251 లో డెసియస్ (Decius) చక్రవర్తి ఎఫెసులో అన్యదేవాలయమును కట్టించి, పట్టణములోని ప్రజలందరు ఆ విగ్రహములకు బలి అర్పింపవలెనని ఆజ్ఞాపిం చెను. కాని అతని సైన్యములోగల ఏడుగురు క్రైస్తవ సైనికులు చక్రవర్తి ఆజ్ఞను తిరస్కరించుటచేత ఖైదుచేయబడిరి. వారెవరనగా : కాన్స్టాన్టినస్ (Constantinus), డయోనిసియస్ (Dionysius), జోనేస్ (Joannes), మాల్కస్ (Malchus), మార్టియానస్ (Martianus), మాక్సిమియానస్ (Maximianus) మరియు సెరయాన్ (Seraion).

డెసియస్ వారియెడల కొంత ఔదార్యమును చూపించి, వారిని మార్చవలెనని కొంత సమయమిచ్చెను. కాని అతడు లేని సమయమున ఆ ఏడుగురు పారిపోయి, సమీపమునగల కొండ గుహలలో దాగిరి. డెసియస్ తిరిగివచ్చి, వారు దాగియున్న స్థావరములను కనుగొని, వారు దాహముతోను, ఆకలితోను మరణించు నట్లు ఆ గుహల ద్వారములను మూసివేయించెను.

డెసియస్ కాలములో జరిగిన హింసాకాండలో ప్రఖ్యాత క్రైస్తవ వేదాంతియైన అరువది నాలుగు సంవత్సరముల వయస్సుగల ఆరిజెన్ (Origen) బంధింపబడి, అలెగ్జాండ్రియాలో అమిత దుర్వాసనగలిగిన ఖైదులో ఉంచబడెను. అతని తండ్రి లియోనిడస్ (Leonidus) ఐదవ హింసలో హతసాక్షి మరణము పొందెను. ఆరిజెన్ తన క్రైస్తవ విశ్వాసమును పరిత్యజించనందున అతని కాళ్లను గొలుసులతో కట్టి, బండ కొయ్యలతో కాళ్లను వెడల్పుగా విడదీసి, అనేక చిత్రహింసలకు గురిచేసిరి.

అదృష్టవశమున ఆ సమయములో డెసియస్ చనిపోయెను. అతని తరువాత చక్రవర్తిగా వచ్చిన గల్లుస్ (Gallus) జర్మను ప్రజలైన గోతు (Goths) లతో వెంటనే యుద్ధము చేయవలసివచ్చెను. కనుక క్రైస్తవులపై హింసలు తాత్కాలికముగ నిలిచినవి. ఆ సమయములో ఆరిజెన్ విడుదల పొంది, తూరు (Tyre) కు వెళ్లి, ఐదు సంవత్స రముల తరువాత అనగా క్రీ.శ. 254 లో అక్కడనే మరణించెను.

వెలేరియన్ చక్రవర్తి : ఎనిమిదవ హింస (క్రీ.శ. 253-260)

ఎనిమిదవ హింస క్రీ.శ. 257 ఏప్రిల్లో ప్రారంభమై మూడున్నర సంవత్స రములు కొనసాగినది. అంతకుముందు జరిగిన హింసలకంటే ఇప్పటి హతసాక్షుల సంఖ్య, వారు అనుభవించిన శ్రమలు ఏమియును తక్కువ కాదు. వారందరిగురించి వ్రాయలేము కాని కొన్నింటిని మాత్రము తెలియజేయుచున్నాము.

రూఫినా (Rufina), సెకుంద (Secunda) అనువారు రోములోని ఒక పేరు గాంచిన వ్యక్తియొక్క కుమార్తెలు. వారు సౌందర్యవతులు, అధిక విద్యనభ్యసించినవారు.

వారిద్దరికి ధనికులైన ఇద్దరు యువకులతో వివాహము నిశ్చయమైనది. మొదట ఈ నలుగురు బహిరంగముగ క్రైస్తవులమని ఒప్పుకొనిరి. కాని హింసలు ప్రారంభమై నప్పుడు తమ ధనము పోవునను భయముతో ఆ ఇద్దరు యువకులు తమ విశ్వాసమును పరిత్యజించి, ఆ యువతులనుకూడ ఒప్పించుటకు ప్రయత్నించిరి. కాని వారు ఒప్పు కొనకపోవుటచే, ఆ యువకులు వారికి వ్యతిరేకముగా అధికారులకు తెలియజేయగా, వారిని బంధించి రోమా గవర్నరైన జునియస్ డొనటస్ (Junius Donatus) యెదుట హాజరుపరచిరి.

వారు అచ్చటకూడ క్రైస్తవులమని ఒప్పుకొని, తమ విశ్వాసమును పరిత్యజించుటకు నిరాకరించగా ఆ యువతుల శిరస్సులు ఖండించిరి. మరియు సత్యసువార్తను చెప్పి అన్యులను క్రైస్తవులుగా మతమార్పిడి చేయుచున్నాడను నేరముపై రోమా సంఘ విచారణకర్తయైన స్తెఫనును హింసించి, శిరస్సు ఖండించిరి.

అదే సమయమున రోమా పాలనలోని తౌలౌసు (Toulouse) పట్టణ సంఘ విచారణకర్తయైన సాతుర్నినస్ (Saturninus) అన్యుల దేవాలయములోని విగ్రహము లకు పూజ చేయుటకు నిరాకరించినందున, దేవాలయ మెట్ల చివరిభాగమునకు తీసికొనివెళ్లి, అతని కాళ్లను పోట్లఎద్దు తోకకు కట్టి, మెట్లమీదనుండి క్రిందకు ఈడ్పించినందున అతడు తలపగిలి చనిపోయెను.

