కొత్త జన్మ – Bible Verses Chapter 3 in Telugu

మూడవ అధ్యాయము

కొత్త జన్మ

నూతన జన్మను గూర్చి యేసు నీకొదేముకు బోధించుట (3:1-21) :

3:1 ఇప్పటి వరకు మనము ముచ్చటించిన సంగతులకంటే నీకొదేము వృత్తాంతము వేరైనది. యూదులలో అనేకులు ఆయనను విశ్వసించినట్లు చెప్పినను, వారి విశ్వాసము నిజమైనది కాదని ఆయన ఎరుగును. కాని నీకొదేము ఇందుకు భిన్నమైనవాడు. సత్యమును తెలిసికొనవలెననెడి ఆకాంక్ష అతనిలో ఉన్నదని ప్రభువు గ్రహించెను. మొదటి వచనము “కాని” యను మాటతో ప్రారంభించబడవలెను. “యూదుల అధికారి యైన నీకొదేమను పరిసయ్యుడొకడుండెను.

” అతడు తన ప్రజలమధ్య బోధకుడుగా గుర్తింపు పొందెను. బహుశ అతడు ప్రభువు నొద్దకు ఉపదేశము పొందుటకు వచ్చెను. ఆ ఉపదేశమును తన బోధతో కలిపి యూదులకు చెప్పవలెనను ఉద్దేశముతో అతడు వచ్చియుండవచ్చును.

3:2 నీకొదేము రాత్రి సమయములో ప్రభువు దగ్గరకు ఎందుకు వచ్చెనో బైబిలు మనకు చెప్పుటలేదు. కాని దీనికి సరియైన వివరణ ఏమనగా, యూదులలో అనేకులు ప్రభువును అంగీకరించక పోవుటనుబట్టి, ప్రభువునొద్దకు వెళ్ళుట ఇతరులు చూచుట ద్వారా ఇబ్బందులు కలుగునని అతడు తలంచెను. కాని మెట్టుకు … అతడు ప్రభువు నొద్దకు వచ్చెను. ప్రభువు చేసినట్టి అద్భుతములు దేవుని సహాయము లేనిదే ఏ వ్యక్తి చేయలేడని గ్రహించినప్పుడే ఆయన దేవునియొద్దనుండి పంపబడిన బోధకుడని నీకొదేము గ్రహించెను.

Read and Learn More Telugu Bible Verses

అతడు లేఖనములను బాగుగా ఎరిగినప్పటికిని సశరీరుడుగా ప్రత్యక్షమైన దేవుడని అతడు గుర్తించలేదు. నేడు యేసు ఒక గొప్ప వ్యక్తి, అద్భుతమైన బోధకుడు, గొప్ప మాదిరిగల వ్యక్తియని చెప్పెడి అనేకులవలె నీకొదేము ఉన్నాడు. ఇట్టి వ్యాఖ్యానములన్నియు సత్యదూరములే. యేసు వర్తమాన భూత భవిష్యత్కాలము లలో ఉన్న దేవుడు.

3:3 నీకొదేము చెప్పినదానికి, ప్రభువు ఇచ్చిన ప్రత్యుత్తరమునకు ఎటువంటి సంబంధమున్నట్లు మొదట మనకు కనిపించదు. కాని నిదానించి గమనించిన యెడల, “నీకొదేమూ, బోధకొరకు నీవు నాదగ్గరకు వచ్చితివి; నీకు నిజముగా అవసరమైనది ‘క్రొత్తజన్మ,’ నీ ప్రారంభము అక్కడనుండియే. నీవు పైనుండి జన్మించవలెను. లేనియెడల నీవు దేవుని రాజ్యమును చూడలేవు” అని ప్రభువు చెప్పినట్లు గ్రహించగలము.

ఒక యూదునిగా నీకొదేముకూడ మెస్సీయ రాకకొరకు ఎదురుచూచుచుండెను. అంతేకాదు ఆయనవచ్చి రోమీయుల చెఱనుండి ఇశ్రాయేలీయులను విడిపించునని ఆశించుచుండెను. మెస్సీయ వచ్చి శత్రువులను సంహరించి, ఈ భూమిమీద తన రాజ్యమును స్థాపించి, జనములన్నింటిలో ఇశ్రాయేలు జనాంగము ప్రధానమైనదిగా చేయబడు ఆ సమయముకొరకు నీకొదేము ఎంత ఆశతో ఎదురు చూచుచుండెను.

అయితే ఈ రాజ్యములో ప్రవేశించుటకు ఒకడు క్రొత్తగా జన్మించవలెనని ప్రభువు చెప్పెను. ఈ భౌతిక జీవమునకు మొదటి జన్మ ఎంత అవసరమో, ఆ విధముగనే, దైవికమైన జీవమునకు రెండవ జన్మ అంత అవసరమైయున్నది. (ఇక్కడ “క్రొత్త జన్మ” అనుదానికి “పైనుండి కలుగు జన్మ” అను అర్థముకూడ కలదు). దీనిని మరొకరీతిగా చెప్పవచ్చును: ఎవరి జీవితములు పూర్తిగా మార్పు చెందినవో వారు మాత్రమే క్రీస్తురాజ్యములో ప్రవేశించగలరు.

ఆయన రాజ్యము నీతి రాజ్యము. ఆయన పరిపాలన నీతి పరిపాలన గనుక పాలితులుకూడ నీతిమంతులై యుండవలెను. అంతేగాని తమ పాపములోనే జీవించువారిని ఆయన పాలించువాడుకాడు.

3:4ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు అర్థము చేసికొనుట మనుష్యులకు ఎంత కష్టమో మరొకసారి ఈ వచనములో చూడగలము. నీకొదేము ప్రతి విషయము అక్షరార్ధముగానే గైకొనుచుండెను. ముసలివాడైన ఒక వ్యక్తి ఎట్లు క్రొత్త జన్మ పొంద గలడో నీకొదేముకు అర్థము కాలేదు. ఒక వ్యక్తి తిరిగి జన్మించు నిమిత్తము తల్లి గర్భములో ప్రవేశించుటలో గల అసాధ్యమును గూర్చి బహులోతుగా ఆలోచించెను (1 కొరింథీ 2:14).

3:5 ఒకడు నీటిద్వారాను, ఆత్మద్వారాను జన్మించవలెననియు, లేనియెడల అతడు దేవుని రాజ్యములో ప్రవేశింప లేడనియు ప్రభువు నీకొదేముతో మరికొంత వివరముగా చెప్పెను.
ఆ విధముగా చెప్పుటలో ప్రభువుయొక్క భావమేమి? రక్షణ పొందుటకు బాప్తిస్మము అవసరమని ప్రభువు చెప్పినట్లు నేడు అనేకులు తలంచుచున్నారు. కాని అటువంటి బోధ బైబిలంతటికి విరుద్ధమైనది. అయితే ఒకడు ప్రభువైన యేసు క్రీస్తునందలి విశ్వాసముద్వారా మాత్రమే రక్షణ పొందగలడని దేవుని వాక్యములో మనము చదువుచున్నాము. బాప్తిస్మము ఒక వ్యక్తి రక్షణ పొందుటకు సాధనము కాదుగాని, రక్షింపబడిన వారికి మాత్రమే అది నియమింపబడినది.

ఈ వచనములో చెప్పబడిన నీరు దేవుని వాక్యమును సూచించుచున్నదని కొందరు చెప్పుచున్నారు. ఎఫెసీ 5:25, 26 లో చెప్పబడిన నీరు దేవుని వాక్యముతో సన్నిహిత సంబంధము కలిగియున్నది. మరియు 1 పేతురు 1:23 లో కూడ నూతనజన్మ దేవుని వాక్యముద్వారా కలుగునని వ్రాయబడినది. గనుక ఈ వచనములో చెప్పబడిన నీరు దేవుని వాక్యమైన బైబిలును సూచించుచున్నది. అనగా, లేఖనములకు వేరుగా రక్షణ లేనేలేదు. గనుక ఒక పాపి దేవుని వాక్యములో పొందుపరచియున్న వర్త మానమును క్రొత్తజన్మ పొందుటకు ముందు అంగీకరించవలెను.

కొత్త జన్మ నూతన జన్మను గూర్చి యేసు నీకొదేముకు బోధించుట (3:1-21) :

కాని నీరు పరిశుద్ధాత్మనుకూడ సూచించుచున్నది. యోహాను సువార్త 7:38,39లో యేసుక్రీస్తు జీవజల నదులనుగూర్చి మాటలాడెను. మరియు ప్రభువైన యేసుక్రీస్తు “నీరు” అని తన బోధలో ఎక్కడ ఉపయోగించినను అది పరిశుద్ధాత్మనే సూచించుచు చెప్పెను. ఏడవ అధ్యాయములో “నీరు” పరిశుద్ధాత్మయైనయెడల, మూడవ అధ్యాయ ములో ఆ అర్ధమే ఎందుకుండదు? ఈ వచనములో “నీళ్ళను” ఆత్మ యను భావముతో రెండు పర్యాయములు చెప్పబడినట్లు కనిపించుచున్నది.

కాని శారీరక జన్మ కలిగి యుండుట చాలదు. ఒక వ్యక్తి దేవుని రాజ్యములో ప్రవేశించవలెనంటే ఆత్మీయ జన్మకూడ కావలెను. ఒకడు యేసుక్రీస్తునందు విశ్వాసముంచినప్పుడు, దేవుని ఆత్మ కార్యముద్వారా ఈ ఆత్మీయ జన్మ కలుగుచున్నది. “ఆత్మ మూలముగా జన్మించవలెను” అనుమాట 6, 8 వచనములలో రెండు పర్యాయములు మనకు కనిపించుచున్నది. గనుక ఈ వ్యాఖ్యానము సరియైనదిగా మనము గమనించగలము.

3:6 అదే రీతిగా, నీకొదేము రెండవసారి తల్లి గర్భములో ప్రవేశించి, మరల జన్మించినను అతనియందున్న పాపస్వభావము సరిచేయబడనేరదు “శరీరమూలముగా పుట్టినది శరీరమును” అని ఈ వచనములో చెప్పబడిన మాటలు – “మానవ మాత్రులకు పుట్టిన బిడ్డలు పాపములో పుట్టినవారై నిరీక్షణాధార రహితులును, నిస్సహాయులునై తమ్మును తాము రక్షించుకొనలేని స్థితిలో ఉన్నారు” అను భావమును తెలియజేయు చున్నవి. ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మరుక్షణమే ఆత్మజన్మ కలుగుచున్నది. ఒక వ్యక్తి ఆత్మద్వారా తిరిగి జన్మించినప్పుడు అతడు నూతన స్వభావ మునుపొంది, దేవుని రాజ్యమునకు అర్హునిగా చేయబడుచున్నాడు.

3:7 ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బోధకు నీకొదేము ఆశ్చర్యపడనవసరము లేదు. కాని ఒక వ్యక్తి తప్పక తిరిగి జన్మించవలెనని అతడు గ్రహించవలెను. అంతేగాక పతనమైన స్థితిలోనున్న మానవ స్వభావమును సరిచేసికొనుటలో మానవుడు కేవలము బలహీనుడని అతడు గ్రహించవలెను. మరి ముఖ్యముగా, ఒక వ్యక్తి దేవుని రాజ్య నివాసిగా యుండుటకు, అతడు తప్పక పరిశుద్ధుడును, పవిత్రుడును మరియు ఆత్మాను సారియై యుండవలెనని నీకొదేము తప్పక గ్రహించవలెను.

3:8 ఆత్మీయ సంగతులను వివరించుటకు ప్రభువైన యేసు అనేక సందర్భములలో ప్రకృతినే ఉపయోగించెను. గాలి తనకిష్టమైన తావులకు వీచుననియు, మనిషి దాని శబ్దమును మాత్రము వినునుగాని, అది ఎక్కడనుండి వచ్చెనో, ఎక్కడకి వెళ్ళుచున్నదో అతడు గ్రహించలేడని ప్రభువు నీకొదేముకు జ్ఞాపకము చేసెను. అదే రీతిగా క్రొత్తజన్మ గాలిని పోలియున్నది. క్రొత్తజన్మ దేవుని చిత్తప్రకారము కలుగదు. అంతేగాక అది మానవుని స్వాధీనములో లేదు.

మరియు క్రొత్తజన్మ అదృశ్యమైనది (Invisible) అనగా దీనిని బాహ్యనేత్రములతో చూడలేముగాని, దాని ఫలితములను చూడగలము. కనుక ఒక వ్యక్తి రక్షింపబడినప్పుడు అతనిలో ఒక మార్పు కలుగును. ఇంతకుముందు తాను ప్రేమించిన చెడ్డ సంగతులన్నింటిని ఇప్పుడు అతడు ద్వేషించును. అంతేగాక ఇంతకుముందు తాను తృణీకరించిన దేవుని సంగతులన్నియు ఇప్పుడు తనకు ప్రియ మైనవిగా మారిపోవును. మరియు ఒకడు గాలినిగూర్చి ఏవిధముగా పూర్తిగా గ్రహించ లేడో, ఆ విధముగానే దేవుని ఆత్మయొక్క అద్భుత కార్యమైన క్రొత్తజన్మను గూర్చికూడ పూర్తిగా గ్రహించలేడు. అంతేగాక గాలినివలె క్రొత్తజన్మ ముందుగా ప్రకటింప వీలుకానిది. అది ఎప్పుడు ఎక్కడ సంభవించునో తెలుపుట కూడ అసాధ్యము.

3:9 దైవిక విషయములతో సంబంధము కలిగియుండుటలో ప్రకృతి సిద్ధమైన మనస్సుకుగల అసమర్ధతను గూర్చి నీకొదేము మరలా ఈ వచనములో వివరించు చున్నాడు. క్రొత్త జన్మ ఆత్మ సంబంధమైనది కాక, కేవలము ప్రకృతి సంబంధమైన సంభవమనియు లేక భౌతిక సంబంధమైనదనియు నీకొదేము ఇంకను తలంచుచున్నా డని చెప్పుటలో ఎట్టి అనుమానము లేదు. అందుకే అతడు “ఈ సంగతులు ఏలాగు సాధ్యము” అని ప్రభువును ప్రశ్నించుచున్నాడు.

3:10,11 అందుకు ప్రభువు ఇశ్రాయేలీయులకు బోధకుడైన నీకొదేము ఈ సంగతులను తప్పక తెలిసికొనవలెనని తెలియజేయుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు తన రాజ్యస్థాపనకు తిరిగి ఈ భూమి మీదకి వచ్చునప్పుడు ఆయన మొదట తన శత్రువులకు తీర్పు తీర్చి, ఆ పిదప తనకు విరోధమైన ప్రతిదానిని ఆయన నాశనము చేయునని పాత నిబంధన లేఖనములు స్పష్టముగా మనకు బోధించుచున్నవి. అయితే ఎవరు తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుదురో వారు మాత్రమే ఆ రాజ్యములో ప్రవేశించుదురు. పదకొండవ వచనములో ప్రభువు తన బోధయొక్క నిశ్చయతను గూర్చియు, ఆ బోధపట్ల మానవునికిగల విశ్వాసమును గూర్చియు నొక్కి చెప్పుచున్నాడు.

ఈ సత్యమును ఆయన నిత్యత్వములోనే ఎరిగి యుండెను గనుక, తాను వినినట్టియు, చూచినట్టియునైన సంగతులనే బోధించెను. కాని నీకొదేము, ఆయన కాలములో నున్న యూదులలోని అనేకులు ఆయన సాక్ష్యమును విశ్వసించుటకు తిరస్కరించిరి. 3:12 ఈ వచనములో ప్రభువు చెప్పిన భూ సంబంధమైన విషయములేవి? అవేవనగా, ఆయనయొక్క భూలోక రాజ్యమును గూర్చిన విషయములే.

పాత నిబంధన లేఖనముల విద్యార్థిగా – ఒకానొక దినము మెస్సీయ ఈ లోకమునకు వచ్చి యెరూషలేము ముఖ్యపట్టణముగా ఈ లోకములో తన రాజ్యమును స్థాపించునని ఎరుగును. కాని ఈ రాజ్యములో ప్రవేశించుటకు క్రొత్తజన్మ అవసరమను సత్యమును అతడు గ్రహించలేకపోయెను. అట్లయితే ప్రభువు చెప్పిన పరసంబంధమైన విషయములేవి? ఒక వ్యక్తి ఈ బోధించెను. క్రొత్తజన్మను ఏ విధముగా పొందగలడో ఆ సత్యములను గూర్చి క్రింది వచనములలో

3:13 పరలోక విషయములను గూర్చి మాటలాడుటకు ఒకే వ్యక్తి సరిపోయినవాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దేవుని యొద్దనుండి పంపబడిన మానవమాత్రు డైన బోధకుడే కాదుకాని, నిత్యత్వమంతటిలో తండ్రియొద్ద నున్నవాడు ఆయనే ఈ లోకమునకు దిగివచ్చెను. “పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు” అని ప్రభువు చెప్పినప్పుడు – పాత నిబంధన భక్తులైన హనోకు, ఏలీయాలు పరలోకమునకు ఎక్కిపోలేదని కాదుగాని, తనవలె ఏ మానవునికి దేవుని సన్నిధిలో ప్రవేశము లేదని ఆయన భావము.

ఆయన పరలోకమునుండి భువికి దిగివచ్చినవాడు గనుక దేవుని నివాసస్థలమైన ఆ పరలోకమునకు విశేషమైన రీతిగా ఆయన మాత్రమే ఎక్కి వెళ్ళ గలడు. ఆయన ఈ లోకములో ఉండి నీకొదేముతో మాటలాడుచున్నప్పుడు సహితము తాను పరలోకములో నున్నట్లు చెప్పెను. అదెట్లు? ఎట్లనగా, దేవునిగా ప్రభువు ఒకే సమయములో అన్ని స్థలములలో ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి (He is Omni-Present).

