స్మిత్ ఫీల్డ్ అగ్ని జ్వాలలు (క్రీ.శ. 1410–1556)

స్మిత్ ఫీల్డ్ అగ్ని జ్వాలలు (క్రీ.శ. 1410–1556)

జయశాలియైన విలియమ్ (William the Conqueror) యొక్క కనిష్ఠ కుమారు డైన ఒకటవ హెన్రీ (Henry I) పరిపాలనలోని మూడవ సంవత్సరమునందు అనగా క్రీ.శ. 1103 లో “పరిశుద్ధుడైన బర్తలోమయి” అను పేరుగల ఒక వైద్యశాల స్మిత్ ఫీల్డ్ పట్టణములో స్థాపించబడెను. ఈ వైద్యశాల నిర్మాణము రాజైన హెన్రీ ఆస్థాన సంగీత విద్వాంసుడైన రేయర్ (Rayer) చే ప్రారంభించబడి కొంతకాలమునకు రిచర్డ్ విట్టింగ్టన్ (Richard Whittington) అను లండన్ నగరపాలక అధ్యక్షునిచే పూర్తిచేయబడెను. ఈ స్మిత్ ఫీల్డ్ పట్టణములో సుమారు వంద సంవత్సరములకు పైగా రాజాజ్ఞలను అతిక్రమించినవారిని, ఇతర దుర్మార్గులను ఉరితీసి చంపిరి.

జాన్ బ్రాడి

రాజైన నాలుగవ హెన్రీ పరిపాలనా కాలములో అనగా క్రీ.శ. 1410, మార్చి నెల ఒకటవ తారీఖు శనివారము రోజున కేంటర్ ్బరి ఆర్చిబిషప్ థామస్ అరుండేల్, దర్జీగా పనిచేయుచున్న జాన్ బ్రాడి (John Brady) ని “పవిత్రపరచబడిన సంస్కార ములో క్రీస్తుయొక్క నిజ ప్రత్యక్షత ఉన్నదా?” అని ప్రశ్నించెను. అందుకు బ్రాడి ఏ పాస్టరుకూడ ప్రార్థనచేసి రొట్టె, ద్రాక్షారసములను క్రీస్తు శరీరముగా మార్చుట అసాధ్యమని జవాబు చెప్పెను. బ్రాడి తన నమ్మకములను మార్చుకొనకపోగా ఇతరులనుకూడా అదేవిధముగా నమ్మునట్లు చేయుటకు ప్రయత్నించుచున్నాడని ఆర్చిబిషప్ గమనించి బ్రాడిని బహిరంగ మతద్రోహి అని నిందించి అతనిని రాజకీయ అధికారులకు అప్పగించెను.

ఈ విషయములు ఉదయము జరుగగా మధ్యాహ్నమునకు బ్రాడిని కాల్చి చంపుడని రాజాజ్ఞ జారీయైనది. వెంటనే బ్రాడిని స్మిత్ ఫీల్డ్కు తీసుకొనివెళ్లి ఖాళీ పీపాలో ఉంచి ఉరికొయ్యకు ఇనుప గొలుసులతో కట్టి, అతని చుట్టూ ఎండిన కట్టెలు పేర్చిరి. విధముగ బ్రాడి నిలువబడియున్నప్పుడు రాజుయొక్క జ్యేష్ఠ కుమారుడు మరియు సింహాసనమునకు వారసుడైన ఆరవ హెన్రీ అక్కడ ఉండుట తటస్థించి, బ్రాడి ప్రాణమును రక్షించుటకు ఏదేని ఒక మార్గమును అన్వేషించసాగెను.

ఈ లోపు, పరిశుద్ధుడైన బర్తలోమయి దేవాలయపు అధిపతి జ్యోతులను చేపట్టిన పన్నెండుమంది అనుచరులతో పెద్ద ఊరేగింపుగా పవిత్ర సంస్కారమును అచ్చటికి తీసుకొనివచ్చి జాన్ బ్రాడి ముందుంచి, దాని గురించి అతని నమ్మకమును మరల తెలిసికొనగోరెను. అందుకు బ్రాడి అది కేవలము పరిశుద్ధపరచబడిన రొట్టె మాత్రమేగాని క్రీస్తు శరీరము కాదను విషయము తాను సంపూర్ణముగా ఎరుగుదునని జవాబు చెప్పగా, ఆ మాటలకు వెంటనే వారతనికి నిప్పు ముట్టించిరి.

ఆ అమాయకపు ఆత్మకు నిప్పు సెగ తగిలినప్పుడు, ‘కరుణింపుము!’ అని కేకవేసెను. అతడు ప్రభువును ప్రార్థించెను, అతని అరుపు భయంకరమైన శబ్దముతో ఉన్నందున యువరాజైన ఆరవ హెన్రీ నిప్పును ఆర్పివేయుడని ఆజ్ఞాపించి ‘నీ మత ద్రోహమును విడిచిపెట్టుటకు ఇష్టపడుచున్నావా?’ అని బ్రాడిని ప్రశ్నించెను. అతడు అంగీకరించి నట్లయితే జీవించుటకు అవసరమైన అన్ని సదుపాయములు తాము కల్పించెదమని, రాజుగారి ఖజానానుండి సాంవత్సరిక వేతనమునుకూడ ఇచ్చెదమని చెప్పెను.

అయితే క్రీస్తుయొక్క పరాక్రమముగల యోధుడైన బ్రాడి యువరాజు మాటలను లెక్కచేయక, తనకు కల్పించెదమన్న సౌకర్యములను తిరస్కరించి, గొప్ప విగ్రహా రాధనను, దుష్టత్వమును ఒప్పుకొనుటకు బదులు ఎంతటి భయంకరమైన హింసల నైననూ సహించుటకే నిశ్చయించుకొనెను. అందుచే యువరాజు బ్రాడిని మరలా అగ్నిలోనికి విసరివేయుడని ఆజ్ఞాపించెను. అయిననూ బ్రాడి క్రీస్తునందు తన నమ్మకములను విసర్జించక అంతమువరకు ధైర్యముగా నిలువబడెను.

విలియమ్ స్వీటింగ్, జాన్ బ్రూస్టర్

గతములో ఒకసారి ఈ ఇద్దరు మనుష్యులు మతద్రోహనేరము చేసిరని ఋజువై నందున వారు మతద్రోహులని అందరికి తెలియునట్లు కేథలిక్ ప్రతిమలు చిత్రీకరించ బడిన చిహ్నములను ధరింపవలెనని ఆజ్ఞాపింపబడిరి. అయితే కొంతకాలమునకు ఆ చిహ్నములను ధరించుట మానినందున వారిని తిరిగి నిర్బంధించి, పరిశుద్ధ సంస్కారమును గురించి వారి నమ్మకములు రోమ్ యొక్క ఉపదేశములకు భిన్నముగా ఉన్నవని, వారు నిషేధింపబడిన పుస్తకములను చదువుచున్నారని మరియు మత ద్రోహులతో స్నేహము చేయుచున్నారను నేరములు వారిపై మోపి, వారిద్దరిని కలిపి క్రీ.శ. 1511 అక్టోబరు 18వ తేదీన సజీవదహనము చేసిరి.

జాన్ స్టిల్మన్

క్రీ.శ. 1518 లో జాన్ స్టిల్మన్ (John Stilman) బహిరంగముగా కేథలిక్ విగ్రహారాధనకు వ్యతిరేకముగా మాట్లాడినందున, పవిత్రపరచబడిన సంస్కారములో క్రీస్తు ప్రత్యక్షతలేదని తృణీకరించుటవలన మరియు జాన్ విక్లిఫ్ను ఘనముగా పొగడినందువలన బిషప్ సభ అతనిని దోషిగా తీర్చి, లండన్ న్యాయాధికారులకు అప్పగింపగా వారు స్మిత్ ఫీల్డులో జాన్ స్టిల్మన్ ను సజీవ దహనము గావించిరి.

జాన్ లాంబర్ట్

జాన్ లాంబర్ట్ (John Lambert) నార్ఫోక్ (Norfolk) పట్టణములో జన్మిం చెను. అతడు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయములో ఉన్నత విద్యను అభ్యసించి లాటిన్, గ్రీకు భాషలలో గొప్ప పాండిత్యమును సంపాదించెను. ఆ కాలములో ఇంగ్లాండులో నెలకొన్న తీవ్రపరిస్థితులవలన లాంబర్ట్ ఇంగ్లాండును వదలి ఐరోపా వెళ్లి ఇక్కడ టిండేల్, ఫ్రిడ్జ్లతో కలసి ఒక సంవత్సరము నివసించెను.

ఆ సమయములో ఆంట్వెర్స్ లోని ‘ఇంగ్లీష్ హౌస్’ (దౌత్య కార్యాలయమువంటిది) లో పాదిరిగా పనిచేసెను. అక్క డున్నప్పుడు సర్ థామస్ మోర్, బార్లో (Barlow) అనువారు ఇతనిపై ఇంగ్లాండునకు ఫిర్యాదుచేసి మరింత కష్టపెట్టిరి. ఇది జరిగిన కొద్దికాలమునకే ఇంగ్లాండు అధికారులు లాంబర్ను ఆంట్వెరున్నుండి లండన్కు తీసుకొనివెళ్లి విచారణ నిమిత్తము కేంటర్ బరీ ఆర్చిబిషప్ వార్హమ్ యెదుట హాజరుపరచిరి.

విచారణ జరుగుచున్న కాలములో ఆర్చిబిషప్ చనిపోయినందువలన లాంబర్ట్క కొంతకాలము స్వేచ్ఛ లభించెను. అందుచే అతడు లండన్ తిరిగివెళ్లి చిన్న పిల్లలకు గ్రీకు, లాటిన్ భాషలు బోధించు ఉపాధ్యాయునిగా పనిచేయుట ప్రారంభించెను. ఆ సమయములో లాంబర్ట్కు కేథలిక్ పరిశుద్ధ సంస్కారములో నమ్మకము లేదనెడి విషయము రాజైన ఎనిమిదవ హెన్రీకి తెలియబడగ అతడు లాంబర్ట్ను తనయెదుట హాజరుకావల్సినదిగా ఆజ్ఞాపించెను. రాజాజ్ఞ ప్రకారము లాంబర్ట్ అతనియెదుట హాజరైనప్పుడు రాజు కోపముతో “నీ పేరేమిటి?” అని ప్రశ్నించెను.

క్రీస్తువంటి వినయముగల లాంబర్ట్ గొట్టెపిల్లవలె రాజుయెదుట ఒంటికాలుపై మోకరించి, “నా పేరు జాన్ నికోల్సన్ (John Nicholson), అయినను అందరు నన్ను లాంబర్ట్ అని పిలచెదరు” అని జవాబివ్వగ, రాజు, “ఏమిటి, నీకు రెండు పేర్లున్నవా? నీవు రెండు పేర్లు కల్గియున్నందున నేను నిన్ను నమ్మను” అనెను.

అందుకు లాంబర్ట్, “ఓ ఘనతగలిగిన యువరాజా! నా పేరు మార్చుకొనుట అవసరమని మీ బిషప్లు నన్ను బలవంతము చేసిరి” అని జవాబిచ్చెను. ఈ విధముగా వారు కొంతసేపు మాట్లాడుకొనిన తరువాత రాజు పరిశుద్ధ సంస్కారమునుగురించి నీవు కచ్చితముగ నమ్ముచున్నదేమిటో బహిరంగముగ తెలియజేయుమని లాంబర్ట్ను ఆజ్ఞాపించెను.

“నా సమాధానము పరిశుద్ధుడైన అగస్టీన్ సమాధానము వంటిది

రాజు తన స్థాయికి తక్కువగ భావించక వివాదాస్పదమైన మత విషయములను విని అర్థము చేసికొనునట్లుగా అతని హృదయమును ప్రభావితము చేసినందుకు లాంబర్ట్ మొదట దేవునికి వందనములు చెల్లించుచుండగ, రాజు కోపముతో లాంబర్ట్న అడ్డుకొని, “నన్నుగూర్చిన పొగడ్తలు వినుటకు నేనిక్కడకు రాలేదు. అధిక ప్రసంగములు చేయకుండ పరిశుద్ధ సంస్కారమును అది క్రీస్తు శరీరమేనా లేక అట్లు కాదని గూర్చి క్లుప్తముగ జవాబు చెప్పుము తృణీకరించెదవా, నీవేమి చెప్పుదువు?” అని ప్రశ్నించెను.

అంతట రాజు “పరిశుద్ధుడైన అగస్టీన్ లేక ఇతరులు సమాధానములు నాకు చెప్పవద్దు. నీవు దానిని క్రీస్తు శరీరమందువా, లేక కాదని అందువా, నాకు స్పష్టముగా చెప్పుము” అని ప్రశ్నించెను. అందుకు లాంబర్ట్ “అట్లయిన అది క్రీస్తు శరీరమని నేను ఒప్పుకొనను” అని ప్రత్యుత్తరమిచ్చెను.

“అయితే జ్ఞాపకముంచుకొనుము, ఇప్పుడు నీవు ‘ఇది నా శరీరము’ అని క్రీస్తు పలికిన పరిశుద్ధ లేఖనముల ప్రకారము దండింపబడుదువు” అని రాజు పలికి, లాంబర్ట్ దృఢముగ నమ్ముచున్న అభిప్రాయములు సరియైనవి కావని నిరూపించుమని ఆర్చిబిషప్ క్రాన మర్ను ఆదేశించెను. (క్రాన్మర్ అప్పటికి ప్రొటెస్టంట్ సంస్కరణ సిద్ధాంతములవైపు మార్పు చెందలేదు).

క్రాన్ మర్ అనేక విధములుగ ప్రయత్నించినను లాంబర్ట్ అభిప్రాయములు సరియైనవి కావని నిరూపించలేకపోయెను. అతడు చెప్పినవాటియందు శక్తిలేదు, అవన్నియూ దేవుని సత్య వాక్యమునకు విరుద్ధముగా ఉన్నవి. చివరకు, పగలంతయు గడిచి దీపములుకూడ వెలిగించినందున రాజు ఆ చర్చను ముగింప తలంచి “ఈ జ్ఞానముగల మనుష్యుల మాటలకు, ఆలోచనలకు నీవేమి చెప్పుదువు. నీవు జీవించుటకు ఇష్టపడుచున్నావా లేక మరణించుటకా? ఏమి చెప్పుదువు? నీకు స్వేచ్ఛ ఉన్నది” అని ప్రశ్నించెను.

అందుకు లాంబర్ట్, “రాజైన మీ ఇష్టమునకు సంపూర్ణముగా లోబడుచున్నాను” అని జవాబివ్వగా, “నాకు కాదు దేవుని చేతులకు నిన్ను నీవు అప్పగించుకొనుము” అని రాజు పలికెను. “నా ఆత్మను దేవుని చేతులకు అప్పగించితిని, కాని నా శరీరమును మాత్రము సంపూర్ణముగా మీకు సమర్పించుచున్నాను” అని లాంబర్ట్ సమాధానమిచ్చెను.

అందుకు రాజు “నీ అంతట నీవు నా తీర్పునకు అప్పగించుకొంటే నీవు కచ్చితముగా చనిపోవలయును. ఎందుకనగా, నేను మతద్రోహుల సంరక్షకుడను కాదు” అని చెప్పి, థామస్ క్రామ్వల్వైపు తిరిగి, “క్రామ్వెల్! ఇతనికి వ్యతిరేకముగా మరణ శాసనమును చదువుము” అని చెప్పెను.

క్రామ్వల్ మరణ శాసనమును చదివిన వెంటనే లాంబర్ట్ను సజీవ దహనము చేయుటకు స్మిత్ ఫీల్డు తీసికొని వెళ్లిరి. ఈ విధముగా సజీవ దహనము గావింపబడు వారిని చూచుటకు వచ్చినట్లు లాంబర్ట్ను సజీవ దహనము చేయు సమయములోకూడా అనేకమంది లండన్ పౌరులు కొందరు స్నేహితులుగా, కొందరు విరోధులుగా మరియు కొందరు అధికారులు తమ వృత్తి ధర్మము నిర్వర్తించుటకు సమావేశమైరి. ఆ విధముగా సమావేశమైనవారిలో కేంటర్ ్బరి ఆర్చిబిషప్ థామస్ క్రాన్మర్ మరియు రాజుయొక్క ముఖ్యమంత్రి థామస్ క్రామ్వల్లు కూడా ఉండిరి.

స్మిత్ఫీల్డ్లో సజీవ దహనము చేయబడినవారిలో ధన్యుడైన ఈ హతసాక్షికంటే భయంకరముగను, నిర్దయగను చంపబడినవారు మరి ఎవరూ లేరు. అతని కాళ్లు పూర్తిగా మొండెమువరకు కాలిన తరువాత హింసకులు అగ్నిని చాలవరకు తొలగించి కొంచెము మంటను మాత్రమే అతని క్రింది భాగము కాలునట్లు ఉంచిరి. వారిలో ఇద్దరు అతనికి ఇరువైపులా నిలిచి పొడవైన ఈటెలతో అతడు అగ్నిలో పడకుండా అతని శరీరముయొక్క పై భాగమును బంధించిన స్తంభమునకు నొక్కిపట్టి ఉంచిరి.

నిస్సహాయుడైన జాన్ లాంబర్ట్ ఆ విధముగా వ్రేలాడుట చూచిన ప్రజలు సానుభూతితో విలపించిరి. అతని వ్రేళ్లచివరి భాగములనున్న క్రొవ్వుకు అగ్నితగిలి మండుచుండగా అతడు తన చేతులను ఆకాశమువైపు ఎత్తి ప్రజలకు ఈ విధముగా చెప్పెను, “క్రీస్తు తప్ప మరెవరును లేరు, క్రీస్తు తప్ప మరెవరును లేరు”. అంతట కాల్చుచున్నవారు నొక్కిపట్టి ఉంచిన తమ బల్లెములను తొలగించగా లాంబర్ట్ క్రింద మండుచున్న అగ్నిలో పడి తన ప్రాణమును క్రీస్తుకు అప్పగించెను.

ఆనీ ఆస్క్యూ

లింకన్ షైర్ యోధుడైన సర్ విలియమ్ ఆస్క్యూ కుమార్తెయైన శ్రీమతి ఆనీ ఆస్క్యూ (Anne Askew) రోమన్ కేథలిక్ సిద్ధాంతములను ద్వేషించినదను నేరముపై ఆమెను బంధించి అనేక విధములుగ చిత్రహింసలకు గురిచేసి స్మిత్ ఫీల్డ్లో సజీవదహనము గావింపవలసినదిగ తీర్పుచెప్పిరి.

అనేక భయంకర చిత్రహింసలకు గురియై నడువలేని స్థితిలోనున్న ఆనీ ఆస్క్యూను ఒక కుర్చీలో కూర్చుండబెట్టి స్మిత్ ఫీల్డనకు తీసికొనివచ్చి గొలుసులతో ఆమె శరీరమును ఉరికంబమునకు బిగుతుగా కట్టిరి. అనేకమంది ప్రజలు అచ్చట చేరుటచే వారిని అదుపుచేయుటకు చుట్టూ దడికట్టిరి. రియోత్స్ (Wriothesley) అను ఇంగ్లాండు న్యాయాధిపతి, నార్ఫోక్ ప్రభువు, బెడ్ఫోర్డ్ ప్రభువు, లార్డ్ మేయర్ మొదలగు అనేకమంది ప్రభువులు ఆ దృశ్యమును చూచుటకు పరి.

బర్తలోమయి దేవాలయమునందలి ప్రాంగణమునకు చేరిరి. వీరందరు ఆనీ ఆస్క్యూ సజీవ దహనము గావింపబడు స్థలమునకు దగ్గరగా వేయబడిన బల్లపై కూర్చుండిరి. వారిలో ఒకరు ఆమెచుట్టూ పేర్చబడిన కట్టెలపై తుపాకీ మందు కలదని విని, భయముతో నిప్పుముట్టించబోవు సమయమున అది పేలి తమమీదికి వచ్చునని హెచ్చరించెను.

అయితే కట్టెలమీద తుపాకీ మందు ఉంచబడలేదని, త్వరగా కాలుటకు ఆనీ ఆస్క్యూ శరీరముమీదనే ఉంచబడినదని బెడ్ఫోర్డ్ ప్రభువు చెప్పెను. అప్పుడు ప్రధాన న్యాయాధిపతియైన రియోత్లో తన విశ్వాసమునుండి ఆనీ ఆస్క్యూ వెనుతిరిగినట్లయితే రాజు ఆమెను క్షమించునని చివరిగా ఒక అవకాశమిచ్చెను.

అయితే ఆమె “నా విశ్వాసమును వదలుకొనుటకంటే నేను చనిపోవుటకు ఇష్టపడు చున్నాను, నా ప్రభువును తిరస్కరించుటకు నేను స్మిత్ఫల్డ్ రాలేదని” జవాబు చెప్పెను. ఈ విధముగా యోగ్యురాలైన ఆనీ ఆస్క్యూ మంటలలో సజీవముగా దహింపబడి క్రైస్తవులందరూ అనుసరించదగిన విశ్వాసముతోకూడిన గొప్ప మాదిరిని చూపించి, దేవునికి ఆశీర్వాదకరమైన త్యాగముగా క్రీ.శ. 1546 లో ప్రభువునందు నిద్రించెను.

ఏడుగురు హతసాక్షులు కలసి బాధననుభవించుట

స్మిత్ ఫీల్డ్ ను, మరి అనేక ఇతర స్థలములలోను సజీవ దహనము చేయబడిన హతసాక్షుల కథలను లేక వారి పేర్లను స్థలాభావమువలన ఈ గ్రంథములో సంపూర్తిగా వ్రాయుటకు వీలుపడలేదు. ప్రభువైన యేసునుగూర్చి యోహాను చెప్పిన విధముగా హతసాక్షుల విషయములోకూడా చెప్పుట సరిగానుండును.

యోహాను 21-25

అదే విధముగా హతసాక్షులుకూడ లెక్కించలేనంతమంది కలరు. వారందరినిగూర్చి దేవునికి మాత్రము తెలియును. కొందరి పేర్లు మాత్రమే ఇక్కడ వ్రాయుచున్నాము. వారు థామస్ మేన్ (Thomas Man), జాన్ లాసెల్స్ (John Lacels), జాన్ ఆడమ్స్ (John Adams), నీకొలాస్ బెలేనియన్ (Nicholas Belenian), జాన్ బ్రాడ్ఫోర్డ్ (John Bradford), జాన్ లీఫ్ (John Leaf), జాన్ ఫిల్పాట్ (John Philpot), థామస్ లా (Thomas Loseby), హెన్రీ రామ్సే (Henry Ramsey), థామస్ తిర్టెల్ (Thomas Thirtel), మార్గరెట్ హైడ్ (Margaret Hide), ఆగ్నెస్ స్టాన్లీ (Agnes Stanley), జాన్ హలింగ్దేల్ (John Hallingdale), విలియమ్ స్పేరో (William Sparrow), రిచర్డ్ గిబ్సన్ (Richard Gibson), హెన్రీ పాండ్ (Henry Pond), రెయినాల్డ్ ఈస్ట్ లాండ్ (Reinald Eastland), రాబర్ట్ సౌతామ్ (Robert Southam), మాథ్యూ రికర్బీ (Matthew Ricarby), జాన్ ఫ్లాయిడ్ (John Floyd), జాన్ హాలిడే (John Holiday), రోజర్ హాలెండ్ (Roger Holland) – మరియు క్రీ.శ. 1556 జనవరి 27వ తేదీన కాల్చబడిన మరి యేడుగురు.

క్రీ.శ. 1556 లో ఆ దినమున రాణియైన మొదటి మేరి పరిపాలనలో బోధకుడైన థామస్ విఠిల్ (Thomas Whittle), బార్లెట్ గ్రీన్ (Bartlet Green) అను పెద్ద మనుష్యుడు, జాన్ టడ్సన్ (John Tudson) మరియు జాన్ వెస్ట్ (John Went) అను శిల్పులను, భార్యాభర్తలైన థామస్ బ్రౌన్ (Thomas Browne) ఇసబెల్ ఫోస్టర్ (Isabel Foster) మరియు వీరి దాసియైన జోన్ లాష్ఫోర్డ్ (Joan Lashford) మొదలగువారందరిని కలిపి ఒకేసారి సజీవ దహనము చేసిరి.

వీరిలో కొందరి వృత్తాంతములనుగూర్చి కొద్ది సమాచారముమాత్రమే మనయొద్ద గలదు. లండన్ బిషప్ యైన బోనర్, థామస్ విరిల్ను అతి క్రూరముగా హింసించి, అతని ముఖముమీద పలుమార్లు కొట్టుటచే అది గుర్తుపట్టలేని విధముగా మారెను. ఒక స్నేహితునికి విఠిల్ ఈ విధముగా వ్రాసెను – “బిషప్ నన్ను పోర్టర్ అను వసతి గృహమునకు పంపించగా, అక్కడ రాత్రంతయూ నేలపైనున్న గడ్డిచాపమీద పరుంటిని. నా జీవితమంతటిలో అంతటి బాధాకరమైన రాత్రిని యెరుగను.

తరువాత బిషప్ యెదుటికి నేను వచ్చినప్పుడు, ‘నేను పిలిచినట్లయితే నీవు కేథలిక్ ఆరాధనకు వచ్చెదవా?” అని అతడు ప్రశ్నించెను. అందుకు నేను ‘నీవు పిలిచినట్లయితే నీ ఆజ్ఞ ప్రకారము తప్పనిసరిగా వచ్చెదను, కాని ఇష్టపూర్వకముగామాత్రము రాను’ అని సమాధానమిచ్చితిని. దానికి కోపోద్రేకుడైన బిషప్ అతని పిడికిలితో నా ముఖముపై కొట్టి చిన్న గదిలో నన్ను బంధించెను.

అక్కడ చాపగాని, దిండుగాని లేకుండా రెండు రాత్రులు గడపవలసివచ్చినది. అయిననూ నేను నేలమీద చక్కగా నిద్రపోతిని. దేవునికి వందనములు.” ప్రభువు కృపనుబట్టి విరిల్ తన విశ్వాసములో స్థిరముగా నిలిచియున్నందున మిగిలిన ఆరుగురితోపాటు అతనిని అగ్నియొద్దకు తీసికొనివచ్చిరి.

బార్లెట్ గ్రీన్ మంచి కుటుంబమునకు చెందినవాడు. అతడు ఆక్స్ఫర్డ్ విశ్వ విద్యాలయములో ఉన్నత విద్య నభ్యసించెను. విద్యార్థిగా అతడక్కడ ఉన్నప్పుడు తరచు పీటర్ మార్టిర్ (Peter Martyr) ఉపన్యాసములకు హాజరై క్రీస్తు సువార్తలోని నిజ వెలుగును గ్రహించెను. క్రీ.శ. 1556 జనవరి 15వ తేదీన అతడు నిర్బంధింపబడి మతద్రోహిగా దండించబడెను.

న్యూ గేట్ చెరసాలకు అతడు తీసుకొనిపోబడినప్పుడు, హింసింపబడుచున్న తమ సహోదరుని ఓదార్చవచ్చునను ఆశతో ఇద్దరు స్నేహితులు అతనిని కలసిరి. వారి హృదయములు స్నేహముతోను, ప్రేమతోను నిండి గ్రీన్ కొరకు ఏడ్చుచుండగా, గ్రీన్ వారితో ఇట్లనెను, “ఓ, నా స్నేహితులారా! నేను హృదయ భారముతో నున్నప్పుడు మీరు వచ్చి నాకిచ్చు ఆదరణ ఇదేనా? నన్ను ఆదరించి సేవచేయుటకు బదులు మిమ్మును మీరే ఓదార్చుకొనుచున్నారా?”

బిషప్ బోనర్ గ్రీన్ను ఇనుప దండముతో కొట్టుచున్నప్పుడు అతడు అధికముగా సంతోషించెను. అతడు ఇన్ని బాధలననుభవించినను వాటినిగూర్చి ఎక్కడను చెప్పలేదు. ఎందుకనగా అది తనను తాను ఘనపరచుకొనినట్లుండునని గ్రీన్ భావించెను. సజీవ దహనము గావింపబడుటకు ముందు తన స్నేహితుడైన మిస్టర్ కాటన్కుమాత్రమే కొంతవరకు చెప్పెను.

థామస్ బ్రౌన్ ఫ్లీట్ స్ట్రీట్ ని పరి. బ్రిడ్స్ (St. Bride’s) గురుమండలములో నివసించెను.

ఆరాధనకు గురుమండలపు దేవాలయమునకు వెళ్లకపోవుటవలన అచ్చటి పోలీసులు అతనిని బంధించి బిషప్ బోనర్ వద్దకు తీసుకొని వెళ్లిరి. అతడు థామస్ బ్రౌన్ు దేవాలయమునకు తీసుకొనివెళ్లి ఆరాధన చేయమనగా అతడు తిరస్కరించి, ఒక తోటలోనికి వెళ్లి చెట్ల మధ్య మోకరించెను. దీనికి బిషప్ బోనర్ అతనిని గట్టిగా మందలించి, “బ్రౌన్, నా యెదుట అనేక పర్యాయములు నీపై నేరారోపణ మోపబడెను. నీ పొరపాట్లనుండి నిన్ను మళ్లించుటకు నేనెంతో కష్టపడితిని. అయిననూ నీవు, నీవంటివారనేకులు నేను రక్త దాహముగలవాడనై మిమ్ములను చంప ప్రయత్నించు చున్నానని చెప్పుచుంటిరి” అనెను.

అందుకు బ్రౌన్, “అవును, నా ప్రభువా, నిజముగా నీవు రక్తపిపాసివి. సముద్రపు నీటివలె నీవు పీల్చుకొనగలిగినంత రక్తము నాలో ఉన్నది” అని జవాబిచ్చెను. బ్రౌన్ సమాధానము వినిన బోనర్ కోపోద్రేకుడై అతనిని కాల్చి చంపుమని తీర్పు చెప్పెను.

జోన్ లాష్ఫోర్డ్ కమ్మరివాడైన రాబర్ట్ వార్న్ కుమార్తె. రాబర్ట్ వార్న్ దేవుని సత్య సువార్తకొరకు హింసింపబడి కొద్దికాలము క్రితము సజీవ దహనముగావించబడెను. ఇతని భార్యయైన ఎలిజబెత్ వార్న్ క్రీ.శ 1555 జనవరి 1వ తేదీన లండన్లోని బౌ చర్చి యార్డులో తొమ్మిదిమందితో పాటు ఒక ఇంటిలో సమావేశమైనప్పుడు బంధింపబడెను.

జూన్ 11 వరకు ఆమె టవర్ జైలులో ఉంచబడినది, తరువాత న్యూ గేట్ జైలునకు బదిలీచేయబడగా అక్కడ జూలై 2వ తేది వరకు ఆమె ఉండెను. జూలై 6వ తేదీన ఈ పదిమంది ఖైదీలు బిషప్ బోనర్దుటకు తేబడిరి. వీరందరిని న్యాయ విచారణ చేయకుండనే అతి క్రూరముగా హింసించిరి.

ఈ తొమ్మిదిమంది పేర్లు ఏమనగా జార్జ్ టంకర్విల్ (George Tankervil), రాబర్ట్ స్మిత్ (Robert Smith), థామస్ ఫస్ట్ (Thomas Fust), థామస్ లేస్ (Thomas Leyes), జాన్వేడ్ (John Wade), స్టీఫెన్ వేడ్ (Stephen Wade), జార్జి కింగ్ (George King), విలియం హాల్ (William Hall), మరియు జోన్ లాష్ఫోర్డ్ (Joan Lashford).

వారిమీద మోపిన నేరములు ఏమనగా పవిత్రపరచబడిన సంస్కారము క్రీస్తుయొక్క నిజమైన శరీరమని నమ్మకపోవుట, కేథలిక్ ఆరాధనకు హాజరుకాకుండుట, అందుకు వ్యతిరేకముగ మాటలాడుట, సంప్రదాయక రోమా పండుగలకు, ఆచారములకు, సంస్కారములకు వ్యతిరేకముగా మాట్లాడుట. ఎలిజబెత్ ను బిషప్ నొద్దకు తీసికొని వచ్చి కాల్చెదమని బెదిరించినప్పుడు ఆమె అతనితో, క్రీ.శ. 1555 జూలై 12వ తేదీన ఆమెయు, ఆమెతోపాటుగల తొమ్మిదిమందిలో ఎనిమిదిమంది మత ద్రోహులుగా తీర్పుతీర్చబడి మరుసటి నెలలో స్ట్రాట్ఫోర్డ్-లీ-బో (Stratford-le-Bow) వద్ద సజీవ దహనము చేయబడిరి.

నీవు చేయవలసినది చేయుము, నేనుమాత్రము క్రీస్తును తిరస్కరింపను

వీరితోపాటు ఆ సమయమున కాల్చబడని పదియవ వ్యక్తి ఎలిజబెత్ కుమార్తెయైన జోన్. కొంతకాలముపాటు ఆమెను విడుదలచేసి మరల కొన్ని నెలల అనంతరము తిరిగి బంధించిరి. బిషప్ బోనర్ ఆమెను పరీక్షించినప్పుడు ఆమె తాను పోప్ల బలిపూజకు హాజరుకానని, యాజకునియెదుట తన పాపములను ఒప్పుకొననని ధైర్యముగా ప్రకటించగా, ఆమె తల్లి సజీవదహనము గావింపబడిన ఆరు నెలల తరువాత జోన్ స్తంభమునకు కట్టబడి కాల్చివేయబడినది.

తెలియని ఐదు కథలు

ఫాక్స్ యొక్క క్రైస్తవ హతసాక్షుల గ్రంథమునకు దృష్టాంతములను వెదకు చున్నప్పుడు, ఐదుగురు క్రైస్తవులు హతసాక్షి మరణములను వివరించుచు చెక్కబడిన ఐదు రాగి చిత్తరువులను కనుగొంటిమి, అవి విఠాలస్ (Vitalus), శార్టింగ్కు చెందిన ఉల్ఫ్ంగ్ బిండర్ (Wolfgang Binder), హెన్రిక్ ప్రుయిజ్ (Hendrik Pruijt), జాన్ బ్రెట్ (John Bret), మరియు మత్తీయాస్ మేర్ (Matthais Mayr). ఆ సమయములో చాల తక్కువ సమాచారముమాత్రమే మాకు లభించినది. అయిననూ, ఆ రాగి చిత్తరువులను చేర్చవలెనని మేము నిశ్చయించుకొంటిమి, ఎందుకనగా వారు హింసించబడి చంపబడిన విధానము వేలకొలది హతసాక్షులు హింసింపబడి చంప బడిన విధానమునకు ఆదర్శమైనది. జ్ఞాపకముంచుకొనుటకు వారు అర్హులు.

విఠాలస్

విఠాలస్ (పటము 9 చూడుము) ఇటలీలోని రవెన్నాలో క్రీ.శ. 99 సంవత్సరములో సజీవముగా సమాధిచేయబడెను.

ఉల్ఫ్ గాంగ్ బిండర్

శార్డింగ్కు చెందిన ఉల్ఫ్ంగ్ బిండర్ (పటము 11 చూడుము) జర్మనీలోని బవేరియాలో క్రీ.శ. 1571 లో శిరచ్ఛేదము చేయబడెను.

క్రీ.శ. 1574 లో వర్కుమ్ (Workum) వెలుపట హెండ్రిక్ ఫ్రుయిజు (పటము 12 చూడుము) తారుపూసి, అతనిని చిన్న పడవకు కట్టి, నిప్పు ముట్టించి ఆ పడవను నీటిలోనికి త్రోసివేసిరి.

జాన్ బ్రెట్

బెల్జియమ్ ని ఆంట్వెర్స్లో క్రీ.శ. 1576 లో జాన్ బ్రెట్ అను (పటము 13 చూడుము) ఆంగ్లేయుని నాలుకను ఎఱ్ఱగా కాల్చిన మేకులతో రంధ్రములు చేసి, తరువాత కొయ్యకు కట్టి కాల్చివేసిరి.

మత్తీయాస్ మేర్

వైర్ (Weir) పట్టణములో క్రీ.శ. 1592 లో మేర్ను (పటము 14 చూడుము) చేతులు వెనుకకు కట్టి, నీటిలో ముంచి చంపిరి.

జాన్ హూపర్ హతసాక్షి మరణము (క్రీ.శ. 1555)

జాన్ హూపర్ హతసాక్షి మరణము (క్రీ.శ. 1555)

జాన్ హూపర్ (John Hooper, Bishop of Worchester) ఇంగ్లాండులోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థి, పట్టభద్రుడు. అతడు విజ్ఞాన శాస్త్ర పఠనమును ముగించుచున్న సమయములో లేఖనములయెడల ప్రేమచేతను, వాటినిగూర్చిన జ్ఞానము సంపాదింపవలెనను బలమైన కోరికచేతను ప్రేరేపింపబడెను. దేవుని వాక్యమును ప్రార్థనపూర్వకముగా ఎక్కువ సమయము చదువుచు, పరిశోధించుటవలన పరిశుద్ధాత్మ కృపచేత నిజమైన పరిశుద్ధ మార్గమతనికి బయలుపరచబడెను.

దేవుని కృపలోను, ఆత్మీయ జ్ఞానములోను, భక్తిగల ప్రవర్తనలోను అతడు వర్ధిల్లు టనుబట్టి విశ్వవిద్యాలయములోని ఇతర మతప్రవిష్టుల ఆగ్రహము, ద్వేషములకు గురియై బహిష్కరింపబడెను. పిమ్మట అతడు సర్ థామస్ అరండెల్ (Sir Thomas Arundel) యొక్క ఆస్తి వ్యవహారములను పర్యవేక్షించుటకు నియమింపబడెను. అయితే హూపర్ మత సిద్ధాంతములనుగూర్చి తెలిసికొనిన అరండెల్ అతనిని ఆ ఉద్దేశ్యములనుండి మార్చుటకు విన్చెస్టర్ (Winchester) బిషప్ యొద్దకు పంపి, కొంతకాలమైన తరువాత హూపర్ను తిరిగి తనయొద్దకు పంపుమని బిషప్ను కోరెను.

విన్చెస్టర్ బిషప్ ఐదు దినములు హూపర్ చర్చించిననూ ఆ యౌవనస్థుని కొంచెమైననూ మార్చలేకపోయెను. హూపర్ ఉద్దేశ్యములను ఏమాత్రము మార్చలేక పోయిన ఆ బిషప్, అరండెల్ కోరికమేరకు హూపర్ను తిరిగి అతనియొద్దకు పంపించెను. బిషప్ హూపర్ యొక్క జ్ఞానమును, తెలివిని ప్రశంసించెను గాని అప్పటినుండి అతనియెడల ద్వేషభావము కలిగియుండెను.

కొద్దికాలమునకే అరండెల్కు తనపై అసూయపెరుగుటవలన, తన ప్రాణమునకు అనేక మార్గములనుండి ముప్పువాటిల్లెనని తలంచిన హూపర్, అతనియొద్ద ఉద్యోగము మానివేసి, కొన్నిదినములకు ముందు తాను ఉరిశిక్షపడకుండా కాపాడిన తన స్నేహితుని యొద్దనుండి ఒక గుఱ్ఱమును అరువుతీసుకొని ఫ్రాన్స్ వెళ్లుటకు సముద్ర తీరమున చేరి, పారిస్ వెళ్లెను.

పారిస్ లో కొంతకాలము గడిపిన తరువాత అతడు తిరిగి ఇంగ్లాండు చేరి మాస్టర్ సెంట్లో (Master Sentlow) అను ఒక వ్యక్తియొద్ద ఉద్యోగములో చేరెను. అచ్చటకూడ అతనికి తన సిద్ధాంతములవలన ప్రాణాపాయము ఏర్పడుటచే ఐర్లాండు, ఫ్రాన్స్ దేశములగుండా ప్రయాణించి జర్మనీకి వెళ్లి, అక్కడ బాసిల్ (Basil) నగరములోనూ, మరిముఖ్యముగ స్విడ్జర్లాండ్ లోని జ్యూరిక్ (Zurich) నగరమందు అనేకమంది వేదాంత పండితులను కలసికొనెను. అక్కడ మాస్టర్ బులింజర్ (Bullinger) తో స్నేహముచేసి, అచ్చటనే బర్గండియన్కు చెందిన ఒక స్త్రీని వివాహమాడి, హెబ్రీ భాషను కష్టపడి నేర్చుకొనసాగెను.

రాజైన ఎనిమిదవ హెన్రీ క్రీ.శ. 1547 జనవరి 28న మరణించెను. అదేరోజున అతని ఏకైక కుమారుడగు ఆరవ ఎడ్వర్డ్ ఇంగ్లాండుకు రాజయ్యెను. హెన్రీ రాజు చనిపోవుటకు కేవలము పది సంవత్సరముల ముందు అనగా క్రీ.శ. 1537 అక్టోబరు 12న అతని మూడవ భార్యయైన జేన్ సెమూర్ (Jane Seymour) కు జన్మించిన ఎడ్వర్డ్ యుక్త వయస్సు రానివాడగుటచే ఇంగ్లాండును పరిపాలించుటకు పదహారు మంది సభ్యులుగల సభను హెన్రీ ఏర్పాటుచేసెను.

కాని ఈ సభ ఏర్పడిన కొద్ది కాలమునకు ఎడ్వర్డ్ మేనమామ మరియు సోమర్సెట్ (Somerset) ప్రభువైన ఎడ్వర్డ్ సెమూర్ (Edward Seymour) ఎడ్వర్డ్కు సంరక్షకునిగా ప్రకటించుకొని ఇంగ్లాండును పరిపాలించుట ప్రారంభించెను. కాని రెండు సంవత్సరముల తరువాత క్రీ.శ 1549లో ఎడ్వర్డ్ సెమూర్ను అధికారమునుండి తొలగించి నార్తంబర్లాండ్ ప్రభువైన జాన్ డడ్లీ (John Dudley) రాజ ప్రతినిధిగా ఎడ్వర్డ్కు యుక్తవయస్సు వచ్చువరకు పరిపా లించుటకు అధికారము చేపట్టెను.

ఆరవ ఎడ్వర్డ్ రాజు ప్రొటెస్టంట్ గురువులవద్ద విద్యనభ్యసించిన ఫలితముగా ఇంగ్లాండు దేశపు సంఘములో ప్రొటెస్టంట్ సంస్కరణలను అభిమానించెను. ఎడ్వర్డ్ పరిపాలనలో ఆర్చిబిషప్ థామస్ క్రానమర్చే వివిధ గ్రంథములనుండి సంగ్రహించ బడిన సాధారణ ప్రార్థన గ్రంథము (Book of Common Prayer) మొదటిసారిగా ప్రచురింపబడెను.

ఎడ్వర్డ్ రాజుగా పరిపాలన

జ్యూరిక్లో అతని స్నేహితులు అతనియెడల చూపిన దయ, అభిమానములకు వారిని అభినందించి, కృతజ్ఞతలు తెలిపి తాను వెళ్లుచున్నానని వారికి చెప్పెను. దానికి జవాబుగా మాస్టర్ బులింజర్ హూపర్తో ఇట్లు చెప్పెను :

“మాస్టర్ హూపర్, మేము నీ సహవాసమును కోల్పోవుచున్నందుకు మాకు బాధగా ఉన్ననూ మేము సంతోషించుటకు గొప్ప కారణముకూడా ఉన్నది. క్రీస్తుయొక్క నిజమైన విశ్వాసమునిమిత్తము చాలాకాలము ప్రవా సములోనున్న నీవు స్వదేశమునకు తిరిగి వెళ్లుచున్నందుకు సంతోషించు చున్నాము. నీవు అచ్చట నీ వ్యక్తిగత స్వేచ్ఛను అనుభవించుటమాత్రమే కాదు గాని నీవలన అచ్చట క్రీస్తు సంఘము అభివృద్ధి చెందుననుటలో మాకు ఏవిధమైన సందేహము లేదు.