రోములో సిక్స్డ్స్ (Sixtus) తరువాత స్తెఫను సంఘ విచారణకర్త అయ్యెను. కాని అతడు కొద్దికాలము మాత్రమే పనిచేసెను. స్తెఫను హతసాక్షియైన ఒక సంవత్స రమునకు అనగా క్రీ.శ. 258 లో రోమా గవర్నరైన మార్సియానస్ (Marcianus) రోములోని క్రైస్తవ గురువులనందరిని చంపుటకు వెలేరియన్ (Valerian) చక్రవర్తి యొక్క ఆజ్ఞను పొంది, వెంటనే సిక్సస్ను, అతని సంఘ ముఖ్యులలో ఆరుగురిని చంపించెను.

అపొ. 6-3

దురాశపరుడైన మార్సియానస్ సంఘనిధిని లారెన్స్ ఎక్కడ దాచియుంచెనో తెలిసికొని, దానిని వశపరచుకొన తలంచి అతనినడిగెను. సంఘపు ఆస్తులను సమకూర్చి, గవర్నరు ముందుంచుటకు లారెన్స్ మూడు దినముల వ్యవధిని కోరెను.

మూడవ దినము వచ్చినప్పుడు సంఘనిధులనుగూర్చి మార్సియానస్ ఆతృతగా అడుగగా లారెన్స్ అక్కడున్న పేద క్రైస్తవులవైపు తన చేయిచాపి, “వీరే సంఘముయొక్క శ్రేష్ఠ సంపద, క్రీస్తులో విశ్వాసముగల వీరే సంఘపు ధనాగారము, మరియు వారిలో క్రీస్తు నివసించుచున్నాడు, క్రీస్తు నివసింతునని వాగ్దానము చేసిన వీరికంటె శ్రేష్ఠమైన సంపద ఏమి ఉండగలదు?” అని చెప్పెను.

అది వినగానే మార్సియానస్ కోపముతో మండిపడి, దయ్యపు చేష్టలతో, అతని సైనికులనుద్దేశించి ఈ విధముగ పెద్దకేకలు వేసెను : “ఈ దుర్మార్గుడు చక్రవర్తిని మోసముచేయ ప్రయత్నించినాడు. వీనిని చంపుడి, కొరడాలతో కొట్టుడి, ఇనుప కొక్కెములతో చీల్చుడి, పిడికిలితో గుద్దుడి, దుడ్డుకఱ్ఱలతో తల చితుకగొట్టుడి.

ఈ దేశద్రోహికి చక్రవర్తితో హాస్యమా? పట్టకారులతో గిచ్చుడి, ఈ ద్రోహి కాళ్లు చేతులు కట్టి ఎర్రగా కాలిన ఇనుపరేకులపై పరుండబెట్టుడి. ఇటు అటు త్రిప్పుచూ అతనిని బోర్లించుడి. మీరు అతనిని హింసింపగలిగిన మేరకు హింసించుడి లేనియెడల మీరుకూడ హింసింపబడగలరు.”

మార్సియానస్ ఆడంబరముగ గర్జించినాడో లేదో చిత్రహింసలు మొదలైనవి. పలు భయంకర హింసల అనంతరము దేవుని దీనసేవకుడు ఎర్రగా కాలిన ఓ ఇనుప మంచముపై పరుండబెట్టబడెను. కాని దేవుని కటాక్షములో అది మెత్తని ఈకల పాన్పువలెనున్నది.

దైవజనుడైన లారెన్స్ విశ్రాంతి తీసికొనుచున్నవానివలె దానిపై పరుండి మరణించెను. ఆఫ్రికాలో హింసలు తీవ్రరూపము దాల్చెను. క్రీస్తుకొరకు వేలకువేల ప్రజలు హతసాక్షులైరి. వారిలో కొందరినిగూర్చి తెలిసికొందము.

ఉటిక (Utica) పట్టణములో ఆ ప్రాంత గవర్నరు మూడు వందలమంది క్రైస్తవు లను కాలుచున్న సున్నపుబట్టీ అంచున నిలువబెట్టి, విగ్రహములను పూజించుటకు బొగ్గుల పెనము, ధూపద్రవ్యములను సిద్ధముచేసి, ‘క్రైస్తవులైన మీరు బృహస్పతిని పూజించెదరో లేక ఆ సున్నపుబట్టీలో విసరివేయబడుటకు ఇష్టపడుదురో నిర్ణయించు కొను’డనెను. దానికి ఆ క్రైస్తవులందరు నిరాకరించి భయంకరమైన ఆ అగ్నిగుండములో దూకి మరణించిరి.

అక్కడికి కొంత దూరమున ముగ్గురు క్రైస్తవ యువతులు, మాక్సిమా (Maxima), దొనతిల్లా (Donatilla), సెకుంద (Secunda) లు క్రీస్తును విడిచిపెట్టకపోవుటచేత దోషులుగా తీర్పు తీర్చబడిరి. తరువాత వారిని ఉరికొయ్యకు వ్రేలాడగట్టి, హింసించి, క్రూరమృగములతో చీల్చివేయించి, చివరకు శిరచ్ఛేదము చేసిరి.

మత్తయి 27-34

స్పెయిన్లో టర్రగోన (Tarragona) సంఘ విచారణకర్తయైన ఫ్రక్టోసస్ (Fructuosus) ను, మరి ఇద్దరు పెద్దలు ఔగురియస్ (Augurius), యూలోజియస్ (Eulogius) లను మంటలలో హతమార్చిరి.