యూదయ ప్రాంతములో బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య (3:22-36):

3:14 ప్రభువైన యేసుక్రీస్తు క్రొత్తజన్మ అవసరమని నీకొదేముకు ఇంతకు ముందే నొక్కి చెప్పెను. అయితే క్రొత్తజన్మ ఎట్లు కలుగును? పాపపు శిక్షను ప్రతి మానవుడు తప్పక పొందవలెను. పాపియైన మానవుడెవడును పరలోకమునకు వెళ్ళలేడు. అరణ్యములో ఇశ్రాయేలీయులు పాముకాటు తినినప్పుడు మోషే ఆ అరణ్యములో ఒక యిత్తడి సర్పమును ఒక స్థంభముపై ఏలాగు ఎత్తైనో, ఆ విధముగనే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను (సంఖ్యా. 21:4-9 చదవండి).

మోషే కాలములో చేసిన అనేకమంది ఇశ్రాయేలీయులు సర్పపుకాటు తిని మరణించిరి. అయితే ఆ బాధననుభవించినవారు పశ్చాత్తాపపడి ప్రభువుకు మొఱ్ఱపెట్టినప్పుడు ఒక యిత్తడి సర్పమును రూపించి, ఒక స్థంభముపై ఎత్తిపెట్టవలెనని ఆయన మోషేకు ఆజ్ఞాపించెను సర్పముకాటు తినిన ప్రతివాడు దానిని నిదానించి చూచి ఆశ్చర్యకరమైన స్వస్థత పొందెను. క్రొత్తజన్మ ఎట్లు కలుగునో వివరించుటకు ప్రభువు ఈ సాదృశ్యమును గుర్తుచేయుచున్నాడు.

స్త్రీ పురుషులందరు పాపమనే సర్పపుకాటుతిని నిత్యమరణమను శిక్షక్రిందనున్నారు. ఇత్తడి సర్పము ప్రభువైన యేసుక్రీస్తుకు పటముగానున్నది. బైబిలు గ్రంథములో ఇత్తడి తీర్పును సూచించుచున్నది. ప్రభువైన యేసు పాపరహితుడు గనుక ఎంతమాత్రము శిక్షకు పాత్రుడు కాడు. కాని ఆయన మన స్థానము వహించి, మనము పొందవలసిన శిక్షను తాను భరించెను. సర్పము ఎత్తబడిన స్థంభము మన ప్రభువు వ్రేలాడిన కలువరి సిలువను సూచించుచున్నది. గనుక విశ్వాసముతో ఆయన తట్టు చూచుట ద్వారా మనము రక్షింపబడియున్నాము.

3:15 మనము ఆయనయందు దేవుని నీతియగునట్లు పాపమెరుగని ప్రభువైన యేసు మన నిమిత్తము పాపముగా చేయబడెను. గనుక ప్రభువైన యేసునందు ఎందరు విశ్వాసముంచుదురో వారు నిత్యజీవమను వరమును ఉచితముగా పొందెదరు.

3:16 బైబిలంతటిలో బాగుగా పరిచయమున్న వచనములలో ఈ వచనము మొదటిది. ఎందుకనగా, ఈ వచనములో సువార్త బహు స్పష్టముగాను, బహు సూక్ష్మముగాను చెప్పబడెను. క్రొత్త జన్మను పొందు విధమును గూర్చి ప్రభువు నీకొదేముతో చెప్పిన విషయము సంగ్రహపరచబడియున్నది. ఈ వచనములో “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను” అని చదువుచున్నాము. ఇక్కడ “లోకము” అనగా సమస్త మానవకోటియని అర్థము.

దేవుడు మానవుని పాపములను గాని, లేక లోకములోనున్న దుష్టవిధానమునుగాని ప్రేమించుటలేదు. కాని ఆయన మానవులను ప్రేమించి, ఎవ్వరు నశించగూడదని ఆయన ఇచ్ఛయించుచున్నాడు. ఆయన తన అద్వితీయ కుమారుని మనకొరకు అనుగ్రహించుటద్వారా మనపట్ల ఆయనకుగల అపారమైన ప్రేమను వెల్లడిచేసియున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వంటి కుమారుడు ఆయనకెవరును లేరు.

తిరుగుబాటు స్వభావముగల మానవజాతి కొరకు తన అద్వితీయ కుమారుని అనుగ్ర హించుటలో ఆయనయొక్క అనంతమైన ప్రేమ ఈ వచనములో వివరింపబడినది. అంటే ప్రతి ఒక్కరు రక్షింపబడిరని భావము కాదు. కాని, ఒక వ్యక్తి క్రీస్తు తనకొరకు జరిగించిన కార్యమునందు విశ్వాసముంచవలెను. అప్పుడు దేవుడు అతనికి నిత్యజీవ మిచ్చును. గనుకనే ఈ వచనములో ఆయనయందు విశ్వాసముంచువారు నశింపరను మాటలు చేర్చబడినవి. అవును, ఎవ్వరును నశించిపోనవసరములేదు. అందరు రక్షణ పొందునట్లు ఒక మార్గము ఏర్పాటుచేయబడినది. గనుక వారు చేయవలసిన కార్య మేమనగా ప్రభువైన యేసుక్రీస్తును తమ ప్రభువుగాను, రక్షకునిగాను అంగీకరించ వలెను. అట్లుచేసిన ప్రతి వాడు నిత్యజీవమును వరముగా కలిగియున్నాడు.

3:17 దేవుడు కఠినుడును నిర్దయుడును కాదు. మానవాళిపై తన ఉగ్రతను కురిపించుటకు త్వరపడువాడు కాదు. కాని వారిపట్ల ఆయన దయార్దహృదయము కలిగియున్నాడు. గనుక మానవులను రక్షించుటకు ఆయన ఎంతో మూల్యము చెల్లిం చెను. లోకమునకు తీర్పు తీర్చుటకు ఆయన తన కుమారుని పంపగలడు కాని, దానికి బదులు లోకము ఆయనద్వారా రక్షణ పొందునట్లు శ్రమపడి తన రక్తము కార్చి మరణించుటకు ఆయన తన కుమారుని పంపెను. కలువరి సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు జరిగించిన కార్యము ఎంతో విలువైనది. అనగా, ఆ కార్యము ప్రతి స్థలములో తన్ను అంగీకరించు పాపులనందరిని రక్షింప గలిగినంత అమూల్యమైనది.

కొత్త జన్మ – Bible Verses Chapter 3

3:18 మానవులలో సహజముగా విశ్వాసులు అవిశ్వాసులను రెండు తరగతులు కలవు. మన నిత్యత్వపు గతి దేవుని కుమారునిపట్ల మనకుగల వైఖరినిబట్టి నిర్ణయింప బడియున్నది. రక్షకునియందు విశ్వాసముంచువాడు తీర్పు తీర్చబడడు గాని, ఆయన యందు విశ్వాసముంచువానికి ఇంతకుమునుపే తీర్పు తీర్చబడెను. ప్రభువైన యేసు రక్షణ కార్యమును సంపూర్తి చేసెను. అయితే యిప్పుడు ఆయనను అంగీకరించుట లేక నిరాకరించుట ప్రతి వ్యక్తి నిర్ణయమునకు వదిలివేయబడినది.

కాని ఇట్టి ప్రేమపూర్వకమైన వరమును తృణీకరించుట బహు భయంకరము. ఒక వ్యక్తి ప్రభువైన యేసునందు విశ్వాసముంచని యెడల దేవుడు వానికి శిక్ష విధించుట తప్ప మరేమియు చేయలేడు. “ఆయన నామమందు” విశ్వాసముంచుట “ఆయనయందు” విశ్వాస ముంచుటయే. బైబిలు గ్రంథములో చెప్పబడిన పేరు ఒక వ్యక్తిని సూచించుచున్నది. నీవు ఆయన నామమును విశ్వసించుట ఆయనను విశ్వసించుటయే.

3:19 లోకములోనికి వచ్చిన వెలుగు యేసుక్రీస్తే. ఆయన పాపరహితమై నిష్కళంక మైన దేవుని గొఱ్ఱపిల్ల. సర్వలోక పాపముల కొరకు ఆయన చనిపోయెను. అందుకు మానవులు ఆయనను ప్రేమించారా? లేదు. వారు ఆయనను అవమానపరచిరి. అంతేకాదు. ఆయనను తమ రక్షకునిగా కలిగియుండుటకంటె తమ పాపములనే మిన్నగా ఎంచిరి. గనుక వారు ఆయనను తిరస్కరించిరి. ప్రాకెడు జీవులు వెలుగు వచ్చిన తోడనే ఎట్లు పారిపోవునో, అట్లే పాపులైన మానవులు క్రీస్తు సన్నిధినుండి
పారిపోవుదురు.

3:20 సహజముగా పాపమును ప్రేమించువారు వెలుగును ద్వేషింతురు. ఎందు కనగా, వెలుగు వారి పాపస్థితిని బయలుపరచును. ప్రభువైన యేసు ఈ లోకములో ఉన్నప్పుడు పాపులైన మానవులు ఆయన సన్నిధి వారిమధ్య ఉండుటను బట్టి బహు సంకటపడిరి. ఎందుకనగా ఆయన తన పరిశుద్ధతద్వారా వారి భయంకరస్థితిని బయలు పరచెను. ఒక కర్రయొక్క వంకరతనమును తెలియజేయుటకు దాని ప్రక్కనే ఒక తిన్ననికర్ర నుంచితే చాలుగదా!

3:21 ఆలాగుననే ప్రభువైన యేసు పరిపూర్ణుడైన మానవునిగా ఈ లోకమునకు వచ్చి, ఇతర మానవులందరి వంకరతనమును తన పరిపూర్ణత ద్వారా బయలుపరచెను. ఒక వ్యక్తి దేవుని యెదుట నిజముగా సత్యవర్తనుడైయున్న యెడల, అతడు వెలుగైయున్న క్రీస్తునొద్దకు వచ్చి తన అయోగ్యతను, తన పాపస్థితిని గుర్తెరిగి రక్షకునియందు విశ్వాసముంచును. ఈ విధముగా ఒక వ్యక్తి క్రీస్తునందలి విశ్వాసముద్వారా తిరిగి జన్మించును.

యూదయ ప్రాంతములో
బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య (3:22-36):

3:22 యెరూషలేములో ప్రభువుయొక్క సాక్ష్యమును గూర్చి ముందు వచనములలో వివరించబడినది. ఇరవై రెండవ వచనమునుండి ఈ అధ్యాయము ఆఖరి వరకు యూదయలో ప్రభువుయొక్క పరిచర్యను గూర్చి చదువుచున్నాము. ఈ ప్రాంతములో ప్రభువు రక్షణను గూర్చిన శుభవర్తమానమును ప్రకటించుచుండెననుటలో ఎట్టి సంశయము లేదు. మనుష్యులు వెలుగునొద్దకు వచ్చుటను బట్టి బాప్తిస్మము పొందిరి. అయితే ఈ వచనములో ప్రభువు తానే బాప్తిస్మమిచ్చినట్లు చూడగలముగాని, 4:2లో శిష్యులు బాప్తిస్మమిచ్చినట్లు నేర్చుకొనుచున్నాము.

3:23 యోహానని ఈ వచనములో చెప్పబడిన వ్యక్తి బాప్తిస్మమిచ్చు యోహానే. అతడు యూదయ పరిసరప్రాంతములో మారుమనస్సును గూర్చి ప్రకటించుచుండెను. మరియు మెస్సీయా రాక కొరకు సిద్ధబాటు కలిగి మారుమనస్సు పొంద ఇష్టపడు వారికందరికి అతడు బాప్తిస్మమిచ్చుచుండెను. “ఐనోను” అను స్థలములో నీరు విస్తార ముగా నున్నందున అక్కడ యోహాను బాప్తిస్మమిచ్చుచుండెను. అయితే అతడు ముంచడము ద్వారా బాప్తిస్మమిచ్చెనని మనము పూర్తిగా ఋజువు చేయలేముగాని, అతడు ఆ విధముగనే ఇచ్చియుండ వచ్చునని మనము గట్టిగా భావించవచ్చును. ఏలయనగా, అతడు కేవలము చిలకరింపుద్వారా బాప్తిస్మమిచ్చి యున్నయెడల అంత విస్తారమైన నీరు అవసరము లేదు.

3:24 యోహాను తన పరిచర్యను ఇంకను కొనసాగించుచుండెననియు, నమ్మకమైన తన సాక్ష్యమునుబట్టి భక్తిగల యూదులనేకులు స్పందించుచున్నారనియు ఈ వచనము మనకు వివరించుచున్నది. సమీప భవిష్యత్తులో యోహాను చెరసాలలో వేయబడి శిరచ్ఛేదనము చేయబడనై యున్నాడు. కాని ఈ కొద్ది సమయములోనే తనకప్పగించిన పనిని శ్రద్ధతో నెరవేర్చుచున్నాడు.

3:25 శుద్ధీకరణాచరమునుగూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెనని ఈ వచనము స్పష్టపరచుచున్నది. “శుద్ధీకరణము” అను పదము బాప్తిస్మమును సూచించుచున్నది. యేసు ఇచ్చు బాప్తిస్మముకంటె యోహాను ఇచ్చు బాప్తిస్మము మిన్నయను విషయములో వారికి వివాదము కలిగెను. అయితే ఏ బాప్తిస్మములో ఎక్కువ శక్తి యున్నది? ఏ బాప్తిస్మము ఎక్కువ విలువ గలది? బహుశా అన్ని బాప్తిస్మములకంటె యోహాను యొక్క బాప్తిస్మము గొప్పదను ఉద్దేశ్యముతో యోహాను శిష్యులలో కొందరు అవివేకముగా జగడము పెట్టుకొని యుండవచ్చును. క్రీస్తుయొక్క ప్రసిద్ధినిగూర్చి యోహాను యొక్క శిష్యులలో అసూయ కలిగించుటకు పరిసయ్యులలో ఒకడు ప్రయత్నించి యుండవచ్చును.

3:26 గనుక ఒక నిర్ణయము కొరకు వారు యోహానునొద్దకు వచ్చి – నీవిచ్చు బాప్తిస్మము శ్రేష్ఠమైనదైతే, అనేకులు నిన్ను విడిచి ఏల క్రీస్తు నొద్దకు వెళ్ళుచున్నారు. అని అతనిని అడిగియుండవచ్చును. (యొర్దానుకు అవతల నున్నవాడనగా క్రీస్తే). యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చెను. ఆ సాక్ష్యమునుబట్టి తన శిష్యులలో అనేకులు తనను విడిచి యేసును వెంబడించసాగిరి.

3:27 యోహాను ఇచ్చిన ప్రత్యుత్తరమునకు రెండు విధములైన వివరణలు కలవు. అతడు యేసుక్రీస్తును గూర్చి చెప్పుచున్న యెడల రక్షకుడు పొందిన ప్రతి విజయము ఆయనను దేవుడంగీకరించెననుటకు గుర్తు. కాని యోహాను తన్ను గూర్చి చెప్పుచున్న తాను గొప్పవాడైనట్లును లేక ప్రముఖడనైనట్లును ఎన్నడు నటించలేదని అతడు చెప్పుచున్నాడు. యేసు ఇచ్చిన బాప్తిస్మముకంటె తానిచ్చిన బాప్తిస్మమే గొప్పదని అతడు ఎన్నడు చెప్పలేదు. అనగా పరలోకమునుండి పొందినది తప్ప తనయొద్ద ఏమియు లేదని యోహాను భావము. మన యందరి విషయము కూడ అంతే. ఈ లోకములో మానవుల యెదుట మనము అతిశయించుటకు గాని, మనలను మనము హెచ్చించుకొనుటకుగాని తగిన హేతువు ఏది లేదు.

3:28 తాను క్రీస్తును కానని చెప్పుచు యోహాను కేవలము క్రీస్తు రాకడ సమయ మును సూచించుటకును మరియు మెస్సీయా రాకడ కొరకు మార్గమును సిద్ధపరచుటక మాత్రమే పంపబడితినని తన శిష్యులకు జ్ఞాపకము చేయుచున్నాడు. అయితే వారు అతని విషయమై ఎందుకు వాదించిరి? అతని చుట్టు ఒక గుంపు ఉండవలెనని ఎందుకు ప్రయత్నించిరి? అతడు ప్రముఖమైన వ్యక్తి కాడుగాని, కేవలము ప్రభువైన యేసుతట్టు మానవులను త్రిప్పుటకు ప్రయత్నించుచున్నాడు.

3:29 ప్రభువైన క్రీస్తు పెండ్లికుమారుడై యున్నాడు. అయితే యోహాను కేవలము పెండ్లికుమారుని స్నేహితుడు మాత్రమే. బహుశా ఈనాడు మనము చెప్పుచున్నట్లు తోడి పెండ్లి కుమారుడు కావచ్చును. పెండ్లికుమార్తె తోడి పెండ్లికుమారునికి చెందదు గాని, పెండ్లి కుమారునికే చెందును. గనుక జనులు యోహానును వెంబడించుటకంటె యేసును వెంబడించుటయే తగును. ప్రభువైన యేసుక్రీస్తుయొక్క శిష్యులుగా ఎందరు తీర్చబడుదురో వారందరు పెండ్లికుమార్తెగా చెప్పబడుచున్నారు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు యెహోవాయొక్క భార్యగా చెప్పబడిరి.