మేము నీనిమిత్తము ఎందుకు ఆనందించుచున్నామనగా నీవు చేదైన, ఆనందము లేని, మూర్ఖత్వము, అనాగరికమైన దేశమును వదలి స్వేచ్ఛ, సంతోషము, పాలు తేనెలు ప్రవహించు ఫలభరితమైన దేశమునకు వెళ్లు చున్నావు.

నీవు మాకు దూరమై అందుబాటులోలేక, ఐశ్వర్యము, ఆశీర్వాదము లతోకూడిన నీ క్రొత్త జీవితములో గొప్ప ధనికుడవై, బిషప్ అంతటివాడవై, నీ గౌరవము వృద్ధిపొంది, అనేకమంది నూతన స్నేహితులను సంపాదించుట వలన, నీ పాత పరిచయస్థులము, నీ క్షేమము కోరు మమ్ములను మరచిపోదు వేమో అను భయముతో పూర్తిగా ఆనందించలేకపోవుచున్నాము.

అయినను నీవు ఎంతవరకు మమ్మును మరచి, విసర్జించినను మేము మా పూర్వ స్నేహితుడు, మా తోటివాడునైన మాస్టర్ హూపర్ను మరచి పోలేమని నీవు కచ్చితముగా తెలిసికొనవలెను. మమ్ములను మరచి పోకుండుట నీకిష్టమైతే నీయొద్దనుండి క్షేమ సమాచారములు మాకు తెలియచేయవలెనని నిన్ను ప్రార్థించుచున్నాము.”

అందుకు హూపర్, “నా స్నేహితులు, శ్రేయోభిలాషులైన మిమ్ములను ఆ దేశములోని ఆనందముగాని, నూతన స్నేహితులుగాని మరచిపోవునట్లు నన్ను ప్రేరేపించలేవు. అప్పుడప్పుడు ఉత్తరములు వ్రాయుటద్వారా అక్కడి పరిస్థితులు మీకు తెలియజేసెదను. కాని అన్నిటికంటే చివరి వార్త నేను మీకు వ్రాయగలనా?” అని బదులు పలికి, మాస్టర్ బులింజర్ చేయిపట్టుకొని, “అక్కడ నేను అధికశ్రమలు పొందుదును, నేను కాల్చబడి బూడిదయైతినని మీరు వినెదరు” అని వారితో చెప్పెను.

హూపర్ లండన్ చేరిన వెంటనే ఎడతెగక బోధించుట ప్రారంభించెను. రోజుకు రెండుసార్లు, కనీసము ఒక్కసారైననూ బోధించకుండా ఉండలేదు. అతని ప్రసంగములు వినుటకు అనేకమంది ప్రజలు వచ్చుటచే చివర వచ్చివారికి దేవాలయములో స్థలము లేక వారు వాకిటనే నిలిచియుండవలసివచ్చెడిది. అతడు తన సిద్ధాంతములలో ఆరితేరిన వాడు, చక్కని వాగ్ధాటి, లేఖనములలో మంచి అనుభవము, బోధించుటలో అలుపెరుగనివాడు గనుక కొద్దికాలములోనే ప్రజలు అతడు బోధించుచున్న దేవాలయమునకు విపరీతముగా వచ్చుట ప్రారంభించిరి.

అతడు తన జీవితకార్యమును ఎట్లు ప్రారంభించెనో అట్లే అంతమువరకు దానిని కొనసాగించెను. శ్రమగాని, కష్టముగాని అతని పనిని నాశనము చేయలేకపోయెను. పదోన్నతి అతనిలో పరివర్తనము తేలేకపోయినది, రుచికరమైన భోజనములు అతనిని చెరిపివేయలేకపోయెను. ఎటువంటి నింద దరిచేర వీలుకానంతటి శ్రేష్ఠమైన, పవిత్రమైన జీవితమును అతడు జీవించెను.

శారీరకముగాను, మానసికముగాను అతడెంతో బలముగా నుండి ప్రతి విషయములోను యేసుక్రీస్తు సువార్తకు లోపములేని సేవకుడుగా నుండెను. అనేకమందికి అతడు చాలా కఠినముగా కనబడిననూ, అందరికీ బాగా తెలిసినవాడుగా ఉండవలెనని అతడు కోరుకొనెను. కాని అతడు తన పనిని చక్కగా ఎట్లు చేయవలెనో ఎరిగినవాడు. ఒకానొక సమయములో ఒక గొప్ప వ్యక్తి కొంత అసూయతోకూడిన మనస్సుతో హూపర్ ఇంటికి వెళ్లెను. అయితే హూపర్ యొక్క సామాన్య జీవితమును, అతని గాంభీర్యమును చూచి అతనితో మాటలాడు ధైర్యము లేక ఆ వ్యక్తి తనలోతాను సిగ్గుపడి తిరిగి వెళ్లెను.

కొంతకాలమైన తరువాత హూపర్ రాజుయెదుట బోధించుటకు పిలువబడి, రాజు మెప్పుపొంది, గ్లేసెస్టర్ పట్టణ బిషప్ (Gloucester) గా పదోన్నతి పొంది, అందు రెండు సంవత్సరములు పనిచేసెను. అచ్చట అతని శత్రువులుకూడా అతనిమీద దోషారోపణ చేయలేనంత మంచిగా పనిచేసెను. ఆ తరువాత అతడు వోర్చెస్టర్ బిషప్ గా నియమింపబడెను.

ఇంగ్లాండు సంఘము మతవిషయములయందు కొంత సంస్కరింపబడిననూ కేథలిక్ బిషప్లు కొన్ని పండుగల సమయములలో మరియు మూఢనమ్మకములు కలిగిన కొన్ని వేడుకల సమయములలో ఆడంబరమైన దుస్తులు ధరించుట చలామణిలో కలదు. వారు పెట్టుకొను టోపీ చతుర్భుజాకారముకలిగి ప్రపంచమునే నాలుగు భాగములుగా విభజించిరను సూచనకు సరిపోవును.

అట్టి వస్త్రములను ధరించుట హూపర్కు ఇష్టము లేదు. అందుచే అతడు బిషప్ పదవినుండి తనను తొలగించుమని, లేదా తాను పండుగ సమయములలో అట్టి ప్రత్యేక వస్త్రములను ధరింపకుండా ఉండుటకు అనుమతించవలెనని రాజును వేడుకొనెను. రాజు అతని మనవికి వెంటనే సమ్మతించెను.

ఇందుకు ఇతర బిషప్లు బలముగా వ్యతిరేకించిరి. పండుగ సమయములలో సంప్రదాయముగా వచ్చుచున్న ఆచార సూచకమైన వస్త్రములను కచ్చితముగ ధరింపవలెనని, ఇది చాల అల్పమైన విషయమని, దోషము వస్త్రములలో లేదని, వాటిని దుర్వినియోగపరచుటలోనే ఉన్నదని చెప్పిరి. ఇటువంటి సామాన్య విషయము లలో హూపర్ అంత మొండిగా ప్రవర్తించనవసరములేదని, తన యిష్టానుసారముగా ఉండెదనని పంతము పట్టుట అంగీకరింపబడదని చెప్పిరి.

వేడుక సమయములలో వస్త్రములను ధరించు విషయములో హూపర్కు, బిషప్లకు వాగ్వివాదము జరుగుటచే అనేకమంది మంచి క్రైస్తవులు బాధపడిరి. అయితే హూపర్ వ్యతిరేకులుమాత్రము సంతోషించిరి. తుదకు బిషప్లదే పైచేయి అయినందువలన హూపర్ కొన్ని సందర్భములలో ఇతర బిషప్లతో కలసి పండుగ వస్త్రములను ధరింపవలసి వచ్చెను. రాజు యెదుట ప్రసంగించవలసి వచ్చినప్పుడు అతడు పండుగ వస్త్రములను చతుర్భుజాకారము కలిగిన టోపీతోసహా ధరించి హాజరయ్యెను. కాని అది అతని తలమీద సరిగా అమరలేదు.

హూపర్ తన మందకు నిజమైన రక్షణ విషయములో తర్బీతునిచ్చుటకు సాధ్యమైన ప్రతి మార్గమును వెదకెను. అతడు పట్టణములను, గ్రామములను దర్శించి తన ప్రజలకు వాక్యమును ప్రకటించినట్లుగా – ఏ తండ్రి తన గృహములోనూ, ఏ తోటమాలి తన తోటలోనూ, ఏ పనివాడు తన ద్రాక్షాతోటలోను అంత మంచిగా పనిచేసియుండ లేదు.

అతనికి పని ఎక్కువగా లేనప్పుడు ప్రజల సమస్యలు వినుటయందును, పాఠశాలలను దర్శించుటయందును, వాక్యధ్యానము, ప్రార్థనలయందును తన సమయ మును గడుపుచుండెను. అతడు తన మందలోనివారిని ధనికులు పేదలు, యౌవనులు వృద్ధులు, అక్షరాస్యులు నిరక్షరాస్యులను భేదము లేకుండా అందరిని సమానముగా చూచెను.

సంఘమునకు, సంఘస్థులకు వెలుగుగాను

ఒక కుటుంబ యజమానిగా హూపర్ తన బిడ్డలకు క్రైస్తవ తర్బీతునిచ్చుటలో తగినంత సమయమును వెచ్చించెను. తనవలె వారును బాగుగా చదువుకొని మంచి మర్యాదలు కలిగి దేవుని వాక్యమును ప్రేమించువారుగా ఉండవలెనని అతడు కోరుకొనెను. ఎవరైన హూపర్ గృహములో ప్రవేశించినచో ఒక దేవాలయములో ప్రవేశించిన అనుభూతిని పొందెదరు.

దైవసంబంధమైన భక్తిభావములు, సత్య ప్రవర్తనతో కూడిన సంభాషణ, పరిశుద్ధ లేఖనముల పఠనము, దైవసంబంధమైన వాతావరణము ఆ యింట చూడగలరు. ఇవి తప్ప ఎటువంటి బుద్ధిహీనత లేక సోమరితనము, ఐశ్వర్యమును ప్రదర్శించుట, అవిధేయతతో కూడిన మాటలు, శాపములు అక్కడ ఎప్పుడూ ఉండవు.

వ్యక్తిగతమైన మరియు సంఘసంబంధమైన ఆర్థిక విషయములలో అతనినెవరూ నిందించలేరు. ప్రాథమిక కుటుంబ అవసరములకు మినహా, బిషప్ కార్యాలయము నుండి వచ్చు మిగతా ధనమంతటిని అతడు ఇతరులకు ఉపయోగించెను. తరచుగా ఆ ప్రాంతములోని భిక్షగాండ్రకు, పేదలకు గొప్ప విందులు చేసెడివాడు.

ప్రతిదినము కొంతమంది పేదలను తన ఇంటికి ఆహ్వానించి భోజనము పెట్టుటతోపాటు పరలోక భోజనమైన ప్రభువు ప్రార్ధన, పది ఆజ్ఞలు, విశ్వాససంబంధమైన కొన్ని విషయములు వారికి బోధించెడివాడు. వారి భోజనమైన తరువాతమాత్రమే అతడు కూర్చొని భోజనము చేసెడివాడు. అయితే హూపయ్యొక్క సత్క్రియలన్నియు త్వరలోనే ఆగిపోయెను.

ఆరవ ఎడ్వర్డ్ రాజు క్రీ.శ. 1552 నవంబరులో రోగగ్రస్థుడై తన పదహారవ జన్మదినమునకు మూడు మాసముల ముందు అనగా క్రీ.శ. 1553 జూలై 6న మరణించెను. నార్తంబర్లాండ్ ప్రభువైన జాన్ డడ్లీ ఎడ్వర్డు వరుసకు సోదరియైన జేన్ గ్రే (Lady Jane Grey) అను వనితను సింహాసనమెక్కించుటకు ప్రయత్నించి విఫలుడయ్యెను. ఈమె ప్రొటెస్టంట్ శాఖకు చెందిన యువతి. అయితే ఎడ్వర్డ్ సవతి తల్లి కుమార్తె మరియు రోమన్ కేథలిక్ శాఖకు చెందిన ఒకటవ మేరి (Mary I) రాణిగా సింహాసనమధిష్టించెను.

సింహాసన మధిష్టించిన వెంటనే, మేరి ఇంగ్లాండులో కేథలిక్ మతమును పూర్వ స్థితికి తెచ్చి, సంప్రదాయముగా వచ్చుచున్న మూఢనమ్మకములతో కూడిన ఆరాధనలను, పోప్ యొక్క అధికారమును పునరుద్ధరించెను. ఒక సంవత్సరము తరువాత పవిత్ర రోమా చక్రవర్తియైన ఐదవ చార్లెస్ కుమారుడును, భవిష్యత్తులో (1556) స్పెయిన్ రాజుగా నియమింపబడు రెండవ ఫిలిప్ (Philip II) ను ఆమె వివాహమాడెను. జీవితాంతమువరకు వారిద్దరూ కలసి ఇంగ్లాండును పరిపాలించిరి.

ఆమె తన పరిపాలనకాలములో సుమారు మూడు వందలమంది ప్రొటెస్టంట్ క్రైస్తవులను హింసించి, వారిని సజీవదహనము గావించెను. అందువలన ఆమెకు ‘రక్తపు మేరి’ (Bloody Mary) అను బిరుదు వచ్చెను.

రాణిగా ఆమెకు పట్టాభిషేకమైన కొద్దికాలమునకే తనయెదుట హాజరుకావలసి నదిగా తాకీదు పంపినవారిలో వోర్చెస్టర్ బిషప్ యైన జాన్ హూపర్ ఒకడు. అతని స్నేహితులైన అనేకమంది హూపర్ను పారిపోయి తన ప్రాణమును రక్షించుకొనుమని హెచ్చరించిరి.

తనయెడల రాణియైన మేరికి దురుద్దేశములు కలవని హూపర్ ఎరిగియున్ననూ అతడు ఇంగ్లాండును విడిచి పారిపోవుటకు ఇష్టపడలేదు. “ఒకప్పుడు నేను పారిపోతిని, కాని ఇప్పుడు జరుగవలసిన దుష్టకార్యములను ఎదుర్కొనుటకు సర్వసన్నద్ధుడనైయున్నాను. నేను నా గొజ్జెలతోనే జీవించెదను, నా గొజ్జెలతోనే మరణించెదను” అని పలికెను.

క్రీ.శ. 1553 సెప్టెంబరు 1వ తేదీన హూపర్ రాణీయెదుట హాజరయ్యెను. చీవాట్లు, ఎగతాళి, అవమానపు మాటలతో అతడు ఆహ్వానింపబడెను. అయినప్పటికినీ బిషప్ గా తన జీవితమును, తన సిద్ధాంతములనుగురించి అతడు స్వేచ్ఛగాను, ధైర్యము గాను చెప్పెను. అదంతయు వినిన తరువాత అతనికి కారాగార శిక్ష విధింపబడెను. అతని విశ్వాసమునుగురించిగాక అతడు రాణీకి డబ్బు అచ్చియుండుటవలన శిక్ష విధింపబడెనని వారు తెలిపిరి, కాని వాస్తవమునకు హూపర్ రాణీకి డబ్బు అచ్చి యుండలేదు.

క్రీ.శ. 1554 మార్చి 19వ తేదీన హూపర్ రాణి ప్రతినిధులైన ప్రధాన న్యాయాధిపతి, విన్చెస్టర్ ప్రభువు, ఇతర ముఖ్య అధికారులయెదుట హాజరయ్యెను. “నీకు వివాహమైనదా” అని విన్చెస్టర్ ప్రభువు ప్రశ్నించగా, “అవును నా ప్రభువా, మరణము నా వివాహమును ఎడబాపువరకు నేను వివాహమును ఎడబాయను” అని హూపర్ సమాధానమిచ్చెను.

ఏ కారణములవలన అయితేనేమి, రోమన్ కేథలిక్ మతాధిపతులు వివాహము చేసికొనరు. వారు ఆసీనులైన ఆ స్థలమునకు అతని జవాబు అమర్యాదకరమైనదని వారు గట్టిగా నవ్వుచూ అతనిని గేలిచేసిరి. ఛిచెస్టర్ పట్టణ (Chichester) బిషప్ డా. డే (Dr. Day) హూపర్ను ‘మతద్రోహి’ అని నిందించి, ఆగ్రహముతో కొట్టి, తిట్టెను. బిషప్ టాన్ల్ (Tonstal) మరియు అక్కడున్న స్మిత్ అను గుమస్తా, మరికొందరు హూపర్ను ‘పశువు’ అని దూషించిరి.

డర్హామ్ పట్టణ బిషప్న టాన్స్టాల్ “సంస్కారములో క్రీస్తు నిజ శరీరమున్నదని నిజముగా నమ్ముచున్నావా?” అని హూపర్ను ప్రశ్నించెను. అందుకు హూపర్ అందులో అట్టిదేదియూ లేదని, దానిని తాను నమ్ముటలేదని స్పష్టముగా జవాబు చెప్పెను. అంతట ప్రధాన న్యాయాధిపతియైన విన్చెస్టర్ ప్రభువు “ఏ అధికారముచేత నీవు క్రీస్తు శరీర ప్రత్యక్షతలను నమ్ముటలేద”ని ప్రశ్నించెను.

“ఆ అధికారము దేవుని వాక్యమే” అని హూపర్ సమాధానమిచ్చెను. అందుకు వారు – అతనికి వివాహమైన దని, భార్యను పరిత్యజించుటకు ఇష్టపడుటలేదని, సంస్కారములో క్రీస్తు నిజ శరీర ప్రత్యక్షత ఉన్నట్లు నమ్ముట లేదని దూషించి, ఈ కారణములనుబట్టి అతనిని బిషప్
పదవినుండి తొలగించిరి. ఫ్లీట్ చెరసాల (Fleet Prison) లో ఉన్నప్పుడు క్రీ.శ. 1555 జనవరి 7వ తేదీన తన శ్రమలను గురించి హూపర్ ఇట్లు వ్రాసెను :

“జైలులో నేను కొద్ది స్వేచ్ఛను పొందుటకు నన్ను క్రీ. శ. 1553 సెప్టెంబరు మొదటి తేదీన రిచ్మండ్నుండి ఫ్లీట్కు బదిలీచేసిరి. ఆరు దినములైన తరువాత ఈ స్వేచ్ఛకొరకు జైలు అధికారికి నేను ఐదుపౌండ్లు సుము చెల్లించితిని. డబ్బు స్వీకరించిన వెంటనే విన్చెస్టర్ బిషప్ స్టీఫెన్ గార్డినర్ (Stephen Gardiner) కు జైలు అధికారి ఫిర్యాదుచేయగా, సుమారు మూడు నెలలపాటు స్వేచ్ఛలేకుండా ఫ్లీట్ జైలులోని టవర్ గదిలో నన్ను బంధించి, చిత్రహింసలకు గురిచేసిరి.

ఒకసారి మంచి మర్యాదగల ఒక స్త్రీ తెచ్చిన మధ్యాహ్నపు భోజనము చేయుటకు నేను క్రిందికి వచ్చు స్వేచ్ఛనిచ్చిరి. కాని, నా స్నేహితులెవరితోను నేను మాట్లాడుటకు అనుమతించక వెంటనే గోపురములోని నా చిన్న గదికి తీసికొని వెళ్లిరి. మరుసటి దినము మధ్యాహ్న భోజనము చేయుటకు నేను దిగివచ్చినప్పుడు చెరసాల అధికారి, అతని భార్య నన్ను దూషిం చుచూ, వారి గొప్ప స్నేహితుడైన విన్వెస్టర్ బిషప్కు నాపై ఘోర నేరారోపణ చేసిరి.

కొన్ని మాసముల అనంతరము చెరసాల అధికారి బాబింగ్టన్ (Babington) అతని భార్య నాతో పోట్లాడి, వారి స్నేహితుడైన విన్చెస్టర్ బిషప్నుండి అనుమతిపొంది, చెరసాలలో మిక్కిలి భయంకరమైన దుర్వాసనగల గదిలో నన్ను ఉంచిరి. ఆ గదిలో విపరీతమైన దుర్వాసనగల గడ్డితో చేయబడిన ఒక చాప, క్రుళ్ల కంపుకొట్టుచున్న దుప్పటి, పక్షి ఈకలు గల సంచివంటి ఒక తలదిండును నాకిచ్చిరి.

ఆ జైలుకు ఇరువైపులా మూయబడని మరుగుదొడ్డి కాలువలు భరింపరాని దుర్గంధమును వ్యాపింపజేయుచున్నవి. నేను అనుభవించిన మరియు ఇప్పుడు అనుభవించుచున్న రోగములకు ఆ అనారోగ్య పరిసర ములే కారణమని నా నమ్మకము.

నేను ఎంతగానో దుఃఖించి, ఏడ్చి కేకలు పెట్టిననూ ప్రయోజనము లేకపోయెను. ప్రాణాపాయ పరిస్థితులలో నేనున్నప్పుడు నాతోటి ఖైదీలు నాకు సహాయము చేయకుండా వారిని ఆపిరి. “అతనిని ఒంటరిగానే ఉండ నీయుడి, అతడు చనిపోతే మనకు పీడ విరగడవుతుంది” అని జైలు అధికారి చెప్పెను.

నా భోజనము నిమిత్తము జైలు అధికారికి ఇరువది షిల్లింగులు ఇచ్చి తిని. నా బిషప్ పదవిని పూర్తిగా తొలగించువరకు ఆ విధముగా ఇచ్చుచూనే యుంటిని. నేను ఎంత ధనము ఇచ్చిననూ అతడుమాత్రము నన్ను ఒక అధమునిగా ఎంచి ఎంతో హీనముగానూ, నీచముగాను చూచుచుండెను.

నా సహాయకుడగు విలియమ్ డౌన్టన్ (William Downton) ను కూడా చెరసాలలో బంధించిరి. అతనివద్ద ఏమైనా ఉత్తరములు లభించు నేమోయని వెదుకుటకు అతని దుస్తులను జైలు అధికారి లాగివేసి, నన్ను చెరసాలనుండి విడుదల చేయించుటకు అవసరమైన ధనమును పంపిన కొందరి మంచివారి పేర్లుగల చీటీని కనుగొనెను. వారినికూడ కష్టపెట్టుటకు దేవునికి, నాకు శత్రువైన స్టీఫెన్ గార్డినర్కు జైలు అధికారి ఆ పేర్లుగల జాబితాను ఇచ్చెను.

సుమారు పదునెనిమిది మాసములు నేను కారాగార శిక్షననుభ వించితిని. నా వస్తువులు, వేతనము, కుటుంబము, మిత్రులు, సౌకర్యములు అన్నీ నాకు దూరమైనవి. న్యాయమైన లెక్కను బట్టి రాణి నాకు ఎనుబది పౌండ్లు ఇచ్చియుండెను. ఆమె నన్ను కారాగారములో పెట్టించినదేగాని నాకు ఏమియు సహాయము చేయలేదు సరికదా ఇతరులు నాకు సహాయము చేయుటకుకూడా ఆమె అంగీకరింపలేదు.

దీనికితోడు దుర్మార్గులైన ఇరువురు స్త్రీ, పురుషులతోపాటు నన్నునూ ఉంచిరి. దేవుని సహాయముతప్ప మరియొక మార్గమేమియు లేదు. నాకు తీర్పు జరుగకముందే నేను చెర సాలలో చనిపోవుదును. అది జీవమైననూ, మరణమైననూ ఆయన చిత్తమే జరుగునట్లు దేవునికి నన్ను అప్పగించుకొనుచున్నాను.”

క్రీ.శ. 1555 జనవరి 22న పరి. మేరి వోవరి (St. Mary Overy) చర్చిలో నున్న విన్చెస్టర్ గృహములో విన్చెస్టర్ బిషప్, ఇతర బిషప్లు మరియు కొందరు ప్రధాన న్యాయాధిపతులు సమావేశమై హూపర్ను తమయొద్దకు తీసికొనిరావలసి నదిగా చెరసాల అధికారియైన బాబింగ్టన్ న్ను ఆదేశించిరి.

హూపర్ వారియొద్దకు వచ్చినప్పుడు విన్చెస్టర్ బిషప్ అతని “దుష్టమైన మరియు అపవిత్రమైన సిద్ధాంతము లను” విడనాడవలసినదిగా బలవంతము చేసి, తిరిగి కేథలిక్ సంఘ ఐక్యతకు తోడ్పడి, ఇంగ్లాండు పార్లమెంట్ నిర్ణయించినట్లు సంఘమంతటికి పోప్ నాయకుడని అంగీక రించుమనెను. పోప్ యొక్క పరిశుద్ధతకు తలవంచి నీవుకూడ నావలె పోప్ ఆశీర్వా దము, రాణియొక్క దయను పొందవచ్చునని బిషప్ హూపర్కు అభయమిచ్చెను.

పోప్ బోధించు సిద్ధాంతము క్రీస్తు సిద్ధాంతమునకు వ్యతిరేకముగ ఉన్నందువలన పోప్ సంఘమునకు నాయకుడుగ నుండుటకు అర్హుడు కాదనియు, అందువలన అన్యాయపు అధిపతికి తాను లోబడననియు, రోమన్ కేథలిక్ సంఘము సరియైన సంఘము కాదనియు, నిజమైన సంఘము తన ప్రియుని స్వరముమాత్రమే వినుననియు, అది క్రొత్తవారి స్వరమునుండి పారిపోవుననియు చెప్పెను.

మరియు హూపర్ అందుకు బిషప్ “పోప్ శత్రువులకు రాణి ఏమాత్రము దయదల్చద”ని చెప్పి, హూపర్ను ఫ్లీట్ చెరసాలకు తీసికొనివెళ్లి ఖైదు చేయుమని బాబింగ్టన్ ను ఆజ్ఞాపించెను.

జనవరి 28వ తేదీన విన్చెస్టర్ బిషప్ మరియు ఇతర న్యాయాధికారులు హూపరు విచారించుటకు మరియొకసారి పరి. మేరి వోవరి చర్చిలో సమావేశమైరి. తీవ్ర వాదోపవాదములు జరిగిన తరువాత వారు హూపర్ను ప్రక్కన ఉంచి మాస్టర్ రోజర్స్ (Rogers) అను మరియొక తిరుగుబాటుదారుని సాయంకాలము నాలుగు గంటలవరకు విచారించిరి.

ఇట్లు వారి విచారణ ముగించిన తరువాత హూపర్ను, మాస్టర్ రోజర్స్ను మరుసటిదినము ఉదయము తొమ్మిది గంటలవరకు సౌత్వార్క్ (Southwark) లో ఉంచుటకు పంపి, వారు ఒకవేళ తమ మనస్సు మార్చుకొని రోమన్ కేథలిక్ సంఘమునకు వచ్చెదరేమోనని వేచియుండిరి.

దేవాలయమునుండి సౌత్వార్క్క అధికారులతో కలసి వెళ్లుచుండగా హూపర్ రోజర్స్తో ఇట్లనెను, “సహోదరుడైన రోజర్స్, రమ్ము, ఎండిన కట్టెలలో సజీవ దహనము గావింపబడువారిలో మనమే మొదటివారమేమో పరిశీలింపుము?”

“అవునయ్యా, దేవుని కృపచేత,” రోజర్స్ బదులు పలికెను.

“దేవుడు మనకు శక్తినియ్యడని అనుమానించకు” అని హూపర్ ధైర్యము చెప్పెను. వారి ధైర్యమును చూచి ఆనందించిన ఆ వీధి ప్రజల మధ్యగా నడచి వెళ్లుట వారికి కష్టమైనది.

మరుసటి ఉదయము జైలు అధికారులు వారిని బిషప్ మరియు ఇతర న్యాయాధి కారుల ముందు ప్రవేశపెట్టిరి. సుదీర్ఘమైన చర్చ అనంతరము హూపర్ వారికి ఏ విధముగాను లోబడడని వెల్లడియైనది. కనుక వారు అతనిని జాన్ హస్, జెరోమ్ వలె కించపరచి, మరణమునకు తగినవాడని తీర్పుచెప్పిరి.

ఆ తరువాత రోజర్స్నుకూడా రప్పించి వారికి లోబడవలసినదిగా బలవంతము చేసిరి. అతడుకూడా అంగీకరింపక పోవుటచే, వారిద్దరిని లండన్ ప్రభుత్వ అధికారులకు అప్పగించిరి. ఆ అధికారులు వారిని చీకటిపడువరకు ఉంచుటకు విన్చెస్టర్ భవన సమీపములోని ‘క్లింక్’ (Clink) ఖైదుకు తీసుకొనిపోయిరి.

చీకటిపడిన తరువాత అధికారులు కర్రలు, కత్తులు ధరించిన తమ అనుచరులతో విన్చెస్టర్ బిషప్ భవనముగుండా లండన్ వంతెనమీదుగా పట్టణములోనుండి న్యూ గేట్ చెరసాలకు హూపర్ను తీసుకొని వెళ్లిరి. పట్టణములోగుండా వెళ్లకమునుపు వారు తమపై ఎవరైనా దాడిచేసి బలత్కారముగా తమయొద్దనుండి హూపర్ను తీసికొని వెళ్లుదురను భయముతో ముందుగా వెళ్లి ఆ వీధులలోని దీపములను ఆర్పివేసిరి.

వారి దుర్మార్గపు కార్యములకు, దుష్ట మనఃస్సాక్షికి చీకటి చక్కగా సరిపోవునుగదా! అయిననూ హూపరు ఆ మార్గమున తీసికొని పోవుచున్నారని తెలిసి ప్రజలు చేతులలో దీపములు పట్టుకొని వారి గృహములనుండి బయటకు వచ్చి ఆయనకు నమస్కరించిరి.

ఆయన వారికి బోధించిన సత్య సిద్ధాంతములను అంతమువరకు కాపాడుకొనినందున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తుది గడియవరకు దేవుడు అతనిని బలపరచునట్లు ప్రార్థించిరి. హూపర్ కూడా వారిమధ్యగా వెళ్లుచూ తనకొరకు దేవునిని మనస్ఫూర్తిగా ప్రార్థించుడని ప్రజలను కోరెను.

ఆ తరువాత వారు హూపర్ను న్యూ గేట్ జైలు అధికారికి అప్పగించగా, అతడక్కడ ఆరు దినములుంచబడెను. ఆ దినములలో జైలు కావలివారు అతనిని చూచుటకు లేక మాట్లాడుటకు కొద్దిమందిని తప్ప మరి ఎవరిని అనుమతించలేదు.

అనేకసార్లు లండన్ బిషప్న బోనర్ (Bonner), మరికొందరు హూపర్ను దర్శించి తన మనస్సు మార్చుకొని క్రైస్తవ వ్యతిరేక సంఘములో సభ్యునిగా చేరుమని ఒప్పించుటకు ప్రయత్నించిరి. వాక్యమును వక్రీకరించుట, పురాతన వ్రాతలకు తప్పుడు అర్థములను చెప్పుట మొదలగు చేయదగు ప్రయత్నములన్నియు చేసిరి. పైపై మంచితనము, స్నేహమును ప్రదర్శించిరి.

లోకసంబంధమైన వస్తువులను, ఆస్తులను అతనికి ఎరచూపిరి, గట్టిగా బ్రతిమలాడిరి, బెదిరించిరి. కాని హూపర్ – “క్రీస్తులోని తన స్థిర విశ్వాసమును దేవుని వాక్యములోని సత్యమునుండి తననేదియూ కదిలించ లేదు” అని వారితో చెప్పెను.

వారు తమ తప్పుడు పనులకు అతనిని ఉపయోగించుకొనుటలోనూ, సంఘము నకు అతనిని తిరిగి సంపాదించుటలోను విఫలమైనందున వారు అతనిమీద, అతడు బోధించిన క్రీస్తు సిద్ధాంతములమీద తప్పుడు ప్రచారము చేసి అవమానపరచుటకు ప్రయత్నించిరి. ముఖ్యముగా లండన్ బిషప్, మరికొందరు ఆ వాదనను బలపరచి నప్పుడు బలహీనులైన కొందరు ఆ వాదనను నమ్మిరి.

తప్పుడు ప్రచారములు ఎంత ప్రభావమును కలిగియుండునో మాస్టర్ హూపర్ త్వరలోనే గ్రహించెను. తనపై మోపబడిన తప్పుడు పుకారులను కొందరు నమ్ముట చూచి అతడు విచారించి, వారికొరకు ఒక బహిరంగ లేఖ వ్రాసెను. ఆ వ్రాయబడిన లేఖ సారాంశమేమనగా:

“జాన్ హూపర్ అను నేను క్రీస్తుకొరకు ఖైదీనై మరణ దండన విధింపబడినవాడనైతిని. (న్యూ గేటు ఖైదులో మరణ శిక్షకొరకు ఎదురు చూచుచూ) నేను ఇంతవరకు బోధించిన విషయములను తప్పు అని నేను ఒప్పుకొనినట్లు వచ్చిన వార్తలు నన్ను ఆశ్చర్యపరచినవి.

నాపై ఈ పుకారులు లండన్ బిషప్ అతని అనుచరులు నన్ను చూచు టకు వచ్చి నాతో మాట్లాడినప్పుడు ఉద్భవించినవి. నేను వారితో మాట్లాడి తిని, మరలా వారు వచ్చినయెడల మాట్లాడెదను. వారి వాదములు నాకు భయము పుట్టింపలేదు. మరణముకూడా నన్ను భయపెట్టలేదు. వారి రాకవలన నేను ఇప్పటివరకు బోధించిన సత్య సిద్ధాంతములలో ఇంకా బలముగా స్థిరపడియున్నాను.

లోకమునకు సంబంధించినవాటినన్నిటిని నేను విడిచిపెట్టితిని, నేను గొప్ప బాధను, చెరసాల శిక్షను అనుభవించితిని. నేను మరణమును భరించుటకు సిద్ధముగా ఉన్నందున దేవునికి వందనములు చెల్లించు చున్నాను. ఇప్పటివరకు నేను నా నాలుకతోను, కలముతోను సత్యమును బోధించితిని. త్వరలోనే అదే సత్యమును దేవుని కృపద్వారా నా రక్తముతో స్థిరపరచుదును.”

క్రీ.శ. 1555 ఫిబ్రవరి 4 సోమవారమున చెరసాల అధికారి హూపర్ వద్దకు వచ్చి గ్లాసెస్టర్ (Gloucester) లో నీకు మరణశిక్ష విధింపబడునని, దానికొరకు సిద్ధపడుమని చెప్పెను. అది వినిన వెంటనే హూపర్ తాను ఇదివరకు గ్లాసెస్టర్ బిషప్ పనిచేసినందున, అక్కడనే తనకు మరణశిక్ష విధించెదరని మిక్కిలి సంతోషించి, ఆకాశమువైపు తన కన్నులను, చేతులను ఎత్తి దేవుని స్తుతించెను.

ఎవరిమధ్య తాను బిషప్ పని చేసెనో ఆ ప్రజలమధ్య చంపబడుట మంచిదని, తన మరణముద్వారా తాను బోధించిన సత్యసిద్ధాంతములను స్థిరపరచవచ్చునని తలంచెను. ఆయన మహిమకొరకు చనిపోవుటకు దేవుడు తనకు శక్తిననుగ్రహించుననుటలో అతనికెట్టి సందేహములేదు. కనుక హూపర్ అధికారులు పిలిచిన వెంటనే వెళ్లుటకు తన నౌకరు ఇంటికి కబురు పంపి తన చెప్పులను, పైవస్త్రమును తీసికొని రమ్మని చెప్పెను.

మరుసటి రోజు తెల్లవారుజాము నాలుగు గంటలకు చెరసాల అధికారి, మరి కొందరు హూపర్ను బంధించిన గదిలో ప్రవేశించి, అతడు వ్రాసినవి ఏమైనా దొరుకునేమోయని వెదకుట ప్రారంభించిరి. అప్పుడు లండన్ అధికారులు, వారి సహాయకులు హూపర్ను న్యూ గేట్ చెరసాలనుండి ఫ్లీట్ వీధిలోగల పరి.

డన్స్ట్రన్ దేవాలయమునకు సమీపములోనున్న ఒక స్థలమునకు తీసికొనిపోయి, అక్కడ అతనిని గ్లాసెస్టర్కు తీసికొని పోవు అధికారులైన చందోస్ ప్రభువు (Lord Chandos) కు, మాస్టర్ విక్స్ (Wicks), రాణి నియమించిన భటులు ఇతర అధికారులకు అప్పగించిరి.

లండన్లో రాణి భటులతో హూపర్ భుజించిన తరువాత అతనిని ఎవరూ గుర్తింపకుండా తలపై ముసుగువేసిరి. అయిననూ అతడు సంతోషముతో ఎవరి సహాయము లేకుండనే గుర్రముమీద ఎగిరి కూర్చుండెను. అతడు రక్షక భటులతో కలసి సంతోషముగా లండన్ నుండి గ్లాసెస్టర్కు ప్రయాణము చేసెను.

గురువారము ఉదయము 11 గంటలకు వారు గ్లాసెస్టర్కు పదిహేను మైళ్ల దూరములోగల సిరెన్సెస్టర్ (Cirencester) అను పట్టణములో భోజనము చేయుటకు ఆగిరి. ఆ భోజన గృహ యజమానురాలు ఎప్పుడూ సత్యమును ద్వేషించుచూ, హూపర్నుగురించి అసభ్యకరముగా మాట్లాడును. కాని ఇప్పుడు మాత్రము అతడు గ్లాసెస్టర్ వెళ్లుచున్న కారణము తెలిసికొనినదై అతనితో మంచిగా మాట్లాడి, “మీకు మరణశిక్ష విధిస్తే మీ సిద్ధాంతములను తప్పక విడిచిపెట్టుదురని మిమ్ములను దూషించితి”నని కన్నీటితో హూపర్ వద్ద ఒప్పుకొనెను.

మీరు నా ఆత్మను ప్రేమించినయెడల, దానిని అక్కడనుండి తొలగించుడి

మధ్యాహ్న భోజనమైన తరువాత వారు ప్రయాణము సాగించి సుమారు సాయంత్రము ఐదుగంటల ప్రాంతములో గ్లాసెస్టర్ చేరిరి. పట్టణము వెలుపల సుమారు ఒక మైలు దూరమువరకు రోడ్డుకు ఇరువైపులా ప్రజలు గుమికూడి హూపర్ పరిస్థితిని చూచి ఏడ్చి, ప్రలాపించిరి.

ప్రజలు హూపర్ ను తమవద్దనుండి బలవంతముగా తీసి కొని పోవుదురని భయపడిన ఒక రక్షకభటుడు పట్టణములోనికి వేగముగా పోయి నగరపాలక అధికారిని, పోలీసు అధికారులను సహాయపడవలసినదిగా కోరెను. అధికారులు వెళ్లి పట్టణ ద్వారమువద్దనున్న ప్రజలను తమ గృహములయందే ఉండ వలెనని ఆజ్ఞాపించిరి. అయితే అలజడులేమియు జరుగలేదు.

హూపర్ గ్లాసెస్టర్ ని ఇన్గ్రామ్ (Ingram) అను నతని గృహములో బసచేసెను. ప్రయాణములో ప్రతి రాత్రి చేసినట్లే ప్రశాంతముగా తన భోజనము ముగించి, కొంత సమయము సుఖముగా నిద్రించెను. పిమ్మట అతడు మేల్కొని ఉదయమువరకు ప్రార్థించెను.

ఆ తరువాత అతడు ఒక చిన్న గదిలోనికి వెళ్లి, దేవుని ప్రార్థించుటకును, ఆయనతో మాట్లాడుటకును వారిని అనుమతి కోరెను. కనుక ఆ దినమంతయూ అతడు భోజనము చేయుటకు, తనను దర్శించుటకు వచ్చినవారితో మాట్లాడుటకు వెచ్చించిన సమయము మినహా మిగిలిన సమయమంతయూ ప్రార్థనలో గడిపెను.

అతనిని దర్శింప వచ్చినవారిలో సర్ ఆంథోని కింగ్స్టన్ (Sir Anthony Kingston) అను యోధుడు కలడు. ఇతడు గతములో హూప స్నేహితుడై యుండెను. ప్రస్తుతము ఇతడు హూపర్ మరణశిక్షను అమలుపరచు అధికారులలో ఒకనిగా రాణిచే నియమింపబడెను. హూపర్ ఆ చిన్నగదిలో ప్రార్థించుట చూచినప్పుడు అతడు బహుగా దుఃఖించి, కన్నీరు కార్చెను. మొదట హూపర్ కూడా అతనిని గుర్తింప లేదు. అప్పుడు కింగ్స్టన్, “నా ప్రభువా, నీవు నన్ను ఎరుగవా? నేను నీ పాత స్నేహితుడను, నా పేరు ఆంథోని కింగ్స్టన్” అని గుర్తుచేసెను.

“అవును, మాస్టర్ కింగ్స్టన్, నేను నిన్ను బాగుగా ఎరుగుదును, నీవు ఆరోగ్యముగా నుండుట చూచినప్పుడు నాకు ఎంతో సంతోషము కలిగినది, దానికొరకు దేవుని స్తుతించుచున్నాను” అని హూపర్ సమాధానమిచ్చెను.

“నీవు ఇక్కడ చనిపోవుటకు వచ్చితివని చూచుటకు నేనెంతో చింతించుచున్నాను. కాని, జీవించియుండుట మధురము, మరణించుట చేదని తలంచుము. అందువలన నీవు జీవించియుండవలెనని కోరుకొనినచో ఇప్పటినుండి నీ జీవితము ఎంతో మేలుకరముగానుండున”ని కింగ్స్టన్ పలికెను.

దానికి హూపర్ ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను, “మాస్టర్ కింగ్స్టన్, నీవు చెప్పినది వాస్తవమే, కాని నేను ఈ ప్రాంతములోను ఇతర ప్రాంతములలోను ఒకప్పుడు బోధించిన సత్య సిద్ధాంతములను కాదనలేను, కనుక ఈ జీవితమును ఇంతటితో చాలించుకొని మరణముననుభవించుటకు ఇక్కడకు వచ్చితిని. నేను కోరదగినది కాకపోయిననూ నీవిచ్చిన స్నేహపూర్వకమైన సలహాకొరకు నీకు వందనములు. మాస్టర్ కింగ్స్టన్, మరణము చేదుగాను, జీవము తీపిగాను ఉండుననుట వాస్తవమే.

కాని నేను మరణమంటే భయపడను, జీవమంటే గొప్పగానూ తలంచను. దేవుని వాక్యము లోని సత్యమును నిరాకరించుటకంటే, ఆయనయొక్క పరిశుద్ధాత్మ శక్తిద్వారా ఇప్పుడు నాకొరకు సిద్ధము చేయబడిన భయంకరమైన అగ్నిలో సహనము వహించి కాలి పోవుటకు సిద్ధపడియున్నాను. ఈ విషయమును నా అంతట నేనే పరిష్కరించుకొంటిని. ఈ లోపుగా, మీరును, ఇతరులును మీ ప్రార్థనలద్వారా నన్ను దేవుని కృపకు అప్ప గింపవలసినదిగా కోరుచున్నాను.”

అందుకు కింగ్స్టన్ “మంచిది, నా ప్రభువా, ఈ విషయమునకు పరిష్కారము కనుపించుటలేదు, కనుక నేను దీనిని వదలివేయుచున్నాను. కాని నిన్నుగూర్చి తెలుసుకొనుటకు నాకు అవకాశము కలిగినది గనుక నా హృదయములో దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాను. నేను తప్పిపోయిన కుమారుడను గనుక నీద్వారా దేవుడు నన్ను మరలా తనయొద్దకు పిలుచుకొనెను” అని జవాబిచ్చెను.
దానికి హూపర్, “దానికొరకు నేను దేవుని ఎంతగానో స్తుతించుచున్నాను. ఆయనయందు భయభక్తులు కలిగి నీవు ఎల్లప్పుడూ జీవించునట్లు నేను దేవుని ప్రార్థించెదను” అని సమాధానమిచ్చెను.

ఇంకా కొంత సమయము మాట్లాడుకొనిన తరువాత చెంపలపైనుండి కన్నీరు కారుచుండగా మాస్టర్ కింగ్స్టన్ అక్కడనుండి వెడలెను. హూపర్ కూడా ఏడ్చుచు చెరసాలలో తాను అనుభవించిన బాధకంటేకూడా వారి ఎడబాటువలన కలిగిన దుఃఖము అధికముగానున్నదని చెప్పెను.