పాలస్తీనాలో అలెగ్జాండరు (Alexander), మాల్కసు (Malchus), ప్రిస్కసు (Priscus), మరియొక పేరు తెలియని స్త్రీ బహిరంగముగ తాము క్రైస్తవులమని ఒప్పుకొనినందున సింహములకు ఎరగా వేయబడిరి.

క్రీ.శ. 260 లో వెలేరియన్ కుమారుడైన గల్లినస్ (Gallienus) అధికారమునకు వచ్చెను. అతని పాలనా కాలములో పెక్కు సంవత్సరములు సంఘము నిర్బంధము లేకుండ స్వేచ్ఛగా నుండెను.

అరేలియనస్ చక్రవర్తి : తొమ్మిదవ హింస (క్రీ.శ. 270-275)

రోమా చక్రవర్తియైన అరేలియనస్ (Lucius Domitius Aurelianus) అనాగరికులను రైను (Rhine) నది దాటకుండ అడ్డుకొని, బ్రిటన్, గాల్, స్పెయిన్, సిరియా, ఐగుప్తులను తిరిగి జయించి, తన సామ్రాజ్యమునకు చేర్చినాడని చరిత్ర కారులకు తెలియును. అదేవిధముగ అతడు అనాగరికులవంటివాడని, యేసుక్రీస్తు సంఘమును హింసించినాడని క్రైస్తవులకు తెలియును.

రోమా సంఘ విచారణకర్తయైన ఫేలిక్స్ అరేలియనస్ పరిపాలనా కాలములో మొదటి హతసాక్షిగా క్రీ.శ. 274 లో శిరచ్ఛేదము చేయబడెను.

రోమునకు ముప్పదిమైళ్ల దూరమునగల ప్రణస్థి (Praeneste) పట్టణములో అగపెటస్ (Agapetus) అను ధనిక యౌవనస్థుడు తనకు కలిగినదంతయు అమ్మి ఆ ద్రవ్యమును పేదలకిచ్చెను. అందుకు అతనిని క్రైస్తవుడని నిందించి, అతని శిరస్సును ఖండించిరి.

కొంతకాలమునకు అరేలియనస్ తన సొంత అధికారులచేత రహస్యముగ చంపబడగా, అతని స్థానమునకు టసిటస్ (Tacitus) చక్రవర్తిగా వచ్చెను. తరువాత ప్రోపస్ (Propus), కారస్ (Carus), అతని కుమారులైన కార్నియస్ (Carnious), నొమెరియన్ (Numerian) మొదలగు అనేకమంది చక్రవర్తులు వచ్చిరి. వీరందరి కాలములలో క్రైస్తవ సంఘము శాంతిననుభవించెను.

డయోక్లేషియన్ చక్రవర్తి : పదియవ హింస (క్రీ.శ. 284-305)

సాధారణ శాంతి కాలము (క్రీ.శ. 54-304) లో నీరో చక్రవర్తినుండి అరేలియనస్ చక్రవర్తి కాలమువరకు జరిగిన హింసలు ప్రస్తుత డయోక్లేషియన్ (Diocletian) చక్రవర్తి కాలమునాటి హింసలకు ఆరంభముమాత్రమే. ఇతని కాలములో క్రైస్తవులకు జరిగిన హింసలు ఘోరమైనవి. రోమా పురాతన అన్యమతాచారములను పునరుద్ధరింప వలెనని డయోక్లేషియన్ ఆశించెను.

ఇది క్రైస్తవులకు జరిగిన గొప్ప హింసమాత్రమే కాదుగాని రోమా సామ్రాజ్యములో జరిగిన చిట్టచివరి హింసయైయున్నది. డయోక్లేషియన్ తన పరిపాలన ప్రారంభ దినములలో క్రైస్తవులకు అనుకూలముగా నుండెను. అయినప్పటికీ, అనేకమంది హతసాక్షులైరి. వారిలో కొందరినిగూర్చి తెలిసి కొందము.

కవలలైన మార్కస్ (Marcus), మార్సిల్లియనస్ (Marcellianus) లు రోములో క్రైస్తవ ఉపాధ్యాయులయొద్ద విద్యనభ్యసించుచూ క్రీస్తునంగీకరించిరి. వారి తల్లిదండ్రులు అన్యులైనందున తమ పిల్లలను కూడ అన్యులుగ మార్చయత్నించిరి, కాని క్రీస్తునందు వారికిగల బలమైన విశ్వాసముతో దానిని తిరస్కరించిరి. అయినను కాలక్రమేణా వారి తల్లిదండ్రులుకూడ తమ మనస్సు మార్చుకొని క్రైస్తవులైరి. వారు స్థిరవిశ్వాసము కలిగి యుండుటచే వారి చేతులను పైనున్న దూలములకు కట్టి వారి పాదములలో మేకులు కొట్టిరి. ఆ విధముగా వారిని ఒక పగలు ఒక రాత్రి ఉంచి బల్లెములతో పొడిచి చంపిరి.

వారి స్థిర విశ్వాసమునకు ఆశ్చర్యపడి చెరసాల అధిపతి భార్యయైన జో (Zoe) క్రీస్తును విశ్వసించెను. ఎంతోకాలము కాకముందే, ఆమెను చెట్టునకు వ్రేలాడదీసి, కాళ్ల క్రింద గడ్డిమంటవేసి కాల్చిరి. మంటలలో నశించిన ఆమె శరీరమునకు పెద్దరాయి కట్టి, సమీపమునగల నదిలో విసరివేసిరి. దక్షిణ ఫ్రాన్సులోని అక్విటైన్లో ఫెయిత్ (Faith) అను క్రైస్తవ స్త్రీని ఇనుప చట్రముపై బిగించి కాల్చి, తరువాత తల నరికి చంపిరి.