అయితే క్రొత్త నిబంధనలో సంఘసభ్యులందరు పెండ్లికుమార్తెగా వర్ణింపబడిరి. కాని ఇక్కడ యోహాను సువార్తలో సాదారణ భావముతో మెస్సీయా ప్రత్యక్షమైనప్పుడు యోహానును విడిచి క్రీస్తును వెంబడించిన శిష్యులను సూచించుచు చెప్పబడినది. అంతేగాని అది ఇశ్రాయేలు జనాంగమనిగాని లేక క్రీస్తు సంఘమనిగాని భావము కాదు. అయితే తన శిష్యులు తన్ను విడిచిపెట్టుటను బట్టి అతడెంత మాత్రము చింతించలేదు. కాని వారు పెండ్లి కుమారుని స్వరము వినుట అతనికెంతో గొప్ప సంతోషము. మరియు అందరు క్రీస్తునందు లక్ష్యముంచుటవలన అతడు తృప్తిచెందెను. క్రీస్తు మానవులచేత స్తుతింపబడి ఘనపరచబడినప్పుడు అతని సంతోషము పరిపూర్ణమైనది.

3:30 యోహాను పరిచర్యలో ముఖ్యోద్దేశ్యము ఈ వచనములో క్రోడీకరింపబడినది. స్త్రీ పురుషులను ప్రభువుతట్టు త్రిప్పి ఆయనయొక్క నిజమైన యోగ్యతను ప్రజలకు గుర్తుచేయుటకు అతడు ఎడతెగక ప్రయాసపడెను. తన కార్యమును నెరవేర్చుటలో అతడు తన్నుతాను మరుగుపరచుకొనెను, క్రీస్తు సేవకుడు స్వమహిమను వెదకుట ద్రోహమే కాగలదు. ఈ అధ్యాయములో తప్పక జరుగవలసిన మూడు కార్యములు గమనించండి : (1) పాపి పక్షముగ జరుగవలసినది (3:7); (2) రక్షకుని పక్షముగా జరుగవలసినది (3:14); (3) పరిశుద్ధుల పక్షముగా జరుగవలసినది (3:30).

3:31 “యేసుక్రీస్తు పైనుండి వచ్చినవాడు; అందరికి పైనున్నవాడు.” ఈ మాటలు పరలోక సంబంధమైన ఆయన ఉనికిని మరియు సర్వోత్కృష్టమైన ఆయన స్థానమును తెలియజేయుచున్నది. అయితే తన అల్పత్వమును నిరూపించుటకు తాను మంటినుండి వచ్చినవాడననియు, భూసంబంధమైన విషయములనే మాటలాడుచున్నాననియు బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పెను. ఈ మాటలలోని భావమేమనగా, బాప్తిస్మమిచు యోహాను జన్మత మానవమాత్రులైన తల్లిదండ్రులకు పుట్టినవాడు. పరలోక సంబంధ మైన ఔనత్యము అతనికి లేదు. అందుచేత దేవుని కుమారునివలె అధికారముతో అతడు మాటలాడలేదు.

యూదయ ప్రాంతములో బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య (3:22-36):

“క్రీస్తు పైనుండి వచ్చినవాడును అందరికి పైనున్నవాడు” గనుక యోహాను క్రీస్తుకంటె తక్కువవాడు. ఈ విశ్వమంతటికి సర్వాధికారి క్రీస్తే. గనుక మనుష్యులు ప్రభువుయొక్క దూతను గాక ప్రభువునే వెంబడించుట ఎంతైన మంచిది.

3:32 కాని ప్రభువైన యేసు మాటలాడినప్పుడు అధికారముగల వానివలె మాట లాడెను. తాను ఏమి వినెనో ఏమి చూచెనో దానినిగూర్చిమాత్రమే ప్రభువు మనుష్యులకు చెప్పెను. దానిలో పొరబాటుగాని, మోసముగాని ఉండుటకు ఎట్టి అవకాశము లేదు. అయితే ఎవడును ఆయన సాక్ష్యమును గైకొనకపోవుట వింతగా నున్నది. ఇక్కడ “ఎవడును” అనగా – బొత్తిగా ఎవ్వరును ఆయన సాక్ష్యమును గైకొనలేదను భావము కాదు.

ప్రభువుయొక్క మాటలు గైకొని ఆయనను స్వీకరించిన వ్యక్తులు అక్కడక్కడ ఉన్నారు. అయితే యోహాను మానవాళిని గమనించి, వారిలో అనేకులు ప్రభువుయొక్క బోధను తిరస్కరించిన వారేయను భావముతో అతడు ఈ మాటలు చెప్పెను. పరలోకమునుండి దిగివచ్చినవాడు ప్రభువైన క్రీస్తే. గాని, బహుకొద్దిమంది మాత్రమే ఆయన బోధలు వినుటకు ఇష్టపడిరి.

3:33 ప్రభువుయొక్క మాటలను దేవునియొక్క మాటలుగా అంగీకరించిన బహుకొద్ది మందిని గూర్చి ఈ వచనము వివరించుచున్నది. వారు ఆ రీతిగా అంగీకరించుట ద్వారా దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేయుచున్నారు. నేడు కూడ అంతే. మనుష్యులు సువార్త సందేశమును అంగీకరించునప్పుడు వారు తనకును తక్కిన మానవాళికిని వ్యతిరేకముగా దేవుని పక్షము వహించుదురు.

దేవుడు చెప్పునదేదైనను తప్పక సత్యమైయుండునని వారు గ్రహించిరి. క్రీస్తుయొక్క దైవత్వమును గూర్చి ముప్ఫైమూడవ వచనము ఎంత స్పష్టముగా వివరించెనో గమనించండి. క్రీస్తుయొక్క సాక్ష్యమును ఎవరు నమ్ముదురో వారు దేవుడు సత్యవంతుడని ఒప్పుకొందురని ఈ వచనము చెప్పుచున్నది. ఈ మాటలనే మరొకరీతిగా చెప్పవలెనంటే క్రీస్తుయొక్క సాక్ష్యమే దేవుని సాక్ష్యము; మరియు క్రీస్తును చేర్చుకొనుట దేవుని చేర్చుకొనుటయే.

3:34 యేసు దేవునిచేత పంపబడినవాడు. ఆయన దేవుని మాటలనే పలికెను. ఈ మాటలను ఋజువుపరచుటకే – దేవుడు కొలత ప్రకారము ఆయనకు ఆత్మను అనుగ్రహించలేదని యోహాను తెలిపెను. ఏ మనుష్యుడును అభిషేకింపబడని రీతిలో ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ఆత్మచేత అభిషేకింపబడెను. మనుష్యులు తమ పరిచర్యలో పరిశుద్ధాత్మయొక్క సహాయము గుర్తించిరి. కాని దేవుని కుమారుని యొక్క ఆత్మ పూర్ణమైన పరిచర్యవంటి పరిచర్యగలవాడు ఎన్నడును ఎవడును లేడు.

3:35 తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడని యోహాను సువార్తలో చెప్పబడిన ఏడు సందర్భములలో ఇది యొకటి. సమస్తముపై కుమారునికి అధికారము అనుగ్రహించుటలో కుమారునిపట్ల తండ్రియొక్క ప్రేమ ఇక్కడ బయలుపరచబడినది. ప్రభువైన యేసుకు అప్పగింపబడిన సంపూర్ణ అధికారములలో మానవుని “గతి” కూడ ఇమిడియున్నది. ఈ సత్యము క్రింద వచనములలో వివరించబడియున్నది.

3:36 క్రీస్తునందు విశ్వాసముంచు వారికందరికి నిత్యజీవము ననుగ్రహించు అధికారము దేవుడు ఆయనకు అనుగ్రహించెను. బైబిలులో ఒక వ్యక్తి ఎట్లు రక్షింపబడునను సత్యము వివరించబడిన వచనములలో ఇది యొకటి.

ధర్మశాస్త్రము ననుసరించుట వలనగాని, బంగారు సూత్రమును పాటించుట వలనగాని, సత్రియలు చేయుటవలనగాని రక్షణ కలుగదు. కాని అది కేవలము కుమారునియందు విశ్వాస ముంచుటద్వారానే కలుగును. ఈ సందర్భములలో దేవుడు మాటలాడుచున్నాడని జ్ఞాపకము చేసికొనుము. ఎన్నటికి తప్పిపోని వాగ్దానమును ఆయన చేయుచున్నాడు. తన కుమారునియందు విశ్వాసముంచువారెవరైనను నిత్యజీవము గలవారని ఆయన నిశ్చయముగా చెప్పుచున్నాడు.

ఈ వాగ్దానమును విశ్వసించుట అవివేకము ఎంత మాత్రము కాదు. అయితే దేవుని కుమారునికి విధేయులు కానివారు జీవము చూడరుగాని, వారిమీద దేవుని ఉగ్రత నిలిచియున్నది. దేవుని కుమారునిపట్ల మనము చేయుదానినిబట్టి మన నిత్యగతి ఆధారపడియున్నదని ఈ వచనముద్వారా మనము నేర్చుకొనుచున్నాము.

మనము ఆ కుమారుని అంగీకరించినయెడల దేవుని నిత్య జీవమును ఉచిత వరముగా మనకు అనుగ్రహించును. అయితే మనము ఆయనను తిరస్కరించినయెడల మనము నిత్యజీవము ననుభవించక పోవుటయేగాక ఏ క్షణమందైనను మనమీద దిగుటకు దేవుని ఉగ్రత కాచుకొనియున్నది. (అని గ్రహించ వలసి యున్నాము).

యూదయ ప్రాంతములో బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య (3:22-36):

నీరు ద్రాక్షారసమగుట – Bible Verses Chapter 2 in Telugu

రెండవ అధ్యాయము

నీరు ద్రాక్షారసమగుట

మొట్టమొదటి సూచకక్రియ –
నీటిని ద్రాక్షారసముగా మార్చుట (2:1-11) :

2:1 ఈ వచనములో “మూడవ దినము” అని చెప్పబడిన దినము ప్రభువైన యేసు గలిలయలో నిలిచిన మూడవ దినమును సూచించుచున్నది. మొదటి అధ్యాయము నలభైమూడవ వచనములో రక్షకుడు గలిలయకు వెళ్ళెనని జ్ఞాపకము చేసికొనుము గలిలయలో కానా అను ఊరు ఎక్కడ ఉన్నదో కచ్చితముగా మనకు తెలియదు. కాని, కపెర్నహూముకు దగ్గరగా ఎత్తైన ప్రదేశములో ఉన్నట్లు 2:12 ద్వారా తెలియుచున్నది.

ఆ ప్రత్యేకమైన దినమున కానాలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లియైన మరియ అక్కడ ఉండెను. ఇక్కడ మరియను “యేసుతల్లి” యని చెప్పుట ఆసక్తితో గమనించదగినది. రక్షకుడు కన్య మరియకు కుమారుడగుటను బట్టి ప్రజలలో ఎక్కువ ప్రఖ్యాతి నొందలేదు కాని, ఆమె ప్రభువుయొక్క తల్లి యగుటవలన ఆమె అనేకులకు బాగుగా తెలియబడెను. అయితే లేఖనములు క్రీస్తుకు ఎల్లప్పుడు ప్రాధాన్యత నిచ్చెను గాని మరియకు ఇయ్యలేదు.

2:2 ఆ వివాహమునకు యేసును ఆయన శిష్యులుకూడ పిలువబడిరి. ఆ వివాహ మునకు ఆయనను ఆహ్వానించుట వివేకమైన నిర్ణయము. గనుక ఇప్పుడుకూడ తమ వివాహమునకు క్రీస్తును ఆహ్వానించుట జ్ఞానానుసారమైన నిర్ణయము. ఇందుకై పెండ్లి కుమారుడును పెండ్లికుమార్తెయు ప్రభువైన యేసునందు నిజమైన విశ్వాసులైయుండ వలెను. మరియు తమ వివాహానంతరముకూడ ఆ రక్షకునికి తమ జీవితములను సమర్పించి వారి గృహము ప్రభువు ప్రేమించు నివాసముగా ఉండునట్లు తీర్మానించు
కొనవలెను.

Read and Learn More Telugu Bible Verses

2:3 ఈ వచనములో “ద్రాక్షారసము లేదు” అను మాటలు గమనించండి. అంటే ద్రాక్షారస కొరత ఏర్పడినదని దీని భావము. సరఫరా నిలిచిపోయినది. ఆ పరిస్థితిని గమనించిన యేసుతల్లి, ఆ సమస్యను తన కుమారునికి తెలిపెను. తన కుమారుడు ద్రాక్షారసమును సమకూర్చుటకు అద్భుతము చేయగలడని ఆమె ఎరుగును. గనుక ఆ విధముగాచేసి తన కుమారుడు అక్కడ చేరియున్న అతిధులందరికి తాను దేవుని కుమారునిగా బయలుపరచుకొనవలెనని ఆమె కోరికయనుటలో ఎట్టి సందేహము లేదు. లేఖనములలో ద్రాక్షారసము ఆనందమును సూచించుచున్నది. “వారికి ద్రాక్షా రసము లేదు” అని మరియ చెప్పిన మాటలలో – రక్షింపబడని స్త్రీ పురుషులను గూర్చిన కచ్చితమైన వివరణను తెలియజేయుచున్నది. అయితే అవిశ్వాసులకు నిజమైన శాశ్వతానందము లేనేలేదు.

అనేకులు క్రీస్తునందు విశ్వాసముంచుట (2:23-25) :

2:4 తన తల్లి మాటలకు యేసు నిరుత్సాహకరమైన సమాధానమిచ్చెను. కాని అది గద్దింపు మాత్రము కాదు. తెలుగులో ‘అమ్మా” అను మాటకు ఇంగ్లీషులో ‘ఉమెన్’ (Woman) అని వ్రాయబడెను. ఆ మాటకు “ఘనురాలైన స్త్రీ” లేక “అమ్మా” అని అర్ధము. మరియు “నాతో నీకేమి పని” అని చెప్పుటలో – దైవకార్యమును జరిగించుటయందు తాను తల్లియొక్క ఆజ్ఞకు లోబడుటకాక, పరలోకముందున్న తన తండ్రి చిత్తమునకు సంపూర్ణ విధేయతతో పనిచేయుటను ఆయన సూచించు చున్నాడు.

“నాతో నీకేమి (పని)?” అను మాట బైబిలులో అనేక మారులు చెప్పబడినది. ఈ మాటకు “మనకు పొందు ఏమిటి?” అని అర్ధము. అనగా “లేదు” అని జవాబు. ఈ మాటలను దావీదు సెరూయా కుమారులతో రెండు పర్యాయములు పలికెను ఆహాబు కుమారుడైన యెహోరామునకును, తనకు మధ్య ఎంత అగాధమున్నదో సూచించుచు ప్రవక్తయైన ఎలీషా రెండవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయములో ఈ మాటలు పలుకుచున్నాడు.

సాతానుకు క్రీస్తుతో లేక క్రీస్తుకు సాతానుతో పని ఏమి లేనట్లు తెలియజేయుచు దయ్యములుకూడ మూడు పర్యాయములు ఈ మాటలు పలికెను. ఈ సందర్భములో మనము గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయ మేమనగా పాపరహితమైన తన దైవత్వమునకును, పాపసహితమైన ఆమె మానవత్వమునకును ఎట్టి పొందులేనట్లును, వారిరువురి మధ్య గొప్ప వ్యత్యాసమున్నట్లు చూపించుటకు ప్రభువు ఈ మాటలు పలికెను.

యేసు మహిమపరచబడుట తాను కన్నులారా చూడవలెనని మరియు ఆశించినది. కాని అందుకు సమయము ఇంకను రాలేదని ఆయన ఆమెకు జ్ఞాపకము చేయు చున్నాడు. సమస్తమును జయించిన క్రీస్తుగా ఆయన లోకమునకు ప్రత్యక్షము కాకముందు ఆయన మొదటిగా బలిపీఠమును తప్పక ఎక్కవలసియున్నది. ఆ కార్యమును ఆయన కలువరి సిలువలో నెరవేర్చినాడు.

2:5 మరియ ఆయన మాటల భావమును అర్థము చేసికొని, “ఆయన మీతో చెప్పునది చేయుడి” అని సేవకులకు హెచ్చరించెను. తనకుగాని, మరి యే మానవునికి గాని విధేయులు కావలెనని ఆమె మనుష్యులకు ఆజ్ఞాపించలేదు. క్రీస్తును వారికి చూపించుచు ఆయనకే విధేయత చూపవలసినదని ఆమె వారికి చెప్పెను. ప్రభువైన యేసుయొక్క బోధలు క్రొత్త నిబంధనలో ఇయ్యబడినవి. అమూల్యమైన ఈ గ్రంథమును చదివినయెడల “ఆయన మీతో చెప్పునది చేయుడి” అని మరియ పలికిన ఈ మాటలే ఆమె ఆఖరి మాటలని మనము గ్రహించగలము.

2:6,7 పెండ్లి జరుగుచున్న ఆ స్థలములో ఆరు రాతి బానలుండెను. వాటిలో పదహారునుండి ఇరవైయేడు గ్యాలనుల నీరు పట్టును. కలిగిన అపవిత్రత నుండి తమ్మునుతాము శుద్ధిచేసికొనుటకు యూదా ప్రజలు ఈ నీటిని ఉపయోగింతురు. ఆ బానలను నీటితో నింపుడని ప్రభువైన యేసు ఆజ్ఞాపించెను. తక్షణమే పనివారు ఆయన చెప్పినట్లు చేసిరి. తాను అద్భుతమును చేయచూచినప్పుడెల్ల ప్రభువైన యేసుక్రీస్తు తనకు అందుబాటులోనున్న పరిస్థితులనే వినియోగించుకొనెను.