ఆ సాయంకాలము ఒక గ్రుడ్డి బాలుడు హూపర్ను చూడవలెనని కావలియున్న వారిని బ్రతిమిలాడి చివరకు అనుమతిపొందెను. అయితే హూపర్ను చూచుటకు కొద్దిసమయము ముందే ఆ బాలుడు దేవుని వాక్యమును విని, సత్యమును ఒప్పుకొని నందున గ్లాసెస్టర్లో ఖైదు చేయబడెను. హూపర్ ఆ బాలుని చూచి, అతని విశ్వాస మును గురించి, అతనిని చెరసాలలో బంధించుటకుగల కారణములనుగురించి ప్రశ్నించిన తరువాత, కన్నీటితో అతనివైపు చూచి “అయ్యో, బాలుడా! దేవుడు నీ కనుచూపునుమాత్రమే తీసికొనిన కారణము ఆయనకుమాత్రమే తెలియును.

అయితే ఇంతకంటే శ్రేష్టమైన మరియొక దృష్టిని అనగా విశ్వాసము, జ్ఞానముతోకూడిన దివ్య దృష్టిని నీకు అనుగ్రహించియున్నాడు. ఆ దివ్యదృష్టిని నీవు ఎన్నడూ పోగొట్టుకొనకుండా ఆయనను నీవు ఎల్లప్పుడూ ప్రార్థించునట్లు దేవుడు నీకు కృపననుగ్రహించును. అట్లు కానిచో నీవు శారీరకముగానూ, ఆత్మీయముగానూ గ్రుడ్డివాడవైయుండెదవ”ని చెప్పెను.

అదేరాత్రి, భటులు కావలికాయుట ముగించి హూపర్ను గ్లాసెస్టర్ నగరపాలక అధికారి, ఇతర అధికారుల బాధ్యతకు అప్పగించిరి. వారు ఆ విధముగా చేసినప్పుడు హూపర్ ఇట్లు చెప్పెను: “గౌరవనీయులైన నగరపాలక అధికారిగారు, మరణశిక్ష విధింపబడిన ఖైదీనైన నన్ను మీరు, మీ అనుచరులు మీ అధీనములోనికి తీసుకున్నందు లకు నేను వందనములు చెల్లించుచున్నాను. నాయెడల గతములో మీకున్న ప్రేమ, స్నేహము పూర్తిగా అంతము కాలేదని గ్రహించి ఆనందించుచున్నాను.

అదేవిధముగ నేను మీకు గతములో బోధించిన సంగతులన్నియూ మీరు మరచిపోలేదని నమ్ముచున్నాను. దైవజనుడైన అప్పటి రాజు నన్ను మీకు బిషప్ను, బోధకునిగాను నియమించెను. అనేకులు తలంచినట్లుగా నేను బోధించిన సిద్ధాంతములు అసత్యములని, మత ద్రోహములని నేను తలం చుటలేదు.

మీకు తెలిసినట్లు రాణి ఆజ్ఞమేరకు చంపబడుటకు నేను ఇక్కడకు పంపబడితిని. నేను ఏ స్థలములో బోధించితినో అక్కడకు వచ్చి, నేను బోధించినవాటిని నా రక్తముతో స్థిరపరచుటకు వచ్చితిని.”

అతని మాటలకు ఆ అధికారులు, వారితోనున్న ఇతరులుకూడా విచారపడి, అతనిని సామాన్య ఖైదులో ఉంచుటకు తీర్మానించుకొనిరి. అయితే ఒక కావలిదారుడు హూపర్ యొక్క మంచితనము, నెమ్మది, ఓర్పుతోకూడిన మంచి ప్రవర్తననుగూర్చి వివరించి ఒక బాలుడు సహితము అతనిని భద్రపరచవచ్చునని చెప్పి సామాన్య ఖైదులో ఉంచక రాబర్ట్ ఇన్ఫ్రాగ్రామ్ గృహములో ఆయనను భద్రపరచవలెనని అభ్యర్థించెను.

ఆ రాత్రంతయూ అతనికి సైనికాధికారులు, ఇతర అధికారులు కావలి ఉండిరి. అతడు చాల విషయములను జ్ఞాపకము తెచ్చుకొనవలసియున్నందున త్వరగా నిద్రించుటకు సెలవడిగి సాయంత్రము ఐదుగంటలకే నిద్రకు ఉపక్రమించి చాలా రాత్రి అగువరకు నిద్రించి, అప్పుడు మేల్కొని వేకువ జామువరకు ప్రార్థించెను. ఉద యము మేల్కొనిన తరువాత తనకు మరణశిక్ష విధించు సమయమువరకు అతడు ఏకాంతముగా ఉండగోరి ఎవరినీ తన గదిలోనికి రానివ్వవద్దని కావలివారిని కోరెను.

క్రీ.శ. 1555, ఫిబ్రవరి 9వ తేది ఉదయము ఎనిమిదిగంటల ప్రాంతములో హూపర్ మరణశిక్షను పర్యవేక్షించుటకు నియమింపబడిన అధికారులైన సర్ జాన్ బ్రిడ్జెస్, చందోస్ ప్రభువు, వారి అనుచరులు, సర్ ఆంథోని కింగ్స్టన్, సర్ ఎడ్మండ్ బ్రిడ్జెస్, మిగతా అధికారులు హూపర్ను ఉంచిన గృహమునకు వచ్చిరి.

తొమ్మిదిగంటల ప్రాంతములో మరణశిక్ష విధించుటకు సమయము ఆసన్నమైనందున అతనిని సిద్ధపడ వలసినదిగా చెప్పి, ఆయుధములు ధరించిన అధికారులు వెంటనే ఆయనను ఆ గదినుండి క్రిందికి తోడుకొని వచ్చిరి. హూపర్ అన్ని ఆయుధములు ధరించినవారిని చూచి “అధికారులారా, నేను ద్రోహిని కాను.

నేను మరణశిక్ష పొందవలసిన స్థలమునకు నన్ను కొనిపోవుటకు మీరింత కష్టపడనవసరములేదు. మీరు నన్ను అనుమతించినట్లయితే మీకు శ్రమ ఇవ్వకుండ నేను ఒంటరిగానే మరణస్తంభము యొద్దకు వెళ్లెదను” అని చెప్పెను.

ఆ రోజు గ్లాసెస్టర్లో సంత జరుగుచున్నది. సుమారు ఏడువేలమంది ప్రజలు హూపర్ తన మరణశిక్షకు ముందు ఎట్లు ప్రవర్తించునోయని చూచుటకు ప్రోగైరి. తానుంచబడిన గృహపు యజమానియైన రాబర్ట్ ఇన్ గ్రామ వద్ద అరువు తీసుకొన్న ఒక అంగీ ధరించి, టోపీ పెట్టుకొని, దీర్ఘకాలము కారాగారములో ఉన్నందున నడుములోను, కాళ్లలోను వచ్చిన నరముల బలహీనత వ్యాధివల్ల ఒక చేతికఱ్ఱ పట్టుకొని తడబడకుండ నడచుచు, అతనిని గుర్తించినవారిని చూచి సంతోషముగా చిరునవ్వు నవ్వుచూ ఇద్దరు అధికారులమధ్య వధకు కొనిపోబడుచున్న గొఱ్ఱపిల్లవలె ఆయన సాగుచుండెను.

అతనిని చూచినవారు హూపర్ అంతకుముందెప్పుడును అంత సంతోషముగాను, ఆరోగ్యముగాను ఉన్నట్లు చూడలేదనిరి. సజీవదహనము చేయు స్థలమునకు తీసికొని వచ్చినప్పుడు అతడు ప్రజలతో మాట్లాడుటకు అనుమతింపబడనందున వెంటనే మోకరించి ప్రార్థించెను. అతడు కొంతసేపు ప్రార్థించిన తరువాత ఒక పెట్టె తేబడి అతని ముందుగల పీటమీద ఉంచబడెను. అందులో అతడు తన విశ్వాసమునుండి, బోధలనుండి వెనుదిరిగిన యెడల క్షమింపబడునని వ్రాయబడిన రాణిగారి ఉత్తరువు ఉండెను. అతడు దానిని చూచి,

ప్రార్థన ముగించిన వెంటనే మరణస్తంభమువద్దకు వెళ్లి తాను అరువు తెచ్చుకొని ధరించిన అంగీని తొలగించి తిరిగి దానిని రాబర్ట్ ఇన్గ్రామ్కు ఇవ్వవలసినదిగ అధికారులకు యిచ్చి, మిగిలిన వస్త్రములనుకూడ తీసివేసి, కోటుమాత్రమే ఉంచు కొనెను. కాని, ఆ కోటుపై అధికారులకు దురాశకల్గి అది కాల్చబడుటకు వారంగీక రించలేదు.

అందువలన హూపర్ కోటునుకూడ వినయముతో తీసివేసి లోపల ధరించు వస్త్రములు మాత్రము ఉంచుకొనెను. అంతట ఒక భటుడు తుపాకిమందుతో నింపబడిన మూడు సంచులను ఆయనకీయగ, హూపర్ ఒక సంచిని తన కాళ్లమధ్యను, మిగిలిన రెండు సంచులను రెండు చంకల క్రింద కట్టుకొనెను.

అప్పుడు హూపర్ అక్కడున్న ప్రజలను తనతో కలసి ప్రార్థించుమని కోరగా వారు అతని బాధను చూచి కన్నీటితో ప్రార్థించిరి. అప్పుడతడు వధస్తంభమువద్దకు వెళ్లగా భటులు ఆయన శరీరమును స్తంభమునకు ఒక ఇనుప గొలుసుతో బిగించిరి. అదే విధముగ వారు మరి రెండు గొలుసులతో అతని మెడ, కాళ్లు బంధింపబోయి నప్పుడు అతడు వారి ప్రయత్నమును వారించెను.

కొద్ది క్షణములలో అతనికి నిప్పుముట్టించు వ్యక్తి అతనిని సమీపించి తనను క్షమింపుమని వేడుకొనెను. తనపట్ల అతడు ఏ నేరము చేయలేదు గనుక, తానెందుకు క్షమింపవలెనని హూపర్ అడుగగా, ఆ వ్యక్తి ఏడ్చుచు “ఓ అయ్యా, నిప్పు ముట్టించుటకు నేను నియమింపబడితిని” అని సమాధానమిచ్చెను. అందుకు హూపర్ “నీవు చేయు చున్నదానివలన నీవు నన్ను కష్టపెట్టుటలేదు. దేవుడు నీ పాపములను క్షమించును. నీ పనిని నీవు చేయుమని మనవిచేయుచున్నాను” అని పలికెను.

ఎండిన రెల్లు గడ్డి అతని చుట్టూ పేర్చుచుండగా, హూపర్ రెండు కట్టల గడ్డిని తీసికొని వాటిని ముద్దుపెట్టుకొని తన చంకలలోనున్న తుపాకిమందు సంచులక్రింద పెట్టుకొనెను. అప్పుడాయన చేతులతో సంజ్ఞలుచేసి ఎక్కడ గడ్డి ఎక్కువ లేదో అక్కడ పెట్టుమని చెప్పి, దానిని పేర్చుటలో తృప్తిచెందిన తరువాత అగ్ని ముట్టింపబడెను.

ఐతే, రెండు గుఱ్ఱములు మోయగలిగినన్ని పచ్చికట్టెలుపయోగించినందున వాటిని వెలిగించుటకు కొంత సమయముపట్టినది. చివరకు అతనిచుట్టు అగ్ని మండెను. కాని ఆ సమయములో చల్లని బలమైన గాలులు వీచుచున్నందున అగ్నిజ్వాలలు హూపర్ను తాకలేదు. కొంచెము సేపైన తరువాత మరికొన్ని ఎండుకట్టెలు తేబడి మరియొక మంట వేయబడెను.

కట్టెలక్రిందమాత్రమే మంటవున్నందున, బలమైన గాలి దానిని ప్రక్కకు నెట్టుటచే ఆ మంటవలన హూపర్ తల వెంట్రుకలుమాత్రమే కొంచెము కాలి, అతని చర్మము ఉబ్బెను. ఇది జరుగుచున్న సమయమంతయు హూపర్ నిశ్శబ్దముగ నొప్పి లేనట్లే ఈ విధముగ ప్రార్థించెను – “ఓ యేసూ, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా ఆత్మను స్వీకరించుము.”

ఎండిన కట్టెలలోని అగ్ని పచ్చికట్టెలను మండింపలేక ఆరిపోవుచుండగా హూపర్ తన చేతులతో కళ్లు తుడుచుకొనుచు పెద్దస్వరముతో – “సజ్జనులారా, దేవుని ప్రేమకొరకు ఎక్కువ అగ్నిని నన్ను పొందనీయుడి” అని చెప్పెను. అతని శరీరము పైభాగమువరకు కాలుటకు చాలినన్ని ఎండిన కట్టెలు లేనందున ఇంతసేపు ఆతని శరీరపు దిగువ భాగము మాత్రమే కాలుచుండెను.

కొంచెము సేపైన తరువాత మరికొన్ని ఎండిన కట్టెలు తేబడి ఆరిపోవుచున్న మంటలలో వేసిరి. ఇప్పుడు వేసిన కట్టెలవలన మంటలు పూర్వముకంటె అధిక మయ్యెను. ఈ మంట తుపాకిమందు సంచులను పగులగొట్టెనుగాని, బలమైన గాలి వలన మంటలు దూరముగా నెట్టివేయబడెను. మంటలు ఈ విధముగ నిదానముగ మండుచున్నందున హూపర్ కొంచెము పెద్దస్వరముతో “ప్రభువైన యేసూ, నన్ను కరుణింపుము ప్రభువైన యేసూ, నన్ను కరుణింపుము, ప్రభువైన యేసూ, నా ఆత్మను స్వీకరింపుము” అని పలికెను. ఈ మాటలు హూపర్ వినబడునట్లుగ పలికిన చివరి మాటలు.

అతని నోరు నలుపెక్కి, నాలుక ఉబ్బి, పెదవులు కాలి చిగుళ్లపైకి వెళ్లువరకు అతడు నిశ్శబ్దముగ ప్రార్ధించుచుండెను. ఆ క్షణములలో అతడు తన చేతులతో ఎదరొమ్ములపై బలముగా కొట్టుకొనెను. కొద్దిసేపటికి ఒక చెయ్యి పడిపోయెను. రెండవచేతితో కొట్టుకొనుచుండగా క్రొవ్వు, నీరు, రక్తము వ్రేళ్లచివరి భాగములనుండి చిందెను. మంటలు హఠాత్తుగా గొప్ప శక్తితో ఎక్కువ కాగా అతని బలము ఉడిగి పోయి రొమ్ముచుట్టువున్న యినుప కడియమునకు అతని చెయ్యి చిక్కుకొనెను. అదే సమయములో అతని శరీరము ముందుకు పడగా, అతడు తన ప్రాణమును విడిచెను.

జాన్ హూపర్ సుమారు 45 నిమిషములనుండి ఒక గంటవరకు అగ్నిలో దహించబడెను. అయినను ఆ వేదననంతటిని ఒక గొట్టెపిల్లవలె ఓర్పుతో భరించుచు, వెనుకకుగాని, ముందుకుగాని, ప్రక్కలకుగాని మళ్లలేదు. దేవుని కృపచేత తప్ప భరింప శక్యముగాని ఆ గొప్ప వేదనను భరించి మంచముమీద పరుండిన ఒక శిశువువలె నిశ్శబ్దముగా మరణించెను. అతని విశ్వాస్యతనుబట్టి క్రైస్తవులమైన మనమందరము దేవుని స్తుతింప బద్ధులమైయున్నాము.

జగత్తు పునాదివేయబడకమునుపే విశ్వాసుల

మార్టిన్ లూథర్ : సేవ, హింసింపబడుట (క్రీ.శ. 1517-1546)

మార్టిన్ లూథర్ : సేవ, హింసింపబడుట (క్రీ.శ. 1517-1546)

మార్టిన్ లూథర్ క్రీ.శ. 1483 నవంబరు 10న హాన్స్ అను గని కార్మికునికి సార్జనీ (Saxony) లోని ఐస్లెబెన్ (Eisleben) లో జన్మించెను. యువకుడైన లూథర్ మాగెబర్గ్ (Magdeburg), ఐసెనాక్ (Eisenach) ల యందు విద్యనభ్యసించిన తరువాత ఎర్ఫర్ట్ (Erfurt) విశ్వవిద్యాలయములో ప్రవేశించెను.

క్రీ.శ. 1505 లో పట్టభద్రుడై తండ్రి కోరికమేరకు న్యాయశాస్త్రమును చదువుట ప్రారంభించెను. కాని కొద్దికాలమునకే న్యాయశాస్త్రమును చదువుట వదలి, ప్రపంచమునే త్యజించి, ఎర్ఫర్టోని అగస్టీనియన్ సన్యాసుల మఠములో చేరెను. ఈ ఆకస్మిక నిర్ణయమునకు కారణము ఒకసారి భయంకరమైన ఉరుము, మెరుపుల శబ్దమునకు అతడు భయపడి క్రిందపడెను. ఆ భయముతో ‘ఈ అశాశ్వత జీవమునకు విలువలేదని ఆత్మయొక్క నిత్యజీవమే ముఖ్యమ’ని గ్రహించెను.

క్రీ.శ. 1508 లో మఠమునందు లూథర్ అభిషేకము నొందెను. క్రీ.శ 1509 లో విటెన్బర్గ్ (Wittenberg) విశ్వవిద్యాలయములో చదువుకొనుటకు మరియు వేదాంతము ఉపన్యసించుటకు పంపబడెను. క్రీ.శ. 1510 లో ఒక పని నిమిత్తము అతడు రోమును సందర్శించి, అక్కడ ప్రముఖ సంఘ నాయకులలో బాహాటముగ కనిపించుచున్న అవినీతిని చూచి విస్మయమునొందెను. క్రీ.శ. 1511 లో వేదాంత శాస్త్రములో డాక్టర్ డిగ్రీని పొంది, అనంతరము విటెన్ బర్గ్ విశ్వవిద్యాలయములో దైవశాస్త్రాచార్యునిగా నియమింపబడెను.

మార్టిన్ లూథర్ రోమన్ కేథలిక్ మతసిద్ధాంతములలో గొప్ప అనుభవము కలిగిన వ్యక్తియైనప్పటికిని, అతడు ‘క్రైస్తవ మతము’ను దీక్షతో పాటించుటకు పూనుకొనెను. అయితే అతని ఆత్మీయ స్థితి వ్యక్తిగత ఆందోళనకు గురిచేసెను. అతనికి అధికమగు చున్న వ్యాకులతకు సరియైన సమాధానము అతడు బోధించుచున్న వేదశాస్త్రములో లభించలేదు.

దేవుని చట్టము మానవ బలహీనతలను అంగీకరించునా? లేక దేవుని చట్ట సమ్మతమైన జీవితము జీవించవలెనా? అను ప్రశ్న ఉత్పన్నమైనది. జవాబును కనుగొనుటకు బైబిలు మాత్రమే ముఖ్యమైనదిగా భావించి చదువుట ప్రారంభించెను. ఆ విధముగ చదువుచున్నప్పుడు అపొస్తలుడైన పౌలు వ్రాసిన రోమా పత్రికపై అతడు తన దృష్టిని కేంద్రీకరించి, అందులో జవాబును కనుగొనెను.

యేసు క్రీస్తు యొక్క సిలువ మరణమునందు దేవుడు మను ష్యులను తనతో సమాధానపరుచుకొనెను.

దేవుని కృపవలన మాత్రమే పాపక్షమాపణ, ఆత్మరక్షణ కలిగి విశ్వాసము ద్వారా స్వీకరింపబడితిమి. అందువలన మనుష్యుడు చేయ వలసినది ధర్మశాస్త్రమునకు సంపూర్ణముగా లోబడుట లేక మత సిద్ధాంతములను కచ్చితముగ నెర వేర్చుటద్వారా కాదుగాని, క్రీస్తులో దేవుడు సంపూర్తి చేసిన కార్యమునందు విశ్వాసముకలిగి యుండుటయే ముఖ్యము. విశ్వాసము పరిపూర్ణ మైనప్పుడు శిక్షింప బడుదుమను భయమువలన కాదుగాని, ప్రేమద్వారానే విధేయు లగుటకు నడిపింపబడుచున్నాము.”

లూథర్ తన చదువులో ఇంకనూ కొనసాగుటవలన పూర్వమునుండి వంశ పారంపర్యముగా వచ్చుచున్న మూఢనమ్మకములు మరియు రోమన్ కేథలిక్ సంఘము యొక్క బోధలు అపొస్తలుడైన పౌలుయొక్క సిద్ధాంతములకు చాల భిన్నముగ ఉన్నవని గ్రహించెను.

అవి లూథర్ యొక్క వ్యక్తిగత ఉద్దేశ్యములను మార్చి, త్వరలో అతడు ఆ మూఢనమ్మకములనుండి మరియు రోమన్ కేథలిక్ తప్పుడు సిద్ధాంతములనుండి వేరై, ఆత్మ రక్షణ విషయములో మానవుని ప్రమేయము కలదని నొక్కి చెప్పిన రోమా వేదాంత పాండిత్యమును తిరస్కరించెను. సత్కార్యములద్వారా నీతిమంతునిగా తీర్చ బడుదురని చెప్పు రోమా సంఘపు అలవాట్లను, బోధలను లూథర్ త్రోసిపుచ్చెను. అతడు క్రొత్తగా అర్థము చేసికొనిన సిద్దాంతములైన సత్యసువార్త, క్రీస్తు ముగించిన పని, అతనిని త్వరలోనే రోమా సంఘాధికారులతో సంఘర్షణకు దారితీసెను.

క్రీ.శ. 1517 లో పాపపరిహార పత్రికలను అమ్ముచున్న తన సంఘనాయకులను ముఖాముఖిగా ఎదిరించుటద్వారా మార్టిన్ లూథర్ కేథలిక్ నాయకులతో తన సంఘర్షణ ప్రారంభించెను. రోములో పరిశుద్ధుడైన పేతురు దేవాలయమును నిర్మించుటకు కావలసిన ధనమును సమకూర్చుటకు పోప్ పదియవ లియో (Pope Leo X) పాపపరిహార పత్రికలను రోమన్ కేథలిక్లకు అమ్ముట ప్రారంభించెను. ఈ పత్రికలు కొనుటద్వారా వారు తాము చేసిన పాపమును పోగొట్టుకొనెదరు.

ఇది చూచిన అనేకమంది యుక్తిగల మతాధిపతులు వెంటనే తమ దేవాలయములకొరకు లేక వారి స్వప్రయోజనములకొరకు పాపపరిహార పత్రికలనమ్ముచు ధన సంపాదనలో పడిరి. లేఖనములకు భిన్నమైనది మరియు క్షమించు దేవుని కృపను, యేసుక్రీస్తుయొక్క శ్రమలను, సిలువ మరణమును అవమానపరచు ఈ దుష్ట సంప్రదాయమును లూథర్ అడ్డుకొనెను.

లూథర్, పోప్ లియోలు ఈ విషయముపై వెంటనే విభేదించిరి. కనుక మార్టిన్ లూథర్ క్రీ.శ. 1517 అక్టోబరు 31న విటెన్బర్గ్ లోని కేజిల్ చర్చి (Castle Church) ప్రధాన ద్వారమునకు తొంబది ఐదు ప్రతిపాదనలు కలిగిన పట్టికను మేకులతో కొట్టెను. పాపపరిహార పత్రికలను అమ్మి పాపములను క్షమించు అధికారము పోప్లకు లేదనెను.

అనతికాలములోనే లూథర్ ప్రకటించిన ప్రతిపాదనలు జర్మనీ అంతటా ప్రచారము పొంది గొప్ప వివాదమును సృష్టించెను. (తొంబది ఐదు సిద్ధాంతముల పూర్తి జాబితాకొరకు మొదటి అనుబంధము చూడుము).

సంఘపరముగ మతాచార్యులు, బోధకులందరు తమ ఉపదేశములు, రచనలద్వారా లూథర్ ఉపదేశములను ఎదుర్కొనుచుండిరి. వారిలో ఒకడు ‘లూథర్ మతద్రోహి, అతడు అగ్నితో కాల్చి చంపబడుటకు యోగ్యుడ’ని చెప్పి, లూథర్ రచనలు, ప్రసంగము లలో కొన్నింటిని తీసికొని, లూథరన్ను కాల్చుటకు గుర్తుగా వాటిని తగులబెట్టెను.

తరువాత వెంటనే జర్మన్ చక్రవర్తియైన మాగ్జిమిలియన్ (Maximillian), పవిత్ర రోమా సామ్రాజ్య చక్రవర్తియైన ఐదవ చార్లెస్, స్పెయిన్ రాజైన మొదటి చార్లెస్, పోప్ మొదలగువారందరు సాగనీ రాజైన మూడవ ఫ్రెడరిక్ (Frederick III) ను కలసికొని లూథర్ను నెమ్మదిపరచవలెనని కోరిరి. ఫ్రెడరిక్ వెంటనే స్పందించలేదు.

కాని, ఆ సమస్య విషయములో కొందరు పండితులను, ఇరాస్మస్ వంటివారినికూడా సంప్రదించెను. ఇరాస్మస్ రాజుతో మార్టిన్ లూథర్ రెండు గొప్ప తప్పిదములు కలవని చెప్పెను. అవి 1. అతడు మతాచార్యుల పొట్టకొట్టుట, 2. పోపు కిరీటమును పగడొట్టుట. కొంతమంది వేదశాస్త్ర పండితులు సంఘములోని తప్పులను సవరించు టకు లూథర్కుగల ఆసక్తి సరియైనదేనని రాజుకు జవాబివ్వగా, రాజుకూడ ‘లూథర్ యొక్క సిద్ధాంత ప్రభావము సరియైనదే’నని వారు చెప్పిన విషయమును ధృవీకరించెను.

అదే సంవత్సరములో ఇరాస్మస్ ఆర్చిబిషపైన మెంజ్ (Mentz) కు ఉత్తరము వ్రాసెను. ఆ ఉత్తరములో అతడిట్లు తెలిపెను, “ఈ లోకము మానవ నిర్మితమైన సంస్థలతోను, యాచించుచున్న మతాచార్యుల కౄరత్వముతోను నిండియున్నది. వారి బోధలను వ్యతిరేకించువారెవరైనను మతద్రోహిగా పరిగణింపబడును. మతాధిపతులను అనుసరింపనివాడు మతద్రోహియని, వారికర్ణముకాని దేనినైననూ మతద్రోహమని ముద్రవేసిరి. గ్రీకు భాషను తెలిసికొనుట లేక వారికంటే చక్కగా మాట్లాడగలుగుటకూడ మతద్రోహమైనది.”

క్రీ.శ. 1518 ఆగస్టు 7న ఆస్కోలి బిషప్ (Ascoli) హైరోమ్ (Hierome) లూథర్ను రోమ్ముకు రావలసినది శాసించెను. రాజైన ఫ్రెడరిక్ మరియు విటెన్బర్గ్ విశ్వవిద్యాలయమువారు లూథర్ పక్షముగ పోప్కు ఉత్తరములు వ్రాసిరి. లూథరెయెడల సానుభూతి కలవాడని తలంచిన పోప్ సలహాదారుడైన కెరోలస్ మిలీషియస్ (Carolus Miltitius) కు కూడ వారు అట్టి ఉత్తరమునే వ్రాసిరి.

ఆ ఉత్తరములో వారు లూథర్ను రోమ్కు బదులు ఆక్స్బర్గ్ కార్డినల్ కెజేటన్ (Cardinal Cajetan) వద్ద విచారించ వలయునని కోరగా, పోప్ విచారణ నిమిత్తము లూథర్ను ఆక్స్బర్గ్కు పిలిపించి, అక్కడనుండి అవసరమయితే బలవంతముగా అతనిని రోముకు తీసికొనిరావలసినదిగా కెజేటన్ను ఆజ్ఞాపించెను.

కార్డినల్ ఆజ్ఞ మేరకు క్రీ.శ. 1518 అక్టోబరులో మార్టిన్ లూథర్ ఆక్స్బర్గ్ వెళ్లెను. అతడు వెళ్లుచూ అతనిని మెచ్చుకొనుచు అనేకమంది వ్రాసిన ఉత్తరములను తనతోపాటు తీసికొని వెళ్లెను. మాగ్జిమిలియన్ చక్రవర్తినుండి తనకెట్టి ప్రమాదము వాటిల్లదను హామి వచ్చువరకు ఆక్స్బర్గ్ లో అతడు మూడు దినములు వేచియుండెను. తరువాత కార్డినల్ కెజేటన్ ముందు లూథర్ హాజరుకాగా, కార్డినల్ లూథరు మూడు విషయములను గురించి తెలియజేయవలసినదిగా ఆజ్ఞాపించెను :

  1. తన తప్పులనుగూర్చి పశ్చాత్తాపపడి వాటిని వెనుకకు తీసికొనుట.
  2. మరలా అదే తప్పులను చేయకుండుట.
  3. సంఘమును బాధపెట్టు విషయములన్నిటినుండి వెనుకకు మళ్లుట.

మార్టిన్ లూథర్ తన తప్పు ఏమిటని కార్డినల్ను ప్రశ్నించినప్పుడు, పోప్ లియో పంపిన ఆజ్ఞాపత్రికను కార్డినల్ అతనికి చూపించి, పాపపరిహార పత్రికలు పాప క్షమాపణ నిమిత్తము ఇవ్వబడినవని, రొట్టె, ద్రాక్షారసము తీసికొనువారికి దేవునియందు విశ్వాసము అవసరము లేదని, విశ్వాసమునకు సంబంధించిన అన్ని విషయములలో పోప్యొక్క అధికారమునకు తిరుగులేదని చెప్పెను.

లూథర్ తిరిగి వ్రాతపూర్వకముగ ఇచ్చిన సమాధానములో, పోప్కూడ తప్పులు చేయు అవకాశమున్నదని, అతడు చెప్పినది లేఖనముల ప్రకారమున్నప్పుడు మాత్రమే అతనియెడల మనము విధేయత చూపింపవలెనని, విశ్వాసియైన యే క్రైస్తవునికైననూ అతనితో విభేదించుటకు, దేవుని వాక్యమునుండి అతని తప్పులను ఎత్తిచూపించుటకు అధికారము కలదని చెప్పెను.

మరియు లూథర్ నీతిమంతుడెవడును లేడని, ఎవరును క్రియలద్వారా నీతిమంతులుగా తీర్చబడరని, సంస్కారమునాచరించువారెవరైనను క్రీస్తు పూర్తిచేసిన పనియందు విశ్వాసము కలిగియుండవలెనని తెలిపెను. ప్రతి అంశములోను తన మాటలను ఖాయపరచుకొనుటకు లూథర్ లేఖన భాగములనే ఉదహరించెను.

ఏది ఏమైనను, కార్డినల్ ఈ విషయములో లూథర్ ఉదహరించిన పరిశుద్ధ లేఖనములను వినుటకు ఇష్టపడలేదు. లూథర్ చెప్పిన బైబిలు వాదములనుకూడా అతడు లెక్కచేయక, లేఖనములనుండికాక సంప్రదాయముగా వచ్చుచున్న సిద్ధాంత ములను, మూఢనమ్మకములను ఉదహరించుచూ అతడు తన సొంత జ్ఞానమునుబట్టి మాట్లాడి లూథర్ను పశ్చాత్తాపపడి రమ్మని చెప్పెను. లూథర్ ఆక్స్బర్గ్ మూడు దినములుండి తనకు విధించబడిన నిబంధనలకు మౌనముగా ఉండగలనని, తన శత్రువులుకూడా ఆలాగుననే ఉండవలెనని తెలియచేయు ఉత్తరమును కార్డినల్కు వ్రాసెను.

అతడక్కడ మరి మూడు దినములుండినను కార్డినల్నుండి ఏ సమాధానము రాలేదు. స్నేహితుల సలహామీద అతడు ఆక్స్బర్గ్ విడిచి విటెన్బర్డ్కు తిరిగివచ్చెను. అతడు బయలుదేరుటకు ముందు బహిరంగ స్థలములలో అతికించిన పట్టికలనుగూర్చి కార్డినల్కు వివరణను, పోప్కు విన్నపమును పంపెను.

లూథర్ విన్నపమునకు సమాధానముగ పోప్ ఒక నూతన శాసనమును జారీ చేసెను. “పాపపరిహార పత్రికలిచ్చు అధికారము ‘అన్ని సంఘములకు కేంద్రమైన రోమ్లోని పవిత్ర మాతృ సంఘము’ యొక్క సిద్ధాంతములలోని ఒక భాగమని, పోప్లు పేతురుయొక్క వారసులని, క్రీస్తు ప్రతినిధులని ప్రకటించెను.

మృతులకు, సజీవులకు మరియు పాప విమోచన లోకములో (Purgatory) ఉన్నవారిని పాపమునుండి విడుదలచేయుటకు కావలసిన పాపపరిహార పత్రికలను మంజూరుచేయు అధికారము కూడ వారికి కలదని చెప్పెను. ఈ సిద్ధాంతమును క్రీస్తును విశ్వాసముతో వెంబడించు వారందరూ అంగీకరింపవలెను. ఈ సిద్ధాంతమును అంగీకరింపక, ఆచరింపకనుండు కేథలిక్ లు గొప్ప శాపముతోకూడిన బాధను పొందుదురని, వారు సంఘమునుండి పూర్తిగా వెలివేయబడుదురని హెచ్చరించెను.”

పోప్ ఇచ్చిన ఈ శాసనమును లూథర్ ఆక్షేపించుచూ రోమన్ కేథలిక్ సంఘ సర్వసభ్య సమావేశమునకు విన్నవించుకొనుటద్వారా దానికి సమాధానమిచ్చెను. లూథర్ సర్వసభ్య సమావేశమునకు చేసిన ఫిర్యాదును పోప్ పదియవ లియో తెలిసికొని జర్మన్వాడైన కరోలస్ మిలీషియస్ (Carolus Miltitius) అను తన సలహాదారునికి ఒక బంగారు గులాబి పుష్పమునిచ్చి దానిని ఫ్రెడరిక్ రాజుకు అందజేయవలసినదిగా పంపించెను.

మిలీషియస్ ఆ ప్రాంతములోని ఇతర ప్రభువులకు పోప్నుండి రహస్య ఉత్తరములుకూడ తీసికొని వెళ్లెను

అయితే మిలీషియస్ జర్మనీ చేరకముందే, రోమా చక్రవర్తియైన మొదటి మాగ్జి మిలియన్ చనిపోయెను. (జనవరి, క్రీ.శ. 1519). వెంటనే ఖాళీ సింహాసనముకొరకు ఇద్దరు ప్రముఖ నాయకులు పోటీపడిరి. వారు ఫ్రాన్సు రాజైన మొదటి ఫ్రాన్సిస్, మరియు స్పెయిన్ రాజైన మొదటి చార్లెస్. అదే సంవత్సరము ఆగస్టు నెల చివరకు చార్లెస్ జర్మనీ రాజుగను మరియు పవిత్ర రోమా చక్రవర్తిగను ఐదవ చార్లెస్ అను బిరుదుతో తన తండ్రి తరపున తాతగారైన మొదటి మాగ్జిమిలియన్ స్థానములో ఎన్నుకొనబడెను.

క్రీ.శ. 1519 వేసవిలో మార్టిన్ లూథర్, అతని ఉపదేశములనుగూర్చిన విభేదములు సుడిగాలివలె వ్యాపించెను. ఫ్రెడరిక్ రాజు మేనమామ, సాగనీ రాజైన జార్జ్ పరిపాలన కాలములో లీప్సిక్ (Leipsic) నగరమందు ఒక బహిరంగ సభ ఏర్పాటుచేయబడెను. ఈ వాగ్వివాదము జాన్ ఎఖియస్ (John Eckius) అను బోధకునికి, విటెన్ బర్గ్ ఆచార్యుడైన అంద్రెయ కెరోలోస్టాడ్ (Andreas Carolostadt) కు మధ్య జరిగెను.

ఎఖియస్ మార్టిన్ లూథర్ బోధించిన కొన్ని ఉపదేశములను, ముఖ్యముగా మతాధిపతుల క్షమాపణకు సంబంధించినవాటిని ఖండించెను. కెరోలో స్టాడ్, మార్టిన్ లూథర్ పక్షమున బలముగా వాదించెను. రాజైన జార్జ్ తర్కించుటకు వచ్చిన ఆ ఇద్దరికి, దాని చూచుటకు వచ్చిన ప్రేక్షకులకు ఏ అపాయము కలుగదని వాగ్దానము చేసెను. లూథర్ తర్కములో పాల్గొనుటకు కాదుగాని, వారు తర్కించు కొనునది వినుటకు హాజరయ్యెను.

లూథర్ ఉద్దేశ్యము వ్యతిరేకముగ ఉన్నను అతడు తప్పనిసరిగా ఎఖియస్తో వాదించవలసివచ్చెను. అతడు చర్చించిన ముఖ్యాంశము పోప్ యొక్క అధికారమును గురించినది. పోప్ జారీచేసిన శాసనముల విషయములో లూథర్ తన అలవాటైన దృక్పధమునే కలిగియుండి, పోప్ ప్రవేశపెట్టిన శాసనములకు లేఖనముల సమర్థన లేకుంటే అవి చెల్లనేరవని చెప్పెను.

పోప్లు పరిశుద్ధుడైన పేతురు వారసులనియు, సంఘముపై వారికి సంపూర్ణ అధికారము కలదను సంప్రదాయ సంఘ పద్ధతులను ఎఖియస్ బలపరచెను. అందు వలన వారు భూమిమీదనున్న క్రీస్తుయొక్క ప్రతినిధులనీ, రోమా బిషప్ యొక్క అధికా రము దేవుని చట్టములో స్థిరముగా స్థాపింపబడినదనీ అతడు బలముగా వాదించెను.

ఈ వాగ్వివాదములు ఐదు దినములు కొనసాగెను. ఎఖియస్ తన వాదనలో మూర్ఖత్వమును, అవిధేయతను, మోసమును ప్రదర్శించెను. అతడు లూథర్ను పోప్ చేతులకు అప్పగింపవలెనని తలంచెను. అందుకు కారణములను ఈ విధముగా చెప్పెను : “సంఘమనునది ఒక పౌర సమితివంటిది. నాయకుడు లేకుండా సంఘము, సైన్యాధిపతి లేకుండా సైనికదండు ఉండవు అని దేవుని చట్టము తెలుపుచున్నది. క్రీస్తుయొక్క సార్వత్రిక సంఘమునకు పోప్ నాయకుడుగ ఉండవలెననునది దేవుని చట్టముయొక్క సారాంశమేయని గ్రహించవలెను.”

సంఘమునకు అధిపతి కలడు ఆ అధిపతి స్వయముగా యేసుక్రీస్తేనని చెప్పుట ద్వారా మార్టిన్ లూథర్ ఆ వాదమును ఎదిరించెను. ఆయన ఒక్కడే సంఘమునకు శిరస్సుయని చెప్పెను. అప్పుడు ఎఖియస్ మత్తయి సువార్తలో యేసుప్రభువు చెప్పిన మాటలను ఉదహరించెను, “మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును” (మత్తయి 16:18).

యోహాను 20-22, 23

ఈ వాక్యము విశ్వాసముయొక్క ఒప్పుకోలు అని, పేతురు సార్వత్రిక సంఘమునే సూచించుచున్నాడు కాని తననుమాత్రము కాదని, ఆ బండ యేసుక్రీస్తు మరియు ఆయన వాక్యమే కాని పేతురు కానే కాదని లూథర్ విశదపరచెను. (యోహాను 21:16). ఈ మాటలు ప్రభువు పేతురుకుమాత్రమే చెప్పెననెను. అందుకు మార్టిన్ లూథర్

లూథర్ చెప్పినదానికి ఆధారములతో కూడిన అధికారముతో తన స్థానమును నిర్ధారించుకొనుటకు ఎఖియస్ కాన్స్టన్స్ సభయొక్క తీర్మానములను చూపించెను. సభలోని సభ్యులు పోపనకు వారి విధేయతను, సభకు అతనిని “పరమోన్నతాధికారిగ” నియమించుటను అతడు ఉదహరించెను. అట్టి ప్రముఖమైన విషయములో సాధారణ సభ తప్పుచేయదని అతడు చెప్పెను.

కొన్ని తీర్పులు మరియు కాన్స్టన్స్ సభయొక్క అధికారము గొప్పగా ఎంచబడినవి, కాని సభకు సంబంధించిన కొన్ని అంశములు ప్రశ్నింపతగినవి. ఎందుకనగా అవి మనుష్యుల సామాన్య తీర్పులని లూథర్ చెప్పెను. మరియు అతడు “ఏ సభకైనను విశ్వాసమునకు సంబంధించిన విషయములలో క్రొత్త ప్రతిపాదనలు చేయు అధికారము లేదు, ఇది నిశ్చయము” అని చెప్పెను.

ఈ వాగ్వివాదములోని నివేదికలు సరియైన నిర్ణయములు కాకపోయినను వాటిని ఐరోపా అంతటా వ్యాపింపజేసిరి. ఆ విధముగ ఎఖియస్ తన స్థానమును నిలుపు కొనెను. అయితే అతడు లూథర్ విశ్వాసమునకు, ఆచరణకు పరిశుద్ధ లేఖనములు ముఖ్య నియమములని దృఢముగ నమ్మెను.

క్రీ.శ. 1520 లో లూథర్ మూడు పుస్తకములు వ్రాసి, వాటిలో తన అభిప్రాయము లను వెల్లడించెను. మొదటిది ‘జర్మన్ దేశ క్రైస్తవ ఉన్నత వర్గానికి ఉద్బోధన’ (The Address to the Christian Nobility of the German Nation) అను పుస్తకము. ఇందు సంఘ సంస్కరణను తమ స్వహస్తములలోనికి తీసికొనవలెనని జర్మనీ ప్రభువుల నతడు ప్రోత్సహించెను.

రెండవ పుస్తకము ‘సంఘముయొక్క బబులోను చెరకు పీఠిక’ (A Prelude Concerning the Babylonian Captivity of the Church). ఇందులో అతడు రోమా సంఘముయొక్క ఆధిపత్యమును, సంస్కారములను ఖండించెను. మూడవది ‘క్రైస్తవ వ్యక్తి స్వాతంత్య్రము’ (On the Freedom of a Chris- tian Man). ఇందులో క్రైస్తవుని స్వాతంత్య్రము, దేవుని కృపావరములలో దృఢమైన విశ్వాసము, సత్కార్యములను వివరించెను.

లోవియన్ మరియు కొలోనే పట్టణములలోని మతగురువులు, పండితులు లూథర్ పుస్తకములు మత ద్రోహమునకు సంబంధించినవని నిందించిరి. మూర్ఖత్వము, క్రూరత్వము, దుర్మార్గము, అపవిత్రత కలిగి తనను నిందించు అధికారము కలిగిన మతగురువులకు లూథర్ తగినరీతిగ సమాధానమిచ్చెను.

క్రీ.శ. 1520 జూన్ 15న, పోప్ పదియవ లియో లూథర్కు ఒక ఆజ్ఞాపత్రికను జారీచేసెను. దాని ప్రకారము లూథర్ తన మతవ్యతిరేక చర్యలను అరువది దినములలో రద్దుపరచుకొనవలెను. అయితే ఆ ఆజ్ఞాపత్రిక లూథర్పై కాని, అతని సిద్ధాంతములపై కాని ఎట్టి ప్రభావమును చూపలేదు.

జర్మనీ ప్రభువులకు వ్రాసిన తన మొదటి పుస్తకములో లూథర్ మతగురువుల అధికారమును మూడు ముఖ్య భాగములుగా విమర్శించెను. అవి ఈ విధముగ నుండెను.