క్రీ.శ. 287 లో రోములో క్విన్టిన్ (Quintin), లూసియన్ (Lucian) అనువారు గాలు (Gaul) లో సువార్త ప్రకటించుటకు నిశ్చయించుకొని, కొంతకాలము సువార్తను ప్రకటించిరి. తరువాత లూసియన్ వేరొక పట్టణము వెళ్లి అక్కడ హతసాక్షియయ్యెను. క్విన్టిన్ పికార్డి (Picardy) వెళ్లి, అక్కడ ఆసక్తితో సువార్తసేవ చేయుచుండెను.

కొద్దికాలమునకే అతనిని బంధించి, మరణమునకు పాత్రుడని తీర్పుచెప్పి, అతని కాళ్లకు, చేతులకు సంకెళ్లు బిగించి, కీలుకు కీలు విడిపోవునట్లు లాగిరి. అతని దిగంబర శరీరముపై మరుగుచున్న నూనె, తారు పోసి నిప్పుపెట్టిరి. ఈ హింసలైన తరువాత, అతనిని మరల కారాగారములో బంధింపగా కాలిన గాయములవలన అతడు చనిపోయెను. అతని శరీరమునకు బరువైన రాయి కట్టి సొమ్మె (Somme) నదిలో విసరివేసిరి.

జూన్ 22, క్రీ.శ. 287 న ఆల్బన్ (Alban) అను క్రైస్తవుడు మొదటి ఆంగ్ల హతసాక్షి అయ్యెను. హెర్పోర్టుషైర్ రాష్ట్రములోని పరి. ఆల్బన్ (St. Alban) పట్టణ మునకు అతని పేరు పెట్టిరి. ఆల్బన్ మొదట అన్యుడు, ఆంఫిబలస్ (Amphibalus) అను క్రైస్తవ బోధకుడు అతనిని క్రీస్తు సత్యములోనికి నడిపించెను. అధికారులు ఆంఫిబలసన్ను వెదకుచుండగా, ఆల్బన్ అతనిని తన యింటిలో దాచియుంచి, అతనిని వెదకుచు సైనికులు వచ్చినప్పుడు ఆల్బన్ తానే ఆంఫిబలసి నని అబద్దముచెప్పి, అతడు పారిపోవుటకు సహాయపడెను. ఈ మోసము తెలిసిన వెంటనే, గవర్నరు ఆల్బన్ను కొట్టి, శిరచ్ఛేదము చేయుమని ఆజ్ఞాపించెను.

క్రీ.శ. 731 లో “ఆంగ్ల ప్రజల క్రైస్తవ చరిత్ర” (Ecclesiastical History of the English Nation) ను వ్రాసిన ఆంగ్లో-సార్జన్ వేదాంతి, చరిత్రకారుడునైన బీడె (Bede) ఉదహరించినట్లు, ఆల్బన న్ను చంపుటకు నియమింపబడిన వ్యక్తి ఉన్నట్టుండి క్రైస్తవ్యమును స్వీకరించెను. అతడు ఆల్బన్కు బదులుగ లేక అతనితోకూడ తానును చనిపోవుటకు అనుమతించవలసినదిగా ఆల్బన్నే కోరెను. ఆల్బన్ రెండవదానికి సమ్మతించెను. కనుక ఒక సైనికుడు వారిద్దరిని శిరచ్ఛేదము చేసెను.

డయోక్లేషియన్ యొక్క పెంపుడు కుమారుడును, వారసుడునైన గలేరియస్ (Galerius) తల్లి అన్యురాలు. ఈమె క్రైస్తవులను రోమా సామ్రాజ్యమునుండి వెళ్లగొట్టుటకు డయోక్లేషియన్ ను ఒప్పించవలసినదిగా గలేరియస్ ను పురికొల్పెను. క్రీ.శ. 303, ఫిబ్రవరి 23న ఈ రక్తసిక్త కార్యక్రమము డయోక్లేషియన్కు చెందిన తూర్పు రోమా సామ్రాజ్య రాజధానియైన నికోమేదియా (Nicomedia) లో ప్రారంభ మైనది. ఆ రోజు ప్రొద్దుటనే ప్రధాన పోలీసు అధికారి, ఇతర అధికారులు, వారికిగల అనేకమంది సహాయకులు పెద్ద సంఖ్యలో క్రైస్తవ ప్రధాన దేవాలయములకు వెళ్లి, బలవంతముగ తలుపులు తెరచి, భవనమును కొల్లగొట్టి, పవిత్ర గ్రంథములన్నిటిని తగులబెట్టిరి.

డయోక్లేషియన్, గలేరియన్లు క్రైస్తవ మతాంతముయొక్క ప్రారంభమును చూచుటకు వారితోపాటు వెళ్లి, గ్రంథములను తగులబెట్టుటతో సంతోషపడక, ఆ భవనమును నేలమట్టము చేయించిరి. తరువాత డయోక్లేషియన్ రాజ్యములోగల క్రైస్తవ దేవాలయములన్నింటిని, వారి గ్రంథములను నాశనము చేయుమని శాసనము జారీచేసెను. క్రైస్తవులందరు దేశద్రోహులని చెప్పి, వారిని బంధించెను.

శాసనముయొక్క ప్రతిని బహిరంగ స్థలములో అతికించినప్పుడు సాహసవంతు డైన ఒక క్రైస్తవుడు దానిని చింపి, ఈ అన్యాయమునకు చక్రవర్తిని నిందించెను. చక్రవర్తిని బహిరంగముగ దూషించినందుకతనిని హింసించి కాల్చిచంపిరి.