రాతి బాసలను సమకూర్చుటకును, వాటిని నీటితో నింపుటకును ఆయన మానవమాత్రులను అనుమతించెను. కాని ఏ మానవుడు ఎన్నడు చేయలేని కార్యమును ఆయన చేసెను. అనగా నీటిని ద్రాక్షారసముగా మార్చెను. రాతి బానలను నీటితో నింపినది. పనివారేగాని యేసు శిష్యులు కాదు. ఇట్లు చేయుటద్వారా మొదటి సూచకక్రియ చేయుటలో ప్రభువు ఏదో మోసము చేసెనను అపవాదుకు తావులేకుండ చేసెను. అంతేగాక నీటిలో ద్రాక్షారసము కలుపబడినదని ఎవరు చెప్పనేరకుండునట్లు ఆ రాతి బానలు అంచులమట్టుకు నీటితో నింపబడెను.

2:8 అద్భుతము జరిగిన తరువాత బానలోనున్న దానిని ముంచి విందు ప్రధాని యొద్దకు తీసికొనిపొండని ప్రభువు ఆజ్ఞాపించెను. తక్షణమే ఆ అద్భుతము జరిగినట్లు స్పష్టమగుచున్నది. అవును, కొంత సమయము జరిగిన తరువాత గాక, ఆ మరుక్షణమే నీరు ద్రాక్షారసముగా మారిపోయెను.

2:9 ఆ విందులో భోజనమును, బల్లలను ఏర్పాటు చేయవలసిన బాధ్యత విందు ప్రధానిదే. కాని ద్రాక్షారసమును రుచి చూచిన వెంటనే, అసాధారణమైన సంభవమేదో సంభవించియుండునని అతడు తలంచెను. అయితే అది ఎక్కడ నుండి వచ్చెనో అతనికి తెలియలేదు. అది బహుశ్రేష్ఠమైనదని అతడు తలంచి వెంటనే దానిని గూర్చి పెండ్లికుమారుని విచారించెను. (తూర్పు దేశములో అనేక మారులు నీరు కలుషితమై త్రాగుటకు పనికిరాక, ప్రమాదభరితముగా నుండును. ఆ దేశములలో ద్రాక్షారసము అతి సామాన్యమైన పానీయము, అయితే కొద్ది మోతాదులో వాడుట పాపముగా పరిగణింపలేదు. నేడు లోకములో కలుగుచున్న అనేక సమస్యలకు కారణము ఈ ద్రాక్షారసమును దుర్వినియోగ పరుచుటయే).

నీరు ద్రాక్షారసమగుట మొట్టమొదటి సూచకక్రియ – నీటిని ద్రాక్షారసముగా మార్చుట (2:1-11) :

అయితే నేటి దినములలో ద్రాక్షారసముపట్ల నిజ విశ్వాసియొక్క వైఖరి ఏమి? కొన్నిసార్లు వైద్యులు ద్రాక్షారసమును ఔషధముగా నిర్ణయించిరి. ఇది క్రొత్త నిబంధన బోధకు పూర్తిగా అనుగుణ్యముగా నున్నది (1 తిమోతి 5:23). దానిని మితిమీరి ఉపయోగించుట వలన కలిగెడి భయంకరమైన ఫలితములనుబట్టి అనేకమంది విశ్వాసులు దానిని పూర్తిగా నిషేధించిరి.

మత్తుపానీయములకు ఎవరైనను బానిసయగు అవకాశము కలదు. అయితే ఆ ప్రమాదమునుండి బయట పడవలెనంటే దానిని పూర్తిగా విడిచిపెట్టుటయే ఏకైకమార్గము. ఇతరులపై తన క్రియలు ఏ రీతిగా ప్రభావము చూపుచున్నవో విశ్వాసి ఎల్లప్పుడు గమనించుకొనవలెను. ఒకవేళ ఒక విశ్వాసి మత్తు పానీయము సేవించుచుండగా, రక్షింపబడని వ్యక్తి అతని చూచిన యెడల ఎంత చెడ్డ సాక్ష్యము పొందునో గదా! విందు ప్రధాని ఆ ద్రాక్షారసమును చూచినప్పుడు అది మంచిదని గ్రహించెను. అతనికియ్యబడిన ఆ రసము కేవలము ద్రాక్షరసమని చెప్పలేము.

2:10 కాని ఇప్పుడైతే అది సామాన్యమైనది కాదని అతడు గ్రహించెను. ఈ సమయములో అతడు పలికిన మాటలు – ప్రభువైన యేసు కార్యములకును, మానవుని కార్యములకును గల భేదమువైపు మన మనస్సులను ఆకర్షించుచున్నవి. సహజముగా పెండ్లి విందులో జరుగునదేమనగా – మొదట మంచి ద్రాక్షారసమును వడ్డించెదరు. ఎందుకనగా, జనులు మత్తుగొనకముందు దాని మంచిచెడులను దాని రుచి, వాసనలను బట్టి గ్రహించగలరు. ఆఖరున మత్తుగా నున్నప్పుడు ద్రాక్షారసముయొక్క నాణ్యతను గూర్చి వారు పట్టించుకొనరు. కాని ఈ విందులో శ్రేష్ఠమైన ద్రాక్షారసము ఆఖరిలో వడ్డించబడును.

ఇందులో మనకొక ఆత్మీయ భావము కలదు. లోకము సహజముగా ప్రారంభములో శ్రేష్ఠమైనదానినే ఇవ్వజూపును. మరి ముఖ్యముగా యౌవనస్థులకు బహు ఆకర్షణీయమైనవాటినే యివ్వజూపును. క్షణికానందము కలిగించువాటియందు తమ జీవితములను వ్యర్ధపరచుకొనిన తరువాత ఈ లోకము అతనికిచ్చునది మష్టేగాని మరేమికాదు. కాని నిజవిశ్వాసియొక్క జీవితము దీనికి పూర్తిగా భిన్నమైనది. అది అన్ని వేళలలో శ్రేష్ఠమైన దానినే పొందును. కాని క్రీస్తు అంతము వరకు శ్రేష్ఠమైన దానినే ఇచ్చును.

ఈ లేఖన భాగము యూదా జాతితో ప్రత్యక్ష సంబంధము కలిగియున్నది. యూదా జనాంగమునందు నిజమైన ఆనందము ఎంతమాత్రము లేదు. యూదా ప్రజలు వ్యర్థమైన ఆచారములను, సాంప్రదాయములను అనుసరించుచుండిరి. కాని వారి జీవితములు నిస్సారమైనవి. దైవికమైన ఆనందమునకు వారు దూరస్థులు. గనుకనే తనయందు విశ్వాసముంచుమని ప్రభువు వారికి చెప్పగోరెను. వారి నీతి బాహ్యమైన స్థితిని పూర్ణ సంతోషము గలదానిగా ప్రభువు మార్చగలడు. ఆచారము సాంప్రదాయము లనెడి యూదా నీరు, క్రీస్తునందు సంతోషభరితమైన, నిక్కమైన ద్రాక్షారసముగా మారగలదు.

2:11 “పేతురు సువార్త” అని చెప్పబడుచున్న ఒక అవాస్తవికమైన గ్రంథములో ప్రభువైన యేసుక్రీస్తు బాల్యములో ఎన్నో అద్భుతములు చేసినట్లు చెప్పబడెను. కాని “యేసు ఈ మొదటి సూచకక్రియను చేసెను” అను మాటలు పైన చెప్పబడిన దానిని కొట్టివేయుచున్నవి. బాల్యములో ప్రభువు అద్భుతములు చేసినట్లు ఆరోపించుట కేవలము దేవదూషణ చేయుటయే. దీనిని ముందే ఎరిగియుండి ప్రభువు జీవితములోని ఈ కాలమును (బాల్యమును) పరిశుద్ధాత్మ దేవుడు “ఈ మొదటి సూచకక్రియ చేసి” అను మాటలతో మరుగుపరచి దురభిప్రాయమునకు చోటు లేకుండ చేసెను.

నీటిని ద్రాక్షారసముగ మార్చుట యనునది ఒక సూచకక్రియ. అది ప్రాధాన్యతతో కూడిన ఆశ్చర్యకార్యము. మరియు అది ఒక ఆత్మీయ భావముతో కూడిన దైవ కార్యము. ప్రభువుయొక్క అద్భుత కార్యములు యేసు దేవుని అభిషిక్తుడని ఋజువు చేయుచున్నవి. ఆ అద్భుతము చేయుటద్వారా ఆయన తన మహిమను ప్రత్యక్ష పరచెను. అంతేకాదు, శరీరమందు ప్రత్యక్ష పరచబడిన నిజమైన దేవుడుగా ఆయన మానవులకు బయలుపరచుకొనెను. ఆయన చేసిన ఆ అద్భుతమును బట్టి ఆయన శిష్యులు ఆయనయందు నమ్మికయుంచిరి. ఒక రీతిగా వారు ఇంతకు ముందే ఆయనయందు విశ్వాసముంచిరి. గాని ఇప్పుడు ఆ విశ్వాసము బలపరచబడెను. గనుక మరి ఎక్కువగా ఆయన యందు విశ్వాసముంచిరి.

క్రీస్తు యెరూషలేములో దేవాలయమును శుద్ధిచేయుట (2:12-17):

2:12 తరువాత యేసు కానా విడిచి తన తల్లితోను, సహోదరులతోను, తన శిష్యులతోను కలసి కపెర్నహూమునకు వెళ్ళెను. వారు అక్కడ కొన్ని దినములు మాత్రమే ఉండి, ఆ తరువాత వెంటనే యెరూషలేముకు వెళ్ళెను.

2:13 ప్రభువు యెరూషలేముకు వచ్చుట ఇదే మొదటి సారియని ఈ వచనము ద్వారా మనము గ్రహించవచ్చును. ప్రభువు తన బహిరంగ పరిచర్యను పస్కా పండుగ సమయములో మందిరమును శుద్ధిచేయుటద్వారా ప్రారంభించి, మందిరమును శు ద్ధిచేయుట ద్వారానే ముగించుచున్నాడు (మత్తయి 2:12, 13; మార్కు 11:15-18; లూకా 19:45, 46 పోల్చండి) ఐగుప్తు దాస్యమునుండి ఇశ్రాయేలీయులను విమో చించి, ఎర్రసముద్రము దాటించి, ఎడారిగుండా నడిపించి, వాగ్దానభూమిలో ప్రవే పెట్టిన ఆ సమయమును జ్ఞాపకార్థముగా ప్రతి సంవత్సరము జరుపుకొను పండుగే పస్కాపండుగ, మొట్టమొదట జరుపబడిన పస్కాపండుగను గూర్చి నిర్గమ 12 అధ్యా॥లో వివరించబడినది. భక్తిగల ఒక యూదునిగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రాముఖ్యమైన ఆ దినమున యెరూషలేము చేరెను.

2:14 ఆలయము ఒక సంతగా మారిపోయినట్లు ఆయన దానిలో ప్రవేశించిన వెంటనే కనుగొనెను. ఎద్దులు, గొట్టెలు, పావురములు దేవాలయములో అమ్మబడు చుండెను. ఆరాధించుటకు వచ్చువారి ఆరాధన నిమిత్తము జంతువులు, పక్షులు అక్కడ అమ్మబడుచుండెను. రూకలు మార్చువారు సహితము తమ వ్యాపారమును అక్కడ జరుపుచుండిరి. రూకలు మార్చువారు చేయు పని ఏమనగా, విదేశీ యాత్రికుల నుండి వారి రూకలు (డబ్బు) తీసికొని, యెరూషలేములో వాడుకలోనున్న రూకల నిచ్చెదరు. దీనివలన యాత్రికులు దేవాలయపు పన్ను కట్టగలుగుటకు వీలగుచున్నది. ఈ రీతిగా వారు అక్రమముగా సొమ్ము సంపాదించెడివారు.

నీరు ద్రాక్షారసమగుట – Bible Verses Chapter 2

2:15 ఈ సమయములో ప్రభువు వాడిన కొరడా బహుశా సన్నని త్రాళ్ళతో తయారు చేయబడియుండవచ్చును. కాని ఆ కొరడాతో ప్రభువు ఎవరిని దండించినట్లు వ్రాయ బడలేదు. అయితే ప్రభువు చేతిలోని ఆ కొరడా ఆయనకుగల అధికారమునకు ఆనవాలైయున్నది. ఆయన కొరడా ఝళిపించుచు ఆలయములో వ్యాపారము చేయు వారిని బయటికి తోలివేసి, చిల్లర మార్చువారి బల్లలను పడద్రోసెను.

2:16 పావురము పేదల అర్పణ. కాని ఈ పావురములనమ్ము వర్తకులనుకూడ బయటికి వెళ్ళిపొమ్మని ఆయన ఆజ్ఞాపించెను. అవును, దేవుని ఇంటిని వ్యాపారపుటిల్లుగా మార్చుట సరికాదు. మత కార్యములను ధనవంతులగుటకు సాధనములుగా ఉపయోగించకూడదని అన్ని యుగములలో దేవుడు తన ప్రజలను హెచ్చరించెను. ఆయన చేసిన ఈ కార్యములన్నింటిలో ఎట్టి క్రూరత్వముగాని, అన్యాయముగాని లేదు కాని, ఆయనయొక్క పవిత్రతకును, నీతిమత్వమునకును అవి ప్రతీకలైయున్నవి.

2:17 మందిరములో జరుగుచున్నదానిని చూచిన ఆయన శిష్యులు మెస్సీయ వచ్చినప్పుడు దేవుని సంగతులను గూర్చి ఆయనకుగల ఆసక్తినిగూర్చి కీర్తన 69:9లో వ్రాయబడిన “నీ యింటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది” అను మాటలు జ్ఞాపకము చేసికొనిరి. దైవారాధన పవిత్రమైనదిగా ఉండవలెనను దృఢ నిశ్చయతను ప్రభువైన యేసు బయలు పరచుటను శిష్యులు చూచిరి అంతేగాక కీర్తనకారుడు ఎవరినిగూర్చి వ్రాసెనో ఆ వ్యక్తి ఈయనే (యేసు) అని శిష్యులు గ్రహించెను.

నిజ విశ్వాసియొక్క దేహము పరిశుద్ధాత్మకు ఆలయమైయున్నదని మనము జ్ఞాపకము చేసికొనవలెను. యెరూషలేములోని దేవాలయము పవిత్రముగా ఉండవలె నని ప్రభువైన యేసుక్రీస్తు ఎంతటి ఆసక్తి కలిగియుండెనో, ఆ విధముగనే మనముకూడ మన దేహములను నిరంతరము శుద్ధి చేసికొనుటకు కూడ జాగ్రత్త వహించవలెను.

తన మరణ పునరుత్థానములనుగూర్చి యేసు ముందుగా చెప్పుట (2:18-22) :

2:18,19,20,21 యూదా ప్రజలు ప్రభువునుండి ఒక అద్భుత కార్యమునో, సూచకక్రియనో చూడవలెనను ఉద్దేశ్యముగల వారివలె కనిపించుచున్నారు. అయినను, ప్రభువైన యేసు అద్భుతములను ఒకదానివెంట మరొకటి జరిగించినను వారి హృదయములు ఆయనపట్ల మూసివేయబడెను. ఈ వచనములో దేవాలయములోని వ్యాపారులను బయటికి నెట్టివేయుటలో ఆయనకుగల అధికారమును వారు ప్రశ్నించిరి. మరియు తానే మెస్సీయ అని ఋజువుపరచుటకు ఒక సూచకక్రియ జరిగించుమని కూడ వారు కోరిరి. అందుకాయన తన మరణ పునరుత్థానములను గూర్చిన ఆశ్చర్యకర మైన సంగతిని తెలియజేసెను.

వారు తన పరిశుద్ధాలయమును పడగొట్టెదరనియు, తాను మూడు దినములలో తిరిగి లేపెదనని వారితో చెప్పెను. ఈ వచనములో ప్రభువుయొక్క దైవత్వము మరొకసారి మనకు కనిపించుచున్నది. “మూడు దినములలో దానిని తిరిగి లేపెదను” అని దేవుడు మాత్రమే చెప్పగలడు. కాని యూదులు ఆయనను గ్రహించలేదు. ఆత్మీయ సంగతులలో కంటే భౌతికమైన విషయములలో వారు ఎక్కువ ఆసక్తి కలిగియుండిరి. ఆలయమంటే యెరూషలేములో నున్న హేరోదుయొక్క ఆలయమునుగూర్చిమాత్రమే వారు ఆలోచించుచుండిరి. దానిని కట్టించుటకు సుమారు నలభై యారు సంవత్సరములు పట్టినది.

తన మరణ పునరుత్థానములనుగూర్చి యేసు ముందుగా చెప్పుట (2:18-22) :

అయితే దానిని తిరిగి మూడు దినములలో ఎట్లు కట్టగలడో వారు గ్రహించలేదు. అయితే ప్రభువైన యేసు తన స్వంత దేహమును గూర్చి మాటలాడు చున్నాడు. ఆయన దేహము దైవత్వముయొక్క సర్వపరిపూర్ణత నివసించు పరిశుద్ధ స్థలమైయున్నది. ఈ యూదులు యెరూషలేములోని ఆలయమును ఎట్లు అపవిత్ర పరచిరో ఆ విధముగనే ప్రభువును మరికొద్ది సంవత్సరములలో మరణమునకు అప్పగించెదరు.

2:22 ఆయన సిలువ వేయబడి, మరణమునుండి తిరిగిలేచిన తరువాత, తాను మూడవ దినమున తిరిగి లేచెదనని ప్రభువు చెప్పిన మాటలను, ప్రభువు యొక్క శిష్యులు జ్ఞాపకము చేసికొనిరి. ఇటువంటి అద్భుతమైన ప్రవచనము కళ్ళెదుట నెరవేరుట చూచి, ఆయన శిష్యులు లేఖనములను, ప్రభువు చెప్పిన మాటలను విశ్వసించిరి.