  1. ఆత్మీయ విషయములలో లోక సంబంధమైన నాయకులకు అధికారము లేదు.
  2. భేదము వచ్చిన వాక్యభాగము లేఖనములలో ఎక్కడున్నను పోహామాత్రమే దానిని వివరింపవలెను కాని మరియొకరు వివరింపకూడదు.
  3. పోప్ మినహా మరియొకరికి సభను సమావేశపరచు అధికారము లేదు.

ఇంకా అనేక విషయములను వివరించెను. అవి, పోప్ యొక్క గర్వమును అనుమ తింపకూడదు, జర్మనీనుండి చాలా ధనము పోప్కు పంపించబడెను, బోధకులు వివాహము చేసికొని భార్యలను కల్గియుండుట అనుమతింపబడవలెను, మాంసమును తినుటకుగల స్వాతంత్ర్యమును అరికట్టకూడదు, ఇష్టపూర్వకమైన పేదరికము మరియు యాచనను నిషేధింపవలెను, చక్రవర్తి సిజిస్మండు జాన్ హస్, జెరోమ్లతో పాటు నిలువబెట్టవలెను, మతద్రోహులను అగ్నితోకాక దేవుని వాక్యముతో ఒప్పించవలెను, పిల్లలకు బోధించు మొదటి పాఠము రోమా సంఘముయొక్క సంప్రదాయములను గురించికాక యేసుక్రీస్తుయొక్క సువార్తమీద కేంద్రీకరింపబడినదై యుండవలెను.

ఐదవ చార్లెస్ జర్మనీ రాజుగను, పవిత్ర రోమా చక్రవర్తిగను అభిషేకింపబడిన తరువాత పోప్ లియో ఇద్దరు కార్డినల్స్ను ఫ్రెడరిక్ ప్రభువునొద్దకు పంపెను. మార్టిన్ లూథర్పై చర్య తీసికొనునట్లు అతనిని ఒప్పించుటకు వారు పంపబడిరి. కార్డినల్స్ రాజు అభిమానమును పొందుటకు అతని పుట్టుకను, కుటుంబ సంస్కృతిని, అతని నాయకత్వమును ఘనపరచి రాజుకు పోప్ పేరున రెండు ప్రత్యేకమైన కోరికలను తెలియజేసిరి. అవి లూథర్ పుస్తకములన్నింటిని అతడు కాల్చివేయవలెను మరియు లూథర్ను రోముకు పంపవలెను లేక ఉరితీయవలెను.

లూథర్ను తన రాజ్యములో బంధించి ఉంచినట్లయితే ఇతర రాజ్యములలో ఉన్న రోమన్ కేథలిక్లపై అతని ప్రభావముండదని పోప్యొక్క సొంత సలహాదారుడు చెప్పినదానిని రాజుకూడ సమర్థించెను. లూథర్ యొక్క రచనలను, ఉపదేశములను పరిశీలనచేసి అతనిని మతద్రోహిగ రుజువుచేయుటకు పండితులైన వేదశాస్త్రజ్ఞులను, నిపుణులను పంపించమని పోప్కు తెలియజేయవలసినదిగా రాజు కార్డినల్స్తో ఇట్లు చెప్పెను :

అతడు మతద్రోహులలో ఒకడుగా నిర్ణయింపబడి

కార్డినల్స్ రోముకు తిరిగిరాకముందు, వారు లూథర్ పుస్తకములను అధిక సంఖ్యలో సేకరించి వాటిని బహిరంగముగ కాల్చివేసిరి. అది వినిన లూథర్ విటెస్బర్గ్ విశ్వవిద్యాలయములోని విద్యార్థులను, అధ్యాపకులను గుంపుగా ప్రోగుచేసి పోప్ తనకు వ్యతిరేకముగా జారీ చేసిన బహిష్కరణ దండన పత్రమును అందరియెదుట కాల్చివేసెను. ఇది క్రీ.శ. 1520, డిసెంబరు 10న జరిగెను.

క్రీ.శ. 1521, జనవరిలో పోప్ పదియవ లియో లూథర్ను ఈ చర్యనిమిత్తము మతద్రోహిగా తీర్పు చెప్పి, సంఘమునుండి బహిష్కరించవలెనను ఆజ్ఞను జారీచేసి చక్రవర్తియైన ఐదవ చార్లెస్ను దానిని అమలుపరచమని ఆజ్ఞాపించెను. కాని చక్రవర్తి ఆ విధముగ చేయుటకు బదులు వామ్స్ (Worms) పట్టణములో కేంద్ర శాసన సభను సమావేశపరచి, లూథరన్ను తనయెదుట హాజరుకమ్మని ఉత్తరువును పంపెను.

చక్రవర్తితో పాటు కొందరు ప్రముఖులు, మరికొందరు ప్రజలు ఎర్ల్ పెలటైన్ రాజు భవనములో సమావేశమైరి. సైనిక సంరక్షణలో లూథర్ను రహస్యముగ చక్రవర్తి యెదుట హాజరుపరచిరి, కాని ఆ రహస్యము ఎక్కువ కాలము నిలువలేదు. రహస్యముగా బంధింపబడిన లూథర్ను చూచుటకు గొప్ప జనసమూహము ఆ భవనములో ప్రవే శించగా, వారిని సైనికులు నివారించలేకపోయిరి.

అనేకమంది ప్రేక్షకులు కూర్చుండు టకు కట్టబడిన మెట్లపైకెక్కి అక్కడ జరుగుచున్న కార్యక్రమములను చూచుటకు కూర్చుండిరి. ఒకసారి లూథర్ మాట్లాడుటకు ప్రయత్నించినప్పుడు, పెపన్ హేమకు చెందిన ఉల్లిక్ (Ulrick) తాము మాట్లాడుమని అతనిని అడుగు సమయము వచ్చువరకు నిశ్శబ్దముగా నుండవలెనని లూథరన్ను ఆజ్ఞాపించెను.

రాజు అభిమానమును పొందుటకు అతని పుట్టుకను, కుటుంబ సంస్కృతిని, అతని నాయకత్వమును ఘనపరచి రాజుకు పోప్ పేరున రెండు ప్రత్యేకమైన కోరికలను తెలియజేసిరి. అవి లూథర్ పుస్తకములన్నింటిని అతడు కాల్చివేయవలెను మరియు లూథర్ను రోమ్ముకు పంపవలెను లేక ఉరితీయవలెను.

లూథర్ను తన రాజ్యములో బంధించి ఉంచినట్లయితే ఇతర రాజ్యములలో ఉన్న రోమన్ కేథలిక్లపై అతని ప్రభావముండదని పోప్యొక్క సొంత సలహాదారుడు చెప్పినదానిని రాజుకూడ సమర్థించెను. లూథర్ యొక్క రచనలను, ఉపదేశములను పరిశీలనచేసి అతనిని మతద్రోహిగ రుజువుచేయుటకు పండితులైన వేదశాస్త్రజ్ఞులను, నిపుణులను పంపించమని పోప్కు తెలియజేయవలసినదిగా రాజు కార్డినల్స్తో ఇట్లు చెప్పెను :

కార్డినల్స్ రోముకు తిరిగిరాకముందు, వారు లూథర్ పుస్తకములను అధిక సంఖ్యలో సేకరించి వాటిని బహిరంగముగ కాల్చివేసిరి. అది వినిన లూథర్ విటెన్ బర్గ్ విశ్వవిద్యాలయములోని విద్యార్థులను, అధ్యాపకులను గుంపుగా ప్రోగుచేసి పోప్ తనకు వ్యతిరేకముగా జారీ చేసిన బహిష్కరణ దండన పత్రమును అందరియెదుట కాల్చివేసెను. ఇది క్రీ.శ. 1520, డిసెంబరు 10న జరిగెను.

క్రీ.శ. 1521, జనవరిలో పోప్ పదియవ లియో లూథర్ను ఈ చర్యనిమిత్తము మతద్రోహిగా తీర్పు చెప్పి, సంఘమునుండి బహిష్కరించవలెనను ఆజ్ఞను జారీచేసి చక్రవర్తియైన ఐదవ చార్లెస్ను దానిని అమలుపరచమని ఆజ్ఞాపించెను. కాని చక్రవర్తి ఆ విధముగ చేయుటకు బదులు వామ్స్ (Worms) పట్టణములో కేంద్ర శాసన సభను సమావేశపరచి, లూథర్ను తనయెదుట హాజరుకమ్మని ఉత్తరువును పంపెను.

చక్రవర్తితో పాటు కొందరు ప్రముఖులు, మరికొందరు ప్రజలు ఎర్ల్ పెలటైన్ రాజు భవనములో సమావేశమైరి. సైనిక సంరక్షణలో లూథర్ను రహస్యముగ చక్రవర్తి యెదుట హాజరుపరచిరి, కాని ఆ రహస్యము ఎక్కువ కాలము నిలువలేదు. రహస్యముగా బంధింపబడిన లూథర్ను చూచుటకు గొప్ప జనసమూహము ఆ భవనములో ప్రవే శించగా, వారిని సైనికులు నివారించలేకపోయిరి.

అనేకమంది ప్రేక్షకులు కూర్చుండు టకు కట్టబడిన మెట్లపైకెక్కి అక్కడ జరుగుచున్న కార్యక్రమములను చూచుటకు కూర్చుండిరి. ఒకసారి లూథర్ మాట్లాడుటకు ప్రయత్నించినప్పుడు, పెపన్ హేమకు చెందిన ఉల్టిక్ (Ulrick) తాము మాట్లాడుమని అతనిని అడుగు సమయము వచ్చువరకు నిశ్శబ్దముగా నుండవలెనని లూథరన్ను ఆజ్ఞాపించెను.

ట్రెవెస్ (Treves) పట్టణ బిషప్ యొక్క ప్రతినిధి సభను ప్రారంభించుచూ ఇట్లనెను: ఆ ప్రశ్నలేవనగా, నీయెదుట కుప్ప వేయబడిన పుస్తకములను నీవే వ్రాసితివా? వాటిని ఉపసంహరించుకొందువా లేక బలపరచెదవా?”

అందుకు లూథర్ “దేవుని వాక్యమునకు కీడు కలుగకుండ, నా ఆత్మ నరకమునకు పోకుండ, నాకు తృప్తికలుగువరకు ధ్యానము చేసికొనిన తరువాత సమాధానమిచ్చుటకు కావలసిన స్వేచ్ఛను, సమయమును అనుగ్రహింపుమని వినయముగా వేడుకొను చున్నాను” అని జవాబిచ్చెను.

లూథర్ విన్నపమునుగూర్చి రాజులందరూ చర్చించుకొనిన తరువాత ఎఖియస్ (Eckius) అనునతడు చక్రవర్తి నిర్ణయమును ఈ విధముగ తెలియజేసెను. “ఘనత వహించిన చక్రవర్తి కనికరమునుబట్టి నీవు ధ్యానము చేసికొని సమాధానమిచ్చుటకు ఒక దినము సమయము అనుగ్రహింపబడెను. రేపు, ఇదే సమయమునకు వ్రాత పూర్వకముగా కాక వాంజ్ఞ్మూలముగ నీ సమాధానమును చెప్పవలెను.”

ఎఖియస్ లూథరన్ను వెంటబెట్టుకొని తన గదిలోనికి తీసికొనివెళ్లగా, అచ్చట లూథర్ మరుసటి దినము చెప్పవలసిన జవాబునిమిత్తము దేవుని చిత్తమును తెలిసి కొనుటకు వాక్యమును శ్రద్ధగా చదువుచు ప్రార్థించుచుండెను.

మరుసటి ఉదయమున లూథర్ సమాధానము వినుటకు అనేకమంది గుమి కూడిరి. ఎఖియస్ లూథర్ ఇట్లనెను, “చక్రవర్తి ఆదేశమునకు ఇప్పుడు జవాబు చెప్పుము. నీవు వ్రాసిన పుస్తకములలోని విషయములన్నిటిని నీవు మనస్పూర్తిగా అంగీకరించెదవా లేక వాటిలో ఏ భాగమునైనను ఉపసంహరించుకొనెదవా? నీమీద అధికారులుగా దేవుడు నియమించినవారికి నిన్ను నీవు అప్పగించుకొనెదవా?”

అందుకు మార్టిన్ లూథర్ ఈ విధముగ సమాధానమిచ్చెను. “ఘనతవహించిన మహా చక్రవర్తీ! మీరు సరియగు సమాధానమును కోరిన విషయమును దృష్టిలో నుంచుకొని మోసపూరితముగా కాకుండ, లేఖనములకు విరుద్ధముగా కాకుండ, నిస్సందేహముగాను, నిశ్చయముగాను, స్థిరమైనది, యథార్థమైనదానిని నేను ఈ విధముగ ఒప్పుకొనుచున్నాను.

మార్టిన్ లూథర్! పవిత్ర రోమా సామ్రాజ్యాధినేతలందరి అంగీకారమువలన పవిత్రుడును,

అనేకసార్లు తప్పులు చేసి వారిలో వారికి విభేదములు గల పోషన్ను, ఆయన ప్రముఖుల సభను నేను నమ్మను – నా మనఃస్సాక్షి పరిశుద్ధ లేఖనములకు, దేవుని మాటకు అంకితమై పూర్తిగా బంధింపబడినది. కనుక వాటిని నమ్ముటమాత్రమేకాక ఒక్కదానినైనను ఉపసంహరించుకొనుటకు వీలుపడదు. నా మనఃస్సాక్షికి వ్యతిరేకముగా జేయుట నాకు అన్యాయము, అది దేవునికి వ్యతిరేకముగా నుండును. దీనిపైననే నేను ఆధారపడి నిలుచున్నాను. నేను చెప్పుటకు మరింకేమియు లేదు. దేవుని కృప నాపై కలదు.”

రాజులు మరలా సంప్రదించుకొనిన తరువాత, ఎఖియస్ లూథర్ – “నీవు వ్రాసినవన్నియు క్రైస్తవ్యమని నిరూపించుటకు నీవు యిష్టపడుచున్నావా? ఈ ప్రశ్నకు ‘అవును, కాదు’ అను క్లుప్తమైన జవాబును చక్రవర్తి కోరుచున్నాడ”ని చెప్పెను.

చక్రవర్తి మరియు ప్రముఖులవైపు తిరిగి తన మనఃస్సాక్షిని గౌరవించవలసినదిగ లూథర్ వారిని ప్రార్థించెను. తన మనఃస్సాక్షి పరిశుద్ధలేఖనములకు అనుకూలముగ స్థిరపరచబడినది కనుక తన మనఃస్సాక్షికి విరుద్ధముగా బలవంతము చేయవద్దని వారిని వేడుకొని, “నేను లేఖనములకు కట్టుబడి ఉన్నాను” అను మాటలతో లూథర్ తన జవాబును ముగించెను.

సాయంత్రమై చీకటిపడినప్పటికి సభలోని ప్రముఖులు లూథర్ విషయములో తుది నిర్ణయమునకు రాలేకపోయినందున వారు తమ విచారణను ఆపి లూథర్ను బందోబస్తుతో అతని నివాసమునకు పంపిరి. వారు మరల సమావేశమైనప్పుడు, చక్రవర్తినుండి వచ్చిన లేఖను సభకు చదివి వినిపించిరి.

దాని ప్రకారము తన ఉద్దేశ్యములను లూథర్ ఉపసంహరించుకొనకపోయినను, చక్రవర్తి ఇచ్చిన తన వాగ్దానమును నిలుపుకొనుటకు లూథర్కు ఎట్టి ప్రమాదము వాటిల్లకూడదని ఆదేశించగా, లూథర్ ఇంటికి తిరిగి వెళ్లెను. అతడు సభనుండి ఇంటికి తిరిగి వెళ్లకమునుపు ఇరువదియొక్క దినముల తరువాత చక్రవర్తి న్యాయస్థానములో మరల హాజరుకావలెనని తెలిపిరి.

ఈ మధ్యకాలములో లూథర్కు వ్యతిరేకముగ భయంకర ఉద్యమము చెలరేగెను. అతనికి వ్యతిరేకముగా ఫిర్యాదు చేయబడిన ప్రకటన కాగితములు గోడలకు అతికించబడినవి. సామ్రాజ్యమంతట మతనాయకుల, సామాన్యప్రజల పెదవులమీద లూథర్ పేరు ప్రతిధ్వనించెను.

మూడు వారముల వ్యవధిలో చక్రవర్తి, పోప్ ఒక అంగీకారమునకు వచ్చి లూథర్ను, లూథర్ చేయుచున్న పనిలో భాగస్థులైనవారిని దేశద్రోహులుగా ప్రకటించి, లూథర్ ఎక్కడ కన్పించినా అతనిని ఖైదుచేసి, అతని పుస్తకములన్నింటిని చేజిక్కించుకొని కాల్చివేయవలెనని ఆజ్ఞాపించిరి. అందుచే లూథర్ వార్ట్బర్గ్ (Wartburg) కోటలో రహస్యముగా ఎనిమిది నెలలు దాగియుండెను. ఈ కాలములోనే అతడు క్రొత్త నిబంధన గ్రంథమును జర్మన్ భాషలోనికి అనువదించెను. ఇంకను అనేక పత్రికలుకూడ వ్రాసెను.

ఇదేకాలములో ఇంగ్లాండు రాజైన ఎనిమిదవ హెన్రీ లూథరుకు వ్యతిరేకముగ ఒక శాసనము జారీచేసెను. ఫలితముగ పోప్ ఆ రాజుకు ఘనమైన “విశ్వాస సంరక్షకుడు” అను (Defender of the faith) బిరుదునిచ్చి గౌరవించెను.

పోప్ పదియవ లియోకు క్రీ.శ. 1521 నవంబరులో జ్వరము వచ్చి డిసెంబరు ఒకటిన మరణించెను, అతని వయస్సు 47 సం॥లు. అతనికి విషప్రయోగము జరిగినదని అనేకమంది అనుమానించిరి. చక్రవర్తియైన చార్లెస్కు ఉపాధ్యాయుడు, గొప్ప పండితుడైన ఆరవ అద్రియన్ (Adrian) అతని తరువాత పోష్గా నియమింప బడెను. అద్రియన్ లోవైన్ (Louvain) లో పెరిగిన జర్మనీ దేశస్థుడు. ఇతడు గొప్ప విద్యావంతుడు కనుక అతడు పూర్వమున్న పోప్లోవలెగాక ఆధునికమైన నాగరిక జీవనవిధానమును అనుసరించెను.

ప్రొటెస్టంట్ మత సంస్కరణోద్యమమునకు ప్రతిస్పందించి, రోమన్ కేథలిక్ సంఘమును సంస్కరింపవలెనను ప్రయత్నము చేసిన మొదటి పోప్ అద్రియన్ యైనప్పటికీ, ఇతడు లూథర్ను సంఘమునకు మరియు పోషకు శత్రువుగానే పరిగణించెను. ఇతడు పోప్ నియమింపబడిన కొద్దికాలమునకు చక్రవర్తి జర్మనీ రాజ్యముల సమావేశమును క్రీ.శ. 1522 లో న్యూరెంబర్గ్ (Nuremberg) లో ఏర్పాటుచేసెను.

ఆ సభలో లూథర్నుగూర్చి తన అభిప్రాయములను అద్రియన్ ఒక పత్రికద్వారా వెల్లడిపరచెను. అతని పత్రిక సారాంశము ఈ విధముగ ఉన్నది : “మార్టిన్ లూథర్ మిక్కిలి చెడ్డవైన పాత మత ద్రోహములనుండి క్రొత్తగా ఉదయించినవాడు. మొదట పోప్ల ముఖ్య ప్రకటనలద్వారా అతనికి మరణశిక్ష విధింపబడెను.

అయినను అతడు తన పిచ్చితనమునుండి తొలగక దినదినము తప్పులతోను, అనేక మతద్రోహములతోను, అవిధేయత తోను, దేశద్రోహముతోనుకూడిన క్రొత్త పుస్తకములద్వారా ప్రపంచమును కలతపెట్టుట మానక జర్మనీ దేశమంతటిని పాడుచేసెను. ఇదే వ్యాధి ఇతర ప్రాంతములకుకూడ వ్యాపించినది.

అతడు విషముగల చెడు నాలుకతో సామాన్య ఆత్మలను, మనుష్యుల ప్రవర్తనను పాడుచేయుటకు ఇంకను ప్రయ త్నించుచుండెను. అన్నిటికంటె చెడ్డదేమనగా అతడు తనకు సహకరించిన వారినికూడ పాడుచేయుచున్నాడు.

ఓ జర్మనీ ప్రభువులారా! ప్రజలారా! లూథర్, అతని లూథరనుల చెడు కార్యములకు, మోసములకు ఇవి ఉపోద్ఘాతము, ముందుమాటలని మీరు ఇంకనూ గుర్తించలేరా? సువార్త సత్యమును కాపాడుచున్నట్లు నటించుట లూథరనులచే మొదట ప్రారంభించబడినదని మీరు మీ కన్నులతో చూచి స్పష్టముగ గ్రహించలేరా?

వారు బహుకాలమునుండి ఆశించినట్లుగా మీ ఆత్మలను పాడుచేయ తలంచుట ఇప్పుడు బహిరంగముగా స్పష్టమైనది. విధేయతను విడనాడుటకు స్వాతంత్య్రమను పేరుతో ఈ అన్యాయ పుత్రులు ఎవరి ఇష్టము వచ్చినట్లు వారు ప్రవర్తించుటకు మార్గము కల్పించుకొనిరని మీరు గ్రహించలేదా?

బోధకులకు, బిషప్లకు, మరియు ప్రధాన బిషప్లకు విధేయత కల్గియుండుటకు బదులు మీ కన్నుల యెదుటే సంఘ ఆస్తులను, దేవునికి అభిషేకించిన వస్తువులను దొంగిలించుట మీరు చూచితిరిగదా, ఇక సామాన్య ప్రజల వస్తువులనుండి వారి చేతులను వెనుకకు తీసికొనెదరని మీరు అనుకొనుచున్నారా? వారి చేతులకు అందినదానినంతటిని పెరికి వేయరని మీరు తలంచుచున్నారా?

మీరు అట్టివారికి వ్యతిరేకముగ త్వరలో సరియైన పరిహారమును కనుగొనకపోయినచో మీమీద, మీ వస్తువులమీద, గృహములమీద, భార్యలమీద, పిల్లలమీద, రాజ్యములమీద, ఆస్తిమీద, మీకు భక్తి గౌరవ ములున్న దేవాలయములమీద కూడ ఈ దుఃఖకరమైన విపత్తుయొక్క ప్రభావము అధికముగా ఉండును.

అందువలన ఈ బహిరంగ అగ్నిని ఆర్పుటకు క్రైస్తవులందరు పరిశు ద్ధుడైన దేవునికి, ధన్యుడైన పేతురుకు, భూమిమీద అతని ప్రతినిధియైన పోప్కు మీ సహాయము అందించవలెనని కోరుచున్నాము. మార్టిన్ లూథర్ను ఈ ఆందోళనలకు, తప్పులకు కారకులైన మోసగాళ్లనందరిని అణచుటకు మీ శాయశక్తుల సహకరించవలెను. జీవమునకు, విశ్వాసము నకు అనుకూల వాతావరణమును వృద్ధిచేయవలెను.

ఈ మోసగాళ్లు ఎవరైన మీ గద్దింపులు వినుటకు నిరాకరించినచో వారివలన మంచిగా ఉన్న ప్రజలుకూడా చెడిపోకుండునట్లు ఏర్పాట్లు చేయవలెను. నైతికముగా చెడిన నోటిపుండుగల వ్యాధి కల్గినవారిని మెత్తదనము, నెమ్మది అను మందులద్వారా బాగుచేయలేకపోతే, మంచి భాగములుకూడ రోగగ్రస్థము కాకుండునట్లు నొప్పి కలిగించెడి మందును, మాడిపోవునట్లు చేయు అగ్ని వంటి మందులను తప్పక ఉపయోగించవలెను.

ఆ మార్గములో మోషేను ఎదిరించి అభిప్రాయభేదములచే మతము నుండి వేరైన దాతాను, అబీరాములను దేవుడు నరకములోనికి విసరెను, మరియు ఎవరైతే మతాధికారికి విధేయులైయుండరో అట్టివారికి మరణ శిక్ష విధించవలెనని ఆజ్ఞాపించెను. కనుక అపొస్తలులలో ప్రధానుడైన పేతురు – దేవునిని మోసగించవలెనని ప్రయత్నించిన అననీయ, సప్పీరాలకు మరణదండన విధించెను. కనుక గతములో పాలించిన దైవిక చక్రవర్తులు జొవీనియన్ మరియు ప్రిసీలియన్లను మతద్రోహులని తీర్పు చెప్పి శిరచ్ఛేద నము గావించిరి.

అదేవిధముగ, కాన్న్స్ సభలో మన పూర్వికులు జాన్ హసన్ను అతని అనుచరులను, జెరోమ్ను దండించి చంపిరి. ఇప్పుడు మార్టిన్ లూథర్ హస్ పునరుజ్జీవింపబడినట్లు కన్పించుచున్నది. మన పూర్వికుల ఆచరణ యోగ్యమైన కార్యములను, ఉదాహరణలను మీరు అనుకరించి నట్లయితే దేవుని దయగలిగిన కృప తన సంఘమును విడుదల చేయుననుటలో సందేహము లేదు.”

పోప్ యొక్క పిలుపునకు స్పందించిన సామ్రాజ్యములోని రాజులందరు కలసి లూథర్ను శిక్షించుటకు పోప్కు ఒక ఉత్తరము వ్రాసిరి. ఆ ఉత్తరముయొక్క సారాం శము ఈ విధముగ ఉన్నది : “పూజ్యులైన మీరు (పోప్) గొప్ప దుఃఖముతో బాధపడుటకు లూథరు, అతనియొక్క మతశాఖ కారణమని మేము గ్రహించితిమి.

అతని ప్రభావము నకు లోనైనవారి ఆత్మలు ప్రమాదకరమైన నిత్య నరకములోనున్నవని మేము గుర్తించుచున్నాము. మీ దుఃఖములో మేమును భాగస్వాములము. జర్మనీలోని అనేకమంది ప్రజలు మార్టిన్ లూథర్ అభిప్రాయములతో పోలిన మార్గము లను అనుసరించుచున్నందున ఇంతవరకు లూథర న్ను శిక్షించుట జరుగ లేదు. ఇది సామ్రాజ్యములో గొప్ప పునరుజ్జీవమును, అనుకూలతనుబట్టి యుద్ధమునకును దారితీయును.

లూథర్ యొక్క మార్గములను అనుసరించుచున్న సామాన్య ప్రజలను సంస్కరింపకపోయినచో లౌకిక, మత విషయములలో సఖ్యత ఏర్పడుటకు ఇక అవకాశముండదు.

కనుక సాధ్యమైనంత త్వరగా పోప్, చక్రవర్తియొక్క అంగీకారముతో జర్మనీలోని ఒక అనుకూల స్థలమందు క్రైస్తవ సభను ఏర్పాటుచేయవలెనని మేము సిఫారసు చేయుచున్నాము. ఆ సభలో ప్రజలు భయము లేకుండ స్వేచ్ఛగా మాట్లాడుటకు అవకాశము కల్పించవలెను.

లూథర్గాని, అతని అనుచరులుగాని ఇకపై వ్రాయుటకు, ప్రకటించు టకు, ఏదేని అచ్చువేయించుటకు అనుమతి పొందకుండునట్లు చేయు బాధ్యత ఫ్రెడరిక్ ప్రభువునకు అప్పగింపవలెనని మేము సిఫారసు చేయు చున్నాము. అతని రాజ్యములోని బోధకులందరు లూథర్ యొక్క ఉద్దేశ్యము లను ప్రచారము చేయకుండ నిషేధింపవలెను.

ఈ ఉత్తరువును ఉల్లంఘించు బోధకులు శిక్షింపబడుదురు. ఎట్టి క్రొత్త పుస్తకమునైన అమ్మబడుటకు ముందు సంఘాధికారుల అనుమతి తీసికొన వలెను. బోధకులు వివాహము చేసికొనినచో లేక బాధ్యతలను విస్మరించిన యెడల వారు సంఘనాయకులచేత శిక్షింపబడుదురు.”

ఇది జరిగిన వెంటనే లూథర్ అనుచరులలో ఒకడైన అంద్రెయ కెరోలోస్టాడ్ (Andreas Carolostadt) పోప్కు, ఆయనయొక్క ఉన్నత హోదాకలిగిన బిషప్లకు మరింత కోపము కలిగెడి కార్యములు చేయునట్లు ప్రజలను ప్రేరేపించి, రోమా దేవాలయములలోని విగ్రహములను, ప్రతిమలను కూలద్రోయించెను. ఆ విధముగ పరిశుద్ధ స్థలములను, విగ్రహములను, సిలువలను నాశనము చేయుచున్న ఉద్రేక పూరితులైన ప్రజలలో శాంతి భద్రతలను పునరుద్దరించుటకు లూథర్ విటెన్బర్గ్ కు క్రీ.శ. 1522 మార్చిలో తిరిగి వచ్చెను.

తరువాతి సంవత్సరములలో వందకుపైగా పత్రికలు, వ్యాసములు, బైబిలు వ్యాఖ్యానములు, వేలకొలది ఉత్తరములు, బైబిలునంతటిని జర్మనీ భాషలోనికి తర్జుమా చేయుట మొదలగు కార్యక్రమములతో లూథర్ జీవితము నిండియుండెను.

ఫిలిప్ మెలాంక్తన్ (Philipp Melanchthon) మరికొందరి సహకారముతో మార్టిన్ లూథర్ జర్మనీలో అనేక సువార్త సంఘములను స్థాపించి, అనేక శతాబ్దముల నుండి అమలులోనున్న సంప్రదాయక మూఢనమ్మకములను రద్దుచేసెను.

లూథర్ క్రీ.శ. 1546 ఫిబ్రవరి 18న చనిపోవునాటికి అరువది మూడు సంవత్సరముల వయస్సు కలవాడు. ఈ గొప్ప సంస్కర్తయొక్క చివరి గడియలను మెలాంక్తన్ ఈ విధముగ వర్ణించెను : బుధవారము గతించినది, ఫిబ్రవరి 17న డా. మార్టిన్ లూథర్ తనయొక్క దీర్ఘవ్యాధిచేత బలహీనుడయ్యెను. సాయంకాలము భోజనమైన తరువాత అతనికి మరింత బలహీనత ఆవరించెను. దానితో అతడు తీవ్రముగ బాధపడుచు విశ్రాంతి గదిలోనికి వెళ్లి అక్కడ తన మంచముపై రెండు గంటలు విశ్రమించెను. ఈ లోపు అతని బాధ అధికమైనది.

తన చివరి గడియ సమీపించుచున్నప్పుడు ఫిబ్రవరి 18 ఉదయము 9 గంటల ముందు భక్తిపూర్వకముగ ప్రార్థించి దేవునికి స్తోత్రములు చెల్లించెను. “నా పరలోకపు తండ్రీ, నిత్యజీవము, కృపగల దేవా, నీ ప్రియ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తును మాకు ప్రత్యక్షపరచితివి. ఆయననుగురించి నేను బోధించితిని. నేను ఆయన నెరుగుదును.

నా ప్రాణము, నా ఆర్యోగము, నా విమోచకునిగ నేనాయనను ప్రేమించితిని. నేను ప్రేమించిన ఆయనను దుష్టులు హింసించి, దూషించి, బాధించిరి. నా ఆత్మను నీ సన్నిధికి చేర్చుము.”

కొన్ని నిమిషములు గడిచిన తరువాత లూథరు స్తోత్రములు చెల్లించు ప్రార్థన మూడుసార్లు చేసెను : “ఓ సత్య దేవా, నీవు నన్ను విమోచించితివి. నా ఆత్మను నీ చేతులకు అప్పగించుచున్నాను”. ఈ ప్రార్ధన అనంతరము లూథర్ తన అభిమాన లేఖన భాగమును ఒప్పగించెను: అది ముగియగానే అతడు తన కన్నులు మూసికొనెను, ఇక మరెన్నటికిని తెరువలేదు.

యోహాను 3-16

అతని మరణముతోపాటు అతని సేవకూడ నశించునని లూథర్ విరోధులు సంతోషించిరి. అయితే అది దేవుని సత్య వాక్యముమీద ఆధారపడినది గనుక ఆలాగున జరుగలేదు. దేవుని వాక్యమువలే లూథర్యొక్క సిద్ధాంతములుకూడ యేసుక్రీస్తుయొక్క సత్యసువార్తను లోకమంతటా వ్యాపింపజేసినవి.

స్కాట్లాండులో హింసలు (క్రీ.శ. 1527-1558)

స్కాట్లాండులో హింసలు (క్రీ.శ. 1527-1558)

మార్టిన్ లూథర్ యొక్క ఉపదేశములు మరియు నిజవిశ్వాసులకు రోమన్ కేథలిక్ సంఘముతో కలిగిన విభేదములు ఐరోపా, గ్రేట్ బ్రిటన్ మరి అనేక దూర ప్రాంతములలో గొప్ప ఫలితములు కలిగించెను. అవి అనేకమంది హృదయములలో మంచి స్పందన కలిగించి, దేవుని వాక్యములోని సత్యాన్వేషణకు వారిని నడిపించెను.

అట్టి సత్యాన్వేషకులలో పాట్రిక్ హామిల్టన్ (Patrick Hamilton) అను స్కాట్లాండ్ దేశస్థుడు ఒకడు. లేఖనములలోని సత్యమును నేర్చుకొనుటకు అతడు, అతని ముగ్గురు స్నేహితులు పశ్చిమ-మధ్య జర్మనీలోని మార్ బర్గ్ (Marburg) విశ్వవిద్యాలయమునకు వెళ్లిరి. అది ఐరోపాలోని మొట్టమొదటి ప్రొటెస్టంట్ విశ్వవిద్యాలయము.

ఈ విశ్వ విద్యాలయము 23 సంవత్సరముల వయస్సుగల హెస్సీ (Hesse) పట్టణ యువ రాజైన ఫిలిప్చే స్థాపించబడెను. అక్కడ పాట్రిక్, అతని స్నేహితులకు మార్టిన్ లూథర్, ఫిలిప్ మెలాంగ్డన్ (Philipp Melanchthon) లతో స్నేహమేర్పడెను. జర్మన్ వేదశాస్త్ర పండితుడైన మెలాంగన్ క్రీ.శ. 1521 లో ప్రొటెస్టంట్ సిద్ధాంతముమీద ‘లోసి కమ్యూనెస్’ (Loci Communes) అను మొదటి వ్యాసమును వ్రాసెను. లూథర్, మెలాంగన్ల రచనలు, సిద్దాంతములద్వారా పాట్రిక్, అతని స్నేహితులు కేథలిక్ (మత) సంఘమును విడిచి ప్రొటెస్టంట్ విశ్వాసములోనికి మార్పుచెందిరి.

విశ్వాసముయొక్క నిజమైన జ్ఞానముతోను, దైవత్వముతోను పురికొల్పబడిన పాట్రిక్ హామిల్టన్ స్కాట్లాండ్కు తిరిగివెళ్లి లేఖనములలో స్పష్టముగ చూపించబడిన క్రీస్తుయొక్క న్యాయమార్గములను తన దేశ ప్రజలకు ఉపదేశించవలెనన్న ఆతృత కలిగియుండెను. కనుక ఆలస్యముచేయక తన ముగ్గురు స్నేహితులను వెంటబెట్టుకొని, స్కాట్లాండ్ తిరిగివచ్చి బోధించుట ప్రారంభించెను.

వెంటనే, పరి. అంద్రెయ చర్చి ఆర్చిబిషప్ జేమ్స్ బీటన్ అను కఠినుడైన మతగురువు హామిల్టన్ ఉపదేశములనుగూర్చి విని, తనయెదుట హాజరుకావలెనని హామిల్టన్కు కబురు పంపెను. మత సిద్ధాంతములలో వాదము పెట్టుకొనుటకిది మంచి అవకాశమని హామిల్టన్ తక్షణమే ఆర్చిబిషపు దర్శించెను.

కొద్దిసేపు విచారించిన తరువాత ఆర్చిబిషప్ అతనిని బంధించి ఉదయము వరకు తన భవనములోని అసహ్యకరమైన స్థలములో ఉంచి, మతద్రోహిగా చిత్రీక రించుటకు బిషప్ సభయెదుట హాజరుపరచెను. తీర్థయాత్రలు, ప్రక్షాళనము, పరిశు ద్ధులకొరకు ప్రార్థనలు, మృతులకొరకు ప్రార్థనలు, విగ్రహారాధనలను నిరాకరించుట, పోప్యొక్క గొప్పతనమును తిరస్కరించుట అను నేరములు అతనిపై మోపిరి. తనపై మోపబడిన నేరములన్నియు వాస్తవమేనని హామిల్టన్ అంగీకరించగా, ఆ మధ్యాహ్నమే అతనిని సజీవదహనము చేయవలెనని బిషప్ మొండిగా తీర్పు చెప్పెను.

చూడవచ్చిన జనసమూహము హామిల్టన్ను తప్పనిసరిగ కాల్చి చంపెదరని నమ్మ లేదు. బహుశః వారు అతనిని భయపెట్టి, తన సిద్ధాంతములను విడచి రోమా మత సిద్ధాంతములను తిరిగి స్వీకరించునట్లు చేసెదరని తలంచిరి. అయితే తాము పొరపాటు పడిరని వారు త్వరలోనే తెలిసికొనిరి.

ఉరికంబమునొద్దకు హామిల్టన్

అయితే ఆ మందు పేలలేదు కాని చేతులు, ముఖము మాత్రము కాలినవి. ఇంకా ఎక్కువ తుపాకీమందు తెచ్చి, అతని చుట్టూగల కట్టెలపై చల్లి నిప్పు ముట్టించిరి. తుపాకీ మందు అప్పుడుకూడ పేలలేదు కాని తెల్లని అగ్నిజ్వాలలు చెలరేగి హామిల్టన్ ను చుట్టుముట్టెను. మంటలు అతనిని ఆవరించినప్పుడు, “యేసుప్రభూ, నా ఆత్మను చేర్చుకో! ఎంతకాలము ఈ రాజ్యమును చీకటి ఆవరించును? ఈ మనుష్యులక్రూరత్వము నెంతవరకు నీవు అనుమతించెదవు?” అని గట్టిగా పలికెను.

ఆ కట్టెలు చూచుటకు పచ్చగా ఉన్నవి కాని తరువాత అవి నెమ్మదిగా కాలుటవలన అతనికి బాధ ఎక్కువైనది. అయినను, ఆ బాధను క్రీస్తునందలి ధైర్యముతో అతడు భరించెను. అతని హతసాక్షి మరణమును చూచిన నిజవిశ్వాసులందరు దేవుని కృప అతనికి తోడుగా ఉండుట గమనించిరి. ఇట్లు పాట్రిక్ హామిల్టన్ హతసాక్షి మరణము క్రీ.శ. 1527 వ సంవత్సరములో సంభవించెను.

క్రీ.శ. 1529 లో హెన్రీ ఫారెస్ట్ (Henry Forest) అను క్రైస్తవ సన్యాసి పాట్రిక్ హామిల్టన్ బోధించిన సిద్ధాంతములు సత్యమని చెప్పుట ప్రారంభించెను. ఇది ఆర్చిబిషప్ జేమ్స్ బీటన్కు తెలియగా, హెన్రీ ఫారెస్ట్ను చెరసాలలో బంధించి, అతడు చేసిన నేరములను విచారణచేయుటకు ఒక మతాధికారిని పంపెను.

అతడు ఒప్పుకొనిన విషయములను వాస్తవమునకు రహస్యముగా ఉంచవలెను, కాని ఆర్చిబిషప్ ఆజ్ఞ ప్రకారము ఆ మతాధికారి ‘మోసగాడైన యూదా’ వలె ఫారెస్ట్ ఒప్పుకొనినవన్నియూ ఆర్చిబిషప్కు తెలియజేసెను. ఫారెస్ట్ తన ఒప్పుదలలో “పాట్రిక్ హామిల్టన్ మంచివాడని అతడు బోధించిన ఉపదేశములు లేఖనానుసారమైనవి” అని తెలియజేసెను.

హెన్రీ ఫారెస్ట్ ఒప్పుకొనిన విషయములను అతనికి వ్యతిరేక సాక్ష్యముగా చూపించి అతనిని సజీవదహనము చేయవలసినదిగా ఆర్చిబిషప్ ఆజ్ఞాపించెను. హెన్రీ ఫారెస్ట్ పేరు ప్రఖ్యాతులుగల దైవజనుడు కనుక ప్రజలకు ఎక్కువగ బాధ కలిగింపకుండ, అతనిని ఏవిధముగ చంపవలెనో ఆలోచన చేయుటకు ఆర్చిబిషప్ సభను సమావేశపరచెను.

ఆర్చిబిషప్ పనివారిలో ఒకడైన జాన్ లిండ్సే “పాట్రిక్ హామిల్టన్ను కాల్చినప్పుడు వచ్చిన పొగ ఎవరిమీద వ్యాపించునో వారందరిపై ఫారెస్ట్ ప్రభావము చూపించును కనుక భూమిలో ఇంటికి అడుగు భాగమున కట్టబడిన గది (Cellar) వంటి రహస్యస్థలములో చంపుట మంచిది” అని సలహా యిచ్చెను. ఆర్చిబిషప్ దానికంగీకరించి, ఆ గదిలోనికి ఫారెస్ట్ను తీసికొనిపోయి అతనికి ఊపిరాడకుండ దట్టమైన తలదిండు ముఖమునకు అదిమిపెట్టి చంపెను.

క్రీ.శ. 1534 లో డేవిడ్ స్ట్రాటన్ (David Stratton), నార్మన్ గార్లె (Norman Gourlay) సువార్త సత్యముకొరకు సంతోషముగ తమ ప్రాణములనర్పించిరి. పాప ప్రక్షాళనము పోప్ చేయలేడని, పోప్ అంత్యక్రీస్తని, స్కాట్లాండ్పై ఆయనకు అధికారము లేదని చెప్పినందుకు స్ట్రాటన్, గార్లెలను నిర్బంధించిరి.

స్ట్రాటన్ జాలరియగుటకూడ నేరమైనది. ఈగిల్స్గ్ (Eglesgrig) పట్టణ పాస్టరైన రాబర్ట్ లాసన్ (Robert Lawson) స్ట్రాటన్ పట్టుచున్న చేపలలో దశమ భాగమడిగినప్పుడు, స్ట్రాటన్ లాసన్ కిచ్చుటకు చేపలను పడవనుండి బయటకు విసరగా వాటిలో కొన్ని చేపలు నీటిలో పడెను. అందుకు లాసన్ కోపోద్రేకుడై స్ట్రాటన్ దేవుని సంఘమునకు దశమభాగ మిచ్చుట ఇష్టము లేనివాడని భావించి అతనిని మతద్రోహియని నిందించెను.

రోజ్ పట్టణ బిషప్ స్ట్రాటన్, గార్లెలను బంధించి వారు మతద్రోహులని తీర్పుచెప్పి, ఎడిన్బర్గ్ (Edinburgh), లేథ్ (Leith) ల మధ్య పెద్ద పచ్చికబయలుమీద వారిని సజీవదహనము చేసెను. దగ్గరలోనున్న ఫైఫే (Fife) వాసులు ఆ మంటలను చూచి భయకంపితులై, స్ట్రాటన్, గార్లెలు నమ్మినట్లు ఇక వారు నమ్మకుందురని ఆర్చిబిషప్ తలంచెను.

మతద్రోహులని నిందింపబడిన స్ట్రాటన్, గార్లెలు అగ్నికి భయపడక దేవుడు తమకిచ్చిన ఆత్మలను తిరిగి సంతోషముగా దేవునికే అర్పించిరి. వారి గొప్ప విమోచకుడైన యేసుప్రభువుద్వారా నిత్యజీవములో మహిమ పునరుత్థానమును పొందుదురని వారికి తెలియును.