నికోమేదియాలోని ప్రతి క్రైస్తవుని బంధించి, ఖైదులో పెట్టిరి. వారిని ఇంకా కఠినముగ శిక్షించునిమిత్తము రాజభవనమునకు రహస్యముగ నిప్పుముట్టింపుమని గలేరియస్ ఆదేశించి, ఇండ్లు తగులబెట్టువారిగా క్రైస్తవులను నిందించెను. అందువలన సామ్రాజ్యమంతట పదిసంవత్సరములపాటు హింసలు చెలరేగి, వేలకొలది క్రైస్తవులు హతసాక్షులైరి. ఈ చర్యలో వారి వయస్సుగాని, స్త్రీ, పురుష భేదముగాని పాటింపలేదు.

ఇంకా పటిష్టముగా పరిపాలించు నిమిత్తము క్రీ.శ. 286 లో డయోక్లేషియన్ తన సామ్రాజ్యమును తూర్పు, పశ్చిమ భాగములుగ విభజించెను. కొంతకాలమునకు తూర్పు భాగములో హింసాకాండ తీవ్రమైనది. క్రీ.శ. 293 లో కాన్టన్లైన్హెయొక్క తండ్రియైన అరెలియస్ వెలేరియస్ కాన్స్టన్టిటియస్ (Aurelius Valerius Con stantius) ను గాలు, బ్రిటన్లుగల పశ్చిమ ప్రాంతమునకు కైసరుగ నియమించెను.

ఆ కాలములో ‘క్రైస్తవుడు’ అను మాట అన్యులకు బహు ద్వేషము కలిగించెను. ఆ పేరుగలవారెవరిని వారు దయదల్చలేదు. అన్యులకు సంభవించిన ప్రతి కష్టము, అరిష్టములకు క్రైస్తవులు మరియొకసారి నిందలపాలైరి. పచ్చి అబద్దములు, అర్థములేని కథలు వారిమీద చెప్పబడగా ప్రజలు వాటిని నమ్మి, ఊహకందని వివిధ హింసాపద్ధతుల ద్వారా వారిని హింసించిరి. వారు హింసించుట మొదలుపెట్టి అనేక క్రైస్తవ గృహములు తగులబెట్టగా, ఎన్నో కుటుంబములు మంటలలో కాలిపోయెను.

మెడలకు బరువైన రాళ్లుకట్టి అనేకులను మర్మరా (Marmara) సముద్రములోనికి విసరిరి. కొరడాలు, అగ్ని, కత్తులు, బల్లెములు, సిలువలు, విషము మొదలగునవన్నీ ప్రయోగించిరి. ప్రుగియ (Phrygia) ప్రాంతములోని ఒక పట్టణ ప్రజలందరు క్రైస్తవులే. వారందరిని బలవంతముగా అగ్నికి ఆహుతి చేసిరి.

చివరకు, ఈ విధముగ చంపుట రోమీయులకు తగినది కాదని అనేక ప్రాంతముల గవర్నర్లు చక్రవర్తికి మనవిచేయగా, అనేకమంది క్రైస్తవులు మరణమునుండి తప్పింపబడిరి, కాని వారి జీవితములు దుఃఖకరముగ నుండుటకు అంగవైకల్యము గావించిరి. కొందరి చెవులను చీల్చిరి, ముక్కులను కోసిరి, కళ్లు పీకిరి, ఎముకలను విరిచిరి, క్రైస్తవులని తెలియబడుటకు స్పష్టముగ కనబడు భాగములలో కాల్చిరి.

రోమా చక్రవర్తి సంరక్షకులలో సెబాస్టియన్ (Sebastian) ఒకడు. ఇతడు తన విశ్వాసమును పరిత్యజించి, విగ్రహారాధనకు అంగీకరించకపోవుటచే, డయోక్లేషియన్ చక్రవర్తి అతనిని చనిపోవునంతవరకు బాణములతో కొట్టి చంపవలెనని శాసించెను. అతని శరీరమును తీసికొనివెళ్లి, పాతిపెట్టుటకు కొందరు క్రైస్తవులు వచ్చి చూచినప్పుడు

అతడు జీవించియున్నాడని గమనించి, క్షేమకరమైన ప్రదేశమునకు తరలింపగ, అతడు అక్కడ గాయములనుండి తిరిగి స్వస్థత పొందెను. కొద్దికాలములోనే అతడు వీధులలో డయోక్లేషియన్ ను, అతడు క్రైస్తవులయెడల ప్రదర్శించిన క్రూరత్వమును, ద్వేష భావమును గద్దించెను. సెబాస్టియన్ మరల బ్రతికివచ్చినందుకు చక్రవర్తి ఆశ్చర్య పడి, వెంటనే అతనిని బంధించి చనిపోవువరకు కొట్టుమని ఆజ్ఞాపించెను. అతని శరీరమును క్రైస్తవులు ఈసారికూడ తీసికొని వెళ్లకుండ, మురికినీటి కాలువలో పారవేయుమని ఆజ్ఞాపించెను. అయితే లుసింద (Lucinda) అను భక్తిగల ఆ స్త్రీ శరీరమును తీయించి, గుహలో హతసాక్షుల శరీరముల మధ్య పాతిపెట్టించినది.

వైటస్ (Vitus) ను పెంచి పెద్దచేసిన దాది అతనికి క్రైస్తవ సిద్ధాంతములను బోధించెను. హైలాస్ (Hylas) అను అన్యుడైన అతని తండ్రి ఈ విషయమును గ్రహించి, అతనిని అన్యమతములోనికి మార్చుటకు ప్రయత్నించి విఫలుడయ్యెను. తన కుమారుడు చేసిన అపచారమునకు అన్యదేవతలను శాంతింపజేయుటకు హైలాస్ తన కుమారుడైన వైటన్నే క్రీ.శ. 303, జూన్ 14న బలియిచ్చెను.