అనేక మారులు మనము గ్రహించుటకు కష్టమైన సత్యములను బైబిలు గ్రంథములో మనము చూచుచున్నాము. కాని దేవుని వాక్యమును మన హృదయములో దాచుకొన వలెనని ఈ సందర్భములో మనము నేర్చుకొనుచున్నాము. ఆ లేఖనములు ప్రస్తుతము మనకు అర్థము కాకపోవచ్చును. కాని కొన్ని దినములైన తరువాత ప్రభువు వాటిని మనకు వివరించును. “వారు లేఖనములను విశ్వసించి” అని ఈవచనములో వ్రాయబడిన భావమేమనగా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును గూర్చి పాత నిబంధనలో వ్రాయబడిన ప్రవచనములను వారు విశ్వసించిరి.

అనేకులు క్రీస్తునందు విశ్వాసముంచుట (2:23-25) :

2:23 పస్కా పండుగ సమయములో యెరూషలేములో ప్రభువైన యేసు చేసిన సూచకక్రియలు, అద్భుతముల ఫలితముగా అనేకులాయనయందు విశ్వాసముంచిరి. అనగా తాము ఆయనను అంగీకరించినట్లు చెప్పుకొనిరి. కాని చెప్పినదానికి, వారి ప్రవర్తనకు ఎట్టి పొందిక లేదు. వారు క్రీస్తును వెంబడించుట కేవలము పైకి తమ్మును తాము కనుపరచుకొనుటకే. నేడు లోకములో జరుగుచున్నది కూడ ఇదే. అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసముద్వారా తిరిగి జన్మించిన అనుభవము లేకపోయినను తాము క్రైస్తవులమని చెప్పుకొనుచున్నారు.

2:24, 25 అనేకులాయనయందు విశ్వాసముంచినప్పటికిని, (23వ) యేసు వారిని విశ్వసించలేదు. ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. వారు కేవలము ఆసక్తితో మాత్రమే ఆయనయొద్దకు వచ్చుచున్నారని ఆయనకు ఎఱుకే. ఒక వింతైన అనుభూతి కొరకే వారు ఎదురు చూచుచుండిరి. “ఆయన అందరిని ఎరిగినవాడు” ఆయన వారి ఆలోచనలను, ఉద్దేశ్యములను ఎరిగినవాడు. వారు ఆ రీతిగా ప్రవర్తించుటలో గల కారణములను కూడ ఆయన ఎరుగును.

అనేకులు క్రీస్తునందు విశ్వాసముంచుట (2:23-25) :

అంతేగాక వారి విశ్వాసము నిజమైనదా? లేక అనుకరణా? అనునదికూడ ఆయన ఎరుగును. ఒకని హృదయమును ప్రభువు ఎరిగినంతగా మరి ఏ మానవుడు ఎరుగలేడు. ఒకని హృదయమును ఎరుగుటలో లేక గ్రహించుటలో ప్రభువుకు ఎవరు బోధించనవసరంలేదు. లేక జ్ఞానోదయము కలిగించనవసరం లేదు. మానవునియందు ఏమున్నదో, అతడు అట్లెందుకు ప్రవర్తించు చున్నాడో అనువాటి విషయమైన పరిపూర్ణ జ్ఞానము ఆయనకు కలదు.

యేసుక్రీస్తుయొక్క దైవత్వము – Bible Verses Chapter 1 in Telugu

మొదటి అధ్యాయము

యేసుక్రీస్తుయొక్క దైవత్వము

ఉపోద్ఘాతము :
యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందగలరని చదువరులు ఎరుగు నిమిత్తము యోహాను ఈ సువార్తను వ్రాసెను (20:31).
యోహాను సువార్తలో ఏడు బహిరంగ అద్భుతములు లేక సూచకక్రియలు కలవు. వాటిలో ప్రతి ఒక్కటి యేసే దేవుడని నిరూపించుటకు ఉద్దేశించబడినవి.
అవి :

  • గలిలయలోని కానా అను ఊరిలో నీటిని ద్రాక్షారసముగా మార్చుట (2:9).
  • ప్రధాని కుమారుని స్వస్థపరచుట (4:46-54).
  • బేతెస్థ కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది ఏండ్లనుండి పడియున్న వ్యాధిగలవానిని స్వస్థపరచుట(5:2-9).
  • ఐదువేలమందికి ఆహారము పెట్టుట 6:1-14).
  • సముద్రములో రేగిన తుఫానునుండి తన శిష్యులను కాపాడు నిమిత్తము యేసు గలిలయ సముద్రముపై నడుచుట (6:16 – 21).
  • పుట్టు గ్రుడ్డివానిని బాగుచేయుట (9:1-7).
  • చనిపోయిన లాజరును మరణమునుండి తిరిగిలేపుట (11:1-14).

ప్రభువు బహిరంగముగా ప్రజల యెదుట చేసిన ఈ ఏడు సూచకక్రియలేగాక వీటితోపాటు తాను పునరుత్థానుడైన తరువాత ప్రత్యేకముగా తన శిష్యులకొరకు ఎనిమిదవ అద్భుత కార్యము చేసెను. అదేమనగా – చేపలు పట్టుటయే.

Read and Learn More Telugu Bible Verses

చార్లెస్ ఆర్, ఎర్డ్మన్ అను భక్తుడు యోహాను సువార్తను గూర్చి ఈ రీతిగా చెప్పెను : బైబిలు గ్రంథములో చెప్పబడిన మరి ఏ పుస్తకముకంటెను ఈ సువార్త అనేకులు క్రీస్తును వెంబడించునట్లు ప్రోత్సాహపరచెను. ప్రభువుయొక్క యథార్థమైన పరిచర్య చేయునట్లు అనేకులను ప్రేరేపించెను. సంక్లిష్టమైన ఎన్నో సమస్యలను అనేకమంది బైబిలు పండితులయెదుట ఉంచెను.

రచయితను గూర్చిగాని ఆతని పేరు గాని ఈ సువార్తలో ఎక్కడా చెప్పబడలేదు. అయితే పన్నెండుమంది అపొస్తలులలో ఒకడైన యోహాను దీనిని వ్రాసెనని నమ్ముటకు అనేక మంచి కారణములు కలవు. ఉదాహరణకు దీని రచయిత యూదుడై యుండెను. ఎట్లనగా రచనాశైలి, దానిలో ఉపయోగించిన శబ్దసముదాయము, యూదా మతాచారములు దాని లక్షణములతో అతనికిగల పరిచయము, ఈ సువార్తలో ప్రతిబింబించెడి పాత నిబంధన లేఖనములు – ఇవన్నియు దీని గ్రంథకర్త యూదుడని తెలియజేయుచున్నవి. ఇతడు పాలస్తీనాలో నివసించిన ఒక యూదుడు (1:28; 2:1,11; 4:46; 11:18,54; 21:1,2). మరియు యెరూషలేమును గూర్చియు దేవాలయమునుగూర్చియు అతనికి మంచి పరిచయము కలదు (5:2; 9:7; 18:1; 19:13, 17, 20, 41; మరియు 2:14-16; 8:20; 10:22).

ఈ సువార్తలో తాను వివరించినవాటన్నింటికి అతడు ప్రత్యక్షసాక్షియైయున్నాడు. అనేక ప్రదేశముల, వ్యక్తుల, సమయముల, అలవాటులను గూర్చిన వివరణలు ఈ సువార్తలో అనేకములు కలవు (4:46; 5:14; 6:59, 12:21; 13:1; 14,5,8; 18:6; 19:31). మరియు ఇతడు అపొస్తలుడైయుండెను. యేసుక్రీస్తును గూర్చియు, ఆయనయొక్క ఆంతరంగిక శిష్యులను గూర్చియు అతడు బాగుగా ఎరిగి యున్నాడు. (6:19,60,61; 12:16, 13:22, 28, 16:19).

అయితే ఇతర అపొస్తలులయొక్క పేర్లను పేర్కొని తన పేరు వెల్లడిచేయకుండునట్లు జాగ్రత్త వహించెను. మరియు 13:23; 19:26; 20:2; 21:7,20 లో పేరు చెప్పబడని ఒక వ్యక్తి గలడు. అతడు నిస్సందేహముగా ఈ అపొస్తలుడైన యోహాను కావచ్చునని నమ్మబడుచున్నది. అంతేగాక ఈ రచయిత ప్రత్యక్షసాక్షి యనుటకు ప్రాముఖ్యమైన మరి మూడు లేఖన
భాగములను గమనించండి -1:14; 19:35 మరియు 21:24.

మన ప్రభువుయొక్క భూలోక పరిచర్యను గూర్చిన వరుసక్రమము ఈ సువార్త నుండియే గైకొనబడినది. తక్కిన మూడు సువార్తలలో ప్రభువుయొక్క పరిచర్యకాలము ఒక్క సంవత్సరమునకే పరిమితమైయున్నట్లు కనిపించుచున్నది. కాని యోహాను సువార్తలో పేర్కొనబడిన సాంవత్సరిక పండుగలు, ప్రభువుయొక్క బహిరంగ పరిచర్య కాలము ఇంచుమించు మూడు సంవత్సరముల కాలవ్యవధిని తెలియజేయుచున్నవి. ఈ వాక్యభాగములు గమనించండి : మొదటిది పస్కాపండుగ (2:12,13); “పండుగ” (5:1) ఇది పూరీము అను పస్కా పండుగ కావచ్చును. రెండవది (లేక మూడవది) పస్కా పండుగ (6:4); “పర్ణశాలల పండుగ” (7:2); “ఆలయప్రతిష్ఠ పండుగ” (10:22); ఆఖరిది “పస్కా పండుగ” (12:1).

యోహాను తన సువార్తలో కాలమును గూర్చి కూడ తేటగా తెలియజేసెను. కాని తక్కిన ముగ్గురు సువార్తికులు సమయాన్ని గూర్చి చెప్పినప్పుడు “ఇంచు మించు” అను పదము వాడిరి. యోహానయితే “ఒంటి గంటకు” (4:52), “మూడవ దినము” (2:1), “రెండు దినములు” (10:22), “ఆరు దినములు” (12:1) అని కచ్చితముగా వ్రాసెను.
ఈ సువార్తలో వాడబడిన శైలి, మాటలు బహు విశేషమైనవి. ఇట్టి శైలి, మాటలు ప్రత్యేకమైనవైయుండి యోహాను వ్రాసిన పత్రికలలోనే కనిపించును. దీనిలోని వచనములు సంక్షిప్తముగాను, బహు సులభశైలిలోను ఉన్నవి.

అనేకులు క్రీస్తునందు విశ్వాసముంచుట (2:23-25) :

ఇది గ్రీకు భాషలో వ్రాయబడినప్పటికిని దీనిలో హెబ్రీ భాషయొక్క ఆలోచన ధోరణి కలదు. సహజముగా వచనము, దానిలోని సత్యము అంత గంభీరముగా నుండును. తక్కిన సువార్తల కంటె ఈ సువార్తలో పదసముదాయము చాలా తక్కువ. కాని వాటిలో బహు లోతైన భావము కలదు. ఈ సువార్తలో చెప్పబడిన ప్రాముఖ్యమైన కొన్ని మాటలు, అవి ఎన్ని మారులు వాడబడినది మనము గమనించవలెను : తండ్రీ (118), విశ్వసించు (100), లోకము (78), ప్రేమ (45), జీవము (37), సాక్ష్యము (47), వెలుగు (24).

ఈ సువార్తలో గుర్తింపదగిన మరొక ముఖ్య లక్షణమేమనగా – “ఏడు” అను సంఖ్య. దాని గుణిజములు సారిసారి మనకు కనిపించును. ఈ సంఖ్యకు లేఖన మంతటిలో పరిపూర్ణత మరియు ముగింపు లేక నెరవేర్పు అను భావము ఇయ్యబడినది (ఆదికాండము 2:1-3 చూడండి). ఈ సువార్తలో దేవుని ఆత్మ యేసుక్రీస్తునందు దేవుని ప్రత్యక్షతను పరిపూర్ణము చేయుచున్నాడు. అందునుబట్టి “ఏడు” అను సంఖ్య పదే పదే మనకు కనిపించుచుండును.

“నేనే” అను మాట ఏడు విధములుగా ఈ సువార్తలో మనకు కనిపించుచున్నది. గమనించండి: “జీవాహారము నేనే” (6:35, 41,48,51), “నేను లోకమునకు వెలుగును”(8:12; 9:5), “ద్వారమును నేనే” (10:7,9), “నేను గొజ్జెలకు మంచి కాపరిని” (10:11,14), “పునరుత్థానమును జీవమును నేనే” (11:25), “నేనే మార్గమును, సత్యమును, జీవమును (14:6), “నేను ద్రాక్షావల్లిని” (15:1,5), ఇవిగాక మరి ఏడు “నేను” లు కలవు (4:26; 6:20; 8:24, 28, 58; 13:19, 18:5, 8).

ఆరవ అధ్యాయములో జీవాహారమునుగూర్చి చెప్పబడిన “ఆహారము” (Bread) అను పదము ఇరువదిఒక్కమారులు గ్రీకు భాషలో చెప్పబడినది. ఇది ఏడుయొక్క గుణిజము (7×3=21). కొన్ని మారులు “రొట్టెలు” (Loaves) అనియు, కొన్ని మారులు “ఆహారము” (Bread) అను భావములతో చెప్పబడెను. “జీవాహారము” అను మాటలో “పరలోక ఆహారము” అని ఏడు పర్యాయములును “పరలోకమునుండి దిగివచ్చిన ఆహారము” అని ఏడు పర్యాయములును చెప్పబడెను.

యోహాను తన సువార్తను “వాక్యము” అను మాటతో ప్రారంభించుచున్నాడు. కాని, వాక్యమనగా ఎవరు? ఆ వాక్యము ఏమైయున్నది? అను విషయమును గూర్చి ప్రారంభములో అతడు వివరించలేదు. సహజముగా మన భావములను ఇతరులకు వ్యక్తపరచు సంభాషణల సముదాయమే వాక్యము. కాని ఇక్కడ యోహాను సంభాషణ లనుగూర్చి గాక, ఒక వ్యక్తిని గూర్చి మాటలాడుచున్నాడు. ఆ వ్యక్తి దేవుని కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు.

ఆయనను యోహాను “వాక్యము” అని సంబోధించెను. ఎందుకనగా, ప్రభువైన యేసుక్రీస్తునందు దేవుడు మానవాళికి తన్నుతాను సంపూర్ణ ముగా బయలుపరచుకొనెను. క్రీస్తు ఈ లోకమునకు వచ్చుటద్వారా దేవుడు ఎట్టివాడై యున్నాడు లేక ఏమైయున్నాడను సత్యమును ఆయన మనకు బయలుపరచెను. అంతే గాక కలువరి సిలువలో మనకొరకు మరణించుటద్వారా దేవుడు మనలను ఎంతగా ప్రేమించెనను దానిని క్రీస్తు మనకు బోధించెను. ఈ రీతిగా క్రీస్తు మానవునికి దేవుని జీవవాక్యమైయున్నాడు. అనగా దేవుని ఆలోచనలను బయలుపరచువాడైయున్నాడు.

వాక్యమైయున్న ప్రభువైన యేసు : (1:1-5) :

1:1 ప్రభువు నిత్యత్వములోనే తన ఉనికి కలిగియున్నాడు. మానవుని ఆలోచన గతములో ఎంత వెనుకకు వెళ్ళగలదో, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన ఎన్నడు సృజింపబడినవాడుకాడు. ఆయన ఆది (ప్రారంభము) లేనివాడు.

అందుకు ఈ వచన భాగమును గమనించండి : “వాక్యము దేవునియొద్ద ఉండెను” అనగా, ఆయన ఒక ప్రత్యేకమైన విశిష్టమైన వ్యక్తి. ఆయన దేవునితో జీవించియున్న ఒక వాస్తవికమైన వ్యక్తి. ఆయన దేవునియొద్దనుండుటమాత్రమే గాక, తనంతట తానే దేవుడైయున్నాడు. దేవుడొక్కడే. మరియు ఆ దైవత్వములో ముగ్గురు వ్యక్తులు అనగా తండ్రి-కుమార-పరిశుద్ధాత్మ ఉన్నారనియు బైబిలు మనకు బోధించుచున్నది.

1.2 ఈ ముగ్గురు వ్యక్తులు కలసి దేవుడై యున్నారు. కాని ఈ వచనములో దైవత్వములోని యిద్దరు వ్యక్తులు మాత్రమే పేర్కొనబడిరి. వారే తండ్రియైన దేవుడు, కుమారుడైన దేవుడు. “యేసుక్రీస్తు దేవుడైయున్నాడ”ని ఈ సువార్తలో చెప్పబడిన అనేక వచనములలో ఇది మొదటి వచనము. ఆయన దేవుని వంటివాడనియు, ఆయనకూడా ఒక దేవుడ నియు చెప్పుట సరికాదు. కాని “ఆయన దేవుడు” అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది. మొదట చెప్పిన విషయమునే ఈ రెండవ వచనముకూడా చెప్పినట్లు కనిపించ వచ్చును.

కాని అది సత్యముకాదు. క్రీస్తుయొక్క వ్యక్తిత్వమునకును, ఆయన దైవత్వ మునకును ఆది లేదని ఈ వచనము చెప్పుచున్నది. ఆయన బేత్లహేములో శిశువుగ జన్మించినప్పుడు మాత్రమే ఒక వ్యక్తి కాలేదు. లేక నేడు అనేకులు చెప్పుచున్నట్లు పునరుత్థానము తరువాత ఆయన ఒక దేవుడు కాలేదు. నిత్యత్వమంతటిలో నుండి ఆయన దేవుడైయున్నాడు.