క్రీ.శ. 1538 లో డాలర్ పట్టణ పాస్టరైన డీన్ థామస్ ఫారెట్ (Dean Tho- mas Forret) తన సంఘములో ప్రతి ఆదివారము క్రొత్త నిబంధన గ్రంథమును బోధించుచుండెను. ఈ విధముగా బోధించుట స్కాట్లాండ్లో అరుదు. ఎందుకనగా, వాడుక ప్రకారము స్కాట్లాండ్లో మతాధిపతులు ఎన్నడూ లేఖనములలోని విషయము లను బోధింపరు.

అందువలన మతాధిపతులు అసూయతో డంకెల్డ్ (Dunkeld) అను బిషప్నకు థామస్ ఫారెట్ మతద్రోహియని ఫిర్యాదు చేసిరి. థామస్ ఫారెట్ లేఖనములలోని మర్మములను ప్రజలకు వారి స్వభాషలో బోధించెను. కాని మత గురువులు ఎన్నడూ ప్రజలు అర్థము చేసికొను వారి స్వభాషలో బోధింపలేదుగనుక ప్రజలు వారిని అసహ్యించుకొనిరి.

పైగా థామస్ ఫారెట్ బోధించినందుకు ప్రజలు అతనికిచ్చుటకు తెచ్చిన ఆవు, విలువైన బట్టలు మొదలగు బహుమతులను అతడు తీసికొనలేదు. ఇదేవిధముగా మతాధిపతులుకూడ తప్పక చేయవలెనని ప్రజలు తలంచిరి.

థామస్ ఫారెట్ను విచారణ చేయుటకు బిషప్ డంకెల్డ్ పిలిపించి ఆవు, బట్టలు మొదలగు బహుమతులను తీసికొనవలెననియు, జీతము లేకుండ ప్రతి ఆదివారము బోధించుట చాల కష్టమనియు, ఈ విధముగా అతడు చేయకపోవుటవలన ప్రజలు ఇతర సంఘ నాయకులను ఈర్ష్యభావముతో చూచెదరనియు, పవిత్ర మాతృసంఘము (Holy Mother Church) యొక్క స్వేచ్ఛను తెలియజేయు మంచి పత్రికలను, సువార్తలను మాత్రమే అతడు బోధింపవలెననియు చెప్పెను.

అందుకు థామస్ ఫారెట్ “ఆదివారములు మాత్రమే బోధించుట చాలదని, తన పేద సంఘస్థులనుండి ఆవును, బట్టలను, లేక వారిచ్చెడి దేనినైనను తీసికొని, దానికి బదులుగా తనకు కలిగినది ఏదయిన వారికిచ్చెదన”ని చెప్పెను. ఆ విషయములో వారిద్దరు ఒక ఒడంబడికకు వచ్చిరి. అదేవిధముగ “బిషప్ తనకు పరిశుద్ధ గ్రంథములో మంచి పత్రికలను మంచి సువార్తలను, చెడ్డ పత్రికలను చెడ్డ సువార్తలను చూపించి నట్లయిన మంచివాటినే బోధించి చెడ్డవాటిని వదలివేయుదున”ని చెప్పెను.

దానికి బిషప్ కోపోద్రేకుడై “క్రొత్త, పాత నిబంధనలనగా ఏమిటో నాకు ఎన్నడు తెలియనందుకు నేను దేవునిని అభినందించుచున్నాను. నాకు నా ఆరాధన పుస్తకము, బిషప్లు పండుగ సమయములలో అనుసరించు పుస్తకము తప్ప మరేమియు తెలి యదు. నీ దారిన నీవు వెళ్లు. నీ చోద్యములు నీతో తీసికొని వెళ్లు.

నీవు తప్పుడు అభిప్రాయములలో కొనసాగుచున్నచో దానికి నీవే బాధపడెదవు, అవి ఏరీతిగను ఫలితములను మార్చజాలవు” అని చెప్పెను. “దేవుని యెదుట నా పని న్యాయమైనదను నమ్మకము నాకున్నది, కనుక దాని ఫలితములతో నాకు సంబంధము లేదు” అని ఫారెట్ సమాధానమిచ్చి, అక్కడనుండి వెడలెను.

కొద్దికాలములోనే థామస్ ఫారెట్కు, కైలర్ (Keillor) మరియు బేవరిడ్జ్ (Beveridge) అను క్రైస్తవమత సన్యాసులకు, డంకన్ సింప్సన్ (Duncan Simpson) అను పేరుగల మతాధిపతికి, రాబర్ట్ ఫారెస్టర్ (Robert Forrester) అను సంఘస్థునికి, మరికొందరికి బిషప్ డంకెల్డ్ సంజాయిషీ పిలుపులు పంపెను. వారు బిషప్ సభ యెదుట హాజరైన దినమున వారందరిని మతద్రోహులని తీర్పు చెప్పిరి.

వారు తమ పక్షముగా వాదించుకొనుటకెట్టి అవకాశము వారికీయబడలేదు. ఎందుచేతననగా వారే ప్రధాన మతద్రోహులు మరియు ప్రజలకు మతద్రోహమును ఉపదేశించు అధ్యాపకులు. కనుక వారందరిని ఎడిన్బర్గ్ (Edinburgh) లోని కేజిల్ హిల్ (Castle Hill) కు తీసికొనివెళ్లి సజీవదహనము చేసిరి.

క్రీ.శ. 1543 లో స్కాట్లాండ్ మత సంస్కర్తయైన జార్జ్ విషార్ట్ (George Wishart) కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయములో ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడు రోమన్ కేథలిక్ పాస్టరైన జాన్ నాక్స్ (John Knox) ను నిజ క్రైస్తవ సిద్ధాంతములోనికి మార్చెను. విషార్ట్ మర్యాద, వినయము కలవాడు. అనేక ప్రాంతములు దర్శించిన మంచి మనిషి, పేదలయెడల దయచూపించుచూ, తన విషయములో పిసినారితనముకలిగి ఉపాధ్యాయ వృత్తిని, అన్నింటికంటే ముఖ్యముగా దేవుని ఎక్కువగా ప్రేమించెను.

దినమునకు రెండుమారులు భోజనము, నాలుగు దినములకొకసారి ఉపవాసము, గడ్డిపరుపుపై నిద్రించుట అతని అలవాట్లు. అతడు లేఖనములను ఉపదేశించుటలో తీవ్రమైన పట్టుదల కలవాడగుటచే కొందరు అతడు కఠినుడనిరి. మరికొందరైతే అతనిని చంపుటకు అతడు చెప్పినది చాలునని అతనిపై ద్వేషముకలిగి ఉండిరి.

అయితే ప్రభువు అతని పక్షముగా ఉండెను. విషార్ట్ వారి దుర్మార్గమును ఖండించి వారిని మంచి మార్గములకు ప్రోత్సహించుటవలన కొందరు అతనియెడల అభిమానము కలిగి యుండిరి. రోమా మత నాయకులు మాత్రము అతని సంఘసంస్కరణ సిద్ధాంతములకు సంతోషించలేదు.

క్రీ.శ. 1544లో తన స్వదేశములో సత్యసువార్తను బోధించవలెనను ఆశ అతనికి అధికమైనందున విషార్ట్ కేంబ్రిడ్జిని విడచి స్కాట్లాండ్ చేరెను. అతడు మొదట మాంట్రోస్ (Montrose) లోను, తరువాత దనీ (Dundee) ల వద్ద సువార్త ప్రకటించెను. ఈ ప్రదేశమునందే పౌలు రోమీయులకు వ్రాసిన పత్రికయొక్క అర్థమును, మరియు మార్టిన్ లూథర్ట్చే ముప్పది సంవత్సరముల పూర్వము తిరిగి కనుగొనబడిన ‘విశ్వాసముద్వారా నీతిమంతునిగా తీర్చబడుట’ (Justification by faith) అను సిద్ధాంతముల అర్థమును ఉపదేశించెను.

అతడు ఉపదేశించుచున్నప్పుడు ప్రదర్శించిన స్వేచ్ఛాస్వాతంత్ర్యములకు మతాధిపతులుకూడ మిక్కిలి భయపడిరి.
ఆ తరువాత విషార్ట్ రెండు సంవత్సరములు స్కాట్లాండ్ అంతటా పర్యటించెను. అనేక పర్యాయములు రోమా మతాధిపతులు అతనిని ఉపదేశించకుండ చేయవలెనని ప్రయత్నించుటచే విషార్ట్కు చాలవరకు ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడినవి. అతడు పశ్చిమ స్కాట్లాండ్లో ఉన్నప్పుడు దనీ పట్టణములో అంటువ్యాధి ప్రబలినదని విని వ్యాధిగ్రస్తుల శరీరములకు, ఆత్మలకు సేవచేయవలెనని అక్కడకు వేగిరమే వెళ్లెను. వారు అతనిని సంతోషముతో చేర్చుకొనిరి.

విషార్ట్ దనీని వదలి మాంట్రోసుకు చేరకముందు స్కాట్లాండ్ కార్డినల్ మరియు ఆర్చిబిషప్యైన డేవిడ్ బీటన్ (David Beaton) విషార్ట్ను చంపుటకు మతాచార్యుడైన జాన్ వైటన్ (John Weighton) ను నియమించెను.

విషార్ట్ ‘ఆత్మను, శరీరమును స్వస్థపరచుట’ అను అంశముపై ప్రసంగము ముగించి వేదికనుండి క్రిందికి వచ్చు సమయములో అతనిని చంపుటకు మతాచార్యుడైన వైటన్ తన గౌనులో బాకును దాచియుంచి వేదిక మెట్లయొద్ద అవకాశముకొరకు కనిపెట్టుకొని యుండెను.

మొత్తముమీద, ఆ మతాచార్యుడు చేతిని గౌనులో పెట్టుకొని తనగురించి వేచియుండుట విషార్ట్ చూచి అతనితో “నా స్నేహితుడా, నీవు కోరునదేమిటి?” అని ప్రశ్నించెను. అంతట ఆ మతాచార్యుడు బాకును తన గౌనునుండి బయటకు తీయుటకు ప్రయత్నించుచుండగా విషార్ట్ వేగముగా ఆ బాకును లాగుకొనెను. భయపడిన మతా చార్యుడు మోకరించి, తన ఉద్దేశ్యమును ఒప్పుకొని విషార్ట్ను క్షమాపణ అర్థించెను.

ఆరోగ్యవంతులనుండి వేరుచేయబడి దడి వెలుపల వేచియున్న అనేకమంది అంటు వ్యాధిగ్రస్తులు ఏమి జరిగినదో తెలుసుకొని, ఆ ద్రోహిని వారికి అప్పగించమని అడిగిరి. ఆ కోపములో వారు దడి విరుగగొట్టి ఆ మతాచార్యుని తీసుకొనివెళ్లెడివారే కానీ విషార్ట్ అతనిని పట్టుకొని, అని చెప్పెను. ఈ విధముగా ప్రజలను నెమ్మదిపరచి తనను చంపుటకు ప్రయత్నించిన ఆ దుష్ట మతాచార్యుని ప్రాణము రక్షించెను.

ఎవరయితే అతనిని గాయపరచకోరుదురో వారు ముందు నన్ను గాయపరచుడి

విషార్ట్ మాంట్రోసుకు తిరిగివచ్చిన వెంటనే, స్కాట్లాండ్ కార్డినల్ అయిన బీటన్ అతనిని చంపుటకు పూనుకొని ఒక కుట్ర పన్నెను. విషార్ట్ ముఖ్య స్నేహితుడు ప్రాణాంతకమైన ఘోరవ్యాధితో బాధపడుచు తనను వెంటనే రావలసినదిగ కోరినట్లు ఒక ఉత్తరమును సృజించి, దానిని విషార్ట్కు పంపెను.

విషార్ట్ మాంట్రోస్నుండి తన స్నేహితుని ఇంటికి వెళ్లు దారిపొడవున అతనిని చంపుటకు బీటన్ అరువదిమంది సైనికులను దాచియుంచెను. కాని విషార్ట్, అతని స్నేహితులు ఆ ప్రదేశమును సమీపించి అక్కడున్న పరిస్థితులు ఆందోళనకరముగా ఉన్నవని అనుమానించి ప్రయాణము కొనసాగించలేదు.

విషార్ట్ తన స్నేహితులతో ‘ముందుకు సాగుటకు దేవుడు నన్ను నిషేధించెను. ముందు ద్రోహము పొంచియున్నది. మీలో కొందరు నాకంటే ముందుగా వెళ్లి, జాగ్రత్తగ అక్కడి పరిస్థితులను కనుగొని నాకు తెలియజేయుడి’ అని చెప్పెను.

కార్డినల్ నియమించిన సైనికులు పొదలమాటున దాగియుండుట విషార్ట్ స్నేహితులు కనుగొని, వేగముగ తిరిగివచ్చి విషార్ట్కు ఆ సంగతి తెలిపిరి. విషార్ట్ ‘నా జీవితము ఆ రక్తపిపాసి చేతులలో అంతమౌనని నాకు తెలియును, కాని చాటున దాగి యుండుటవలన కాదు’ అని వారితో చెప్పెను.

అనతికాలములోనే, క్రీ.శ. 1546 లో విషార్ట్ దక్షిణ స్కాట్లాండులోని తూర్పు లోథియన్ (East Lothian) లో కాక ్బర్న్ (Cockburn) అను వ్యక్తితో నివసించు చున్నాడని కార్డినల్కు తెలిసి, విషార్ట్ను అదుపులోనికి తీసికొనుమని ప్రాంతీయ గవర్నరును ఆదేశించగా గవర్నరు తన మనఃస్సాక్షికి విరోధముగ అతనిని నిర్బంధించి, ఎడిన్ బర్గ్ తీసికొనివెళ్లి, పరి. అంద్రెయ భవనములో బంధించెను.

విషార్ట్ రాజద్రోహము, మతద్రోహమునకు సంబంధించిన సిద్ధాంతములను బోధించుచున్నాడని కార్డినల్ ఆరోపించి మరునాటి ఉదయము తన బిషప్ సభయెదుట హాజరుకమ్మని అతనికి తాకీదు పంపెను. కార్డినల్ యుద్ధమునకు వెళ్లుచున్నట్లు సాయుధులైన నూరుమంది సేవకులు సైనిక దుస్తులు ధరించి ఆయుధములతో కవాతు చేయుచు విషార్ట్ను అబ్బె దేవాలయము (Abbey Church) నకు తీసికొని వచ్చిరి.

విషార్ట్ అనుచరులు, అభిమానులు అతనిని తమవద్దనుండి విడిపించుకొని పోవుదురని, లేక అతడే తప్పించుకొని పారిపోవుటకు ప్రయత్నించునని కార్డినల్ సేవకులు భయపడిరి. కాని అతడు శాంతముగా వారిని వెంబడించెను. దేవాలయ ద్వారమువద్ద అతడు క్షణమాగి డబ్బులు ఉన్న తన చిన్నసంచిని మెట్లయొద్ద వేచియున్న పేదవానికి విసిరెను.

విషార్ట్ దేవాలయములోనికి ప్రవేశించి కార్డినల్, అతని బిషప్ల సభయెదుట నిలువబడెను. ముసలివాడైన జాన్ లాండర్ (John Lander) అను మతాధికారి విషార్ట్కు వ్యతిరేకముగా పదునెనిమిది నేరములు చదివి వినిపించెను. ఆ నేరములు శాపములతోను, వేషధారణతోను, బెదిరింపులతోను నిండియుండెను.

అతడు చదువుట చాలించిన తరువాత విషార్ట్ను చూచి “నీవు దొంగవు, దేశద్రోహివి, మతము విడిచి పారిపోయిన వాడవు, నీవు చేసిన నేరములన్నిటికి తగిన సాక్ష్యములు మేము నిరూపించెదము, ఈ నేరములకు నీ జవాబు ఏమిటి?” అని అరచెను.

విషార్ట్ మొదట మోకరించి ప్రార్థించెను. తరువాత, అతడు క్రీస్తువలె శాంతము వహించి “నన్ను తీర్పు తీర్చు మీరు నా మాటలు, నేను బోధించిన సిద్ధాంతములేమిటో తెలిసికొనుట న్యాయము.

అప్పుడు మీ ఆత్మల నాశనమును గురించి నేను అన్యాయ ముగా మరణము పొందను. కనుక దేవుని మహిమకొరకు, ఘనతకొరకు, మీ క్షేమము కొరకు, మరియు నా ఆత్మ రక్షణకొరకు, నా మాటలు ఆలకించుడని న్యాయాధిపతులైన మిమ్మును మనఃపూర్వకముగా బ్రతిమాలుకొనుచున్నాను” అని చెప్పెను.

దానికి లాండర్ విషార్ట్ను నిందించుచు, “ఓ మత విరుద్ధమైనవాడా, దేశద్రోహి, దొంగ ! నీవు బోధించుట న్యాయము కాదు. సంఘము ఏ అధికారము ఇవ్వకుండగనే బోధించు అధికారమును నీవే నీ చేతులలోనికి తీసికొంటివి” అని పెద్దగా అరచెను.

వారు చేయ తలంచినది విషార్ట్ గ్రహించి, పలు విజ్ఞాపనలు చేసి విఫలుడయ్యెను. పదునెనిమిది నేరములలో అతనిని మతద్రోహిగా నిరూపించి, వ్రేలాడదీసి, కాల్చి చంపవలెనను తీర్పు చెప్పిరి.

విషార్ట్ను చంపబోవు ఉదయము కార్డినల్ ఇద్దరు సన్యాసులను చెరసాలలోని అతనియొద్దకు పంపెను. వారు అతనికి నల్లని అంగీని ధరింపచేసి తుపాకీమందు సంచులను అతని శరీరములోని పలుభాగములకు కట్టి, అతని చేతులు వెనుకకు స్కాట్లాండులో హింసలు విరిచికట్టి, మొలచుట్టు ఇనుపగొలుసును బిగించి, మెడచుట్టు కట్టబడిన తాడును చేతపట్టుకొని అతనిని దహనముచేయు స్థలమునకు నడిపించిరి.

విషార్ట్ పూర్తిగా దహనమై చనిపోవువరకు అతని అభిమానులు, స్నేహితులు అడ్డుకొనకుండ కార్డినల్ బీటన్ తుపాకులు ధరించిన తన సైనికులను చుట్టూ నిలువబెట్టించెను. విషార్ట్ సజీవదహనము గావింపబడు స్థలమునొద్దకు వెళ్లుమార్గములో మతాచార్యులలో ఒకరు అతనితో “జార్జ్ విషార్ట్, మేరి మాతను ప్రార్థించుము, ఆమె నిన్ను తన కుమారునిగా అంగీకరించి మధ్యవర్తిత్వము నడుపును” అని చెప్పెను. అందుకు విషార్ట్ “ఆగండి! నన్ను శోధింపవద్దు, నా సహోదరులారా, అగ్ని నన్ను ఎంతగానో ఆకర్షించుచున్నది” అనెను.

ఉరికంబమువద్ద అతడు మోకరించి మూడుసార్లు ప్రార్థించెను. “ఓ లోకరక్షకా, నన్ను కనికరింపుము. పరలోకపు తండ్రీ, నీ పరిశుద్ధ చేతులకు నా ఆత్మను అప్పగించు చున్నాను, నాపై నిందమోపినవారిని క్షమించుము, నా హృదయపూర్వకముగా నేను వారిని క్షమించియున్నాను. వారు తెలియక నన్ను నిందించినందుకు వారిని క్షమింపు మని నేను వేడుకొనుచున్నాను” అని ప్రార్థించెను.

అప్పుడు అక్కడ గుమి కూడిన ప్రజలవైపు తిరిగి “దేవుని కృపద్వారా నాకు అనుగ్రహింపబడిన వాక్యము, సత్య సువార్తలకొరకు ఈ దినమున నేను మనుష్యుల చేతులలో బాధననుభవించుచున్నాను. దుఃఖముతోకాక సంతోష హృదయముతో భరించుచున్నాను. క్రీస్తుకొరకు అగ్నిని భరించుటకు నేను పంపబడితిని. నా ముఖమును సమీపించి చూడుడి, నేను అగ్నికి భయపడుటలేదు కనుక నా ముఖము కళ మారలేదు. ఈ రాత్రే నేను నా రక్షకుడైన క్రీస్తుతో కలసి పరలోక రాజ్యములో నిశ్చయముగా భుజించెదన”ని చెప్పెను.

అది విని, తలారి విషార్ట్ యెదుట మోకరించి ‘అయ్యా, దయచేసి నన్ను క్షమించుము, నీ మరణము విషయములో నేను నిర్దోషిన’ని చెప్పెను. అందుకు విషార్ట్ ‘నా దగ్గరకు రమ్ము’ అని సమాధానమిచ్చెను. అతడు రాగానే, అతని చెంపమీద ముద్దుపెట్టుకొని, ‘నా ప్రియుడా, నేను నిన్ను క్షమించితిననుటకిది నిదర్శనము. నీ పని నీవు చేయుము’ అని పలికెను.

అతని శరీరము కాలి బూడిదగువరకు ఉరిమ్రానుమీద నిప్పులపై విషార్ట్ వ్రేలాడదీయబడెను. పెద్దమంటలలో అతడు కాలిపోవుట చూచిన ప్రజలు ఏడ్వకుండ ఉండలేకపోయిరి. అమాయకపు గొఱ్ఱపిల్లను వధించినందుకు వారు మతాధికారులను నిందించి, కోపోద్రేకులై కార్డినల్ బీటన్ ను చంపి, అతని కోటను ఆక్రమించిరి.

విషార్ట్చే నిజ క్రైస్తవ సిద్ధాంతములోనికి మార్పుచెందిన జాన్ నాక్స్ ఆ కోటలోని సేనతో చేరి సువార్తను ప్రకటించుట మొదలుపెట్టెను. వెంటనే నాక్స్ తిరుగుబాటు దారులందరికి బోధకుడయ్యెను. మరుసటి సంవత్సరము అనగా క్రీ.శ. 1547, జూలైలో ఫ్రెంచివారి సహాయముతో రోమన్ కేథలిక్లు ఆ కోటను మరల ఆక్రమించి నాక్స్ని ఖైదు చేసిరి. క్రీ.శ. 1549, ఫిబ్రవరిలో నాక్స్ విడుదలై కొంతకాలము ఇంగ్లాండు, జర్మనీలలో ఉపదేశించి, తరువాత స్విడ్జర్లాండులోని జెనీవా ఆంగ్ల సంఘమునకు పాస్టరుగా నియమింపబడెను.

అక్కడ జెనీవాను ‘దేవుని పట్టణము’ (City of God) గా మార్చిన ఫ్రెంచి వాస్తవ్యుడు, స్విస్ వేదాంతశాస్త్ర పండితుడైన జాన్ కేల్విన్ (John Calvin) యొద్ద శిష్యునిగా చేరెను. కొంతకాలమునకు మరల స్కాట్లాండ్ తిరిగి వచ్చి ఆ దేశములో పెద్దలచే సంఘపాలన నిర్వహించు ప్రొటెస్టంట్ క్రైస్తవ పద్ధతిగల సంఘము (Presbyterianism) ను స్థాపించెను.

స్కాట్లాండులో చనిపోయిన చివరి హతసాక్షి 82 సంవత్సరముల వయస్సుగల వాల్టర్ మిల్ (Walter Mill). ఇతడు క్రీ.శ. 1558 లో హతసాక్షి మరణము పొందెను. యౌవన ప్రాయములో మిల్ కొంతకాలము అంగస్ (Angus) లోని లూనాన్ సంఘము (Lunan) నకు పాస్టరుగా పనిచేసెను.

అతడు ఒకసారి జర్మనీ వెళ్లి అక్కడ సత్యసువార్తను విని, స్కాట్లాండ్ తిరిగివచ్చి రోమన్ కేథలిక్ సంఘ విషయము లన్నిటిని ప్రక్కనబెట్టి సంస్కరణ సిద్ధాంతమును ఉపదేశించుట ప్రారంభించెను. అనతికాలములోనే స్కాట్లాండ్ బిషప్లు అతనిని మతద్రోహిగా అనుమానించుట మొదలుపెట్టిరి.

తనను నిర్బంధించెదరని గ్రహించిన మిల్ తన సంఘమును వదలి కొంతకాలము దాగియుండెను. తరువాత అతడు తన సంఘమునకు తిరిగివచ్చి ఉపదేశించుటకు రాణి అనుమతించెను. అయినను కొద్దికాలమునకే ఇద్దరు మతా చార్యులు మిల్ను భయపెట్టి ఎడిన్బర్గ్ లోని పరి. అంద్రెయ కోటకు తీసికొనిపోయిరి.

మొదట మిల్ను హింసించుట, కాల్చుటద్వారా భయపెట్టిరి. కాని, ఈ హింసలు, శ్రమలు మిల్ను తన సంస్కరణ సిద్దాంతములు, బోధలనుండి మార్చలేకపోయినవి. అందుచే వారు మిల్ తన క్రియలు తప్పు అని ఒప్పుకొనినచో అతనికి అబ్బె చర్చ్ జీవితాంతము మతాధిపతి స్థానము కల్పింతుమని ఆశచూపిరి. అయినను మిల్ వారు చూపిన ఆశలకు వ్యతిరేకముగా నిజవిశ్వాసములో మరింత బలపడెను.

అప్పుడతడు పరి. అంద్రెయ కోట వేదికపై బిషప్లముందు విచారింపబడుటకు తేబడెను. మిల్ పెద్ద వయస్సుకలవాడగుటచేత, మరియు చెరసాలలో అనుభవించిన శిక్ష కారణముగా సహాయము లేకుండ వేదిక మెట్లు ఎక్కలేకపోయెను.

అతడు వారికి వినబడునంత గట్టిగా మాట్లాడలేని బలహీనుడని బిషప్లు తలంచిరి. అయితే అక్కడ చేరిన క్రైస్తవులందరు ఆనందించునట్లు మిల్ ధైర్యముగాను, గంభీరముగాను మాట్లాడగా బిషప్లు కంగారుపడిరి. మిల్ వేదికపై మోకరించి చాలసేపు ప్రార్థించెను.

కార్డినల్ బీటన్ కాలమునుండి అక్కడ పాస్టర్గా పనిచేయుచున్న ఆండ్రూ ఓలిఫాంట్ (Andrew Oliphant) మిల్తో, “సర్ వాల్టర్ మిల్, మీరు అధిక సమయము ప్రార్థించి మా ప్రభువుల (బిషప్ల) కాలమును వృధాచేసిరి. ఇక లేచి మీమీద మోపబడిన నేరములకు సమాధానము చెప్పుమ”నెను. ప్రార్థించుట ముగిసిన తరువాత మిల్.

నీవు నన్ను 'సర్ వాల్టర్'

అనుకున్నరీతిగా విచారణ సాగెను. చివరకి ఆండ్రూ ఓలిఫాంట్ అతనితో “నీ తప్పుడు అభిప్రాయములను ఉపసంహరించుకొననిష్టపడుదువా?” అని మిల్ను ప్రశ్నించెను. “నేను పదివేల జీవితములనైనను వదలుకొందును కాని ఈ పరలోక సిద్దాంతములోని ఒక అణువుకూడ వదలుకొనను” అని జవాబిచ్చెను.

అప్పుడు ఓలిఫాంట్ మిల్ను మరుసటి దినమున ఉరితీసి చంపవలెనను తీర్పు ప్రకటించగా అతనిని మరల చెరసాలకు తీసికొనిపోయిరి. అతనిని సజీవ దహనముచేయు స్థలమునకు తీసికొని వచ్చినప్పుడు అతని శత్రువులుకూడ ఆశ్చర్యపడునంతగా తన వయస్సు, బలహీనస్థితిని మించునట్లు వాల్టర్ మిల్ తన భావములను, సిద్ధాంతములను చాల దృఢముగ తెలియజేసెను.

ప్రార్థనానంతరము అక్కడ చేరినవారితో “ప్రియ స్నేహితులారా, దేవునియెదుట చాల ఘోర పాపిగా నన్ను నేను భావించుకొనుచున్నాను. ఈ రోజు నేను ఈ విధముగా బాధననుభవించుటకు నేను చేసిన దోషములు కారణము కాదు.

కాని, మనందరికొరకు పాత, క్రొత్త నిబంధనలలో ఉంచబడిన యేసుక్రీస్తునందలి విశ్వాసమును కాపాడుటకే. అట్టి విశ్వాసముకొరకు నిజ క్రైస్తవ హతసాక్షులు సంతోషముగా తమంతట తామే అర్పించుకొనిరి కనుక వారికి శాశ్వతానందమైన పరలోకము వాగ్దానము చేయబడెను.

అట్టి హతసాక్షులలో ఒకనిగా ఉండుటకు ఆయన నన్ను ఎంచుకొనినందున నేను దేవునికి వందనములు చెల్లించుచు నా జీవితములో ఆయన సత్యమును ముద్ర వేయుచున్నాను. నా ప్రాణమును ఆయన యొద్దనుండి పొందితిని, ఆయన మహిమ కొరకు దానిని తిరిగి ఆయనకే అప్పగించుచున్నాను.”

“మీరు రెండవ మరణమును తప్పించుకొనకోరితే మతాధిపతులు, బిషప్లు, సన్యాసులు, బోధకులు, ఉపదేశకులు, అధికారులు, అంత్యక్రీస్తును వెంబడించువారు చెప్పెడి అబద్ధములవలన మోసపోకుడి. మీరు నాశనమునుండి విమోచింపబడి నిత్య.

జీవమును పొందుటకు యేసుక్రీస్తు, ఆయన కృపమీద మాత్రమే ఆధారపడుడి” అని మిల్ చెప్పుచుండగా ప్రజలందరిలో గొప్ప దుఃఖము, విచారము కలిగెను. అతని ధైర్యము, గంభీరము, దృఢత్వము, విశ్వాసపు మాటలు వారి హృదయములను మండించెను.

అప్పుడు వారు వాల్టర్ మిల్ను కొయ్యకు వ్రేలాడదీసి, క్రిందనున్న కట్టెలకు నిప్పు ముట్టించిరి. జ్వాలలు అతనిని కాల్చుచుండగా “ప్రభువా, నన్ను కనికరింపుము! ప్రజలారా, సమయముండగానే దేవుని ప్రార్థించుడి” అని పలుకుచు ఈ లోకమును విడచి, తనకొరకు మరణించిన ప్రభువునొద్దకు వెళ్లెను.

స్కాట్లాండ్కు క్రీ.శ. 1560 లో మతోద్దారణ పూర్తిగా వచ్చినప్పుడు, పెద్దలచే సంఘపాలన నిర్వహించు ప్రొటెస్టంట్ క్రైస్తవ్యము (Presbyterianism) ను జాతీయ మతముగా పార్లమెంట్ స్థాపించెను. అప్పుడు ప్రజలు రోమన్ కేథలిక్ దేవాలయము లలోనున్న విలువైన విగ్రహములను తీసివేసి వాటిని వాల్టర్ మిల్ హతసాక్షి మరణము పొందిన స్థలములో కాల్చివేసిరి.

ఇంగ్లాండులో హింసలు (క్రీ.శ. 1401–1541)

ఇంగ్లాండులో హింసలు (క్రీ.శ. 1401–1541)

మూడవ ఎడ్వర్డ్ రాజు (King Edward III) పరిపాలించుచున్న కాలములో (క్రీ.శ. 1327-1377) ఇంగ్లాండు సంఘము అవినీతితోను, మూఢభక్తితోను, చెడి యుండెను. మనుష్య సిద్ధాంతములు, పూర్తి విగ్రహారాధన మొదలగు కార్యకలాపముల చీకటిలో క్రీస్తు నిజసువార్త అను వెలుగు ఆరిపోయెను.

అదే కాలములో లోలార్డులు అనబడు సంఘసంస్కర్తలైన విక్లిఫ్ అనుచరులు అధికముగ విస్తరించెను. అందుచే మతాచార్యులు విసుగుచెంది, వారిని చంపు అధికారము లేనందున, వారిని రహస్య ముగ బాధించుట మొదలుపెట్టిరి.

ఆంగ్ల సింహాసనమును నాల్గవ హెన్రీ (Henry IV) బలవంతముగ క్రీ.శ. 1399 లో ఆక్రమించిన తరువాత లో లార్డులకు శ్రమలు అధికమయ్యెను. తమ సిద్ధాంతములను మార్చుకొనక, మొండి పట్టుదలతో ఉన్న లోలార్డులను దోషులుగ ప్రపంచ క్రైస్తవ హతసాక్షులు తీర్పు తీర్చి, మతద్రోహులని వారిని కాల్చిచంపు అధికారము రాజకీయాధికారులకు మంజూరు చేయు నిమిత్తము పార్లమెంటును సమావేశపరచి, ఆ చట్టమును వెంటనే ప్రవేశపెట్టవలసినదిగా మతనాయకులు రాజును ఒత్తిడిచేసిరి.

లో లార్డుల వ్యతిరేకత తీవ్రముగా ఉన్నప్పటికీ మతద్రోహులను కాల్చిచంపు చట్టమును క్రీ.శ. 1401 లో పార్లమెంటు ఆమోదించి దానిని వెంటనే అమలుపరచెను. వారి మత మూఢనమ్మకముల కొరకు ప్రజలను కాల్చిచంపు శాసనము చేయబడుట ఇంగ్లాండులో అదే ప్రప్రథమము.

ఈ క్రొత్త చట్టమునకు బలియైన మొదటి హతసాక్షి విలియమ్ సంత్రీ (Will- iam Santree) – ఇతడు స్మిత్ఫీల్డు (Smithfield) లో కాల్చి చంపబడెను.

వెంటనే కేంటర్్బరి ఆర్చిబిషప్ థామస్ అరుండేల్ (Thomas Arundel) అతని బిషప్లు సర్ జాన్ ఓల్డ్ కేజిల్ (Sir John Oldcastle) కు వ్యతిరేకముగ నిందలు లేవదీసిరి. సర్ జాన్ ఓల్డ్ కేజిల్ పేరుగాంచిన విక్లిఫ్ అనుచరుడు, రాజైన నాల్గవ హెన్రీ వ్యక్తిగత స్నేహితుడు. బిషప్ల అనుమతి లేకుండ కొందరిని ఉపదేశించుటకు బోధకులుగా నియమించుచున్నాడను నేరము అతనిపై మోపబడెను.

సంఘ ఆరాధనను, విగ్రహములను, తీర్థయాత్రలను నిరసించుచు, పోపు వ్యతిరేకముగ తప్పుడు బోధలను ప్రోత్సహించుచున్నాడను నింద అతనిపై మోపిరి. అతనిమీద దోషారోపణ చేయుటకు ముందు, రాజు సహాయము పొందవలెనని వారికి తెలియును. వారు చెప్పినది రాజు ప్రశాంతముగ విని, సర్ జాన్తో గౌరవముగ వ్యవహరింపుడని మంచితనము ద్వారానే సంఘమునకు అతనిని అప్పగించవలయునని వారికి చెప్పెను.

వారి పక్షముగ రాజుకూడ సర్ జాన్తో వాదించెను. అతడు సర్ జాన్ ను మందలించి, తన పరిశుద్ధ సంఘమునకు తిరిగి వెళ్లుమని, విధేయత కలిగిన చిన్నబిడ్డవలె తాను తప్పు చేసినందున శిక్షకు తగినవాడనని ఒప్పుకొనుమని చెప్పెను. దీనికి స్పందించి, సర్ జాన్ రాజునకు ఈ విధముగా సమాధానమిచ్చెను :

ఘనతవహించిన రాజా

నీవు క్రైస్తవ రాజువనియు, ఏర్పాటుచేయబడిన దేవుని సేవకుడవనియు, దుర్మార్గులను శిక్షించి, ధర్మమును కాపాడుటకు కత్తి పట్టినవాడవనియు నాకు తెలియును. నిత్యుడగు దేవుని తరువాత, మీకు నేను విధేయుడను.

ప్రభువునందు మీరు ఏమి శాసించినను నెరవేర్చుటకు, నా దగ్గర ఉన్న చరస్థిరాస్తిని మీకు అప్ప గించుటకు, పూర్వమువలె ఇప్పుడును సిద్ధమే. కాని పోప్, మత నాయకుల విషయమునకు వచ్చినయెడల, నేను వారియెదుట హాజరగుటకు, సేవ చేయుటకు నేను వారికి అచ్చియుండలేదు. ఎందుచేతననగా, లేఖనముల వలన అతడు క్రీస్తు విరోధి అని, నాశనపుత్రుడని, దేవుని ప్రత్యక్ష విరోధియని నాకు తెలియును.” రాజు ఇది విని, జవాబు చెప్పకుండ ఆ గది విడిచి వెళ్లెను.

సర్ జాన్ విషయము మాట్లాడుటకు ఆర్చిబిషప్ మరల రాజును కలిసెను. సర్ జాన్ వారిముందు హాజరుకానందున, వారి అధికారమును గర్వముగ ఎదిరించినందున ‘పవిత్ర సంఘ శాసనముల’ (The Laws of Holy Church) ప్రకారము అతనిని శిక్షించుటకు ఆర్చిబిషప్కు అధికారమీయబడెను.

సర్ జాన్ తనను పరిహసించినాడని, తాను చేసిన ప్రతి కార్యమును తిరస్కరించి నాడని, అతడు ఇప్పటికీ అదే అభిప్రాయములను కలిగియుండెనని, సంఘాధికారము లను, బిషప్ ఘనతను, ద్వేషభావముతో చూచుచున్నాడని తెలియజేయబడినందున, ఆర్చిబిషప్ క్రోధావేశముతో సర్ జాన్ను సంఘమునుండి వెలివేసెను.

వెలివేయబడిన తరువాత సర్ జాన్ ఓల్డ్ కేజిల్ తన వ్యక్తిగత విశ్వాసపు ఒప్పుదలను తన స్నేహితుడైన నాల్గవ హెన్రీకి వ్రాసెను. అతడు దానిని సంతోషముతో స్వీకరించ గలడని ఆశించెను. కాని దానికి బదులుగ రాజు దానిని తిరస్కరించి, అతనికి న్యాయమును తీర్చు ఆర్చిబిషప్కును, సభలోని బిషప్లకు విన్నవించుకొనుమని ఆజ్ఞాపించెను.

సర్ జాన్ సభయెదుట, రాజుయెదుట హాజరై “నా సిద్ధాంతములు, నేను చేసిన కార్యములు దేవుని వాక్యానుసారము కావని మీరు నిరూపించినట్లయిన, వాటిని నేను సరిదిద్దుకొని, మీకు వినయముగా లోబడెదన”ని చెప్పెను. సర్ జాన్ చెప్పుట ముగించినప్పుడు రాజు అతనిని రహస్యగదిలోనికి తీసికొనివెళ్లి పోప్ నిర్ణయములకు లోబడుమని చెప్పెను. సర్ జాన్ రాజు సలహాను తిరస్కరించగా రాజు అతనిని బంధించి ‘లండన్ టవర్’ (Tower of London) లో ఖైదుచేయుమని ఆజ్ఞాపించెను.

సర్ జాన్కుగల గొప్ప ప్రజాభిమానము, గౌరవములనుబట్టి, ఆర్చిబిషప్ తన తీర్పును నెమ్మదిగ ఏడువారములు కొనసాగించి, చివరకు సర్ జాన్ మత ద్రోహియని తీర్పుచెప్పి, అతనిని స్తంభమునకు వ్రేలాడదీసి కాల్చిచంపవలసినదిగా శిక్ష విధించెను.
అనంతరము సర్ జాన్ సభకు తన వాదనను ఈ విధముగా తెలియజేసెను :

“విగ్రహములు విశ్వాససంబంధమైనవి కావు. దేవునికి చెందవలసిన ఆరాధనను మృణ్మయ విగ్రహములకు అర్పించుచూ, దేవునిలో మాత్రమే ఉంచవలసిన నిరీక్షణ, నమ్మకము వాటియెడల కలిగించుచూ, దేవునికంటె వాటియెడల ఎక్కువ ప్రేమను చూపించుటవలన అతడు ఎక్కువ పాపము చేయుచున్నాడు. క్రీస్తునందలి విశ్వాసమును సంఘము అంగీకరించినది కనుక మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క సుగుణములను, త్యాగపూరిత మరణమును మనస్సులోనికి తెచ్చుటకు ఇతర నీతిమంతుల జీవితములు సూచించుచున్నవి.

ఈ భూమిమీదనున్న ప్రతి వ్యక్తి సంతోషమునకో లేక దుఃఖమునకో యాత్రికుడు. దేవుని పవిత్ర ఆజ్ఞలను ఎరుగక, వాటిని తన జీవితములో పాటింపక, తీర్థయాత్రలకని ప్రపంచమంతట తిరుగుచు, యాత్ర చేయుచునే చనిపోయినయెడల అతడు నరకము పాలగును; కాని ఎవరైతే దేవుని పవిత్ర ఆజ్ఞలను యెరిగి, వాటిని పాటించునో, అతడు తన జీవితములో ఎప్పుడును తీర్థయాత్రలకు అనగా ప్రజలు ఇప్పుడు కేంటర్ ్బరి, రోము లేక ఏదైన మరియొక స్థలమునకు వెళ్లుచున్నట్లుగా అతడు వెళ్లకపోయినను రక్షింప బడును.”

ఉరితీయబడు దినమున, చేతులు వెనుకకు కట్టి సర్ జాన్ ఓల్డ్ కేజిల్ను ‘లండన్ టవర్’ నుండి వెలుపలికి తీసికొనిరాగా, చుట్టూ ఉన్నవారిని చూచి అతడు సంతోషముగ నవ్వెను. ఘోరమైన రాజకీయ ద్రోహియన్నట్లు, అతనిని కొయ్య చట్రముపై పరుండబెట్టి, పరి. గైల్స్ మైదానము (St. Gile’s field) నకు ఈడ్చిరి. ఉరితీయు స్థలమునకు వచ్చినప్పుడు, కొయ్య చట్రమునుండి అతనిని తొలగించగా సర్ జాన్ మోకరించి, తన శత్రువులను క్షమింపుమని దేవుని ప్రార్థించెను.

అతడు నిలువబడి, అక్కడ చేరిన ప్రజలను చూచి, లేఖనములలో వ్రాయబడిన దేవుని మాటలను అనుసరించుడని, క్రీస్తుకు విరోధమైన సంభాషణ, జీవితము కలిగిన బోధకుల విషయములో జాగ్రత్తగా ఉండవలెనని హెచ్చరించెను. గొలుసులు అతని నడుముచుట్టు బిగింపబడి అతడు పైకెత్తబడగా క్రింద నిప్పు వెలిగించిరి.

అగ్ని అతనిని కాల్చి వేయుచున్నను, అతడు స్తుతింపలేని స్థితికి వచ్చువరకు దేవుని స్తుతించుచునే యుండెను. దైవికమైన మంచిమనిషి చనిపోవుచున్నాడని అక్కడ చూచుచున్న జనసమూహము దుఃఖించి, బాధపడెను. ఇది క్రీ.శ. 1417వ సంవత్సరములో జరిగినది.

క్రీ.శ. 1473, ఆగస్టులో థామస్ గ్రాంటర్ (Thomas Granter) లండన్ చెర సాలలో వేయబడెను. తాను విక్లిఫ్ ఉపదేశములను నమ్ముచున్నానని బహిరంగముగ ప్రకటించిన నేరమునకు అతనిని ‘మొండి మతద్రోహి’ అని తీర్పుచెప్పిరి. ఉరితీయు దినమున థామస్ ను ఉరి అమలుచేయు అధికారి ఇంటికి తీసికొని వెళ్లి భోజనము పెట్టించెను.

తినుచున్నప్పుడు అక్కడున్న ప్రజలతో అతడీలాగు చెప్పెను : ‘ఇప్పుడు నేను మంచి భోజనము తినుచున్నాను, నేను మరల భోజనము తినుటకు ముందు నేను చేయవలసిన నూతన పోరాటము ఒకటి ఉన్నది.’ అతడు తినుట ముగించిన వెంటనే దేవుడు అనుగ్రహించిన అధికమైన కృపకొరకు వందనములు చెల్లించి, అతడు నమ్మిన సిద్ధాంతములయొక్క సత్యసాక్ష్యమును ప్రకటించవలసియున్నది గనుక వెంటనే తనను ఉరితీయు స్థలమునకు తీసికొని వెళ్లుమని కోరెను. ఆ ప్రకారమే, అతనిని ‘టవర్-హిల్’ (Tower-Hill) కు తీసికొనివెళ్లి, ఒక స్తంభమునకు గొలుసులతో కట్టిరి. చివరి శ్వాస విడుచువరకు సత్యమును ప్రకటించుచు, అతడక్కడ సజీవ దహనమయ్యెను.