మంచి క్రైస్తవుడైన విక్టర్ (Victor) రోగులను, బలహీనులను దర్శించుటకు అధిక సమయమును వెచ్చించుచు, పేదలకు ఆర్థిక సహాయము చేయుచుండెను. అతడు దాతృత్వముగల క్రైస్తవుడని చక్రవర్తి దృష్టికి తేబడగా అతనిని బంధించి వీధులలో ఈడ్పించుమని, ఈడ్చుసమయములో అన్యులందరు అతనిని కొట్టి, రాళ్లురువ్వవలెనని చక్రవర్తి ఆజ్ఞాపించెను. విక్టర్ ఈ శ్రమనంతటిని గొప్ప ధైర్యముతో సహించెను. అతని అచంచల విశ్వాసము మొండితనముగా భావించబడినది. అతనిని హింసించు వారు అలసిపోయి అతనిని తిరిగి ఖైదుచేసిరి. అక్కడ విక్టర్ చెరసాల అధికారులకు క్రీస్తు సువార్తను ప్రకటించగా వారిలో ముగ్గురు – అలెగ్జాండర్ (Alexander), లాంగినస్ (Longinus), ఫేలీషియన్ (Felician) లు క్రీస్తును అంగీకరించిరి. చక్రవర్తికి ఈ వార్త తెలిసినప్పుడు, ఆ ముగ్గురు చెరసాల అధికారులను పిలిపించి వారి తలలు నరికించెను. విక్టర్నుమాత్రము దుడ్డుకఱ్ఱలతో కొట్టించి, మరల ఖైదుచేసెను.

మూడవసారి, ఒక అన్యదేవతకు కట్టిన బలిపీఠముపై హారతులు వెలిగించి, ఆ దేవతను పూజింపుమని అతనిని నిర్బంధించిరి, అయితే విక్టర్ ఆ దేవత బలిపీఠముపై తన కాలుమోపి, బలిపీఠమును తలక్రిందులు చేసెను. దగ్గరనే ఉన్న చక్రవర్తి రెచ్చిపోయి, అతని పాదమును నరికివేయించి, ధాన్యపు మరలో వేయించి తిరుగటి రాయి క్రిందపెట్టి నలుగగొట్టుమని ఆజ్ఞాపించెను. సిసిలియ ప్రాంత గవర్నరైన మాగ్జిమస్ (Maximus) ఒకసారి తార్సు పట్టణము వెళ్లెను. అక్కడ టార్కస్ (Tarchus), ప్రోబస్ (Probus), ఆంధ్రోనికస్ (Andronicus)

అను ముగ్గురు క్రైస్తవులను అతనియొద్దకు తీసికొనివచ్చిరి. వారిని పదేపదే చిత్రహింస పెట్టుచు క్రీస్తునందలి వారి విశ్వాసమును ఉపసంహరించుకొనుమని హెచ్చరించిరి. వారు అంగీకరింపకపోవుటతో, వారిని మృగమైదానమునకు పంపి ఆకలితోనున్న అనేక మృగములను వీరిపైకి వదలిరి, కాని అవి వారిని ఏమియు చేయలేదు.

అప్పుడు జంతుశాల కాపరి క్రూరమైన ఆడసింహమును, పెద్ద ఎలుగు బంటిని తీసికొనివచ్చెను. అవి అదే రోజున ముగ్గురు మనుష్యులను చంపినవి. కాని ఆ రెండు జంతువులుకూడ ఈ క్రైస్తవులపైబడలేదు. అడవి జంతువులు పళ్లతోను, పంజాలతోను వీరిని చీల్చి, చంపివేయునని తలంచి, నిరుత్సాహపడిన మాగ్జిమస్, వారిని కత్తితో పొడిచి చంపెను.

రోమనస్ (Romanus) కైసరయ సంఘమునకు పెద్దగా ఉండెను. అతనిని బలవంతముగా పట్టుకొని అంతియొకయకు తీసికొని వెళ్లిరి. అక్కడ అతని నమ్మకమును గురించి నిందించి కొరడాలతో కొట్టి, కొక్కెములతో చీల్చి, శరీరము, ముఖముమీద చాకుతో గాట్లుపెట్టి, పళ్లు విరుగగొట్టి, గొంతుపిసికి చంపిరి.

భక్తిగల సూసన్న (Susanna) రోమా సంఘకాపరియైన కైయస్ (Caius) మేన కోడలు. ఈమెను తన బంధువు, ధనవంతుడైన అన్యుని పెండ్లాడమని డయోక్లేషియన్ ఆజ్ఞాపించెను. అందుకు ఆమె నిరాకరించుటతో, డయోక్లేషియన్ ఆమె తల నరికించెను.

చక్రవర్తి సేవకుడు, నపుంసకుడైన పేతురు క్రైస్తవుడుగా మారి, చాల భక్తిగాను, మర్యాదగాను ఉండెను. అది వినిన చక్రవర్తి, పేతురును ఇనుప చట్రమునకు కట్టించి, చనిపోవువరకు తక్కువ సెగతో కాల్చి చంపెను. అది చాల గంటలు పట్టినది.
యులాలియ (Eulalia) స్పెయిన్ క్రైస్తవ కుటుంబమునకు చెందిన మంచి బుద్ధిగల, చక్కని యౌవ్వనురాలు.

క్రైస్తవురాలైనందుకు ఆమె బంధింపబడినప్పుడు, ఒక ప్రభుత్వాధికారి ఆమెను అన్యమతములోనికి మార్చుటకు ప్రయత్నించెను. కాని ఆమె అన్యదేవతలను కించపరచినందున అతడు కోపోద్రేకుడై, అతి క్రూరముగ ఆమెను చిత్రహింసలపాలు చేయమని ఆదేశించెను. ఆమెను హింసించు సమయములో ఇనుప కొక్కెములను ఆమె ప్రక్కలో దూర్చి లాగి, ఆమె స్తనములను నల్లబడువరకు కాల్చిరి. దానివలన బాధ అధికమై ఆమె చనిపోయెను. ఇది క్రీ.శ. 303, డిసెంబరులో జరిగినది.