1:3 యేసుక్రీస్తు ఒకరిచేత సృష్టింపబడినవాడు కాదు. కాని ఆయన సమస్తమును సృష్టించిన సృష్టికర్త. మానవులను, జంతుజాలమును, గ్రహములను దేవదూతలను అనగా – దృశ్యమైన, అదృశ్యమైన వాటన్నింటిని ఆయనే సృష్టించెను. సృష్టింపబడిన దేదైనను ఉన్నయెడల అది ఆయనద్వారానే సృష్టింపబడెను. సృష్టికర్తగా సమస్త సృష్టికి ఆయన పైవాడైయున్నాడు. వాస్తవముగా సృష్టి కార్యములో దేవత్వములోని ముగ్గురు వ్యక్తులు కలసియున్నారు. ఈ వచనమును గమనించండి: ఆదియందు ఆయన భూమ్యాకాశములను సృజించెను (ఆది 1:1). “దేవుని ఆత్మ జలములపైన అల్లాడు చుండెను” (ఆది 1:2).

వాక్యమైయున్న ప్రభువైన యేసు : (1:1-5) :

“సర్వమును ఆయన (యేసుక్రీస్తు) ద్వారాను, ఆయననుబట్టియు సృజింపబడెను” (కొలొస్స. 1:16).

1:4 ఆయన జీవమునకు మూలమైయుండెను. ఇక్కడ “జీవము” అను మాటలో “భౌతిక జీవము” మరియు “ఆత్మీయ జీవము” అను భావము కూడా కలదు. ఈ లోకములో మనము పుట్టినప్పుడు భౌతిక జీవమును పొందియున్నాము. అయితే మనము తిరిగి జన్మించినప్పుడు మాత్రమే ఆత్మీయ జీవమును పొందుదుము. అయితే ఈ రెండు జీవములు ఆయననుండియే కలుగుచున్నవి మనకు జీవమును అనుగ్రహిం చిన ఆయనే మానవులకు వెలుగైయున్నాడు. మానవునికి ఈ లోకములో అవసరమైన నడుపుదలను, మార్గమును ఆయనే చూపును. జీవించుట అనునది ఒక సత్యము. కాని, ఎలా జీవించవలెను?

“ఈ జీవముయొక్క నిజమైన ఉద్దేశ్యమేమి?” అను సత్యమును ఎరుగుట, అనగా పరలోకపు మార్గము ఎరుగుట ప్రాముఖ్యమైన సత్యము. మనకు జీవముననుగ్రహించిన ఆయనే. మనము పయనించుచున్న మార్గమునకు అవసరమైన వెలుగునుగూడ అనుగ్రహించుచున్నాడు.

ఈ ప్రారంభ అధ్యాయములో మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క అద్భుతమైన ఏడు బిరుదులు కలవు. అవి : వాక్యము (1,14); వెలుగు (5,7), దేవుని గొట్టెపిల్ల (29,36); దేవుని కుమారుడు (34,49); క్రీస్తు (మెస్సీయ 41); ఇశ్రాయేలు రాజు (49); మనుష్యకుమారుడు (51). ఈ ఏడింటిలో మొదటి నాలుగు బిరుదులు ఒక్కొక్కటి రెండుమారులు. తక్కిన మూడు బిరుదులు ఒక్కొక్కసారి మాత్రమే పేర్కొనబడినవి. మొదటి నాలుగు బిరుదులు సార్వత్రికముగను, తక్కిన మూడు బిరుదులు దేవుని పురాతన ప్రజలైన ఇశ్రాయేలీయులకును అన్వయింపబడియున్నవి.

1:5 పాపము లోకములో ప్రవేశించుటను గూర్చి ఈ వచనములో మనము చూడ గలము. పాపప్రవేశము మానవ జాతియొక్క మనస్సునకు చీకటి క్రమ్మజేసెను. మానవుడు దేవుని ఎరుగకుండునట్లును, దేవుని ఎరుగవలెననెడి కోరిక లేకుండ ఈ చీకటి అతనిని అంధకారములో ముంచివేసినది. అయితే ఈ చీకటి లోనికే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చెను. అనగా, చీకటిలో ప్రవేశించు వెలుగుగా వచ్చెను.

మరొక తర్జుమాలో (ASV) దీని భావము : “చీకటి దానిని జయింపకుండెను” అని కలదు. దీని భావమేమి? ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆ చీకటి ఆయనను గ్రహించలేదని దీని భావము. నిజముగా ఆయన ఎవరో, ఆయన ఈ లోకమునకు ఎందుకు వచ్చెనోయను విషయమును మానవులు గ్రహింపకుండిరి. అయిననేమి? మానవుని తిరస్కారము, శతృత్వము ఆ నిజమైన వెలుగు ఈ లోకములో ప్రకాశింపకుండ నిరోధించలేకపోయెను.

బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య (1:6-8) :

1:6 ఈ వచన భాగము బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి తెలియజేయుచున్నది. ఇతడు ప్రభువైన యేసుకు ముందుగా దేవునిచేత పంపబడెను. యేసు క్రీస్తుయొక్క రాకడను గూర్చి ప్రకటించుటయు, ఆయనను అంగీకరించుటకై సిద్ధపడవలెనని ప్రజలకు తెలియజేయుటయు ఇతని పనియైయున్నది.

1:7 మరియు లోకమునకు నిజమైన వెలుగు యేసుప్రభువేయని సాక్ష్యమిచ్చు టకును, తద్వారా మనుష్యులందరు క్రీస్తునందు విశ్వాసముంచునట్లును ఇతడు సాక్షిగా వచ్చెను.

1:8 తనకు అప్పగించిన పనిలో అపనమ్మకస్థుడు కాకుండునట్లు ప్రజలను తన తట్టు ఆకర్షించుకొనలేదు. అంతేగాక తన్నుగాక ప్రభువైన క్రీస్తునే ప్రజలకు కనుపరచెను. లోకములోనికి ప్రభువైన క్రీస్తు రాక (1:9-18) :

1:9 యుగములనుండి మేమే రక్షకులము, మార్గదర్శకులమని చెప్పుకొనిన అనేక మంది కలరుగాని యోహాను ఎవరినిగూర్చి సాక్ష్యమిచ్చెనో ఆయనమాత్రమే శ్రేష్ఠమైన, నిజమైన వెలుగైయున్నాడు. “నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది” (9వ).

అనగా ప్రతి మనుష్యుడు క్రీస్తును గూర్చిన జ్ఞానము తన అంతరంగములో పొందియున్నాడని భావము కాదు. లేక అందరు ఏదోయొక సమయములో యేసుక్రీస్తునుగూర్చి వినియున్నారను భావముకూడా కాదు. కాని కుల, మత, జాతి, రంగు విచక్షణ లేకుండ ఆ వెలుగు అందరిపై ప్రకాశించుననియే దీని భావము. మరియు ఆ వెలుగు మనుష్యులందరిపై ప్రకాశించుటద్వారా ప్రభువైన యేసుక్రీస్తుయొక్క నిజ స్వభావమును బయలుపరచుచున్నది. అంతేగాక పరిపూర్ణమైన

మానవుడుగా ఆయన ఈ లోకములోనికి వచ్చుటద్వారా, ఇతర మానవులందరు తనకంటే ఎంతో అసంపూర్ణులని తెలుపుచున్నాడు. సహజముగా ఒక గది చీకటిగా ఉన్నప్పుడు, ఆ గదిలోని వస్తువులపైనున్న దుమ్ము ధూళిని నీవు చూడలేదు. కాని ఎప్పుడైతే ఆ గదిలో వెలుగు ప్రకాశించునో అప్పుడుమాత్రమే ఆ గదిలో ఉన్నది ఉన్నట్లు కనిపించును. అదే విధముగా నిజమైన వెలుగుయొక్క ప్రకాశత ఒక వ్యక్తి వాస్తవముగా ఏమైయున్నాడను విషయమును అతనికి బయలుపరచును.

1:10 ప్రభువు బేత్లహేములో జన్మించినప్పటినుండి, తిరిగి పరలోకమునకు వెళ్ళు దినము వరకు ఇప్పుడు మనము జీవించుచున్న ఈ లోకములోనే ఆయన జీవించి యుండెను. వాస్తవముగా మనుష్యులందరికంటే ఈ భూమిమీద నివసించుటకు ఆయనకుమాత్రమే ఎక్కువ అధికారము, హక్కు కలదు. ఈ సమస్త లోకమును ఉనికి లోనికి తెచ్చినవాడును, దీనికి నిజమైన హక్కుదారుడును ఆయనే, కాని మనుష్యులు సృష్టికర్తగా, ఆయనను గుర్తించక, తమవలె ఆయనకూడ ఒక సామాన్య మానవుడని వారు తలంచిరి. గనుకనే ఆయనను తమకు అన్యునిగాను, బయటికి త్రోసివేయబడిన వానిగాను ఎంచిరి.

1:11 “ఆయన తన స్వకీయులయొద్దకు (తన స్వంతవారియొద్దకు) వచ్చెను” అని ఈ వచనములో మనము చదువుచున్నాము. ఆయన ఎవరి స్వాస్థ్యమును ఆక్రమించ లేదు. కాని తాను సృజించిన ఈ భూమిమీదనే ఆయన జీవించెను. అయినను “ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు” సామాన్యదృష్టితో పరికించిన యెడల ఆయన స్వకీయులు” అను మాట సమస్త మానవాళిని సూచించుచున్నది. గనుక సమస్త మానవాళి ఆయనను తిరస్కరించెననుట వాస్తవము.

కాని ప్రత్యేకముగా చెప్పవలెనంటె యూదా జాతిని ఆయన తన వారినిగా ఎంచుకొనెను. వీరు ఆయన యొక్క భూలోక ప్రజలైయున్నారు. గనుక ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు వారి “మెస్సీయ” గా తన్నుతాను యూదులకు కనుపరచుకొనెను. కానీ వారు ఆయనను
అంగీకరించలేదు.

1:12 అందువలన సమస్త మానవాళికి ఆయన తన్నుతాను సమర్పించుకొనెను. మరియు తన్ను ఎందరు అంగీకరించెదరో వారికి దేవుని కుమారులగు అధికారమును అనుగ్రహించెను. అయితే మనము దేవుని పిల్లలము కాగల విధానమును ఈ వచనము స్పష్టముగా మనకు తెలియజేయుచున్నది. సత్రియలవలనగాని, లేక సంఘములో సభ్యత్వమువలనగాని గాక, ఆయనను అంగీకరించి, ఆయన నామమునందు విశ్వాస ముంచుట ద్వారా మాత్రమే మనము దేవుని పిల్లలము కాగలము.

1:13 సామాన్యముగా ఆలోచించినయెడల, శరీరరీత్యా ఒకడు ఒక వ్యక్తికి బిడ్డగా తీర్చబడవలెనంటే వాడు తప్పక శరీరరీతిని జన్మించవలెను. అదేరీతిగా, ఒకడు దేవుని బిడ్డగా తీర్చబడవలెనంటే అతడు తప్పక రెండవ జన్మను కలిగియుండవలెను. దీనినే క్రొత్తజన్మ లేక “మారుమనస్సు” లేక “రక్షింపబడుట” అంటారు. అయితే క్రొత్త జన్మను ఏ రీతిగా పొందలేమో తెలియజేయు మూడు విధానములను ఈ వచనము మనకు తెలియజేయుచున్నది. అదే సమయములో క్రొత్త జన్మ పొందుటకుగల ఏకైక మార్గమును కూడ ఈ వచనము తెలియజేయుచున్నది. అవును, ఇది “రక్తమువలన” కలుగునది కాదు.

అనగా విశ్వాసులైన తల్లితండ్రులకు జన్మించుటవలన ఒకవ్యక్తి నిజమైన క్రైస్తవుడుగా తీర్చబడడు. రక్షణ రక్త సంబంధము (తల్లి తండ్రుల) ద్వారా బిడ్డలకు సంక్రమించునదికాదు. రెండవదిగా, ఇది “శరీరేచ్ఛలవలన” కలుగునదికాదు. అనగా క్రొత్త జన్మను కలిగించుశక్తిని ఏ వ్యక్తి తన శరీరమందు కలిగియుండడు. రక్షణపొంద వలెననెడి కోరిక అతనికి కలిగినను, అతని స్వయిష్టము ఎంత మాత్రము చాలదు. చివరిగా, రక్షణ “మనుషేచ్ఛవలన” కలుగదు.

ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఏ విధముగను రక్షించలేడు. లేక ఒక బోధకుడు ఫలానివ్యక్తి తిరిగి జన్మించవలెనని ఎంతో ఆత్రుత కనుపరచినను అద్భుతమైన ఆ క్రొత్తజన్మను కలిగించుశక్తి అతనికి లేదు. అయితే ఈ క్రొత్త జన్మ ఏ విధముగా కలుగును? “దేవునివలననే” అని దీనికి జవాబు. అనగా క్రొత్త జన్మను కలిగించుశక్తి దేనియందుగాని, ఎవరియందుగాని లేదు కాని, దేవునియందే కలదు.

1:14 ప్రభువైన యేసుక్రీస్తు బేత్లహేములో శిశువుగా పుట్టినప్పుడే “వాక్యము శరీర ధారియాయెను”. ఆయన దేవుని కుమారుడుగా పరలోకములో తండ్రితోకూడ నిరంత రము ఉన్నవాడు. కాని ఈ లోకములోనికి వచ్చుటకు ఆయన మానవ దేహమును ఎన్నుకొనెను. ఈ సందర్భములో మనము గ్రహించవలసినదేమనగా ఆయన శరీరా కారముగా చేయబడుననుట సరికాదు. కాని “ఆ వాక్యము శరీరధారియయ్యెను” యనుట స్పష్టము. ఎందుకనగా, ఆయన ఎన్నడు రూపింపబడినవాడుగాని లేక సృష్టింప బడినవాడుగాని కాడు. ఆయన తానే సమస్తమును సృష్టించిన సృష్టికర్త. అయినను ఆయన శరీరధారియాయెను. అనగా ఒక మానవుడుగా ఈ లోకమునకు వచ్చెను.

అంతేగాక, ఆయన “మన మధ్య నివసించెను.” అనగా, ఇంతలో కనబడి అంతలో వెళ్ళిపోయెనని తలంచుట పొరబాటు. కాని వాస్తవముగా దేవుడు తానే ఈ లోకమునకు దిగివచ్చి మానవులమధ్య ఒక మానవుడుగా జీవించెను. “నివసించెను” అను పదము “తన గుడారమును వేసెను” అను భావమును సూచించుచున్నది. అనగా ఆయన శరీరమే ఆ గుడారము. తన శరీరమనే ఆ గుడారములో ఆయన మానవుల మధ్య ముప్ఫై మూడు సంవత్సరములు నివసించెను.

మరియు యోహాను – “మనము ఆయన మహిమను కనుగొంటిమి” అని చెప్పు. చున్నాడు. బైబిలు గ్రంథములో “మహిమ” అను పదము అనేక మారులు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు కనిపించెడి తేజస్సును, ప్రకాశించుచున్న వెలుగును సూచించుచున్నది. అంతేగాక ఆ పదము దేవునియొక్క “పరిపూర్ణత” మరియు “మహాత్మ్యము” అను భావములనుకూడ సూచించుచున్నది. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమందు ఉన్నప్పుడు తన మాంసయుక్తమైన దేహమందు తన మహిమను మరుగుపరచెను.

కాని ఆయన మహిమ ప్రత్యక్షపరచబడుటకు రెండు మార్గములు కలవు. మొదటిది, ప్రకాశమానమైన, నీతియుక్తమైన మహిమ, అనగా, పరిపూర్ణమైన ఆయన శీలము మరియు పరిపూర్ణమైన జీవితమే. ఆయనయందు ఎట్టి లోపముగాని, దోషముగాని లేదు, ఆయన తన సమస్త మార్గములయందు సంపూర్ణుడై యున్నాడు. ప్రతి సద్గుణము ఆయన జీవితములో సమపాళ్ళలో ప్రత్యక్షపరచబడినది.

రెండవది – కనిపించని ఆయన మహిమ ఈ మహిమ రూపాంతరపు కొండమీద ప్రత్యక్షమైనది (మత్తయి 17:1,2). శిష్యులు చూచిన ఆ మహిమ ఆయన నిజముగా దేవుని కుమారుడై యున్నాడని తెలియజేయుచున్నది. క్రీస్తు తండ్రియొక్క అద్వితీయ కుమారుడు. అనగా దేవుని సాటిలేని కుమారుడు. ఆయనవంటి కుమారుడు దేవునికి మరొకడు లేడు. ఒక విధముగా, నిజవిశ్వాసులందరు దేవునికి కుమారులైయున్నారు. కాని యేసుక్రీస్తు తనకు తానుగా దేవుని కుమారుడై యున్నాడు.

దేవుని కుమారునిగా ఆయన దేవునితో సమానుడైయున్నాడని అర్ధము. మరియు ఆయన “కృపాసత్య సంపూర్ణుడై యున్నాడు. అపాత్రులయెడల ఆయన మితిలేని దయగలవాడు. పరిపూర్ణమైన నీతి, పరిశుద్ధత గలవాడు. కాని ఆయన ఎన్నడు పాపమును కప్పిపుచ్చలేడు. దుష్టత్వమును సహించలేదు. నిండు కృప, మెండైన నీతిగలవాడు దేవుడు మాత్రమే.
1:15 ఈ వచనములో – యేసుక్రీస్తు దేవుని కుమారుడని యోహాను సాక్ష్యమిచ్చెను.

ప్రభువు తన బహిరంగ పరిచర్య ప్రారంభించకముందే యోహాను ఆయనను గూర్చి మానవాళికి తెలియజేయుచుండెను. యేసు యోహాను నొద్దకు వచ్చినప్పుడు యోహాను – “నేను చెప్పినవాడు ఈయనే” అని ఎలుగెత్తి చాటెను. పుట్టుకలోను పరిచర్యలోను ప్రభువు యోహానుకంటే వెనుకటివాడు.