నేను విక్లిఫ్ సిద్ధాంతములను

లండన్కు ఈశాన్యదిశలోనున్న నార్విచ్ (Norwich) లో క్రీ.శ. 1499 లో బాద్రేమ్ (Badram) అను పేరుగల భక్తిపరుడొకడుండెను. విక్లిఫ్ సిద్దాంతములను నమ్ముట నేరమని మతాధికారులు అతనిని నార్విచ్ బిషప్ ముందుకు తీసికొనివచ్చిరి. బాద్రేమ్ అంగీకరించెను. అతనిని ‘మొండి మతద్రోహి’ యని నిందించి, అతనిని చంపుమని బిషప్ ఆజ్ఞాపించెను. అతడు గొప్ప విశ్వాసముతో తన సజీవ దహనమనుభవించెను.

క్రీ.శ. 1506 లో విలియమ్ టిల్ (William Tilfrey) అను భక్తిపరుడు అమెన్షామ్ (Amersham) లో సజీవ దహనము చేయబడెను. అతనికి జోన్ క్లార్కె (Joan Clarke) అను వివాహితయైన కుమార్తె కలదు. అతని హంతకులు జోన్ క్లార్కెను ఆమె తండ్రియైన విలియమ్ అగ్నిలో కాలుచుండగా చూడుమని బలవంతము చేసిరి. అదే సంవత్సరము తూర్పు ఇంగ్లాండులోని లింకన్ బిషప్ ఫాదర్ రాబర్ట్స్ (Father Roberts) ను లోలార్డులకు చెందినవాడను అభియోగముపై బకింగ్ హామ్ (Buckingham) లో సజీవ దహనము చేసిరి.

థామస్ నోరిస్ (Thomas Norris) సామాన్య మానవుడు. అతడు పేదవాడు, ఇతరులకు హానిచేయనివాడు. క్రీ.శ.1507 లో అతడు తన సంఘ పాస్టరును మత సంబంధమైన కొన్ని ప్రశ్నలడిగెను. వారి సంభాషణ మధ్యలో థామస్ అడిగిన ప్రశ్నలను బట్టి అతడు లోలార్డు అయివుండునని పాస్టర్ నిశ్చయించుకొని బిషప్కు ఫిర్యాదు

చేయగా, బిషప్ థామస్ ను బంధించి దోషియని తీర్పు చెప్పి, సజీవ దహనము చేసెను.

దక్షిణ ఇంగ్లాండులో లారెన్స్ గాలె (Lawrence Guale) ను క్రీ.శ. 1508 లో సాలిస్బరి (Salisbury) యొద్ద రెండు సంవత్సరములు జైలులో ఉంచి, తరువాత సజీవ దహనము చేసిరి. పాస్టరు ప్రార్థనచేసిన తర్వాత ఆరాధన (mass) లోని రొట్టె, ద్రాక్షారసము నిజమైన క్రీస్తు శరీరము, రక్తముగ మార్పుచెందునని అతడు అంగీకరించలేదు. ఒక రోజున అతడు తన యింటిలో లోలార్డులకు ఆశ్రయము కల్పించినాడను ఫిర్యాదు రాగా, బిషప్ లారెన్స్ను నిర్బంధించి, మతద్రోహియని నిందించి, సజీవదహనము గావించెను.

అదే సంవత్సరము చిప్పెన్ సద్బర్న్ (Chippen Sudburne) లో ఒక దైవ భక్తిగల స్త్రీ, మతద్రోహి అని తీర్చబడి, డా. విటెన్హామ్ (Dr. Whittenham) అను అధ్యక్షుని ఆజ్ఞవలన సజీవ దహనమైనది. ఆమె సజీవదహనమగుచుండగా ఒక ఎద్దు కసాయివానినుండి విడిపించుకొని, డా. విటెన్హామ్ శరీరమంతటిని కొమ్ములతో చీల్చి, అతని ప్రేగులను కొమ్ములమీద వేసికొని అక్కడ కూడియున్న జనసమూహము చుట్టూ కొంతసేపు తిరిగినది కాని అది మరెవరికినీ హాని చేయలేదు.

క్రీ.శ. 1511, అక్టోబరు 18న విలియమ్ సక్లింగ్ (William Succling) మరియు జాన్ బానిస్టర్ (John Bannister) అనువారు స్మిత్ ఫీల్డులో సజీవదహనమైరి. వారు అంతకు ముందు క్రీస్తునందలి తమ విశ్వాసమును పరిత్యజించిరి కాని మరల నిజవిశ్వాసమునకు తిరిగివచ్చిరి.

ఏడవ హెన్రీ (Henry VII) పరిపాలన (క్రీ.శ. 1485-1509) లో జాన్ బ్రౌన్ (John Brown) చిత్రహింసలకు భయపడి క్రీస్తు సాక్ష్యమును విడిచిపెట్టెను. కాని కొంతకాలమునకు క్రీస్తునందలి విశ్వాసములో తిరిగి బలపడుటచే కేంటర్ ్బరి ఆర్చిబిషప్ డా. వాన్ మన్ (Dr. Wonhaman) అతనిని హింసించి, సజీవదహనము గావించెను. అతనిని కొయ్యకు గొలుసులతో కట్టుటకు ముందు డా. వాన్ మన్, రొచెష్టర్ బిషప్ యైన యెస్టర్ (Yester) లు జాన్ బ్రౌన్ చర్మము ఊడిపడి, ఎముకలు కనుపించువరకు అతని పాదములు కాల్చి తన విశ్వాసమును విడిచిపెట్టునట్లు చేయు టకు ప్రయత్నించిరి. కాని ఈసారి జాన్ బ్రౌన్ అంతటి బాధలోకూడ తన విశ్వాసమును నిలబెట్టుకొని, క్రీస్తుకొరకు, దేవుని సత్యవాక్యముకొరకు మహిమకరముగ మరణించెను.

క్రీ.శ. 1518, అక్టోబరు 25న జాన్ స్టిలిన్సెన్ (John Stilincen) నిర్బంధింప బడి లండన్ బిషప్ యైన రిచర్డ్ ఫిట్జ్-జేమ్స్ (Richard Fitz-James) ముందు హాజరుపరచబడగ, అతనిని మతద్రోహియని నిందించి కాల్చిచంపిరి. హింసలకు భయపడి జాన్ ఒకసారి క్రీస్తునందలి తన విశ్వాసమును విడిచిపెట్టెను. కాని కొంత కాలమునకు ప్రజలందరి ముందు స్మిత్ఫీల్డులో కొయ్యకు గొలుసులతో బంధింప బడి తాను విక్లిఫ్ ఉపదేశముల ననుసరించితిననియు, దేవుని సత్యవాక్యముకొరకు చనిపోవుటకుకూడ సిద్ధముగా ఉన్నాననియు ప్రకటించెను.

క్రీ.శ. 1519 లో రాబర్టు సెలిన్ (Robert Celin), థామస్ మత్తయి (Tho- mas Matthew) లు విగ్రహారాధనకు, తీర్థయాత్రలకు వ్యతిరేకముగ మాట్లాడినారని లండన్లో కాల్చిచంపబడిరి.

క్రీ.శ. 1532 లో థామస్ హార్డింగ్ (Thomas Harding), అతని భార్య మత ద్రోహులని నిందింపబడిరి. ఆరాధనక్రమములో పాస్టరు ప్రార్థించిన తరువాత రొట్టె, ద్రాక్షారసము క్రీస్తుయొక్క శరీరము, రక్తముగ మారునను సిద్దాంతమును వారు త్రోసిపుచ్చిరి. తూర్పు ఇంగ్లాండులోని లింకన్ బిషప్ వారిని దోషులని నిందించి, కొయ్యకు కట్టి, సజీవదహనము చేయవలసినదిగా ఆజ్ఞాపించెను. బొట్లే (Botely) పట్టణమునకు వారిని తరలించి, స్తంభమునకు గొలుసులతో కట్టి, వారిచుట్టు పెద్దపెద్ద కట్టెలు పేర్చి నిప్పుపెట్టిరి.

నిప్పు పైకి వ్యాపించుచుండగ, అక్కడున్న ఒక మతాధిపతి లావైన కట్టెతో థామస్ తలమీద గట్టిగ కొట్టుటచే తల చిట్లి, మెదడు బయటకువచ్చి అగ్నిలో పడెను. అచ్చటున్న ప్రజలతో మతాధికారులు “ఈ మతద్రోహులను సజీవ దహనము చేయుటకు కట్టెలు తెచ్చి యిచ్చిన వారికి పాపపరిహార పత్రికలు ఇవ్వ బడును. వాటితో నలుబది దినములు మీరు ఇష్టము వచ్చినట్లు పాపము చేయుటకు అనుమతింపబడుదుర”ని చెప్పెను.

సంవత్సర ముగింపులో కేంటర్బరి ఆర్చిబిషప్ వార్మ్ (Worham) దక్షిణ ఇంగ్లాండులోని మైడ్లైన్ (Maidstone) చర్చ్ పాస్టరైన హిట్టెన్ (Hitten) అను ఒక మార్పుచెందిన బోధకుని బంధించి అనేక నెలలు జైలులో పెట్టి హింసించెను. వారోమ్ మరియు రోచెస్టర్ బిషప్ యైన ఫిషర్ (Fisher) లు అతనిని సంస్కరింపబడిన నూతన విశ్వాసమును విడిచిపెట్టించు ప్రయత్నము చేసిరి. వారు విఫలమైనప్పుడు, అతనిని మతద్రోహిగ తీర్చి, సజీవదహనముచేయుటవలన అతని బోధ అంతమగునను నిశ్చయమునకు వచ్చిరి. అలాగే సంఘప్రజలకు హెచ్చరికగ ఉండునట్లు హిట్టెనన్ను అతని చర్చిముందు కాల్చి చంపిరి.

రోమన్ కేథలిక్ సంఘముయొక్క మూఢనమ్మకములను, మత సిద్ధాంతములను తిరస్కరించినవారెవరైనను – సామాన్య మానవులుకాని, భార్యభర్తలుకాని, విశ్వవిద్యాలయాచార్యులుకాని మతాధికారులు ఆగ్రహమునుండి తప్పించుకొనలేరు. థామస్ బిల్నే (Thomas Bilney) కేంబ్రిడ్జి న్యాయశాస్త్ర ఆచార్యుడు. అతడు మతద్రోహ నేరముపై ఖైదు చేయబడి, లండన్ బిషప్ సభ యెదుటికి రప్పింపబడెను.

హింసించెద మని, కాల్చి చంపెదమని పదే పదే అతనిని బెదిరించి భయపెట్టినందున, అతడు తన విశ్వాసమునుండి వెనుదిరిగెను. అయితే తరువాత పశ్చాత్తాపముతో చాల విచారించి తిరిగి విశ్వాసములో బలపడెను. అందుకు సభ అతనిని “మూర్ఖపు మత ద్రోహి” అని నిందించి, కాల్చి చంపెను.

బిల్నేకాలిపోక ముందు మార్టిన్ లూథరు యొక్క అభిప్రాయములను తాను పూర్తిగా నమ్ముచున్నానని చెప్పెను. ఉరికంబమునకు కట్టబడినప్పుడు, అక్కడున్నవారందరిని చూచి నవ్వి ‘ఈ లోకములో నేను పలు తుపానులను ఎదుర్కొనినాను, కాని త్వరలో నా నావ పరలోకపు ఒడ్డును చేరును’ అని చెప్పెను. అగ్ని జ్వాలలు అతని చుట్టు గర్జించుచుండగ, కదలకుండ నిలబడి, ‘యేసూ, నేను నిన్ను నమ్ముచున్నాను’ అని చెప్పి, అతడు తాను నమ్మినవానిని కలిసికొనుటకు వెళ్లెను.

రోమా మతాధికారులు వారి మూఢనమ్మకములను, సిద్ధాంతములను వ్యతిరేకిం చిన ఇతరులయెడల మూర్ఖత్వము కలిగియున్నను, రోమా ప్రభుత్వములో భాగమై ఉండి వ్యతిరేకించినవారియెడలకూడ మిక్కిలి క్రూరముగా ప్రవర్తించిరి. ఆగ్నేయ ఇంగ్లాండులోని బార్నెస్ (Barnes) యొద్ద రిచర్డ్ బైఫీల్డు (Richard Byfield) అను క్రైస్తవ సన్యాసి కలడు. ఇతడు టిండేల్ (Tyndale) ఆంగ్లములోనికి అనువదించిన క్రొత్త నిబంధన గ్రంథమును చదివి నిజవిశ్వాసములోనికి మార్పుచెందెను.

అంతేగాక మార్టిన్ లూథర్ యొక్క అభిప్రాయములను, సత్యములనుకూడ పూర్తిగ నమ్మెను. ఇది మతాధికారులకు తెలిసినప్పుడు, అతనిని మతద్రోహియని నిందించి, ఖైదుచేసిరి. అతడు మార్పుచెందిన రోమన్ మతనాయకుడగుటచేత, వారు అతనిని మిక్కిలి క్రూరముగ హింసించిరి. అతనిని విశ్వాసమునుండి మళ్లించుటకు, మానవ మలము ఉన్న మురికి నీళ్లతో కంపు కొట్టుచున్న చీకటి గుహలలో నిర్బంధించిరి. అక్కడ ఎలుకలు, బొద్దింకలుమాత్రమే అతని సహవాసులు. అప్పుడప్పుడు చెరసాల అధి కారులు వచ్చి, భుజముల స్థానములు తప్పువరకు చేతులను వెనుకకు లాగికట్టెడివారు. ఆహారము, మలమూత్ర విసర్జన లేకుండ బైఫీల్డ్ను అనేక దినములు అదే స్థితిలో ఉంచిరి.

ఇతర సమయములలో అతనిని కొరడాలతో వీపుమీద మాంసము ఊడునట్లు కొట్టిరి. అయినప్పటికిని క్రీస్తునందలి తన నూతన విశ్వాసమునుండి తిరిగిపోవుటకతడు ఇష్టపడలేదు. కనుక అతనిని లాంబెత్ భవనములోని లోలార్డుల టవర్కు తీసికొనివెళ్లి, అక్కడ ఆర్చిబిషప్ అతని మెడను గొలుసులతో గోడకు బంధించి, రోజుకు ఒకసారి తన సేవకులచే కొట్టించు ఏర్పాట్లుచేసెను. మొత్తముమీద రిచర్డ్ బైఫీల్డు హస్ వలె హింసించబడి, స్మిత్ఫీల్డ్లో దహించబడెను. అది లండనులోని పరి. పౌలు దేవా లయమునకు ఉత్తరమున కలదు.

అదే కాలములో సుమారు క్రీ.శ. 1535 జాన్ టెక్స్బరి (John Tewkesbury) కూడ రిచర్డ్ బైఫీల్డువలే టిండేల్ ఆంగ్లములోనికి అనువాదముచేసిన క్రొత్త నిబంధన గ్రంథమును చదువుచున్నాడని, అది ‘పవిత్ర మాతృ సంఘము’ (Holy Mother Church) నకు వ్యతిరేకమైన నేరమని అతనిని నిర్బంధించిరి. అయితే టెక్స్బరి శ్రమలకు, హింసలకు భయపడి తాను చదివినవాటిలో రోమన్ కేథలిక్ మత సిద్ధాంత ములకు విరుద్ధమైనవాటిని తాను నమ్మలేదని చెప్పెను.

కొంతకాలము తరువాత అతడు పశ్చాత్తాపపడి, క్రొత్త నిబంధన గ్రంథములోని పరిశుద్ధ లేఖనములు యథార్థ మని, కేథలిక్ మత సిద్ధాంతములు అసత్యములని అంగీకరించెను. అందుకు వెంటనే అతనిని లండన్ బిషప్ ముందు నిలువబెట్టి ‘మూర్ఖపు మతద్రోహి’ అని నిందించి, చాల దారుణముగ హింసించిరి.

ఆ హింసలవలన అతడు స్మిత్ ఫీల్డు ఉరికంబము నొద్దకు తీసికొని వెళ్లునప్పటికే చాలవరకు చనిపోయెను. ఉరికంబమువద్ద రోమన్ కేథలిక్ మతముయొక్క దుష్టత్వమును, అవినీతిని
గూర్చి బిగ్గరగ చెప్పి, దేవునిదృష్టిలో తన నూతన విశ్వాసము న్యాయమైనదను గట్టి నమ్మకము తనకు కలదని తెలియజేసెను.

క్రీ.శ. 1536 లో దక్షిణ మధ్య ఇంగ్లాండులోని బ్రాడ్పోర్డు-ఇన్-విట్ షైర్ (Bradford-in-Wiltshire) లో ట్రాక్సనల్ (Traxnal) అను గ్రామస్థుడు కలడు. ఆరాధన సమయములో రొట్టె, ద్రాక్షారసము క్రీస్తు నిజశరీరము, రక్తముగ మారు ననియు మరియు పోపు స్త్రీ, పురుషులు మనఃస్సాక్షిమీద సంపూర్ణాధికారము కలదనియు బహిరంగముగ అంగీకరించకపోవుటవలన అతనిని సజీవదహనము చేసిరి.

తూర్పు ఇంగ్లాండులోని నార్విచ్లో క్రీ.శ. 1538వ సంవత్సరములో నీకొలాస్ పెకె (Nicholas Peke) ట్రాక్స్నలవలె కేథలిక్ సంఘ మూఢనమ్మకములను వ్యతిరేకించినందున సజీవదహనము గావించబడెను. డా. రీడింగ్ (Dr. Read- ing), డా. హెర్నె (Dr. Hearne) మరియు డా. స్క్రాగ్వెల్ (Dr. Spragwell) అను ముగ్గురు కేథలిక్ మతాధిపతులీకార్యక్రమమును నిర్వహించిరి.

నీకొలాస్ తారువలె నల్లగ వచ్చువరకు కాల్చబడినప్పుడు, డా. స్క్రాగ్వెల్ పొడవైన కఱ్ఱతో అతని కుడి భుజముమీద కొట్టి, ‘పెకె, వెనుతిరిగి కేథలిక్ సంఘ ఆరాధనను నమ్ము’ అని చెప్పగా, ఆ ఆరాధనను, నిన్నుకూడ నేను అసహ్యించుకొనుచున్నాను’ అని పెకె జవాబిచ్చి తన ద్వేషమునకు, బాధకు గుర్తుగా డా. స్క్రాగ్వెల్ మీద రక్తము ఉమ్మెను. ఇప్పుడైన నీకొలాస్ పైకె తన అభిప్రాయములను మార్చుకొంటే నలుబది దినముల పాపపరిహార పత్రికలిచ్చెదనని డా. రీడింగ్ ప్రలోభపెట్టెను. రీడింగ్ యొక్క అవివేకతకు నీకొలాస్ స్పందించక, క్రీస్తు నామముకొరకు బాధననుభవించుటకు ఆయన తనను యోగ్యునిగా లెక్కించినాడని సంతోషించెను.

ఎనిమిదవ హెన్రీ పాలనలో దహనము చేయబడిన మరియొక వ్యక్తి తూర్పు ఇంగ్లాండులోని సఫోక్ (Suffolk) గ్రామవాసియైన విలియమ్ లెట్టన్ (William Letton) అను ముసలి క్రైస్తవ సన్యాసి. కేథలిక్ సంఘముయొక్క ఉత్సవములో ఊరేగించుచున్న విగ్రహమునకు వ్యతిరేకముగ మాట్లాడినాడని విలియమ్ ను సజీవ
దహనము చేసిరి.

ప్రసిద్ధ రాజకీయవేత్తయైన థామస్ క్రామ్వెల్ (Thomas Cromwell) ను కేథలిక్ మతమునకు మరియు రాజైన ఎనిమిదవ హెన్రీకి ద్రోహి అని జూన్ 10న నిర్బంధించి, విచారణ లేకుండగనే దోషియని నిర్ణయించి క్రీ.శ. 1540, జులై 28న శిరచ్ఛేదము గావించిరి. శిరచ్ఛేదమునకు ముందు అతనిని ఘోరముగ హింసించిరి. క్రామ్వల్ ప్రజలనుద్దేశించి క్లుప్తముగ మాట్లాడి, మరణమునకు తన్నుతాను మౌనముగ అప్పగించుకొనెను. థామస్ క్రామ్వల్మెద మోపబడిన నేరములకు మతముతో సంబంధము లేకపోయినను, ఆ గొప్ప వ్యక్తిని హతసాక్షుల జాబితాలో చేర్చుట సబబు.

అదేకాలములో డా. రాబర్ట్ బార్నెస్ (Dr. Robert Barnes), థామస్ గార్నెట్ (Thomas Garnet) మరియు విలియమ్ జెరోమ్ (William Jerome) లపై మతద్రోహ నేరములు మోపి లండన్ బిషప్ యొక్క మతన్యాయస్థానము ఎదుటికి రప్పించిరి. ఆ ముగ్గురిని కాల్చిచంపవలెనని బిషప్ తీర్పుచెప్పగా, వారిని లండన్ టవర్లో నిర్బంధించిరి.

అనతి కాలములోనే క్రీ.శ.1540 జులై 30న స్మిత్ ఫీల్డ్కు తీసికొనివెళ్లి వారిని ఒకే స్తంభమునకు గొలుసులతో బంధించి, నిప్పు ముట్టించిరి. మంటలు వారి చుట్టు అలుముకొనినప్పుడు, ఆ ముగ్గురు హతసాక్షులు ఒకరినొకరు స్థిరధైర్యముతో ప్రోత్సహించుకొనిరి. ఆ ధైర్యము యేసుక్రీస్తునందలి నిజవిశ్వాసము వలన వారికి కలిగెను.

ఇది జరిగి ఎంతోకాలము కాకముందే థామస్ సోమర్స్ (Thomas Sommers) అను వ్యాపారిని, మరి ముగ్గురు వ్యక్తులను మార్టిన్ లూథర్ వ్రాసిన గ్రంథములలో కొన్నింటిని చదివినారని చెరసాలలో బంధించిరి. ఆలాగు వారు చదివిన గ్రంథములను చీప్సైడ్ (Cheapside) వ్యాపార కూడలినొద్దగల మంటలవరకు మోసికొనిపోయి, అక్కడ వాటిని అగ్నిలో విసరుటయే వారికి శిక్షగా విధించిరి. ఆ ముగ్గురు వ్యక్తులు ఆలాగుచేసిరి కాని, థామస్ ఆ గ్రంథములను అగ్నిలో పడకుండ విసరుటవలన అవి తగులబడలేదు. కనుక అతడు లండన్ టవర్కు తిరిగి పంపబడి, అక్కడ రాళ్లచే కొట్టబడి చంపబడెను.

అదే సమయములో థామస్ బైనార్డు (Thomas Bainard) ప్రభువు ప్రార్థన ఆంగ్లములో చేసినందుకు లింకన్ బిషప్న డా. లాంగ్లండ్ (Longland) భయంకర మతద్రోహి అని దూషించి, థామస్ను కొయ్యకు కట్టి కాల్పించెను. యాకోబు పత్రికను ఆంగ్లములో చదివినందుకు అదే శిక్ష జేమ్స్ మోర్టన్ (James Moreton) కు కూడ విధించెను. పాస్టరైన ఆంటోని పార్సన్స్ (Anthony Parsons) ను, ఈస్టువుడ్ (Eastwood) ను, మరియొక వ్యక్తిని డా. లాంగ్లండ్ సాలిస్బరి బిషప్ వద్దకు విచారణ నిమిత్తము పంపెను. అయితే సాలిస్బరి బిషప్ విచారణ పేరుతో కాలము వృధాచేయుట అనవసరము, ఆ ముగ్గురిని సజీవ దహనము చేయుమని తీర్పు చెప్పెను.

ఆ ముగ్గురిని సజీవదహనము చేయుటకు గొలుసులతో స్తంభమునకు బంధించి నప్పుడు పార్సన్స్ త్రాగుటకు నీళ్లు అడిగెను. ఇచ్చిన వెంటనే, ఆ నీళ్లను తన మిగిలిన ఇద్దరి సహచరులకు అందించి పార్సన్స్ ఈలాగు చెప్పెను : ‘సంతోషించండి, నా సహోదరులారా, మీ హృదయములను దేవునితట్టు ఎత్తుడి, రుచిలేని ఈ అల్పాహారము ముగించిన తరువాత మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు రాజ్యములో మనమిక మంచి భోజనము చేసెదము.’ పార్సన్స్ మాటలు ఈస్టువుడ్ విని, అతని కన్నులు, చేతులు ఆకాశమువైపు ఎత్తి, తన ఆత్మను త్వరగా చేర్చుకొనుమని పలికెను.

హంతకులు కట్టెలు, గడ్డిని వారిచుట్టు పేర్చగా, పార్సన్స్ కొంతగడ్డిని తీసికొని, తన గుండెలవద్ద పెట్టుకొని చూచుటకు వచ్చిన ప్రజలతో ‘ఇది దేవుని కవచము, నేను యుద్ధమునకు సిద్ధపడిన క్రైస్తవ సైనికుడను, క్రీస్తు యోగ్యతలద్వారా తప్ప, ఎవరి దయకొరకు నేను చూచుటలేదు. ఆయన ఒక్కడే నా రక్షకుడు, నా రక్షణకొరకు నేనాయనను విశ్వసించుచున్నాన’ని చెప్పెను.

నిప్పులు రగిలి, వారి శరీరములు కాలిపోయెను. కాని వారి ప్రశస్తమైన, శాశ్వతమైన ఆత్మలను ఏదీ నష్టపరచలేక పోయెను. దుర్మార్గముమీద వారి స్థిర విశ్వాసము విజయము పొందెను. వారి బోధలు హతసాక్షులను ప్రేమించువారి హృదయములలో ఎల్లప్పుడు నిలిచిపోయెను.

ఆనాటి రోమన్ కేథలిక్ మతాధిపతుల కఠినత్వము, ద్రోహములద్వారా క్రీస్తుయొక్క దైవిక అనుచరులు ఇంగ్లాండులో ఈ విధముగ హింసింపబడిరి. ఇంగ్లాండు శాసన సభలో రాజైన ఎనిమిదవ హెన్రీ దైవదూషణకరమైన చెడ్డ శాసనమును ప్రవేశపెట్టెను: ‘విక్లిఫ్ బోధించిన లేఖనములు చదివిన వారెవరైనను వారు తమ భూమిని, పశువు లను, వస్తువులను, చివరకు వారి శరీరములనుకూడ శాశ్వతముగ కోల్పోవుదురు. వారు దేవునికి ద్రోహులని, రాజుకు శత్రువులని, ఇంగ్లాండునకు సంపూర్ణ దేశ ద్రోహులని తీర్పు తీర్చబడుదురు.’

క్రీస్తు నిజ విశ్వాసులకు

జైరోము : హింస, హతసాక్షి మరణము (క్రీ.శ. 1416)

జైరోము : హింస, హతసాక్షి మరణము (క్రీ.శ. 1416)

ప్రేగ్ నివాసియైన జెరోము (Jerome) క్రీ.శ. 1370 లో జన్మించెను. ఇతడు బొహెమియా సంఘసంస్కర్త, సంచార పండితుడు. వివిధ పట్టణములలోని అనేక విశ్వవిద్యాలయ చర్చలలో ఇతడు పాల్గొనెను. ప్రేగ్ (Prague), పారిస్ (Paris), హైడెల్బర్గ్ (Heidelberg), కొలొన్ (Cologne), మరియు ఆక్స్ఫర్డ్ (Oxford) పట్టణములలోని చర్చలలో పాల్గొనుటద్వారా అతనికి చక్కని ఆంగ్లము మాట్లాడుట వచ్చెను. ఆక్స్ఫర్డ్ జాన్ విక్లిఫ్ రచనలతో పరిచయము కలిగి, వాటిని ఆంగ్లమునుండి చెక్ (Czech) భాషలోనికి తర్జుమా చేయగా అతని పుస్తకములు బొహెమియా అంతట వ్యాపించెను.

జెరోము బొహెమియాకు తిరిగివచ్చినప్పుడు అతని గ్రంథములు పట్టణములోను, విశ్వవిద్యాలయములోను విస్తృతముగ చదువబడుట చూచెను. విక్లిఫ్ రచించిన ఉపదేశములను జాన్ హస్ వ్యాప్తిచేయుచున్నందున జెరోము వెంటనే హస్ సహవాసము చేసెను. అప్పటినుండి వారిద్దరు ఆ సేవలో కలసి పనిచేసిరి.

కాన్స్టన్స్ సభలో హస్ బంధింపబడి, చెరసాలలో ఉన్నప్పుడు జెరోము కాన్స్టన్స్ వెళ్లెను. హస్ కాల్చివేయబడుటకు మూడు నెలల ముందు అనగా క్రీ.శ. 1415, ఏప్రిల్ 4న అతడక్కడకు వెళ్లెను. తాను కూడా ఖైదు చేయబడుదునను భయముతో రహస్యముగ ఆ పట్టణములో ప్రవేశించి, విక్లిఫ్ సిద్ధాంతములను విశ్వసించిన కొందరు నాయకులను సంప్రదించెను.

హసన్ను సజీవదహనము చేయవలెనను సభ తీర్పును మార్చుట అసాధ్యమని ఆ నాయకులు తెలుపగా జెరోము చక్రవర్తియైన సిజిస్మండ్ సంరక్షణలోనున్న ఐబెర్లింగ్ (Iberling) అను రాజనగరికి వెళ్లాను. తనకు ఏవిధమైన హాని కలుగదని చక్రవర్తి హామీ యిచ్చినట్లయితే తాను హస్ పక్షముగ సభముందు హాజరగుదునని చక్రవర్తికి ఉత్తరము వ్రాయగా, అది నిరాకరింపబడెను.

అదే విష యము కాన్స్టన్స్ సభకు వ్రాయగా వారుకూడా తిరస్కరించిరి. కాని హసు బదులుగ తీర్పును వినుటకు కాన్స్టన్స్, ఐబెర్లింగ్లలోని ప్రభువులు సంతకముచేసిన యోగ్యత పత్రములన్నింటిని తీసికొని తిరిగి బొహెమియా చేరెను. అయితే రాజైన సల్స్బాక్ (Sultsbach) ఆజ్ఞ ప్రకారము ఒక అధికారి జెరోమును జర్మనీలోని హిర్షా (Hirshaw) పట్టణములో అన్యాయముగ బంధించెను.

జెరోము బందీగా ఉన్నందున అతనిని తక్షణమే తమయెదుట హాజరుపరచవలెనని సభ తెలియజేసెను. జర్మనీ యువరాజు జెరోము కాళ్లకు పొడవైన గొలుసు బిగించి, ఆ గొలుసు చివరి భాగమును తన మెడకు చుట్టుకొని ఆడంబరముగా కాన్స్టన్స్కు గుఱ్ఱముమీద ప్రయాణించెను. దారిలో జెరోము అనేకమంది తన సహవాసులను కలిసికొనెను.

అతడు జెరోమును కాన్స్టన్స్కు తీసికొనిరాగా, అతనిని దుర్గంధపు గుహలో బంధించి న్యాయాధిపతులు సంతోషించిరి. హస్కు చేసిన విధముగానే జెరోముకుకూడ చేసిరి. అయితే ఇతనిని తక్కువకాలము బంధించి, వేరువేరు చెర సాలలకు మార్చెను. అతనిని బంధించిన సంవత్సరము తరువాత సభ ముందుంచిరి. అక్కడ అతనిని తన పక్షముగ వాదించుకొనుమని చెప్పి, మరల తిరస్కరించిరి. అందుకు జెరోము కోపముతో, గట్టిగా ఈ మాటలు పలికెను :

“ఇదేమి క్రూరత్వము? సుమారు మూడువందల నలుబది ఐదు దినములు నేను వివిధ జైళ్లలో బంధింపబడితిని. నేననుభవింపని దుఃఖముగాని, కష్టము గాని లేదు. వారు కోరినంతమేరకు నన్ను హింసించుటకు మీరు వారికి అప్పగించితిరి. నా పక్షముగ న్యాయమును నిరూపించుకొను చిన్న అవ కాశముకూడ నాకు ఇవ్వ నిరాకరించితిరి. తీర్పుకొరకు సిద్ధపడుటకు నాకు ఒక్క గంట వ్యవధికూడ మీరు అనుగ్రహింపలేదు.

నాకు వ్యతిరేకమైన అతి దుర్మార్గపు ప్రకటనలను మీరు స్వీకరించితిరి. నా సిద్ధాంతము తెలియకుండనే నన్ను మతద్రోహిగా నిర్ధారించితిరి. నేను ఎట్టి నమ్మకము కలిగియున్నానో తెలియకుండగనే నన్ను విశ్వాసమునకు విరోధియనుచున్నారు. నా ఉద్దేశ్యము గ్రహింపకుండగనే నన్ను బోధకుని చంపినవాడని నిందించితిరి.

మీలో ఈ ప్రపంచమునకు బోధింపగలిగినంత విజ్ఞానము, మంచి తనము పవిత్రత ఉన్నవి. కాని మీరు ఇంకను మనుష్యులే. మనుష్యుల మాటలవలన మోసపోవుదురు. మూర్ఖత్వములోను, మోసములోను పడ కుండునట్లు జాగ్రత్త కలిగియుండుడి. నేను వాదించ కోరుకొను విషయము నా స్వంత విషయము, ప్రజల విషయము, క్రైస్తవుల విషయము. ఏ రకమైన పద్ధతిని ఉపయోగించి మీరు పరీక్షించెదరో కాని, ఇది రాబోవు తరముల స్వేచ్ఛను, హక్కులను బాధించు విషయము.”

జెరోముయొక్క హృదయవేదన సభపై ఎట్టి ప్రభావము చూపలేదు. అతడు మాట్లాడుట ముగించినవెంటనే, అతనిపై ఐదు నేరారోపణలు జారీచేసిరి.

  1. జెరోము సంఘ గౌరవమును పరిహసించెను.
  2. పోప్ను వ్యతిరేకించెను.
  3. మత ప్రధానాధికారులకు శత్రువు.
  4. బిషప్ హంతకుడు.
  5. క్రైస్తవ మతద్వేషి.

జెరోము తనపై మోపిన నేరారోపణలనన్నింటిని తిరస్కరించగా, తిరిగి అతనిని జైలులో పెట్టి పదకొండు దినములు కాలిమడమలు పైకికట్టి తలక్రిందులుగా వ్రేలాడదీసిరి.

జెరోము గొప్ప భాషాపాండిత్యము, మిక్కిలి జ్ఞానముగలవాడు కనుక మాట్లాడుటకు అవకాశమిచ్చినచో ఎంతటి మతోన్మాదినైనను, కరడుగట్టిన ద్వేషబుద్ధిగలవానినైనను మార్చగలడు. కనుక మాట్లాడుటకు అతనికి అవకాశమీయకూడదని కొందరు అభి ప్రాయపడిరి. అయినను సభ తన వాదనలోని న్యాయమును నిరూపించుకొను అవ కాశము జెరోముకిచ్చెను.

తనమీద నేరములు ద్వేషముతోను, అబద్దములతోను నిరూ పించబడినవని చెప్పెను. తన జీవితము, నడవడి సభకు విడమరచి చెప్పెను. మహా ఘనులు, పవిత్రులైన మనుష్యుల అభిప్రాయములుకూడ కొన్నిసార్లు మారుననియు, కనుక బహిరంగముగ చర్చించుకొనిన వాస్తవములు గ్రహించవచ్చుననెను.

ప్రకటన 2-12

విక్లిఫ్ సిద్ధాంతములు సత్యమైనవని నిరూపించి, హసన్ను గొప్పగా శ్లాఘించెను. అట్టి పవిత్ర హతసాక్షులననుసరించి తానుకూడ చనిపోవుటకు సిద్దముగా ఉన్నానని జెరోము విన్నవించెను. గతములోవలె, ఇప్పుడుకూడ సభ అతని మాటలను లక్ష్యపెట్టలేదు.

జాన్ హస్వలె జెరోముకూడ దోషియని తీర్చబడి, మతద్రోహివలె కొయ్య స్తంభమునకు కట్టి కాల్చవలెనని ఆజ్ఞాపించిరి. అతడు హస్వలె పాదిరి కాదు గనుక అగౌరపరచు కార్యములు చేయలేదు. తన మనస్సు మార్చుకొనుటకు సభ అతనికి రెండురోజుల వ్యవధినిచ్చెను. శాయశక్తుల కృషిచేసి, అతనిని ఒప్పించుటకు కార్డినల్ ఫ్లారెన్స్ ప్రయత్నించెను. కాని జెరోము మాటలు సభపై ప్రభావము చూపనట్లే ఫ్లారెన్స్ మాటలుకూడ జెరోముపై ఎట్టి ప్రభావమును చూపలేకపోయెను.

ఉరికంబమునకు వెళ్లుదారిలో జెరోము ఎన్నో స్తుతిగీతములు పాడెను. హసన్ను సజీవ దహనముచేసిన అదే స్థలమునకు జెరోమును తీసికొనివచ్చినప్పుడు అతడు మోకరించి పట్టుదలగా ప్రార్థించెను. గొలుసులతో కట్టబడకముందే, కొయ్యస్తంభమును కౌగిలించుకొనెను. కట్టెలు అంటించుటకు హంతకుడు వెనుకకు వచ్చినప్పుడు, అతనిని పిలిచి, “నాకు ఎదురుగా వచ్చి, నేను చూచునట్లు నిప్పుముట్టించుము. నేను భయ పడను, భయపడి ఉంటే, నేనీ స్థలమునకు వచ్చి ఉండేవాడను కాదు” అని చెప్పెను.

నిప్పు ముట్టించబడినది. కట్టెలు బాగా ఎండినవగుటచే, జ్వాలలు త్వరగా అతనిని చుట్టుముట్టెను. కొద్దిసేపు జెరోము స్తుతిగీతములు పాడెను కాని, రగులుచున్న అగ్ని అతనిని నిశ్శబ్దపరచినది. ప్రత్యక్ష సాక్షులు వినిన అతని చివరి మాటలు : ‘క్రీస్తూ, ఈ మంటలలో నా ఆత్మను నీకు సమర్పించుచున్నాను.’

ఇట్లు జెరోము క్రీ.శ.1416, మే 30 న హతసాక్షి మరణమొందెను. మతన్యాయ నిర్ణేతలు ఏవిధముగా తలంచినను, అతని మరణజ్వాలలు సత్యసువార్తాగ్నిని నాగరిక ప్రపంచమంతట వ్యాపింపజేసెను. విక్లిఫెక్క ఆంగ్ల రచనలను జెరోము చెక్భాషలోనికి తర్జుమా చేసి, ఆ విధముగ సత్య సువార్త విత్తనములను నాటెను.

ఎఫెసీ 6-17

పునరుత్థానుడైన క్రీస్తు పెర్గములో ఉన్న సంఘమునకు ఈలాగు వ్రాసెను:ఇప్పుడు ఆత్మ ఖడ్గమైన దేవుని వాక్యము, మారుమనస్సు పొందని సంఘము మీదకి రానైయుండెను.

జాన్ హస్: హింస, హతసాక్షి మరణము (క్రీ.శ. 1415)

జాన్ హస్: హింస, హతసాక్షి మరణము (క్రీ.శ. 1415)

క్రీ.శ. 1372 లో బొహెమియాలోని హస్సెనిట్జ్ (Hussenitz) నందు జాన్ హస్ జన్మించెను. ప్రేగ్ (Prague) విశ్వవిద్యాలయమునందు వేదాంత శాస్త్రము చదివి, పాదిరిగా అభిషేకము పొంది ప్రేగ్లోని బేత్లహేము దేవాలయములో క్రీ.శ. 1402 లో బోధకునిగా నియమింపబడెను. ఆ తరువాత క్రీ.శ. 1409 లో విశ్వ విద్యాలయ అధ్యక్ష పదవిని పొందెను.

విక్లిఫ్ రచనలవలన జాన్ హస్ చాల ప్రభావితుడయ్యెను. ముఖ్యముగ క్రైస్తవ సంఘముపై పోప్ చేయుచున్న అధికారములకు బైబిలు ఆధారము కాదని తిరస్కరించి, సంఘవిషయములన్నిటిలో లేఖనములు ఉన్నత ప్రమాణములని, సంఘములోని లోపములు,అవినీతి సంస్కరింపబడవలెనని పట్టుబట్టెను.

పాదిరి ప్రార్థించిన తరువాత ఆరాధనలోని రొట్టె, ద్రాక్షారసము ప్రభువైన యేసుక్రీస్తుయొక్క నిజశరీరముగాను, రక్తముగాను మారునను సిద్ధాంతము (Doctrine of Transubstantiation) ను హస్ ఒప్పుకొనలేదు. క్రైస్తవులు తమంతట తాము చదువుకొనుటకు బైబిలు వారి స్వభాషలలో ఉండవలెనని వాదించెను.

అప్పటిలో బైబిలు లాటిన్ భాషలో మాత్రమే కలదు, ఉన్నత మతాధికారులు మాత్రమే బైబిలును చదువగలిగేవారు. ఆరాధనకు ఉపయోగించు కొన్ని బైబిళ్లు మాత్రము సామాన్య ప్రజలు దేవాలయము వెలుపటికి తీసికొని వెళ్లకుండ వాటిని గొలుసులతో బోధకుడు నిలుచుండు ఉన్నత స్థలమైన పులి ్పటు కట్టి ఉంచేవారు.

విక్లిఫ్ సిద్ధాంతములను జాన్ హస్ నమ్ముటమాత్రమే కాదుగాని తన దేవాలయము లోను, విశ్వవిద్యాలయమందును వాటిని బోధించెను. అతడు పోషను, అతని అభి మానులను తీవ్రముగ ఎదుర్కొనెను గనుక వారి దృష్టినుండి ఎక్కువకాలము తప్పించుకో లేకపోయెను.

వారు పిలువబడినట్లుగ, “సంస్కర్తలు లేక లో లార్డు (Reformists)” దిన దినము విస్తరించుచున్నందున ప్రేగ్ ని రోమన్ కేథలిక్ ఆర్చిబిషప్ విక్లిఫ్ రచనలు వ్యాపించకుండ వాటిని అణచివేయవలెనని శాసనము చేసెను. కాని అతడు ఆశించిన దానికి భిన్నముగా జరిగెను.

విశ్వవిద్యాలయములోని విక్లిఫ్, జాన్ హస్ల అభిమాను లందరు ఏకమై వారు చేయగలిగినంతమేరకు వారి ఉపదేశములను, సిద్ధాంతములను ఎక్కువ పట్టుదలతో వ్యాపింపజేసిరి.

పోప్ అది వినినప్పుడు, జాన్ హసన్ను రోముకు పిలిపించి, మతవిరుద్ధమైన తప్పుడు బోధలు చేయుచున్నాడను నిందలకు సంజాయిషీ కోరుమని కార్డినల్ కొలొన్నా (Cardinal Colonna) ను నియమించెను. జాన్ హస్ తరపున ముగ్గురు ప్రతినిధులు కార్డినల్వద్దకు వెళ్లి “జాన్ హస్ రోముకు రాలేడని అతని పక్షముగ ఏ ప్రశ్నలకైనను తాము జావాబిచ్చెదమ”ని చెప్పిరి. కాని జాన్ హస్ మొండితనముతోకూడిన అవిధేయు డని, అతనిని సంఘమునుండి వెలివేయుచున్నానని కార్డినల్ ప్రకటించెను.

చక్రవర్తి

జాన్ హస్యొక్క ప్రతినిధులు పోపన్ను వేడుకొనగ, ఆ ప్రకటనను పునఃపరిశీలన చేయుటకు నలుగురు కార్డినల్స్ను పోప్ నియమించెను. ఆ నలుగురు కార్డినల్స్ శిక్షను ధృవీక రించుటమాత్రమే గాక జాన్ హస్ స్నేహితులను, అనుచరులను, ఆ ముగ్గురు ప్రతినిధు లనుకూడ సంఘ బహిష్కరణ గావించిరి.