వెలేరియస్ (Valerius) అను సంఘ విచారణకర్తను, సంఘపెద్దయైన విన్సెంట్ (Vincent) ను క్రీ.శ. 304 లో స్పెయిన్లోని తరగోన గవర్నరు బంధించి, గొలుసు లతో కొట్టించి, చెరసాలలో వేయించెను. అయినను ఆ ఇద్దరు విశ్వాసములో గట్టిగా నిలచిరి. కారణము తెలియదు కాని, వెలేరియసు తర్రగోననుండి బహిష్కరించి, సంఘ పెద్దయైన విన్సెంట్కుమాత్రము కఠినశిక్ష విధించిరి.

అతనిని కొయ్య చట్రము నకు కట్టిలాగుటచే కీళ్లు స్థానము తప్పినవి. వదులుగా ఉన్న శరీర భాగములలో కొక్కెము దూర్చి, లాగిరి. పైన ముళ్లుండి శరీరములోనికి గుచ్చుకొనిపోవు ఇనుప చట్రమునకు అతనిని వ్రేలాడగట్టి క్రింద మంటలు పెట్టిరి. ఈ హింసలు అతని స్థిరత్వమును మార్చలేకపోయినవి. పదునైన చెకుముకి రాయివంటి గాజు పెంకులు పరచి, కంపుకొట్టుచున్న చెరసాల గదిలో అతనిని వేసిరి. ఆ బాధతో అతడు క్రీ.శ. 304, జనవరి 22న చనిపోయెను.

డయోక్లేషియన్ రోమా గవర్నర్ పదవికి రాజీనామా చేయుటకు ముందటి సంవత్సరము అనగా క్రీ.శ. 304 లో క్రైస్తవులపై హింసలు తారాస్థాయికి చేరినవి. అన్యులందరు మార్పు రాబోవుచున్నదని తెలిసికొని, హింసాకాలము పూర్తికాకముందే, క్రైస్తవులను అతి క్రూరముగ హింసించుటకు నిశ్చయించుకొనిరి. ఆ సంవత్సరము హతసాక్షులైనవారిలో కొందరి గాథలనుగూర్చి తెలిసికొందము.

ఆఫ్రికాలో క్రైస్తవ బోధకుడైన సాతుర్నినస్ (Saturninus) హింసింపబడి, ఖైదులో పెట్టబడి, చివరకు ఆకలితో చనిపోయెను. అతని నలుగురు పిల్లలకుకూడ అదే గతి సంభవించినది.

రోమీయుల మాసిదోనియ ప్రాంతములోని థెస్సలొనీకయ (Thessalonica) లో అగ్రపె (Agrape), కియోనియ (Chionia) మరియు ఇరెనె (Irene) అను ముగ్గురు అక్కచెల్లెండ్రను బంధించి, క్రీ.శ. 304 మార్చి 25న కాల్చి చంపిరి. ఇరెనె అందమునకు ఆకర్షింపబడిన గవర్నరు ఆమెను ప్రలోభబెట్టచూడగా ఆమె అతనిని గద్దించెను. అంతట గవర్నరు ఆమెను వివస్త్రనుచేసి, నగర వీధులవెంట త్రిప్పుమని, ఆ స్థితిలోనే ఆమెను పట్టణ ద్వారమునకు వ్రేలాడగట్టి, కాల్చిచంపుమని ఆజ్ఞాపించెను.

విక్టోరియస్ (Victorius), కార్పోఫోరస్ (Carpophorus), సవెరస్ (Severus), మరియు సవేరియనస్ (Severianus) అను నలుగురు సోదరులు రోము పట్టణములో ఉన్నతోద్యోగములలో నియమింపబడిరి. వారు క్రైస్తవులని, విగ్రహారాధనకు వ్యతిరేకు లని తెలిసినప్పుడు, వారిని బంధించి, కొరడాలతో కొట్టగా, తీవ్రమైన దెబ్బలకు ఆ నలుగురు సోదరులు చనిపోయిరి.

రోమా సామ్రాజ్యములోని మౌరిటానియ సంఘపెద్దయైన తిమోతి (Timothy), మౌరా (Maura) అను యువతి కొన్ని వారములక్రిందట వివాహము చేసికొనిరి. వారు క్రైస్తవులైనందున ఖైదుచేయబడి, ఆ ప్రాంత గవర్నరైన అరియానస్ (Arrianus) ముందు నిలువబెట్టబడిరి.

పరిశుద్ధ లేఖనములు తిమోతి ఆధీనములో ఉన్నవని గవర్నర్కు తెలిసి వాటిని తీసికొనివచ్చి కాల్చివేయుమని శాసించెను. అందుకు తిమోతి ‘నాకు పిల్లలు ఉన్నట్లయితే వారిని నీ ముందుకు తీసికొనివచ్చి బలియిచ్చెడివాడను, కాని దేవుని వాక్యమును ఆలాగు చేయను’ అని సమాధానమిచ్చెను.