ఆయన యోహాను పుట్టిన ఆరు నెలల తరువాత పుట్టెను. యోహాను ప్రకటించుచు బాప్తిస్మమిచ్చుచున్న కొంత కాలమునకు ఇశ్రాయేలు జనాంగమునకు తన్నుతాను ప్రత్యక్షపరచుకొనెను. కాని ఆయన యోహానుకంటే ముందున్న వాడు. అంతేకాదు – ఆయన యోహానుకంటె గొప్పవాడు. గనుక యోహానుకంటే ఆయన అధిక ఘనతకు యోగ్యుడైయున్నాడు. కారణమేమనగా, ఆయన యోహాను కంటె ముందున్నవాడు. ఆయన విత్తుతున ఇట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచువారందరు ఆయన పరిపూర్ణతలో నుండి ఆత్మీయ బలమును పొందుదురు.

ఆపరిపూర్ణత సకల యుగములలో సమస్తదేశ విశ్వాసులకు బలమును అనుగ్రహింపగలిగినంత గొప్పదైయున్నది. ఈ వచనములో బడిన “కృప వెంబడి కృప” అను మాటకు “సమృద్ధియైన కృప” అని భావము కలదు. “కృప” అనగా, దేవుడు తన ప్రియమైన పిల్లలపట్ల కుమ్మరించు దయ వాత్సల్యతయని అర్థము.

1:17 పాత నిబంధన కాలమునకు క్రొత్త నిబంధన కాలమునకు గల వ్యత్యాసమును యోహాను ఈ వచనములో చూపించుచున్నాడు. మోషేద్వారా ఇయ్యబడిన ధర్మశాస్త్రము కృపను కనుపరచునదికాదు, విధేయతను చూపవలెనని అది మానవులకు ఆజ్ఞాపించు చున్నది. కాని విధేయత చూపుటలో మానవులు విఫలులైనయెడల వారికి మరణశిక్ష విధించుచున్నది. మరియు అది మంచిని మానవులకు బోధించెనుగాని, ఆ మంచిని చేయగల శక్తి ననుగ్రహించలేకపోయెను. ఆ ధర్మశాస్త్రము మానవులు కేవలము పాపులని చూపుటకే ఇయ్యబడెను. కాని ఆ మానవులను వారి పాపములనుండి రక్షించలేక పోయెను.

బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య (1:6-8) :

అయితే “కృపయు సత్యమును యేసుక్రీస్తుద్వారా కలిగెను” అని చెప్పబడిన మాటలు గ్రహింపతగినవి. ఆయన లోకమునకు తీర్పుతీర్చుటకు రాలేదుగాని, అయోగ్యులై తమ్మునుతాము రక్షించుకొనలేని తన శత్రువులైన వారిని రక్షించుటకు వచ్చెను. ఇదియే కృప. భూలోకపు నీచులకొరకు అనుగ్రహింపబడిన పరలోకపు శ్రేష్ఠుడే కృప.
కృప మాత్రమే కాదుగాని సత్యముకూడ ఆయనద్వారా కలిగెను.

ఆయన తన్ను గూర్చి “నేనే … సత్యమును” అని చెప్పెను. ఆయన తన సమస్త మాటలయందును కార్యముల యందును పరిపూర్ణమైన నీతిమంతుడును, నమ్మతగినవాడునైయుండెను. తన కృపను కనుపరచు నిమిత్తము ఆయన సత్యమును విడిచిపెట్టలేదు. మరియు పాపులను ప్రేమించినప్పటికిని, వారి పాపములను ఆయన ప్రేమించలేదు.

1:18 “ఎవరును ఎప్పుడైనను దేవుని చూడలేదు” అని యోహాను ఈ వచనములో చెప్పుచున్నాడు. దేవుడు ఆత్మగనుక ఆయన అదృశ్యుడైయుండెను. సామాన్యమైన మానవ దేహము ఆయనకు లేదు. పాత నిబంధన కాలములో ఆయన దేవదూతగా లేక ఒక మానవునిగా మానవులకు కనిపించెను. కాని దేవుడు ఏమైయున్నాడు? ఏ పోలికలో ఉన్నాడను దానిని పాత నిబంధనలోని ఈ ప్రత్యక్షతలు బయలుపరచలేదు. అవి కేవలము తన ప్రజలతో మాటలాడుటకు దేవుడు ఏర్పరచుకొనిన ప్రత్యక్షతలు మాత్రమే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడు. ఆయన దేవుని సాటిలేని కుమారుడు. ఆయనవంటి కుమారుడు మరొకడు లేడు. తండ్రియైన దేవునితో ఆయన ఎల్లప్పుడు ఒక విశిష్టమైన సన్నిహితము గలవాడు. యేసుక్రీస్తు

ఈ భూమిమీద ఉన్నప్పుడుకూడ ఆయన తండ్రి రొమ్మున ఉండెను. ఆయన దేవునితో ఉన్నవాడు. దేవుడు ఏమైయుండును లేక ఆయన ఎట్టివాడై యుండెనను సత్యమును ఆయన మానవులకు సంపూర్ణముగా ప్రత్యక్షపరచెను. యేసును చూచుట, దేవుని చూచుటయే. మానవులు యేసును చూచినప్పుడు దేవుని చూచిరి దేవుని మాటలు వినిరి. దేవుని ప్రేమను, ఆయన దయను వారు అనుభవించిరి.

బాప్తిస్మమిచ్చు యోహాను సాక్ష్యము (1:19-34) :

1:19 మెస్సీయ వచ్చుచున్నాడు గనుక మారుమనస్సు పొందుడని యోహాను అను పేరుగల వ్యక్తి యూదా జాతికి బోధించుచున్నాడను వార్త యెరూషలేమునకు చేరిన వెంటనే, అతడెవరో తెలిసికొనుటకు యూదులు యాజకులను లేవీయులను అతని యొద్దకు పంపిరి. (యాజకులు దేవుని మందిరములో ప్రాముఖ్యమైన పరిచర్యలను జరిగించువారైయుండగా, లేవీయులు సామాన్యమైన విధులను జరిగించు పరిచారకులై యున్నారు.) వారు యోహాను నొద్దకు వచ్చి “నీవు ఎవరవు? బహు కాలమునుండి మేము ఎదురు చూచుచున్న మెస్సీయవా?” అని అడిగిరి.

1:20 అందుకు ఇతరులెవరైనను ఈ అవకాశమును సద్వినియోగము చేసికొని తానే క్రీస్తునని చెప్పుకొని పేరు ప్రతిష్ఠలు సంపాదించుకొనుటకు ఉపయోగించుకొనెడి వారే. కాని యోహాను నమ్మకమైన సాక్షి. గనుక “నేను క్రీస్తును కాను” అని ఒప్పుకొనెను. 1:21 క్రీస్తు రాకముందు ఏలీయా ఈ భూమిమీదికి తిరిగి వస్తాడని యూదులు తలంచిరి (మలాకీ 4:5). గనుక ఈ యోహాను క్రీస్తుకానియెడల ఏలీయా కావచ్చునను ఉద్దేశ్యముతో “నీవు ఏలీయావా?” అని ప్రశ్నించిరి.

అందుకు యోహాను “కాను” అని గట్టిగా చెప్పెను. ఈ సందర్భములో ద్వితీయోపదేశకాండము 18:16 లో మోషే చెప్పిన మాటలు గమనించండి * “నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను.” అను ప్రవచన వాక్కులు యూదులు జ్ఞాపకము చేసికొని, మోషే చెప్పిన ఆ ప్రవక్త ఈ యోహాను కావచ్చునని తలంచిరి. కాని ఈ పర్యాయముకూడా యోహాను – “కాను” అని ప్రత్యుత్తరమిచ్చెను.

1:22 గనుక యెరూషలేమునుండి పంపబడిన యాజకులు లేవీయులు సరియైన ప్రత్యుత్తరము లేకుండ తిరిగి వెళ్ళుటకు కలవరపడి “నిన్నుగూర్చి నీవు ఏమని చెప్పుకొనుచున్నావు” అని ప్రశ్నించిరి.

1:23 అందుకతడు – “ప్రవక్తయైన యెషయా చెప్పినట్లు నేను …. అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము” అని చెప్పెను (యెషయా 40:3). మరొక మాటలో చెప్పవలెనంటే ముందుగా చెప్పబడినట్లు ఆయనకు ముందుగా వెళ్ళువాడనని యోహాన చెప్పెను. యోహానే ఆ స్వరము ఇశ్రాయేలీయులే ఆ అరణ్యము. ఎట్లనగా, ఇశ్రాయేలు జనాంగము ఎండిపోయి, నిష్పలమైన ఎడారివంటి వారైరి. అట్టి జనాంగమునకు యోహాను ఒక “స్వరముగా” తన్ను గూర్చి చెప్పుకొనెను. సహజముగా మనము స్వరమును వినగలమే గాని దానిని చూడలేము. ఇక్కడ యోహాను స్వరముకాగా, యేసుక్రీస్తు వాక్యమై యున్నాడు. వాక్యము వెల్లడి కావలెనంటే దానికి స్వరము కావలెను. కాని వాక్యములేకుండ స్వరమునకు విలువలేదు.

స్వరముకంటే వాక్యము బహు గొప్పది. గనుక మనము ఆయన స్వరమైయుండుట మన గొప్ప భాగ్యము. “ప్రభువు మార్గము సరాళము చేయుడి” – అనునది యోహాను వర్తమానము. “మెస్సీయ వచ్చుచున్నాడు. మరియు ఆయనను అంగీకరించుటకు ఆటంకముగా నున్న సమస్తమును మీలో నుండి తీసివేసికొనుడి. అట్లు చేసి ఆయన వచ్చి ఇశ్రాయేలు రాజుగా మిమ్మును ఏలునట్లు మీ పాపముల విషయమై పశ్చాత్తాప పడుడి” అని భావము.

1:24 యోహాను నొద్దకు మనుష్యులను పంపిన పరిసయ్యులు యూదా జాతిలో బహు నిష్టగల తెగకు చెందినవారు. ధర్మశాస్త్రమునందు తమకుగల విశేష జ్ఞానమును బట్టి పాతనిబంధన ఆజ్ఞలను, లేఖనములను తూ.చ. తప్పక పాటించెదమనెడి అతిశయము గలవారు. కాని వాస్తవమునకు వారిలో అనేకులు వేషదారులు. భక్తిగల వారివలె కనుపరచుకొనుటకు వారు ప్రయత్నించెదరు గాని ఘోరమైన పాపములో వారు జీవించెడివారు.

1:25 మరియు తాము పేర్కొనిన ప్రముఖ వ్యక్తులలో ఎవరూ కానప్పుడు బాప్తిస్మ మిచ్చుటలో యోహానుకు గల అధికారమేమిటోయని వారు తెలిసికొనగోరిరి.

1:26 ఇతరులు తన్ను ప్రాముఖ్యమైనవానిగా ఎంచవలెనని యోహాను ఆశించలేదు. గాని, క్రీస్తుకొరకు మానవులను సిద్ధపరచుటయే అతని పని. “నేను నీళ్ళలో బాప్తిస్మ మిచ్చుచున్నాను” అని యోహాను ఈ వచనములో చెప్పుచున్నాడు. ఎందుకనగా అతని బోధ వినినవారు తమ పాపముల విషయమై పశ్చాత్తాపపడినప్పుడు, వారి అంతరంగములో కలిగిన మార్పుకు బాహ్యసంకేతముగా అతడు వారికి నీటిలో బాప్తిస్మమిచ్చుచుండెను.

యేసుక్రీస్తుయొక్క దైవత్వము – Bible Verses Chapter 1 in Telugu

యోహాను తన ప్రసంగమును కొనసాగొంచుచు – నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు; మీరాయనను నెరుగరు అని ప్రభువైన యేసు క్రీస్తును సూచించుచు చెప్పెను. కాని పరిసయ్యులు బహుకాలము నుండి తాము ఎదురు చూచిన మెస్సీయగా ఆయనను గుర్తించలేదు. యోహాను మాటలలోని భావ మేమనగా ఒక ప్రముఖునిగా నన్ను తలంచవద్దు … మీరు లక్ష్యముంచవలసిన వ్యక్తి ఒక్కడే. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. కాని ఆయన నిజముగా ఎవరైయున్నాడో మీరు ఎరుగలేదు అని అతడు నొక్కి చెప్పెను.

1:27 అవును, ఆయన మాత్రమే యోగ్యుడు. ఆయన యోహానుకంటే తరువాత వచ్చినప్పటికిని ఆయన అన్నింటిలోను ప్రాముఖ్యత మరియు స్తుతి పొందనర్హుడు. తన యజమానియొక్క చెప్పులను విప్పవలసిన బాధ్యత దాసునిదే. కాని యోహాను క్రీస్తు కొరకు ఇట్టి దీనాతిదీనమైన పరిచర్యచేయుటకు తన్ను యోగ్యునిగా ఎంచుకొనలేదు.

1:28 యోహాను పరిచర్యచేసిన బేతనియ ఉన్న కచ్చితమైన ప్రదేశము మనకు తెలియదు. కాని యొర్దానునదికి తూర్పువైపున ఉన్నదని ఎరుగుదుము.

1:29 మరునాడు యెరూషలేమునుండి పరిసయ్యులు యొర్దాను. తీరమునకు వచ్చిరి, యేసుకూడ తనయొద్దకు వచ్చుట యోహాను చూచి, ఆ క్షణములో అమితానందము నొందినవాడై – “ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల” అని కేకవేసి చెప్పెను. గొజ్జెపిల్ల యూదులయొక్క బలిపశువు. గొట్టెపిల్లను వధించి దాని రక్తమును ప్రోక్షించవలెనని దేవుడు వారికి బోధించెను.

మానవుని పాపములు క్షమించబడునట్లు తనకు ప్రతిగా గొట్టెపిల్ల వధించబడి రక్తము చిందింపబడవలెను. అయినప్పటికిని, పాత నిబంధనలో వధింపబడిన గొఱ్ఱపిల్ల రక్తము పాపమును నిజముగా తీసివేయలేకపోయెను. ఆ గొట్టెపిల్లలు కేవలము ఛాయలైయుండి, దేవుడే ఒకనాటికి పాపభారమంతటిని మోసికొనిపోవు ఒక గొట్టెపిల్లను అనుగ్రహించునను సత్యమును సూచించుచున్నది. ఇప్పుడు ఆ సమయము రాగా, దేవుని నిజమైన గొట్టెపిల్ల వచ్చెనని యోహాను విజయోత్సవముతో ప్రకటించెను.

అయితే మనము ఇక్కడ గమనించవలసిన విషయమేమనగా, యేసు లోక పాపమును మోసెనని చెప్పుటలో, ప్రతి ఒక్కరి పాపములు క్షమించబడెనని యోహాను యొక్క భావముకాదు. సమస్త లోకపాప విమోచన క్రయధనముగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణము పూర్తిగా సరిపోయినది. కాని, ఎందరు ఆయనను ప్రభువుగాను, రక్షకునిగాను అంగీకరింతురో ఆ పాపులు మాత్రమే క్షమింపబడుదురు.

1:30 వచ్చుచున్నవాడు తనకంటే గొప్పవాడు. ఆయన కొరకు తాను మార్గమును సిద్ధపరచువాడను మాత్రమేయని జ్ఞాపకము చేయుటలో యోహాను ఎన్నడు అలయ లేదు. దేవుడు మానవునికంటే ఎంతటి గొప్పవాడో, యేసుక్రీస్తు యోహానుకంటె అంత గొప్పవాడు. యోహాను క్రీస్తుకంటె కొన్ని నెలలముందు పుట్టెనుగాని, యేసు నిత్యత్వమంతటిలో ఉన్నవాడు.

1:31 “నేను ఆయనను ఎరుగను అని యోహాను చెప్పినప్పుడు – యోహాను క్రీస్తును అంతకమునుపు ఎన్నడు చూడలేదని కాదు. యోహాను మరియు యేసు బంధువులు గనుక బహుశా వారు ఒకరి నొకరు బాగుగా ఎరిగియుండ వచ్చును. కాని యోహాను తన బంధువైన యేసుక్రీస్తును మెస్సీయగా తాను బాప్తిస్మమిచ్చువరకు గుర్తించలేదు. ఇక్కడ యోహాను చేయవలసిన పని ఒక్కటే. అదేమనగా – ప్రభువు మార్గము సిద్ధపరచి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఇశ్రాయేలు జనాంగమునకు ఆయనను కనుపరచుట. గనుక క్రీస్తురాకడ కొరకు ప్రజలను సిద్ధపరచుటకై వారికి నీటిలో బాప్తిస్మమిచ్చు చుండెను. అయితే శిష్యులను తన కొరకు సంపాదించుకొనవలెనను ఉద్దేశ్యముతో అతడు ఆ విధముగా చేయలేదు.

1:32 32 వ వచనములోని మాటలు యోర్దాను నదిలో యోహాను క్రీస్తుకు బాప్తిస్మ మిచ్చు సమయమును సూచించుచున్నవి. బాప్తిస్మము పొంది యేసు నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చిన వెంటనే దేవుని ఆత్మ పావురము రూపములో ఆయనమీదికి దిగి వచ్చెను (మత్తయి 3:16).

1:33 మెస్సీయ రాబోవుచున్నాడనియు, ఆయన వచ్చినప్పుడు దేవుని ఆత్మ దిగి వచ్చి ఆయనపై నిలుచుననియు దేవుడు యోహానుకు ముందుగా బయలుపరచెను, గనుక యేసు ప్రభువుకు ఈ సంభవము ఎప్పుడు సంభవించెనో, అప్పుడు “పరిశు ద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడు ఈయనే” అని యోహాను గ్రహించెను.