తీర్పును మార్చమని జాన్ హస్ వేడుకొనెను గాని ఫలితము లేకపోయెను. ప్రేగ్ లోని బేత్లహేము దేవాలయములో ఇక బోధింపలేడు కనుక అతడు తన స్వగ్రామమైన హస్సెనిట్జ్కు తిరిగి వెళ్లెను. అక్కడ తన సిద్ధాంతములను బోధించుచు అనేక పత్రికలు వ్రాసెను. విక్లిఫ్వంటి సంఘసంస్కర్తలు వ్రాసిన పుస్తకములు చదువకుండ, తమను నిషేధించు హక్కు ఎవరికీ లేదని తన సుదీర్ఘ వ్యాసములో వ్రాసెను.

రోమన్ కేథలిక్ పోప్, కార్డినల్స్, మతనాయకుల దుర్మార్గములనుగూర్చి పుస్తకములు వ్రాసెను. జాన్ హస్ వాదములు బైబిల్ ప్రకారము సహేతుకమైనవి, శక్తికలవియునైయున్నవి గనుక అతడు మంచివాడని చాలమంది అంగీకరించిరి.

క్రీ.శ. 1414 నవంబరులో కాన్ఫ్రాన్స్ నందు ఒక సభ జరిగెను. ఆ సభకు జాన్ హస్ ఆహ్వానింపబడెను. అక్కడ అతనికేమియు ముప్పువాటిల్లదని సిజిస్మండ్ (Sigismund) చక్రవర్తి అభయమిచ్చెను. అయినప్పటికిని “మతద్రోహి” అను నేరము అతనిపై మోపబడినందున క్రీ.శ. 1415 జనవరిలో హస్ కాన్స్టన్స్ చేరగానే, అతనిని పట్టుకొని ఒక కోటగదిలో నిర్బంధించిరి. అది చట్టవిరుద్ధమని, అతనికి ఏ ప్రమాదముండదని చక్రవర్తి చేసిన వాగ్దానమునకు విరుద్ధమని హస్ స్నేహితులు సభకు తెలియపరచిరి.

“అతని భద్రత విషయములో తాను ఏమీ చెప్పలేదని, చక్రవర్తి చెప్పిన దేనికైనను తాను బాధ్యుడను కాన”ని పోప్ చెప్పెను. ప్రమాదము జరుగకుండ చూచెదనని అతడు చేసిన వాగ్దానమును గూర్చి అతని స్నేహితులు చక్రవర్తి సిజిస్మండుకు మొఱ్ఱపెట్టుకొనినప్పుడు, అతడు హస్ ను రక్షించుటకు నిరాకరించెను.

హసన్ను విచారించుటకు మతన్యాయాధిపతులు లేనందున ఆ బాధ్యతలను సభ నిర్వహించెను. హస్ వారి ముందుకు తేబడినప్పుడు, అతనిమీద నలుబది నిందలు మోపిరి. వాటిలో చాలావరకు అతని రచనలనుండి ఎన్నుకొనిరి. మిగిలినవి నిరాధార ములు. ఆ నిందలకు జాన్ హస్ “నేను పోప్కు విన్నవించితిని, నా విన్నపము పరిశీలింపకముందే పోప్ గారు చనిపోయిరి.

కనుక, అతని తరువాత వచ్చిన పోప్ ఇరువదిమూడవ జాన్కు మొఱ్ఱపెట్టితిని. రెండు సంవత్సరములవరకు నా విషయమును వాదించుకొనుటకు నాకు అవకాశము లభింపలేదు. కనుక నేను ఉన్నత న్యాయాధి పతియైన యేసుక్రీస్తునకు మనవిచేసికొంటిన”ని సమాధానమిచ్చెను. “క్రీస్తుకు మొఱ్ఱపెట్టుట న్యాయసమ్మతమా?” అని సభ అతనిని ప్రశ్నించెను.

“మీ అందరియెదుట వాస్తవమునకు నేను చెప్పునదేమనగా క్రీస్తుకు సమర్పించిన విన్నపముకంటె న్యాయమైనది, శక్తివంతమైనది మరి యే విన్నపము ఉండదు. చిన్న న్యాయాధిపతిద్వారా జరిగిన తప్పును దిద్దుటకు పెద్ద న్యాయాధిపతికి విన్నపము చేయుమని న్యాయశాస్త్రము చెప్పుచున్నది. క్రీస్తుకంటె ఉన్నత న్యాయాధిపతి యెవరు? అని నేను మిమ్ములను అడుగుచున్నాను.

ఈ విషయమును న్యాయముగను, నిష్పక్షపాతముగను, నిర్దోషముగను ఎవరు తీర్పు చెప్పగలరు? క్రీస్తులో మోసము లేదు, ఆయన మోసగింపబడడు, బాధింపబడినవారికి, అణచివేయబడినవారికి ఆయనకంటె అధికముగ ఎవరు సహాయపడగలరు?” అని జవాబిచ్చెను. హస్ మాటలు విని సభ సభ్యులందరు హేళనచేసి, కోపోద్రేకులై, అతనిని కాల్చి చంపుమని తీర్పుచెప్పిరి.

ఏడుగురు బిషప్లు ముందుకువచ్చి హసన్ను పాదిరి బట్టలు ధరింపుమని ఆజ్ఞా పింపగ అతడు ఆ వస్త్రములను ధరించెను. అప్పుడు వారందరు అతని వస్త్రములను ఒకేసారి లాగి, అతనిని కించపరచి, పరిహసించిరి. అప్పుడు హస్ “మీరందరు ఒకే చెడ్డ మనస్సు కలిగి ఉన్నందుకు నేను ఆశ్చర్యపడుచున్నాను” అని చెప్పెను.

రెండు కత్తెరలతో అతని తలమీదనున్న కిరీటమును ముక్కలు చేయుటకు బిషప్పులందరు తీర్మానించుకొని, పని ప్రారంభించిరి. రక్తసిక్తమైన అతని తలపై “మత ద్రోహుల నాయకుడు” అని వ్రాసి, దయ్యముల బొమ్మలు వేసిన టోపి ధరింప జేసిరి. హస్ అది చూచి  అప్పుడు బిషప్ కాగితపు కిరీటమును హస్ తలపై ఉంచి, “ఇప్పుడు నీ ఆత్మను నరకమునకు అప్పగించుచున్నాను” అని చెప్పెను.

నాకొరకు నా ప్రభువైన యేసుక్రీస్తు ముళ్ల కిరీటము ధరించెను

కాని హస్ ఆకాశమువైపు కన్నులెత్తి “ఓ యేసుక్రీస్తు ప్రభువా, నీవు విమోచించిన నా ఆత్మను నీ చేతులకు అప్పగించుచున్నాను” అని చెప్పెను.

అతని పుస్తకములు కాల్చివేయబడుచున్న స్థలమునకు అతనిని నడిపించుకొని వెళ్లి, ఒక కొయ్యస్తంభమునకు గొలుసులతో కట్టివేసిరి. వారు గొలుసులతో కట్టివేయు చున్నప్పుడు హస్ నవ్వుచూ “నాకొరకు నా ప్రభువైన యేసుక్రీస్తు ఇంతకంటె కఠినమైన గొలుసులతో కట్టబడెను, కనుక ఈ తుప్పుపట్టిన గొలుసులతో కట్టించుకొనుటకు నేనెందుకు సిగ్గుపడవలెను?” అని చెప్పెను.

హసను నిలువబెట్టి మెడవరకు చుట్టు కట్టెలు పేర్చిరి. బవేరియా రాజు, హసన్ను తన సిద్ధాంతములను పరిత్యజించవలసినదిగా కోరెను. కాని హస్ “కాదు, నేనెప్పుడు తప్పుడు సిద్ధాంతమును ప్రకటింపలేదు. నేను పెదవులతో చెప్పినదానికి రక్తముతో ముద్రవేయుచున్నాను” అని జవాబిచ్చెను. కట్టెల మంటలు అతనిని చుట్టు ముట్టి నప్పుడు, మంటల శబ్దములోకూడ వారందరు వినునట్లు హస్ బిగ్గరగా పాటలు పాడెను. త్వరలో మంటలు అతని గొంతును, ముఖమును మూసివేయుటతో అతని స్వరము ఆగిపోయి, గొలుసులమీదుగ ముందుకుపడి మరణించెను.

విక్లిఫ్ యెడల చూపించిన బుద్ధిహీనతతోనే, బిషప్ లు హస్ చితాభస్మమును ప్రోగుచేసి, భూమిమీద అతని జ్ఞాపకచిహ్నములుండకుండ ఆ భస్మమును రైన్ నదిలో విసరివేసిరి. కాని, హస్ అభిమానుల మనస్సులనుండి అతనిని, అతని ఉపదేశములను, జ్ఞాపకములను తుడిచివేయలేకపోయిరి. అతని ఉపదేశములు అభిమానులద్వారా గౌరవింపబడి సుదూరప్రాంతములకు వ్యాపించెను. జీవములోకంటే మరణములోనే హస్ మతాధిపతులకు హడలు పుట్టించెను.

అతని ఉపదేశములను అనుసరించిన చెక్ (Czech) మత సంస్కర్తలగు హస్సైటులు (Hussites) అతని మరణమునుండి ఉద్భవించిరి. అతడు క్రీ.శ. 1415, జూలై 6న మరణించిన తరువాత బొహెమియా, మొరావియాలలో జాతీయోద్యమ అంకురార్పణ జరిగెను. పవిత్ర రోమా చక్రవర్తి సిజిస్మండ్, ప్రమాదము లేదని వాగ్దానము చేసినప్పటికిని కాన్స్టన్స్ సభలో హస్ను మతద్రోహిగా నిందించి చంపిరి. దీనిని చెక్ ప్రజలు జాతీయావమానముగ భావించిరి. ఈ అవమానమును ప్రజ లనేకులు ఎన్నటికిని మరువకపోవుటచే అది హస్పైటు యుద్ధములకు (Hussite Wars) దారితీసెను.

జాన్ విక్లిఫ్ : సేవ, హింసించబడుట (క్రీ.శ. 1377-1384)

జాన్ విక్లిఫ్ : సేవ, హింసించబడుట (క్రీ.శ. 1377-1384)

జాన్ విక్లిఫ్ (John Wycliffe) జన్మస్థలము ఇంగ్లాండులోని యార్కైర్ (York- shire). ఇతడు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయములో చదివి తత్వజ్ఞానశాస్త్రము, వేదాంత శాస్త్రములందు పండితుడయ్యెను. ఆ కాలములో విక్లిఫ్ అపార పాండిత్యముగల వేదాంత శాస్త్రజ్ఞునిగను, మిక్కిలి గౌరవింపదగిన తర్కపండితునిగను ప్రసిద్ధిగాంచెను. క్రీ.శ. 1374 లో ప్రభుత్వపు కొలువులో చేరి, రోమన్ కేథలిక్ సామంత రాజులు రోముకు చెల్లింపవలసిన కప్పము విషయమై పోప్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుటకు అతడు నైరుతి బెల్జియంలోని బ్రుజెస్ (Bruges) పట్టణమునకు రాయబారిగా పంప బడెను.

అక్కడ కొంతకాలము గాంట్ పట్టణమునకు చెందిన జాన్ (John of Gaunt), రాజైన లంకాస్టెర్ ప్రభువు (Duke of Lancaster) లతో స్నేహము చేసెను. ఆ కాలములో విక్లిఫ్ సంఘ సిద్ధాంతములలోని లోపములను గ్రహించి, వాటిని సంస్కరింపవలెనని, ఇంగ్లాండు సంఘమును ప్రక్షాళనము చేయుటకు రాజే న్యాయబద్ధమైన అధికారియని తలంచెను. అతని ఉద్దేశ్యములు రోమన్ కేథలిక్ సంఘ బోధలకు, ఆచారములకు పూర్తి వ్యతిరేకముగ ఉన్నవి. కనుకనే “భిన్నమతావలంభికులు” (Lollards) అని పిలువబడు విక్లిఫ్కు, అతని అనుచరులకు మతాధికారులందరు వ్యతిరేకముగ నిలిచిరి.

విక్లిఫ్ గొప్ప ఆక్స్ఫర్డ్ విద్యావేత్త, తత్త్వశాస్త్రజ్ఞుడు. అతని సిద్ధాంతములను వ్యతిరే కించువారు సహితము ఆ విషయమును గుర్తించిరి. వారు అతని బలమైన, సహేతుక మైన వాదములకు ఆశ్చర్యచకితులైరి. విక్లిఫ్ చనిపోయిన కొన్ని సంవత్సరములకు అతని స్నేహితుడైన వాల్డెన్ (Walden) పోప్ ఐదవ మార్టిన్కు ఈలాగున ఒక ఉత్తరము వ్రాసెను :

పూర్వకమైన

మతము నీతిమాలి చెడిపోయినప్పుడు విక్లిఫ్ ప్రభావము వ్యాప్తిచెందెను. ప్రజలు కేవలము పెదవులతో ప్రభువును ఆరాధించుచున్నారు. కాని, వారి జీవితములను మార్చగల ఆయన గొప్ప శక్తిని తృణీకరించిరి. అనేకులకు వారి సంప్రదాయములు, మూఢనమ్మకములు ముఖ్యము.

అది ఆత్మీయ అంధకార యుగము. ఎందుకనగా, పరిశుద్ధ లేఖనములను ప్రత్యక్షముగ తెలిసికొను అవకాశము సామాన్య ప్రజలెవరికీ లేదు. అనేకమంది మనుష్యులు ఈ చీకటి, సందేహమను రాజ్యమునకు నడిపింపబడు చున్నారు. సంఘముయొక్క ఆచారములు, మూఢ నమ్మకములు ప్రజలను రక్షించునని, పోప్ ప్రకటించిన కార్యములు నెరవేర్చినచో పరదైసు లభ్యమగునని మతాచార్యులు వారికి బోధించిరి.

తొలి క్రైస్తవులు అన్యులచే హింసింపబడి, హతసాక్షులైరి. అయితే జాన్ విక్లిఫ్ మాత్రము క్రీస్తు పవిత్ర నామమును ఎరిగినవారినుండి హింసలు ఎదుర్కొనవలసి వచ్చెను. అతని బోధనలు కేథలిక్ మతనాయకులకు కోపము కల్గించెను. అవకాశమున్న ప్రతి పద్ధతిలో వారు అతనిని ఖండించిరి.

మొదట మత సన్యాసులు, మత నాయకులు విక్లిఫ్ను వ్యతిరేకించిరి. తరువాత బోధకులు, బిషప్లు, ఆర్చిబిషప్లు వారితో కలసిరి. సైమన్ సద్బురి (Simon Sudbury) అను ఆర్చిబిషప్ విక్లిఫ్ను ఆక్స్ఫర్డ్లోని తన ఉద్యోగమునుండి తొలగించెను. చివరకు పోపూడ విక్లిఫ్మీద వ్యతిరేక చర్యలు చేపట్టెను.

గాంట్ పట్టణ జాన్, లంకాస్టర్ ప్రభువు, నార్తుంబెర్లాండ్ మొదటి ప్రభువైన లార్డ్ హెన్రీ పెర్సీ (Lord Henry Percy) లు విక్లిఫ్కు అనుకూలముగా ఉండి, మధ్యవర్తిత్వము నడిపినందున విక్లిఫ్ కొంతకాలము కేథలిక్ సంఘాధికారమునుండి తప్పించుకొనగలిగెను. అయితే బ్రమ్హమ్ మూర్ (Bramham Moor) యొద్ద నాల్గవ హెన్రీకి వ్యతిరేకముగ లార్డ్ హెన్రీ పెర్సీచేసిన తిరుగుబాటులో క్రీ.శ. 1408, ఫిబ్రవరి 20న చంపబడెను. ఆ తరువాత మిగిలిన ఇద్దరు ప్రభువుల ఆశ్రయముకూడ నిరుపయోగమైనది. క్రీ.శ. 1377 లో బిషప్లందరు విక్లిఫ్పై చర్యతీసికొనవలసినదిగ ఆర్చిబిషప్ సైమన్ సద్బురిని పురికొల్పుటలో కృతకృత్యులైరి.

ఇంతకుపూర్వమే సద్బురి విక్లిఫ్ను తన సిద్ధాంతములను బోధింపకుండ ఆటంక పరచెను. మరలా ఇప్పుడు విక్లిఫు బిషప్ల సమావేశమునకు హాజరుకావలసినదిగ ఆజ్ఞాపించెను. విక్లిఫ్ను బలపరచు లౌకిక నాయకులు తోడురాగా విక్లిఫ్ సమావేశము నకు హాజరయ్యెను. ఈ సభ లండనులోని పరి. పౌలు దేవాలయములో జరిగెను.

ప్రభువులు, జమిందారులు, బిషప్ లు, ఆర్చిబిషప్లు అందరు కలసి ఆ దేవాలయములో సమావేశమైరి. విక్లిఫ్ వారియెదుట నిలువబడవలసియుండెను. అతడు ‘జవాబు చెప్పవలసిన అనేక విషయములున్నవి’ కనుక అతడు కూర్చుండుట మంచిదని పెర్సీ ప్రభువు విక్లిఫ్ను కూర్చుండుమని చెప్పెను. దీనికి ఆగ్రహించిన లండన్ బిషప్ విక్లిఫ్ నిలుచుండవలసినదేనని చెప్పెను.

ఆ విషయమై అనేక వాగ్వి వాదములు జరిగెను. అక్కడ చేరిన జనసమూహము తమ అసహనమును వ్యక్తపరచిరి. ఇరుపక్షములు ఒకరినొకరు బెదరించుకొనిరి. లౌకికపక్షము మతాధికారులపై లౌకిక చర్య తీసికొనెదమని, మతపక్షము లౌకికాధికారులపై మతపరమైన చర్య తీసికొనెదమని బెదరించుకొనిరి.

ఇంతలో అందరు వినునట్లు లంకాస్టర్ ప్రభువు లండన్ బిషప్ ను అవమానపరచు మాటను గట్టిగ, అతని ప్రక్కనవున్న వ్యక్తితో అనుటవలన గుంపులోని అనేకమంది ఆ మాటకు గట్టిగా అరచి, తమ బిషప్ ను ఈ విధముగ అవమానించుటను సహించమని చెప్పిరి. నిందించుకొనుట, జగడమాడుకొనుటతో సభ ఆ ఉదయము తొమ్మిదిగంటలకు రద్దయినది. తిరిగి సమావేశము జరుగలేదు.

క్రీ.శ. 1377 లో మూడవ ఎడ్వర్డు (Edward III) అనంతరము రెండవ రిచర్డు (Richard II) ఇంగ్లాండునకు రాజయ్యెను. అతని ప్రసంగములనుండి సంపాదించిన అనేక వ్యాసముల ఆధారములతో రోమా బిషప్లు విక్లిఫ్కు వ్యతిరేక పోరాటము సాగించిరి.

  1. అవి : ఆరాధనలో పాదిరి ప్రార్థనచేసిన తరువాత రొట్టె, ద్రాక్షారసము నిజమైన క్రీస్తు శరీరముగా మారవు.
  2. రోమా సంఘము అన్ని సంఘములకు అధినేత కాదు, ఇతరులగు అపొస్తలుల కంటె పేతురునకు క్రీస్తు ఎక్కువ అధికారమునీయలేదు.
  3. ఏ యితర పాదిరి (Priest) కంటె పోప్ వద్ద సంఘపు తాళపుచెవులు లేవు.
  4. భూమిమీద ప్రతి క్రైస్తవ వ్యక్తియొక్క జీవితమును శాసించుటకు తగినది సువార్త మార్గము తప్ప మరి యే శాసనము కాదు.
  5. మతస్థులైన ప్రజలను పరిపాలించుటకు చేయబడిన శాసనములన్నియు యేసుక్రీస్తు సువార్తకు గోడకు వేసిన సున్నముకంటె అధిక పవిత్రతను ఆపాదింపలేవు.
  6. ఆజ్ఞను అతిక్రమించినవారిని శిక్షించి, వారిని ఖైదు చేయు కారాగారములు పోషక్కుగాని, మతాధికారులకుగాని ఉండరాదు.

ఈ సిద్ధాంతములను ఎచ్చటను బోధింపరాదని బిషప్లు, మతాధికారులు విక్లిఫ్ను ఆదేశించిరి. అయితే అతడు మునుపటికంటె బలముగాను, ధైర్యముగాను లేఖనముల లోని సత్యములను ప్రకటించుటకు నిశ్చయించుకొనెను. అనేకమంది పెద్దలు, ఇతర ప్రభువుల సహకారముతో సామాన్యప్రజల మధ్య తన సిద్ధాంతములను బోధించెను.

మూడవ రిచర్డ్ పరిపాలన మొదటి సంవత్సరములో పోప్ ప్రతిస్పందించి విక్లిఫ్ సిద్ధాంతము వ్యాపించుటకు, వేళ్లూనుటకు అవకాశము కలిగించిన ఆక్స్ఫర్డ్ విశ్వ విద్యాలయమును నిందించుచు సూటిగ శ్వేతపత్రమును విడుదలచేసెను. విశ్వవిద్యా లయ ప్రతినిధులు, అధికారులు ఆ శ్వేతపత్రమును తీసికొని దానిని గౌరవింపవలెనా? లేక లజ్జాకరమైనదిగా భావించి దానిని తిరస్కరించవలెనా? అని వారిలో వారు ఆలోచన చేసిరి. పోప్ విడుదల చేసిన శ్వేతపత్రములోని అంశములు :

“లండన్ బిషప్ అధికారములోగల లుటెర్ వర్త్ (Lutterworth) సంఘాధ్యక్షుడు, వేదాంతాచార్యుడైన జాన్ విక్లిఫ్ విషయములు నమ్మకస్తు లైన అనేకమంది మనుష్యులద్వారా మాకు తెలిసినవి. ఏమనగా అతడు ద్వేషించదగిన మూర్ఖస్థితికి చేరినాడని, తప్పుడు సిద్ధాంతములను భయము లేకుండ బహిరంగముగ బోధించుచు, సంమౌన్నత్యమును కూలద్రోయు విధముగ అతడు చెడు స్వభావముతో తప్పుడు బోధలను, సిద్ధాంతములను ప్రకటించుచు సంఘమును, లౌకిక ప్రభుత్వమునుకూడ బలహీనపరచు చున్నాడు.

అధికారములోను, ఐశ్వర్యములోను గొప్ప కీర్తి గడించిన ఇంగ్లాండు రాజ్యములో అతడు తన తప్పుడు అభిప్రాయములను వ్యాపింపజేయు చున్నాడు. ఇంగ్లాండు తన విశ్వాసముయొక్క పవిత్రతను ప్రకాశింప జేయుచు, లేఖనములలో నిర్దిష్టమైన గొప్ప జ్ఞానముగల, కీర్తి గడించిన మనుష్యులను అందించుటకు అలవాటుపడెను. వారు తమ విధానములలో పరిపక్వత పొందిరి.

వారు భక్తిలో శ్రేష్ఠులు, కేథలిక్ విశ్వాసమును ధైర్యముగా కాపాడగలిగినవారు. అయితే విక్లిఫ్ తన సిద్ధాంతములద్వారా క్రీస్తు మందలో కొందరిని అపవిత్రపరచుచు కపట విశ్వాసముతో సరళ మార్గమునుండి తప్పుదారిన నరకమను గోతిలోనికి వారిని నడిపించు. చున్నాడు.

అందువలన మీ అధికారమును ఉపయోగించి మీరు జాన్ విక్లిఫ్ను బంధించి లేక బంధింపబడునట్లు చేయవలసినదిగ మిమ్ములను గట్టిగా ఆదేశించుచున్నాము. నమ్మకమైన గట్టి బందోబస్తుతో కేంటర్ ్బరి ఆర్చి బిషప్, లండను బిషప్లయొద్దకు లేక ఏ ఒక్కరియొద్దకైనను అతనిని పంపించుడి.”

పోప్ వద్దనుండి వచ్చిన మరి రెండు ఉత్తరములు జాన్ విక్లిఫ్మీద అతనికున్న “కోపమును వ్యక్తము చేసెను. మూడు నెలలలోపు బిషప్ లు ఆ సమస్యను పరిష్కారము చేయలేకపోయినట్లయితే, విక్లిఫ్ను తనయెదుట హాజరుపరచవలెనని పోప్ వ్రాసిన ఉత్తరములలో ఒకటి సూచించెను. అలాగే విక్లిఫ్ సిద్దాంతములకు ఏవిధమైన పరపతి కలిగింపవద్దని ఇంగ్లాండు బిషప్లకు వ్రాసిన రెండవ ఉత్తరములో హెచ్చరించెను. విక్లిఫ్కు వ్యతిరేకముగ బిషప్లందరు ఏకమగుటకు ఆ ఉత్తరములు దోహదపడినవి. వారి యెదుటికి విక్లిఫ్ను రప్పించుటకు వారందరు తీర్మానించిరి.

విక్లిఫ్ కేసు పరిశీలనకు వచ్చిన రోజున రాజైన రెండవ రిచర్డ్ కొలువునుండి లూయిస్ క్లిఫర్డ్ (Lewis Clifford) అనునతడు బిషప్లు ఉన్నచోటికి వచ్చి, జాన్ విక్లిఫ్కు వ్యతిరేకముగా ఏవిధమైన శిక్ష విధింపరాదని వారికి ఆజ్ఞాపించెను. వారిలో అనేకమంది నిశ్చేష్టులగునంతగ అతని మాటలు బిషప్లకు దిగ్రమ కలిగించెను. ఆశ్చర్యకరమైన దేవుని కృపాకార్యములద్వారా పోప్ ఆగ్రహమునుండి జాన్ విక్లిఫ్ రెండవసారి తప్పించుకొనెను.

ప్రకటించుటకు, బోధించుటకు ఎక్కువ సమయము లభించినందున విక్లిఫ్ పరవశించెను. అతడెంత ఎక్కువ బోధిస్తే బిషప్లు, మతాధికారులు అంత ఎక్కువగా కోపించిరి. క్రీ.శ. 1378, మార్చి నెలలో విక్లిఫ్కు ఎక్కువ శ్రమలు కలుగజేసిన నాయకుడైన పోప్ పదకొండవ గ్రెగరి ఆకస్మికముగా చనిపోయెను. ఆ తరువాత కాన్స్టన్స్ సభ క్రీ.శ. 1417 లో ఐదవ మార్టిన్ (Martin V) ను పోప్ ఎన్నుకొనెను.

అదే సమయములో ఇంగ్లాండు ప్రజలు సామాన్యులు, ప్రభువర్గము అను రెండు వర్గములైరి. ఆ కాలములో కేంటర్బరి ఆర్చిబిషప్ సైమన్ సబ్బురిని కోపోద్రేకులైన కొందరు తీసికొనిపోయి శిరచ్ఛేదము చేసిరి. అతని తరువాత వచ్చిన కేథలిక్ నాయకుడైన విలియమ్ కోర్టెనే (William Courtney) కూడ మతద్రోహులను నిర్మూలించుటలో తక్కువవాడేమి కాదు.

విక్లిఫ్, అతని అనుచరులు ఇంగ్లాండులో గొప్ప శక్తి, ప్రభావము కలవారగు చున్నందున, అప్పటి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయముయొక్క అధ్యక్షుడైన విలియమ్ బెర్టన్ (William Berton) ఎనిమిదిమంది మత సన్యాసులను, నలుగురు ఇతరులను సమావేశపరచి, విక్లిఫోను అతని అనుచరులతోను సహవాసము చేయువారెవరికైనను తీవ్రమైన శిక్షలు విధింపబడునని శాసనమును జారీచేసెను. విక్లిఫ్ను, అతని అనుచరు లను సంఘమునుండి వెలివేసి ఖైదుచేయుదునని బెదిరించి, ‘మీ చెడ్డపనులు, తప్పుడు బోధల’ను విస్మరించి, పశ్చాత్తాపపడవలసినదిగా మూడు దినముల వ్యవధినిచ్చెను.

పర్యవసానముగ విక్లిఫ్ పోప్ ను, మతనాయకులను కాదని సరాసరి రాజునకు విన్నవించుకొనవలెనని తలంచెను. అయితే రాజైన లంకాస్టర్ ప్రభువు అతనిని వారించి, న్యాయస్థానమునకు, బిషప్ తీర్పునకు లోబడవలెనని హెచ్చరించెను. అందువలన విక్లిఫ్ మరియొకసారి సమస్యలతో చుట్టబడి రోమా మతాధికారుల ముందు నిలువవలసి వచ్చెను.

క్రీ.శ. 1382 పరి. డన్స్ట్రన్ దినమున (St. Dunstan’s Day) మధ్యాహ్నము రెండు గంటలకు కేంటర్ ్బరి ఆర్చిబిషప్, అతని సహాయకులు, కొందరు వేదాంత పండితులు, న్యాయాధిపతులు, ఆచార్యులు, ఇంక ఇతర మతనాయకులందరు విక్లిఫ్ గ్రంథములను, ఉపన్యాసములను తప్పుపట్టుటకు ఇంగ్లాండులోని బ్లేక్ ఫ్రయర్స్ (Blackfriars) పట్టణములో సమావేశమైరి. అదే సమయములో ఘోర భూకంపము సంభవించి ఇంగ్లాండునంతటిని నాశనము చేసెను. విక్లిష్ను విచారణ చేయుటకు వచ్చిన వారిలో అనేకులు దానిని అపశకునమనిరి. కొందరైతే వారు వచ్చిన కార్యమును వదలివేయుట మంచిదని సలహానిచ్చిరి. మరియొక సభ్యుడు.

దేవాలయపు తలుపు బ్రద్దలై

అయితే, ఆర్చిబిషప్ అందుకు నిరాకరించి, వచ్చిన కార్యమును కొనసాగించు టలో కృతార్థుడై, విక్లిఫ్ రచనలలో కొన్నింటిని వారికి చదివి వినిపించెను. విక్లిఫ్ సిద్ధాంతములు సుస్పష్టముగ మతద్రోహమని, సంఘముయొక్క సిద్ధాంతములకు, ఉపదేశములకు విరుద్ధమని, అతడు బోధించినవి తప్పుడు ఉపదేశములు మాత్రమేగాక వాటియందు దేవదూషణ కలదని ప్రకటించెను. ఇట్లు విక్లిఫ్, అతని ఉపదేశములమీద వాగ్వివాదము కొన్ని గంటలు కొనసాగెను.

బ్లేక్ఇయర్స్ సమావేశ ఫలితముగ జాన్ విక్లిఫ్, అతనిని బలపరచువారికి వ్యతిరేకముగ కేంటర్్బరి ఆర్చిబిషప్ లండన్ బిషప్నకు ఒక ఉత్తరువును పంపెను. ఆ ఉత్తరువు ప్రకారము :

“సంఘ చట్టముననుసరించి, బిషప్ అనుమతి లేకుండ, నిషేధింపబడిన ఏ మనుష్యుడైనను బహిరంగముగాకాని లేక రహస్యముగాకాని సువార్తను ప్రకటించరాదు. అయితే కొందరు వ్యక్తులు సంఘచట్టములను ధిక్కరించి నరకపుత్రులుగా ఉండి మహా పవిత్రత అను ముసుగులో తమకు తాముగా బోధించు అధికారమును పొంది సంఘములో దుష్ట సిద్ధాంతములను బోధించుచున్నారు.

ప్రజలందరిలో బహిరంగముగా ప్రకటించుటకు, దేవాలయములలోను, వీధులలోను, అనేక ఇతర స్థలములలోను బోధించు టకు వారు భయపడుటలేదు. దేవుని సంఘముచేత వ్యతిరేకించబడిన కొన్ని తప్పుడు సిద్ధాంతములను అనుసరించుచు, పరిశుద్ధ సంఘముయొక్క నిర్ణయములకు విరోధముగా అనేకమంది మంచి క్రైస్తవులను పాడుచేయు చున్నారు. ఏ విశ్వాసములేకుండ రక్షణ లేదో అట్టి కేథలిక్ విశ్వాసముపై దుఃఖపూరితమైన చెడువిమర్శలు చేయుచున్నారను విషయము మా వినికిడికి వచ్చియున్నది.

కనుక ఇప్పటినుండి ఏ మనుష్యుడైనను పైన చెప్పబడిన మత ద్రోహు లను ఆదరించుట, రక్షించుట, బలపరచుట, వారి బోధలవైపు దృష్టి మరల్చుట చేయకూడదు. వారిని బహిరంగముగాగాని, రహస్యముగాగాని సమర్థించకూడదు. వారిని వెంటనే విషమును క్రక్కు పామును వదిలించు కున్నట్లు, అధిక శాపము రాకముందే వారిని విసర్జించవలెను.”

అదే సమయములో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయమునకు క్రొత్త అధ్యక్షునిగా వచ్చిన మాస్టర్ రాబర్ట్ రిగ్గే (Master Robert Rygge) జాన్ విక్లిఫ్ను, అతడు బోధించుచున్న సువార్తను స్పష్టముగ అభిమానించిన వ్యక్తి. ఇతడు విక్లిఫ్కు వ్యతిరేకముగా చేయు ఉద్యమములను ఆపి, సువార్త వ్యాపించుటకు దోహదము చేసెను.

ప్రజలకు ప్రసంగ ములు చేయవలసి వచ్చినప్పుడు, విక్లిఫ్ను, అతని అనుచరులను బోధకులుగా పంపించెను. రాబర్ట్ రిగేవలే విక్లిఫ్ను అభిమానించి, ధైర్యముచెప్పిన మరి ఇద్దరు జాన్ హస్ట్మాన్ (John Huntman) వాల్టర్ డిష్ (Walter Dish) లు.

తరువాత అదే సంవత్సరము (1382) ఆరోహణ పండుగ (Feast of the Ascension), కార్పస్ క్రిస్టి (Feast of Corpus Christi) పండుగలలో ప్రజల నుద్దేశించి ప్రసంగించుటకు ఫిలిప్ రెప్పింగ్టన్ (Philip Reppyngdon), నికోలస్ హెర్ఫోర్డు (Nicholas Hereford) లు నియమింపబడిరి. అయితే వారు పరి. ఫ్రైడ్వైడ్ (St. Frideswide) దేవాలయములో ప్రజలముందు విక్లిఫ్కు అనుకూలముగ ప్రసంగించిరి.

విక్లిఫ్ నమ్మకస్తుడు, మంచివాడు, అమాయకుడని హెర్ఫోర్డు చెప్పెను. అతడు ఆ విధముగ మాట్లాడినందున అక్కడ హాజరైన మతాధిపతులు దిగ్రమచెంది, లేచి తీవ్రమైన మాటలతో అతనిని దూషించిరి. కార్మెలైట్ (Carmelite) సంఘాధ్యక్షుడైన పీటర్ స్టోక్స్ (Peter Stokes) హెర్ఫోర్డును హేళనచేసెను. ఆ తరువాత ఇతడు విక్లిఫ్ బహిరంగ బోధలను అవమానపరచుటకు నియమింపబడెను.

‘కార్పస్ క్రిస్టి’ పండుగ సమీపించుచున్నందున, హెర్ఫోర్డ్ అందించిన వర్తమానము వంటిదే రెప్పింగ్టన్ క్కూడ అందించునేమో అని మతాధిపతులు భయపడి, రెప్పింగ్టన్ ప్రసంగమును రద్దుచేయించమని కేంటర్ ఆర్చిబిషప్కు మనవిచేసిరి. కేంటర్ ్బరి ఆర్చిబిషప్ ఆక్స్ఫర్డ్ అధ్యక్షునికి రెప్పింగ్టన్ను ‘కార్పస్ క్రిస్టి’ పండుగకు బోధకునిగా చేసిన నియామకమును పునఃపరిశీలన చేయుమని లేఖ వ్రాసెను.

ఆ లేఖకు అధ్యక్షుడు మండిపడి, విశ్వవిద్యాలయ అధికారమును కించపరచు చున్నందుకు, ప్రశాంత వాతావరణమును భగ్నము చేయుచున్నందుకు ఆర్చిబిషప్ ను, పీటర్ స్ట్రోక్స్ను గద్దించెను. విశ్వవిద్యాలయముపై మీకు ఏ అధికారము లేదనియు, ఈ విషయములలో విశ్వవిద్యాలయము తన సొంత నిర్ణయములను చేయగలదని ప్రకటించి, మీకు ఏవిధమైన సహాయము చేయనని బాహాటముగ తెలియజేసెను.

పండుగదినమున రెప్పింగ్టన్ తన సందేశమిచ్చుచూ ‘నైతిక విషయములన్నిటిలో జాన్ విక్లిఫ్ నిజమైన కేథలిక్ వేదాంతి, పండితుడు కనుక నేనతనిని సమర్థించెదన’ని విక్లిఫ్ యొక్క పనిని, సేవను శ్లాఘించుచు తన ప్రసంగమును ముగించెను.

ప్రసంగము ముగిసిన వెంటనే రెప్పింగ్టన్ అనేకమంది స్నేహితులతో పరి. ఫ్రైడ్స్వైడ్ దేవాలయములోనికి వెళ్లెను. రెప్పింగ్డన్మీద ఏదైన ముట్టడి జరిగినచో ఎదుర్కొనుటకు తమ బట్టలలో ఆయుధములను దాచియుంచినారని అతని శత్రువులు అపోహపడిరి.

విక్లిఫ్ శత్రువైన పీటర్ స్టోక్స్ వారు తనను చంపుదురేమోనని భయపడి, దేవాలయము లోని దైవపీఠముండు స్థలములో దాగెను. రెప్పింగ్టన్, అతని పక్షమువారు వెళ్లిపోవువరకు అతడు బయటకి వచ్చుటకు సాహసింపలేదు. అధ్యక్షుని సాహసమునకు విశ్వవిద్యాలయ మంతయు ఆనందముతో నిండెను. రెప్పింగ్టన్ యొక్క చక్కని ప్రసంగము వారిని ప్రోత్సహించెను.

దేశ బహిష్కరణ అనంతరము జాన్ విక్లిఫ్ తాను ప్యారిష్ పాస్టరుగా నియమింప బడిన లుటెర్వర్త్ (Lutterworth) కు తిరిగివచ్చి, 56 సంవత్సరముల వయస్సులో అనగా క్రీ.శ. 1384 డిసెంబరు 31న నిద్రలో మరణించెను. ‘అతడు యువకునిగా ఉన్నప్పుడు ఏ విషయము అతనిని సంతోషపరచెనో, వయస్సు మళ్లిన తరువాతకూడ అదే విషయము అతనిని సంతోషపరచెన’ని అతనిగురించి చెప్పబడెను.

విక్లిఫ్ ముఖ్యశత్రువులందరు సంఘనాయకులే, అయితే అతడు సామాన్య ప్రజల, కొంతమంది సంస్థానాధిపతుల సహకారమును పొందెను. వారిలో జాన్ క్లెన్బన్ (John Clenbon), లెవిస్ క్లిఫ్ఫర్డ్ (Lewis Clifford), రిచర్డ్ స్టురి (Richard Stury), థామస్ లాటిమర్ (Thomas Latimer), విలియమ్ నెవిల్ (William Nevil) మరియు జాన్ మాంటేగ్ (John Montague) వంటి ప్రముఖులు ఉండిరి. అతని సిద్ధాంతములు, బోధల గౌరవార్ధము విక్లిఫ్ మరణానంతరము వారు తమ దేవాలయములనుండి విగ్రహములను, ప్రతిమలను తొలగించిరి.

విక్లిఫ్ మరణానంతరము అనేక సంవత్సరములవరకు అతనిమీద, అతని బోధలమీద వ్యతిరేకత కొనసాగెను. క్రీ.శ. 1415 మే 4న కాన్స్టన్స్ సభ సమావేశమై ఒక తీర్మానమును జారీచేసెను :

జాన్ విక్లిఫ్

విక్లిఫ్ మరణించిన ముప్పది ఒక్క సంవత్సరముల అనంతరము కాన్ స్టాన్స్ సభ అతని సమాధి స్థలమునుండి అతని అవశేషములను తీసి వాటిని కాల్చి, భస్మమును రైన్ నదిలో విసరెను. ఆ విధముగ చేయుటద్వారా అతని ప్రభావమును రూపు మాపగలిగినామని అతని హంతకులు తలంచిరి. కాని ఆ విధముగ జరుగలేదు.

పరిసయ్యులు క్రీస్తును చంపి, ఆయన శరీరమును చీకటి సమాధిలో పెట్టి, ఆయన ఎన్నటికి తిరిగి రాకుండ వెళ్లినాడని తలంచినట్లే జాన్ విక్లిఫ్ను వ్యతిరేకించిన సభ కూడ – మతద్రోహిని పూర్తిగ నాశనముచేసి, అతని భస్మమును నదిలో నిమజ్జనము చేయుటద్వారా అతని అనుచరులలో అతని జ్ఞాపకము నశించిపోయినదని తలంచి నది. పరిసయ్యులు ఆశ్చర్యపడినరీతిగ యేసుక్రీస్తును, ఆయన సత్యమును ఏదియు అడ్డుకొనలేకపోయెను.

అలాగే విక్లిఫ్ శరీరమును దహనముచేసి, చితాభస్మమును నదిలో నిమజ్జనము చేసినను, విక్లిఫ్ సిద్ధాంతములలోని సత్యమును వారు నాశనము చేయలేకపోయిరి. అతడు ప్రారంభించిన పనిని అతని అనుచరులు కొనసాగించుచున్నారు.

మతాధికారుల హింసలు, విచారణ (క్రీ.శ. 1208–1834)

మతాధికారుల హింసలు, విచారణ (క్రీ.శ. 1208–1834)

సుమారు 12వ శతాబ్దమువరకు క్రీస్తుయొక్క నిజ విశ్వాసులకు కలిగిన హింసలు, శ్రమలు క్రైస్తవేతరులైన అన్యప్రపంచమునుండి వచ్చినవి. కాని ఇప్పుడు రోమా సంఘము లేఖనములలోని సత్యమును, ప్రేమతో కూడిన ఆజ్ఞలను త్రోసివేసి వారి తప్పుడు సిద్ధాంతములు, అన్య మతాచారములను వ్యతిరేకించినందుకు నిజవిశ్వాసులపై కత్తి కట్టినది. ఇది కాన్స్టాంటైన్ కాలమునుండి విస్తరించెను.

ఏ సత్య సిద్ధాంతములకొరకు అనేకమంది క్రైస్తవులు హతసాక్షులైనారో అట్టి విధానములనుండి రోమా సంఘము వేరైపోయెను. కాగా భక్తి, పవిత్రత, మానవత్వము, ప్రేమ, దయ మొదలగువాటిని విసర్జించి, అన్యుల మూఢనమ్మకములను, విగ్రహారాధనను ఆచరించుట మొదలు పెట్టిరి. వారు ఆర్థికముగా, సాంఘికముగా లాభసాటిగావుండు సిద్ధాంతములను అమలుచేసిరి. సంఘసంబంధమైన విషయములన్నింటిలో వారికి అధిక ప్రాధాన్యత లభించినది.

వారిని, వారి సిద్ధాంతములను ఎవరు వ్యతిరేకించెదరో, వారిని నాస్తికులని ముద్రవేసి, అవసరమైన మేరకు బలప్రయోగముతో వారు తమతో ఏకీభవించునట్లు చేసిరి. వారు మనస్సు మార్చుకొనక, పోప్ (Pope) యెడల, అతని అనుచరులయెడల తమ విధేయతను, విశ్వాసమును ప్రకటించకపోతే వారిని ఉరితీసేవారు. వారు చేసిన ఘోరకృత్యములకు పాత నిబంధనలోను, అలాగే అను వాక్యభాగములను విశ్లేషించి విశ్వాసులకు విధించిన శిక్షలను తమకు తాము సమర్థించుకొనిరి.