ఈ సమాధానమునకు బహుగా కోపించిన అరియానస్ ఎర్రగా కాలిన ఇనుప చువ్వలను తిమోతి కళ్లల్లో పెట్టి కాల్చుమని ఆదేశించుచూ ‘ఆ పుస్తకములు నీకు ఉపయోగపడవు. ఎందుకనగా వాటిని చదువుటకు నీకు కళ్లుండవు’ అని చెప్పెను.
భయంకర బాధలోకూడ తిమోతి చూపిన స్థిరత్వము అరియానసన్ను రెచ్చగొట్టి, అతని మెడకు బరువైన రాయికట్టి, నోటిలో గుడ్డపెట్టి తలక్రిందులుగా వ్రేలాడగట్టుమని ఆజ్ఞాపించెను. అయినను తిమోతి తన దృఢవిశ్వాసమును విడిచిపెట్టలేదు.

ఈ ఘోరమంతటిని బలవంతముగ చూచుచున్న తిమోతి భార్య మౌరా, అట్టి హింసలను చూచు ధైర్యము తనకు లేదని, తనకొరకైనా విశ్వాసమును పరిత్యజింపుమని తిమోతిని యాచించినది. ఆమె విజ్ఞాపనలకు జవాబిచ్చునని, అతని నోటిలో కుక్కిన గుడ్డను తీయగా, తిమోతి ఆమెతో ఏకీభవించుటకు బదులు, ‘క్రీస్తుకొరకు చనిపోవుటకు నిర్ణయించుకొన్నాన’ని ప్రకటించెను.

మౌరాకూడ తన భర్తను అనుసరించి మహిమ లోనికి వెంబడించుటకు తీర్మానించుకున్నది. ఆ తీర్మానమునుండి ఆమెను మార్చుటకు అరియానస్ ఆమెను దారుణముగా హింసింపుమని ఆదేశించెను. వారి హింసలన్నీ ముగిసిన తరువాత తిమోతి మౌరాలను ఒకరి తరువాత ఒకరిని సిలువవేసిరి.

టస్కనీ ప్రాంతములో అస్సీసియం పట్టణ బిషప్ సబీనస్ (Sabinus) రోమియుల ప్రధాన దేవత బృహస్పతికి బలియిచ్చుటకు తిరస్కరించి, ఆ విగ్రహమును దూరముగా విసరికొట్టగా గవర్నరు సబీనస్ చేతిని నరికించెను. ఏ విధముగానైతేనేమి జైలులో ఉన్నప్పుడు సబీనస్ గవర్నరును, అతని కుటుంబమును క్రైస్తవ్యములోనికి మార్చెను. వారు క్రొత్తగా కనుగొనిన నిజదేవునిలో వారికిగల నమ్మకమును ఒప్పుకొనినప్పుడు వారిని ఉరితీసి, సబీనస్ ను చనిపోవువరకు కొట్టిరి. ఇది క్రీ.శ. 304 డిసెంబరులో జరిగినది.

పాంఫిలస్ (Pamphilus) ఫోనీషియలో జన్మించెను. ఇతడు మహా జ్ఞాని, విద్యావేత్త. ఇతనిని రెండవ ఆరిజెన్ (Origen) అని పిలచెడివారు. రోమా యూదయ రాజధానియైన కైసరయ మతాచార్యుల సంఘసభ్యుడై, పాంఫిలస్ ప్రజా గ్రంథాలయ మును స్థాపించెను. ఇతడు క్రైస్తవధర్మము, కార్యములయందు ఆసక్తిగలవాడై ఆరిజెన్ రచనలలో అధిక భాగమును తన స్వహస్తములతో తిరగ వ్రాసెను.

యూ సెబియస్ (Eusebius) అను మరియొక దైవసేవకుడు సహాయపడగ, సరియైన ప్రతిలేఖకులు లేక అశ్రద్ధచేయబడిన పాత నిబంధన గ్రంథమును మరలా తప్పులు లేకుండా రూపొందించెను. ఆ విధమైన పనులు చేయుచున్నందుకు అతనిని ఖైదుచేసి, హింసించి చంపిరి.

క్రీ.శ. 305 లో డయోషియన్ ప్రధాన రోమా చక్రవర్తి పదవికి రాజీనామా చేసి, క్రీ.శ. 293 లో పశ్చిమ రాజ్యమునకు అతనిచే కైసరుగా నియమింపబడిన కాన్స్టాంటియస్ (Constantius) కు, అతని వారసుడు మరియు అతనితోపాటు తూర్పు ప్రాంతములో సహచక్రవర్తిగా పనిచేసిన గలేరియస్ (Gaius Galerius Valerius Maximianus) లకు రాజ్యమును అప్పగించెను. కాన్స్టాంటియస్ నెమ్మది పరుడు, మంచిస్వభావము, నడవడి కలవాడు. ఇతని పరిపాలనలో పశ్చిమ ప్రాంతపు క్రైస్తవులకు మొదటిసారిగా అనేక సంవత్సరములనుండి అనుభవించుచున్న శ్రమల నుండి ఉపశమనము కలిగినది.

అయితే తూర్పు ప్రాంతములో గలేరియస్ పరి పాలనలో చిత్రహింసలు కొనసాగినవి. ఇతడే క్రైస్తవ్యమును భూమిమీదనుండి తుడిచివేయవలసినదిగాను, హింసలను తీవ్రతరము చేయవలసినదిగాను డయోక్లేషి యన్ ను ప్రోత్సహించెను. అయినప్పటికి, హింసలన్నీ విఫలమైనవి. కారణమేమనగా ఆయన తిరిగివచ్చువరకు భూమిమీద క్రీస్తు తన సంఘమును కలిగి ఉండును.

రోమా సామ్రాజ్యములో క్రీస్తు సంఘమును అన్యులు నాశనము చేయలేకపోవుట శ్రమల అంతమునకు నాంది. ఎందుకనగా, దేవునికి ఒక యోధుడు ఉన్నాడు, అతనిని రోమా సామ్రాజ్యమంతటికి చక్రవర్తిగా ఆయన అతిత్వరలో కూర్చుండబెట్టును.