పరిశుద్ధాత్ముడు దైవత్వములోని ముగ్గురు వ్యక్తులలో ఒక వ్యక్తియైయున్నాడు. ఆయన తండ్రియైన దేవునితోను, కుమారుడైన దేవునితోను సమానుడైయుండెను. యోహాను నీటితో బాప్తిస్మమిచ్చెనుగాని, యేసు పరిశుద్ధాత్మతో బాప్తిస్మమిచ్చెను. ఈ ఆత్మ బాప్తిస్మము పెంతెకొస్తు దినమున సంభవించెను. (అ.కా. 1:15; 2:4,38). ఆ ఆత్మ ప్రతి విశ్వాసియందు నివసించుటకును, ఆ విశ్వాసిని క్రీస్తుశరీరమైయున్న సంఘములో అవయవములుగా చేర్చుటకును ఆ దినమున ఆయన దిగివచ్చెను (1 కొరింథీ 12:13). 1:34 ముందుగా చెప్పబడినట్లు లోకమునకు రానైయున్న దేవుని కుమారుడు నజరేయుడైన ఈ యేసేయని యోహాను సరిగా సాక్ష్యమిచ్చెను. యూదా జాతి యంతటిలో ఆయనను మెస్సీయగా గుర్తెరిగిన మొదటివారిలో వీరుకూడ ఉన్నారు. అంద్రెయ,

యోహాను, పేతురులు శిష్యులగుట (1:35-42):

1:35 “మరునాడు” అని చెప్పబడిన దినము మూడవ దినమును సూచించుచ్నుది. అప్పటికి యోహాను తన యిద్దరు శిష్యులతో ఉండెను. ఈ మనుష్యులు యోహాను ప్రకటించుచుండగా విని అతడు చెప్పినదానిని నమ్మిరి. అయితే వారు అప్పటికి యేసుక్రీస్తును కలసికొనలేదు.

1:36 క్రిందటి దినము క్రీస్తుయొక్క వ్యక్తిత్వమును గూర్చి – “దేవుని గొఱ్ఱపిల్ల” యని చెప్పి, ఆయన నెరవేర్చబోవు కార్యమును గూర్చి యోహాను మరియొకసారి బహిరంగముగా సాక్ష్యమిచ్చెను. ఇప్పుడైతే ప్రభువువైపు, ఆయన వ్యక్తిత్వమువైపు తన దృష్టిని సారించి, శిష్యుల మనస్సులను కూడ మళ్ళించెను. అంతేగాక, అతని సందేశము క్లుప్తముగాను, సామాన్యముగాను, స్వార్థరహితమైనదిగాను, పూర్తిగా రక్షకుని గూర్చినదిగాను యున్నది.

1:37 తానిచ్చిన నమ్మకమైన ప్రకటనద్వారా యోహాను తన ఇద్దరు శిష్యులను పోగొట్టుకొనెను. కానివారు యేసును వెంబడించుట చూచి అతడు బహుగా సంతోషించెను.

1:38 తన్ను వెంబడించువారియందు రక్షకుడు ఎల్లప్పుడు ఆసక్తి కలిగియున్నాడు. తన్ను వెంబడించుచున్న ఇద్దరు శిష్యులవైపు తిరిగి వారిని ప్రశ్నించుటలో ఆయన ఎంతో ఆసక్తి కనుపరచెను. తానడిగిన ప్రశ్నకు సమాధానము ప్రభువే ఎరిగియున్నాడు. ఆయన సమస్తమును ఎరిగినవాడు. కాని వారి ఆసక్తిని వారి మాటలలోనే ఆయన వినగోరెను. వారు ప్రభువుతోనే ఉండగోరిరనియు, ఆయనను గూర్చి మరి ఎక్కువగా తెలిసికొనగోరిరనియు వారిచ్చిన ప్రత్యుత్తరమునుబట్టి తెలియుచున్నది. కేవలము ఆయనను కలిసికొనుట వలననే వారు తృప్తిచెందలేదు. కాని, ఆయనతో సహవాసము కలిగియుండవలెనని వారు ఆశించిరి. గనుకనే వారు ఆయనను “రబ్బీ” అని సంబోధించిరి. ఆ మాటలకు “బోధకుడు” లేక “యజమానుడు” అని అర్థము.

1:39 అప్పటికి రక్షకునిగూర్చి మరి ఎక్కువగా నేర్చుకొనవలెననెడి నిజమైన అపేక్ష గలవాడెవడును ఆయననుండి ఎన్నడు వెనుకకు మళ్ళడు. రక్షకుని రాకతో పరిస్థితులు మారిపోయినవి. రక్షకుడు తాను ఆ సమయమున ఎక్కడ కాపురముండెనో, అక్కడికే ఆ ఇద్దరు శిష్యులను ఆహ్వానించెను. నేటి ఆధునిక నివాసములతో పోల్చినప్పుడు, ఆయన నివాసము అతిసామాన్యమైనదిగా నున్నది.

కాని ఈ సమస్త విశ్వమునకు సృష్టికర్తయైన ఆయనతో ఆ శిష్యులు ఆ చిన్న ఇంటిలోనే రాత్రి గడిపిరి. మెస్సీయాను గుర్తెరుగుటలో యూదాజాతి యంతటిలో మొట్టమొదట వ్యక్తులు వీరే. ప్రభువు వారిని ఆహ్వానించి నప్పుడు సమయము సాయంత్రము నాలుగు గంటలైనది. అక్కడ వారు ఎంత ప్రొద్దు గడిపిరో, ఏఏ సంగతులు ముచ్చటించిరో తెలిసికొనుట అసక్తికరమైన విషయమే.

1:40 ఆ శిష్యులలో ఒకని పేరు అంద్రెయ. రెండవ వ్యక్తి పేరు చెప్పబడలేదు. కాని యీ సువార్త వ్రాసిన యోహానే ఆ శిష్యుడని బైబిలు పండితులు ఒప్పుకొను చున్నారు. ఎట్లనగా, తన పేరును ఇక్కడ పేర్కొనక పోవుటలోగల అతని తగ్గింపు జీవితమును కారణముగా చూపుచున్నారు.

1:41 సహజముగా ఒక వ్యక్తి ప్రభువును కనుగొనినప్పుడు, తన బంధువులుకూడ ప్రభువును కలిసికొనవలెనని కోరుదురు. రక్షణ-ఒకడు తన కొరకు పదిల పరచుకొన దగినంత ప్రశస్తమైనది. గనుక ఇట్టి శుభ సందేశముతో అంద్రెయ తన సహోదరుడైన సీమోనునొద్దకు త్వరగా వెళ్ళి – మేము మెస్సీయను కనుగొంటిమి అని చెప్పెను. ఆహా! ఇది ఎంత ఆశ్చర్యకరమైన ప్రకటన! అవును. వాగ్దానము చేయబడిన దేవుని అభిషిక్తుడైన క్రీస్తుకొరకు ప్రజలు అప్పటికి నాలుగు వేల సంవత్సరములనుండి ఎదురు చూచుచుండిరి. కాని ఇప్పుడైతే, ఆ మెస్సీయా తనచెంతనే ఉండెనను ఆశ్చర్యకరమైన వార్తను సీమోను తన స్వంత సహోదరుని పెదవులద్వారా వినెను.

అంద్రెయ వర్తమానము ఎంత సూక్ష్మమైనది! అతని వర్తమానములో కేవలము మూడు మాటలే కలవు. గమనించండి : “మేము మెస్సీయను కనుగొంటిమి” అయిననేమి? సీమోనును సంపాదించుకొనుటకు దేవుడు ఆ మూడు మాటలనే ఉపయోగించెను. మనము గొప్ప బోధకులము తెలివైన ప్రసంగీకులము కాకపోవచ్చును, కాని సామాన్య మాటలలో ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చి ఇతరులకు చెప్పుట ఎంతైనా అవసరమైయున్నది. మిగిలిన కార్యమును దేవుడే చేయును.

1:42 ఇప్పుడు అంద్రెయ తన సహోదరుని తగిన స్థలమునకు తగిన వ్యక్తియొద్దకు తోడుకొనివచ్చెను. ఇది ఎంత ప్రాముఖ్యమైన కార్యమోగదా! అంద్రెయకుగల ఆసక్తిని బట్టి, తరువాత కాలములో సీమోను మనుష్యులను పట్టు గొప్పజాలరిగా మారిపోయెను. మరియు ప్రభువుయొక్క ముఖ్య అపొస్తలులలో ఒకడాయెను. మరియు తన సహోదరుడైన అంద్రెయకంటే సీమోను ప్రజలలో ఎక్కువ ప్రసిద్ధి పొందెను. కాని పేతురు యొక్క బహుమానములో అంద్రెయ తప్పక పాలు పంచుకొనుటలో సందేహము లేదు. ఎందుకనగా, యీ అంద్రెయయే సీమోనును ప్రభువు నొద్దకు తెచ్చెను.

ప్రభువు సీమోనుయొక్క పేరు ఎవరు చెప్పకనే ఎరుగును. అంతేకాదు, అతడు చంచల మనస్కుడనియు, పిరికివాడనికూడ ఆయన ఎరుగును. కడకు సీమోను గుణము మారిపోయి రాయివలె స్థిరచిత్తుడగునని కూడ ప్రభువు ఎరుగును. అయితే ఈ సంగతులన్నింటిని ప్రభువైన యేసు ఎట్లు ఎరుగును? ఆయన వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉన్న దేవుడు గనుక ఆయన ఎరుగును. ఇప్పుడు సీమోను పేరు కేఫాగా (పేతురు) మారెను. ప్రత్యేకించి యేసుక్రీస్తు ఆరోహణమై పరిశుద్ధాత్ముడు భూమిమిదికి దిగివచ్చిన పిదప అతడు ఒక బలమైన వ్యక్తిగా మారిపోయెను.
ఫిలిప్పు నతనయేలు పిలుపు (1:43-51) :

1:43 ఇప్పుడు నాలుగవ దినమును గూర్చి ఈ అధ్యాయములో మనము చదువు చున్నాము. ప్రభువు గలిలయలోని ఉత్తర భూభాగములో సంచరించెను. అక్కడ ఆయన ఫిలిప్పును కనుగొని తన్ను వెంబడించుమని ఆహ్వానించెను. ఈ సందర్భములో “నన్ను వెంబడించుము” అను మాటలు బహు శ్రేష్ఠమైనవి. ఎందుకనగా, ఆ మాటలు పలికినవాడు శ్రేష్ఠుడు. మరియు ఆ మాటలు అనుగ్రహించు ఆధిక్యతలుకూడ శ్రేష్ఠ మైనవే. గనుక ఇట్టి సామాన్యమైన అతి గంభీరమైన ఆహ్వానముతో ప్రతి స్థలములో నున్న ప్రతి మనుష్యుని ప్రభువు ఇంకను పిలుచుచున్నాడు.

1:44 బేత్సయిదా అనునది గలిలయ సముద్రపు ఒడ్డున ఉన్న ఒక పట్టణము, ఈ బేత్సయిదావలె ప్రసిద్ధిచెందిన పట్టణములు ఈ లోకములో బహు అరుదు. తాను జేసిన అద్భుతములలో కొన్నింటిని ప్రభువు ఈ పట్టణమందే జరిగించెను (లూకా 10:13). ఇది ఫిలిప్పు, అంద్రెయ, పేతురుయొక్క స్వంత పట్టణము. అయితే ఈ పట్టణము రక్షకుని తిరస్కరించినది. ఫలితముగా అది పూర్తిగా నాశనము చేయబడెను. ఇప్పుడు ఆ పట్టణము ఎక్కడ ఉన్నదో ఆ చోటును మనము కచ్చితముగా చెప్పలేము.

1:45 ఫిలిప్పు నూతనముగా తాను పొందిన ఆనందమును ఇతరులతో పంచుకొన గోరెను. గనుక అతడు బయలు వెళ్ళి నతనయేలును కనుగొనెను. ఫిలిప్పు యొక్క వర్తమానము సాధారణమైనదిగాను, సూటిగాను ఉన్నది. ఫిలిప్పు నతనయేలును మోషేయు ప్రవక్తలును ఎవరినిగూర్చి ముందుగా చెప్పెనో ఆయనను మేము కనుగొంటిమి. ఆయన నజరేయుడైన యేసు అని చెప్పెను.

వాస్తవముగా అతని వర్తమానము పరిపూర్ణమైనది కాదు. అతడు యేసును యోసేపు కుమారునిగా వర్ణించెను. యేసు కన్యమరియ గర్భమున జన్మించెను. కాని ఆయనకు శరీరరీత్యా తండ్రిలేడు, యోసేపు యేసుకు నిజమైన తండ్రి కాకపోయినను, ఆయనను దత్తత తీసికొని, చట్టరీత్యా ఆయనకు తండ్రియాయెను.
కనుగొని

1:46 నతనయేలుకు అనేక సమస్యలు, అనుమానములు కలవు. గలిలయలో నజరేతు తృణీకరింపబడిన పట్టణము. అట్టి వెనుకబడిన పట్టణములో మెస్సీయా నివసించుట అసాధ్యమని అతనికి తోచెను. గనుక తన మనస్సులోని ప్రశ్నను బయట పెట్టెను. కాని దానిని గూర్చి ఫిలిప్పు నతనయేలుతో వాదించలేదు. మనుష్యులకున్న అభ్యంతరములను తీసివేయుటకు వారిని నేరుగా ప్రభువుకు పరిచయము చేయుట శ్రేష్ఠమైన విధానమని అతడు తలంచెను. ప్రభువు కొరకు ఆత్మలను సంపాదించలెనని ప్రయత్నించెడి వారికందరికి ఇది యొక అమూల్యమైన పాఠము. వాదములకు పోవద్దు. దీర్ఘముగా తర్కించక “వచ్చి చూడుడి” అని మాత్రమే చెప్పుడి.

బాప్తిస్మమిచ్చు యోహాను సాక్ష్యము (1:19-34) :

1:47 యేసుక్రీస్తు సమస్తమును ఎరిగినవాడని ఈ వచనము మనకు తెలుపుచున్నది. ప్రభువుకు నతనయేలుతో ఎటువంటి పరిచయము లేకపోయినప్పటికిని “ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు; ఇతనియందు ఏ కపటమును లేదు” అని ప్రకటించెను. అయితే యాకోబు నీతి యుక్తముకాని విధానములను అనుసరించిన వాడుగా పేరు పొందెను. కాని నతనయేలు ఇందుకు భిన్నమైనవాడు. అవును, అతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. అతనియందు రహస్యముగాని, అక్రమముగాని లేదు.

1:48 ఒక క్రొత్తవ్యక్తి తన్ను ఇంతకుముందే ఎరిగియున్నట్లు మాటలాడుట చూచి నతనయేలు నిజముగా ఆశ్చర్యపడెను. ఆ అంజూరపు చెట్టుక్రింద కూర్చుండి యున్నప్పుడు అతడు పూర్తిగా దాగియుండెననుట స్పష్టమే.

1:49 కాని అతడెంత దాగుకొనినను యేసు అతనిని చూచెను. మానవ కంటికి
కనబడకుండ నతనయేలు తన్ను మరుగు చేసికొనెనని మానవ దృష్టితో మనము చెప్పినను, యేసు అతనిని చూచెను. ఇది ఆయన శక్తి. బహుశా, యేసుక్రీస్తు కియ్యబడిన ఈ జ్ఞానము మానవాతీతమైనదని నతనయేలు తలంచెను. మెట్టుకు యేసుక్రీస్తు దేవుని కుమారుడనియు, ఇశ్రాయేలుయొక్క రాజనియు అతడు గుర్తెరిగెను.

1:50 తానే మెస్సీయా అని తెలియజేయుటకు ప్రభువు రెండు ఋజువులను నతన యేలుకు కనుపరచెను. ఒకటి – ప్రభువు నతనయేలుయొక్క గుణమును వివరించెను. రెండు ఏ కన్ను చూడలేని అతనిని ఆయన చూచెను. ఈ రెండు ఋజువులు నతనయేలుకు చాలినవి. గనుక అతడు ప్రభువునందు విశ్వాసముంచెను. అయితే వీటికంటే గొప్ప కార్యములు చూతువని ప్రభువు వాగ్దానము చేసెను.

1:51 సర్వలోకమును యేలుటకు త్వరలో రానైయున్న తన భవిష్యత్కాల పటమును ప్రభువు నతనయేలుకు వివరించెను. ఆ దినమున పరలోకము తెరువబడును. యెరూష లేమును ముఖ్యపట్టణముగా చేసికొని రాజుగా ఆయన పరిపాలన చేయునప్పుడు దేవుని అనుగ్రహము రాజుపై నిలుచును. దేవదూతలు దేవుని పరిచారకులు. వీరు దేవుని చిత్తమును జరిగించు అగ్నిజ్వాలలవంటివారు. యేసుక్రీస్తు రాజుగా యేలునప్పుడు ఈ దూతలు ఆయన చిత్తమును నెరవేర్చుచు ఆకాశమునకు భూమికిని మధ్య ఎక్కుచును దిగుచును నుందురు. మెస్సీయాగా తనకుగల అధికారమును చూచించు సూచకక్రియ లలో అత్యల్పమైనది మాత్రమే నతనయేలుకు చూపబడెనని ప్రభువు నతనయేలుకు చెప్పెను. కాని రానైయున్న క్రీస్తు పరిపాలన కాలములో అభిషిక్తుడైన దేవుని కుమా రుడుగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడుట నతనయేలు చూచును. అప్పుడు నజరేతునుండి మంచివాడు వచ్చెనని సమస్త మానవాళి తెలిసికొనును.

“నిశ్చయముగా చెప్పుచున్నాను” అను మాట గమనించదగినది. “నిశ్చయముగా” అని ప్రభువు చెప్పినప్పుడు, ఆయన చెప్పిన మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవని మనము గుర్తించవలెను. “నిశ్చయముగా” అను మాటకు “నిజముగా,” “ఆలాగుననే జరుగును గాక” అని భావము. (Verily Verily means “truly truly” or “amen, amen”).