లూకా 14-23

అనేక శతాబ్దములు రోమా సంఘము ఆకలిగొన్న మృగమువలె రెచ్చిపోయి, వేలకొలది క్రీస్తుయొక్క నిజవిశ్వాసులను చంపుచు, ఇంక అనేక వేలమందిని హింసిం చుచు, ఏడ్పించినది. అందుకే ఆ కాలమును సంఘముయొక్క ‘చీకటి యుగము’గా అభివర్ణింతురు. వారి రౌద్రమునకు మొదట ఫ్రాన్స్లోని వార్డెనులు బలిపశువులైరి.

క్రీ.శ. 1000 లో చీకటి, మూఢనమ్మకములచేత సత్యవాక్యముయొక్క వెలుగు ఆర్పివేయబడినప్పుడు, సంఘమునకు సంభవించిన గొప్ప విపత్తును చూచి కొందరు పవిత్రతతోకూడిన సత్యసువార్త వెలుగులోనికి ప్రజలను నడిపించవలెనని నిశ్చయించు కొనిరి. ప్రజలను మభ్యపెట్టి నిజవెలుగును దాచివేయు ప్రయత్నములనన్నిటిని పోగొట్ట వలెనని సంకల్పించుకొనిరి.

మొదట బెరెన్గా గారియస్ (Berengarius) అను ధైర్యవంతుడు లేఖనములలోని పరిశుద్ధ సువార్తను ఉన్నది ఉన్నట్లుగ బోధించుట ప్రారంభించెను. చాలసంవత్సరములు విశ్వాసులు ఆ సత్యసువార్తను చేబట్టి, ఆ వెలుగును అనేక వేల మందికి అందించిరి. ఇట్లు క్రీ.శ. 1140 వరకు అనేకమంది విశ్వాసులు మార్పు చెందిరి.

ఈ విషయములో పోప్ కలతచెంది మార్పుచెందిన విశ్వాసులను తమ రాజ్యములనుండి తరిమివేయుమని యువరాజులకు లేఖలు వ్రాసి, వారికి వ్యతిరేకముగ పత్రికలు వ్రాయుమని చదువరులైన తన అధికారులను ఆదేశించెను.

వార్డెనులకు హింసలు

పీటర్ వాల్డో (Peter Waldo, క్రీ.శ. 1173) అధిక ధనవంతుడైన వర్తకుడు, తనకున్న సంపదనంతటిని పేదలకు దానముచేసి సంచార సువార్తికునిగా పేరుగాంచెను. మతాధికారుల ధనవ్యామోహమును, అణచివేతను తీవ్రముగ ఖండించెను. కొద్దికాలము లోనే ఫ్రాన్స్లోని వార్డెనులైన అనేకమంది మార్పుచెందిన విశ్వాసులు అతనితో కలిసిరి.

మొదట వాల్డో మతాధికారులు గుర్తింపుకొరకు ప్రయత్నించి, రోమా సంఘముపై తన ప్రభావమును చూపించవచ్చునని తలంచెను కాని దానికి బదులుగా వారు అతనిని నాస్తికుడని నిందించి క్రీ.శ. 1184 లో వెలివేసిరి.

అంతట వాల్డో, అతని అనుచరులు కలసి వేరొక సంఘమును అభివృద్ధిచేసి, దానికి స్వంత బోధకులను ఏర్పాటుచేసుకొనిరి. వారు సంఘకట్టుబాట్లను, పవిత్రతనుగూర్చి బోధించి, రోమా సంఘనాయకులను, వారి వ్యసనములను దుయ్యబట్టి, ఎట్టి పరిస్థితుల లోను మానవ జీవితమును అంతముచేయు అధికారము వారికి లేదని చెప్పిరి. కనుక క్రీ.శ. 1208 లో వాలైనులు మరియు ఇతర మార్పుచెందిన విశ్వాసులపై, ముఖ్యముగ ఆల్బిజెనుల (Albigens) పై మతయుద్ధము చేయుటకు పోప్ అనుమతించెను.

క్రీ.శ. 1211 లో ఎనుబదిమంది వాల్డో అనుచరులను స్ట్రాస్బర్గ్ (Strasbourg), పట్టణములో బంధించి, పోప్ నియమించిన మత విచారణకర్తలతో తీర్పు చెప్పించి, వారిని స్తంభమునకు కట్టి సజీవదహనము చేసిరి. ఇది జరిగిన కొద్దికాలమునకు అనేకమంది వార్డెనులు ఉత్తర ఇటలీలోని ఆల్పైన్ (Alpine) లోయలో నివసించుటకు వలస వెళ్లిపోయిరి. క్రీస్తు సత్య సువార్తను ప్రకటిస్తూనే క్రీ.శ. 1218 లో వాల్డో మరణించెను.

ఆల్బిజెనుల హింసలు

ఆల్బిజెను (Albigens) లందరు మార్పుచెందిన మతస్థులు (Reformed religion people). వారు 12,13 వ శతాబ్దములలో దక్షిణ ఫ్రాన్సులో నివసించిరి. వారు ఫ్రెంచి పట్టణమైన ఆల్బి (Albi) లో కేంద్రీకరింపబడినందున వారికి ఆ పేరు వచ్చెను. వారు చాల కఠినమైన నైతిక విలువలు గలవారు. వారిలో కౌంట్ టౌలౌస్ (Count of Toulouse), కౌంట్ ఫోయిక్స్ (Count of Foix), కౌంట్ బెజైర్స్ (Count of Beziers) వంటి అనేకమంది ప్రముఖులేకాక ఇంకా ఎందరో చదువరులు, ఉన్నతస్థాయి కలవారున్నారు. వారిని అణచుటకు రోము మొదట సిస్టెర్సియన్ (Cistercian) ను మరియు డొమినికన్ మఠ సన్యాసులను పంపి, వారిని తిరిగి మతాధికారుల సిద్ధాంతములలోనికి మార్చుటకు ప్రయత్నించెను. అయితే ఆల్బిజెనులు సంస్కరింపబడిన తమ సిద్ధాంతములకు కట్టుబడి ఉండుటవలన వారి ప్రయత్నములు విఫలమైనవి.

రెండవ (1139), మూడవ (1179), నాల్గవ (1215) లాటెరన్ సభలు (Lateran Councils) జరిపి, ప్రతి సభలో భిన్నమతావలంభికులకు ఖైదు, వారి ఆస్తిని ప్రభుత్వము స్వాధీనపరచుకొనుట, మొదలగు శిక్షలున్నవని బెదరించిరి. అయితే ఈ శిక్షలేవియు ఆల్బిజెనులను రోమా సంఘనాయకుల అధీనములోనికి తీసికొని రాజాలకపోయెను. అందుచే ఆల్బిజెనులకు వ్యతిరేకముగ హింసాయుద్ధము ప్రారంభించుట న్యాయమని మూడవ పోప్ ఇన్నోసెంట్ (Pope Innocent III) తన ప్రతినిధులను ఐరోపా అంతటికి పంపించి, సైన్యములను సమకూర్చి, ఆల్బిజెనులపై యుద్ధము చేయుటకు పంపెను. పోప్ ఈ యుద్ధమును ‘పవిత్ర యుద్ధము’గా ప్రకటించి ఈ యుద్ధములో పాల్గొనినవారందరికి “పరలోకము”ను వాగ్దానము చేసెను.

క్రీ.శ. 1209 నుండి క్రీ.శ. 1229 వరకు జరిగిన మిక్కిలి అపవిత్రమైన ఈ యుద్ధములో ఆల్బిజెనుడైన కౌంట్ రేమాండ్, గొప్ప ధైర్యముతో టౌలౌస్ పట్టణమును, మతోన్మాదియైన రోమన్ కథోలిక్ సంస్థానాధిపతిని, మరికొన్ని ఇతర ప్రాంతములను జయించెను. పోప్ సైన్యము కౌంట్ రేమాండ్ను బహిరంగముగా ఓడించలేకపోవుటచే, ఫ్రాన్స్ రాజు, రాణి మరియు ముగ్గురు ఆర్చిబిషప్లు గొప్ప సైన్యమును సమకూర్చి, శాంతి ఒప్పందమునకు రావలసినదిగా కౌంట్ రేమాండ్ను ఆహ్వానించిరి. అయితే అతడు వచ్చిన తరువాత మోసముతో అతనిని నిర్బంధించి, చెరసాలలో వేసిరి. అతనిని శత్రువుల ముందు అవమానపరచుటకు కిరీటము లేని తల, పాదరక్షలు లేని కాళ్లతో బలవంతముగా నడిపించి, వివిధ రకములైన చిత్రహింసలద్వారా హింసించి పోప్ల సిద్ధాంతములను వ్యతిరేకించవద్దని హెచ్చరించిరి.

కౌంట్ రేమాండ్ను బంధించిన తరువాత, అనభిషిక్తులైనవారు పరిశుద్ధ లేఖనము లను చదువరాదని పోప్ ఆజ్ఞాపించెను. పదమూడవ శతాబ్దము మిగతా కాలములో ఐరోపా అంతట మతన్యాయస్థానము (Inquisition) ద్వారా ఆల్బిజెనులను, వాల్డెను లను, ఇతర మార్పుచెందిన క్రైస్తవులను అణచుటయే వారి ప్రధాన గురియైయున్నది.

మత న్యాయస్థానము

మతద్రోహులను శిక్షించుటకు ఏర్పాటుచేయబడిన న్యాయస్థానమును ‘ఇన్క్వ జిషన్’ అందురు. ఆనాటి క్రైస్తవ సంఘములోని దోషములను, మూఢభక్తిని వ్యతిరే కించినవారిని శిక్షించుటకీన్యాయస్థానమేర్పడెను. బిషప్లచేత, సంఘసంబంధమైన సభ్యులతో ఈ న్యాయస్థానము పరిపాలింపబడెను.

ప్రతి మతన్యాయస్థానములో సుమారు ఇరువదిమంది అధికారులు నియమించ బడిరి. ప్రధాన విచారణకర్త, ముగ్గురు ముఖ్య న్యాయాధికారులు, కోశాధికారి, పురజనులకు సంబంధించిన అధికారి, ఆర్థిక సంబంధమైన లెక్కలుచూచు అధికారి, మతాధికారుల హింసలు, విచారణ వశపరచుకొనిన ఆస్తి విషయములు చూచు అధికారి, ఆస్తి విలువను తనఖీచేయు అధికారులు, “జైలు అధికారి, ఉరితీయువారు, కాల్చువారు, వైద్యులు, జరిగిన విషయములను గ్రంథస్థము చేయు లేఖికులు కలరు.

మతద్రోహులని అనుమానించబడినవారిని నేరారోపణలతో సంబంధము లేకుండ వారిని న్యాయమూర్తులు చాలా కఠినముగ శిక్షించెను. వారి వయస్సు, ఆడ, మగ, జాతి తేడా లేకుండ, ఉన్నత కుటుంబీకులైనను ఏవిధమైన దయాదాక్షిణ్యములు చూపలేదు. వారి ఉన్నత ఉద్యోగము, సాంఘిక స్థితి, శారీరక లేక మానసిక స్థితి గతులనుకూడ లెక్కచేయలేదు. మత సిద్ధాంతములను, వారి అధికారమును ధిక్కరించిన వారియెడల ముఖ్యముగ ఒకప్పుడు రోమన్ కేథలికైయుండి, ఇప్పుడు ప్రొటెస్టంట్ లైన వారిని అతి దారుణముగ హింసించిరి.

ఇన్విజిషన్ ముందు వాదనద్వారా రక్షించుకొను పద్ధతి లేదు. నేరము మోపబడిన చాలును. ధనము ఎంత ఎక్కువ ఉంటే అంత అపాయము. కొన్నిసార్లు మతద్రోహి అనే కాదుగాని అధిక ధనవంతులనికూడ కొందరిని ఉరితీసిరి. అనేకసార్లు వారి భూములు, గృహములు, అధికారములు లాగివేయబడెను.

నిజ క్రైస్తవులను మతద్రోహులుగా చిత్రించి, వారిని వివిధరీతులుగా వేధించి, వారు తాము నేరము చేసినట్లు ఒప్పుకొన్ను పరిస్థితులను కల్పించి, హింసించుటకు వారికి తెలిసిన ప్రతి పద్ధతిని అవలంభించిరి. కొన్నిసార్లు హింసించుటకు క్రొత్త పద్ధతులను ఊహించి అమలు చేసిరి. కొయ్యస్తంభమునకు కట్టి కాళ్లు, చేతులు ఎముకలు స్థానము తప్పువరకు సాగదీయుట, నిప్పులతో కాల్చుట, కాలుచున్న లోహములపై పరుండబెట్టుట, బొటనవ్రేళ్లను నరుకుట, కాళ్లు చేతులను చితుక గొట్టుట, పళ్లు ఊడబెరుకుట, ముళ్లగంటెతో చర్మమును లాగుట, మాంసపు కండలలో ఇనుప కొక్కెములు గ్రుచ్చి మాంసము చిన్న చిన్న ముక్కలుగా వచ్చునట్లు లాగుట, శరీరములో సూదులు గ్రుచ్చుట, కాళ్లు చేతుల వ్రేళ్లగోరులక్రింద సూదులు గ్రుచ్చుట, కొరడాలతో కొట్టుట, దుడ్డుకఱ్ఱలతో కొట్టుట, అవయవములను మెలివేయుట, కీళ్లను విడదీయుట – ఈ రీతిగ నిజక్రైస్తవులను మతిభ్రమించినవారిలా, న్యాయనిర్ణేతలు పేర్కొనలేనన్ని ఘోరపద్ధతులద్వారా చిత్ర హింసలకు గురిచేసిరి.

ఇనిక్విజిషన్ తీర్పులను ముగించిన తరువాత ఉరితీయు స్థలములో పవిత్రమైన కార్యక్రమము జరుగును. అది ‘సెర్మొ జెనెరాలిస్’ (Sermo generalis / సాధారణ ప్రసంగము) అని తెలియబడినది. స్పెయిన్లో దానిని ‘ఆటో-డి-ఫె’ (Auto – De-Fe / విశ్వాస కార్యము) అందురు. దానికి ప్రాంతీయ అధికారులు, మతాధికారులు, ఉరితీయుటను కోరువారందరు, మతద్రోహులకు శత్రువులైనా, మిత్రులైనా అందరు హాజరవుదురు. నేరస్థులుగా తీర్చబడిన మతద్రోహులు వారి మతద్రోహమును ఒప్పుకొని, తమ విశ్వాసమును పరిత్యజించినచో వారి శిక్షలు రద్దుచేయుదురు. అనగా తీవ్రముగా శిక్షించుటకు బదులు, ఖైదులో ఉంచుట, సంఘ అవసరములకు వారి ఆస్తిని, వస్తువులను వశపరచుకొనుట చేసెదరు. ఒకవేళ నేరస్థులు తమ విశ్వాసములో పట్టుదలగా ఉన్నచో, వారిని శపించి, అందరు చూచుచుండగ కాల్చిచంపుటకు హంతకులకు అప్పగించెదరు. ఎవరును మతద్రోహమునకు పాల్పడకుండ వారిని చాలా క్రూరముగా చంపెడివారు. అయితే హతసాక్షుల ధైర్యమును, వారి హింసలలో, అగ్నిజ్వాలలో దేవుడు వారికి అనుగ్రహించిన కృపను చూచినప్పుడు క్రీస్తునందు నిజవిశ్వాసమున్నవారు మరింత బలపడిరి.

ప్రపంచములోనున్న మతన్యాయస్థానములన్నిటిలో స్పెయిన్లో ని మతన్యాయ స్థానము చాల పట్టుదలగాను, తీవ్రముగాను పనిచేసెను. అపవిత్రులుగా ఉండి, పవిత్రులమని చెప్పుకొనువారికి హద్దులేని అధికారము లిచ్చినప్పుడు వారి ఆగడాలకు అంతుండదు.

స్పెయిన్

మతన్యాయస్థానములవలన ప్రపంచములో ఎందరు చంపబడినది, హింసింపబడి నది తెలుసుకొనుటకు వ్రాతపూర్వక ఆధారములు లేవు. అయితే స్పెయిన్ మతన్యాయ స్థానమునకు సంబంధించి వ్రాయబడిన కొన్ని సంఘటనలు ఇచ్చట పరిశీలించుదము.

స్పెయిన్లో పదిహేడు న్యాయస్థానములు కలవు. అందు ఒక్కొక్కటి ఏడాదికి సుమారు పదిమంది మతద్రోహులను కాల్చిచంపెను. అనేక వేలమంది ప్రజలను చిత్రహింసలకు గురిచేసి, అంగవైకల్యము గావించెను. వారెన్నటికి ఆ గాయముల నుండి కోలుకొనలేకపోయెను. కేవలము వారి తప్పుడు మతసిద్ధాంతములను అంగీక రించకపోవుటవలన స్పెయిన్ మతన్యాయస్థానముద్వారా సుమారు 32,000 మంది ప్రజలు నమ్మలేని విధముగ హింసింపబడి, సజీవదహనము గావించబడిరి.

వీరుకాక, అనేక వేలమంది జైలునకు పంపబడి, వారి ఆస్తి ఆక్రమించబడి, రక్తము కారునంతగా హింసింపబడి, జీవితములో వారికున్న దంతయు పోగొట్టుకొనిరి. వీరి సంఖ్య సుమారు 3,39,000. శ్రమలవలన గుహలలోను, చీకటి, పురుగులు, దుర్గంధము, రోగగ్రస్థమైన బొరియలలో ఉండి, విరిగిన హృదయములతో, బ్రతుకు దెరువుకొరకు వారిమీద ఆధారపడిన వేలకొలది మనుష్యులను వదలి, క్రీస్తుకొరకు మరణించినవారెందరో కలరు. వారినిగూర్చి గ్రంథస్థము చేయబడిన ఆధారములు భూమిపై లేవు కాని వ్రాసిపెట్టిన గ్రంథములు తీర్పుదినముకొరకు పరలోకములో దాచిపెట్టబడినవి.

క్రీ.శ. 1483 లో స్పెయిన్లోని రోమన్ కేథలిక్ పరిపాలకులు, ఆరగాను చెందిన రెండవ ఫెర్డినాండ్ (Ferdinand II), కేసైల్ నివాసి మొదటి ఇసబెల్లా (Isabella I) ల ప్రేరణతో పోప్ నాల్గవ సిక్స్త్స్ (Pope Sixtus IV) స్పెయిన్కు ఒక స్వతంత్ర మత న్యాయస్థానమును ఏర్పాటుచేసెను. క్రీ.శ. 1487 లో పోప్ ఎనిమిదవ ఇన్నోసెంట్ (Pope Innocent VIII) డొమినికన్ సన్యాసియైన థామస్ డి టార్క్ మడా (Tomas de Torquemada) ను ప్రధాన న్యాయమూర్తిగా నియ మించెను. అతని నాయకత్వములో వేలకొలది క్రైస్తవులు, యూదులు, మహమ్మ దీయులు, ఇంక అనేకులు హింసింపబడి మరణించిరి.

కఠినత్వము, మతమౌఢ్యము, అసహనము, ద్వేషములకు మారుపేరైన టారడా స్పెయిన్ ప్రజలందరని హడలగొట్టెను. క్రీ.శ. 1487 నుండి క్రీ.శ. 1498 మధ్యగల అతని భయంకర పరిపాలనా కాలములో అతని వ్యక్తిగత ఆజ్ఞమీద సుమారు 2000 మందిని కొయ్యస్తంభములకు కట్టి కాల్చివేసిరి. ఏడాదికి అతనివలన 181 మంది మరణించగ, స్పెయిన్ న్యాయస్థానమువలన ఏడాదికి 10 మందిమాత్రమే కాల్చి చంపబడిరి.

రోమన్ కేథలిక్ పాలకుల సహకారముతో మొదటి స్పానిష్ విచారణకర్తలు ప్రజలను కాల్చిచంపుటకు భయంకరమైన పద్ధతులను అవలంభించిరి. క్రీ.శ. 1492లో మతన్యాయస్థానము యూదులను, మూరులను (Moors) స్పెయిన్ నుండి వెళ్లగొట్టెను. లేదా రోమన్ కేథలిక్ మతములోకి మారవలసినదిగా వారిని బలవంతము చేసెను.

టార్క్మడా

రాజకీయ కారణములననుసరించి విచారణకర్తలు వలసల మధ్య కఠిన చర్యలు చేపట్టి అమెరికాలోని స్పెయిన్ వలసలలోనున్న భారతీయులను తమ మతములోకి మార్చిరి. క్రీ.శ. 1821 పోర్చుగల్లోనూ, క్రీ.శ. 1834 స్పెయిన్ లోనూ అనగా 19వ శతాబ్దము తొలిభాగము వరకు మతన్యాయస్థానముయొక్క క్రూరత్వము తగ్గిననూ, ఏదో ఒక రకముగా హింసలు కొనసాగించెను. తరువాత దాని పేరు మారినది కాని దారుణములు తగ్గలేదు.

క్రీ.శ. 1908 లో పవిత్ర కార్యాలయ సంఘము (Congregation of the Holy Office) అను పేరుతో మత న్యాయస్థానము పునర్నిర్మాణము గావింపబడెను. క్రీ.శ. 1965 లో పోప్ ఆరవ పాల్చే విశ్వాస సిద్ధాంత సమాజము (Congregation for the Doctrine of the Faith) అను పునర్నిర్వచనము రెండవ వాటికన్ కౌన్సిల్లో చెప్పబడెను. మతద్రోహమును “నిందించుట”కంటే సరియైన సిద్ధాంతములను అను కూలమైన పద్దతిలో ప్రవేశపెట్టి అమలుపరచుటయే నేటి కర్తవ్యమని నిర్ణయించిరి.

వేయి సంవత్సరముల సాధారణ శాంతి కాలములో జరిగిన హింసలు (క్రీ.శ. 320–1079)

వేయి సంవత్సరముల సాధారణ శాంతి కాలములో జరిగిన హింసలు (క్రీ.శ. 320–1079)

ఈ వేయి సంవత్సరములలో హింసలు చెదురుమదురుగా, ప్రపంచమంతట వ్యాపించినందువలన క్రీస్తుకొరకు హతసాక్షులైన కొందరినిగూర్చి మాత్రమే కచ్చితమైన ఆధారములు కలవు. హతసాక్షులైన ప్రతివారు ఒకేరకమైన బాధ, హింసలను అనుభవించి, చివరకు తమ దేవునియందుగల ప్రేమ, విశ్వాసములకై మరణించిరి. వారు ఎక్కడ బాధననుభవించినను దేవుడు వారితో నుండెను.

ఆయన వారికి తన బలమును, శాశ్వత మహిమను పొందువరకు హింసలను భరించు సహనమును అనుగ్రహించెను. ఆయనవలె అట్టి శ్రమను సహించి, ఆయన నామము నిమిత్తము చనిపోవువారికొరకు తన చేతులు చాపి కనిపెట్టుచుండెను. కొందరినిగూర్చిన వివర ములు, వారు ఎక్కడ, ఏ విధముగా క్రీస్తుకొరకు చనిపోయినది పరిశీలించుదము.

పర్షియా : క్రీ.శ. 320

పర్షియా ప్రజలలో అనేకులు సూర్యుని ఆరాధించువారు. సువార్త వారి దేశములో వ్యాపించుట ప్రారంభించినప్పుడు, అన్యమతాచార్యులు ఆ దేశ ప్రజలమీద తమ ప్రభావము పోవునను భయముతో కలవరపడిరి. అందుచే వారు ‘క్రైస్తవులు దేశమునకు విరోధులని, పర్షియనులకు శత్రువులైన రోమీయులకు స్నేహితులని, వారితో జరిగిన ప్రతి యుద్దమునందు పర్షియనులు ఓడిపోవుచున్నార’ని వారి రాజైన సపోర్స్ (Sapores) కు ఫిర్యాదు చేసిరి.

అందుచే సపోర్స్ తన రాజ్యములో క్రైస్తవులెక్కడున్నను వారిని చిత్రహింస చేయుడని ఆజ్ఞాపించెను. ఆ విధముగ, సంఘములో, పర్షియా ప్రభుత్వములో పనిచేయుచున్న దైవభక్తిగల అనేకమంది ప్రజలు బంధింపబడి హతసాక్షులైరి.

పర్షియాలో జరుగుచున్న హత్యల విషయమై కాన్స్టాంటైన్ చక్రవర్తి దృష్టికి రాగా, క్రైస్తవులను హింసించినవారికి సంభవించిన విషాదములు, వారిని బహుగా ఆద రించినవారికి నిరంతరము కలుగు గొప్ప విజయములనుగూర్చి అతడు సపోర్స్ నకు ఒక లేఖ వ్రాసెను. విరోధులైన రోమా చక్రవర్తులపై తన సొంత విజయములను ఉదహరించుచూ ఈలాగు వ్రాసెను :

“క్రీస్తునందలి విశ్వాసమువలనమాత్రమే నేను వారిని ఓడించితిని, ఆ విశ్వాసమునుబట్టియే ప్రతి యుద్దములో దేవుడు నాకు సహాయముచేసి, విజయము కలుగజేసెను. పశ్చిమ మహాసముద్రమునుండి తూర్పున చాల దూరమువరకు నా సామ్రాజ్యమును ఆయనే విస్తరింపజేసెను. ఇవన్నీ పొందుటకు నేను పూర్వికుల దేవతలెవరికి బలి అర్పించలేదు, మంత్ర శక్తులను ఉపయోగించను లేదు. నేను సర్వశక్తిగల దేవునిని మాత్రమే ప్రార్థించి, నాకు పతాకముగా నీయబడిన క్రీస్తు సిలువను అనుసరించి తిని. దీనినంతటిని ఆలోచింపుము, నీవుకూడ మహిమలో ఆశీర్వదించ బడినప్పుడు నేనే సంతోషించెదను, ఎందుకనగా నీవు క్రైస్తవులను చక్కగ ఆదరించితివి. నీవు నేను, నీవు వారు నిరంతర శాంతిని అనుభవించ వలెను.”

కాన్స్టాంటైన్ యొక్క విజ్ఞప్తి ఫలితముగ పర్షియాలో హింసలు కొంతకాలము నిలిచినవి; కాని కొన్ని సంవత్సరముల తరువాత క్రైస్తవులకు వ్యతిరేక మనస్తత్వముగల వ్యక్తి పర్షియాకు రాజైనప్పుడు హింసలు మరల ప్రారంభమైనవి.

ఐగుప్తు : క్రీ.శ. 325–340

సుమారు క్రీ.శ. 318 లో ఐగుప్తులోని అలెగ్జాండ్రియాలో అరియస్ (Arius) అను క్రైస్తవ బోధకుడు ‘యేసుక్రీస్తు మధ్యలో సృజింపబడిన వ్యక్తియేకాని నిత్యత్వము నుండి ఉన్నవాడు కాదని, కనుక దేవునితో యేసుక్రీస్తు సమానుడు కాదు’ అని ప్రకటించు ఒక సిద్ధాంతమును ప్రచురించెను. ఆ సిద్ధాంతమును పరిష్కరించుటకు కాన్ స్టాంటైన్ నైసియా (Nicaea) అను పట్టణములో సర్వమతశాఖల సమావేశమును ఏర్పాటు చేసెను. ఆ సమావేశము అరియసు, ‘అరియనిజమ్’ (Arianism) అని పిలువబడు అతని సిద్ధాంతములను తీవ్రముగ విమర్శించి, తండ్రియైన దేవుడు, కుమారుడు ఒక్కటే అనియు, తండ్రియు, కుమారుడును ‘ఒకే మూలమునకు చెందినవారని’ ప్రకటించిరి.

సమావేశము

అతని ననుసరించివచ్చిన వాలెన్స్ (Valens) కూడ ఆ సిద్ధాంతమును బలపరచెను. అతడు తన సోదరుడైన మొదటి వాలెన్టిటినియన్ (Valentinian I) తో పాటు పరిపాలనలో భాగస్వామ్యమును తీసికొని సంయుక్తముగా పరిపాలించెను. రెండవ కాన్స్టాంటియస్ సింహాసనమధిష్టించగానే అరియన్స్ విజృం భించి నిష్ఠగల క్రైస్తవులను, ముఖ్యముగ క్రీస్తు దైవత్వములో నమ్మకముగల క్రైస్తవులను హింసించుట మొదలుపెట్టిరి.

అలెగ్జాండ్రియాలో అతనాసియస్ (Athanasius) అను గ్రీకు ప్రధాన గురువు కలడు. అతడు అరియనిజమ్ను పాటించువారినుండి క్రైస్తవ విశ్వాసులను కాపాడువాడు. అతనితోపాటు అనేకమంది బిషప్లుకూడ అలెగ్జాండ్రియా నుండి బహిష్కరింపబడెను. వారి ఉద్యోగములు అరియన్స్కు ఇవ్వబడెను. ఐగుప్తులోని రోమా సైన్యాధిపతియైన అర్తెమియస్ (Artemius) క్రైస్తవ్యమును స్వీకరించినందున అతని ఉద్యోగము, ఆస్తి, చివరకు అతని తలకూడ తీయబడెను.

రోము : క్రీ.శ. 361

క్రీ.శ. 361 లో రెండవ కాన్స్టాంటియస్ చనిపోగా, అతని తరువాత వచ్చిన జూలియన్ (Julian) రోమా చక్రవర్తిగా రెండు సంవత్సరములు పరిపాలించెను. జూలియన్ క్రైస్తవ విశ్వాసములో ఎదిగినప్పటికినీ, చక్రవర్తియైన వెంటనే క్రైస్తవ్యమును విడనాడి, తాను అన్యుడనని, రోమీయుల పురాతన అన్యమతమును పునరుద్ధరించెదనని ప్రకటించెను. క్రైస్తవులకు విరోధముగ బహిరంగ చట్టములు ప్రకటింపలేదు కాని, విగ్రహారాధనను తిరిగి ప్రవేశపెట్టి, బహిష్కరింపబడిన అన్యులను తిరిగి రప్పించెను.

ప్రతి వ్యక్తి తన మతమును యథేచ్ఛగా ఆచరించుటకు అనుమతి ఇచ్చినను, క్రైస్తవులను ప్రభుత్వ, సైనిక ఉద్యోగములనుండి తొలగించి, కాన్స్టాంటైన్ క్రైస్తవ బిషప్లకిచ్చిన అన్ని హక్కులను రద్దుచేసెను.

ఇటలీలోని అరెజ్జా (Arezzo) బిషప్ డొనటస్ (Donatus) ను, సన్యాసి హిలారి నస్ (Hilarinus) ను, మరియు రోమా న్యాయాధిపతి గార్డియన్ (Gordian) లను హింసించి, మరణదండన విధించెను.

అంకారా (టర్కీ) : క్రీ.శ 362

విగ్రహారాధనను తీవ్రముగ వ్యతిరేకించినందుకు తూర్పు అంకేరా లేక అంకారా (Ancyra or Ankara) పట్టణ బిషప్ బాసిల్ (Basil) ను కారాగారములో బంధిం చిరి. అతడు కారాగారములోనుండగ జూలియన్ చక్రవర్తి అంకారా వచ్చి, తానే స్వయముగ విచారించు నిమిత్తము బాసిల్ను తన యెదుటకు రప్పించి, విగ్రహారాధనకు వ్యతిరేకమైన చర్యలనన్నింటిని మానుకొనుమని హెచ్చరించెను.

కాని బాసిల్ అంగీక రించలేదు. పైగా నీవు శాశ్వతముగా బాధననుభవించుదువని చక్రవర్తి మరణమును గూర్చి బాసిల్ ప్రవచించెను. అది వినిన జూలియన్ మండిపడి బాసిల్ శరీరములో ఏడు వేర్వేరు ప్రదేశములలో ప్రతి దినము చర్మము మాంసమునుండి వేరగునంతవరకు ఒలిచి వేయుమని ఆజ్ఞాపించెను. అయితే ఆ పరిస్థితి సంభవింపకముందే తీవ్రమైన బాధతో బాసిల్ చనిపోయెను. ఇది క్రీ.శ. 362 జూన్ 28న జరిగినది.

పాలస్తీనా : క్రీ.శ. 363

పాలస్తీనాలో హతసాక్షులైనవారియొక్క వ్యక్తిగత సమాచార గ్రంథములేమియు లేవు. సామాన్యరీతిలో వారందరు తమ జీవితములను క్రీస్తునకు అర్పించిరి. కొందరు సజీవ దహనము గావింపబడిరి, కొందరు తమ కాళ్లు బంధింపబడి దిగంబరులుగా వీధుల వెంబడి ఈడ్చుకొనిపోవుటవలన రక్తము స్రవించి, బాధతో చనిపోయిరి. మిగిలినవారు కాల్చి చంపబడిరి లేక రాళ్ల దెబ్బలచే చంపబడిరి, మరి అనేకులను కఱ్ఱలతో తలలమీద మోదినప్పుడు మెదడు బయటికివచ్చి చనిపోయిరి.

అలెగ్జాండ్రియా : క్రీ.శ. 363

అలెగ్జాండ్రియాలో హతసాక్షులైన క్రైస్తవులను లెక్కింపనలవికాదు. కత్తులతో పొడవబడి, కాల్చబడి, రాళ్లు రువ్వబడినందున కొందరు చనిపోయిరి. కొందరి పొట్ట(ఉదరము)లు కోసి వాటియందు ధాన్యము కూర్చి, ఆ ధాన్యమును వారి ప్రేగులతో పాటు తినుటకు పందులను వదలిరి. ఎంతసేపు వారు ఆ బాధతో జీవించిరనునది పందుల ఆకలిమీద ఆధారపడియున్నది!

థ్రాస్ : క్రీ.శ. 363

ఎమిలియానస్ (Emilianus) అను క్రైస్తవుని స్తంభమునకు కట్టి కాల్చివేసిరి, హంతకులబారినుండి దాగుకొనుటకు గుహలోనికి పరుగెత్తిన డొమిటియస్ (Domi tius) అను మరియొకనిని కత్తులతో పొడిచి చంపిరి.

క్రీ.శ. 363 లో జు అన్ (Ju an) చక్రవర్తి పర్షియాతో జరిగిన యుద్దములో గాయపడి మరణించెను. అతని తరువాత వచ్చిన జోవియన్ (Jovian) టైగ్రిస్ నదికి ఆవలనున్న రోమా ప్రాంతములన్నిటిని ఇచ్చివేసి, పర్షియనులతో సంధిచేసికొనెను. జోవియన్ ఒక్క సంవత్సరము మాత్రమే పరిపాలించినను సంఘమునకు తాత్కాలిక శాంతిని తిరిగి తెచ్చెను.

క్రీ.శ. 364 లో మొదటి వాలెన్టిటినియన్ పశ్చిమ రోమా చక్రవర్తియై తన సోదరుడైన వాలెన్స్తో కలసి తూర్పుప్రాంతమును సంయుక్తముగా పరిపాలించెను. వాలెన్స్ అరియనుడు, కనుక మరియొకసారి దేవుని నిజసంఘము శ్రమలపాలైనది. మొదటి వాలెన్టిటినియన్ పశ్చిమ ప్రాంతమును క్రీ.శ. 364 నుండి క్రీ.శ. 375 వరకు పరిపాలింపగా, వాలెన్స్ తూర్పు ప్రాంతములో క్రీ.శ. 364 నుండి క్రీ.శ. 378 వరకు పరిపాలించెను.

ఆడ్రియానోపిల్ (Adrianople) పట్టణ సమీపమున విసిగోత్స్ (Visigoths) తో జరిగిన యుద్ధములో క్రీ.శ. 378 లో అతడు చంపబడెను. గోత్స్ (గోత ప్రజలు) లలో అనేకులు క్రైస్తవులు. గోత్స్నండి క్రైస్తవ్యమును స్వీకరించిన భక్తిగల విద్యావేత్తయైన ఉల్ఫిలాస్ (Ulfilas) ద్వారా అనేకుల మధ్య క్రైస్తవ్యము వ్యాపించెను. అతడు నలుబది సంవత్సరములకు పైగా కృషిచేసి, గోతిక్ భాషకు ప్రప్రథమముగా వర్ణమాల తయారుచేసి, బైబిలును ఆ భాషలోనికి తర్జుమా చేసి, క్రీస్తు సువార్తను వారికి ప్రకటించెను.

అలెగ్జాండ్రియా : క్రీ.శ. 386

అరియన్ బిషప్న జార్జ్ల్కు అలెగ్జాండ్రియా పట్టణములోని భక్తిగల క్రైస్తవులను హింసించుటకు చక్రవర్తి అధికారమియ్యగా, చాల దుష్టత్వముతో అతడు క్రైస్తవులను హింసించెను. ప్రభుత్వ నాయకులలో అనేకులు, ఐగుప్తు సైన్యాధిపతి, పెద్ద హోదాకలిగిన రోము అధికారి అతనికి సహాయపడిరి.

హింసాకాలములో నిష్ఠగల బిషప్లను అలెగ్జాండ్రియానుండి తరిమివేసి, వారి దేవాలయములను మూసివేసిరి. క్రైస్తవులకు ఎంతో క్రూరమైన శిక్షలు విధించిరి. శిక్షనుండి క్రైస్తవుడెవరైన పారిపోయినట్లయితే, అతని కుటుంబ సభ్యులందరిని ఉరితీసి, వారి ఆస్తిని స్వాధీనపరచుకొనిరి.

స్పెయిన్ : క్రీ.శ. 586

హెర్మెనిజిల్డస్ (Hermenigildus) గోత్స్ రాజైన లియోవిజిల్డస్ (Leovigildus) యొక్క పెద్ద కుమారుడు. మొదట అతడు ఆరియన్ అయినప్పటికి దైవభక్తిగల అతని భార్య ఇంగొండా (Ingonda) ద్వారా నిజదేవుని తెలిసికొనెను. అతని తండ్రి అతని మతము మార్పునుగూర్చి వినినప్పుడు నైరుతి స్పెయిన్లోని సెవిలే (Seville) పట్టణ గవర్నర్ పదవినుండి అతనిని తొలగించి హతమార్చెదనని బెదరించెను. కాని హెర్మెనిజిల్డస్ క్రీస్తునందలి విశ్వాసమును వదులుకొనలేదు.

మరణశిక్షను తప్పించుకొనుటకు హెర్మెనిజిల్డస్ తనకొరకు పోరాడు బలమైన విశ్వాసుల సైన్యమును సమకూర్చుకొనెను. తిరుగుబాటు చేసినాడను కక్షతో, రాజు విశ్వాసులనందరిని హతమార్చ ప్రారంభించి, ఒక బలమైన సైన్యమును సెవిలేవైపునకు పంపించెను. మొదటిలో హెర్మెనిజిల్డస్ సెవిలేలో ఆశ్రయము పొంది, యుద్ధము తీవ్రమైనప్పుడు అసైటా (Asieta) కు పారిపోయెను. కాని అచ్చట అతనిని బంధించి, సెవిలేకు తిరిగి తీసికొని వచ్చిరి. ఈస్టరు విందురోజు ఆరియన్ బిషప్ వద్దనుండి దైవప్రసాదము తెచ్చిన దూతను చేర్చుకొనుటకతడు నిరాకరించినందున తండ్రి ఆజ్ఞప్రకారము సైనికులు అతనిని ఖండఖండములుగ చీల్చి చంపిరి. అది క్రీ.శ. 586 ఏప్రిల్ 13వ తేదిన జరిగినది.

లొంబార్డి (ఇటలీ) : క్రీ.శ. 683

లొంబార్డి ప్రాంతములోని బెర్గమో (Bergamo) పట్టణ బిషప్ యైన జాన్ అరియనిజమ్ సిద్ధాంతములను సంఘమునుండి తుడిచివేయుటకు మిలాన్ పట్టణ బిషప్ తన సైన్యమును జతపరిచెను. వారిద్దరు మతవ్యతిరేక శక్తులను అణచుటలో కృతకృత్యులైరి. అయితే క్రీ.శ. 683 జూలై 11న జాన్ హత్యచేయబడెను.

వేయి సంవత్సరముల … శాంతి కాలములో జరిగిన హింసలు

జర్మనీ : క్రీ.శ. 689

జర్మనీలోని ఫ్రాంకోనియా (Franconia) లోని అన్యులకు కిఫెన్ (Kiffien) అను పవిత్ర రోమా బిషప్ దేవుని వాక్యమును బోధించెను. అతడు వర్జ్బర్గ్ (Wurz burg) గవర్నరైన గోజెబెర్ట్ (Gozbert) ను, ఆ పట్టణ పౌరులలో అనేకులను క్రైస్తవ్యము లోనికి నడిపించెను. క్రీ.శ. 689 లో కిఫెన్ శిరచ్ఛేదము గావించబడెను.

స్పెయిన్ : క్రీ.శ. 850

పెర్ఫెక్టస్ (Perfectus) స్పెయిన్ లోని కార్డుబా (Corduba) లో పుట్టి, క్రైస్తవ విశ్వాసములో పెరిగెను. అతడు గొప్ప పండితుడు, భక్తిపరుడు. ప్రచురింపబడిన పుస్తకములన్నిటిని చదివి జ్ఞానము సంపాదించుకొనెను. చిన్నతనములోనే పాస్టర్గా అభిషేకింపబడి తన బాధ్యతలను అందరు మెచ్చతగిన విధముగ నెరవేర్చెను. క్రీ.శ. 850 లో అతడు మహమ్మద్ను వంచకునిగా ప్రకటించగా, దానికి వెంటనే మహమ్మ దీయులు అతని శిరస్సు ఖండించిరి.

పర్షియా : క్రీ.శ. 997

ప్రాగ్ (Prague) బిషప్ యైన అడాల్బర్ట్ (Adalbert) విగ్రహారాధికులను మార్చుటలో ఎక్కువ భారము కలిగియుండెను. పర్షియాలోని ఒక పట్టణములో పర్యటించి చాలమందిని మార్చి, బాప్తిస్మమిచ్చెను. అన్యమత గురువులకిది అమిత కోపము పుట్టించుటచే వారు అతనిని పట్టుకొని, బాణములతో కొట్టి చంపిరి.

పోలండ్ : క్రీ.శ. 1079

పోలండ్ రెండవ రాజైన బోలిస్లాస్ (Bolislaus) రాజ్యములో దుర్మార్గపు కార్యములు చేయుచుండెను. విస్తుల నది ఒడ్డునగల క్రాకో పట్టణ బిషప్ యైన స్టానిస్లాస్ (Stanislus) ధైర్యము తెచ్చుకొని, వ్యక్తిగత సంభాషణలో ప్రజలను హింసించుట మాని, తన తప్పులను సరిదిద్దుకొనవలసినదిగా రాజునకు మనవిచేసెను. రాజు తన తప్పులను నిర్హేతుకముగా అంగీకరించినప్పటికిని, బిషప్ మాటిమాటికి దెప్పు చున్నందువలన బోలిస్లాస్కు కోపము వచ్చి, బిషపు సంహరించు అవకాశముకొరకు కనిపెట్టుకొని యుండెను.

ఒక రోజున సమీపమునగల గుడిలో బిషప్ ఒంటరిగా ఉన్నాడను విషయము రాజు విని, అతనిని కనుగొని చంపుటకు, సైనికులను పంపెను. వెళ్లిన సైనికులు అత్యంత గౌరవనీయుడైన ఆ బిషప్ ఒంటరిగా ఉండుట కనుగొనిరి కాని అతని దైవిక ప్రత్యక్షతను చూచి కలవరపడి, చంపుటకు భయపడిరి.

దైవజనుని కత్తితో

క్రైస్తవులను హింసించుటలో వెయ్యి సంవత్సరముల విరామము తర్వాత సాతానుడు రోములో మరల విజృంభించెను. యేసుక్రీస్తు సంఘమును ఒక ప్రణాళిక ప్రకారము నాశనము చేయుటకు అతడు తన పనివారిని నియమించెను. ఈసారి మాత్రము హింసలు అన్యులయొద్దనుండి రాలేదుగాని, క్రైస్తవులని పిలువబడుచున్నవారే దేవుని సంఘమును హింసించిరి. వారు ఊహకందని రీతిలో తమ దుర్మార్గమును నిజ క్రైస్తవులయెడల ప్రదర్శించి, వారిని చిత్రహింసలపాలు చేసిరి.